సంస్కరణలు ఎవరి కోసం

‘మీరు సంస్కరణలకు అను కూలమా, లేదా ప్రతికూలమా?’ అని నిరంతరం అడుగు తుంటారు. ఏ సంస్కరణ కూడా సంపూర్ణం కాదు. ప్రతీ సంస్కరణకూ కొంత విషయం వుంటుంది, ఒక ప్రయోజనం వుంటుంది. ఏ నిర్దిష్ట సంస్కరణ కైనా మద్దతివ్వాలా లేక వ్యతిరేకిం చాలా అనేది ఇవి నిర్ణయిస్తాయి. ఈసంస్క రణలనేవి మన ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడ తాయా,వారి జీవనో పాధులు,దేశ ఆర్థిక సార్వభౌమా ధికారం బలోపే తం అవుతుందా అన్నదే ఇక్కడ కీలకమైన అంశంగా వుంటుంది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన ఇన్ని దశాబ్దాల కాలంలో మా వైఖరి ఇలానే వుంటూ వచ్చింది. ఇకపై కూడా ఇలాగే కొనసాగుతుంది’

మూడు దశాబ్దాలుగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఈ నేప థ్యంలో కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా,కనీస మద్దతు ధరకు చట్ట బద్ధమైన హామీ కల్పించాలంటూ మనరైతాంగం కనివినీ ఎరుగని రీతిలో పోరాటం కొనసాగి స్తూనే వుంది. శతాబ్దం క్రితం బలవంతంగా నీలిమందు మొక్కలను పెంచడానికి నిరసనగా జరిగిన చంపా రన్‌ సత్యాగ్రహం స్మృతులు గుర్తుకు వస్తు న్నాయి. కార్పొరేట్‌ వ్యవసాయం, చిన్న మొత్తాల్లో ఉత్పత్తిని దెబ్బతీయడం (మోడీపెద్దనోట్లరద్దు),ఆహార కొర తలు…ఇవన్నీ కలిసి కరువు కాటకాలు పెంచేలా చేయవచ్చు.
పేదలను పణంగాపెట్టి గరిష్టస్థాయిలో లాభా లు ఆర్జించడం,పెరుగుతున్న దారిద్య్రం,మరింతగా విస్తరిస్తున్న ఆర్థిక అసమానతలు,అన్ని దేశాల్లో తీవ్రంగా పడిపోయిన దేశీయ డిమాండ్‌ పైనే దశా బ్దాల తరబడి సంస్కరణలు ప్రధానంగా దృష్టి పెడుతూ వస్తున్నాయని అంతర్జాతీయ, భారతదేశ అనుభవాలు తెలియచేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం,ప్రజలజీవితంపై దానిప్రభావం వినా శకరమైన రీతిలో వుంది. ఇది,కరోనాతో మరిం తగా పెరిగిపోయింది. ఇంకా ఆ ప్రభావం కొనసా గుతూనే వుంది. ఇదిమార్క్స్‌ మాటలను గుర్తు చేస్తోంది:‘పెట్టుబడిదారీ విధానం భారీఉత్పత్తి, మారకపు మార్గాలను సమకూర్చుకుంది. ఇది క్షుద్ర ప్రపంచంలో మంత్రాలు, మాయలతో శక్తులను సృష్టించే మాంత్రికుడి లాంటిది. ఆతరువాత వాటి ని అదుపు చేయడంలో ఆమాంత్రికుడు విఫల మవుతాడు.’ అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి ఆది óపత్యంలోని నయా ఉదారవాద విధాన నిర్మాణంలో అంతర్భాగమే భారతదేశంలో సంస్కరణల క్రమం. ఇక్కడ గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించడమే లక్ష్యం. ఇది, పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యంత అద్వాన్నమైన స్వభావాన్ని తెలియచేస్తోంది. జంతు స్ఫూర్తిని వెల్లడిస్తోంది. పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్తు లను, అన్ని ప్రభుత్వ సంస్థలను, సేవలను, ఖనిజ వనరులను ప్రైవేటీకరించడానికి…ప్రజలపై యూ జర్‌ చార్జీల భారాన్ని మోపడానికి దారితీసింది. నయా ఉదారవాదమనేది అంతర్జాతీయంగా, భారత్‌లో కార్పొరేట్లకు పెద్ద లాభదాయకంగా మారింది. నయా ఉదారవాదం ప్రారంభమైనప్పటి నుండి సంపన్నులపై పన్నులు విధించడం అంతర్జా తీయంగా 79శాతం తగ్గింది.2008లోఆర్థిక మాం ద్యం తర్వాత,మూడేళ్ళ లోనే చాలామంది కోటీశ్వ రులు తమసంపదను పునరుద్ధరించు కున్నారు. 2018నాటికి వారి సంపద రెట్టింపు అయింది. ఈసంపద అంతాఉత్పత్తి ద్వారా పెరగలేదు. తీవ్రంగా వున్న ఈ ఆర్థిక మాంద్యం స్టాక్‌ మార్కెట్ల ను ఎందుకు ప్రతికూలంగా ప్రభావితం చేయలేదో వివరించిన స్పెక్యులేషన్‌ ద్వారా పెరిగింది. మరో వైపు,ప్రపంచవ్యాప్తంగా 80శాతం మంది ఆదా యం సంపాదించేవారు 2008ముందు నాటి స్థాయికి కోలుకోలేదు. సంఘటిత రంగంపై, కార్మిక వర్గ హక్కులపై దాడుల ఫలితంగా1979లో ప్రతి నలుగురిలో ఒకరికి ప్రాతినిధ్యం వహించే కార్మిక సంఘాలు… ఈనాడు ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే ప్రాతినిధ్యంవహించే స్థాయికి క్షీణించాయి.
భారత్‌ : అసమానతల పెరుగుదల
పర్యవసానంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి.‘షైనింగ్‌ ఇండియా’ (వెలిగిపో తున్న భారతదేశం) ఎల్లప్పుడూ సఫరింగ్‌ ఇండియా (బాధలు పడుతున్న భారతం) పైనే స్వారీ చేసేది. వెలిగిపోతున్న భారత్‌..కమిలిపోతున్న భారత్‌కు విలోమానుపాతంలో వుంటుంది. 2020 మార్చి నుండి భారతదేశం లోని వంద మంది కోటీశ్వరులు తమ ఆస్తులను రూ.12,97,822 కోట్లు పెంచు కున్నారు. అంటే దేశంలోని 13.8 కోట్ల మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి రూ.94,045 చొప్పున చెక్‌ ఇవ్వగలిగేంత. కరోనా సమయంలో ముఖేష్‌ అంబానీ సంపాదించే మొత్తాన్ని ఒకనైపుణ్యం లేని కార్మికుడు సంపాదించాలంటే 10 వేల సంవత్సరా లు పడుతుంది. అంబానీ ఒక సెకనులో సంపాదిం చే మొత్తాన్ని ఈకార్మికుడు మూడేళ్ళకు సంపాది స్తాడని ఆక్స్‌ఫామ్‌ నివేదిక ‘ది ఇనీక్వాలిటీ వైరస్‌’ లోని తాజా భారత్‌ అనుబంధ నివేదిక పేర్కొంది.
మరోవైపు,2020 ఏప్రిల్‌లో ప్రతి గంటకు లక్షా 70వేల మంది తమ ఉద్యోగాలను కోల్పో యారని గణాంకాలు తెలియచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారత కోటీశ్వరుల సంపద 35 శాతం పెరిగింది. 2009 నుండి చూసినట్లైతే 90 శాతం పెరిగి 42.29 వేల కోట్లకు చేరుకుంది. వాస్తవానికి, కరోనా మహమ్మారి సమయంలో భారతదేశంలో అగ్రస్థానంలో వున్న 11మంది కోటీశ్వరుల పెరిగిన సంపదతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కాన్ని పదేళ్ళపాటు లేదా ఆరోగ్య మంత్రిత్వ శాఖను పదేళ్ళపాటు నిర్వహించవచ్చు. పైస్థాయిలో వున్న 20 శాతం లోని 93.4 శాతంతో పోల్చుకుంటే… నిరుపేదలైన 20 శాతంలో కేవలం ఆరు శాతానికే మెరుగైన పారిశుధ్య వనరులు అందుబాటులో వున్నాయి. భారత జనాభాలో దాదాపు 59.6 శాతం మంది ఒక్క గదిలోనో లేదా అంతకంటేచిన్న జాగాలోనో బతుకు తున్నారు. ప్రభుత్వ వ్యయం వాటాను బట్టి చూసి నట్లైతే ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ ఆరోగ్య రంగ బడ్జెట్‌వున్న దేశాలలో భారత్‌ నాల్గవ స్థానం లో వుంది. కరోనా సమయంలో పెరిగిన తమ సంపదపై కనీసం ఒక శాతం పన్నును దేశంలోని పైస్థాయిలో వున్న 11 మంది కోటీశ్వరులు కట్టినా కూడా ‘జన్‌ ఔషధి’ పథకానికి కేటాయింపులను 140 రెట్లు పెంచడానికి సరిపోతుంది.ఈ పథకం వల్ల పేదలు, అట్టడుగు వర్గాల వారికి మందులు అందుబాటులో వుంటాయి. భారతదేశంలో దశాబ్దాలుగా అమలవు తున్న సంస్కరణలు ఆర్థిక అసమానతలను తీవ్రంగా పెంచుతున్నాయి. ప్రజలను దృష్టిలో వుంచుకుని వారికి అనుకూలమైన రీతిలో కాకుండా.. పెట్టుబడి దారులు లాభాలు ఆర్జించే రీతిలో సంస్కరణలు తీసుకు వస్తున్నారు. సంపద సృష్టికర్తలను గౌరవిం చాలని ప్రధాని మోడీ మనకు ఉద్భోదిస్తున్నారు. సంపద అంటే విలువను డబ్బు రూపంలోకి మార్చడమే. ఆ విలువను సృష్టించేది కార్మిక వర్గమే. మన ప్రజల సర్వతోముఖ సంపదకు విలువను సృష్టించే వారిని గౌరవించాల్సిన అవసర ముంది.
దారిద్య్రం : అపార వృద్ధి
ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడంతో పాటు మోడీ ప్రభుత్వం,స్వాతంత్య్రం సము పార్జించి నప్పటి నుండి భారతదేశం అనుసరిస్తూ వచ్చినదాన్ని (దారిద్య్ర స్థాయిని లెక్కించడానికి మౌలికమైన పోషకాహార నిబంధనను) విడిచిపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి రోజుకు 2200 క్యాలరీల పోషకాహారం వుండాలి. పట్టణభారతంలో అయితే అది 2100 క్యాలరీలుగా వుండాలన్నది నిబంధన. దీని ప్రకారం చూసినట్లైతే 1993-94లో గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 57శాతం మంది ఈ దారిద్య్ర రేఖకు దిగువున వున్నారని ఎన్‌ఎస్‌ఎస్‌ నమూనా సర్వే తెలియచే స్తోంది. 2011-12లో మరోసారి నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వేలో ఈశాతాలు వరుసగా 68, 65కు పడిపోయాయి.తిరిగి 2017-18లో మరో సారి విస్తృతంగా నమూనా సర్వే నిర్వహించారు. కానీ మోడీ ప్రభుత్వం వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఈ ఫలితాలను వెల్లడిరచకుండా తొక్కిపట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన డేటాబేస్‌ సంస్థలను కూడా ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది. గ్రామీణ భారతంలో తలసరి వాస్తవ వినిమయం వ్యయం (కేవలం ఆహారమే కాదు) కేవలం 9శాతంగా మాత్రమే వుందని మీడియాకు లీకైన డేటా తెలియ చేసింది. కరోనా మహమ్మారి తలెత్తడానికి ముందు గానే గ్రామీణ, పట్టణభారతాల్లో సంపూర్ణ స్థాయిలో దారిద్య్రం అనూహ్యంగా పెరిగిందన్నది సుస్పష్టం. అప్పటి నుండి పరిస్థితి మరింత అద్వాన్నంగా మారింది.
కోవిడ్‌ మహమ్మారి విజృంభణ…ప్రజల ప్రాణాలను,వారిఉపాధులను కాపాడేందుకు అరకొరగా వున్న ఆరోగ్య సంరక్షణ సదుపాయాల ఇబ్బందులు…పరిస్థితులను బహిర్గతం చేశాయి. ఈనాడు మనం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక మాం ద్యం అంతర్జాతీయ నయా ఉదారవాద విధానంలో భాగమే. ఏదోవిధంగా ప్రజలను తీవ్ర స్థాయిలో దోపిడీ చేయడం ద్వారా లాభాలను గరిష్టంగా ఆర్జించాలన్నదే ఈ నయా ఉదారవాద విధానం. పొదుపు చర్యల నుండి వేతనాల్లో కోతల వరకు, ఉద్యోగాల లేఆఫ్‌లు, మరీ ముఖ్యంగా చిన్న స్థాయి లో ఉత్పత్తిని దెబ్బ తీయడం (భారత్‌లో ఇది పెద్ద నోట్ల రద్దు ద్వారా జరిగింది) వంటి చర్యల ద్వారా ప్రజలను దోపిడీ చేస్తారు. ఆర్థిక కార్యక లాపాలకు సంబంధించిన అన్ని మార్గాలను ఆక్రమించు కోవడం, ఇప్పుడు కార్పొరేట్‌ లబ్ధికోసం భారత వ్యవ సాయ రంగాన్ని నాశనం చేయడం, కాంట్రాక్ట్‌ వ్యవ సాయం,ఫలితంగా ఆహార కొరత వంటివి ఈవిషయాన్ని మనకు స్పష్టంగా తెలియ చేస్తు న్నాయి. ఈనాడు, అంతర్జాతీయ ఆకలి సూచీ భారత్‌ను ‘తీవ్రమైన కేటగిరీ’లో నిలిపింది. పోషకా హార లోపం ప్రమాదకర స్థాయిలో పెరిగిపో తోందని,మరీ ముఖ్యంగా పిల్లల్లో ఇది ఎక్కువగా వుందని, ఫలితంగా శిశుమరణాలు ఎక్కువగా నమోదవుతు న్నాయని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 తెలియ చేసింది.
మతోన్మాదం-కార్పొరేట్ల బంధం
2014 తరువాత కార్పొరేట్‌, మత రాజకీ యాల యొక్క విషపూరిత బంధం ఆవిష్కృతమైంది. జాతీయ ఆస్తులను దోపిడీ చేయడం ద్వారా గరిష్టం గా లాభాలను ఆర్జించడమన్నది చాలా దూకుడుగా అమలు చేశారు. ప్రభుత్వ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రైవేటీకరించారు. ప్రభుత్వ సంస్థలను, గనులను కూడా ప్రైవేటీకరించారు. ఫలితంగా అనూహ్యమైన స్థాయిలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, రాజకీయ అవినీతి పెరిగిపోయింది. దీనికి తోడు ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై, పౌర హక్కులపై, మానవ హక్కులపై నిర్దాక్షిణ్యంగా దాడులు చేశారు. అస మ్మతివాదులందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్ర వేశారు. నిరంకుశ యుఎపిఎ, దేశద్రోహ చట్టం కింద ప్రజలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమం ఇటు భారత రాజ్యాం గాన్ని,అటుప్రజలకు ఇచ్చినహామీలను దెబ్బతీసింది.
ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా సూచీ (గ్లోబల్‌ ఎకనామిక్‌ ఫ్రీడంఇండెక్స్‌)భారత్‌ను105వ స్థానం లో నిలిపింది. గతేడాది కన్నా ఇది అద్వా న్నమైన స్థితి. గతేడాది 79వస్థానంలో వుంది. మానవ హక్కుల సూచీలో భారత్‌ 94నుండి 111కి పడిపో యింది. యుఎన్‌డిపి మానవ వికాస సూచీ మనల్ని ఇంకా కిందకు..అంటే గతేడాది వున్న 129 నుండి 131వ స్థానానికి దింపేసింది. మెజారిటీ ప్రజలకు పెరుగుతున్న ఇబ్బందులతో పాటుగా పెరుగుతున్న నియంతృత్వం…ముస్సోలిని ఫాసిజానికి చెప్పిన నిర్వచనం ‘పాలనతో కార్పొరేట్ల కలయికకు’ దగ్గరగా ఉంది. ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడంలో నూతన ఆర్థిక విధానాలు విఫలమయ్యాయన్న సంగతి ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతోంది. అసమానతలు వృద్ధికి ఆటం కం కలిగించి, అసమ ర్ధతను పెంచే స్థాయికి చేరుకు న్నాయి’ అని ‘ది ఎకానమిస్ట్‌’ పత్రిక పేర్కొంది.
నయా ఉదారవాద సంస్కరణల దివాళా
పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యయాలతో కూడిన ఉద్దీపన ప్యాకేజీలను అభివృద్ధి చెందిన దేశాలన్నీ ప్రకటించాయి. ఇవి నయా ఉదారవాదానికి శాపం గా పరిణమిస్తాయి. దేశీయ డిమాండ్‌ను, ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఈ చర్యలు ఉద్దేశించబడ్డాయి. ‘’నేను కమ్యూనిస్టును కాను, కానీ….’’ అంటూ ప్రభుత్వ వ్యయం పెంచడాన్ని సమర్ధిస్తూ ఇటీవలే బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రసంగించారు. అయితే, మోడీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ వ్యయం పెంచడం గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. కానీ తన ఆశ్రితులు చెల్లించని పెద్ద మొత్తంలోని రుణాలను మాత్రంరద్దు చేస్తోం ది. రోజువారీ పెట్రో ధరల పెంపు ద్వారా ప్రజ లపై భారాలు మోపుతోంది. ఫలితంగా ద్రవ్యో ల్బణం పెరిగిపోతోంది. దీనివల్ల దేశీయ డిమాండ్‌ మరింతగా క్షీణిస్తోంది. ఫలితంగా ఆర్థిక మాంద్యం పెరుగుతోంది. భారత్‌లో ఈ సంస్కరణల పంథా ను మనం తీవ్రంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. మన ప్రాధాన్యాలేంటనేది పున: నిర్వచించుకోవాల్సి వుంది. వ్యవసాయాన్ని బలో పేతం చేయాలి. ఆహార భద్రతను పటిష్టపరచాలి. ఆరోగ్యం,విద్యపై పెట్టుబడి పెంచాలి. ప్రస్తుతం మనకు ఎంతగానో అవసరమైన-ఆర్థిక, సామాజిక-మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభుత్వ పెట్టు బడులు పెద్దఎత్తున పెరగాలి.అప్పుడే ఉద్యోగాలు సృష్టించబడతాయి.దేశీయ డిమాండ్‌ పెరుగు తుంది. కేవలం మానవతావాద ఆందోళనల తోనే కాకుండా, సమానమైన ఆర్థిక పునరుద్ధరణకు కూడా ఇదొక్కటే మార్గం. అస్పష్టత,అహేతుకత,మన సమా జాన్ని అమానవీయం చేసేలా, మనసామాజిక సామ రస్యతను దెబ్బతీసే అన్ని విచ్ఛిన్నకర ధోరణులను తిరస్కరించడం అన్నింటికంటే ముఖ్యమైనది. ప్రజా ప్రయోజనాలే కీలకమైన అటువంటి సంస్కర ణలు ఈనాడు భారతదేశానికి అవసరం. అంతేగానీ కార్పొరేట్‌ లాభార్జనే థ్యేయంగా గల సంస్కరణలు కాదు. ఇటువంటి సంస్కరణల దిశను సాకారం చేయగలిగే వేదిక ప్రజా పోరాటాలను బలోపేతం చేస్తుంది. ప్రత్యామ్నాయ సంస్కరణల పంథాను సూచించగల ప్రజాఉద్యమాలు,సమీకరణలు తగి నంత బలాన్ని పుంజుకోవాల్సి వుంది. మన ప్రజల పై మరిన్ని భారాలను మోపుతున్న, వారిని దెబ్బ తీస్తున్న భారత పాలకవర్గాల ప్రస్తుత దిశను మార్చ గలిగేలా ఈఉద్యమాలు వుండాలి. భారత దేశం లోని మూడు దశాబ్దాల సంస్కరణల క్రమం సరైన దిశ లోకి మారడానికి ఇదే సముచితమైన సమయం.
(సీతారాం ఏచూరి)(ప్రజాశక్తి సౌజన్యంతో)

కలుపు మొక్కలు

బాల్యం నుండే విద్యార్థుల్లో ప్రకృతి,పర్యా వరణం, దురాచారాలు మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, ఆచార వ్యవహా రాలు మొదలైన అనేక అంశములను తెలి యజేసి విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థుల కోసం ప్రారంభిస్తున్న కొత్త శీర్షిక ‘థింసా బాల వినోదం. ప్రదర్శన యోగ్యమైన చేతి బొమ్మలాటలు, లఘునాటికలు,నాటికలు ఏక పాత్రాభి నయం మొదలగు ప్రక్రియల ద్వారా ధారా వాహికగా అందిస్తున్నాం. ఈశీర్షిక మీ అందరి మనసులు ఆనందంతోపాటు, విజ్ఞా నం, వినోదం కలిగిస్తుందని భావింస్తున్నాం. చిత్తూరు జిల్లా రిషివ్యాలి స్కూల్లో ఉపాధ్యా యులుగా పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీ గోమఠం రంగా చార్యులు అందిస్తున్నారు. ఈనెల సంచికలో ‘కలుపు మొక్కల కథ’ ప్రత్యేకమైన కొత్త శీర్షిక.

కోదండపాణి గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు వారం వారం కాకపోయినా నెలకొకసారైనా వాళ్ల పుస్తకాల బీరువాలు పరిశుభం చేసుకుని పుస్తకాలను ఓ క్రమపద్ధతి లో అమర్చుకుంటారు. ఓఆదివారం తెలుగు ఉపాధ్యాయుడు బుడంకాయ్‌ బీరువా పని పడదామని ఉత్సాహంగా తలుపు తెరవగానే ఉన్న ఎలుక సపరివార సంతాన సమేతంగా దూకి పారిపోయింది. అదృష్టం బాగుండి తెలుగు టీచరు బుడంకాయ్‌ మీదకు దూకలా. బుడంకాయ
అసలు పేరు సంతానం. నిక్‌ నేం బుడంకాయ్‌. బొద్దెంకను చూస్తేనే భయపడే ఆయనకి ఎలుకల సమూహాన్ని చూడగానే ఒళ్లంతా ముచ్చెమటలు పట్టాయి.నిశ్చేష్టుడైఎలుకల వైపు వాటితోకల వైపు తదేకంగా కళ్లార్పకుండా చూస్తున్న ఆయన చెవులకు ‘బుడంకాయ గారు’ అన్న కేక వినబడేసరికి ఉలిక్కిపడి గంతేసి చెయ్యెత్తి నిల్చున్న ఆ ఆకారం చూచి ఈ భంగిమలో మీరు ఉవేదాంతం సత్యనారాయణశర్మ గారి భామాకలాపంలో వున్న ‘సత్యభామలా వున్నారండి’ అన్నారు ఆ స్కూలు డాన్సు
మాస్టారు పెంచలయ్య –
పుస్తకాల బీరువా శుభ్రం చేస్తున్నారా?అన్న పెంచెలయ్య మాటలకు లేదు అభ్యంగన స్నానం చేయిద్దామని ఆలోచిస్తున్నాఅన్నాడు నిదానంగా.
ఏంటినిజంగా నీళ్లు పోసికడుగుతారా? అన్నాడు అమాయకంగా..మీరు ప్రతిసారి పిల్లలచేత చేయించే వినాయక స్తోత్రరో వున్న మూషిక వాహనానికి – దానమ్మ కడుపు మాడ నా కబ్బో ర్డులో సంతాన సమేతంగా ఉన్నదికాక మల మూత్ర విసర్జనలతో, పుణ్యాహ వాచనం చేసిందండీ! మరి నన్నేం చేయమంటారు? అని ఓ పశ్న్ర సంధించాడు బుడంకాయ గారు.
నేను మీకు చెప్పేంతటివాడినా? అడిగారు కాబట్టి – నిమ్మకాయ చెక్కతో శుభంగ్రా రుద్ది, యాంటీడాండ్ర షాంపుతో కడిగి, ఎందుకైనా మంచిది కరోనా శానటైజర్‌ కూడా స్ప్రేచేయండి అన్నారు నృత్యాచార్యుడు పెంచెలయ్య.
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగనూనా? నా తలచుండ్రుకే మీరు చెప్పినదేదీ చెయ్యలేదు.చూస్తున్నారుగా! ఎడారిలో ఖర్జూరం మొక్కల్లా నడినెత్తిన నాలుగు వెంట్రుకలు అని దీర్ఘాలోచనలో పడ్డ ఆయనగారితో చమత్కారంగా గుండైతే ఏంటండీ? ఎంత గుండంగ్రా వుందోమీ తల అన్న పెంచెలయ్య మాటలకు యిద్దరూ హాయిగా
నవ్వుకున్నారు. ఎలుక దాని సంతానం కలసిపరీక్ష ఆన్సర్‌ పేపర్లన్నీ కొరికేశాయి పెంచెలయ్య్నా.. అని కాంభోజీ రాగం లాంటి అరుపుకు పక్కనేవున్న సంగీతం సార్‌ దేవలోకం ఉదేశభాషలందు తెలుగు తియ్యందనం ఎక్కువ అని మీరే
అంటారుగా! అందుకే తెలుగు పేపర్లన్నీ కొరికాయ్‌ అన్నాడు కాలర్‌ ఎగరేస్తూ . దేవలోకం చేసిన ఎద్దేవకు ఏం చెప్పాలో అర్థంకాని బుడంకాయ్‌ కొరికి తిన్నందుకు కాదు, అన్నిటి మీద మలమూత్రవిసర్జన చేసి కంపు చేశాయ్‌ నా అలమార అన్నాడు సావధానంగా! ఈసారివిస్తుపోయారు సంగీతం దేవలోకం, డాన్సు పెంచెలయ్య. ప్రక్కనేవున్న హిందీటీచర్‌ విద్వత్‌ ఇదంతా వింటు వుండబట్టలేక పిల్లలు వ్రాసిన స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ పేపర్లు తిన్న తరువాత వాటికి అతి మూత్రవ్యాధి విరోచనాలు పట్టుకు నుంటాయ్‌ మిస్టర్‌ బుడంకాయ్‌ అన్నాడు నవ్వుతు. ఆయనగారి సహేతుక వివరణకు ముగ్గురూ నవ్వుకున్నారు.
ముక్కుకు గుడ్డకట్టుకొని, నోటికిప్లాస్టర్‌ వేసుకుని, చేతివేళ్లకు గ్లౌజ్‌ తొడుక్కుని తలకు కండువ చుట్టుకొని చేసేదిటీచరు ఉద్యోగం. ఎన్ని జాగ్రత్తలు? ఇవన్నీ జాగ్రత్తలు అంటేపొరపాటే. బుడంకాయ్‌ గారికిలేని జబ్బు లేదనటం
సముచితంగా వుంటుంది. ఎలర్జీ,తుమ్మలు, గజ్జి,దురదలు,బి.పి,ఎక్కువ తింటేడయాబిటిక్‌, రెండు మెట్లు ఎక్కితే ఆయాసం, ఎక్కువసేపు కూచుంటే శరీర భాగాలన్నీ తిమ్మిరెక్కుతాయ్‌! ఒకటా రెండా? అన్ని వ్యాధుల సమాహారమే బుడంకాయ్‌ ఆల్‌ డిసీజెస్‌ యిన్‌ వన్‌ బాడీ! మొత్తం మీద రాక్‌ శుభం చేసి ఎలుకలు కొరికిన పరీక్ష పేపర్లు ఆ రూములోనేడస్ట్‌ బిన్‌ లో వేశాడు. వేసివెయ్యకుండానే డస్ట్‌ బిన్‌ ఈ పేపర్లు వేసేందుకు నేను తప్పితే ఇంకేం దొరకలేదా? అని అడిగినట్లనిపించింది బుడం కాయ్‌కి. ఇక్కడ కాకపోతేఎక్కడ వేస్తాను? పైగా పరీక్ష పేపర్లు. వీటన్నిటినీ తగలబెడదామా అంటేకాగితం సాక్షాత్‌ సరస్వతీదేవికి ప్రతి రూపం. ఆం ఏం కాదులే అని అవి తగల పెడితేఅగ్నిదేవుడికిఏం కోపం వస్తుందో? బుడంకాయ గారు ప్రకృతి ప్రేమికుడు కూడాను. ఈ మధ్యనేపక్షుల వీక్షణ గ్రూపులో కూడా చేరాడు. ప్రతి ఆదివారం ఉదయం చెట్లవెంబడి, పుట్టల వెంబడిపడితిరుగుతు పక్షులను గమనిస్తున్నాడు.
ఈ ఎలుకలు కొరికిన చెత్తవదిలించుకోవటం ఎలా? తల వేడెక్కింది బుడంకాయ్‌ కి.
తలపాగా తీసిగోక్కుంటే అపురూపంగా పెంచుకున్న నాలుగు వెంట్రుకల్లో ఓ వెంట్రుక కాస్తా ఊడిపడిరది. ఆ గోకుడుకి గుండు మీద గాయం రక్తం కారటం మొదలుపెట్టింది. ఏం చెయ్యాలి? డాక్టరు దగ్గరకు వెళితే 56 రకాల పరీక్షలు చేయించమని అంటాడు. దిద్దిపారేసిన పేపర్లు 156 దాకా వున్నాయి కాని జేబులో 6 రూపాయలు కూడా లేవు. పైగా నెలాఖరు.
పోనీ అప్పు చేస్తే? అనుకోగానేశ్రీమతి ఃమంగతాయారుః జ్ఞాపకం వచ్చింది. అప్పిచ్చిన వాడితల, నా తల రోకలిబండతో ముక్కల పచ్చడిచేస్తుంది. డాక్టరూ వద్దు మందూ వద్దు. అప్పు అసలే వద్దు అనుకుంటు చిన్నపిల్లవాడిలా చేతులో వున్న చాక్పీసు అరగతీసి నెత్తురుపై నెత్తికిరాసుకున్నాడు.ఆ మంటకు ఏడుపు ఆపుకోలేకపోయాడు. కళ్ల వెంట నీరు ఏకధాటిగా కారుతోంది. అటుగా వెళుతున్న విద్యార్థిచూసి ఉఏమైందిఎవరన్నా పోయారండీ? అలా ఏడుస్తున్నా రెందుకండీ?్న అని సావ ధానంగా అడిగాడు. భరించలేని మంట, కోపం, ఏం చెప్పాలో తెలియక ముందు వెనక ఆలోచించకుండా ఠక్కున ఆ హెడ్‌మాస్టారు పోయాడు అన్నాడు బుడంకాయ. పాపం పిల్లవాడూ వెక్కి వెక్కి ఏడుపు ప్రారంభించాడు. ఒకరికియింకొకరు తోడైఅక్కడ ‘ఓఏడుపుల క్లబ్‌’ తయారైంది.
అటుగా వెళుతున్న లెక్కలసారును చూడగానే నోటికి తాళాలు పడ్డాయ్‌. పిల్లలందరూ మటుమాయమయ్యారు. కాస్త ఊపిరి పీల్చుకున్నాడు బుడంకాయ. ఇప్పుడు ఇలా యింటికి వెళితే తల గాయం గూర్చి శ్రీమతి అడుగుతుంది. విషయం చెప్పీ చెప్ప కుండానే ఏడుపులు,పెడబొబ్బలు మొదలవుతాయి అనుకొని స్టాఫ్‌ రూంలోనే కూర్చున్నాడు. వచ్చేవారు వస్తున్నారు పోయేవారు పోతున్నారు. వారడిగే ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానం చెప్పి వూరుకుంటున్నాడు బుడంకాయ. మనసు పరిపరివిధాలా వేధిస్తోంది.ఈ పేపర్లను ఏం చేయాలి? ఇంటికివెళ్లేలోపు ఏదో ఒకదారి దొరుకుతుందిలే అని చంకలో పేపర్లు పెట్టుకొని దర్జాగా బయలుదేరాడు.హఠాత్తుగా ఈదురుగాలి విజృంభించింది. దుమ్ము ధూళి పైకిలేచింది.పేపర్లగూర్చే ఆలోచించే ఆయన ఈ హఠాత్పరిణామాన్ని గమనించలేదు. కంట్లో దుమ్ము పడేసరికిచేతులెత్తి కళ్లుమూసు కున్నాడు. చంకలో కాగితాలు గాలిపటాల్లా సందు చివరిదాకా ఎగురుతు చెల్లాచెదురుగా భూమ్మీద కొన్ని, చెట్లకొమ్మల ఆకుల మధ్యలో కొన్ని, వీధిచివర్లో వున్న చెరువులోకి
కొన్ని కొట్టుకుపోయాయి.
ఐదేఐదు నిముషాల్లో వాయుదేవుడు విజృంభించటం, శాంతించటం జరిగి పోయింది.దుమ్ము పడ్డముఖాన్ని చెరువు నీళ్లతో కడుక్కుందామని చెరువు గట్టు దగ్గరకు చేరిచెరువులోకి చూసి మూర్ఛ పేషంటులా వూగిపోతూ కిందపడిగుడ్లు తేలేశాడు. వెంటనేతనను తాను తమాయించుకుంటు చేతులు చాచి ‘మరణ మృదంగం మీద నృత్యం చేస్తున్న’ మీన సుందరినోట్లో కాగితం తీసిచూస్తేతన శిష్యులు వ్రాసిన పరీక్ష పేపరు
ముక్క మీద మీనము అన్నది చూచి ఆ కాగి తాన్ని జేబులో వుంచీ వుంచకుండానేకేరింతలు వేస్తూ చేతిలో వున్న మీన సుందరిమృత్యువుని జయించి ఈదుకుంటు లాహిరిలాహిరి లాహిరిలో జగమేవూగెను అన్నంత ఆనందంలో చెరువు మధ్యకు చేరింది. బుడంకాయ వెళ్లిన దారినే ‘బర్డ్‌ వాచర్స్‌ క్లబ్‌’ సెక్రటరీ ఖగపతి కూడా యింటికి బయలుదేరాడు. ఆయన ధోరణిలో ఆయన కొత్తపిట్టేమైనా వచ్చిందేమో అనుకుంటు ‘బైనాక్యులర్‌’ తీసి ఓచెట్టు కొమ్మలో యిరుక్కుని ‘కీకీ’ అంటున్న పక్షిని గమనించాడు. అదిచావుబతుకుల మధ్య కొట్టుకుంటోందని అర్థమైంది. నిశితంగా గమనిస్తేదాన్నోట్లో కాగితం ముక్క. గొంతు కడ్డు పడిరదనుకొని అటుగా వెళుతున్న ఓచెలాకీవిద్యార్థిని పిలిచి చెట్టుపైవున్న పిట్టను చూపించి దాన్ని జాగ్రత్తగా కిందకు పట్టుకు రమ్మన్నారు. విద్యార్థీశతమర్కట ఉపాధ్యాయుడిమాట పూర్తయీ కాకుండానేవాడు చెట్టు సగం ఎక్కేసిపిట్టని పట్టుకుని కిందకిదిగి గురువుగారిచేతిలో ఆయన కోరుకున్న పక్షీశ్వరు ణ్ణివుంచాడు.పిట్టనోట్లో కాగితం తీసిపిట్టని పిల్లవాడి చేతిలో వుంచాడు. పరలోకానికి వెళ్లాల్సిన పిట్టపిల్లవాడిచేతుల్లో నుండి తుర్రున ఎగిరిపోయింది.చెరువు దగ్గర నుండి బుడంకాయ వీళ్లను వింతగా చూస్తూ ఏమైందండీఅని అడిగాడు. ఖగపతిగారు చేతిలోని కాగితం ముక్కను బుడంకాయ చేతిలో పెట్టాడు. బుడంకాయ కాలరెగరేసాడు ఈ కలుపు మొక్కలు సూర్యుడస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం వారు నేర్పిన ఇంగ్లీషులో కూడా ఉన్నాయా అని అనుకున్నాడు.పక్కనేవున్న చెట్టెక్కి దిగిన విద్యార్థిఆ పేపరు నాదేనండి అదినేనే వ్రాశాను. నా ఇంగ్లీషు దస్తూ రినేను గుర్తుపట్టగలనండీ అన్నాడు. వాడి మాటలకు బుడంకాయ మళ్లీ బుర్రగీక్కున్నాడు. మిగిలివున్న మూడు ఎడారి మొక్కల్లో ఒకటి కిందకు పడిరది. నెత్తిన మిగిలి వున్న రెండు మొక్కలు ఈరోజుకు బతిక్రిపోయాం అనుకున్నాయి. పిల్లలు నాటిన యీ కలుపు మొక్కలు ఎప్పుడు వూడిపడతాయో! అనుకుంటు దిగాలుగా యిల్లు చేరాడు. చిలికి చిలికి గాలివాన తుఫానుగా మారినట్లు పరీక్ష పేపర్లు కొరికిన ఎలుకల దగ్గర నుండి చావు బ్రతుకుల మధ్య నరకం అనుభవించి బయటపడ్డమీన సుందరి, పక్షీశ్వరుల కథలు, కథలు కథలుగా స్కూలు మొత్తానికి తెలిశాయి. ఆనోట ఆనోట హెడ్‌ మాస్టరు గజవా హనుడికీ తెలిసింది. గజవాహనుడు చండశాసనుడు. స్కూలు పిల్లల్ని గడగడ లాడిస్తాడేకాని ఆయన పిల్లల్ని చూస్తే ఆయన గడగడలాడుతాడు. స్టాఫ్‌ రూంలో సరదాగా కబుర్లు చెప్పుకుంటు నవ్వులు విరగబూస్తున్న సమయంలో గజవాహనుడు వచ్చాడు. ఆయన్ను చూడగానేవాతావరణం మారిపోయింది. వాడిపోయిన కుసుమాల్లా ముఖాల్లో మార్పు వచ్చింది. ఇదంతా గమనించ లేనంత అసమర్ధుడు కాదు గజవాహ నుడు.అందర్ని చూస్తూ ఉనా రాక మీకేమైనా ఇబ్బందిగా వుందా అన్నారు.ఉచెట్టెక్కి కిందకు దింపిన పిల్లవాడి పిట్టకథ ప్రాణాపాయం నుండి బయటపడిన ఉమీన సుందరికథఉ తెలుసా? అని గద్దించాడు గజవాహనుడు. అందర్నీ ఉతికిఆరేద్దామని వచ్చి ఏదోమొదలు పెట్టబోయేలోపేబెల్‌ మోగింది. అక్కడున్నవారు అంతా ఎవరిమానాన వారు పుస్తకాలు,డస్టరు, చాక్పీసు తీసుకుని గజవాహనానికి నమస్కరిస్తూ బయటపడ్డారు. కాంపోజిషన్‌ పుస్తకాలు దిద్దుకుంటు అక్కడేకూర్చున్న బుడంకాయను సావకాశంగా ఉఏం చేస్తున్నారండి? అని అడిగిఆయవ పక్కనేకూర్చున్నాడు గజవా హనుడు. దిద్దుతున్న పుస్తకాన్ని చూపిస్తూ తెలుగు కాంపోజిషన్‌ దిద్దుతున్నా సార్‌ అని పుస్తకం పెద్దాయనకు చూపించాడు. పుస్తకంలో ప్రతిపేజీ దిద్ది వ్రాసిన సరిjైున పదాలు, వ్యాసంపైవిద్యార్థికి చేసిన సూచనలు అన్నీ చూశాడు గజవాహనుడు సావకాశంగా. ఏంటిసార్‌ 10ష్ట్రలో యింత ఘోరమా? అన్న ఆయన ప్రశ్నకు ఇదిచూడండి అంటూ యింకో పుస్తకంలో ఓపేజీ చూపిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో కాళ్లు, చేతులు,తల కోల్పోయి మొండెం ఏనుగుల కాళ్ల కిందపడి రక్తసిక్తమైన కురుక్షేత్రసంగ్రామాన్ని తలపిస్తుందియీ ఎర్రసిరా గుర్తులు అంటు తన అశక్తను తెలియజేసాడు బుడంకాయ్‌. ఆ పుస్తకంలోని అన్ని పేజీలు తిప్పి అట్టమీద పేరు చూసిదిమ్మెర పోయారు గజవాహనుడు. అదెవరిదో కాదు అక్షరాల తన పుతర్రత్నానిదే. బుడంకాయ మీద కోపం చల్లారలేదు. ఎంత కోపం బాధగా వుంటే మాత్రం ‘హెడ్మాష్టరు చచ్చాడని’ పిల్లలకు చెపుతాడా? కోపాన్ని తమాయించుకుంటున్నాడు గజవాహనుడు. వారిద్దరిమధ్య నిశ్శబ్దం ఆవరించింది. ఇంతలో ప్యూన్‌ అప్పలస్వామి ఓ ఫైల్‌ చేతికిచ్చి నిలబడ్డాడు. ‘పద. వస్తున్నా నంటు’ లేచి రూంకి బయలు దేరాడు.ఓ వారం రోజుల తరువాత గజవాహనుడు తన పుత్ర రత్నానికితెలుగు చెప్పే బుడంకాయకి కబురు చేశారు.వీలైతేయీరోజు సాయంత్రం మాఇంటి కిటీకిరాగలరా? ఓ తప్పకుండ వస్తా అంటు తిరుగు సమాధానం కబురు తెచ్చిన వ్యక్తిచేతే కబురు పంపాడు.ఏం ఆలోచించ లేదు. సాయంత్రం గజవాహనుని ఇంటికి వెళ్లాడు బుడంకాయ్‌. సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకుని పోయి ఏవేవో పిచ్చాపాటి మాట్లాడి అసలు విషయానికివచ్చాడు.మీ గూర్చి నాకే అనుమానమూ లేదు. మీరు శక్తివంచన లేకుండా పిల్లల అభివృద్ధికికావలసిన చర్యలన్నీ తీసుకుంటు ఆహ్లాద వాతావరణంలో పాఠం బోర్‌ కొట్టకుండా చెపుతారనీ తెలుసు. పిల్లల అశద్ధ్రను ఏమాత్రం సహించరనీ తెలుసు. కానీ యీ కురుక్షేత్రసంగ్రామంలో రక్తం మరకల్లా యీ ఎర్రసిరా గుర్తులేంటిసార్‌? అన్నాడు. తెలుగు సాహితీ నందనవనంలో మొలకెత్తాల్సిన కల్పవృక్షం విద్యార్థుల చేతుల్లో పడి కలుపు మొక్కలుగా మొలిచిందండీ! కారణం ఎవరైనా కావచ్చు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమా జం, పాఠశాల యాజమాన్యం, ప్రభుత్వం తీరుతెన్ను-ఏదైనా కావచ్చు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిపైన ఎంతమందికి ప్రేమా భిమానాలున్నాయి మాతృమూర్తి మీదేఅభిమానం చూపించలేని వీరు మాతృభాష మీదేం అభిమానం చూపిస్తారు? అంటేమనమేం చేయలేమా అన్న గజవాహనం మాటకికాంగ్రెస్‌ మొక్కలు అంటే పార్థీనియంని ఏ ఒక్కడో అంత మొందించలేడు. ఏ ఒక్క సంవత్సరంలోనో ఆ పని కాదు. రైతులందరూ సామూహికంగా కొన్ని సంవత్సరాలు అవి మొలకెత్తిన రోజుల్లోనే పీకేస్తే వాటి ఉత్పత్తి తగ్గి చివరికి అదృశ్యం కావచ్చు.తెల్లకాగితం లాంటివిద్యార్థుల మెదడులో అమోఘమైన జ్ఞాపకశక్తిఉంటుంది. అదిఆ వయసులో ఎట్లా చెపితే అట్లా వింటుంది ఆ సమయంలో సరిjైున ఉపాధ్యాయుని చేతులో విద్యార్థి పడితే సాహితీ నందన వనంలో కల్పవృక్షమే కాదు క్రియేటివిటీ అనే కామధేనువూ ఉదయిస్తుంది. దేశం మొత్తం -అన్ని శాఖల్లో – యీ కలుపుమొక్కలు ఒక్కొక్క చోట ఒక్కో పేరుతో పెరిగాయి. కలుపు మొక్కే గదా అని నాడు వదిలేశాం. అది నేడు మహా వృక్షంగా సిగ్గుసెరం లేకుండ తలెత్తుకుని భుజాలు ఎగరవేస్తోంది-ఇంతకంటే ఏం చెప్ప లేను సార్‌ అన్నాడు బుడంకాయ. గజవాహనం గారిభార్య దేవమ్మ తెచ్చిన టీతీసుకుంటు ఏమ్మా ఎలా వున్నావు? నీ రచనా వ్యాసంగం ఎలా వుంది? అని వాత్సల్యంగా అడిగారు బుడంకా య్‌. నేను మీ శిష్యురాలిని సార్‌. మీరు నా చిన్ననాడు నామీద ఉంచిన ఆశలు నిరాశలు చేయలేదు. మీ దయవల్ల నా రచనా వ్యాసంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వుందండీ అన్నదిఎంతో వినమ్రతతో. మంచి కబురు చెప్పావు. ఇదిగో యీ చాక్లెట్‌ తీసుకో అంటు చేతిలో చాక్లెట్‌ పెట్టి నేటిపిల్లలే రేపటిపౌరులు. వాళ్లను అన్ని విధాల తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడ వున్నదన్న సంగతి గుర్తుంచుకోవాలి అంటూ దంపతులిద్దరినుండి సెలవు తీసుకున్నాడు బుడంకాయ. ఇంటి బయటకొస్తోంటేగార్డెన్‌లో తోటమాలి ఏకాం బరం కలుపుమొక్కలు పీకు తున్నాడు. వాడు జీవితాంతం ప్రయత్నించినా యీ కలుపు తగ్గదనుకుంటు యింటికిచేరాడు బుడంకాయ్‌ –గోమఠం రంగా చార్యులు

ప్రకృతి సహజీవనమే పర్యావరణ పరిరక్షణ

పంచభూతాత్మకమైన అనంత సృష్టిలో మానవుడు ఒకభాగం, అంతే కానీ తానే సర్వస్వం కాదు, సృష్టికి ప్రతి సృష్టి చేయా లనే ఆలోచనలు వినాశనానికి దారి తీస్తాయి అనే విషయాన్ని మనం చరిత్ర నుండి గ్రహించవచ్చు. పంచభూ తాత్మకమైన ప్రకృతిలో విలీనం కానీ ఏ పదార్థమైనా అది పర్యావరణానికి సమస్యగా మారుతుంది. ఈరోజు మానవుడు తన అవసరాల కోసం కొండల్ని గుట్టల్ని తొలిచేసే సమతలం చేస్తూ అడవుల అన్నిం టిని సమూలంగా నరికివేస్తూ భూమాతను సంపదవిహీనంగా చేస్తున్నాడు, భూగర్భ జల ప్రవాహాలను వాటి సహజ మార్గాలను మార్చివేసి తనకు అనుగుణంగా మళ్ళించి వేస్తున్నాడు. భూగర్భ జలాలను అడు గంటించేస్తున్నారు దాని కారణంగా ఈ రోజున మంచినీటి కటకట ఏర్పడుతున్నది. అత్యంత విస్తృతమైన ప్రకృతి వనరులను తన గుప్పెట్లో బంధింప చూస్తు న్నాడు. తనకు తానే సర్వశక్తిమంతుడైన సృష్టి స్థితి లయ కారకుడు అని భావించు కుంటున్నాడు. ఇది ప్రకృతి ప్రకోపించనంత కాలం సాగుతుంది ఎప్పుడైతే ప్రకృతి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుందో అప్పుడు సృష్టిలోని ఈ మానవమాత్రుడిన్ని ఎవరు రక్షించగలరు? అందుకే భారత దేశంలో ఏకాత్మతా అనుభూతి చెందే జీవనము రచించబడిరది. ప్రకృతి అనుకూల జీవన విధానంతో ప్రకృతిని కాపాడు కుంటూ వస్తోంది. దాని నుంచి బయట పడటం దానికి విరుద్ధంగా వ్యవహరించటం అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈరోజు కాలుష్యం కానీ పంచ భూతాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే అన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చెయ్యాలని నినాదం చేస్తున్నారు. కానీ ప్రకృతి అనుకూలంగా జీవించాలనే మాట చెప్పడం లేదు. ప్రకృతికి అనుకూలమైన జీవనం లోకి మానవుడు ఎప్పటివరకైతే మారడో అప్పటి వరకు ఏవో సమస్యలు వచ్చి పడుతూనే ఉంటా యి. ఈరోజు జల సమస్య చాలా తీవ్రంగా ఉంది నదులు సజీవనదులుగా కనబడటం లేదు. ద్వాపర యుగ అంతంనుండి త్రివేణి సంగమం లోని సరస్వతి నది లుప్తం కావటం ప్రారంభమై ఇప్పుడు అంతర్వాహినిగా కనబ డుతున్నది ఇట్లా అనేక నదులు ఆ దిశలో ఉన్నా యి కాబట్టి నదులను,వాగులు,వంకలను కాపాడు కోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ దిశలో చేయవలసిన ప్రయత్నం అందరూ చేయాలి. అందుకే మనం ప్రతి రోజు పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచి స్తుంటాం. అది మన జీవితంలో ఒక భాగము. అదే పాశ్చాత్య దేశాలలో సంవ త్సరంలో ఒకరోజు పర్యావరణ పరిరక్షణ అనే నినాదం చేస్తారు. పర్యావరణ విద్వంసం చెయ్యి దాటిపోయే పరిస్థితులలో ప్రపంచ దేశాలు 1974 వ సంవత్సరం ప్రపంచ సదస్సు ఏర్పాటు చేసి ప్రతి సంవ త్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమము చేస్తుంది. కరోనా ప్రపంచంలో విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో 47వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ సంవత్సరం, ప్రకృతి తో సంబంధాలనుతిరిగి పునరుద్ధరించు కోవటంపై దృష్టి కేంద్రీ కరించబడిరది. 2021-2030 దశాబ్దం యుఎన్‌ లాంఛనం గా వాతావరణ సంక్షోభంపై పోరాడటానికి, ఒక మిలియన్‌ జాతుల నష్టాన్ని నివారించు కోవటానికి, మరియు ఆహారభద్రత, నీటి భద్రతా,జీవనోపాధిని పెంచడానికి క్షీణించిన నాశనం చేయబడిన పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణనులక్ష్యంగా పెట్టుకొన్నది. మనదేశంలో కూడా గడిచినరెండు దశాబ్దాల నుండి ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించి ఇప్పుడుదేశ వ్యాప్తంగా ఆచరణ లోకి తీసుకోని వస్తున్నది.కొద్దీ సంవత్సరాల పూర్వం దేశ వ్యాప్తంగా విశ్వమంగళ గోగ్రామ యాత్ర జరిగింది దానితో గో ఆధారిత వ్యవ సాయం ఊపు అందుకొంది,దాని కొనసాగింపు గానే, ఈ మధ్యనే భూమిసంరక్షణ, భూమిసు పోషణ,దిశలో పెద్దఎత్తున దేశమంతా ఒక ఉద్యమం ప్రారంభమైనది. ఇట్లా మన దేశంలో అనేక ప్రయత్నాలు దేశవ్యాప్తంగా మొదలైయి నాయి. నీటి సంరక్షణపై అవగాహన పెంచటా నికి ఆ నీటి వనరులను కాపాడు కోవటానికి ప్రజలను జాగృతం చేయటానికి ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్‌ ‘రివర్స్‌ ఆఫ్‌ ఇండియా’ అనే మ్యూజిక్‌ వీడియో ను విడుదల చేసింది. భారతదేశంలోని 51 నదులుపేర్ల ఆధారంగా ఆ వీడియో తయారు చేయబడిరది. ఆ వీడియోలో పెరుగుతున్న జనాభాపై,నదులను కాపాడుకోవటంపై, నీటి వనరుల దోపిడీ దాని పర్యవసానాలపై, కథనం సాగుతుంది. పర్యా వరణ వ్యవస్థల విస్మరణపై హెచ్చరిస్తుంది. ఈ రంగంలో అత్యాధునిక పరిశోధనలను చేయటానికి కేంద్రం యొక్క నిబద్ధతను హైలైట్‌ చేస్తుంది.
పర్యావరణానికి తగిన గౌరవం, విలువ ఇస్తున్నామా?

ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనే పేరుతో ఈ సంవత్సరం దీనిని ‘‘పర్యావరణవ్యవస్థ పునరుద్ధరణ ‘‘(జుషశీంవర్‌వఎ Rవర్‌శీతీa్‌ఱశీఅ) అన్ననినాదంతో జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ నేపధ్యంలో గ్లోబల్‌ వార్మింగ్‌ పెరగటంవల్ల అనేక సమస్యలు కలుగుతున్నాయి.అభివృద్ది చెందాము అని చెప్పుకునే దేశాలు తమ విధానాలవల్ల జరుగు తున్న నష్టాన్ని పట్టించుకోకుండా మాత్రం ప్రపంచానికి సుద్దులు చెపుతుంటాయి. అవి చేసే పర్యావరణ నష్టాన్ని , ఇతర దేశాల భుజాలపైకి తోసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదంతా ఒక పార్శ్వం అయితే,దేశాల అనాలో చిత నిర్ణయాల వల్ల కూడా ఈ సమస్య ఉత్పాతంగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. నిజమే ప్రపంచం ఇప్పుడు సరిదిద్దుకోకపోతే తరువాత సరిదిద్దుకుందామనుకున్నా కుదరనంత చిక్కుల్లోకి పోయే పరిస్థితి ఏర్పడిరది . ఇటు వంటి విషమ పరిస్థితుల్లో ‘‘విశ్వగురువు‘‘ భారత దేశమే ప్రపంచానికి దారి చూపగలదు. పర్యావరణ పరిరక్షణలో రెండు ప్రధాన సమస్యలు మనకు కనపడతాయి. ఒకటి ప్రభుత్వ కార్యక్రమాలు, వాటి నిర్వహణ. రెండోది ప్రజల భాగస్వామ్యం. జపాన్‌,సింగాపుర్‌ వంటి దేశా లలో పరిశుభ్రత చాలా కచ్చితంగా పాటిస్తారని చెప్పుకుంటూ ఉంటాం. మరి మన దేశం గురించి వేరే దేశస్థులు ఏమి ఆలోచిస్తారో మనం కూడా చూసుకోవాలి కదా. మొదట మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఏమి చెపుతోందో తెలుసుకుని, మన వంతుగా ఏమి చేయాలో ఆలోచించాలి . ప్రభుత్వం ఏమి చేస్తోంది 2014 లో ప్రధాని మోదీ శౌచాలయపు ప్రాధా న్యతను ఏకంగా ఎర్రకోట పై నుంచే చెప్పారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా ఉద్యమస్థాయిలో శౌచలయాల నిర్మాణం జరిగింది. 2019లో తిరిగి ప్రధాని పీఠం ఎక్కిన తరువాత మొదలు పెట్టిన కార్యక్రమాలలో ‘స్వచ్చ భారత్‌ అభియాన్‌ ‘మొదటిది. అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ పర్యావరణ పరిరక్షణలో మొదటి మెట్టు స్వచ్చమైన పరిసరాలు అంటూతానే స్వయంగా చీపురు అందుకొని మొదలు పెట్టారు. ఈ స్వచ్చ భారత్‌ అభియాన్‌ ఒక ఉద్యమంగా మొదలై 2019 నాటికి బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన పూర్తిగా అరికట్టాలని లక్ష్యంతో పని చేసి దాదాపు 94%లక్ష్యం 2019లో మిగిలిన 6%తరువాతి కాలంలో సాధించ కలిగారు (ఈవెబ్‌ సైటు చూడవచ్చు ష్ట్ర్‌్‌జూం://ంషaషష్ట్రష్ట్రపష్ట్రaతీa్‌.ఎవస్త్రశీఙ.ఱఅ). అదే విధంగా ‘నమామి గాంగే‘ అన్న నినాదంతో గంగానది పరీవాహక ప్రాంతాలలో వ్యర్ధాల నిర్వహణ,కాలుష్య నివారణ,శుద్దీకరం వంటి అనేక కార్యక్రమాలను మొదలుపెట్టారు. అలాగే షaఎజూa aష్‌ ద్వారా అటవీ భూమిని ఎంత వాడుతాము అంత తిరిగి మళ్ళా అడవిని తయారు చేయటానికి అవసరమైన నిధులను తప్పని సరిగా సిద్దం చేసే చట్టాన్ని రూపొందిం చారు. దాదాపు రూ.95వేలకోట్ల నిధి సిద్దం చేశారు. పర్యావరణ రక్షణ ఒక నినాదంగా మిగిలి పోకుండా అది ఒకవిధానంగా మారేం దుకు అవసరమైన నిపుణతలను పెంచేందుకు Gతీవవఅ ూసఱశ్రీశ్రీ ణవఙవశ్రీశీజూఎవఅ్‌ ూతీశీస్త్రతీaఎ ను ంసఱశ్రీశ్రీ ఇండియాలో ఒకభాగంగా చేశారు. ఇది ఒకమంచి కార్యక్రమం ఈ వెబ్‌ సైటు ను చూడండి ష్ట్ర్‌్‌జూ://షషష.స్త్రంసజూ-వఅఙఱం. స్త్రశీఙ.ఱఅ).ప్రభుత్వం ఈపర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగానే కర్బన ఉద్గారాలను (షaతీపశీఅ వఎఱంంఱశీఅం) తగ్గించే ఉద్దేశ్యం తోనే దాదాపు పునరుత్పాదక వనరులు (తీవఅవషaపశ్రీవ వఅవతీస్త్రవ ంశీబతీషవం) అయిన సౌర శక్తి, వాయు శక్తి వాడకాన్ని ప్రోత్సహి స్తోంది. ఎలెక్ట్రిక్‌ వాహనాలు,భారత్‌ 6’ నిబం ధనలకు అనుగుణమైన వాహనాల తయారీ వంటి చర్యలు చెప్పట్టింది. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిరోధించేవిధంగా గట్టి అడుగులే పడుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతుంటే మరి ప్రజల భాగ స్వామ్యం ఏమిటీ??
ప్రజల భాగస్వామ్యం
పర్యావరణ స్పృహ భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన అంశం. మనం జరుపుకొనే ప్రతీ పండుగలో ఏదో ఒక ప్రకృతి సంబందంమైన అంశాలు ఉండటం మనం గమనించవచ్చును. అసలు మన మొదటి పండుగ యుగాది అంటేనే ప్రకృతి క్రొత్తచివురులుతొడగటం. ఆయా ఋతువులో ఏర్పడే ఆయా మార్పులను అర్ధంచేసుకొని పండుగలు జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఏమి జరుగుతోంది? తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి ఇవ్వమని ఉచితంగా పచ్చనిరంగు, నీలి రంగు డబ్బాలులు ఇస్తే,నగరంలో కేవలం 25% మాత్రమే వాటిని వాడుతున్నారని తెలుస్తోంది. 5000 టన్నుల చెత్తనుతడి,పొడి విభజన చేయడం అసాధ్యమని, దానివల్ల ఎంతో కాలు ష్యం కలుగుతోందని ఒక మునిసిపల్‌ అధికారి వెల్లడిరచారు. నిజానికి అది ఇళ్ళలో వారికి చాలా చిన్న పని. ఇంటిలో చెత్తని తడి, పొడిగా విభజించి పారిశుద్ధ్య విభాగానికి ఇస్తే చాలు. ఇంత సులభమైన పని కూడా మనం చేయలేమా? భారతీయులు తమ మూల విధా నాలకు విలువ ఇస్తూ, ప్రకృతి తో మమేకమయ్యే అవసరం ఇప్పుడు చాలా కనిపిస్తోంది. మనం వ్యక్తిగత పరిశుభ్రతతో మొదలుపెట్టి, ఇల్లు, వీధి,గ్రామం,జిల్లా,రాష్ట్రం, దేశం ఇలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళితే మన జీవిత కాలం లో ఏదో ఒకచిన్న సకారాత్మక మార్పునైనా చూడగలుగుతాము. పారిశ్రామిక కాలుష్య నివారణ,షaర్‌వ ఎaఅaస్త్రవఎవఅ్‌ మొదలై నవి ప్రభుత్వపు పనులేనని భావించకుండా మనం చేయాల్సిన పని మనం చేద్దాం. మన దైనందిన అంశాలలో మొట్ట మొదటగా ప్రారంభించాల్సిన విషయం, పర్యావరణ కాలు ష్యాన్ని తగ్గించడం కోసం మీ ఇంటి పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఇంట్లోని చెత్తను తడిచెత్త, పొడిచెత్తగా తప్పనిసరిగా విభజించడం. ప్లాస్టిక్‌ వినియోగాన్ని బాగా తగ్గించడం. ప్రకృతి అందించే సౌరశక్తి, వాయు శక్తిని ఎక్కువ వినియోగంలోనికి తెచ్చుకోవడం. వీలైనంత వరకు సేంద్రీయ విధానం వైపుకు మారటం. జ్యూట్‌,కొబ్బరి,గుడ్డలతో తయారు కాబడ్డ సంచీలు,తాళ్ళు, ప్రకటన వస్తువుల ఉపయోగాన్ని పెంచటం. తమ తమ పరిధి మేర ఎంతో కొంత స్వచ్చ భారత్‌ అభియాన్‌ వంటి కార్యక్రమాలలో పాలు పంచుకోవటం. ఇలా అనేక చిన్న చిన్న విషయాలతో మొదలు పెట్టి దేశం కోసం స్వంత లాభం కొంత మానుకుని, మన భావితరాలకి మంచి పర్యా వరణాని అందించడం కోసం మనవంతు ప్రయ త్నం చేయకపోతే ముందు ముందు ఎన్ని ఉత్పా తాలను చూడాలో ఈ రెండు సంవత్సరాలలో బాగా అర్ధమయింది.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచే ప్రయ త్నం చేయాలి. ఎందుకంటే, ప్రకృతిలో సహజం గా పెరిగిన ఎన్నో చెట్లను మనిషి తనకోసం తొలగిస్తున్నారు. అందువలన మనిషి మరలా అటువంటి చెట్లు తయారుకావాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. ఇంకా వాతా వరణం అనుకూలంగా లేకపోతే నాటిన ప్రతి మొక్క చెట్టుగా మరే అవకాశం తక్కువ. కాబట్టి వీలైనన్ని మొక్కలు పెంచడానికి ప్రతివారు కృషి చేయాలి. పర్యావరణ పరిరక్షణలో చెట్లు చాలా కీలకమైనవి.సమాజంలో పర్యావరణ పరిరక్షణ అంటూ అనేక నినాదాలు సంవత్సరాలుగా వస్తున్నాయి. పర్యావరణంలో చెట్ల యొక్క ప్రాముఖ్యతను సమాజంలో పెద్దలు గుర్తించారు. కానీ నరుకుతున్న చెట్లు, ఒక్కరోజులో పెరిగినవి కావు. ఏళ్ల నాటి నుండి మొక్కలుగా పెరిగి, పెరిగి చెట్లుగా ఎదిగి పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి. అటువంటి చెట్లు తొలగించే సమయానికి ఒక చెట్టుకు కనీసం పది మొక్కలు నాటి, వాటిని పెంచే ప్రయత్నం చేస్తే, అటువంటి చెట్లు భవిష్యత్తులో మానవ మనుగడకు అవసరమైనన్ని తయారు కాగలవు. మొక్కలు పెంచడానికి ఎవరికి మినహాయింపు లేదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.మనిషి మనుగడకు గాలి అవసరం. అలాగే నీరు అవసరం. నేడు చెట్లు తక్కువగా ఉండడం వలన పర్యావరణ సమతుల్యత తగ్గి వానలు సరైన సమయానికి రావడం లేదనే వాదన బలంగా ఉంది. వానలు సమృద్దిగా కురిస్తే, నీరు పుష్కలంగా ఉంటుంది. తగినంత నీరు ఉంటే, తగినంత పంటలు పండుతాయి. తగి నంత పంటలు పండితే, తగినంత ఆహార పదార్ధాలు లభిస్తాయి. శ్రమజీవులకు ఆహారం అందుతుంది. నేటి సమాజం శ్రామిక జీవుల పైనా, రైతులపైనా ఆధారపడి ఉంది.
నీటి దుర్వినియోగం పర్యావరణానికి చేటు
గత కాలంలో నీరు భూమిపై మాత్రమే ప్రవహించేది. అందువలన నీరు అయితే భూములోకి ఇంకేదీ. లేకపోతే ఎండలకు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో మేఘంగా మరి మరలా భూమిపైకి వర్షించేది. ఇలా ఒక సహజమైన క్రమం జరుగుతూ ఉండేది. కానీ నేటి రోజులలో నీరు ప్రవహించేది గొట్టాలలో` వివిధ రకాల గొట్టాల ద్వారా వివిధ విధాలుగా నీటి మళ్లింపు జరుగుతుంది. అందుకోసం ఆకాశం నుండి కురిసే వానలు చాలక భూమి లో నీటిని పైకి తీసుకురావడం కూడా జరుగు తుంది.పర్యావరణ పరిరక్షణలో చెట్లు, జంతువులు, గాలి నీరు అనేక విధాలుగా పాలు పంచు కుంటాయి. వాటిని సహజంగా ఉండేలాగా కృషి చేయవలసిన బాద్యత, ప్రకృతిని వినియోగించుకుంటూ, ప్రకృతిని ఆధారంగా జీవించే ప్రతి మనిషిపైన ఉండాల్సిన అవశ్యకత ఉంది.

లేటరైట్‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

లేటరైట్‌ అక్రమాల నిగ్గు తేల్చేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రంగంలోకి దిగింది. విశాఖ ఏజెన్సీలో అక్రమంగా ఖనిజాన్ని తవ్వడంతో పాటు…రవాణాకోసం వేలాది పచ్చటి చెట్లను అడ్డంగా నరికి రోడ్డు వేసిన వైనంపై ‘నిజ నిర్ధార ణ’కు ఆదేశించింది.ఈవ్యవహారంపై విశాఖ జిల్లా నాతవరం మండలం గునుపూడికి చెందిన దళిత ఐకయ ప్రగతి సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ్రు మరిడియ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు స్వీకరిం చడమే కాకుండా..‘మా జోక్యం అవసరం అని భావిస్తున్నాం’అని కూడా ట్రైబ్యునల్‌ చెన్నై ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాతే ధర్మాసనం ఈఅభిప్రా యానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. దీంతో మైనింగ్‌ లీజుదారు జర్తాలక్ష్మణరావుతోపాటు పంచాయ తీరాజ్‌ సహా పలు శాఖల అధికారులు దాదాపు ఇబ్బందుల్లో పడినట్టేనని ప్రభుత్వ వర్గాలే అభిప్రా యపడుతున్నాయి. అడవిలోకి చొచ్చు కురా వడమే కాకుండా వేలాదిచెట్లు కొట్టి రోడ్డువేయడంపై స్థానిక గిరిజనులు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. న్యాయపరంగా ఉన్న మార్గా లపై జాతీయ పర్యా వరణవాదులతో కొంతకా లంగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే కొండ్రు మరిడియ్య జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేశారు.ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కే.రామకృష్ణన్‌,సభ్య నిపుణుడుకే సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం జులై 26వ తేదీన పిటిషన్‌ను విచారించి,అదేరోజు జులై 30న ఆదేశాలుఇచ్చింది.
పిటిషన్‌లో ఏముందంటే..

అటవీ సంరక్షణచట్టం-1980లోని సెక్షన్‌ 2 కింద సరైన అటవీ అనుమతులు లేకుండా, అటవీ సంరక్షణ రూల్స్‌-2003ను పాటించకుండా లేటరైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. సర్వే చేయని కొండ పోరంబోకు భూమి(యూఎసహెచ్‌పీ)లో 212 హెక్టార్ల భూమిలో 20ఏళ్లపాటు మైనింగ్‌ చే సేందుకు అనుమతులు ఇచ్చారు. గిరిజనుల కోసం ఉద్దేశించిన రహదారిని ఎలాంటి అటవీ శాఖ అనుమతులు లేకుండా మైనింగ్‌కోసం పెద్దది గా విస్తరించుకున్నారు. ఈరహదారి నిర్మాణం కూడా అటవీ హక్కుల చట్టం-2006లోని నిబంధ నలకు విరుద్దంగా చేశారు. మైనింగ్‌కోసం సమర్పిం చిన గ్రామసభ తీర్మానపత్రం వట్టిబోగస్‌. ఆ విష యం తెలిసినా దాని ఆధారంగానే మైనింగ్‌కు అను మతి ఇచ్చారు. దీంటోపాటు అటవీ హక్కుల చట్టం-2006తోపాటు ఇతర కీలకచట్టాలను కూడా ఉల్లంఘించారు. దీనివల్ల పర్యావరణకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈనేపధ్యంలో విశాఖ,తూర్పు గోదా వరి మన్యంలో రిజర్వ్‌ ఫారెస్ట్‌ (ఆర్‌ఎఫ)తో కలిసి ఉన్నభూమిలో అటవీ సంరక్షణ చట్టం-1980, రూల్స్‌-2003ని ఉల్లంఘించి మైనింగ్‌ చేయడానికి వీల్లేదని ఆదేశించాలి. అటవీ సంరక్షణ చట్టం ఉల్లంఘించి చేపడుతున్న మైనింగ్‌ ని నిలు వరించి ఆ ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఈ విష యంలో చట్టబద్ధమైన అంశాలు, నిబంధనలను అమలు చేయడంలో విఫలమైన అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాలి. సరుగుడు లోని రిజర్వ్‌ ఫారెస్టను కాపాడలేకపోయిన, తప్పులు చేసిన అధికారులపై అపరాధరుసుం విధించాలి’’
ట్రైబ్యునల్‌ ఆదేశాలివీ..
ఫిర్యాదులో పిటిషనర్‌ లేవనెత్తిన అంశా లపై విచారణకు ట్రైబ్యునల్‌ ఆదేశించింది. కేంద్ర-రాష్ట్ర అధికారులతో కూడిన జాయింట్‌ కమిటీ విచారణ చేయాలని దిశానిర్దేశం చేసింది. ఈ కమిటీలో కేంద్ర అటవీ,పర్యావరణ మంత్రిత్వ శాఖ లోని సీనియర్‌అధికారి లేదా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏదైనా స్వతంత్ర ఏజెన్సీబీ విశాఖ కలె క్టర్‌,విశాఖ జిల్లా అటవీఅధికారి(డీఎఫఓ),గనులశాఖ సీనియర్‌ అధికారి,రాష్ట్రకాలుష్య నియంత్రణమండలి (పీసీబీ) నుంచి సీనియర్‌ అధికారి ఉంటారని,కమిటీకి అవస రమైన లాజిస్టిక్‌ సహకారం,సమన్వయం కోసం రాష్ట్ర గనుల శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుందని పేర్కొంది. ఈ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్లి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, చట్టాల ఉల్లంఘనలను పరిశీ లించి,వాటిపై వాస్తవిక,కార్యాచరణ నివేదికను అందించాలని కోరింది. అంటే,మైనింగ్‌ జరుగు తున్న ప్రాంతం,రహదారులు నిర్మించిన అటవీ, డంపింగ్‌ యార్డు,పర్యావరణంపై ప్రభావం చూపే ప్రతీ పాయుంట్‌ను కమిటీ పరిశీలన చేయనుంది. అలాగే…మైనింగ్‌కోసం కేటాయించిన భూమి వాస్తవిక పరిస్థితి ఏమిటో,అక్కడ మైనింగ్‌ చేపట్ట డానికి అటవీ సంరక్షణ చట్టం-1980 ప్రకారం ఏమైనా అనుమతులు తీసుకోవాలా? ఆ ప్రాంతంలో అటవీ సంరక్షణ చట్టం, అటవీ హక్కుల చట్టంలోని నియమనిబంధనల ఉల్లంఘనలు జరిగాయా? ఒక వేళ అలాంటివేమైనా కనిపెడితే వాటిపై అటవీ శాఖ తరపున ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్వతంత్ర నివేదికను అందించాలని ఆంధ్రప్రదేశ్‌ పీసీసీఎఫ్‌, అటవీ దళాల విభాగాధితి (హెచ్‌ఓ ఎఫఈ)ని ఎన్‌జీటీ ఆదేశించింది.
ఏడు అంశాల్లో విచారణ..
లేటరైట్‌ మైనింగ్‌ జరుగుతున్న ప్రాం తాన్ని తనిఖీ చేసి..వాస్తవిక పరిస్థితులను అధ్య యనం చేయడంతోపాటు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని కమిటీకి ట్రైబ్యునల్‌ ఆదేశించింది. మొత్త ఏడు అంశాలను పరిశీలిం చాలని నిర్దేశించింది.అవి..ౌ మైనింగ్‌ జరుగు తున్న ప్రాంతం ఒరిజినల్‌ రెవెన్యూ రికార్డుల (స్వాతంత్య్రానికి ముందున్నవి) ప్రకారం ఎక్కడుందో నిర్ధారణ చేయాలి. ౌ మైనింగ్‌దారు నిబంధనల ప్రకారం, అటవీ సంరక్షణ చట్టం-1980 మేరకు అనుమతులు తీసుకొన్నారా? ౌ అక్కడ ఏ పద్ధతిలో మైనింగ్‌ జరుగుతోంది… దాని వల్ల పర్యావరణం,జీవావరణం (జంతు జాలం)పై ఎంత మేర ప్రభావం ఉంటుంది.. ఇప్పటికే ఏ మేరకు దెబ్బతీసింది? ౌ లీజుదారు ఏమైనా పరిమితికి మించిన మైనింగ్‌ చేశారా…ఒక వేళ అదే జరిగితే ఏ స్థాయిలో అది ఉంది? ౌ ఆ ప్రాంతంలో లీజుదారు ఏమైనా చట్టప రమైన అనుమతులు తీసుకోకుండా రహదారిని విస్తరించారా? ౌ లీజుదారు మైనింగ్‌కు అనుమతులు,క్లియ రెన్స్‌లు తీసుకున్నప్పుడు జారీ చేసిన నిబం ధనలను, కాలుష్యనియంత్రణ మండలి నియమనిబంధనలు పాటించారా? ౌ ఇంకా….ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారా…వాటిపై సంబంధిత విభాగాలు తీసుకున్న చర్యలేమిటి? పర్యావరణ నష్టం జరిగి ఉంటే పర్యావరణ పరిహారాన్ని అంచనావేశారా? ఈ అంశాలపై సమగ్ర పరిశీలనచేసి ఆగస్టు31లోగాపీడీఎఫ్‌ రూపం లో నివేదిక సమర్పించాలని జాయింట్‌ కమిటీకి దిశానిర్దేశం చేసింది.
ఫిర్యాదుదారుకీ భాగస్వామ్యం
ట్రైబ్యునల్‌ మరోకీలకమైన ఆదేశం ఇచ్చింది. ఫిర్యాదుదారు కొండ్రు మరిడయ్యను కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని ఎన్‌జీటీ ఆదేశించింది. విచారణ చేపట్టే సమయంలో హాజరు కావా ల్సిందిగా ఫిర్యాదుదారునికి నోటీసులు ఇవ్వాలని, మైనింగ్‌ ప్రాంతాన్ని సందర్శించే సమయంలో ఫిర్యా దుదారు కూడా ఉంటారని నిర్దేశించింది. ఈ సమ యంలో పర్యావరణ,అటవీ చట్టాల ఉల్లంఘనలు, అక్రమాలపై కమిటీకి ఆయన తన నివేదిక అందిం చొచ్చునని పేర్కొంది. కమిటీ తన నివేదికను సమ ర్పించడానికి అది(ఫిర్యాదుదారుడు ఇచ్చిన రిపోర్టు) ఉపయోగపడుతుందని ఉత్తర్వులో పేర్కొంది. జాయింట్‌ కమిటీ విచారణ వేగంగా సాగడానికి ఫిర్యాదుదారు వారం రోజుల్లోగా తన వద్ద పత్రా లు,రిపోర్టులను కమిటీ సభ్యులకు అందించాలని కోరింది.
ఇదీ నేపథ్యం..
విశాఖజిల్లా నాతవరం మండలం భమిడికలొద్ది వద్ద 121హెక్టార్లలో లేటరైట్‌ మైనిం గ్‌కు గతంలో లీజులుపొందిన వ్యక్తిని అధికార పార్టీ ముఖ్యనేతలు తమ దారికి తెచ్చుకున్నారు. గత నెల నుంచి లీజుగనిలో లేటరైట్‌ తవ్వి, తరలిం చడం మొదలుపెట్టారు. ఈ ఖనిజాన్ని తరలించ డానికి క్వారీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రౌతుల పూడి మండలం జల్దాం వరకు 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించారు. అప్పటికే ఉన్న కాలి బాటను 20-30 అడుగుల మేర వెడల్పు చేశారు. దీనికోసం ఐదు కిలోమీటర్ల మేరవిస్తరించిన ఫారెస్టు ను గుల్ల చేశారు.రెవెన్యూ,అటవీశాఖల అనుమతు లు లేకుండా ఆరేడు వేలవృక్షాలను నరికివేశారు.
చెట్టుకు రూ. ఐదు వేలు..
విశాఖ జిల్లా నాతవరం మండలం తొరడలో లేటరైట్‌ మైనింగ్‌ కోసం కిల్లో లోవరాజు అనే వ్యక్తి సుమారు పదేళ్ల క్రితం దరఖాస్తు చేసు కొన్నారు. అన్ని ప్రక్రియల అనంతరం అధికారులు ఆయనకు లీజు మంజూరుచేశారు. సుమారు 19 హెక్టార్లలో 2016-17లో తవ్వకాలు ప్రారంభించి తొమ్మిది నెలల్లో మూడు లక్షల టన్నుల లేటరైట్‌ను ఆ క్వారీలో వెలికితీశారు. సుందరకోటకు చెందిన ఓగిరిజనుడు మైనింగ్‌లో నిబంధనలు ఉల్లంఘిం చారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.ఖనిజం రవాణాకు 1.5కిలోమీటర్ల రహదారి నిర్మాణం కోసం దాదాపు మూడు వేల చెట్లు కొట్టివేశారని ఫిర్యాదు చేశారు. కొట్టేసిన చెట్ల ఫొటోలను హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీ లించిన హైకోర్టు..తక్షణమే మైనింగ్‌ నిలిపివేయాలని 2018లో ఆదేశించింది. అంతేకాక క్వారీ చుట్టూ ప్రహరీగోడ నిర్మించి, వన్యప్రాణులకు ముప్పు లేకుండా పగటిపూట మాత్రమే క్వారీ తవ్వకాలు చేపట్టాలని సూచించింది. రోడ్డు నిర్మాణం కోసం నరికివేసిన చెట్లకు ఒక్కో చెట్టుకు రూ.ఐదు వేలు వంతున మొత్తం రూ.1.5కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఇంతలో కాలుష్య నియంత్రణ మండలి,గనులశాఖ,అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. క్వారీలో తనిఖీలు చేసి, నిబం ధనలు ఉల్లంఘించారంటూ మైనింగ్‌ని నిలిపి వేశారు. తాజా ట్రైబ్యునల్‌ ఆదేశాలతో స్థానిక గిరిజనులు అప్పటి ఉదంతాన్ని గుర్తు చేసుకొం టున్నారు. ఇప్పుడూ తమకు అలాంటి న్యాయం అందించాలని కోరుకుంటున్నారు.
సీనియర్‌ జర్నలిస్టు జక్కల నాగ సత్య నారాయణ(జనాస)అందించిన వివరాలు ప్రకారం
రిజర్వ్‌ ఫారెస్ట్‌ పొడవునా రహదారుల ఏర్పాటు
పేరుకే గిరిజనుల సంక్షేమం కోసం రహ దారి..కానీ, అక్కడ జరిగింది…కాకినాడ పోర్ట్‌ కు అడ్డరోడ్డులో లేటరైట్‌ను యథేచ్ఛగా తరలించుకు పోయేందుకు రోడ్డు నిర్మాణం.జాతీయ రహదారి మీదుగా తరలిస్తే ఇబ్బందులొస్తాయని తలంచి అడవి మార్గం అయితే ఖనిజరవాణాకు గోప్యంగా ఉంటుందని భావించినట్టుంది. రిజర్వ్‌ ఫారెస్టులో రోడ్లనిర్మాణానికి అటవీశాఖ చట్టాలు అంగీకరిం చవు ..అందులోనూ ప్రజలకు సంబంధం లేకుండా ఖనిజాన్ని తరలించ డానికి రోడ్ల నిర్మాణం అంటే అస్సలు పనికాదు. దీంతో క్వారీయజమానులు కొత్త ఎత్తుగడతో ఏజెన్సీ గ్రామాలను కలుపుతూ ప్రజా ప్రయోజనంపేరిట అనుమతులు పొందారు. అను కున్నదే తడవుగా ఖనిజాన్ని తరలించేందుకు కాకి నాడ పోర్టుకు దగ్గరదారైన రౌతులపూడి మం డలం రాఘవపట్నం,జల్దాం,దబ్బాది,సిరిపురం మీదుగా బమిడికలొద్దుక్వారీ వరకూ దశల వారీగా 2అడుగుల కాలిబాటను 8అడుగులరోడ్డు కోసం అనుమతులు తెచ్చుకొని ఏకంగా 32 అడు గుల వెడల్పుతో19రోజుల్లో..17కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించేశారు. ఇప్పుడా రోడ్డుపై14 టైర్ల టిప్పర్లు వేగంగా దూసుకు పోతున్నాయి.నాతవరం మండలం సరుగుడుపంచాయితీ పరిధిలోని భమిడికలొద్దు రిజర్వ్‌ఫారెస్టులోని 121హెక్టార్లలోని సుమారు 5000కోట్ల లాటరైట్‌ ఎర్ర మట్టిని తవ్వుకు నేందుకు ఆంధ్రప్రేదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులను తీసుకున్న క్వారీ నిర్వాహకులు తొలుత రోడ్డునిర్మాణంపై దృష్టి సారించారు. రిజర్వ్‌ ఫారెస్టులోరోడ్ల నిర్మాణానికి అటవీశాఖ చట్టాలు అంగీకరించవు. అందులోనూ ప్రజలకు ఏవిధం గానూ సంబంధం లేకుండా కేవలం లాటరైట్‌ ఖనిజ సంపదను తరలించడానికి రోడ్ల నిర్మాణం అంటే అస్సలుపనికాదు. అందుకు రిజర్వ్‌ ఫారెస్టు లోని వివిధగ్రామాలను కలుపుతూ ప్రజాప్రయో జనం అనే ముసుగులో అనుమతులను పొందారు. విశాఖ జిల్లాలోని సరుగుడు,తూర్పు గోదావరి జిల్లాలోని కోటనందూరు,తుని మండలాల మీదుగా లాటరైటు ఖనిజాన్ని జాతీయ రహదారికి తరలించి అక్కడ నుంచి నేరుగా వివిధ దారుల్లో కాకినాడ పోర్టుకు చేర్చాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా లోని కాకినాడ పోర్టుకు దగ్గర దారైన ప్రత్తిపాడు నియోజక వర్గం రౌతుల పూడి మండలం రాఘవ పట్నం, జల్దాం, దబ్బాది, సార్లంక, సిరిపురం మీదుగా బమిడికలొద్దు క్వారీ వరకూ దశల వారీగా సుమారు 17కిలో మీటర్ల మేరకు వివిధ భాగాలుగ పక్కాగా ఒకే మట్టిరోడ్డుగా నిర్మించాలని తలంచి రంగం సిద్దంచేసారు. దాన్ని గుట్టుగా పక్కాగా అమలు చేసారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం అటవీశాఖ రేంజ్‌ పరిధి లోని రౌతులపూడి మండలం సార్లంక నుంచి విశాఖ మన్యంలోని సిరిపురం వరకు రహదారి నిర్మించాలని జూన్‌10న పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్‌తో అటవీశాఖకు ఓదర ఖాస్తు పెట్టారు. 15న అటవీశాఖ రేంజర్‌ వెళ్లి ప్రతిపాదిత ప్రాంతా న్ని పరిశీలించి,అది 2అడు గుల కాలి బాట అని, దాన్ని 8అడుగుల రహదారిగా మార్చాల్సిన అవ సరం లేదని రిపోర్టు ఇచ్చారు. ఆ మరుసటి రోజే జిల్లా స్థాయి కమిటీ సమావేశమై సిరిపురం, సార్లంక, దబ్బాది గ్రామాల ప్రజల రాకపోకలు, వైద్య పరమైన అవసరాల కోసం ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని జిల్లాస్థాయి కమిటీ (డీఎల్‌సీ) లో జూన్‌ 16న తీర్మానించారు. ఐతేఈరోడ్డే అడిగితే లేటరైట్‌ రహదారి విషయం బయ టకు వస్తుందని తెలివిగా ఆలోచించి, ఒకేసారి 109రోడ్లను అందులో రంప చోడవరం ఐటిడిఏ మన్యం పరిధిలో 66, కాకి నాడ పంచాయితీరాజ్‌ విభాగం పరిధిలో 43కు తీర్మానించి అదేరోజు ఈ రహదార్ల నిర్మాణానికి అనుమతిస్తూ అటవీశాఖ అధికారి ఆదేశాలు ఇచ్చారు. అడవిలో రహదారులు నిర్మిం చాలంటే అటవీశాఖ,గ్రామపంచాయతీల తీర్మానం, ఐటీడీఏ అనుమతి తప్ప నిసరి.వాటికి ప్రభుత్వ నిధులూ ఉండాలి. అన్నిరకాల అనుమతులు వచ్చాక రహ దారి నిర్మాణం ప్రారంభంకావడానికి కనీసం ఐదా రు నెలల సమయం పడుతుంది. కానీ ఇక్కడ మన్యంలో మాత్రం కేవలం 19 రోజులే పట్టింది. అంటే ఇక్కడ ప్రభుత్వ నిధులతో పని లేకుండా మైనింగ్‌ సొమ్ములతో పనిపూర్తి అయ్యింది. కానీ వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ 32అడుగుల మేర మట్టిరోడ్డు కనిపిస్తోంది. ఇప్పుడా రోడ్డులో14 టైర్ల టిప్పర్లు దూసుకుపోతున్నాయి.
పర్యావరణానికి భారీ నష్టం
దట్టమైనఅటవీ ప్రాంతంలో వేలాది గా ఎదిగిన పచ్చని వృక్షాలు,చెట్లు విచాక్షణ రహితంగా నరికేశారు.తమస్వార్ధం కోసం రిజర్వ్‌ ఫారెస్టును నాశనం చేసేశారు. అడవిని నరికే సమయంలో అడ్డోచ్చిన అటవీ జంతువు లను యంత్రాలతో నిర్ధాక్షణ్యంగా చంపేశారు. వేలాది చెట్లు నేలమట్టంచేసి పర్యావరణానికి తీవ్ర విఘా తం కల్పించారు. ఇంటి ముందు సొంతంగా పెంచుకున్నచెట్టు నరకాలంటేనే…రూల్స్‌ ఒప్పు కోవు! రిజర్వు ఫారెస్టలో చెట్టుపై గొడ్డలి వేటు వేస్తే…అదో పెద్ద నేరం! అక్కడ…కేంద్ర అను మతి లేకుండా ప్రభుత్వాలే చిన్నపని కూడా చేయలేవు. కానీ ప్రైవేటు వ్యక్తుల సారథ్యంలో కొండకోనల్లో వందలు,వేల సంఖ్యలో చెట్లను నరికేసి,రోడ్డు వేయడాన్ని ఏమనాలి? వాటి ఆన వాళ్లు లేకుండా చేశారు. దశాబ్దాల వయసున్న టేకు,నల్లమద్ది, తెల్లమద్ది వంటి వృక్షాలను కొట్టేసు కొంటూ పోయి..నెలన్నరలోనే రోడ్డు వేసేశారు. ఈ మార్గంలోని చెల్లూరు- భమిడికలొద్ది మధ్య నున్న అయిదు కిలోమీటర్ల పరిధి రోడ్డు పూర్తిగా రిజర్వ్‌ అడవే. రిజర్వు అడవి పరిధిలో అటవీ శాఖ అనుమతులు లేకుండా ఎలాంటి పనులు చేయకూడదు. కానీ ఇవేవీ పట్టించుకోలేదు. రహ దారికోసం అడ్డంగా ఉన్న టేకు,దండారి,నల్ల మద్ది,తెల్లమద్ది,తుమ్మిడి, తెల్లగర్ర వంటి విలువైన భారీ వృక్షాలను నేలకూల్చేశారు. చిన్నా పెద్దా కలిసి ఆరేడువేల చెట్లను నరికినట్లు స్థానికులు చెబుతున్నారు. వన్యప్రాణాలకు ముప్పు వాటిల్లు తుందనే స్పృహ కూడా లేకుండా అడ్డగోలుగా నేలకూల్చేశారు.పైగా కేవలం 425 మీటర్ల రిజర్వు ఫారెస్టు పరిధిలో 21చెట్లు మాత్రమే తొలగించామని చెప్పడం అతిపెద్ద వింత. నిజా నికి…రిజర్వు ఫారెస్టులో ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పని సరి. కానీ ఇక్కడ ఇవేం లేకుండా టిప్పర్లు తిరిగేస్థాయిలో30 అడుగులకు మించి రహదారి నిర్మించేశారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంతో భారీ యంత్రాలు మోహరించి ఎక్కడికక్కడ చెట్లతో పాటు కొండలను కూడా గుల్లచేసేశారు.– కొండ్రు మ‌రిడియ్య‌, అధ్య‌క్షుడు ద‌ళిత ప్ర‌గ‌తి ఐక్య‌సంఘం
జిఎన్‌వి సతీష్‌

1 2