వాక్సిన్‌పై అవగాహన

కరోనా కట్టడికి ఏకైక మార్గంగా భావిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే,వ్యాక్సిన్లపై ఎన్నో అనుమానాలు, సందేహాలు రాజ్యమేలుతున్నాయి. కొంత మంది ఫేక్‌ప్రచారం వల్ల ప్రజలు వాక్సిన్‌ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దేశంలో కరోనా కట్టడికి, ప్రభుత్వ లక్ష్యానికి ఇది అడ్డంకిగా మారింది. అందువల్ల, గ్రామీణ ప్రాంతప్రజల్లో వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు ముందుకొస్తున్నారు కొందరు సామాజిక కార్యకర్తలు. తాజాగా,తమిళనాడుకు చెందిన ఒకయువకుడు తన గ్రామప్రజలకు వాక్సిన్‌పై అవగాహన పెంచేందుకు నడుం బిగించాడు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఒక బహుమతి ఇస్తూ, ఎక్కువ మంది ప్రజలు టీకాలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాడు. కల్లకూరిచి జిల్లాలోని ఉలుందూర్పేట గ్రామానికి చెందిన ఆర్‌. తంబిదురై అనే స్టూడియో ఫోటోగ్రాఫర్‌,సామాజిక కార్యకర్త ఈకార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

వ్యాక్సిన్‌ ప్రక్రియలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు తన గ్రామానికి రాగా.. ప్రజల్లో అవగాహన లేక ఎవరూ వాక్సిన్‌? తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీన్ని గ్రహించిన తంబిదురై తన గ్రామ ప్రజలను వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ప్రోత్సహించాలనుకున్నాడు. వెంటనే తంబిదురైకి ఒక ఆలోచన వచ్చింది. ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఫ్రీగిఫ్ట్‌ స్కీమ్‌ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఫ్రీ గిఫ్ట్‌లు కొనుగోలు చేసేందుకు తన సొంత డబ్బు ఖర్చు చేస్తున్నాడు. ఆయన తీసుకున్న చొరవ ఇప్పుడు సత్ఫలితాలనిస్తోంది.

ఈకార్యక్రమంపై తంబిదురై మాట్లాడుతూ‘‘కోవిడ్‌-19సెకండ్‌ వేవ్‌ విజృంభనతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాకట్టడికి సంజీవనిలా భావిస్తున్న వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మా గ్రామానికి సమీపంలో టీకా డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. కానీ గ్రామస్థుల్లో అవగాహన లేకపోవడం వల్ల వాక్సిన్‌ తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో వారిని ప్రోత్సహించేందుకు నా సొంత ఖర్చులతో బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. టీకాలు తీసుకున్న వారికి వంట పాత్రలు వంటి బహుమతులను అందజేస్తున్నా. దీనివల్ల ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్‌? తీసుకునేందుకు ముందుకొస్తున్నారు’’ అని అన్నాడు. ఫ్రీగిఫ్ట్‌లు అందజేస్తుండటంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు టీకా తీసుకొని నా నుండి బహుమతి వస్తువులను అందుకున్నారని సంతోషం వ్యక్తం చేశాడు.

యువకున్ని ప్రశంసిస్తున్న గ్రామస్థులు..
కాగా,మొదటి రోజుటీకా తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అయితే, రెండో రోజు మాత్రం తంబిదురై చొరవతో 94మందికి టీకాలు తీసుకునేందుకు ముందుకొచ్చారు.తంబిదురై అవిశ్రాంతంగా పనిచేస్తున్నందున గ్రామస్థులు,వైద్యులు, ప్రంట్‌ లైన్‌ వారియర్స్‌, స్వచ్చంద సంస్థలు ఆయన్ను ప్రశంసించారు.కోవిడ్‌-19పై పోరాటంలో యువతది చాలా కీలక పాత్ర. ప్రజల్లో ఉన్న అపోహలు,అనుమానాలు తొలగించి వారిని వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రోత్సహించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.-రెబ్బాప్ర‌గ‌డ ర‌వి

గిరిజనుల కాలికింద కాజేసే ప్రయత్నం?

గిరిజనులు తమ హక్కుల కోసం నినా దించిన మహత్తరమైన రోజుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. గిరిజన స్వయం నిర్ణయక హక్కు వివక్ష నుండి స్వేచ్ఛ భూమి ఇతర వనరులపై హక్కులు, గిరిజనుల సాంప్రదాయ,భాషాసంస్కృతి, విశిష్టత, విద్యా, వైద్యం, సమాచార, శ్రమ హక్కులు, అభివృద్ధి ఇతర ఆర్థిక సాంఘిక హక్కులతో పాటు గిరిజనులకు ఎదురవ్ఞతున్న ముప్పుల నుండి రక్షిం చాలనే అంశాలపై అన్ని దేశాలకు ఐక్యరాజ్య సమితి ఈ తీర్మానంలో పేర్కొన్నది. వీటిని గుర్తించాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్ఞన్న హక్కులను కాలరా యడానికి పూనుకుంటున్నాయి. ప్రభుత్వ విధానాల మూలంగా గిరిజనులు అడవ్ఞల నుండి బలవం తగా గెంటివేయబడుతున్నారు. లక్షలాది ఎకరాల గిరిజనుల భూములు అన్యాక్రాంతం అవ్ఞతున్నాయి.
అభివృద్ధి పేరుతో గిరిజన ప్రాంతాల్లో నిర్మి స్తున్న భారీ ప్రాజె క్టులు,పోలవరం వలన వేలాది గిరిజన గ్రామాలు లక్షలాది మంది గిరిజ నులు భూమితో పాటు సర్వ స్వం కోల్పతున్నారు. గిరిజనులకు విద్యా,వైద్యం,విద్యుత్‌,రోడ్లు, మంచినీటి వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవ్ఞ తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గిరిజనుల జీవిత విధానంలో సారుప్యత కనిపిస్తుంది. ఏ ప్రాంతం లోను కలవిడిలేని ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయం గిరిజనులది. భూమి అటవి వనరులపైనే గిరిజనుల సంస్కృతి,సాంప్రదాయం తమ చుట్టూ ఉన్న అడవి వనరులతోనే పెనవేసుకోని ఉంటాయి ప్రపం చంలోని 90శాతం వరకు గిరిజను లు అటవీ ప్రాంతాలలో వ్యవసాయం,వేట,అటవీ ఉత్పత్తు లపైనే ఆధారపడి జీవిసున్నారు. ప్రపంచంలోని గిరిజనుల సాధక,బాధకాలు తెలుసుకొనుటకు ఐక్యరాజ్య సమితి 1982లో ఒకకమిషన్‌ ఏర్పాటు చేసారు. గిరిజనులస్వయం,పరిపాలన హక్కు సంస్కృ తి,సాంప్రదాయాలు,భాష కాపాడే హక్కు, ఇతర ప్రజలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీన పరుచుకునే హక్కు, సంఘనిర్మాణం చేసుకొనే హక్కు, భూమిని, ప్రకృతి వనరులను స్వయంగా సర్మించు కునే హక్కును, భూమిపై గిరిజన తెగల యాజ మాన్యం పోకుండా చూసే చట్టాలను చేయవలసి నదిగా ప్రభుత్వాలను కోరేహక్కు,చట్టాల రూపకల్ప నలో గిరిజన తెగలకు కూడా తగు ప్రాతినిధ్యం కల్పించే హక్కు, ప్రభుత్వాల నుండి రాయతీలు పొందే హక్కు, ఐక్య రాజ్యసమితిలో గిరిజన తెగ లకు సభ్యత్వం కలిగివ్ఞండే హక్కు వివిధ దేశాలలో గిరిజన తెగలపై సాగుతున్న హింసాకాండను నిలిపి వేయటం వంటి హక్కులను రాజ్యాంగం కల్పిం చింది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల మనుగడే ప్రశ్నారక్ధంగా మారుతుంది. షెడ్యూల్డు ప్రాంతా లలో స్వయం పాలన లేకుండా అభివృద్ధి పేరుతో గిరిజనుల ను అడవ్ఞలనుండి తరిమివేసే విధానాన్ని ప్రభుత్వాలు అనుసరి స్తున్నాయి. అటవీ ప్రాంతా లలో ఖనిజ నిక్షేపాలే గిరిజనుల పాలిట శాపాలౌ తున్నాయి. గిరిజనులను బలి పశువులను చేసి అటవి సంపదను కొల్లగొట్టే కార్పొరేట్‌ శక్తులు చట్టా లను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అటవి,ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు, వ్యక్తులకు కట్టబెట్టేందుకు గిరిజన చట్టాలను తుంగ లో తొక్కుతున్నారు. ప్రభుత్వాలకు గిరిజనుల పట్ల చిత్తశుద్ది ఉంటేవారి హక్కులను గౌరవించాలి, పరిరక్షించాలి. గిరిజనుల సంస్కృతికి, వారి జీవన విధానానికి వారిని దూరం చేయ కుండా స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి.గిరిజనుల ఆర్ధిక,సామాజిక పునాదు లపైవారి అభివృద్ధిసాగాలి.గిరిజనుల ప్రాం తానికి సంబంధించిన ఏనిర్ణయాలు తీసుకున్న వారి ప్రత్యేక గిరిజన సలహామండళ్ల అంగీకారం తప్పని సరిగా ఉండాలి. గిరిజనుల చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలహీ నులు, నిస్సహాయలగా ముద్రపడిన వర్గం గిరి జనులు, గిరిజన జాతి తరతరాలుగా అణచివేతకు, దోపిడీకి గురవ్ఞతుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు.
ఒకప్రక్క అభివృద్ధి పథంలో నడిపిస్తాం అం టూనే గిరిజనుల కాలికింది నేలను కూడా లాగేసుకునే దురాఘాతాలు (టి.ఆర్‌.ఎస్‌) ప్రభుత్వం లోనే తీవ్రమౌతున్నాయి. సంస్కరణల పేరుతో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయం,భాష,ఆచార వ్యవహారలు అంతరించిపోతున్నాయి. ప్రపంచం లోని అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలోని అత్యంత వెనుకబాటుకు గురౌతున్న గిరిజనుల సమగ్రాభివృద్ధికి నేటికీ ఒక సమగ్ర జాతీయ విధానం లేకపోవడం దారుణం. మనదేశంలోని 9 రాష్ట్రాలు గిరిజన ప్రాంతల పరిపాలనలో గవర్నర్లకు, గిరిజన శాసనసభ్యులతో కూడిన గిరిజన సలహా మండళ్లకు విచక్షిణాధి కారాలున్నాయి. రాజ్యంగంలోని 5,6 షెడ్యూళ్ల ద్వారా దఖ లు పడ్డ సదరు అధికారాలను ఏ గవర్నర్‌ వినియోగించుటలేదు. గిరిజన ప్రాం తాల పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలను రాష్ట్రాలలో గిరిజన సలహామండళ్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుం డాలి. గవర్నర్‌లు గిరిజన సలహా మం డళ్లు గిరిజన ప్రాంతాల పరిపాలన తీరుతెన్నులు, సిఫారుసులతో కూడిన నివేదికలను ప్రతి ఏటా రాష్ట్రపతి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖకు అందజే యాలి. గిరిజన సలహా మండలిని మన రాష్ట్రంలో టి.ఆర్‌.ఎస్‌.ప్రభుత్వం నేటివరకు ఏర్పాటు చేయ లేదు.
గిరిజనులు అంటే ఎవరు?
వాడుక భాషలో గిరిజనులు అని పిలిచే వారినిరాజ్యాంగ పరంగా షెడ్యూలు తెగలు అని పిలుస్తారు. మనదేశానికిస్వాతం త్య్రం రాకముందు గిరిజనుల్ని వివిధ పదాలతో పిలిచేవారు వన వాసి,గిరిజన్‌, ఆదిమజాతి లాంటి పదాలు ఉపయో గించే వారు. పురాణాలలోను, ఇతిహాసాలలోను గిరిజనులు,ముఖ్యంగా దండకారణ్యం వివరాలు ఉన్నాయి.గిరిజనుల నాగరికత చాలా పురాతన మైనది. వారికి రాజ్యాలుఉండేవి. కోటలు ఉండేవి. వారికి భాష ఉంది. సంఖ్యా పరిజ్ఞానం,మాసాలు, ఋతువులు లాంటి లెక్కలు కూడా ఉన్నాయి. సాహి త్యం,సంగీతం,వాయి ద్య సహకారం అత్యున్నత స్థాయికి చేరుకుంది. స్వపరిపాలన వారి సంస్కృతికి మూలాలు చాలాగిరిజన సంస్కృతిలో కనిపి స్తాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ సాధనకై ప్రజాపోరాటాలు తప్పనిసరైన పరిస్థితులు నెలకొ న్నాయి. గిరిజనులు అందరి పౌరులు లాగానే రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులకు అర్హులు. అదే కాకుండా రాష్ట్రపతిచే ప్రత్యే కంగా ‘షెడ్యూలు తెగలుగా గుర్తింపు వల్ల కొన్ని హక్కులు, రక్షణలు పొందుతారు. షెడ్యూలు ప్రాంతాలలో నివసించే గిరిజనులకు మరిన్ని రక్షణలు, సౌకర్యాలు కల్పిం చేందుకు రాజ్యాంగంలో నిర్ధేశికాలు ఉన్నాయి. ఒకపక్క రక్షణ కల్పిస్తూ,మరో పక్కన మిగిలిన ప్రజల/ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందేం దుకు అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం సూచి స్తోంది. అయితే ఆచరణలో చిత్తశుద్ధి లేకపోవటం వల్ల అంతరాలు పెరిగి పోయి,పురోగతికి బదులు తిరోగతిని చూస్తున్నాం.-తేజావత్‌ నందకుమార్‌ నాయక్‌

మైనింగ్‌ వ్యతిరేక ఉద్యమంలో‘సూపర్‌ సైకిల్‌’ సిద్ధం చేయండి!

దశాబ్దాలుగా గనుల తవ్వకందారులు కార్పొరేట్‌ వ్యతిరేక కార్యకర్తలకు లక్ష్యంగా ఉన్నారు. ఖనిజాల వెలికితీత కలిగించే పర్యావరణ, సామాజిక ప్రభావాలపై ఉద్యమిస్తున్న వారి దృష్టిని ఆకట్టుకొంటుండగా, ఆతిథ్య దేశాలకు పెద్ద ప్రయోజనాలను చేకూర్చే పరిశ్రమ వాదనలలో వాస్తవం ఏమైనప్పటికీ, సందే హాలకు దారితీస్తున్నాయి.

ఇప్పుడు,వస్తువుల ధరలు పెరగడం ద్వారా ఈ రంగం పునరుజ్జీవింప బడుతున్నం దున, మరింత బలమైన దాడికి సామాజిక శక్తులు సిద్ధపడితే పర్యావరణ,సామాజిక,పాలన ఆధారాల పరంగా పరిశ్రమను మెరుగైన స్థితికి మార్చవచ్చు. మొదటిది వాతావరణ అనుకూల పదార్థాల గురిం చిన పరిశ్రమ కథనానికి వ్యతిరేకంగా పెరుగుతున్న ఎదురుదెబ్బ.ఇంధన ప్రాధాన్యతలు మారుతు న్నందున రాగి,కోబాల్ట్‌,లిథియం వంటి పరిశుభ్రమైన ఖనిజాలు డిమాండ్‌ పెరుగుతుంది. దాని తో చాలామంది ఖనిజ త్రవ్వకందారులు తమ హరిత ఆధారాలను చెప్పుకోవలసి వస్తున్నది. కానీ ఇది పరిశ్రమ దీర్ఘకాల విమర్శకులను వెనక్కి నెట్ట డానికి ప్రేరేపిస్తున్నది. ఉదాహరణకు,గత మార్చి లో,అటువంటి ఖనిజాలను వెలికి తీయడం ‘‘విస్తృతమైన విధ్వంస, మానవహక్కుల ఉల్లంఘనకు అపరిమిత అవకాశాలు కల్పించడం’’గావార్‌ ఆన్‌ వాంట్‌’ఒకవిశ్లేషణనుప్రచురించింది. ఏప్రిల్‌లో,ఎర్త్‌వర్క్స్‌’ మద్దతుతో జరిగిన ఒక అధ్యయనం అటువంటి పదార్థాలను వెలికితీసే అవసరాన్ని తగ్గించ డానికి రీసైక్లింగ్‌ కోసం పిలుపునిచ్చింది. ఇంధన పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్న వాతావరణ కార్యకర్తలు, ఇప్పుడు ఎక్కువ ఇంధనం వినియో గించే పరిశ్రమల వైపు, ముఖ్యంగా మైనింగ్‌ వైపు దృష్టి సారిస్తున్నారు.ఒక అంచనా ప్రకారం, ప్రపంచ గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలలో అవి 4నుండి 7 శాతం వరకు బాధ్యత వహిస్తున్నాయి. రెండవది, కార్యకర్తలు వివిధ పరిశ్రమల ఖనిజాల వినియో గంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. డిజిటల్‌, ఇతర పరికరాల్లో ఉపయోగించే లోహాలను త్రవ్వడంవల్ల పర్యావరణ ప్రభావాలు సాంకేతిక సమూహాలను లక్ష్యంగా చేసుకుని చర్చనీ యాంశం గా మారాయి. మరింత విస్తృతంగా, ప్రపంచం పెట్టుబడిదారీ ‘‘అతిగా వినియోగం’’ ట్రెడ్‌మిల్‌లోకి లాక్‌ చేయబడిరదనే ఆందోళనల మధ్య, మైనర్లు, ఎప్పటికీ అంతం కాని వనరుల వెలికితీతపై తమ దృష్టితో, మృగానికి ఆహారం ఇస్తున్నట్లు కనిపిస్తారు. మైనింగ్‌ రంగం ఎదుర్కొంటున్న మూడవ సవాలు విస్తృత సాంఘిక ఆందోళనలు. ఇక్కడ మహమ్మా రికి ఆజ్యం పోసిన సమాజ స్థితి గురించి ఆందోళన లు చాలా అరుదుగా జరుగుతాయి. ఇది అసమా నత అయినా,పర్యావరణాన్ని దెబ్బతీసినా, మైనారిటీ లేదా కార్మిక హక్కులను ఉల్లంఘించినా, శక్తివంత మైన కంపెనీలు తప్పు చేసినట్లు కనిపించినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. పెద్ద మైనింగ్‌ గ్రూపులకు అయితే మరేమీ కాదు. వారికార్యకలాపాలు తరచు గా విస్తారంగా ఉంటాయి. మారు మూల, కోల్పో యిన, పర్యావరణ సున్నితమైన ప్రాంతాలలో ఉంటాయి. తరచుగా మైనారిటీ సమూహాల జనాభా కలిగి ఉంటాయి. గని విస్తరణకు మార్గం చూపడా నికి పశ్చిమ ఆస్ట్రేలియాలో 46,000 సంవత్సరాల పురాతన పవిత్ర అబోరిజినల్‌ ఆశ్రయాన్ని కంపెనీ ధ్వంసం చేసిన తరువాత రియో టింటో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ గత సంవత్సరం చివర్లో తనఉద్యోగాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. దానితో ఇప్పుడు ప్రపం చవ్యాప్తంగా మైనింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఉల్లంఘన జరిగితే, అంతర్లీనంగా సామజిక పరిస్థితులు సున్ని తంగా ఉంటూ ఉండడంతో తాము భారీ మూల్యం చెలింపవలసి వస్తుందని భావిస్తు న్నారు. అయితే ఈమైనింగ్‌ వ్యతిరేక క్రియాశీలత వెనుక ఉన్న ఆందోళనలకు మద్దతు ఇవ్వడానికి ఇదిఏదీ అవస రం లేదు. కొన్ని ఉద్యమాలు స్పష్టమైన ఆధారాల ఆధారంగా ఉండగా,మరికొన్ని. యధాలా పంగా, సైద్ధాంతికంగా ఉంటున్నాయి. సాంఘిక క్రియాశీ లత మునుపటి పరిస్థితులకంటే, ఈ ధోరణి ఖనిజ వ్యాపార నమూనాలను తిరిగి రూపకల్పన చేసే అవకాశం ఉంది. అయితే అవకాశాలతో పాటు నష్టాలను కూడా కలిగిస్తుంది. గతంలో, క్రియాశీ లత ప్రభావం చాలా పరిమితం ఉద్యమాలు సంస్థలకు కొన్ని ప్రతికూల పరిస్థితులను సృష్టించ వచ్చు,స్థానిక వ్యతిరేకతను రేకకెత్తింప వచ్చు. కానీ చాలా పరిమితంగా ఉంటూ ఉండెడిది. ఇప్పుడు, ఇటీవలి రెండు మార్పుల కారణంగా ఖనిజాల త్రవ్వకంవాణిజ్య ఫలితాలను ప్రభావితం చేయ డానికి ఉద్యమ కారులకు ఎక్కువ అవకాశం కలిగి స్తున్నది. పెద్ద పెట్టుబడిదారుల విస్తరించే కట్టు బాట్లు,కార్యకర్తల ప్రచారాలకు తరచుగా సున్ని తంగా ఉంటాయి, మంచి ఇ ఎస్‌ జి పనితీరు ఉన్న సంస్థలకు మాత్రమే మద్దతు ఇస్తాయిబీ టెక్నాలజీ,కార్‌ కంపెనీల వంటి లోహాల పారిశ్రా మిక కొనుగోలుదారులలో పెరుగుతున్న సున్నిత త్వం,వారి సరఫరాదారుల పరపతికి కలిగే నష్టం. ఇప్పటికే, కొంతమంది గనుల తవ్వకందారులు తమ వ్యాపార నమూనాలను సర్దుబాటు చేయడం ప్రారంభించారు. కొందరు, ఉదాహరణకు, తక్కువ ప్రత్యక్ష గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలు లేదా నీటి వాడకంతో ఆస్తులను కొనాలని కోరుతూ, తమా దస్త్రాలను పున రూపకల్పన చేసే మార్గాలను చూస్తున్నారు.ఇతరులు తమ ఖనిజాలను ‘‘బాధ్యతా యుతంగా తవ్వినవి’’ అని ధృవీకరించడానికి లేదా తాము ఉపయోగించే లోహాలను రీసైకిల్‌ చేయ డంలో సహాయపడటానికి ఉమ్మడి పథకాలను రూపొందించడానికి తమ వినియోగదారులతో కలిసి పనిచేయడం ప్రారంభించారు.
విమర్శలను తగ్గించే మార్గం కాకుండా కస్టమర్లు, పెట్టుబడిదారులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే మార్గంగా సాధారణ థ్రెడ్‌ ఇ ఎస్‌ జి పరిశ్రమ గురించి ఆలోచించడంలో ఇది ఒక పరిణామం, ఇంకా చాలా దూరం వెళ్ళాలి – కాని ఆ కార్యకర్తలు దుర్వినియోగానికి పాల్పడుతున్నంత కాలం నిర్మాణాన్ని కొనసాగించే అవకాశం ఉంది.
(డేనియల్‌ లిట్విన్‌, సంస్థలకు స్థిరత్వం, భౌగోళిక రాజకీయ ప్రమాదం గురించి సలహా ఇచ్చే క్రిటికల్‌ రిసోర్స్‌ స్థాపకుడు, మేనేజింగ్‌ భాగస్వామి. ‘ఎంపైర్స్‌ ఆఫ్‌ ప్రాఎస్ఫిట్‌: కామర్స్‌,కాంక్వెస్ట్‌, కార్పొరేట్‌ బాధ్యత’ రచయిత)-డేనియల్‌ లిట్విన్‌

కులాల విభజన ఉపాధి హామికే ప్రమాదం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామిలో కులాలవారి సమాచారంపై కేంద్ర గ్రామీణా భివృద్ధిసంస్థ మార్చి 2, 2021న అడ్వయి జరీ ఫైల్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఉపాధి హామిలో దళితు లు,గిరిజనుల వివరాలు, వారి పనిదినాలను ప్రత్యేకంగా పేర్కొనాలని, ఆ ప్రాతిపదికపై 2021-22వేతనాల చెల్లింపు ఉంటుందని ఆ అడ్వయిజరీ ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. 2006లో ఉపాధి హామిని ప్రారం భించిన నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సర్క్యులర్‌లు ఏవీ కేంద్రం నుంచి రాష్ట్రాలకు రాలేదు. మొదటి సారిగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధిలో ఈ కులాల విభజన చేయడాన్ని పైపైన పరిశీలిస్తే హిందుత్వ శక్తుల అసలు ఎజెండా అర్థం కాదు. ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం కలగజేయడానికే ఈ వివరాల సేకరణ అనే ముసుగేసి అంతిమంగా ఉపాధి హామి చట్టం యొక్క మౌలిక లక్ష్యాలనే దెబ్బతి సేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం సిద్ధమైంది.

   దేశంలో అన్ని గ్రామాలకు విస్తరించిన అతి ముఖ్యమైనది ఉపాధి హామి చట్టం. 2004లో ప్రజా సంఘాల ఒత్తిడితో ‘’ఉపాధిహామి’’ పథకంగా కాకుండా చట్టంగా రూపుదిద్దుకున్నది. ఉపాధి హామిలో ఎలాంటి మౌలికమైన మార్పులు చేయా లన్నా పార్లమెంట్‌కే అధికారం ఉన్నది. అలాంటి ఈచట్టాన్ని మోడీ ప్రభుత్వం నీరుగార్చడానికి సర్క్యులర్స్‌,అడ్వయిజరీల పేరుతో దొడ్డిదారిన అనేక మార్పులు చేస్తున్నది. హిందూత్వ శక్తులు ఉపాధి హామిలో తెస్తున్న మార్పులు ఎంత ప్రమాదకరమో అర్థం కావాలంటే చట్టంలో ఉన్న మౌలిక అంశా లను గుర్తుచేసుకోవడం అవసరం. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి వయోజనుడికి కులాలు, మతాలు,ప్రాంతాలు అనేదానితో నిమిత్తం లేకుండా సంవత్సరంలో 100రోజులకు తక్కువ కాకుండా పని కల్పించాలి. వారం,పది రోజుల్లో పని చూపిం చకపోతే నిరుద్యోగభృతి ఇవ్వాలి. యంత్రాలు, కాంట్రాక్టర్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమ తించవద్దు. పనిప్రదేశాల్లో అన్ని సౌకర్యాలను కల్పిం చాలి. చివరకు పిల్లలకు చైల్డ్‌కేర్‌ సెంటర్స్‌ను కూడా పెట్టాలి. వారంవారం వేతనాలు చెల్లించాలి. సరళీ కృత ఆర్థిక విధానాలవల్ల వ్యవసాయంలో యాంత్రీ కరణ జరగడం, వృత్తులు దివాళాతీసి వ్యవసాయ కార్మికులుగా మారడం, చిన్న-సన్నకారు రైతులు వ్యవసాయ నష్టాలతో కూలీలుగా మారడంతో వ్యవ సాయ రంగంలో సంవత్సరంలో 70-80రోజు లకు మించి పనిదొరకని నేపథ్యంలో ఉపాధి హామి చట్టం వచ్చింది.
  కానీ,29కోట్ల 42లక్షల మంది ఉపాధి కూలీల్లో ప్రస్తుతం 14కోట్ల31లక్షల మందికే ప్రభు త్వాలు పని కల్పిస్తున్నాయి. కేరళ మినహా అన్ని రాష్ట్రాలు పనులు కల్పించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో గత రెండు, మూడు సంవత్సరాలుగా లక్షల మంది పనికోసం దరఖాస్తులు పెట్టుకుంటే పనులు ఇవ్వకుండా అక్కడి ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి. కోర్టులు జోక్యం చేసకున్నా ఫలితం ఉండడం లేదు. ఇన్ని పరిమితుల్లో కూడా2020-21ఆర్థిక సంవ త్సరం లో 389.32 కోట్ల పనిదినాలు ఉపాధిలో దేశ వ్యాపితంగా లభించాయి. కరోనా విపత్తులో కూడా ఉపాధి కూలీలు ప్రాణాలు ఫణంగా పెట్టి పనులు చేసారు. వ్యవసాయంలోనూ కరోనాలో పనులు నిర్వహించడంవల్లనే అన్నిరంగాలు మైనస్‌లో      ఉన్నా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే 4శాతం అభివృద్దిని సాధించింది. ఇలాంటి ఉపాధి హామికి మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలి. కానీ బీజేపీ తీసుకొచ్చిన ఈఅడ్వయిజరీ ఫైల్‌, మొత్తం ఉపాధి హామి లక్ష్యాలనే తలక్రిందులుగా చేస్తోంది.
  ఉపాధిలో ఎస్సీ,ఎస్టీల వివరాలను సేకరిం చేది సబ్‌ప్లాన్‌ ద్వారా నిధులిచ్చి మరింతగా ఈ తరగతులకు లబ్దిచేయడానికేనని బీజేపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం. గత సంవత్సరం కల్పిం చిన పని దినాల్లో ఎస్సీలు 19.86 శాతం, ఎస్టీలు 17.9శాతం పని దినాలు పొందారు.ఎస్సీ, ఎస్టీ లకు కలిపి 37.76శాతం...అంటే 140కోట్లకు పైగా పనిదినాలు లభించాయి. దేశంలో ఎస్సీ, ఎస్టీ జనాభా 24.4 శాతం ఉంటే, జనాభా కంటే 13శాతానికి పైగా అదనంగా ఉపాధి హామి పను లు చేస్తున్నారు. దళిత, గిరిజన ప్రజలకు గ్రామాల్లో ఉపాధి హామి ఒక జీవనాధారం. కానీ ఇప్పుడు సబ్‌ప్లాన్‌ నిధుల్లో జనాభా ప్రాతిపదికపై బడ్జెట్‌లో కేటాయింపులు చూపిస్తున్నారు. ఉపాధి హామికి సబ్‌ప్లాన్‌ నిధులు మరలించాలంటే జనాభా ప్రాతిపదికన 24.4శాతమే ఇస్తారు. మరి అదన మైన 13శాతం పని దినాలకు వేతనాలు ఎక్కడి నుండి వస్తాయి? దేశంలో ఈ స్థితి ఉంటే చాలా రాష్ట్రాల్లో ఉపాధి హామి పనులు 40 నుంచి 60 శాతం వరకు దళితులు, గిరిజనులే చేస్తున్నారు. పంజాబ్‌లో ఉపాధి పనులు 60శాతానికి పైగా ఒక్క దళితులే చేస్తున్నారు. అక్కడి జనాభా రేషియో లో నిధులు ఇస్తే పంజాబ్‌లో ఎస్సీ జనాభా 30 శాతం మాత్రమే. మిగిలిన 30శాతం ఎస్సీ వేత నాల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి పని దినాల్లో 33.38శాతం, ఉత్తరప్రదేశ్‌లో 28.5శాతం, తెలంగాణలో 40శాతం ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. కనుక ఎస్సీ,ఎస్టీ ప్రయోజనాలకే ఈ వివ రాల సేకరణ అనేది పచ్చి బూటకం. ఈ పేరు చెప్పి ఉపాధి హామీలో బీజేపీ ప్రభుత్వ హెడన్‌ ఎజెండాను అమలుచేసే కుట్రలకు బీజేపీ తెగిం చింది. సబ్‌ప్లాన్‌ నిధులంటే రెగ్యులర్‌ పథకాల్లో దళిత, గిరిజనులు పొందే సౌకర్యాలకు అదనంగా వాటిని ఉపయోగించాలి. కానీ,ఏకకాలంలో      ఉపాధిని, సబ్‌ప్లాన్‌ను పాతర పెట్టడానికి నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు.
  నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉపాధిహామిని బలహీన పర్చడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగి స్తున్నారు. వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యుపీఏ ప్రభుత్వం యూనియన్‌ బడ్జెట్‌లో ఈపథకానికి 4శాతానికి తగ్గకుండా నిధులు కేటాయిస్తే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర బడ్జెట్‌లో 2శాతానికి తగ్గించారు. ఒక్కదెబ్బతో ఉపాధి నిధు లకు అడ్డంగా కోతపెట్టారు. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో గత ప్రభుత్వాలు కేటాయించినట్టు కనీసం 4శాతం కేటాయిస్తే 1,44,000 వేల కోట్లకు తక్కువ కాకుండా ఉపాధి హామికి బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి. కానీ ఈ సంవత్సరం బీజేపీ ప్రభుత్వం 71వేల కోట్లే ఇచ్చింది. మోడీప్రధాని అయిన దగ్గర నుంచి ఈ తరహాలోనే కేటాయింపులు సగానికి తగ్గాయి. బడ్జెట్‌ తగ్గిపోవడంతోటే ఉపాధి పనుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సగం మందికే పనులు కల్పిస్తున్నాయి. ఉపాధిహామి నిధుల్లో 10 శాతానికి మించి మెటీరియల్‌కు ఖర్చు పెట్టకుండా గతంలో అమలైతే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40శాతానికి మెటీరియల్‌ను వినియోగిం చుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీంతో యంత్రా లు,కాంట్రాక్టర్లను,మనుష్యులు చేయలేని పనుల పేరుతో ఎంపిక చేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వాలు దళిత, గిరిజనుల స్వంత భూముల అభివృద్ధికి ఉపాధిహామి నిధులను ల్యాండ్‌ డెవలప్‌ మెంట్‌ పేరుతో వేలకోట్లు వినియోగించాయి. స్వంత భూమిలోపని చేసుకోవడం వలన భూములు సాగులోకి తెచ్చుకున్నారు. కానీ,నరేంద్రమోడీ ప్రభు త్వం ఉపాధి ద్వారా ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ను అటకెక్కించింది. ప్రజలకు ఉపయోగపడే వాటిని పక్కన పెట్టి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మంత్రుల పర్యటనలకు, పార్కులకు, హెలిప్యాడ్‌ల వినియో గానికి కూడా ఉపాధి హామి నిధులను ఉపయోగిం చే స్థితికి ప్రభుత్వాలు దిగజారాయి. చట్టం యొక్క స్పూర్తికే బీజేపీ తిలోదకాలిచ్చింది.
  కేరళతో పాటు, త్రిపురలో వామపక్ష ప్రభు త్వం ఉన్నప్పుడు ఉపాధిహామి పని దినాలు కల్పిం చడంలో దేశంలో అగ్రభాగాన ఉన్నాయి. త్రిపుర అయితే ప్రతి జాబ్‌కార్డుకు సగటున 89పని దినాలు కల్పించి కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నది. దక్షిణాది రాష్ట్రాలు కూడా ఉపాధి హామిని ఐదారు సంవత్సరాలు బాగా ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు వామపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాలు తప్ప, కేంద్రంతో పాటు ప్రాంతీయ పార్టీలన్న తేడా లేకుం డా అని పార్టీల ప్రభుత్వాలూ ఉపాధి హామిని నిర్వీర్యం చేస్తున్నాయి. బీజేపీ పాలక రాష్ట్రాల్లో ప్రారంభం నుండి ఉపాధిహామిపై శ్రధ్ద లేదు. ఉత్తరప్రదేశ్‌లో అయితే ప్రాణాళికాబద్దంగా ఉపాధి హామీనే లేకుండా చేస్తున్నారు.20కోట్ల జనాభా     ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 2.21కోట్ల జాబ్‌కార్డులు, 3. 12కోట్ల ఉపాధి కూలీలను మాత్రమే నమోదు చేసారు. ఉపాధి హామిని బలహీనపరచి దళిత, గిరిజనుల ఆర్థిక మూలాలను దెబ్బతియడానికే బీజేపీ ఈ కుతంత్రాలు చేస్తున్నది. ఉపాధి హామి వల్ల వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, ప్రత్యేకించి దళిత,గిరిజనులు,ఓబీసీలకు కొన్ని పని దినాలు దొరికాయి. రెండు,మూడు నెలలు ఆహా రానికి ఇబ్బంది లేని పరిస్థితి ఏర్పడిరది. కొంత కొనుగోలు శక్తి పెరిగింది. ప్రత్యేకించి గ్రామ పెత్తందారులపై పదిఇరవై రూపాయలకు ఆధా రపడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది.పేదల భూము లు కొంతమేరకైనా సాగులోకి తెచ్చుకున్నారు. గుడ్డిలో మెల్లగా అమలవుతున్న ఉపాధిచట్టం వల్ల కలిగే ఈ మాత్రం ప్రయోజనాలు కూడా గ్రామీణ ధనిక వర్గానికి కంటగింపుగా ఉన్నాయి. ఈ చట్టాన్ని అమలు జరపడం ఏ కోశానా ఇష్టంలేని పెత్తందా రులు, హిందుత్వవాదులు కలిసి ఉపాధి హామి పీక నులమడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వయిజరీ ఫైల్‌లో ఉన్న అంశాలు అమలైతే అందరికంటే నష్టపోయేది దళితులు, గిరిజనులే. సబ్‌ప్లాన్‌ పేరు చెప్పి, జనాభా ప్రాతిపదికమీద నిధులిచ్చి దళిత-గిరిజనులు ఇప్పుడు పొందుతున్న పనులు సగానికి తగ్గిస్తారు. తద్వారా దళితులను పూర్వ స్థితికి, అంటే పెత్తందా రులకు ఊడిగం చేసే స్థితికి నెట్టేస్తారు. ఎస్సీ, ఎస్టీల పేరు చెప్పి ఓబీసీ, బీసీలకు కూడా ఉపాధి హామి పనులు లేకుండా చేస్తారు. దేశ వ్యాపితంగా 35నుంచి40శాతం పనులు ఓబీసీ, బీసీలు చేస్తున్నా రు. భవిష్యత్‌లో వారికీ అవకాశం లేకుండా ఈ చట్టాన్ని తలకిందులుగా మారుస్తారు. పని ప్రదే శాల్లో కుల వైశమ్యాలను పెంచుతారు. సమిష్టిగా చేసే ఉపాధి పనులు కుల ఘర్షణలుగా మారు తాయి. దీనిని పెత్తందారులు అవకాశంగా వినియో గించుకుంటారు. కులాల పేరుతో ఏర్పడే గ్రూపులకు గ్రామ పంచాయతీలు ఇష్టానుసారం పనులు ఇస్తాయి. దళిత, గిరిజనులకు కఠినమైన పనులు, తక్కువ వేతనాలు పడేటట్లుగా ఈ ఆధిపత్య వర్గాలు ప్రయత్నిస్తాయి. బీజేపీ తెచ్చిన ఈ అడ్వయిజరీ అమలైతే కులాల వారీగా వేతనాల్లో వ్యత్యాసా లొస్తాయి. పూర్వ కాలంలో, ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో దళితులకు, ఇతర కులాల కంటే తక్కువ వేతనాలు ఇచ్చిన నేపథ్యం మన దేశంలో ఉన్నది. ఆస్థితి ఉపాధిలో పునరావృతం అవు తుంది. ఇప్పటి వరకు 50శాతం ఉపాధి పనులను మహిళలు చేస్తున్నారు. కులాల విభజన వచ్చిన తర్వాత మహిళలు చేయలేని పనులను ప్రవేశపెట్టి వీరికి పనులు సగానికి సగం తగ్గిస్తారు. అంతిమం గా ఈ అడ్వయిజరీ వల్ల అందరికంటే దళిత, గిరిజనులు, అన్ని కులాల్లో ఉన్న మహిళలకు తీవ్ర నష్టం కలుగుతుంది. రైతు చట్టాలు, విద్యుత్‌ బిల్లు, కార్మిక చట్టాల కోడ్‌ల కోవలోనే ఉపాధి హామిలో కుల విభజనను చూడాలి. దేశ వ్యాపితంగా రైతాం గం,కార్మికులు,వ్యవసాయకార్మికులు చేస్తున్న చట్టాల వ్యతిరేక పోరాటంలో ఉపాధి హామిలో బీజేపీ తెచ్చిన కులవిభజనను జోడిరచాలి. పోరాడి సాధిం చుకున్న ఉపాధి హామిని కాపాడుకోవడానికి మరో పోరాటమే మార్గం. కులాల విభజన రద్దు, 200 రోజుల పని, రోజు వేతనం రూ.600 కోసం దేశ వ్యాపిత సమరశీల సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం కావాలి. రైతాంగ పోరాటాల స్ఫూర్తితో ఉపాధి హామి పోరాటం ప్రారంభం కావాలి.-బి.వెంకట్‌

పర్యావరణం..కరోనా

చిన్న పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎక్కువ గా ఉంటుంది. ఏవిషయాన్నైనా ఇట్టే పట్టేసి జ్ఞాపకం ఉంచుకుంటారు. బాల్యంలో విద్యార్ధుల ప్రతిభను గమనించి ప్రోత్సహిం చేది తలిదండ్రులు. తరు వాత గురువులు, స్నేహితులు. ఈ విధమైన ప్రతిభ అనేక విష యాల్లో చూస్తుంటాం. వయసుకు మించి న శక్తి సామర్ధ్యాల్ని కనబరచటం. ఈ ప్రతిభ ను వెలికి తీయటం అనేది కత్తి మీదసామే! చదువు తో పాటు విద్యార్ధిలో నిగూఢమైవున్న కళను బయ టకు తీసుకురావటంలో ఉపాధ్యాయులు ముం దుండాలి. అలా చేయగలిగితే ఆవిద్యార్ధిలో పరి పూర్ణ పరిమళత్వం చూడ గల్గుతుంది. ఈనేపథ్యం లో ఉపాధ్యాయుని ప్రోత్సాహంతో విద్యార్ధి సాధించిన విజయమే ఈనెల బాల వినోదంలో చదవండి. (జన విజ్ఞాన వేదిక ఏప్రి యల్‌ 2021 లో ‘‘పర్యావరణం-కరోనా’’ అనే అంశంపై ఆంధ్రా-తెలంగాణాలలో నిర్వహించిన పోటీలలో పాఠశా లల విభాగంలో తృతీయ బహుమతి పొందిన వ్యాసం )

‘‘ ఆధునిక కాలంలో మన పర్యావరణం ఎక్కువ భాగం,కాలుష్యానికి గురవుతోంది. ప్రపంచ జనాభా పెరుగుతూ ఉండగా,మనుషుల అవసరాలు,వారి కోరికలు పెరుగుతున్నాయి. దీనివల్ల భూమి మీద ఉండే ప్రకృతి వనరులని, మనం ఎక్కువగా వాడటమే కాకుండా భూమిని,దానిమీద ఉండే జీవరాశులన్నీంటినీ కూడా పెద్ద ప్రమాదంలో పడేస్తున్నాము. కర్మాగారాలు బయటకు వదిలే వ్యర్ధపదార్ధాలు, ప్రమాదకరమైన రసాయనాలు,బొగ్గును కాల్చడం ద్వారా వచ్చే కార్బన్‌ డైయాక్సైడ్‌,సముద్రాలలోకి విడుదలయిన ప్లాస్టిక్‌,నేలని ఆక్రమించుకోవటానికి చెట్లు కొట్టి వేయడం ఇవన్నీ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్‌, మన జీవనవిధానాన్ని మార్చే సింది. ఈ ప్రభావంవల్ల కొంత మంచి మరియు కొంత చెడు జరుగుతోంది.. జరిగింది. అవి పెద్దవైన చిన్నవైన,చాలా సంవత్సరాల తర్వాత పర్యావరణంలో ఒక మార్పు కలుగుతుంది ’’
ఆధునిక సమాజం సాంకేతికంగాబాగా అభివృద్ధి చెందినప్పటికీ మానసికంగా మాత్రం ప్రకృతితో ఇతర జీవరాసులతో ఒకసంబంధాన్ని అభివృద్ధి చేసుకోలేక పోయింది. మనుషులు ఒకరికొకరు సంబంధం లేకుండా యాంత్రికంగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు కంటికి కనబడని ఈవైరస్‌ రోజురోజుకి వేలల్లో, లక్షల్లో మనుషులకు సోకుతోంది. ఇకపై మనందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రకృతితో మమేకమైతేనే మనం బ్రతకగలమని అర్ధమైంది. ఈపరిణామంవల్ల మన సమాజంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి.
కరోనావ్యాధి ప్రపంచ వ్యాప్తంగా మను షులకి సోకటంవల్ల వ్యాపారాలు,చదువులు,ఉద్యో గాలు,దేశాలఆర్ధిక వ్యవస్థలు వీటన్నీటిపై ప్రతికూల ప్రభావం చూపించినా, పర్యావరణంపై మాత్రం అనుకూల ప్రభావమే చూపించింది. కరోనావల్ల అందరూ ఇంట్లోనే నిర్బంధమయ్యారు. ఈసమ యంలో ఎవరూ ప్రయాణాలు చేయక పోయేసరికి కార్లు, విమానాలు, రైళ్లు మరియు ఇతర రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. దీనివల్ల అవి విడుదలచేసే కార్బన్‌ డైయాక్సైడ్‌ ఎమిషన్లు, గాలిలో సుమారుగా17 శాతం తగ్గాయి. మనుషులు ఎవరూ బయటకు రాకపోవటంవల్ల సముద్రాలలో, నదు లలో ఉన్న నీళ్ళు ఇప్పుడు పరిశుభ్రంగా ఉన్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాలు మరియు రసాయనాలు, అవి మూతబడటంవల్ల సముద్రా లలోకి నదులలోకి వెళ్ళట్లేదు. ప్రస్తుతం మనభారత దేశానికి చెందిన గంగా నదిలో కూడా, నీళ్ళస్వచ్చత దాదాపుగా50శాతం పెరిగింది. చాలాతక్కువగా కనిపించే పక్షులు,అడవి జంతువులు కూడా బయట ఉన్న వాహనాల రద్దీ,ధ్వనికాలుష్యం తగ్గటంవల్ల అవిరోడ్ల మీద సంచరిస్తున్నాయి. చాలా సంవత్స రాల తర్వాత వాటికి స్వేచ్చ మళ్ళీ వచ్చింది. ఈ విధంగా కరోనావల్ల కొన్ని పర్యావరణ లాభాలు ఉన్నాయి. కరోనా పర్యావరణంపై చూపించిన ప్రభావాలలో చాలానష్టాలు కూడా ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత,అందరూ ప్రాముఖ్యత నిచ్చింది మాస్కులకే. మాస్కు ధరిస్తే మనల్ని మనము కాపాడుకోవచ్చు అనేది తెలిసిన విషయమే. కానీ ఒక్కసారే వాడిపడేసే ఈమాస్కులవల్ల చెత్త పెరిగి పోతోంది. అవి కూడా ప్లాస్టిక్‌ తోనే చేయబడ్డాయి కాబట్టి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ చెత్త సముద్రాలకు చేరి వాటిలో ఉన్నటువంటి జల చరాలకు హాని చేస్తాయి. చాలామంది మామూ లు చెత్తలాగా వీటిని కూడా ఎలా కావాలంటే అలా రోడ్ల మీద పడేస్తున్నారు. ఈమాస్కుల్లో వైరస్‌ ఉండటంవల్ల జంతువులకు తర్వాత మనుషులకు కూడా కరోనా వీటి నుంచి సోకుతుంది. ఆన్లైన్‌ షాపింగ్‌ కూడా కరోనా కారణంగా బాగా పెరిగిం ది. షాపులకి వెళ్లలేని మనము,ప్రతిదానికి ఆన్లైన్‌ ఆర్డర్లు చేస్తున్నాము. దీనివల్ల కూడా చాలా ప్లాస్టిక్‌ చెత్త మిగులుతుంది. ఈసమయంలో మాస్కులు లాగానే చేతితొడుగులు (గ్లవ్స్‌) మరియు ఆసుప త్రులనుంచి వచ్చే వ్యర్ధాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇవికూడా మాస్కుల లాగా చెత్త అయ్యి ఇతర జీవులకు హాని కల్గిస్తున్నాయి.
ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరగటం వలన,చాలామంది మరణిస్తున్నారు. రోజు రోజుకి మరణాల రేటు పెరుగుతోంది. అంతకుముందు రోజుకు ఐదు-ఆరు శవాలని కాల్చి వేయాల్సి వచ్చేది,కానీ ఇప్పుడు రోజుకి వేల శవాలను కాల్చే యాల్సి వస్తోంది. వీటిని కాల్చటంవల్ల కూడా పర్యావరణం కలుషితం అవుతుంది. ఎందుకంటే శవాల్ని కాల్చటంవల్ల వచ్చే పొగంతాగాలిలో కలు స్తుంది. కరోనాబయటివాళ్లకు సోక కుండా ఉండ టానికి శవాలని ప్లాస్టిక్‌ కంటైనర్లలో పెట్టినప్పుడు, శవాలతో పాటు ప్లాస్టిక్‌ కూడా కాలుతుంది. ఇందు వల్ల కూడా గాలిలోకి హానికరమైన విషవాయు వులు విడుదలవుతాయి. కరోనా కేసులు పెరగటం వల్ల కృత్రిమ ఆక్సిజన్‌ వాడకం పెరిగింది. ఆక్సిజన్‌ సరిపోక ఆసుపత్రులలో చాలామంది చనిపోతు న్నారు కూడా. ఒకఆసుపత్రిలో ఆక్సిజన్‌ లీక్‌ అవ్వ టంవల్ల 20మంది మృతి చెందారు. కృత్రిమ ఆక్సిజన్‌ రోగులకు అందటానికి దేశంలో రోజుకి చాలా ఆక్సిజన్‌ తయారు చేయాల్సి వస్తుంది. ఇది కూడా సరిపోక ఇతర దేశాలనుంచి విమానాలలో తీసుకురావాల్సి వస్తోంది. ముందే మనం కరోనా కేసులు ఇలా పెరగనివ్వకుండా ఉంటే, ఈపరిస్థితి వచ్చేది కాదు. ఈవిధంగా కరోనా పర్యావరణంపై చెడు ప్రభావాన్ని చూపించింది.
కరోనా వల్ల పర్యావరణానికి కల్గిన లాభాలు,నష్టాలు చూస్తుంటే అది మనుషులకు ఒక మంచి గుణపాఠం నేర్పింది. అయినప్పటికీ పర్యా వరణాన్ని ఇంకా కలుషితం చేస్తున్నాము. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం పర్యా వరణాన్ని కాపాడితే, అదే మనల్ని కాపాడుతుంది.-జతిన్‌ జూలకంటి

గమ్యం తెలియని బాలల ప్రయాణం

బంగారు భవిష్యత్తుకు పునాదిపడేది బాల్య దశ. ఇలాంటి కీలకదశలో బాలలు చదువు,ఆటలకు దూరమై శ్రామికులుగా మారడాన్ని బాలకార్మికులంటారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాలకార్మిక వ్యవస్థ ఒకటి. బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతిబిడ్డ జన్మహక్కు. అయితే కుటుంబాల సామాజిక,ఆర్థికపరిస్థితులు కారణంగా అత్యధికబాలలు వ్యవసాయ రంగం లో…మిగతావారు ఇళ్లలో,హౌటళ్లలో,కర్మాగారాల్లో,దుకాణాల్లో పనిచేస్తున్నారు. వీరంతా కూడా అధిక పనిగంటలు తక్కువ వేతనంతో శ్రమదోపిడీకి గురవడంతోపాటు అక్రమ రవాణా, వేశ్యావత్తి, డ్రగ్‌ మాఫియాకి బలవుతు న్నారు. ఫలితంగా వారి భవిష్యత్‌ అంధకారంగా మారింది. ..`

కరోనాతో బాలకార్మికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చాటు తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవ స్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకురా వడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ సంవత్సరం ‘’బాల కార్మిక వ్యవస్థ ముగింపునకు ఇప్పుడే చర్యలు’’ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈదినోత్సవం ప్రధానంగా ఐరాస 2021 సంవ త్సరాన్ని ‘’అంతర్జాతీయ బాల కార్మిక నిర్మూలన సంవత్సరం’’గా ప్రకటించిన నేపథ్యంలో తీసుకో వాల్సిన చర్యలపై దృష్టి సారించనుంది. గతేడాది బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశంలో ప్రపంచదేశాలు సార్వ త్రిక ఆమోదం తెలిపాయి. కరోనా విసిరిన సవాళ్ళ అనంతరం ఇది మొదటి ప్రపంచ దినం. ఇప్పటికే 2025 నాటికి బాలకార్మిక వ్యవస్థకు ముగింపు పలకాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో (లక్ష్యం8.7) నిర్దేశించుకోవడం జరిగింది. ఈ చర్యల్లో భాగంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ బాల కార్మికుల లెక్కిం పునకు సంబంధించిన నూతన అంచనాలు, పోకడ లను విడుదల చేయనుంది. ఇందులో అందరిని భాగస్వామ్యం చేయడానికి వారంపాటు చర్యలు చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా గత ఏప్రిల్‌ మాసంలో అయాప్రాంతాలు, దేశాలు, సంస్థ వాటాదారులు, వ్యక్తులు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసిన ‘’2021కార్యాచరణ ప్రతిజ్ఞల’’ పురోగతిని ప్రదర్శిం చడం జరుగుతుంది.ఈఏడాది పొడవునా తీసు కున్న చర్యలు, తదుపరి 2022లో బాల కార్మికులపై సౌత్‌ ఆఫ్రికాలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి మైలురాయిగా నిలువనున్నాయి.
కరోనాతో పెరిగిన బాలకార్మికులు…
అనేక రూపాల్లో కొనసాగుతున్న బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. కుటుంబ ఆర్థిక పరిస్థితికి,బాలల జీవనానికి అవినాభావ సంబంధం ఉంది. దీంతో వారు చదువుకోవాల్సిన వయసులో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు నిరక్షరా స్యత,ఉపాధి నిమిత్తం కుటుంబ వలసలు,జనాభా పెరుగుదల,ప్రపంచీకరణ తదితరకారణాలు కూడా బాలకార్మిక వ్యవస్థకు ఆజ్యం పోస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా గత సంవత్సరన్నర కాలంగా కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో కుటుంబ ఆదా యం పడిపోయి, సామాజిక జీవనం దెబ్బతిన్నది. దీని ప్రభావంపిల్లలపై పడిరది. దీంతో వారు విద్య,వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలకు దూరమ య్యారు. బడులు మూతపడడం, ఆన్‌లైన్‌ చదువు లతో మెజారిటిపిల్లలు విద్యను పొందలేక పోయా రు. ఫలితంగా బాల్య వివాహాలు,బాలకార్మిక వ్యవస్థలాంటి దుర్లక్షణాలు పెరిగాయని అనేక అధ్య యనాలు చాటుతున్నాయి. గతేడాది ‘’కోవిడ్‌-19, బాలకార్మిక వ్యవస్థ’’ పై అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూనిసెఫ్‌ అధ్యయనం బాలకార్మిక వ్యవస్థ పై గత ఇరవై సంవత్సరాల కాలంలో సాధించిన పురోగతి వెనక్కి నెట్టబడిరదని తెలిపింది. ఈ సంక్షో భం కన్నా ముందుతో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర పేదరికంలోకి జారుకున్న వారి సంఖ్య 4నుంచి 6 కోట్లు పెరిగిందని,ఒక శాతం పేదరికం పెరి గితే 0.7శాతం బాలకార్మికులు పెరుగుతారని పేర్కొన్నది. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల ప్రకారం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15.2కోట్ల మంది బాల కార్మికులు ఉండగా…అందులో 7.2 పిల్లలు ప్రమాదకరమైన పనుల్లో నిమగమయ్యారు. అధికంగా బాలకార్మికులున్నా భారతదేశంలో కరోనా అనంతరం వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కైలాష్‌ సత్యార్థి చిల్డ్రన్స్‌ ఫౌండే షన్‌ సర్వే పేర్కొన్నది. పిల్లల అక్రమరవాణా పెరిగే అవకాశం ఉందని, కార్మిక చట్టాలు దుర్వినియోగం అయ్యేప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు…
దేశ సంపద అయిన బాలలు బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవు తుంది. సంఘ విద్రోహ కార్యకలాపాలు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి బాలలకు తగిన విద్యా భ్యాసం,శిక్షణ అందించి విలువైన మానవ వనరులు గా తీర్చిదిద్దాలి. కార్మికులుగా పనిచేస్తున్న బాలల పూర్తివివరాలు సేకరించాలి. ఇందులో ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా భాగస్వామ్యం కా వాలి. బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, విద్యా హక్కు చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడాలి. బడిబయట ఉన్న విద్యార్థులపై సమగ్ర సర్వే నిర్వహించి పాఠశాలలో నమోదు చేయాలి. వ్యవ సాయ సంస్కరణలు,ఉపాధికల్పన పథకాలు, సాం కతిక నైపుణ్యాలు పెంపొందించటం,అవ్యవస్థీ కత రంగాలను ప్రోత్సహించటం, సహకారసంఘాల ఏర్పాటు,సాంఘిక భద్రతా పథకాల రూపకల్ప న వంటి చర్యలు పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూ లనకు దోహదపడతాయి. ప్రభుత్వాలు వీటిపై ప్రత్యే కంగా దృష్టిసారించాలి. అందుకు దీర్ఘకాల కషి, బహుముఖ వ్యూహం అవసరం. భారతదేశంలో కరోనా మహమ్మారితో చాలా మంది బాలలు అనాధలయ్యారు. వీరి సంరక్షణకై క్షేత్రస్థాయి చర్యలు చేపట్టాలి. విద్యఅంతరాలను తొలగించడానికి డిజి టల్‌ సాధనాలు అందించాలి. నేటి కోవిడ్‌ విపత్కర పరిస్థితులో బాలల హక్కులు సంక్షోభాన్ని ఎదుర్కో వడానికి ప్రపంచదేశాలు సమన్వయం కోసం యూనిసెఫ్‌ ఎజెండా రూపొందించింది. ఇందులో బాలల ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారం అందివ్వాలని, తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. పిల్లల విద్యను కొనసాగిస్తూ,వారి సంరక్షణ కోసం కుటుం బాలకు సామాజిక మద్దతు ఇవ్వాలి. బాలలను హింస,దోపిడి,దుర్వినియోగం నుంచి రక్షించాలి. అంతర్యుద్ధాలు,హింస సంఘటనలతో వలస వచ్చిన,శరణార్థులుపిల్లలను రక్షించాలి. ఈ చర్యలు బాల కార్మిక వ్యవస్థకు చమరగీతం పాడి, వారి వికాసానికి దోహద పడతాయి.– డాక్టర్‌ పెంట కృష్ణ