కామారం కలాల శోధన కోయతూర్‌ ఆఫ్‌ కామారం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ‘‘బీర్సా ముండా యూత్‌ సభ్యులు’’ పర్యటనలు, పరిశోధనల సాయంగా వెలువరించిన పుస్తకం’’ ‘‘ఇండిజినెస్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ది కోయతూర్‌ ఆఫ్‌ కామారం’’ డా. అమ్మిన శ్రీనివాసరాజు
నేటి ఆధునిక కాలంలో అడవి బిడ్డల్లో పొడచూస్తున్న మార్పుల తీరు తెన్నులు గమనిస్తుంటే, అక్షరాల ఆనందదాయకంగా ఉంది. ఆదివాసీలు తమ చరిత్రను, తమ అస్తిత్వాన్ని, మూలాలను, తామే స్వయంగా నిర్మాణం చేసుకుంటున్న శుభతరుణం ఇది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పరిధిలోగల ‘‘సమ్మక్క సారక్క తాడ్వాయి’’ మండలంలోని గిరిజన గ్రామం కామారంకు చెందిన విద్యావంతులైన గిరిజన యువత ఏర్పాటు చేసుకున్న ‘‘బీర్సా ముండా యూత్‌ సభ్యులు’’ పర్యటనలు, పరిశోధనల సాయంగా వెలువరించిన పుస్తకం.
‘‘ఇండిజినెస్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ది కోయతూర్‌ ఆఫ్‌ కామారం’’ ఇది విషయపరంగాను అలంకరణ పరంగాను ఎంతో ఆకర్షణీయంగా అందంగా విలువైనదిగా ఉంది ఒకరకంగా చెప్పాలి అంటే దీనిని ‘‘గిరిజన ఎన్సైక్లోపీడియా’’ అని కూడా అభివర్ణించవచ్చు.
296 కమ్మలతో అచ్చంగా 64 అంశాలను సచిత్రంగా అనుభవసారంతో అందించిన ఈ వ్యాసావళిలోని ప్రతి వ్యాసం ఒక ఆణిము త్యం లాంటిదే..!! ఆదివాసి జనజాతి అన్న, వారి ఆచారసాంప్రదాయాలు అన్న,అవి అతి ప్రాచీనమైనవి అనే భావన ప్రతి ఒక్కరిలో నాటుపోయి ఉంది.కానీ అది సరైనది కాదు అనే భావన కలుగుతుంది ఈ పుస్తకం చదివితే. దీనిలో ఆదివాసీలకు సంబంధించిన సమస్త అంశాలు పరిశోధనాత్మకంగా వివరించబడ్డాయి.వస్త్రధారణ,అలంకరణ, పండుగలు,గట్టు- గోత్రాలు,పెళ్లి, చావు,వేట, భాష, ఆహార సేకరణ,ఆటలు- పాటలు, వ్యవసాయ విధానం,పశువుల జంతువుల పెంపకం,తదితర విషయాల గురించిన సంపూర్ణ సచిత్ర విషయాలు సహేతుకంగా ఇందులో మనం చదవచ్చు.సాధారణంగా పరిశోధన గ్రంథాలు అంటే ఏదో ఒక అంశం మాత్రమే తీసుకుని దానిని పరిశోధించి ఫలితాలు రాస్తారు కానీ ఈబీర్సా ముండా యూత్‌ వారు సుమారు 200 విషయాలు ఎంచుకొని వృక్ష- జంతు శాస్త్ర, గణిత -భౌతిక శాస్త్ర, చరిత్ర, పురావస్తు, ఆంత్రఫాలజీ, వంటి అంశాలను కలగలిపి అధ్యయనం చేసి పరిశోధన చేయటం సాహసంతో కూడిన గొప్ప విషయం.
దీనిలో ప్రధానంగా ‘‘ఇండిజినెస్‌’’ (స్థానిక ప్రజల ఆలోచనలు ఆచరణ) జ్ఞానంపై ఎక్కువ విశ్లేషణ చేసి గిరిజన ప్రాకృతిక వైవిధ్య ఫలితమైన జ్ఞానాన్ని విపులంగా చిత్రించారు, ఇందులోని శోధన అంతా గిరిజన జీవనం ప్రాకృతిక జ్ఞానం కేంద్రంగా కొనసాగింది. ఆదివాసుల నాగరికతకు సంబంధించిన పరికరాలను వివరించడమే కాక వాటి యొక్క శాస్త్రీయ విశ్లేషణ కూడా చేయడం ఇందులో ఒక విశిష్టత, ఎడ్ల బండి మొదలు నాగలి , ముల్లుకర్ర, గొర్రు, బొనగ, తూతకొమ్ము, ఒడిసెల, గినుగు, బరిశ, ఇసుర్రాయి, రోలు, తదితర వస్తువుల నిర్మాణం ఉపయోగంతో పాటు వాటిలో గల శాస్త్రీయ విశ్లేషణలు కూలంకషంగా చేశారు.
వీటిలో ‘‘తూత కొమ్ము’’ గురించిన విశ్లేషణ గమనిద్దాం… అడవి దున్నల కొమ్ములను గిరిజనులు అడవుల నుంచి సేకరించి క్రమ పద్ధతిలో మొన భాగాన్ని, తొలగించి లోపల భాగం శుభ్రం చేస్తారు, పై భాగంలో నులుపుగా ఉండటానికి నూనె పూస్తారు, బోలుగా ఉన్న కొమ్ము మొన భాగం నుండి గాలిని ఊదటంతో భీకరమైన శబ్దం వస్తుంది,
ఈ ‘‘త్షుత కొమ్ము’’ గిరిజనులకు హెచ్చరిక చేసే సైరన్‌ లాంటిది, పశువులను మేత కోసం వదలడానికి, అడవుల్లో అవి మేత మేసే సమయంలో క్రూర మృగాల బారి నుంచి కాపాడటానికి, మందల నుంచి తప్పిపోయిన పశువులు తిరిగి మందలోకి రావడం కోసం, ఈ ‘‘తూతకొమ్ము’’ను ఉపయోగిస్తారు. అలాగే గిరిజన గ్రామాల్లో ఈ తూతకొమ్ము ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది, ముఖ్యంగా గ్రామ దేవతల జాతరలు పండుగల వేళ ఆయా దేవర్ల ఆగమనానికి గుర్తుగా తూతకొమ్ము ఊది జనాలను జాగృతం చేస్తారు. ఈ దూత కొమ్ముకు సంబంధించిన శాస్త్రీయ విశ్లేషణ చేస్తూ దీని జ్ఞానం నుంచే నేటి ఆధునిక సౌండ్‌ సిస్టమ్స్‌ వచ్చాయని భావించవచ్చు అంటూ…అడవిలో జంతువులు పక్షులు ఆరుపులను బట్టి గుంపులు గుంపులుగా జీవిస్తాయి,వాటి క్రమం నుంచే జ్ఞానం తెలుసుకుని తూతకొమ్ము శబ్దంతో ఆదివాసీలందరూ ఏకమవడం నిజంగా ప్రకృతి నేర్పిన జ్ఞానం అంటారు ఈ పరిశోధకరచయితలు,ఇదే క్రమంలో వడిసెల, గినుగు, విల్లు, తదితర ఉపకరణాల గురించిన విశ్లేషణలు ఆసక్తికరంగా విజ్ఞానదాయకంగా ఇందులో చదవచ్చు.
కోయవారు పూర్వకాలం నుంచి కాలాన్ని కొలవడానికి కార్తెలను ఎలా ఉపయోగించారో చెబుతూ కార్తెల పేర్లకు గల జానపద కథనాలు, వాటితో ముడిపడి ఉన్న సామెతలు, కూడా ఇందులో పేర్కొనడం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. అలాగే ఆయా కార్తెల సందర్భంగా గిరిజనులు చేసుకునే పండుగల వివరాలు సైతం చెప్పడం జరిగింది.అడవిలోనే మృగాలు దాంపత్య జీవనం కోసం కలుసుకునే సందర్భంలో భీకరంగా అరుస్తాయి.ఆసందర్భంలో వచ్చే కార్తె కనుక దీనిని ‘‘మృగశిర కార్తె’’ అంటారు, ఎండలు తగ్గి వానలు రాకకు అనుకూలత చెందెసమయంలో ఈ కార్తె వస్తుంది.వర్షం లేకపోయినా భూమి చల్లగా ఉంటుంది. ఈ కార్తెలోనే భూమిలో విత్తనాలు వేస్తే పాడైపోకుండా సక్రమంగా మొలుస్తాయి అని వారి నమ్మకం, ఇలా కార్తెలను లెక్కించడం, కాలాన్ని విభజించడం, భూములు కొలవడం, తదితర విషయాల గురించి పరిశీలిస్తే ఈ ఆదివాసులకు, అక్షరజ్ఞానం అంతగా లేకపో యినా ప్రకృతిని అంచనా వేయడంలో వారు చక్కని పరిజ్ఞానం కలిగి ఉంటారు అనే నిజం నమ్మి తీరాల్సిందే.!! ఈ పుస్తకంలో సాధార ణమైన గిరిజన పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఉమ్మడి జీవన విధానం, కుటుంబ వ్యవస్థ, బంధుత్వాలు, ఆటలు, పాటలు, వ్యవసాయం, జంతువుల పెంపకం, గురించిన సాధారణ విషయాల గురించి ఎంతో విశ్లేషణాత్మకంగా సహేతుకంగా వివరించడమే కాక శివుని చారిత్రక నేపథ్యం, సింధు నాగరికత కోయ నాగరికత, కోయ సిద్ధాంతం ప్రత్యేకత, కోయ తూర్‌, గోండ్వానా ధర్మచక్రాల గురించిన విశ్లేషణలతో పాటు, గొంతెమ్మ మడుగు పురాతన చిహ్నాలు – ఒక అధ్యయనం, వంటి వినూత్న విషయాల గురించిన వివరాలు చెప్పడం దీనిలో ఒక ప్రత్యేకత.
ఆదివాసి జాతి సంరక్షణ కోసం తమ అస్తిత్వాన్ని తామే వ్రాసుకోవడం ఒక కోణం, అయితే గిరిజనులకు గల పరిశీలన దృష్టి, ప్రకృతిని అంచనా వేయడంలో వారికి గల ప్రత్యేకతలు, కూలంకషంగా ఈ క్షేత్ర పరిశీలన తాలూకు పరిశోధన అధ్యయన గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం ఎంతో అవసరమైన గిరిజన విజ్ఞానం తాలూకు సైద్ధాంతిక పరమైన విషయ సేకరణలో కామారం బిర్సా ముండా యువజన ఉద్యోగ సంఘాల వారు చేసిన ఈ అక్షర కృషి ఎంతో శ్లాఘనీయం, భావి పరిశోధనలకు ఇది ఒక ‘‘నీటి చెలెమె’’లా, దోహదపడగదు, ఈ అద్బు Ûత అక్షర కృషికి సారథ్యం వహించిన గిరిజన పరిశోధక విద్యార్థి ‘‘మైపతి అరుణ్‌ కుమార్‌’’ ఎంతో అభినందనీయుడు.గిరిజన సంస్కృతి సైద్దాంతిక గ్రంథాలకు తలమాని కంగా నిలిచే ఈ సచిత్ర పుస్తకం ప్రతి పరిశోధక విద్యార్థి అధ్యయనకర్త, విధిగా చదవాల్సినది.

అపరా అనుభవసారం ఆదివాసీ ఆత్మగానం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయత ‘‘ డాక్టర్‌ వి.ఎన్‌ .వి. కె, శాస్త్రి గారి ’’ కలం నుంచి జాలు వారిన ‘ఆదివాసి ఆత్మగానం’ – డా. అమ్మిన శ్రీనివాసరాజు
గిరిజన జన జీవితాలను అత్యంత దగ్గరగా గమనించడమే కాక సుమారు 50సంవత్స రాల పాటు వారితో సహజీవత్వం చేసిన పరిశోధకుడు, ప్రభుత్వ ఉద్యోగి, రచయిత, ముఖ్యంగా కేవలం గిరిజనుల గురించి అనేక పుస్తకాలు పరిశోధనాత్మకంగా వ్రాసిన వ్యక్తి, తెలుగు గిరిజన రచయిత లలో ప్రథమ స్థానంలో నిలిచేవారు, వారే అందరికీ డాక్టర్‌విఎన్‌.వి.కె,శాస్త్రిగా సుపరిచి తులైన ‘‘వట్టిపల్లి నరసింహ వీరభద్ర కృష్ణశాస్త్రి’’ ఆయన ఇటీవల వెలువరించిన వ్యాససంపుట్టి ‘‘ఆదివాసి ఆత్మగానం’’ ఆదివాసి జీవన సంస్కృతులకు దర్పణం పడుతున్న ఈ వ్యాసవళిలో మొత్తం 34వ్యాసాలు ఉన్నాయి. నేటి ఆధునిక కాలంలో మన గిరిజన బిడ్డలు పడుతున్న ఇక్కట్ల గురించి సహేతుకంగా వివరించే నేపథ్యంలో ఒకవైపు సంస్కృతి పరంగా, మరోపక్క పాలకులు చేస్తున్న దురాగతాలు, అలాగే వలస గిరిజనుల వల్ల కలుగుతున్న నష్టాలు అదేవిధంగా గిరిజనే తరులు, ప్రపంచీకరణ సాయంతో సాగు తున్న ఆధునిక అభివృద్ధివల్ల వాటిల్లుతున్న నష్టం గురిం చి రచయిత పారదర్శకంగా ఆలోచింప జేసే విధంగా ఈవ్యాస ప్రస్థా నం కొనసాగించారు. ఆనాటి మొగ లాల సాయంతో మన తెలుగు ప్రాంతానికి వచ్చిన బంజారాలు తమదైన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ అష్ట కష్టాలు పడి దుర్భర జీవితాలు అనుభ వించిన వారు ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో సుగాలీలుగా తెలంగాణలో లంబాడాలుగా పేర్లు కలిగి గిరిజ న సామాజిక వర్గ సౌక ర్యాలు పొందుతున్న తీరును వివరిం చిన శాస్త్రిగారి వ్యాసంలో కేవలం వారి చరిత్ర జీవితం మాత్రమే ప్రస్తావించారు, వారివల్ల నిజమైన కొండల్లోని గిరిజన సామాజిక వర్గం వారికి జరుగుతున్న ఉపాధి ఉద్యోగ ఆర్థిక నష్టాల ప్రస్తావన లేదు.కానీ ఇదే వ్యాస సంపు టిలో ‘‘నకిలీ గిరిజన సర్టిఫికెట్‌ గాళ్లు’’ అనే మరో వ్యాసంలో ఆయన స్వీయ అనుభవంలోని విష యాలు ప్రస్తావించారు. సుమారు 50 సంవత్స రాల క్రితమే నకిలీ సర్టిఫికెట్లు పొంది వివిధ ఉద్యోగ హోదాల్లో ఉన్నవారు ప్రస్తుతం వారి పిల్లలకు సైతం అదే సర్టిఫికెట్లతో రిజర్వేషన్‌ సౌకర్యాలు అనుభవిస్తున్న వైనం ఇందులో పేర్కొంటూ నకిలీ గిరిజనులు ఏర్పడుతున్న తీరును, తెలిపి అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు గూర్చి మాత్రం అస్పష్టంగా ముగించారు. కోసం మెరుపుగా ఏజెన్సీ బయట నివసిస్తున్న గిరిజనులు ఏజెన్సీ గిరిజనులుగా నకిలీ సర్టిఫికెట్లు పొంది స్థానిక గిరిజన కోటాలో ఉద్యోగాలు పొందుతున్న వైనం, ప్రస్తావించిన శాస్త్రిగారు తనదైన పారదర్శకత చూపించే ప్రయత్నం చేశారు. ఆధునికత పేరుతో ఆవిర్భవించిన పర్యాటక రంగం వల్ల అడవి బిడ్డల సంస్కృతి ఎలా నాశనం అవుతుందో వివరించే వ్యాసంతో పాటు మాయమవుతున్న సాంప్రదాయ నాయకత్వం, గిరిజనేతరులైన వడ్డీ వ్యాపారులు, గిరిజనులను ఆర్థికంగా దోచుకుంటున్న వైనంతో పాటు ప్రస్తుతం ఆధునిక గిరిజన జనాభా పోడు వ్యవసాయం నుంచి కాఫీ తోటలు సాగు చేసే స్థాయి వరకు సాధించిన అభివృద్ధిని కూడా వ్యాస ర చయిత ఇందులో పేర్కొనడం అభినందనీయం.
ఇక గిరిజనులు అంటేనే సాంస్కృతి సాంప్రదాయాల వారసులుగా చెప్పుకుంటాం. అంతేకాక వారిలో అబ్బురపరిచే జీవన సంస్కృతి ఆగుపిస్తుంది ఈ వ్యాస సంపుటలో ఈ కోవకు చెందిన వ్యాసాలు కూడా మనం చదివే వీలు కల్పించారు. గోండు గిరిజనుల సలహాదారులైన ‘‘ప్రధానులు’’ అనే గిరిజన ఉపతెగ ప్రస్థానంతో పాటు,యానాదులు కొండరెడ్లు చెంచులు రాచకోయలు గుండులు తదితర గిరిజన జాతుల వారి జీవన విధానం సంస్కృతి సాంప్రదాయాలను వివరించే విశేషమైన వ్యాసాలు ఇందులో ఉన్నాయి, మనం అంతా గోండులు అని వ్యవహరిస్తున్న వారు గోండ్లు కాదు కోయత్తుర్లు అనే సహేతుక విశ్లేషణ కూడా వ్యాస రచయిత ఇందులో చేశారు.ప్రస్తుత గిరిజన సాహిత్యంలో అత్యంత ప్రధాన పాత్ర వహిస్తున్న విషయం’’ గిరిజన చట్టాలు’’ వీటికి సంబంధించిన విలువైన సమాచారయుతమైన వ్యాసాలు ఇందులో పొందుపరిచారు, ఉమ్మడి అటవీ యాజమాన్య చట్టం, అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం గురించిన ఎంతో ఉపయుక్త సమాచారం ఇందులో వివరించబడిరది. అలాగే గిరిజన యువతలో విద్యావంతులతో పాటు పెరుగుతున్న నిరుద్యోగిత గురించి కూడా వివరిస్తూనే గిరిజనులకు మాతృభాషలో విద్యాబోధన లేని తీరు, భాష అంతరిస్తే జరిగే పరిణామాలు గిరిజన పాఠశాలల సంఖ్య తో పాటు పెరగాల్సిన సౌకర్యాలు గురించిన వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. వ్యవస్థాగత లోపాల కారణంగా గిరిజన అక్షరాస్యత దేశవ్యాప్తంగా 58.96% మాత్రమే కాగ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే గణాంకాలు ఉన్నట్లు చెబుతూ.. మైదాన ప్రాంతాల్లో కూడా గిరిజన అక్షరాస్యత ఆశించినంత ఎక్కువగా లేదనే అభిప్రాయం వెల్లడి చేశారు. అంతేకాక గిరిజన స్త్రీ అక్షరాస్యత 40% మాత్రమే ఉండటం మరింత అన్యాయంగా వ్యాసకర్త అభిప్రాయం వ్యక్తం చేశారు. గిరిజన జన జాతుల్లో ఒకటైన ‘‘సవర’’ తెగ గురించిన సంపూర్ణ వివరణలో భాగంగా చిత్రకళలో వారి నైపుణ్యాన్ని వారు ఇచ్చే ప్రాధాన్యతల గురించి ఎంతో ఆసక్తిగా విశేషంగా వివరించారు ‘‘ఇడి సింగ్‌ లేని ఇల్లుండదు’’ వ్యాసంలో. ఇలా ఈ 34 వ్యాసాలు వేటికవి ప్రత్యేకతలు కలిగి ఆసక్తి విశేషాలతో కూడిన విలువైన సమాచారం నిండి ఉన్నాయి. వ్యాసాలు అనగానే పాఠకుల దృష్టి అదో గణాంకాల సమూహం, అనే సాధారణ అభిప్రాయం ఉంటుంది కానీ ఈ వ్యాసాల రచయిత ఒక పరిశోధకుడు మాత్రమే కాక అర్థశతాబ్దం పాటు అచ్చంగా గిరిజనులతోనూ వారు నివసించే ప్రాంతాల లోను అత్యంత దగ్గర సంబంధాలతో నివసించిన వ్యక్తి అలాగే 1980 దశకంలో గోండు గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే లండన్‌ విశ్వవిద్యాలయ మానవ శాస్త్ర ఆచార్యుడు, గిరిజన పరిశోధకుడు, నైజాం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, అయిన ‘‘హేమన్‌ డార్ప్‌’’ తో డాక్టర్‌ శాస్త్రి ప్రత్యక్ష పరిచయం, వారి పర్యటనల్లో భాగస్వామి కూడా అయిన అనుభవాల సారం తదితర ప్రత్యేక అర్హతలు గల ఈ వ్యాసర చయిత కలం నుంచి జాలువారిన ఈ అన్ని వ్యాసాలు అత్యంత ఉపయుక్తంగా ఉన్నాయి. వ్యాసాలు అన్నీ సాధారణ నిడివి అత్యంత సరళమైన భాష ఆసక్తిని పెంచే అనుభవ సంఘటనలు, తదితరాల మేళవింపుతో ఈ వ్యాస సంపుటి విలువ మరింతగా పెరిగింది, కేవలం గిరిజన జీవన విధానం, చరిత్ర, సంస్కృతి,తో పాటుగా పరిశోధనలకు అవసరమైన ప్రామాణిక విషయా లు గణాంకాలు దీనిలో నిక్షిప్తమై ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ప్రతి ఒక్కరితోపాటు పరిశోధకులు విధిగా చదవాల్సిన వ్యాసావళి ఇది.
ఆదివాసి ఆత్మగౌరవం… వ్యాసకర్త: డాక్టర్‌ వి ఎన్‌ వి కె శాస్త్రి, పేజీలు: 152, వెల: రూ 90/-ప్రతులకు: నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ అన్ని బ్రాంచీలు. ఫోను: 040 – 27665420. సమీక్షకుడు: డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌:7729883223.

గిరిజన కథల పొది..ఇప్ప పూలు

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయత ‘ ఐ.ఏ.ఎస్‌ అధికారి అయిన అపరమేధావి ‘‘ గూడూరు రాజేందర్రావు గారి ’’ కలం నుంచి జాలు వారిన ‘విప ్పపూలు’ -డా. అమ్మిన శ్రీనివాసరాజు


తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలది ఒక ప్రత్యేక స్థానం,గిరిజనుల సంస్కృతి సాంప్రదా యాలు ఎలాంటి విశిష్టత,ప్రత్యేకతలు,కలిగి ఉం టాయో ఆ కథలు కూడా అంతే వైవిధ్యం నింపుకొని సాగుతాయి. 1910లో తెలుగు సాహిత్యంలో కథల తలుపులు తెరుచుకుంటే 1932లో గూడూరు రాజేంద్రరావు ‘‘చెంచి’’ కథతో గిరిజన కథల ప్రవేశం మొదలైంది. ప్రారంభంలో గిరిజన జన జాతికి చేరువలో జీవనం సాగించిన, అడవిబిడ్డలపై అభిమానం గల రచయితల నుంచి అరకొరగా గిరిజన ప్రత్యేక కథలు వెలువడ్డాయి.
అనంతర కాలంలో ఆదివాసుల్లో కూడా అక్షరాస్యత దినదిన ప్రవర్తమానమై వారిలో కూడా రచయితలు ఆవిర్భవించారు. అంతకు ముందుగల వారియొక్క ‘‘నోటి సాహిత్యం’’ను అక్షరబద్దం చేసే పని ప్రస్తుతం విస్తృతంగా జరుగుతుంది. గతంలో గిరిజనుల పోరాటాలు, అన్యాయా లకు గురవుతున్న తీరు,వారికష్టాలు మాత్రమే కథా వస్తువులుగా కథలు వెలువడి అవి అన్ని ‘‘సానుభూతి కథల’’ జాబితాలో చేరిపోయాయి. అనంతరం వచ్చిన గిరిజనులే వ్రాసిన గిరిజన కథల్లో విస్తృత మార్పులు చేరి వారి సంస్కృతి సాంప్రదాయాలే కథా వస్తువులుగా గిరిజన కథలు వెలబడుతూ..‘‘స్వానుభవ కథల’’ జాబితాగా తయారయ్యాయి, కథలు అవే అయినా వస్తువుల్లో భిన్నత్వం సంతరించుకొని అటు పాఠకులకు ఇటు పరిశోధకులకు పూర్తి సంతృప్తిని అందిస్తూ తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
గిరిజన జీవితాలకు సంబంధించి విశ్వవిద్యాలయ స్థాయిలో విస్తృత పరిశోధనలు జరిగిన గిరిజన కథల గురించిన పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. భావి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మంకు చెందిన ప్రముఖ సీనియర్‌ రచయిత, జీవన్‌ అవిశ్రాంత సాహితీ కృషిలో భాగంగా ఆయన సంపాదకత్వంలో2009 సంవత్సరంలో 29 కథలతో ‘‘ఇప్ప పూలు’’ గిరిజన సంచార తెగల కథా సంకలనం వెలువడిరది, దానికి లభించిన అత్యధిక ఆదరణతో మరో పదకొండు అచ్చమైన గిరిజన కథలు జోడిరచి మొత్తం 40కథలతో ‘‘ఇప్పపూలు’’ మలికథా సంకలనం ఇటీవల వెలువడిరది. దీనిలో 30% సంచార జాతుల వారి జీవన దర్పణాలైనా కథలు మినహాయిస్తే అన్ని అచ్చమైన అడవి జాతి బిడ్డల కథలే…!! జయధీర్‌ తిరుమలరావు, వంశీకృష్ణ, వంటి లబ్ద ప్రతిష్టులైన రచయితల గీటురాళ్ల వంటి ఆప్త వాక్యాలు అదనపు ఆకర్షణగల ఈ కథా సంకలనం నిజంగా తెలుగు కథ సాహిత్యంలో వెలువడ్డ తొలి గిరిజన కథా సంకలనంగా చెప్పవచ్చును. బోయ జంగయ్య వ్రాసిన ‘‘ఇప్ప పూలు’’ కథ నే శీర్షికగా ఎంచుకున్న ఈ కథా సంకలనంలోని ప్రతి కథ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. లంబాడా గిరిజన కుటుం బాలలో పేదరికం వల్ల, పుట్టిన ఆడపిల్లల సంతానాన్ని డబ్బులకు అమ్ముకుంటున్న దీన పరిస్థితులకు అక్షర రూపం అయిన ‘‘ఇప్ప పూలు’’ కథలో ఇప్ప సారా తయారు చేయడం కుటీర పరిశ్రమగా చెబుతూ పోలీసులు ఆ నెపంతో లంబాడా సామాజిక వర్గం వారిని శారీరకంగా ఆర్థికంగా ఎలా దోచు కుంటున్నారో కూడా ఈ కథలో మరో కోణం ద్వారా చూపించారు. ముందు తరం గిరిజన కథకుడు గూడూరు రాజేంద్ర రావు మొదలు నేటితరం యువ గిరిజన కథకుడు రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ వరకు 40మంది కథకుల నవ్య కథా రీతులు ఇందులో మనం చదవవచ్చు. బహు విశేషాల వేదిక అయిన ఈ కథల పందిరిలో ప్రజావాగ్గేయ కారుడు పాటల పోరు బిడ్డ వంగపండు ప్రసాదరావు వ్రాసిన కథ కూడా ఉండటం మరో విశేషం!! ‘‘వంగపండు’’ అంటే పాట గాడు గానే అందరికీ తెలుసు, కానీ అతనిలోని అద్భుతమైన కథకుడిని ఆవిష్క రించింది ఆయన వ్రాసిన ‘‘కొండ పందికొక్కు’’ కథ, అమాయకపు అడవి బిడ్డలు వ్యాపారస్తుల మోసాలకు ఎలా బలి అవుతున్నారో తెలుపుతూ తద్వారా ఉద్య మాలవైపు, సంఘాల వైపు, గిరిజనులు మొగ్గు చూపుతున్న తీరు గురించి తనదైన ఉద్యమ శైలిలో ఈ కథను వంగపండు వ్రాశారు. ఇక గిరిజన రచయితలైన మల్లి పురం జగదీష్‌,భూక్యా తిరుపతి,పద్దం అనసూయ,రమేష్‌ కార్తీక్‌ నాయక్‌,తిమ్మక రాంప్రసాద్‌, వంటి వారి కథలు ఈ సంపుటికి మరింత ప్రత్యేకతను అందించాయి ఈ ఐదు కథలు గిరిజన సంస్కృతిసాంప్రదాయాలు ప్రధాన భూమికగా చెప్పబడ్డాయి. భూక్య తిరుపతి ‘‘కాక్లా’’ కథలో లంబాడా సామాజిక వర్గంలో గల కాకుల కలయికతో ముడిబడ్డ ఒక అపనమ్మకాన్ని వారు సంప్రదాయంగా ఎలా కొనసాగిస్తున్నారో చెబుతారు.మల్లిపురం తన ‘‘దారి’’ కథలో అడవి బిడ్డల రోజువారి దినచర్యలను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తూనే ఆదివాసులు ఐక మత్యంతో తమను మోసగిం చిన తమ ప్రాంతపు అధికారిపై ఎలా ఎదురు తిరిగారో ఆవిష్కరిం చారు.ఇక చావు నేపథ్యం లో కథలు వ్రాసి తనదైన ప్రత్యేకతను చాటు కున్న ‘‘పద్దం అనసూయ’’ వ్రాసిన ‘‘మూగ బోయిన శబ్దం’’ కథలో గిరిజన జన జాతి అన్యమత ఊబిలో ఎలా కూరుకుపోతున్నదో చక్కగా వివరించారు, సంస్కృతి సాంప్రదా యాలపై అన్యమత దాడి గురించి ఈ కథలో ఆలోచనత్మకంగా చెప్పారు.
‘‘ప్రాచీన పురుడు’’ తీరు గురించి సందేశాత్మకంగా ఆవిష్కరించిన మరో గిరిజన కథారచయిత రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ రాసిన కథ ‘‘పురుడు’’,పాత్రోచితమైన సంభాషణ తీరు దీనిలో మనకు ఆవిష్కరించబడిరది ఇదే తీరుకు తార్కాణకంగా నిలిచే మరో కథ ‘‘పిన్లకర్ర’’ గిరిజన యువత పట్టణాలపై మోజుతో అక్కడకు చేరి తమ చక్కని సంస్కృతితో పాటు విలువైన ఆరోగ్యాలను ఎలా కోల్పోతున్నారో.. ఈ కథ కళ్ళకు కట్టింది.మొత్తానికి ఈ కథా సంకలనంలో 40కథలు వ్రాయబడ్డ కాలాల రీత్యా 50సంవత్సరాల నిడివి ఉంది ఈ ఐదు దశాబ్దాల నడుమ అనేక ఆధునిక మార్పులు వచ్చి చేరాయి కానీ గిరిజన జీవన విధానంలో వారి అణిచివేతలు, దోపిడి, ఆధిపత్యం, తదితర మోసాల్లో మాత్రం తేడా రాలేదు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు లోబడే వారి మీద అన్యాయాలు అక్రమాలు రూపాం తరం చెందాయి.ప్రాంతాలవారీగా విభజించ బడ్డ,ఈగిరిజన కథలసమాహారం లోని కథల తీరు గమనిస్తే,..ఆస్తులు అంతస్తులు కాదు పీడన,దోపిడి కూడా ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ అదో గొలుసు వలయమై నిరంతరం కొనసాగుతుంది, కానీ దానిని ఎక్కడో ఒక చోట ఛేదించి నియం త్రించాలి, లేకపోతే భవిష్యత్తులో ఈ ఆదిమ తెగల మనుగడకు భారీ ప్రమాదం ఏర్పడి మహా ఉత్పాతం కలగవచ్చు, దాని నుంచి రక్షించే దిశగా సాగుతున్నదే ఈఅక్షర చైతన్య కథాయాత్ర. తరాలు మారిన తలరాతలు మారని గిరిజన స్త్రీల స్థితిగతులు, ఆందోళన కలిగిస్తున్న తీరును ఈ గిరిజన సంచార జాతుల కథాసంకలనం ఆవిష్కరించింది. గిరిజన హక్కులు మానవ హక్కులే అని ఎలుగెత్తి చాటిన ‘‘పోరాటశీలి’’బాలగోపాల్‌,స్మృతిగా ఈ ‘‘ఇప్ప పూలు’’ కథా సంకలనం ప్రచురించిన సంపా దకులు ప్రచురణకర్త జీవన్‌ గారికి అభినందనీయులు.అడవి బిడ్డలతో పాటు అణగారిన వర్గపు సంచార తెగల బతుకుల వెతలు కూడా ఇందులో మనం చదవవచ్చు, పెద్దింటి అశోక్‌ కుమార్‌,బిఎస్‌ రాములు, ఏ.విద్యాసాగర్‌, బోయ జంగయ్య, జాతశ్రీ, అల్లంరాజయ్య, అట్టాడ,గంటేడ వంటి లబ్దప్రతిష్టలైన వారి కథల్లోని భావ సొగసులతో పాటు వర్ధమాన కథా శీలురైన డా:జడా సుబ్బా రావు,బాల సుధాకర్‌ మౌళి,ఆప్త చైతన్య,ల ఆధునిక కథన రీతులు ఈ కథా సంకలనంలో మనం గమనించవచ్చు.బహురుచుల విందు భోజనంలా బహుముఖీయమైన కథల సమా హారం ఇది,కథ ప్రియులకే కాక పరిశోధక విద్యార్థులకు ఇది ఒక మార్గదర్శి వంటి అపురూప కథా పేటిక, ఇదో చారిత్రక దీపిక.

తెలంగాణ గిరిజనులు`భాషా సాహిత్యాలు

గిరిజన భాష అనగానే అది ఒక ఆదిమ భాష లిపిలేని మౌకిక సాహిత్యానికే పరిమి తమైన పేద భాషగా చెప్పుకుంటాం కానీ కాలానుగుణంగా వస్తున్న మార్పులు, విద్యాసాయంగా గిరిజన యువతలో పెరిగిన ఆలోచన తద్వారా గిరిజన జన జాతికి చెందినవారు విశ్వవిద్యాలయ స్థాయి విద్యలు పూర్తిచేసుకుని తమలోని పరిశోధన శక్తిని వెలికి తీసుకుని, తమ జాతి భాషా సంస్కృతుల ఉన్నతి కోసం కృషి చేస్తున్న శుభ సమయం ఇది.
దీనికి తోడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద యం తరువాత తెలంగాణ సాహితీ సంస్కృతుల గురించి జరుగుతున్న ప్రత్యేక అధ్యయనాలలో భాగంగా రాష్ట్రంలోని రచ యితలు,విద్యావేత్తలు,విద్యాలయాలు సంస్థలు విశ్వవిద్యాలయాలు తెలంగాణ భాషా సంస్కృతల వికాసమే లక్ష్యంగా కృషి ప్రారంభించాయి.అందులో భాగంగానే 2015లో నాటి ఆంధ్ర సారస్వర పరిషత్‌ అయిన నేటి తెలంగాణ సారస్వత పరిషత్‌ తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భాషా సాహిత్య వికాసం పనిలో భాగంగా‘‘తెలం గాణ గిరిజన భాషా సాహిత్యాలు’’అనే ఉపయుక్త గ్రంథం ప్రచురించింది. నాటి పది జిల్లాల తెలంగాణలో గల గిరిజన జాతులు వాటికి చెందిన ప్రజల భాషలు,వారి విశిష్ట జీవనశైలి గురించి విస్తృతంగా వివేచనాత్మకంగా చర్చించడం కోసం పరిషత్‌ ఒక సదస్సు ఏర్పాటు చేసి పరిణితి గల భాష సంస్కృతుల వికాసం కోసం సుదీర్ఘ కాలంగా కృషి చేస్తున్న భాషా సేవకులను వక్తలుగా ఆహ్వానిం చింది.వీరితోపాటు గిరిజన భాష సాహిత్యాల గురించి విభిన్నమైన కోణాల్లో పరిశోధనలు చేసిన వారు చేస్తున్నవారు ఈభాషా సదస్సులో పాల్గొని వారి వారి విలువైన అభిప్రాయాలు అనుభవాలు ప్రసంగ వ్యాసాలు ద్వారా అందించారు, వాటి అన్నిటిని అమూల్యమైన గ్రంథంగా వెలువరించారు.నాటి సంస్థ అధ్యక్షులు డా: సినారె.ప్రధాన కార్యదర్శిడా:జె.చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈపుస్తకం వెలువడిరది. తెలంగాణలోని వివిధ గిరిజనభాషల వైలక్ష్యాన్ని ఇందులో వ్యాసాలు ప్రతి భావంతంగా ఆవిష్కరించాయి అనడంలో అక్షర సత్యం ఉంది.దీనిలో మొత్తం 30 అంశాల గురించి 30మంది నిష్ణాతులైన వ్యాస రచయితలు అందించిన వ్యాసాలు ఇందులో నిక్షిప్తం చేయబడ్డాయి. తెలంగాణలోగల గిరిజనజాతి వారైనా గోండులు,ప్రధాన్‌లు,బంజారాలు, కొండరెడ్లు,ఆంధ్‌లు,కోయలు,ఎరుకల, యానాదులకు సంబంధించిన భాషలు సంస్కృతులు సామెతలు పొడుపు కథలు, జాతీయాలు,అలంకారాలు,గేయ సాహి త్యం,అంశాల గురించి కూలంకుశమైన చర్చలు విశ్లేషణలు ఈవ్యాసాల్లో మనకు కనిపిస్తాయి.ప్రాంతాలవారీగా విస్తరించి నివసిస్తున్న గిరిజన జాతుల గురించి ఆయా వ్యాసకర్తలు వివరించారు,సోయం భీంరావు,‘‘గోండి భాష సాహిత్యాలు’’అనే అంశం గురించి వ్రాసిన సుదీర్ఘ వ్యాసంలో గోండిభాష గురించిన సంపూర్ణ విశ్లేషణ చేస్తూ తరతరాలుగా అంతరించిపోతున్న గోండు భాష గురించి చెబుతూ…65 సంవత్సరాలు పైబడ్డ గోండుగిరిజనులు తమ మాతృభాషను స్వచ్ఛంగా అధికంగా మాట్లాడుతున్నారని,15-20సంవత్సరాల మధ్యవారంత తమసంభాషణల్లో ఆంగ్లం, హిందీ,తెలుగు,భాషలపదాలు కలగలిపి మాట్లాడుతూ తమదైన గోండు మాతృ భాషను నిర్వీర్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు.
అలాగే ఆధునిక పద్ధతుల్లో గోండిభాష విస్తరిస్తున్న తీరు కూడా వివరించారు. ఇంటర్నెట్లో గోండిసాహిత్యం,సంగీతం, పాటలు,పొందుపరిచి విశ్వవ్యాప్తం చేసిన వైనం గురించి కూడా పేర్కొన్నారు. వార్తా పత్రికల ప్రచురణలో గోండిభాష పాత్రను వివరించారు.
గిరిజన జాతులు అన్నిటిలోనూ ఉన్నతమైన గోండు జాతికి 17,18వశతాబ్ధాంల్లోనే లిపి ఉన్నట్టు చెబుతూ గోండు లిపి చదివిన పెందోర్‌లింగోజి,ఆత్రంరాంజీ, ఆత్రం మాన్కు,కోట్నకజంగు,ఆత్రం కమ లాబాయి,అనే మూడు తరాలకు చెందిన వ్యక్తులపేర్లు పేర్కొన్నారు.
గుండు భాషలోని పాటలు గోండిభాష మాట్లాడే ప్రాంతాలతో పాటు భాషాప రమైనవ్యాకరణం నామాచకాలు కొలతలు చెట్లు,గృహోపపకరణలు వంటి వాటికి తెలుగు అనువాదాలతో కలిపి వివరణలు ఇచ్చారు.
‘‘తెలంగాణ గిరిజనభాషా సాహిత్యాలు’’ అనే అంశం గురించి ‘‘పసుల బుచ్చయ్య’’ రాసిన మరో సుదీర్ఘ వ్యాసంలో నాయక పోడు గిరిజన తెగకు సంబంధించిన భాషా సాహిత్యాల గురించి సుదీర్ఘ వివరణ చారిత్రక ఆధారాలతో అందించబడిరది. గిరిజన తెగల్లోనే ఒక విశిష్టమైన ‘‘ఎరుకల’’జనజాతి గురించి కె.వివేక్‌ వినా యక్‌ రాసిన ఆంగ్ల వ్యాసం,పరిశోధక విద్యార్థిని బి.భీమమ్మ వ్రాసిన‘‘ఎరుకల వారి సంస్కృతి సాహిత్యం’’అనే వ్యాసం ఎరుకల సాహిత్యం భాషల గురించి తెలియజేశాయి.
ఇక కొండ రెడ్ల గురించి వారి జీవన విధానం నివాసం,ఆహారం,పండుగలు, తదితర సాధారణ విషయాలు తప్ప సాహి త్యం భాషల జోలికి పోలేదు. గోండుల తర్వాత అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తున్న వలస గిరిజన జనజాతి అయిన ‘‘బంజా రాలకు’’సంబంధించి దీనిలో అనేక విషయాలు చర్చించబడ్డాయి. బంజారా భాషలో అలంకారాలు, సామెతలు,పొడుపుకథలు,గేయసాహిత్యం, బంజారాభాషా స్వరూపం వైశిష్యం సంస్కృతి సాహిత్యం ప్రపంచీకరణలో మాయమవుతున్న బంజారా సంస్కృతి, తెలుగు బోధన భాషవల్ల బంజారా విద్యా ర్థుల సమస్యలు,తదితరాల గురించి అధిక వ్యాసాలు అగ్రస్థానంలో నిలిచాయి. వీటితోపాటు తెలంగాణ కథా సాహి త్యంలో గిరిజన స్త్రీ,తెలంగాణసాహిత్యం గిరిజనజీవితం,కొండాకోనల్లో కనిపించిన కోయ జీవితం,అనేవ్యాసాల ద్వారా తెలంగాణ తెలుగుసాహిత్యంలోగల నవలలు,కథల్లో గిరిజనులస్థానం గురించి పరిశోధనాత్మకంగావివరించడం జరిగింది. అన్ని గిరిజన జనజాతులకు సంబంధించి ఒకే ఒక సమస్య ఆభాషకు లిపి లేక పోవడం ఉన్నకొద్ది మాత్రంది కార్య క్రమంలో అంతరించిపోవడం ఈప్రధాన విషయాల గుండానే ఈ30వ్యాసాల పరిశ్రమ కొనసాగింది.
తెలంగాణ గిరిజన భాషాసాహిత్యాలపై పరిశోధన చేసే వారికి ఈగ్రంథం చక్కని దారిదీపంగా ఉంటుందని చెప్పవచ్చు మనకు గల అతితక్కువ తెలుగు గిరిజన భాషా సాహిత్య గ్రంథాలలో ఇది అత్యంత ఉన్నతమైనదిగా పేర్కొన వచ్చు.
చక్కటి పరిశోధనాత్మకమైన కృషితో సదస్సు నిర్వహించడమే కాక దాన్ని అంతటిని అక్షరబంధం చేసి గ్రంథరూపం తీసుకు రావడంలో తెలంగాణ సారసత పరిషత్‌ కృషి అభినందనీయం ఆచరణీయం, రేఖామాత్రంగా గల ఈఅంశాలు భవిష్య త్తులో మరింత కూలంకషంగా వివరణ తీసుకురావడమే కాక భాషా శాస్త్రవేత్తలు త్వరలోనే ఈఆదిమ భాషలకు లిపిని తయారు చేయడంలో సఫలీకృతులు కావాలని కోరుకుందాం.
డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

ఆదివాసీ జీవనం విధ్వంసం

సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకులుగా, అడవుల సంరక్షకులుగా వాసికెక్కిన వనవాసుల జీవనం ఆధునికులకు ఆశ్చర్యంగా ఉన్న అసలైన మానవ సంస్కృతి వారి వద్దేఉంది అన్నది వంద శాతం నిజం.అటువంటి అడవి బిడ్డల జీవన సంస్కృతుల గురించి ఇంతకాలం వారిని పరిశీలించిన దగ్గరగా జీవించిన వారే వ్రాయడం చూసాం చదివాం కానీ 20వ శతాబ్దంలో వచ్చిన ఆధునిక మార్పుల్లో భాగంగా అడవి బిడ్డల్లో అక్షరాస్యత విరివిగా పెరగడంతో వీధి బడి చదువులో నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి ఆదివాసుల చదువులు ఎదిగాయి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడువాయి మండలం కామారం గిరిజన గ్రామానికి చెందిన మైపతిఅరుణ్‌ కుమార్‌ అనే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థి తన గిరిజన జన జాతికి చెందిన జీవనం గురించి,దాని విధ్వంసం గురించి కూలం కశమైన గ్రంథం వ్రాశారు. ఒక గిరిజన యువకుడు అందున పోరాట నాయకుడు, అయిన అరుణ్‌ కుమార్‌ ఈ రచన చేయడానికి 2012లో సుమారు నెలరోజుల పాటు 5848 కిలోమీటర్ల దూరం పర్యటించి తెలుగు ప్రాంతాలే కాక పక్క రాష్ట్రాల్లోని గిరిజన గ్రామాలను సందర్శించి స్థానిక చరిత్రలతో పాటు అక్కడి భౌగోళికత, గిరిజనజీవన స్థితి గతులు, ఆధునిక ప్రపంచీకరణ ద్వారా ఆదివాసులకు జరుగుతున్న నష్టాలు, భావితరం తీసుకోవలసిన జాగ్రత్తలు, గురించి, సవివరంగా సచిత్రంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు.502 పేజీలు గల ఈ బృహత్తర రచనను 30 అధ్యాయాలుగా విభజించారు, ఆదివాసి స్వయం పాలన ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ బియ్యాల జనార్దన్‌ రావు గారికి అంకితం ఇవ్వబడ్డ ఈ గ్రంథం నాటి వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యం, మొదలుకొని దేవాదుల ప్రాజెక్టు, కమలాపురం కాగిత పరిశ్రమ, అశ్వాపురంభార జల కర్మాగారం, భద్రాచలం పేపర్‌ బోర్డు, మొదలుకొని.. రంప రాజ్యం రంప పితూరి శ్రీకాకుళం గిరిజన ఉద్యమం దాని కారకుడు సత్యం మాస్టారు వాకపల్లి అమాను షత్వం, బొండా,భగత,గిరిజన జీవన విధానాలు మర్రి కొమరయ్య పోరాటం ఇలా అనేక విషయాలు ఇందులో వివరించబడ్డాయి. అలాగే నల్లమల చెంచుల జీవితాలు, చెంచుల చెరవిడిన శ్రీశైల క్షేత్రం, చెంచుల జీవావరణ వ్యవస్థ, ప్రమాదంలో చెంచుల మనుగడ, గురించి కూడా ఇందులో హెచ్చరించారు రచయిత, ఇక ఆదిలాబాద్‌ గుండులు తొలి పోరాటయోధుడు రాంజీ గోండు,కేస్లాపూర్‌ నాగోబా జాతర,బాసర క్షేత్రం,గోండ్వానా రాజ్య పాలన చరిత్రతో పాటు గోండుల ఆరాధ్య దైవం హైమన్‌ డార్ప్‌,గుస్సాడి నృత్యం, తదితర జగద్వితమైన విషయాలను భిన్నకోణాల్లో క్షేత్ర పర్యటనల అనుభవసారం జోడిరచి, అనేక ప్రామాణిక విషయాలు, విశేషాలతో ఈరచన చేయబడిరది,
గిరిజన ప్రాంతాలలోని వాస్తవాలతో పాటు, చరిత్ర, గణాంకాలు, చిత్రపటాలతో ఈ బృహత్తర గ్రంథం పరిపూర్ణ ప్రామాణికత సాధించింది అనడంలో అతిశయం అనిపించదు.
రచన శైలి కూడా సరళమైన బాణీలో ఉండి పాఠకులకు అనుకూలంగా చదివించే విధంగా ఉంది.
అచ్చమైన ఆదివాసి జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర పూర్వకథ తోపాటు పూజా విధానాలు వారి ఆచారాల ప్రకారం ఎలా చేస్తారు వివరిస్తూ నీటి ఆధునిక సమాజం గిరిజన ఇతరులు జాతరను హస్తగతం చేసుకుని అసలు సాంప్రదాయాన్ని ఎలా కనుమరుగు చేస్తున్నారో చెబుతూ రచయిత అరుణ్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు.
పాల్వంచ అటవీ ప్రాం తానికి చెందిన గిరిజన పోరాట యోధుడు, చరిత్ర విస్మరించిన వీరుడు, అయిన ‘‘సోయం గంగులు’’ పోరాటతీరు అమరుడైన వైనం, గురించి ఇందులో పేర్కొనడం ద్వారా రచయిత అరుణ్‌ లోని సూక్ష్మ పరిశీలన, పరిశోధన దృష్టి అర్థమవుతుంది, ఇలా వ్యక్తులే కాకుండా ప్రాంతాలు ఆచారాలు, ఆహారాలు, పండుగలు, మొదలైన అనేక విషయాలు, విశేషాలు, గురించి భిన్నకోణంలో ఇందులో వ్యక్తీకరించబడి తద్వారా అనేక నూతన విషయాలు సంఘటనలు ఆవిష్క రించ బడ్డాయి.కేవలం గిరిజన ప్రాంతాల్లో ప్రపంచీకరణ సాయంగా జరుగుతున్న యుద్ధం, గురించి విమర్శించి వదిలేయలేదు, కానీ నిలుపుదలకు తీసుకోవలసిన చర్యలు చట్టాలు అమలుకు తీసుకోవలసిన తక్షణ చర్యల గురించి కూడా నిర్మొహమాటంగా వివరించి జాగృతంతో కూడిన హెచ్చరికలు చేశారు రచయిత.
ఒక గ్రామాన్ని షెడ్యూల్‌ ఏరియాగా గుర్తించడానికి ఉండాల్సిన అర్హతలు గురించి చెబుతూ ప్రధాన లక్షణాలైనా అధిక శాతం ఆదివాసీలు ఉండటం,
ఆ గ్రామ అభివృద్ధి స్థాయి,ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటందుకు గల విస్తీర్ణం,వంటి ప్రాథమిక మార్గదర్శకాలు ఇందులో చెప్పారు, అలాగే చాలా గిరిజన గ్రామాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా షెడ్యూల్‌ గ్రామాలుగా ఎంపిక చేయబడక, అక్కడ గిరిజనులు అయిదవ షెడ్యూల్‌ హక్కులు ఎలా కోల్పోయి నష్టపోతున్నారో కూడా ఇందులో వివరించారు.
వాకపల్లి అడవితల్లి ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం, భూపతిపాలెం ప్రాజెక్టు, కన్నెధార గ్రానైట్‌ పరిశ్రమ వల్ల అక్కడి ఆదివాసీల జీవనానికి వాటిల్లుతున్న ముప్పు,
గుర్తు చేస్తూనే శ్రీకాకుళం ప్రాంత సవర గిరిజనుల నృత్యాలు, ఆచారాలు, తో పాటు వారి ఉన్నతికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి గురించి కూడా గుర్తు చేశారు.
అలాగే ఆదిలాబాద్‌ ప్రాంతానికే వన్నెతెస్తున్న ‘‘కుంటాల జలపాతం’’ ఎలా కనుమరుగు కాబోతున్నదో కూడా చెబుతూ ఇది శకుంతల దుష్యంతుల విహార కేంద్రమని, మొదట దీనిని ‘‘శకుంతల జలపాతం’’గా పిలిచేవారని కాలక్రమంలో ‘కుంటాల’గా రూపాంతరం చెందిందనే చారిత్రిక విషయాలను కూడా ఇందులో వివరించారు.
అదేవిధంగా కొమరం భీమ్‌ పోరాట క్షేత్రం జోడేఘాట్‌ గురించి, పోరాటం యొక్క నేపథ్యం గురించి కూడా ఆసక్తికర విషయాలు విశేషాలు ఇందులో పొందుపరిచారు.
గోండుల గుస్సాడి గురించి, నాగోబా జాతర నేపథ్యం వివరాలు ఇలా… ప్రసిద్ధ, అప్రసిద్ధ అనే తేడా లేకుండా సంపూర్ణ గిరిజన సమాచారం వెలికి తీసి అక్షరీకరణ చేయడమే లక్ష్యంగా అరుణ్‌ కుమార్‌ అక్షర కృషి కొన సాగింది అనడానికి నిండు నిదర్శనం ఈ బృహత్తర పుస్తకం.
ఆదివాసి జీవనం గురించి తెలుసుకోవాలి అనుకునే పాఠకులే కాదు, గిరిజన విజ్ఞాన పరిశోధకులు విధిగా చదివి తీరాల్సిన ఉత్తమ పొత్తం ఇది.- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

స్వీయ అనుభూతి గురి

నేటితరం గిరిజనసాహిత్యంకు ప్రామాణికతను పెంపొందించే దిశగా జరుగుతున్న కృషిలో భాగంగా…’’వర్తమాన గిరిజన సమాజానికి కావలసింది సానుభూతి సాహిత్యం కాదు సహను భూతి సాహిత్యం’’ అని ఘంటాపధం గా చెప్పడమే కాదు ఆచరించి చూపిస్తున్న నేటి కాలపు బంగారు భవిత కలిగిన రచయిత నేటి తరం యువతరానికి ఆదర్శనీయుడు ‘‘మల్లిపురం జగదీశ్‌’’ మలి కథా సంపుటి ‘‘గురి’’,2013 నుంచి 2018సం: మధ్యకాలంలో రాయబడ్డ ఈ 13 కథల్లో.. ఉత్తరాంధ్ర ప్రాంతపు గిరిజన సమాజం ప్రపంచీకరణ పడగ నీడన ఎలా విలవిలలాడుతుందో కళ్ళకు కట్టినట్టు అక్షర బద్ధం చేశారు.
అయితే ఈ వ్యధలు కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం కాలేదు యావత్తుదేశానిదికూడ…!! రచయిత తను స్వయంగా సవిచూసిన విషయాలను అక్షరబద్ధం చేసే బాధ్యతలో భాగంగా తనదైన కథా శైలిలో అభివ్యక్తీకరించారు, దీనిలో ప్రతి కథ తన గిరిజన సామాజిక కుటుంబాల చుట్టూ పరిభ్రమిస్తుంది.
మానవ సంబంధాలు అన్ని ‘‘మనీ సంబంధాలు’’గా రూపాంతరం చెందుతున్న క్లిష్ట పరిస్థితుల్లో.. అడవి బిడ్డల మునుగుట ప్రశ్నార్థకం అయిపోతున్న కాలంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం గురించి వివరిస్తూ జాగృతం చేసే లక్ష్యంతో వ్రాయబడ్డ కథలుగా కనిపిస్తాయి ఇవన్నీ.
అన్ని మార్గాల ద్వారా దాడికి గురి అవుతున్న అడవి బిడ్డల దయనీయ స్థితిని అద్దం పడుతున్న ఈ ‘‘గురి’’ కథాగుచ్చంలోని పతాక శీర్షిక అయిన కథ విషయానికొస్తే తరతరాలుగా ఆదివాసి బిడ్డలపై జరుగుతున్న అరాచకాలు దరిమిలా అడవి బిడ్డల్లో వస్తున్న తిరుగుబాటు తత్వం గురించి అక్షరీకరించిన కథ ‘‘గురి’’ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆదివాసి బిడ్డల జీవితాలపై పెట్టుబడిదారీ వ్యవస్థ సాగిస్తున్న అణచివేత ధోరణి తీరు ఆధునిక పాఠక లోకానికి ఆశ్చర్యం కలిగించక మానదు, ఆధునిక కాలంతో పాటు అడవి బిడ్డల బ్రతుకు చిత్రాల్లో ఆధునిక జీవన సరళి అగుపిస్తున్న అణచివేత కూడా అదే స్థాయిలో ఆధునిక పంథాల్లో సాగటం పట్ల రచయితతో పాటు పాఠకులు ఆగ్రహించి నివారణోపాయాలు గురించి ఆలోచించాల్సిన తరుణమిది.గురి కథలు మంగులు అతని కొడుకు సత్యం ఏవిధంగా పెత్తందారులైన భూస్వాముల అరాచకాలకు బలి అయ్యారో మల్లిపురం జగదీశ్‌ తనదైన కథన శైలిలో కళ్లకు కట్టారు. మంగులు,సత్యం తండ్రి కొడుకులు ఇద్దరి కథనాల్లోనూ సంఘవిద్రోహక శక్తులుగా భావించబడుతున్న నక్సలైట్ల పాత్రను కథా రచయిత భావ గర్భితంగా సూచించారు, వారివల్ల అడవి బిడ్డలకు మేలా? కీడా?? అనే విషయాన్ని కాలానికి వదిలివేసిన, తల్లి తండ్రి అన్యాయాలకు బలై అనాధ అయిన సత్యం బ్రతుకుతెరువు కోసం పట్టణం తరలి పోయిన అతని పోరాట దృక్పథంలో మార్పు రాలేదు సరి కదా అది వారసత్వంగా తన కూతురు గీతకు ఆపాదించిన వైనం పోరాటస్ఫూర్తి, అందులోని సజీవత్వం ఆవిష్కరించబడతాయి. మహానటి సమాజంలో అక్రమాలను ఎదిరించిన తండ్రి మంగులు మంత్రగాడి నేరంతో సమా జానికి దూరం చేయబడితే నీటి కాలానికి చెందిన అతడి కొడుకు సత్యం తండ్రిలో ధనవంతులు అన్యాయాన్ని ఎదిరించి ఇన్ఫార్మర్‌ గా నేరం మోపబడతాడు అక్కడ సత్యం తప్పించుకుని నగరం బాట పడితే ఇక్కడ అతని కూతురు గీత తండ్రికి జరిగిన అన్యాయానికి ఎదురునిలిచి గురి పెట్టడం ద్వారా రచయిత గిరిజన సమాజానికి స్ఫూర్తిని ధైర్యాన్ని అందిస్తూ కథను ఉత్తమ కథా లక్షణాలతో ముగిస్తారు. బిడ్డల కష్టాల గురించి కథా రచయిత పరిశీ లించిన తీరు కోణాలు ఔరా అనిపిస్తాయి.’’ నిత్య నిర్వాసితులు’’ కథలో ప్రభుత్వ అధికారులు వారికి గల నియమాలను బూచిగా చూపిస్తూ అమాయకులైన ఆదివాసి జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో వివరిస్తారు. ముఖ్యంగా ప్రాజెక్టులవంటి బహుళార్థక కట్టడాలకు మొదట బలయ్యేది అడవి బిడ్డలే !! పాలకులు ప్రాజెక్టుల ద్వారా పంట భూములు విస్తీర్ణం పెంచుకొని నీటి సౌకర్యం పెంచుతు న్నామని ఏక కోణం ఆలోచనతోనే ముందుకు పోతున్నారు తప్ప ఎప్పటినుంచో ఆ గ్రామాల మీద ఆధారపడి జీవిస్తున్న అడవి బిడ్డల జీవి తాలు నిత్యనిర్వాసితం అయిపోతున్నాయనే మానవత్వపు ఆలోచనలు మన అధికారులకు కానీ పాలకులకు కానీరాకపోవడంపై రచయిత తీవ్ర విముఖత వ్యక్తం చేశారు ఈ కథలో. పెల్లివలస అనే గిరిజన గ్రామం ప్రాజెక్ట్‌ ముంపు ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి వలసరాగ దురదృష్టవశాత్తు ఆ గ్రామం అగ్ని ప్రమాదంలో కాలి బూడిద అయింది దానికి కేవలం తత్కాలిక తిండిగిం జలు పంపిణీ సాయంతో సరిపెట్టారు అధికా రులు,అది రెవెన్యూ గ్రామంగా గుర్తింపు కాలేదు కనుక పక్కా గృహాలు మంజూరు చేయలేమన్న అధికారుల అలసత్వం ఈ కథలో చూపించారు రచయిత. నిర్వాసిత గ్రామంలో ప్రకటించ డంలో అధికారులు చేసిన అలసత్వంవల్ల అమాయకులైన ఆదివాసీలు ఎలా నష్టపోయారో ఉదాహరిస్తూ ఇలాంటి చేయని నేరాలకు ఎలా శిక్షలు అనుభవిస్తున్నారో రచయిత ఇందులో వివరించిన వైనం హృద్యంగా సాగుతుంది, ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు గారు అన్నట్టు ఇవి కతలు కావు ఆదివాసి వెతలు, అడవుల్లో జరుగుతున్న అభివృద్ధి ఆధునీకరణల వల్ల అడవి బిడ్డలకు దక్కే ఫలా లు గోరంత అయితే పెట్టుబడిదారులకు కొం డంత ఆదాయం దక్కుతుంది అనే వాస్తవ విష యాలు చెప్పడంలో రచయిత మల్లిపురం గారు విజయం సాధించారు. యుగయుగాలుగా అభి వృద్ధి యజ్ఞంలో మొదట బలయ్యే’’బలిపశువు’’ ఆదివాసినినే అన్న రచయిత భావనలో నిండు నిజాం దాగి ఉంది. అలాగే ఆదివాసీ లకు ఆరోగ్య రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు నగరా లను ఎంత అభివృద్ధి చేస్తే ఏమిటి అని ‘‘డోలి’’ కథలో రచయిత ప్రశ్నిస్తారు, అడవి బిడ్డల్లో వస్తువ్యామోహం పెంచి అధిక లాభాలతో వారిని అప్పుల పాలు చేస్తున్న నాగరిక వ్యాపా రుల తీరును ఎండగట్టిన తార్రోడ్డు కథ, భూ విముక్తి పోరాటంలో పాల్గొన్న ఆదివాసీలు చివరికి భూమిని పోగొట్టు కున్న వైనాన్ని ధైన్యం గా చూపించిన కథ ‘‘తాండ్ర చుట్ట’’. సభ్య సమాజానికి తెలియని అడవి బిడ్డల ఆగచాట్లు ఎన్నో ఈ ‘‘గురి’’ కథా సంపుటిలో కనిపిస్తాయి, ఈ కథల్లో ఇంత ఘాడతకు కారణం రచయిత ఓగిరి పుత్రుడు కావడమే, అతడు గిరిజనుల ను చూసి రాసిన కథలుకావు, వారితో మమేకమై వ్రాసిన కథలు నిజమైన గిరిజన కథలకు నిల యమైన మన మల్లి పురం జగదీశ్‌ కథలు ప్రతి ఒక్కరికి అవసరం, గిరిజన జీవితాల పరిశో ధకులు ప్రత్యేకించి చదవదగ్గది –డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

విశాఖలో సి ఎం పర్యటన 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిభ కలిగిన యువ క్రికెటర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం ఉంటుందని, అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేయడంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్క రోజు పర్యటన నిమిత్తం గురువారం విశాఖపట్టణం చేరుకున్న ఆయన పోతిన మల్లయ్యపాలెం డా.వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ముందుగా స్టేడియం ముందరి భాగంలో ఏర్పాటు చేసిన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్టేడియం లోపల ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని యువ క్రీడాకారలు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, విశాఖపట్టణం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ముందుగా క్రికెట్ క్రీడా చారిత్రాత్మక విశేషాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి సందర్శించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన కె. అంజలి శర్వాణి, అండర్ -19 విభాగంలో ప్రాతినిధ్యం వహించిన శబనంకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేశారు. మెడల్స్తో సత్కరించి అభినందించారు. ఈ క్రమంలో అక్కడకు విచ్చేసిన సుమారు 100 మంది యువ క్రీడాకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. కుశల ప్రశ్నలు వేసి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, భవిష్యత్తులో జాతీయ స్థాయి క్రీడాకారులు మరింత మంది తయారయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తగిన ప్రణాళికలు రచించి ముందుకు వెళుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు అన్ని విధాలుగా సహకారం లభిస్తుందని అన్నారు. శక్తి సామర్థ్యాలు ఉండి ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి తగిన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రిని రాష్ట్ర ఉపాధ్యక్షులు రోహిత్ రెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాకేష్, సిఈఓ వెంకట శివారెడ్డి, ట్రెజరర్ చలం పురుషోత్తం తదితరులు దుశ్శాలువాతో సత్కరించారు. జ్ఞాపికను బహూకరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బివి సత్యవతి, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, జివిఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ, ప్రభుత్వ విప్ లు కరణం ధర్మశ్రీ, కోరుముట్ల శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు వరుదు కళ్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి, భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్ రాజ్, రెడ్డి శాంతి, వివిధ కార్పొరేషన్ అధ్యక్షులు కెకె రాజు, ఓబుల్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నేతలకు ముఖ్యమంత్రి ఆత్మీయ పలకరింపు
పర్యటనలో భాగంగా స్థానిక ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. వారిని ఆత్మీయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు- జి ఎన్ వి సతీష్ 

అడవి బిడ్డల ఆత్మి చిత్రం

ప్రతి రచయిత తన రచనలు వెలు వరించడానికి అనుభూతి లేదా ఆవేదన ఒక్కోసారి రెండు కావచ్చు అలా ఆవిర్భ వించిన రచనలకే పట్టుత్వం వుండి, పదికాలాల పాటు ప్రజల అక్షర హృదయాలలో నిలిచిపోతాయి. అలా కాక ఊహాత్మకత కోసమో. సానుభూతి కోసమో, సందర్భోచితమో అయిఉండి వ్రాసే రచనలకు బోలెడు బలహీనతలు ఉంటా యి.రచయిత డా.దిలావర్‌ ఉద్యోగ రీత్యా ఉపాధ్యాయుడు,ఉపన్యాసుడుగా…సుమారు పాతికేళ్లు అచ్చంగా అడవి బిడ్డల ఆవాసాల నడుమ జీవనం చేసిన అను భవం తాలూకు అనుభూతులతో రాయబడిరది ఈడజను కథల ‘కొండ కోనల్లో….’ కథా సంపుటి,దీనిలో ప్రతికథ ఓగిరిజన ప్రాంతం జీవన్మరణగోస, సమస్య చూస్తూ రాయకుండా ఉండలేనితనం రచ యితది.ఈ కథలు వెలువటానికి అది కూడా ఓకారణం!!.రచయిత డా:దినార్‌ విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడైన రచయిత,భిన్నమైన ప్రక్రియలు చేపట్టినా కథా రచయితగా చేయి తిరిగిన వ్యక్తి, 2014 సంవత్సరంలో వెలువరించిన ఈ కొండ కోనల్లో…కథా సంపుటిలోని కథలన్నీ గిరిజనుల జీవితాలకు, సాంఘిక పరిస్థితులకు అద్దంపడ తాయి. కారడివిలో కాంతికిరణం,పాటకు మరణం లేదు, వేట,తునికాకు,చెట్లు కూలుతున్న దృశ్యం,అరణ్య రోదన,కొండ కోనల్లో… మొదలైన కథలన్నీ గిరిజన జాతుల బతుకు చిత్రాలను నింపుకున్నాయి.ఈ కథల్లోనే ప్రాంతాలు పాత్రలపేర్లు అన్ని ఇలా స్వీయ పర్యటనలు అనుకోవాలి అలాగే కథల్లో వాడిన జాతీయాలు,సామెతలు, ఉపమా నాలు, అన్నీ అందమైన అటవీ వాతావరణం అన్వయించి రాయడం ద్వారా రచయితలోని పరిణితి అనుభవం తేటతెల్లం కావడంతో పాటు, సుందర శైలి ఆసక్తికర అధ్యయ నానికి ఆయువుగా నిలుస్తాయి.అసౌకర్యాలకు నిలయమైన అడవుల్లోని అడవి బిడ్డల జీవితాల్లో అన్ని చక్కగానే అనిపిస్తాయి, ఆరోగ్య సమస్యలు రవాణా సదుపాయాలు లేమి తప్ప.!! వీటి వల్లే అన్ని కాలాల్లో కన్నా ‘వానాకాలం’లో అధిక సంఖ్యలో అడవి బిడ్డలు అనారోగ్యాల పాలై సకాలంలో సరైన వైద్యం అందక పిట్టల్లా రాలిపోతున్న ‘అనారోగ్య సమస్యలు’ అడవుల్లో అంతటా అగుపిస్తాయి.ఈ నేప థ్యంలో సాగిన కథ ‘‘కారడివిలో కాంతి కిరణం’’ వెంకటాపురం మండలంలోని ఒక గిరిజన గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్‌గా వచ్చి న కిరణ్‌ అనే యువ వైద్య విద్యార్థి తన కార్యదీక్షతో అక్కడి గిరిజనుల ఆలోచనలో ఎలాంటి ధైర్యాన్ని, మార్పును, పెంపొందించ గలిగాడో తెలిపిన కథ ‘‘కారడివి లో కాంతి కిరణం’’, పిల్లలైనా, అడవి బిడ్డలైన,ఉపన్యా సాలు విని ప్రేరణ పొంది మారరు, కేవలం ఆచరణా త్మకమైన కార్యాల ద్వారానే మార్పుకు దారులు వేయవచ్చు అని చెబుతారు ఈ కథ ద్వారా రచయిత దిలావర్‌. కొత్తగా డాక్టర్‌ ఉద్యోగంలో చేరిన కిరణ్‌ గిరిజన గుడాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆధునిక వైద్యం వైపు కాక పాత వైద్య విధానాలకు, పసరు వైద్యాలకు, వారు ఎందుకు మొగ్గు చూపుతున్నారు, చేతబడి, దేవర్ల పూనకాలను ఎందుకు నమ్ముతున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కథలో దొరుకుతాయి. ‘‘గిరిజనుల వద్దకే సర్కారు వైద్యం’’ అన్న నినాదం నీరుగారడానికి గల కారణాల్లో శాఖ పరమైన అవినీతి, ఉద్యోగుల్లో అలసత్వం, ప్రధానంగా చూపిస్తారు. గిరిజన గుడేల్లో ప్రభుత్వాలు ఆనాడు చేపట్టిన మొక్కుబడి వైద్య విధానాల వల్లే గిరిజనులు తమనాటు వైద్యాల నుంచి బయటపడలేక పోతున్నారనే సత్యాన్ని కూడా ధైర్యంగా చెబుతారు ఇందులో. కిరణ్‌ తనదైన అంకిత భావంతో చేసిన పనులు ముఖ్యంగా గిరిజనగుడేనికి చెందిన సారమ్మ అనే గిరిజన గర్బిణి నిండు వానాకాలంలో ప్రాణాపాయ పరిస్థితిల్లో నుండి గూడెం యువకుల సాయంతో ఆమెను వాగు దాటించి సరైన సమయంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడం అక్కడ తను పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం ఈ కథలోని సారం, ఆ గర్భి ణీని తనదైన ఆధునిక వైద్యం ద్వారా కిరణ్‌ ఎలా కాపాడాడో ప్రత్యక్షంగా చూసిన గిరిజనుల ఆలోచనల్లో మార్పు రావడమే ఈ కథకు ప్రాణప్రదమైన ముగింపు.కాయకష్టాలకు చిరునామాదారులైన గిరిజనులు సంఘటిత కార్మికులు కాదు, భరోసా లేని సాధారణ కూలీలే,!! వారి వారి పనుల్లో అటవీ ఉత్పత్తుల సేకరణ సమయాల్లో జరిగే ప్రమాదాలకు ఎందరో అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్న వైనం దానికి స్వార్థపరులైన కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారుల కారణం గురించి రచయిత ‘‘తునికాకు’’ కథలో చక్కగా చెబుతూ అందరిలో ఆలోచన కలిగించారు. గిరిజనులకు కన్నతల్లి తర్వాత తల్లి వంటి అడవిని సంరక్షించుకోవడం వారి ఆచార సంప్రదాయాల్లో అంతర్భాగంగా మొదటి నుంచి వస్తుంది, కానీ ఆధునిక సమాజంలో అడుగడుగునా మోసులెత్తుతున్న అవినీతి, స్వార్థం, సాయంగా అంతరించిపోతున్న అడవులు తద్వారా దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యం, గురించి ఓ గిరిజన యువకుడి ఆవేదన సాయంగా కళ్ళకు కట్టారు ‘‘చెట్లు కూలుతున్న దృశ్యం’’ లో కథా రచయిత. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై పరిశోధన చేసిన ‘‘తేజ’’ అనే యువకుడు తన భార్య ఉష ఇతర మిత్రుల కుటుం బాలతో భద్రాచలం – పాపికొండల విహారయాత్రకు వెళ్లిన వైనం విహార యాత్ర సంబంధంగా భార్య ఉషకు జాతీయ,అంతర్జాతీయంగా గిరిజనుల చరిత వారి జీవన విధానం గురించి సహేతు కంగా చెబుతూ…కొమరం భీము నుంచి నేటి తరం గిరిజన పోరాట వీరుల దయాగుణం గురించి చెబుతూ.. పాపి కొండలు, పేరంటాలపల్లి, తదితర స్థల ప్రాసస్థ్యాల గురించి రచయిత ఈకథలో చక్కగా వివరించారు. అంతేకాక భద్రా చలం ఆలయానికి రామదాసుకు, తూము నరసింహదాసుకు, ఇచ్చిన ప్రాధాన్యత రామ కథకు కారణభూతురాలు అయిన గిరిజన మహిళ శబరికి ఎందుకు ఈయలేదనే ధర్మసందేహంతో పాటు అనేక పాత్రల స్వభావాలను పరామర్శిస్తూ వ్రాసిన చక్కని చరిత్రాత్మక విషయాల మేళవింపు గల కథ ‘‘కొండకోనల్లో…..’’ ఇంత చక్కని ప్రాముఖ్యత గల ఈ ‘‘మన్య సీమ’’ పోలవరం ముంపుతో అంతర్థానం అయిపోయినట్టు కలగన్న తేజ మానసిక స్థితి గురించి తన భావాలు జోడిరచి ఎంతో హృద్యంగా చెబుతారు రచయిత. ఇంచుమించు అదే భావనతో వ్రాసిన ఆ ‘‘ఏడు మండలాలు’’ కథ, పోలీసుల దాష్టి కాలకు అమాయకపు గిరిజ నులు బలవుతున్న వైనం తెలిపే ‘‘పాటకు మరణం లేదు’’ మృగ్యమవుతున్న అటవీ సంపద గురించిన ‘‘వేట’’ ‘‘బొందల గడ్డ’’ తదితర కథలు వేటికవే భిన్నంగా ఉండి గిరిజన సంస్కృతి,అందాల అడవిని, అంతే అందంగా అక్షరీకరించారు రచయిత డా: దిలావర్‌ . కథల్లో ఉపయోగించిన భాష, వ్యాకరణాం శాలు, సంస్కృతి,తదితర అంశాల ద్వారా రచయిత యొక్క పరిశీలన గుణం,సంస్కృతి శైలి వెల్లడవుతాయి. మనిషి శరీరంలోని నరాల్లా అడవి దేహం నిండా అల్లిబిల్లిగా అల్లుకున్న కాలిబాటలు, వాగు పలుపు విడిచిన లేగ దూడలుగా…. సుడులు,సుడులు,తిరిగి ప్రవహిస్తుంది, వాగులు వంకలు ఎండిపోయి అస్తిపంజ రాల్ల పడిఉన్నాయి, వంటి ఉదాహ రణలు మచ్చుకు కొన్ని మాత్రమే…!! ఇలా ప్రతి అంశాల్లో, విశేషాలు, కల్పనలు, వెరసి ఈ కథా సంపుటం నిండా అచ్చమైన అడవి వాతావరణం ఆవిష్కరించబడిరది. సందర్బో Ûచితమైన సంభాషణ శైలి రచయిత యొక్క విధివిధానాల గుండా ఈ కథలను అధ్యయనం చేయడం ద్వారా చక్కని వైజ్ఞానిక, సామాజిక, సమాచారం అందుకోవచ్చు.
పుస్తకం :- కొండుకోనల్లో..- (ఆదివాసి కథలు)
పేజీలు:152, ధర:-100/-
రచయిత: డా: డిలావర్‌,
సెల్‌:986692329.
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాస రాజు 7729883223.

సమక్క సారలమ్మ పూర్వ చరిత్ర

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు కారకులైన సమ్మక్క సారక్కలు గిరిజన వీర వనితలుగా పూజలు అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే! కానీ వారి పుట్టుక జీవనం మనుగడకు సంబంధించిన చారిత్రక ఆధారాలు శూన్యం. కేవలం పుక్కిట పురాణంలా, జానపదుల శైలిలో మౌఖిక సాహిత్యమై గిరిజనుల శాసనాలుగా చెప్పబడే ‘‘పడిగె కథలు’’ ద్వారా మాత్రమే మనకు సమ్మక్క సారక్కల సమాచారం అరకొరగా లభ్యం అవుతుంది. ఇలాంటి సందీప్తి సమయంలో మేడారం గ్రామంకు సమీపానగల కామారం గిరిజన గ్రామానికి చెందిన గిరిజన యువకుడు పరిశోధక విద్యార్థి బీరసం ఉండాల యూత్‌ నిర్వాకుడు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు నిత్యసంచారి అయినా మైపతి అరుణ్‌ కుమార్‌ రాసిన ‘‘సమ్మక్క సారలమ్మ పూర్వ చరిత్ర’’ పుస్తకం, అరుణ్‌ తనదైన పరిశోధకుశ శైలిలో తన క్షేత్ర పర్యటల ద్వారా స్థానిక పెద్దల ద్వారా తెలుసుకున్న విలువైన చారిత్రక సమాచారాల సమ్మేళనంగా దీన్ని వ్రాశాడు.ఈ క్షేత్ర పర్యటనల సమాహారం గతంలో గల సమ్మక్క చరిత్రకు నూతనత్వం ఆపాదిస్తుంది, ఇక ఈ పూర్వ చరిత్ర విశేషాల్లోకివెళితే……!! ఇప్పటివరకు మనకు తెలిసిన సమ్మక్క సారక్క కథకు పూర్తి భిన్నంగా వాస్తవానికి కాస్త చేరువులో చెప్పబడిరది ఈ పూర్వ చరిత్ర, పరిశోధకరచయిత మైపతి అరుణ్‌ కుమార్‌ ఈ చరిత్ర వివరణ కోసం కేవలం ‘‘పడిగలు’’ మీదే ఆధారపడకుండా దానికి ఆధారంగా స్థానికులచే చెప్పబడే వ్యక్తులు, నివసించే ప్రాంతాలకు, వెళ్లి అక్కడి వారి అనుభవాలు సేకరించి ఈ కథనానికి మరింత ప్రామాణికత చేకూర్చారు. ప్రస్తుతం చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్ర పరిధిలో గల బీజాపూర్‌ జిల్లాలోని అత్యంత దట్టమైన అడవిలో గల కాన్కనార్‌ గిరిజన గ్రామం వెళ్లి అక్కడి గ్రామస్తులను, పూజారులను సంప్రదించి సమ్మక్క వంశ పూర్వ చరిత్రను తెలుసుకు న్నారు మైపతి అరుణ్‌ పరిశోధక బృందం. ఈ క్రమంలో గోండ్వాన రాజ్య విస్తరణలో గిరిజనుల పాత్ర చెబుతూ సింధు నాగరి కతకు పూర్వమే గోండ్వానా రాజ్య నాగరికత వెళ్లి విరిసిందని పడగలపై గల అనేక ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేశారు అరుణ్‌. ‘‘సమ్మక్క’’ కోయత్తూర్‌ సమాజంలో ఐదవ గట్టుకు చెందిన ‘‘రాయి బండాని రాజు ‘‘ వంశానికి చెందిన ఆడబిడ్డగా ‘‘బాండానిరాజు’’ పడిగలోని చిత్రలిపి విశ్లేషణ ద్వారా వివరించారు, ‘‘రాయి బండాన్నిరాజు’’కు చందంబోయి రాలు, కనకంబోయి రాలు,అని ఇద్దరు భార్యలు. గోండ్వాన రాజ్యపు రాజైన ‘‘బేరంబోయిన రాజు’’కు ఏడుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, ఆఇద్దరు కూతుళ్లే చందం బోయిరాలు,కనకం బోయిరాలు,వీరు ఇద్దరు ఇష్టపడి రాయి బండాన్ని రాజును పెళ్ళాడ తారు,కానీ పెద్ద భార్యకు సంతానం కలగలేదు శివపార్వతులను పూజించగా వారి వరప్ర సాదంగా అడవిలో మాఘ పౌర్ణమి రోజున బండాని రాజుకు అతని పెద్ద భార్య చందం బోయిరాలకు కంక వనములో ఒక పసిపాప కనిపిస్తుంది అది శివపార్వతుల ప్రసాదంగా భావించి ఇంటికి తీసుకువస్తారు ఆ పాపే సమ్మక్క. అంతకుముందే గర్భవతి అయిన చిన్న భార్య కనకం బోయిన రాలు, రెండు రోజుల తర్వాత ఆడపిల్లను ప్రసవిస్తుంది ఆమెకు నాగులమ్మ అనే పేరు పెట్టుకుంటారు. ఐదవ గట్టుకు చెందిన ‘‘బండాని’’ వంశములో తొలిచూరు ఆడబిడ్డ సమ్మక్క, కోయ సాంప్రదాయం ప్రకారం మొదటి ఆడబిడ్డను వేల్పుగా కొలుస్తారు అందుకే సమ్మక్క ఇలవేల్పుగా దేవర అయింది. సమ్మక్క- నాగులమ్మలు పెరిగి పెద్దయ్యాక అదే గోండ్వాన రాజ్యంలో గల బీజాపూర్‌ దగ్గరి కొత్తపల్లి గ్రామానికి చెందిన నాలుగవ గట్టువాడైన ‘‘పగిడిద్ద రాజు’’కు పెద్ద కూతురైన సమ్మక్క నిచ్చి పెళ్లి నిశ్చయించుకుంటాడు రాయిబండని రాజు, తన ఇద్దరు భార్యలు, చిన్న కూతురు నాగులమ్మతో కలిసి అతడిని చూసి వచ్చి నిర్ణయం చెప్తాడు సమ్మక్కకు. కానీ చెల్లెలు మాయమాటలు నమ్మి పగిడిద్ద రాజు వికార రూపం కలవాడు అనుకోని ఆ పెళ్ళికి ఇష్టపడదు సమ్మక్క. ఆడిన మాట తప్పకుండా అన్న ముహూర్తానికి తన చిన్న కూతురు నాగులమ్మ తో పైడిద్దరాజు పెళ్లి నిశ్చయించి మాఘ పౌర్ణమి ముందే తన కుటుంబం చుట్టాలతో కలిసి వెళ్లి..నాటి మధ్యప్రదేశ్‌ లోని కొత్తపల్లి గ్రామ సమీపాన గల ‘‘పాలెం’’ గ్రామంలో మండపం కట్టించి పెళ్లికి ఏర్పాటు చేసుకుంటాడు బండాని రాజు, అక్కడి చెరువును ‘‘కాముని చెరువు’’ అంటారు ఇవి ఇప్పటికీ ఉన్నాయి.తీరా పెళ్లి సమయంలో సమ్మక్క అందగాడైన పైగిడిద్ద రాజును చూసి తన చెల్లెలు నాగులమ్మ చేసిన మోసానికి ఆగ్రహించి పెళ్లి మండపంలోనే చెల్లిపై దాడి చేసింది, ఆ పెనుగులాటలో సమ్మక్క చేతికడెం పగిడిద్దరాజు కంటికి తగిలి కన్ను కోల్పోయాడు, ఇక చేసేదేమీ లేక తను అక్కా చెల్లెలు ఇద్దరిని అదే మండపంలో పెళ్లాడుతాడు. కానీ చివరికి చెల్లెలు పోరు పడలేక తన పుట్టింటికి వచ్చేసింది చంద్రవంశీయుల సమ్మక్క.తల వారితో ఉండి పోయి ఆ ఇంటి ఇలవేల్పుగా మిగిలిపోయింది, అలా చందా వంశీయులు అనేక తరాలుగా సమ్మక్క ను అనంతరం ఆమె వస్తువులను, పూజించుకుంటూ వారి వారి జీవితాలు సాగించుకుంటున్న క్రమంలో ప్రకృతి వైపరీత్యాలు కరువు కాటకాలతో చందా వంశీలు కుటుంబాలుగా విడిపోయి దూర ప్రాంతాలకు, బ్రతుకు తెరువు కోసం వలస పోయారు. అలా వలస వచ్చిన వారిలో ఒక చందా కుటుంబం వారు పడమరదేశంలోని అడవిలో బాయక్క అనే ఆమె పేరుతో ఒక గూడెం నిర్మించుకొని ‘‘బయ్యక్కపేట’’అని పేరు పెట్టుకున్నారు, ఆ గ్రామం ప్రస్తుతం మేడారం సమీపంలో ఉంది. బయ్యక్కపేట చందా వంశీలే మొదట రెండేళ్ళ కోసారి మాఘ పున్నమికి ‘‘సమ్మక్క జాతర’’ చేసేవారు, కానీ కాలక్రమంలో కరువు కాటకాలలో డబ్బులు లేక పక్క గూడెం అయిన మేడారం గిరిజను లకు జాతర బాధ్యతలు అప్పగించారు, అలా మేడారంకు సమ్మక్క జాతర ప్రవేశించింది. అంటూ చిత్రలిపి ఆధారంగా సమ్మక్క సారలమ్మ పూర్వ చరిత్ర పుస్తక రూపం చేశారు మైపతి అరుణ్‌ కుమార్‌. ఈ చరిత్రకు అంతర్గతంగా గోండ్వానా రాజ్య ఆనవాళ్ళ గురించి ప్రాంతాలవారీగా ఆధారాలు చూపుతూ సింధు నాగరికతకు పూర్వమే ఆదివాసుల ‘‘గోండ్వానా నాగరికత’’ ఉన్నదనే విషయం చరిత్రకారులు విస్మరించారని ఆదివాసులపై ఆర్యులు చేసిన అణిచివేతకు ఇదొక ఉదాహరణ అంటారు అరుణ్‌ కుమార్‌. అంతేకాక ఈ పరిశీలన గ్రంథంలో కాకతీయ రాజ్యం కూడా గోండులదే అన్న తన వాదాన్ని వినిపిస్తారు. ఆనాడు గూండాను చరిత్రను భూస్థాపితం చేసినట్టే ఇప్పుడు మేడారం చరిత్రను సమ్మక్క సారక్కల చరిత్రను తప్పుదారి పట్టించి హిందూ తత్వాన్ని ఆపాదించి అసలైన గిరిజన సంస్కృతిని మటుమాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ తన ఆవేదన వ్యక్తపరిచాడు అరుణ్‌ ఈ పుస్తకంలో. దీని ద్వారా పరిశోధకులు ముందుకు వచ్చి సందిగ్ధ భరితమైన ఈచరిత్రను సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది,గిరిజన పరిశోధకులు, చరిత్ర ప్రేమికుల తో పాటు అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
పుస్తకం : సమ్మక్క సారమ్మ పూర్వ చరిత్ర, పేజీలు : 174, వెల : 300/- రూ, రచన : మైపతి అరుణ్‌ కుమార్‌, సెల్‌ : 9441966756. సమీక్ష : డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌ : 7729883223.

గిరిజన ఉద్యమాల దర్పణం

ఆదివాసీలు అంటే అడవుల్లో నివశించే శారీరకశక్తి వనరులు మాత్రమేకాదు. కృషి,త్యాగం,బలిదానం,మొదలైన పరోపకార బుద్ధి నిలయాలు, కూడా అని నేటి ఆధునిక నగరవాసులు గుర్తించాలి, అన్న లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ ‘‘వనవాసి కళ్యాణ పరిషత్‌’’ భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా ఆదివాసీ స్వాతంత్ర సమర యోధులు,సంస్కర్తలు,గురించి ప్రామాణిక సమాచారం అందించాలనే సత్సంకల్పంతో వెలువరించిన అపూర్వ పుస్తకం ‘తెలంగాణ – గిరిజన స్వాతంత్ర సమరయోధులు సంస్కర్తలు.’ దీని రచయిత డా:ద్యావనపల్లి సత్యనారాయణ, నిత్యం గిరిజన ఆవాసాల పర్యటనలు, అందుబాటులోని అన్ని భాషల గిరిజన సాహిత్యాలను ఆధ్యయనం చేసిన అనుభవం సారంతో,‘కొండ అద్దం ముందు కొంచమైనట్టు’ అన్న చందంగా ఈచిరు పుస్తకాన్ని పాఠక లోకానికి అందించారు రచయిత. ఈ పుస్తకం పరిధి కేవలం తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి పరిమితమైన, ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది. రచయిత తన ముందుమాటలో పేర్కొన్నట్టు ఈ చిరు సమాచారం ప్రామాణికంగా భావి తరాల విజ్ఞులకు,పరిశోధకులకు,ఎంతో ఉప యోగంగా ఉంటుంది.ఈ పుస్తకాన్ని ‘స్వాతంత్ర సమరయోధులు`సంస్కర్తలు’ అని రెండు భాగా లుగా విభజించి వ్రాశారు,అనుబంధంగా బీర్సా ముండా పోరాటం వివరణ ఇచ్చారు.ఈ విభ జన లోనే రచయిత పరిశో ధనా దృష్టి,పటిమ, కనిపిస్తున్నాయి. స్వాతం త్ర సమరయోధులు విభాగంలో రాంజీ గోండ్‌,కొమరం భీమ్‌,రౌంట కొండల్‌, కొమరం సూరు,వెడ్మ రాములను పేర్కొ న్నారు.సంస్కర్తలుగా సమ్మక్క, సేవాలాల్‌, పులాజిబాబా,హైమండార్ప్‌, ఎస్సార్‌ శంకరన్‌లను చెప్పడంలోనే రచయిత పారదర్శకత సుస్పష్ట మవుతుంది. ఇకవ్యాసాల తీరును పరిశీలిస్తే అనేక ప్రామాణిక విషయాలు అర్థమవుతాయి. తెలంగాణ గిరిజన పోరాట యోధులు అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ‘కొమ రంభీమ్‌,’కానీ అతనిలోని శక్తి సామర్థ్యాలు గుర్తించి ప్రోత్స హించి అతడిని అంతటి నాయకుడిని చేసింది అతని అనుచరుడు మొదటి నుంచి చివరి వరకు అతనితో కలిసి నడిచిన వాడు ‘రౌట్‌ కొండ’అని చాలా మందికి తెలియని సత్యం. ఉద్యమానికి నాయకుడు ఎంత అవసరమో! నాయకునికి అనుచరులు అంతే అవసరం !! అన్న నిండు నిజాన్ని రచయిత డా:సత్యనారాయణ ఎంతోచక్కగా విశ్లేషించి వివరిస్తూ నేటి తరానికి తెలియని నాటి గిరిజన సమర యోధుడు ‘‘రౌట కొండను’’ పరిచయం చేశారు. అదేవిధంగా కొమరం భీమ్‌ పోరాటంలో వార్త హరుడుగా సహకరించిన మరో యోధుడు కుమరం సూరు. జీవిత విశేషాలు, గెలిచిన పోరాటంలో అతని పాత్ర గురించిన వివరణ కూడా కూలంకషంగా వివరించారు మరో వ్యాసంలో.‘జోడే ఘాట్‌’పోరాటంలో విరోచిత పోరాటం చేసి అమరుడై అందరికీ తెలిసిన ‘‘భీమ్‌’’ పోరాటంలో సంపూర్ణ సహకారం అందిం చినవారు అనేకమంది ఉన్న అందులో అతనికి కుడి భుజంగా ‘‘కుమ్రం సూరు’’ తుడుం దెబ్బ మోగిస్తే, ఆయనకు ఎడమ భుజంగా ఉన్న ‘‘వెడ్వ రాము’’ తూత కొమ్ము ఊది చుట్టు పక్కల12గ్రామాల గిరిజనులను యుద్ధానికి సిద్ధం చేసేవాడు, అతని పరిచయం కూడా వ్యాస రచయిత ఇందులో పొందు పరిచారు. అలా ఆదిలాబాద్‌ కేంద్రంగా సాగిన ఆదివాసీ పోరాటం ద్వారా గిరిజనుల త్యాగం,వీరోచి తత్వాన్ని, ప్రపంచానికి చాటిన జోడేఘాట్‌ పోరాటయోధుడు,కొమరంభీమ్‌ కు సాయపడిన వ్యక్తుల సంక్షిప్త జీవిత చరిత్రల వ్యాసాలు ఇందులో పొందుపరచడం ద్వారా వ్యాస రచయిత సత్యనారాయణ గారి నిశిత పరిశీలన, పరిశోధనా పఠిమ,ప్రతిపాటకుడికి ఆవగతం అవుతాయి. ఇక ప్రధాన యోధుడు భీమ్‌కు సంబంధించిన ప్రథమ వ్యాసంలో జల్‌,జంగల్‌,జమీన్‌ల సాధనలో గిరిజనుల ఐకమత్య పోరాటం,నాయకుడు చేసిన కృషి, ఐక్యత యొక్క విలువ,చాటమే కాక వందల సంవత్సరాల క్రితం గిరిజనుల స్థితిగతులను కళ్ళకు కడుతుంది. భీమ్‌ వ్యాసంలో రచయిత వ్రాసిన ప్రతి వాక్యంలో ప్రామాణికత కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధాన ఘట్టాలకు సంబంధించిన విషయాలు అలాంటి సంఘ టనలు ప్రత్యక్షంగా చూసిన వారి అనుభవాలు, ప్రభుత్వం చూపిన అధికారులు లెక్కలు, అప్పటి పత్రికలో వచ్చిన వార్తలు సాయంగా రాయడం వల్ల సంపూర్ణ ప్రామాణికత కనిపిస్తుంది. జోడెన్‌ ఘాట్‌ గిరిజన పోరాటంలో అమరులైన వారి సంఖ్యలోగల సందిగ్ధత కూడా రచయిత సహేతుకంగా వివరించారు, అలాగే కుమ్రం భీమ్‌ మరణించిన రోజులోని వివాదం కూడా వివరించే ప్రయత్నం చేశారు,ఇక భీమ్‌కు ఆదర్శనీయుడు,భారత ప్రధమ గిరిజన స్వాతం త్య్ర సమరయోధుడు రాంజీ గోండు వీరోచిత త్వాన్ని వివరించిన తొలి వ్యాసంతో మొదలై, వెడ్మ రాముతో మొదటివిభాగ మైన సమరయో ధులు ముగుస్తుంది. ఇక రెండవ భాగంను గిరిజన సంస్కర్తలుగా పేర్కొని, ఇందులో మా’’నవ’’దేవతలు సమ్మక్క- సారక్కలు, సేవాలాల్‌,పులాజీ బాబా,హైమన్‌ డార్ప్‌, ఎస్‌.ఆర్‌,శంకరన్‌ల సేవా సంస్కరణలు వివరిం చారు.సమ్మక్క వంశ చరిత్ర, చారిత్రక విషయా లతో,పాటు సమ్మక్క వీరోచిత పోరాటం తది తర విషయాలతో, సమ్మక్కను చారిత్రక సంస్కర్త గా చిత్రిస్తు నాటి గాధలకు సాక్ష్యంగా నిలిచే నేటి గ్రామాలను ఆధారంగా చూపిస్తూ ఈ వ్యా సం కొనసాగించారు. లంబాడి సామాజిక వర్గ గిరిజనులు ఆరాధ్య దైవంగా పూజించే ‘సేవ లాల్‌’ జన్మించింది అనంతపురం వద్ద గల గుత్తి,సమీప గ్రామం గొల్లలదొడ్డి,అయినా అతని సేవా తత్పరత ఎక్కువగా సాగింది తెలంగాణ ప్రాంతంలోనే, కనుక అతడిని తెలంగాణ గిరిజన జాతి సంస్కర్త గానే రచయిత పేర్కొన డం అతని సహృదయతకు చిహ్నం. విగ్రహారా ధన, జంతు బలి, మూఢనమ్మకాలకు, వ్యతిరేకి అయిన సేవాలాల్‌ లంబాడాలకు ఎలా ఆరాధనీ యుడు అయ్యాడో ఈ వ్యాసం వివరణఇచ్చింది. పూర్తి మాంసాహారులైన గిరిజనుల్లో శాఖాహార తత్వాన్ని అలవర్చిన గొప్ప శాఖాహార సంస్కర్త ‘‘పులాజి బాబా’’ అతని తపస్సు, ధ్యానం, వివ రాలు వెల్లడిరచడంతోపాటు అతడు గిరిజ నులను తన బోధనల ద్వారా తీర్చిదిద్దిన తీరు ఇందులో గమనించవచ్చు. ఇక గిరిజనుల జీవితాలకి వెలుగులు అద్ది వారి జీవితాలు విద్యా ఉద్యోగాలకు ఆర్థిక ఎదుగు దలకు సంక్షేమానికి ప్రణాళికలు సిద్ధం చేయడమే కాక ,అమలుకు కృషి చేసిన ఆదివాసులు ఆత్మబం ధువు ‘‘హైమన్‌ డార్ప్‌’’ కృషి గురించిన వ్యాసం. గిరిజన వికాసానికి పాటుపడే వారందరికీ ఉపయుక్తం.అడవి బిడ్డల సంక్షేమానికి పర్యాయ పదంగా నిలిచే మరో ఐ.ఏ.ఎస్‌ అధికారి ఎస్‌.ఆర్‌. శంకర్‌,కృషిని వివరించే వ్యాసం కూడా ఇందులో చదవవచ్చు. అనుబంధంగా ‘‘బిర్సా ముండా’’ పోరాటం గురించిన వ్యాసం లో అతని జీవితం,కృషి,సూక్ష్మంలో మోక్షంగా సరళంగా, సూటిగా,వివరించబడిరది, కేవలం వ్యాసాలే గాక ఆయా యోధుల, సంస్కర్తల, ఫోటోలు కూడా ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి, తెలంగాణ ప్రాంత గిరిజన సమరయోధులు, సంస్కర్తలపై భావి తరంలో జరగాల్సిన సంపూర్ణ పరిశోధనలకు ఈచిరు పుస్తకం చక్కని దారి దీపం కాగలదు. – డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

1 2 3 5