ప్రభుత్వ బడిని బతికించుకుందాం..!

అమ్మ లాంటి ప్రభుత్వ బడి. అమ్మా నాన్న కూలికి వెళితే అక్కున చేర్చుకుని విద్యా బుద్ధులు నేర్పిన బడి. సమాజంలో ఎలా బతకాలో నేర్పిన బడి. ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావించడం తన జీవనంలో భాగంగా చూడమన్న బడి. పెద్దలను గౌరవించండి, తల్లిదండ్రులను పూజించండి అని రోజూ ఓనమాలు దిద్దించిన బడి. ఇప్పుడు ఏదో పాడు ప్రపంచీకరణ వచ్చి అమ్మ, బడి నేర్పాల్సిన దాన్ని సెల్‌ఫోన్‌ నేర్పు తుంది కానీ..ఆ రోజుల్లో బడే నేర్పేది. పాఠశాల ప్రారంభం కాబోతుంది కనుక ఆ బడిని రక్షించు కోవడం కోసం ఉపాధ్యాయులుగా, సమాజంగా ఏం చేయాలో చూద్దాం.
పాఠశాలలు-పిల్లలు
ఏప్రిల్‌ 30,2021 ప్రభుత్వ లెక్కల ఆధారంగా ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ రంగంలో 33,813 ఉంటే,ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠ శాలలు 1,287ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రాథమికోన్నత పాఠశాలలు 4,158 ఉంటే, ఎయిడెడ్‌ పాఠశాలలు 250 ఉన్నాయి.ప్రభుత్వ రంగంలో ఉన్నత పాఠశాలలు 6,648 ఉంటే, ఎయిడెడ్‌ పాఠశాలలు 435 ఉన్నాయి.2021 ఏప్రిల్‌ నాటికి ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 44,54,038.
జిఓ 117 పేరుతో పాఠశాలలకు సంఖ్యను 6 పాఠశాలలుగా మార్చిన తర్వాత కచ్చితమైన లెక్కలు ప్రభుత్వం నుంచి బహిర్గతం కాలేదు. కొన్ని జిల్లాల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఫౌండేషన్‌ స్కూళ్లు అంటే 1,2 తరగ తులు మాత్రమే నిర్వహించే పాఠశాలలు మొత్తంగా 4600 ఉంటే దానిలో 20 లోపు ఎన్‌రోల్‌మెంట్‌ ఉన్న పాఠశాల 2,730. ఫౌండేషన్‌ ప్లస్‌ అంటే ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 27,000 పైచిలుకు ఉంటే 8,900 వరకు 20 లోపు విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలు ఉన్నాయి. అంటే సుమారుగా 12,000 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయులతో నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా వస్తుందో ప్రశ్నార్థకంగా మారిపోయింది. ప్రీ హైస్కూల్‌ అంటే 1నుంచి 8వ తరగతి వరకు ఉన్న మొత్తం పాఠశాలలు 3,500 దాకా ఉన్నాయి. వీటిలో 30లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 900 వరకు ఉన్నాయి.ఉన్నత పాఠశాలలు 5,400 దాకా ఉంటే దీనిలో 100లోపు విద్యార్థులు ఉన్న పాఠ శాలలు 450 దాకా ఉన్నాయి.20లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు 30లోపు వున్న ప్రీ హైస్కూళ్లు, 100లోపు ఉన్న ఉన్నత పాఠశాలల భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారబో తుంది. ఆశ్చర్య కరమైన విషయం ఏమంటే హైస్కూల్‌ లో చదువుతున్న మూడో తరగతి విద్యార్థికి సబ్జెక్టు టీచర్లతో పాఠాలు,అదే ఒక ప్రాథమిక పాఠశాలలో లేదా ప్రీ హైస్కూల్‌లో 8వ తరగతి దాకా ఉన్న యూపీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థికి సబ్జెక్టు టీచర్లతో బోధన ఉండదు. ఒక భిన్నమైన విద్యా విధానం గత రెండు సంవత్సరాల కాలంగా అమలు చేయబడిరది. మేధావులు,ఎమ్మెల్సీలు,ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు దీన్ని సరిచేయాలని ఇది సరైన పద్ధతి కాదని చెప్పినా ఇది మాపాలసీ అనే పేరుతో అప్పటి ప్రభుత్వం అమలు చేసు కుంటూ పోయింది. దీంతో ఈ రోజున 12,000 ప్రాథమిక పాఠశాలలు ఏకోపా ధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. అలాగే కొన్ని ఉన్నత పాఠశాలల డీ గ్రేడ్‌,కొన్ని యూపీ పాఠశాలల డిగ్రేడ్‌గా మారిపోయాయి. ఎయిడెడ్‌ పాఠశాలలు కనుమరుగు అయి పోయాయి. ఇప్పుడు ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ చూస్తే ఈ లెక్కలు కూడా ప్రభుత్వం అధికారి కంగా ఎక్కడా వెబ్‌సైట్‌లో పెట్టలేదు.కానీ 36 లక్షలకు మించి విద్యార్థులు ప్రభుత్వ పాఠశా లల్లో చదవటం లేదనేది అర్థమవుతుంది. ప్రాథమిక పాఠశాల వ్యవస్థ జిఓ117వల్ల అస్తవ్యస్తంగా మారిపోయింది. అక్కడ చదివే పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారో ప్రైవేటు పాఠశాలకు వెళ్లారో కూడా గణాంకాలు లేని పరిస్థితులు ఏర్పడతాయి. పాఠశాల స్ట్రక్చర్‌, మౌలిక వసతులు, పిల్లలకు కావలసిన సదుపాయాలు కలుగచేసిన తర్వాత కూడా పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గడానికి కారణమేమిటో, ఉపాధ్యాయ పోస్టులు కుదించబడటానికి కారణమేమిటో సమీక్ష జరగకపోవటం ప్రధాన లోపంగా ఉన్నది. ఇప్పటికైనా తక్షణం ఈ విద్యారంగంలో చేస్తున్న మార్పుల మీద ఒక స్పష్టమైన సమీక్ష జరగాలి. దాన్ని సరిచేసుకుని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకునేవైపు ప్రణాళికలు ఉండాలి. బైజూస్‌, సిబిఎస్‌ఇ, టోఫెల్‌, ఐఎఫ్‌బి ప్యానల్‌. ఇలా అనేక పథకాలు పాఠశాలలోకి వచ్చి చేరాయి. ఏపాఠశాలలో ఏసిలబస్‌ ఉందో,ఏ పరీక్షా విధానం ఉందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపైన మాట్లాడుకోవడం గానీ, చర్చించుకోవడం గానీ సమగ్రంగా జరగలేదు. మరో విచిత్రం ఏమంటే ఉపాధ్యాయులు తమ సొంత నెట్‌,సెల్‌ఫోన్‌లోనే అన్ని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవటం.పిల్లలకు ఏమైనా నాలుగు అక్షరాలు వచ్చాయా అనే దానికంటే ఉపాధ్యాయులు యాప్‌లు నింపడం,ఫార్మేట్లు పూర్తి చేయటం మీదే పర్యవేక్షణ సాగింది. పర్యవేక్షణ పాఠశాలలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది.ఒక్క ఉపాధ్యా యులే కాదు.విద్యార్థులు,తల్లిదండ్రులు, డీఈఓ,ఆర్‌జెడి,పై అధికారులు కూడా భయ పడాల్సిన పరిస్థితి ఏర్పడిరది.ఒక స్వేచ్ఛా యుత వాతావరణం పాఠశాలో దెబ్బతిన్నది.
బడి కోసం ఉపాధ్యాయులు
విద్యార్థి బడి ద్వారా సమాజంలో మంచి పౌరుడుగా మారడానికి టీచరు ఉపయోగ పడాలి.నిరంతరం తల్లిదండ్రులతో మమేకం అవ్వాలి.పిల్లల యోగక్షేమాన్ని అడిగి మనోధైర్యా న్ని ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించడానికి నిరంతరం ప్రత్యేక కృషి చేయాలి.చదవటం,రాయటం ప్రతి విద్యార్థికి వచ్చే బాధ్యత తీసుకోవాలి. మన బడికి వచ్చే పిల్లలు ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వారినే విషయం స్పృహలో ఉంచుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చే ఆప్యాయతను విద్యార్థికి బడిలో ఉపాధ్యాయులు ఇవ్వాలి. బడి సమయాన్ని పిల్లల కోసం మాత్రమే కేటా యించాలి. ఉపాధ్యాయుల జీతాలు తల్లిదం డ్రులు, సమాజం కట్టే పన్నుల నుంచే వస్తున్నా యనే వాస్తవాన్ని గ్రహించి, పిల్లల తల్లిదం డ్రులతో, సమాజంతో అనుసంధానం అయ్యేలా వారి పని ఉండాలి. ప్రతి రోజు నూతన అంశాలు, నిరూపించిన శాస్త్రీయ అంశాలు బోధించాలి. విద్యార్థుల్లో చదువుల పట్ల ఆసక్తి కలిగించేటట్లు పని మెరుగు పరచుకోవాలి. ఏదైనా పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే, ఉత్తీర్ణత కాకపోతే తనువు చాలించడం కాకుండా మనోధైర్యంతో బతికేటట్లు, మరల విజయాన్ని అందుకునేటట్లు ప్రోత్సహించాలి. కష్టం,శ్రమ,నిజాయితీ లాంటి నైతిక విలువ లను నేర్పాలి.మొత్తంగా బడి చుట్టూ ఒక సామాజిక కంచెను ఏర్పాటు చేసుకోవాలి. సమాజంలో మనం మనలో సమాజం భాగంగా ఉంటుందని భావనతో ఉపాధ్యా యులు తమ పనిని అభివృద్ధి చేసుకునే వైపు ఉండాలి. బడి తల్లిదండ్రుల ఆదరాభిమానాల్ని పొందే విధంగా టీచర్లు ఆదర్శంగా ఉండాలి. అవసరమైతే ఒకగంట అదనంగా పనిచేయ డానికి సిద్ధపడాలి.బడి నుంచి బయటికి వెళ్లిన విద్యార్థి సమాజంలో ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా బతకగలిగే సామర్ధ్యాన్ని ఇవ్వగలిగేలా బోధన ఉండాలి. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా బడి సమయంలో పిల్లల చుట్టూ, పిల్లల అభివృద్ధి చుట్టూనే ఉపాధ్యాయుల ఆలోచనలు,ఆచరణ, కార్యాచరణ ఉండాలి. బడి కోసం ప్రభుత్వం బోధనకు మాత్రమే ఉపాధ్యాయుని పరిమితం చేయాలి. పాఠశాల పర్యవేక్షణ కక్ష సాధింపు ధోరణితో కాకుండా పొరపాట్లను సరిచేసుకునే పద్ధతిలో ఉండాలి. విద్యారంగానికి హాని చేసే జీవో117ని పూర్తిగా రద్దు చేయాలి.విద్యార్థి ఏమీడి యంలో చదువుకోవాలనే దానిపై విద్యార్థికి స్వేచ్ఛ నివ్వాలి. ప్రాథమిక పాఠశాల విద్య మాతృ భాషలో మాత్రమే ఉండాలి. మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో రెండు మీడియంలను అనుమ తించాలి.ఖాళీలన్నీ డిఎస్సీ ద్వారా తక్షణం భర్తీ చేసి ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయాలి. ఎంఈఓ-2,ప్లస్‌ టు పాఠశాలల వ్యవస్థపై సమీక్ష జరపాలి.ప్రతి పంచాయతీకి అన్ని హంగులతో ఒక ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉండేటట్లుగా ఏర్పాట్లు జరగాలి. ఉపాధ్యాయుల సమస్యలను విని పరిష్కరించే ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. బది లీల కౌన్సిలింగ్‌ విధానాన్ని బలోపేతం చేసే విధంగా బదిలీల చట్టాన్ని రూపొందించాలి. బదిలీల చట్టానికి భిన్నంగా ఎలాంటి బదిలీలు చేయడానికి అనుమతించకూడదు. యాప్‌లు, సెక్షన్లు, ఫార్మేట్లు పూర్తి చేయటం అనేది పాఠశాల పరిధిలో ఉండకూడదు. పాఠశాల పనిదినాలలో ఎలాంటి శిక్షణలు ఉండకూడదు. బడి అంటే పిల్లల కేంద్రంగా ఉండాలి. పిల్లలకు నైపుణ్యమైన, నాణ్యమైన విద్య అందించడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. సాంకేతిక పరిజ్ఞానం అదనపు సోర్సుగా ఉండాలి తప్ప ఉపాధ్యాయుడు మింగివేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుమతించకూడదు. స్కీముల పేరుతో రోజుకో రకమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం కూడదు.రాష్ట్ర అవసరాలను తీర్చగలిగిన నూతన తరాన్ని తయారు చేసేటట్లు రాష్ట్ర విద్యా విధానం రూపొందించాలి. మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం విద్యలో చేస్తున్న మార్పులపై సమగ్ర చర్చ జరిపి, అందరి ఆమోదంతో అమలు చేయాలి. అంతి మంగా ప్రభుత్వ బడిని బలోపేతం చేసే వైపు కార్యాచరణ, ప్రణాళిక, బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి. బడిలో ఉపాధ్యాయుడికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలి.
ప్రభుత్వ బడికి ప్రత్యామ్నాయం లేదు
సమాజంలో నైతిక విలువలు,ప్రజాస్వామ్య విలువలు దృఢంగా నిలబడాలన్నా, మానవత్వం పరిమళించాలన్నా శ్రమజీవుల గురించి ఆలోచించే గొంతుకలు కావాలన్నా,ప్రశ్నించే తత్వం, పరిశోధనలు పెరగాలన్నా, భవిష్యత్తు తరంలో సమానత్వపు ఆలోచనలు పెంపొందిం చాలన్నా, చదువుకున్న చదువుని సమాజం కోసం నిస్వార్ధంగా వినియోగించాలన్నా ప్రభుత్వ బడి వుండాలి. డబ్బుతో కొనుక్కునే చదువు ద్వారా తయారైన పౌరుడు ప్రతిదాన్ని కొనుక్కునే వైపుగానే ఆలోచిస్తాడు. విద్యార్థి పరిపూర్ణ మానవత్వం కలిగిన వ్యక్తిగా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడాలంటే ప్రభుత్వ బడిని బతికించుకోవాలి. కనుక ప్రభుత్వ బడిని రక్షించుకోవాల్సింది బలోపేతం చేయాల్సింది ఆ రంగంలో పని చేస్తున్నటు వంటి ఉపాధ్యాయులే. ఉపాధ్యాయ హక్కుల కోసం ఎంతగా కదులుతున్నామో, ఎంతగా తపిస్తున్నామో, హక్కుల రక్షణకు ఎంతగా ఆలోచిస్తున్నామో అంతకంటే ఎక్కువ బాధ్యతతో, చిత్తశుద్ధితో ప్రభుత్వ బడిని బతికించుకునేందుకు కదలాలి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యా యులు ముందుకు కదలాలి. నిరంతరం సమాజంతో మమేకం కావాలి.
తెలుగు భాషలో సరిగా పునాదులు వేయాలి! -డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌
‘బడి ఈడు పిల్లలకు ‘తెలుగు భాషలో సరిగా పునాదులు పడకపోవడానికి కారణం ఏమిటి? ప్రస్తుతం ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే ‘సమాజంలో ఉన్న సమస్యల గురించి లోతైన పరిశీలన చేయకపోవడం పరిష్కారాల గురించి సరైన దిశగా విశ్లేషణతో కూడిన చర్చ చేయక పోవడం.నిజానికి ప్రస్తుత చర్చలు అన్నీ కూడా ….పైపై మెరుగుల్లాగా,అంతా పైపై చర్చలే! 21వశతాబ్దంలో మన తెలుగువారు నమ్ముతున్న అతిపెద్ద అవాస్తవం ఏమిటంటే ‘ఇంగ్లీష్‌ రావా లంటే చిన్నప్పటి నుండి ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలి.తెలుగు రావాలంటే తెలుగు మీడియం లో చదవాలి‘అని.ఈ రెండు భావనలు తెలుగు రాష్ట్రాల ప్రజలను,తల్లిదండ్రులను,రాజకీయ పార్టీలను బలంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ రెండు భావనలతో ఆలోచించడం మానేసి , మెదడును మూసివేసి…వాస్తవాన్ని,సత్యాన్ని చూడటం లేదు మరియు కనీసం వినడం కూడా లేదు!! చర్చలలో వాస్తవాలను తెలుసు కోవడానికి ‘ఓపెన్‌ మైండ్‌‘తో ఉండటం ఎంతో అవసరం.కానీ ఘనీభవించిన ఆలోచనలు ఉన్న మెదడులు…నిజాలను తెలుసుకోవడానికి కానీ, వాస్తవాలను అంగీకరించడానికి కానీ సిద్ధంగా ఉండవు.
అసలు సమస్య..
విద్యార్థి తెలుగు మీడియంలో చదివినా (లేక) ఇంగ్లీష్‌ మాధ్యమంలో చదివినా ప్రాథమిక స్థాయిలో..వారి మోడల్‌ టైమ్‌ టేబుల్‌ ప్రకారం,1వ తరగతి నుండి 5వ తరగతి వరకు వారానికి తెలుగుకు కనీసం10 పీరియడ్‌లు ఉంటాయి.నిజానికి చాలా మంది ‘ మంచి ఉపాధ్యాయులు‘ తెలుగు ఇంగ్లీష్‌లకు ఇంకా ఎక్కువ సమయం కేటాయిస్తారు (అనగా ప్రతీ భాషకు వారానికి సుమారు 12నుండి 15పీరియడ్‌ల వరకు) తగినంత బోధనా సమయం కేటాయించినా కూడా విద్యా ర్థులకు తెలుగులో చక్కటి పట్టు ఎందుకు రావడం లేదు అన్నది అసలు ప్రశ్న లోపం ఎక్కడుంది? ఏదైనా భాషలో నైపుణ్యం (లాంగ్వేజ్‌ ప్రోఫిషియన్సీ) ఉన్నది అంటే ‘సంసిద్ధం కాని) పరిస్థితులలో కూడా విన డం,విన్నదాన్ని అర్థం చేసుకొని తగురీతిలో మాట్లాడటం,చదవడం మరియు రాయడం అనే నాలుగు నైపుణ్యాలు (శ్రీఱర్‌వఅఱఅస్త్ర,ంజూవaసఱఅస్త్ర, తీవaసఱఅస్త్ర aఅస షతీఱ్‌ఱఅస్త్ర)వచ్చి ఉండా.మన రాష్ట్రంలో పిల్లలు బడిలో చేరటానికి ముందే …ఇంటివద్దే వారికి తెలుగులో మాట్లాడిరది విని అర్థం చేసుకొని,తదుపరి తగినట్లుగా మాట్లాడటం అనేవి (శ్రీఱర్‌వఅఱఅస్త్రడ ంజూవaసఱఅస్త్ర) చక్కగావచ్చు.వాస్తవానికి బడి పిల్లలకు నేర్పా ల్సింది…తెలుగులో చదవడం,వ్రాయడం మాత్రమే! ఈరెండు నైపుణ్యాలు తెలుగు పిల్లలకు,తెలుగుగడ్డపై నేర్పడంలో‘తెలుగు రాష్ట్రాలబడులు’ఎందుకు విఫలమవు తున్నాయి..?లోపం ఎక్కడుంది?తెలుగును బోధించే విధానంలో లోపం ఉన్నదా?(లేక) తరగతి గదిలోనూ,పరీక్షలలోనూ విద్యార్థులు వ్రాసిన తప్పులను సరిచేయకపోవడంలో ఉన్నదా?
తెలుగును బోధించే విధానం..
అ) ముందుగా తెలుగు అక్షరాలు,గుణింతాలు, తదుపరిపదాలు,వాక్యాలు నేర్పుతూ ముందుకు వెళ్లడం ఒక పద్ధతి.
ఆ) మరొక పద్ధతి నేరుగా పదాలలోని అక్షరాలను గుర్తిస్తూ,పదాలను కూడా ఒకేసారి పరిచయం చేసుకుంటూ వెళ్లడం.ఇందులో అక్షరమాలను వరుస క్రమంలో పిల్లలకు నేర్పరు.నిజానికి విద్యార్థికి ఏవిధానంలో నేర్పినా…అక్షరమాలలోని అన్ని అక్షరాలు నేర్పడం,వాటి ఆధారంగా పదాలను చదవడం,తర్వాత రాయడం నేర్పుతారు.
పలకపై దిద్ధితేనే తెలుగు వస్తుందా..
తెలుగు అక్షరాలు నేర్పేటప్పుడు ‘ఒకప్పుడు అక్షరాలు ఇసుకలో దిద్దించేవారు,తర్వాతి కాలంలో పలక మీద, ప్రస్తుతం నోట్‌ పుస్త కంలో వ్రాయిస్తున్నారు.ఇందులో ఒకపద్ధతి కన్నా,మిగిలిన పద్ధతులు ఏమాత్రం ఉత్తమ మైనవి కావు.
తప్పులను సరిచేయకపోవడమే అసలు లోపం..
ప్రాథమిక స్థాయినుండే అత్యధిక మంది ఉపాధ్యాయులు తెలుగులో విద్యార్థుల తప్పులను (చదివినప్పుడు,వ్రాసినప్పుడు)సరిచేయడం చాలా వరకు ఆపేశారు. కనీసం క్లాస్‌ నోట్స్‌లో కూడా తప్పులను ఎర్ర పెన్నుతో రౌండ్‌ చేసి …సరైనది వ్రాయడం లేదు.1వ తరగతినుండి పరీక్షలలో25కి23-24-25లు వేయడంకోసం అన్నిటికీ కరెక్ట్‌ అని టిక్కులు కొడుతున్నారు. దీని వలన విద్యార్థులు వాళ్ళు వ్రాసింది( తప్పు లు అయినా) కరక్టే అనే భావనలో ఉంటు న్నారు. ఇదే విధానంపై తరగతులలో కూడా జరుగుతుంది.ఏదైనామార్కులు 23,24,25లు వేయాలంటే..అన్నిటికీ రైట్‌లు కొట్టుకుంటూ వెళ్ళాల్సిందే కదా !!అదే ఉపాధ్యాయులు చేస్తున్నారు.విద్యార్థులు వ్రాసినదాన్ని సరిచేయడం అనేది దాదాపు ఆగిపో యింది.కొద్ది మంది నిబద్ధత కల్గిన ఉపాధ్యా యులు,ప్రశ్నించే తల్లిదండ్రులు ఉన్న చోట్ల మాత్రమే తప్పొప్పులు కొంతమేర సరిచేస్తున్నారు.
బాధ్యతా రాహిత్యం నుండి మార్కుల వరద వరకు…
తరగతి గదిలో ప్రాథమిక స్థాయిలో,సెకండరీ స్థాయిలో చేయాల్సినవి చేయకుండా..పరీక్షలలో మార్కుల వరద తీసుకువస్తున్నారు.2024 పది పబ్లిక్‌ పరీక్షలలో6,854మందికి తెలుగులో 100 కి100మార్కులు వచ్చాయి.ఇవి నిజంగా నిక్కచ్చిగా పేపర్లు దిద్దిన తర్వాత వస్తే … ఆవిద్యార్థులు మన తెలుగు జాతికి గర్వకా రణం.అప్పుడు భాషాభిమానులు దిగులు పడాల్సిన పనేమీలేదు!! ఎందుకంటే భాషను కాపాడే శక్తియుక్తులు ఆ పిల్లలకు ఉన్నాయి అని గుండెల మీద చేయివేసుకొని హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు! ఈమార్కులు నిజమైనవని,వారు వ్రాసిన సమాధానాలలో తప్పులే లేవని ప్రభుత్వం భావిస్తే ‘తెలుగులో 100కి100మార్కులు వచ్చిన విద్యార్థుల జవాబు పత్రాలు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టండి. (విద్యార్థుల పేర్లు,హాల్‌ టికెట్‌ నెంబర్‌లు కనబడకుండాచేసి…ఆపేపర్లు పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు). తప్పులు లేకుండాఉన్న జవాబుపత్రాలు తల్లిదం డ్రులు చూస్తే,వారి పిల్లలు కూడా అలా రాయలని తపన పడతారు ,వారి పిల్లలను కూడా ఆదిశగా ప్రోత్సహిస్తారు.నిజానికి దీనివలన సమాజంపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
తల్లిదండ్రులపై నెపం వేయడం తప్పు….
తల్లిదండ్రులకు తెలుగుపై మక్కువలేదని, ఇంగ్లీష్‌పై మోజుందని చెప్పడం అనేది ‘సమస్య ను పక్కదారి పట్టించడమే !.వాళ్ళపిల్లలు వ్రాస్తున్న, చదువుతున్న తప్పులను సరికుండా,కనీసంఎత్తి చూపకుండా మార్కులు కుమ్మరిస్తుంటే…వాళ్ళు అంతా సవ్యంగా ఉంది అని అనుకుంటున్నారు.
చక్రపాణి మాష్టారు లాంటి వారు ఆదర్శం…
తాడికొండ గురుకులపాఠశాలలో 1992లో 10వ తరగతి విద్యార్థులందరికీ పబ్లిక్‌ పరీక్ష లలో తెలుగులో 90కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. మార్కులు నిక్కచ్చిగా వేసే ఆరోజుల లోనే కాదు…ఇప్పటికీ అది రికార్డే! ఈరికార్డుకు మూలకారణం‘చక్రపాణి మాష్టారు ‘…ఆయన తెలుగు మాష్టారు.ఆయన జవాబు పత్రాలు దిద్దేటప్పుడు ప్రతీతప్పును హైలైట్‌ చేసేవారు.ప్రతీతప్పుకు 1/4% మార్కు తగ్గించే వారు.కొత్తగా చేరిన విద్యార్థులు కూడా, రెండు మూడు పరీక్షలు ముగిసేటప్పటికి తప్పులు లేకుండా వ్రాసేవారు.నేర్చుకోవడం అనేది విద్యార్థికి ఉన్న సహజ స్వభావం.పరీక్షలలో తప్పులు సరిజేయకుండా, అధిక మార్కులు వేసుకుంటూ వెళ్లడం వలన ‘విద్యార్థులకు ఉండే నేర్చుకునే స్వభావం మసకబారు తుంది,మరియు మొద్దుబారిపోతుంది. కావున తెలుగు భాషను కాపాడాలంటే ‘ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులు (క్లాస్‌టీచర్‌లు),హై స్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయులు నడుంకడితే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. విద్యార్థులు వ్రాసిన తప్పొప్పులను,ఉపాధ్యాయులు ప్రతీ దశలోనూ సరిచేయాలి.తప్పులను సరిచేస్తే పిల్లలు బాధపడతారు అనేది …చాలా అసంబద్ధమైన, పసలేని వాదన!! ఎందుకంటే వారు బాధపడటం,బాధపడకపోవడం అనేది మన హావభావాల మీద-దండన లాంటి విషయాలపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. కావలసింది తప్పులనుసరిదిద్ది,విద్యార్థులను మరింతగా ప్రోత్సహించే అభ్యుదయ కాముకులైన ఉపాధ్యాయులు, హెడ్‌మా స్టార్లు.వారికి పాఠశాల యాజమా న్యాలు మరియు విద్యాశాఖ అధికారులు పూర్తి సహకారాన్ని అందిస్తూ, పర్యవేక్షణను పెంచాలి.అప్పుడే తెలుగు భాష మరలా తన పూర్వ వైభవాన్ని పొందుతుంది.
-(ఎన్‌.వెంకటేశ్వర్లు)

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రజా సమక్షంలో నాలుగోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు.17మంది కొత్త వారితో సహా 24మందితో తన మంత్రి మం డలి జట్టును కూడా ప్రకటించారు. ఈ ప్రమా ణ స్వీకార మహోత్సవానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా విచ్చేసి,కొత్త ప్రభు త్వానికి శుభాకాంక్షలు చెప్పారు.చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ సమయంలో కార్య కర్తల హర్షాతిరేకాలతో సభాప్రాంగణం మార్మోగి పోయింది! జూన్‌ 4న టిడిపి కూటమి విజయ కేతనం ఎగుర వేయడంతో మొదలైన కూటమి శ్రేణుల సందడి నిన్నటి ప్రమాణ స్వీకారంతో పతాకస్థాయికి చేరింది.జూన్‌ 13న చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి,కొన్ని ఎన్ని కల వాగ్దానాలపై తొలి సంతకాలు చేయడంతో పాలనాపర్వం మొదలైంది.
వివిధ తరగతుల ప్రజలు పెట్టుకున్న ఆశలను, ఆకాంక్షలనూ నెరవేర్చే విధంగా కొత్త ప్రభుత్వం ఇక ముందుకు సాగవల్సి ఉంటుంది. నిరంకుశ విధానాలు, ప్రజలపై భారాలూ అమలు చేస్తే జనం ఎలా స్పందిస్తారో గత ప్రభుత్వ అను భవాన్ని సదా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. విభజిత రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబుకి, ఆయన మంత్రివర్గానికి ఇది చాలా బాధ్యతాయుత కాలం. రాష్ట్రం విడివడి పదేళ్లు గడచిపోయాక కూడా విభజన హామీలు నెరవేరలేదు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునివ్వాల్సిన కేంద్రంలో ఈ పదేళ్లూ బిజెపియే అధికారంలో ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల వ్యవధిలోనే ప్రత్యేక హోదా హామీకి మోడీ షా ప్రభుత్వం మంగళం పాడేసింది. మనం హక్కుగా పొందాల్సిన విభజన హామీలు చూస్తుండగానే తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యాయి. రైల్వే జోను మంజూరు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, వివిధ సంస్థల ఏర్పాటు వంటి కీలక బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా తప్పుకొంది. తరువాత అధికారంలోకి వచ్చిన జగన్‌ మూడు రాజధానుల జపం చేసినప్పుడు మోడీ ప్రభుత్వం గోడ మీద పిల్లిలా అవకాశవా దాన్ని ప్రదర్శించింది.తన వైఖరిని స్పష్టం చేయకుండా నాన్చి,రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని త్రేన్చి, రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసింది.
అలాంటి బిజెపి ఇప్పుడు చంద్రబాబు మద్దతు తప్పనిసరైన పరిస్థితుల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒకరికొకరు చాలా కీలక మూ,అవసరమూ అన్నంత ప్రదర్శన మోడీ -చంద్రబాబుల్లో బయటికి బ్రహ్మాండంగా కనిపిస్తోంది.2014లో వలె రాష్ట్రంలో బిజెపి అధికారాన్ని పంచుకుంటుంటే, కేంద్రంలో టిడిపి మంత్రిపదవులను అంది పుచ్చుకొంది. అయితే, బిజెపి సహజంగానే తన మిత్రులకు సమాన ప్రాతినిథ్యం ఇవ్వదని, సంపూర్ణ విశ్వాసం చూపదని అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అనుభవం. గతంలో చంద్రబాబు కూడా దీనిని చవి చూశారు కాబట్టి, అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం తొలినాళ్ల నుంచీ రాష్ట్ర ప్రయోజనాలే ప్రప్రథమ ప్రాధాన్య బాధ్యతగా తలకెత్తుకొని పనిచేయాలి. కేంద్ర బిజెపి మన రాష్ట్రానికి చేయాల్సింది చేయకపోగా,తెలుగు జాతి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కార్పొరేటు పరం చేయటానికి పూనుకొంది. ఏళ్ల తరబడి మొక్కవోని దీక్షతో ఉక్కు కార్మికులు సాగిస్తున్న నిరవధిక పోరాటమే దానిని ఇన్నాళ్లూ భద్రంగా ఉంచగలిగింది. చంద్ర బాబు ప్రభుత్వం పూనుకొని,విశాఖ ఉక్కును ప్రభుత్వరంగంలోనే నిలబెట్టి, సొంత గనులూ సాధించాలి.రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా అన్ని విభజన హామీలూ ఆచరణలోకి వచ్చేలా నిక్కచ్చిగా, నిరంతరాయంగా పనిచేయాలి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, నిర్వాసి తులకు సంపూర్ణంగా పరిహారం, పునరావాసం కల్పన వంటి కీలక బాధ్యతలను నెరవేరుస్తూనే -ఎన్నికల ప్రాంగణంలో ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలనూ అమలు చేయాలి. మోడీ షాల మాటల మాయోపాయంలో కాలహరణం జరిగిపోకుండా తొలిరోజు నుంచీ న్యాయ బద్ధమైన రాష్ట్ర హక్కుల కోసం, ప్రకటిత హామీల అమలు కోసం గొంతెత్తాలి.తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఎన్‌టి రామారావు స్థాపించిన పార్టీ రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు గట్టిగా పనిచేయాలి.
ఆ ఐదు ఫైళ్లపై సంతకాలు
వెలగపూడి సచివాలయంలో ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే.. ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. ముందుగా మెగా డీఎస్సీ,పెన్షన్ల పెంపు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్‌ సెన్సస్‌ ఫైళ్లపై సైన్‌ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు. అన్నట్టుగానే ఆ ఫైల్‌పైనే ముఖ్య మంత్రిగా తొలి సంతకం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవ రించి..కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 13వేలకు పైగా పోస్టులు ఖాళీలు న్నట్టు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు. వీటిపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించి ఆ తర్వాత వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రజల్ని అయోమ యానికి గురిచేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం చేశారు సీఎం చంద్రబాబు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి గత ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని 2023అక్టోబర్‌ 31న తీసుకొచ్చిందని ఎన్నికల ప్రచారంలో పదే పదే కూటమి పార్టీలు ఆరోపించాయి. ఈ చట్టం ముసుగులో ప్రభుత్వ, ప్రైవేట్‌ వ్యక్తుల భూ భక్షణకు ఆస్కా రం ఇచ్చేలా వేర్వేరు సెక్షన్లు రూపొందించార ని మండిపడ్డారు.సామాన్యుల ఆస్తులకి ఈ చట్టంతో రక్షణ లేకుండా పోయిందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీనిచ్చారు చంద్రబాబు. దీంతో రెండో సంతకం..ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు ఫైల్‌పైనే చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే 200 రూపా యలున్న వృద్ధుల పెన్షన్‌ ఏకంగా ఐదు రేట్లు పెంచి వెయ్యి చేశారు. ఆ తర్వాత దాన్ని 2వేలకు పెంచారు.ఈ సారి ఎన్నికల ప్రచా రంలో వృద్దుల పెన్షన్‌ నాలుగు వేలకు పెంచు తామని చంద్రబాబు హామీనిచ్చారు. అంతే కాదూ ఏప్రిల్‌ నుంచి పెంచిన పెన్షన్‌ వర్తింపజే స్తామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు. ఆ హామీని నెరవేరుస్తూ మూడో సంతకం చేశారు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ వ్యాప్తం గా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఒక పూటకి ఐదు రూపాయల చొప్పున మూడు పూటలకి 15రూపాయలకే భోజనం అందిం చారు.అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్లను నిలిపివేశారు.ఎన్నికల ప్రచారంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని చంద్రబా బు ప్రకటించారు.ఇందులో భాగంగా నాలుగో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై చేశారు. యువత ఉన్నత విద్యనభ్యసించినా అందుకు తగ్గట్టు ఉద్యోగాలు రావడం లేదు. కారణం నైపుణ్యం లేకపోవడమే.ఇది గుర్తించిన కూటమి నేతలు..ఎన్నికల ప్రచారంలో స్కిల్‌ సెన్సస్‌ హామీనిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి,ఏరంగానికి ప్రాధాన్య ముంది..ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు స్కిల్‌ సెన్సస్‌ చాలా ఉపయోగపడనుంది.ఐదో సంతకం స్కిల్‌ సెన్సస్‌పైన చేశారు.
మెగా డీఎస్సీ ఫైల్‌పై చంద్రబాబు తొలి సంతకం
సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసి నిరుద్యోగుల జీవితాల్లో భరోసా నింపారు. మెగా డీఎస్సీ ద్వారా పాఠశాలల్లో 16,347 పోస్టులకు పచ్చజెండా ఊపారు.చంద్రబాబు నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో నిరుద్యోగులకు పండగొచ్చింది. మెగా డీఎస్సీ అంటే దాదాపు పదివేల వరకు పోస్టులు ఉండొచ్చు అనుకుంటే అంతకు మించి ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.మెగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ ప్లస్‌? అనిపించేలా 16,347పోస్టుల ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఇవాళ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ పైల్‌పైనే తొలి సంతకం చేశారు. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం,సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం,మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన చంద్రబాబుకు గుంటూరులో అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌ పాలనలో ఉపాధ్యాయ భర్తీ నోటిఫికేషన్‌ విడుదల కాక తీవ్ర ఇబ్బందులు పడ్డామని వాపోయారు. చాలా మంది అభ్యర్థులు వయో భారంతో అవకాశాలు కోల్పోయారని తెలి పారు. కూటమి ప్రభుత్వంలో వారికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తమకెంతో మేలు జరుగుతుందని డీఎస్సీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారం చేపట్టిన 24గంటల్లోపే మెగా డీఎస్సీ పై సంతకం చేస్తామన్న నారా లోకేశ్‌ మాట నిలబెట్టుకున్నారని డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు.ఐదేళ్లుగా మెగా డీఎస్సీపేరుతో జగన్‌ నిరుద్యోగులను దగా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే తెదేపాతోనే సాధ్యమన్నారు. డీఎస్సీ పై మ్నెదటి సంతకం చేసిన సీఎం చంద్రబాబుకు నిరుద్యోగ యువత ధన్యవాదాలు తెలిపారు.
మెగా డీఎస్సీ 2024 ఖాళీల వివరాలివే..
ఎస్‌జీటీ 6,371
వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 132
స్కూల్‌ అసిస్టెంట్‌ 7,725
టీజీటీ పోస్టులు 1,781
పీజీటీ పోస్టులు 286
ప్రిన్సిపాళ్లు 52
మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం చేశారు.
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు..
ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రెండో సంతకాన్ని భూ హక్కు చట్టం రద్దు దస్త్రంపై పెట్టారు.తర్వాత న్యాయశాఖ వద్దకు పంప బోతున్నారు.రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమో దం తెలుపుతుంది.ఆ తర్వాత జరిగే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో టైటిలింగ్‌ చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశ పెడతారు.
నీతి ఆయోగ్‌ నమూనా చట్టానికి తూట్లు పొడిచి..
గత ప్రభుత్వం రూపొందించిన టైటిలింగ్‌ చట్టంలో పేర్కొన్న నిబంధనలు ప్రజల స్థిరా స్తుల భద్రతను ప్రశ్నార్ధకం చేశాయి.సొంత స్థిరాస్తులపై చట్టబద్ద హక్కులను నిర్ణయించే అధికారాన్ని అధికారులకు అప్పగించి, యాజ మాన్య హక్కుల కల్పన బాధ్యతల నుంచి సివిల్‌ కోర్టులను వైసీపీ ప్రభుత్వం తప్పించడం దుమా రాన్ని రేపింది.వైసీపీ ప్రభుత్వం 2023 అక్టోబర్‌ 31నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జీవో జారీ చేయడం భూ యాజమా నులకు ఆందోళన కలిగించింది. అలాగే.. చట్టంలోని సెక్షన్‌28కి అనుగుణంగా ఏపీ ల్యాండ్‌ ఆధారిటీని ఏర్పాటు చేస్తూ దానికి చైర్‌పర్సన్‌,కమిషన్‌,సభ్యులను నియమిస్తూ గతేడాది డిసెంబర్‌ 29నప్రభుత్వం జీవో జారీ చేసింది.నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన టైటిలింగ్‌ చట్టానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచి..తన ఇష్టమొచ్చినట్లు నియమ నిబంధనలు రూపొం దించి,అందరిని కలవరానికి గురిచేసింది.నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన నమూనా టైటిలింగ్‌ చట్టం సెక్షన్‌5లో టైటిలింగ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (టీఆర్‌ఓ) నియామకం గురించి కేంద్ర ప్రభుత్వం పేర్కోంది.నోటిఫికేషన్‌ జారీ చేయ డంద్వారా ఏ అధికారినైనా(ఎనీ ఆఫీసర్‌) టీఆర్‌ఓగా నియమించవచ్చని తెలిపింది. అయితే ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం సెక్షన్‌ 5లో ఏవ్యక్తినైనా(ఎనీ పర్సన్‌)టీఆర్‌ఓగా నియమించవచ్చని పేర్కొంది.రికార్డుల్లో యజమానుల పేర్లను ఓసారి చేర్చి నోటిఫై చేసిన తర్వాత మూడేళ్లలోపు ఎవరూ అభ్యం తరం చెప్పకపోతే యాజమాన్య హక్కు విష యంలో ఈ వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించాలని నమూనా చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది.రాష్ట్ర చట్టంలో మూడేళ్ల కాలాన్ని రెండేళ్లకు కుదించారు.రికార్డుల్లో నమోదైన యాజమాన్య హక్కుపై అభ్యంతరం వ్యక్తం చేసే గడువును రెండేళ్లకే పరిమితం చేశారు.ల్యాండ్‌ టైటిలింగ్‌ అఫీలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే నీతీ ఆయోగ్‌ నమూనా చట్టం సెక్షన్‌16ప్రకారం హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసుకోవచ్చు.రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం హైకోర్టులో అప్పీల్‌కు అవకాశం ఇవ్వలేదు.హైకోర్టులో రివిజన్‌కు మాత్రమే దాఖలు చేసుకోవాలని పేర్కొన్నారు.భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికార పరిధి నుంచి రాష్ట్రంలోని సివిల్‌ కోర్టులను పూర్తిగా పక్కనపెట్టి(సెక్షన్‌ 38)జగన్‌ సర్కారు..హైకోర్టులో అప్పీల్‌కు అవకాశం లేకుండా కేవలం రివిజన్‌కు అవకాశాన్ని కల్పించడం తీవ్ర ఆందోళన కలిగించింది.
న్యాయస్థానాల తీర్పులనూ పక్కన పెట్టి
భూ యాజమాన్య హక్కు వివాదాన్ని పరిష్కరిం చేందుకు నీతీ ఆయోగ్‌..నమూనా టైటిలింగ్‌ చట్టం ద్వారా మూడు అంజెల వ్యవస్థను సిఫార్సు చేసింది.ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం ద్వారా ఈ వ్యవహారాన్ని రెండు అంచెలకే పరిమితం చేశారు.న్యాయశాస్త్ర పరిజ్ఞానం లేని అధికారుల చేతుల్లో భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికా రాన్ని వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టడం చర్చనీ యాంశమైంది.భూ హక్కులను అధికారులు నిర్ణయించలేరని,న్యాయస్థానాలు మాత్రమే ఈ విషయాన్ని పరిష్కరించగలవని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం పెడచెవిని పెట్టింది.ఈ చట్టాన్ని రద్దు చేయా లని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా నెలల తరబడి కోర్టు విధులను బహిష్కరించినా ప్రభుత్వం స్పందించలేదు.
పెన్షన్ల పెంపుపై 3వ సంతకం
‘‘మొదటి సారి రూ.35లతో పెన్షన్లు ప్రారంభించింది ఎన్టీఆర్‌. సమైక్యరాష్ట్రంలో నేను దాన్ని రూ.75లకు పెంచాను. విభజన తర్వాత రూ.200 ఉన్న పెన్షన్లను రూ.1000లకు, తర్వాత రూ.2వేలకు పెంచాను. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం విడతల వారీగా పెంచింది వెయ్యి రూపాయలు మాత్రమే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌ రూ.4 వేలకు పెంచాం. పెంచిన పెన్షన్‌ పెన్షన్‌ తో పాటు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు నెలకు రూ.1000 చొప్పున కలిపి ఇస్తానని చెప్పాను. పెంచిన వాటితో కలిపి జులైలో రూ.7వేలు పెన్షన్‌ లబ్ధిదారులకు అందుతుంది. దివ్యాంగుల పెన్షన్‌ కూడా రూ.6 వేలకు పెంచాం…పెంచిన పెన్షన్‌ మూడు నెలలకు వర్తిస్తున్నందున జూలైలో దివ్యాంగులు రూ.12 వేలు తీసుకుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పెన్షన్‌ పెంచాము. ఇబ్బందులు పడేవారిని గుర్తించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం.’’అని సీఎం చంద్రబాబు అన్నారు.
నైపుణ్య గణన పై 4వ సంతకం
‘‘యువత నైపుణ్యం లెక్కించేందుకు, దానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకుక నైపుణ్య గణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి..కానీ వాటిని సాధించుకోవాలంటే కావాల్సిన నాలెడ్జ్‌, నైపుణ్యం కావాలి. ఉన్నత చదువులు చదివినా…సరైన స్కిల్స్‌ లేకపోవడంతో ఉద్యోగా లు రావడం లేదు.నాలెడ్జ్‌ ఎకానమీలో ముం దుకు వెళ్తున్న సమయంలో తగిన స్కిల్స్‌ ఉంటే ప్రపంచంలో రాణించవచ్చు.ప్రపంచంలో ఇప్పటి వరకు జనాభా లెక్కలు చేశారు. కులాల వారీగా లెక్కులు తీశారు..కానీ మొదటి సారిగా స్కిల్‌ గణనకు శ్రీకారం చుట్టాం. ఎవరికి ఎలాంటి నైపుణ్యం ఉంది…దేశంలో ఏఉద్యో గాలు ఉన్నాయి…దానికి తగ్గ స్కిల్స్‌ ఉన్నాయా లేదా అన్నది లెక్కిస్తున్నాం.పెట్టుబడులు వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుండి ఉద్యోగులు రాకుండా మనరాష్ట్రం నుండే కావాల్సిన మానవ వనరులు అభివృద్ధి చేయాలి. కావాల్సి న నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్ర మానికి శ్రీకారం చుట్టాం. ఇది యువత భవిష్య త్తుకు సంబంధించిన అంశం.’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. – జి.ఎన్‌.వి.సతీష్‌

నీటి అన్వేషణలో వన్యప్రాణులు

వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతోంది. అడువుల్లోని నీటి వనరులు ఎండిపోతున్నాయి. దాహార్తి కోసం వన్యప్రాణులు విలవిలాడే ప్రమాదం ఉంది.తాగునీటి కోసం ఆరుబయట కొచ్చిన అడవి జంతువులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్న క్రమంలో అడవుల్లోని వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ ప్రణాళిక రూపొందించింది.అడవుల్లో సాసర్‌పిట్స్‌, చిన్ననీటి కుంటల్లో నీరు నింపే చర్యలు చేపట్టారు.అనుమానిత ప్రాంతాల్లో నిఘా తీవ్రతరం చేస్తున్నారు.వేటగాళ్ల బారినుంచి వన్యప్రాణులను సంరక్షిస్తున్నారు. గ్రామాల్లోకి తాగునీటి కోసం వన్యప్రాణులు వస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చేలా చైతన్యం కల్పిస్తున్నారు.
దేశంలోనే పెద్దపులులకు ఆవాస కేంద్రం నల్లమల్ల అటవీ ప్రాంతం. ఆత్మకూరు డివిజన్‌ పరిధిలో వేసవి కాలం వచ్చిందంటే ముందస్తు గానే అటవీశాఖ అధికారులు నామ మాత్రపు చర్యలు చేపట్టి వన్యప్రాణుల దాహార్తిని తీర్చేం దుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. అయితే అడవిలో వన్య వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు నీరు ఏ మాత్రం సరి పోవడం లేదు. అభయారణ్యంలో ఉండా ల్సిన పెద్దపులి దాహం తీర్చుకునేందుకు జనావాసం లోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ నిధులను ఎంత ఖర్చు చేస్తుంది అనే లెక్కల్లో నేటికీ స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్ద పులుల సంరక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నల్లమల అటవీ ప్రాంతం లోని నాగార్జు నసాగర్‌.. శ్రీశైలం పెద్దపులుల అభయా రణ్యంగా ప్రకటించింది.దేశవ్యాప్తంగా పరిచయమైన ఈ శాంచారి నల్లమల సొంతం. వాస్తవంగా ఇక్కడ పెద్దపులుల సంతతి తగ్గి పోతుండగా.. ప్రతి సంవత్సరం అటవీశాఖ అధికారులు పులుల లెక్కింపు చేస్తారు. వేసవిలో పెద్ద పులుల మనుగడ దినదినగండంగా మారు తోంది. అడవుల్లో నీటి లభ్యత ఆవాసాలు లేకపోవడంతో జనారణ్యంలోకి వస్తున్న సంద ర్భాలు ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలో ఎన్నో ఉన్నాయి. ఆ సమయంలో వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ కోసం నిధులు పుష్కలంగా ఉన్నప్ప టికీ అటవీశాఖ అధికారులు అరకొర చర్యలు తీసుకుంటున్నారు. నల్లమల అటవీ ప్రాంతం లోని నంద్యాల జిల్లా పరిధిలో గల ఆత్మకూరు డివిజన్‌ ఆత్మకూరు, వెలుగోడు, బైర్లూటి, నాగలూటి, శ్రీశైలం రేంజిలో పెద్ద పులుల సంతతి అధిక సంఖ్యలో ఉంటుందని అటవీ శాఖ అధికారుల గణాంకాలు తెలుపు తున్నా యి. ఈ వేసవిలో మాత్రం నీటి కొరత తక్కువ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. 40 డిగ్రీల ఉష్ణోగ్ర తతో ఎండలు మండుతున్న ఈ పరిస్థితుల్లో నంద్యాల, కర్నూల్‌, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో గల నల్లమల్ల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అభయారణ్యంలో 3,568 చదరపు కి.మీ విస్తరించి ఉన్న తమ ఆవాసా లను పెద్ద పులులు వీడి నీటి కోసం మైదానం ప్రదేశాల వైపు వస్తున్నాయి. ఈ వలస పయ నంలో వన్యప్రాణుల మధ్య నీటి యుద్ధం, సరిహద్దుల వివాదం నెలకొంటోంది. ఆధిపత్య పోరులో పెద్ద పులులు చిరుతలు ఎలుగుబంట్లు ఇతర వన్యప్రాణులు మరణిస్తున్నాయి.
వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం..
వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వేసవిలో దప్పిక తీర్చేందుకు అడవుల్లో నీటి గుంతలు, చెక్‌ డ్యామ్‌లు, సాసర్‌లు అవసరాన్ని బట్టి సోలార్‌ బోర్లను ఏర్పాటు చేసింది. నీటి లభ్యత ఉన్న ప్రాంతా లకు దాహర్తిని తీర్చుకునేందుకు వచ్చే జంతువులు వేటగాళ్లకు చిక్కకుండా సీసీ కెమెరాలు, బెస్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తు న్నారు. అడవుల జిల్లాలుగా పేరున్న ములుగు, భూపాలపల్లి జిల్లాలో వన్యప్రాణులను కాపాడేం దుకు అధికారులు కాంపా నిధులతో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
వేసవి దప్పికతో విలవిల..
మండుతున్న ఎండలతో అడవుల్లో ఆకులు రాలిపోతున్నాయి. వాగులు, వంకలు, గుంటల్లో నీళ్లులేక పగుళ్లు పారుతుంటాయి. దీంతో అటవీ ప్రాంతం లో గొంతు తడుపుకునేందుకు నీటిచుక్క కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో వన్యప్రాణుల దప్పికతో విలవిలలాడు తుం టాయి. దుప్పులు, అడవి పందులు, కృష్ణ జింకలు, అడవిదున్న, కొండ గొర్రెలు, ఎలుగుబంట్లు, నెమళ్లు, కుందేళ్లు తదితర అడవి జంతువులు నీళ్ల కోసం వేసవిలో దాహర్తితో అల్లాడుతుంటాయి. అడవి జంతువులు నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వస్తున్నాయి.వేటగాళ్ల దృష్టిలో పడితే ఇక వన్యప్రాణులు గాలి లో కలిపి పోవాల్సింది. ఇప్పటికే భూపాలపల్లి జిల్లా పలిమెల, మహాముత్తారం, ఆజాంనగర్‌, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం,కన్నాయిగూడెం, తాడ్వాయి మండలాల్లోని అడవుల్లో అడవి జంతువులు వేటగాళ్లకు ఆహారంగా మారుతున్నాయి. నీటి లభ్యత ఉన్న ప్రాంతా లకు వచ్చే జంతువులపై వేటగాళ్లు గురి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వన్య ప్రాణులను కాపాడుకునేందుకు ప్రభుత్వం అడవుల్లోనే నీటి వసతులను కల్పించేందుకు కాంపా పథకం ద్వారా నిధులు కేటాయిస్తోంది.
అడవుల్లో నీటి గుంతలు..
వన్యప్రాణులను వేసవి దప్పిక నుంచి కాపా డేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. 2016 నుంచి భూపాలపల్లి, ములుగు జిల్లాలో సుమారు రూ.30 కోట్ల కాంపా నిధులతో అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భూపాలపల్లి జిల్లా అటవీశాఖ పరిధిలో 52 నీటి గుంతలు, 119 మినీ పీటీ (పెర్కోలేషన్‌ ట్యాంకు)లు, 65 పెర్కోలేషన్‌ ట్యాంకులు, 134 చెక్‌డ్యాంలు, 102 సాసర్‌పిట్స్‌,9 సోలా ర్‌ బోర్లు,151 రాక్‌ఫిల్‌ డ్యాంలు, 28 చెలి మెలు తదితర నీటి వసతులను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో 100కు పైగా నీటిగుంతలు, 55 సిమెంట్‌ నీటి తొట్టెలు,.660 చిన్నరాతి కట్టడాలు, 50 పెర్కులేషన్‌ ట్యాంకులు, 6 సోలార్‌ బోర్‌ వెల్స్‌ ఏర్పాటు చేశారు. అడవిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని నిర్మించారు. వీటిలో ట్రాక్టర్లు, మిని వాటర్‌ ట్యాంకుల ద్వారా నీటిని నింపుతున్నారు. గ్రామాలకు దూరంగా ఉన్న వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, పలిమెల, మహాముత్తారం అడవుల్లో సోలార్‌ ఆధారిత బోర్లు ఏర్పాటు చేశారు. ఈ బోర్లతో చుట్టుపక్కల చెక్‌ డ్యామ్‌లు, నీటి గుంతలు, నీటితొట్టే (సాసర్‌) లతో నీటిని నింపుతున్నారు. వారానికి ఒకటి రెండు సార్లు తప్పకుండా నీటిని నింపేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని ఓ అటవీశాఖ అధికారి తెలిపారు. వన్యప్రాణులకు అడవిలో నీటిని అందించటంతో నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వచ్చే అవకాశం తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. పైగా నీటి లభ్యత ఉండే ప్రాంతాల్లో గడ్డి కూడా మొలిచే అవకాశం ఉంటుందని, ఈ గడ్డి జంతువులకు ఆహారంగా ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. అలాగే వన్య ప్రాణులు ఆకలి, దప్పిక కోసం ఎంచుకున్న ప్రదేశాల్లో కృత్రిమంగా నీరునిల్వ ఉండేలా చెక్‌డ్యాంలు నిర్మించారు. నీటి వనరులు లేని చోటబోర్లు వేసి సోలార్‌తో నడిచే మోటర్లను బిగిస్తున్నారు. తద్వారా వన్యప్రాణుల కోసం నీరు, గడ్డి కొరత తీర్చగలుగుతున్నారు.
వేటగాళ్లకు పండుగే..
వేసవి వచ్చిందంటే వేటగాళ్లకు పండుగే. వేసవిలో నీటి లభ్యత ఉండే ప్రాంతాలపై వేటగాళ్లు దృష్టి సారిస్తారు. గోదావరి తీరంతో పాటు అడవుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వేటగాళ్లు ఉచ్చులు, వలలు వేయటంతో పాటు బాణాలు, నాటు తుపాకీలు, మందుగుండు సామగ్రితో జంతువులపై దాడికి వ్యూహలు అమలు చేస్తుంటారు. అడవిశాఖ అధికారులు వన్యప్రాణుల కోసం అడవిలో ఏర్పాటు చేసే నీటి గుంటలు, చెక్‌ డ్యామ్‌లు, సాసర్‌లు, సోలార్‌ బోర్ల సమీపంలోను వేటగాళ్లు దాడులకు పాల్పడుతుంటారు. దీనికి చెక్‌పెట్టి వన్యప్రాణులను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పలిమెల, మహదేవపూర్‌, మహముత్తారం, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం,వాజేడు అడవి ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశా రు. వీటితో పాటు ఏటూరునాగారం అభయారణ్యం, పలిమెల, మహముత్తారం అడవుల్లో బెస్‌ క్యాంపులతో పాటు రాత్రి వేళల్లో ప్లాయింగ్‌ స్క్వాడ్‌లు తిరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఇటీవల కాలంలో ములుగు, భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల అడవి జంతువు లను వేటాడిన వారిని అడవిశాఖ అధికారులు పట్టుకున్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ వన్యప్రాణులకు రక్షణ కవచంగా మారిందనే టాక్‌ వినబడుతోంది…
అటవీశాఖ అధికారుల చర్యలు ఇంతేనా..
జనవరి నెల వచ్చిందంటే అటవీశాఖ అధికారులు వరల్డ్‌ వ్డైల్లఫ్‌ నిధులతో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు నిధులు కేటాయిస్తారు. ఇందులో భాగంగా ప్రత్యేక నీటి వసతి ఏర్పాటు- చేయాలి. ఆయా అటవీ రేంజ్‌లలో క్రూ త్రీయ సాసర్‌ పిట్‌లను నిర్మించి వాటిని నీటితో నింపాలి, జంతువుల శరీరాలు జీర్ణ వ్యవస్థ శరీరంలో నీటి శాతం తగ్గకుండా సాల్‌ టు లిరిక్స్‌ (ఉప్పు దిమ్మలను) ఏర్పాటు చేస్తూ 24 గంటలు సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తూ వాటి కదలికలను గమనిం చాలని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వేసవి కాలంలో వేటగాళ్లు మాటువేసి జంతువులను మట్టి పెడుతున్నారు.
పక్షులు,పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండిసెల్వి, సిస్టర్‌, విశాఖ మరియా మేక్స్‌
పక్షులు, పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండి అని ఆరిలోవ లోని విశాఖ మరియా మేక్స్‌ సంస్థ ప్రతినిధి సిస్టర్‌ సెల్వి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఉదయం సంస్థ కార్యాలయం వద్ద ఎకో వైజాగ్‌ జివిఎంసిలో భాగంగా గ్రీన్‌ క్లైమేట్‌ టీం ఎన్‌ జిఒ పక్షులు, జంతువులు, ఇతర జీవుల కోసం నీరు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఎకో వైజాగ్‌ గురించి 5వేల కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు కృషి ప్రారంభించామన్నారు. ఈ వేసవిలో పక్షులు, పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచాలన్నారు. విశ్వం లో ఇంత వరకూ శాస్త్రవేత్తల పరిశో ధనల ప్రకారం ఒక్క భూగోళం మీద మాత్రమే జీవరాశి ఉందన్నారు. మానవాళి మనుగడ సమస్త జీవరాసులతో పెనవేసి ఉందని,ఏజీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మను గడకు ఇబ్బంది కలిగిస్తుంది అని హెచ్చరిం చారు. ఏక్షన్‌ ఎయిడ్‌ ఫెలోషిప్‌ ప్రతినిధి కృష్ణకుమారి మాట్లాడుతూ పిచ్చుకల పరిరక్షణకు గూళ్ళు ఏర్పాటు చేయాలని, ధాన్యం, చిరుధాన్యాలు అందుబాటులో ఉంచా లని కోరారు. ప్రతి ఒక్కరూ తాము తినే పండ్ల విత్తనాలు ఆర బెట్టండి.వర్షాకాలంలో కొండల్లో జల్లుదాం అని ఆయన కోరారు. పండ్లు జాతి మొక్కలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కలు, పక్షులు, జంతువులకు ఆహారం అందించే, ఆశ్రయానికి ఉపకరించే చెట్లు అధికంగా పెంచాలని కోరారు. గ్రీన్‌ క్లైమేట్‌ టీం ఎన్‌జి ఒ వ్యవ స్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లా డుతూ జల వనరులు దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టాలనిలని, ప్రతి ఒక్కరికీ అవగా హన కల్పించేందుకు కృషి చెయ్యాలి అని ఆయన కోరారు. బెంగళూరు లో ప్రజలు నీటి కోసం అల్లల్లాడి పోతున్నారని, ఆ పరిస్థితి విశాఖ నగరంలో రాకముందే అందరూ భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చెయ్యాలి అని అన్నారు. నీరు, చిరుధాన్యాలు పక్షులు జంతువులకు అందుబాటులో ఉంచే మీ పిల్లలు, మనవళ్ళ ఫొటోలు, మీ ఇంటి వద్ద నీరు తాగుతున్న, ఆహారం తింటున్న పశు, పక్ష్యాదుల ఫొటోలు మీ స్టేటస్‌ లో పెట్టండి, మీ మిత్రులకు, బంధువులకు షేర్‌ చేయమని చెప్పండి అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి ప్రతి ఒక్కరినీ స్పందింప చేయండి అని కోరారు. -(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌..

‘ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్‌ రిజిస్టర్‌ వస్తుంది. వ్యవసాయభూమి,వ్యవయేతర భూమి, ఆ భూమి ఏశాఖదైనా,ఏవ్యక్తిదైనా, ఏభూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్‌ లో ఉం టుంది. వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో పలు వ్యతాసాలు, తేడాలు,తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కారమవు తాయి.ఈ టైటిల్‌ రిజిస్టర్‌నే చట్ట పరంగా కన్‌క్లూజివ్‌ రికార్డు అని పిలుస్తారు.అదే తుది రికార్డు కింద లెక్క..ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజెంటివ్‌ రికార్డులు మాత్రమే.వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది.ఒకసారి కన్‌క్లూజివ్‌ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం ఉండదు..’
ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.ఈ మేరకు ఏపీ రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఎంపిక చేసిన ఈ16 సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులకు ఒరిజినల్‌ డాక్యుమెంట్లకు బదులు జిరాక్స్‌ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై వివాదం రాజుకుంటోంది. దేశంలో తొలిసారి అమలవు తోన్న ఈచట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.ఈ చట్టం భూకబ్జాదారులకు వరంగా మారుతుందని విపక్షాలు ఆరోపిస్తు న్నాయి. అధికారులు చేసిన తప్పిదాల కారణంగా.. స్థిరాస్తుల వివాద పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లిన ప్రజలు..ఇప్పుడు పరిష్కారం కోసం తిరిగి అధికారుల దగ్గరకే వెళ్లాల్సి వస్తోందని లాయర్లు ఆరోపిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో భూములను సేకరించాలనుకుంటే..ఇబ్బందులు తలెత్తుతు న్నాయనే ఉద్దేశంతో..భూమిపై వివాదాలు కోర్టుల పరిధిలో ఉండొద్దనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని న్యాయవాదులు చెబుతున్నారు. భూమి క్రయవిక్రయాల సమయంలో జరిగే అవకతవకలను ట్రైబ్యు నళ్లలో ప్రభుత్వం నియమించే టీఆర్వోలు పరిష్కరిస్తారని ప్రభుత్వం చెబుతుండగా..దీని వల్ల ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మీ భూమి మీది కాకుండా పోతుందా..?
‘‘మీ పేరు మీదున్న భూమి..తెల్లారే సరికే వేరే ఎవరి పేరు మీదో మారుతుంది.. మీ ఆస్తులకు మీరు యజమాని కాకుండా పోతారు.. భూయాజమాన్య వివాదాలపై విచారణ జరిపి తీర్పులిచ్చే అధికారం సివిల్స్‌ కోర్టులకు లేకుండా చేశారు.. కేవలం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను మాత్రమే ఆశ్రయించాలి. మీ భూమి ఎవరి పేరిట మారిందనేది మీకు మీరుగా తెలుసుకోవాలి. 90రోజుల్లోగా తెలుసు కోలేకపోతే ఇక అంతే సంగతులు’’ అని ప్రచారం చేస్తున్న విపక్షం ప్రజల ఆందోళనను మరింత పెంచుతోంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కారణంగా పట్టాదారు పాస్‌ బుక్‌, అడంగల్‌ లాంటి రెవెన్యూరికార్డులు ఎందుకు పని రాకుండా పోతాయని..ఈ ఆధారాలు ఏవీ లేకుండాపోతే..భూములు ఎవరి చేతుల్లోకైనా వెళ్లే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.చిన్న, సన్నకారు రైతుల దగ్గర్నుంచి భూములను చట్ట ప్రకారం కొట్టే యడానికి వైసీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది..తాము అధికారంలోకి వచ్చాక ఈ చట్టం లేకుండా చేస్తామని విపక్ష కూటమి చెబుతోంది.
ప్రభుత్వం ఏం చెబుతోందంటే..?
అయితే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ విషయంలో ప్రభుత్వ స్పందన మరోలా ఉంది.ఈ చట్టం అమల్లోకి వస్తే 99 శాతం భూవివాదాలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి.. ఇలా అన్ని రకాల భూములకు సంబంధించి ఒకే ఒక టైటిల్‌ రిజిస్టర్‌ వస్తుందని సర్కారు చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో భూములకు సంబంధించి 30కిపైగా రికార్డులున్నాయి.అయితే ఈ రికార్డుల్లో పేరున్నా..వేరే వ్యక్తులు భూమి తమ దని అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉందని.. కానీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమల్లోకి వస్తే భూమి యజమానులకు భరోసా వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వివాదాలు ఉన్న భూములను ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారని.. అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్‌ రిజిస్టర్‌లో నమోదు చేస్తారని.. వివా దాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్‌, రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ట్రైబ్యునల్‌ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించొచ్చని చెబుతోంది.ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రకారం భూ యజమానిని ఒకసారి నిర్ధారిస్తే అదే ఫైనల్‌ అని..భూ వివాదం కారణంగా భూము లను కోల్పోయే అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు నమోదైన తర్వాత.. రెండేళ్లలోపే అభ్యంతరాలు వ్యక్తం చేయాలని.. ఒకవేళ రెండేళ్లలోపు అభ్యంత రాలేవీ లేకపోతే..ఆతర్వాత కోర్టుకు వెళ్లే అవ కాశం కూడా ఉండదని ప్రభుత్వంచెబుతోంది. మార్చి తొలి వారంలో ప్రభుత్వం ప్రధాన సలహాదారు అజయ్‌ కల్లం ఈచట్టం గురించి మాట్లాడుతూ..దేశంలోని 12రాష్ట్రాలు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను అమలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు.ఈచట్టం అమల్లోకి వస్తే ఎవరైనా భూరికార్డుల్లో మార్పులు చేయాలని భావిస్తే..వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందుతుందని..దీంతో తప్పులు జరిగేందుకు అవకాశం ఉండదన్నారు.
మరి ఈ విషయాల సంగతి ఏంటి..?
అయితే టీఆర్వోలుగా ఎవరిని నియమిస్తారు..? దీనికి సంబంధించిన మార్గదర్శకాలేంటి..? ఈ ట్రైబునళ్లు స్వయంప్రతిపత్తితో పని చేయ గలవా..?ప్రభుత్వంలోని కీలక నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లను టీఆర్వోలు ఎలా అధిగమి స్తారు..?కోర్టుల పరిధి నుంచి భూ వివాదాలను తప్పించడం వల్ల తలెత్తే పర్యవసనాలేంటి..? భూ యజమాన్య హక్కులు మారినప్పుడు.. పాత యజమానికి సమాచారం ఇస్తారా..?యజ మానికి వేరే ప్రదేశంలో ఉంటే ఎలా..?ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే..ఈ చట్టం పట్ల ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. ప్రజలకు పూర్తి అవగాహన వచ్చాకే ఇలాంటి చట్టాలను అమలు చేస్తే అటు ప్రజలు, ఇటు అధికారంలో ఉన్నవారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండ వనే భావన వ్యక్తం అవుతోంది.
ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్‌ రిజిస్టర్‌ వస్తుంది. వ్యవసాయ భూమి,వ్యవసాయేతర భూమి,ఆ భూమి ఏ శాఖదైనా,ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్‌లో ఉంటుంది.వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో పలు వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కార మవుతాయి. ఈ టైటిల్‌ రిజిస్టర్‌నే చట్ట పరంగా కన్‌క్లూజివ్‌ రికార్డు అని పిలుస్తారు. అదే తుది రికార్డు కింద లెక్క. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజెం టివ్‌ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉం టుంది. ఒకసారి కన్‌క్లూజివ్‌ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం ఉండదు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో రాష్ట్రంలో భూముల చరిత్రలో కొత్త శకం నమోదు కానుంది.భూ యజమానులకు భరోసా ఇచ్చే ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చాలా ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కులచట్టం తెచ్చిన మొట్ట మొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది.వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. పలు మా ర్పుల తర్వాత ఇటీవలే దానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా చెబుతోంది. ఈ ఆలోచనలను అందిపుచ్చుకుని దాన్ని ఆచర ణలోకి తీసుకు రావడంలో ఆంధ్రప్రదేశ్‌ సఫలీ కృతమైంది. గత నెల అక్టోబర్‌ 31వ తేదీ నుంచి ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌-2023 అమల్లోకి వచ్చింది.
ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కిపైగా రికార్డు లున్నాయి. గ్రామ స్థాయిలో 1బీ,అసైన్‌మెంట్‌, ఈనాం వంటి 11రిజిష్టర్లు ఉన్నాయి. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాల యంలో మరికొన్ని, సబ్‌ రిజిస్ట్రార్‌, పంచా యతీ, మున్సిపాల్టీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తు న్నారు.అటవీ, దేవాదాయ,వక్ఫ్‌ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా, చట్టపరంగా ఏదీ కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా వేరే వాళ్లు అది తనదని అప్పీల్‌ చేసుకునే అవ కాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు. టైట్లింగ్‌ చట్టంలో భూ యజమానులకు తమ భూములపై భరోసా వస్తుంది.
వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల వ్యవస్థ భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్‌ రిజిస్టర్‌లో ఉంటాయి. వివా దం ఉన్న భూముల వివరాలను వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.ఈ చట్టం ప్రకా రం టైటిల్‌ నిర్ధారించే క్రమంలో భూ సమస్య లు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది.ప్రస్తుత వ్యవస్థ మాది రిగా రెవెన్యూ,సివిల్‌ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు.జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్‌,రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్‌ ఏర్పాటవుతుంది. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్‌ తీర్పు మీద అభ్యం తరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది.అంతేతప్ప కింది స్థాయిలో ఏ రెవె న్యూ అధికారికి,ఏ సివిల్‌ కోర్టుకీ వివాదాన్ని పరిష్కరించే అధికారాలు ఉండవు. ఈ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్‌.ఆ భూమి వివాదంలో పడి భూములు కోల్పోయే పరిస్థితులు ఉండవు. టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు సంవత్సరాల లోపే చెప్పాలి. రెండేళ్ల లోపు ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండ దు. టైటిల్‌ నిర్థారణ అయిన రెండేళ్లలోపే దాన్ని ఛాలెంజ్‌ చేయాలి.అలా చేయని పక్షంలో టైటిల్‌ రిజిస్టర్‌లో ఉన్న పేరే ఖరారవుతుంది.
భూ యజమాని హక్కులకు పూచీ ప్రభుత్వానిదే
టైటిల్‌ రిజిష్టర్‌లో నమోదైన వివరాలకు ప్రభు త్వం పూర్తి బాధ్యత వహిస్తుంది.ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు.1బిలో ఉన్నా,అడంగల్‌లో ఉన్నా, ఆర్‌ఎస్‌ ఆర్‌లో ఉన్నా ప్రభుత్వ గ్యారంటీ ఉండదు.ఈ గ్యారంటీ లేకపోవడాన్నే ప్రిజెంటివ్‌ రైట్స్‌ అనేవారు.1బిలో ఉన్న పేరుపైన ఎవరైనా కోర్టుకు వెళ్లి అది తప్పని నిరూపించే వరకు అది కరెక్ట్‌ అని భావించేవారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని, రెవెన్యూ రికార్డులు యాజ మాన్య హక్కులకు సాక్ష్యంగా పనికి రావని స్పష్టం చేసింది. ఎందుకంటే అవన్నీ శిస్తు వసూలు చేయడానికి బ్రిటీష్‌ హయాం నుంచి రాసిన లెక్కల పుస్తకాలు.అందులో పన్ను ఎంత కట్టాలో ఉంటుంది తప్ప ఆభూమి ఎవరిదో ఉండదు. టైటిలింగ్‌ చట్టం కింద రూపొందిన రిజిస్టర్‌ ప్రకారం ప్రిజెంటివ్‌ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్‌ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. పాత రికార్డులేవీ చెల్లవు. భూమి హక్కుల చరిత్ర కొత్తగా మొదలవుతుంది. ఒకసారి టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూయజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం ఇస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. టైటిల్‌ రిజిస్టర్‌గా మారనున్న ఆర్‌ఓఆర్‌ రికార్డు
ఈ చట్టం అమలు కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.ఆ శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టైటిల్‌ గ్యారంటీ అథారిటీలు ఏర్పాటవుతాయి. టైటిల్‌ రిజిస్టర్‌లను నిర్ధిష్ట విధానంలో ఈ అథారిటీలే ఖరారు చేస్తాయి. వారి ఆధ్వర్యంలోనే రిజిస్టర్‌లు నిర్వహిస్తారు. భూముల రిజిస్ట్రేషన్‌ ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటి వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రే షన్‌ మాత్రమే జరుగుతోంది. హక్కుల రిజిస్ట్రే షన్‌ జరగడం లేదు.
పాత వ్యవస్థ స్థానంలో టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నప్పుడే టైటిల్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు.అమ్మేవాడికి టైటిల్‌ ఉంటేనే కొనేవాడికి వస్తుంది.రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టైట్లింగ్‌ అథారిటీలు,గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు,భూ వివా దాల పరిష్కారానికి ట్రిబ్యునల్‌ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో తయారవుతున్న కొత్త రికార్డులను ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం కింద నోటిఫై చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రీ సర్వేలో రూపొందించిన డిజిటల్‌ రికార్డులను ఆర్‌ఓఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టం కింద నోటిఫై చేస్తున్నారు. టైటిల్‌ గ్యారంటీ చట్టం ప్రకారం ఆర్‌ఓఆర్‌ రికార్డు టైటిల్‌ రిజిస్టర్‌గా మారుతుందని చెబుతున్నా­రు.ఎంతో ప్రతిష్టా త్మకమైన ఈచట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో విధివిధానాలు రూపొందించనుంది.
గొప్ప ముందడుగు
ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం తేవడం చాలా గొప్ప ముందడుగు.రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. టైటిల్‌కు భద్రత ఉంది కాబట్టి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా ఆంధ్రాలో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు.వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది.భూ యజమానికి భరోసా ఉంటుంది. ఈ ఫలితాలు అందరికీ దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి.ఇది ఒక ల్యాండ్‌ మార్క్‌ చట్టం కాబట్టి ఇందులో కొన్ని ఇబ్బం దులు కూడా ఉంటాయి. చట్టం అమలు లో పేదల కోసం పారా లీగల్‌ వ్యవస్థ వంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగానికి పూర్తి స్థాయిలో రీఓరి యెంటేషన్‌ అవసరం. ఇది ఆర్‌ఓఆర్‌ చట్టం లాంటిది కాదు. దీనిపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేస్తే ఐదేళ్లలో ఆర్థిక ప్రగతిలో ఏపీ అద్భుతంగా దూసుకుపోయే అవకాశం ఉంటుంది.-వ్యాసకర్త : భూ చట్టాల నిపుణుడు, నల్సార్‌ లా వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌-(ఎం. సునీల్‌కుమార్‌)

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగలు

భానుడు నిప్పులు కురిపిస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి పలుచోట్ల జల్లుల పడి కాస్త ఉపశమనం ఇచ్చినా మళ్లీ బాదుడు కొన సాగుతూనే ఉన్నది. మే నెలంతా ఈ మండే ఎండలు తప్పవని, ఆతర్వాత కాస్త మళ్లీ జల్లులు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటొచ్చని పేర్కొంది. వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఉదయించిన గంటల వ్యవధిలోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం కాకముందే మాడు పగిలిపోయే నిప్పులు కురిపి స్తున్నాడు. వీటికితోడు వడగాలులు కూడా వీయడంతో దప్పికలు,నీరసం,డీహైడ్రేషన్‌లు వెంటనే చుట్టుముడుతున్నాయి. అందుకే అవసరం ఉంటే తప్పితే గడప బయట కాలు పెట్టొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు,చిన్నారులు ఇంటి పట్టునే ఉండటం మంచిది. తాజాగా,వాతావరణ శాఖ మరో హాట్‌ న్యూస్‌ చెప్పింది. ఈఏడాది టెంపరేచర్‌లు రికార్డులు బ్రేక్‌ చేస్తాయని ఐఎండీ అంచనాలు వేసింది. ఈఏడాది వేసవి తాపం 50 డిగ్రీల సెల్సియస్‌లు దాటొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగాయని,పలు ప్రాంతాల్లో 45డిగ్రీల సెల్సి యస్‌లు క్రాస్‌ చేసి టెంపరేచర్‌లు రికార్డు అవుతున్నాయని ఐఎండీ తెలిపింది. వడగా లులు కూడా https://dhimsa.net/wp-admin/post.php?post=2563&action=editభయంకరంగా వీస్తున్నాయి. సాధారణంగా మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మెటీయరాలజీ డాక్టర్‌ ఎం మోహపాత్రా తెలిపారు. కాబట్టి,పశ్చిమ రాజస్తాన్‌లోఉష్ణోగ్ర తలు 50డిగ్రీల సెల్సి యస్‌లను తాకొచ్చని వివరించారు. ఓప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మోహపాత్రా మాట్లాడుతూ,పశ్చిమ మధ్య భారతం, వాయవ్య భారతంలోనూ సాధారణానికి మించి టెంప రేచర్‌లు రికార్డు అవుతాయని తెలిపారు.ఉత్తర, ఈశాన్య భారతంలోనూ సాధారణానికి మించి వేడిగా రోజులు గడవచ్చని వివరించారు. మన దేశంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటేశాయి. కాగా,ఏప్రిల్‌ నెలలో యూపీలో అలహాబాద్‌ (46.8డిగ్రీలు), రaాన్సీ(46.2డిగ్రీలు), లక్నో (45.1డిగ్రీలు)లు ఆల్‌ టైం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితోపాటు హర్యానాలోని గురుగ్రామ్‌ (45.9 డిగ్రీలు), మధ్యప్రదేశ్‌ సత్నా (45.3 డిగ్రీలు)లు ఆల్‌ టైం హై టెంపరేచర్‌లు ఈ నెలలో రికార్డ్‌ చేశాయి. ఇక మే నెలలో అంచనాలు చూస్తే.. మే నెలలో దేశంలో చాలాచోట్ల సాధారణం నుంచి సాధారణాని కంటే గరిష్టంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.దేశాన్ని భారీ ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రతలు122ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసి నట్టు భారత వాతావరణశాఖ వెల్లడిరచింది. మే నెలలో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటిపోయే అవకాశం ఉందని పేర్కొంది. హీట్‌వేవ్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ నెల ఉష్ణోగ్రతలు రికార్డుల మోత మోగించాయి. వాయువ్య భారతం,మధ్య భారతంలో ఉష్ణోగ్ర తలు సగటున 35.90డిగ్రీలు,37.78డిగ్రీలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిందని, ఫలి తంగా దేశంలో పవర్‌ కట్‌లు పెరిగాయని పేర్కొంది. దేశరాజధాని ఢల్లీిలోఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని,72ఏళ్ల రికార్డు..దేశంలో హీట్‌వేవ్‌ పరిస్థితులపై యూఎన్‌ ఏజెన్సీ డబ్ల్యూఎంఓ ఆందోళన వ్యక్తం చేసిందని వివరించింది.
మునుపెన్నడూ లేనంత వేడిగాలు
మానవుని కార్యకలాపాలవల్ల ఏర్పడిన గ్లోబల్‌ వార్మింగ్‌తో ప్రాణహాని సంభవిస్తోంది. ఇది ఇప్పటికే రుజువైన సత్యం కూడా. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షులు, జంతువుల మనుగడ కష్టతరమౌతోంది. దీంతో యావత్‌ జీవరాశి దెబ్బతినడంతో పాటు… మనుషుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే.. మన దేశంలో మే నెల రాకముందే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల కంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఇప్పటికే దేశరాజధాని ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ అమల్లో ఉంది. ఎండ తీవ్రత ఏస్థాయిలో ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల.. ప్రపంచంలోని మిగతా దేశాలకంటే.. భారతదేశమే మరిన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ఇక భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రోజుల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 4.5-6.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతుందని అంచనా వేసింది. బహుశా మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా వేడిగాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది.గత కొన్ని సంవత్సరాలుగా దేశ రాజధాని ఢల్లీి ఉష్ణోగ్ర తలను పరిశీలిస్తే..1981-2010ల మధ్య గరిష్టంగా 39.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయితే…ఈ సంవత్సరం ఏప్రిల్‌ 28 నుండే.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. రోజువారీగా సగటున 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతున్నదని, ఇలా కొద్దిరోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని ఐఎండి తెలిపింది. అందుకే ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక 1979 నుండి 2017 వరకు సేకరించిన వాతావారణ సమాచారం మేరకు..’తూర్పు తీర ప్రాంత భారతదేశం, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే.. ఇప్పటికే మధ్య అమెరికా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య, వాయువ్య-ఆగేయ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 2010 కంటే.. 2023 తర్వాతి సంవత్సరాల్లో ఉష్ణోగ్ర తల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసు కుంటు న్నాయని స్పష్టమవుతున్నది. ఇది భవిష్యత్‌ లో మరింత పెరిగే అవకాశముందని పరిశోధ కులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు సంభవిస్తోంది. పనికి వెళ్తే గాని పూట గడవని పేదలు ఎండల్లో కూడా బయటకు వెళ్లడం వల్ల.. ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రజల ప్రాణాల్ని కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మే నెలలో 50డిగ్రీలు…!
వేసవి కాలంలో సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కానీ ఈసారి మార్చి నుంచే భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఏప్రిల్‌లో ఎండలు మరింత తీవ్రంగా ఉన్నా యి. ఇప్పుడు..మే నెలంటనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ‘‘వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు హిమాచల్‌,పంజాబ్‌, హైర్యానా,రాజస్థాన్గుజరాత్‌-మేలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.‘‘దేశంలో 2022 మేలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది’’ అని మోహపాత్ర చెప్పారు.అయితే, వాయువ్య మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో మేలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మోహపాత్ర చెప్పారు. పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో 50డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోద వడాన్ని కూడా మోహపాత్ర తోసిపుచ్చలేదు. ఎందుకింత తీవ్రంగా ఉన్నాయి?
ఈ ఏడాది కనిపిస్తున్న ఉష్ణోగ్రతలు సాధారణం కాదు.1901 నుంచి చూస్తే, 2022 మార్చిలో అత్యంత ఉష్ణోగ్రతలు కనిపించడం ఇది మూడో సారి.ఈ ఏడాది మార్చిలో భారత్‌లో 26 రోజులపాటు వేడిగాలులు వీచాయి. తూర్పు, మధ్య,ఉత్తర భారత ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్‌’ జారీ చేసింది.
కారణం ఏంటి?
ఈ రెండు నెలల్లో వానలు,ఉరుములతో కూడిన వర్షం, వడగళ్ల వానలు కురిసిన దాఖలాలు లేకపోవడమే ఈ అధిక ఉష్ణోగ్రత లకు ప్రధాన కారణం.గతంలో ఈ నెలల్లో సగటు వర్షపాతం 30.4మిల్లీ మీటర్లుఉండగా, ఈఏడాది కేవలం 8.9మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దేశంలోని పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే గాలులు దక్షిణ,మధ్య భారతదేశ పవనాలను తాకినప్పుడు వర్షం, తుపానులు వస్తాయి. ఈసారి అది కూడా చాలా తక్కువ. సాధార ణంగా,వడగాలులు దశ ఏప్రిల్‌ చివరిలో ప్రారంభమై మే నెలలో గరిష్ఠ స్థాయికి చేరు కుంటుంది. ఈఏడాది మార్చి 11 నుంచే హీట్‌ వేవ్‌ కనిపించింది. ఇది హోలీ పండు గకు ముందే కనిపించింది.మరోవైపు, వాతా వరణ శాస్త్రవేత్తలు మార్చి, ఏప్రిల్‌లో వీచే బలమైన వేడి గాలులు అసాధారణంగా ఉంటా యని హెచ్చరిస్తున్నారు. వాతావరణం నుండి కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే, వాతావరణ మార్పుల కారణంగా ఈవేడి గాలులు వాతా వరణంలో సాధారణంగా మారిపోయే అవకాశ ముందని అంటున్నారు.వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి తీవ్రమైన హీట్‌వేవ్‌ ఉండ వచ్చని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ ఇనిస్టి ట్యూట్‌కు చెందిన మరియం జకారియా, ఫ్రెడ రిక్‌ ఒట్టో చేసిన పరిశోధన చెబుతోంది. ‘‘ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ చర్యలు కారణమవ్వడానికంటే ముందు, భారతదేశంలో మనం ఈ నెల ప్రారంభంలో చూసిన లాంటి ఉష్ణోగ్రతలను 50ఏళ్ల క్రితమే అనుభవించాం. కానీ ప్రస్తుతం ఇది సాధారణ విషయంగా మారింది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది’’ అని మరియం జకారియా అన్నారు. ఏది ఏమైనప్పటికీ, వాతావరణం మరియు భూ వినియోగ మార్పు గతంలో భౌగోళికంగా-వివిక్త జాతుల వన్యప్రాణుల మధ్య వైరల్‌ షేరింగ్‌ కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తుంది3,4. కొన్ని సందర్భాల్లో, ఇది జూనోటిక్‌ స్పిల్‌ఓవర్‌ను సులభతరం చేస్తుంది-ప్రపంచ పర్యావరణ మార్పు మరియు వ్యాధి ఆవిర్భావం మధ్య యాంత్రిక లింక్‌. ఇక్కడ, మేము భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ యొక్క సంభావ్య హాట్‌స్పాట్‌లను అనుకరిస్తాము, క్షీరద-వైరస్‌ నెట్‌వర్క్‌ యొక్క ఫైలోజియోగ్రాఫిక్‌ మోడల్‌ని ఉపయోగిస్తాము మరియు 2070 సంవత్సరానికి వాతావరణ మార్పు మరియు భూ వినియోగ దృశ్యాలలో 3,139 క్షీరద జాతుల కోసం భౌగోళిక శ్రేణిని మార్చాము. ఎత్తైన ప్రదేశాలలో, జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో మరియు ఆసియా మరియు ఆఫ్రికాలో మానవ జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కొత్త కలయికలలో, వాటి వైరస్‌ల యొక్క నవల క్రాస్‌-స్పీసీస్‌ ట్రాన్స్‌మిషన్‌ను 4,000 సార్లు అంచనా వేస్తుంది. వాటి ప్రత్యేకమైన చెదరగొట్టే సామర్థ్యం కారణంగా,గబ్బిలాలు నవల వైరల్‌ షేరిం గ్‌లో ఎక్కువ భాగం,మానవులలో భవిష్య త్తులో ఆవిర్భావానికి దోహదపడే పరిణామ మా ర్గాల్లో వైరస్‌లను పంచుకునే అవకాశం ఉంది. ఆశ్చర్యకరంగా,ఈ పర్యావ రణ పరివర్తన ఇప్పటికే జరుగు తోందని మేము కనుగొన్నాము శతాబ్దంలో 2ళీజకంటే తక్కువ వేడెక్కడం భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ను తగ్గించదు. జాతుల శ్రేణి మార్పులను ట్రాక్‌ చేసే జీవవైవిధ్య సర్వేలతో వైరల్‌ నిఘా మరియు ఆవిష్కరణ ప్రయత్నాలను జత చేయాల్సిన తక్షణ అవస రాన్ని మాపరిశో ధనలు హైలైట్‌ చేస్తాయి, ప్రత్యే కించి అత్యధిక జూనోస్‌లను కలిగి ఉన్న ఉష్ణ మండల ప్రాంతాలలో వేగవంతమైన వేడెక్కడం జరుగుతోంది.
వేడి గాలుల ప్రభావం
ఈఅధిక ఉష్ణోగ్రతల వల్ల దేశవ్యాప్తంగా విద్యు త్‌ వినియోగం అకస్మాత్తుగా,వేగంగా పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల లో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.దీంతో బొగ్గు అవసరం విపరీ తంగా పెరిగింది. డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడంవల్ల బొగ్గు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. బొగ్గు కొరత కార ణంగా,రాబోయే రోజుల్లో విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడ వచ్చని దిల్లీ ప్రభు త్వం ప్రకటించింది. ఇదే జరిగితే మెట్రో రైళ్లు, ఆసుపత్రుల వంటి ముఖ్యమైన సేవలపై కూడా ప్రభావం చూపు తుందనేది ఆందోళన కలిగించే అంశం.‘‘వేడి పెరిగినప్పుడల్లా బొగ్గు సరఫరాపై ప్రభావం పడుతోంది. కానీ రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం,ఆ స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి పెరగకపోవడం,డిమాండ్‌-సరఫరా మధ్య అంతరం పెరగడం సహజం’’ అని ఎన్‌టీపీసీ మాజీ జనరల్‌ మేనేజర్‌ బీఎస్‌ ముఖియా అన్నారు.సుదీర్ఘ వేడిగాలులు,విద్యుత్‌ సరఫరా అంతరాయాలు ప్రధానంగా పారిశ్రా మిక ఉత్పత్తి, పంటలపైనా ప్రభావం చూపి స్తాయి.వేడిగాలుల కారణంగా ఉత్పన్నమవు తున్న విద్యుత్‌ సంక్షోభం గురించి కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. భారత్‌లో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని దిగుమతి కూడా చేసుకుంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బొగ్గు ధరలు కూడా పెరిగాయి. బొగ్గుకు డిమాండ్‌ కూడా పెరిగింది.వాతావరణపరంగా భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే కొన్ని వారాలు పెద్ద సవాలుగా మారవచ్చు.‘‘హీట్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా బహిరంగ శీతలీ కరణ ప్రాంతాలు,తక్కువ విద్యుత్‌ కోతలు, స్వచ్ఛమైన తాగునీరు,కార్మికుల పని వేళల్లో మార్పు ఉండేలా చూసుకోవాలి. మండుతున్న వేడిలో పనిచేసే బడుగు బలహీన వర్గాల కోసం మనం ఈ చర్యలు తీసుకోవాలి’’ అని గుజరాత్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అభియంత్‌ తివారీ చెప్పారు.
వేడిని ఎలా ఎదుర్కోవాలి
ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచాలి: చాలా మందికి దీని గురించి తెలుసు. శరీరం 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో బాధపడుతుంటే, హీట్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు పెరుగు తాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, తక్షణ వైద్య సహాయం అవసరం. వైద్య సహాయం వెంటనే అందని పరిస్థితుల్లో ఒక్కోసారి అపస్మారక స్థితికి దారి తీసి అవయ వాలకు కూడా హాని కలగొచ్చు. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోవచ్చు.చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా కూడా ప్రమాద సంకేతాలే. ఆహారం,నీరు : శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా నీరు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.- (గునపర్తి సైమన్‌)

నిరంతర స్పూర్తిప్రదాత

నూట ముప్పైయేళ్లు క్రితం భారతీయ సమాజంలో పుట్టిన ఆ మహా విప్లవం పేరు.అంబేద్కర్‌.133 ఏళ్ల తర్వాత.. ఈకోట్లాది మహాభారతావనికి బాబా సాహెబ్‌ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు.ఈ దేశ గతిరీతులకు విధాత.నేటికీ ఆయనే మన సామాజిక పథ నిర్ధేత.కులం పునాదులను పెకలించాలని పిడికిలెత్తిన సామాజిక విప్లవకారులకు మహో పాధ్యా యుడు. దేశంలో అణగారిన కోట్లాది ప్రజలకు న్యాయం అందించే గొంతుక.ఆ ప్రజల చైతన్యాన్ని శాసిస్తున్న నడిపిస్తున్న, విప్లవింపచేస్తున్న మరణం లేని ప్రవక్త. మన బడ్జెట్లకూ,ఆర్ధిక విధానాలకు నిత్య నిర్ధేశకుడు అంబేద్కరే.ఈ దేశ రాజకీయ రంగాన్ని శాసిస్తున్న మహాశక్తి.-జీఎన్‌వీ సతీష్‌
ఆయన రాసిన ప్రతి అక్షరం,పలికిన ప్రతి మాటా ఈ దేశానికి ఒక సందేశం.ఆ నిత్య స్పూర్తిమంతుని 133వజయంతిని జరుపు కోవడం,సేవలను మన నం చేసుకోవడం ఒకగొప్ప అనుభవం.చారిత్రక అవసరం. అస్పృశ్యతా శాపానికి గురైన మహర్‌ కుటుంబంలో పుట్టిన అంబేద్కర్‌,ఆవర్గంలో మెట్రిక్యు లేషన్‌ చేసిన మొదటి విద్యార్ధి.బరోడా మహారాజు ఆర్ధిక సాయంతో ముంబైలో డిగ్రీపూర్తిచేసి,ఉన్నత విద్యకు కొలంబియా (అమెరికా)వెళ్లారు.అక్కడ ఉన్న భారతదేశ సమస్యల గురించి ఆయన ఆలోచించే వారు.సంఘానికి సంబంధించి నంతవరకు అస్పృశ్యులు వేరు కాదు.వారు భారతీయ సంస్కృతిలో అవిభక్త భాగమే అని ఇండియన్‌ రేస్‌ అనే తనవ్యాసంలో స్పష్టం చేశారు.తర్వాత ఆయన చేసిన పరిశోధనలకు ఈ సిద్దాంతమే ఆధారం.
అంబేడ్కర్‌ తొలి పత్రిక ‘’మూక్‌ నాయక్‌’’కు 104 ఏళ్లు
‘‘ఇక్కడి సామాజిక వ్యవస్థను ఓసినిమాలా ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఈదేశం అన్యాయా లకు పెట్టని కోటలా కనిపిస్తుంది.కచ్చితంగా అలానే అనిపి స్తుంది’’.సరిగ్గా 104 సంవత్స రాల క్రితం,31జనవరి 1920నాడు‘ ‘మూక్‌నాయక్‌’’జర్నల్‌ తొలి సంచిక కోసం అంబేడ్కర్‌ రాసిన తొలి కథనం ప్రారంభ వ్యాఖ్యలు ఇవి. అప్పటితో పోల్చిచూస్తే..నేడు చాలా మార్పులు వచ్చాయి.అయితే, మారాల్సినంత మార లేదు.మీడియాతో అంబేడ్కర్‌కు విడదీయరాని బంధాలు పెనవేసుకుని ఉండేవి.ఆయన సొంతంగా మీడియా సంస్థలను ప్రారంభించారు. సంపాద కుడిగా పనిచేశారు.ప్రత్యేక వ్యాసాలూ రాశారు.ఆతర్వాత ఆయనే పత్రికల వార్తల్లో నిలిచారు.అప్పట్లో ఎక్కువమందికి చేరువైన,సామాజిక ఉద్య మాలను ఒంటి చేత్తో నడిపించిన అగ్రనా యకుల్లో అంబేడ్కర్‌ ఒకరు. కాంగ్రెస్‌ తరహాలో ఆయనకు ఆర్థిక,సామాజిక సాయం అందలేదు.అయితే,పేదల ఉద్య మంగా ఆయన దీన్ని నడిపించారు.భూమికి లేదా యజమానులకు బానిసలైన వెనుక బడిన బలహీన వర్గాలే ఆయన అనుచ రులు. దీంతో ఆయ నకు ఆర్థికంగాఎలాంటి సాయమూ అందేదికాదు. బయట నుంచి ఎలాంటి మద్దతూ లేకుం డానే తన భుజాలపై అంబేడ్కర్‌ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిం చాల్సి వచ్చేది. మీడియా కవరేజీలోనూ ఇది స్పష్టంగా కనపడేది.
అంతర్జాతీయ మీడియాలోనూ..
అంబేడ్కర్‌ కృషి దేశీయ మీడియాతోపాటు అంతర్జాతీయ మీడియాలోనూ కనిపించేది. దేశీయ మీడియాలో ఆయన రాసిన కథనాలు, వ్యాసాల గురించి మనకు కొంతవరకు తెలుసు. అయితే, అంతర్జాతీయ మీడియాలో ఆయనకు సంబంధించిన కవరేజీ చాలా వరకు మరుగున పడిపోయింది. ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక లైన లండన్‌లోని ద టైమ్స్‌,బాల్టీమోర్‌ ఆఫ్రో అమెరికన్‌, ద నార్‌ఫోక్‌ జర్నల్‌లను అపట్లో నల్లజాతీయులు నడిపించేవారు.అంబేడ్కర్‌ అంటరానితనంపై నడిపించిన ఉద్యమాన్ని ఈ పత్రికలు విస్తృతంగా కవర్‌ చేశాయి.గాంధీతో ఆయన విభేదాలపైనా వార్తలు ప్రచురించాయి. రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్‌ పాత్ర, పార్లమెంటులో ఆయన చర్చలు,నెహ్రూ ప్రభు త్వం నుంచి ఆయన రాజీనామా తదితర పరిణామాలను ప్రపంచం క్షుణ్నంగా గమనిం చింది.అంతర్జాతీయ పత్రికల్లో అంబేడ్కర్‌పై వచ్చిన కథనాలు, ఆయన రాసిన కథనాలపై ‘’అంబేడ్కర్‌ ఇన్‌ బ్లాక్‌ అమెరికా’’ పేరుతో నేను ఓ పుస్తకాన్ని కూడా త్వరలో ప్రచురించబోతు న్నాను.దేశీయంగానూ తన సామాజిక ఉద్యమా న్ని ముందుకు నడిపించేందుకు అంబేడ్కర్‌ మీడియానే మాధ్యమంగా ఎంచుకున్నారు.దీని కోసం ప్రాంతీయతకు పెద్దపీట వేస్తూ ఆయన మరాఠీలో తొలి జర్నల్‌ ‘’మూక్‌ నాయక్‌’’ను ప్రారంభించారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం..
అణగారిన వర్గాల హక్కుల కోసం తన పత్రికలు, జర్నల్స్‌ సాయంతో అంబేడ్కర్‌ పోరాడేవారు. మూక్‌ నాయక్‌ తొలి 12 ఎడిష న్లకు ఆయనే సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన తర్వాత డీడీ ఘోలప్‌ ఆ బాధ్యతలను తలకెత్తుకున్నారు. అయితే 1923లో మూక్‌ నాయక్‌ మూతపడిరది.ఉన్నత చదువుల కోసం అంబేడ్కర్‌ విదేశాలకు వెళ్లడం,ప్రకటనలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.తొలి నాళ్లలో రాజశ్రీ షాహు మహరాజ్‌ ఈమ్యాగజైన్‌కు సాయం అందిం చారు.అంటరాని వారి స్వాతంత్య్ర ఉద్యమానికి మూక్‌ నాయక్‌ బాటలు వేసిందని అంబేడ్కర్‌ జర్నలిజంపై పరిశోధన చేస్తున్న గంగాధర్‌ పంత్‌వానే వ్యాఖ్యానించారు.అణగారిన వర్గాల్లో ఈ జర్నల్‌ కొత్త ఊపిరులు నింపిందని ఆయన అన్నారు.
బహిష్కృత్‌ భారత్‌ పేరుతో మరొకటి..
‘’మూక్‌ నాయక్‌’’ అనంతరం ‘’బహిష్కృత్‌ భారత్‌’’ పేరుతో3 ఏప్రిల్‌ 1927లో మరో జర్నల్‌తో అంబేడ్కర్‌ ముందుకు వచ్చారు. మహద్‌ ఉద్యమంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో దీన్ని మొదలుపెట్టారు.ఇది 15, నంబరు 1929 వరకు నడిచింది. అయితే ఈ జర్నల్‌ కూడా ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులకు తలొగ్గాల్సి వచ్చింది. మూక్‌ నాయక్‌, బహిష్కృత్‌ భారత్‌ల ఒక్కో ఎడిషన్‌ ధర ఒకటిన్నర అణాలు మాత్రమే.వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ అయితే పోస్టల్‌ చార్జీలతో కలిపి మూడు రూపాయలకే ఇచ్చే వారు. ఇదే సమయంలో ‘’సమత(1928)’’ జర్నల్‌ మొదలైంది.ఆతర్వాత బహిష్కృత్‌ భారత్‌ పేరును ‘జనతా’గా మార్చి24నవంబరు 1930 న దీన్ని మళ్లీ పునఃప్రారంభించారు.దళితుల కోసం ప్రత్యేకంగా నడిపించిన పత్రికగా జనతా రికార్డులకు ఎక్కింది.దాదాపు 25ఏళ్లపాటు ఈ పత్రిక నడిచింది.ఆ తర్వాత కాలంలో అంబే డ్కర్‌ ఉద్యమంలో మార్పులకు అనుగుణంగా దీని పేరును ‘’ప్రబుద్ధ భారత్‌’’గా మార్చారు. ఇది 1956 నుంచి 1961 వరకు నడిచింది. దీంతో బహిష్కృత్‌ భారత్‌ మొత్తంగా 33ఏళ్లు నడిచిందని,భారత్‌లో దళితుల కోసం సుదీర్ఘ కాలం పనిచేసిన పత్రిక ఇదేనని చెబుతారు.
అందరినీ కలుపుకుంటూ..
ఈ కాలంలోనే ఉన్నత కులాల పాత్రికేయుల్ని తన మిషన్‌లో అంబేడ్కర్‌ కలుపుకుంటూ వెళ్లారు. అప్పట్లో చాలా పత్రికలను బ్రాహ్మ ణులు నడిపించేవారు.డీవీ నాయక్‌ (సమత, బ్రాహ్మణ్‌ బ్రాహ్మణేతర్‌),బీఆర్‌ కాద్రేకర్‌ (జనతా),జీఎన్‌ సహశ్రబుద్ధి (బహిష్కృత్‌ భారత్‌, జనతా) తదితరులు ఆయనతో పనిచేసిన వారిలో ఉన్నారు.బీసీ కాంబ్లే, యశ్వంత్‌ అంబేడ్కర్‌ తదితర దళిత ఎడిటర్లు జనతాలో కీలకపాత్ర పోషించారు.అయితే,బహిష్కృత్‌ భారత్‌లో ఎడిటర్ల కొరత ఉండేది.ఒక్కోసారి ఒక ఎడిటరే 24-24కాలమ్స్‌ రాయాల్సి వచ్చేది.యశ్వంత్‌ అంబేడ్కర్‌, ముకుందరావ్‌ అంబేడ్కర్‌,డీటీ రూపవస్తే,శంకర్రావు కారాట్‌, బీఆర్‌ కాద్రేకర్‌ల సాయంతో ప్రబుద్ధ భారత్‌ ముందుకు నడిచింది.
దళిత జర్నలిజం
అంబేడ్కర్‌కు ముందు దళితుల కోసం పనిచేసిన జర్నల్స్‌ చాలాతక్కువగా ఉండేవి.ఫూలే ప్రారం భించిన ‘సత్యశోధక్‌ ఉద్యమం’ దళితుల కోసం పనిచేసింది.సత్యశోధక్‌ సమాజం సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనవరి 1, 1877లో కృష్ణరావ్‌ భాలేకర్‌‘దీన్‌ బంధు’ జర్న ల్‌ ప్రారంభించారు.దళితుల ఆలోచనలు,అభి ప్రాయాలకు దీన్‌బంధు స్థానం కల్పించేది. మధ్య మధ్యలో అంతరాయాలతో దాదాపు 100ఏళ్లు ఈ జర్నల్‌ నడిచింది.తొలి దళిత జర్నలిస్టులుగా పేరొందిన వారిలో మహర్‌ వర్గానికి చెందిన గోపాల్‌ బాబా వాలాంగ్కర్‌ ఒకరు. ఆయన వ్యాసాలు,కథనాలు..‘దీన్‌ మిత్ర’,‘దీన్‌బంధు’,‘సూధ్రక్‌’తదితర జర్నల్స్‌ కోసం ఆయన పనిచేశారు.హిందూ ధర్మాలపై ఆయన విమర్శలను ‘’విటాల్‌ విధ్వంసక్‌’’ పేరుతో ఓపుస్తకం కూడా ప్రచురించారు. దీనిలో శంకరాచార్య సహా ప్రముఖ హిందూ నాయకులకు 26 ప్రశ్నలు సంధించారు.
మరికొందరు కూడా..
మహర్‌ నాయకుడైన శివరామ్‌ జన్బా కాంబ్లే కూడా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరా డారు.తొలి దళిత దినపత్రిక ‘’సోమ్‌వాన్షీయ మిత్ర’’ను ఆయన జులై 1,1908లో ప్రారం భించారు.దళితుల ఉద్యమ నాయకుల్లో కిసాన్‌ బాన్సోడే పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మరోవైపు కార్మిక నాయకుడు ఎంప్రెస్‌ మిల్‌.. నాగ్‌పుర్‌లో స్వతంత్ర మీడియా సంస్థను కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే ‘మజూర్‌ పత్రిక’ (1918-22),‘చోఖామేలా(1936)’లను ఆయన నడిపించారు.1941లో రచయిత చోఖామేలా ఆత్మకథనూ ఆయన ప్రచురించారు. ‘సోమ్‌ వాన్షీయ మిత్ర’కు ముందు కిసాన్‌ బాన్సోడే.. ‘మరాఠా దీన్‌బంధు’ (1901)‘అత్యంజ్‌ విలాప్‌’ (1906),‘మహారాంచ సూధ్రక్‌’(1907)ల పేరుతో మూడు దిన పత్రికలను ఆయన నడిపించారు.అయితే,ఈ పత్రికల కాపీలు ఏ ప్రాచీన పుస్తక భాండాగారాల్లోనూ లభించడంలేదు. అయితే అప్పటి పరిణా మాలపై పరిశోధనలు చేసిన కొందరు..ఈ పత్రికలను బాన్సోడే నడిపించారని తేల్చారు. ముఖ్యంగా అణగారిన వర్గాలను ఏకం చేయ డమే ఈ పత్రికల లక్ష్యం.అంబేడ్కర్‌ ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్లిన పత్రికల్లో దాదాసా హెబ్‌ శిర్కే మొదలుపెట్టిన ‘గరుడ్‌’(1926), పీఎన్‌ రాజభోజ్‌ ప్రారంభించిన ‘దళిత్‌ బంధు’ పతిత్‌పావండాస్‌ నడిపించిన పతిత్‌పావన్‌ (1932),ఎల్‌ఎన్‌ హరదాస్‌ ప్రారంభించిన మహారత్తా(1933),దళిత్‌ నినాద్‌(1947)ఉన్నా యి. కులాలపై గాంధీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీఎన్‌ బార్వే..‘దళిత్‌ సేవక్‌’ను మొదలుపెట్టారు.తొలినాళ్లలో అంబేడ్కర్‌ జర్నలిజంపై..‘దళితాంచి వృతపత్రే’ పేరుతో 1962లో అప్పాసాహెబ్‌ రాన్‌పిసే ఓపుస్తకాన్ని ప్రచురించారు.మరోవైపు దళిత జర్నలిజంపై గంగాధర్‌ పంతవానే 1987లో ఓపరిశోధక పత్రాన్ని ప్రచురించారు. ఆతర్వాత అంబేడ్కర్‌ దళిత జర్నలిజంపై పరిశోధనలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
కళాత్మకంగా…
అంబేడ్కర్‌ రచనలు చాలా కళాత్మకంగా ఉంటా యి. వీటిలో ఆయన గట్టి విమర్శలు చేసేవారు. మరోవైపు అణగారిన వర్గాల కోసం ప్రవేశపెట్టే పథకాలను సమీక్షించడంతోపాటు బడుగు వర్గాలపై జరిగే అకృత్యాలను ఎత్తిచూపేవారు. ప్రభుత్వ విధానాలు,రాజకీయ పార్టీల వాద నలు,సామాజిక,రాజకీయ సంస్కరణలపై అంబేడ్కర్‌ సంపాదకీయాలూ రాసేవారు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలను క్షుణ్నంగా పరిశీలించేందుకు ఆయన కథనాలు,వ్యాసాలు మనకు చక్కటి అవకాశం కల్పిస్తాయి.ఆయన మంచి వ్యాసకర్త,ఆలోచనా పరుడు. ఆయన ప్రచురించిన జర్నల్స్‌లో దళిత ఉద్యమకారుల చిత్రాలు,దళిత కళాకారుల సృజనాత్మకత కనిపించేవి.జూన్‌ 15,1927లో‘బహిష్కృత్‌ భారత్‌’లో రాసిన ఓకథనంలో బ్రాహ్మణులపై అంబేడ్కర్‌ ధ్వజమెత్తారు.ముంబయి ప్రాంతంలో చేపట్టిన ఓసర్వేను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు.ప్రతి రెండులక్షల మంది విద్యావంతుల్లో బ్రాహ్మణులు వెయ్యి మంది వరకు ఉంటే…అంటరాని వారి ప్రాతినిధ్యం సున్నా అని గణాంకాలను ఉటంకించారు.దళిత ఉద్యమాలతో జర్నలిజానికి విడదీయరాని బంధముంది.దళితుల సామాజిక,రాజకీయ ఉద్యమాలు ప్రతిబింబించేలా వారు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక పత్రికల్లో కవరేజీ ఉండేది. అయితే,అంబేడ్కర్‌ కాలంలానే నేటీకీ ప్రధాన పత్రికల్లో వారికి సముచిత స్థానం దక్కడం లేదు. (హార్వర్డ్‌ కెనడీ స్కూల్‌లోని షోరెన్‌స్టీన్‌ సెంటర్‌ ఆన్‌ మీడియా,పాలిటిక్స్‌,పబ్లిక్‌ పాలసీలో సూరజ్‌ యెంగ్డే పరిశోధకుడు)

ఓటరా..మేలుకో..!

‘‘ లోక్‌ సభ ఎన్నికలకు నగారా మోగింది. పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పజల ఆకాంక్షలకు పాలకులు చరమ గీతం పాడిన రోజున ప్రజల తమ తిరుగుబాటు ద్వారా తమకు అనువైన రాజకీయ వ్యవస్థను నిర్మించు కుంటారని హెచ్చరించడాన్ని బట్టి ప్రత్యామ్నయ ప్రభుత్వాల ఆవశ్యకతను అర్ధం చేసుకోవచ్చు.అదే సందర్భంలో విద్య,వైద్య,సామాజిక న్యాయం ప్రజలం దరికీ ఉచితంగా అందిన రోజున వ్యక్తి ఎదుగుదల ఉన్నతంగా ఉంటుం దని, మెరుగైన సమాజ నిర్మాణంలో వారు చురుగ్గా పాల్గొం టారని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ దిశానిర్దేశం చేవారు. రాజ నీతిజ్ఞతతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోసించ వలసిన పాలకులు అవకాశ వాదులుగా మారుతున్న సందర్భంలో ప్రభుత్వాల కుట్రలను ఛేధించడానికి అంబేద్కర్‌ చేసిన ప్రయత్నాలు, హెచ్చరికలు ప్రజల చైతన్యాన్ని మరింతగా పెంచవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.’’
‘ప్రశ్నించేతత్వాన్ని పెంచిపోషించే విద్య ను మాత్రం ఉచితంగా అందివ్వరు’అని చురకలు అంటించారు.డాక్టర్‌బి.ఆర్‌అంబేద్కర్‌.విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా అందితే ప్రజలు చైతన్యవంతు లై శాసించేస్థాయికి వస్తారనేది ఇందులోని అంరా ర్దం.ప్రశ్నించేతత్వాన్ని పెంచిపోషించే అత్యంత చురుకైన సాధనం‘విద్య’ అని ప్రపంచవ్యా ప్తంగా ఏకాభిప్రాయం ఉంది. ఇందుకు ఎలాంటి మినహా యింపులు లేవు.కానీ,ఈప్రశ్నించేతత్వాన్ని నీరుగార్చే ప్రయత్నాలు కూడా సమాంతరంగా జరుగుతున్న మాట వాస్తవం కాదా?మతం,మూఢ విశ్వాసాలు, అతివినయం,మనకు సంబందం లేదని గిరి తీసుకు నేతత్వం,సామాజిక స్పృహ లేకపోవడం,పరిధి దాటి రాకపోవడం,ప్రబుత్వాల కుట్రవంటి అనేక అంశా లు కూడా ప్రశ్నించే తత్వాన్ని సమాజంలో ఎదగ కుండా చేస్తున్నవని చెప్పుకోవచ్చు. ఇన్ని అవరోధా లను అధిగమించి,అసాంఫీుక శక్తుల కబంధహాస్తాల నుంచి విముక్తి చెంది,సానుకూల దృక్పథాన్ని పెంచి పోషించడానికి,లక్ష్యాలనుచేరుకోవడానికి,ఆత్మ విశ్వాసం నింపడానికి,సామాజిక రుగ్మతలను చీల్చి చెండాడి మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడే ప్రయాణంలో ‘ప్రశ్నించడం’అనివార్యమైంది.
ఏయే అంశాలలో..
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు జన జీవితాలను విచ్ఛన్నం చేస్తున్నప్పడు,అసాంఫీుక శక్తులు ప్రశాంత తను కొల్లగొడుతున్నప్పుడు, అసామానతలు, అంతరాలు,వివక్షత సమాజంలో ఎల్లెడలా వ్యా పించినప్పుడు,జాతిసంపదను సంపన్నులు, పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసి సామాన్య జనాలను నిర్లక్ష్యం చేసినప్పడు ప్రశ్నిం చడమే పరిష్కారంగా పనిచేస్తుంది. ప్రభుత్వాలు ప్రజా జీవితంలో చొరబడి,స్వేఛ్చా స్వాతం త్య్రాలను హరించివేసి,బానిసలుగా తయారు చేసుకొని, అధికారాన్ని శాశ్వతం చేసుకునే క్రమంలో ‘ప్రశ్నించి యజమానులుగా మారుతారా? లేక లొంగిపోయి బానిలుగా జీవిస్తారా? ’తేల్చు కొమ్మన్నారు డాక్టర్‌.బి.ఆర్‌.అంబేద్కర్‌.ఈ హెచ్చరిక వెనుకఉన్న నేపథ్యం విద్యను ఆయు ధంగా చేసుకుని సమాజాన్ని శాసించాలని ఆశించడమే.అందుకే అంబేద్కర్‌ ‘ప్రభుత్వాలు అంత సులభంగా విద్యను ప్రజలకు ఉచితంగా అందించడానికి సిద్దపడవు’ అని జ్ఞానోదయం కలిగించిన సందర్భాన్ని మనం సమయస్పూర్తి తో సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఉంది.అంబేద్కర్‌ సూచనలు మేరకు ప్రశ్నింప నేర్పే నాన్యమైన విద్యను ఉచితంగా అందుకోవ డానికి మరో పోరాటం చేయక తప్పడం లేదని తేలిపోతున్నది కదా!?.కేరళ,ఢల్లీి, రాష్ట్రప్రభు త్వాలు విద్యారంగంలో నువ్వా?నేనా?అనే స్థాయిలో పోటీపడుతున్నాయి.విద్యకు 24,25 శాతం నిదులను కేటాయించి అంతర్జాతీయస్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్న సందర్భాలను మిగ తా రాష్ట్ర ప్రభుత్వాలు ఆకలింపు చేసుకుంటే మంచిది.ఢల్లీి ప్రభుత్వం వేలాది తరగతి గదులను సర్వాంగ సుందరంగా,విశాలంగా తీర్చిదిద్ది విద్య ను ఉచితంగా అందిస్తూ,కార్పొరేటు పాఠశా లలను పరోక్షంగా మూసివేయడానికి తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలి.ఢల్లీి లాంటి రాష్ట్రాలలో నిబంధనలను తుంగలోతొక్కిన ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వాలే మూసివేసి జరి మానా విధించిన సంఘటనలు చూస్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాలలో విద్య అంగడి సరు కుగా మారిందని భావించక తప్పదు.
ఉచితం ఉండాలి..
రాజ్యాంగ రచన సందర్భంలోనూ,స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనూ జరిగిన అనేక సభలు, సమావేశాల సందర్భంగా డాక్టర్‌ బి.ఆర్‌. అంబే ద్కర్‌ చేసిన అనేక సూచనలు లేదా హెచ్చరికలు నేటి పాలకులకు కనువిప్పు కావాలి.ప్రజల ఆకాం క్షలకు పాలకులు చరమగీతం పాడిన రోజున ప్రజలు తమ తిరుగుబాటు ద్వారా తమకు అను వైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకుంటారని హెచ్చ రించడాన్ని బట్టి ప్రత్యామ్నాయ ప్రభుత్వాల ఆవశ్య కతను అర్దం చేసుకోవచ్చు.అదే సందర్భంలో విద్య, వైద్య,సామాజికన్యాయం ప్రజలందరికీ ఉచితంగా అందిన రోజున వ్యక్తిఎగుదుల ఉన్నతంగా ఉం టుందని,మెరుగైన సమాజం నిర్మాణంలో వారుచు రుగ్గా పాల్గొంటారని అంబేద్కర్‌ దిశానిర్ధేశం చేశా రు.రాజనీతిజ్ఞతతో దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించవలసిన పాలకులు అవకాశ వాదులుగా మారుతున్న సందర్భంలో ప్రభుత్వాల కుట్రలను ఛేధించడానికి అంబేద్కర్‌ చేసిన ప్రయ త్నాలు, హెచ్చరికలు ప్రజల చైతన్యాన్ని మరింతగా పెంచ వలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది.
పాలకులు ఎప్పుడు కూడా సంపన్న వర్గాల పక్షాన నిలిచి పనిచేస్తారనే ముందుచూపు, ప్రజల ఐక్య ఉద్యమాలు,పోరాటాలద్వారా ఏర్పడే నిజమైన చట్టాల ముందు పాలకులు తలవంచక తప్పదనే హెచ్చరిక వారి మాటలలో కనబడు తుంది.కేంద్ర ప్రభుత్వం విద్య,వైద్యానికి నామ మాత్రపు నిదులను కేటాయిస్తూ ప్రైవేటుపరం చేయడానికి ఉత్సాహపడుతుంది.రాష్ట్రాల ప్రభు త్వాలు కూడా ఆయా రంగాలను గాలికి వదిలి, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయ డంలో పోటీ పడుతున్న తరుణంలో ఐక్య ఉద్యమా లే పరిష్కారమని సూచన కూడా మన ముం దు చర్జనీయాంశంగా నిలిచింది.దేవ గౌరవాన్ని, జాతి ప్రతిష్టను,ప్రజల ఆకాంక్షలను, రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకోవడానికి పిడికిలి బిగించి నినదించడమే మన ముందున్న ఏకైక పరిష్కారం. ఎన్నికల వేళ అలాంటి పార్టీలకే తమ ఓటు అనే డిమాండ్‌ తెర మీదకు రావాలి.
ఓటు ఓ వజ్రాయుధం
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగను న్నాయి. రాజ కీయ పార్టీల ఎన్నికల్లో గెలవడానికి ప్రచారములో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అమలుకు నోచు కోని హామీలు ఉచితాలు’ ఆర్థిక ప్రలోభాలు ప్రకటి స్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తు న్నాయి.ఓటర్లు తమ కున్న ఓటు హక్కును ఉత్తమ అభ్యర్థుని ఎన్నుకోవడంలో విజ్ఞతప్రదర్శించాలి. ఎన్నికలపై నిర్లక్ష్యం తగదు..ఎన్నికలు అంటే అవి నాయకులకే పరిమితమైనవని సాధారణ పౌర సమాజం ఎన్నికలపట్ల ఆసక్తి చూపక పోవ డంవల్ల అవినీతి పరులు చట్ట సభలకు ఎన్నికై రాజకీయ అవినీతికి పాల్పడి కోట్లాది సంపాదనకు రాజకీయా లు మార్గమైనాయి. ప్రాజెక్టుల పేరు మీద ప్రజల సొమ్మును దోపిడిచేస్తూ దోసుకో’దాసుకో అనే నినా దాన్ని తమ పాలన విధానంగా మార్చివేసి పేద’ మధ్యతరగతి బిసి బడుగు బలహీనర్గాలను చట్ట సభల్లోకి ప్రవేశించకుండా అడ్డు కునే వికృత రాజ కీయ క్రీడ కొనసాగడంశోచ నీయం. బ్రిటిష్‌ పాలన నుండి దేశ ప్రజల విముక్తి కొరకు జరిగిన పోరా టాల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన భారతదేశ ప్రజలు స్వాతంత్య్ర అనంతరం చట్టసభలకు జరిగే సార్వత్రికఎన్నికల్లో ఉదా సీన వైఖరి అవలంభించ డంవల్ల చట్టసభలు నేరచరితులరౌడీల’మాఫి యా ల’ ధన స్వాముల పరమైనాయి. ఎన్నికలు గెలుపు గుర్రాలు ఎన్నికలు అంటే గెలుపు గుర్రాలకు మాత్ర మే రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తు పార్టీ కొరకు ప్రజా ఉద్యమాలు చేసిన త్యాగశీలురు అంకిత బావం సిద్ధాంత నిబద్ధత కలిగిన సీనియర్‌ కార్యర్త లకు టికెట్లు ఇవ్వక పోవడంవల్ల చట్టసభలకు జరిగే ఎన్నికలు ధనికులకు‘మాఫియా‘డాన్‌ కార్పొరేట్‌ శక్తులకు రిజర్వ్‌ చేయబడ్డాయన్న మానసిక భావన సమాజంలో స్థిరపడి పోయింది.మన తలరాతను మార్చేది ఎన్నికలే..మనం ఎన్నికల ఓటింగ్‌ గురించి పట్టించు కోక పోయిన మనసమాజంలో ఆర్థిక ‘సామాజిక సాంస్కృతిక ‘సాంఘికఉద్యోగ’ ఉపాధి ‘పెట్టుబడి ఉత్పత్తి’ఉత్పాదకత ‘స్వదేశీవిదేశీ వర్తకం’ వ్యారం ‘విధ్య వైద్యం ‘ఆరోగ్యం ‘విదేశీ విధానాల రూపకల్పనలో మౌలికమార్పులు తెచ్చి మన జీవి తాలను భవిష్యత్తును మనపిల్లల భవిష్యత్తును మార్చ గలిగేది చట్ట సభలకు జరిగే ఎన్నికలు మాత్రమే నన్నది చారిత్రిక వాస్తవం .ఎన్నికలు అంటే సమాజ ములో అందరివి కొందరివి కాదు లేదా కొన్ని సామాజిక వర్గాల ఏకస్వామ్యంకాదు. కుటుం భాలగుత్తాధి పత్యంకాదు.ఓటర్లు పోలింగులో సంపూర్ణ భాగస్వాముల్కె‘‘తమ స్థితగతులను ‘‘మా ర్చు కునే పరిస్థితిగా గుర్తించాలి. ఓటు మన జన్మ హక్కు..నిజమైన సార్వభౌమాధికారం ఓటరు చేతి లోనే వుంటుంది.ఐదేళ్లకు ఒక సారి మన సేవకులను చట్ట సభలకు అభ్యర్థులుగా ఎన్నుకుంటాం. పరి పాలన దక్షున్ని రాజ్యాంగ చట్టాలపట్ల ప్రజా సంక్షే మ పథకాలు చట్టాల పట్ల అవగాహన పరిజ్ఞానం వున్న అభ్యర్థిని ఎన్నుకొని సుపరిపాలనకు దిశ దశ నిర్ణయించడంలో ఓటే కీలకం.నోటుకు ఓటును అమ్ముకోవద్దు.ఓటుద్వారా తమ తల రాతను మార్చే శక్తి వుంది.ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్న అభ్యర్థిని ఎన్నుకొని ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచే ఉత్తమ అభ్యర్థులకు ఓటువెయ్యాలి.ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభు వులు ప్రజలు తమకున్న ఓటుహక్కుతో ఐదు సంవ త్సరాల పదవీ కాలానికి ప్రజా ప్రతినిధులను ఎన్ను కొని ప్రభుత్వాల ఏర్పాటులో క్రియా శీలకంగ పాల్గొనాలి. ఓటుమార్పుకు ఆయుధం.. ఓటు అనే ఆయుధంతో ఓటరు తమ ఆకాంక్షలు అవసరాలు తీర్చే ప్రభుత్వాలకు అధికారం ఇస్తాడు. అభివృధ్ది సాధకులకు ఎన్నుకోవాలి..జాతి తల రాతలు మార్చే సమాజ సేవకులను సామర్థ్యం’ సత్తాగల అభివృద్ధి సాథకులనుచట్ట సభలకు అభ్యర్థులుగా ఎన్ను కోవాలి. ఓటు వేసే ముందు గత ఎన్నికల్లో పార్టీలు ఇచ్చిన వాగ్దానాల అమలునుఎన్నికల మేనిఫెస్టో పట్ల ఆలోచించాలి.
తలరాతను మార్చేది ఓటు..
బాధ్యత గల పౌరుడిగా మన జీవితాన్ని తద్వారా జాతి తల రాతను మార్చేది మన ఓటుతోనే వీలవు తుందనే వాస్తవాన్ని మరువరాదు. ఎవరికి ఓటు వెయ్యాలి? ఎందుకు ఓటు వేయాలి? జాతిభవి ష్యత్తు ‘దేశఐక్యతా సమగ్రత’ దేశ సార్వభౌమా ధికార రక్షణ భద్రత దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థ, వ్యవ సాయం ‘పారిశ్రామిక అభివృధి ‘సేవా రంగాల విస్తరణ స్వయంసమృది సుస్తిరాభివృద్ది‘ఉపాధిఉత్పా దక’సామర్థ్యం ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని మెరుగు పరిచే పార్టీ అభ్యర్థులను చట్ట సభ సభ్యు లుగా ఎన్నుకోవాలి. ఓటు వేసే ముందు రాజకీయ పార్టీల విదానాలు సిద్ధాంతాలు కట్టుబాట్లు నిబద్ధత నిజాయితీ ప్రజాసమస్యల పరిష్కారం కోసం అవ లంబించే సామర్థ్యం ఉన్న వారిని ఎన్నుకోవాలి. ఓటర్లుఎన్నికల మేనిఫెస్టో పరిశీలించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాటి అమలు ప్రాజెక్టుల నిర్మాణం నాణ్యత లభిదారుల సమస్యలు పరిష్కారాలు పరిశీ లించాలి.ఓటు వేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి అభివృధ్దికి పాటు పడేవారికి ఓటు వెయ్యాలి.ఏపార్టీ,మన దేశాన్ని,మన ధర్మాన్ని రక్షిం చడానికి కట్టుబడి ఉంది?ఏపార్టీ లంచగొండితనం తో కూరుకుపోయి ప్రజాధనాన్ని దుర్వి నియోగం చేస్తుంది. అభివృధ్ది సంక్షేమం పేరున అమలౌతున్న పథకాల ప్రయోజనాలు అధికారంలో ఉన్న వారి కుటుంబానికి లబ్దిచేకూరుస్తున్నాయనే అంశాల మీద ఓటర్లు అవగాహన కలిగి వుండాలి. సహజ వనరు లు మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగపడే దీర్ఘ కాలిక ప్రయోజనాలకు పెద్ద పీట వేసి పేదరికం నిరుద్యోగం తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే సరైన పార్టీకి ఓటు వేసి ప్రగతి శీల సమాజ స్థాపనకు చేయూత నివ్వాలి. మన ఓటు తోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి! మనం ఓటు వేసేది ఎవరికో అధికారం ఇవ్వటానికి కాదు. మన జాతి తలరాతను మార్చి ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ఓటరు ఓటు వేసే ముందుపార్టీల మేనిఫెస్టో అంశాలు నిర్ణీత పదవీకాలంలో అమలుఅవుతాయా? లేదా? తెలుసుకోవాలి.రాజకీయాల పట్లఎన్నికల పట్ల ఎన్ను కునే ప్రతి పౌరుడు ఆసక్తి అవగాహన కలిగి వుం డాలి.మనం రాజకీయం చేయక పోయినా రాజకీ యాలు తెలుసు కోవటం నేటి తక్షణ అవసరం. ఓటు నిశ్శబ్ద విప్లవం.. దేశ రాజకీయాలకు వెగటు పుట్టిస్తున్నధన’ రౌడీ రాజకీయాలతో పరువు మాస్తున్న ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయడానికి తమ ఓటు హక్కు వినియోగం ద్వారా అవినీతి అక్రమాల చెర లోంచి జనస్వామ్యానికి స్వేచ్ఛ ప్రసాదించే ప్రజాఉద్యమానికి విజ్ఞతగల ఓటర్లు నేతృత్వం వహించాలి. ఓటు బుల్లెట్‌ కంటే బలమైంది.ఓటు ఒక నిషబ్ధ విప్లవం ఓటే మన ఆయుధం! దానితోనే మనం పోరాడాలి.మన ధర్మాన్ని మనం నిల బెట్టు కోవాలి!మన బతుకులు మనం చక్కపరచు కోవాలి! ఎన్నికల్లో ప్రతిఓటరు క్రియా శీలక బాగ స్వామి కావాలి.ఓటింగులో తప్పని సరిగా పాల్గొనాలి ఇతర ఓటర్లను యువతను తమఓటు హక్కు వినియోగించుకొని తమ తల రాతను మార్చే పార్టీ లకు అభ్యర్థులకు ఓటు.వెయ్యాలి. పోటీ చేసే అభ్య ర్థుల గునగణాలు వారి సామాజిక సేవా అంశాల మీధ విరివిగా చర్చించాలి. నోటుకు ఓటు అమ్ము కో వద్దు..ఓటువేసే ముందు విజ్ఞత ఓటరు రాజకీ య పార్టీల హామీల ఓట్ల వేలం పాటల హోరులో హైరానా పడి నోటుకు ఓటు అమ్ముకోవద్దు. మన ఓటు తెలంగాణ అభివృద్ధికి మన కులం వాడని, మన జిల్లా వాడని, మన ప్రాంతం వాడని భావించ కుండ కులమతాలకు అతీతంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలిగించే వారిని ఎన్నుకోవాలి. ఎన్నిక ల్లో పోటీ చేసే అభ్యర్థి ఏపార్టీ వాడని చూడకు ఏ పాటి అభివృద్ధికి పాటుపడే వాడో ఆలోచించు. మనంవేసే ఓటు ప్రజాస్వామ్యాన్ని పది కాలాల పాటు ఉద్దరించ గలగాలి.ఓటుకు ఒక ప్రత్యేక త వుంది.దాని ప్రాధాన్యం ఎంత చెప్పిన తక్కువే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ముందే జాగ్రత్త పడాలి.నీతినిజా యితీగా పనిచేసే వాడికి,రాష్ట్ర భవిష్యత్తు అభివృధ్దికి సంక్షే మానికి ప్రజారక్షణలో క్రమశిక్షణ కలిగిన సైనికు డిగా అండగా నిలబడే పార్టీకి/ అభ్యర్థికి ఓటు వెయ్యాలి రాష్ట్ర ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తుకు పాటు పడే పార్టీ/ అభ్యర్థులకు ఓటు..పేద బడుగు బలహీన వర్గాల జీవితాలలో జీవన ప్రమాణాలు మెరుగు పరిచి సామాన్య పేద ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిం చే వ్యక్తికి /అభ్యర్థికి ఓటు వేస్తే తెలంగాణా ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తుకు సుఖమయ జీవితానికి దోహ దపడే నూతన అభివృధ్ది వ్యూహా లతో ముందుకు వచ్చే పార్టీకి/ అభ్యర్థులకు ఓటు వేయండి.ప్రజా సంక్షేమానికి పాటు పడని నేతలను ఓటు ద్వారా నిగ్గ తీయండి.ప్రజాఆకాంక్షలు తీర్చని వారిని శం కర గిరి మాన్యాలు పట్టించే శక్తిని సమకూర్చేది ఓటు హక్కేనని విజ్ఞతగల ఓటర్లు.గుర్తించాలి. ఓటర్లు జాతి తలరాతను మార్చి రాసేవిధాలుగా అవతరించాలి.ఓటర్లు నిర్లక్ష్యాన్ని నిర్లిప్తత ను సోమ రితనం విడనాడి ఓటింగులో చురుకుగా పాల్గొ నాలి.తమ ఓటుద్వారా ప్రభుత్వ నిర్మాణం జరుగు తుందనినే వాస్తవాన్ని మరువద్దు.ప్రజాస్వామ్య రక్షణ ప్రతి ఓటరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని జనస్వామ్యంగా మార్చే ప్రక్రియ లో ఓటర్లదే తుది తీర్పు .ఓటు పదున్కెన ఆయుధం. దీన్ని ఏవిధంగా సందిస్తే మన జీవితాలు మారుతా యనేది ఆలోచించాలి.ఎది ఏమైనా మనం వేసే ‘‘ఓటుకోహినూర్‌’’వజ్రంకంటే అత్యంత విలువై నది.ఓటు ఓగొప్ప మార్పుకు సంకేతం. ఓటు ప్రగ తికి మేలుకొలుపులాఉండాలి.మనం తోడుకున్న గోతిలో మనం పడకూడదు.ఓటరా మేలుకో ప్రజా స్వామ్యాన్ని రక్షించుకో (గునపర్తి సైమన్‌)

సుప్రీం కోర్టు ప్రకారమే అటవీ నిర్వచనం

‘‘ అడవులు భూగోళపు ఊపిరితిత్తులు.అడవి చల్లగా ఉంటేనే మానవాళి భవిత భద్రంగా ఉంటుంది. కీకారణ్యమైనా,చిట్టడవిjైునా,నాలుగు చెట్లు ఒకచోట ఉంటే భూగోళానికి చేసే మేలు ఇంత అంత కాదు! కానీ,అంతులేని లాభాపేక్షతో కార్పొరేట్లు అడవులను కబళించడానికి ఎప్పటికప్పుడు విరుచుకు పడుతుంటారు.తమ చెప్పుచేతల్లోని ప్రభుత్వాలతో అనుకూల చట్టాలను తయారు చేయించుకుంటారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈదిశలో భారత అటవీ (సంరక్షణ)చట్టం 1980ని సవరించడానికి చేసిన ప్రయత్నానికి అత్యున్నత న్యాయస్థానం బ్రేక్‌ వేసింది. కార్పొరేట్లకు కట్టబెట్టడమే లక్ష్యంగా గత ఏడాది అడవుల నిర్వచనాన్ని మారుస్తూ తీసుకు వచ్చిన చట్ట సవరణను తాత్కాలికంగా నిలిపి వేసింది.1996లో వెలువరించిన టిఎన్‌ గోదా వర్మన్‌ తిరుములపాడ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో నిర్దేశించిన అటవీ నిర్వచ నానికి అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌డి.వై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆహ్వానించదగిన పరిణా మం. నిఘంటవుల్లోని అర్థాన్ని అడవికి ప్రామాణి కంగా తీసుకోవాలని ఈతీర్పులో ధర్మాసనం పేర్కొంది.వర్గీకరణలు,యాజమాన్యాలతో సంబం ధం లేకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. అడవులుగా భావించే ప్రాంతాలను (డీమ్డ్‌ ఫారెస్ట్స్‌) గుర్తించడానికి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇన్ని కీలకమైన ఆదేశాలు ఉన్నాయి కాబట్టే ఆ తీర్పును ఒక మైలురాయిగా భావిస్తారు ’’
భూమిని గుర్తించే ప్రక్రియలో 1996లో టిఎన్‌ గోదావర్మన్‌ తిరుమల్‌పాడ్‌ తీర్పులో పేర్కొన్న ‘అటవీ’ నిర్వచనం ప్రకారం..రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా వ్యవ హరించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 19న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ సంరక్షణ చట్టానికి 2023లో చేసిన సవరణలను సవాలుచేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌,న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.పిటిషనరు తరపున సీనియర్‌ న్యాయవాదులు ప్రశాంతభూషన్‌,చంద్రసేన్‌ వాదనలువినిపిస్తూ 2023 సవరణలోని సెక్షన్‌ 1ఎగోదావర్మన్‌ తీర్పులో ఇచ్చిన ‘అడవి’నిర్వచనం కుదించబడిరదని, దీని ప్రకారం భూమిని అటవీగా నోటిఫై చేయాలని, ప్రభుత్వంలో ప్రత్యేకంగా అటవీగా నమోదు చేయాలని పేర్కొన్నారు.ఈనిర్వచనాన్ని కుదించడం వల్ల దాదాపు1.99 లక్షల చదరపు కిలోమీటర్ల అటవీ భూమి‘అటవీ’ పరిధినుండి బయటపడుతుందని అన్నారు.అడవులను అటవీయేతర వినియోగానికి మళ్లించబడుతున్న భూముల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని సిజెఐ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
‘రూల్‌ 16ప్రకారం రాష్ట్ర ప్రభు త్వాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు పరిపాలన కస రత్తు పూర్తి చేయడానికి పెండిరగ్‌లో ఉంది. గోదావర్మన్‌లోని ఈకోర్టు తీర్పులో స్పష్టంగా వివ రించబడిన సూత్రాలను తప్పనిసరిగా పాటిం చాలి.16వ నిబంధనలో నిపుణుల కమిటీ గుర్తిం చాల్సిన అటవీ,వంటి ప్రాంతాలు,వర్గీకరించని అటవీ భూములు,కమ్యూనిటీ ఫారెస్ట్‌ భూము లు ఉంటాయి.అందువల్ల గోదావర్మన్‌ తీర్పులో వివ రించిన విధంగా ‘అటవీ’ అనే వ్యక్తీకరణ పరిధికి అనుగుణంగా ఉండేలాచూసుకోవాలి’అని పేర్కొం ది.ఈ ఆర్డర్‌కు సంబంధించి అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలితప్రాంతాలకు సర్క్యులర్‌ను జారీచేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశిం చింది.ఈఉత్తర్వు తేదీనుండి రెండువారాల వ్యవధిలో రాష్ట్రాలు ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీలతో అడవులుగా గుర్తించబడిన భూమికి సంబంధించిన సమగ్ర రికార్డును అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లు,కేంద్ర ప్రభుత్వం తమకు అందించాలని ధర్మా సనం ఆదేశించింది. నిపుణుల కమిటీల నివేదిక లను మార్చి 31లోగాఫార్వార్డ్‌ చేయడంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా ఆదేశాలను పాటించాలని,ఈ రికార్డులు ఏప్రిల్‌ 15 నాటికి అధికారిక వెబ్‌సైట్‌లో డిజిటలైజ్‌ చేయాలని,అందుబాటులో ఉంచాలని సూచిం చింది.2023రూల్స్‌లోని రూల్‌16ప్రకారం ఏర్పా టైన నిపుణుల కమిటీలుగోదా వర్మన్‌ తీర్పు ప్రకా రం ఏర్పాటైన మును పటి నిపుణుల కమిటీలు చేసిన పనిని దృష్టిలో ఉంచుకోవాలి. అయితే, 2023 నిబంధనల ప్రకారం ఏర్పడిన నిపుణుల కమిటీలకు రక్షణకు అర్హమైన అటవీభూముల పరిధిని విస్తరించేందుకు స్వేచ్ఛ ఉంటుందని ధర్మా సనం స్పష్టం చేసింది.ముందస్తు అనుమతి లేకుం డా అటవీ భూములను జంతుప్రదర్శన శాలలు, సఫారీలకు తెలియజేయ కూడదని పేర్కొంది. తదుపరి విచారణ జులైకు వాయిదా వేసింది.
40 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణ
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1951నుండి75వరకు దేశ వ్యాప్తంగా 40లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఆ నేపథ్యంలోనే భారత అటవీ (సంరక్షణ) చట్టాన్ని రూపొందించి 1980లో ఆమోదించారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఇతర అవస రాలకు అటవీ భూమిని మళ్లించడం గణనీయంగా అదుపులోకి వచ్చింది.గతంతో పోలిస్తే 1981 నుండి 2022 వరకు అటవీ భూముల నిర్మూలన పదిశాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ,చట్టంలోని లొసుగులను అవకా శంగా తీసుకుని అడవుల నరికవేత కొనసాగింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని గూడలూరులో చోటుచేసుకున్న కలప అక్రమ నరికివేతకు సంబం ధించి దాఖలైన టిఎన్‌ గోదావర్మన్‌ తిరుమలన పాడ్‌ కేసులో అటవీప్రాంతాల రక్షణను ప్రధా నంగా చేసుకుని సుప్రీం ఇచ్చిన తీర్పులో ‘అడవి’ని విస్తృతంగా నిర్వచించింది. ఇది కార్పొరేట్లకు ఆటంకంగా మారింది.ఈనిబంధనలను మార్చా లన్న ఒత్తిడి పెరిగింది.ఈ నేపథ్యంలో వారి కను సన్నల్లో నడిచే మోడీప్రభుత్వం గతఏడాది ప్రభు త్వ రికార్డుల్లో నమోదైన భూమిని మాత్రమే అడవి గా గుర్తిస్తూ అటవీ చట్టానికి సవరణ తీసుకు వచ్చింది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అడవుల పరిధిలోకి వస్తాయన్న భయంతో ప్రైవేటు వ్యక్తులు ప్లాంటేషన్లు,తోటలు పెంచడం లేదని తన చర్యను ప్రభుత్వం సమర్ధించుకుంది. వాతా వరణ లక్ష్యాలను అందుకోవాలంటే ప్రైవేటు ప్లాంటేషన్ల భాగస్వామ్యం అవసరమని అడ్డగోలు వాదనకు దిగింది.ప్రభుత్వం చేసిన సవరణతో దేశ వ్యాప్తంగా1.99 లక్షలచదరపుకి.మీల భూమి అడవులపరిధి నుండి బయటకు వస్తుందని అం చనా.మన రాష్ట్రంలోనూ వేలఎకరాల అటవీ భూమికి రెక్కలు వస్తాయని అంటున్నారు. ఇప్పటికే యురేనియం తవ్వకాల పేరిట ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అడవుల విధ్వంసం ప్రారంభమైంది. పర్యాటక ప్రాంతాల్లో భూముల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వాలపై ఒత్తిడిఎలానూఉంది. వీటన్నింటితో పాటు కేంద్ర సవరణ అమలు లోకి వస్తే అటవీహక్కుల చట్టానికి పెద్ద ఎత్తున గండి పడే ప్రమాదం ఉంది. అత్యున్నత న్యాయ స్థానంలో ఈ వాదనలన్నీ ప్రస్తావనకు వచ్చాయి. ఆశాజనకమైన ఫలితం వచ్చినప్పటికీ అది మధ్యం తర తీర్పే! ప్రభుత్వం చేసిన సవరణను న్యాయ స్థానం పూర్తిగా కొట్టివేయలేదు. అడవులను గుర్తి స్తూ రికార్డులు తయారు చేయడానికి ప్రభుత్వానికి గడువిస్తూ అంతవరకు పాత నిర్వచనం అమలు లో ఉంటుందని పేర్కొంది. దీనర్ధం కార్పొరేట్‌ కత్తి వేలాడతూ ఉందనే!ఈ ప్రమాదాన్ని తిప్పికొట్టి, ఆకుపచ్చటి అడవులను పరిరక్షించు కోవడానికి ప్రజలను చైతన్యం చేయడం ఒక్కటే మార్గం.
అటవీ నిర్వచనం
అటవీ శాస్త్రం వ్యవసాయం మరియు పర్యావరణ పరిరక్షణను అడ్డుకునే ఒక శాస్త్రం. అడవులలో పంటలను నిర్వహించడం మరియు అటవీ దోపిడీని మెరుగుపరచడం దీని బాధ్యత. లో అటవీ నిర్వచనం పర్యావరణ నాణ్యతను మెరుగుపరచడం,సహజ వస్తువుల ఉత్పత్తి ద్వారా పర్యావరణం,ప్రకృతి పరిరక్షణ ప్రధాన లక్ష్యం. అటవీప్రాంతం నిర్వచనంలో,అడవుల పెంపకం మరియు నిర్వహణకు బాధ్యత వహి స్తున్నది మనం చూస్తాము. అడవులను నాటడం, పర్యా వరణ నాణ్యతను మెరుగుపరచడం,పశువుల పొలాల ఉత్పత్తి,నిర్వహణ ద్వారా సహజ పర్యా వరణాన్ని రక్షించడం దీని ప్రధాన లక్ష్యం. మన దేశంలో,అటవీప్రాంతం సహజపర్యావరణ వ్యవ స్థను నాశనం చేయకుండా కలప మరియు కార్క్‌ చాలా ముఖ్యమైన అభివృద్ధిని ఉత్పత్తి చేసింది. అటవీ సంరక్షణలో చేర్చబడిన కార్యకలాపాలలో, అడవులు,పర్వతాల నుండి విస్తరించే అటవీ చెట్ల పంటల నాటడం,నిర్వహణ అభివృద్ధిని మేము కనుగొన్నాము.ఆచరణాత్మక ప్రయోజనాల కోసం, ఇది వ్యవసాయంతో పాటు కుటుంబ శాస్త్రంగా పరిగణించబడుతుంది, అయినప్పటికీ దీనికి కొన్ని తేడాలు ఉన్నాయి. మొదటి మరియు అతిపెద్ద వ్యత్యాసం ఉత్పత్తి పద్ధతి. వ్యవసాయానికి కొన్ని నెలల్లో పండ్లు మరియు పంటలను పొందడం భారీగా ఉత్పత్తి చేయడం అవసరం, అయితే అటవీప్రాంతం ఫలితాలను చూడటానికి దశాబ్దా లు అవసరం. నాటిన జాతులను బట్టి ఈ సమ యాలు మారవచ్చు.సహజంగానే, మేము జాతు లను పెంచడానికి ఎంచుకున్న వాతావరణం పర్యావరణ వ్యవస్థను బట్టి,ఈ సహజ వనరును పొందటానికి ఎక్కువ లేదాతక్కువ సమయం పడు తుంది.సేంద్రీయ మట్టినిఉత్పత్తి చేసే జాతులు అటవీ అటవీనిర్మూలనకు కూడా ఉపయోగి స్తారు. అటవీ కార్యకలాపాలలో వివిధ చికిత్సలు పద్ధతులతో అడవుల పెంపకం వంటి కార్యకలా పాలు ఉంటాయి. పదార్థాలు,సహజ వనరుల నిర్వహణ మరియు ఉపయోగం పర్యావరణానికి అనుకూలమైన రీతిలో మరియు సాధ్యమైనంత తక్కువ నష్టంతో నిర్వహించడానికి రూపొందించ బడిరది. ఈ విధంగా, అటవీ నిర్వచనం ఏర్పడు తుంది వివిధ అటవీ పర్యావరణ వ్యవస్థలలో శ్రేయస్సు ఉత్పాదకత మధ్య మంచి సంబంధం. మేము పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి సహజ వనరులను రక్షించడానికి మాత్రమే ప్రయ త్నించము, కానీ దాని నుండి ఆర్ధిక ప్రయోజనా లను కూడా పొందవచ్చు.
రకాలు ` లక్షణాలు
ప్రతి ప్రాంతానికి అవసరమైన భూభా గాన్నిబట్టి అనేకరకాల అటవీప్రాంతాలు ఉన్నా యి:ఇంటెన్సివ్‌ ఫారెస్ట్రీ:సాగు చేస్తున్న ప్రాంతం ఎక్కువ ఉత్పాదకతను నిర్ధారించడానికి ఇది వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంది. అంటే, పర్యావర ణాన్ని పరిరక్షించేటప్పుడు అత్యధిక వనరులను ఉత్పత్తి చేయడానికి మేము ప్రయత్నిస్తాము. విస్తృతమైన అటవీ: ఇతర ఆర్థిక మరియు సామా జిక కార్యకలాపాలు చేర్చబడిన ప్రదేశాలలో కొన్ని కార్యకలాపాలను నిర్వహించే బాధ్యత ఇది. ఈ కార్యకలాపాలను అభ్యసించడం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే, అది పెరిగిన ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ గురించి జనాభాకు అవగా హన కల్పించడం. అదనంగా, ఇది పర్యాటకం పర్యావరణ విద్య వంటి జనాభాకు కొన్ని సేవలను కూడా అందిస్తుంది. దీనికి ధన్యవాదాలు, అడ వుల ఉత్పతి నిర్వహణ స్థిరమైన మార్గంలో కాలక్రమేణా హామీ ఇవ్వబడుతుంది.
ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు
మొదటి స్థానంలో చెట్లు లేని ప్రాంతా లలో అటవీ నిర్మూలన లేదా అటవీ నిర్మూలన ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి అని మేము కనుగొ న్నాము.ఆఎడారి ప్రాంతాలను పునరుద్ధరించ డానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది అనేక జాతుల మొక్కలు మరియు జంతువు లకు జీవన వనరులో భాగం.ఈవిధంగా మీరు అద్భు తమైనఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తారు.ఇది మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా గాలిని బాగా శుద్ధి చేయగలదు, ఇది అనేక పర్యావరణ ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది నదులకు ఆహారం ఇస్తుంది మరియు వివిధ ప్రాంతాలకు తాగునీటిని అందిస్తుంది. అయితే, ఇది కొన్ని నష్టాలను కలిగి ఉంటుంది. అటవీ నిర్వహణ లోపం ఉన్నప్పుడు ఈ లోపాలు ప్రధానంగా కనిపిస్తాయి.సరిగ్గా నిర్వహించక పోతే,పర్యావరణానికి హాని కలిగించడం మరియు మొక్క జంతు జాతులకు అపాయం కలిగించడం సులభం.నిర్వహణ సరిగా లేకపోవడంవల్ల మాన వులు సహజ పర్యావరణ వ్యవస్థలలో గొప్ప అసమతుల్యతను కలిగిస్తారు. ఉదాహరణకి, అధిక లాగింగ్‌, అననుకూల మరియు / లేదా ఆక్రమణ జాతులను నాటడం ద్వారా పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది.ఈ కార్యాచరణ నుండి ఉత్పన్నమ య్యే అన్ని ప్రతికూలతలు, నిర్వహణ సరైన మార్గం లో చేయనప్పుడు జరుగుతుంది. ఇది సమతుల్య పద్ధతిలో చేసినంత కాలం, అది ప్రయోజనాలను మాత్రమే తెస్తుంది.ఇది సామాజిక,ఆర్థిక పర్యా వరణ వినియోగాన్ని ఇవ్వడానికి అత్యంత అధోకర ణం చెందిన ప్రాంతాలలో ఉపయోగించవచ్చు. ఈ సమాచారంతో మీరు అటవీ నిర్వచనం దాని ప్రాముఖ్యత గురించి మరింత తెలుసుకోవచ్చని నేను ఆశిస్తున్నాను.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

విజన్‌ విశాఖ సదస్సు

విశాఖపట్నం రాడిసన్‌ బ్లూ హోటల్లో విజన్‌ విశాఖ సదస్సు మార్చి 5నపారిశ్రామికవేత్త లతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి హజరై విశాఖపట్నాన్ని ఎలా తీర్చి దిద్దాలి? రాష్ట్రానికి విశాఖపట్నం ఎందుకు అవసరం అన్న అంశాలపై మనం చర్చించాల్సిన అవసరం ఉందని వివరిం చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వ్యవసా యాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. దేశంమొత్తం చూసుకుంటే జీఎస్డీపీలో వ్యవ సాయం వాటా17-18శాతంగా ఉంది.మన రాష్ట్రంలో అయితే ఇది35శాతంగాఉంది. ద్వితీయ, తృతీయ రంగాలు వృద్ధి చెందకపోతే రాష్ట్రం కూడా ఆర్ధికంగా నిలబడలేదు.ప్రాథమిక రంగమైన వ్యవసాయరంగంతో పోలిస్తే ద్వితీయ రంగం, తృతీయ రంగాలు శరవేంగా వృద్ధిచెందాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ముందున్న సవాళ్లను అధిగమించ గలం. అప్పుడే మనం ఆశించిన ఆర్థికాభి వృద్ధిని సాధించగలం.రాష్ట్ర విభజనవల్ల పెనుసవాళ్లు మనకు ఎదురవుతున్నాయి.హైద రాబాద్‌ నగరాన్ని కోల్పోయాం.దీనివల్ల రాష్ట్రం మీద పెను ప్రభావం పడిరది. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా పురోగమించాలంటే ఒక చోదకశక్తి అవసరం.ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి ఆర్థిక చోదకశక్తి అయిన హైదరాబాద్ను మనం కోల్పోయాం.ఆర్థిక ప్రగతి లక్ష్యాలను చేరుకోవ డానికి ఒక వాహనం మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలను భావించి…ఆరోజుల్లో కేంద్ర ప్రభుత్వం వాటిని విరివిగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఐడీపీఎల్‌, ఎన్‌ఎండీసీ, ఎన్‌ఎఫ్సీ, ఐఐసీటీ లాంటి సంస్థలు హైదరా బాద్లో స్థాపించబడ్డాయి.పెద్ద ఎత్తున పెట్టు బడులు హైదరాబాద్కు వచ్చాయి.దీంతో ఉమ్మడి రాష్ట్రంలోని ఏఇతర ప్రాంతంతో పోల్చు కున్నా హైదరాబాద్‌ బాగా అభివృద్ధి చెం దింది. ఇలాంటి సంస్థలు వస్తే గనుక వెంటనే అభివృద్ధి పరంగా మంచి మార్పు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో మంచి జీతాలు లభిస్తున్న ఉద్యో గులు ఉంటారు. ఇది వలయంలా మారి మంచి సంస్థలు రావడం,తద్వారా మంచి ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది.తద్వారా నగరం బాగా విస్తరిస్తుంది.ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన ప్రభుత్వరంగ సంస్థల్లో 90 శాతం సంస్థలు కేవలం హైదరాబాద్లోనే స్థాపించబడ్డాయి. దీనివల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందింది. దురదృష్టవ శాత్తూ ఉమ్మడి రాష్ట్రంలోని మిగతా ప్రాంతా ల్లో అలా జరగలేదు.ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపే సేవారంగం జాతీయ స్థాయిలో చూస్తే జీఎస్డీపీలో 55శాతంకాగా, కానీ తెలంగాణలో సేవా రంగం దాదాపు 62.87శాతంగా ఉంది. కాని మన రాష్ట్రంలో సేవారంగం వాటా కేవలం 40శాతం మాత్రమే. తెలంగాణలో సేవారంగానికి సంబంధించి అత్యధిక వాటా హైదరా బాద్నుంచే వస్తోంది.అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రావాల్సి ఉంది. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ పెరుగుతుంది. తయారీ రంగంలో జాతీయ స్థాయితో పోలిస్తే జీఎస్డీపీలో సమాన స్థాయిలో ఉన్నప్పటికీ సేవా రంగం విషయంలో గణనీయ ప్రగతి చోటుచేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసా యరంగంతో పోలిస్తే సేవారంగంలో మంచి వృద్ధిరేటు సాధ్యం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సర్వీసు రంగం బాగా పెరగాల్సిన అవసరం ఏ రాష్ట్రా నికైనా ఉంది. 2022-3 ఆర్థిక సంవత్స రంలో చూస్తే ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం కేవలం రూ.2,19,518కాగా, తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,12,398లు. తెలం గాణ తలసరి ఆదాయంలో అత్యధిక భాగం హైదరాబాద్‌ నుంచే వస్తోంది.సహజ సిద్ధంగా మనకున్న బలాలను వినియోగించుకుంటూ ఆర్థిక పురోగతిలో ముందుకుసాగాల్సిన అవ సరం ఉంది. దేశంలోనే రెండో అతిపెత్త సముద్రతీర ప్రాంతం మనకు ఉంది.974 కి.మీ పొడవైన తీర ప్రాంతం కారణంగా పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మనకు అపార అవకాశాలున్నాయి. దీనివల్ల తయారీ రంగాన్ని కూడా గట్టి ఊతం లభిస్తుంది. పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా తయారీ రంగానికి తగిన సహకారాన్ని అందిస్తూ ,974 కి.మీ. తీరంవెంబడి వివిధ పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసుకుంటూ, మరోవైపు విశాఖ పట్నాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ రెండూ కలిసి రాష్ట్రానికి మంచి ఆర్థిక ప్రగతిని అందిస్తాయి. 2019కు ముందు కేవలం 4చోట్ల నుంచే ఎగుమతులు జరిగేవి.కాని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మరో నాలుగు పోర్టు లు కడుతున్నాం. వీటి పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దాదాపు రూ.16వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. ఇప్పటికే దాదాపుగా రూ.4వేల కోట్లు ఖర్చు చేశాం. రామాయపట్నం పోర్టులో వచ్చే నెలలోనే షిప్పులు వచ్చే పరిస్థితి నెలకొందని అధికారులు చెప్తున్నారు. మచిలీపట్నం, కాకినాడలోని ప్రయివేటు పోర్టు, మూలపేట పోర్టులవద్ద కూడా పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. నాలుగులో మూడు పోర్టులు ప్రభుత్వ రంగంలో వస్తుం డగా,మరో పోర్టు ప్రయివేటు రంగంలో వస్తోంది.బ్లూ ఎకనామీకి ఊతమిచ్చేలా 10 పిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్నాం.తీరం వెంబడి ప్రయాణిస్తే ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఒక ఫిషింగా హార్బర్‌ ఉంటుంది. అలాగే 6 ఫిష్‌ ల్యాండిరగ్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటితోపాటు పారిశ్రామిక నోడ్స్ను అభివృద్ధి చేస్తూ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్ను నెలకొల్పాం. అచ్యు తాపురం,ఓర్వకల్లు, కృష్ణపట్నంలలో పారి శ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నాం.అలాగే రాష్ట్రమంతటా కూడా సమతుల్య అభివృద్ది ఉండేలా చూస్తున్నాం. ప్రభుత్వం తీసుకుం టున్న సానుకూల చర్యలవల్ల, వ్యాపార అను కూల వాతావరణం వల్ల గడచిన మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. పారిశ్రామిక వేత్తలకు, పారిశ్రామిక రంగాన్ని రాష్ట్రం ఎంత స్నేహపూర్వకమైనదో చెప్పడానికి ఇదే ఉదాహ రణ. గత ఏడాది ఇదే విశాఖట్నంలో నిర్వ హించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సంద ర్భంగా రూ.13లక్షల కోట్లకుపైగా విలువైన 352 ఒప్పందాలు కుదిరాయి.దాదాపు 6 లక్ష ల మందికి ఉద్యోగావకాశాలు లభించను న్నాయి. ఇందులో 39శాతం ఒప్పందాలు ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ఇప్పటికే కార్య రూపంలోకి వచ్చాయి. మిగిలిన ఒప్పందాలు కూడా శరవేగంగా అమల్లోకి వస్తున్నాయి. కేవలం అతి పెద్ద తయారీ పరిశ్రమలు రావడంద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి, లబ్ధిదారు లను సుస్థిర స్వయం ఉపాధి మార్గాలవైపు నడిపించింది.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు గణనీయమైన మార్పును తీసుకు వచ్చాయి.లంచాలకు తావులేకుండా, దళారీలు లేకుండా అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా పథకాలు డీబీటీ పద్ధతిలో అమలు చేసింది. ప్రతి సంక్షేమ పథకం కూడా లబ్ధిదారులను చేయిపట్టుకుని నడిపించాయి. ఉదాహరణకు చేయూత పథకాన్ని తీసుకుంటే క్రమం తప్పకుండా ఒకే మహిళకు రూ.18,750లు చొప్పున నాలుగేళ్లపాటు స్థిరంగా ఇచ్చాం.ఆ లబ్ధిదా రులైన మహిళలను బ్యాంకులతో అనుసం ధానం చేశాం. అమూల్‌, ఐటీసీ, రియలన్స్‌, పీ అండ్‌ జీ లాంటి పెద్ద కంపెనీల భాగస్వా మ్యంతో వారికి స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశాం.వాల్లకాళ్లమీ వాళ్లు నిల బడేలా చేశాం.రాష్ట్రం ప్రభుత్వం ఈ ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఇలాగే అమలు చేసింది. ఇదివరకు జీవనోపాథి పొందుతున్న మార్గాన్ని బలోపే తం చేయడమో లేక కొత్త ఉపాథి మార్గాన్ని సృష్టించడమో జరిగింది.
ఉద్యోగ రంగాన్ని మొత్తం చూస్తే.. ప్రభుత్వంలో ఉన్నవి కొన్ని మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మేం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యగుల సంఖ్య 4లక్షలు అయితే, మేం వచ్చిన తర్వాత సుమారో మరో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను జోడిరచ గలిగాం. దశాబ్దాలపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్య 4లక్షలు అయితే,50శాతం అధికంగా కొత్త ఉద్యోగాలను మేం అధికారం లోకి వచ్చాక సృష్టించగలిగాం.అలాగే భారీ పరిశ్రమల విషయంలో కూడా కోట్లాది రూపాయల పెట్టుబడులను పెడితే,ఆ పెట్టు బడులు ఉద్యోగావకాశాల రూపంలో మారేది కూడా స్వల్పంగానే ఉంటుంది.కాని, ఉద్యోగ ఉపాధి రంగాల్లో పెద్ద వాటా వ్యవసాయం సహా ఇతర మూడు రంగాల్లో ఉన్నాయి. వ్యవసాయరంగంపై 62శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు.52 శాతం మంది రైతులకున్న భూమి అర హెక్టారు లోపలే.70 శాతం మంది రైతులకున్న భూమి హెక్టారు లోపలే.అభివృద్ధిగురించి మనం మాట్లాడుకు నేటప్పుడు ఈ వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మనకు పెద్ద మొత్తంలో సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. వీరు ఆదాయాలు పొందలేకపోతే ఆర్థిక వ్యవస్థ కూప్పకూలి పోతుంది. అందుకే రైతులకు చేయూనిచ్చి నడిపించడానికి,ఆర్బీకేలద్వారా,అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లను పెట్టడంద్వారా,రైతు భరోసా ద్వారా వారికి తోడుగా నిలుస్తున్నాం.ఉపాథి రంగంలో వ్యవసాయానిది ప్రముఖ పాత్ర. ఇక మరో కీలక రంగం ఎంఎస్‌ఎంఈలు. అతి భారీ,భారీ పరిశ్రమలవల్ల కేవలం3-4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయనుకుంటే ఎంఎస్‌ ఎంఈల్లో 30లక్షల మంది ఉద్యోగాలు చేస్తు న్నారు.ఎంఎస్‌ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది.వీటన్నింటికంటే ఎక్కడు మంది స్వయం ఉపాధి మార్గాల ద్వారా జీవిస్తున్నారు.1.5 కోట్ల మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేం వెనుక వీరి పాత్రే కీలకం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్ర మాల ద్వారా వీరికి చేదోడుగా నిలుస్తోంది. వారి స్వయం ఉపాధికి సహకారాన్ని అంది స్తోంది.ఉదాహరణకు చూసుకుంటే రాష్ట్రంలో కోటిమందికిపైగా మహిళలు స్వయం సహాయ సంఘాల్లో ఉన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్వయం సహాయక సంఘాల రుణ బకాయిలు,ఎన్పీఏలు 80 శాతం వరకూ ఉండేవి.ఇప్పుడు కేవలం 0.3శాతం మాత్రమే ఉన్నాయి. కోటిమంది మహిళలు దీనిపై ఆధారపడి ఉన్నారు. అలాగే కార్లు, వాహనాలు నడుపుతూ బతుకుతున్న వారిని వాహనమిత్ర ద్వారా చేదోడుగా నిలు స్తున్నాం. అలాగే కులవృత్తులు చేసుకుంటున్న నాయీబ్రాహ్మణులు,రజకులు, టైలర్లు వంటి వారికి కూడా ప్రభుత్వం చేదోడుగా నిలి చింది. ఆర్థికాభివృధ్ధిలో వీరందరిదీ కీలక పాత్ర. రాష్ట్రంలో ఇలా ప్రతి వర్గానికి కూడా చేయూత నందించేలా ప్రభుత్వం అనేక కార్య క్రమాలు చేపట్టింది. కోవిడ్‌ లాంటి సంక్షోభ సమయంలో కూడా ఎంఎస్‌ఎంఈలకు సకాలంలో ప్రోత్సాహకాలను విడుదలచేసి ప్రభుత్వం వారిని ఆదుకుంది. ఇది ఎంఎస్‌ ఎంఈల రంగాన్ని రక్షించింది. అందుకే ఈ రంగంలో వృద్ధి గతంతో పోలిస్తే గణనీయం గా ఉంది. 2018-19లో ఆర్థిక వృద్ధిరేటులో రాష్ట్రం చివరల్లో ఉంటే గత ఏడాది మొదటి ఐదు రాష్ట్రాల్లో నిలవడం దీనికి నిదర్శనం. భారత్లో తయారీ రంగం జీవీఏలో రాష్ట్ర తయారీ రంగం జీవీఏ 2019-24 మధ్య 4శాతంగా ఉంటే,2014-19 మధ్య కేవలం 2.9శాతం మాత్రంగా ఉండడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మరి ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శరవేగంగా ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ఇప్పుడు మనం ఆలోచన చేయాలి? వైజాగ్‌ విషయంలో మనం ఏం చేయాలి? వైజాగ్‌ అభివృద్ధి చరిత్రను మనం ఏరకంగా మార్చా లి? వచ్చే పదేళ్లలోగా మనం హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు లాంటి మహా నగరాలతో ఎలా పోటీపడాలి? అన్నదానిపై మనం దృష్టిపెట్టాలి. ఇదే విజన్‌ విశాఖకు అర్ధం, పరమార్థం కావాలి. ఈ ప్రాంతం పట్ల ఈ నగరం పట్ల అభిరుచి, అంకిత భావం, చిత్త శుద్ధి లేకపోతే ఈ విజన్‌అన్నది సాకారం కాదు, వాస్తవంలోకి రాదు. అన్నికంటే ముందు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఇక్క డకు వచ్చి నివాసం ఉండాలి. ఆది నేను అనగానే,మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు, సొంత ప్రయోజనాలు ఉన్న నెగెటివ్‌ మీడియా ఒక్కసారిగా బోరున విలపిస్తాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. వైజాగ్కు మారుస్తా న్నామంటే చాలు, ఇక్కడ భూముల కబ్జాచే యడానికి వస్తున్నారనీ, అది చేస్తున్నారనీ, ఇది చేస్తున్నారనే రక రకాల కథనాలు ప్రచురి స్తున్నారు, ప్రసారంచేస్తున్నారు.
సిగ్గులేకుండా ఇలాంటి రాతలు రాస్తున్నారు. సిగ్గులేకుండా చూపిస్తున్నారు.కోర్టులకువెళ్తున్నా రు. కేసులు వేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వాళ్లు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి విశాఖపట్నం రాకూడదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇక్కడకు వస్తే,ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్గా పురోగతి సాధిస్తుంది. అందుకే సీఎం ఇక్కడకు రాకూ దని అనుకుంటున్నాకు. దీనివెనుక మరోచోట వారికి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. అక్కడ రాజధాని ప్రకటనకు ముందే వేలాది ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. బినామీల పేర్లతో భూములు కొన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూ టివ్‌ క్యాపిటల్‌ అనగానే ఈ భూముల కొన్న వారంతా అక్కడ వారి భూముల రేట్లు తదు పరి పడిపోతాయని ఒక్కసారిగా భీతిల్లి పోయారు. వారి స్వప్రయోజనాల కారణంగా వైజాగ్‌ సందిగ్ధంలోకి వెళ్లాల్సి వచ్చింది.నేను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. మార్పులు అనేవి అనివార్యం. హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరులతో పోటీపడాలంటే వైజాగ్‌ అనేది ఎకనామిక్‌ ఇంజిన్‌-ఆర్థిక చోద కశక్తి కావాల్సిందే. నాకేమైనా స్వప్రయోజనం ఉంటే నేను కడప గురించి మాట్లాడేవాడిని. రాష్ట్రం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిదీ అనేది నా అభిప్రాయం.భవిష్యత్తు తరాలకు ఏది చేస్తే మంచిది,మన పిల్లలకు ఏం చేస్తే బాగుంటుంది,ఏం చేయడం వల్ల రాష్ట్ర ఆదాయాలు పెరుగుతాయి, దేని వల్ల ఆర్థికంగా పురోగమిస్తాం, అనేరకంగా మనం ఆలోచన చేయకపోతే,ఈ కోణంలో మనం వైజాగ్ను మనం ఆలోచించలేకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అన్నది మనం అంతా ప్రశ్నిం చుకోవాలి.
నాయకుడి దార్శినికత తప్పు అయితే…
నాయకుడి దార్శినికత నెగెటివ్‌ అయితే… వైజాగ్‌ వృద్ధిచెందదు,విస్తరించదు.దురదృష్టవ శాత్తూ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పట్నం కోసం ఎవరైనా నిలబడ్డారంటే..అది నేను మాత్రమే. ఇది వాస్తవం. విశాఖపట్నం కోసం ప్రతిపక్షాలతోనూ, స్వప్రయోజనాలున్న మీడియాతోనూ పోరాడుతున్నాం. వారిలో ప్రతి ఒక్కరూ కూడా విశాఖపట్నం కార్య నిర్వాహక రాజధాని కాకూడదని కోరుకుం టున్నారనేది వాస్తవం.వైజాగ్‌ తప్పనిసరిగా అభివృద్ధి చెందాలి. ఒకవైపు కోర్టు కేసులు నడుస్తున్నాయి, మరోవైపు విశాఖపట్నాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎన్నికలు ముగిసిన తర్వాత నేను విశాఖలోనే నివాసం ఉంటాను.నా ప్రమాణస్వీకారోత్సవం కూడా విశాఖలోనే జరుగుతుంది.వైజాగ్‌ పట్ల నాకు న్న కృతనిశ్చయం ఇది.
విశాఖ అభివృద్ధికోసం పదేళ్ల విజన్‌ఇది.
మనం ఈ నగరాన్ని ఓన్‌ చేసుకోవాలి. కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దాలి. దీనికోసం సాకారమయ్యేలా, వాస్తవ రూపంలో ప్రతింబింబించేలా వైజాగ్‌ కోసం మార్గదర్శక ప్రణాళిక రూందించాం.పెద్దగా కలలు కని, ఆచరణలో మాత్రం ఏమీ సాధ్యంకానట్టుగా కాకుండా వాస్తవిక దృక్పథంతో,అనుకున్నవన్నీ సాకారమయ్యేలా ఈ విజన్ను రూపొందిం చాం.పదేళ్లకాలంలో ఇవన్నీకూడా వాస్తవ రూపం దాలుస్తాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వ మే కాకుండా కేంద్ర ప్రభుత్వం,పీపీపీ పద్ధతు ల్లో, ప్రయివేటు రంగం వీరందరూ కూడా ఈ విజన్‌ సాకారంలో భాగస్వాములు అవుతారు. పదేళ్లకాలంలో హైదరాబాద్‌,బెంగుళూరు, చెన్నై నగరాలకు పోటీగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేలా ఈ విజన్‌ ఉంటుంది.రాజధానిగా అమరావతి ఆలోచనను నేను ఎందుకు వ్యతిరేకించాలి? అలాంటి వ్యతిరేకత కూడా నాకేమీ లేదు. పైగా శాసన రాజధానిగా అమరావతిని ప్రటించిందీ, నిర్ణయించిందీ నేనే. కర్నూలును కూడా న్యాయరాజధానిగా ప్రకటించిందీ నేనే. నాకేం ఎలాంటి వ్యతిరే కతా లేదు. కాని వాస్తవం ఏంటంటే.., అమ రావతి అనేది 50వేలఎకరాల వర్జిన్‌ ల్యాండు, ఖాళీ భూమి. రోడ్లు,నీళ్లు,విద్యుత్‌ లాంటి కనీస సదుపాయాలు కల్పించడానికి మాత్రమే వాళ్లు ఇచ్చిన డీపీఆర్‌ ప్రకారమే ఎకరాకురూ.2కోట్లు ఖర్చు అవుతుంది. అమరావతి ప్రాంతంలో భవనాలు రావాలంటే దానికి ముందు కనీ సంగా రూ.1లక్ష కోట్లు పైనే ఖర్చు చేయాల్సి వస్తుంది.ఇవాళ మనం ఒకలక్ష కోట్లు అనుకుంటే..20 ఏళ్లలో ఏటా రూ.5వేల కోట్లు చొప్పున వేసుకుంటే సుమారుగా 10 లక్షల కోట్లో, అది చివరకు ఖర్చులు పెరిగీ, పెరిగీ ఏరూ.15లక్షల కోట్లో అయినా అవు తుంది. అందుకనే అమరావతి ఆలోచనకు నేను వ్యతిరేకం కాదు, కాకపోతే అక్కడ అది చేయలేం అంటున్నాం.
కాని వైజాగ్‌ విషయానికొస్తే.. కనీస మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. మంచి రోడ్లు, కరెంటు,తాగునీటి సదుపాయం.. ఇలా అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కొన్ని మెరుగులు దిద్దితే సరిపోతుంది. వీటితో సిటీ రూపురేఖలు గణనీయంగా మారుతాయి. కార్యనిర్వాహక రాజధానిగా ఇక్కడకు మారే సమయంలో ఉద్యోగులు పనిచేసుకునేందుకు ఐకానిక్‌ సెక్రటేరియట్‌ ఒకటి ఉండాలి. ఇది దేశం దృష్టిని ఆకర్షించాలి.అలాగే దేశం అంతా ఇటు చూసేలా ఐకానిక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌,అలాగే అహ్మదాబాద్‌ తరహాలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఉండాలి. మ్యాచ్లు జరిగేటప్పుడు దేశం మొత్తమే కాదు, ప్రపంచం మొత్తంకూడా మాట్లాడుకోవాలి. ఇవన్నీవస్తే ప్రపంచంలో వైజాగ్‌ స్ధాయి పెరుగుతుంది.దేశం మొత్తమే కాదు, ప్రపం చం మొత్తం సంభ్రమాశ్చర్యంతో చూస్తుంది. ప్రపంచ ఆధునిక సాంకేతిక రంగంలో అంశా లను బోధించేలా ఎమర్జింగ్‌ టెక్నాలజీ యూని వర్శిటీ ఒకటి రావాల్సి ఉంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలో మన విద్యార్థులకు ఇది చక్కటి వేదిక కావాలి. అలాగే భోగాపురం ఎయి ర్పోర్టు నిర్మాణం శరవేంగా సాగుతోంది.15-18 నెలల్లో పూర్తిచేయడానికి చాలా వేగంగా పనిచేస్తున్నారు.భోగాపురం ఎయిర్‌ పోర్టును అనుసంధానించేలా ఆరు లేన్లతో అందమైన బీచ్‌ కారిడార్‌ రోడ్డు ప్రాజెక్టు కూడా రావాల్సి ఉంది.అలాగే మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌,ఏడాది కాలంలోగా ప్రారంభమయ్యే మూలపేట పోర్టు.దీంతో మొత్తం హారిజాంటల్‌ గ్రోత్‌ కారిడార్‌ ఏర్పడుతుంది. అలాగే డేటా సెంటర్‌, సబ్మెరైన్‌ కేబుల్‌ రూపంలో పెద్ద పెట్టుబడులు అదానీ పెడుతుంది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినవన్నీ చేశాం. వచ్చే 5-6 ఏళ్లలో విడతల వారీగా ఈప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే ఆతిథ్య రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయి. ఓబరాయ్‌, మై ఫెయి ర్‌ కూడా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. బెస్ట్‌ ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలు రాబోతున్నాయి. అలాగే ఎన్టీపీసీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ రూపంలో రూ.30వేల కోట్ల పెట్టుబడులు రాబోతు న్నాయి. ప్రధానమంత్రి నిన్ననే దీనికి శంకు స్థాపన చేశారు. ఇవన్నీ కూడా సాధ్యం కానివి కాదు. ఇవన్నీకూడా వాస్తవరూపంలోకి వచ్చేవే. వచ్చే పదేళ్లలో ఇవన్నీ రాబో తున్నాయి. ఇవేమీ ఊహించలేనివి కూడా కాదు. ఇవన్నీకూడా సాకారమయ్యేవే. అలాగే హైస్పీడ్‌ రైలు కారిడార్లపై కూడా ప్రధాన మంత్రితో మాట్లాడుతున్నాం. హైదరాబాద్‌-వైజాగ్‌,విజయవాడ-బెంగళూరుల మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లకోసం సంప్రదిస్తున్నాం. ఇవన్నీరావమే కాకుండా, సీఎంకూడా ఇక్కడకు వస్తే పదేళ్లకాలంలో వైజాగ్‌ ప్రపంచంలోని, దేశంలోని అత్యుత్తమ నగరాలతో పోటీ పడుతుంది. ఇన్ని అడ్డంకులు ఉన్నా, అవరో ధాలు ఉన్నా విశాఖ నగర వాసులకు నేను ఒక్కటే చెప్తున్నాను.మనం తప్పక విజయం సాధిస్తాం.విశాఖపట్టణంలోని వి-కన్వెన్షన్‌ హాలులో జరిగిన భవిత కార్యక్రమంలో భాగంగా ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ ద్వారా శిక్షణ పొంది ప్రయివేటు రంగాల్లో ఉపాధి పొందిన యువత తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. విద్యా దీవెన,వసతి దీవెనల సాయంతోనే చదువుకున్నాం ః దీపిక,గ్రాడ్యు యేట్‌ ఇంజినీర్‌ ట్క్రెనీ, రాయల్‌ ఎన్ఫీల్డ్‌ మోటర్‌ కంపెనీ,చెన్నై. మాది విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను.మా నాన్న ఫోర్క్‌ లిఫ్ట్‌ ఆపరేటర్‌. అమ్మగృహిణి.నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకు న్నాం.నేను నా గ్రాడ్యు యేషన్‌ పూర్తయిన తర్వాత ఆటోమేషన్‌ రంగంలో స్ధిరపడాలని భావించాను.సీడాప్‌ ద్వారా స్కిల్‌ కాలేజ్లో జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సు నేర్చుకున్నాను. మాకు అక్కడ మంచి శిక్షణ ఇచ్చారు. మాకు టెక్నికల్‌ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ కూడా నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్కు ఎంపికయ్యాను. రాయల్‌ ఎన్ఫీల్డ్‌ కంపెనీలో నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ఆ కంపెనీలో గ్రాడ్యు యేట్‌ ఇంజినీర్‌ ట్క్రెనీగా సెలక్ట్‌ అయ్యాను. మా బ్యాచ్లో అనేక మంది వివిధ కంపెనీలకు సెలక్ట్‌ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి,ఏపీ ప్రభుత్వా నికి, స్కిల్‌ డెవల ప్మెంట్కు, సీడాప్కు అందరికీ కృతజ్ఞతలు.నేను మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తి చేశాను. అప్పుడు ఏపీ ఎస్‌ఎస్డీసీ స్కిల్‌ ట్క్రెనింగ్‌ ప్రోగ్రామ్‌ లో 45రో జులు శిక్షణ తీసుకు న్నాను. ఆ శిక్షణలో నేను చాలా నేర్చుకు న్నాను.మెషిన్‌ ఆపరేటింగ్‌, సాప్ట్స్కిల్స్‌, కమ్యూ నికేషన్‌ స్కిల్స్‌ నేర్పారు. -జిఎన్‌వి సతీష్‌

చిత్తడి నేలను కాపాడుకుందాం

జీవ వైవిధానికి నెలవులుగా గుర్తింపు పొందిన చిత్తడి నేలలు ఎక్కువ లోతు లేకుండా వివిధ జంతు, వృక్ష జాతులకు అవాసాలుగా ఉంటాయి. ఎన్నో రకాల చేపలు,పక్షులకు ఆహారాన్ని సమకూరుస్తూ.. వాటి సంతానోత్పిత్తికి, అవాసాలకు అవి ప్రధాన ఆధారా లుగా నిలుస్తున్నాయి. రామ్‌సర్‌ అంతర్జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ ఒప్పందం ప్రకారం ప్రవహించే లేదా స్థిరమైన నీటిని కలిగి ఉన్న ప్రాంతాలన్నీ చిత్తడి నేలలే.2014కు ముందు రామ్‌సర్‌ జాబితాలోని చిత్తడి నేలలు దేశీయంగా 26 మాత్రమే ఉండేవి. ప్రస్తుతం అవి 75కి చేరినట్లు ఇటీవల మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వాటి పరిరక్షణ ప్రయ త్నాల్లో స్థానిక ప్రజలు ఎప్పుడూ ముందు వరసలో ఉం టున్నట్లు తాజా బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశంసించారు.
అడవులను ప్రకృతికి శ్వాసకోశాలుగా పరిగణిస్తే,చిత్తడి నేలలను మూత్రపిండాలుగా అభివర్ణిస్తారు.అవి నీటి నుంచి వ్యర్ధాలను తొలగించి శుద్ది చేస్తాయి.భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. సముద్ర తీర స్థిరీకరణ,వరదల నియంత్రణ వంటి ఎన్నో సేవలను చిత్తడినేలలు అందిస్తాయి.అధిక వర్షాలవల్ల వచ్చే నీటిని స్పాంజిమాదిరిగా అవిశోషించుకొని వరదలను నియంత్రిస్తాయి.ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలకు మత్స్యసంపద ద్వారా ఆహార భద్రతను, జీవనోపాధులను చిత్తడి నేలలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం మనుగడ అత్యంత ప్రమాదంలో పడిన ఆవరణ వ్యవస్థలుగా వాటిని పరిగణిస్తున్నారు. చిత్తడి నేలలు కలుషితమైన నీటి నుండి నైట్రోజన్‌ మరియు ఫాస్పరస్‌ వంటి వ్యర్థా లను గ్రహించి కిడ్నీలాగా శుభ్రపరిచే కీలకమైన పర్యావరణ వ్యవస్థ సేవను అందిస్తాయి. కాబట్టి, మనం మన అవయవాలను జాగ్రత్తగా చూసు కున్నట్లే, ఈకీలక పర్యావరణ వ్యవస్థలను భవిష్యత్తు కోసం కాపాడుకోవడం మన బాధ్యత.మరియు ఈ ప్రాథ మిక కర్తవ్యాన్ని మనకు గుర్తు చేయడానికి ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం ఇక్కడ ఉంది.నీరు భూమి లో కలిసేచోట చిత్తడి నేల ఏర్పడుతుంది. సరళం గా చెప్పాలంటే, ఇది ప్రధానంగా సంతృ ప్తమైన లేదా శాశ్వతంగా లేదా కాలానుగుణంగా నీటితో నిండిన భూభాగం.చిత్తడినేలలు,చెరువులు, సరస్సులు, ఫెన్స్‌,నదులు,వరద మైదానా లు,చిత్తడి నేలలను కలిగి ఉన్న లోతట్టు చిత్తడి నేలలు, సముద్రతీర చిత్తడినేలలు,వీటిలో ఉప్పునీటి చిత్తడి నేలలు,ఈస్ట్యూరీలు,మడ అడవులు మరియు మడుగులు ఉన్నాయి.మానవ నిర్మిత చిత్తడి నేలలు కొన్ని చేపలచెరువులు, వరి వరిపంటలు మరియు సాల్ట్‌పాన్‌లు.భారతదేశం వంటి ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో,చిత్తడి నేలలు మిలియన్ల మంది మానవులు మరియు వన్యప్రాణుల దా హాన్ని తీర్చే మంచినీటి యొక్క ప్రముఖ వనరులు. భూమిపై జీవాన్ని నిలబెట్టేది నీరు! అయినప్పటికీ, ఈజీవితపు అమృతం కనుమరుగవుతోంది, అందువల్ల,అనేక నగరాలు దానిలోని ప్రతి చుక్కను రక్షించడానికి పెనుగులాడుతున్నాయి. సర్వత్రా ఉన్నప్పటికీ,సంభాషణ పరంగా చిత్తడి నేలలు తరచుగా విస్మరించబడతాయి.నీటి విపత్తు అదృ శ్యంపై,చిత్తడి నేలలపై కన్వెన్షన్‌ సెక్రటరీ-జనరల్‌ మార్తా రోజాస్‌ ఉర్రెగో,‘‘మేము తీవ్రపరిణా మా లతో నీటి సంక్షోభంలో ఉన్నాము మరియు చిత్తడి నేలలు దాని తీర్మానానికి కేంద్రంగా ఉన్నాయి’’ అని నొక్కి చెప్పారు.‘‘భూమిపై ఉన్న నీటిలో ఒకశాతం కంటే తక్కువ మంచినీరు ఉపయోగ పడుతుంది మరియు ఎక్కువగా నదులు, ప్రవా హాలు, సరస్సులు, చిత్తడి నేలలు, ఈస్ట్యూరీలు మరియు జలాశయాలు వంటి చిత్తడి నేలలలో నిల్వ చేయబడుతుంది. మనం ప్రతిరోజూ కనీసం 10 బిలియన్‌ టన్నుల మంచినీటిని వినియోగి స్తాము-భూమి తిరిగి నింపగలిగే దానికంటే ఎక్కువ. అయినప్పటికీ, 2050 నాటికి 10 బిలి యన్ల జనాభాకు 55% ఎక్కువ నీరు అవసరం అవుతుంది.ఈ దిశగా, ప్రపంచ నాయకులు ఫిబ్రవరి 2,1971న ఇరాన్‌లో రామ్‌సర్‌ కన్వె న్షన్‌గా పిలవబడే చిత్తడి నేలలపై కన్వెన్షన్‌పై సంతకం చేయడం ద్వారా భవిష్యత్‌ తరాలకు మరియు భూమి కోసం చిత్తడి నేలలను పరిరక్షిం చాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ చారిత్రాత్మక ఒప్పం దాన్ని ఆమోదించడం ప్రతి సంవత్సరం ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తించబడిరది. ప్రపంచవ్యాప్తంగా, రామ్‌సర్‌ కన్వెన్షన్‌ ద్వారా దాదాపు 2300 చిత్తడి నేలలు గుర్తించబడ్డాయి. ఈరోజు 50వసంవత్సర వేడుకలకు అంకితమైన థీమ్‌ ‘వెట్‌ల్యాండ్‌ అండ్‌ వాటర్‌’.ఈ ముఖ్యమైన మంచినీటి వనరుపై అవగాహన పెంచడం థీమ్‌ లక్ష్యం. అంతేకా కుండా, ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల నష్టాన్ని పునరుద్ధరించడానికి మరియు ఆపడానికి వారి నమ్మకాన్ని పునరుద్ఘాటించాలని కూడా ఈ రోజు ప్రజలను కోరింది.
భారతదేశంలో,చిత్తడి నేలలు 15. 26 మిలియన్‌ హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయని అంచనా వేయబడిరది,ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో4.63%కి సమానం.1982లోభారత ప్రభుత్వం సంతకంచేసిన రామ్‌సర్‌ కన్వెన్షన్‌ కింద ఇవి రక్షించబడ్డాయి.రామ్‌సర్‌ కన్వెన్షన్‌ కింద, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన 37చిత్తడి నేలలకు భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. భారత దేశం కూడా అతిపెద్ద రామ్‌సర్‌ సైట్‌లలో ఒకటిగా ఉంది,అంటే సుందర్‌బన్స్‌ 4,230 చద రపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. భారతదేశం కూడా విభిన్న రకాల చిత్తడి నేలలకు ఆతిథ్యం ఇస్తుంది, వీటిలో ముఖ్యమైనవి గంగా మరియు బ్రహ్మపుత్ర వంటి నదుల వరద మైదానాలు,హిమాలయాల ఎత్తైన ప్రాంతాలు, మడుగులు మరియు తీరప్రాంతంలోని మడ చిత్తడి నేలలు. అయితే గత నాలుగు దశాబ్దా లుగా దేశం దాదాపు మూడిరట ఒకవంతు చిత్తడి నేలలను కోల్పోయినందున ఈవిలువైన పర్యా వరణ వ్యవస్థ ముప్పులో పడిరది.
చిత్తడి నేలలకు ముప్పు
పట్టణీకరణ,వ్యవసాయ విస్తరణ, ఆనకట్టల నిర్మాణం,సిల్టేషన్‌, వాతావరణ మార్పు, పర్యాటకం కోసం భూమిని క్లియరెన్స్‌ చేయడం, ఆక్రమణ జాతులు మరియు కాలుష్యం కార ణంగా అత్యంత ఉత్పాదక చిత్తడి నేలలు అంచున ఉన్నాయి.ఈపైన పేర్కొన్న కారణాలవల్ల, 1700 ల నుండి భూమి దాదాపు 87% సహజ చిత్తడి నేలలను కోల్పోయిందని అంచనాలు సూచిస్తు న్నాయి, అయితే వాటిలో దాదాపు 35% 1970ల నుండి కోల్పోయింది.అడవుల కనుమరు గయ్యే రేటుతో పోలిస్తే చిత్తడి నేలలు మూడిర తలు వేగంగా కనుమరుగవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రామ్‌సర్‌ కన్వెన్షన్‌ కింద ప్రణా ళిక చేయబడిన చర్యలు అమలు చేయకపోతే, రాబోయే సంవత్సరాల్లో భూమి మరో ముఖ్యమైన మంచినీటి వనరులను కోల్పోవచ్చు. వరదలు, అలలు మరియు కరువుల వంటి విపత్తుల ప్రభా వాన్ని తగ్గించడంలో ఈ వనరులు కీలక పాత్ర పోషిస్తాయి మరియు పోషకాలు మరియు రసాయ నాలను రీసైకిల్‌ చేస్తాయి. వారు మట్టిలో కార్బన్‌ నిల్వ చేయడానికి ప్రసిద్ధి చెందారు, ఇది వాతా వరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడుతుంది.ప్రపంచవ్యాప్తంగా,చిత్తడి నేలలు ఏడాది పొడవునా విభిన్న వృక్షజాలం మరియు జంతుజాలం,జాతులకు హాట్‌స్పాట్‌. అందువల్ల, అవి మన గ్రహం యొక్క మొత్తం శ్రేయస్సు,వనోపాధికి ముఖ్యమైనవి. తగ్గిన కాలు ష్యం,వ్యర్థాల ఉత్పత్తి వ్యక్తిగత స్థాయిలో సహాయ పడగలిగినప్పటికీ, మెరుగైన విధానం మరియు నియంత్రణ కోసం ఒత్తిడి చేయడం ద్వారా దేశ స్థాయిలో ప్రకృతిఈ విలువైన బహుమతులను సంరక్షించవచ్చు.
జల, వృక్ష సంపదకు కొల్లేరు ఆలవాలం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు చిత్తడి నేలలకు ఎంతో ప్రాముఖ్యత సంత రించుకుంది. ఇటువంటి నేలను, ప్రకృతిని కాపా డితే అది భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుందని కొంతమంది గుర్తించలేకపోతు న్నారు. సృష్టిలో సహజసిద్ధంగా మానవాళి మనుగడ కోసం ఏర్పడిన సంపదను విస్మరిస్తున్నారు. ప్రపంచ దేశాలుసైతం పర్యావరణాన్ని పరిరక్షిం చండి, ప్రకృతిని కాపాడడండి అంటూ పదేపదే హెచ్చరిస్తున్నా వాటి వినాశనానికి చేసే వికృతి చేష్టలు తగ్గలేదు. సహజసిద్ధంగా ఏర్పడిన సంప దను రక్షించడంలో ప్రభుత్వాలు విఫలమవుతు న్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన ఏకైక చిత్తడి నేలలు ఏలూరు జిల్లాలో విస్తరించిన 77,136 ఎకరాలు కొల్లేరు సరస్సు మాత్రమే.ఈ చిత్తడి నేలలు అనేక జీవరాశులకు, పక్షులకు ఎంతో మేలు చేస్తుంటాయి. అందువల్లే ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన పక్షులు వలసవస్తున్నాయి.ప్రపంచంలోని 164 దేశాలు చిత్తడినేలల పరిరక్షణకు ఒప్పంద సంతకాలు చేశాయి. వీటిలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది.2002 సంవత్సరంలో కొల్లేరును రామ్‌సర్‌ సైట్‌లోనికి తీసుకున్నారు. భారతదేశంలో 21 రాష్ట్రాల్లో 46 ప్రాంతాలను చిత్తడినేలలుగా గుర్తించారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రంలో పలు రకాల పోటీలు నిర్వహించి ఈనేలల విశిష్ట తను విద్యార్థులకు తెలియజేస్తూ ఉంటారు.
చిత్తడి నేలల ప్రాధాన్యం
సముద్రం, నది ఇతర నీటి వనరుల తీర ప్రాంతాల్లో లోతు తక్కువ ఉండి ఎక్కువ కాలం నీటినిల్వ ఉండే భూములను చిత్తడి నేలలు అంటారు. మంచినీటి సరస్సులు, ఉప్పునీటి సర స్సులు,మడ అడవుల తీరప్రాంతాలన్నీ చిత్తడి నేలలే. అరుదైన మొక్కలు, పక్షులు, జంతువులు, చేపలు గుడ్లుపెట్టడానికి ఈనేలలు చాలా అను కూలం.నీటి నాణ్యతను పెంచడంలో, కాలు ష్య కారకాలను గ్రహించడంలో ఈచిత్తడినేలలు ప్రాధాన్యత పోషిస్తాయి. మానవ తప్పిదాలతో పర్యావరణానికి చాలాహాని జరుగుతుంది. ప్రజలు వ్యవసాయ, ఆక్వా అవసరాలకు ఈ భూములను ఆక్రమించుకుని రసాయన ఎరువులు వాడడం వల్ల నివాసయోగ్యానికి ఈ నేలలను పూడ్చడంతో చిత్తడి నేలలు విధ్వంసానికి గురవు తున్నాయి. ప్రపంచం పరిశ్రమల కోసం ఈ చిత్తడి నేలలు కేటాయించడంతో మరింత వినాశనానికి దారితీస్తున్నాయి.
కొల్లేరును కాపాడే ప్రయత్నాలు నిల్‌..
పేరుకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సుగా గుర్తించినప్పటికీ ఎక్కడచూసినా ఆక్రమణల పర్వమే. 2006లో కొల్లేరు ప్రక్షాళన కోసం ఆపరేషన్‌ నిర్వహించినప్పటికీ దానిని పూర్తి స్థాయిలోవినియోగంలోకి తీసుకురాలేకపోయారు. మళ్లీ చెరువులు తవ్వ కాలు చేపట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసు కోవడంతోపాటు ఈ అక్రమ చేపల చెరువు గట్ల వల్ల ఎగువ నుంచి కొల్లేరులోకి నీరు రావడం లేదు. దీంతో ప్రతి ఏడాది చిత్తడినేలలు కాస్తా ఎడారిగా మారి సహజజాతి మత్య్స సంపద అంతరించిపోతుంది. అధికార రాజకీయ నాయ కుల ఒత్తిడితో అటవీశాఖ అక్రమార్కులపై చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా చిత్తడినేలలను పరిరక్షించుకుంటే మానవాళికి ఎంతో దోహదపడుతుందని, వీటి పరిరక్షణ చర్య లు చేపట్టాలని పలువురు పర్యా వరణ ప్రేమికులు కోరుతున్నారు.
అవగాహన అంతంత మాత్రమే
కొల్లేరు చిత్తడి నేలలకు అనువైన ప్రదేశం అయినప్పటికీ వీటి పట్ల ప్రజల్లో అవగాహన, ప్రభుత్వ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే సాగుతూ ఉంటాయి. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో కొల్లేరు విశిష్టతను తెలిపేందుకు పక్షుల పండుగ, సంప్రదాయకమైన తాటిదోనెల పోటీలను నిర్వహించేవారు. వీటితోపాటు ఫిబ్రవరి 2న పలు ప్రభుత్వ, ప్రై వేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు చిత్తడినేలల ప్రాముఖ్యతపై వ్యాసరచన, డిబేట్‌, డ్రాయింగ్‌ పోటీలను నిర్వహించేవారు. ప్రస్తుతం అయితే విద్యార్థులకు పోటీలు మాత్రమే నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఈనేలల ప్రాముఖ్యతను కొల్లేరు పరివాహక ప్రాంత ప్రజలకు తెలియజేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
చిత్తడి నేలలను పరిరక్షించాలి..
చిత్తడి నేలలు పర్యావరణానికి, ప్రజలకు, అనేక జీవరాశులకు ఎంతో దోహదపడుతాయి. వీటిని కాపాడుకునేందుకు కృషి చేయాలి. చిత్తడి నేలల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వీటిని సంరక్షించుకునే చర్యలను ప్రభుత్వం, ప్రజలు తీసుకోవాలి.
-చింతపల్లి వెంకటనారాయణ,సాహితీవేత్త, కొల్లేరు వాసి – (జి.ఎ.సునీల్‌ కుమార్‌)

1 2 3 9