బంజారా తండాల్లో తీజ్ ఉత్సవాలు
ప్రతి ప్రాంతానికి,వర్గానికి ఓ సంస్కృతి ఉంటుంది.ఆ సంస్కృతిని నిలబెట్టే పండుగలూ ఉంటాయి.అలాంటి పండుగే తీజ్ ఉత్సవం.తెలుగు రాష్ట్రాల్లోని గోర్ బంజారాలు పవిత్రంగా జరుపుకునే వేడుక ఇది. వర్షాలు నిండుగా కురవాలనీ,పంటలు దండిగా పండాలనీ కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తారు. ‘బతుకమ్మ’ పండుగ తరహాలో చేసుకునే సాగే తీజ్ పండుగ శ్రావణ మాసంలో వస్తుంది.తొమ్మిది రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ గిరిజనోత్సవం జరగనుంది.ఈ వేడుక విశిష్టతపై తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ‘‘రాథోడ్ శ్రావణ్’’ థింసా పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక కథనం..
కరవు నుండి, కాపాడే ప్రకృతి పండుగ..తీజ్ !
తొమ్మిది రోజుల సంబురాలు కఠోర నియ మాలు.. డప్పుల మోతలు తండాల్లో కేరింతలు పెళ్ళికాని ఆడబిడ్డల ఆటాపాటలు.. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాలు బావ మరదళ్ల అల్లరిచేష్టలు ఆపై భక్తి భావం వీట న్నింటి మేళవింపే తీజ్ పండుగ!పూర్వం తండాలలో తీవ్ర కరువు వచ్చినప్పుడు లోకం సుభిక్షంగా వుండాలని,తీజ్ పండుగ నిర్వహి స్తారు.ఈపండుగ బతుకమ్మను పోలి ఉం టుంది.తీజ్‌ను ఎనిమిది రోజుల పాటు పూజిం చి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు.ఈఉత్స వాలను పెళ్ళికాని ఆడపిల్లలే నిర్వహిస్తారు. వీరికి తండాపెద్దలు,సోదరులు సహకరిస్తారు. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్’ అంటారు.అలాగే గోధుమ మొలకలను కూడా‘తీజ్’గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే.. తీజ్ లో గోధుమ మొలకలను పూజించడం ఆనవా యితీ.ఆగస్టు నెలలో ఈ వేడుకలు మొదలువు తాయి.తీజ్ ఉత్సవం.బంజారాల సంస్కృతికి దర్పణం.ఈ తొమ్మిది రోజులు అమ్మాయిలకు అగ్నిపరీక్షే.ఉప్పుకారం లేని భోజనం తినాలి. మాంసాహారాలు ముట్టకూడదు, తండా నుంచి బయటికి వెళ్లకూడదు.యువతులు పుట్టమట్టి తెచ్చి కులదేవతలను కొలుస్తూ పాటలుపాడి తండా నాయకునిచేత బుట్టలో ఆమట్టిని పోయించి గోధుమలను చల్లుతారు.స్వయంగా మూడు పూటలు బావుల వద్దకు వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చి తీజ్‌లపై చల్లుతారు.అలా తొమ్మిది రోజుల్లో గోధుమ నారు ఏపుగా పెరుగు తుంది.అలా బుట్టల్లో గోధుమ మొలకలను పెంచి, వాటి చట్టూ ఆడిపాడి,తొమ్మిదోరోజు వాగులో నిమజ్జనం చేస్తారు.వర్షాలు సంవృ ద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ఊరంతా బాగుండాలని,మంచి మొగుడు రావాలని కోరుకుంటూ,అంతరించి పోతున్న గిరిజన సంస్కృతిని అపూర్వంగా కాపాడు కోవడానికి అడవిబిడ్డలు ప్రతి ఏటా తీజ్ పండు గను భక్తిగా జరుపుతున్నారు. చెట్టు,పుట్ట, గుట్టలకు నిలయమైన అడవుల్లో గుడిసెలు నిర్మించుకొని గోసేవ,ప్రకృతి సేవ చేస్తూ తమ దైన సంస్కృతిని, సంప్రదాయాలను నిలుపు కుంటూ సాగిపోతారు బంజారాలు.అనాదిగా సాతిభవానీలను (సప్తమాతృకలు) కొలుస్తూ ఆ జగదంబలోనే జగతిని దర్శిస్తారు.మొలకనారు ను ఆతల్లికి మరోరూపంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.ఈరెండు పండుగలకు దగ్గరి పోలికలు,సామీప్యతలు చాలా విషయా ల్లో కనిపిస్తాయి.ఈరెండు పండుగలు కాలా నుగుణంగా కొద్దిగా ముందు వెనకాల నిర్వ హించబడినా రెండిరటి లక్ష్యంసృష్టి కళ్యాణమే. తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ పండుగ జరుపబడితే,తీజ్ పండుగను మాత్రం దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు బంజారాలు. రెండు పండుగల్లో ప్రకృతే ప్రధాన దైవంగా కొలవబడుతుంది.ముత్తైవదులు,కన్నెపిల్లలు తమ జీవితాలు మంగళమయం అవ్వాలనే ఆకాంక్ష తో ఈ పండుగలను జరుపుకుంటారు.తీజ్ కొండ కోనల్లో,అడవుల్లోని తండాల్లో నిర్వహిం చబడితే, బతుకమ్మ మైదాన ప్రాం తాల్లో నిర్వహించబడుతుంది.బతుకమ్మ,తీజ్ రెండు పండుగలు ప్రకృతి మాతను ఆరాధించే ప్రజల హృదయ నిర్మల తను ఆవిష్కరిస్తు న్నాయి. పండుగలు జరుపుకునే విధానాలు, పద్ధతులు వేరువేరు కావచ్చు.కానీ రెండిరటి లక్ష్యం లోక కల్యాణం అన్నది మాత్రం గమనించవలసిన అంశం. పాట, ఆటల మధ్య పువ్వులు, మొల కలు పరవశించి ప్రాణశక్తిని ప్రజారణ్యం లోకి ప్రసారం చేస్తున్న విధానం రెండు పండుగలలో కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఏ విధంగా గౌరవిస్తోందో అలాగే బంజారా గిరిజ నుల సంప్రదాయ తీజ్ పండుగను కూడా సాద రంగా గౌరవిస్తు న్నది.ఈపండుగలు రెండు తెలంగాణ గడ్డ ఆత్మగౌరవ ప్రతీకలుగా దర్శనమిస్తాయి.
బంజారా సాంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక
బంజారా సాంస్కృతి,సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైన తీజ్ పండుగ తీజ్.తీజ్ అనగా గోధుమ మొక్కలు అని అర్థం.ఈ పండుగను మన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోనే కాక పోరుగునున్న ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటక,గోవా,ఉత్తర భారత దేశంలోని ఉత్తర ప్రదేశ్,మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గడ్,రాజస్తాన్, గుజ రాత్ మొదలగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.ఈ పండుగ మొదట ఎలా ప్రారంభమౌతుందంటె తండా ల్లోని ప్రజలందరూ ఆ తండాకు చెందిన పెద్ద ఆయన నాయక్ ఆధ్వర్యంలో సమావేశమై పండుగ విశేషాలపై నిర్ణయాలు తీసుకుని ‘‘నాయక్’’అనుమతితో అంగడికి వెళ్లి వెదురుతో తయారు చేసిన చిన్నచిన్న గుల్లలని తీసుకు వస్తారు.ఐతే ఒక ఇంటిలో ఎంతమంది పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటారో అన్ని వెదురు గుల్ల లు తీసుకువచ్చి వాటిని అందంగా రంగు, రంగుల నూలు దారాలతో,గువ్వలతో, ముత్యా లతో,పూసలతో,మరియు బాసింగాలు కట్టి పెళ్ళి కూతులా అందంగా ఆగుల్లలని ముస్తాబు చేస్తారు.ఈ పండుగను పెళ్లికాని ఆడపిల్లలు శ్రావణ పూర్ణిమి రోజు ఉదయంలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసి అందంగా ముగ్గులు వేసి, అందం గా ముస్తాబై కొత్తబట్టలు ధరించి ‘‘నాయక్’’ ఇంటికి చేరుకోని అక్కడి నుండి గండు చీమలు గుల్లు కట్టిన నల్లని మట్టిని తీసుకురావడానికి అడవికి వెళ్తారు. ఇనుప గుల్లలో ఆమట్టిని తీసుకు వచ్చి ఆరబెట్టి శ్రావణంలో వచ్చే రాఖీ పౌర్ణమి రోజు సాయంత్రం తండా నాయకుని ఇంటి ఆవరణలో అందరూ సమావేశమై నాయక్ అనుమతితో అందంగా అలంకరించిన వెదురు గుల్లల్లో నల్లని మట్టిని నింపి అందులో నాయక్,భార్య నాయకణ నాని బెట్టిన గోధుమ లను చల్లడంతో ఈఉత్సవం ప్రారంభ మౌతుంది.అందరు పాటలు పాడుతూ,నాట్యం చేస్తూ ఈకార్యక్రమంలో పాల్గోంటారు. వెదురు బుట్టల్లోనే కాకుండా ‘‘మోదుగు’’ ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి,గోదుమ లని చల్లుతారు.పెళ్ళికాని ఆడపిల్లలు ప్రతిరోజు మూడు పూటలు అందంగా ముస్తాబై వెదురు బుట్టల్లో ఉన్న గోదుమలకు నీల్లు జల్లుతారు ఐతే ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు ‘‘పులియా గెణో’’ ‘పూర్ణ కుంభం’లా తలపై పెట్టుకొని బావి నీళ్లు కాని బోరింగ్ నీళ్ళుకాని చెరువు నీళ్లుకాని తీసుకు వచ్చి తీజ్‌కి పో స్తారు.ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పెళ్ళికాని మగపిల్లలు తీజ్ కినీరు పోయకుండా ఆపి కొన్ని పోడుపు కథలు వేస్తారు.వాటికి సమాధా నం చెప్పినవారికి తీజ్‌కి నీళ్ళు పోయ్యనిస్తారు. ఈవిధంగా రోజుకు మూడు పూటల పాటలు పాడుతూ,నృత్యాలు చేస్తూనీళ్ళు జల్లూతూ అగరు బత్తులతో ధూపం చేస్తూ నైవేద్యం పెడుతూ ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.పాటలు పాడుతూ తోమ్మిదవరోజు గోకుల అష్టమినాడు ‘డంభోళి’ పండుగను జరుపుకుంటారు.ఆరోజు పెళ్ళి కాని ఆడ పిల్లలు కొత్త బట్టలు ధరించుకొని నాన బెట్టాన సెనగలను తీసుకోని పోలాలకు వెళ్ళి నేరేడు చెట్టుకు సెనగలను గుచ్చుతారు అప్పుడు ఆడ పిల్లలు తమతో తెచ్చుకున్న పండ్లు, ఫలహారాలతో ఉపవాసాన్ని విరమీస్తారు. అక్కడి నుండి నల్లని బంక మట్టిని తీసుకోని నాయక్ ఇంటికి తీసుకువెళ్ళి పెళ్ళికాని ఆడ, మగవాల్లు ఆ మట్టితో డోక్రి,డోక్రా ముసలమ్మ ముసలోడులను పీట పై తయారు చేస్తారు దానినే ‘గణగోర్’అంటారు.తయారు చేసిన మట్టి బొమ్మల పై రైక బట్ట,తువ్వాల కప్పు తారు.‘డంబోళి’రోజు రాత్రి ఎనిమిది,తోమ్మిది గంటలకు తండా వాళ్లందరూ భోజనం చేసిన తర్వాత గోదుమ పిండితో తయారు చేసిన గోదుమ రోట్టే,బెల్లం నెయ్యితో కలిపి హుండలు తయారు చేస్తారు. దానిని ‘చుర్మో’అంటారు. తయారు చేసిన చుర్మోను హరితి పెళ్ళేంలో వేసి ఆగరుబత్తి,కోబ్బరికాయ,కుంకుమ,నీళ్ళు తీసుకొని స్త్రీ పురుషులందరు పెళ్ళి కాబోయె ఆడపిల్లలతో తండా నాయక్ ఇంట్లో డోక్రి, డోక్రా పూజలు చేసి డంబోళి పైన ఇలా పాట పాడుతారు.మరుసటి రోజు ఉదయాన్నె ఆడ పిల్లలందరు డోక్రి,డోక్రాను నెత్తి మీద పెట్టు కొని ఊరి బయట ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు.అప్పుడు ఈ పాట విధంగా పాట పాడుతారు. ఈ పాటాల్లో ముసలమ్మను పోగు డుతూ,ముసలయ్యని విమర్శిస్తూ పాట పాడుతారు.గణగోర్‌ని చెరువులో నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి వచ్చి స్నానంచేసి కొత్త బట్టలు ధరించి ఆడపిల్లలందరు నాయక్ ఇంటి ఆవరణలో ఉన్న తీజ్ గుల్లలను మధ్యలో పెట్టు కొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.ఆ తర్వాత గ్రామప్రజలు,పెద్దలు, నాయకులు, కార్భారి,ఢావ్,ఢవ్ గేర్యా మాన్కరి అందరూ వచ్చి సహపంక్తి భోజనం (బాలాజీ బండారో) చేస్తారు.నాయక్ అగరుబత్తీలు పెట్టి కొబ్బరి కాయ కొట్టి పూజ నిర్వహిస్తారు.పూజ అనం తరం ఆడపిల్లలు తమ తీజ్ గుల్లలను నెత్తి మీద పెట్టుకొని నృత్యాలు చేస్తారు. ఆడపిల్లల వదినలు ఆగుల్లను లాక్కొని వారి అమ్మలకు ఇస్తారు. అమ్మ వాళ్ళందరూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ తీజ్‌ని తెంపుతారు. తెంపిన తీజ్‌ని ఆడ పిల్లలు గ్రామ పెద్దలకు ఇస్తూ మొక్కుతారు.గ్రామ పెద్దలు వారికి తోచిన విధంగా కానుకలు ఇస్తారు. తర్వాత ఆడ పిల్లలు తీజ్‌ని చేతుల్లో పట్టుకొని నృత్యం చేస్తుంటే వారి తల్లులు ఒక్కోక్కరు గుల్లల్లో డబ్బులు వేస్తారు.ఒక్కొక్కరు తీజ్‌ని ఇచ్చిపుచ్చుకుంటారు. ఆతీజ్ ని మొక్కతూ పెళ్ళికాని వారు హరాలకి పెళ్ళి అయిన వారు మంగళ సూత్రాలకి వాటిని కట్టుకుంటారు. ఆ తర్వాత నాయక్,నాయకణ్ జోన్నలు, గోధుమలు,సెనగలతో గుడాలు వండిస్తారు. వండిన గుడాలని సాయంత్రం ఐదు గంటలకు అందరు తినటం ఆతర్వాత ఎడ్లకు రaూలు వెసి అలంకరించి,బండి కట్టి అందులో తీజ్‌ని ఉంచి బాజా బజంత్రీలతో తాండా అంతా ఊరేగించి పిల్లలు, పెద్దలు తాండా చెరువులో తీజ్ గుల్లలని నిమజ్జనం చేస్తారు. ఆసమ యంలో ఆడ పిల్లలు బాదపడటం,ఏడ్వటం చేస్తారు.ఎందుకంటే తోమ్మిది రోజులు ఉపవాస దీక్షతో,భక్తి శ్రద్ధలతో,పాటలతో,నృత్యాలతో ఆనందంగా జరుపుకోని మరుసటి సంవత్సరం వరకు ఆగకుండా ఉండలేక అంతేకాకుండా పెళ్ళి అయినచో ఈతీజ్ ఉత్సవం జరుపుకోలే మన్న బాదతో ఏడుస్తారు.తీజ్ నిమజ్జనం అనంతరం ఆడపిల్లలకు వారి అన్నలు లేదా తమ్ముల్లు కాళ్ళు కడుగుతారు.అనంతరం సాయంత్రం ఐదు గంటలకు నాయక్ ఆధ్వర్యంలో గుడాలను ఆరగిస్తారు.తీజ్ పండుగ అనేది పెద్దలను గౌరవించాలని, గిరిజన సాంప్రదాయాన్ని,సంస్కృతిని కోనసా గించాలని, పచ్చదనంతో కుటుంబాలు ఎప్పుడు పచ్చగా వెలగాలని పెళ్ళి కాని యువతులకు మంచి భర్త దోరకాలని అంటారు.