ఏజెన్సీ స్వరాజ్య సింహం` చింతల చెరువు వెంకటాద్రి

‘‘దేవభక్తుని నందీశ్వరుడు’’ తదితరులతో కలిసి చర్లలో క్రీడా,సాంస్కృతిక, సేవా,కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది. ఆయన స్వరాజ్య, సంఘ సేవ కృషికిగాను 1982 సంవత్సరంలో నాటి మన ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాదులో సమరయోధులకు ఇచ్చే తామ్రపత్రం అందించారు. 1983 అక్టోబర్‌ 2న ‘‘మహాత్మా గాంధీ శతజయంతి సేవాసదన్‌’’ వారు మహాత్ముని జ్ఞాపికతో సత్కరించారు ‘‘ఏజెన్సీ లయన్‌’’ అనే బిరుదును ప్రదానం చేశారు. కడదాకా గాంధేయవాదంతో, ఖద్దరు వస్త్రధా రణతో, సేవ భావమే జీవనంగా బ్రతికిన ‘‘చింతలచెరువు వెంకటాద్రి’’ తన 96వ ఏట 15 జూలై 1986 న తన అభిమాన పుత్రుడు, సంఘసేవ వారసుడు, సి.వి.కె.రావు ఇంట చర్లలోని రైసుపేటలో తనువు చాలించి, మన్య ప్రాంతానికి ‘‘స్వరాజ్య పోరాట సింగమైనిలిచారు’’.

గిరిజన ప్రజలకు నెలవైన గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం ఏజెన్సీలో ఒకసాధారణ గ్రామం చర్ల. మన దేశంలో ఒకేపేరుతో అనేక గ్రామాలు ఉన్నాయి కానీ ‘‘చర్ల’’ అనే రెండు అక్షరాల పేరుతో మరెక్కడ ఒక్కగ్రామం లేకపోవడం ఒక విశేషం!! అలా ఎన్నో విశేషాలకు సాక్షి భూతమైన చర్ల ప్రాంతంలో తొలిసారిగా స్వరాజ్య ఉద్యమస్ఫూర్తిని అందించడానికి గిరిజనగ్రామాలలో కాలి నడకన,సైకిళ్లు,ఎడ్లబండ్ల, సాయంతోతిరిగి స్వరాజ్య స్ఫూర్తిని ఉద్యమ చైతన్యం నింపిన నాటి ఏజన్సీ‘‘స్వరాజ్య సింహం చింతలచెరువు వెంకటాద్రి’’.
గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా మృత్యుంజయ పురంలో ‘‘చింతలచెరువు వెంకట్రామయ్య – లక్ష్మమ్మ’’ దంపతులకు 5వ సంతానంగా 1889 నవంబరు20న వెంకటాద్రి జన్మించారు. పన్నెండేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన ఆలనాపాలనా అన్న గార్ల మీదేపడిరది, బ్రతుకుతెరువు కోసం మిత్రుల సహాయ సలహాలతో వీరి పెదనాన్న వెంకటప్పయ్య గారు భద్రాచలం డివిజన్లోని వెంకటాపురంలో 1896సంవత్సరం పట్వారి ఉద్యోగంలో చేరారు, దానితో మిగతా కుటుంబ సభ్యులంతా వెంకటాపురం చేరుకొని ఆనాటి సాధారణ ఉద్యోగాలైన పట్వారి పనులు చేస్తూ కొందరు, మరికొందరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారు. పట్వారి ఉద్యోగం చేసేవారు వ్యవసాయం చేయడం ఆ రోజుల్లో నిషేధం.
వెంకటాపురం సమీపంలోని ఆలుబాకలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్న వెంకటాద్రిగారు, సోదరుని వద్ద సాధారణ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని స్వయంకృషితో తెలుగుతోపాటు ఇంగ్లీష్‌, హిందీ భాషలు నేర్చుకొని చక్కని సాహిత్య పరిజ్ఞానం కూడా పెంచుకున్నారు. అన్నగారి సాయంతో 1908 సంవత్సరం లో కొత్తగా ఏర్పడ్డ ‘‘పడిగాపురం’’(వాజేడు సమీపంలో ప్రస్తుతం అంత రించిన గ్రామం) సర్కిల్లో ‘‘పట్వారి’’ కొలువులో చేరారు.
గుంటూరుకు చెందిన మహాలక్ష్మమ్మని పెళ్లి చేసుకున్నారు వెంకటాద్రి,ఆమె అక్క గారు ఏలూరులోని ప్రముఖ ప్రచురణ సంస్థ వెంకట్రామా అండ్‌ కంపెనీ యజమాని ‘‘ఈదర వెంకట్రావు’’ గారి భార్య, దరిమిలా వెంకటాద్రిగారి తోడల్లుడు ద్వారా సాహితీవేత్తలతో పరిచయం. సాహిత్యంపై మక్కువ పెరిగాయి. దాని ద్వారా అందిన సామాజిక స్పృహ ఆయనను జాతీయోద్యమం వైపు నడిపించింది. 1908 సంవత్సరంలో భద్రాచలం డివిజన్‌ మద్రాసు రాజధాని పరిధిలో ఉండేది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా అక్షర పరిజ్ఞానం లేక పూర్తి స్తబ్ధతతో ఉన్న ఈగిరిజన ప్రాం తంలో వెంకటాద్రి వారిని చైతన్య పరచడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఉదర పోషణ కోసం ఉద్యోగం చేస్తున్న ఆయన ఆలోచనంతా సమాజ శ్రేయస్సు కోసమే ఉండేది.
ఆ రోజుల్లో వెలువడుతున్న ఒకేఒక తెలుగు దిన పత్రిక ‘‘ఆంధ్రపత్రిక’’దానిని ఈ ప్రాంతంలో పోస్టు ద్వారా తెప్పించుకున్న ఏకైక వ్యక్తి వెంకటాద్రి, నాటి స్వరాజ్య ఉద్యమ వార్తలు నాయకుల ప్రసంగాలు, ప్రకటనలు, చదివి తాను స్ఫూర్తి పొందడం కాక గాంధీజీ పట్ల ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమంపట్ల మక్కువ పెంచుకున్నారు. గ్రామగ్రామాన తిరిగి గిరిజనులకు నాటి దేశ పరిస్థితులు,బ్రిటిష్‌ వారి అరాచకాలు వివరించేవారు. కాలక్రమేణా ఆయనకు ఉద్యోగం కన్నా సమాజ సేవే ముఖ్య మని దేశ స్వరాజ్యమే ప్రధానం అనే భావన కలిగింది, ఈయన చర్యలు ఎప్పటికప్పుడు గమని స్తుండే పైఅధికారులు అతని పై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారు. 1921 డిసెంబరులో అహ్మదాబాదులో భారత జాతీయ కాంగ్రెస్‌ ‘‘పన్నుల నిరాకరణ ఉద్యమా నికి’’ పిలుపునివ్వడంతో వెంకటాద్రి తన గ్రామ కర్నికానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి ఉద్యమంలో ప్రవేశించారు. నాటి ప్రముఖ స్వరాజ్య ఉద్యమ నాయకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతూ తన ‘‘ఉద్యమ స్నేహరాజ్యం’’ విస్తరించుకున్నారు. ఆయనలోని స్వరాజ్య కాంక్ష పట్టుదల మాట తీరు తదితర లక్షణాలు తెలిసిన దేశభక్త కొండా వెంకటప్ప య్య గారి పిలుపు మేరకు అష్టకష్టాలు పడి కాలినడకన ఇల్లందు చేరి అక్కడ నుంచి రైల్లో గుంటూరు వెళ్లి వెంకటప్పయ్య గారి నాయక త్వంలో ‘‘సహాయ నిరాకరణోద్యమంలో’’ పాల్గొన్నారు. అక్కడ టంగుటూరి ప్రకాశం, కళావెంకట్రావు,భోగరాజు పట్టాభి సీతారా మయ్య, కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, వంటి పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి. అనంతర కాలంలో వారితో కలిసి వెంకటాద్రి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. పది నెలల పాటు అక్కడే స్వరాజ్య ఉద్యమంలో గడిపి తిరిగి వెంకటాపురంచేరి తాను గుంటూరులో పొందిన ఉద్యమస్ఫూర్తితో గిరిజన గ్రామాలు తిరుగుతూ జాతీయోద్యమ అవసరాన్ని తనదైన వాక్చాతుర్యంతో ప్రచారం చేశారు.వెంకటాపురం నుంచి వి.ఆర్‌.పురం (వరరామచంద్రపురం) వరకు వెంకటాద్రి గారికి స్వరాజ్య ఉద్యమ అనుచరగణం ఉండేది. ఆ రోజుల్లో గోదావరి రేవు ప్రాంతం ‘‘దుమ్ముగూడెం’’ పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది. స్వరాజ్య ఉద్యమకారులకు అదే కేంద్రంనిలయం. ఆప్రాంతానికి చెందిన ప్రముఖ రచయిత రంగూన్‌ రౌడీ నాటకకర్త ‘‘సోమరాజు రామానుజరావు’’ భద్రాచలంకు చెందిన కురిచేటి శ్రీరామ్మూర్తి,ఆర్‌.కొత్తగూడెం చెందిన భూపతిరాజు బుచ్చి వెంకటపతిరాజు, మొదలైన వారంతా ఆయన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించే వారు. ఈ క్రమంలో వెంకటాద్రి గారి కుటుంబాలకు అనివార్య కారణాలతో చర్లకు చెందిన భూస్వామి ‘‘ముత్యాల వెంకట స్వామి’’ స్నేహం లభించింది. ఆయన సలహా మేరకు చర్లకు చేరి వ్యవసాయ భూములు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం ద్వారా జీవనం సాగించేవారు, దీనితో వెంకటాద్రి గారి స్వరాజ్య పోరాట కేంద్రం చర్లకు మారింది. ఆయన కార్య దీక్షను తెలుసుకున్న విప్లవం వీరుడు’’అల్లూరి సీతారామరాజు’’తన అజ్ఞాత పర్యటనలో భాగంగా ఒకరాత్రి చర్లకు వచ్చి తన పోరాటానికి సహకరించమని వెంకటాద్రి గారిని కోరారు, కానీతాను మొదటి నుంచి గాంధేయవాదానికి అహింస సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పి రామరాజు అభ్యర్థులను సున్నితంగా తిరస్కరించారు.1926 సంవత్సరములో మన్యం ప్రాంతపు పోలవరం గ్రామంలో ‘‘పునులూరు కోదండరామయ్య’’ నేతృత్వంలో ‘‘స్వరాజ్య ఆశ్రమం’’నెలకొల్పారు 1929 మే 9న గాంధీజీ ఆ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు వెంకటాద్రి తన అనుచరగణంతో పోలవరం వెళ్లి మహాత్ముని తొలిసారి దర్శనభాగ్యం చేసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు.
ఆ స్ఫూర్తితో ఆశ్రమం చేపట్టే ప్రతి ఉద్యమ కార్యక్రమాల్లో ఆయన పాత్ర ప్రముఖంగా ఉండేది. 1929 డిసెంబర్‌లో లాహోర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వెళ్ళిన వెంకటాద్రి అక్కడి నాయకుల ప్రసంగాలతో తనలో అచంచలమైన ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు.1930 సంవత్సరంలో గాంధీజీ ఉప్పుసత్యాగ్రహంకు పిలుపునిచ్చి దండి యాత్ర ప్రారంభించారు. సముద్ర తీర ప్రాంతాల ఉద్యమకర్తలు తమ ప్రాంతాల్లో ఉద్యమానికి మద్దతుగా ‘‘ఉప్పుతయారీలు’’ మొదలుపెట్టారు సముద్రానికి దూరంగా మన్యం ప్రాంతంలో ఉన్న వెంకటాద్రి గారికి ఏం చేయాలో అర్థంకాక చివరికి చౌడు మట్టి నుంచి ఉప్పు తీయవచ్చని ఆలోచనతో పాత చర్లలోని చెరువు దగ్గర ఆయన ఉప్పు సత్యాగ్రహ దీక్షకు శ్రీకారం చుట్టారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఈ ఉద్యమం పెను సవాలుగా నిలిచింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంకటాద్రి గారి దీక్షను భగ్నం చేసి లాఠీలతో కొట్టి చిత్రహింసలకు గురి చేసి భద్రాచలం తీసుకువెళ్లి అక్కడి నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారానికి పంపించారు. అక్కడ ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చారు. అనంతరం 1932లో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా పాల్గొని ప్రముఖ పాత్ర పోషించారు.రాజాజీ మంత్రివర్గములో మద్రాసు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం 1938 సంవత్సరంలో ‘‘జమిందారి రిపోర్ట్‌’’ తయారు చేయడానికి చర్ల వచ్చినప్పుడు ఆయన లోని కర్తవ్య దీక్షను వెంకటాద్రి ప్రత్యక్షంగా గమనించి ప్రభావితం చెందారు.
1939 సంవత్సరంలో త్రిపురలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాలకు వెంకటాద్రి హాజరయ్యారు. సుభాష్‌ చంద్రబోస్‌ను ప్రత్యక్షంగా అక్కడే దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీకి, తూర్పుగోదావరి జిల్లా కమిటీ, సభ్యులుగా ఎన్నికయ్యారు.
1942 వ సంవత్సరంలో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన మన్యం ప్రాంతానికి నాయకత్వం వహించి తన సహచరులతో కలిసి అనేక చోట్ల జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వరాజ్యఉద్యమ శిక్షణా శిబిరాలు నిర్వహించారు.
స్వాతంత్రానంతరం ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా నిస్వార్ధంగా గాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడి తాను నమ్మిన పార్టీలోనే కొనసాగి తన కార్య క్షేత్రమైన చర్ల అభివృద్ధికి తన సొంత ఆస్తులు సైతం అందించిన త్యాగశీలి, 1951 ఫిబ్రవరి 14న చర్లలో ప్రాథమిక సహకార సంఘం, స్థాపించడం శాఖ గ్రంథాలయానికి సొంత స్థలం ఇల్లు వితరణ చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేసిన త్యాగమూర్తి వెంకటాద్రి,
తన సహచరులు ‘‘దేవభక్తుని నందీశ్వరుడు’’ తదితరులతో కలిసి చర్లలో క్రీడా,సాంస్కృతిక, సేవా,కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది.
ఆయన స్వరాజ్య, సంఘ సేవ కృషికిగాను 1982 సంవత్సరంలో నాటి మన ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాదులో సమరయోధులకు ఇచ్చే తామ్రపత్రం అందించారు. 1983 అక్టోబర్‌ 2న ‘‘మహాత్మా గాంధీ శతజయంతి సేవాసదన్‌’’ వారు మహాత్ముని జ్ఞాపికతో సత్కరించారు ‘‘ఏజెన్సీ లయన్‌’’ అనే బిరుదును ప్రదానం చేశారు. కడదాకా గాంధేయవాదంతో, ఖద్దరు వస్త్రధా రణతో, సేవ భావమే జీవనంగా బ్రతికిన ‘‘చింతలచెరువు వెంకటాద్రి’’ తన 96వ ఏట 15 జూలై 1986 న తన అభిమాన పుత్రుడు, సంఘసేవ వారసుడు, సి.వి.కె.రావు ఇంట చర్లలోని రైసుపేటలో తనువు చాలించి, మన్య ప్రాంతానికి ‘‘స్వరాజ్య పోరాట సింగమైనిలిచారు’’.- డా.అమ్మిన శ్రీనివాసరాజు

గిరిజన సంప్రదాల్ని గుర్తించిన పీసా చట్టం

గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్యమైనది స్వయం పరిపాలన. ఎప్పుడో హిందు రాజులు, మొగల్‌ సామ్రాజ్యం, దాని తరువాత బ్రిటిష్‌ నైజాం నవాబుల పాలనలో స్వయం పరిపాలన అధికారాలు కోల్పోయిన గిరిజనులు నిర్విరామంగా పోరాటాలు చేస్తోనే ఉన్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం అయితే గిరిజన ప్రాంతాలను షెడ్యూలు ప్రాంతాలుగా 1874లోనే గుర్తించి సామాన్య పరిపాలన నుండి తప్పించారు. గిరిజనుల సార్వ భౌమధికారాన్ని కాలరాసేయడం వల్ల అలజడులు వస్తున్నాయని గుర్తించకపోగా హిందు రాజుల ప్రోద్భలంతో వీరు తిరుగుబాట్లు చేస్తున్నారని బ్రిటిష్‌ వారు అభిప్రాయపడ్డారు. సుమారు 150 సంవత్సరాలుగా అదే అభిప్రాయం కొనసాగుతోంది. అయితే అప్పుడప్పుడు అలజడులకు కారణాలు తెలుసుకునేందుకు కమీటీలను వేసి వాటి ద్వారా విషయాలు సేకరించేవారు. అయినా గిరిజన ప్రాంతాలను చీకట్లో ప్రాంతాలుగా చిత్రీకరించడం మానలేదు. అందువల్ల శాంతిని నెలకొల్పేందుకు పోలీసు బలగాల ఉపయోగం పెరిగింది. కాని మొదట షెడ్యూలు ప్రకారం శాంతి, సుపరి పాలన జరిగేందుకు ప్రయత్నాల చేయడం యాదృచ్చికమే! ఒకానొక సమయంలో ఐదవ షెడ్యూలు ప్రాంతంలో చాలా భాగం కల్లోలిత ప్రాంతంగా కేంద్రహోంశాఖ గుర్తించింది. మరోపక్క రాజ్యాంగం 46వ ఆర్టికల్‌ ప్రకారం గిరిజనులకు రక్షణ కల్పిస్తూ విద్య, అర్థికా భివృద్ధిని చేపట్టాలని ఉన్నా ఆచరణ మాత్రం అంతంతే. రాజ్యాంగం ఐదవ షెడ్యూలులో ప్రభుత్వ అధికారుల (గవర్నరు) ద్వారా శాంతి, సుపరిపాలన సాధించాలని నిర్దేశించినా అది సాధ్యం కాలేదు. ఎందుకంటే అధికార యంత్రాంగం తమ స్వార్థం కోసమే పనిచేసింది. అక్కడకు బదిలీ అయినవాళ్ళు చాలామంది వెళ్ళకుండా ప్రయత్నం చేసుకుంటే, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న సంసారాన్ని చెడగొట్టేరు. ఫలితంగా గిరిజనులకే శిక్షపడిరది. ఇదంతా వివరంగా చర్చించిన తరువాత పంచాయితీ రాజ్‌ వ్యవస్థలో గిరిజన ప్రాంతాలలోని పంచాయితీలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని 1992 లో నిర్ణయం జరిగింది.
వారి ప్రపంచం వేరు
73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీ రాజ్‌ చట్టం, 1992 తీసుకు వచ్చేటప్పుడు ఈ చట్టం షెడ్యూలు ప్రాంతాలకు యధాతధంగా అమలు చేయరాదని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాలలో స్వయం పాలనా వ్యవస్థ, ముఖ్యంగా సామాజిక వ్వవహారాల్లో ఇంకా పటిష్టంగానే ఉందనే విషయాన్ని గుర్తించారు. అయితే బయటి ప్రపంచంతో సంబంధాలు ఎక్కువ అవుతున్న సందర్భంలో ఉత్పన్నమౌతున్న సవాళ్ళను మాత్రం సాంప్రదాయక వ్యవస్థ ఎదుర్కోలేక పోతోంది. అందువల్ల షెడ్యూల్‌ ప్రాంతాలలో ఎన్నుకోబడిన పంచాయితీలకు అధికార వికేంద్రీకరణతో పాటు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని కూడా ఆలోచించారు. షెడ్యూలు ప్రాంతంలోని పంచాయితీలకు ఏ ఏ ప్రత్యేక అధికారాలు ఇవ్వాలో నిర్ణయించేందుకు దిలీప్‌ సింఫ్న్‌ ఛూరియా నాయకత్వంలో ఒక కమీటీని నియమించారు. ఈ కమీటీలో గిరిజన ప్రాంతాలలో చాలా కాలం పనిచేసిన నిష్ణాతులు ఉన్నారు.షెడ్యూలు ప్రాంతాలలో పంచాయితీలకు ప్రత్యేక అధికారాలపై ఎన్నో సూచనలు ఇచ్చేరు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు వీటిలో కొన్నింటినే ప్రభుత్వం ఆమోదించి 1996లో కేంద్ర పీసాచట్టం (40వ ఏక్టు 1996)రూపంలో పార్లమెంటు ఆమోదం పొందింది. కేంద్రచట్టం అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ (సవరణ) చట్టం 1998లో వచ్చింది. ఈ చట్టం అమలుకు కావలసిన రూల్సు 2011 సంవత్సరంలో అంటే 13 సంవత్సరాల తరువాత వచ్చాయి. రాజ్యాంగ సవరణ 1992లో జరిగితే పీసాచట్టం అమలుకు కావలసిన మార్గదర్శకాలు (రూల్సు) వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో 19సంవత్సరాలు పట్టింది. డిల్లీ నుండి హైదరాబాదుకు అంతదూరమా? 2011లో రూల్సు వచ్చేసరికి పంచాయతీలు గడువు కాలం తీరింది. 2014లో పంచా యితీ ఎన్నికలు అయినా కనే పీసా పంచాయ తీలు పనిచేసే అవకాశం కలిగింది. పీసా పంచాయతీలను రూల్సు ప్రకారం ప్రకటించవలసిన భాద్యత గిరిజన సంక్షేమశాఖది. దీనికి జిల్లా కలెక్టరు దగ్గరనుండి ప్రతిపాదనలు రావాలి. దీనికోసం మరింత జాప్యం జరిగింది. ప్రభుత్వంలో కొంత మంది విజ్ఞులు ఉంటారు. ఏదైనా పనిచేయకూడదు. అని వారు అనుకుంటే జాప్యం చేస్తే సరి అనే విధానం పాటిస్తారు. పంచాయితీలకు ఇవ్వవలసిన అధికారాలు అన్నీ ఇప్పటికే కొన్ని డిపార్టుమెంటు అధికారులు అనుభవిస్తున్నారు. లాభడుతున్నారు. కూడా. అందువల్ల అధికారాలు బదలాంచడాన్ని ఇష్టపడరు. అలాగని చట్టం అమలు చేయకపోతే ఇబ్బందుల్లో పడతారు. కాలయాపనే మార్గంగా ఎంచుకుంది అధికార వ్యవస్థ. సరే, చట్టం ప్రకారం పంచాయతీలకు సంక్రమిస్తున్న అధికారాలు ఏమిటి? అనేది క్లుప్తంగా తెలుసుకుందాం.
ఆదివాసీ పంచాయితీ అధికారాలేమిటి?
అన్నిటికంటే ముఖ్యమైనది ‘పీసా గ్రామం’ నిర్వచనం. గిరిజనుల ఆచారాల ప్రకారం గుర్తించబడి, వారే పాలన చేసుకునే ప్రాంతాలు: ఆవాసం/శివారు గ్రామాలు/ సముదాయాల పీసా గ్రామాలుగా గుర్తించాలి. అంటే ప్రతి ఆవాసానికి గ్రామ సభ ఉంటుంది. ఇంతకు ముందు గ్రామసభ పంచాయితీ ముఖ్య గ్రామానికే పరిమితం అవుతోంది. ఆ పంచా యితీలో నున్న శివారు గ్రామాలకు ప్రాతినిధ్యం కాగితాలకే పరిమితం రెండవది, అంతే ముఖ్యమైనది పాలనా వ్యవస్థ. గ్రామపంచాయితీ పాలన వారి ఆచార వ్యవహారాలను, సాంస్కృతిక ప్రత్యేకతను రక్షిస్తూ తదనుగుణంగా పరిపాలన చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు వ్యతిరేకంగా ఈ పాలన ఉండకూడదు. గిరిజన సంస్కృతికి, చట్టాలకు మధ్య సంఘర్షణ ఉన్నప్పుడు చట్టాలదే పైచేయి అవుతుంది. అటువంటప్పుడు గిరిజన సంప్రదాయక చట్టాలు పనికిరావు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గిరిజన సంప్రదాయక పరిపాలనా వ్యవస్థను క్రోడీకరించలేదు. అందువల్ల న్యాయవ్యవస్థ గుర్తించదు. ఒడిసా రాష్ట్రంలో నియామ్‌గిరి కొండల్లో బాక్సైటు గనులకు వేదాంతా (బహుళదేశ) కంపెనీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నివసించే డోంగ్రియా ఖోండులు అనే చాలా వెనుకబడిన గిరిజన తెగవారు అభ్యంతరం తెలిపారు. ఆ కొండల్లో తమ ఆరాధ్య దైవమైన నియామ్‌గిరి రాజు నివసిస్తాడని, బాక్సైటు గనులు త్రవ్వటం వల్ల గిరిజన వ్యవస్థ దెబ్బతింటుందని గ్రామ సభ తీర్మానం ద్వారా తెలిపేరు. దాంతో బాక్సైటు గనుల త్రవ్వకం ఆపేసింది సుప్రీంకోర్టు. అందువల్ల పీసా చట్టం వల్ల గిరిజన సంప్ర దాయాలను కాపాడుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోవాలి. షెడ్యూలు ప్రాంతాలలో గ్రామసర్పంచులు మండల అధ్యక్షులు గిరిజనులే ఉండాలని, పీసా చట్టంలో ఉందికాని ఎం.పి.టి.సి, జెడ్‌.పి.టిసి వ్యవస్థ దీన్ని దెబ్బతీస్తోంది. గ్రామ ప్రణాళిక తయారు, అమలు, పర్యవేక్షణ, లబ్దిదారుల ఎన్నిక గ్రామ సభదే. అయితే బయటి వారి ప్రమేయం ఎక్కువగానే కనిపిస్తుంది. దీనికి తోడు అధికారుల దొంగ లెక్కలు కలుస్తే అబ్దిదారులు జాబితా తప్పులు తడకలే. షెడ్యూలు ప్రాంతాలలో భూసేకరణ, పునరావాస ప్రణాళిక, అమలులో గ్రామసభ, ఆ పై పంచాయితీ రాజ్‌ వ్యవస్థల ఆమోదం ద్వారానే జరగాలి. అసలు సంప్రదింపులు కూడా జరగని సందర్భాలు చాలా ఉన్నాయని గిరిజన ప్రజాసంఘాలు చెబుతాయి. షెడ్యూలు ప్రాంతంలో భూమి అన్యాక్రాంతం కాకుండా చూడడం, ఇంతకుముందు అన్యాక్రాంతం అయిన భూమిని గిరిజనులకు తిరిగి ఇప్పించటం లాంటివి చేపట్టేందుకు గ్రామసభకు అధికారాలు ఉన్నాయి. అయితే చట్టం అమలు పరిచే స్థోమత గ్రామసభలకు కల్పించలేదు, చాలాచోట్ల అవగాహనేలేదు. చిన్నతరహా అటవీసంపదపై ఆస్థిహక్కు, మార్కెట్టుపై అజమాయిషీ కూడా గ్రామ సభకు ఉన్నాయి. కాని జి.సి.సి అటవీశాఖలకు కూడా ఈ హక్కులు ఇంకా ఉన్నాయి. గ్రామ సభలకు ఈ వ్యవస్థలను వ్యతిరేకించే స్థోమత లేదు. వడ్డీ వ్యాపారం నియంత్రణకు కూడా గ్రామసభకు అధికారం ఉంది. కాని బ్యాంకులు పనిచేయని చోట్ల వడ్డీ వ్యాపారులే దిక్కు అయినప్పుడు ఈ అధికారం చలాయించడం కష్టమే. ఇక స్థానిక సంస్థలు అధికారులపై అజమాయిషీ హక్కులు ఉన్నా వారిని నియంత్రించే స్థోమత గ్రామ పంచాయితీలకు లేదు. ఉద్యోగులకు బలమైన సంఘాలు ఉన్నాయి. గిరజన పంచాయితీ గ్రామసభలను చైతన్య పరిస్తేనే స్వపరిపాలన సాధ్యం. ఆలోచించండి.
స్వపరిపాలన వారి సంస్కృతికి మూలం
వాడుక భాషలో గిరిజనులు అని పిలువబడే వారిని రాజ్యాంగపరంగా షెడ్యూలు తెగలు అని పిలుస్తారు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు గిరిజనుల్ని వివిధ పదాలతో పిలిచేవారు. వనవాశి, గిరిజన్‌, ఆదిమజాతి లాంటి పదాలు ఉపయోగించేవారు. పురాణాలలోను, ఇతిహాసాలలోను గిరిజనుల గురించి ముఖ్యంగా దండకారణ్యం గురించి వివరాలు ఉన్నాయి. గిరిజనుల నాగరికత చాలా పురాతనమైనది. వారికి రాజ్యాలు ఉండేవి. కోటలు ఉండేవి. వారికి భాష ఉంది. సంఖ్యా పరిజ్ఞానం, మాసాలు, ఋతువులు లాంటి లెక్కలు కూడా ఉన్నాయి. సాహిత్యం, సంగీతం, వాయిద్య సహకారం అత్యున్నత స్థాయికి చేరుకుంది. స్వపరిపాలన వారి సంస్కృతికి మూలాలు చాలా గిరిజన సంస్కృతి లో కనిపిస్తాయి. అయితే కాలక్రమేణా వారి రాజ్యాలు, హిందూ రాజులు, మొగలులు, నిజాములు, బ్రిటిష్‌వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వారి జీవన విధానానికి తీవ్రమైన ఇబ్బందులు కలిగాయి.1901 జనాభా లెక్కల నాటికి బ్రిటిష్‌ ప్రభుత్వం గిరిజనుల్ని ‘ఏనిమిస్ట్‌’ లుగా పిలిచేవారు. కాని అప్పటి జనాభా కమిషనర్‌ అయిన శ్రీ హట్టన్‌, ఏనిమిస్ట్‌లను హిందువుల నుంచి నేరుగా పరిగణించటం కష్టం అవుతోందని వర్ణించారు. అయితే గిరిజన ప్రాంతాలు మాత్రం మిగిలిన ప్రాంతాలకంటే భిన్నంగా ఉంటాయని, వాటి పరిపాలన సామాన్య పరిపాలనతోటి కలపరాదని భావించి, బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయా ప్రాంతాలను షెడ్యూలు జిల్లాలుగా 1874లోనే ప్రకటిం చారు. అలాగే హైదరాబాద్‌ ప్రభుత్వం 1949 లో నోటిఫైడ్‌ ప్రాంతాలుగా గుర్తించింది. బ్రిటిష్‌వారు వీరిని హిల్‌ట్రెబ్స్‌ అనిపిలిస్తే, హైదరాబాద్‌ ప్రభుత్వం నోటిఫైడ్‌ ట్రెబ్స్‌గా పిలిచారు. వారి భూమి రక్షణకై చట్టాలు కూడా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ముఖ్యంగా 1960నుంచి గిరిజనులు నివసించే మారుమూల కొండ ప్రాంతాలు రోడ్లతో కలుపబడ్డాయి. బయటి ప్రాంతాల ప్రజలు మొదటి వ్యాపారానికి వచ్చి, తరువాత వ్యవసాయానికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకు న్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు అమ ల్లోకి వచ్చాయి. గిరిజన సంతలు- బయటి మార్కెట్టు ప్రభావానికి లోనయ్యాయి. భారత రాజ్యాంగంలో 366 ఆర్టికల్‌లో షెడ్యూలు తెగల గురించి నిర్వచించడం జరిగింది. రాజ్యాంగంలో 342 ఆర్టికల్‌ ప్రకారం రాష్టప్రతి ప్రకటించిన గిరిజన తెగలు కాని, సమాజాలు కాని, వాటిలో భాగాలు కాని, గిరిజన తెగలు గుంపులను షెడ్యూలు తెగలుగా గుర్తిస్తారు. కొన్ని తెగలను ఈ లిస్టులో చేర్చడానికి కానీ, తీసివేయడానికి కాని పార్లమెంట్‌కు అధికారం ఉంది. వీరిని రాజ్యాంగపరంగా షెడ్యూలు తెగలు అంటారు. కేంద్ర గిరిజన సంక్షేమశాఖ వారి లెక్కల ప్రకారం దేశంలో 50 షెడ్యూలు తెగలు వున్నాయి. వారిలో 75 షెడ్యూలు తెగలు, ఇంకా పురాతన సాంకేతిక స్థాయిలో ఉండి ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి వున్నాయి. వారిని పి.టి.జి. (ప్రిమిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్సు)గా పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 10.42 కోట్ల షెడ్యూలు తెగల జనాభా ఉంది. అది దేశ జనాభాలో 8.6 శాతం. మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఈశాన్య భారతదేశంలో షెడ్యూలు తెగల జనాభా సాంద్రత ఎక్కువగా వుంది. దేశంలోని గిరిజన జనాభాలో 89.96 శాతం గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారు.ఏదైనా తెగను కాని, భాగాన్ని కాని, సముహల్ని కాని షెడ్యూలు తెగలుగా గుర్తించేందుకు లోకూర్‌ కమిటీవారు కొన్ని ప్రామాణికాల్ని నిర్ధేశించారు. అవి (1) అతి పురాతన సాంకేతిక విధానం (ఆహార సేకరణ, పోడు వ్యవసాయం), (2) ప్రత్యేక సంస్కృతి (్భష, ఆచారాలు, నమ్మకాలు, కళలు లాంటివి), (3) ప్రత్యేక నైవాశిక ప్రాంతం (అడవి, కొండలు లాంటివి), (4) బయటివారితో కలవడానికి ఇష్టపడకపోవడం, (5) బాగా వెనుకబడి వుండటం (మానవా భివృద్ధి సూచికలు- విద్య, ఆరోగ్యం, ఆదాయం లాంటి వాటివి) ఆర్టికల్‌ 244 (1) ప్రకారం రాష్టప్రతి షెడ్యూలు ప్రాంతాలను ప్రకటిస్తారు. గిరిజనుల సాంద్రత ఎక్కువగా వున్న ప్రాంతా లు, పరిపాలన సౌలభ్యం ఉండే ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాలను షెడ్యూలు ప్రాంతాలుగా గుర్తిస్తారు. అయితే భారత రాజ్యాంగం రాకముందే ఉన్న ఏజెన్సీ ప్రాంతాలే రాజ్యాంగం తరువాత ఇంచుమించుగా షెడ్యూ లు ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది.- తేజావత్‌ నందకుమార్‌ నాయక్‌

ఖరీఫ్‌ సాగు`మెలకవలు

రోహిణిలో రోళ్ళ పగిలే అన్న సామెతను నిజం చేస్తూ, వేసవి (ఎండాకాలం) వెళ్ళిపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో భానుడు భగ్గుమని 48 డిగ్రీల ఉష్ణవ్రతాపాన్ని చూపాడు. వర్యావరణం అతలాకుతలమై భూతాపం ఏ స్థాయికి చేరిందో మనం అనుభవించాం. అంతలోనే ప్రతీ చినుకు ముత్యంగా మెరుస్తూ కొంగొత్త ఆశల ఊసులను మోసుకొచ్చింది. ప్రకృతి మాత పచ్చని పచ్చిక బయళ్ళ చీరలో సింగారించుకొని రైతుల ముగింట్లో దర్శనమిచ్చింది. వేసవి ముగిసీ ముగియగానే కాస్త కునుకుపాటు తీస్తున్న రైతన్న ఒక్కసారి మళ్ళీ భూమాతకు భూరి దండాలు పెట్టుకొని వానాకాలం పంటల సాగుకు సర్వసన్నద్దమయ్యాడు. వేసవి దుక్కుల వలన చేలల్లో, చెలకల్లో నీరు ఇంకి తేమ నిలువ ఉండి విత్తనం విత్తడానికి, మొలకెత్తడానికి అనువుగా మారింది.

నాణ్యమైన విత్తనం విత్తి,నమ్మకమైన దిగుబడి సాధించే దిశగా రాష్ట్ర వ్యవసాయశాఖ క్షేత్ర స్థాయిలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. వరి,మొక్కజొన్న జొన్న పెసర, కంది,సోయాచిక్కుడు విత్తనాలను సుమారు 6 లక్షల క్వింటాళ్ళు రాయితీపై పంపిణీ చేసింది.
సేంద్రీయ ఎరువులు
నారుమడులు పోయాలనుకున్న భుములకు వేసవి దుక్కికి ముందుగానే హెక్టారుకు 5-10 టన్నుల పశువుల ఎరువును వేయాలి, నారు మడులను పోయడానికి పొలంలో 10వ భాగాన్ని ఎంపిక చేసుకోవాలి.ఎ0పిక చేసుకున్న పొలానికి 5-10 సె0.మీ.నీళ్ళు పెట్టిబాగా కలియ దున్నాలి.తరువాత మట్టెగడ్డలన్ని మెత్తగయ్య్లోలా బాగా దమ్ము చేయాలి. బాగా దమ్ము చేసిన తరువాత పొలం నుండి కలుపు మొక్కలు లేకుందా జాగ్రత్త పడాలి.
విత్తన మోతాదు
నాటే పద్ధతికి 20-25 కిలోలు,వెదజల్లటానికి (గరువు) భూముల్లో) 24-30 కిలోలు, వెద జల్లటానికి (గోదావరి జిల్లాల్లో) 16-20 కిలోలు,గొర్రుతో విత్తటావికి (వర్షాధారపు వరి) 30-36 కిలోలు, శ్రి పద్ధతిలో 2 కిలోలు సరి పోతుంది.
విత్తన శుద్ది
కిలో విత్తనానికి 2.5గ్రాముల కార్చండజిమ్‌ కలిపి 24గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి. దంప నారుమళ్ళ కైతే లీటరు నీటికి ఒక గ్రాము కార్బండజిమ్‌ కలిపి, ఆ ద్రావణంలో విత్తనాలను 24 గ0టలు నానబెట్టీ ,24 గంటలు మ0డెకట్టీ మొలకలను ద0ప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్త నాలు నానబెట్టడానికి లిటరు మందు నీరు సరిపోతుంది. పది లిటర్ల నీటికి 1.5 కిలోల ఉప్పు కలుపగా వచ్చిన ద్రావంలో ఎ0పిక చేసు కున్న విత్తనాన్ని పోసి పైకి తేలిన తాలు విత్తనా లను తీసివేయాలి. ఉప్పునీటిలో మునిగిన గట్టీ విత్తనాలను నారు పోయడానికి వాడుకోవాలి. మడిలో చల్లే ము0దు 24గంటల పాటు మంచి నీటిలో విత్తనాలను నానబెట్ఠాలి. విత్తనాల ద్వారా సంక్రమి0చే లెగుళ్ళ నివారణ కోస0 కిలో విత్తనానికి 3 గ్రా. దైరమ్‌ లేదా కాప్టాన్‌ మందును కలిపి విత్తన శుద్ది చేయాలి. నారు మడిలో చల్లేము0దు మొలకెత్తిన విత్తనాన్ని 0.2 శాత0 క్లోరిప్రేరిఫాస్‌ ద్రావణంలో నాసబెట్టీ చల్లుకోవాలి. దీనివల్ల నారుమడిలో ఆకు తినే పురుగులు,ఉల్లికోడు,మొవ్వపురుగు ఆశించకుండా ఉంటాయి.
నారుమడి
దమ్ము చేసిన నేలను 10మీ.పోడవు ఒకమీ. వెడల్పుతో నారుమడిని చేసుకోవాలి. నారు మడిలోని నీరు పోషకాలు బయటపోకుండా ఉండేలా గట్లు వేసుకోవాలి. గట్ట్లును సమంగాను గట్టిగాను పోయాలి.మడిలో చెతాచెదారం లేకుండా జాగ్రత్తపడాలి. నారుమడి బురద పదునులో ఉండాలి.నారుమడులు ఎత్తుగా ఉండేలా జాగ్రత్తపడాలి. రెండు మడుల మధ్యలో 20సెం.మీ వెడల్పులో కాలువ తీయాలి.కాలువలోని మట్టిని తీసి మడిలో వేసి నారుమడిని ఎత్తుగా చేసుకోవాలి. నారుమడి మొత్తం చదునుగా ఉండాలి.
సస్యరక్షణ
విత్తిన 10రోజులకు కార్బోఫ్యూరాన్‌ 3జి గుళి కలు సెంటు నారుమడికి 160గ్రా చొప్పున వేయాలి లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6మి.లి లేక క్లోరిఫైరిఫాన్‌ 2.0మి.లి.లీటరు నీటికి కలిపి విత్తిన 10రోజులకు మరియు 17రోజులకు పిచి కారి చేయాలి లేదా నారు తీయటానికి 7 రోజు ల ముందు సెంటు నారుమడికి 160 గ్రా కార్బోఫ్యూరాన్‌ గుళికలు తక్కువ నీటిలో వేయా లి జింకు లోపాన్ని గమని లీటరు నీటికి 2గ్రా జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారి చేయాలి. చలిఎక్కువగా ఉండే దాళ్వా వరి సాగులో జింకులోప లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి.
నాటు
నారు తీసేటపుడు మొక్కలు లేతాకుపచ్చగా వుంటీనే మూన త్వరగా తిరుగుతుంది. నాలుగు నుండి ఆరుఆకులున్ను నారును ఉపమోగిం చాలి.ముదురు నారును నటితే దిగుబడి తగ్గు తుంది. నాటు నాటితే పిలకలు ఎక్కువగతొడిగే అవకాశముంది. నట్టువేసేతప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీప్‌లోచ/మీ/కు 33 మూనలు, రబీలో 44 మూనలు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండుమీటర్లకు 20సెం.మీ.బాటలు తీయటం వలన ఫైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడిపిడాల ఉదృతి కొంతవరకు అదుపుచేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు,కలుపు మందులు వెయ టానికి ఇంకా ఫైరు పరిస్ధితిని గమనించటానికి ఈ బాటలు బాగా ఉపమోగపడతాయి. వరిరకాల కలపరిమితిని బట్టి కుదుళ్ళు సంఖ్య ను నిర్దారించాలి. భూసారం ఎక్కువ ఉన్న పోలాల్లో తక్కువ కుదుళ్ళు ,భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేటట్లు నాటాలి. ముదురు నారు నా టిన పుడు కుదుళ్ళు సాంఖ్యను పెంచి,దగ్గర దగ్గరగా,కుదురుకు 4,5 మొక్కలు చొప్పున నాటు వేయాలి. అలా ముదురు నారు నాటి నాపుడు నత్రజని ఎరువును మూడు దఫాలుగా గాక,రెండు దఫాలుగా-అంటే 70శాతం దమ్ము లోను మిగితా30 శాతం అంకురం దశలోనూవాడాలి.
పచ్చిరోట్టి పైర్లు
వరి మగాణుల్లో అపరాలు,జిలుగు ,జను ము,పిల్లిపెసర లాంటి ప్చ్చిరోట్టి పైర్లను వంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరుగుడమే కాక సుమారు 20-25శాతం నత్రజని, భాస్వీ రం,పొటాష్లను కూడాఅదా చేయవచ్చు.
సేంద్రియ ఎరువులు
పశువుల ఎరువు,కంపోషు,కోళ్ళు ఎరువులను ,రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25 శాతం వరకు నత్రజనిని అదా చేయవచ్చు.
రసాయనిక ఎరువులు
భూసారాన్ని బట్టీ రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయంచి నత్రజని, భాస్వరం, ఫొటాష్‌, జి0కు నిచ్చే ఎరువులను సమతు ల్యంగా వాడాలి. నత్రజనిని కాంప్లేక్సు ఎరువుల రూపలలోగాని, యూరియా రూపలలో గాని వాడపచ్చు. నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి, నాటుటకు ముందు దమ్మలోను దుబ్బుచేసే దశలోను, అంకురం దశలోను, బురదపదనులో మాత్రమే సమాన0గా వెదజలల్లి 36-48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్ఠాలి. 50 కిలోల యూరియాకి 10కిలోల వేపపిండి లేక 250 కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి, 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లీతే సత్రజని విని యోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరు వును దమ్ములోనే వేయాలి. పొటొష్‌ ఎరువులను రేగడి నేల్లలో ఆఖరి దమ్ములో పూర్తీగా ఒకేసారి వేయాలి-చల్క (తేలిక) భూముల్లో ఆఖరి దమ్ములో సగం. అకురం ఏరఎడు దశలో మిగతా సగాన్ని వేయాలి.కాంప్లేక్స ఎరువులను ఫైపాటుగా దుబ్బు చేసే సమయంలలో గాని, అంకురం ఏర్చడే దశలోగాని వేయకూడదు. దమ్ములోనే వేయటం మంచిది.
వేప పిండి
50కిలోల యూరియాకి10 కిలోల వేపపిండి లేక 250కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి,2రోజులు నిల్వ ఉంచివెదజల్లితే నత్రజ నిన వినియోగం పెరుగుతుంది.
నీలి ఆకుపచ్చ శైవలాలు – నాచు
వీటిని వరి పొలంలో వేసి ఎకరాకు 10కిలోల నత్రజని పైరుకురు అందుతుంది. నాచు నేలలో కలిపి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడి చేసి వరినాట్లు వేసిన 10-20 రోజుల మధ్య మడిలో పలుచగా నీరు నిలువ గట్టీ ఎకరాకు 4కిలోల నాచుపొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమాసంగా పడేటట్టు చల్లాలి.
సామగ్ర పోషక యాజమాన్యం
భూసార వరిరక్షణకు, ఉత్పత్తి స్తబ్దతను అధిగమమించటానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ లేదా జీవన ఎరువులను వాడి, ప్తెరుకు సమతుల్యంగా పోషక పదార్దాలను అందజేయాలి. పశువుల ఎరువు, కంపోషు. కోళ్ళ ఎరువులను,రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25శాతం వరకు నత్రజనిని ఆదా చేయవచ్చు. వరి మాగాణురల్లో అపరాలు,జీలుగు,జనుము, పిల్లెపెసర లాంటి పచ్చిరొట్ట ప్తెర్లను పెంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరగడమే కాక షుమారు 20-25శాతం నత్రజని, భాస్వర,పొటొష్‌లను కూడా ఆదా చేయ వచ్చు.
-గునపర్తి సైమన్‌