చెట్లు విలువ ఎంత..?

సమాజానికి,పర్యావరణానికి సేవ చేస్తు మానవ జాతికి ఆక్సిజన్‌,సూక్ష్మపోషకాలు ఇతరాత్ర విలువైన సంపదను అందిస్తున్న మన వారసత్వవృక్షాలు అభివృద్ధిపేరుతో గొడ్డలి వేటుకు బలైపో తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఐదు రైల్వే ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం కోసం 356 చెట్లను నరికేశారు.దీనిపై ఓఎన్జీఓ సుప్రింకోర్టును ఆశ్రయించారు.ఆకేసును విచారించిన కోర్టు,నిషికాంత్‌ ముఖర్జీ (టైగర్‌ ఎన్విరాన్‌ మెంట్‌ సెంటర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌),సోహంపాండ్యా (కార్యదర్శి)లతో ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఈకమిటీ కోర్టుకు నివేదించిన నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడిరచారు.డబ్బు చెట్లను పెంచదుని తెలిపింది.చెట్టు యొక్క ఈద్రవ్య మదింపును నిపుణుల బృందం ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో నిపుణుల కమిటీ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది.
ఒకచెట్టు ధరను దాని వయస్సుతో గుణించి రూ.74,500గా నిర్ణయించింది.చెట్ల మదింపుపై మార్గదర్శకాలను రూపొందించడానికి ఒక నివేదికలో ఒక చెట్టు ద్రవ్య విలువను ప్యానెల్‌ పేర్కొంది.ఒక వారసత్వ వృక్షం పౌరసమాజానికి,పర్యావరణానికి సేవచేస్తుందని,ఆక్సిజన్‌,సూక్ష్మపోషకాలు, కంపోస్ట్‌, బయో-ఎరువులతో సహా వివిధ గణనలపై దాని విలువను చేరుకోవచ్చని నిపుణుల కమిటీ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎబోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది.ప్రాజెక్టుల కారణంగా నరికివేయబడుతున్న ఈ చెట్ల ఆర్థిక,పర్యావరణ విలువ అధికం.2021లో దాఖలు చేసిన నివేదిక బహిరంగపరిచారు.ఇది భారతదేశంలో మొదటిసారి జరిగింది.
అన్ని ఖర్చులను చెట్టు యొక్క మిగిలిన వయస్సుతో కలిపి గుణిస్తే,ప్రస్తుత సందర్భంలో 100సంవత్సరాలలో,మొత్తం చెట్టు సంవత్సరానికి రూ.74,500అవుతుంది. ఇందులో ఒక్క ఆక్సిజన్‌కే ఏడాదికి రూ.45వేలు,ఆ తర్వాత బయోఫెర్టిలైజర్ల ధర రూ.20వేలు.సూక్ష్మపోషకాలు,కంపోస్ట్‌ ఖర్చులను జోడిరచడంద్వారా,జీవించేచెట్లు వాటిని నరికివేయబడుతున్న ప్రాజెక్టుల ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొనడం విశేషం.హైవే ప్రాజెక్టులకోసం చెట్లను నరికివేయడానికి బదులు, ట్రాఫిక్‌,రవాణా మౌలికసదుపాయాలను సులభతరం చేయడానికి ఇప్పటికే ఉన్న జలమార్గాలు, రైలు మార్గాలను ఉపయోగించడంవంటి ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు మొదట ప్రత్యామ్నాయ ఎంపికలను అన్వేషించాలని కూడా కమిటీ సూచించింది. చెట్లను నరికితే మొదటి ప్రయత్నంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాటిని తరలించడమే కాకుండా చెట్లనునరికివేస్తే ఆస్థలంలో ఐదు మొక్కలు నాటితే సరిపోదని కమిటీ స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ప్యానెల్‌ ముందు సమర్పించిన నివేదిక బాధిత రైతులకు భూమి,చెట్లకు ముఖ్యంగా ఫలాలను ఇచ్చే చెట్లకు న్యాయమైన నష్టపరిహారాన్ని కోల్పోయినందున వారికి సహాయకరంగా ఉండవచ్చు అని నిపుణల నివేదిక భావించింది.
అయితే జీ`20పేరుతో విశాఖాని సుందరంగా తీర్చిదిద్దడానికి అనేక వృక్షాలను విచాక్షణ రహితంగా నరికేశారు.దేశంలోనే పేరుగాంచిన ఆంధ్రా విశ్వవిశ్వవిద్యాలయంలో శతాబ్దల సంవత్స రాలకుపైగాఉన్న వారసత్వ వృక్షాలను సైతం నరికేశారు.అదేవిధంగా షెడ్యూల్‌ ప్రాంతమైన ఏజెన్సీలో నిర్మిస్తున్న హైవే రహదారి నిర్మాణం కోసం దట్టమైన అడవిలో ఉండే వేలాది వృక్షాలను నరికివేయడం గమనార్హం.సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం..గుత్తేదారు కంపెనీ, అటవీ అధికారుల నుండి ఖర్చులను పరిపాలన ఇప్పుడు గుర్తించగలదా?నిపుణుల నివేదికను పరిశీలిస్తే ఇప్పటి వరకూ ఇక్కడ ఎంతో వారసత్వ సంపద గల విలువైన వృక్షాలను కోల్పోయాం అనేది తెలుస్తోంది.ఇప్పటికైనా ప్రభుత్వ పరి పాలన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయడంలో ముందుండాలి.ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాల్సిన అవశ్యకత ఉంది.!– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్