పట్నం..పల్లెలు..కన్నీటిమయం

వర్షం విలయం సృష్టించింది.మిన్నుమన్నూ ఏకమైనట్టుగా కుంభవృష్టి కురడంతో విజయ వాడలో జనజీవనం అతలాకుత లమైంది. వానలకు వాగులు,వంకలు పొంగిపోర్లి కాలనీల్లోని లోతట్టు ప్రాంతా లను ముంచెత్తాయి. పధానంగా విజయ వాడ నగరపాలక సంస్థలకు భారీ నష్టం వాటిల్లింది.నగర శివారు ప్రాంతాలు, పలు కాలనీలు నీట మునిగాయి.నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుడ మేరు ప్రభావిత ప్రాంతాలు, కాలనీలు, చెరువులను తలపిస్తున్నాయి.శివారు ప్రాంతాలవారు పడవల్లో ప్రయాణిస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో దాదాపు 5`7అడుగుల మేర వరదనీరు చేరగా,ప్రధాన, అంతర్గత రహదారులపై నాలుగు అడుగల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది.ప్రజలు బయటకు వచ్చేందుకు అవకాశం లేక,నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు వీలులేక బిక్కుబిక్కుమని ఇళ్లలోనే కాలం గడుపుతు న్నారు. వరదనీరు పెరుగుతూ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ చేరడంతో విద్యుత్తు సరఫరా ఆపేశారు. దీంతో అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి.ఎత్తయిన భవనాల్లో చిక్కుకు పోయినవారు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రులు, అధికారులు ప్రతిక్షణం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు.సహాయక చర్యలు ఆశాజనకంగా లేక ఆందోళన చెందుతున్నారు.చాలామంది ఇళ్లలోనే ఉండ పోియి అవస్థలు పడుతున్నారు.
భారీ వర్షాలకు విజయవాడ అస్తవ్యస్తం అయ్యింది. వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.గత 30ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో రికార్డ్‌ వర్షపాతం నమో దైంది.బుడమేరు పొంగడంతో పలు కాలనీలు నీట మునిగాయి.నగరంలో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదైంది.ఒక్క రోజే 29సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలి పింది.భారీ వర్షాలకు నగర జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కాలనీలు,ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింది.బాధితులు సాయం కోసం ఎదురుచూ స్తున్నారు.విజయవాడను వరదనీరు ముంచెత్తింది. బుడమేరు ఉప్పొంగుతోంది.దీంతో బడమేరు 11 గేట్లు ఎత్తివేశారు.కవులూరు వద్ద బుడమేరు కట్ట తెగి వరదనీరు కాలనీల్లోకి ప్రవేశిస్తుంది.
రికార్డు స్థాయిలో వర్షాలు
విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో 30ఏళ్ల రికార్డు బద్దలైంది. చరి త్రలో ఎన్నడూ లేనంతగా..ఒకేరోజు (ఆగస్టు 31 శనివారం) 29సెంటి మీటర్ల వర్షపాతం నమో దైంది.అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది.ఆటోనగర్‌ నుంచి బెంజి సర్కిల్‌ వరకు వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. సెప్టెంబర్‌ 1న కూడా బెజవాడలో భారీవర్షాలు కురువడంతో బెజవాడ గజగజ వణికిపోతోంది.
ముంపులో కాలనీలు :విజయవాడ,గుంటూరు నగరాల్లో అనేక కాలనీలువరద నీటిలో నాను తున్నాయి.అపార్ట్‌మెంట్లసెల్లార్లలోకి వర్షపు నీరు చేరి,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలు బయటపెట్టలేని పరిస్థితి నెల కొంది.నగర శివార్లలోని కండ్రిగ వద్ద రహ దారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది నివాసాలు నీటము నిగాయి.రైల్వేట్రాక్‌ అండ ర్‌పాస్‌ వద్ద 4బస్సులు నీట మునగగా క్రేన్ల సాయంతో అధికారులు… బస్సులను బయటకు తీశారు.మైలవరంలో వెలగలేరు గేట్లుఎత్తి వేశారు.దీంతో చుట్టుపక్కల కాలనీ ల్లోకి వరద నీరు చేరింది.రాజరాజేశ్వరి పేట వరద నీటిలో చిక్కుకుంది.
బుడమేరు ఉగ్రరూపం
సరిగ్గా20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపునకు గురైంది.వాగులు,వంకలు ఆక్రమ ణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది.20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్‌ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో నేడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు.20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగం గా విస్తరించడం,బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతోదశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది.2005లో చివరి సారి బుడమేరు బెజ వాడ పుట్టిముంచింది.2005సెప్టెంబర్‌లో వచ్చి న భారీ వర్షాలతో నగరం అతలాకు తలమైంది. విజయవాడ మూడొంతులు ముంపు నకు గురైంది. వరదల కారణంగా విజయవాడ లో కార్పొరేషన్‌ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపం తో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్త డంతో అదంతా విజయవాడను ముం చెత్తింది. తాజాగా బుడమేరు పొంగడంతో సింగ్‌నగర్‌, చిట్టీనగర్‌,ఇతర కాలనీలు జలది గ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై 5అడుగుల మేర నీరు నిలిచిపోయింది.
ప్రకాశం బ్యారేజీ
కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఇన్‌ ఫ్లో ,ఔట్‌ ఫ్లో 7,69,443 క్యూసెక్కులు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.వాగులు, వంకలు పొంగిపోర్లుతాయని,ప్రజలు అప్రమ త్తంగా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమ త్తంగా ఉండాలన్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
రాజధాని ప్రాంతం
అమరావతి ప్రాంతంలో వరద నీరు చేసింది. చాలా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కరకట్ట సమీపంలోకి వరదనీరు చేరుతోంది. హైకోర్టుమార్గంలో వరదనీరు చేరింది.విజయ వాడలో గత రెండు రోజులుగా కురిసిన కుండ పోత వర్షాలకు రోడ్లు చెరువులను తలపి స్తున్నా యి. మురుగు నీరురోడ్లపై ప్రవహిస్తోంది. వరద నీటిలో కార్లు,ద్విచక్రవాహనాలుకొట్టుకు పోయా యి. 30ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయ వాడ విలవిల్లాడిరది.పాతబస్తీ,బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు,జాతీయ రహదారి,ఆటో నగర్‌ లో భారీ వరద పోటెత్తింది.విజయవాడ సమీ పంలోని జాతీయరహదారుల నీటిలో చిక్కు కుపోయాయి.
మొగల్రాజపురం ప్రమాదం
విజయవాడలోని మొగల్రాజపురం వద్ద ఆగస్టు 31న కొండచరియల విరిగిపడ్డాయి. ఈ ఘట నలో ఐదుగురు మృతి చెందారు. అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు.పడిపోయిన కొండ రాళ్లను డ్రిల్లింగ్‌ చేసి, భారీ క్రేన్లతో శిథిలాల తొల గింపు ప్రక్రియ చేపట్టారు. భారీ వర్షాల కారణంగా కొండ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.మొగల్రాజపురం మృ తుల కుటుంబాలకు ప్రభుత్వంరూ.5లక్షల పరిహారం ప్రకటించింది.
ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు
విజయవాడలో భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రొటోకాల్‌ ఆఫీస్‌,డోనర్‌ సెల్‌ ధ్వం సం అయ్యాయి.ఈప్రదేశంలో భక్తులు లేకపో వడంతో ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి ఘాట్‌ రోడ్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఘాట్‌రోడ్‌ను మూసివేశారు.
రాయనపాడు ఘటన
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభా వంతో ఏపీలోభారీ నుంచి అతిభారీ వర్షాలు కురు స్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విజయవాడ లోని బుడమేరు వాగు పొంగటంతో నగర ఔటర్‌ పరిధిలో ఉన్నరాయనపాడు రైల్వేస్టేషన్‌లోకి భారీ గా వరదనీరువచ్చిచేరింది రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిం చారు.ఆరో బెటాలియన్‌ ఎస్డీఆర్‌ఎఫ్‌ రెస్కూ టీమ్‌ రంగంలోకి దిగిసహాయక చర్యలను చేప ట్టింది.రాయనపాడులో నిలిచి పోయిన తమిళ నాడు ఎక్స్‌ ప్రెస్‌లోని ప్రయాణికులను రక్షించి, విజయవాడస్టేషన్‌కు తరలించారు. ప్రయాణికు లను ప్రత్యేక రైలులో తమిళనాడుకు తరలి స్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎంపర్యటన
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంద రికీ సాయం అందు తుందని చంద్రబాబు వివ రించారు.సీఎం మాట్లాడారు.ఈ క్రమం లోనే వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్‌ చేరుకున్నాయి.వీటి ద్వారా సింగ్‌నగర్‌ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేశారు. మరో వైపు ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి.మరోవైపు ప్రైవేట్‌ హోటల్స్‌,దుర్గగుడి,అక్షయపాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చింది. నిరంతర పర్య వేక్షణతో అధికారులుఆహారం సిద్దం చేసి పంపిణీ చేపట్టారు.ఎవ్వరూ ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని,అందరికీ సాయం అందు తుందని పేర్కొన్నారు.మూడు పూటలా బాధితు లకు ఆహారం అందించాలని చెప్పారు.చిన్నా రులు,గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు.ఒకేప్రాంతంలో కా కుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లా లన్నారు. -గునపర్తి సైమన్‌

అంబరాన్నింటిన ఆదివాసీ సంబరాలు

‘‘ గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలోనే చనిపోతున్నారు.పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మించుకోవాలి.ఏపని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆదివాసీల్లో పేదరికం ఎక్కువగా ఉంది…వారిని అన్ని విధాలా పైకి తీసుకొచ్చేందుకు నేను తప్పకుండా శ్రద్ధ తీసుకుంటా. రాబోయే ఐదేళ్లలో నిర్థిష్ట ప్రణాళికతో పేదరికాన్ని తగ్గిస్తాం. పేరుకు పథకాలు ఇవ్వడం కాదు…వాటి ఫలితాలు ఇచ్చేలా ఉండాలి. చేసే ప్రతి ఒక్క పనితో గిరిజనుల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొస్తాం.ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ గురించి మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో డోలీ మోతలు కనబడటం చాలా బాధగా ఉంది. నేను రాజకీయ వివక్ష చూపించను…కక్ష సాధింపులకు పాల్పడను. కానీ రాష్ట్ర ప్రజల ఖజానాను, ఆస్తులను దోచిన వారిని శిక్షిస్తా. దోచిన సొమ్మును రికవరీ చేసి పేదలకు ఖర్చు పెడతా.ఈ రోజు నుండి చైతన్యం 2.0ప్రారంభమైంది.ఈ 2.0 చైతన్యం ఎక్కడ పేదవాడుంటే అక్కడికొచ్చి మీకు కావాల్సిన వనరులు ఇచ్చి పేదరికం నుండి బయటకు తీసుకొస్తాం. మీ జివితాల్లో వెలుగులు రావాలని కోరుకుంటున్నా..’’ `- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆగష్టు 9న జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సంబరాలు అంబరాన్నింటాయి.అంత ర్జాతీయ గిరిజన దినోత్సవం వేళ రాష్ట్రం లోని గిరిజనులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది ప్రభుత్వ సిద్ధాం తాలల్లో ఒకటని గుర్తు చేశారు. అందుకే నాటి తెలుగుదేశం హయాంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివాసీ దినోత్సవానికి హాజరైన సీఎం గిరిజ నులతో మమేకమయ్యారు.మంత్రి గుమ్మడి సంధ్యారాణి,ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజనులతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం చేశారు.అనంతరం గిరిజనుల వద్దకు వెళ్లి వారిని పలకరించి, వారితో మమేకమయ్యారు.ఆ తర్వాత డప్పు కొట్టి గిరిజనులను ఉత్సాహ పరిచారు. వివిధ వేషధారణలతో వచ్చిన వారితో ముచ్చటిం చారు.అనంతరం అరకు కాఫీ తాగిన సీఎం చంద్రబాబు, గిరిజనుల తయారు చేసిన ఉత్ప త్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాల వద్దకు వెళ్లారు.గిరిజన ఉత్పత్తులను పరిశీలించారు. అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జా తీయ గుర్తింపు కోసం ప్రోత్సాహాన్ని అందించా మని చెప్పారు.గిరిజన జాతులను కాపాడు కోవడం అంటే భారతీయ సంస్కృతిని సమున్న తంగా నిలబెట్టడమే అని పేర్కొన్నారు. రాబో యే రోజుల్లోనూ గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని గిరిజను లకు,వారి బిడ్డలకు మంచి భవిష్యత్‌ను అంది స్తామని హామీ ఇచ్చారు.అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆదివాసీ ప్రజలను ఉద్దే శించి ప్రసంగించారు.‘గిరిజనులు పేదరి కంలో పుట్టి పేదరికంలోనే చనిపోతున్నారు. పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మించు కోవాలి.ఏపని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకోవాలి.ఆదివాసీల్లో పేదరికం ఎక్కువగా ఉంది..వారిని అన్ని విధాలా పైకి తీసుకొ చ్చేందుకు నేను తప్ప కుండా శ్రద్ధ తీసు కుంటా. రాబోయే ఐదేళ్లలో నిర్థిష్ట ప్రణాళి కతో పేదరికాన్ని తగ్గిస్తాం.పేరుకు పథకాలు ఇవ్వడం కాదు…వాటి ఫలితాలు ఇచ్చేలా ఉండాలి. చేసే ప్రతి ఒక్క పనితో గిరిజనుల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొస్తాం. ఆర్టిఫిషియల్‌ ఇంటి లిజెన్స్‌ గురించి మాట్లాడుకుంటున్న ఈరోజుల్లో డోలీ మోత లు కనబడటం చాలా బాధగా ఉంది. నేను రాజకీయ వివక్ష చూపించను…కక్ష సాధిం పులకు పాల్పడను.కానీ రాష్ట్ర ప్రజల ఖజా నాను,ఆస్తులను దోచిన వారిని శిక్షిస్తా. దోచిన సొమ్మును రికవరీ చేసి పేదలకు ఖర్చు పెడతా.ఈరోజు నుండి చైతన్యం 2.0ప్రారం భమైంది.ఈ 2.0 చైతన్యం ఎక్కడ పేదవా డుంటే అక్కడికొచ్చి మీకు కావాల్సిన వనరులు ఇచ్చి పేదరికం నుండి బయటకు తీసుకొస్తాం. మీ జివితాల్లో వెలుగులు రావాలని కోరుకుం టున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
డీఎస్సీ రాసే గిరిజన అభ్యర్థుల కోసం శిక్షణా కేంద్రాలు
‘ఇటీవల 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాం.డీఎస్సీకి పోటీపడే గిరిజన అభ్య ర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తాం.గిరిజన విద్యార్థుల కోసం విశాఖ,విజయవాడ, తిరుపతి లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తాం.ఆదివాసీల్లో అనేక కళలున్నాయి.అరకు గిరిజన నృత్యం దేశంలోనే ప్రత్యేకమైంది. అనేక కళలున్న ఆదివాసీలు చాలా రంగాల్లో వెనకబడి ఉన్నా రు. ప్రతి యేడాది ఆగస్టు 9న ప్రపంచ ఆది వాసీ దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాలని జీఓ నెంబర్‌ 123ను నాడు తెలుగుదేశం ప్రభుత్వం లోనే విడుదల చేసి నిర్వహించాం.కానీ గత ప్రభుత్వం ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిం చడం మానేసింది.మన దేవానికి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉన్నారు, ఆమెను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. పాఠశాలలో ఉపాధ్యా యిరాలిగా పని చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అయ్యారంటే అదీ ఆదివాసీల్లో ఉండే ప్రతిభ. ఆదివాసీలు అనగానే శౌర్యం, ప్రతిభ, నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రకృతిని ఆరాధి స్తారు.ఎగ్జిబిషన్‌ లో ఏకలవ్యుడి ఫోటోలు చూశాను. గిరిజన కుటుంబంలో పుట్టాడు. విలువిద్యను అందించేందుకు గురువులు నిరాకరిస్తే పట్టుదలతో విద్యనభ్యసించి అంద రికీ ఆదర్శంగా నిలిచారు.బిర్సాముండా, తాత్వాబిల్‌, మన తెలుగువారైన కొమరం భీం లాంటి వాళ్లు బ్రిటిష్‌ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అల్లూరి సీతారామరాజు మీ అండతోనే బ్రిటిష్‌ వారి ఆధిపత్యాన్ని అంతం చేయడానికి పోరాడి ప్రాణత్యాగం చేశారు. అందుకే దేశానికే ముద్దబిడ్డగా మిలిగిలారు.మీ త్యాగాలు, మీమద్దతు జాతి మరవదు. దేశంలో 10.42కోట్ల మంది గిరిజనులున్నారు. రాష్ట్రం లో 5.56శాత మంది ఉన్నారు.’అని సీఎం వివరించారు.
ఆదివాసీలు వెనకబాటుతనంపై సమగ్ర అధ్యయనం
‘మీలో అనేక కట్టుబాట్లు ఉన్నాయి. మైదా నంలో ఉండే వారి జీవన ప్రమాణాలు తక్కువ గా ఉన్నాయి…ఏజన్సీలో ఉండే వారికి కనీసం రోడ్లు కూడా సరిగా లేవు. సమైఖ్య రాష్ట్రంలో చైతన్యం అనే కార్యక్రమం పెట్టి పెనుమార్పు లకు శ్రీకారం చుట్టాం. మైదాన ప్రాంతాల్లో ఉండేవారి కంటే ఏజన్సీలో ఉండేవారికి వనరులు ఎక్కువ అందుబాటులో ఉంటాయి. అరకు కాఫీని ప్రమోట్‌ చేశాం.అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను అందిం పుచ్చుకున్నాం.చాలామంది అర్గానిక్‌ ఆహార ఉత్పత్తులను పండిస్తున్నారు.ఎక్కడా దొరకని తేనె మన ప్రాంతాల్లో దొరుకుతోంది.కాఫీకి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా వ్యాపారంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు సాగును ప్రోత్సహించాం.ప్యారిస్‌లో కూడా ప్రస్తుతం అరకు కాఫీ అమ్ముతున్నారు.కొన్ని పెద్ద పత్రి కలు కూడా అరకు కాఫీ గురించి రాస్తు న్నాయి. వ్యవసాయంలో అరకు కాఫీ కూడా భాగమని కథనాలు రాస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ కూడా గతంలో అరకు కాఫీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉన్నారు. ఆదివాసీల మహిళలు డ్వాక్రా సంఘాల్లో కూడా ఉన్నారు. పేద మహిళలను సంఘటిత శక్తిగా మార్చాలని నాడు ఆలోచించాను.మారుమూల ప్రాంతా ల్లోని ఆడబిడ్డలు చేసే కుల,చేతివృత్తులను ప్రోత్సహించాం.మల్టీ గ్రెయిన్‌ బిస్కెట్ల తయా రీని ప్రోత్సహించాం.ఏపని చేసినా అనునిత్యం సాధన చేస్తూ నైపుణ్యం పెంచుకుంటే ఆదా యం వస్తుంది. కానీ ప్రభుత్వం నుండి ఆధా రం లేకపోవడంతో దెబ్బతిన్నారు.ఆదివాసీలు ఎందుకు వెనకబడి ఉన్నారో అధ్యయనం చేస్తున్నా’నని అన్నారు.
గత ప్రభుత్వం దుర్మార్గంగా16 సంక్షేమ పథకాలు రద్దు చేసింది
‘స్వాతంత్య్రం వచ్చి 78ఏళ్లైంది.చాలా వర్గాలు అభివృద్ధి చెంది ముందుకెళ్తున్నాయి. కానీ ఎస్సీ,ఎస్టీ,బీసీలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఆదివాసీల్లో పుట్టిన పిల్లలతో పాటు తల్లులు కూడా చనిపోతున్నారు.ఈ సంఖ్యను తగ్గిం చాలి. పిల్లల సంఖ్య తగ్గితే వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. మన పిల్లలే మనకు ఆస్తి. వారిని బాగా చదివిస్తే మనం కష్టంలో ఉన్న ప్పుడు చూసుకుంటారు. దేశంలో తలసరి ఆదాయం రూ.1.72లక్షలు ఉంటే ఏపీలో రూ. 2.20లక్షలు ఉంది. కానీ ఆదివాసీల్లో రూ.1.20లక్షలే ఉంది.పేదల జీవన ప్రమా ణాలపై శ్రద్ధ పెడతాం. అన్ని విధాలా పైకి తీసుకొస్తాం. తెలుగుదేశం పార్టీ హయాంలో 16పథకాలు తీసుకొచ్చాం.199 గురు కులాలు తీసుకొచ్చాం.2,705 విద్యాసంస్థల్లో ప్రస్తుతం 2,45,380 మంది విద్యార్థులు విద్యనభ్యసి స్తున్నారు.ఆదివాసీల్లో విద్యాభ్యాసం తక్కువగా ఉందని ఆలోచించిన ఎన్టీఆర్‌ ఏ ఊరిలో స్కూలు కావాలంటే ఆఊరిలోనే స్కూలు నిర్మిం చారు. గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే ఉపాధ్యా యులుగా ఉండాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్‌.మీ పిల్లల విద్య కోసం 2014-19లో రూ.450 కోట్లు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం సగం కూడా ఖర్చు చేయలేదు. గిరిజన పిల్లలు అటవీ ప్రాంతాలకు పరిమితం కాకూడదని ఐఏఎస్‌, ఐఐఎంలలో చదవాలని శ్రద్ధ పెట్టాం. సివిల్‌ సర్వీస్‌ కోచింగ్‌ కు వెళ్లేందుకు 1000మందికి రూ.13కోట్లు ఖర్చు చేశాం.కానీ గత ప్రభుత్వం రూ.3 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి ముగ్గురికే ట్రైనింగ్‌ ఇచ్చింది. గిరిజనుల్లో ప్రతిభ ఉంది… దాన్ని సానబెట్టి బయటకు తీయాలి. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విదే శాల్లో చదువుకునేందుకు రూ.15లక్షల చొప్పున సాయం అందించి 55మందిని విదేశాలకు పంపాం.దీనికోసం రూ.7.5కోట్లు ఖర్చు పెట్టాం. కానీ గత ప్రభుత్వం అంబేద్కర్‌ పేరు తొలగించి జగన్‌ పేరు పెట్టుకుని ఒక్కరికి మాత్రమే విదేశీ విద్యను అందించింది. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు, కార్పొరేట్‌ స్కూళ్లలో చదు వించుకునేవారి కోసం ప్రభుత్వం నుండి ఫీజు లు చెల్లించాం.గిరిపుత్రిక కింద 9,222 మంది గిరిజన యువతులకు రూ.56కోట్లు పెళ్లి కానుక అందించాం.దాన్ని కూడా గత ప్రభు త్వం నీరుగార్చింది.గిరిజనులు చనిపోతే రూ.5 లక్షలు ఆర్థిక సాయం బీమా ద్వారా అందిం చాం. రహదారి సదుపాయం లేని ప్రాంతాల నుండి ఆసుపత్రులకు డోలీల్లో వెళ్తున్నారని గుర్తించి ఫీడర్‌ అంబులెన్సులు తీసుకొచ్చాం. కానీ గత ప్రభుత్వం వాటిని కూడా నిర్వీర్యం చేయడంతో మళ్లీ డోలీల్లో మొసుకొచ్చే పరిస్థితికి తీసుకొచ్చింది. డోలీల్లో తీసుకొచ్చే సమయంలో ప్రసవం అవుతున్నారంటే ఏంటి ఈ దౌర్భా గ్యం.ఆధునిక యుగంలో ఉన్నాం…అయినా డోలీల్లో తీసుకొస్తున్నారంటే అందరూ బాధ పడాలి.ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగితే మాతా,శిశు మరణాలు తగ్గుతాయి. సరైన పౌష్టికాహారం అందించేందుకు బాలింతలు, పిల్లలకు ఫుడ్‌ బాస్కెట్‌ ప్రవేశపెట్టాం. దోమల బెడద నుండి తప్పించుకోవడానికి దోమ తెరలు అందించాం. ట్రైకార్‌ ద్వారా ఉపాధి, భూమి కొనుగోలుకు రూ.685 కోట్లు ఖర్చు చేశాం. గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేశాం.మేము ఉచితంగా కరెంట్‌ ఇస్తే దాన్ని కూడా గత ప్రభుత్వం రద్దు చేశారు. బాక్సైట్‌ తవ్వకాలు నిలిపేస్తే లేట్‌ రైట్‌ పేరుతో తవ్వ కాలు చేశారు’ అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
లంబసింగిలో మ్యూజియం ఏర్పాటు
‘ఆరోగ్య,ఆర్థికంతో పాటు కుటుంబానికి కావా ల్సిన వసతులపై సమగ్ర విధానం తీసు కొస్తాం. ఇంకా విద్యుత్తు, మరుగుదొడ్లతో పాటు తాగునీరు లేని గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో ప్రతి ఇంటికీ కనీస అవసరాలు కల్పిస్తాం. గిరిజన వాడల్లో రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. పాఠశాలకు పిల్లలందరూ వెళ్తున్నారో లేదో కూడా సమీక్ష చేస్తాం. గ్రామంలోని వనరులు ఉపయోగించి ఆదాయం పెంచే మార్గం చూపిస్తాం.ట్రైకార్‌ ద్వారా రుణా లు ఇస్తాం.2014-19 మధ్య ఇచ్చినట్లుగానే ఇన్నోవా కార్లు అందిస్తాం.గతంలో 80 స్కూళ్ల ను రెసిడెన్సియల్‌ స్కూళ్లుగా మార్చాం…వాటి కోసం కొత్త భవనాలు నిర్మిస్తాం.గిరిజనుల్లోని సమరయోధుల త్యాగాలను తెలియజేసేందుకు లంబసింగిలో మ్యూజియం ఏర్పాటు చేస్తాం. దేశంతో పాటు, ప్రపంచం లోని ముఖ్య నగరాల్లో అరకు కాఫీని ప్రమోట్‌ చేసి మరింత గుర్తింపు తీసుకొస్తాం.అరకు కాఫీ నాణ్యతను పెంపొందిస్తాం. వాణిజ్య పంటల కంటే కాఫీ పంటకు ఆదాయం అధికంగా వచ్చేలా చేస్తాం.మీరు పండిరచే ఆర్గానిక్‌ పంటల ఉత్పత్తులకు మార్కెట్‌ సదుపాయం కల్పిస్తాం.తయారు చేసే వస్తువులను ఓఎన్డీసీ ఫ్లాట్‌ ఫాం ద్వారా వినియోగదారులకు నేరుగా వినియోగించేలా చేస్తాం.జీవో నంబర్‌ 3 నాకు బాగా గుర్తు ఉంది.నేనే తీసుకొచ్చా.విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉపఎన్నికలు ఉండ టంవల్ల మాట్లాడలేకపోతున్నా…మీ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలో అదంతా చేస్తా. సీతంపేట ఐటీడీఏలో రూ.7కోట్లతో సమగ్ర పసుపు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌ ను రూ.2.54 కోట్ల తో అభివృద్ధి చేస్తాం. పార్వతీపురం ఐటీడీఏ కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు గ్రామాల మధ్య నాగావళి నదిపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మిస్తాం.చింతూరు ఐటీడీఏ పరిధిలో 11 ఎత్తి పోతల పథకాలను రూ.2.5 కోట్లతో నిర్మిస్తాం. పాడేరులో మెడికల్‌ కళాశాలను రూ.500 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేస్తాం.418 ఏకో పాధ్యాయ పాఠశాలలకు రూ.50 కోట్లతో భవనాలు పూర్తి చేస్తాం. అల్లూరి సీతారా మరాజు మన్యం జిల్లాలో ప్రధాన కేంద్రంలో మూడు ప్రధాన రహదారుల కారిడార్‌ను రూ.50కోట్లతో పూర్తి చేస్తాం.పాడేరు ఏజన్సీలో రూ.10కోట్లతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. 2,191 గిరిజన గ్రామాలకు త్వరలో రోడ్డు మార్గాలు నిర్మిస్తాం. 16,816 గిరిజన నివాస ప్రాంతాలకు తాగునీరు లేదు,ఆ ప్రాంతాలకు కుళాయి ద్వారా నీళ్లు అందిస్తాం.’అని సీఎం హామీల వర్షం కురిపించారు.
మీ భూములు దోచుకునేందుకు గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేశాం
‘ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలపడమే కాదు…నిర్ధిష్ట ప్రణాలి కతో అభివృద్ధి చేస్తాం.అరకు పార్లమెంట్‌ పరిధిలో 5స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారు. మంచి పనులు జరగాలంటే ఆలోచనా విధానం కూడా మారాలి.మొన్నటి ఎన్నికల్లో సుడిగాలి వచ్చింది…ఆ సుడిగాలిలో తిరిగి రానంతగా జగన్‌ కొట్టుకుపోయారు. దీనికి కారణం అవినీతి, దోపిడీ, పేదల పొట్టకొట్టే పాలకులు ఉండటమే. ఇక్కడుండే వారిని అడుగుతున్నా….గత ప్రభుత్వంలో ఎవరికైనా న్యాయం జరిగిందా.? మీకు ఒక్క రుణమైనా ఇచ్చిందా.? మీ పిల్లల భవిష్యత్తు ను నిర్వీర్యం చేశారు.గిరిజనులపై దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టారు.అందుకే నిశ్వబ్ధ విప్లవం వచ్చి ఎవరూ ఊహించని విధంగా 93శాతం స్థానా లు కూటమికి వచ్చాయి. మీరు అనేక కష్టాలు అనుభవించారు. వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్ష ల కోట్లు అప్పులు చేసింది..వాటికి ప్రతి నెలా వడ్దీలు కట్టాలి. ఇప్పటికే కొన్ని పథకాలు అమ లు చేస్తున్నాం. ఎన్నికల ముందు చెప్పిన విధం గానే పింఛను రూ.3వేల నుండి రూ.4వేలకు పెంచి పెద్దకొడుకుగా ఉన్నా. వాలంటీర్ల లేకుం టే పింఛన్లు ఇవ్వలేరని చెప్పి 35 మంది వృద్ధు ల ప్రాణాలు తీశారు. కానీ మనం ఒక్కరోజు లోనే 97శాతం మందికి పింఛన్లు అందిం చాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి తెలుగు దేశం పార్టీకి ఉంది. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం.రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండలాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం.ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు ద్వారా మీభూములను దోచుకోవాలని చూశారు. అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశాం.’ అని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
– గునపర్తి సైమన్‌

మడ అడవుల జీవ వైవిధ్య ప్రతీకలు

మడ అడడులు..పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి ప్రసాదించిన వరాలు.తీర ప్రాంతాలకు సహజ రక్షణ గోడలు.సముద్ర తీర జీవవైధ్యంలో వీటిదే కీలక పాత్ర.ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మనుషల్ని,వన్యప్రాణుల్ని కాపాడుతు న్నాయి. కోట్ల మంది జీవనోపాధికి ఆసరాగా నిలుస్తున్నాయి.వీటినిభద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మాన వాళిపై ఉంది. జూలై26 అంతర్జా తీయ మడ అడువుల సంరక్షన దినోత్సవం సందర్భంగా…
ఉష్ణమండలం..ఉప ఉష్ణమండల ప్రాంతాలు, అత్యధిక వర్షపాతం నమోదయ్యే భూ భాగాలు,నదులు,సముద్రంలో కలిసేతీర ప్రాం తాల్లో మడ అడవులు ఏర్పడతాయి. అత్యధిక ఉప్పు సాంధ్రత,నీటినిల్వఉండి, తరచూ తుఫాన్లు సంభవించే ప్రాంతాల్లో అలలు,ఉప్పెనల ప్రభా వంతో నెలకొం టాయి.మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో తుఫానుల తీవ్రత,వాటివల్ల కలిగే నష్టం తక్కువగా ఉన్నట్లు కోనసీమ ఉప్పెన సహా పలుసందర్భాల్లో తేలింది.ఇవి ఉండే చోట మత్స్య సంపద అధికంగా ఉంటున్నట్లు అధ్యయ నాల్లో వెల్లడైంది.చేపలు,రొయ్యలకు ఆహారంగా మత్స్యసంపదను పెంపొందిం చడంలోనూ తోడ్ప డుతున్నాయి. పర్యాటక పరంగానూ వేల మందికి ఉపాధిని కల్పిస్తు న్నాయి.వాతావర ణంలో కర్బన్‌ ఉద్గారాలు కార్బొన్‌ డై ఆక్సైడ్‌ను తగ్గించు డంలో కీలక పాత్ర పోషిస్తు న్నాయి. సముద్ర తీరప్రాంతంలో నీటి నాణ్యత ను పెంచేందుకు దోహదపడుతు న్నాయి. పర్యా వరణ పరిరక్షనతోపాటు జీవవైధ్యానికి అండగా నిలుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో పలురకాల గ్రామీణ జీవనోపాధి అవకాశాలు కల్పించడం లో గణనీయ పాత్ర పోషిస్తున్నాయి.తుఫానులు, ఉప్పెనల నుంచి తీరప్రాంత గ్రామాలను కాపాడుతున్నాయి. బలమైన వేళ్లతో అల్లుకుపోయిన మడ అడు వులు అటుపోట్లకు అడ్డుగా నిలిచి భూమి కోతకు గురికాకుండా పరిరక్షిస్తున్నాయి. ప్రత్యేకమైన,విలువైన మరియు సున్నితమైన పర్యావరణాలుగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థల ప్రాముఖ్యతపై ప్రపంచ అవగాహనను పెంచడం దీని ఉద్దేశ్యం..యునెస్కో జనరల్‌ కాన్ఫరెన్స్‌ 2015లో ఈఅంతర్జాతీయ దినోత్సవాన్ని అధికారికంగా ఆమోదిం చింది. అలాగే తాజాగా జీ20సదస్సులో వాతావరణ మార్పుల సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు మడ అడవులను పరిరక్షించుకోవాలని ప్రపంచ దేశాల నేతలు పిలుపు నిచ్చారు.సదస్సు సాక్షిగా మడ అడవుల పరిరక్షణకు ఉద్దేశించిన మాం గ్రూప్‌ ఆలయన్స్‌ ఫర్‌ క్లైమేట్‌ వేదికలో భారత్‌ భాగస్వామిక చేరినట్లు ప్రధాని మోది ప్రకటిం చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థాలాల కేటాయంపు పేరుతో కాకినాడ తీరంలో పెద్దఎత్తున మడ అడవు లను ధ్వంసం చేయడాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తప్పుపట్టింది.ధ్వంసం చేసిన మడ అడవులను అయిదేళ్లలో ప్రభుత్వం పునరుద్దరించాలని ఆదేశిం చింది.అందుకోసం అయిదుకోట్ల రూపా యలమేర మధ్యంతర పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని ట్రైబ్యునల్‌ ఆదేశించడం సమస్య తీవ్రతకు అద్దంపడుతుంది.
భారతదేశంలోని మడ అడవులు
ఫారెస్ట్‌ సర్వే రిపోర్ట్‌ 2021ప్రకారం,2019 అంచనాతో పోలిస్తే భారతదేశంలో మడ అడవుల విస్తీర్ణం17చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇది ఇప్పుడు 4,992 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. మడ అడవులు అత్యధికంగా పెరిగిన మూడు రాష్ట్రాలు- ఒడిశా (8చదరపు కి.మీ),మహారాష్ట్ర (4చదరపు కి.మీ) మరియు కర్ణాటక (3 చ.కి.మీ).వీటిలో తీర రక్షణ: మడ అడ వులు అలలు మరియు తుఫానుల ద్వారా ఏర్పడే కోతల నుండి తీరప్రాంతాలను రక్షిస్తాయి.వాటి చిక్కుపడినట్టు ఉండే వేర్లు అవక్షేపాలను బంధించడానికి,నీటి ప్రవా హాన్ని తగ్గించడానికి సహాయ పడతాయి. ఇది ఈ సహజ ప్రమాదాల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
చేపలు,వన్యప్రాణుల ఆవాసాలు : మడ అడవులు వివిధ రకాల చేపలు, షెల్ఫిష్‌లు, పక్షులు మరియు ఇతర జంతు వులకు నిలయంగా నిలుస్తాయి. మడ చెట్ల వేర్లు మరియు కొమ్మలు ఈ జంతువులకు ఆహారం మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి. ఈ అడవులు అనేక జాతుల చేపలకు నర్సరీగా కూడా పనిచేస్తాయి.
నీటిని శుద్దీచేయడం: మడ అడవులు కాలుష్య కారకాలు,అవక్షేపాలను ఫిల్టర్‌ చేయడం ద్వారా నీటిని శుద్ధి చేయడా నికి సహాయపడతాయి.అవి నీటి ప్రవాహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి, ఇది వరదలను నిరోధిం చడంలో సహాయ పడుతుంది.
కార్బన్‌ నిల్వలు: మడ అడవులు ఒక ముఖ్యమైన కార్బన్‌ సింక్‌గా పనిచేస్తుంది, అంటే అవి వాతావ రణంలో ఉన్న కార్బన్‌ డయాక్సైడ్‌ను నిల్వ చేస్తాయి. ఇది వాతావరణ మార్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.
నిర్లక్ష్యంతో తీరని నష్టం..
తీరప్రాంతాల్లో పర్యావరణానికి నష్టం కలిగించే రీతిలో సాగుతున్న అభివృద్ధి, వ్యవసాయ విస్తరణ,వన్యప్రాణుల వేట తదితర అంశాలు మడ అడవులకు ముప్పుగా పరిణ మిస్తున్నాయి. వీటి సంరక్ష ణకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగంలో ఉదాసీనత పెరుగు తోంది. ప్రకృతి వైపరీ త్యాలతోపాటు మానవ చర్యలు దుష్ప్రభావం చూపుతున్నాయి.మడ అడవులు వ్యవసాయ భూములుగా మారే ముప్పు అంతకంతకూ అధికమవుతోంది.తీరం వెంబడి వేగంగా పెరుగుతున్న పారిశ్రామి కీకరణ,పారిశ్రామిక వ్యర్ధాలు,శుద్దిచేయని మురుగునీరు శాపాలుగా పరిణమిస్తు న్నాయి.తీరప్రాంతాల్లో జనాభా పెరుగుదల నేపథ్యంలో భూమికోసం పెరుగు తున్న డిమాండ్‌తోపాటు మానవ ఆవాసాలు, కలప,వంటచెరకు,పశుగ్రాసం,అటవీ ఉత్పత్తుల సేకరణ వంటివి ఆశనిపాతంలా మారాయి. అభివృద్ధి పేరట నదుల వెంబడి జరుగుతున్న పలురకాల కార్యకలాపాలు, నదీప్రవాహాల్లో మార్పులు మడ అడవుల సహజత్వాన్ని దెబ్బ తీస్తున్నాయి.కొన్నిచోట్ల వీటికి అవసరమైన నీరు కూడా సరిగ్గా అందకపోవడం తీవ్రనష్టాన్ని కలిగిస్తోంది. వాతావరణ సమస్యలు,ఉష్ణోగ్రతల్లో తేడాలు, నదీప్రవాహంలో కొట్టుకొచ్చే మట్టి మేట వేయడం,కాలువపూడిక,నీటినిల్వతో ఉప్పు శాతం పెరిగి మొక్కలు నశించడం,మొల కెత్తకపోవడం వంటి సమస్యలు ఎదురవుతు న్నాయి.మరో వైపు, మడ అడువులు నరికివేత ముప్పునూ ఎదుర్కొం టున్నాయి. ఇలాంటి అనేక సమస్యలపై ఎన్నో అధ్యయ నాలు,ఎన్నిసార్లు హెచ్చకిరలు చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగాలు సరైన చర్యలు చేపట్టకపోవడంతో నష్టం తీవ్రత అంత కంతకూ పెరుగుతోంది.ప్రపంచవ్యాప్తంగా 113దేశాల్లో 1.4కోట్ల హెక్టార్లకుపైగా విస్తీర్ణం లో మడఅడవులు ఉన్నాయి. ఇందు లో 50లక్షల హెక్టార్లకుపైగా ఆసియా ఖండంలోనే ఉండటం గమనార్హం. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లో విస్తరించిన సుందర్‌బన్స్‌ ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన మడ అడవులు కావడం విశేషం.ఇవి యునెస్కో వారసత్వసంపద గుర్తింపును సొంతం చేసుకు న్నాయి. గంగ,బ్రహ్మపుత్ర నదుల నడుమ వందకుపైగా దీవులుగా విస్తరించిన సందర్‌బన్‌ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా గుర్తింపు పొందింది.ఇక్కడ 55ఎకరాల జంతవులు,54ఎకరాల సరీసృపాలు,248రకాల పక్షలు జీవిస్తు న్నాయి.వృక్షజాతుల్లోనూ ఎంతో వైవిధ్యం కొనసాగుతోంది.రాయల్‌ బెంగాల్‌ పులులకు సుందర్‌బన్‌లే ఆవాసం.వీటితోపాటు మనదేశంలో భితర్‌కనికా,కోరింగ, పిచావరం, గుజరాత్‌ మడఅడవులు కీలకమైనవిగా పేరొందాయి.
బహుముఖ వ్యూహాలు..
మడ అడవుల సంరక్షణలో విస్తీర్ణం పెంపుదలలో ఒడిశా ఆదర్శంగా నిలు స్తోంది.నదీ తీరప్రాంతాలతోపాటు నదులు సముద్రంలో కలిసే భూభాగంలో మొక్కలు నాటడం ద్వారా విస్తీర్ణం పెరుగుతోంది.మడ అడువులు పెంచేందుకు అనువైన ప్రాంతా తలన్నింటినీ సమర్ధంగా ఉపయోగించు కుంటున్నారు. సముద్ర జలాలు చొచ్చుకుని వచ్చే ప్రాంతాల్లో వీటిని పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.దేశంలోని ఇతర ప్రాంతాల్లో సైతం మడ అడవులను సంరక్షిం చాలి.ఈ అడవుల్ని పెంచేందుకు ఎక్కడ అవకాశం ఉన్నా వదులుకోకూడదు. ఒడిశా తరహాలో విస్తరించేందుకూ కృషి చేయాలి. మడఅడువుల నిర్వహణ ప్రణా ళికలు రూపొందించి అమలు చేయడం కీలకం.మడ అడవుల వైవిధ్యం,ప్రత్యేకతలపై మరింత లోతుగా పరిశోధనలు చేయట్టాల్సిఉంది.వీటి సంరక్షణలో బహుముఖ వ్యూహాల కార్యాచరణ ఎంతో అవసరం.మడఅడువుల్ని కాపాడు కోవడంలో ప్రభుత్వాలతోపాటు.. విశ్వవిద్యా లయాలు,పరిశోధన సంస్థలు,స్థానిక సంస్థలూ కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉంది.
ఏపీలో తగ్గిన విస్తీర్ణం..
పలు రాష్ట్రాల్లో మడఅడవుల విస్తీర్ణం..ఎంత కొంత పెరుగుతుండగా,ఆంధ్రప్రదేశ్‌ మాత్రం తగ్గుతుండటం ఆందోళనకరం.ఏపీలో 1987 లో మడ అడవుల విస్తీర్ణం 495చదరపు కిలోమీటర్లు.ఇప్పుడు అది 405చదరపు కి.మీ.ఇందులో 70శాతం అంతకంటే ఎక్కువ సాంధ్రత కలిగిన దట్టమైన మడ అడవుల జాడే లేదు.213చదరపు కి.మీ ఒక మోస్తరు (40`70శాతం సాంద్రత)ఉన్నవి.మరో 162చదరపు.కి.మీ.40శాతం కంటే తక్కువ సాంద్రత కలిగినవి కావడం గమనార్హం.ఉమ్మడి తూర్పుగోదావరి,కృష్ణా,గుంటూరు జిల్లాలతో పాటు పరిమితంగా నెల్లూరు జిల్లాలోనూ మడ అడవులు విస్తరించాయి. ఏపీలోని ప్రధానమైన కోరింగ మడ అడువుల్లో 34రకాల మొక్కలు ఉన్నట్లు అంచనా.వీటి పిల్లి(మరకపిల్లి/ఏటిపిల్లి) అనే వన్యప్రాణితోపాటు అనేక రకాల జంతు వులు,పక్షులకు అవాసంగా నిలుస్తున్నాయి. విదేశీ పక్షలకూ విడిది కేంద్రంగా ఆకర్షిస్తున్నాయి.
మడ అడవుల పరిరక్షణ…
మడ అడవులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత ప్రజల శ్రేయస్సు, ఆహార భద్రత మరియు రక్షణ కోసం ముఖ్యమైనవి.వారు చేపలు,క్రస్టేసియన్లతో సహా గొప్ప జీవవైవిధ్యా నికి మద్దతునిస్తారు.ఇవి సునామీలు, తుఫా నులు,కోత,పెరుగుతున్న సముద్ర మట్టాలకు వ్యతిరేకంగా అవరోధంగా పనిచేస్తాయి.ఇవి సముద్రం మరియు భూమి మధ్య సరిహద్దు లుగా కూడా పనిచేస్తాయి అలాగే అనేక తీర ప్రాంత వర్గాలకు రక్షణ మరియు ఆహార భద్రతను అందిస్తాయి. మడ పర్యావరణ వ్యవస్థ యొక్క నేలలు కార్బన్‌ సింక్‌లుగా పనిచేస్తాయి మరియు భూమి ఆధారిత అడవులతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ కార్బన్‌ను నిల్వ చేయగలవు.
మడఅడవులకు ఎదురౌతున్న ప్రమాదాలు
దురదృష్టవశాత్తు, గత నాలుగు దశాబ్దాలుగా, వివిధ మానవ చర్యల కారణంగా మడ అడవుల విస్తీర్ణం దాదాపు సగానికి పడిపో యింది. రొయ్యల పెంపకం ఇందులో ప్రాధ మిక ప్రమాదంగా తెలుస్తోంది. రొయ్యల పెంపకం కోసం చుట్టుపక్కల చెరువులను సృష్టించడానికి అడవిలో ఎక్కువ భాగాలను నరికేస్తున్నారు. వ్యాధులను నివారించడానికి మరియు దిగుబడిని పెంచడానికి యాంటీబ యాటిక్స్‌ మరియు రసాయనాలను అధికంగా ఉపయోగించడం వంటివి కూడా వీటికి హాని చేస్తున్నాయి. ఇది అడవుల పర్యావరణ సమతు ల్యతకు కోలుకోలేని నష్టానికి దారితీస్తుంది. అంతేకాక, ఈ అడవుల నుండి విలువైన కలప తరచుగా దోపిడీ చేయబడుతొంది మరియు గణనీయమైన లాభాలకు విక్రయిస్తున్నారు, అలాగే వీటిని బొగ్గు ఉత్పత్తిలో కూడా ఉపయో గిస్తున్నారు. అన్నింటివలన  తీవ్రమైన అటవీ నిర్మూలన జరుగుతోంది.రోడ్లు, భవనాల నిర్మాణం,నీటిపారుదల అవసరాల కోసం నదు లను మళ్లించడం మడ అడవుల ఆవాసాన్ని మరింత దెబ్బతీస్తుంది, ప్రత్యేకించి చాలా మడ అడవులు నదీతీరాల దగ్గర ఉన్నాయి.(జూలై26 అంతర్జాతీయ మడ అడువుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా…)
-గునపర్తి సైమన్‌

కొలువు దీరిన కొత్త ప్రభుత్వాలు

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కొత్తప్రభుత్వాలు కొలువు దీరాయి.ఇటు ఆంధ్రప్రదేశ్‌,అటు కేంద్రంలోను బలమైన జట్టుతో కూటమి ప్రభుత్వాలు కొలువు దీరాయి.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది.వీరిలో 30మంది క్యాబినెట్‌,ఐదుగురు స్వతంత్ర, 36సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.పదేళ్ల అనుభవాలు 140కోట్లమంది ప్రజల ఆకాంక్షల మధ్య కొలువుదీరింది మోదీ సర్కారు 3.0. మూడవసారి దేశ నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు. ఆఅరుదైన ఘనత ఒకవైపు,పదేళ్ల తర్వాత సంకీర్ణ బలంపై ఆధారపడిన సమీకరణాలు మరోవైపు నేపథ్యంలో ఈ దఫా ఎన్డీయే పాలన ఎలా సాగనుంది?రాజకీయంగా,ప్రభుత్వ పరం గా వారి ముందున్న ప్రాధాన్యాలు,సవాళ్లు ఏంటి?ఎన్డీయే తొలి వంద రోజుల ప్రణాళిక లో ఏ ఏ అంశాలున్నాయి? ఉమ్మడి పౌరస్మృతి, ఒకటేదేశం-ఒకటే ఎన్నికలతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తోన్న సవాళ్లకు ఇకనైనా పరిష్కారం చూపగలరా ?ఇవే అంశాలపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం లో కొలువు దీరిన ఎన్డీఏ3.0సర్కార్‌ కేబినెట్‌ లో బీజేపీకి 61,ఎన్‌డీఏ మిత్రపక్షాలకు11 బెర్తు లు లభించాయి. మొత్తం 72మందితో మోదీ కేంద్ర కేబినెట్‌ కొలువుదీరింది. ఎన్‌డీఏ ప్రధాన మిత్రపక్షాలైన తెలుగుదేశం,జేడీయూకి చెరో రెండు కేబినెట్‌ బెర్తులు దక్కాయి.ఎల్‌జేపీ(ఆర్‌ వీ),జేడీఎస్‌,శివసేన,రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండి యా,రాష్ట్రీయలోక్‌దళ,అప్నాదళ్‌,హిందూ అవా మీ మోర్చాచెరో ఒక్కకేబినెట్‌ స్థానాన్ని దక్కించు కున్నాయి.
ఏనీలో కూటమి కొత్త కొలువు
ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల ఆనందోత్సాహాలు, అభివాదాల మధ్య నారా చంద్రబాబునాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు.ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్ర గవ ర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చంద్రబాబుతో ప్రమాణం చేయిం చారు.ప్రమాణస్వీకారం అనంతరం పవన్‌ కల్యాణ్‌ తన సోదరుడు చిరంజీవికి పాదాభి వందనం చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటు మరో 24మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో రెండుసార్లు,విభజన తర్వాత నవ్యాంధ్రó ప్రదేశ్‌కు రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌,కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు తమ స్థానాల్లోనే నిలుచుని చప్పట్లతో అభినందనలు పలికారు. అనంతరం వేదిక వద్ద ఉన్న ప్రముఖులంతా చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియ జేశారు.ఆ తర్వాత వరు సగా 24మంది కొత్త మంత్రులచే గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిం చారు. జనసేన అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌,టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌,టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నా యుడు, కొల్లు రవీంద్ర,నాదెండ్ల మనోహర్‌ (జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకు మార్‌యాదవ్‌(బీజేపీ),నిమ్మల రామా నాయుడు, మహ్మద్‌ ఫరూఖ్‌,ఆనం రాంనారా యణరెడ్డి, పయ్యావుల కేశవ్‌,అనగాని సత్య ప్రసాద్‌, కొలుసు పార్థసారథి,బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌,కందుల దుర్గేష్‌ (జన సేన),గుమ్మడి సంధ్యారాణి,బీసీ జనార్ధన్‌ రెడ్డి, టీజీభరత్‌, ఎస్‌ సవిత,వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌,మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రు లందరూ ప్రమా ణంచేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ,రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌లతో చంద్ర బాబు కొత్త కేబినెట్‌ గ్రూప్‌ ఫొటోదిగారు. ప్రమాణ స్వీకార కార్యక్ర మానికి కేంద్ర మంత్రులు అమిత్‌షా,నితిన్‌ గడ్కరీ,జేపీనడ్డా,చిరాగ్‌పాశ్వాన్‌,అనుప్రియా పాటిల్‌,కింజారపురామ్మోహన్‌నాయుడు, శ్రీనివాస వర్మ,పెమ్మ సాని చంద్రశేఖర్‌, మహా రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,(గవర్నర్‌,ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌, శ్రీలంక) తదితరులున్నారు.
-గునపర్తి సైమన్‌

ఓటువేద్దాం..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రా యుధం. ప్రజల భవితను నిర్ణయించే శక్తి దాని కుంది. ఓటుద్వారా పాలకులను ఎన్నుకునే అధికారం రాజ్యాంగం ఓటరుకు ఇచ్చింది.అలాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వి నియోగం చేసుకోవాలి. ప్రలోభాలకు లొంగి పోకుండా ప్రజాస్వామ్య వ్యవస్ధను పరిరక్షిం చాలి.అవినీతి అంతం..అభివృద్ధిని కోరుకుంటు న్నారా..అయితే ఓటు వేయండి..విలువైన ఓటు ను పచ్చని నోటుకు అమ్ముకోవదు. దేశభవిష్యత్తు నీ వేలు చివరే ఉంది.

ప్రజాస్వామ్యాన్ని మన ఓటే నడిపిస్తుంది.భవిష్యత్తుకు ఓటు అభివృద్ధి కోసం ఓటు.ప్రజాస్వామ్య విలువలకు జీవం పోయాలి.ప్రజాస్వామ్యంలోవిలువలను చాటి చెప్పాలన్నా,అక్రమార్కుల పాలనకు స్వస్తి పలకా లన్న నీఓటే కీలకం.ప్రజా సంక్షేమానికి పాటు పడేవారిని ఎన్నుకోవాలి.మే 13నజరగబోయే ఎన్ని కల్లో రోజున తప్పక ఓటు వేయండి.అవినీతి నాయ కులకు ఓటుతో సమాధానం చెప్పాలి. ప్రజాస్వా మాన్ని బ్యాంకు ఖాతాల్లోని డబ్బు నడిపించదు. స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా ఓటు వేయడం మన బాద్యత.బాధ్యతతో ఓటేసి గొప్ప దేశాన్ని నిర్మించు కుందాం.మనం వేసే ఓటు నడిపిస్తుంది.మార్పు కోసమైనా ఓటు హక్కు వినియోగించండి.ఓటు వేసేందుకు బాధ్యతతో కదలండి.ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా విని యోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపే తమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది.అందుకే ఎలాం టి ప్రలోభాలకు తలవంచకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రపంచంలో ప్రజాస్వా మ్యానికి దిక్సూచి అయిన ఓటును వినియోగిం చుకోవటం ప్రజల ప్రధాన కర్తవ్యం. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. నిజమైన ప్రజాస్వా మ్యానికి పునాది ఓటు.అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకో వద్దు.మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మా ణం సాధ్యమవుతున్నది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన వజ్రాయుధం.‘ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల కొరకు పనిచేస్తూ , ప్రజలే పాలకులుగా గల పాలన విధానమే ప్రజాస్వా మ్యం’.మనది సర్వస్వతంత్ర భారతదేశం. ‘లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామిక’ దేశమని మన రాజ్యాంగంలో మనమే చెప్పు కున్నాం.స్వేచ్ఛా సమానత్వం మన దేశ ఆద ర్శం. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సమాజంలోని ప్రతిఒక్కరూ సమానమని, అం దరికీ సమానమైన స్వేచ్ఛ, హక్కులు ఉండాలని రాజ్యాంగంలో రాసుకున్నాం.వ్యక్తులు లేనిదే సమాజంలేదు.సమాజంలో అంతర్భాగం కా కుండా ఏవ్యక్తీ విడిగా మనుగడ సాగించనూ లేడు. అందుకే‘అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరు కలిసి,ప్రజాస్వామ్య మనుగడను కాపాడుకోవాలంటే ఓటు హక్కు ఒక్కటే మార్గం.
దేశ చరిత్రను మార్చే శక్తి ఓటే!
ఓటుహక్కు దేశ చరిత్రనే మార్చే యగల ప్రజాస్వామ్య ఆయుధం. కుల, మత, ప్రాంత,లింగ,జాతి,భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18ఏండ్లు నిండిన పౌరులం దరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 ప్రకా రం ఓటుహక్కు కల్పిస్తున్నది.తద్వారా సమర్థు లైన పాలకులను ఎన్నుకునే అవకాశాన్ని కల్పిం చింది.అందుకే ఓటును దుర్వినియోగం చేయ కుండా దానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి సరైన నాయకున్ని ఎన్నుకున్నప్పుడే దానికి సార్థకత. సమాజంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు వజ్రా యుధం లాంటిదే. ఎన్నికల్లో తమ కు నచ్చిన అవినీతి రహిత పాలన అందించే సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే హక్కు ఈ ఓటు ద్వారానే సాధ్యపడుతుంది. ప్రజాస్వా మ్య విలువలున్న సమాజమే ప్రజా సంక్షేమానికి నాంది పలుక గలదు. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక.ప్రపంచ స్థితి, గతులను మార్చేశక్తి ఓటుకు ఉన్నది. ఒక వ్యవస్థకు ప్రజాప్రతినిధి ఎంత అవసరమో,ఆ ప్రజా ప్రతి నిధిని ఎన్నుకునేం దుకు ఓటు అంతే అవసరం. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా,రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మనం బాగు పడాలి అనే తాపత్రయం ఉండడమే కాదు ఓటూ ముఖ్య మే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా ఓటు వేయాలి. భారత రాజ్యాంగం పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది.రాజ్యాం గ పరిషత్‌,ఎన్నికల సందర్భంగా28.5శాతం ప్రజ లకు దీన్ని విస్తరింపచేశారు.ప్రజాస్వామ్య విధా నానికి కట్టుబడి ఉండేలా రాజ్యాంగం భారత పౌరు లకు సార్వత్రిక వయోజనఓటు హక్కును కల్పిం చింది. ప్రజాస్వామ్యంలో సమానత్వ సూత్రా న్ని అనుసరించి 325 అధికర ణం ప్రకారం ఒకవ్యక్తి కి ఒక ఓటు మాత్రమే ఉం టుంది.కుల, మత,వర్గ, వర్ణ,జాతి ,ప్రాంతం,లింగ భేదాలు వంటి తేడాలతో ఏఒక్క వ్యక్తికి ఓటు హక్కు నిరాకరించ కూడదం టూ నిబంధనలు జారీ చేసింది. 1988 లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఓటు హక్కు వయో పరిమితిని 21ఏండ్ల నుంచి 18ఏండ్లకు తగ్గించి అత్యంత ప్రాధాన్యం కలిగిన హక్కుగా ప్రాముఖ్య తను చేకూర్చింది. ప్రస్తుతం దేశంలో ఓట్లు వేయ డం కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతు గా భావి స్తున్నారు. రాజకీయ నాయకులు నోటు అనే తాయిలాన్ని ప్రజలకు పంచి ఓటును బలహీన పరిచి గెలుపును పటి ష్టం చేసుకుంటున్నారు. మనమంతా నోటు తీసుకుని ఓటు వేస్తే నాయ కులను ప్రశ్నించే హక్కుని కోల్పోతాము. గెలిచిన నాయకుడు డబ్బుకు అమ్ముడుపోయి అవినీతి,కుళ్లు రాజకీ యాలతో ప్రజలను తప్పుడు దారిలోకి తీసుకొని పోతున్నాడు.
భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢ విల్లాలన్నా, సాంఘిక, ఆర్థిక, సమాన త్వాన్ని సాధిం చాలన్నా, మన జీవితాలు, తల రాతలు మారాలన్న అది పారదర్శకమైన ఎన్ని కలు, నిజాయితీపరులైన నాయకుల వల్లనే సాధ్యం. మనం వేసే ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. మనం వేసే ఓటే మన భవి ష్యత్తు,రాబోయే తరాల మనుగడను నిర్ణయిం చేది ఓటే.రాజకీయ నాయకుల తల రాతల్ని మార్చే ఆయుధం ఓటు. అందరూ ఓటు వేసిన పుడే,రాజ్యాంగం కల్పించిన హక్కుకు సార్థకత లభిస్తుంది. దేశ దిశ,దశను ఓటు మారుస్తుంది. మనం ఓటువేసేది బంగారు భవిష్యత్తు కోసమే అనే విషయం మరచిపోకూడదు. ఓటు వేద్దాం -మన ప్రాంత,పురోభివృద్ధికి మంచి నేతను ఎన్ను కొని బంగారు బాటలు వేద్దాం. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడను నిర్ణయించేది ఓటే.రాజకీయ నాయకుల తల రాతల్ని మార్చే ఆయుధం ఓటు. అందరూ ఓటు వేసినపుడే,రాజ్యాంగం కల్పించిన హక్కుకు సార్థ కత లభిస్తుంది.దేశ దిశ,దశను ఓటు మారుస్తుంది. మనం ఓటువేసేది బంగారు భవిష్యత్తు కోసమే అనే విషయం మరచిపోకూడదు.
ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు.
ఏ ప్రజాస్వామ్య సమాజంలోనైనా ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. ఇదిమన ప్రజాస్వా మ్యా నికి మూలస్తంభం,పౌరులు తమను ఎవరు పరి పాలించాలో,వారు ఎలా పరిపాలించబడ తారో చెప్పడానికి వీలు కల్పిస్తుంది.ఓటు వేయగల సామ ర్థ్యం అనేది ఒక హక్కు మాత్రమే కాదు, బాధ్యత, ఎందుకంటే ఇది పౌరులందరి వాణిని వినిపించేలా మరియు వారి ప్రయోజనాలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించేలా చేస్తుంది.ఓటుహక్కు అనే ది ఒక ప్రత్యేక హక్కు మాత్రమే కాదు, మానవ ప్రాథమిక హక్కు. ఇది యూనివ ర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (1948)సివిల్‌ అండ్‌ పోపై అంతర్జాతీయ ఒడం బడిక ద్వారా రక్షించ బడిరది.
భారతదేశంలో ఓటు హక్కు
భారత రాజ్యాంగంలో ఓటుహక్కు ఆర్టికల్‌ 326 ప్రకారం హామీ ఇవ్వబడిరది. ఈ ఆర్టికల్‌ ప్రకారం‘‘ప్రతి రాష్ట్రంలోని ప్రజల సభకు,శాసన సభకు ఎన్నికలు వయోజన ఓటు హక్కు ఆధా రంగా ఉంటాయిబీ అంటే,భారత పౌరుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేని ప్రతి వ్యక్తి తగిన శాసనసభద్వారా లేదా ఏదైనా చట్టం ద్వారా నిర్దేశించబడవచ్చు.ఈ రాజ్యాంగం లేదా ఏదైనా చట్టం ప్రకారం అనర్హులు కాదు. నివా సం ఉండకపోవడం, తెలివితక్కువతనం, నేరం లేదా అవినీతి లేదా చట్టవిరుద్ధమైన అభ్యాసాల కారణంగా తగిన శాసనసభ ద్వారా అటువంటి ఎన్నికలలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.’’
యునైటెడ్‌ స్టేట్స్‌ రాజ్యాంగంలో ఓటు హక్కు
యునైటెడ్‌ స్టేట్స్‌ రాజ్యాంగంలో ఓటు హక్కు స్పష్టంగా పేర్కొనబడలేదు. ఏది ఏమైనప్పటికీ, ఫెడరల్‌ ప్రభుత్వం ఎన్నికల నిబంధన ద్వారా ఓటింగ్‌ ప్రక్రియను నియంత్రించే ఫ్రేమ్‌వర్క్‌ను రాజ్యాంగం అందిస్తుంది, ఇది సమాఖ్య ఎన్నిక లను నిర్వహించే ‘‘విధానానికి’’ సంబంధించిన చట్టాలను ‘‘తయారు లేదా మార్చే’’ అధికారాన్ని కాంగ్రెస్‌కు ఇస్తుంది. అదనంగా, అంతర్యుద్ధం (1861-1865) తర్వాత ఆమోదించబడిన రాజ్యాంగంలోని 14వ మరియు 15వ సవరణలు జాతి లేదా రంగు ఆధారంగా ఓటింగ్‌లో వివక్షను నిషేధించాయి.1920లో ఆమోదించబడిన 19వ సవరణ, లింగం ఆధారంగా ఓటింగ్‌లో వివక్షను నిషేధించింది.1971లో ఆమోదించబడిన 26వ సవరణ,18సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి వయస్సు ఆధారంగా ఓటు వేయడంలో వివక్షను నిషేధిస్తుంది.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలి`జిల్లా కలెక్టర్‌ డా.ఎ. మల్లిఖార్జున
పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు అతి శక్తి వంతమైనదని…ప్రజాస్వామ్య పరిరక్షణకు అదొక వజ్రాయుధం లాంటిదని దానిని సక్రమంగా వినియోగించుకోవటంద్వారా తమ ప్రథమ కర్త వ్యాన్ని నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ. మల్లి ఖార్జున పేర్కొన్నారు. మే13న జరిగే ఎన్నికల పండుగలో కుటుంబ సమేతంగా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు ప్రాముఖ్యతను,ఆవశ్యకతను తెలుసు కోవాలని.. వంద శాతం ఓటింగే లక్ష్యంగా ప్రతిఒక్కరూ ముం దుకు సాగాలని పిలుపునిచ్చారు. ఓటరు చైతన్యం, ఓటు ప్రాముఖ్యత,వినియోగం,హోం ఓటింగ్‌ విధానం,పోలింగ్‌ స్టేషన్ల వద్ద కల్పించిన వసతులు, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్టు తదితర అంశాలపై ఆల్‌ ఇండియా రేడియోద్వారా జిల్లా కలెక్టర్‌ ఓట ర్లకు సందేశం ఇచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్‌ లో నిర్వ హించిన టాక్‌ షోలో పాల్గొని ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు.
తొలిసారి ఓటు పొందిన యువత ఉత్సాహం చూపాలి
‘‘జిల్లాలో తొలిసారిగా ఓటు పొందిన 18-19 సంవత్సరాల మధ్యగల యువత సుమారు 60వేల మంది ఉన్నారు. వారంతా తమ ఓటు హక్కు వినియోగంలో ఉత్సాహం కనబరచాలి. మే 13న జరిగే పోలింగ్‌ రోజున ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. యువశక్తిదే నిర్ణయాత్మకం. వారు తప్పకుండా ఉత్సాహం ప్రదర్శించి ఓటు హక్కును వినియోగించుకోవాలని… ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి’’ అని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.
విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక క్యూ లైన్లు
‘‘జిల్లాలోని 1991పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. అన్ని చోట్లా పటిష్ట ఏర్పాట్లు చేశాం. వయో వృద్ధు లకు,విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక వసతులు సమకూర్చాం. వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాం.విభిన్న ప్రతిభావంతులతో ఒకరు సహాయ కంగా రావొచ్చు. అయితే ఒకరితో వచ్చిన సహాయ కులు మరొకరితో ఇంకొసారి రావటానికి వీలు లేదు. ఓటరు ఓటు వేసేటప్పుడు సహాయకుడు దూరంగా ఉండాలి’’ అని కలెక్టర్‌ సూచించారు.
హోం ఓటింగ్‌ సదుపాయం వారికి ప్రత్యేకం…
‘‘ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం 85 ఏళ్లు దాటిన వృద్ధులకు,40 శాతం వైకల్యం దాటిన వారికి ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకొనే వెసులు బాటు కల్పించాం. ఇప్పటి వరకు సుమారు 1500 పై చిలుకు దరఖాస్తులు అందాయి. వాటిని పరిశీ లించి తదుపరి చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు అన్ని రకాల అధికారులు ఇంటికి వచ్చి.. రహస్య పద్ధతిలో ఓటింగ్‌ జరిపిస్తారు. తొలి విడత మే 7,8వ తేదీల్లో జరుగుతుంది. ఒక వేళ ఎవరైనా మిగిలిపోతే మే 9వ తేదీన మరొక సారి అవకాశం కల్పిస్తాం.హోంఓటింగ్‌ అనేది ఐశ్ఛికం మాత్రమే. ఒకవేళ ఎవరైనా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు’’అని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు.
వేసవి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
‘‘వేసవిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలోని 1991 పోలింగ్‌ కేంద్రాల వద్ద షామియానాలు, తాగునీరు ఏర్పాటు చేస్తాం. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో సాధారణ పౌరుల అవసరాలను గుర్తించి చలివేంద్రాలు ఏర్పాటు చేశాం’’ అని జిల్లా కలెక్టర్‌ వివరించారు.
ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నాం
‘‘జిల్లాలో కోడ్‌ అమల్లోకి వచ్చిన రోజు నుంచీ అప్రమత్తంగా ఉంటున్నాం. పటిష్ట చర్యలు చేపట్టాం. ఇప్పటికే 58 ఘటనల్లో ఎఫ్‌.ఐ.ఆర్‌.లు నమోదు చేశాం. 68 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నాం. కోడ్‌ అమలుకు 110 రకాల బృందా లను నియమించాం. వస్తు, ధన రూపంలో ఇప్పటి వరకు రూ.5.03కోట్లను జప్తు చేశాం.కేంద్ర ఎన్ని కల సంఘం జారీ చేసిన నిబంధనలను తు.చ. పాటిస్తున్నాం. ఓటరు చైతన్యం కల్పించేం దుకు వీలుగా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తాం. మేధా వులతో చర్చలు ఏర్పాటు చేస్తాం’’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు.
పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి ప్రత్యేక కేంద్రాలు
ఎన్నికలవిధుల్లో భాగస్వామ్యం అయ్యేవారి కోసం.. అత్యవసర సేవల్లో నిమగ్నమయ్యే వారి కోసం.. ప్రత్యేక చర్యలు చేపట్టాం. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశాం. ఫాం 12డిని సేకరిస్తున్నాం.మే 5,6,7,8వ తేదీల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో స్థానిక ఉద్యోగులు, బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సేవలందిస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించు కోవచ్చని’’ కలెక్టర్‌ సూచించారు.
ఎపిక్‌ కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చు..
ఓటరు జాబితాలో పేరుండి..అర్హులైన వారు ఎపిక్‌ కార్డు లేకపోయినా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కలెక్టర్‌ చెప్పారు. కేంద్రం ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల కార్డులు, ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంకు పాసు పుస్తకం ఇర ఆధారాలు చూపించి ఓటు వేయొచ్చని స్పష్టం చేశారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందుగా ప్రతి ఓటరుకు ఓటరు ఇన్ఫర్మేషన్‌ స్లిప్పులు అందజే స్తామని తెలిపారు.ఎలాంటి ప్రలోభాలకు గురికా కుండా ఓటర్లు చైతన్యవంతంగా ఉంటూ ఓటును వేయాలని సూచించారు.
వంద శాతం ఓటింగ్‌ కు అందరూ సహకరించాలి
మే13న అందరూ పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని..తద్వారా వందశాతం ఓటింగ్‌కు అధికారులు, ఓటర్లు పూర్తి స్థాయిలో సహకరించా లని కలెక్టర్‌ ఆల్‌ ఇండియా రేడియో ద్వారా ఇచ్చిన సందేశంలో పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో 67 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని..ఈ సారి 80 శాతం దాటేలా అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 7.00 గంటలకే పోలింగ్‌ ప్రారంభమవుతుందని..సాయంత్ర 6.00 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.6.00 గంటలకే లైన్లలోకి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారందరికీ ప్రత్యేక స్లిప్పులు జారీ చేసి వారంతా ఓటు వేసే వరకు పోలింగ్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మా ఒక్కరి ఓటు వల్ల ఏం జరుగు తుందిలే అనే నిరూత్సాహ భావం వద్దని.. అంద రూ ముందుకు వచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలి కారు. రాజ్యాంగ వ్యవస్థలు.. న్యాయ వ్యవస్థ… మీడియా వ్యవస్థ మాదిరిగా పౌరులు ఓటు హక్కును వినియోగించుకోవటం ద్వారా ప్రజాస్వా మ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున పిలుపునిచ్చారు. ఆల్‌ ఇండియా రేడియో టాక్‌ షోలో డీఐపీఆర్వో ఎస్‌.వి. రమణ, డివిజనల్‌ పీఆర్వో డి.నారాయణ రావు,ఆల్‌ ఇండియా రేడియో ప్రోగ్రాం హెడ్‌ పీవీ రామ్‌ గోపాల్‌, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌. సుధా కర్‌ రెడ్డి, డ్యూటీ అధికారి సాంబశివరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.- (గునపర్తి సైమన్‌)

ఏపీలో ఎన్నికల కోడ్‌`2024

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది సీఈసీ. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర సరిహద్దుతో పాటుగా జిల్లాల సరిహద్దుల్లో కూడా అవసరమైన చోట చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.డబ్బులు, బంగారం, వెండి,మద్యం,విలువైన వస్తువులు భారీగా పట్టుబడుతోంది.దీంతో ఎంత వరకు డబ్బు,బంగార,వెండిని వెంట తీసుకె ళ్లొచ్చు..ఒకవేళ తీసుకెళితే ఎలాంటి ఆధారాలు ఉండాలి అనే నిబంధనలపై చర్చ జరుగుతోంది.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం..పరిమితికి మించి తీసుకెళ్తే తప్పనిసరిగా లెక్క చూపించాలి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రూ.50వేలు వరకు మాత్రమే డబ్బులు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ తీసుకెళ్లాల్సి వస్తే..ఆ నగదుకు సంబంధించిన వివరాలు, సరైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎక్కడికి తీసుకెళుతున్నారు వంటి అంశాలను చెప్పాల్సిందే. ఒకవేళ డబ్బులు తీసుకెళ్లేవారు ఇచ్చే డాక్యుమెంట్లు, చెప్పే విషయాల్లో నిజాలు లేకపోతే ఆ డబ్బుల్ని స్వాధీనం చేసుకుంటారు. సరైన పత్రాలు చూపించిన తర్వాతే తిరిగి ఆ నగదును అప్పగిస్తారు. అప్పటి వరకు ఆ డబ్బులు కోర్టు కస్టడీలో ఉంటాయి. ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. డబ్బులు మాత్రమే కాదు.. బంగారం, వెండి తదితర ఆభరణాలు, విలువైన వస్తువుల్ని కూడా పరిమితికి మించి తీసుకెళ్లకూడదు..
నియమావళి అంటే ఏమిటి, పాటించకపోతే ఏమవుతుంది?
లోక్‌ సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ లకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. దీంతో 2024 జనరల్‌ ఎలక్షన్స్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రక్రియ మొదలు పెట్టినట్లయింది.ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో కోట్లమంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో ఎన్నికల నియ మావళి(ఎలక్షన్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) కూడా అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.దేశంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనలనే ‘‘ఎన్నికల నియమావళి’’గా పిలుస్తారు.ఎన్నికల నియమావళిని అమలుచేసిన తర్వాత ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సిబ్బందిగా పని చేస్తారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరు ఈసీ కోసమే పనిచేస్తారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత,ఒక పార్టీకి ప్రయో జనాలు చేకూర్చేలా ప్రజాధనాన్ని ఉపయోగించ కూడదు. ఒకసారి కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత,కొత్త ప్రభుత్వ పథకాలు,భూమి పూజలు,శంకుస్థాపనలు,ప్రకటనలు చేయ కూడదు.ప్రభుత్వ వాహనాలు,విమానాలు, ప్రభుత్వ భవనాలను ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోకూడదు.ఎన్నికల ర్యాలీలు, పాదయాత్రలు,బహిరంగ సభలు లాంటి ప్రజా కార్యక్రమాలు నిర్వహించే పార్టీలు,అభ్యర్థులు, వారి మద్దతుదారులు ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. మతం,కులంపేరుతో ఏరాజకీయ పార్టీ ఓట్లు వేయాలని అభ్యర్థించకూడదు.మత ఘర్షణలు రెచ్చగొట్టేలా లేదా కులాల మధ్య చిచ్చు పెట్టేలా లేదా భాష పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేలా అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రకటనలు లేదా వ్యాఖ్యలు చేయకూడదు. పార్టీలు లేదా అభ్యర్థుల విమర్శలు..విధాన నిర్ణయాలు,పథకాలు,కార్యక్రమాలు,గతంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి.అభ్యర్థుల వ్యక్తిగత అంశాలు, ప్రజా జీవితంతో సంబంధంలేని అంశాల జోలికి పోకూడదు. నిరూపించలేని ఆరోప ణలను చేయకూడదు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మసీదులు, చర్చ్‌లు, దేవాలయాలు ఇతర ప్రార్థనా స్థలాలను ఉపయోగించుకో కూడదు.ఎన్నికల చట్టంలో నేరాలుగా పరిగణించే ‘‘అవినీతి‘’ విధానాల జోలికి అభ్యర్థులు, పార్టీలు వెళ్లకూడదు.ఓటర్లకు డబ్బులు లేదా బహుమతులు ఇచ్చి ప్రలోభ పెట్టడం,భయపెట్టడం,దొంగ ఓట్లు వేయడం లాంటివి చేయకూడదు.పార్టీలు ఓటర్లకు లంచం ఇవ్వడం/బెదిరించడం/అవమానించడం లాంటవి చేయకూడదు.ఓటర్లను పోలింగ్‌ స్టేషన్‌లకు, అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు కల్పించకూడదు. పోలింగ్‌ రోజున మద్యం సేవించడం/పంపిణీ చేయడం నిషేధం.పోలింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచార బోర్డులు ఏర్పాటుచేయకూడదు. పోలింగ్‌కు ముందు 48 గంటల సమయంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలూ నిర్వహించకూడదు.ఎన్నికల కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్‌ ఎన్నికల పరిశీలకులను నియమిస్తుంది.
ప్రవర్తనా నియమావళి ఎప్పుడు ప్రారంభమైంది?
భారత్‌లో 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికలతో ప్రవర్తనా నియమావళి (కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల అంగీకారంతో వారితో సంప్రదింపులు జరిపి ప్రవర్తనా నియమావళిని రూపొందించారు. పార్టీలు, అభ్యర్థులు ఏ నియమాలను అనుసరించాలో నిర్ణయించుకున్నారు.1967 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ప్రవర్తనా నియమావళి అమలు చేశారు. దానికి కొన్ని కొత్త విషయాలు, నియ మాలు పొందుపరిచారు.కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఏ చట్టంలోనూ భాగం కాదు.కానీ దానిలోని కొన్ని నిబంధనలు ఐపీసీలోని సెక్షన్ల ఆధారంగా అమలవుతాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ 1979లో రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రవర్తనా నియమావళిని సవరిం చింది.1979 అక్టోబరులో జరిగిన సాధారణ ఎన్నికల నుంచి దీన్ని అమలుచేశారు.ప్రవర్తనా నియమావళి విషయంలో 1991జనరల్‌ ఎల క్షన్స్‌ అత్యంత ముఖ్యమైనవి.ఈ సమయంలో ప్రవర్తనా నియమావళిని విస్తరించారు.దీనిని అమలుపరచడంలో ఎన్నికల సంఘం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిచింది. తేదీలు (షెడ్యూల్‌) ప్రకటించిన రోజు నుంచే ప్రవర్తనా నియమావళి అమల్లోకి తెచ్చేలా చూడాలని ఎన్నికల కమిషన్‌ భావించగా,నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.ఈ వ్యవహారం చివరకు కోర్టుల వరకు వెళ్లింది.కానీ,అక్కడి నుంచి స్పష్టత రాకపోవడంతో చివరకు 2001 ఏప్రిల్‌ 16రాజకీయ పార్టీలు,ఎన్నికల సంఘం మధ్య జరిగిన చర్చల తర్వాత,షెడ్యూల్‌ విడుద లైన రోజు నుంచి ప్రవర్తనా నియమావళి (కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌)ను అమలు చేయడానికి ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి.అయితే, ఎన్నికల తేదీకీ, నోటిఫికేషన్‌కు మధ్య కనీసం మూడు వారాల (21రోజుల) గడువు ఉండా లన్న షరతు పెట్టారు.

ఏపీ ఎన్నికల `2024 షెడ్యూల్‌ ఇదీ..
ఏప్రిల్‌ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌
ఏప్రిల్‌ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
ఏప్రిల్‌ 26న నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్‌ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు
తెలంగాణలోనూ మే 13న ఎన్నికలు
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక
జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ..ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్‌ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు

` సైమన్‌

మహిళా లోకానికి స్పూర్తినిద్దాం

(గునపర్తి సైమన్‌)

ఇంట్లో అదనపు వరకట్నం కోసం హింసించే భర్త.. పాఠశాల, కళాశాలలో ప్రేమ పేరిట విసిగించే పోకిరీలు అదును చూసి కాటేసే కామాంధులు..పనిచేసే చోట మానసికంగా వేధింపులు ఇలా అడుగుకో మగాడు. మహిళ రక్త మాంసాలు నుంజుకుతినే మృగాడు. మరి ఈ అకృత్యాలకు అంతం లేదా? మగువకు రక్షణ లేదా? అంటే రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు, ఐపీసీలో మరెన్నో సెక్షన్లు ఉన్నాయి. వాటి గురించి అవగాహన లేకపోవడమే మహిళల పాలిటశాపంగా మారింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల సామాజిక,ఆర్థిక,సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను జరుపుకునే ప్రపంచ దినోత్సవం.లింగ సమానత్వాన్ని వేగవంతం చేయడానికి చర్యకు పిలుపుని కూడా సూచిస్తుంది. మహిళల విజయాలను జరుపుకోవడానికి లేదా మహిళల సమానత్వం కోసం ర్యాలీ చేయడానికి సమూహాలు కలిసి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన కార్యాచరణ కనిపిస్తుంది.ఏటా మార్చి 8న గుర్తు పెట్టబడుతుంది, ప్రపంచ మహిళా దినోత్సవం అనేది సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి.ఈ ఏడాదిప్రచార థీమ్‌ ఏమిటి?ప్రపంచ మహిళా దినోత్సవం2024 ప్రచార థీమ్‌ ఇన్‌స్పైర్‌ ఇన్‌క్లూజన్‌.(స్పూర్తి చేర్పించడం).మహిళల చేరికను అర్థం చేసుకోవడానికి,విలువైనదిగా ఉండటానికి మేము ఇతరులను ప్రేరేపించి నప్పుడు, మేము మెరుగైన ప్రపంచాన్ని రూపొందిస్తాము. మహిళలు తమను తాము చేర్చుకునేలా ప్రేరేపించబడినప్పుడు, వారికి సంబంధించిన భావన, ఔచిత్యం మరియు సాధికారత ఉంటుంది. ఇన్‌స్పైర్‌ ఇన్‌క్లూజన్‌ క్యాంపెయిన్‌ మహిళల కోసం మరింత సమగ్ర ప్రపంచాన్ని రూపొందిం చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐడబ్ల్యూడి` 2024 ప్రచార థీమ్‌ గురించి ఇక్కడ మరింత తెలుసుకుందాం!. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 ప్రచార థీమ్‌ ‘స్పూర్తి చేర్చడం’ చేరికను ప్రేరేపించడానికి కట్టుబడి ఉంది. మహిళా ఆర్థిక సాధికారతను కల్పిం చడం,మహిళా ప్రతిభను నియమిం చడం, నిలుపుకోవడం మరియు అభివృద్ధి చేయడం. మహిళలు,బాలికలను నాయకత్వం, నిర్ణయం తీసుకోవడం,వ్యాపారంలోకి మద్దతు ఇవ్వడం, మహిళలు,బాలికల అవసరాలకు అనుగు ణంగా మౌలిక సదుపాయాల రూప కల్పన, నిర్మాణం మహిళలు,బాలికలు వారి ఆరోగ్యం గురించి సమాచారం తీసుకునే నిర్ణయాలు తీసుకోవడంలో సహాయప డటం. స్థిరమైన వ్యవసాయం ఆహార భద్రతలో మహిళలు,బాలికలను చేర్చడం. మహిళలు మరియు బాలికలకు నాణ్యమైన విద్య,శిక్షణను అందించడం.క్రీడలో మహిళలు మరియు బాలికల భాగస్వా మ్యాన్ని మరియు విజయాన్ని పెంచడం. మహిళలు,బాలికల సృజనాత్మక,కళాత్మక ప్రతిభను ప్రోత్సహిం చడం.మహిళలు, బాలికల అభ్యు న్నతికి తోడ్పడే మరిన్ని రంగాలలో ప్రసంగిస్తారు.
సమానత్వం ఎక్కడుంది!..
ఆకాశంలో,అవకాశంలో సగం అన్నది నినాదంగా మిగిలాల్సిందేనా?ఇది చేవికి ఇంపు కలిగించడమే తప్ప..నేత్రానందం ప్రసాదించే అవకాశమే లేదా?జనాబా లెక్కల ప్రకారం,పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య తక్కువన్నది ప్రపంచ స్థితి.స్త్రీలు ప్రవేశించని రంగం లేదని, నిపుణత కనబరచని పని.లేదని పదేపదే చెప్పడం సరే.వారు నిలబడగలిగేలా చేస్తున్నమా,ఆత్మ విశ్వాసం కోల్పోకుండా చూస్తున్నామా?అన్నదే మన దేశంలో నాటికీ నేటికీ ప్రశ్న.స్త్రీలంటే అప్పటికే ఇప్పటికీ చిన్నచూపే.విధి నిర్వహణ ప్రదేశాల్లో రక్షణ అంతంత మాత్రమే.శ్రమకు సరిపడా ప్రతిఫలం లభిస్తోందా అన్నది ఈనాటికీ సందేహాస్పదమే.కాకుంటే..గతంలో కంటే వర్తమానంలో ప్రశ్నించే తత్వం పెరిగింది. నిలదీసి,నిగ్గదీసి నిలువునా కడిగి పారేసే ధీరత అలవాటుగా మారింది. ఆడవారిని కించపరిచే దుష్టశక్తుల పనిపట్టే తెగువా విస్తృతమవుతుంది. వీటన్నింటితో పాటు స్త్రీలపట్ల ఆలోచనా ధోరణిని ఇంకా మార్పుకావాల్సిన అగత్యమైతే ఇతర సమా జానికి చాలా ఉంది. ఆచరిస్తే సరి..!
సాధికారత గురించి మాట్లాడనివారు లేరు. మహిళలూ మీకు జోహార్లు అంటూ ఏటేటా కవితలల్లే వారికీ కొదవ లేదు.ఆకాశం, అవకాశం వివాదాల జోరు సరేసరి.టన్నుల కొద్దీ పదజ్ఞానం కన్నా,ఎంతో కొంతైనా ఆచరించి చూపడం మిన్న.అది సాకార మైనప్పుడే ఆడపిల్ల పెదవి మీద దరహాసం మెరుస్తుంది.అంతేకానీ,ఇంటా బయటా.. మాటలు చేతలూ ఆమె కన్నీటికి కారణ మైతే,జాతికి నిష్కృతి ఉండదు.ప్రాంతీయం నుంచి అంతర్జాతీయం దాకా ఇంతే!.
వరకట్న నిషేధ చట్టం-1961
భర్త, అతని తల్లిదండ్రులు, అడపడుచులు, అత్తింటి తరపున ఇతర బంధువులు ఎవరైనా వరకట్నం కోసం వేధిస్తే ఐదేండ్లకు పైగా జైలు,రూ.15 వేలకు తక్కువ కాకుండా జరి మానా విధిస్తారు.ఈ చట్టం ప్రకారం కట్నం ఇవ్వడం,తీసుకోవడం రెండు నేరమే. వరకట్న వేధింపులకు సంబంధించి మహిళలు నేరుగా సంబంధింత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసులపై మొదటి శ్రేణి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు విచారణ జరిపి శిక్షలు ఖరారు చేస్తుంది.
ర్యాంగింగ్‌ నిరోధక చట్టం-1997
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం 1997లో ర్యాగింగ్‌ నిరోధక చట్టం నంబర్‌ 28ను తెచ్చింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. 1800 18022 18055 నంబర్లకు విద్యార్థినులు ఫోన్‌చేసి సమస్యలను చెప్పవచ్చు. ర్యాగింగ్‌ వ్యవస్థ నిర్మూలనకు కళాశాలల్లో కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. ర్యాగిం గ్‌కు పాల్పడినట్లు రుజువైతే ఆరు నెలల నుంచి పదేండ్ల వరకు జైలు శిక్షతోపాటు కఠిన చర్యలు తీసుకుంటారు.
మహిళకు స్వేచ్ఛ కొంతే!
అందరూ ఒప్పుకోదగిన పరిణామం నాటికి, నేటికి స్త్రిల పరిస్థితులు మారాయి. నాలుగు గోడలమధ్య వంటిల్లే స్వర్గంలా భావించే మహిళలు ఇప్పుడు జన జీవన స్రవంతిలో ఒక విశిష్టమైన శక్తిలా కలిసిపోయి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.ముఖ్యంగా అభినందించవలసిన విషయం- విద్యారంగం లో పాఠశాల మొదలు కళాశాల వరకు బాలికలదే అగ్రస్థానం. చదువులకోసం తాత్కాలిక ఉద్యోగాలు (మెహంది, అల్లికలు, శుభకార్యాలలో పిండివంటలు తయారీ దార్లుగాను, హస్తకళలు, వాహనాలు నడిపే డ్రైవర్లుగాను) ఇలా ఎన్నో మరెన్నో పనులు చేసుకుంటూ తమ కాళ్ళమీద తాము నిలబడుతూ ఉన్నత వ్యక్తిత్వంతో ప్రయో జకులైన మహిళలు నేటి భారతీయ సమాజంలో నిత్య ప్రకాశ దీపాలుగా చెమటను ఆజ్యంలా పోస్తూ దశదిశలా అఖండమైన కాంతులతో వెలిగిపోతున్నారు. ఆనందించవలసిన విషయం ఏమిటి అంటే వృత్తి విద్యాకోర్సులు, ఉద్యోగాలలో రాజకీయాలలో స్త్రిలకూ ప్రాముఖ్యం లభించడం. స్త్రిలు సమంగా నేర్పుగా అంకితభావంతో గొప్పగా పనిచేయటం, వారు రాణించినంత గొప్పగా పురుషులు రాణించలేకపోవడం ఆశ్చర్యం కాకపోతే మరేమిటి?
ఇలా పలు విధాలుగా వైద్య,విద్యా,విజ్ఞాన, రాజకీయ,క్రీడా,రక్షణ రంగాలలో ఎక్కడ చూసినా,ఏ నోటవిన్నా పదును పెట్టిన ఆయు ధంలా మహిళా శక్తి, యావత్‌ ప్రపంచం స్తంభించిపోయేలా ఉప్పెనలా పొంగి పొరలి నింగిని తాకుతున్న కెరటాలవలే ఎగసిన మహిళా స్ఫూర్తికి, ఎవరూ సాటిలేరు, పోటీ పడరు అనే విధం రాకెట్టులా ఆకాశంలో దూసుకుపోతున్న మహిళా చైతన్యం అందరూ హర్షించదగిన విషయం.
ఈ ప్రపంచంలో మహిళలు రచయిత్రులుగా, కవయిత్రులుగా ఉపన్యాసకులుగా,ఉద్యమ కారిణులుగా ఉపాధ్యాయినిలుగా,గృహిణు లుగా ఉన్నత ఉద్యోగస్తులుగా,మంత్రులుగా, శాసనసభ్యులుగా,న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా,ప్రాణాలను రక్షించే వైద్యులుగా,స్వచ్ఛంద సంస్థల అత్యున్నత అధికార సభలకు అధ్యక్షులుగా,ఆయా రంగాలలో వారు చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎందరో మహిళలు ఆకాశంలో వెలిగే స్వయం ప్రకాశక నక్షత్రాలుగా వెలుగొందుతున్నారు.
ఇకపోతే కొన్ని గమనించవలసిన ముఖ్య విషయాలు ఏమిటి అంటే- ఇన్ని రకాలుగా అన్ని విధాలుగా ఇంత గొప్పగా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించబడుతున్న ‘మహిళ పాత్ర’ సమాజంలో మమేకమవుతున్న ‘స్త్రి అభ్యుదయం’ ఇంకా మొదట్లోనే వుంది. మొక్కగానే వుంది. ఎక్కడో ఒకచోట దాని కూకటి వేరు కత్తిరించబడుతూనే వుంది. బాలికగా విద్యార్థినిగా, గృహిణిగా.. ఉద్యోగి నిగా, మంత్రిగా ఇలా ఎన్నో విధాలుగా రూపొంతరాలు చెంది సమాజంలో భాగంగా మారినా స్త్రి యొక్క స్వయం నిర్ణయం ఇంకా పురుషుల చేతులలోనే వున్నది. స్త్రి పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలిసి నడవా ల్సిందే. కాని నియంతృత్వ ధోరణితో కట్టిపడే యటమే మహిళా స్వేచ్ఛకు ఇబ్బందిగా అభ్యం తరకరంగా ఉంది కాని అదే జరుగుతుంది కదా. కొన్ని చోట్ల అడుగడుగునా ఆటంకాలు. అలుపెరుగని మహిళా పోరాటాలు, మహిళల ఆత్మాభిమాన అణచివేతలు..ఆత్మవిశ్వాసానికి అవరోధం..ఇవన్నీ..కలిసి మహిళలను ఉప్పెన లా చుట్టుకుంటున్నాయి. తర తరాలనుండి వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, కట్టు బాట్లు నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థ కాలక్రమేణా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మార్పులు జరగాలి. భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా ఉద్యోగినిగా ఆర్థిక సేవలందిస్తూ, మాతృత్వంతో సంసారాన్ని పెంచే త్రిపాత్రధారిణిగా ఉప యోగపడే యంత్రంలా ఉందనుకుంటారు. కొందరి పురుషుల ఆలోచనలు కాని అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా స్త్రిలు శ్రమిస్తూనే వున్నారు. ఎలా అంటే నిరంతర నిత్య ప్రవాహంలా మహానదులై సముద్రాలై చరిత్రపుటంలో మహిళలు సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నారు. గృహ హింస, విడాకుల చట్టం- ఇలా ఇంకా ఎన్నో చట్టాలు స్త్రిలకి రక్షణ కవచాలుగా ఉన్నప్పటికి సగటు స్త్రి జీవితంలో రక్షణ కరువైందన్న కఠినమైన వాస్తవాన్ని అందరూ అంగీకరించవలసిందే.
వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రిలపైన జరిగే అత్యాచారాలను అరికట్టే వౌలికమైన మార్పు పురుషులలో రావాలి.ఈ మార్పు ముఖ్యంగా ప్రతి ఇంటినుండి మొదలవ్వాలి. చట్టసబలో మహిళలంతా ఏకతాటిపైకొచ్చినప్పటికీ మహిళా బిల్లు ప్రవేశపెట్టడానికే ఎన్నెన్ని అవస్థలు పడ్డారో, ఎన్నెన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారో యావత్‌ భారతావనికి తెలిసిన విషయమే. స్త్రిల యెడల ఇలాంటి పక్షపాత ధోరణి విడనాడాలి. మహిళా సాధికారత కార్యరూపం దాల్చాలి. మాటల రూపంలోనే మిగిలిపోకూడదు.
ఏది ఏమైనా సగటు స్త్రి జీవితంలో సంపూ ర్ణమైన, సమూలమైన మార్పు రావాలి. అత్యాచార కేసుల్లో దోషిని కఠినంగా శిక్షించాలి. ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో బ్రతుకగలగాలి. నిర్భయంగా నిర్ణయాధి కారాలు చేపట్టగలగాలి. అటువంటి సమ సమాజంలో అద్భుత ప్రపంచాన్ని ఆవిష్క రించాలి.

సమున్నత శిఖరం

విజయవాడలో ఆకాశమంత అంబేద్కరుడు.. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం, విశేషాలివే..! దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ,అంటరానితనం నిర్మూలన,సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మహా విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంగా పిలిచే పీడబ్ల్యూడి గ్రౌండ్స్‌లో ఏపీ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ నిధులతో నిర్మించిన 206 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఇవాళ సీఎం జగన్‌ ఆవిష్కరించనున్నారు. రూ.400 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచం లోనే ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహంగా (సామాజిక న్యాయ మహాశిల్పం) నిలవనుంది.ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మహా విగ్రహ విశేషాలెంటో ఇప్పుడు చూద్దాం.!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల డా.బీ.ఆర్‌. అంబేద్కర్‌ ఎత్తైన కాంస్య విగ్రహాన్ని నగరం నడిబొడ్డులో ఏర్పాటు అంబేద్కర్‌ స్మృతివనం పేరుతో సరికొత్త అందాలతో సర్వాంగ సుందరంగా నిర్మించారు. దీంతో ఈ ప్రాంతం రానున్న రోజుల్లో పూర్తి పర్యాటక ప్రాంతంగా మార నుంది. నగరంలోని ఏ మూల నుండి చూసినా ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహం మిలమిల మెరిసేలా ఏపీఐసీసీ,గిరిజన సంక్షేమశాఖ,పురపాక శాఖ సమన్వయంతో నిర్మాణాలు జరిగాయి.అంబేద్కర్‌ విగ్రహంతో పాటు,కన్వెన్షన్‌ సెంటర్‌,వాకింగ్‌ ట్రాక్‌,పార్క్‌ మ్యూజియంతోపాటు పలు నిర్మాణాల కోసం పీడబ్ల్యుడి గ్రౌండ్స్‌ లోని 18.81ఎకరాల స్థలాన్ని వినియోగించారు. దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. విగ్రహం మ్నెత్తం
ఎత్తు 206 (81అడుగుల బేస్‌, 125 అడుగుల విగ్రహం) అడుగులు. మార్చి 21, 2022లో పనులు ప్రారంభం కాగా..విగ్రహ తయారీకి 120 టన్నుల కాంస్యం వాడారు. 400 మెట్రిక్‌ టన్నుల స్టీలు, 2,200 టన్నుల శాండ్‌ స్టోన్‌ వాడారు. విగ్రహం తయారీకి మ్నెత్తం అయిన ఖర్చు. రూ.404.35 కోట్లు.
18.`8 ఎకరాల్లో ఈ విగ్రహాన్ని రూపొం దించారు. ఇందులో అందమైన గార్డెన్‌, వాటర్‌ బాడీస్‌, మ్యూజికల్‌ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్‌ చేసుకోవ టానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.జీ ప్లస్‌ టూగా నిర్మించగా..గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాల్స్‌ ఉన్నాయి. ఇందులో ఓసినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్‌ మ్యూజియంలు ఏర్పాటు చేశారు. ఫస్ట్‌ ఫ్లోర్‌లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేద్కర్‌కు దక్షిణ భారతదేశశంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్‌లో లైబ్రరీ ఏర్పాటుకు సిద్దం చేశారు. ఇక సెకండ్‌ ఫ్లోర్‌లో1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్‌లున్నాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది.మినీ థియేటర్లు,ఫుడ్‌కోర్టు,కన్వెన్షన్‌ సెంటర్‌,వెహికల్‌ పార్కింగ్‌ ఉన్నాయి. కన్వెన్షన్‌ సెంటర్‌ 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో,2,000 మంది సీటింగ్‌ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్‌ చుట్టూ నీటి కొలనులు,మ్యూజికల్‌, వాటర్‌ ఫౌంటేన్‌,ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్‌, బబ్లింగ్‌ సిస్టం ఉన్నా యి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేద్కర్‌ పీఠం(పెడస్టల్‌) ను రూపొందించారు.విగ్రహ బేస్‌ నిర్మాణానికి రాజస్థాన్‌కు చెందిన పింక్‌ రాక్‌ను ఉపయోగిం చారు.అంబేద్కర్‌ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌ వర్క్‌ ఏర్పాటు చేస్తున్నారు.అంబేద్కర్‌ జీవితంలో బాల్యం, విద్య, వివాహం,ఉద్యోగం,రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయా చిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటుచేస్తున్నారు. విగ్రహాన్ని హనుమాన్‌ జంక్షన్‌ వద్ద శిల్పి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కాస్టింగ్‌ చేశారు. స్థానిక కూలీలతో పాటు, ఢల్లీి, బిహార్‌, రాజస్థాన్‌ నుంచి వచ్చిన కూలీలు రెండేళ్ల పాటు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేశారు.ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు.
ఆంధ్రా తలెత్తుకునేలా.. సమున్నత అంబేద్కర్‌ విగ్రహం : సామాజిక న్యాయ ప్రదాత, రాజ్యాంగ రూప శిల్పి,సమసమాజ నిర్మాత డా.బీఆర్‌ అంబే ద్కర్‌ అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త చరిత్రను లిఖిం చేందుకు సిద్ధమైంది. ప్రపంచమే తలతిప్పి చూసేలా రాష్ట్రం నడిబొడ్డున 125 అడుగుల సమునన్నత విగ్రహం కొలువుదీరింది. అన్ని వర్గాల ప్రజలు దైవంలా కొలిచే అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుతో విజయవాడ నగరం సరికొత్త శోభను సంతరించుకుంది. ఓట్ల కోసం గత ప్రభుత్వం అమరావతిలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీ నీటిమూటగా మిగిలిపోయింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే విజయవాడలో అంబేద్కర్‌ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడమే కాకుండా కార్యాచరణకు పూనుకుంది. భారీ పీఠాన్ని నిర్మించి,పలు లోహాల సమ్మేళనంతో అతిపెద్ద విగ్రహాన్ని సగర్వంగా నిలిపింది.
సామాజిక న్యాయ మహా శిల్పం
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అంబేద్కర్‌ మహా శిల్పం ఆవిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఏపీ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు..ఈ సందర్భంగా సీఎం జగన్‌ విజయవాడలో మాట్లాడుతూ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంబేద్కర్‌ గారి మహా శిల్పం మన రాష్ట్రానికే కాకుండా దేశానికి తలమానికం అంటూ తెలియజేశారు. ఇది స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అంటూ కూడా తెలియజేశారు.ఈ శిల్పం ఒక సామా జిక న్యాయ మహా శిల్పం అంటూ కూడా తెలియజేయడం జరిగింది.
దేశంలో మూడో పెద్ద విగ్రహం..
ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్‌ విగ్రహం కాగా..దేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో మూడవది. మొదటిది స్టాట్యూ ఆఫ్‌ యూనిటీగా ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం 597అడుగుల ఎత్తులో ఉంది. రెండవది శంషాభాద్‌ పరిధిలో నిర్మించిన స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ తర్వాత విజయ వాడలో ప్రారంభం కానున్న 210 అడుగుల ఎత్తులోని స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం.
అంబేద్కర్‌ స్ఫూర్తిని భావితరాలకుఅందించాలి జాతికి స్ఫూర్తి ప్రధాత డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అని, ఆయన స్ఫూర్తిని భావిత రాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌ కుమార్‌ పేర్కొన్నారు. అమరావతిలో 125 అడుగుల డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ సందర్భంగా సామాజిక సమతా సంకల్పం పేరిట మానవహారం కార్యక్రమం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరి 23న విశాఖపట్నం రామా టాకీస్‌ వద్ద జరిగింది.జిల్లా రెవెన్యూ అధికారి మానవ హారంలో పాల్గొని, రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అంబేద్కర్‌ భవన్‌ వరకు కొనసాగిన సమైక్యత ర్యాలీలో పాల్గొన్న ఆయన డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ దంపతుల విగ్రహాలకు వివిధ కులసంఘాల నాయకులు, జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి అంబేద్కర్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన డా.బి.ఆర్‌. అంబే ద్కర్‌ చిత్ర పటానికి పూలమాలను వేసి జ్యోతి ప్రజ్వలనతో సామాజిక సమతా సంకల్పం చైతన్య కార్యక్రమాన్ని డీఆర్వో పారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం అంబేద్కర్‌ చేసిన కృషి, పోరాటం భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆయన స్ఫూర్తిని వాడవాడలా తీసుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. నేడు అనుభవి స్తున్న స్వేచ్చా వాయువులను మనకు అందిం చేలా చేసిన మహోన్నత వ్యక్తి డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ అని కొనియాడారు. సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిద న్నారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం భారత దేశానికి దిశా నిర్దేశం చేస్తుందన్నారు. ఆయన రూపకల్పన చేసిన రాజ్యాంగం ఏ దేశంలో లేదని, అటు వంటి రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవలసిన అవసరం మనందరిపై ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన భావజాలాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్య త అందరిపై ఉందని తెలిపారు. కార్యక్ర మం అనంతరం వెంకటరావు సమర్పిం చిన ఇంటిం టా రాజ్యాంగం పుస్తకాలను,అండ మాన్‌ కు చెందిన బతుకుల అప్పారావు సమర్పించిన అంబేద్కర్‌ జీవిత చరిత్ర పుస్తకాలను ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు.ప్రముఖ వక్త, యూపీఎస్సీ మెంబర్‌, ద్రవిడ యూనివర్సిటీ విశ్రాంత ఛాన్సలర్‌ ఆచార్య కె.ఎస్‌. చలం అంబేద్కర్‌ అందించిన సామాజిక న్యాయం గురించి వివరించగా, ఏ.యు. ఆంత్రోపాలజీ హెచ్‌ఓ డి ఆచార్య సత్యపాల్‌ అంబేద్కర్‌ విద్యా విశేషాల ప్రాము ఖ్యతను తెలిపారు. ఏ.యు.పొలిటి కల్‌ సైన్స్‌ ప్రొ.డా.వీర్రాజు అంబేద్కర్‌ రాజ్యాంగం గురించి వివరంగా తెలియ జేశారు.ఈ సంద ర్బంగా ఏర్పాటు చేసిన బి.ఆర్‌. అంబేద్కర్‌ జీవిత విశేషాల ఛాయాచిత్ర ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్ర మాలు అహుతులను అలరించాయి. కార్యక్ర మంలో రాష్ట్ర రెల్లి కార్పొరేషన్‌, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్లు వి. మధు సూధనరావు, భాస్కర రావు, జీవీ ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె. రామారావు,డీఎల్డీవో ఆర్‌.పూర్ణిమాదేవి, డీఈఓ చంద్రకళ, డీవీఎంసీ మెంబర్లు బొడ్డు కళ్యాణరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. – గునపర్తి సైమన్‌

ఇది అందరి పండుగ

రంగు రంగుల హరివిల్లులతో, రివ్వురివ్వున ఎగిరేగాలిపటాలతో, ఇంటికొచ్చే హరిదాసు లతో,అందంగాఅలంకరించిన బసవన్నలతో కనువిందు చేసే తెలుగువెలుగుల కాంతి మన రంగవల్లుల సంక్రాంతి. ఆప్యాయతలతో అనురాగాలతో ప్రేమాను బంధాలతోఅసలు సిసలైన ఆనందాల పూతోట మన ప్రియమైన సంక్రాంతి. వన్నెలద్దుకున్న గుమ్మాల వింత కాంతులతో కళకళలాడే నట్టింటి సోయగం మన ముచ్చటైనసంక్రాంతి. మావిడాకులతో, పూబంతీ చామంతులతో, తోరణాలతో అలం కరించుకున్న పందిరి మనపచ్చదనాల సంక్రాంతి. కొత్త అల్లుళ్ళతో, కొంటెమరదళ్ళతో మేళవించుకున్న సన్నాయి రాగంమన ఆట పాటల సంక్రాంతి. కోళ్ల పందాలతో,ఎడ్ల పందాలతో ఊరంతా హ్రోరెత్తిపోయే సంతో షాల వడిఈ సంబరాల సంక్రాంతి. నేతి అరిసె లతో కొబ్బరిబూరెలతో కలగలపు కూర లతో ఘుమఘుమలాడిరచే అరిటాకు భోజనం మన కమ్మనైనసంక్రాంతి. ఊరంతా పేరంటాల తో వాడంతా ఉత్సవాలతో ఇళ్లన్నీ కొత్త కాంతు లతో అంబరాన్నంటే ముంగిళ్ల కాంతి మన తెలుగు ఇంటి మమకారాల సంక్రాంతి. సంక్రాంతి సిసలైన రైతుల పండగ. శ్రామికుల పండగ. అల్లుళ్ల పండగ.గునపర్తి సైమన్‌
గిరిజన పల్లెకు ..సంక్రాంతి పల్లకి..
గిరిజన గూడెల్లో ముందస్తు సంక్రాంతి సందడి నెలకొంది..! ఏజెన్సీ గ్రామాల్లో అడవి బిడ్డలు సంబరాల ఊపందుకున్నాయి. జనవరి నెల వచ్చిందంటే చాలు..ఏజెన్సీ వ్యాప్తంగా సందడి వాతావరణం మొదలౌతుంది. ముఖ్యంగా మన్యంలోని గిరిజనుల సంప్ర దాయ సంక్రాంతి పండగను పుష్య పౌర్ణమి నుంచి ప్రారంభించారు. ప్రతి ఏడాది పుష్యమాసం ఆఖరు రెండు వారాల్లో ఎక్కడో చోట సంక్రాంతి పండగను గిరిజనులు ఉత్సా హంగా జరుపుకొంటారు. పుష్యమాసం వచ్చిన రెండో వారం తర్వాత గిరిజనులు భోగి చేసు కుంటారు. గ్రామంలోని పాత వస్తువులు, చీపుర్లు, కర్రలను భోగి మంటలో వేస్తారు. కొత్త కుండలో కొత్త బియ్యం, పప్పులతో పులగం తయారు చేసి గ్రామంలో అందరికీ పంచుతారు.భోగి రోజు నుంచి ప్రతి రోజూ రాత్రి వేళల్లో డప్పు వాయిద్యాలు,థింసా నృత్యాలతో సందడిగా ఉంటుంది. వ్యవసా యాధారంగా జీవనం సాగించే గిరిజనులు తమ వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించే రోజునే సంక్రాంతిగా భావిస్తారు. దీంతో భోగి మరుసటి రోజు సంక్రాంతి పండగ నిర్వహించుకుని, తమ పనిముట్లకు పూజలు చేస్తారు. మైదాన ప్రాంతంలో కనుమగా నిర్వహించే మూడో రోజును ఏజెన్సీలో పప్పల పండగ అంటారు. ఈ పం డగను కేవలం పశువుల కోసమే చేస్తారు. పశువులను శుభ్రంగా కడిగి,వాటి కొమ్ములకు రగ్గులు పూసి,అరెశలు,బూరెలు,గారెలతో చేసిన దండలను వాటికి వేస్తారు. ప్రత్యేకంగా పులగాలను వండి వాటికి ఆహారంగా పెడతారు.
పుష్యమాసాంతం వరకు సందడి
గిరిజనులు సంప్రదాయం ప్రకారం పుష్య మాసం రెండో వారం(పౌర్ణమి) నుంచి పక్షం రోజులు సంక్రాంతి పండగను నిర్వహి స్తారు. దీనిని స్థానిక భాషలో ’పుష్య పోరోబ్‌’ అంటారు. జనవరి 17 నుంచి 31వ తేదీ వరకు ఏజెన్సీ పల్లెల్లో సంక్రాంతి సందడి కొనసాగుతుంది. ప్రధానంగా ఇతర గ్రామాల్లో వారి బంధువులను తమ గ్రామాలకు ఆహ్వానించుకుంటారు. వారికి మద్యం, మాంసంతో విందు భోజనాలు పెడతారు. అలాగే కొత్త బట్టలను పెడతారు. అలాగే పుష్యమాసం ముగిసే వరకు ప్రతి రోజు రాత్రుళ్లు మహిళలు థింసా నృత్యాలు, పురు షులు డప్పువాయిద్యాలతో సందడి చేస్తారు. పురుషులు మాత్రమే వివిధ వేషధారణలతో గ్రామాల్లో తిరుగుతుంటారు. దీంతో పుష్య మాసంలో ఏజెన్సీలోని వారపు సంతలు సైతం జనంతో కళకళలాడతాయి. సంక్రాంతి నాడు పండిరచిన తొలిచూరి బియ్యంతో పులగం తయారు చేస్తారు. తమకు వ్యవసాయ జీవనాధారమైన పాడి పశువులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు..ఇప్పటికే కొన్ని గిరిజన పాడేరు మండలం వనుగుపల్లి పంచాయితీ లో సంక్రాంతి సందడిగా సాగుతోంది. క్యాలెండర్‌తో సంబంధం లేకుండా సాధా రణంగా అందరూ జరుపుకునే సంక్రాంతికి ముందు గ్రామ దేవతకు గంగాలమ్మకు పూజలు చేస్తారు. ఇక్కడ గిరిజనులు. అదే రోజు రాత్రి భోగి మంటలు వేసి భోగి పండగ జరుపుకుంటారు.పండిన వ్యవసాయ జీవనా ధారమైన పాడి పశువులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కొత్త వస్త్రం…కొత్త కన్నె..తాడు.. పూజలు నిర్వహిస్తారు. ఏడాది పండిరచిన కొత్త ధాన్యాన్ని పులగం ఆహారంగా తయారుచేసి పశువులకు తినిపిస్తారు.పశువుల మెడలో దుంపల్ని కడతారు.అంతా సందడిగా సంబరాలు చేసు కుంటారు.మరుసటి రోజు కనుమ పండుగ చేసుకుంటారు ఇక్కడే ఆదివాసీలు. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని, సాంప్రదాయాలను గిరిజనులు ఇప్పటికీ పాటిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గిరిజన మహిళలు ప్రత్యేక వస్తదారణతో ఆకట్టుకుంటారు. థింసా నృత్యం చేస్తూ ఆడి పాడతారు.
మైదాన ప్రాంతాల్లో ఇలా…
పిల్లల పండగ.పెద్దలు,వృద్ధుల పండగ. బీదాబిక్కి పండగ. కళకళలాడుతున్న పంట పొలాలను, పండబోయే దిగుబడిని తలుచు కొని సంతోషపడుతుంటారు. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంప దకు గొప్ప స్థానమిచ్చే ఈ సంక్రాంతి పండు గను బీద,గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకు కర్షకులు ఆనందంలో పాలుపంచుకుంటారు. సంక్రాంతికి విడుద లయ్యే సినిమాల సంగతి చెప్పనక్కరలేదు. సంక్రాంతి నాడు చేసే స్నాన, దాన, జపా దులు విశేష ఫలదాయకం. అన్నిటికన్నా ఉదయ కాల స్నానం ముఖ్యం. సంక్రాంతి నాడు స్నానం చేయని వారికి వ్యాధులు సంక్రమిస్తాయని శాస్త్రోక్తి. స్నానం చేసిన తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగిం చాలి. నువ్వులు, బియ్యం కలిపి శివుని అర్చిం చిన పిమ్మట ఆవునేతితో అభిషేకం చేయాలి. విష్ణువును, పౌష్యలక్ష్మిని పూజించి విష్ణుసహస్ర నామ పఠనం చేయాలి. తర్వాత లోక బాంధవుడు, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుడిని పూజించి కొత్తబియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలు పొంగించి భక్తిప్రపత్తులతో ఆయనకు నివేదించడం శుభప్రదం.భోజనంలో మంచి గుమ్మడి కూర ఉండేట్లు చూసుకోవాలి.చక్కెర పా నువ్వులు కలిపి చేసిన మిఠాయిలు తినడం, వాటిని చుట్టుపక్కల వారికి, స్నేహి తులకు, హితులకు పంచిపెట్టడం వల్ల బాంధవ్యాలు పెంపొందుతాయి. మకర సంక్రాంతి పితృపూజలకు అనుకూలమైన దినం కాబట్టి నువ్వులతో పితరులకు తర్పణ విడవాలి. పితృదేవతలకు పుణ్యప్రదమైన ఈ సంక్రమణం కాలంలో ఒకపూట భోజనం చేయడం మంచిది.
అనుబంధాల పెన్నిధి
బిడ్డలు..ఉద్యోగ,ఉపాధి అవకాశాలను అన్వేషిస్తూ..వేర్వేరుప్రాంతాలకు వెళ్లి స్థిరపడు తుంటారు.పల్లెకు,తల్లిదండ్రులకు అది బాదైనా..ఎక్కడున్నా తమ బిడ్డలు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు.అలా వెళ్లిన వారంతా ఈ పండగకు సొంత ఊళ్లకు తరలి రావడం..పల్లెకు,ప్రతి ఇంటికి సంక్రాంతే.
సమైక్యతల సన్నిధి
సంక్రాంతి..ప్రజల సమైక్యతను చాటుతుంది.దాన గుణాన్ని పెంపొందిం చడంతోపాటు ధని,పేద తారతమ్యం మరచి,ప్రతి ఇంట పౌష్యిలక్ష్మీని ఆహ్వానిస్తూ,జరిగే కార్యక్రమాలు గ్రామాలకు నూతన శోభను తెస్తుంటాయి.ఏడాది పొడవునా వచ్చే పండుగలు ఆ రోజుకు ఆరోజే చేసుకుంటారు. సంక్రాంతికి మాత్రం ముందుస్తు ఏర్పాట్లు జరుగుతుంటాయి. ప్రధానంగా అరిసెల తయారీ ఇరుగుపొరుగువారందరూ కలసిమెలసి చేసుకోవడం ఆకట్టుకుంటుంది.
చెక్కు చెదర‘నిధి’
మకర సంక్రాంతిని అత్యంత విశిష్టంగా భావిస్తుంటారు.తమ ఇంట కాలం చేసిన పెద్దలను పితృదేవతులుగా భావిస్తూ,వారిని నూతన వస్త్రాలునివేదించి..తమున్నతికి వారుచేసిన కృషిని గుర్తు చేసుకుంటూ భాష్పాంజలి సమర్పిస్తుంటారు.తమ హృదయాల్లో కొలువైన తమ వారి గురించి సంతానానికి తెలిపి,తర్వాత తరానికి దిశా నిర్ధేశం చేయడం అబ్బురమనిపిస్తుంది. ప్రకృతి వేళ ఆలయాల్లోనే కాదు..వేపచెట్టు మహాలక్ష్మీ,పోలేరమ్మ ప్రతిరూపాలుగా భావిస్తూ పూజలు చేయడం మన ఆన వాయితీ.సాప్ట్‌వేర్‌ ఇతర ఉద్యోగాల కోసం నగరాలు,ఇతర సుదూరాలకు వెళ్లినవారు సైతం గ్రామాలకు వచ్చిన తర్వాత ఈ ఉత్స హాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. పంక్తి భోజనాలతోపాటుకనుమనాడు తమజీవన గమనంలో తోడుగా నిలిచిన పశువులను అలంకరించి..గౌరవించడం ఎంతో ప్రత్యేకం.
సాంప్రదాయ వారధి
గతంలో పుష్యమాసంలో హరిదాసుల కీర్తనలు,గంగిరెద్దుల విన్యాసాలు,పిట్టల దొరల గొప్పలు..కాలక్రమంలో కనుమరుగవుతున్నా.. సంక్రాంతి సంప్రదాయం నిర్వఘ్నంగా కొనసాగుతోంది.అప్పట్లో చెడుగుడు,కబడ్డీ పోటీలు జరిగేవి.ఇప్పుడు వాటి స్థానంలో క్రికెట్‌,వాలీబాల్‌ చేరాయి.ఇంటి ముంగిళ్లలో ముగ్గులు,గొబ్బిళ్లు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
శాంతి,సౌభాగ్యం,ఐకమత్యం కలగ లిసినదే పండుగ. అందరూ పండుగగా వ్యవహరించే ఉత్సవాలు వ్యక్తిగతంగాను, కుటుంబ పరం గాను, బంధుగతంగాను జరుపుకుంటూ ఉం టాము. అంతవరకు వున్న కష్టాలు మరచి అందరితో కలసి మెలసి ఆనందం పంచుకునే దినమే పండుగ. ఈపండుగల క్రమంలో వచ్చే ముఖ్య మైన పండుగలలో సంక్రాంతి ఒకటి. సూర్యుడు తన ప్రయాణంలో ఒక రాశినుండి మరొక రాశి లోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ధనుస్సురాశినుండి మకరరాశిలోనికి ప్రవేశిస్తే మకర సంక్రమణం సంభవించి, ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమయి, మనం ఆచరించే ‘‘సంక్రాంతి’’ పండుగ వస్తుంది. సూర్యగమనం ఉత్తరాయణ, దక్షిణాయనాలు నిర్ణయిస్తే, చంద్రగమనం మాసాలు నిర్ణయిస్తుంది. సూర్యుడు ధనుస్సురాశిలో సంచరిస్తుండగా ధనుర్మాసం జరుగుతుంది. ఈ ధనుర్మాసం ముగియగానే సంక్రాంతి శోభలు ప్రారం భమవుతాయి. కాలచక్రంలోని రాశులలో మకరరాశి సర్వశ్రేష్టమైనది. శ్రవణానక్షత్ర ములో ఉద్భవించిన శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభునిగా బ్రహ్మకు సాక్షాత్కరిం చినది శ్రవణానక్షత్రములో. ఈ నక్షత్రము మకర రాశికి చెందినది.ఈకారణం చేత శ్రీమహా విష్ణువుని యొక్క రాశి మకరరాశి. దీనిని మానవుని శిరస్సుగా భావిస్తారు. అటువంటి మకరరాశిలోకి సహస్రకిరణుడైన సూర్యభగ వానుడు ప్రవేశించే మహత్తర పుణ్యదినం కాబట్టి, ప్రతీవ్యక్తిలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించటానికి అత్యంత అనువైన కాలం. వేదకాలంనుంచి శిష్యులు సరైన గురువు కోసం అన్వేషించటం, గురూ పదేశం పొందడం, వేదపారాయణలు సాగించటం వంటివి ఈ సమయంలోనే ఆరంభమవుతాయి. జగత్తు జలమjైునప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదివరాహమూర్తిగా అవతరించి భూమిని ఉద్ధరించిన రోజు సంక్రాంతి. వామనావతార ఘట్టములో వామనుడికి బలిచక్రవర్తి మూడడుగుల భూమిని దానం చేసినది, వామనుడి పదఘట్టనతో పాతాళానికి చేరినది ఈరోజే. దీనికి సంకేతంగా మనం సంక్రాంతి పర్వదినం జరుపుకుంటాము. ఈపండుగ భోగి, సంక్రాంతి, కనుము అని మూడు రోజులుగా జరుపుకునే పర్వదినం.
భోగిపండుగ
భోగి పండుగ పేరు చెప్పగానే మనకు స్ఫురించేవి భోగిపళ్ళు, భోగిమంటలు. ఆవుపేడతో పిడకలు తయారుచేసి యఙ్ఞ దేవతను తలుచుకుంటూ, పాపప్రక్షాణన జరిపించమని వేడుకుంటూ, ధర్మమార్గ పయనానికి సమాయత్తమవుతూ మంటలలో సూర్యోదయం సమయంలో వీటిని వేస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ ఈ మంటల చుట్టూ చేరి ఆనందోత్సాహలలో మునిగిపోతారు. ఈ మంటలలోనే పాతపడిన సామానులను కూడా వేసే సాంప్రదాయం కూడా కనబడుతుంది. నూతనత్వానికి ఆహ్వానం పలుకాలంటే పాతదనాన్ని విడనాడాలి.ఈ మంటలు వేదకాలమునాటి ఋషులు తాము సంవత్సరారంభములో వ్రేల్చిన ‘ఆగ్రాహాయణి’ హోమాగ్నికి ప్రతి రూపం. హోమ భస్మం మంత్రసారము, అతి పవిత్రమైనది. మంటలు శాంతించిన తరువాత ఈ హోమ భస్మాన్ని దైవప్రసా దంగా భావించి నుదుటిన ధరిస్తారు. పిల్లలకుకూడా నుదుటిమీద ఉంచి వారి ఆయురారోగ్యాలకై ప్రార్థిస్తారు. దేవతారాధన, నూతన వస్త్రధారణ, పిండివంటలతో భోజనము వగైరా పూర్తిచేసుకుని సాయంకాలం ‘‘భోగిపళ్ళ’’ వేడుక జరుపుతారు. పిల్లలను ఆశీర్వదిస్తూ పెద్దలంతా వారి శిరస్సుపై రేగిపళ్ళను పోస్తారు. రేగిచెట్టును సంస్కృతంలో బదరీ వృక్షం అని పిలుస్తారు. ఈవృక్షం విష్ణు ప్రీతికరమైనది. ఈ రేగిపళ్ళతోపాటు చిల్లర పైసలు, నానపెట్టిన శనగలు, పువ్వులు పిల్లల తలలపై పోస్తూ, శ్రీమహావిష్ణువులాగా తేజరి ల్లాలని ఆశీర్వదిస్తారు. తరువాత ముతై దువు లకు తాంబూలాలు ఇచ్చి సంతోషపరు స్తారు.
సంక్రాంతి పండుగ
రెండవ రోజైనది సంక్రాంతి పండుగ. పండుగలలో ప్రతీ రోజుకు ఒకప్రత్యేకత ఉంటుంది, వ్యవహార నియమ నిబంధన లుంటాయి. స్నానాదికాలు ఎలా ఆచరిం చాలి, ఎటువంటి పూజలు ఆచరించాలి, ఎటువంటి దానధర్మాలు చేయాలి అనేవి మన శాస్త్రాలు విపులంగా వివరించాయి. ఇవిశారీరిక ధారు ఢ్యాన్ని పెంపొందించి, వాతావరణ సమతుల్యత కాపాడుతూ, సమతలను పెంపొందిస్తాయి.నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం శారీరిక రుగ్మతలను నివారిస్తుంది. నువ్వులు సేవించటం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఈరోజు జరిపే శాంతి హోమాలు, మృత్యుంజయ హో మాలు, అభిషేకాలు, వివిధ దైవారాధనలు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించి, భగవ దానుగ్రహానికి తోడ్పతాయి. పితృదేవతల స్మరణ వారి అఖండ ఆశీర్వచనానికి దోహదం చేస్తాయి. ఇది పగటి పూట వస్తే ప్రశస్తము. మధ్యాహ్నమునకు పూర్వమే సంభవించే అర్ధోదయకాలమే పూర్తి ఫలితాన్ని స్తుంది. గొబ్బిళ్ళ సందడి సంక్రాంతి పం డుగు వేడుకలలో మరొక ప్రధానమైనది. కన్నె పిల్లలు చక్కటి వస్త్ర ధారణతో, తమకు కలిగిన ఆభరణాలతో చూడచక్కగా అలంక రించు కుంటారు. తెలుగుదనం ఉట్టి పడే కన్నె పిల్లలను చూచి కుటుంబ సభ్యులు మురిసి పోతారు. వివాహ వయస్సుకు వచ్చినారని చెప్పకనే చెబుతారు. పెద్దవారికి ఇది ఒక హెచ్చరికలాటిది. ఆవుపేడతో గుండ్రముగా బంతులవలె తయారుచేసి, ఇంటి ముంగిటి రంగవల్లుల మధ్య అమరుస్తారు. వాటిపై బంతిపూవులు, ఇతర రంగు రంగు పూలను అలంకరించి, వాటి చుట్టూ తన తోటివారితో, స్నేహితులతో వలయాకారంగా తిరుగుతూ, గొబ్బిపాటలు పాడుతూ,లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ తిరుగుతారు. ఇది సంధ్యా సమయంలో జరిగే కనుల పంట. చూచిన వారిదే భాగ్యం. మహాలక్ష్మికి ప్రీతిపాత్ర మైనది. ఈవిధంగా చేయటం వలన కన్నెపిల్ల లకు త్వరలోనే చక్కటి వరుడు లభించి వివాహం జరుగుతుందని విశ్వాసం. లయ బద్దంగా చిడతలు వాయిస్తూ, భుజము పైనున్న వీణను స్వరబద్ధముగా మీటుతూ, అడుగు అడుగులో గజ్జెల సవ్వడి నింపుతూ విలాసంగా సాగిపోయే హరిదా సులు మన సంప్రదాయ చిహ్నాలు. హరి నామ సంకీ ర్తన తప్ప మరొక మాయ వారి నోటి వెంట వెలు వడదు. రంగు రంగుల వస్త్రధారణతో, మెడలో పూదండతో హుందాగా నడుస్తూ సాగిపోతారు.
కనుమ
మూడవ రోజైన పండుగ కనుమ పండుగ. కనుమ నాడు మినుము తినాలంటారు. అందుకే ఆవునేతితో తయారుచేసిన మినపసు న్నెలు, బెల్లం గారెలు వంటిని తయారుచేసు కుంటారు.నోరూరించే పదార్థాలు జిహ్వను మరింత పెంచగా మానసిక సంతృప్తితో కడుపారా అస్వాదిస్తారు. వ్యవసాయదారులు తమ తమ పశువులను అలంకరించి వాటిని స్వేచ్ఛగా తిరిగేలా చేస్తారు. బలవర్థకమైన దాణావేసి విశ్రాంతిగా ఉండేలా చేస్తారు. వ్యవసాయ క్షేత్రములో వాటి అవసరం లేకుండా పంటలు పండవు.నాగరిక ప్రపంచ ములో యంత్రాల విని యోగం ఎక్కువైనప్ప టికి, పశువుల వినియోగం లేకుండా సాగదు. మనకు జీవనాన్ని,జీవి తాన్ని ఇచ్చిన ప్రతీ ప్రాణిని గౌరవించాలనే సత్సాంప్రదాయము మనది. కనుమనాడి కాకి కూడా కదలదు అనే నానుడి ప్రచారంలోఉంది. శాస్త్రపద్దతిలో ఆలోచిస్తే దీనికి తగిన కారణం కనబడు తుంది. దైనం దిన కార్యక్ర మాలకు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యు లతో కలసి మెలసి ఆనందంగా జీవించటానికి అవకాశం కల్పించేవే కొన్ని కట్టుబాట్లు, ఆచారవ్య వహారాలు. బయటకు వెళ్ళకోడదు అనే నియమం పెడితే చక్కగా ఇంటి వద్దే వుండి సంతోషంగా గడుపుతారని దీని ముఖ్యోద్ధే శము. అంతేకాకుండా మరుసటి రోజున బంధువులు తమతమ స్వస్థాలకు వెళ్ళిపోతారు కనుక వారి వీడ్కోలుకు కావలసిన కార్యక్రమ నిర్వహణకు దోహదం చేస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా కోడిపందేలతో మగవారు ఆనందిస్తారు.
బొమ్మల కొలువు ప్రతీ ఇంటా కొలువుదీరుతుంది. సంవత్సరం పొడవునా సేకరించిన రకరకాల బొమ్మలను పలు వరుసలలో అలంకరించి హృద్యమైన వాతావరణాన్ని తయారుచేస్తారు. వస్తుగ్రహ ణాశక్తిని పెంపొందించి, మానసిక శాంతిని కలిగిస్తుంది. సిరిసంపదలు కలుగుతాయని విశ్వాసం. బొమ్మల కొలువు పేరుతో ఇంటిని అందంగా అలంకరిస్తారు. పలువురు విచ్చేసి అలంకరణలను వీక్షించి ముగ్దులౌతారు. ఇంటిని అలంకరించిన మామిడి తోరణాలు, నూతన వస్త్ర ధారణలు,వాకిట భోగి మంటల వింత శోభలు,నట్టింట్లో నిండు గర్భిణిలా ధాన్యపు గాదెలు, వాకిట్లో హరిదాసులు ఆలపించే హరిభ జనలు, తోటల్లో కోడిపందేలు, పెరట్లో పశువుల అలంకా రాలు,అత్తింట్లో అల్లుడు గారు ఎక్కే అలక పాన్పులు, వంటింట్లో అత్తగారు చేసే నేతి అరిసెల ఘుమఘుమలు, అంగట్లో వస్త్రాల సంబరాలు, ఆలయాలలో దైవ పూజలు, ముంగిట్లో వయ్యారి భామలు దిద్దే ముత్యాల రంగవల్లులు, రంగవల్లులపై శోభిల్లే గొబ్బిళ్ళు, దాన ధర్మాల తృప్తిపొందిన దానగ్రహీ తలు.. కలగలసి మన సంక్రాంతి. ఈవిధంగా మూడు రోజులు నూతన వస్త్రాలు ధరించి, యథాశక్తి పూజలు, హో మాలు సలిపి, దానాలు చేసి, పశువులను అలంకరించి అందరితో కలసియధాశక్తి పిండివంటలు భుజించి అత్యంత ఆనందంగా గడుపుకుని, సంవత్సరమంతా పండుగలా గడవాలని కోరుకుంటారు.

విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర

కేంద్రంలో హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. గ్రామ స్థాయి నుంచి ఎన్నికల ప్రణాళికను రూపొందిం చేందుకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాల స్థాయిలో ఉన్న ప్రజ లందరికీ చేరువ చేసేలా ఒక పెద్ద డ్రైవ్‌ చేపట్టనుంది. ఆరు నెలల పాటు కొనసాగ నున్న ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా గ్రామాల్లో ఉన్న సంక్షేమ పథకాల అర్హులను గుర్తించి వారికి అవి అందేలా ఒక భారీ కార్యక్రమానికి కేంద్రంలోని మోదీ సర్కార్‌ శ్రీకారం చుట్ట నుంది. ఈ దీపావళి పండగ తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర పేరుతో ఈ మెగా డ్రైవ్‌ను దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది. దేశంలోని 2.7లక్షల గ్రామ పంచాయతీల్లో ఈ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్రను చేపట్టనున్నారు. ఈ మెగా డ్రైవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఎవరు అర్హులు అనేది గుర్తించి వారికి ఆ పథ కాల్లో ఉన్న ప్రయోజనాలను అందించడమే ఈ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ప్రధాన ఉద్దే శం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో పూర్తిగా అందేలా చూసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 నెలల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర.. దీపావళి పండుగ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల ప్రయోజ నాలు ఇప్పటివరకు అదని లబ్ధిదారులకు వేగంగా చేరేలా చూడాలని కేంద్ర మంత్రు లకు ప్రధాని సూచించినట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. ఈ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర కోసం ప్రత్యేకంగా రథాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ఫసల్‌ బీమా యోజన, పోషణ్‌ అభియాన్‌, ఉజ్వల్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌,పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన వంటి పథకా లకు సంబంధించి అర్హులుగా ఉండి.. ఇప్పటివరకు నమోదు చేసుకోని..వాటి ద్వారా లబ్ధి పొందని వారికి ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోనున్నారు. దీపావళి తర్వాత నుంచి ప్రారంభం కానున్న ఈ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర 6 నెలలు కొనసాగనుంది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మరోసారి అధికారాన్ని కట్టబెడు తుందని మోదీ సర్కార్‌ భావిస్తోంది.వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర పేరుతో జార్ఖండ్‌లో నవంబర్‌ 15న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.గిరిజన నేత బిర్సా ముండా జయంతి అయిన నవంబర్‌ 15న జార్ఖండ్‌ లోని ఖుంటిలోని ఉలిహతు గ్రామం నుంచి ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ను ప్రధాని మోడీ ప్రారంభించారు. గిరిజనుల జన్మస్థల మైన ఉలిహతును సందర్శించబోతున్న తొలి ప్రధాని మోదీయే కావడం విశేషం.యాత్ర మొదట్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల నుండి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 25 నాటికి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలను కవర్‌ చేస్తుంది. 3వేల వ్యాన్లతో ఈ యాత్ర రెండు నెలల పాటు కొనసాగుతుంది. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 15వేల పట్టణ ప్రాంతాలను ఈ యాత్ర కవర్‌ చేస్తుంది. ప్రతి వ్యాన్‌ రెండు గంటలపాటు గ్రామ పంచా యతీలో ఉండి, ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్న అర్హులైన లబ్దిదారులను గుర్తించి వారికి వాటిని అందేలా చూస్తుంది. దీని ప్రధాన లక్ష్యం దిగువ, మధ్యతరగతి జనాభా. వారు కేంద్ర పథకాల ప్రయోజనాలను పొందేలా చూడటమే. ఇప్పటికే నవంబర్‌ 22 వరకు 21రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 69 జిల్లాల్లోని 393 ట్రైబల్‌ బ్లాక్‌లు, 9వేల గ్రామ పంచా యతీలు ఈ యాత్రలో కవర్‌ చేసింది. ఆ తరువాత ఈ యాత్ర ఇతర గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తారు. చివరికి వచ్చే ఏడాది లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టాలనేది ప్రధాని మోడీ లక్ష్యంగా కనిపిస్తోంది. అర్హు లందరికీ సంతృప్తస్థాయిలో పథకాలు అందిం చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఎంవై, పీఎం కిసాన్‌, ఫసల్‌ బీమా, పోషణ్‌ అభియాన్‌,ఉజ్వల,గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన తదితర పథకాలకు అర్హులను గుర్తించి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా 2.7లక్షల పంచాయితీలలో ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ చేపడుతోంది.
విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను విజయ వంతం చేయాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు ఈ నెలలో ప్రారంభిస్తున్న విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోక్య రాజ్‌ తెలిపారు. నవంబర్‌ 15న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోక్యరాజ్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లి కార్జునతో కలిసి విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర సన్నద్ధత, కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు,పథకాలపై ప్రజలలో చైతన్యం,అవగాహన కోసం విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ను నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లాలో ఈనెలలో ప్రారంభించు విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర జనవరి 26వ తేదీ వరకు జరుగుతుందని, ప్రధానమంత్రి దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు నోడల్‌ అధికారి, ఆహ్వన,ఉత్సవ కమీటీలను నియమించడం జరుగుతుందని తెలిపారు.విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి యోజన,సురక్ష బీమా యోజన,పోషన్‌ శక్తి నిర్మాన్‌ అభియాన్‌,జన్‌ధన్‌ యోజన,చేతి వృత్తి దారులకు తదితర పధకాలను ప్రచారం చేస్తూ రోజుకు రెండు పంచాయితీల్లో ప్రచార వాహనంతో చిత్ర ప్రదర్శన,సాంస్కృతిక ప్రదర్శనలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పధకాల లబ్ధిదారులను సమీకరిం చడం,అవగాహన కల్పించడం జరుగు తుందని,వివిధ పథకాల కింద అర్హులై ఉండి ప్రయోజనం పొందని వారిని గుర్తించి వారికి పధకాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం నిర్వహించే రోజులలో ఫ్యామిలీ డాక్టరు కార్యక్రమం కూడా ఉండేలా షెడ్యూలు చేసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.పధకాలకు సంబంధించిన శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, మండల అభివృద్ది అధికారులు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, లబ్దిదారుల వీడియోలను సంబంధిత పోర్టలు నందు అప్లోడ్‌ చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ డా ఏ మల్లిఖార్జున మాట్లాడుతూ ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి చేతులమీదుగా విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. మైదానం, రూరల్‌ ప్రాంతాలలో ఈ నెల చివర నుండి ప్రారంభమగునని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు రెండు నెలలు పాటు జరుగు విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర షెడ్యూల్‌ ప్రకారం, ప్రణాళికా బద్ధంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. యాత్ర జరుగు రోజులలో సంబంధిత శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు.జిల్లా పరిషత్‌ సిఈఓ ఎం పోలి నాయుడు కార్యక్రమ షెడ్యూల్‌, వివిధ శాఖల అధికారులు చేయవలసిన వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి,గ్రామ,వార్డు సచివాలయ అధికారి,జిల్లా వైద్య అధికారి,జిల్లా పౌర సరఫరాల అధికారి, డి.ఆర్‌.డి.ఎ. ప్రోజెక్టు డైరెక్టరు, హౌసింగు ప్రోజెక్టు అధికారి, పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజరు,జిల్లా వ్యవసాయఅధికారి, జిల్లా ద్యానఅధికారి, జిల్లా మత్స్యఅధికారి, ఐ.సి.డి.ఎస్‌. ప్రోజెక్టు అధికారి,గ్రామీణ నీటి సరఫరా సూపరిం టెండెంటు ఇంజనీరు పాల్గొని వారి శాఖల పరిధిలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ పధకాల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. – గునపర్తి సైమన్‌

1 2 3 6