ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు-2022-2023


సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచీలో ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన పురోగతి సాధించి టాప్‌ -5 రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 2018లో కేవలం 64 పాయింట్లను మాత్రమే సాధించిన ఏపీ తాజాగా 72 స్కోర్‌ పాయింట్లను పొందడం, అగ్రశ్రేణి కోవలో నిలవడం, పలు అంశాల్లో టాప్‌ స్కోర్లను దక్కించుకోవడం రాష్ట్రం సత్తాను, అభివృద్ధి పథంలో పరుగులను రుజువు చేస్తోంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో 75 శాతం స్కోర్‌తో కేరళ మొదటి స్థానంలో నిలవగా 74 శాతం స్కోర్‌తో హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. 72 శాతం స్కోర్‌తో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. మూడో విడత ఎస్డీజీ సూచీ నివేదికను నీతిఆయోగ్‌ గురువారం ఢల్లీిలో ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన, అసమానతలు తొలగింపు, జీవన ప్రమాణాలను మెరుగు పరచడం, సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ ఇతోధికంగా దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్‌ ప్రశంసించింది.
పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా..
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు నవరత్నాల పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నవర త్నాలు పేదరిక నిర్మూలనతో పాటు ఆహార భద్రతకు ఎంతో దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్‌ ప్రశంసించింది. పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా అవతరించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా అడుగులు వేస్తోందని నివేదికలో పేర్కొంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొదటిదైన పేదరిక నిర్మూలనలో ఆంధప్రదేశ్‌ 81 శాతం స్కోర్‌ సాధించి అగ్రగామి ఐదు రాష్ట్రాల సరసన నిలిచింది. ఆరోగ్యం,సంక్షేమంలో రాష్ట్రం 77శాతం స్కోర్‌ సాధించింది. అగ్రవర్ణ పేదలకు కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పిస్తూ అసమానతలను రూపు మాపుతున్నారని నీతి అయోగ్‌ ప్రశంసిం చింది. పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తూ లింగ సమానత్వంలో రాష్ట్రం 58 శాతం స్కోర్‌తో అగ్రగామి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. అసమానతలు రూపుమాపడంలో 74 శాతం స్కోర్‌తో దూసుకెళ్తోంది.ఏపీలో 2020లో వృద్ధి కనిపించిన ఇండికేటర్లు ఆకలి లేని స్థాయి లక్ష్యంలోని ‘వ్యవసాయ రంగంలో స్థూల అదనపు విలువ’లో పెరుగుదల నమోదు చేసుకుంది. ఆరోగ్యం, సంక్షేమం ఇండికేటర్‌లో ప్రసూతి మరణాలు, శిశు మరణాల రేటు తగ్గుదల, హెచ్‌ఐవీ కేసుల సంఖ్య తగ్గుదల నమోదైంది. ప్రతి పది వేల జనాభాకు వైద్య సిబ్బంది పెరుగుదలలో వృద్ధి కనిపించింది. లింగ సమానత్వం కేటగిరీలో మహిళలపై నేరాల సంఖ్య ఇండికేటర్‌లో తగ్గుదల నమోదైంది. పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇవ్వడం పెరిగింది. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత నీటి సరఫరా పెరిగింది. హత్యలు, వివిధ రకాల కేసుల సంఖ్య తగ్గింది.
సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌లో అగ్రగామి..
2019 డిసెంబరు 30న ఆవిష్కరించిన ఎస్డీజీ సూచీలో ఆంధ్రప్రదేశ్‌ 67 పాయింట్ల స్కోరుతో 3వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 2018 మొదటి ఎస్డీజీ సూచీలో 64 పాయింట్ల స్కోరుతో నాలుగో స్థానంలో ఉంది. తాజాగా మూడో విడత సూచీలో చౌక, సురక్షిత ఇంధన శక్తిలో వందకు వంద పాయింట్లు సాధించి టాప్‌లో నిలవడం గమనార్హం. సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో అగ్రగామిగా నిలిచింది.
అత్యున్నత ప్రమాణాలతో విద్య.. నాణ్యమైన వైద్యం
అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యుత్తమంగా పనిచేస్తోందని నీతి అయోగ్‌ వెల్లడిరచింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు -నేడు ద్వారా పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చి దిద్దారు. ఆరోగ్యశ్రీతోపాటు ప్రభుత్వ ఆసుపత్రు లను అభివృద్ధి చేయడం, వైద్య సిబ్బందిని భారీ ఎత్తున నియమించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని.. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడమే అందుకు తార్కాణమని పేర్కొంది. శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తూ.. సుపరిపాలన ద్వారా ప్రజలకు సామాజిక భద్రత చేకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబర్చుతోందని విశ్లేషిం చింది. 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధన వైపుగా ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని పేర్కొంది.
పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానం.. నీతి ఆయోగ్‌ ఎస్టీజీ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానంలో కొనసాగు తోందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. 2022-23 సంవత్సరపు వార్షిక బడ్జెట్‌ ను ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాడు-నేడుతో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి విద్య, ఆరోగ్యాన్ని అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అంతే కాకుండా 99.5 శాతం కాన్పులు స్థానికంగానే జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని వంద శాతం కుటుంబాలకు విద్యుత్‌ అందు తోందన్నారు మంత్రి. 2022 -23 ఆర్థిక సంవత్సరానికి గానూ 2,56,257కోట్లు రూపా యలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,08,261 కోట్లు, మూలధన వ్యయం అంచనా 47,996 కోట్లు, 2022-23 సంవత్సరంలో రెవెన్యూ లోటు 17,036 కోట్లు, ద్రవ్య లోటు 48,724కోట్ల రూపాయలని ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్రి జీఎస్డీపీ లో రెవెన్యూ లోటు 1.27శాతంగా, ద్రవ్య లోటు 3.64శాతంగా ఉండవచ్చని తెలి పారు. గత మూడు సంవత్సరాలలో ప్రభుత్వం నవరత్నాలు, ఇతర మేనిఫెస్టో పథకాల ద్వారా రాష్ట్రంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతేగాక ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి, సంస్థాగత బలోపేతం, సామాజిక చేరకల వల్ల అన్ని ఏస్జీజీలలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్ధానం దిశగా పయనిస్తోంది. అంతకు ముందు వార్షిక బడ్జెట్‌కు సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్‌ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి, మండలిలో మంత్రి సీదిరి అప్పల రాజు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. శాసనసభ లో వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కన్న బాబు, మండలిలో వేణుగోపాలకృష్ణ ప్రవేశపెడ తారు. కేబినెట్‌ భేటీకి ముందుఆర్థిక మంత్రి ఛాంబర్‌లో బడ్జెట్‌ ప్రతులకు మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కల్తిసారా మరణాల,పెగాసెస్‌ల పై దద్దరిల్లిన అసెంబ్లీ
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై మూడోరోజు శాసనమండలి దద్దరిల్లింది. శాసనసభను తప్పుదోవ పట్టించేలా అసత్యాలు చెప్పిన సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనీ, దీనిపై ప్రవేశపెట్టిన వాయిదా తీర్మాణం చర్చకు అనుమతించాలని ప్రతిక్ష నేతలు పట్టుపట్టడంతో సభ సంభించింది. అలాగే పెగాసస్‌పై అసెంబ్లీ భగ్గుమంది. ఇప్పటికే దేశమంతా మార్మోగినన ఈఘటనపై అసెంబ్లీలో అధికార పార్టీనేతలు ప్రతిపక్షంపై ధ్వజమెత్తారు. పెగాసస్‌ స్పైవేర్‌తోపాటు వివిధ రకాలుగా నిఘా పెట్టారని అసంబ్లీ వ్యవహా రాలశాఖ మంత్రి బుగ్గన విమర్శించారు.
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు తమ ప్రాధాన్యత కోల్పోతున్నాయి. కేంద్ర బడ్జెట్‌ విషయంలోనూ ఇది స్పష్టంగా కనిపించింది. రాష్ట్రం కూడా అదే బాటలో నడుస్తున్నది. బడ్జెట్‌ అంటే కేవలం జమాఖర్చుల చిట్టా మాత్రమే కాదు. ప్రభుత్వ విధానాలు, ప్రజాసంక్షేమం,అభివృద్ధి ప్రాధాన్యతలు ఇందులో ప్రతిబింబిస్తాయి. అభివృద్ధి బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది. ఈ రంగా న్ని బడా కార్పొరేట్‌ సంస్థలకు వదిలేసింది. వారికి కావలసిన సదుపాయాలు, ప్రోత్సాహం ఇవ్వడం ప్రభుత్వం తన బాధ్యతగా స్వీకరిం చింది. దానికే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని పేరు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో పోటీ పడడానికి ప్రోత్సా హకాలను ఇస్తున్నది. మరోవైపు అభివృద్ధికి మూలాధారంగా ఉన్న ప్రణాళికా సంఘాన్ని కేంద్రం రద్దు చేసింది. కార్పొరేట్‌ బోర్డుల తరహాలో నీతి అయోగ్‌ను నియమించింది. గతంలో ప్రభుత్వ రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్‌,విశాఖ, బెంగుళూరు లాంటి నగరాలు ప్రభుత్వ రంగం పునాదిగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు నగరాల నిర్మాణాన్ని కూడా ప్రైవేటు రంగానికి వదిలేశారు. రియల్‌ ఎస్టేటే పట్టణాల అభివృ ద్ధిని శాసిస్తోంది. అందువల్ల బడ్జెట్‌లో అభివృద్ధి నిధులు క్రమంగా తగ్గిపోయి నిర్వహణా వ్యయా లు మాత్రమే మిగులు తున్నాయి. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు చివరిదాకా అలాగే ఉంటాయని గ్యారెంటీ కూడా లేదు. రివైజ్డ్‌ బడ్జెట్‌ పేరుతో అన్నీ తలక్రిందులవుతుంటాయి. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా నిధుల కేటాయింపులు అధికారంలో ఉన్న పార్టీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి జరుగుతున్నాయి. ఇది పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థను బలహీనపరిచే పరిణామం. ఈ బడ్జెట్‌తోనైనా ఈ ఒరవడికి స్వస్తి చెప్పాలి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున గవర్నర్‌ ప్రసంగం పాలక పార్టీ ఆలోచనలకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ పథకాల చిట్టాను ఆయన చదివేశారు. సంక్షేమ పథకాలతో ప్రజలు బ్రహ్మాండంగా జీవిస్తున్నారని, సంతృప్తికరంగా ఉన్నారని పాలక పార్టీ భ్రమల్లో ఉంది. అందువల్లే ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను గాలికి వదిలేసింది. సంక్షేమ పథకాల నిర్వహణకు అదనపు ఆదాయాలను సమకూర్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదాయ కోటాలను ఇచ్చింది. డబ్బులు రాబట్టడానికి వారు ప్రజల మెడపై కత్తి పెట్టి వసూలు చేయాలని చెబుతోంది. ఈ మధ్యకాలంలో సంక్షేమ పథకాలతోపాటు ప్రజల నుండి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ‘’ప్రభుత్వ ధనార్జన స్కీము’’లను కూడా ప్రవేశపెట్టింది.– జె.వి.శ్రీనివాసరావు

జాతీయ
విద్య విధానాలు..
చదువులకు దూరమౌతున్న చిన్నారులు…!

మూడవ వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒకేచోట చదువు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వారి మానసిక పరిస్థి తులు వేరు. వారి ఆహారపు విరామ సమ యం వేరు. చిన్న పిల్లలు అంత సమయం వరకు ఆకలితో ఉండలేరు. అలాగని ముందుగా విరామం ఇస్తే వీరిని చూస్తూ పై తరగతి పిల్లలు పాఠ్యాంశాలపై ఆసక్తి కోల్పోతారు. ఈ సమస్యలు అధిగమించి ముఖ్యంగా అంత దూరం 3వ తరగతి పిల్లవాడు వెళ్లలేకపోవడంతో ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపుతారు. క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడి ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు రంగంలోకి దిగుతాయి.
భారత దేశంలో పేద,అణగారిన వర్గాల పిల్లల విద్యవిషయంలో కరోనా ప్రభావం తీవ్రంగా పడిరది. ఒకటి రెండు తరగతులు చదువుతున్న చిన్నారులలో ప్రతి ముగ్గురులో ఒకరు పాఠశాలకు తిరిగి రావడం లేదు. విద్యారంగం నేడు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించని పక్షంలో ముందు ముందు మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుం దని యునెస్కో భారత్‌ను హెచ్చరించింది. ఈ పరి స్థితి నుంచి బైటపడాలంటే కేంద్ర,రాష్ట్రప్రభు త్వా లు… పేద,అణగారిన వర్గాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కరోనా కారణంగా బడికి దూరమైన విద్యార్థులను పాఠశాలకు రప్పించే ప్రయత్నం చేయాలి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానం (ఎన్‌.ఇ.పి), దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు చూస్తుంటే ఆ కొద్ది మంది పేద విద్యార్థులు కూడా చదువుకు దూరమైపోతారనేది స్పష్టమవుతోంది.
మ్యాపింగ్‌ తో విద్య కేంద్రీకరణ
కేంద్ర ప్రభుత్వ షరతులకు లొంగి ప్రపంచ బ్యాంకుకు దాసోహమంటున్న వైఎస్‌ఆర్‌సిపి ప్రభు త్వం…నూతన విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తూ చిన్నారుల భవిష్యత్తును మొగ్గలోనే తుంచేస్తున్నది. పైకి మాత్రం ప్రపంచ స్థాయి విద్య అందిస్తామంటూ నమ్మబలుకుతున్నది.విద్యా రం గంలో నూతన విద్యా విధానం విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తుందని విద్యార్థులు, తల్లిదం డ్రులు, ప్రజానీకాన్ని మభ్యపెట్టేందుకు అవగాహన సదస్సులలో చెప్తున్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేస్తామని గొప్పలు చెప్తున్నారు. అం దుకు, అంగన్వాడీ పిల్లలకు ఆటపాటలతో పాటు ప్రాథమిక స్థాయి విద్య అందించేందుకు గాను వారిని ప్రాథమిక పాఠశాలలో కలుపుతామం టున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈవంకతో…అద్దె భవ నాల్లో నడుస్తున్న అంగన్వాడీల అద్దెలు కట్టకుండా వాటి నిర్వహణకు పెట్టాల్సిన మదుపు తగ్గించు కోవాలనుకుంటోంది. దీంతో పసిపిల్లలకు, బాలిం తలకు, గర్భిణీలకు పౌష్టిక ఆహారం దూరమై మాతా శిశు మరణాల సంఖ్య పెరుగుతుంది.దీన్ని గ్రహించ కుండా కేంద్ర ప్రభుత్వం…పెరిగుతున్న మాతా శిశు మరణాలు తగ్గించేందుకు స్త్రీల వివాహ వయ స్సు 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా ఆటలాడుకునే వయసులో విద్యాబుద్ధులు నేర్పించడం ద్వారా పిల్లలు మానసికంగా, శారీర కంగా అనారోగ్యం పాలవుతారు.
ఇకపోతే3,4,5 తరగతులను ఉన్నత పాఠశా లలకు తరలిస్తామంటున్నారు. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు 3వతరగతి పిల్లవాడిని అంతదూ రం పంపించడానికి భయపడుతున్నారు. ఎందు కంటే చాలా పాఠశాలలు రద్దీగా ఉన్న రహదారి పక్కన లేదా రహదారికి అవతలి వైపున ఉన్నాయి. వాహనాల రద్దీవల్ల చిన్నారులకు ఎప్పుడేమవు తుందోనన్న భయం తల్లిదండ్రుల్లో ఉరది. అలాగని పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్లి తీసుకురావడం కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులకు సాధ్యం కాని పని. అందుకే చదువులైనా మాన్పించేస్తార కానీ పిల్లలనుఅంతదూరంపంపలేమనే దగ్గరికొస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీపిల్లల బంగారు భవిష్యత్తు కోసం దూర ప్రయాణం అసౌకర్యం అయినప్పటికీ దాన్ని అధిగమించి పిల్లలను ఉన్నత పాఠశాలకు పంపాలంటున్నది. ఉన్నత పాఠశా లల్లో అయితే సకల సౌకర్యాలు, ల్యాబులు, కంప్యూ టర్లు ఉంటాయని, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన ఉంటుందని… పిల్లల మానసిక వికాసానికి, ఉజ్వల భవిష్యత్తుకు హైస్కూల్‌ విద్య తోడ్పడు తుందని చెబుతుంది. అయితే అవే సౌకర్యాలు ప్రాథమిక పాఠశాలల్లో కల్పించవచ్చు కదా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. గతంలో ఒక ఉపాధ్యాయుడు ఉన్న 5 తరగతులకు 5 క్లాసులు బోధించి మిగిలిన3 పిరియడ్స్‌లో ముందున్న క్లాసు కు ప్రిపేర్‌ అయ్యేవారు. ఇప్పుడు ఈ3,4,5 తరగ తులను కలుపుతూ మొత్తంగా 8 తరగతులకు 8 క్లాసులను విరామం లేకుండా బోధించేట్లు చేయా లనుకుంటున్నది. దీంతో ఉన్నకొద్దిమంది ఉపాధ్యా యులతోనే అన్ని తరగతులకు సర్దుబాటు చెయ్య వచ్చు. మరో వైపు రాష్ట్రంలోఉన్న ఎయిడెడ్‌ పాఠశా లలను మూసివేస్తూ ఆ అధ్యాపకులను ఖాళీ పోస్టుల్లో భర్తీ చేస్తుంది. అదేవిధంగా ఎస్‌జిటి లకు కొంత శిక్షణ ఇచ్చి స్కూల్‌ అసిస్టెంట్లుగా బోధించాలం టున్నది. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందదు. ఈ రకంగా అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే సంవత్సరానికి ఒక డిఎస్సీ తీస్తామన్న జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కడిఎస్సీ కూడా తీయలేదు. భవిష్య త్తులో సైతం తీయకుండా ఉండేలా రిటైర్మెంట్‌ వయస్సు రెండు సంవత్సరాలు పెంచింది. దీంతో డిఎస్సీకి ప్రిపేర్‌ అయినవాళ్లు దాన్ని పక్కన పెట్టి ఇతర ఉద్యోగాలకు సిద్ధం అవుతున్నారు. ఎన్‌ఇపి ద్వారా విద్యను ఒక దగ్గర కేంద్రీకరించి అధ్యాప కులను సర్దుబాటు చేస్తూ విద్యారంగానికి పెట్టాల్సిన ఖర్చు తగ్గించుకోవాలనుకుంటున్నది.
విద్య వ్యాపారీకరణ
‘నాడు-నేడు’ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అదనపు భవనాలు గానీ అదనపు మరుగుదొడ్లు గానీ నిర్మించలేదు. ఉన్నఫళంగా విద్యార్థులను మెర్జ్‌ చేస్తే ఆ పిల్లలు ఎక్కడ కూర్చొని చదువుకోవాలి. ఇప్పటికే గదులు చాలక చాలా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ గది, స్టాఫ్‌ రూమ్‌, స్టోర్‌ రూమ్‌లను తరగతి గదులుగా మార్చి బోధిస్తున్నారు. అంతే కాకుండా 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒకేచోట చదువు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వారి మానసిక పరిస్థితులు వేరు. వారి ఆహారపు విరామ సమయం వేరు. చిన్న పిల్లలు అంత సమయం వరకు ఆకలితో ఉండలేరు. అలాగని ముందుగా విరామం ఇస్తే వీరిని చూస్తూ పై తరగతి పిల్లలు పాఠ్యాంశాలపై ఆసక్తి కోల్పోతారు. ఈ సమస్యలు అధిగమించి ముఖ్యంగా అంత దూరం 3వ తరగతి పిల్లవాడు వెళ్లలేకపోవడంతో ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపుతారు. క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడి ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు రంగం లోకి దిగుతాయి. కొంత కాలానికి విపరీతంగా ఫీజులు పెంచి ‘నచ్చితే చదవండి. లేకుంటే పోండి’ అని చెప్తాయి. అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చది విద్దామంటే అవి మూతబడి ఉంటాయి. ఈ విధం గా ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలు వారికి నచ్చి నట్టు దోచుకుంటూ విద్యద్వారా వ్యాపారం చేసు కుంటాయి.
విద్య కాషాయీకరణ
ఇప్పటికే బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో… తన ఆర్‌ ఎస్‌ఎస్‌ భావజాలాన్ని చొప్పిస్తూ సిలబస్‌లో మార్పు లు చేస్తున్నది. అయితే సిలబస్‌ రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో ఉండటంతో…ఈ హిందూత్వ భావజా లాన్ని దేశమంతటా వ్యాపింపచేయడానికి ఆటంకం కలుగుతుంది. అందుకే సిబిఎస్‌ఇ సిలబస్‌ ద్వారా ఆ మార్గం సుగుమం చేసుకోవాలనుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం చెప్పిన ప్రతీదానికి తల ఊపుతూ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం …. రానున్న విద్యా సంవత్సరంలో33 కెజిబివిలు, 16 ఆదర్శ పాఠశాలలు, ఎ.పి రెసిడెన్షియల్స్‌, గురుకు లాలతో పాటు 500పైగా ఉన్నత పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌ ప్రవేశ పెడతామంటున్నది. విద్య దూరం…తల్లిదండ్రులకు భారం…
ప్రాథమిక పాఠశాలలు మూసి వేయా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.3,4,5 తరగ తులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు సర్క్యులర్‌ 172విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మూడు కిలోమీటర్ల లోపు వున్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు తరలించ నుంది. ప్రాథమిక పాఠశాలలు ఒక కిలోమీటర్‌ పరిధిలో వుండాలన్న విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి భిన్నంగా 1,2 తరగతుల పిల్లలను అంగన్‌వాడీలకు అప్పగించనుంది. అందుబాటులోని ప్రాథమిక విద్యను పేదలకు అందకుండా చేస్తోంది. ప్రాథమిక పాఠశాలలు క్రమంగా కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి స్వగ్రామమైన చినమేరంగి హైస్కూల్‌లో2.25 కిలోమీటర్ల దూరం లోవున్న అల్లువాడ,దాసరిపేట,తాళ్లడుమ్మ, చిన మేరంగి కాలనీ, చినమేరంగిలోని ఆరు ప్రాథమిక పాఠశాలలను కలిపేస్తున్నారు. ప్రాథమిక పాఠ శాలలను మూసేసే పని ప్రారంభించింది. ప్రభుత్వ చర్యలవల్ల ప్రాథమిక పాఠశాలలకు పేద పిల్లలు వెళ్లలేనంత దూరం పెరుగుతుంది. 3,4,5 తరగ తుల పిల్లలు కిక్కిరిసిన రద్దీతో వాహనాలు తిరుగు తున్న రోడ్లను దాటి సురక్షితంగా పాఠశాలకు వెళ్లి రాగలారా? సాధ్యం కాదు. వెళ్లిన పిల్లలు తిరిగొచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పదు. దూరం గానున్న బడులకు పిల్లలను పంపించేందుకు తల్లి దండ్రులు భయపడితే వారే తీసుకెళ్లి తీసుకురావాలి. లేదంటే ఆటోలకు పంపించాలి.ప్రతిపేటలో పిల్లలు బడికెళ్లి సురక్షితంగా రావడానికి వీలుగా బడులు పెట్టారు.వయసును బట్టి పిల్లల మానసిక ఎదుగు దల,పరివర్తనలో తేడా వుంటుంది.అందువల్ల చిన్న పిల్లలకు చదువుపట్ల ఆసక్తి పెంచేందుకు ఒకే ఊరి లో ప్రైమరీ, హైస్కూల్‌ ఏర్పాటు చేశారు. ఆడుతూ, పాడుతూ,ఏడుస్తూ బడికి వెళ్లే ఆరేళ్ల పిల్లడు,13 ఏళ్లు దాటిన పిల్లలతో ఇమడలేడని గుర్తించి… అనేక కమిషన్ల సూచన ప్రకారం ఒకటి నుంచి ఐదుతరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠశాల నెల కొల్పారు. ఇపుడా ప్రాథమిక పాఠశాలలను ప్రభు త్వం ఏకపక్షంగా మూసేస్తోంది. వ్యవసాయం, కూలి పని చేసుకునే జనం తెల్లారగానే పనిలోకి పోవాలి. రోజూ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి తీసుకు రావడం సాధ్యం కాదు. కనుక పిల్లలను ఆటోలకు పంపించాలి. అందుకు డబ్బు పెట్టాలి.‘అమ్మ ఒడి’కి ఇచ్చిన డబ్బు అందుకు సరిపోవచ్చు. కుటుం బంలోని మిగతా పిల్లలకు ‘అమ్మ ఒడి’ వర్తించదు కనుక తల్లిదండ్రులు చేతి డబ్బు పెట్టుకోవాలి. లేదంటే పిల్లలను బడికి పంపడం ఆపేస్తారు. ‘అమ్మఒడి’ శాశ్వత పథకంకాదు.ప్రభుత్వం మారితే ‘అమ్మ ఒడి’వుండదు.‘అమ్మ ఒడి’ లేకపోతే తల్లిదం డ్రులపై చదువుల భారం పెరుగుతుంది. అధికారం లోకి రేపు ఎవరొచ్చినా మూసేసిన పాఠశాలలను తెరిపించరు.అందుకని సర్కారు బడులను సంరక్షిం చుకోవడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.
మౌలిక సదుపాయాలు లేకుండానే….
హైస్కూళ్లకు తరలిస్తున్న 3,4,5 తరగతుల పిల్లలకు తరగతి గదులున్నాయా?బెంచీలు,కుర్చీలు న్నాయా? ఇతర మౌలికసదుపాయాలున్నాయా? అవేమీ లేవని అన్ని చోట్లా ఒకటే మాట. మరెందుకు ఇంత తొందర? హైస్కూళ్లలో తరగతి గదులు లేవు గనుక టీచర్లు విలీన తరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి పాఠాలు చెప్పాలట?గంట గంటకు ప్రైమరీ స్కూల్‌ నుండి హైస్కూలుకు, హైస్కూల్‌ నుంచి ప్రైమరీ స్కూల్‌కు టీచర్లు పరుగులు తీయాలా? సాధ్యాసాధ్యాలపై కనీసం ఉపాధ్యాయ సంఘాలతోనైనా ప్రభుత్వం చర్చించలేదు? మేము నిర్ణయించాం. మీరు అమలు చేయండి అని విద్యా శాఖ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది.
వ్యాసకర్తలు : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు-(డి. రాము/ ఎం.కృష్ణమూర్తి)

విశాఖ కేంద్రంగా ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్‌

ఎంతోకాలంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖ రైల్వేజోన్‌ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కు కేంద్ర మంత్రివర్గం మార్చి 25న ఆమోదం తెలిపింది. అలాగే వాల్తేర్‌ డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజ్యసభలో ప్రకటించారు. రాజ్యసభలో నిన్న బీజేపీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమాధానం ఇచ్చారు. జోన్‌ ఏర్పాటు కోసం డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్‌ అధికారులతో కమిటీ వేసినట్టు మంత్రి రాజ్యసభ వేదికగా వెల్లడిరచారు.
దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు డీపీఆర్‌ సమర్పించిన తర్వాత కొత్త రైల్వే జోన్‌,రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పాటు పరిధి, ఇతర అంశాలకు సంబంధించి పలు విషయాలు తమ దృష్టికి వచ్చాయని అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.దీంతో ఈ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ లెవెల్‌ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొ న్నారు. ప్రస్తుతం ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేపట్టి విశాఖ పట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌, వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రం కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసినట్టు కూడా ఆయన తెలిపారు.
కమిటీ పని చేస్తోంది
జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసినట్లు కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. కొత్త రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకోసం 2020-21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రైల్వేజోన్‌కు డీపీఆర్‌ సమర్పించాక కొత్త రైల్వేజోన్‌,రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పాటు లో భాగంగా పరిధి-ఆదాయ వ్యవహా రాలకు సంబంధించి అనేక విషయాలు తమ దృష్టికి రావటంతో వీటిని మరింతగా అధ్య యనం చేయటం కోసం అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ లెవెల్‌ కమిటీని ఏర్పాటుచేశామని రైల్వే మంత్రి వెల్లడిరచారు.
భూమి ఎంపిక పూర్తయింది
దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయ సముదాయం నిర్మాణానికి భూమిని ఎంపిక చేశామని చెప్పారు. పరిపాలన.. నిర్వహణ అవసరాలతో పాటుగా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం కొనసా గుతున్న సౌత్‌ సెంట్రల్‌ రైల్వే… తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేసి విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు..అదే విధంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పుకొచ్చారు.
రైల్వేలో ఉద్యోగాల ఖాళీలు
ఇలా దక్షిణ మధ్య రైల్వేలో నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగాలు 16,878, గెజిటెడ్‌ ఉద్యోగాలు 34 ఖాళీగా ఉన్నట్లు రైల్వేమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లలో కలిపి 3,01,414 నాన్‌గెజిటెడ్‌, 2,519 గెజిటెడ్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడిరచారు. 2013-14లో రూ.110 కోట్లతో మంజూరుచేసిన కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ కేటాయింపులను తాజాగా రూ.560.72 కోట్లకు పెంచినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. కడప-బెంగుళూరు రైల్వేలైన్‌ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన వాటా డిపాజిట్‌ చేయకపోవడంతో ఆ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిపేసినట్లు పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియను వేగవంతం చేయడానికి వీలుగా భూసర్వే, ప్రధాన కార్యాలయ సముదాయం లేఅవుట్‌, నివాస సముదాయ కాలనీ, ఇతర ముందస్తు నిర్మాణ పనుల ప్రాథమిక కార్యకలాపాలను చేపట్టాలని రైల్వేశాఖ నిర్దేశించింది. పరిపాలన, నిర్వహణ అవసరాలతో పాటు ఇతరత్రా హేతుబద్ధమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిపై నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడున్న దక్షిణమధ్య రైల్వే,తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేపట్టి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్‌, ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది’అని రైల్వేమంత్రి తెలిపారు. కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ కేటాయింపులు రూ.560 కోట్లకు పెంపు,2013-14లో రూ.110కోట్లతో మంజూరుచేసిన కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ కేటాయిం పులను, తాజాగా రూ.560.72 కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.178.35 కోట్లు కేటాయించి రూ.171.2 కోట్లు ఖర్చుచేసినట్లు వెల్లడిరచారు. తెలంగాణ ప్రభుత్వం7ఎకరాల భూసేకరణలో ఆలస్యం చేయడం వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందన్నారు. ఆ భూమిని గత ఏడాది నవంబరులో రైల్వేకి అందించినట్లు వెల్ల డిరచారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ వల్లా పనులు తీవ్రంగా ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఎప్పటికప్పుడు ఇక్కడ ఓవర్‌హాలింగ్‌ చేయనున్నట్లు వెల్లడిరచారు. దక్షిణ మధ్య రైల్వేలో నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగాలు 16,878, గెజిటెడ్‌ ఉద్యోగాలు34ఖాళీగా ఉన్న ట్లు రైల్వేమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లలో కలిపి 3,01,414నాన్‌గెజిటెడ్‌, 2,519 గెజిటెడ్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడిరచారు.
కొత్త జోన్‌తో అభివృద్ధి పరుగు
విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే జోన్‌ ప్రకటన..ప్రయాణీకుల అవసరాలను తీర్చడంతోపాటు, రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదం చేయనుంది. ప్రధానంగా కేంద్ర బడ్జెట్‌లో జోన్లవారీగా చేసే కేటాయింపుల వల్ల ఆర్ధిక వెసులబాటు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక కొత్త రైళ్ల మంజూరు,ఉన్నవాటిని పొడిగించడంతో రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.విశాఖపట్నం జోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానుండటంతో పరిపాలనపరంగానే కాక ఉద్యోగాల విషయంలోనూ ఎంతో లబ్ది కలగనుంది.రైల్వే ఉద్యోగాల నియామకాలకు సంబంధించి,రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ)జోన్‌ కేంద్రంగా విశాఖపట్నంలోనే ఏర్పడుతుంది. ఇది రాష్ట్ర ప్రజలకు రైల్వే ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చాలా దోహదం చేస్తుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ దాదాపుగా ఒకే పరిధిలోకి
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే నెట్‌వర్క్‌,ఇప్పటివరకు వేర్వేరుజోన్ల పరిధిలో ఉంది. విజయవాడ,గుంటూరు,గుంతకల్లు డివిజన్లు సికింద్రాబాద్‌ కేంద్రంగా దక్షిణమధ్య రైల్వే జోన్‌లో ఉన్నాయి. వాల్తేరు డివిజన్‌ ఒడిశాలోని భువనేశ్వర్‌ కేంద్రంగా గల తూర్పు కోస్తా,జోన్‌లో అంతర్భాగమై ఉంది. రాష్ట్ర అవసరాలకు,ప్రయాణీకులకు సంబంధించిన ప్రతిపాదనలు ఏవైనా ఆయా డివిజన్ల నుంచి జోన్‌ ప్రధాన కార్యాలయం వెళ్లేవి.కొన్నింటిఇన దక్షణ మధ్య రైల్వేకు,మరికొన్నింటిని తూర్పు కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయాలకు పంపాల్సి వచ్చేది. అరకరడ ఆమోదం తర్వాత ఆ ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు చేరేవి.ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రతిపాదనలను తూర్పుకోస్తా జోన్‌లో తొక్కిపెడుతున్నారని,వివక్ష చూపుతున్నారని,ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఓ బండికి అదనంగా బోగీ కావాలన్నా తిరగాల్సి వచ్చేది. విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్ఠ్‌ రైల్వే ప్రత్యేక జోన్‌ కావాలన్న డిమాండ్‌ నెరవేరడంతో ఇబ్బందులు తొలగిపోతా యంటున్నారు.
వాల్తేరు పేరు ఇక లేనట్లే
విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్‌ ఏర్పాటుచేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించినప్పటికీ,విశాఖలో రైల్వే డివిజన్‌ లేకపోవడం ఓ పెద్దలోటుగా మారింది. వాల్తేర్‌ డివిజన్‌ ఆంధప్రదేశ్‌,ఒడిశా,చత్తీషఘడ్‌..మూడు రాష్ట్రాల పరిధిలోనూ ఉంది. ఇందులో ఏపీ పరిధిలోని వాల్తేరు డివిజన్‌ ప్రాంతాన్ని విజయవాడ డివిజన్‌లో కలిపి,విశాఖ కేంద్రంగా కొత్తగా దక్షిణకోస్తా రైల్వే ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాల్తేరు డివిజను విశాఖపట్నం డివిజన్‌గా పేరు మారుస్తారని వినిపించినా,అలా జరగలేదు. ఏపీలో ఏర్పడుతున్న కొత్త రైల్వేజోన్‌లో వాల్తేర్‌ పేరుతో డివిజన్‌ లేకపోవడంపై విమర్శలు వినిపి స్తున్నాయి. డివిజన్‌ స్థాయిలో జరగాల్సిన పనులు,ప్రతిపాదనల కోసం విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లి రావాల్సి ఉంటుంది. జోన్‌ ప్రధాన కార్యాలయం ఉన్న చోట డివిజన్‌ లేకపోవడాన్ని రైల్వే రంగ నిపుణులు తప్పుపడుతున్నారు.
ా గుంటూరు,గంతకల్లు,విజయవాడ డివిజన్లతోపాటు వాల్తేరు డివిజన్‌ పరిధిలో ఉత్తరాంధ్ర ప్రాంతం,కొత్త జోన్‌ పరిధిలోకి వస్తుంది. అది విజయవాడ డివిజన్‌లో కలిసే అవకాశం ఉంది. భౌగోళికంగా కొద్ది ప్రాంతం మినహా ఆంధప్రదేశ్‌ అంతా ఒకే జోన్‌ కిందికి వస్తుంది.
ా జోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకానుంది.కొత్తగా జనరల్‌ మేనేజర్‌,అదనపు జనరల్‌ మేనేజర్‌,వివిధ విభాగాల అధిపతులు,వారికి కార్యదర్శులు,సహాయకులు..ఇలా కొత్త ఉన్నతా ధికారులు,అధికారులు వాస్తారు.
ా రద్దీని బట్టీ ఏదైనా రైలుకు అదనపు బోగీలు వేయాలన్నా,పండుగ సమయాల్లో ప్రత్యేక రైళ్లు నడపాలన్నా,త్వరితగతిని నిర్ణయాలు ఉంటాయి. సంక్రాంతి,ఇతర ప్రధాన పండుగల సమయంలో విశాఖపట్నం వైపు రద్దీ అధికంగా ఉంటుంది. తూర్పుకోస్తా రైల్వే స్పందించి నిర్ణయం తీసుకునేసరికి పండుగ వచ్చేస్తుంది. కొత్త జోన్‌ రావడంవల్ల ఇక్కడే త్వరగా నిర్ణయాలు జరుగుతాయి.
ా అదపు రైళ్ళు బోగీలు తెచ్చుకోవడంవల్ల ఆ మేరకు ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది.
ా కొత్త రైళ్లు ప్రకటించినప్పుడు సాధారణంగా జోన్‌ ప్రధాన కార్యాలయం ఉన్న చోటకు ప్రాధాన్యం లభిస్తుంది. రిజర్వేషన్‌ కోటా తక్కువగా ఉండేది. ఇప్పుడు విశాఖ కేంద్రంగా జోన్‌తో ఆ సమస్యలు తీసిపోతాయి.
ా ఇచ్ఛాపురం,పలాస వంటి మారుమూల ప్రాంతాలకు రైళ్ల కనెక్టివిటీ పెంచుకోవచ్చు.
ా వడ్లపూడిలో ఉన్న వ్యాగన్‌,వర్క్‌షాపు తదితరాలకు అనుబంధ పరిశ్రమలు వస్తాయి.
ా గంగవరం,విశాఖపట్నం ఆదాయాలు పెరుగుతాయి.
ా ప్రయాణీకుల అవసరాల్ని బట్టి రైళ్లను పొడిగించుకోవచ్చు.
ా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంలో,నిధుల కేటాయింపులోనూ ప్రాధాన్యం పెరుగుతంది.
వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వేజోన్‌ ప్రకటించాలి ఆర్టికల్‌ 371డి ప్రకారం స్థానికులకు 75 శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలి, రైల్వే విడిభాగాల పరిశ్రమలను కేటాయించి ,కొత్త ఆర్‌ఆర్‌బి సెంటర్ను ప్రారంభించాలి, వాల్తేర్‌ డివిజన్‌తో కూడిన రైల్వే జోన్‌ ప్రారంభించే తేదీని ప్రకటించాలి. కొన్ని సంవత్సరాల నుండి కేంద్ర డిపిఆర్‌ వేశామని కాలయాపన చేసు ్తన్నారూ, గత డిపిఆర్‌ నివేదిక ఏమయింది, మరల ఎందుకు డి పి ఆర్‌ కమిటీ వేస్తున్నారు .2021లో 170 కోట్లు డివిజన్‌ అభివృద్ధి గురించి కేటాయించిన పనులు ఏమయ్యాయి. కేంద్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, రాయగడ డివిజన్‌ బదులు వాల్తేరు డివిజన్‌ తో కూడిన విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించాలి. అంతవరకూ రైల్వేజోన్‌ సాధన సమితి తో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత కుమార్‌ స్పష్టం చేశారు.– జిఎన్‌వీ సతీష్‌

దేశంలో మొబైల్‌ లేని గ్రామాలెన్నో..?

దేశం డిజిటల్‌ ఇండియా అంటూ టెక్నాలజీ రంగంలో అమితవేగంతో దూసుకుపోతుంటే ఇంకా పల్లెల్లో మొబైల్‌ సౌక ర్యాలు లేవంటే ఎవరైనా నమ్మగలరా..ఇది నిజం. దాదాపు దేశంలోని 60వేలకు అటుఇటుగా గ్రామాల్లో ఫోన్‌ అంటేనే తెలియదని కేంద్రప్రభుత్వం వెల్లడిరచింది. లోక్‌సభలో ప్రశ్నోతర్తాల సమయంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖా మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఓప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. మార్చి23న పార్లమెంట్‌లో అందించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం,ఆంధ్రప్రదేశ్‌లోని1,787గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీ లేదు. గతకొన్ని దశాబ్దాలుగా డిజిటల్‌విప్లవంలో పెద్ద ఎత్తున దూసుకుపోతున్నప్పటికీ,ఇలాంటి గ్రామాలకు సాంకేతిక రంగం దూరంగా ఉండటంతో అక్కడ ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, వైద్యరంగాలకు దూరవమతుండటం శోచనీయం.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ విశాఖ జిల్లాలో అరకు,చింతపల్లి,డుంబ్రిగూడ,జీకేవీధి,ముంచింగిపుట్టు,పెదబయలు,అనంతగిరి తదితర గిరిజన మండలాల్లోని పదుల సంఖ్యలో గ్రామాలు సామాజికంగా,భౌగోళికంగా బయటి ప్రపంచానికి దూరమంగా ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది.మొబైల్‌ మరియు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోవడం ఈ కుగ్రామాలలో ఆర్థిక మరియు సామాజిక అసమానతలను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇవిరోడ్లు,ఆరోగ్య సౌకర్యాల వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసం కూడా చాలా కాలంగా పోరాడుతున్నాయి. మొబైల్‌ నెట్‌వర్క్‌ ఉన్న గ్రామాలలో కూడా సిగ్నల్‌ నాణ్యత తక్కువగా ఉంటుంది. మరో విచిత్రమేమిటంటే..ఎక్కడో మారుమూల ప్రాంతాలకు మొబైల్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేదంటే కాస్తా ఆలోచించ వచ్చు.కానీ విశాఖ మహానగరానికి అతిచేరవలో ఉన్న సింహాచలం దేవస్థానానికి సమీపంలో గల దబ్బంద పరిసర గ్రామాలకు మొబైల్‌,ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోవడం విచారకరం.ఈ చుట్టుపక్కల సుమారు ఎనిమిది గ్రామాలకు సాంకేతికత దూరమైంది.వీరంతా నెట్‌వర్క్‌ కవరేజీకోసం వారిఇళ్ల నుండి సుదూర ప్రాంతాలకు కాల్‌ చేయడానికి/స్వీకరించడానికి పరుగులు తీస్తున్నారు.
ఇటీవలి కోవిడ్‌-19మహమ్మారి,తదుపరి లాక్‌డౌన్‌ కూడా కోవిడ్‌-19పరీక్ష,చికిత్స,టీకాలను యాక్సెస్‌ చేయడంలో గిరిజన ప్రాంతాలలోఈ డిజిటల్‌ విభజనను హైలైట్‌ చేసింది.కోవిడ్‌-19 మొదటి ఒకసంవత్సరంలో రిమోట్‌ టీచింగ్‌ లెర్నింగ్‌పై దాని ప్రభావం చూపించింది.విశాఖపట్నం గిరిజనప్రాంతంలో దాదాపు3వేలగ్రామాలు ఉన్నాయి.డోర్‌-టు డోర్‌ సర్వీస్‌ డెలివరీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలను మెరుగ్గా అందజేయడం కోసం ప్రవేశపెట్టబడిన అనేక గ్రామ సచివాలయాలు కూడా మొబైల్‌,ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోవడంవల్ల వాటి లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేబినెట్‌ కమిటీ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసారశాఖమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడిరచిన వివరాలు మేరకు దేశంలోని ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర,ఒడిశాల్లోని దాదాపు 44జిల్లాల్లో ఇప్పటివరకూ సెల్‌సౌకర్యం అందుబాటులోలేని గ్రామాలను గుర్తించారు.ఏపీ విశాఖజిల్లాలో1,054, విజయ నగరంలో154, కడప జిల్లాలో10 గ్రామాల్లో మొబ్కెల్‌ సేవలవిస్తరణకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. మొత్తంగా18నెలల్లో పనులుపూర్తి చేస్తామన్నారు. సాధ్యసాధ్యాలు పరిగణనలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత ఎక్కువగా సోలర్‌ పవర్‌ బ్యాటరీలుద్వారా టెలికాం టవర్స్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడుజిల్లాల్లో 1,218 గ్రామాలు సహా దేశవ్యాప్తంగా 44ఆకాంక్ష (యాస్పిరేషనల్‌) జిల్లాల్లోని 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించడంలో భాగంగా యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.ఈ ప్రాజెక్టు కోసం యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌)నిధులతో మొత్తం రూ.6,466కోట్ల అంచనావ్యయంతో ప్రతిపాదించారు. ఇప్పటికైనా మారుమూల గ్రామాలకు మొబైల్‌,ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సేవలు తక్షణమే విస్తరించి ప్రజలందరికి రాష్ట్ర,కేంద్రప్రభుత్వాల సంక్షేమ ఫలాలు అందేల చర్యలు తీసుకోవాల్సిన ఆశ్యకత ఉంది! – రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌

1 2