నా ఆరోగ్యం నా హక్కు చట్టం చేయాలి

ఆరోగ్యహక్కు ద్వారా గౌరవంగా, ఆనందంగా జీవించడం.. దేశ పురోగతుల్లో పాలు పంచుకోవడం..అవసరమైన భౌతిక,మానసిక, సామాజిక పరిస్థితులను మెరుగైన ప్రమాణాలతో అందుకునే అర్హత ప్రతి పౌరునికీ కలుగుతుంది. ఆరోగ్యం సమకూరుతుంది.అందుకే అందరికీ ఆరోగ్యం అందాలంటే..ప్రభుత్వాల దయాదాక్షి ణ్యాలపై ఆధారపడటం కాకుండా ఆరోగ్యమన్నది హక్కుగా ఉండాలి.అందుకొరకు కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలన్నీ తప్పక ఆరోగ్యహక్కు చట్టాన్ని తీసుకు రావాలి. చట్టాన్ని తీసుకురావడమే కాదు.. దాన్ని ఆచరణలో పెట్టాలి.అప్పుడే అందరికీ ఆరోగ్యం అందే పరిస్థితి వస్తుంది. పేదవాడికి వైద్యం సరిగా అందక..వైద్య ఖర్చులకు తనసొంత జేబులో నుంచి ఖర్చు పెట్టుకోలేక..మరింత పేదవాడిగా మారు తున్న పరిస్థితి. ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర ఆరోగ్య పరిస్థితిలో ప్రజలందరికీ ఆరోగ్య హక్కును ప్రాథ మిక మానవహక్కుగా సూచించడమే మంచి పరిణామం.2000 సంవత్సరాల నాటికి అందరికీ ఆరోగ్యం అందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1977లోనే నిర్ణయించింది.1978లో జరిగిన అల్మా-అటా ప్రకటనలో ప్రజలందరికీ ఆరోగ్యం అందే విధంగా అడుగులు వేస్తామని సంతకాలు చేసిన జాబితాలో మన దేశం కూడా ఉంది. కానీ పేదవానికి అందుతున్న ఆరోగ్య సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆరోగ్య అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
చట్టం అవసరం. : మనిషి జీవనశైలిలోను, వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అనేక వ్యాధులు విపరీతంగా విస్తరిస్తున్న పరిస్థితిలో మనం జీవిస్తున్నాం.మలేరియా,డెంగ్యూ, అతిసార, మీజిల్స్‌,కరోనాలాంటి అంటువ్యాధులు..బి.పి, షుగర్‌,కొలెస్ట్రాల్‌, ఊబకాయం, క్యాన్సర్‌ లాంటి వ్యాధుల ప్రాబల్యం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం మనదేశంలో ప్రతి నాలుగో వ్యక్తికి షుగర్‌ ఉందని, భవిష్యత్తులో ఈసంఖ్య మరింత ఎక్కువ కాబోతుందని అంచ నాలు తెలుపుతున్నాయి. వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయి.వైద్యం ఎంతో అభివృద్ధి చెం దింది.ఈ ఆధునిక వైద్యం పేదవాడికి అందే పరిస్థితిలో లేదు.వీరికి అవసర మైన వైద్యం ప్రభుత్వ వైద్యశాలలో పూర్తిగా అంద డం లేదు.డబ్బులు పెట్టి కొనుక్కోగల పరిస్థితి వారికి లేదు. విపరీతం గా పెరుగుతున్న మందుల ధరలు,వైద్యం కోసం అయ్యే ఖర్చులను పేద ప్రజలు భరించలేక మరింత పేదరికంలోకి నెట్టబడు తున్నారు.
ముందస్తు జాగ్రత్తలు..: జబ్బు చేసిన తరువాత వైద్యం చేయడం మాత్రమే ఆరోగ్యంకాదు. జబ్బుకు వైద్యం చేయడంతో పాటు జబ్బు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఆరోగ్యంలో భాగమే.మంచినీరు అందించడం,పారిశుధ్య కార్య క్రమాలు సక్రమంగా నిర్వహించడం,టీకాలు వేయించడం,పౌష్టికాహారాన్ని అందించడం నివా రణ మార్గాలలో అత్యంత ప్రధానమైనవి. వీటిని సరైన పద్ధతిలో ప్రజలకు అందించకపోవడంతో అనేక అంటురోగాలు వ్యాపిస్తున్నాయి. వైద్య శాస్త్రంలో వస్తున్న ఆధునిక పద్ధతులు సాధారణ ప్రజలకు అందుబాటులో లేక వైద్య రంగంలో అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనకున్న వైద్యరంగం దరిదాపుగా 80 శాతం ప్రైవేటురంగం చేతుల్లోనే ఉంది. ఆరోగ్యశ్రీ లాంటి వైద్య సేవలు సాధారణ ప్రజలకు కొంత ఊరట కలిగించినా,ఎక్కువ సందర్భాలలో పేద వాని జేబులో నుంచి వైద్యం కొరకు ఖర్చు చేయా ల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇది సరైన విధానం కాదు. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరాలకు సరిపడా వైద్యం అందడం లేదు. ప్రజలందరికీ సమగ్రమైన,నాణ్యమైన ఆరోగ్య సేవలను, పౌష్టి కాహారాన్ని, మంచి నీటిని, పారిశుద్ధ్యాన్ని అందిం చగలిగితే సాధారణ ప్రజలు ఉన్నత ప్రమాణాలతో, భరోసాతో జీవించగలుగుతారు. అప్పుడు సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుంది. అసమానతలు లేని మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను ప్రజలందరికీ అందించాలంటే వైద్యం ప్రభుత్వాల దయాదాక్షి ణ్యాల మీద ఆధారపడకుండా, ఆరోగ్యమన్నది ప్రభుత్వ బాధ్యతగా, ప్రజల హక్కుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉపయోగాలు..
పుట్టుక నుంచి చివరి శ్వాస విడిచే వరకు నిరాకరణ లేని, అసమానతలు లేని నాణ్య మైన వైద్య సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో ఉచితంగా పొందవచ్చు.
రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వ, ప్రైవేటు / స్వచ్ఛంద ఆసుపత్రులలో దేనిలోనైనా ముందుగా ఫీజు చెల్లించకుండా..వెంటనే, అసమా నతలు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఎల్లవేళలా పొందగలిగే అవ కాశం ఉంటుంది.
మెడికో లీగల్‌ కేసైనా, చికిత్సలో ఆలస్యం లేకుండా అన్ని స్థాయిలలో వైద్యం అందు కునే పరిస్థితి ఏర్పడుతుంది.
గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు అన్ని ప్రాథమిక,ద్వితీయ,తృతీయ స్థాయి ఆసుపత్రులకు త్వరగా చేరుకునే రెఫెరల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగు తుంది.
ప్రభుత్వం తప్పనిసరిగా ఆసుపత్రుల వద్ద పాలియేటివ్‌ కేర్‌ (దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం కలిగించే సేవలు), చికిత్స పొంది పూర్తిస్థాయిలో కోలుకుని..తమ పనులు తాము చేసుకు నేలా ప్రోత్సహించే పునరావాస సంరక్షణ సేవలు కూడా ఏర్పాటు చేయబడతాయి.
జబ్బు వచ్చిన తర్వాత వైద్యం చేయడమే కాకుండా వ్యాధి నివారణ, ఆరోగ్య సంరక్షణ, ప్రోత్సాహక వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
వయసు పైబడిన ముసలివారికి కలిగే దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది. వీరి జీవితానికి కావలసిన ఆర్థిక, సామాజిక ఉపశమన సదుపాయాలు కూడా కలిగించబడతాయి.
ప్రభుత్వాలు చేయాల్సినవి..
ఆరోగ్యం ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా ఉండాలంటే ఆరోగ్య మన్నది ఒకహక్కుగా ఉండాలి. ఈ హక్కును కల్పించడం కొరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య హక్కు చట్టాన్ని తీసుకురావాలి. ఈ చట్టాన్ని ప్రభుత్వాలు ఆచరణలో పెట్టాలి. ఆ¸రోగ్యమన్నది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండాలి. ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ కోసం స్థూల జాతీయ ఉత్పత్తిలో 1.2శాతం నుంచి 2.1శాతం వరకు ఖర్చు చేస్తుంది. దిగువ,మధ్య ఆదాయ దేశాలు చేస్తున్న సగటు వ్యయం 5.2శాతంగా ఉంది.పొరగు దేశాలతో పోల్చుకుంటే మన ఆరోగ్య రంగం బడ్జెట్‌ ఎంత తక్కువగా వుం దన్నది ఈసంఖ్యలు తెలుపుతున్నాయి. Ê ఆరోగ్య రంగ కేటాయింపులను శరవేగంగా పెంచుతూ జాతీయ స్థూల ఆదాయంలో 3.5శాతానికి చేరేలాగా చూడాలి. ఆరోగ్య వ్యయం కోసం రాష్ట్రాలు ప్రత్యేక ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకోవాలి.
ఆరోగ్యంపై జరిగే ఖర్చులు భరించడం వల్ల ఎవరూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకూ డదు. వైద్య ఖర్చుల కొరకు ప్రజలు వారి జేబులో నుంచి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండకూడదు. ప్రస్తుతం ఉన్న 80శాతం నుంచి కనీసం 25శాతానికి వెంటనే తగ్గేలాగా చూడాలి.
ఖాళీగా ఉన్న పోస్టులను పూరించాలి. ఆరోగ్య కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలి. ఆరోగ్య సదుపాయానికి కూడా ఖాళీ స్థానం ఉండకుండా చూడాలి. ప్రజారోగ్య సంస్థల్లో కాంట్రాక్టు సిబ్బందితో పూరించకూడదు. కాంట్రాక్టు ఆరోగ్య కార్యకర్తలందరినీ క్రమబద్ధీకరించాలి. తగిన వేతనాలు, కార్మిక చట్టాల ప్రకారం రక్షణ కల్పించాలి.
ఆరోగ్య వ్యవస్థలను నిర్వహించడం కోసం ఆర్థిక,పరిపాలన అధికారాలను ప్రాంతీయ సంస్థలకు అప్పజెప్పాలి.
మందులను సరసమైన ధరలకు అందు బాటులోకి తేవాలి.నాణ్యతలో తేడా లేకుండా చూడాలి.
ఆరోగ్య సంరక్షణ ప్రధానంగా ప్రభుత్వ బాధ్యత. పిఎం.జె.ఎ.వై.ఆరోగ్యశ్రీ, పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌లవంటి ప్రభుత్వ నిధులతో కూడిన ఆరోగ్య బీమా పథకాలను దశల వారీగా తొలగించాలి.
మెరుగైన క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రైవేట్‌ హెల్త్‌కేర్‌ సెక్టార్‌ను నియంత్రించాలి.
మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యొక్క వాణిజ్యీకరణను ఆపాలి.
వైద్యసేవలను ప్రజల హక్కుగా గుర్తించి, మనదేశంలో ఆరోగ్యహక్కు చట్టాన్ని తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్‌. ఈ ఆరోగ్య హక్కు బిల్లుని 2023,మార్చి 21న రాజస్థాన్‌ అసెంబ్లీ ఆమోదించింది. ప్రస్తుతం ఆచరణ ప్రారంభదశలో ఉన్నారు. అలాగే మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యహక్కు చట్టాన్ని తీసుకురావాలి. ప్రస్తుతం మనం శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల వాడి వేడి వాతావరణంలో ఉన్నాం. ఎన్నికలలో నిలబడిన పార్టీల వారు నెగ్గితే ఏ కార్యక్రమాలు అమలు చేయబోతున్నారన్న విషయాన్ని వారివారి ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేసుకుంటారు.ఆరోగ్య హక్కు చట్టాన్ని కూడా వారి ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పరచాలి. ఆమేరకు ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేయాలి. ఆరోగ్యహక్కు చట్టాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన వారికే ఓటు వేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన విభజన బాధ్యతలు ఆరోగ్యాన్ని ఉమ్మడి జాబితాలో ఉంచాయి. ఈ ఆరోగ్య హక్కును సాధించే దిశగా ఇరు ప్రభుత్వాలు కలసి పనిచేయాలి.
వైద్యం కోసం స్వంత ఖర్చులు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రసూతి మరణాల రేటు,శిశు మరణాల రేటుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇది హర్షించదగ్గ పరిణామం. అయితే, రెండు ప్రధాన పోకడలు తీవ్రమైన ఆందోళనను సూచిస్తున్నాయి.ఒకటి సంక్రమిత వ్యాధులు. రెండు, ప్రజలకు స్వంత జేబుల్లోంచి అయ్యే వైద్య ఖర్చు.మొదటి విషయానికి వస్తే,సంక్రమిత వ్యాధు లు మొత్తం వ్యాధి భారంలో మూడిరట ఒక వంతు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ భారం 29శాతం కాగా, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇది కేవలం 13 శాతం మాత్రమే. కుష్టు వ్యాధులు, టీబీ,ఎయిడ్స్‌ (హెచ్‌ఐవి) ఐరన్‌ లోపం,రక్తహీనత, ముందస్తు జనన సమస్యలు, శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు, అతిసార వ్యాధులు, పోషకార లోపం,కిడ్నీ జబ్బులు, మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం వంటి మొదటి 10 ప్రాణాంతక వ్యాధులలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా కొనసాగుతుంది. రెండవది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ఆరోగ్యశ్రీ కింద 90 శాతం కుటుంబాలు అందులో ఉన్నప్పటికీ వైద్యం కోసం తమ సొంత జేబు నుంచి పెట్టే ఖర్చు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది.
వ్యాధుల భారం.. ఆరోగ్య అసమానతలు
రాష్ట్ర విభజన (2014)తర్వాత ఆంధ్రప్రదేశ్‌ తన మొత్తం రాష్ట్రబడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయిం చింది కేవలం 4.2శాతం మాత్రమే.కరోనా సమయంలో రెండు సంవత్సరాలు కొంచెం ఎక్కువ 6శాతం 2021-22లో కేటాయించారు. జాతీయ ఆరోగ్య వ్యయం 40.8శాతం అయితే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30శాతం మాత్రమే ఖర్చు పెడుతోంది. అయితే ఇదంతాఎక్కువ భాగం ఎక్కడ నుండి వస్తోందని చూస్తే దాదాపు 67శాతం తమ స్వంత జేబుల్లోంచి వైద్య ఖర్చులు భరించాల్సి వస్తోంది.ఇది జాతీయ సగటు (48.8శాతం) కన్నా ఎక్కువే. దీని ప్రభావం అన్ని వర్గాలు, కులాలు, జెండర్స్‌ మీద ఒకే రకంగా ఉందా అంటే కాదు అనే చెప్పాలి.కింది వర్గాలు, కులాల మీద విపరీత మైన భారం పడుతోంది. వీళ్లకు ఖర్చులు సమ కూర్చుకోగలిగితే వైద్యం దొరుకుతుంది.. లేకుంటే వైద్యం జోలికి వెళ్ళలేరు. ఇవన్నీ ఏమి సూచిస్తు న్నాయంటే ఆంధ్రప్రదేశ్‌లో అట్టడుగువర్గాలు, కులాలు, స్త్రీ-పురుషులకు పెరిగిన వ్యాధి భారం, అసమానతలు,దుర్బలత్వాన్ని స్పష్టంగా సూచి స్తుంది.మనదేశంలో ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్స ప్రక్రియలో ప్రజలు ఏమేరకు పేదరికానికి గురవుతున్నారో వ్యయ విశ్లేషణ వెలుగులోకి తెస్తుంది. జనాభాలో 3 శాతం-4 శాతం మంది సగటున ప్రతి సంవత్సరం దారిద్య్ర రేఖకు దిగువన నెట్టివేయబడుతున్నారని అంచనాలు చూపిస్తున్నా యి. దీని ఫలితంగా ఆరోగ్య అసమానతలు పెరుగుతున్నాయని ఈ పరిస్థితికి ముఖ్యమైన కారణం ఇన్‌-పేషెంట్‌ (ఆసుపత్రిలో చేరి, చికిత్స చేయించుకునేవారు) ఆసుపత్రి చికిత్స అన్న విషయం ప్రాథమిక అధ్యయనాలు చెపుతున్నాయి. ఇన్‌ పేషంట్‌ ఆసుపత్రి చికిత్స చాలా ఖర్చుతో కూడుకొన్న కారణంగా వైద్య ఖర్చులు కింది వర్గా లకు భారమయ్యాయి. కోవిడ్‌-19కోసం సగటు వైద్య వ్యయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రోగులు రూ.17,000 చెల్లిస్తే, ప్రైవేట్‌ ఆసుపత్రుల విషయంలో ఇది ఐదు కంటే ఎక్కువ రెట్లు. అంటే వారికి సగటున రూ.90,000 ఖర్చు అయిందని కరోనా ఎకల్‌ మహిళ పునరివాసన్‌ సమితి,జన్‌ ఆరోగ్య అభియాన్‌ చెప్తున్నాయి. గ్రా మీణ ప్రాంతాల్లో ఆసుపత్రి చికిత్సకు రూ.13,010 సగటున ఖర్చయితే,పట్టణ ప్రాంతాల్లో రూ.30, 112 ఖర్చవుతోంది. ముఖ్యంగా 50శాతం పైగా వ్యయం మందుల మీదే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌..
వ్యాధి ప్రారంభమైన తర్వాత ఆసుపత్రి చికిత్సపై దృష్టి పెట్టడం కంటే వ్యాధిని నివారించేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అనేక అధ్యయనాలు సూచించాయి. నిర్ణయాత్మకంగా జీవితాన్ని, శ్రేయస్సును పొడిగించగల ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం. ఔట్‌ పేషంట్‌ చికిత్స లో ప్రధానంగా మందులకు వివిధ రకాల టెసు ్టలకు అయ్యే ఖర్చు వల్లే పేదరికంలోకి నెట్టబడు తున్నారు. కార్పొరేట్‌ వైద్యం, ఇన్సూరెన్సు ద్వారా నడిపిస్తున్న ఆరోగ్య సేవలు ఆరోగ్య సంరక్షణ చేయ కపోగా, అసమానతలు, అంతరాలు పెంచుతున్నా యి.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయి నుండి తృతీయ స్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును పటిష్టం చేయాలి. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ దిశగా (యూనివర్శల్‌ హెల్త్‌ కేర్‌) ప్రభుత్వాలు అడుగులు వేయడం తప్ప వేరే మార్గం లేదు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నమూనాలను అధిగమించి, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వైపు అడుగులు వెయ్యాలి.
మానసిక ఆరోగ్యం..
మానసిక ఆరోగ్యం అనేది మానసిక శ్రేయస్సు స్థితి. ఇది ప్రజలు జీవితంలోని ఒత్తిళ్లను ఎదుర్కొనే క్రమంలో వస్తోంది.వారివారి సామర్థ్యాలను గ్రహించడానికి,బాగా నేర్చుకోవడానికి, బాగా పని చేయడానికి ఒత్తిడికి గురవుతున్నారు. దీని ప్రభా వం సమాజంపై ఉంటుంది. ఇటీవల అనేకమంది విద్యార్థుల నుంచి స్త్రీలు,యువకులు, మధ్య వయ స్కులు, వృద్ధులు..ఒకరని కాదు..అన్ని వయస్సుల వారూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది అంతర్గత సమస్య అయినా..అది బాహ్య ప్రభా వాన్ని కలుగజేస్తుందనేది అంతే వాస్తవం. మానసిక ఆరోగ్యంతోనే మనశ్రేయస్సు సమగ్రతను సంతరించుకుంటుంది. ఏసమయంలోనైనా, మాన సిక ఆరోగ్యాన్ని రక్షించడానికి, అణగదొక్కడానికి విభిన్నమైన వ్యక్తిగత,కుటుంబం,సంఘం, నిర్మాణా త్మక కారణాలు మిళితం కావచ్చు. చాలా మంది వ్యక్తులు స్థితిస్థాపకంగా ఉన్నప్పటికీ, పేదరికం, హింస, వైకల్యం, అసమానతలతో సహా ప్రతికూల పరిస్థితులకు గురయ్యే వ్యక్తులు మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది.అనేక మానసిక ఆరోగ్య పరిస్థితు లను సాపేక్షంగా తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు.,అయినప్పటికీ ఆరోగ్య వ్యవ స్థలు గణనీయంగా తక్కువగా వనరులను కలిగి ఉన్నాయి. చికిత్స అంతరాలు ప్రపంచవ్యాప్తంగా విస్తతంగా ఉన్నాయి. డెలివరీ చేయబడినప్పుడు మానసిక ఆరోగ్య సంరక్షణ తరచుగా నాణ్యతలో తక్కువగా ఉంటుంది. మానసిక ఆరోగ్య పరిస్థితు లు ఉన్న వ్యక్తులు చులకనగా చూడబడుతున్నారు. హేళనకు గురవుతున్నారు. వ్యాసకర్త : అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక.(ప్రజాశక్తి సౌజన్యంతో..)- డాక్టర్‌ ఎం.వి.రమణయ్య

ఆగని వలసలు..మారని బతుకులు

కార్మికులకు పరాయి పంచన తప్పని ఆగచాట్లు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న కార్మికులకు పరాయి పంచన ఆగచాట్లు తప్పడం లేదు.స్థానికంగా ఉపాధి లేమి,ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ వేతనం వంటి కారణాలు వీరిని వలస వెళ్లేందుకు అడుగులేయిస్తు న్నాయి.తీరా అక్కడికి వెళ్లి వేతనాలు దొరక్క కొందరు,చిత్రహింసలు భరించలేదక మరికొం దరు సొంత ఊళ్లకు తిరుగు పయనమ వుతు న్నారు. ఈక్రమంలో దూర ప్రాంతాల నుంచి తమ గ్రామాలకు తిరిగి వచ్చేందుకు ప్రయాణ ఖర్చులు లేక ఎంతోమంది వందలాది కిలోమీటర్లు కాలి నడకన చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో అనారో గ్యాలకు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలొదులు తున్న వారు కోకొల్లలు.ఇటుక బట్టీలు,రొయ్యల,వస్త్ర పరిశ్రమలు తదితర రంగాల్లో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోతూ నరకయాతన అనుభవి స్తున్నారు.పరిస్థితి ఇలా ఉన్న ఇటు కార్మికశాఖ అధికారులు,అటు ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తుండటం వలన కార్మికులకు శాపంగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మెతుకు దొరకని వలస బతుకులు..
దేశ నిర్మాణంలో వలస కార్మికుల పాత్ర ఎంతో కీలకం. వలస వెళ్ళిన చోట సరిగ్గా పని దొరక్క, రేషన్‌ కార్డులు లేక వారికి ఆకలి కేకలు తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరిం చేందుకు సరైన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ‘వైరస్‌ కన్నా ముందుగా ఆకలి భూతమే మా ప్రాణాలు మింగేసేలా ఉంది. కొవిడ్‌ కల్లోల సమయంలో కాలే కడుపులతో నిస్సహాయ స్థితిలో కాలినడకన సొంత ఊళ్ల బాటపట్టిన వలస కార్మికుల ఆవేదన ఇది.దేశీ యంగా ఆకాశహర్మ్యాలు,రోడ్డు,రైలు మార్గాలు, ఇతర ప్రాజెక్టులన్నీ వారి శ్రమతోనే రూపుదిద్దు కొంటున్నాయి. అయితే పట్టణాలు,నగరాల్లో నిత్యం పని దొరక్క వలస కార్మికులకు సరైన ఆదాయం లభించడం లేదు. చౌక ధరలకు ఆహార ధాన్యాలు అందుకొనేందుకు రేషన్‌ కార్డులూ లేక ఎంతోమంది వలస కార్మికులకు ఆకలి మంటలు తప్పడంలేదు. వీటిని నిలువ రించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని సుప్రీంకోర్టు తాజాగా సూచిం చింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అందేలా వలస కార్మికులందరూ ఈ-శ్రమ్‌ పోర్టల్లో పేరు నమోదు చేసుకునేలా చూడాలని నిర్దేశించింది.
దక్కని లబ్ధి..
తొలి విడత కొవిడ్‌ విజృంభణ సమయంలో వలస కార్మికుల ఆకలి బాధలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. దేశీయంగా ఎవరూ ఆకలితో అల్లాడిపోకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.అది సరిగ్గా అమలుకు నోచుకోకపోవడంతో వలస కార్మికుల సంక్షేమంపై పలువురు సామాజిక కార్యకర్తలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్ర యించారు.ఆ పిటిషన్లపై విచారణ సంద ర్భంగా..జాతీయ ఆహార భద్రతాచట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద జనాభా నిష్పత్తి లెక్కలు సక్రమంగా లేవనే కారణంతో వలస కార్మికు లకు రేషన్‌ కార్డులు నిరాకరించలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కొన్నిసార్లు దాహంతో ఉన్నవారి దగ్గరికే బావి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పింది.నిజానికి వలస కార్మికుల కోసం కేంద్రం 2019లో ఒకే దేశం,ఒకే రేషన్‌ కార్డు పథకాన్ని తెచ్చింది.2022 నుంచి అది దేశవ్యా ప్తంగా అమలులోకి వచ్చింది. దాని ప్రకారం ఒక చోట రేషన్‌ కార్డు ఉన్నవారు దేశంలో ఎక్కడి నుంచి అయినా చౌక ధరల దుకాణాల్లో ఆహార ధాన్యాలు తీసుకోవచ్చు. అందుకోసం రేషన్‌ కార్డులను బయోమెట్రిక్‌, ఆధార్లతో అనుసంధానించారు. నిరుడు జులై నాటికి దేశీయంగా ప్రతి నెలా మూడు కోట్ల మంది ఇలా ఇతర ప్రాంతాల్లో రేషన్‌ సరకులు అందుకుంటున్నారు. 2019 ఆగస్టు నుంచి చూస్తే ఈ సంఖ్య దాదాపు 78కోట్లు. అయితే, ఇండియాలో అర్హులైన లబ్ధిదారులు ఎంతో మందికి నేటికీ రేషన్‌ కార్డులు లేవన్న విమర్శ లు వినిపిస్తున్నాయి.
విధానం మారాలి…
దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం- అంతర్గత వలస కార్మికులు 45 కోట్లు.నాటి జనాభాకు అనుగుణంగానే ఇప్పటికీ రేషన్‌ కార్డులు అందిస్తున్నారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం భారత్లో 67శాతం జనాభాకు రేషన్‌ కార్డులు దక్కాలి. ప్రస్తుతం అరవై శాతానికే అవి అందినట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. 2011 జనగణన ప్రకారం ఇండియా జనాభా 121కోట్లు.ఇటీవల భారత్‌ చైనాను అధిగ మించి ప్రపంచంలోనే అత్య జనసంఖ్య ఉన్న దేశంగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఇండియా జనాభా 142 కోట్ల పైమాటే. 2011 జనగణ నను అనుసరించే రేషన్‌ కార్డులు జారీ చేస్తు న్నందువల్ల పది కోట్ల మంది అర్హులు నష్టపోతు న్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం సమగ్ర జనగణన జరిపి రేషన్‌ కార్డులు దక్కాల్సినవారి అసలైన సంఖ్యను నిర్ణయిం చాలి. దేశంలో ఎవరూ ఆకలితో అల్లాడకుండా పటిష్ఠ చర్యలు సంక్షేమ ప్రభుత్వ విధ్యుక్త ధర్మం! తీసుకోవడం సంక్షేమ ప్రభుత్వ విధ్యుక్త ధర్మం.
వలసలను నియంత్రించేదెప్పుడు?
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడాన్ని వలసలు అంటారు. ఇవి విభిన్న రకాలుగా ఉంటాయి, ఒక ఊరి నుండి మరొక ఊరికి, పల్లె నుండి పట్నానికి, పట్నం నుండి పల్లెకు, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి, ఒక ఖండం నుండి మరొక ఖండానికి వలసలు వెళ్తుంటారు. వలసలు వెళ్ళడానికి సైతం విభిన్న పరిస్థితులతో కూడుకొని ఉంటాయి. పెళ్లిళ్ల రీత్యా, చదువుల నిమిత్తం ఒక్కెత్తెట్కతే బ్రతుకుదెరువుకై కొందరు, వ్యాపార నిమిత్తం మరికొందరు వలసలు వెళ్ళడం ఇంకొకెత్తు.
తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌ జిల్లాల నుండి వలస కూలీలు మహారాష్ట్ర, హైదరాబాద్‌, కువైట్‌, దుబాయ్‌.. వంటి ఇతర ప్రాంతాలకు బ్రతుకుదెరువుకై వలసలు వెళ్ళిన సందర్భాలెన్నో చూశాము. వివిధ దినపత్రికలు, టీవీలలో, మాస పత్రికలలో వెలువడిన వ్యాసాలు, పరిశోధన పత్రాల ద్వారా దీనిని విపులంగా వివరించిన మాట వాస్తవం. ప్రభుత్వం సైతం వాటిని నియంత్రించడానికి పలు పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ అనుకు న్నంత ప్రగతి సాధించలేదన్నది నిజం. ఏదో ‘గుడ్డికంటే మెల్ల నయ్యం’ అన్నట్లుగా ఉన్నదన్నది నగ్న సత్యం.మన తెలంగాణ రాష్ట్ర వలస బ్రతుకులు అందరికీ తెలిసినవే. కానీ మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి వలసలు వచ్చిన వారి బ్రతుకులను ఒక్కసారి పరిశీలిస్తే…ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా తయారయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లలో చేపట్టే అభివృద్ధి పథకాలను కాంట్రాక్టర్లకు అప్పగిం చడం ఆనవాయితీ.ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌,ఉత్తర ప్రదేశ్‌,బిహార్‌,ఒడిషా,తెలంగాణ ప్రజలు భాగ్యనగరంలో చేసే పనులను చూస్తే… ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలలో పనిచేసే పనివారి గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుమనక మానదు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పట్నాలకు వలసలు వెళ్ళే కార్మికులు భవనాల నిర్మాణంలో ఎక్కువగా పనిచేస్తూ, మిగతా చిన్న, చితక పనులు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. వారి సంపాదన తక్కువగా వుండి ఖర్చులు అధికంగా ఉండటం మూలంగా నగరాలలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ కాలం గడుపు తుంటారు.బిహార్‌ రాష్ట్రం నుంచి వచ్చే వలస కార్మికులు కొంత మంది తెలంగాణలోని జాతీయ రహదారులకు ఇరువైపుల ధనవం తులు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ వివిధపండ్ల తోటల పెంపకం చేపడుతూ,అందులో పనిచేయడానికిఈ రాష్ట్రం నుండి వచ్చిన వ్యక్తులను నియమించుకోవడం జరుగుతోంది.అలాగే బడా కాంట్రాక్టర్లు వివిధ రహదారుల ఏర్పాటు నిమిత్తం రకరకాల బ్రిడ్జీలు,వంతెనలు,ప్రాజెక్టులు,డ్యాముల నిర్మా ణంలో పనిచేసే కార్మికులు ఎక్కువగా ఈ ప్రాం తానికి చెందిన వారుంటారు.బోర్‌వెల్స్‌లో పని చేసే కార్మికులలో అత్యధిక మంది ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఆదివాసులే వుంటారు. కుటుంబానికి దూరంగా ఉంటూ,ఎలాంటి లాభార్జన లేకుండా ఏదో మోటు కష్టానికే పరిమితమై పనిచేస్తూ, ఎప్పుడు ఎక్కడ ఉంటారో వారికే తెలియకుండా పనిచేస్తూ కాలం గడుపు తుంటారు. భాగ్యనగ రంలో ఇటుకల తయారీలో ఎక్కువగా ఒడిషా రాష్ట్రానికి చెందిన వారుంటారు.వారు నామ మాత్రపు డబ్బులు తీసుకొని యజమానుల క్రింద పనిచేస్తుంటారు.పేదరికంతో ముందు గానే వారివద్ద డబ్బులు తీసుకొని, అప్పు తీర్చు టకు నెలలకొద్దీ పనిచేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌ నుండి తెలంగాణకు వలసల వచ్చి పండ్ల తోటలలో పనిచేస్తున్నవారు కొందరు. జార్ఖండ్‌ నుండి ఇక్కడకు పనిచేయుటకు వచ్చి ఆకలితో చనిపోవడం లాంటి వార్తలను వివిధ దిన పత్రికల్లో చూస్తున్నాము.హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ సమీపంలోకి వెళ్ళి చూస్తే ప్రత్యక్షంగా వలస కూలీల బ్రతుకులను దగ్గరగా చూడవచ్చు. వారితో సంభాషిస్తే వారి బాధలను కథలుగా వినవచ్చు. ఏదో బ్రతుకు దెరువుకై వచ్చి నాలుగు డబ్బులు సంపాదించు కొని సంతోషంగా గడుపుతున్నారంటే అదీ లేదు, ఉద్యోగ భద్రత లేకుండా, యజమానుల క్రింద వెట్టిచాకిరీ చేస్తున్న…యజమానులకు కాసుల పంట పండుతుంది కానీ,వీరికి మాత్రం దినదినం గండంగానే ఉంటుంద నడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో కష్టాలు, మరెన్నో చీదరింపులు, వేధింపుల మధ్య పనిచేస్తూ పొట్టకూటి కోసం పనిచేస్తున్న వలస కూలీల బ్రతుకులను మార్చేదెవరు? అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టినా ఆ ఫలాలు ఎవరికెళ్తున్నాయో అర్థంగాని పరిస్థితి.దేశంలో సైతం వృద్ధిరేటు పెరుగుతుందని ఏవో సర్వేలు చేసి ఘనంగా చెప్పుకుంటారు తప్ప, ఎక్కడున్నది అభివృద్ధి? వీరి బ్రతుకులు మారేదెప్పుడు? మార్చేదెవరు? వీరి భద్రతకు ఎవరు భరోసానిస్తారు? అర్థంగాకుండా వున్నదనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. వలసలు పోవడంలో తప్పలేదు గానీ, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ, రక్షణగావిస్తూ, నాలుగు డబ్బులు సంపాదించుకొని కుటుం బంతో సంతోషంగా గడిపే విధంగా యజమా నులు వుండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.దేశంలో రోజురోజుకు నిరుద్యోగత పెరిగిపోతున్నది, ఎలాంటి ఉన్నతమైన చదువులు చదివినా నేటికీ తల్లిదండ్రులపై ఆధారపడి జీవించే పరిస్థితులు నెలకొన్నాయి. పేదవారి పరిస్థితులను తెలపా లంటే వ్రాస్తే రామాయణమంతా, చెబితే మహాభారతమంతా ఉంటుందనడంలో నిజం లేకపోలేదు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో ప్రభుత్వాలు పునఃపరి శీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉన్నది. నేటి ఈ ప్రజాస్వా మ్య వ్యవస్థలో పాలనాధికారులు ఇచ్చే ఉపన్యా సాలు అంతా ఇంతా గాదు, కానీ ఆచరణలో మాత్రం అనుకున్నంత మేరలో ఉండదు. ఎవ్వరైనా అవే విషయాలను ప్రస్తావిస్తే మేమన లేదని,అవి సాధ్యపడవని మాటలు మార్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి.ఏ ప్రభు త్వం వచ్చినా పేద, నిమ్న వర్గాలకు చెందిన ప్రజల బ్రతుకులకు భరోసా లేనప్పుడు ఈ ప్రభుత్వా లెందుకో అర్థంగాని పరిస్థితి.దేశం లో ఏ రాష్ట్రంలోనైనా పరిపాలన యంత్రాంగం మాటలు ఆపి ఆచరణలో సాధ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.ఏవో పథకాలను చేపట్టి, డబ్బులు లెక్కలు చూపించి, పేపర్లకు పరిమితంగాకుండా క్షేత్ర స్థాయిలో ఎలాంటి అభివృద్ధికి నోచుకుందో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.సొంతూరిలో ఓ గూడు కట్టుకోవాలన్నది వారి ఆలోచన.ఈ దంపతులకు నాలుగేళ్లు, అయిదేళ్లు, ఎనిమి దేళ్లు,11ఏళ్ల వయసున్న పిల్లలున్నారు. నలు గురు చిన్నారులూ తమ సొంతూరిలోనే 54 ఏళ్ల నానమ్మ దగ్గరే ఉంటు న్నారు.ఈ ఒక్క కుటుంబమే కాదు. కర్గిస్థాన్‌లో ఇలాంటి వలస లు సర్వసాధారణం.ఈ దేశం లోని ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఉపాధి కోసం పరా యి దేశాలకు వలసవెళ్లినవారే. అంతర్జా తీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా ప్రకారం, ఇలాంటి వలస కార్మికులు తమ స్వదేశాలకు పంపే డబ్బు విలువ మధ్య ఆసియా దేశాల జీడీపీలో మూడో వంతుకు పైనే ఉంటుంది.అలా పంపే డబ్బు విలువ 2018లో 528 బిలియన్‌ డాలర్లకు చేరిందని అంచనా.దిగువ, మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాల పురోగతికి ఆడబ్బు ఎంతో దోహదపడుతోంది.కానీ, ఆకార్మికుల పిల్లలు తమ జీవితంలో ఎంతో కోల్పోవాల్సి వస్తోంది. పసి పిల్లలను సొంతూళ్ల లో వదిలేసి తల్లిదం డ్రులు కనిపించకుండా వలసెళ్లిపో తున్నారు.దాంతో ఎంతోమంది చిన్నారులకు అమ్మానాన్నల ఆప్యాయత కరువవుతోంది.ఒక తరం పిల్లలంతా తమ బంధువుల సంరక్షణలోనే ఉండాల్సి వస్తోంది. నిరాదరణకు,వేధింపులకు కూడా గురవుతు న్నారు.ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలపట్ల,శ్రామిక వర్గాలపట్ల అండగా వుంటూ,రక్షణనిస్తూ,ఉద్యోగ భద్రతను కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకునేలా ప్రత్యక్ష చర్యలు తీసుకునే విధంగాచట్టాలను గావించా ల్సిన ఆవశ్యకత ఎంతైనా అవసరం.ఆదిశగా ఆలోచిస్తూ వలసల నియంత్రణగావిస్తూ, వారికి ఆర్థికపరమైన భరోసానివ్వాలని ఆశిద్దాం.- సైమన్ 

ముంచుకొస్తున్న ముప్పు..వాతావరణంలో మార్పులు

వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్ర తలు పెరుగుతుంటే..వానాకాలంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడం లేదు. అకాల వర్షాలు.. కరవు.. తుఫాన్లు..సర్వసాధారణమై పోయాయి. ఈ సంవత్సరంలో ఎండలు ప్రజలను భయపెడుతున్నాయి. వేసవిలో సాధారణం కన్నా 4 నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.సముద్ర ఉష్ణోగ్రతల పెరుగు దలతో తీవ్ర తుఫాన్లు వస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. వాతావరణంలో మార్పుల కారణంగానే ఉష్ణోగ్ర తలు అధికమౌతున్నాయని వాతావరణ శాఖాధి కారులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ముప్పు ఉంటుందని హెచ్చరి స్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై తక్షణం దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరే ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో పొడి వాతావరణ తీవ్రత కూడా క్రమంగా బాగా పెరుగు తోందని.. ఇలాంటి వాతావరణం ఉన్న సమయంలో ప్రజలు ఎండలో తిరగవద్దని సూచిస్తోంది. ఇటీవలే ఒడిషాలో తీరం దాటిన ఫోని తుఫాన్‌ తీవ్ర మార్పులకు కారణమౌ తోందని వెల్లడిరచింది. తుఫాన్‌ సమయంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా టెంపరేచర్స్‌ నమోదయ్యాయని..సాధారణం కన్నా 7.1 డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ తెలిపింది. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి పెనువిపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి.ఇంతకీ వాతావరణ మార్పుల గురించి మనకేం తెలుసు?
వాతావరణ మార్పు అంటే..
భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువగా, తక్కువగా కూడా ఉంది.ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతు న్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ దీనికి కారణమని వారు చెబుతున్నారు.గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం.భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌ హౌజ్‌ వాయువులు గ్రహించు కుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలితంగా వాతావరణం, భూ ఉపరితంల వేడెక్కుతున్నాయి.ఈ ఎఫెక్ట్‌ లేకపోతే భూమి ఇంకో30డిగ్రీ సెంటీగ్రేడ్స్‌ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమయ్యేది.అయితే,ఈ గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయం వల్ల వెలువడే వాయువులు తోడై మరింత శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.దీన్నే గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడెక్కడం),వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఇవే…
గ్రీన్‌ హౌజ్‌ వాయువుల్లో అత్యంత ప్రభావ వంతమైంది నీటి ఆవిరి. కానీ, అది వాతా వరణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రామికీకరణ కన్నా ముందు ఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవనరులు దాన్ని పీల్చుకోగలవు. శిలాజ ఇంధనాలను మండిరచడం వల్లే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతోంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులను నరికి, కాల్చేయడం వల్ల కూడా కార్బన్‌ వెలువడుతోంది. గ్లోబల్‌ వార్మింగ్‌ ఎక్కువవుతోంది. 1750లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు 30శాతం పెరిగాయి.గత 8 లక్షల ఏళ్లలో వాతావరణంలో ఈ స్థాయిలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఎప్పుడూ లేదు. మనుషుల చర్యల వల్ల మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ లాంటి ఇతర గ్రీన్‌ హౌజ్‌ వాయువులు కూడా వెలువ డుతున్నాయి.అయితే,కార్బన్‌ డై ఆక్సైడ్‌ అంతటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్‌ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందునాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్‌ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది.అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20 ఏళ్లు..గత 22 ఏళ్లలోనే ఉన్నాయి.2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది.ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది. కరుగు తున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగ డానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటు న్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఆర్కిటిక్‌ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌పై పరుచుకున్న మంచు కూడా కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో కరుగుతోంది. పశ్చిమ అంటార్కిటికాపై ఉన్న మంచు ద్రవ్యరాశి కూడా తగ్గుతోంది. తూర్పు అంటార్కిటికాలోనూ ఈ పరిణామం మొదలవ్వొచ్చని తాజాగా ఓఅధ్యయనం హెచ్చరించింది. పంటలు, జంతువులపైనా వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. మొక్కల్లో పూలు పూసే, పండ్లు కాసే సమయా లు ముందుకు జరుగుతున్నాయి. జంతువులు వలస వెళ్తున్నాయి. ఉష్ణోగ్రత ఎంత పెరగవచ్చు? భూ ఉపరితల ఉష్ణోగ్రత 1850తో పోల్చితే 21వ శతాబ్దం చివరినాటికి1.5 డిగ్రీసెంటీ గ్రేడ్‌ పెరగొచ్చు.చాలా వరకూ అంచనాలు ఇదే సూచిస్తు న్నాయి.ప్రస్తుతం ఉన్న గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితులే ఇకపైనా కొనసాగితే పెరుగుదల 3నుంచి 5డిగ్రీసెంటీగ్రేడ్‌లు కూడా ఉండొచ్చని డబ్ల్యూఎంఓ అంటోంది.ఉష్ణోగ్రత లో 2డిగ్రీ సెంటీగ్రేడ్‌ల పెరుగుదల ప్రమాదకర పరిస్థి తులకు దారితీయొచ్చని అంచనా వేస్తు న్నారు.ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌ లకు కట్టడి చేసుకోగలిగితే క్షేమం గానే ఉండొ చ్చని ఇటీవలి కాలంలో శాస్త్ర వేత్తలు,నాయకులు అంటున్నారు.ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5డిగ్రీసెంటీగ్రేడ్‌లకు అదుపు చేయాలంటే సమాజం అన్ని విధాలుగా త్వరి తగతిన మారాల్సి ఉంటుందని ఇంటర్‌గవర్న్‌ మెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపీసీసీ) నివేదిక అభిప్రాయపడిరది.గ్రీన్‌ హౌజ్‌ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగుతున్న కృషికి ఐరాస నేతృత్వం వహిస్తోంది. చైనా నుంచే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా,యురోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు ఉన్నాయి.జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే, వీటిలో ఉద్గారాలు చాలా ఎక్కువ.ఇప్పటికిప్పుడు గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారాలు గణనీయంగా తగ్గించు కున్నా, వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటు దన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు.ఆహార ఉత్పత్తిపైనా తీవ్ర ప్రభావం పడొచ్చు.వరదలు,తుఫానులు, వడ గాలుల వల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు. భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది.ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువవుతుంది.కొన్ని ప్రాంతాల్లో మంచుపడుతుంది.తీరాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో వేసవుల్లో కరవు ముప్పు ఎక్కువవు తుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు.ఈ మార్పులను తట్టుకునే సామర్థ్యం లేని పేద దేశాలపై ప్రభా వం విపరీతంగా ఉండొచ్చు.పరిస్థితులకు అంత త్వరగా అలవాటుపడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు తరించిపోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)అంచనా వేసింది.వాతావరణంలో పెరిగిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడం వల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్‌ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు.వాతావరణ మార్పు లపై స్పందించడమే ఈ శతాబ్దంలో మానవా ళికి అతిపెద్ద సవాలు కాబోతోంది.
ఈ వాతావరణం అనూహ్యం!
వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మునుపెన్నడూ లేనంతగా ఈ నెలలో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. రెండు, మూడు రోజుల నుంచి పెనుగాలులు, పిడుగులతో భారీవర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భూతాపం ప్రభావంతో కొన్నాళ్లుగా వాతావరణంలో అసాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. గడిచిన మూడేళ్ల పాటు పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగిన లానినా బలహీ నమై ప్రస్తుతం తటస్థంగా ఉంది. ఇది కొద్దిరోజు ల్లో ఎల్‌నినో దశకు చేరుకుంటుం దని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా భూమధ్య రేఖకు ఆనుకుని పసిఫిక్‌ మహాసము ద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగు తున్నందున ఆ ప్రభావం మన దేశంపై ఉం టుందని పేర్కొంటున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ నెల తొలివారం నుంచి దేశం లో ఎండల తీవ్రత పెరగడంతో పాటు వడగా డ్పులు వీచాయి.రోజుల తరబడి ఎండలకు భూ ఉపరితలం వేడెక్కింది.ఈ నేపథ్యంలో భూమధ్య రేఖ నుంచి ఉత్తర దిశగా 10 డిగ్రీల అక్షాం శం వరకూ ఆవరించిన అధిక పీడనం మూడు రోజుల క్రితం మరింత పైకి అంటే 15 డిగ్రీల అక్షాం శం వైపు వచ్చింది.ఈ కారణంగా బంగాళా ఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులు, ఉత్తరాది నుంచి వచ్చే పొడి గాలుల కలయికతో గాలుల విచ్ఛిన్నత (విండ్‌ డిస్‌కంటి న్యూటీ) ఏర్పడడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది.దీంతో గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో ఈదురుగాలులు, పిడుగులు, అక్కడ క్కడా వడగళ్లతో వర్షాలు పడుతు న్నాయి. క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరిస్తే రెండు, మూడు గంటల వ్యవధిలోనే తీవ్ర విధ్వంసం సంభవిస్తుందని ఇస్రో వాతావరణ నిపుణుడు పేర్కొన్నారు.గత నెలలో కురిసిన వర్షాలకు రూ.కోట్ల పంట నష్టం వాటిల్లిందని, ప్రస్తుతం అలాంటి నష్టమే జరుగుతోందన్నారు. ఈ నెలాఖరు వరకు వర్షాలు కొనసాగుతా యని, రైతులు అప్రమ త్తంగా ఉండాలని సూచించారు.
క్లౌడ్‌ బరస్ట్‌ అయిన క్షణాల్లో…
వేసవిలో తీవ్రమైన వాతావరణ అనిశ్చితి నెలకొంటుంది. పొడిగాలి, తడిగాలి (తేమతో ఉండేది) ఒకచోట కలుస్తుంటాయి. పొడిగాలి తోయడంతో తడిగాలి పైకి వెళుతుంది. అక్కడే మేఘాలు ఏర్పడతాయి. భూ ఉపరితలం నుంచి మేఘాలు పైకి వెళ్లే కొద్దీ వాటిలో ఉష్ణోగ్రతలు తగ్గుతారు. భూఉపరితలం నుంచి పైకి ఆరు కిలోమీటర్లు దాటిన తరువాత ఉష్ణోగ్రత మైనస్‌ డిగ్రీ ఉంటుంది. అక్కడే మేఘాల్లో మంచు గడ్డలు ఏర్పడతాయి. ఎత్తుకు వెళ్లే కొద్దీ మంచు గడ్డలతో మేఘాల్లో బరువు పెరుగుతోంది. అలా 12 నుంచి 13 కిలోమీటర్ల ఎత్తునున్న మేఘాల్లో ఉష్ణోగ్రత మైనస్‌ 80 డిగ్రీలు ఉం టుంది. తీవ్రత పెరగడంతో బరువు భరించలేక మేఘాలు విచ్ఛిన్నమవుతాయి. దీనినే క్లౌడ్‌ బరస్ట్‌ అంటారు. క్లౌడ్‌ బరస్ట్‌ అయిన క్షణాల్లో ప్రచండ వేగంతో గాలులు వీస్తాయి.కళ్లు మిరు మిట్లు గొలిపేలా మెరుపులు, ఉరుములు సంభవిస్తాయి. ఇదే సమయంలో పిడుగులు పడతాయి. ఇదంతా ఐదు నిమిషాల వ్యవధిలో ముగుస్తుంది. పైనున్న మంచుగడ్డలు కింద పడేటప్పుడు కరిగిపోగా మిగిలిన భూమిపై పడతాయి. వీటినే వడగళ్లుగా పిలుస్తారు. దాంతోపాటు భారీ వర్షాలు కురుస్తాయి. మొత్తం ప్రక్రియ గంటలోపే ముగుస్తుంది. అంతవేగంగా జరిగే ప్రక్రియలో ప్రతిదీ అత్యంత వేగంగా, ప్రమాదకరంగా ఉంటుం దని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఇలాంటి సమయంలో ఆరు బయట ఉండే రైతులు, కూలీలు, ఇతరులు, మూగజీవాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిం చారు. క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
అనంతలో అత్యధిక ఉష్ణోగ్రత
దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిరది. దీని నుంచి కర్ణాటక, మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్‌ వరకు ఉపరి తల ద్రోణి విస్తరించింది. ఈ ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. సోమవారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో పంట లకు తీవ్ర నష్టం వాటిల్లింది. రానున్న మూడు రోజులు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల పిడుగులు, ఈదరుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రాయలసీమ, కోస్తాల్లో అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదైనా ఉక్కపోత ఎక్కువైంది.దేశంలో అత్యధికంగా అనంతపురంలో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
పిడుగుల నుంచి రక్షణకు జాగ్రత్తలు
వేసవి కాలంలో క్యూములోనింబస్‌ మేఘాలు ఏర్పడినప్పుడు పొలాల్లో పనిచేసే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి
చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండ రాదు
పొలాల్లో ఉండిపోతే పిడుగులు పడే సమయంలో నేలపై పడుకుండిపోవాలి
పిడుగులు పడే సమయంలో ఇళ్లలో టీవీ లు ఆపేయాలి
రోడ్లపై ప్రయాణించే వాహనదారులు దగ్గరలో ఉన్న పక్కా భవనంలోకి వెళ్లాలి
మూగజీవాలను చెరువులు,నీటికుంట లకు దూరంగా ఉంచాలి (ఓయూ యూనివర్శిటీ`హైదరాబాద్‌)-(డాక్టర్‌.రామకుమార్‌ వర్మ)

పెరుగుతున్న నిరుద్యోగత రేటు

పదేండ్ల కేంద్ర సర్కార్‌ పాలనను చూస్తే..దయనీ యమైన మన దేశ ప్రస్థానం కండ్ల ముందే సాక్షాత్క రిస్తుంది.‘సబ్‌ కా సాత్‌- సబ్‌ కా వికాస్‌’,‘అమృత కాలం’ వంటి మోదీ గ్యారెం టీల బూటకపు నినాదాల వాస్తవాలు మనకు కనిపి స్తాయి. మోదీ పాలనలో భారతీయ ప్రజల జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత, ఉపాధి, వేతనాలు, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. బీజేపీ సర్కార్‌ అవలంబించిన నయా ఉదారవాద విధానాలు దేశాన్ని తీవ్రమైన సామాజిక, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయన డంలో ఎటువంటి సందేహం లేదు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగనిరీతిలో దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. అన్నమో రామచంద్రా అంటూ అలమ టించే సంఖ్య విపరీతంగా పెరిగింది.గ్లోబల్‌ హం గర్‌ ఇండెక్స్‌ ప్రకారం..ఆకలి సూచీలో 125 దేశా ల్లో మన దేశం111వ స్థానంలో నిలవడమే అందు కు నిదర్శనం. అయితే దేశంలోఉన్న అనేక ప్రధాన సమస్యలు చర్చకు రాకుండా ప్రజలను మతం మత్తులో ముంచుతున్నది బీజేపీ. రాష్ట్రాల హక్కు లను హరించివేస్తున్నది. సమాఖ్యవాదానికి తిలోద కాలు ఇచ్చింది. ఏకస్వామ్య విధానానికి బాటలు వేస్తున్నది. వ్యవస్థలను మారుస్తూ నియంతృత్వ పోకడలను కొనసాగిస్తున్నది. కుల నిర్మూలన అనే రాజ్యాంగ లక్ష్యానికి బదులు అసమానతల కుల వ్యవస్థ స్థిరీకరణకు పూనుకుంటున్నది. పదేండ్ల మోదీ పాలనలో దేశంలో పేద రికం మరింతగా పెరిగింది. సంపన్నుల ఆదాయా లు గణనీయంగా పెరిగాయి. మోదీ మిత్రులు అంబానీ, అదానీ ప్రపంచ కుబేరులుగా మారిపో యారు. 2014 వరకు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ.. కార్పొరేట్‌ సంస్థల ఎదుగుదలకు తోడ్పడ్డారు. ప్రతిఫలంగా మోదీ రుణం తీర్చుకో వడానికి గుజ రాతీ కార్పొరేట్‌ సంస్థలు ఆయనను ప్రధానిని చేయటంలో సహకరించాయి. అందుకే ప్రజల సొమ్ముతో నిర్మించిన అనేక ప్రభుత్వ రంగ సంస్థ లను ఒక్క కలం పోటుతో ప్రైవేట్‌ కంపెనీ లకు బీజేపీ సర్కార్‌ అప్పగించేసింది.
బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన వారిలో అత్యధికులు గుజరాతీ వ్యాపా రులే. వారు దోచుకున్నదంతా ప్రజాధనమే. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని ఎక్కడున్నా పట్టుకొస్తామని ప్రగల్భాలు పలికిన మోదీ ఈపదేండ్లలో ఏం సాధించారో అందరికీ తెలుసు. పైగా బ్యాంకులపై ఒత్తిడి తీసు కొచ్చి వారి రుణా లను మాఫీ చేశారు. గత పదేం డ్లలో మోదీ ప్రభు త్వం ప్రైవేట్‌ కంపెనీలు చెల్లిం చాల్సిన రూ.15 లక్షలకోట్ల రుణాలను మాఫీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.ఇదంతా ప్రజల సొమ్ము కాదా? అంతే కాదు,గతపదేండ్లలో కార్పొరేట్‌ సంస్థలకు రూ.55 లక్షలకోట్ల పన్ను రాయితీ లను కూడా ప్రభుత్వం ఇచ్చింది.తాజా బడ్జెట్‌లో కార్పొరేట్‌ కంపెనీలపై పన్నును 33శాతం నుంచి 25 శాతానికి తగ్గిం చింది. మోదీ ప్రభుత్వం అనుస రిస్తున్న ఇలాంటి ఆర్థిక విధానాలను సమర్థించే కొందరు కుహనా మేధావులు..సంక్షేమ కార్యక్ర మాలను తప్పుబడు తుండటం విడ్డూరం.దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికడతామని,నిత్యావసర సరు కుల ధరలు తగ్గిస్తామని 2014లో మోదీ హామీ ఇచ్చారు.కానీ, మోదీ పాలనలో నిత్యావసర సరు కుల ధరలు భగ్గుమంటున్నాయి. ఉదాహరణకు గ్యాస్‌ సిలిండర్‌ ధర2014లోరూ.410ఉండగా..ప్రస్తుతం రూ. 906చేరింది.నిజానికి సిలిండర్‌ ధరలురూ.1200 ను తాకాయి.ఎన్నికల సమయం కావడంతో తాత్కా లిక ఉపశమనం లభించింది.ఎన్నికల తర్వాత వడ్డీతో సహామరోసారి ధరా ఘాతం తప్పదు. ప్రధాని నోటి నుంచి వెలువడే ప్రతి మాట విలువై నది.కానీ,మనప్రధాని గత పదేండ్లలో మాట్లాడి నన్ని అబద్ధాలు మరో దేశాధినేత మాట్లాడి ఉం డరు. తాజాగా రాజస్థా న్‌లో ఎన్నికల ర్యాలీలో.. ‘కాంగ్రెస్‌ గెలిస్తే మీ సంప దను ముస్లింలకు పంచేస్తుంది. తల్లుల మెడలోని మంగళసూత్రాలను వదలదు’అంటూ ఒకమతాన్ని టార్గెట్‌ చేసి మాట్లాడారు.ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం తగునా? : మనం వేసే ఓటే మన దేశ భవిష్య త్తును నిర్ణయిస్తుంది. ఓటర్లు ఒక్కసారి ఆలోచిం చాలి.కులం,మతం,జాతి అనే అభిమాన, దురాభి మానాలకు, తాత్కాలిక రాయి తీలు, ప్రలోభాలకు లొంగిపోవద్దు. ఓట్ల కోసం చెప్పే మాటలు, వాగ్దా నాల ఒరవడిలో కొట్టుకు పోవద్దు. నాయకులు, పార్టీల గత చరిత్ర, హామీల అమలును తెలుసుకొని ఓటు వేయండి. ఓటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా.
దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగిత రేటు..: ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సేవల్ని అందించేందుకు ప్రభుత్వ శాఖల్లో అదే స్థాయిలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరగాలి. అయితే, అలా జరగడంలేదు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలను ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ హామీకి నీళ్లొదిలేసింది. అంతేనా.. జనాభాకు అనుగుణం గా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచాల్సింది పోయి..కొత్త పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపది కన రిక్రూట్‌మెంట్‌ చేపడుతూ పరిమిత ఉద్యోగు లతోనే ప్రభుత్వ రథాన్ని లాగుతున్నది. ఫలితంగా నిరుద్యోగం తారాస్థాయికి చేరుతున్నది.‘పే అండ్‌ అలవెన్స్‌’పేరిట కేంద్ర ఆర్థికశాఖ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నది.
నాలుగు పోస్టుల్లో ఒకటి ఖాళీనే : ఆర్థికశాఖ తాజా నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం 30.13 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.2010 తర్వాత ఉద్యోగుల సంఖ్య ఇంత తక్కువ స్థాయిలో ఉండ టం ఇదే తొలిసారి. దేశ జనాభాను బట్టి ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతఉద్యోగుల సంఖ్యకు కనీసం ఐదారు రెట్ల సంఖ్యలో ఉద్యోగాలనుభర్తీ చేయాల్సి ఉన్నది. అయితే, 39.77లక్షల పోస్టులను మాత్రమే మం జూరు చేసిన బీజేపీ ప్రభుత్వం అందులో 30.13 లక్షల కొలువులనే భర్తీ చేసింది.అంటే, ఇంకా 9.64 లక్షల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ప్రతి నాలుగు పోస్టుల్లో ఒకఉద్యోగం భర్తీకి నోచుకోకుండా ఖాళీ గానే ఉన్నది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా చదువుకు తగిన ఉద్యోగం లభించక దాదాపు 22కోట్ల మంది పడిగాపులు కాస్తున్నట్టు నివేదికలు చెబుతు న్నాయి. కేంద్రప్రభుత్వశాఖల్లో మంజూరైన పోస్టుల సంఖ్యను పెంచి, వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తే దేశంలో నిరుద్యోగం తగ్గుతుందని నిపుణులు సూచి స్తున్నారు.
ఏపీ,తెలంగాణాలో ఇలా!
దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమ స్యల్లో నిరుద్యోగం (ఖఅవఎజూశ్రీశీవఎవఅ్‌ )ఒకటి. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీల మేనిఫె స్టోలో ఉద్యోగ కల్పన గురించి, నిరుద్యోగ ప్రస్తావన గురించి ఖచ్చితంగా ఉంటుందన్న విషయం తెలె సిందే.అయితే దేశంలో నిరుద్యోగం గురించి సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (జవీIజు) ఒక డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో నిరుద్యోగిత రేటు6.8శాతం ఉందట. అయితే ఈ రేటు గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నట్లు లేటెస్ట్‌ డేటా చెబుతోంది.గ్రామీణ ప్రాంతంలో6.3 శాతం నిరుద్యోగం ఉండగా,పట్టణ ప్రాంతంలో 7.8 శాతంఉంది. వాస్తవానికి గత నెలలో 8.28 శాతం ఉన్న దేశనిరుద్యోగ రేటుఒకే నెలలో 6.3శాతానికి తగ్గినట్లు డేటాలో తెలిపారు.కాగా,రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా చూస్తే దేశంలో అత్యధి కంగా హర్యానాలో 37.3 శాతం నిరుద్యోగ రేటు ఉంది.ఆతర్వాత జమ్మూ కశ్మీర్‌ (32.8), రాజస్తాన్‌ (31.4), జర్ఖండ్‌ (17.3), త్రిపుర (16.3),గోవా (13.7), బీహార్‌(12.8) రాష్ట్రాలు ఉన్నాయి. ఇక దేశంలో అత్యంత తక్కువ నిరుద్యోగం చత్తీస్‌ ఘడ్‌ లో ఉన్నట్లు డేటా వెల్లడిరచింది. చత్తీస్‌ ఘడ్‌ లో నిరుద్యోగ రేటు0.4శాతమని డేటా వెల్లడిర చింది. మేఘాలయ(2),మహారాష్ట్ర(2.2),ఒడిషా (2.6), మధ్యప్రదేశ్‌(2.6) తర్వాత స్థానంలో ఉన్నాయి. అయితే దక్షిణాదిలో కర్ణాటక మినహా అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్నట్లు డేటా చెబుతోంది.దక్షిణాదిలో అత్యంత తక్కువ నిరు గ్యోగం ఉన్న రాష్ట్రంగా కర్ణాటక(3.5గా ఉంది. దక్షణాదిలో అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు(7.2)నిలిచింది. తెలంగా ణలో నిరుగ్యోగ రేటు(6.9)గా ఉండగా,ఆంధ్ర ప్రదేశ్‌ నిరుద్యోగ రేటు(6),కేరళలో6.1గా ఉన్నట్లు సీఎంఐఈ డేటా తెలిపింది. నిరుద్యోగ రేటు అంటే ప్రధానంగా పనిచేసే వయస్సు జనాభా(15ఏళ్లు అంతకన్నా ఎక్కువ)పని కోసం ఎదురుచూస్తూ ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నవారు.-(డాక్టర్‌ కోలాహలం రామ్‌కిశోర్‌)

ఉన్నత విద్యకు దూరవుతున్న దళిత,బహుజనులు

2024-25 విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలలో పీహెచ్‌డీ ప్రవేశాలకు జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) నిర్వహించాలనడం యూనివ ర్సిటీల స్వయంప్రతిపత్తిని ధ్వంసం చేయడమే. ఆయా వర్శిటీలు సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష స్థానంలో నెట్‌ను నిర్వహించాలంటూ దళిత, బహుజన విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కులోన్మాద కుట్రలను విద్యార్థి లోకం తిప్పి కొట్టాలి.
మార్చి 13వతేదీన న్యూఢల్లీిలో యూని వర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ యూనివర్సి టీలు సొంతంగా నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష స్థానంలో జాతీయస్థాయిలో ఏక పరీక్ష (నెట్‌) ను ప్రవేశపెట్టారు. ఈ నూతన పరీక్ష విధా నంలో నెట్‌ను మూడు కేటగిరీలుగా విభజించారు. అందు లోని 1వకేటగిరీలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హత ఇచ్చారు. 2వ కేటగిరిలో ఫెలోషిప్‌ ఇవ్వకుండా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికే అర్హత ఇచ్చారు. ఇక 3వ కేటగిరిలో ఫెలోషిప్‌ గాని, అదేవిధంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హత ఇవ్వకుండా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేందుకు మాత్రమే అర్హత ఇచ్చారు. దాన్ని కూడా ఏడాదికే పరిమితం చేశారు. నెట్‌ పరీక్ష ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ఉండటంతో దక్షిణ భారతదేశ విద్యార్థులు పరీక్షల్లో అధిక మార్కులు సాధించలేరు. దీంతో కేటగిరి-1లో వీరు ఫెలోషిప్‌ పొందలేరు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హత కూడా కోల్పోతారు. వివిధ యూనివర్సిటీల్లో ఏటా పీహెచ్‌డీ ఖాళీలు భర్తీ చేసేందుకు తప్పనిసరి గా పరీక్షలు నిర్వహించాలనే విధానం లేకపోవడం వల్ల యూజీ నెట్‌లోని 3వ కేటగిరి సాధించినప్ప టికీ విద్యార్థులు ఏడాది కాల పరిమితి నిబంధన వల్ల కనీసం అడ్మిషన్‌ కూడా పొందలేని పరిస్థితి ఏర్పడనున్నది.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు,రాష్ట్ర భాషలు, మాతృభాషలలో చదువుకున్న విద్యార్థులు, పేద, దళిత, బహుజన విద్యార్థులు పట్టణాల్లోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలో ఇంగ్లీష్‌ భాషలో చదివే విద్యార్థులకు పోటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడు తున్నది. అనేక కష్టనష్టాలు, అణచివేతకు, అవమా నాలకు గురై పీజీ వరకు చదువుకున్న దళిత, బహుజన విద్యార్థులు ఈనిర్ణయంతో ఉన్నత విద్యా సంస్థల నుంచి గెంటివేయబడుతారనేది నూటికి నూరుపాళ్లు వాస్తవం. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బహిర్గతం చేసిన యూజీసీ సంస్థ విద్యార్థుల ఆందోళనలను ఎలక్షన్‌ కోడ్‌ పేరుతో అణచివేసే ఉద్దేశంతోనే చేసింది. కొత్త విద్యా విధానం-2020 అమలులో భాగం గానే ఈ ఏకపరీక్ష విధానాన్ని ప్రవేశపెడుతున్నా మని ఈసందర్భంగా ప్రకటించిన యూజీసీ తొందరలోనే తన అస్తిత్వాన్ని కోల్పోయి రద్దయ్యే పరిస్థితి కూడా ఉన్నది. కొత్త విద్యా విధానంలోనే యూజీసీని రద్దు చేయాలని, ఆస్థానంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఈసీఐ) ఏర్పాటు చేయాలని ఉంది.గత కొన్నేండ్లుగా ఎంతో మంది పేదవిద్యార్థులకు ఉపకార వేతనాలు అందించిన యూజీసీని కూడా కనుమరుగు చేసే పరిస్థితి నేడు నెలకొన్నది.ఈ దేశ పాలకులు అనుస రించిన విధానాలతో ఇప్పటికే భారత విద్యా విధా నంలో కొందరికే విద్య అనే పరిస్థితికి నెట్టివేయ బడిరది. విద్య కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణతో పూర్తి కేంద్రీకరణకు పూను కున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ పదేండ్ల కాలంలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. ఏక పరీక్ష విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా పోరాడేందుకు విద్యార్థులు ముందుకురావాలి.పీజీపూర్తి చేసి ఎంఫిల్‌, పీహెచ్‌ ఎ ప్రవేశాలు పొందిన మైనారిటీ విద్యార్థులకు ఆర్థిక వెసులుబాటులేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈఆటంకాన్ని తొలగించడానికి 2009 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘మౌలానా అబుల్‌ కలాంఆజాద్‌ జాతీయ ఫెలోషిప్‌’పేరిట ఉపకార వేతనాలను ప్రవేశ పెట్టింది. వీటితో లబ్ధిపొందు తున్నవారు ఇతర ఉపకార వేతనాలు కూడాఅందు కుంటున్నారనే నెపంతో మోదీ ప్రభుత్వంవీటిని ఈ మధ్య రద్దు చేసేసింది. దేశానికి తొలివిద్యా శాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ముస్లిం కావడం, అల్పసంఖ్యాక వర్గాలలో సహజంగా ముస్లింలే అధికంగా ఉంటారు కనకే మోదీ ప్రభుత్వం వీటిని రద్దు చేసినట్టుకనిపిస్తోంది. దేశ జనాభాలో14.2శాతం మంది ముస్లింలు ఉంటే,కళాశాలలు,విశ్వవిద్యాలయాలలో చేరే ముస్లిం విద్యార్థులు 5.5శాతం మాత్రమే ఉన్నారు. దేశ జనాభాలో16.5శాతం ఉన్న షెడ్యూల్డ్‌ కులాల వారిలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారు 14.7 శాతం ఉన్నారు.2019లో ఉన్నత విద్య గురించి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
అదే కారణమా?..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం2018-19లో మౌలానా ఆజాద్‌ పేరిట నెలకొల్పిన ఉపకార వేత నాలలో1000మంది వినియోగించుకుంటే అందు లో 733 మంది ముస్లింలే కావడం సహజంగానే మోదీ సర్కారుకు అభ్యంతరకరమై ఉండొచ్చు.ఈ ఉపకార వేతనాలను రద్దు చేసినందుకు విద్యా సంస్థల లోపల,వెలుపల తీవ్ర నిరసన వ్యక్తం అవు తోంది.ప్రభుత్వ నిర్ణయం అల్పసంఖ్యాక వర్గాల, ముఖ్యంగా ముస్లింల విద్యావకాశాలను దెబ్బ తీయడానికేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పని గట్టుకుని బీజేపీ ప్రభుత్వం ఈనిర్ణయం తీసు కుందని నిర్ధారణకు రావడానికి ప్రత్యేక పరిశోధన అనవసరం.12వ తేదీన వందలాది మంది విద్యా ర్థులు దిల్లీలో నిరసనకు దిగారు. పోలీసులు వారం దరినీ స్టేషను తీసుకెళ్లి కొన్ని గంటల తరవాత వదిలేశారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు ఇమ్రాన్‌ ప్రతాప్‌గఢీ,బహుజన సమాజ్‌ పార్టీకి చెందిన డానీష్‌ అలీ, మజ్లిస్కు చెందిన ఇంతియాజ్‌ జలీల్‌ ఈ అంశాన్ని లేవనెత్తారు. అల్పసంఖ్యాక వర్గాలవారి వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రాజీం దర్‌ సచార్‌ నేతృత్వంలో ఓకమిటీ ఏర్పాటు చేసిం ది.ఈ కమిటీ 2006లో సమర్పించిన నివేదికలో ముస్లింలు సామాజికంగా,విద్యాపరంగా, ఆర్థికం గా ఇతర మతాలవారితో పోలిస్తే బాగా వెనుకబడి ఉన్నారని తేలింది. కొందరు ముస్లింల పరిస్థితి దళితుల కన్నా హీనంగా ఉందని సచార్‌ కమిటీ పేర్కొంది.మైనారిటీల పరిస్థితి అధ్వానం 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 20 యేండ్లకు పైబడినవారిలో ఏడు శాతం మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.ముస్లింలలో నాలుగు శాతం మాత్రమే ఉన్నారని సచార్‌ కమిటీ నివేదిక ఆందోళ న వ్యక్తం చేసింది. అవకాశాలు తక్కువగా ఉన్న ఇతర వర్గాలవారితో పోల్చి చూసినా ముస్లింల పరిస్థితి అధ్వానంగా ఉందనివివరించింది.ఆ కమి టీ సిఫారసుల పర్యవసానంగానే మౌలానా ఆజాద్‌ జాతీయ ఉపకార వేతనాల పథకం అమలులోకి వచ్చింది.ఇది ముస్లింలకేకాక అల్పసంఖ్యాక మతా లవారందరికీ వర్తిస్తుంది. మైనారిటీ విద్యార్థులు ఒకటికన్నా ఎక్కువ ఉపకార వేతనాలు అందు కుంటున్నందున మౌలానా ఆజాద్‌ పథకాన్ని రద్దు చేస్తున్నామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రకటిం చారు.విద్యార్థులకు వివిధ పథకాల కింద ప్రయో జనం పొందే అవకాశంఉన్నా ఒక ఉపకార వేత నం మాత్రమే అందిస్తున్నారు. మౌలానా ఆజాద్‌ పథకాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నది పీహెచ్‌ఎ పరిశోధక విద్యార్థులే. వారికి జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే, ఇది ప్రతిభ ఉన్నవారికే వర్తిస్తుంది. మౌలానా ఆజాద్‌పథకం రద్దు చేశారు గనక ఇతర మైనారిటీ వర్గాలవారు పరిశోధనలు కొనసాగించే అవకాశం మందగిస్తుంది. పరిశోధన మీద ఆసక్తి ఉన్నవారికి ఉపకార వేతనాలు అందితే ఉద్యోగావ కాశాలను కూడా వదులుకుని ఉన్నత విద్య కొనసా గించగలుగుతారు.లేకపోతే ఉన్నత విద్య కొన సాగించగలుగుతారు. లేకపోతే ఉన్నత విద్య ఆర్థిక స్థోమత ఉన్నవారికే పరిమితం అవుతుంది. క్రమక్రమంగా అమలు చేసిమౌలానా ఆజాద్‌ పథకం రద్దుచేయక ముందుకూడా యూజీసీ ఈ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానించడాన్ని తగ్గించింది.ఈ పథకం కింద ఆఖరుసారి దరఖా స్తులు ఆహ్వానించింది 2018లోనే. 2020 మార్చి లోక్సభలో ప్రశ్న అడిగితే అప్పటి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖార్‌ అబ్బాస్‌ నఖ్వీ ‘మార్గదర్శకాలు ఖరారు చేస్తున్నాం’అని చెప్పి తప్పించుకున్నారు.‘జాతినిర్మాణం’ ‘జాతీయ భద్రత’ పేర పౌరసత్వ సవరణచట్టం (సీఏఏ) లాంటి వాటి ద్వారా ఇదివరకే ముస్లింలను అణగదొక్కడం కొనసాగుతూనే ఉంది. విద్యారంగంలో, ముఖ్యం గా ఉన్నత విద్యారంగంలో అనేక కారణాలతో ముస్లింలు ఇప్పటికే షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతుల వారికన్నా ఎక్కువగా వెనుకబడి పోయారు. అలాంటప్పుడు ఉన్న పథకాలను కూడా రద్దు చేస్తుంటే ముస్లిం వెనుకబాటుతనం మరింత పెరు గక తప్పదు.2.76శాతం మంది ముస్లింలే ఉన్నత విద్యఅభ్యసించగలుగుతున్నారు. ఇప్పటికే పరాయి వారుగా మారిపోయిన వారిని మిగతా సమాజా నికి మరింత దూరంచేసే కుట్ర జరగడం దురదృష్ట కరం.(వ్యాసకర్త : ఓయూ, హైదరాబాద్‌)
సంక్షోభంలో వసతి గృహాలు
‘సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం, శిధిలావస్థలో ఉన్న భవనాలు అనేక చోట్ల దర్శన మిచ్చాయి. సిబ్బంది లేకపోవడంతో అధ్యాపకులే అన్ని పనులు చేయాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఒక విద్యార్థికి ఇచ్చే 30 రూపాయలలో గ్యాస్‌, మ్యాన్‌ పవర్‌ కోసం 8 రూపాయలు ఖర్చవుతున్నాయి. మిగిలిన 22 రూపాయలతో టిఫిన్‌, లంచ్‌, స్నాక్స్‌, డిన్నర్‌,రెండుసార్లు టీ, వారానికి రెండుసార్లు నాన్‌ వెజ్‌,ఐదు రోజులు ఎగ్‌ ఇవ్వాలి.ఇది సాధ్యం కాక నిర్వాహకులు తక్కువ రేటు ఉన్న కూరగాయలతో చేసిన కూరలు,నీళ్లపప్పు,పురుగుల అన్నం పెడుతు న్నారు.పరిశుభ్రత లేనికిచెన్‌,రాత్రి మిగిలిన పదా ర్థాలు పొద్దున వాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం సంక్షేమహాస్టళ్లలో సమూల మార్పులు చేయాలి.’ పేద బడుగు బలహీనవర్గాల విద్యార్థులు ఆర్థిక వెనుకబాటు కారణంగా విద్యకు దూరం కాకూడదనే ఉన్నత ఆలోచనతో రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు నిర్లక్ష్యానికి గురవు తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వాటిని నరకకూ పాలుగా మారుస్తోంది. గ్రామీణ విద్యార్థుల బంగా రు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, గురుకుల, మైనారిటీ వసతి గృహాలు సంక్షేమానికి దూరమై సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలే ఇందుకు నిదర్శనం. స్వరా ష్ట్రంలో విద్యా రంగానికి పెద్దపీట వేస్తారని కేజీ నుంచి పీజీ వరకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తారని తెలంగాణ సమాజం ఆశించినా అది కార్యరూపం దాల్చకపోగా, మరిం త నిర్వీర్యమైంది. పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందక, కనీస మౌలిక సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వసతిగృహలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం, వార్డెన్‌, వంట మనుషులు,ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టక పోవడం,సరైన సమయంలో దుప్పట్లు,బట్టలు ఇతర వస్తువులు అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
హామీని విస్మరించి..
కేజీ టూ పీజీ మిషన్లో భాగంగా దళిత, గిరిజన, బహుజన విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించడానికి గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటనలు గుప్పించారు. ప్రచార అర్బాటాలతో గురుకులాల ఏర్పాటు చేశారు. వాటి అభివృద్ధిని మాత్రం అటకెక్కించారు. సరిపడా నిధులను కేటాయించలేదు. పక్కా భవనాలు నిర్మిం చలేదు. ఖాయిలా పడిన ఇంజనీరింగ్‌ కళాశాలు, ఇతర కళాశాల భవనాలను కోట్ల రూపాయలతో అద్దెకు తీసుకుని గురుకులాలను నడిపిస్తున్నారు. హైదరాబాద్‌ మహా నగరంలో సరూర్‌ నగర్‌, ఇతర అనేక ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో నిర్వహి స్తున్నారంటే పరిస్థితి గురుకులాలు ఎలా ఉందో అవగతమవు తుంది.అద్దెచెల్లింపులలోనూ ఎలాంటి ప్రామాణికత, నియమ నిబంధనలు లేకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేమి, సిబ్బంది తప్పిదాలు, నాణ్యతలేని,గడువు ముగిసిన సరుకులతో తయారు చేసిన ఆహారం విషపూరితం కావడం వంటి ఘట నలు జరిగి విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులలోచేరుతున్నారు. అయినా ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించడం లేదు.
ఇప్పటికీ దొడ్డు బియ్యమే..
వసతిగృహాలతో పాటు,పాఠశాల మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి మనువడు తినే భోజనానికి సమంగా హాస్టల్‌ విద్యార్థుల భోజనం ఉంటుందని ఊకదంపుడుఉపన్యాసలిచ్చారు. కొద్ది రోజులే సన్న బియ్యం పంపించి, తరువాత పురుగులతో కూడినముక్క పట్టిన దొడ్డు బియ్యమే సరఫరా చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆదిలాబాద్‌ సరూర్నగర్‌,సిదిపేట,వరంగల్‌. నిర్మల్‌,గద్వాల సహా పలు జిల్లాలలో కలుషిత నీరు తాగలేమని,పురుగులతో కూడిన భోజనం తినలే మని బాలికలు రోదిస్తూ రోడ్లపైకి వచ్చారు. జగి త్యాల, సిద్ధిపేట, భూపాలపల్లి సహా పలు హాస్టల్స్లో ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.గౌలిదొడ్డి గురుకులంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, బాసర ట్రిపుల్‌ ఐటీ సహా పలు వసతిగృహాల భవనాల పెచ్చులూడి విద్యార్థు లకు గాయాలవ్వడం, ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్‌ హాస్టల్‌ కిచెన్లో పాము కాటుతో సిబ్బంది మృతి చెందడం, ఆలేరు మైనారిటీ హాస్టల్లో విద్యార్థి నులపై లైంగిక వేధింపులు ఇలా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. హాస్టల్స్‌ అంటేనే విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందే పరిస్థితి దాపురించింది.
ఎందుకీ నిర్లక్ష్యం?…
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 2,500 గురుకుల సంక్షేమ వసతి గృహాలలో ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న పేద విద్యార్థుల విషయంలో ప్రభు త్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందనేది అంతు చిక్కనిప్రశ్న.ఈ నేపథ్యంలో ఏబీవీపీ బృం దం వసతిగృహాల సందర్శించింది. సిబ్బంది కొరత,అధికారుల పర్యవేక్షణ లోపం,శిధిలా వస్థలో ఉన్న భవనాలు అనేకచోట్ల దర్శన మిచ్చాయి. సిబ్బంది లేకపోవడంతో అధ్యాపకులే అన్ని పనులు చేయాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఒక విద్యార్థికి ఇచ్చే 30రూపాయలలో గ్యాస్‌, మ్యాన్‌ పవర్‌ కోసం 8 రూపాయలు ఖర్చవుతున్నాయి.మిగిలిన 22 రూపాయలతో టిఫిన్‌,లంచ్‌, స్నాక్స్‌, డిన్నర్‌, రెండు సార్లు టీ,వారానికి రెండుసార్లు నాన్‌ వెజ్‌, ఐదు రోజులుఎగ్‌ ఇవ్వాలి. ఇది సాధ్యం కాక నిర్వాహ కులు తక్కువ రేటు ఉన్న కూరగాయలతో చేసిన కూరలు, నీళ్ల పప్పు, పురుగుల అన్నం పెడుతు న్నారు. పరిశుభ్రత లేని కిచెన్‌, రాత్రి మిగిలిన పదార్థాలు పొద్దున వాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు చేయాలి. ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకాలు చేపట్టాలి. తగిన వసతుల కోసం సరిపడా నిధులు కేటాయించాలి.శానిటరీ అధికారులు నిత్యం పర్య వేక్షించాలి.పక్కా భవనాలు నిర్మించాలి.మెస్‌ చార్జీలు పెంచాలి.
`(వ్యాసకర్త: పీడీఎస్‌ఎఫ్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు)-(ఎం.వి.బాబు)

విపరీతం(వాక్‌ చిత్రం)

అదో అందమైన పల్లెటూరు పేరు ‘పెండ్యాల’ పట్టణానికి దగ్గరగా ఉన్న ఆ ఊర్లో, అన్ని భావాలు గల ప్రజలు కలిసి మెలిసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతుంటారు, అక్షర జ్ఞానంగల ప్రజలకు వర్తమాన రాజకీయాల పట్ల, నాయకుల పట్ల, అవగాహన బాగానే ఉంది, అసలే ఇది ఎండాకాలంతో కూడిన ఎన్నికల కాలం…అదిగో గ్రామ కూడలిలోని వేప చెట్టు కింద పంచాయతీ వాళ్ళు వేసిన సిమెంట్‌ బెంచీల మీద కూర్చున్న రామచంద్రయ్య,సూర్యం,కరుణాకర్‌,విశ్వక్‌, ఏదో మాట్లాడుకుంటున్నారు..
మనము చెవి వేద్దాం రండి….
రామచంద్రయ్య :-
హాయిగా ప్రొఫెసర్‌ జాబ్‌ చేసుకుంటూ లక్షలకు లక్షలు సాలరీ వచ్చే నౌకరితో బతకకుండా… ఎందుకీ లొల్లి అభ్యుదయం ఆవకాయ తొక్కు అని! ఇప్పుడేమైంది ఊరు గాని ఊర్లో జైలు కూడు తినుకుంటా‘రావు’కుహాయిగా ఉందా.!? సూర్యం :-అట్లెట్ల అనుకుంటావ్‌ చంద్రన్న కొమరం భీమ్‌ నీ లెక్కనే ఆలోచిస్తే ఇప్పుడు ఈ గోండు బిడ్డల పరిస్థితి ఎట్లుండేది!? ‘ఉద్య మం’ అంటే మనతోనే ఆగిపోయేది కాదు, అది విత్తనం తీరు భూమిలో పడి చనిపోయి కూడా కొత్త మొలకలు పుట్టిస్తది.
రా.చం :- ఏమి మొలకలో ఏమి ఉద్యమాలో అప్పుడు నడిచినయి గాని ఇప్పుడు కష్టమే…!!
సూర్యం : – నడవనిస్తేగా?? నడిచేది,ఆ మధ్య నారాయణమూర్తి పాపం అప్పులు చేసి కష్టపడి వాస్తవాలు ‘దండకారణ్యం’ సినిమాగా తీస్తే విడుదల కాకుండా ఆపారు మీ ధనవంతుల గుంపు.
రా. చం :- ఆపకపోతే ఏం చేస్తారు అన్ని అవకతవకల సినిమాలే నాయె..! 1978ల కరీంనగర్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఉన్న కిషన్‌ జీ రుద్రయాగం చేయాల్సిన వాడు ఈ రావు మాటల మాయాజాలంలో పడి విప్లవాల బాట పట్టాడు.
సూర్యం :- ఎవరు ఎవరిని మాయాజాలంలో పడేస్తారు? అన్ని అవసరాల కోసమే అయితయి…!!
రా. చం :- మీ నారాయణమూర్తి సినిమాలన్నీ..అగ్రవర్ణాలు ధనవంతులు నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లంతా విప్లవ ద్రోహులు పేదల పొట్టలు కొట్టేవారు అన్నట్టు చూపిస్తాయి గా!?
కిషన్‌ జీ అనే పరుశురాముడిని మమతా బెనర్జీ అనే ధీరశక్తి పొందిన సాయం కూడా మరిచి చివరికి ఎలా మట్టు పెట్టిందో ఎలా మర్చిపోగలం?
సూర్యం :- ఇంత అభ్యుదయ అవగాహన ఉండి ఈ యాగాలు,పూజలు, దేనికి చేస్తారు మీరు?
రా.చం :- ఈ కమ్యూనిస్టులు, నాస్తికులు, హేతువాదులు, వారి వారి భావజాలంతో సమాజాన్ని ఎంత బ్రష్టు పట్టించాలో అంతా పట్టించారు, అది చాలదు అన్నట్టు ఆడవారిని హక్కుల పేరుతో చక్కని సంసారాల్లో నుంచి బయటకు లాగి వారి జీవితాలను చెల్లా చెదురు చేశారు, ఇలాంటి అకృత్యాలు నుంచి సమాజాన్ని కాపాడాలి అంటే పూర్వం మన పెద్దలు చెప్పిన క్రమశిక్షణ విలువలు కలిగిన ఆధ్యాత్మిక భావాలు ప్రజల్లోకి వ్యాపింప జేయాల్సిన అత్యవసరం ఇప్పుడు వచ్చింది.
విశ్వక్‌ :- ఆపుండి మీ ఇద్దరి లొల్లి..శాస్త్రీయ విలువలకు పూజలకు పొంతన ఎట్ల అయితది??
రా.చం :- ఇప్పుడు కావాల్సింది శాస్త్రీయ విలువలు కాదు జాతీయ విలువలు.
విశ్వక్‌ :- మళ్లీ మీ వాదాలకే తీసుకుపోతున్నావా??
రా.చం :- నేను చెప్పేది ఏ వాదంతో కాదు మనమంతా ముందు భారతీయులం ఆతర్వాతే ఏదైనా ఈ జాతీయ విలువలన్నీ వీరుల ఆరాధన, భక్తి ఉద్యమాలు,పూజలు, హోమాలు,ద్వారా వచ్చాయి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే శాశ్వత సత్యాలన్ని జాతీయ విలువలతో ముడిపడి ఉన్నవే!!
విశ్వక్‌ :- అదెట్ట! చిత్రంగా చెబుతున్నావ్‌?
రా.చం :- అవును వాస్తవాలు తెలియకపోతే అన్ని చిత్రంగానే ఉంటాయి..
ఇండోనేషియాలో 90% కన్నా ఎక్కువగా ముస్లింలే ఉంటారు. అయినా వారు ఆ దేశంలో రామాయణ భారతాలను వారి జాతీయ సంపదలుగా గౌరవిస్తూ సరస్వతి, గణేష్‌, మార్కండేయ, పేర్లతో విశ్వవిద్యా లయాలు ఏర్పాటు చేసుకున్నారు. యోగ, ధ్యానం, అక్కడి పవిత్ర ఆధ్యాత్మిక విషయాలు, మన భారతదేశం కొన్ని వేల సంవత్సరాల క్రితం వాటి ని ప్రపంచానికి కానుకలుగా అందించింది,అన్న విషయం నేటి మీయూత్‌లో ఎంతమందికి తెలుసు!? విశ్వక్‌ : – చంద్రం మామ..!! మరి ఆ విలు వలు అన్ని మన దగ్గర లేకుండా ఎందుకు పోయాయి??
రా.చం :- జాతీయ ఉద్యమానికి, కొందరు విదేశీ తొత్తులైన మనవాళ్లే విఘాతం కలిగిస్తు, మాయ తెలియని అమాయక ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారు, అలాంటివారి వల్లే మన భారత జాతీయ విలువలు అన్ని ఆధునికత, నాగరికత, పేరుతో కనుమరుగైపోతున్నాయి.
విశ్వక్‌ :- మామా!!..అసలు ‘‘జాతీయత’’అంటే ఏమిటి?సూటిగా సుత్తి లేకుండా చెప్పు. రా.చం :- మనదేశంలో జాతీయత ఉపజాతీ యత కులం మతం ప్రాంతంభాష అనే వాటిని అర్థం చేసుకోకుండా ఈ హేతువాదులు నాస్తికులు ఏమీ సాధించలేరు, చేతి పార్టీ వాళ్లు దీనిని కాస్త గమనించి బీ.సీ,దళిత, మైనారిటీ, విభాగాలు ఏర్పాటు చేసింది. ఇక కమలం పువ్వు వాళ్ళు కూడా అదే దారిన ముందుకు పోతున్నారు.
కరుణాకర్‌ :- ఈ అసమానతలు పోవాలంటే కులాంతర, మతాంతర, పెళ్లిల్లు జరగాలి, అలా కులాతీత, మతాతీత, వర్గాతీత, సమాజం రావాలి అప్పుడే మన దేశం ప్రశాంతంగా అభివృద్ధి చెందుతుంది అది జరగాలి అంటే ‘‘లౌకికవాదం’’ నర నరాన జీర్ణించుకున్న మా అభయహస్తం పార్టీకి అధికారం రావాలి.
రా.చం :- ఏమిటి ఏర్పడేది? ఇప్పటి మన విప్లవ హేతువాదులంతా సాంప్రదాయ పెళ్లిళ్లు చేసుకున్న వారే!! కానీ వారి ఉపన్యాసాల ప్రభావంతో ఆదర్శ వివాహాలు చేసుకున్న వారంతా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో!!? మనస్పర్ధలతో, ఏకం చేసే వాళ్ళు లేక, తల్లిదండ్రులను ఎదిరించి వచ్చిన ఆడపిల్లలు భర్త నుంచి వేరుపడి పుట్టింటికి పోలేక, ఎన్ని అవస్థలు పడుతున్నారు ??ఆపడే వారికి తెలుస్తుంది.
విశ్వక్‌ :- మన ముచ్చట ఎక్కడో మొదలై ఎటో పోతుంది??
రా.చం :- అటువంటి ఆదర్శ వివాహాలు చిరంజీవి లాంటి ధనవంతుల కుటుంబాలకే చెల్లుతాయి, మన బోటి మధ్య తరగతి,నిరుపేద కుటుంబాల వారికి అస్సలు కుదరవు.
కరుణాకర్‌ :- ఇప్పటివరకు వరవరరావు వంతు అయిపోయింది,ఇక చిరంజీవి మిగిలి పోయాడా? ఆయన చేసిన పాపం ఏమిటో సెలవీయండి !!
రా.చం :- చిరంజీవి సినిమాలు అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్యస్థంగా ఉం డటం మాట వాస్తవమే ఆ మాటకొస్తే తెలుగు సినిమాకు కొత్త డాన్సులు నేర్పిన ఘనత కూడా ఆయనదే!!
విశ్వక్‌ :- మరి అంత ఆదర్శ వారిని పట్టుకుని ఏమిటా మాటలు!?
రా.చం :- ఏమి డ్యాన్స్‌ లో !! చిరంజీవి పాటలు రికార్డింగ్‌ డాన్సులు చేసే పోరంబోకు వెధవల కామపు వలల్లో ఎన్ని అమాయకపు కుర్రలు చిక్కి జీవితాలు నాశనం చేసుకున్నా యో ఆ సినిమాల ప్రభావంతో ఎంతమంది రెండు పెళ్లిళ్లు తప్పు కాదు హక్కు అనే భావం లో పడ్డారో మీకేం తెలుసు!?
కరుణాకర్‌ :- చంద్రం..బాబాయ్‌ సినిమాల్లో అవి అన్ని మామూలే!! మనసు మనసు కలిసి నప్పుడు శరీరాలు కలవడం పెద్ద అసమంజసం ఏమీ కాదు, ఆ సూత్రం సినిమా రంగం వారికే కాదు అందరికీ వర్తిస్తుంది.
రా.చం :- రస సిద్ధాంతం లోతులు బాగానే పరిశీలించావు కరుణాకర్‌…!!
కరుణాకర్‌ :- అదే మీ సాంప్రదాయ వాదులతో వచ్చిన చిక్కు, సంస్కృతి సాంప్రదాయాలకు మీరే దిక్కు అనుకుంటారు. మీ కళాతపస్వి ని మించిన పాండిత్య ప్రకర్ష కులు ఎందరో మన సామాజిక రంగం మార్పు కోసం పాటుపడుతున్నారు, అనే విషయం మర్చిపోకండి.
విశ్వక్‌ :- సమాజం నిరంతరం సామాజిక మార్పుకై పరిణామానికై ముందుకు పోతుంది, ఒక్కోసారి ఆర్థిక ప్రాతిపదికత ఉంటుంది, ఇది స్థిరీకరించబడిన తర్వాత సాంస్కృతిక ప్రాతి పదిక ఏర్పడుతుంది, ఒకరకంగా ఇవి రెండు పరస్పర ఆశ్రితాలు.
కరుణాకర్‌ :- ఏది ఏమైనా చంద్రంబాబాయ్‌, రావు, చిరంజీవి నీకు చేసిన అన్యాయం ఏమిటి?? వాళ్ల మీద నీకు ఎందుకా ద్వేషం??
రా.చం :- ద్వేషం కాదు ప్రేమ మనం ఎవరిని బాగా ఇష్టపడతామో వాళ్ళు తప్పులు చేస్తే సహించలేం కదా?? మన బాధ వ్యధ అంతా కోపంగా మారి వారిపై మనం అగ్నిపర్వతం లెక్క విరుచుకుపడతాం.
కరుణాకర్‌ :- అంతగా మీరు ఇష్టపడేది బాధపడేది ఆ ఇద్దరిలో ఏముంది!? రా. చం :-సాధారణంగా ఎవరైనా జీవితంలో 50 సంవత్సరాల పాటు ఒక సిద్ధాంతం ప్రకారం ఒక అవగాహనతో వెళ్ళినప్పుడు అవి మనం ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పుడు వాటిని పునః సమీక్షించుకొని విచారించు కోవాలి,ఉదాహరణకు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు పద్ధతిలోనే భారత దేశానికి స్వరాజ్యం రావాలి అంటే కుదిరేదా!
సూర్యం :- కుదరదు కానీ మొదటి ప్రపంచ యుద్ధం వల్ల రష్యా, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల చైనా స్వాతంత్రం పొందాయి కదా!?
రా.చం : -అవును సాధారణ దృష్టికి అలాగే అనిపిస్తుంది, కానీ ఏ నియంతృత్వం వద్దని ‘‘లెనిన్‌’’ చెప్పాడో.. అదేవిధానంతో ‘‘స్టాలిన్‌’’ ఒక వెలుగు వెలిగాడు కదా!?
సూర్యం :-అది అట్లా ఉంచండి అసలు వరవరరావు గారిని మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? మీ దృష్టిలో ఆయన ఎవరు!?
రా.చం :- బ్రాహ్మణ సంతతికి చెందిన వాడు,
సూర్యం :- అసలు బ్రాహ్మణుల వృత్తి ఏమిటి??
రా.చం :- పౌరహిత్యం అందుకే వారిని పురోహితులు అని కూడా అంటారు.
సూర్యం :- మీ వివరణ బాగానే ఉంది కానీ పురోహితుడు అంటే అర్థం ఏమిటి!?
రా.చం :- పురం యొక్క హితం కోరి అందుకోసం కృషి చేసేవాడు అని అర్థం.
సూర్యం :- అంటే ఆ ఊరిలో దేవాలయాల్లో పూజలు చేస్తూ ఆ పురం యొక్క హితం కోరుతూ.. కాలచక్రం గణిస్తూ ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ప్రజలకు చెబుతూ వారికి మార్గదర్శనం చేయాలి కదా!?
రా.చం :- అక్షరాల అంతే..
సూర్యం :- అయితే సమాజంలోని అసమానతలు తొలగించే పనిలో భాగంగా పేదల పక్షాన నిలిచి వారిని చైతన్యం చేయడం కూడా పురోహితమే కదా? అంటే మా కమ్యూ నిస్టులు అందరూ చేస్తున్న పని అదే కనుక మేమూ… పురోహితులమే మరి..!!
రా.చం :- మీ మొండి వాదనలు మీవే కానీ ఎవరి మాట వినరు అందుకే నేటి ప్రజాస్వా మ్యంలో మీ స్థానం ఏమిటో ప్రజలు చెబుతూనే ఉన్నారు..! మేము మాత్రం మా లక్ష్యంతో ముందుకు పోతూ సాంస్కృతిక విద్రోహులను, అరాచక వాదులను,అదుపు చేసి భారత దేశ పునర్వైభవం సాధిస్తాం. మాకు వ్యక్తులు శత్రువులు కాదు, వారు చేసే చెడు పనులే మా నిత్య శత్రువులు.
సూర్య :- మీరు చెప్పేదొకటి చేసేదొకటి దళితులు ముస్లింలను బద్ధ శత్రువులుగా చూస్తారు, మన దేశ ప్రజలే మతాలు మారుతున్నారని ఒప్పుకుంటూనే.. సెక్యులరి జంను తెరచాటుగా వ్యతిరేకిస్తారు,మేము మాత్రం మీరు వ్యతిరేకించే సెక్యులరిజం తోనే విజయం సాధిస్తాం.
రా.చం :- మీ ప్రజాస్వామ్య ధోరణి చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియడంలేదు,ఆనాడు నియంతృత్వ నిజాం పై,పోరాడి ఇప్పుడు ఓట్ల కోసం వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటున్నారు. మన దేశానికి పక్కలో బల్లెంలావున్న ఇస్లామిక్‌ తీవ్రవాదం పట్ల, అరబ్‌ షేకుల అరాచకాల పట్ల మాట్లాడడానికి మీకు నోరు రాదు. ఇస్లామిక్‌ పురుషాధిక్యత మీకు కనిపించదు, కేవలం హిందూ పురుషాధిక్యతే మీకు కనిపిస్తుంది.
కరుణాకర్‌ :- అప్పటినుంచి వింటున్నా మీ సనుగుడు..
మీ ఇద్దరూ సాధించింది ఏమీ లేదు! సాధించలేరు కూడా..!!
మన దేశ ఆకాంక్షలను ఆశయాలను మా అభయహస్తం జాతీయ పార్టీనే తీర్చగలరు సుదీర్ఘకాలంగా మమ్మల్ని ఈ దేశ ప్రజలు అక్కున చేర్చుకుని పాలనా అధికారం అందిం చారు, ఏదో అప్పుడప్పుడు మాలో మాకు వర్గ పోరు ఎక్కువైనప్పుడు, ప్రజలకు మా మీద మొహం మొత్తినప్పుడు మధ్యలో పాలన మా అభయహస్తం చేజారి ఉండవచ్చు.. కానీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించే పార్టీ మాదే!!
రా.చం :- నిజమే మీ పాలనంతా కనిపించని నియంతృత్వమే! చాప కింద నీరులా విదేశీయతను పెంచి పోషించారు. భారతదేశం అనే భౌతిక రూపానికి సంపూర్ణ బ్రిటిష్‌ వాదాన్ని నింపి స్వదేశంలో పరదేశ పాలన అందించారు.
విశ్వక్‌ :- మధ్యలో పోయిన బ్రిటిష్‌ పాలన దేనికి? మన గురించి చెప్పండి.
రా.చం :- పోయింది అనుకుంటే సరిపో తుందా ఇక్కడ అమలు జరుగుతున్నది అదే కదా? ‘‘విభజించి పాలించు’’ బ్రిటిష్‌ వాళ్ళ తొలి పాలన సూత్రం.
విశ్వక్‌ :- అది ఇప్పుడు ఎక్కడ ఉంది?
రా.చం :- సిద్ధాంతాలతో పని లేకుండా శత్రువు యొక్క శత్రువుతో స్నేహం చేయడమే ఈ అభయ హస్తం వారి పని.
విశ్వక్‌ :- అది సరేగాని మామా..మధ్యలో చిరంజీవి నిన్ను ఏమన్నాడు? అతను అందరి వాడు కదా!?
రా.చం :- నిజమే తెలుగు సినిమా రంగంలో ఏ కులం అండదండలు లేకుండా ప్రతిభతో కష్టపడి ప్రజల మనసుల్లో స్థానం పొందాడు, అంతటితో ఆగకుండా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎన్టీఆర్‌ లెవెల్లో పార్టీ పెట్టాడు బాగానే ఉంది..
అంత బతుకు బతికి చివరికి అభయ హస్తం పంచన ఎందుకు చేరినట్టు? తనను నమ్ముకున్న పోసాని వంటి వారిని అనాధలను చేయడానికి మనసు ఎలా వచ్చింది? సినీ నటనలో తను వలకబోసిన ఆదర్శాలను నిజజీవితంలో ఎందుకు ఆచరించలేదు??
విశ్వక్‌ :- ఇక ఆపండి మీ వాద ప్రతి వాదనలు మీ మాటల చాతుర్యంతో మీరు చేసిన చేస్తున్న పనులను చక్కగా సమర్థించు కుంటూ పథకాల పేరుతో ఉచితాలకు ప్రజలను బానిసలు చేసి, ప్రజల సొమ్మునే ప్రజలకు పంచుతూ మీ సొంత సొమ్ములు ఇస్తున్నట్లు పోజులు పెట్టకండి.
‘‘ఉచితాలే భవిష్యత్తుకు ఉరితాళ్లు’’ అనే నిజం ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుం టున్నారు. ప్రలోభాలకు లొంగకుండా మా పవిత్ర ఓటు హక్కు వినియోగిస్తాం, నాయ కులకు ‘‘ఓటరు ప్రజలు’’ అంటే వెన్నులో వణుకు పుట్టే అసలైన ప్రజాస్వామ్యం నిర్మించుకుంటాం.
రా.చం :- విశ్వక్‌…! చిన్నవాడివైనా విలువైన మాటలు చెప్పావు ఏ పార్టీ అయినా నాయకులైన ప్రజలంతా ఏకమై కదం తొక్కితే తలలు వంచి నిలవాల్సిందే!!
విశ్వక్‌ :- అవును మామా!! మన పెద్దలు ఆశించిన అసలైన ప్రజాస్వామ్యం ఏర్పాటు కావాలంటే దానికి మా యువతే నడుం బిగించాలి, ఆధునిక ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయాలి అందుకు ఈరోజే మొదలు పెడతాం.- సెల్‌:- 98668 37741. -డా: కాసర్ల రంగారావు

ఓటువేద్దాం..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రా యుధం. ప్రజల భవితను నిర్ణయించే శక్తి దాని కుంది. ఓటుద్వారా పాలకులను ఎన్నుకునే అధికారం రాజ్యాంగం ఓటరుకు ఇచ్చింది.అలాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వి నియోగం చేసుకోవాలి. ప్రలోభాలకు లొంగి పోకుండా ప్రజాస్వామ్య వ్యవస్ధను పరిరక్షిం చాలి.అవినీతి అంతం..అభివృద్ధిని కోరుకుంటు న్నారా..అయితే ఓటు వేయండి..విలువైన ఓటు ను పచ్చని నోటుకు అమ్ముకోవదు. దేశభవిష్యత్తు నీ వేలు చివరే ఉంది.

ప్రజాస్వామ్యాన్ని మన ఓటే నడిపిస్తుంది.భవిష్యత్తుకు ఓటు అభివృద్ధి కోసం ఓటు.ప్రజాస్వామ్య విలువలకు జీవం పోయాలి.ప్రజాస్వామ్యంలోవిలువలను చాటి చెప్పాలన్నా,అక్రమార్కుల పాలనకు స్వస్తి పలకా లన్న నీఓటే కీలకం.ప్రజా సంక్షేమానికి పాటు పడేవారిని ఎన్నుకోవాలి.మే 13నజరగబోయే ఎన్ని కల్లో రోజున తప్పక ఓటు వేయండి.అవినీతి నాయ కులకు ఓటుతో సమాధానం చెప్పాలి. ప్రజాస్వా మాన్ని బ్యాంకు ఖాతాల్లోని డబ్బు నడిపించదు. స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా ఓటు వేయడం మన బాద్యత.బాధ్యతతో ఓటేసి గొప్ప దేశాన్ని నిర్మించు కుందాం.మనం వేసే ఓటు నడిపిస్తుంది.మార్పు కోసమైనా ఓటు హక్కు వినియోగించండి.ఓటు వేసేందుకు బాధ్యతతో కదలండి.ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా విని యోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపే తమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది.అందుకే ఎలాం టి ప్రలోభాలకు తలవంచకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రపంచంలో ప్రజాస్వా మ్యానికి దిక్సూచి అయిన ఓటును వినియోగిం చుకోవటం ప్రజల ప్రధాన కర్తవ్యం. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. నిజమైన ప్రజాస్వా మ్యానికి పునాది ఓటు.అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకో వద్దు.మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మా ణం సాధ్యమవుతున్నది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన వజ్రాయుధం.‘ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల కొరకు పనిచేస్తూ , ప్రజలే పాలకులుగా గల పాలన విధానమే ప్రజాస్వా మ్యం’.మనది సర్వస్వతంత్ర భారతదేశం. ‘లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామిక’ దేశమని మన రాజ్యాంగంలో మనమే చెప్పు కున్నాం.స్వేచ్ఛా సమానత్వం మన దేశ ఆద ర్శం. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సమాజంలోని ప్రతిఒక్కరూ సమానమని, అం దరికీ సమానమైన స్వేచ్ఛ, హక్కులు ఉండాలని రాజ్యాంగంలో రాసుకున్నాం.వ్యక్తులు లేనిదే సమాజంలేదు.సమాజంలో అంతర్భాగం కా కుండా ఏవ్యక్తీ విడిగా మనుగడ సాగించనూ లేడు. అందుకే‘అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరు కలిసి,ప్రజాస్వామ్య మనుగడను కాపాడుకోవాలంటే ఓటు హక్కు ఒక్కటే మార్గం.
దేశ చరిత్రను మార్చే శక్తి ఓటే!
ఓటుహక్కు దేశ చరిత్రనే మార్చే యగల ప్రజాస్వామ్య ఆయుధం. కుల, మత, ప్రాంత,లింగ,జాతి,భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18ఏండ్లు నిండిన పౌరులం దరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 ప్రకా రం ఓటుహక్కు కల్పిస్తున్నది.తద్వారా సమర్థు లైన పాలకులను ఎన్నుకునే అవకాశాన్ని కల్పిం చింది.అందుకే ఓటును దుర్వినియోగం చేయ కుండా దానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి సరైన నాయకున్ని ఎన్నుకున్నప్పుడే దానికి సార్థకత. సమాజంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు వజ్రా యుధం లాంటిదే. ఎన్నికల్లో తమ కు నచ్చిన అవినీతి రహిత పాలన అందించే సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే హక్కు ఈ ఓటు ద్వారానే సాధ్యపడుతుంది. ప్రజాస్వా మ్య విలువలున్న సమాజమే ప్రజా సంక్షేమానికి నాంది పలుక గలదు. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక.ప్రపంచ స్థితి, గతులను మార్చేశక్తి ఓటుకు ఉన్నది. ఒక వ్యవస్థకు ప్రజాప్రతినిధి ఎంత అవసరమో,ఆ ప్రజా ప్రతి నిధిని ఎన్నుకునేం దుకు ఓటు అంతే అవసరం. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా,రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మనం బాగు పడాలి అనే తాపత్రయం ఉండడమే కాదు ఓటూ ముఖ్య మే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా ఓటు వేయాలి. భారత రాజ్యాంగం పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది.రాజ్యాం గ పరిషత్‌,ఎన్నికల సందర్భంగా28.5శాతం ప్రజ లకు దీన్ని విస్తరింపచేశారు.ప్రజాస్వామ్య విధా నానికి కట్టుబడి ఉండేలా రాజ్యాంగం భారత పౌరు లకు సార్వత్రిక వయోజనఓటు హక్కును కల్పిం చింది. ప్రజాస్వామ్యంలో సమానత్వ సూత్రా న్ని అనుసరించి 325 అధికర ణం ప్రకారం ఒకవ్యక్తి కి ఒక ఓటు మాత్రమే ఉం టుంది.కుల, మత,వర్గ, వర్ణ,జాతి ,ప్రాంతం,లింగ భేదాలు వంటి తేడాలతో ఏఒక్క వ్యక్తికి ఓటు హక్కు నిరాకరించ కూడదం టూ నిబంధనలు జారీ చేసింది. 1988 లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఓటు హక్కు వయో పరిమితిని 21ఏండ్ల నుంచి 18ఏండ్లకు తగ్గించి అత్యంత ప్రాధాన్యం కలిగిన హక్కుగా ప్రాముఖ్య తను చేకూర్చింది. ప్రస్తుతం దేశంలో ఓట్లు వేయ డం కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతు గా భావి స్తున్నారు. రాజకీయ నాయకులు నోటు అనే తాయిలాన్ని ప్రజలకు పంచి ఓటును బలహీన పరిచి గెలుపును పటి ష్టం చేసుకుంటున్నారు. మనమంతా నోటు తీసుకుని ఓటు వేస్తే నాయ కులను ప్రశ్నించే హక్కుని కోల్పోతాము. గెలిచిన నాయకుడు డబ్బుకు అమ్ముడుపోయి అవినీతి,కుళ్లు రాజకీ యాలతో ప్రజలను తప్పుడు దారిలోకి తీసుకొని పోతున్నాడు.
భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢ విల్లాలన్నా, సాంఘిక, ఆర్థిక, సమాన త్వాన్ని సాధిం చాలన్నా, మన జీవితాలు, తల రాతలు మారాలన్న అది పారదర్శకమైన ఎన్ని కలు, నిజాయితీపరులైన నాయకుల వల్లనే సాధ్యం. మనం వేసే ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. మనం వేసే ఓటే మన భవి ష్యత్తు,రాబోయే తరాల మనుగడను నిర్ణయిం చేది ఓటే.రాజకీయ నాయకుల తల రాతల్ని మార్చే ఆయుధం ఓటు. అందరూ ఓటు వేసిన పుడే,రాజ్యాంగం కల్పించిన హక్కుకు సార్థకత లభిస్తుంది. దేశ దిశ,దశను ఓటు మారుస్తుంది. మనం ఓటువేసేది బంగారు భవిష్యత్తు కోసమే అనే విషయం మరచిపోకూడదు. ఓటు వేద్దాం -మన ప్రాంత,పురోభివృద్ధికి మంచి నేతను ఎన్ను కొని బంగారు బాటలు వేద్దాం. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడను నిర్ణయించేది ఓటే.రాజకీయ నాయకుల తల రాతల్ని మార్చే ఆయుధం ఓటు. అందరూ ఓటు వేసినపుడే,రాజ్యాంగం కల్పించిన హక్కుకు సార్థ కత లభిస్తుంది.దేశ దిశ,దశను ఓటు మారుస్తుంది. మనం ఓటువేసేది బంగారు భవిష్యత్తు కోసమే అనే విషయం మరచిపోకూడదు.
ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు.
ఏ ప్రజాస్వామ్య సమాజంలోనైనా ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. ఇదిమన ప్రజాస్వా మ్యా నికి మూలస్తంభం,పౌరులు తమను ఎవరు పరి పాలించాలో,వారు ఎలా పరిపాలించబడ తారో చెప్పడానికి వీలు కల్పిస్తుంది.ఓటు వేయగల సామ ర్థ్యం అనేది ఒక హక్కు మాత్రమే కాదు, బాధ్యత, ఎందుకంటే ఇది పౌరులందరి వాణిని వినిపించేలా మరియు వారి ప్రయోజనాలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించేలా చేస్తుంది.ఓటుహక్కు అనే ది ఒక ప్రత్యేక హక్కు మాత్రమే కాదు, మానవ ప్రాథమిక హక్కు. ఇది యూనివ ర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (1948)సివిల్‌ అండ్‌ పోపై అంతర్జాతీయ ఒడం బడిక ద్వారా రక్షించ బడిరది.
భారతదేశంలో ఓటు హక్కు
భారత రాజ్యాంగంలో ఓటుహక్కు ఆర్టికల్‌ 326 ప్రకారం హామీ ఇవ్వబడిరది. ఈ ఆర్టికల్‌ ప్రకారం‘‘ప్రతి రాష్ట్రంలోని ప్రజల సభకు,శాసన సభకు ఎన్నికలు వయోజన ఓటు హక్కు ఆధా రంగా ఉంటాయిబీ అంటే,భారత పౌరుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేని ప్రతి వ్యక్తి తగిన శాసనసభద్వారా లేదా ఏదైనా చట్టం ద్వారా నిర్దేశించబడవచ్చు.ఈ రాజ్యాంగం లేదా ఏదైనా చట్టం ప్రకారం అనర్హులు కాదు. నివా సం ఉండకపోవడం, తెలివితక్కువతనం, నేరం లేదా అవినీతి లేదా చట్టవిరుద్ధమైన అభ్యాసాల కారణంగా తగిన శాసనసభ ద్వారా అటువంటి ఎన్నికలలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.’’
యునైటెడ్‌ స్టేట్స్‌ రాజ్యాంగంలో ఓటు హక్కు
యునైటెడ్‌ స్టేట్స్‌ రాజ్యాంగంలో ఓటు హక్కు స్పష్టంగా పేర్కొనబడలేదు. ఏది ఏమైనప్పటికీ, ఫెడరల్‌ ప్రభుత్వం ఎన్నికల నిబంధన ద్వారా ఓటింగ్‌ ప్రక్రియను నియంత్రించే ఫ్రేమ్‌వర్క్‌ను రాజ్యాంగం అందిస్తుంది, ఇది సమాఖ్య ఎన్నిక లను నిర్వహించే ‘‘విధానానికి’’ సంబంధించిన చట్టాలను ‘‘తయారు లేదా మార్చే’’ అధికారాన్ని కాంగ్రెస్‌కు ఇస్తుంది. అదనంగా, అంతర్యుద్ధం (1861-1865) తర్వాత ఆమోదించబడిన రాజ్యాంగంలోని 14వ మరియు 15వ సవరణలు జాతి లేదా రంగు ఆధారంగా ఓటింగ్‌లో వివక్షను నిషేధించాయి.1920లో ఆమోదించబడిన 19వ సవరణ, లింగం ఆధారంగా ఓటింగ్‌లో వివక్షను నిషేధించింది.1971లో ఆమోదించబడిన 26వ సవరణ,18సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి వయస్సు ఆధారంగా ఓటు వేయడంలో వివక్షను నిషేధిస్తుంది.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలి`జిల్లా కలెక్టర్‌ డా.ఎ. మల్లిఖార్జున
పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు అతి శక్తి వంతమైనదని…ప్రజాస్వామ్య పరిరక్షణకు అదొక వజ్రాయుధం లాంటిదని దానిని సక్రమంగా వినియోగించుకోవటంద్వారా తమ ప్రథమ కర్త వ్యాన్ని నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ. మల్లి ఖార్జున పేర్కొన్నారు. మే13న జరిగే ఎన్నికల పండుగలో కుటుంబ సమేతంగా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు ప్రాముఖ్యతను,ఆవశ్యకతను తెలుసు కోవాలని.. వంద శాతం ఓటింగే లక్ష్యంగా ప్రతిఒక్కరూ ముం దుకు సాగాలని పిలుపునిచ్చారు. ఓటరు చైతన్యం, ఓటు ప్రాముఖ్యత,వినియోగం,హోం ఓటింగ్‌ విధానం,పోలింగ్‌ స్టేషన్ల వద్ద కల్పించిన వసతులు, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్టు తదితర అంశాలపై ఆల్‌ ఇండియా రేడియోద్వారా జిల్లా కలెక్టర్‌ ఓట ర్లకు సందేశం ఇచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్‌ లో నిర్వ హించిన టాక్‌ షోలో పాల్గొని ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు.
తొలిసారి ఓటు పొందిన యువత ఉత్సాహం చూపాలి
‘‘జిల్లాలో తొలిసారిగా ఓటు పొందిన 18-19 సంవత్సరాల మధ్యగల యువత సుమారు 60వేల మంది ఉన్నారు. వారంతా తమ ఓటు హక్కు వినియోగంలో ఉత్సాహం కనబరచాలి. మే 13న జరిగే పోలింగ్‌ రోజున ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. యువశక్తిదే నిర్ణయాత్మకం. వారు తప్పకుండా ఉత్సాహం ప్రదర్శించి ఓటు హక్కును వినియోగించుకోవాలని… ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి’’ అని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.
విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక క్యూ లైన్లు
‘‘జిల్లాలోని 1991పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. అన్ని చోట్లా పటిష్ట ఏర్పాట్లు చేశాం. వయో వృద్ధు లకు,విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక వసతులు సమకూర్చాం. వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాం.విభిన్న ప్రతిభావంతులతో ఒకరు సహాయ కంగా రావొచ్చు. అయితే ఒకరితో వచ్చిన సహాయ కులు మరొకరితో ఇంకొసారి రావటానికి వీలు లేదు. ఓటరు ఓటు వేసేటప్పుడు సహాయకుడు దూరంగా ఉండాలి’’ అని కలెక్టర్‌ సూచించారు.
హోం ఓటింగ్‌ సదుపాయం వారికి ప్రత్యేకం…
‘‘ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం 85 ఏళ్లు దాటిన వృద్ధులకు,40 శాతం వైకల్యం దాటిన వారికి ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకొనే వెసులు బాటు కల్పించాం. ఇప్పటి వరకు సుమారు 1500 పై చిలుకు దరఖాస్తులు అందాయి. వాటిని పరిశీ లించి తదుపరి చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు అన్ని రకాల అధికారులు ఇంటికి వచ్చి.. రహస్య పద్ధతిలో ఓటింగ్‌ జరిపిస్తారు. తొలి విడత మే 7,8వ తేదీల్లో జరుగుతుంది. ఒక వేళ ఎవరైనా మిగిలిపోతే మే 9వ తేదీన మరొక సారి అవకాశం కల్పిస్తాం.హోంఓటింగ్‌ అనేది ఐశ్ఛికం మాత్రమే. ఒకవేళ ఎవరైనా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు’’అని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు.
వేసవి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
‘‘వేసవిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలోని 1991 పోలింగ్‌ కేంద్రాల వద్ద షామియానాలు, తాగునీరు ఏర్పాటు చేస్తాం. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో సాధారణ పౌరుల అవసరాలను గుర్తించి చలివేంద్రాలు ఏర్పాటు చేశాం’’ అని జిల్లా కలెక్టర్‌ వివరించారు.
ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నాం
‘‘జిల్లాలో కోడ్‌ అమల్లోకి వచ్చిన రోజు నుంచీ అప్రమత్తంగా ఉంటున్నాం. పటిష్ట చర్యలు చేపట్టాం. ఇప్పటికే 58 ఘటనల్లో ఎఫ్‌.ఐ.ఆర్‌.లు నమోదు చేశాం. 68 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నాం. కోడ్‌ అమలుకు 110 రకాల బృందా లను నియమించాం. వస్తు, ధన రూపంలో ఇప్పటి వరకు రూ.5.03కోట్లను జప్తు చేశాం.కేంద్ర ఎన్ని కల సంఘం జారీ చేసిన నిబంధనలను తు.చ. పాటిస్తున్నాం. ఓటరు చైతన్యం కల్పించేం దుకు వీలుగా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తాం. మేధా వులతో చర్చలు ఏర్పాటు చేస్తాం’’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు.
పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి ప్రత్యేక కేంద్రాలు
ఎన్నికలవిధుల్లో భాగస్వామ్యం అయ్యేవారి కోసం.. అత్యవసర సేవల్లో నిమగ్నమయ్యే వారి కోసం.. ప్రత్యేక చర్యలు చేపట్టాం. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశాం. ఫాం 12డిని సేకరిస్తున్నాం.మే 5,6,7,8వ తేదీల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో స్థానిక ఉద్యోగులు, బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సేవలందిస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించు కోవచ్చని’’ కలెక్టర్‌ సూచించారు.
ఎపిక్‌ కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చు..
ఓటరు జాబితాలో పేరుండి..అర్హులైన వారు ఎపిక్‌ కార్డు లేకపోయినా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కలెక్టర్‌ చెప్పారు. కేంద్రం ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల కార్డులు, ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంకు పాసు పుస్తకం ఇర ఆధారాలు చూపించి ఓటు వేయొచ్చని స్పష్టం చేశారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందుగా ప్రతి ఓటరుకు ఓటరు ఇన్ఫర్మేషన్‌ స్లిప్పులు అందజే స్తామని తెలిపారు.ఎలాంటి ప్రలోభాలకు గురికా కుండా ఓటర్లు చైతన్యవంతంగా ఉంటూ ఓటును వేయాలని సూచించారు.
వంద శాతం ఓటింగ్‌ కు అందరూ సహకరించాలి
మే13న అందరూ పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని..తద్వారా వందశాతం ఓటింగ్‌కు అధికారులు, ఓటర్లు పూర్తి స్థాయిలో సహకరించా లని కలెక్టర్‌ ఆల్‌ ఇండియా రేడియో ద్వారా ఇచ్చిన సందేశంలో పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో 67 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని..ఈ సారి 80 శాతం దాటేలా అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 7.00 గంటలకే పోలింగ్‌ ప్రారంభమవుతుందని..సాయంత్ర 6.00 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.6.00 గంటలకే లైన్లలోకి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారందరికీ ప్రత్యేక స్లిప్పులు జారీ చేసి వారంతా ఓటు వేసే వరకు పోలింగ్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మా ఒక్కరి ఓటు వల్ల ఏం జరుగు తుందిలే అనే నిరూత్సాహ భావం వద్దని.. అంద రూ ముందుకు వచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలి కారు. రాజ్యాంగ వ్యవస్థలు.. న్యాయ వ్యవస్థ… మీడియా వ్యవస్థ మాదిరిగా పౌరులు ఓటు హక్కును వినియోగించుకోవటం ద్వారా ప్రజాస్వా మ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున పిలుపునిచ్చారు. ఆల్‌ ఇండియా రేడియో టాక్‌ షోలో డీఐపీఆర్వో ఎస్‌.వి. రమణ, డివిజనల్‌ పీఆర్వో డి.నారాయణ రావు,ఆల్‌ ఇండియా రేడియో ప్రోగ్రాం హెడ్‌ పీవీ రామ్‌ గోపాల్‌, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌. సుధా కర్‌ రెడ్డి, డ్యూటీ అధికారి సాంబశివరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.- (గునపర్తి సైమన్‌)

ప్రజాస్వామ్యం నుదుట చెరగని తిలకం

-(థింసా రీసెర్చ్‌ సెంట్రల్‌ డెస్క)

  • ప్రజాస్వామ్యానికి పండుగ వంటి ఎన్నికల నిర్వహణలో కాలంతోపాటు ఎన్నోమార్పులు వచ్చా యి.కానీ దశాబ్దాలుగా చెక్కు చెదరని ఒక అంశం మాత్రం ఈ ప్రక్రియలో కీలక భూమిక వహిస్తూనే ఉంది.అదే.. ఓటు వేసినవ్యక్తి ఎడమచేతి చూపుడు వేలుపై సిరా ముద్ర.కొన్ని రోజులపాటు చెరిగి పోకుండా ఉండే ఈసిరా (ఇండెలిబుల్‌ ఇంక్‌)కు పెద్ద చరిత్రే ఉంది.
  • దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది.ప్రభుత్వం ప్రకటించిన విధంగా మే13న ఏపీలో ఒకేవిధంగా 175అసెంబ్లీ స్థానా లకు 25పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగ బోతున్నాయి. పోలింగ్‌ తేదీన ఓటు వేసిన తర్వాత పోలింగ్‌ బూత్‌ లోపల ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఎడమచేతి చూపుడువేలుపై ఒకసిరా చుక్కను పెడతారు.ఈచుక్క 72గంటల వరకు (3రోజులు) చెరిగిపోకుండా ఉంటుంది.దొంగ ఓట్ల నివారణకై దీనిని ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. 10మి.లీ. సామర్ధ్యం కలిగిన ఒకసిరా సీసా(వైల్‌)700 మంది కి చుక్కలు పెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఓటరుకు ఎడమచేయలేకపోయినా, ప్రమా దంలో కోల్పోయినా,అప్పుడు మాత్రమే అధికారుల అనుమతితో కుడిచేతికి పెట్టాలనే నిబంధన కూడా ఉంది.
  • 1962 నుంచి కర్ణాటక ప్రభుత్వానికి చెందిన మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమి టెడ్‌ దీనిని ఉత్పత్తి చేస్తుంది. ఎన్నికల సంఘానికి మాత్రమే సరఫరా చేస్తోంది.చెరగని సిరాను ఢల్లీి లోని కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌` నేషనల్‌ ఫిజికల్‌ లేబొరేటరీ ప్రత్యేకంగా ఈ కంపెనీ కోసం అభివృద్ధిపరిచి ఇచ్చింది.ప్రస్తుతంలోక్‌సభ, దాంతో పాటే నిర్వహించే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కల కోసం ఏర్పాటుచేసే 12లక్షల పోలింగ్‌ కేంద్రా లకు అవసరమైన సిరా సరఫరా ఇప్పటికే పూర్త య్యిందని తయారీ సంస్థ వెల్లడిరచింది. రూ.55 కోట్ల విలువైన 26.55లక్షల సిరా బుడ్ల(వయల్స్‌) ను అందించినట్లు తెలిపింది.అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌కు 3.64లక్షల వయల్స్‌,అత్యల్పంగా లక్ష ద్వీప్‌కు 125 వయల్స్‌ పంపించారు.ఒక్కో బుడ్డీలో 10మిల్లీటర్‌ సిరా ఉంటుందని,700మంది ఓటర్ల వేలికి రాయడానికి వస్తుంది.
  • అక్కడ సిరాలో వేలిని ముంచుతారు..
  • చెరిగిపోని సిరాను 25కు పైగా దేశా లకు మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌ ఎగుమతి చేస్తోంది.కెనడా,ఘనా,నైజీరియా, మంగోలియా,మలేసియా,నేపాల్‌,దక్షిణాఫ్రికా, మాల్దీవులు,తుర్కియో తదితర దేశాలు మన సిరాను ఎన్నికల్లో అక్రమాలను ఆరికట్టడానికి వినియోగి స్తున్నాయి.అయితే,సిరా విని యోగించే విధానం వేర్వేరుగా ఉంటుంది. కంబోడియా,మాల్దీవులలో ఓటరు తన వేలిని సిరాలో ముంచాలి. బర్కినా పాసోలో కుంచెతో,తుర్కియేలో నాజిల్‌తో ఇంక్‌ ముద్ర వేస్తారు.
  • పోలియో చుక్కల కోసం..
  • ఈ సిరా చుక్కను మనదేశంలో 1962 నుంచి వాడుతున్నారు.ఇది కర్ణాటకలోని మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిస్‌ కంపెనీ తయారు చేస్తుంది. అయితే డిమాండ్‌ను బట్టి కర్ణాటకతో పాటు హైదరా బాద్‌లోనూ తయారీచేసే కంపెనీ ప్రభుత్వం అనుమతించింది.ప్రస్తుతం ఇదే సిరాను చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసినప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు.ఇదే సిరాను మనదేశంలో ఎన్నికలకు కాకుండా 1976 నుంచి 29 దేశాలకు భారతదేశం ఎగుమతి చేస్తుంది. ఎన్నికల సంఘ నిబంధనలు సెక్షన్‌37(1)ప్రకారం ఓటరు ఎడమ చేతిపై చూపుడు వేలుపై సిరా చుక్క వేయ్యాలి. 2006 ఫిబ్రవరి నుంచి వేలుతోపాటు గోరు పై భాగంలో కూడా సిరా చుక్క వేస్తున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్య ప్రజానీ కం మొదలు సెలబ్రిటీలు సైతం తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. కొందరు తాము ఓటు వేసిన అనంతరం తాము ఓటు చేశామని చెబుతూ తమ ఎడమ చేతిచూపుడు వేలును చూపుతుంటారు. కొంత మంది తాము వేసిన ఓటు చిహ్నం(చూపుడు వేలిపై ఉన్న సిరా చుక్క)తో సెల్ఫీలు దిగుతూ సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇంత చేస్తున్నా వారికి ఓటు వేసే సమయం అధికారులు తమ వేలిపై వేసే సిరా చుక్కను అంతంగా పట్టించుకోరు. అయితే అధికారులు వేలిపై వేసే సిరా చుక్కకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఓటు వేసిన వ్యక్తి మళ్లీ ఓటు వేయకుండా ఇలా సిరా గుర్తు పెట్టే పద్ధతి 1962 సార్వత్రిక ఎన్నికల్లో మొదలైంది. దొంగఓట్లు వేయకుండా కట్టడి చేసేందుకు సిరా గుర్తు పద్ధతి మంచి ఫలితాలే ఇస్తోంది. సిరా చుక్క. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు..దొంగ ఓట్లను నిరో ధించే ఆయుధం కూడా అదే. ఎన్నికల్లో ఉపయోగించే సిరాను చెరగని సిరా (ఇండెలిబుల్‌ ఇంక్‌) అంటారు. మొదట్లో సిరాను చిన్న బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవారు, 2004 తర్వాత ఇంక్‌ మార్కర్లను తీసుకొచ్చారు.ఈ ఇంకును స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పిల్లల కు పోలియో చుక్కలు వేసే సమయంలోనూ వీటిని ఉపయోగి స్తుండటం గమనార్హం.
  • 1950లో పేటెంట్‌
  • ఓటర్లకు సిరా వేసే విధానం చాలాకాలంపాటు లేదు.1950 సంవత్సరంలో ఈ సిరా పేటెంట్‌ ను భారత్‌లోని నేషనల్‌ రీసెర్స్‌ అండ్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఆర్‌డీసీ) పొందింది. ఆతర్వాత సీఎస్‌ఐఆర్‌(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌కు చెందిన నేషనల్‌ ఫిజికల్‌ లాబోరేటరీ ఈసిరాను అభివృద్ధిచేసింది
  • సీరా చుక్క ప్రత్యేకతలు..
  • సిరా గుర్తు మాత్రమే కాదు..దొంగ ఓట్లను ఆపే ఆయుధం కూడా..
  • ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తికి ముందుగా ఎడమ చేతి చూపుడు వేలుకి సిరా గుర్తు వేసి అనుమతి ఇస్తారు.
  • గోరుతోపాటు చర్మానికి కలిపి వేసిన ఈగుర్తు చెరపడం సాధ్యం కాదు.దీంతో ఆవ్యక్తి తిరిగి వచ్చి మరో ఓటు వేయడం సాధ్యం కాదు.
  • వేలికి పూసిన 15నుంచి 20 సెకండ్లలో ఈ సిరా ఆరిపోతుంది.కొన్ని రోజులకి ఈ గుర్తు మెల్లగా చెరిగిపోతుంది.
  • ఎన్నికలకు వినియోగించే దీని తయారీ కోసం పదిశాతం ఇంకుతోపాటు 14 నుంచి 18శాతం సిల్వర్‌ నైట్రేట్‌ కలిపి చేస్తారు.
  • సిల్వర్‌ నైట్రేట్‌ సన్‌లైట్‌ తగిలిన వెంటనే గుర్తులా ఏర్పడుతుంది.దీని కారణంగానే ఈ ఇంకు గుర్తు త్వరగా పోదు.
  • దొంగ ఓట్ల నిర్మూలనే లక్ష్యంగా చేసుకొని ఈ సిల్వర్‌ నైట్రేట్‌ సిరా ఎన్నికల సమ యంలో ఎలక్షన్‌ అధికారులు ఉపయోగి స్తున్నారు.

ఆడవి తల్లిని అమ్మకన్నా మిన్నగా కాస్తున్న స్త్రీమూర్తులు

‘అ.. అమ్మ! తర్వాత ఆ.. ఆవు!’ అనే చాలామందికి తెలుసు. కొందరు మాత్రమే.. అమ్మ తర్వాత అమ్మలాంటి ‘అడవి’ అని అక్షరాలు దిద్దుతారు. ఆ పదాన్ని అక్కడితో మర్చిపోరు. ఎక్కడికి వెళ్లినా తలుచుకుంటారు. తమ చుట్టూ పచ్చగా ఉండాలని భావిస్తారు. అడవిని ఆడపడుచుగా గౌరవిస్తారు. ఆమెకు మొక్కలు చదివిస్తూ ఆలనా పాలనా చూస్తారు. అలాంటి వాళ్లే ఈ స్త్రీమూర్తులు. కుంచించుకుపోతున్న అడవులను చూసి చింతించి ఊరుకోకుండా.. తమ వంతుగా చెట్లు నాటుతూ పచ్చదనం పెంచుతూ అడవితల్లిని అమ్మకన్నా మిన్నగా కాస్తున్న ఈ స్త్రీమూర్తుల కథలు తలుచుకుందాం..!!

ఐదువేల చెట్లకు అమ్మ
పడమటి కనుమల్లో మరింత పచ్చగా ఉంటుంది కేరళ.ఆరాష్ట్రంలోని అలెప్పి జిల్లా ముత్తుకుళం గ్రామంలో 1934లో జన్మించింది కొల్లక్కయిల్‌ దేవకి.బాల్యంలో తాత చెప్పిన అన్ని కథలూ అడవి చుట్టూ తిరిగేవి. దీంతో ఆమెకు వనమెంతో ఘనంగా కనిపించేది. దేవకి వివాహం గోపాలకృష్ణ అయ్యర్‌తో జరిగింది. అతను ఇంగ్లిష్‌ టీచర్‌. వారసత్వంగా వాళ్లకు ఐదెకరాల పొలం వచ్చింది.చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన అనుభవం ఉండటంతో పెండ్లయ్యాక సాగు కొనసాగించింది. అయితే ఓ ప్రమాదంలో ఆమె కాళ్లు దెబ్బతిన్నాయి. కొన్నాళ్లకు కోలుకున్నప్పటికీ మునుపటిలా ‘పొలం పని చేయలేన’ని దేవకికి అర్థమైంది. బాల్యం నుంచి తన మనోఫలకంపై చిత్రించుకున్న వనాన్ని తన చేనులో కొలువు దీర్చా లని భావించింది.ఆనాటి నుంచి మొక్కలు నాటడం పనిగా పెట్టుకుంది. అప్పుడు ఆమె వయసు నలభై ఏండ్లు! రకరకాల మొక్కలు పెరిగి పెద్దవడంతో కొన్నేండ్లలోదేవకి సాగుభూమి దట్టమైన వనమైంది. ఇందులో వేప,చింత,రావి తదితర జాతుల వృక్షాలు ఉన్నాయి.ఇప్పుడు దేవకీ అమ్మ వయసు 90 ఏండ్లు.ఆమె పెంచి పోషిస్తున్న చెట్ల వయసు ఆమె వయసులో సగం! ఎన్నెన్నో పురస్కారాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చి వరించాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా‘నారీశక్తి’ అవార్డునూ అందుకున్నది.అవేం ఆమెకు అంతగా పట్టవు! పెందరాళే లేచి అడవికి వెళ్లి.. తన బిడ్డలను చూసుకోవడమే ఆమెకు అసలు తృప్తి!
తులసి వనం
పొడవైన సముద్ర తీరమున్న కర్ణాటకలో అడవులూ ఎక్కువే! అలాంటి చిక్కటి అటవీ ప్రాంతంలో జన్మించింది తులసి గౌడ. ఆమె చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. బడి ముఖం చూసింది లేదు. అడవే ఆమెకు పాఠశాల అయింది. చిన్నప్పుడు ఇంటి పరిసరాల్లో తులసి రకరకాల చెట్ల విత్తనాలు చల్లుతూ ఉండేది. స్థానికంగా ఉండే అటవీశాఖ అధికారుల దగ్గర సహాయకురాలిగా ఉండేది. వాళ్లు డ్యూటీ ఏం చేసేవారో తెలియదు కానీ, తులసి మాత్రం మొక్కలు నాటడమే దినచర్యగా మార్చుకుంది.ఆమె ఉత్సాహాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు తులసికి ‘వనమాలి’ఉద్యోగాన్ని ఇచ్చారు.కొత్తగా రెక్కలు తొడిగినట్లయింది. వన మంతా విహరిస్తూ ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు మొక్కలు నాటేది. అలా నాటి వదిలే యకుండా.. అవి వేళ్లూనుకునేదాకా రక్షణచర్యలు చేపట్టేది. ఏకంగా 30వేల మొక్కలు నాటి పశ్చిమ కనుమ లకు పచ్చని కానుకను సమర్పించింది. ‘వృక్షలక్ష్మి’ గా పేరు తెచ్చుకుంది. వన విస్తరణకు ఆమె చేసిన కృషికిగాను ఎన్నో అవార్డులు అందుకుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం పొందారు.
వనప్రభజి
అడవికి,ఆవిడకు అవినాభావ సంబంధం. ప్రభాదే విది ఉత్తరాఖండ్‌లోని కుగ్రామం. పచ్చదనంలోనే ఆమె బాల్యమంతా సాగింది.బాల్యంలో ఊయల లూగిన తరులు..పెద్దయ్యేసరికి కనిపించకుండా పోయాయి. ఇంటి వసారాలోంచి కనుచూపు మేర లో కనువిందు చేసే పచ్చదనం తను ఎదిగేకొద్దీ తగ్గుతూ పోయింది. తన అడుగులకు మడుగు లొత్తిన అడవితల్లి ఎందుకో బక్కచిక్కిపోయిందని అనుకునేది! పెద్దయ్యాక వనదేవతను కబళిస్తున్నది మనుషులేనని తెలిసి బాధపడిరది. ఆమె మాత్రం ఏం చేయగలదు! కూలిపోతున్న చెట్లను చూసినప్పు డల్లా దిగాలుగా ముఖం పెట్టడం తప్ప! అభివృద్ధి పేరుతో విస్తరిస్తున్న కాంక్రీట్‌ జంగిల్‌ను చూసి మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడటం తప్ప!! రోజులు గడిచిపోయాయి..పర్యాటక కేంద్రంగా విస్తరించే కొద్దీ ఉత్తరాఖండ్‌లో అటవీ విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది.రుద్రప్రయాగ జిల్లాలోని ప్రభా దేవి వాళ్ల గ్రామం సమీపంలోనూ ఇదే ధోరణి. అప్పటికే ఆమెకు పెండ్లయింది.ఊరికి అల్లంత దూరంలో వారికి కొంతపొలం ఉంది.అక్కడ మరో అడవికి జన్మనివ్వాలని ఆఆడకూతురు నిశ్చయించు కుంది. భర్తకు చెబితే సరేనన్నాడు. ఓరోజు వెళ్లి కొన్ని మొక్కలు నాటింది.ఆతర్వాతి రోజు మరికొన్ని నాటింది.అప్పట్నుంచి అదేపని! మొక్కలే ఆమె లోకమయ్యాయి. ఇంటిపట్టున విశ్రాంతి తీసుకునే వయసులో మొక్కల సంరక్షణ భుజానికెత్తుకుంది. చూస్తుండగానే ఆమొక్కలు చెట్లయ్యాయి, మానుల య్యాయి. 500 చెట్లు..అడవితల్లి సిగలో పచ్చల పతకంగా ఇప్పుడు మెరిసిపోతున్నాయి.80 ఏండ్ల వయసులోనూ నిత్యం తమను పలకరించడానికి వస్తున్న ప్రభాదేవి ఆ మానులకు అమ్మ కన్నా ఎక్కు వంటే ఎవరు కాదనగలరు?
అభివందనం..
హిమాలయ పర్వత పాదాల దగ్గరున్న డూన్‌ లోయ వందనా శివ జన్మస్థలం. ఆమె బాల్యమంతా మంచుకొండలను చూస్తూ గడిచిపోయింది. హిమగిరుల నుంచి వీచే గాలి పైన్‌ చెట్ల మీదుగా తనను తాకినప్పుడు పులకించిపోయేది. 1970లో మొదలైన చిప్కో ఉద్యమం నాటికి వందన యువతి. కుంచించుకుపోతున్న హిమాలయ అడవులపై గడ్వాల్‌ వాసులు ఎత్తిన పిడికిళ్లలో ఆమె చేయీ ఉన్నది. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఆమెకు మరింత బలాన్నిచ్చింది. సహజంగా ఉన్న ధైర్య స్వభావం ప్రకృతి ప్రేమికురాలిని కాస్తా.. పర్యావరణవేత్తగా, ఉద్యమకారిణిగా తీర్చిదిద్దింది. ప్రభుత్వాలు వన సంరక్షణ చర్యలు తీసుకునేలా ఎన్నో ఉద్యమాలు చేపట్టింది. ‘నవధాన్య’ సంస్థను స్థాపించి తన పోరాటాన్ని వివిధ రంగాలకు విస్తరించింది. స్త్రీ సాధికారత, సుస్థిర వ్యవసాయ విధానాలతోపాటు అటవీ సంరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నది.
ఆకుపచ్చని అడవి..
అడవులు భూగోళపు ఊపిరితిత్తులు. అడవి చల్లగా ఉంటేనే మానవాళి భవిత భద్రంగా ఉంటుంది.కీకారణ్యమైనా,చిట్టడవిjైునా, నాలుగు చెట్లు ఒకచోట ఉంటే భూగోళానికి చేసే మేలు ఇంత అంత కాదు! కానీ, అంతులేని లాభాపేక్షతో కార్పొరేట్లు అడవులను కబళించడానికి ఎప్పటిక ప్పుడు విరుచుకు పడుతుంటారు. తమ చెప్పుచేత ల్లోని ప్రభుత్వాలతో అనుకూల చట్టాలను తయారు చేయించుకుంటారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశలో భారత అటవీ (సంరక్షణ) చట్టం 1980ని సవరించడానికి చేసిన ప్రయత్నా నికి అత్యున్నత న్యాయస్థానం బ్రేక్‌ వేసింది. కార్పొరేట్లకు కట్టబెట్టడమే లక్ష్యంగా గత ఏడాది అడవుల నిర్వచనాన్ని మారుస్తూ తీసుకువచ్చిన చట్ట సవరణను తాత్కాలికంగా నిలిపివేసింది. 1996లోవెలువరించిన టిఎన్‌ గోదావర్మన్‌ తిరు ములపాడ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో నిర్దేశించిన అటవీ నిర్వచనానికి అనుగు ణంగా నడుచుకోవాలని ఆదేశిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వం లోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆహ్వానించదగిన పరిణామం. నిఘం టవుల్లోని అర్థాన్ని అడవికి ప్రామాణికంగా తీసు కోవాలని ఈ తీర్పులో ధర్మాసనం పేర్కొంది. వర్గీక రణలు, యాజమాన్యాలతో సంబంధం లేకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. అడవులుగా భావించే ప్రాంతాలను (డీమ్డ్‌ ఫారెస్ట్స్‌) గుర్తించడానికి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇన్ని కీలక మైన ఆదేశాలు ఉన్నాయి కాబట్టే ఆ తీర్పును ఒక మైలురాయిగా భావిస్తారు.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1951నుండి 75వరకు దేశ వ్యాప్తంగా 40లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైంది.ఆ నేపథ్యంలోనే భారత అటవీ (సంరక్షణ) చట్టాన్ని రూపొందించి 1980లో ఆమోదించారు.ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఇతర అవసరాలకు అటవీ భూమిని మళ్లించడం గణనీయంగా అదుపు లోకి వచ్చింది.గతంతో పోలిస్తే 1981నుండి 20 22 వరకు అటవీ భూముల నిర్మూలన పది శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయిన ప్పటికీ, చట్టంలోని లొసుగులను అవకాశంగా తీసుకుని అడవుల నరికవేత కొనసాగింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని గూడలూరులో చోటుచేసుకున్న కలప అక్రమ నరికివేతకు సంబం ధించి దాఖలైన టిఎన్‌ గోదావర్మన్‌ తిరుమలనపాడ్‌ కేసులో అటవీ ప్రాంతాల రక్షణను ప్రధానంగా చేసుకుని సుప్రీం ఇచ్చిన తీర్పులో ‘అడవి’ని విస్తృ తంగా నిర్వచించింది. ఇదికార్పొరేట్లకు ఆటంకం గా మారింది.ఈ నిబంధనలను మార్చాలన్న ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో వారి కనుసన్నల్లో నడిచే మోడీ ప్రభుత్వం గత ఏడాది ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన భూమిని మాత్రమే అడవిగా గుర్తిస్తూ అటవీ చట్టానికి సవరణ తీసుకు వచ్చింది. ప్రస్తుత మున్న నిబంధనల ప్రకారం అడవుల పరిధిలోకి వస్తాయన్న భయంతో ప్రైవేటు వ్యక్తులు ప్లాంటేష న్లు,తోటలు పెంచడం లేదని తన చర్యను ప్రభుత్వం సమర్ధించుకుంది.(నవతెలంగాణ సౌజన్యంతో..)-(కందుకూరి సతీష్‌ కుమార్‌)

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకం

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఓటును సద్వినియోగం చేసుకోవాలి.పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మంచి నాయుకుడిని ఎన్నుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది.ఎన్నికల్లో ఉత్తములను ప్రజాప్రతి నిధులుగా ఎన్నుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఓటు హక్కు వినియోగం విషయంలో స్వచ్ఛంధంగా నిర్ణయం తీసుకోవాలి.ఎవరో చెప్పారని ఓటు వేయకూడదు.దీనిపై మరింతగా చైతన్యం పెంపొం దించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును వజ్రాయుధంగా వినియోగించాలి. విద్యావంతులను ఎన్నుకుంటే సుపరిపాలనకు అవకాశం ఉంటుంది.నేర చరితులు చట్టసభల్లోకి వెళ్లకుండా చూడాలి. ఈ బాధ్యతను యువత తీసుకుని భావితరాలకు ఆదర్శంగా నిలవాలి.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగిం చుకోవాలని ఎన్నికల సమయంలో ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు తమ ఓటును ఎలాంటి ఒత్తిడులకు, ప్రలోభాలకులోను కాకుండా సక్రమంగా వినియోగించుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్ను కోవడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం.దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించిన వరం.ఈహక్కును సద్వినియోగం చేసుకొని సమర్థవంతమైన నాయక త్వాన్ని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఓటు విలువ,ప్రాముఖ్యత తెలుసుకోవాలి.ఇతరలను చైతన్యవంతులను చేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదని, దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చాటిచెప్పాలి.
దేశ ఆర్థిక,సామాజిక,రాజకీయాలలో ఓటు హక్కు ఎంతో విలువైన పాత్ర పోషిస్తుంది. అర్హతగల ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి.నోటుకు తలవంచితే జీవితాంతం తలదిం చుకునే జీవించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.విజ్ఞులైన భవిష్యత్‌ భద్రంగా ఉండాలంటే నీతి నిజా యితీగా ఎన్నికల్లో పోటీచేసి వారికి అండగా నిలవండి.ఓటును మించిన ఆయుధం లేదు.మనం వేసే ఓటు బుల్లెట్‌ కన్నా బ్యాలెట్‌ పవర్‌ గొప్పది.ఆదాయం,చదువులో మాత్రమే కాదు..సామాజిక బాధ్యతతో కూడా ఓటు వేసేందుకు ముందుండాలి.ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటే వేసేలా ఇంటిలో,ఆఫీసుల్లో,బంధువులు,స్నేహితులకు అవగాహన కల్పించి చైతన్యపర్చాలి.ఓటుకు మించిన ఆయుదం లేదు.ఓటుతో తీసుకురాలేని విప్లవం ఉండదు.ఓటు అనేది హక్కు కాదు..నీబాధ్యత. బాధ్యతాయుతమైన పౌరులు అనిపించుకోవాలంటే ఓటుహక్కును తప్పనిసరిగా వినియో గించు కోవాలి.
ప్రజాస్వామ్యాన్ని మన ఓటేనడిపిస్తుంది.భవిష్యత్తుకు ఓటు అభివృద్ధికోసం ఓటు. ప్రజా స్వామ్య విలువలకు జీవంపోయాలి.ప్రజాస్వామ్యంలోవిలువలను చాటి చెప్పాలన్నా, అక్రమార్కుల పాలనకు స్వస్తి పలకాలన్న నీ ఓటే కీలకం. ప్రజాసంక్షేమానికిపాటు పడేవారిని ఎన్నుకోవాలి. ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపే తమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది.అందుకే ఎలాంటి ప్రలోభాలకు తలవంచకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్సూచి అయిన ఓటును వినియోగించుకోవటం ప్రజల ప్రధానకర్తవ్యం.అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకో వద్దు.మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మా ణం సాధ్యమవుతున్నది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన వజ్రాయుధం.ప్రజల చేతఎన్నుకోబడి,ప్రజల కొరకు పనిచేస్తూ,ప్రజలే పాలకులు గల పాలన విధానమే ప్రజాస్వామ్యం.మనలోనే మార్పు రావాలి..ఓటే వారధి కావాలి!– రవి రెబ్బాప్రగడ ,ఎడిటర్ 

1 2