ప్రైవేట్‌ స్కూల్స్‌..ఫీజల నియంత్రణ ఎక్కడ

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. కార్పొరేట్‌ స్కూళ్లల్లో ఎల్‌కేజీ ఫీజులే సుమారు రూ.50వేల నుంచి రూ.లక్షన్నర మధ్యలో వసూలు చేస్తున్నారు.ఇంకా విద్యా సంవత్సరం పూర్తి కాకుం డానే ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లోనైతే అప్పుడే అడ్మిషన్లు పూర్తయినట్లు చెబుతున్నారు.తమ పిల్ల లను నాణ్యమైన చదువులు చదివించాలన్న తల్లిదం డ్రుల కోరిక ప్రైవేట్‌ విద్యా సంస్థలకు మంచి అవకాశంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి అక్రమ వసూళ్లకు తెరతీశారు. పట్టణా ల్లో చదవాలంటే హాస్టలు వసతి కూడా వారికి అవసరమవుతుంది.దీంతో స్కూలు, హాస్టల్‌ పేరుతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు,ఆ తర్వాత విద్యార్థు లకు పాఠశాలనుబట్టి రూ.60వేల నుంచి సుమారు లక్షరూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు తాము తక్కువ కాదం టూ కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు ఇదే సంప్రదా యానికి దిగాయి. సాధారణ చదువులతో ఐఐటి ఫౌండేషన్‌ అంటూ మరికొంత నొక్కుతున్నాయి.దీంతో విద్యా ర్థులను స్కూళ్లలో చేర్పించేందుకు వచ్చి,వెనక్కి వెళ్ళ లేక చేర్పించే సాహసం చేయలేక తలిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.
విద్యాహక్కు చట్టం అమలు తుంగలోకి
విద్యాహక్కు చట్టం సెక్షన్‌-6 ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాలి. సెక్షన్‌-11ప్రైవేటు యాజమాన్యాలు గవర్నింగ్‌ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయ కూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులోపెట్టాలి.సెక్షన్‌1,2ప్రకారం స్కూల్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను,నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను నియ మించి వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరా లను నోటీస్‌ బోర్డ్‌లో పెట్టాలని చట్టం చెబుతుంది. సెక్షన్‌-12ప్రకారంటీచర్‌,విద్యార్థుల నిష్పత్తి 1:20 కి మించరాదు.విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమా న్యం 25 శాతం సీట్లను ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగు లకు, మైనారిటీలకు కేటాయిం చాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్‌ బుక్స్‌, యూనిఫారాలు, స్కూల్‌ బ్యాగులు, ఇతర స్టేషనరీని అమ్మరాదు. ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా సూచించరాదు. విద్యార్థుల ఫీజు వివరాలను ఆన్‌లై న్‌లో ఉంచాలి. ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో పాఠశాలల్లో 1000 చదర పు మీటర్ల ఆటస్థలం, గ్రామీణ ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి. పాఠశాల యాజమాన్యం అభం శుభం తెలియని చిన్నారుల చేతికి స్కూల్‌ ఫీజుల రసీదులు ఇస్తున్నది.మీఅమ్మనాన్న ఇంకా ఫీజు చెల్లించలే దంటూ వారిని కించ పరుస్తున్నారు. ఫీజు స్లిప్పు లను చిన్నారుల చేతికిస్తే జరిమానా ఉంటుంది. అనుమతులు లేకుండా స్కూళ్లను ప్రారంభించ కూడదు. ప్రభుత్వ అనుమతి తోనే ప్రారంభించాలి. ఆరు నెలల్లోపు అనుమతులు పొందాలి. భవనానికి ప్రహరీ ఉండి, గాలి వెలుతురు బాగా వచ్చేలా ఉండాలి.చిన్నారులు నిద్రపోవడానికి ప్రత్యేకంగా విశ్రాంతి గది ఉండాలి. మరుగుదొడ్లు, స్నానాల గదిలో టవలు, సబ్బులు ఉంచి, పరిశుభ్రత చర్యలు పాటించాలి. ప్లే స్కూల్‌కు తప్పనిసరిగా ప్లే స్కూల్‌ అని బోర్డు పెట్టాలి. ప్రవేశాలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల కమిటీని నెలలోపు నియమించాలి. ఈ కమిటీని ఏటామారుస్తుండాలి.ప్రతి నెల సమా వేశం ఏర్పాటు చేసి ఆవివరాలను నమోదు చేయా లి.పిల్లలకు జంక్‌ఫుడ్‌ను అనుమతించ కూడదు. పోషకాలతో కూడిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. ఇటువంటి నిబంధనలు చాలా స్కూళ్లు పాటించ కుండా నడుపుతున్నాయి.ప్రతిజిల్లాకు జిల్లా విద్యా శాఖ అధికారి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేసి, ఫీజులను నియంత్రించే ఆలోచన చేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అవస రమైతే పాఠశాలల గుర్తింపును రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలి.
తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదు వులు చెప్పించాలనే ఉద్దేశంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్‌ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి, వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న స్థితి తెలుగు రాష్రా ్టలలో నెలకొంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధ నలు రూపొందించినా తమ రూల్‌ తమదే అనేలా కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లు ప్రవర్తిస్తున్నాయి. కొన్ని స్కూళ్లయితే ఒకేసారి మొత్తం అడ్మిషన్‌ ఫీజు, పాఠశాల ఫీజు కట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వబోమంటూ విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 2024-25కి గాను పలు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు భారీగా పెంచాయి. ప్రస్తు తం ఉన్న ఫీజుల కంటే ఎక్కువగా 10నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతోంది. అంతేకాకుండా ఈవిద్యా సంవత్సరం వార్షిక పరీక్ష లు ఇంకా ముగియక ముందే వచ్చే ఏడాదికి కట్టా ల్సిన స్కూల్‌ ఫీజుల విషయంలో కొన్ని కార్పొరేట్‌, ప్రవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్‌ మెసేజ్‌లు, నోటీసులు, మెయిళ్లు పంపడం గమనార్హం. కొత్తగా తీసుకునే అడ్మిషన్లు గడువు తేదీలు ముగిశాయి. విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగాస్క్రీనింగ్‌ టెస్టులు, తల్లిదండ్రులు ఇంటర్వ్యూల ఆధారంగా వారు చేస్తున్న ప్రొఫెషన్‌ తెలుసుకుని వివక్షాపూరితంగా వ్యవహరిస్తూ అసమానతలు పెంచుతున్నారు.
ఫీజులపై నియంత్రణ ఏది ?
ప్రైవేటు, కార్పొరేట్‌ ఫీజుల నియంత్రణ కోసం అన్ని రకాల ఉత్తర్వులూ వున్నాయి. కానీ ఆచరణలో అవన్నీ ఉత్తవే. 1994లో వచ్చిన జీవో నెం-1 ప్రైవేటు పాఠశాలలు స్థాపన, నిర్వహణ, అడ్మిషన్లు, ఫీజులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ, తనిఖీలు తదితర విధివిధానాలను స్పష్టం చేస్తు న్నాయి. వాటిని అమలు చేయలేమని ప్రైవేటు విద్యాసంస్థలు చెప్పేస్తున్నాయి. 2009లో వచ్చిన జీవో నెం-91లో ఫీజు స్ట్రక్చర్‌ నిర్వచించబడిరది. వాటిని అమలు చేయకుండా ప్రైవేటు యాజమా న్యాలు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్ధుల చదువు కోసం విద్యాహక్కు చట్టం కల్పించిన ఉచిత విద్యకు తీసు కొచ్చిన జీవోనెం 46/2010పై కూడా కోర్ట్‌ స్టే తీసుకుని వచ్చారు. పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వినియోగించడం లేదు. షూ, టై, బెల్టు అమ్మే వ్యాపార కేంద్రాలుగా పాఠశాలలు మారినా చర్యలు తీసుకోకుండా అధికారులు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు,కార్పొరేట్‌ ఫీజుల నియం త్రణకై అనేక వాదనలు జరుగుతున్నాయి. అటాన మస్‌ హోదా కల్గిన విద్యాసంస్థలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని యాజమాన్యం వాదనలు వినిపిస్తున్నాయి.2002లో ’’టి.ఎ.పారు.వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం’’2003లో’’ఇస్లామిక్‌ ఎడ్యు కషన్‌ అకాడమీ వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం’’, 2004లో’’మోడరన్‌ స్కూల్‌ వర్సెస్‌ ఢల్లీి ప్రభు త్వం’’,2005లోపి.ఎ.ఇనాందారి వర్సెస్‌ మహా రాష్ట్ర ప్రభుత్వం’’ కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులలో చాలా స్పష్టత వచ్చింది. నాన్‌ ప్రాఫిట్‌ సంస్థలైన ప్రైవేటు విద్యాసంస్థలుక్యాపిటేషన్‌ ఫీజులు వసూలు చేయకుండా సరైన యంత్రాంగం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉం దని సుప్రీం తెలిపింది. కానీ ఈ మార్గదర్శకాలు ఎక్కడా అమలు కావడం లేదు.
నియంత్రణ చట్టం అవశ్యం
ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రిం చేందుకు తమిళనాడు,కర్ణాటక,మహారాష్ట్ర, రాజస్ధాన్‌,పశ్చిమ బెంగాల్‌,పంజాబ్‌ సహా15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చా యి.తెలంగాణలో కూడా ఇదే బాట పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది.దాదాపు 11వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించింది.కానీ ఆచరణలో గత ప్రభుత్వం ఈ కృషి చేయలేదు.రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 19(1) ప్రకారం విద్యను ఉచితంగా అందించాలి. ప్రైవేటు విద్యాసంస్థల నిర్వహణలో ఉపాధ్యాయుల జీతాలు ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం ప్రభు త్వం ఆయా సంస్థల ఎకౌంట్లను సమగ్రంగా పరిశీ లించి సరైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే నిర్వ హణ ఖర్చులు15శాతం మించకుండా పెంచుకు నేలా చట్టం చేయాలి. ప్రతి సంవత్సరం తల్లిదం డ్రులు,పాఠశాల యాజమాన్యం,విద్యావేత్తలు, జిల్లా స్థాయిలో జిల్లాకలెక్టర్‌,జడ్జి కమిటీ సభ్యులుగా ఉన్న ‘డిస్ట్రిక్ట్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ’ ఫీజులను నియం త్రణ చేసే నియంత్రణ వ్యవస్థ ఉండాలి. పాఠశా లలను దుకాణాలుగా మార్చి టై, బెల్ట్‌, పాఠ్యపుస్త కాలు అమ్మడంపైనా నియంత్రణ చేయాలి. ప్రత్యేక చట్టాన్ని ఆమోదించి ప్రతి సంవత్సరం ఫీజులను పక్కాగా అమలు చేయాలి. ప్రభుత్వ పర్యవేక్షణ పెంచాలి.ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను ధిక్కరిం చిన సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలి. ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం కోసం విద్యా ర్థులు,తల్లిదండ్రులు,విద్యావేత్తలు,చిన్న విద్యాసంస్థ ల యాజమాన్యాలు కూడా ఉద్యమం చేపట్టాల్సి బాధ్యత ఉంది.
ఎక్కడ ఫీజుల నియంత్రణ చట్టం?
ప్రయివేట్‌,కార్పొరేట్‌ స్కూల్స్‌లో ఫీజుల మోత మోగుతోంది. ఇది ప్రతియేటా విద్యార్థుల తల్లిదండ్రులకు భారమవుతోంది.ప్రయివేట్‌, కార్పొ ంట్‌,ఇంటర్నేషనల్‌ పేరుతో నడిపిస్తున్న స్కూల్స్‌ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇటు విద్యాశాఖాధికారులుగానీ,అటు ప్రభుత్వంగానీ ఆ స్కూల్స్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ నిబంధనలు ఈ స్కూల్స్‌లో క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం దారుణం. ఫీజులను కట్టడి చేస్తామంటూ సంవత్స రాల నుంచి చెబుతున్న మాటలను ఆచరణలో మాత్రం పెట్టడం లేదు. ప్రొ. తిరుపతిరావు కమిటీ అంటూ కొన్ని రోజులు, మంత్రుల కమిటీ అంటూ కొన్నిరోజులు ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేశారు.చివరికి ఈ రెండు కమిటీలు ఇచ్చిన సిఫార సులను పక్కన పెట్టేశారు. దీంతో ఫీజులు మళ్లీ ఎంత పెంచుతారో అంటూ తల్లిదండ్రులు ఆందో ళన చెందుతున్నారు.రాష్ట్రంలో పైచిలుకు కార్పొ రేట్‌, ప్రయివేట్‌ స్కూల్స్‌ ఉండగా, వీటిలో దాదాపు గా లక్షల మంది చదువుతున్నారు.ఫలితంగా ప్రయి వేట్‌,కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం వెళ్లిన తల్లిదండ్రులకు ఫీజులు చూస్తే దిమ్మ తిరుగు తుంది.రాష్ట్రంలో కొన్ని పాఠశాలకు పర్మిషన్‌ లేక పోయినా అద్దె భవనాలు చూపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అడ్మిషన్ల పేరుతో డబ్బులు దండు కుంటున్నాయి యజమాన్యాలు. గత సంవత్సరం ఫీజు కంటే 20నుంచి 30శాతం వరకు ఫీజులు పెంచు తున్నాయి.స్కూల్స్‌ స్థాయిని,విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫీజులు పెంపకం నడు స్తుంది.కార్పొరేట్‌స్కూల్స్‌ బ్రాంచీల పేరుతో రాష్ట్రం లో నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.ఈ ప్రాంతాల్లో అడిగే నాథుడు లేడనే ఉద్దేశాలతో విద్యాలయాలు నడిపిస్తున్నారు. విద్యార్థుల తల్లితండ్రులను పరోక్షంగా భయాం దోళన గురిచేస్తున్నారు.రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య,భాష్యం,సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌, కృష్ణవేణి టాలెంట్‌,శాంతినికేతన్‌,నాగార్జున స్కూల్స్‌ వివిధ ప్రాంతాలలో బ్రాంచిల పేరుతో విద్యా వ్యాపారం సాగిస్తున్నారు. ఆఖరికి పపుస్తకాలు, బూట్లు, టై, బెల్ట్‌ వరకు ఇష్టం వచ్చినట్లు రేటు పెట్టి అమ్ముతు న్నారు. నిజానికి ప్రభుత్వ సూచనల మేరకు స్కూల్‌ పరిధిలో ఇవి అమ్మరాదు అని నిబంధన ఉన్న పట్టించుకోకుండా వీటిని అమ్ముతున్నారు. పూర్తిస్థాయిలో భవనాలు ఉండవు, క్రీడా స్థలాలు ఉండవు,ఇరుకైన తరగతి గదులు, మౌలిక సదుపా యాలు ఉండవు. ఫైర్‌ సేఫ్టీ ఉండవు అయినప్పటికీ ఈ స్కూలుకు రెన్యువల్‌కు దరఖాస్తు పెట్టుకుంటే విద్యాశాఖ అధికారులు అనుమతులిచ్చేస్తున్నారు. స్కూల్‌ ఫీజుల పెంపును నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓచట్టం చేయాలని నిర్ణయం తీసు కుంది. జనవరిలో జరిగిన మంత్రివర్గ సమావే శంలో మంత్రులతో ఫీజు నియంత్రణకు విధివిధా నాలు ఏర్పాటు చేసేందుకు ఉప సంఘాన్ని నియ మించారు.ఈ కమిటీకూడా ప్రతిప్రయివేట్‌, కార్పొ రేట్‌ స్కూల్లో ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ చేసి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండే ఫీజు లు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. వీటిపై ప్రత్యేక చట్టం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలి. కానీ ఇప్పటివరకు ఆ ప్రయత్నం జరగ లేదు.అటువైపు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు, అడుగులు కూడా పడకపోవడం గమనార్హం. ప్రత్యేక చట్టం చేయాలని విద్యార్థి సంఘాలు, పేరెంట్స్‌ అసోసియేషన్‌ నిరసనలు వ్యక్తం చేస్తున్న గాని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. వాస్తవానికి ఏవిద్యా సంస్థనైనా ట్రస్ట్‌ పేరిట నడ పాలి. దానికి ఒక గవర్నమెంట్‌ బాడీ ఏర్పాటు చేయాలి.అయితే కార్పొరేట్‌ పాఠశాలలో నామ మాత్రంగా గవర్నమెంట్‌ బాడీ చూపిస్తున్నా, అధి కారం మొత్తం యాజమాన్యం చేతుల్లో పెట్టుకుం టుంది.కొన్ని స్కూల్స్‌ ఒకేసారి మొత్తం ఫీజు కట్టా లని నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వడం లేదు. అందుకే వెంటనే రాష్ట్రం లోని అన్ని ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలో ఫీజు నియంత్రణ ఉండేటట్టు విద్యాశాఖ అధికా రులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లితండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.-(టి.నాగరాజు)

ఆహారం కోసం..వలస పోరాటం

ప్రపంచ మార్కెట్‌లో తక్కువ ధరలకే దొరికే టప్పుడు దేశీయంగా ఎందుకు పండిరచడం అన్న సామ్రాజ్యవాదుల వాదన ఎంత బూటకమో దీనిని బట్టే స్పష్టం ఔతోంది. కొన్ని దేశాలు అన్ని రకాల పంట లనూ పండిరచలేనప్పుడు ప్రపంచ మార్కెట్‌లో పోటీ అన్నది అర్ధం లేనిది. అన్నిదేశాలూ అన్ని రకాల పంట లనూ పండిరచి, తమకు అవసరం లేని వాటిని చౌకగా ఎగు మతిచేసి, కావలసినవాటిని దిగుమతి చేసు కున్నప్పుడు మార్కెట్‌ సూత్రం వర్తిస్తుంది. కాని కొన్ని దేశాల దగ్గర పెట్టుబడి అధికంగా పోగుబడినప్పుడు, మరికొన్ని దేశాలు పేద దేశాలుగా మిగిలిపోయి నప్పుడు సమన్యాయం వర్తించదు. అటువంటప్పుడు కీలకమైన తిండిగింజల విషయంలో దిగుమతుల మీద ఆధార పడవలసిన పరిస్థితిని కొని తెచ్చుకోవడం ఏ దేశానికైనా ఆత్మహత్యా సదృశమే ఔతుంది.
ప్రపంచం మొత్తం మీద గోధుమ ఎగు మతుల్లో 30శాతం రష్యా, ఉక్రెయిన్‌ దేశాల నుంచే జరుగుతుంది.తమ ఆహారఅవసరాల కోసం చాలా ఆఫ్రికన్‌ దేశాలు ఈరెండు దేశాల మీదే ఆధారపడ తాయి.ఇప్పుడు ఆరెండు దేశాల నడుమ సాగుతున్న యుద్ధం కారణంగా ఆఫ్రికన్‌ దేశాల ఆహార సరఫరాలు దెబ్బతిన్నాయి.యుద్ధం ముగిసిన తర్వా త కూడా ఈవిషయంలో మామూలు పరిస్థితి తిరిగి వెంటనే రాకపోవచ్చు.ఆరెండు దేశాల్లో పంట సాగువిస్తీర్ణం యుద్ధం కారణంగా తగ్గి పోయింది. ప్రపంచ మొక్కజొన్న ఎగుమతుల్లో 20 శాతం ఒక్క ఉక్రెయిన్‌ నుంచే జరుగుతాయి. ఈ మొక్క జొన్న సరఫరాకూడా దెబ్బ తింటోంది.చాలా బల హీన దేశాల ఆహార లభ్యత ఇందువలన దెబ్బ తింటోంది. అంతే కాదు, చాలా దేశాలకు ఎరువు లను సరఫరా చేసేది రష్యానే.ఇప్పుడు వాటి సర ఫరా కూడా దెబ్బ తింటోంది. వెరసి ప్రపంచం మొత్తం మీద ఆహార వస్తువులధరలు బాగా పెరగ డానికి, ఆహార లభ్యత దెబ్బ తినడానికి ఈ పరిస్థితి దారితీస్తుంది.
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభం కావ డానికి ముందరి నెల ఫిబ్రవరి నాటి ధరలతో పోల్చితే మేనెల నాటి ముఖ్యఆహార ధాన్యాల ధరలు 17శాతం పెరిగాయి. మరింత ఎక్కువ సంఖ్యలో ప్రజలు కరువు పరిస్థితులను ఎదుర్కొనే వాతా వరణం ఏర్పడిరది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా తయారౌతాయి. ముఖ్యం గా పశ్చిమాసియా,ఆఫ్రికాదేశాలు-యెమెన్‌, ఇథి యోపియా,సోమాలియా,సూడాన్‌,దక్షిణ సూడాన్‌, నైజీరియా,కాంగో రిపబ్లిక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి దేశాలు ఈ ముప్పుకు ఎక్కువగాలోనయ్యే ప్రమాదంఉంది. ఇటువంటి పరిస్థితులు ఎదురవవచ్చునని నిపు ణులు ముందు నుండే హెచ్చరిస్తున్నారు. యుద్ధ రంగంలో పోతున్న ప్రాణాల గురించే ఎక్కువ మంది పట్టించుకుంటున్నారు కాని తిండి దొరకని పరిస్థితులు ఏర్పడినందువలన, ఈ యుద్ధంతో ఏ మాత్రమూ సంబంధం లేని దేశాల్లో, యుద్ధం జరుగుతున్న చోటికి చాలా దూరాన ఉన్న దేశాల్లో ఎన్ని ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతు న్నాయో వారికి పట్టడం లేదు. ముఖ్యంగా పశ్చిమ, సంపన్న దేశాల వారికి ఈ సమస్య అస్సలు పట్ట డం లేదు. ఐతే,ఈచర్చలో కేంద్ర స్థానంలో ఉన్న ప్రశ్న వేరు. దానినెవరూ అడగడమే లేదు. ‘’ప్రపం చంలో కొన్ని దేశాలు కరువు ముంగిట ఎందుకు నిలబడాల్సిన పరిస్థితి ఉన్నది?ఎక్కడ ఆహార ధాన్యా ల సరఫరాలో తేడా వచ్చినా,ఈ దేశాలలోనే ఎందుకు భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది? అసలు కరువు ప్రమాదానికి లోనయ్యే పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఎందుకు ఉండవలసిన పరిస్థితి ఏర్పడిరది ?’’ ఈ ప్రశ్నకు వెంటనే వచ్చే సమా ధానం ఈ విధంగా ఉంటుంది. ఈ కరువు దేశా లు స్వయంగా యుద్ధం కారణంగా దెబ్బతిన్న దేశా లుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ కాని, సూడాన్‌ కాని, పశ్చిమ ఆఫ్రికా దేశాలు కాని యుద్ధాల చరిత్ర కలిగివున్నాయి.కొన్నిదేశాలలో ఆయుద్ధాలు ఇటీ వల దాకా సాగుతూనే వున్నాయి. ఈ యుద్ధాల కారణంగా ఆహార సరఫరా దెబ్బ తిన్నది. దాని ప్రభావం వలన ఆ దేశాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఐతే ఈ వివరణ ఏ మాత్ర మూ సరతృప్తినివ్వదు. ఇక్కడ మనం యుద్ధం అంటే రెండు దేశాల మధ్య జరిగేదానినే కాకుండా, ఒక దేశంలో జరిగేఆంతరంగిక తిరుగుబాటును (దీనినే మనం ఉగ్రవాదం అంటున్నాం) కూడా పరిగణన లోకి తీసుకోవాలి. ఐతే ఈ తిరుగుబాట్లు అనేవి వెలుపలి నుండి రుద్దేవి కావు. ఆదేశంలోని పేదరి కంలో,ఆహారం సైతం దొరకని పరిస్థితు లలో ఈ తిరుగుబాట్ల మూలాలు ఉంటాయి. అందుచేత తిరుగుబాట్ల వలన ఆహార లభ్యత దెబ్బ తిన్నదనే వివరణ చెల్లదు. ఇకరెండో విషయం: ఈ యుద్ధా లు, లేక తిరుగుబాట్లు దాదాపు మూడో ప్రపంచ దేశాలన్నింటా జరిగాయి. కానికొన్ని దేశాలు మాత్ర మే కరువు ముంగిట నిలవాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది ? దీనికి సరైన సమాధా నం ఒక్కటే. కొన్ని దేశాలు సామ్రాజ్య వాదుల డిమాండ్లకు తలొగ్గి తమ ఆహార భద్రతను బలి చేశాయి. వలస దేశాలుగా ఉన్న కాలంలో చాలా మూడో ప్రపంచ దేశాల్లో తలసరి ఆహార లభ్యత చాలా ఎక్కువగా పడిపో యింది. దానివలన ఆ దేశాల్లో ఆ కాలంలో కరువు పరిస్థితులు ఏర్ప డ్డాయి. వలసపాలన నుండి విముక్తి సాధిం చాక వాటిలో చాలా దేశాలు తమ దేశీయ ఆహార ధాన్య ఉత్పత్తిని పెంచడానికి పూనుకు న్నాయి. వలసాధి పత్యం నుండి బైట పడడం అంటే అందులో ఆహార స్వయంసమృద్ధి సాధించడం ఒక ప్రధాన అంశంగా ఉన్నది. కాని ఈ ప్రయత్నాన్ని సామ్రా జ్యవాద దేశాలు అడ్డుకున్నాయి. ఆహార స్వయం సమృద్ధి అన్న భావనే సరైనది కాదని, ప్రపంచం అంతా ఒకటే మార్కెట్‌గా ఉన్నప్పుడు చౌకగా లభించే చోట నుండి ఆహారధాన్యాలను కొనుక్కునే వీలు ఉన్నదని,ఆఅవకాశాన్ని వదులు కుని స్వం తంగా పండిరచుకోవాలనే తాపత్రయం ఎందుకని సామ్రాజ్యవాదం వాదించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఎజెండాలో ఇదొక అంశంగా సామ్రాజ్య వాదం జొప్పించగలిగింది. ఆహార స్వయం సమృద్ధి లక్ష్యంగా ఉండేదానికన్నా ప్రపంచ మార్కెట్‌లో వేటికి ఎక్కువ గిట్టుబాటు అవుతుందో ఆపంటలను పండిరచేందుకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలని డబ్ల్యు.టి.వో చెప్తుంది. ఇప్పుడు సంపన్న పెట్టుబడి దారీ దేశాలు కొన్ని రకాల ఆహార ధాన్యాలను ఎప్పుడూ తమ దేశీయ అవసరాలకు మించి ఎక్కువ గా పండిస్తూంటాయి. వాటి వద్ద ఆధాన్యాలు ఎప్పు డూ నిల్వ ఉంటాయి.ఐతే ఉష్ణ,సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో పండే పంటలు చాలా వరకు ఈ సంప న్న దేశాల్లో పండవు. తాజా కూరగా యలు, పళ్ళు,జనుము,పత్తి వంటి పీచు పంటలు, చెరకు, నూనె గింజలు,సుగంధ ద్రవ్యాలు వంటివి అక్కడ పండ వు. మూడో ప్రపంచ దేశాల్లో అధిక భాగం ఈ ఉష్ణ, సమశీతోష్ణ మండల ప్రాం తాలలో ఉన్నాయి. ఆ దేశాల్లో భూ వినియోగాన్ని తమకు అను కూలంగా మార్చగలిగితే, అది రెండు విధాలుగా సంపన్న పశ్చిమ దేశాలకు లాభదా యకం ఔతుంది.తమ వద్దనున్న మిగులు ధాన్యపు నిల్వ లను ఆమూడో ప్రపంచ దేశాలకు అంట గట్ట వచ్చు. తమకు అవసరమైన పంటలను ఆ మూడో ప్రపంచ దేశాల్లో పండిరచేటట్టు చేయడం ద్వారా తమ అవసరాలను తీర్చుకోవచ్చు (ఆ పంట ల్లో బయో ఇంధనానికి ఉపయోగించే మొక్కజొన్న వంటివి కూడా ఉన్నాయి). తక్కిన మూడో ప్రపంచ దేశాల కన్నా ఆఫ్రికా దేశాలు సామ్రాజ్యవాదుల వత్తిడికి ముందుగా తలొగ్గాయి. అందుకనే తక్కిన ప్రపంచంలో కన్నా ఆఫ్రికాలోనే ఎక్కువ దేశాలు కరువు ముంగిట్లో ఉండే దేశాల జాబితా లోకి చేరాయి. వాటిలో నుంచి కేవలం రెండే రెండు దేశాల ఉదాహరణలను చూద్దాం. ఒకటి నైజీరి యా. ఆఫ్రికాలోకెల్లా అత్యధిక జనాభా ఉన్న దేశం ఇది. 20 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. రెండోది కెన్యా.నయా ఉదారవాద విధానాలు అత్యంత జయ ప్రదంగా అమలు చేసిన దేశంగా కెన్యా గురించి సంపన్న పశ్చిమ దేశాలు నిన్నమొన్నటి దాకా పొగుడుతూ వచ్చాయి. ఐరాస కు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ) అందించిన గణాం కాలను బట్టి1990లో నైజీరియా తలసరి తిండి గింజల ఉత్పత్తి 129.37ఉండేది కాస్తా 2019 నాటికి 101.09కి పడిపోయింది. మూడే మూడు దశాబ్దాల లోపల 20శాతం కన్నా అధి కంగా పడి పోయింది. కెన్యాలో కూడా ఇదే కాలం లో తలసరి ఆహారధాన్యాల ఉత్పత్తి 132.82, ఉండి 107. 97కి పడిపోయింది. 1980లోనైతే కెన్యా తలసరి ఉత్పత్తి 155.96 ఉండేది. అంటే నాలుగు దశా బ్దాల వ్యవధిలో ముప్పై శాతానికి మించి పడి పోయింది! ఇంత గణనీయంగా దేశీయ ఉత్పత్తి తగ్గిపోతే ఇక దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు ఆ దేశాలు కరువు ముంగిట నిలబడివుండే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచ మార్కెట్‌లో తక్కువ ధరలకే దొరికేటప్పుడు దేశీయంగా ఎందుకు పండిరచడం అన్న సామ్రా జ్య వాదుల వాదన ఎంత బూటకమో దీనిని బట్టే స్పష్టం ఔతోంది. కొన్ని దేశాలు అన్ని రకాల పంట లనూ పండిరచలేనప్పుడు ప్రపంచ మార్కెట్‌లో పోటీ అన్నది అర్ధం లేనిది. అన్ని దేశాలూ అన్ని రకాల పంటలనూ పండిరచి, తమకు అవసరం లేని వాటిని చౌకగా ఎగుమతి చేసి, కావలసిన వాటిని దిగుమతి చేసుకున్నప్పుడు మార్కెట్‌ సూత్రం వర్తిస్తుంది. కాని కొన్నిదేశాల దగ్గర పెట్టుబడి అధి కంగా పోగుబడినప్పుడు, మరికొన్ని దేశాలు పేద దేశాలుగా మిగిలిపోయినప్పుడు సమన్యాయం వర్తించదు. అటువంటప్పుడు కీలకమైన తిండి గింజల విషయంలో దిగుమతుల మీద ఆధారపడ వలసిన పరిస్థితిని కొని తెచ్చుకోవడం ఏ దేశాని కైనా ఆత్మహత్యా సదృశమే ఔతుంది. వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగిన ప్రతీ దేశంలోనూ ఈ సత్యాన్ని అవగతం చేసుకున్నారు. దేశం స్వతంత్రంగా మనగలగడం అంటే ఆహార స్వయం సమృద్ధి అని నిర్ధారించుకున్నారు. దాన ర్ధం దేశంలో ప్రతీ ఒక్కరికీ సరిపడా తిండి లభించే స్థితి కోసం ప్రయత్నించారని కాదు. కాని కనీస స్థాయి వినియో గాన్ని గ్యారంటీ చేసేందుకు ప్రయ త్నించారు. సామ్రాజ్యవాదుపై ఆధారపడ కుండా మూడో ప్రపంచ దేశాలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి ఆహార స్వయం సమృద్ధి విషయంలో పరస్పరం సహకరించుకున్నాయి. ఈవిధానాన్ని తొలుత ఆఫ్రికా దేశాలు విడనాడాయి. సామ్రాజ్య వాద ఒత్తిడులకు తలొగ్గాయి. అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించు కుంటున్నాయి. కరువు ముంగిట్లో నిలబడివున్నాయి. భారతదేశం స్వతం త్రం వచ్చిన తొలిదినాల్లో ‘’గ్రో మోర్‌ ఫుడ్‌’’నినా దాన్ని చేపట్టి దేశీయంగా ఆహారోత్పత్తిని పెంచా లని ప్రచారం చేపట్టింది. కాని అమెరికా వలలో పడి పి.ఎల్‌-480 పథకం కింద అమెరికా నుండి ఆహారధాన్యాలను కొనుగోలు చేయడం మొదలు బెట్టింది. ఎప్పుడైతే 1960 దశకంలో సంభవించిన కరువు కాటకాల కాలంలో ఈ స్కీము అక్కరకు రాలేదో, అప్పుడే మన ప్రభు త్వానికి జ్ఞానోదయం అయింది. ఆహార స్వయం సమృద్ధి ప్రాధాన్యత బోధపడిరది.ఆ తర్వాత హరిత విప్లవం చేపట్టింది. ఆహరిత విప్లవం తన లక్ష్యా లను సంపూర్ణంగా నెరవేర్చిందని చెప్పలేం కాని ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో మన కాళ్ళ మీద మనం నిలబడగల పరిస్థితి ఏర్పడిరది. కాని సామ్రాజ్య వాదులు మాత్రం మన ఆహార స్వయంసమృద్ధిని దెబ్బ తీయడానికి నిరంతరం ప్రయత్నాలు కొన సాగిస్తూనే వున్నారు. వారి ప్రయత్నాలకు మోడీ ప్రభుత్వం ఊతం ఇచ్చినట్టు వ్యవహరించింది. నల్ల వ్యవసాయ చట్టాలను జారీ చేసింది. కనీస మద్దతు ధర వ్యవస్థను రద్దు చేయడానికి సిద్ధమైంది. మన దేశ ఆహార భద్రతకి ఈ కనీస మద్దతు ధర అనేది చాలా కీలకమైనది. దేశ రైతాంగం సాహసోపే తంగా సాగించిన పోరాటం ప్రస్తుతానికి మనల్ని కాపాడిరది. ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసు కోక తప్పలేదు. ప్రస్తుతానికి మన ఆహార భద్రత నిలబడిరది. కాని అది అంతర్ధానం కాకుండా ఉండాలంటే ప్రజానీకం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే.
ఆకలిచావులు పట్టవు కానీ …
దేశంలోని ఆకలి చావులు పట్టవు… కానీ ప్రజలు తినే ఆహారంపై ఆంక్షలు పెడుతు న్నారు కేంద్ర పాలకులు. బీఫ్‌పై నిషేధం పేరుతో ఆవు,గేదె,ఎద్దు,ఒంటెలను తినడాన్ని నిషేధిం చటం ఒక కుట్రపూరిత చర్య. దీనివెనుక ఈ దేశాన్ని శాఖాహార దేశంగా మార్చాలనే సంఫ్న్‌ సిద్ధాంతం అమలవుతోంది. బీఫ్‌ తినే వారిపై నిన్నటి వరకు మోరల్‌ పోలీసింగ్‌ చేసిన వారు ఇప్పుడు కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని డైరెక్ట్‌ పోలీసింగ్‌ ప్రయోగించబోతున్నారు. ఈదేశంలోని దళిత గిరిజనులు ఇష్టంగా తినే అహారాన్ని ఏవో మతప రమైన కారణాలు చెపుతూ దూరం చేసే పనికి మోడీ సర్కారు సిద్ధమైంది. నిషేధంగా చెప్పబ డుతున్న ఆవు,ఎద్దు,గేదెలను పెంచేది కాసేదీ కడిగేదీ…వాటి యోగక్షేమాలు చూసేదీ ప్రధానంగా దళితులే. ఇవన్నీ సామాన్యుల ఇండ్లలో పెంపుడు జంతువులు.
వ్యవసాయం, పాడి అవసరాలకోసం జంతువులను వాడి, అవి అవసరం తీర్చలేని పరిస్థి తిలో కబేళాలకు అప్పజెప్పటం సహజంగా జరిగే పని. దీన్ని అడ్డుకుంటాం. వీటిని తినేవారిపై దాడు లు చేస్తామనే వారు దీన్ని అడ్డుకోవడానికి వారికి ఉన్న అర్హత ఏమిటో ఆలోచించుకోవాలి? ఇక్కడ మోడీ సర్కారు కాని, ఆ ప్రభుత్వాన్ని వెనకనుండి నడిపిస్తున్న సంఫ్న్‌ సంస్థలు కాని గుర్తుపెట్టు కోవాలిసిన అంశం ఏమిటీ అంటే..బీఫ్‌ అంటే ఎక్కడో అడవుల్లో సహజసిద్ధంగా పెరిగే జంతువుల మాంసం కాదు. ఈ దేశంలోని పేద మధ్యతరగతి ఇండ్లలో వారి చేతులతో పెంచుకునే జంతువుల మాంసం. పెంచుకునే వారి హక్కులు కాలరాసేలా ప్రభుత్వాలు వ్యహరించడం సరైంది కాదు. పైకి బీఫ్‌ని నిషేధిస్తున్నట్టు చెపుతున్నా వారి అసలు టార్గెట్‌ మాంసాహారం లేకుండా చేసే కుట్రే. ఆహారంపై దాడి చేయటం ఏమిటి అనేది దేశం లోని ప్రగతిశీల శక్తుల ప్రశ్న. నిజానికి దేశంలో ఒక్క బీఫ్‌మీద ఏడాదికి లక్షకోట్ల వ్యాపారం జరుగు తోంది. మిగతా జంతువులు అనగా కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు కలిపితే ఇది ఇంకా ఎక్కువే. లక్షలాదిమంది ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు. వీటన్నింటినీ విస్మరిస్తూ తీసుకొనే నిర్ణయాలు దేశ అభివద్ధికి మంచిది కాదు. ఆదిమానవుడి కాలం నుండే మనిషికి మాంసాహారం అలవాటు. దీన్ని వక్రీకరిస్తూ దేవుడికి,మతానికి,నమ్మకాలకి మాంసా హారాన్ని ముడిపెట్టి మాంసం తినడం పాపం అనే వాదనని సంఫ్న్‌శక్తులు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ రోజు మాంసాహారం తినేవారిపై జరగు తున్న దాడి ఈ దేశం తమ భుజాలపై మోస్తున్న ఉత్పత్తి రంగంలో పనిచేసే వారిపై, వారి అహారపు అల వాట్లపై దాడిగానే చూడాలి. అసలు ఇక్కడ మోడీ సర్కార్‌ సమాధానం చెప్పాల్సిన విషయాలు ఏమిటీ అంటే అహారపు అలవాట్లు అనేది వ్యక్తిగత విష యం. కొందరు కొన్ని కూరలు తింటారు, కొందరు తినరు. కొందరు మాంసాహారం ఇష్టంగా తింటా రు, కొందరు అసలు ముట్టరు. ఇది వారి ఇష్టాయి ష్టాలూ అలవాట్లను బట్టి ఉంటుంది. మరి ఇలాంటి వ్యక్తిగత విషయంలోకి పాలకులు ఎందుకు తలదూ రుస్తునట్టు?పాలించే ప్రభువులు చూడాల్సింది దేశంలోని అందరి ప్లేట్లలో ఆహారం ఉందా, లేదా…లేకపొతే ఎందుకు లేదు. అందరికీ ఆహరం చేరాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి అని ఆలోచించాలి. దేశంలోని ప్రజలందరికీ సరిపడు ఆహారం అందుబాటులో ఉందా?ఉపాధి లబి óస్తోందా? ఆహారాన్ని పండిరచే రైతుకు గిట్టు బాటు ధర లేదు. దేశంలో రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్టాల్లో మిర్చి రైతుల గోస అందరికీ తెలిసిందే. తమిళ నాడు మహారాష్ట్ర రైతుల ఉద్యమం చూస్తూనే ఉన్నాం. దేశంలో ఆహారాన్ని ఉత్పత్తి చేసే వారికీ రక్షణ కల్పించలేని కేంద్ర పాలకులకు తినే ఆహారం గురించి అడిగే హక్కు ఎక్కడిది?మరి ఎవరి ప్రయోజనాలకోసం సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నిర్ణయాన్ని కేరళ,బెంగాల్‌,ఢల్లీి లాంటి చాలా రాష్ట్రా లు వ్యతిరేకిస్తున్నా ఏఅజెండా అమలు కోసం కేంద్రం ఈనిర్ణయాన్ని అమలు చేసేందుకు పూనుకుందీ? బీఫ్‌ మీద నిషేధం అమలుచేస్తున్న సర్కారు దానికి శ్రాస్తీయ కారణాలు ఉంటే అర్థం చేసుకోవొచ్చు. కానీ, కొన్ని నమ్మకాల ఆధారంగా నిషేధం ఏమిటి అనే సమాధానం చెప్పాలి. నమ్మ కాలు వేరు,పాలన వేరు,ఒక నమ్మకం కలిగిన వారు వేరే నమ్మకం కలిగిన వారిపై భౌతిక దాడికి దిగ కుండా ఆపడమే పాలకుల పని. కానీ కొన్ని నమ్మ కాలు మోయడమో,వాటి అజెండాగా పాలన నడప డటం సరైంది కాదు.లౌకిక విలువలు కలిగి ప్రపం చానికే ఆదర్శంగా నిలబడిన భారతదేశంలో నమ్మ కాల ఆధారంగా పాలన సాగిస్తామంటే భారత ప్రజలు సమ్మతించరు.-(కందుకూరి సతీష్‌ కుమార్‌)

ముంచుకొస్తున్న ముప్పు..వాతావరణంలో మార్పులు

వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్ర తలు పెరుగుతుంటే..వానాకాలంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడం లేదు. అకాల వర్షాలు.. కరవు.. తుఫాన్లు..సర్వసాధారణమై పోయాయి. ఈ సంవత్సరంలో ఎండలు ప్రజలను భయపెడుతున్నాయి. వేసవిలో సాధారణం కన్నా 4 నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.సముద్ర ఉష్ణోగ్రతల పెరుగు దలతో తీవ్ర తుఫాన్లు వస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. వాతావరణంలో మార్పుల కారణంగానే ఉష్ణోగ్ర తలు అధికమౌతున్నాయని వాతావరణ శాఖాధి కారులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ముప్పు ఉంటుందని హెచ్చరి స్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై తక్షణం దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరే ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో పొడి వాతావరణ తీవ్రత కూడా క్రమంగా బాగా పెరుగు తోందని.. ఇలాంటి వాతావరణం ఉన్న సమయంలో ప్రజలు ఎండలో తిరగవద్దని సూచిస్తోంది. ఇటీవలే ఒడిషాలో తీరం దాటిన ఫోని తుఫాన్‌ తీవ్ర మార్పులకు కారణమౌ తోందని వెల్లడిరచింది. తుఫాన్‌ సమయంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా టెంపరేచర్స్‌ నమోదయ్యాయని..సాధారణం కన్నా 7.1 డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ తెలిపింది. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి పెనువిపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి.ఇంతకీ వాతావరణ మార్పుల గురించి మనకేం తెలుసు?
వాతావరణ మార్పు అంటే..
భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువగా, తక్కువగా కూడా ఉంది.ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతు న్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ దీనికి కారణమని వారు చెబుతున్నారు.గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం.భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌ హౌజ్‌ వాయువులు గ్రహించు కుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలితంగా వాతావరణం, భూ ఉపరితంల వేడెక్కుతున్నాయి.ఈ ఎఫెక్ట్‌ లేకపోతే భూమి ఇంకో30డిగ్రీ సెంటీగ్రేడ్స్‌ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమయ్యేది.అయితే,ఈ గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయం వల్ల వెలువడే వాయువులు తోడై మరింత శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.దీన్నే గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడెక్కడం),వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఇవే…
గ్రీన్‌ హౌజ్‌ వాయువుల్లో అత్యంత ప్రభావ వంతమైంది నీటి ఆవిరి. కానీ, అది వాతా వరణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రామికీకరణ కన్నా ముందు ఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవనరులు దాన్ని పీల్చుకోగలవు. శిలాజ ఇంధనాలను మండిరచడం వల్లే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతోంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులను నరికి, కాల్చేయడం వల్ల కూడా కార్బన్‌ వెలువడుతోంది. గ్లోబల్‌ వార్మింగ్‌ ఎక్కువవుతోంది. 1750లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు 30శాతం పెరిగాయి.గత 8 లక్షల ఏళ్లలో వాతావరణంలో ఈ స్థాయిలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఎప్పుడూ లేదు. మనుషుల చర్యల వల్ల మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ లాంటి ఇతర గ్రీన్‌ హౌజ్‌ వాయువులు కూడా వెలువ డుతున్నాయి.అయితే,కార్బన్‌ డై ఆక్సైడ్‌ అంతటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్‌ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందునాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్‌ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది.అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20 ఏళ్లు..గత 22 ఏళ్లలోనే ఉన్నాయి.2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది.ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది. కరుగు తున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగ డానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటు న్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఆర్కిటిక్‌ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌పై పరుచుకున్న మంచు కూడా కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో కరుగుతోంది. పశ్చిమ అంటార్కిటికాపై ఉన్న మంచు ద్రవ్యరాశి కూడా తగ్గుతోంది. తూర్పు అంటార్కిటికాలోనూ ఈ పరిణామం మొదలవ్వొచ్చని తాజాగా ఓఅధ్యయనం హెచ్చరించింది. పంటలు, జంతువులపైనా వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. మొక్కల్లో పూలు పూసే, పండ్లు కాసే సమయా లు ముందుకు జరుగుతున్నాయి. జంతువులు వలస వెళ్తున్నాయి. ఉష్ణోగ్రత ఎంత పెరగవచ్చు? భూ ఉపరితల ఉష్ణోగ్రత 1850తో పోల్చితే 21వ శతాబ్దం చివరినాటికి1.5 డిగ్రీసెంటీ గ్రేడ్‌ పెరగొచ్చు.చాలా వరకూ అంచనాలు ఇదే సూచిస్తు న్నాయి.ప్రస్తుతం ఉన్న గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితులే ఇకపైనా కొనసాగితే పెరుగుదల 3నుంచి 5డిగ్రీసెంటీగ్రేడ్‌లు కూడా ఉండొచ్చని డబ్ల్యూఎంఓ అంటోంది.ఉష్ణోగ్రత లో 2డిగ్రీ సెంటీగ్రేడ్‌ల పెరుగుదల ప్రమాదకర పరిస్థి తులకు దారితీయొచ్చని అంచనా వేస్తు న్నారు.ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌ లకు కట్టడి చేసుకోగలిగితే క్షేమం గానే ఉండొ చ్చని ఇటీవలి కాలంలో శాస్త్ర వేత్తలు,నాయకులు అంటున్నారు.ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5డిగ్రీసెంటీగ్రేడ్‌లకు అదుపు చేయాలంటే సమాజం అన్ని విధాలుగా త్వరి తగతిన మారాల్సి ఉంటుందని ఇంటర్‌గవర్న్‌ మెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపీసీసీ) నివేదిక అభిప్రాయపడిరది.గ్రీన్‌ హౌజ్‌ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగుతున్న కృషికి ఐరాస నేతృత్వం వహిస్తోంది. చైనా నుంచే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా,యురోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు ఉన్నాయి.జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే, వీటిలో ఉద్గారాలు చాలా ఎక్కువ.ఇప్పటికిప్పుడు గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారాలు గణనీయంగా తగ్గించు కున్నా, వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటు దన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు.ఆహార ఉత్పత్తిపైనా తీవ్ర ప్రభావం పడొచ్చు.వరదలు,తుఫానులు, వడ గాలుల వల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు. భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది.ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువవుతుంది.కొన్ని ప్రాంతాల్లో మంచుపడుతుంది.తీరాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో వేసవుల్లో కరవు ముప్పు ఎక్కువవు తుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు.ఈ మార్పులను తట్టుకునే సామర్థ్యం లేని పేద దేశాలపై ప్రభా వం విపరీతంగా ఉండొచ్చు.పరిస్థితులకు అంత త్వరగా అలవాటుపడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు తరించిపోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)అంచనా వేసింది.వాతావరణంలో పెరిగిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడం వల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్‌ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు.వాతావరణ మార్పు లపై స్పందించడమే ఈ శతాబ్దంలో మానవా ళికి అతిపెద్ద సవాలు కాబోతోంది.
ఈ వాతావరణం అనూహ్యం!
వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మునుపెన్నడూ లేనంతగా ఈ నెలలో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. రెండు, మూడు రోజుల నుంచి పెనుగాలులు, పిడుగులతో భారీవర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భూతాపం ప్రభావంతో కొన్నాళ్లుగా వాతావరణంలో అసాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. గడిచిన మూడేళ్ల పాటు పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగిన లానినా బలహీ నమై ప్రస్తుతం తటస్థంగా ఉంది. ఇది కొద్దిరోజు ల్లో ఎల్‌నినో దశకు చేరుకుంటుం దని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా భూమధ్య రేఖకు ఆనుకుని పసిఫిక్‌ మహాసము ద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగు తున్నందున ఆ ప్రభావం మన దేశంపై ఉం టుందని పేర్కొంటున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ నెల తొలివారం నుంచి దేశం లో ఎండల తీవ్రత పెరగడంతో పాటు వడగా డ్పులు వీచాయి.రోజుల తరబడి ఎండలకు భూ ఉపరితలం వేడెక్కింది.ఈ నేపథ్యంలో భూమధ్య రేఖ నుంచి ఉత్తర దిశగా 10 డిగ్రీల అక్షాం శం వరకూ ఆవరించిన అధిక పీడనం మూడు రోజుల క్రితం మరింత పైకి అంటే 15 డిగ్రీల అక్షాం శం వైపు వచ్చింది.ఈ కారణంగా బంగాళా ఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులు, ఉత్తరాది నుంచి వచ్చే పొడి గాలుల కలయికతో గాలుల విచ్ఛిన్నత (విండ్‌ డిస్‌కంటి న్యూటీ) ఏర్పడడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది.దీంతో గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో ఈదురుగాలులు, పిడుగులు, అక్కడ క్కడా వడగళ్లతో వర్షాలు పడుతు న్నాయి. క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరిస్తే రెండు, మూడు గంటల వ్యవధిలోనే తీవ్ర విధ్వంసం సంభవిస్తుందని ఇస్రో వాతావరణ నిపుణుడు పేర్కొన్నారు.గత నెలలో కురిసిన వర్షాలకు రూ.కోట్ల పంట నష్టం వాటిల్లిందని, ప్రస్తుతం అలాంటి నష్టమే జరుగుతోందన్నారు. ఈ నెలాఖరు వరకు వర్షాలు కొనసాగుతా యని, రైతులు అప్రమ త్తంగా ఉండాలని సూచించారు.
క్లౌడ్‌ బరస్ట్‌ అయిన క్షణాల్లో…
వేసవిలో తీవ్రమైన వాతావరణ అనిశ్చితి నెలకొంటుంది. పొడిగాలి, తడిగాలి (తేమతో ఉండేది) ఒకచోట కలుస్తుంటాయి. పొడిగాలి తోయడంతో తడిగాలి పైకి వెళుతుంది. అక్కడే మేఘాలు ఏర్పడతాయి. భూ ఉపరితలం నుంచి మేఘాలు పైకి వెళ్లే కొద్దీ వాటిలో ఉష్ణోగ్రతలు తగ్గుతారు. భూఉపరితలం నుంచి పైకి ఆరు కిలోమీటర్లు దాటిన తరువాత ఉష్ణోగ్రత మైనస్‌ డిగ్రీ ఉంటుంది. అక్కడే మేఘాల్లో మంచు గడ్డలు ఏర్పడతాయి. ఎత్తుకు వెళ్లే కొద్దీ మంచు గడ్డలతో మేఘాల్లో బరువు పెరుగుతోంది. అలా 12 నుంచి 13 కిలోమీటర్ల ఎత్తునున్న మేఘాల్లో ఉష్ణోగ్రత మైనస్‌ 80 డిగ్రీలు ఉం టుంది. తీవ్రత పెరగడంతో బరువు భరించలేక మేఘాలు విచ్ఛిన్నమవుతాయి. దీనినే క్లౌడ్‌ బరస్ట్‌ అంటారు. క్లౌడ్‌ బరస్ట్‌ అయిన క్షణాల్లో ప్రచండ వేగంతో గాలులు వీస్తాయి.కళ్లు మిరు మిట్లు గొలిపేలా మెరుపులు, ఉరుములు సంభవిస్తాయి. ఇదే సమయంలో పిడుగులు పడతాయి. ఇదంతా ఐదు నిమిషాల వ్యవధిలో ముగుస్తుంది. పైనున్న మంచుగడ్డలు కింద పడేటప్పుడు కరిగిపోగా మిగిలిన భూమిపై పడతాయి. వీటినే వడగళ్లుగా పిలుస్తారు. దాంతోపాటు భారీ వర్షాలు కురుస్తాయి. మొత్తం ప్రక్రియ గంటలోపే ముగుస్తుంది. అంతవేగంగా జరిగే ప్రక్రియలో ప్రతిదీ అత్యంత వేగంగా, ప్రమాదకరంగా ఉంటుం దని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఇలాంటి సమయంలో ఆరు బయట ఉండే రైతులు, కూలీలు, ఇతరులు, మూగజీవాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిం చారు. క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
అనంతలో అత్యధిక ఉష్ణోగ్రత
దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిరది. దీని నుంచి కర్ణాటక, మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్‌ వరకు ఉపరి తల ద్రోణి విస్తరించింది. ఈ ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. సోమవారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో పంట లకు తీవ్ర నష్టం వాటిల్లింది. రానున్న మూడు రోజులు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల పిడుగులు, ఈదరుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రాయలసీమ, కోస్తాల్లో అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదైనా ఉక్కపోత ఎక్కువైంది.దేశంలో అత్యధికంగా అనంతపురంలో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
పిడుగుల నుంచి రక్షణకు జాగ్రత్తలు
వేసవి కాలంలో క్యూములోనింబస్‌ మేఘాలు ఏర్పడినప్పుడు పొలాల్లో పనిచేసే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి
చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండ రాదు
పొలాల్లో ఉండిపోతే పిడుగులు పడే సమయంలో నేలపై పడుకుండిపోవాలి
పిడుగులు పడే సమయంలో ఇళ్లలో టీవీ లు ఆపేయాలి
రోడ్లపై ప్రయాణించే వాహనదారులు దగ్గరలో ఉన్న పక్కా భవనంలోకి వెళ్లాలి
మూగజీవాలను చెరువులు,నీటికుంట లకు దూరంగా ఉంచాలి (ఓయూ యూనివర్శిటీ`హైదరాబాద్‌)-(డాక్టర్‌.రామకుమార్‌ వర్మ)

పెరుగుతున్న నిరుద్యోగత రేటు

పదేండ్ల కేంద్ర సర్కార్‌ పాలనను చూస్తే..దయనీ యమైన మన దేశ ప్రస్థానం కండ్ల ముందే సాక్షాత్క రిస్తుంది.‘సబ్‌ కా సాత్‌- సబ్‌ కా వికాస్‌’,‘అమృత కాలం’ వంటి మోదీ గ్యారెం టీల బూటకపు నినాదాల వాస్తవాలు మనకు కనిపి స్తాయి. మోదీ పాలనలో భారతీయ ప్రజల జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత, ఉపాధి, వేతనాలు, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. బీజేపీ సర్కార్‌ అవలంబించిన నయా ఉదారవాద విధానాలు దేశాన్ని తీవ్రమైన సామాజిక, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయన డంలో ఎటువంటి సందేహం లేదు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగనిరీతిలో దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. అన్నమో రామచంద్రా అంటూ అలమ టించే సంఖ్య విపరీతంగా పెరిగింది.గ్లోబల్‌ హం గర్‌ ఇండెక్స్‌ ప్రకారం..ఆకలి సూచీలో 125 దేశా ల్లో మన దేశం111వ స్థానంలో నిలవడమే అందు కు నిదర్శనం. అయితే దేశంలోఉన్న అనేక ప్రధాన సమస్యలు చర్చకు రాకుండా ప్రజలను మతం మత్తులో ముంచుతున్నది బీజేపీ. రాష్ట్రాల హక్కు లను హరించివేస్తున్నది. సమాఖ్యవాదానికి తిలోద కాలు ఇచ్చింది. ఏకస్వామ్య విధానానికి బాటలు వేస్తున్నది. వ్యవస్థలను మారుస్తూ నియంతృత్వ పోకడలను కొనసాగిస్తున్నది. కుల నిర్మూలన అనే రాజ్యాంగ లక్ష్యానికి బదులు అసమానతల కుల వ్యవస్థ స్థిరీకరణకు పూనుకుంటున్నది. పదేండ్ల మోదీ పాలనలో దేశంలో పేద రికం మరింతగా పెరిగింది. సంపన్నుల ఆదాయా లు గణనీయంగా పెరిగాయి. మోదీ మిత్రులు అంబానీ, అదానీ ప్రపంచ కుబేరులుగా మారిపో యారు. 2014 వరకు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ.. కార్పొరేట్‌ సంస్థల ఎదుగుదలకు తోడ్పడ్డారు. ప్రతిఫలంగా మోదీ రుణం తీర్చుకో వడానికి గుజ రాతీ కార్పొరేట్‌ సంస్థలు ఆయనను ప్రధానిని చేయటంలో సహకరించాయి. అందుకే ప్రజల సొమ్ముతో నిర్మించిన అనేక ప్రభుత్వ రంగ సంస్థ లను ఒక్క కలం పోటుతో ప్రైవేట్‌ కంపెనీ లకు బీజేపీ సర్కార్‌ అప్పగించేసింది.
బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన వారిలో అత్యధికులు గుజరాతీ వ్యాపా రులే. వారు దోచుకున్నదంతా ప్రజాధనమే. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని ఎక్కడున్నా పట్టుకొస్తామని ప్రగల్భాలు పలికిన మోదీ ఈపదేండ్లలో ఏం సాధించారో అందరికీ తెలుసు. పైగా బ్యాంకులపై ఒత్తిడి తీసు కొచ్చి వారి రుణా లను మాఫీ చేశారు. గత పదేం డ్లలో మోదీ ప్రభు త్వం ప్రైవేట్‌ కంపెనీలు చెల్లిం చాల్సిన రూ.15 లక్షలకోట్ల రుణాలను మాఫీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.ఇదంతా ప్రజల సొమ్ము కాదా? అంతే కాదు,గతపదేండ్లలో కార్పొరేట్‌ సంస్థలకు రూ.55 లక్షలకోట్ల పన్ను రాయితీ లను కూడా ప్రభుత్వం ఇచ్చింది.తాజా బడ్జెట్‌లో కార్పొరేట్‌ కంపెనీలపై పన్నును 33శాతం నుంచి 25 శాతానికి తగ్గిం చింది. మోదీ ప్రభుత్వం అనుస రిస్తున్న ఇలాంటి ఆర్థిక విధానాలను సమర్థించే కొందరు కుహనా మేధావులు..సంక్షేమ కార్యక్ర మాలను తప్పుబడు తుండటం విడ్డూరం.దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికడతామని,నిత్యావసర సరు కుల ధరలు తగ్గిస్తామని 2014లో మోదీ హామీ ఇచ్చారు.కానీ, మోదీ పాలనలో నిత్యావసర సరు కుల ధరలు భగ్గుమంటున్నాయి. ఉదాహరణకు గ్యాస్‌ సిలిండర్‌ ధర2014లోరూ.410ఉండగా..ప్రస్తుతం రూ. 906చేరింది.నిజానికి సిలిండర్‌ ధరలురూ.1200 ను తాకాయి.ఎన్నికల సమయం కావడంతో తాత్కా లిక ఉపశమనం లభించింది.ఎన్నికల తర్వాత వడ్డీతో సహామరోసారి ధరా ఘాతం తప్పదు. ప్రధాని నోటి నుంచి వెలువడే ప్రతి మాట విలువై నది.కానీ,మనప్రధాని గత పదేండ్లలో మాట్లాడి నన్ని అబద్ధాలు మరో దేశాధినేత మాట్లాడి ఉం డరు. తాజాగా రాజస్థా న్‌లో ఎన్నికల ర్యాలీలో.. ‘కాంగ్రెస్‌ గెలిస్తే మీ సంప దను ముస్లింలకు పంచేస్తుంది. తల్లుల మెడలోని మంగళసూత్రాలను వదలదు’అంటూ ఒకమతాన్ని టార్గెట్‌ చేసి మాట్లాడారు.ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం తగునా? : మనం వేసే ఓటే మన దేశ భవిష్య త్తును నిర్ణయిస్తుంది. ఓటర్లు ఒక్కసారి ఆలోచిం చాలి.కులం,మతం,జాతి అనే అభిమాన, దురాభి మానాలకు, తాత్కాలిక రాయి తీలు, ప్రలోభాలకు లొంగిపోవద్దు. ఓట్ల కోసం చెప్పే మాటలు, వాగ్దా నాల ఒరవడిలో కొట్టుకు పోవద్దు. నాయకులు, పార్టీల గత చరిత్ర, హామీల అమలును తెలుసుకొని ఓటు వేయండి. ఓటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా.
దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగిత రేటు..: ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సేవల్ని అందించేందుకు ప్రభుత్వ శాఖల్లో అదే స్థాయిలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరగాలి. అయితే, అలా జరగడంలేదు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలను ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ హామీకి నీళ్లొదిలేసింది. అంతేనా.. జనాభాకు అనుగుణం గా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచాల్సింది పోయి..కొత్త పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపది కన రిక్రూట్‌మెంట్‌ చేపడుతూ పరిమిత ఉద్యోగు లతోనే ప్రభుత్వ రథాన్ని లాగుతున్నది. ఫలితంగా నిరుద్యోగం తారాస్థాయికి చేరుతున్నది.‘పే అండ్‌ అలవెన్స్‌’పేరిట కేంద్ర ఆర్థికశాఖ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నది.
నాలుగు పోస్టుల్లో ఒకటి ఖాళీనే : ఆర్థికశాఖ తాజా నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం 30.13 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.2010 తర్వాత ఉద్యోగుల సంఖ్య ఇంత తక్కువ స్థాయిలో ఉండ టం ఇదే తొలిసారి. దేశ జనాభాను బట్టి ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతఉద్యోగుల సంఖ్యకు కనీసం ఐదారు రెట్ల సంఖ్యలో ఉద్యోగాలనుభర్తీ చేయాల్సి ఉన్నది. అయితే, 39.77లక్షల పోస్టులను మాత్రమే మం జూరు చేసిన బీజేపీ ప్రభుత్వం అందులో 30.13 లక్షల కొలువులనే భర్తీ చేసింది.అంటే, ఇంకా 9.64 లక్షల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ప్రతి నాలుగు పోస్టుల్లో ఒకఉద్యోగం భర్తీకి నోచుకోకుండా ఖాళీ గానే ఉన్నది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా చదువుకు తగిన ఉద్యోగం లభించక దాదాపు 22కోట్ల మంది పడిగాపులు కాస్తున్నట్టు నివేదికలు చెబుతు న్నాయి. కేంద్రప్రభుత్వశాఖల్లో మంజూరైన పోస్టుల సంఖ్యను పెంచి, వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తే దేశంలో నిరుద్యోగం తగ్గుతుందని నిపుణులు సూచి స్తున్నారు.
ఏపీ,తెలంగాణాలో ఇలా!
దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమ స్యల్లో నిరుద్యోగం (ఖఅవఎజూశ్రీశీవఎవఅ్‌ )ఒకటి. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీల మేనిఫె స్టోలో ఉద్యోగ కల్పన గురించి, నిరుద్యోగ ప్రస్తావన గురించి ఖచ్చితంగా ఉంటుందన్న విషయం తెలె సిందే.అయితే దేశంలో నిరుద్యోగం గురించి సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (జవీIజు) ఒక డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో నిరుద్యోగిత రేటు6.8శాతం ఉందట. అయితే ఈ రేటు గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నట్లు లేటెస్ట్‌ డేటా చెబుతోంది.గ్రామీణ ప్రాంతంలో6.3 శాతం నిరుద్యోగం ఉండగా,పట్టణ ప్రాంతంలో 7.8 శాతంఉంది. వాస్తవానికి గత నెలలో 8.28 శాతం ఉన్న దేశనిరుద్యోగ రేటుఒకే నెలలో 6.3శాతానికి తగ్గినట్లు డేటాలో తెలిపారు.కాగా,రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా చూస్తే దేశంలో అత్యధి కంగా హర్యానాలో 37.3 శాతం నిరుద్యోగ రేటు ఉంది.ఆతర్వాత జమ్మూ కశ్మీర్‌ (32.8), రాజస్తాన్‌ (31.4), జర్ఖండ్‌ (17.3), త్రిపుర (16.3),గోవా (13.7), బీహార్‌(12.8) రాష్ట్రాలు ఉన్నాయి. ఇక దేశంలో అత్యంత తక్కువ నిరుద్యోగం చత్తీస్‌ ఘడ్‌ లో ఉన్నట్లు డేటా వెల్లడిరచింది. చత్తీస్‌ ఘడ్‌ లో నిరుద్యోగ రేటు0.4శాతమని డేటా వెల్లడిర చింది. మేఘాలయ(2),మహారాష్ట్ర(2.2),ఒడిషా (2.6), మధ్యప్రదేశ్‌(2.6) తర్వాత స్థానంలో ఉన్నాయి. అయితే దక్షిణాదిలో కర్ణాటక మినహా అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్నట్లు డేటా చెబుతోంది.దక్షిణాదిలో అత్యంత తక్కువ నిరు గ్యోగం ఉన్న రాష్ట్రంగా కర్ణాటక(3.5గా ఉంది. దక్షణాదిలో అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు(7.2)నిలిచింది. తెలంగా ణలో నిరుగ్యోగ రేటు(6.9)గా ఉండగా,ఆంధ్ర ప్రదేశ్‌ నిరుద్యోగ రేటు(6),కేరళలో6.1గా ఉన్నట్లు సీఎంఐఈ డేటా తెలిపింది. నిరుద్యోగ రేటు అంటే ప్రధానంగా పనిచేసే వయస్సు జనాభా(15ఏళ్లు అంతకన్నా ఎక్కువ)పని కోసం ఎదురుచూస్తూ ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నవారు.-(డాక్టర్‌ కోలాహలం రామ్‌కిశోర్‌)

అన్నపురాజులు ఒకచోట..ఆకలి మంటలు ఒకచోట

అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచోట.. హంస తూలికలు ఒక చోట.. అలసిన దేహాలు ఒకచోట..సంపద అంతా ఒకచోట.. గంపెడు బలగం ఒకచోట..’ అంటూ కొన్ని దశాబ్దాల క్రితం ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు అసమానతలపై ధర్మాగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. నేటికీ అవి పెచ్చుమీరుతూనే ఉన్నాయి. అనంతపురం కలెక్టరేట్‌కు సమీపంలోనే దళిత మహిళ అంజలి ఆకలితో అలమటిస్తూ.. కన్నుమూసింది. మరోవైపు భారత్‌ బ్రిటీష్‌ రాజ్‌ నుంచి బిలియనీర్‌ రాజ్‌గా మారిందని ప్రపంచ అసమానతల ల్యాబ్‌ నివేదిక ఎత్తిచూపింది.
ప్రభుత్వ ఆదాయమంతా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకే ఖర్చు చేసెస్తున్నా యని,ప్రజలను బిచ్చగాళ్లుగా చేస్తున్నారని కార్పొ రేట్‌,మీడియాలో ప్రచారం నిత్యం హోరెత్తి పోతూ నే ఉంది. మీడియాలో సింహభాగాన్ని ఆక్రమించిన గోడీ మీడియా సంగతి ఇక చెప్పనక్కరేలేదు. మద్యా నికి బానిసై వేధించుకుతినే భర్త, తిండి లేక అలమ టిస్తూ అడుక్కుంటున్న ముగ్గురు బిడ్డలు,రోజుల తరబడి ఆహారం లేక బక్కచిక్కి ఆకలితో మరణిం చిన అంజలి ఉదంతం.ఆ ప్రచారంలోనూ,నేటి సంక్షేమ పథకాల అమలులోనూ ఉన్న డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్నాయి.అంజలి, ఆమె పిల్లలకు ఆధార్‌ కార్డే లేదు. ఇంటింటికీ సంక్షేమ పథకాలంది స్తున్నా మంటున్న ప్రభుత్వాలకు, అధికారులకు, వాలంటీర్ల కు ఇల్లేలేని ఆమె కనిపించనేలేదు. కనీసం బియ్యం అందినా అంజలి ప్రాణం నిలబడేదని చెబుతున్న స్థానికుల మాటలు చేదు నిజాలను కళ్లముందుంచు తున్నాయి.77ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో..మరీ ముఖ్యంగా2000నుంచీ విపరీతంగా పెరిగి పోయి న ఆర్థిక అసమానతలు పేదల ఆకలిచావు లకు, రైతుల ఆత్మహత్యలకు కారణభూతమవుతున్నాయి. 15 కోట్ల మంది నిరుపేదలు ఒక్కపూట తిండికోసం అల్లాడుతున్నారని తాజా నివేదిక ఎత్తిచూపింది. 144 కోట్ల మంది ప్రజలు నా అక్కచెల్లెల్లు, అన్నద మ్ములు అని నిత్యం ప్రధాని మోడీ వల్లెవేస్తుండగానే ప్రపంచ ఆకలి సూచీలో 125దేశాలకుగాను అట్ట డుగున111వ స్థానానికి మనదేశం దిగజా రింది. 2015 నుంచి పురోగతి శూన్యమని గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ తేల్చిచెప్పింది. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే 38శాతం మంది పోషకా హార లోపంతో బాధపడుతున్నారు.ఇబ్బడిము బ్బడి గా పెరుగుతున్న కార్పొరేట్ల ఆదాయం, వారి దురాశే పేదరికాన్నిరోజురోజుకూ వృద్ధి చేస్తోందని ఆక్స్‌ ఫామ్‌ తేల్చిచెప్పింది.1947నుంచి 80 వరకూ అస మానతలు తగ్గుముఖం పట్టగా, నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలుతో అసమానతలు పెరి గాయి. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపద కేంద్రీకరణ మరింత పెరిగి పోయింది.1951లో 11.5శాతం జాతీయాదా యం మాత్రమే వారి చేతుల్లో ఉండేది. 10 శాతం సంపన్నుల చేతిలో1951లో 36.7శాతం సంపద ఉండగా,2022నాటికి57.7శాతానికి పెరిగి పోయింది. అంతేలే పేదల గుండెలు.. అశ్రువులే నిండిన కుండలు అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు పేదలబతుకులు రోజురోజుకూ తీసికట్టుగా మారి పోతున్నాయి.దిగువన ఉన్న 50శాతం మంది ఆదాయం 1951లో20.6శాతం ఉండగా, 2022 నాటికి 15శాతానికి పడిపోయింది. జనాభాలో దాదాపు 40శాతంగా ఉన్న మధ్యతరగతి ఆదా యం కూడా 42.8 శాతం నుంచి 27.3 శాతానికి తగ్గిపోయింది.2022లో మనదేశ జాతీయాదాయం లో 22.6 శాతం, 40.10శాతం ఆస్తి ఒకశాతం సంపన్నుల చేతిలో ఉంది.1991లో ఒకే ఒక శత కోటీశ్వరుడు ఉంటే 2022 నాటికి 162కి పెరిగి పోయింది. ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి విషయాలలోనూ ప్రభుత్వ పెట్టుబడులు సగటు భారతీయుల స్థితిగతులను మార్చేకన్నా సంపన్నులకు కట్టబెట్టేందుకు దోహదం చేస్తున్న దుస్థితిని నివేదిక ఎత్తిచూపింది.
‘ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) అనుమతిస్తే, ప్రపంచానికి ఆహార నిల్వలను అందిం చేందుకు భారత్‌ సిద్ధం’.గత ఏప్రిల్‌లో గుజరాత్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆర్భా టంగా చేసిన ప్రకటన ఇది. ప్రధాని అలా చెప్పారో లేదో.. ప్రపంచానికి భారత్‌ అన్నపూర్ణగా మారి పోయిందంటూ కమలశ్రేణులు గప్పాలు కొట్టాయి. అయితే,భారత్‌లో ఆహార సంక్షోభం, పోషకాహార లోపం, శిశు మరణాల రేటు ప్రమాదకరస్థాయికి చేరిం దంటూ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ దారుణమైన స్థితికి పడిపోయింది. ఎంతలా అంటే.. కటిక పేద దేశాలుగా పరిగణించే సూడాన్‌, రువాం డా,నైజీరియా,ఇథియోపియా,రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోతోపాటు యుద్ధంతో కకావికలమై, తినడానికి గింజలు లేక అల్లాడుతున్న ఉక్రెయిన్‌ కంటే కూడా హీనమైన ర్యాంకును నమోదు చేసింది.మోదీ 10ఏండ్ల పాలనలో ఆకలిసూచీలో భారత్‌.. ఏకం గా 52 స్థానాలను కోల్పోయింది.
దారుణమైన పరిస్థితి
వివిధ దేశాల్లో ఆకలి స్థాయులు, పోషకాహార లోపాలను సూచించే ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌-జీహెచ్‌ఐ)లో భారత్‌ స్థానం మరింతగా దిగజారింది.2022 సంవత్సరానికిగానూ మొత్తం 121దేశాలను పరిగణలోకి తీసుకొంటే 29.1 హంగర్‌ స్కోరుతో భారత్‌ 107వస్థానంలో నిలిచింది. గత కొంత కాలంగా తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న పొరుగు దేశం శ్రీలంక, ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పేద దేశాలుగా పిలిచే సూడాన్‌, రువాండా, నైజీరియా, ఇథియో పియా,రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోతో పాటు యుద్ధంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ (36) తో పోలిస్తే భారత్‌ దారుణమైన ర్యాంకుకు పడి పోవడం గమనార్హం. ఈ మేరకు జీహెచ్‌ఐ వార్షిక నివేదికను కన్‌సర్న్‌ వరల్డ్‌వైడ్‌, వెల్త్‌ హంగర్‌ హిల్ఫ్‌ సంస్థలు శనివారం సంయుక్తంగా ప్రచురించాయి. భారత్‌లో ఆకలి స్థాయి చాలా తీవ్రంగా ఉన్నదని హెచ్చరించాయి. సూచీలో చైనా, కువైట్‌, టర్కీ సహా 17దేశాలు 5కంటే తక్కువ స్కోర్‌తో అగ్ర స్థానంలో నిలిచాయి.ఎంతదారుణమంటే.. దక్షిణా సియాలోని అన్ని దేశాలకంటే కూడా దిగువ స్థానా నికి భారత్‌ చేరుకొన్నది.
మోదీ నిర్వాకం ఇది
పైకి ఉత్తుత్తి మాటలు చెప్పాలంటే మోదీ ఆయన వందిమాగధ జనం ఎంత పెప్ప మన్నా చెప్తారు. కానీ..మోదీ ఆయన మంత్రిగ ణానికి ఎలాంటి దూరదృష్టి కానీ, దార్శనికత కానీ సున్నాశాతం కూడా లేదు.ముఖ్యంగా ఆహార భద్రత విషయంలో ఎంతమాత్రం ప్రణాళిక లేదు. దేశం లో ఒకవైపు ఆకలి కేకలు వినిపిస్తుంటాయి. మరో వైపు ఏరాష్ట్రంలోనైనా రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే..తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలఆహారభద్రత హక్కును పణంగా పెడతారు.
పండిన ధాన్యాన్ని కొనరు. ఇదేమయ్యా అంటే.. ఓప్‌ా మాదగ్గర నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలున్నాయని చెప్తారు. ధాన్యం బాగా పండుతున్నప్పుడు నిల్వల సామర్థ్యాన్ని పెంచవచ్చు కదా అంటీ అదీ చేయరు. ఉన్న నిల్వలను పేదలకు పంచాలి కదా..అంటే అదీ చేయరు.ధాన్యం నిల్వల నిర్వహణకు ఒక విధానమంటూ ఉండదు. బోలెడు నిల్వలు ఉన్నయనిచెప్పి నాలుగైదు నెలలైనా కాలేదు. ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వలు నిండుకున్నయి. లబోదిబోమంటూ..గోధుమలు,బియ్యం, నూకలు.. ఇలా అన్నింటి దిగుమతులపైనా నిషేధం విధిం చారు.ఓపక్క పండిరచడానికి రైతుసిద్ధంగా ఉన్న ప్పటికీ అతనికి మోదీ సర్కారు నుంచి మద్దతు కొరవడిరది సరికదా.. వ్యవసాయాన్నే దారుణంగా దెబ్బతీసే దిశగా మోదీ దుందుడుకు విధానాలు సాగుతున్నాయి. విచిత్రమేమిటంటే.. ఎగుమతులపై నిషేధం విధించటమే ఆలస్యం..దేశంలోని గోధు మల్లో సింహభాగం ముకేశ్‌ అబానీ కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి.ఇదొక్క నిదర్శనం చాల దా మోదీ దర్శనం కార్పొరేట్ల కోసమేనని చెప్ప డానికి..
ఏమిటీ సర్వే? నిర్వహించేదెవరు?
ప్రపంచదేశాల్లో నెలకొన్న ఆకలి స్థాయి లు, పిల్లల్లో పోషకాహారలోపం,శిశుమరణాలు తదితర గణాంకాలు ఆధారంగా చేసుకొని జీహె చ్‌ఐ వార్షిక నివేదికను ఐర్లాండ్‌కు చెందిన కన్‌సర్న్‌ వరల్డ్‌వైడ్‌, జర్మనీకి చెందిన వెల్త్‌ హంగర్‌ హిల్ఫ్‌ సంస్థలు ఏటా సంయుక్తంగా వెలువరిస్తాయి. ఎక్కువ స్కోర్‌ సాధించిన దేశంలో ఆకలి సంక్షోభం తీవ్ర రూపంలో ఉన్నట్టు పరిగణించాలి.
భారత్‌ ఖండిస్తుందని ముందే తెలిసి..
ఆకలి సూచీలో కిందటేడాది116 దేశా ల్లో భారత్‌ 101స్థానంలో నిలిచింది.అయితే అప్పు డు కేంద్రం ఈ నివేదికను తప్పుబట్టింది. ఆకలి స్థాయుల్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉన్నదనని నివేదికను ఖండిరచింది. ఈ క్రమంలో నివేదికను వెలువరించే సమయం లోనే సదరు సంస్థలు ప్రత్యేక వివరణ ఇచ్చాయి. ప్రధాని మోదీ హయాంలో గడిచిన ఎనిమిదేండ్లలో జీహెచ్‌ఐలో భారత్‌ స్కోరు దారుణంగా పతన మైంది. చిన్నారుల్లో కనిపిస్త్తున్న పోషకాహార లోపం, ఆకలి, ఎదుగుదల లోపం, కుంగుబాటు వంటివాటి పై ప్రధాని మోదీ ఎప్పుడు స్పందిస్తారో చూడాల్సి ఉన్నది. దేశంలో 22.4కోట్ల మంది ప్రజలు పోష కాహార లోపంతో బాధపడుతున్నారు. ఆకలి సూచీ లో భారత దాదాపు అట్టడుగు స్థానానికి చేరు కొన్నది.
బడా పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వా నికి మధ్య సంబంధాలు పెరిగిపోవడాన్ని,ఏక వ్యక్తి కేంద్రంగా నిరంకుశ పాలనకు దారితీస్తుందని హెచ్చరించింది. హిందూ మతతత్వ రాజకీయాలు, కార్పొరేట్‌ క్యాపిటల్‌ కలిసి దేశాన్ని లూటీ చేసిన పరిస్థితుల్లో ప్రముఖ ఆర్థిక వేత్తలు థామస్‌ పికెట్టి, లూకాస్‌ ఛాన్సెల్‌,నితిన్‌కుమార్‌ భారతి,అన్మోల్‌ సోమంచి తదితరులు రూపొందించిన ఈ నివేదిక ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టాయి. తాజాగా ఎన్నికల బాండ్ల విషయంలోనూ మోడీసర్కారుకు,కార్పొ రేట్లకు ఉన్న అనుబంధాన్ని తేటతెల్లం చేసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ, కార్పొరేట్‌ రాజ్‌ను మట్టికరిపించాలి.అందుకు ఉక్కు సంకల్పం తీసుకోవాలి.- (వ్యాసకర్త : ఇండిపెండెంట్‌ సీనియర్‌ పాత్రికేయులు`న్యూఢల్లీి)

ఆర్దిక అంతరాలకు అంతమెన్నడు.

కొంతమంది ప్రపంచ స్థాయి ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం భారత్‌లో నేడు ఆర్థిక అంతరాలు బ్రిటిష్‌ పాలనలో కన్నా ఘోరంగా ఉన్నాయి. గణాంకాల ఆధారంగా వారు చెప్పిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో సంపద సృష్టి బాగానే జరుగుతున్నా, అది కొద్ది మంది చేతిలోనే కేంద్రీకృతమౌతుంది. దేశ సంపద లో 44శాతం ఒక్కశాతం ధనికుల చేతిలోఉంది. ఆఒక్క శాతం మంది జాతీయ ఆదాయంలో 22 శాతం మేరకు పొందు తున్నారు.ఏభై శాతం ప్రజలు జాతీయ ఆదాయంలో 15శాతానికి మించి పొందలేక పోతున్నారు. అంటే జాతీయ ఆదాయం ఎంత పెరిగినా జనాభాలో సగం మందికి దక్కేది అందులో 15పైసల వాటానే. ఇలా అసమానతలు పెరగడానికి ఇప్పటి ప్రభుత్వ విధానాలే కారణం. ధనికులపై విధించే పన్నులు తక్కువ. వారు పొందే రాయితీలు ఎక్కువ. పేదలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కట్టే పన్నులు ఎక్కువ. వారికి దొరికే ఊరట. ధరల నియంత్రణ ద్వారానో, మరోలానో తక్కువ. అయితే అసమానతలు తగ్గే విధానాల్ని అమలు చేస్తామని ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం. వృద్ధి వైపు దేశాన్ని పరుగులు పెట్టిస్తామని అందరూ అంటున్నారు తప్పించి, ఆ వృద్ధి ఫలాలు అందరికీ అందేలా విధానాలు రూపు దిద్దగలమని జాతీయ పక్షాలు మాట్లా డడం లేదు.బహుశా దాని వల్ల ధనికులు దూరమై, వారి విరాళాలు అందవని భయ మేమో? చూశాం కదా, ఎన్నికల బాండ్ల రూపంలో దివాళా కంపెనీలు కూడా పార్టీలకు ఎలా నిధులు ఇచ్చాయన్నది. ఇకపోతే ఆర్థిక అంతరాలు మరీ వారు చెప్పినంత ఘోరంగా లేవని వాదించవచ్చు. కానీ అసమానతలు దండిగా ఉన్న వాతావరణంలోనే ఉన్నామన్నది ఎవరూ కాదనలేరు. వేరే వేరే నివేదికల ప్రకారం 2000 సంవత్సరంలో 35 శాతం ఉన్న నిరుద్యోగిత నేడు 65 శాతం అయ్యింది. పేదరికం, పోషకాహార లేమి గణనీయంగా ఉన్నాయి. ఇప్పటికీ వైద్యం, విద్యపై పౌరులు భరించాల్సిన ఖర్చు ఎక్కువే. వాటివల్ల అప్పులు పాలయ్యే వాతావరణం. ఈ సమస్యల్ని గమనం లోకి తీసుకోకుండా వృద్ధిలో ముందంజ వేయడం సాధ్యమా? పేదలకి, అధిక సంఖ్యలో ఉన్న మధ్యతరగతికి భారమైన విద్య, వైద్యం చవకగా అందుబాటులోకి రావాలి. అప్పుడే నాణ్యమైన భవితకు, ఆర్థిక వృద్ధికి పూచీ. యువత గణనీయంగా ఉన్న భారత్‌ శక్తిమంతం కావడమే కాదు అసమానతలు లేని సమాజంగా మారాలి. ఇప్పుడున్న విధానాలతో అది సాధ్యం కాదు. మెరుగైన విధానాల కోసం, అవి ఎన్నికల్లో ప్రాధాన్యత గల అంశాలుగా మారడం కోసం నడుం కట్టాల్సింది పౌర సమాజమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశా బ్దాలు గడిచినా ప్రజల మధ్య ఆర్థిక అసమాన తలు తీవ్రస్థా యిలో ఉన్నాయి. నిత్యం పెరుగు తున్న ధరలు, ఇతర కారణాలతో కోట్ల మంది కూడు,గూడు, గుడ్డ కోసం ఇంకా బతుకు పోరా టం చేస్తుండగా..మరోవైపు ఇదే సమ యంలో సంపన్నులు పోటీపడి మరీ లగ్జరీలైఫ్‌ అనుభవిం చడంతో పాటు విలువైన వస్తువుల కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు ఇటీవల ముంబైలో ప్రారంభమైన యాపిల్‌ స్టోర్‌కు పలు వురు పోటెత్తడమే ఉదాహరణ.ఈ తరహా ఆర్థిక అంతరాలు దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని, దేశాభివృద్ధికి ఆటంకం అని ఆర్థిక నిపుణు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక అంతరాలు అధికంగా ఉన్నదేశాల జాబితాలో భారత్‌ ఉన్నదని వరల్డ్‌ ఇన్‌ఈవ్వాలిటీ ఇండెక్స్‌-2022 పేర్కొన్నది. భారత్‌లో దేశ ఆదాయంలో టాప్‌ 10శాతం లేదా 1శాతం సంపన్నుల వద్ద వరుసగా 57శాతం, 22శాతం సంపద ఉన్నద నే ఆందోళనకర విష యాన్ని వెల్లడిరచింది. ఇటీ వల యాపిల్‌ సంస్థ ముంబైలో తన తొలి రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభిం చింది. అక్కడ ఒక్కొ క్కటి రూ.లక్ష అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే విలువైన ఫోన్ల కోసం స్టోర్‌ ముందు సంపన్నులు క్యూ కట్టారు. కాగా, మునుపటి ఏడాది కంటే 2022లో భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరిగాయి.ఇదే సమ యంలో మధ్య తరగతి ప్రజలు వినియో గించే బైక్‌లు,దేశీయ తయారీ సంస్థ బజాజ్‌ ఆటో అమ్మకాలు 10 శాతం పడిపోయాయి. భారత్‌ను తమ వేగవం తమైన మార్కెట్‌గా భావిస్తున్న లగ్జరీ కార్ల సంస్థ మెర్సి డెస్‌ బెంజ్‌ అమ్మకాలు గణనీయంగాఉంటా యని అంచ నా వేస్తున్నది. పైన పేర్కొన్న దానికి విరుద్ధంగా దేశంలో 63శాతం పేద,మధ్య తరగతి వినియోగ దారులు అనవసరమైన వస్తు వులు,సేవలపై ఖర్చులను పరిమితం చేసు కొంటున్నారని 2023 పీడ బ్ల్యూసీ గ్లోబల్‌ కన్జ్యూ మర్‌ ఇన్‌సైట్స్‌ పల్స్‌ సర్వే పేర్కొన్నది. తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులపై ఆందోళన చెందు తున్నామని సర్వేలో పాల్గొన్న74శాతం మంది పేర్కొ న్నారు. కలరా,తట్టు,పోలియో,మెదడు వాపు, మశూచి, సార్స్‌,ఎబోలా, ప్లేగు వంటి మహమ్మారులు సైతం వేధించి కనుమరుగయ్యాయి. కరోనా గతీ రేపు ఇంతేకాక తప్పదు. ఈలోపు అది సృష్టించే విలయం నుంచి ప్రజలను కాపాడుకోవడానికి పాలకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలి. దాంతోపాటు జాతిని వేధిస్తున్న మరో మహ మ్మారిపైనా వారు దృష్టి సారించాల్సిన కీలక తరుణమిది. మానవాళిని వేధిస్తూ ఎప్పటికి అంతమవుతుందో తెలియని ఆ మహమ్మారి- ‘ఆర్థిక అసమానత’!
అసమానతలకు అంతంలేదా?
కరోనా భూతంలానే వందేళ్ల క్రితం 1920లో స్పానిష్‌ ఫ్లూ ప్రపంచాన్ని వణికించింది. అన్ని కాలాల్లోనూ నిరంతరాయంగా మహమ్మా రులు పీడిస్తూనే ఉన్నాయి.అసమానత అనే రుగ్మ తకు మాత్రం మందు కనుచూపు మేరలో లేదు. నిజానికి శ్రేయోరాజ్య భావన ప్రపంచంలో తొలుత 1880లో మొగ్గతొడిగింది. 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత ఏర్పడిన ఆర్థిక సామా జిక కష్టాలతో దాని అవసరం మరింత ఏర్పడిరది. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్ల అవుతున్నా ఆర్థిక అంతరాలు మాత్రం సమసిపోలేదు. శ్రేయోరాజ్య పాలన అందించే ప్రభుత్వాలు దాని మూలసూ త్రాలైన సమాన ఉపాధి అవకాశాలు, సంపద పంపిణీ వంటివాటిని విస్మరించాయి. అనవసర వ్యయాల బారినపడి అవినీతిని నిర్మూలించకుండా అమ లు చేసే పథకాలు, కార్యక్రమాలు మరింత అంతరాలకు కారణమవుతున్నాయి. దేశ ప్రజల ఆరోగ్య, ఆర్థిక సామాజిక భద్రత కోసం ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు దోహదం చేసినప్పుడే శ్రేయోరాజ్య భావన సఫలీకృత మవుతుంది. ‘ఫోర్బ్స్‌’ లెక్కల ప్రకారం దేశంలో 102 మంది, ప్రపంచం లో 2,095 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచ, దేశ జనాభాతో పోలిస్తేఇది సంఖ్యాపరంగా తక్కువే కావచ్ఛు కానీ మొన్నామధ్య ప్రముఖ ఆర్థికవేత్త పద్మ భూషణ్‌ కౌశిక్‌ బసు ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదికను ఉటంకిస్తూ-73శాతం సంపద ఒక శాతం ప్రజల చేతిలో ఉందని ఓఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఆర్థిక అంతరాలు ఎంతగా పెరిగి పోయాయో స్పష్టమైంది. దురదృష్ట వశాత్తు ప్రభుత్వాలు చేపను పట్టడం నేర్ప కుండా… తెచ్చి నోట్లో పెట్టినట్లు తాత్కాలిక పథకాలు, కార్యక్రమాలతో తమ అధికారాన్ని కాపాడు కోవడం కోసం యత్నిస్తున్నాయి. అధిక సంఖ్యలో ఉన్న నిర్ణాయక శక్తిని ప్రభావితం చేస్తు న్నాయి. ఫలితంగా ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం లేదు.
ఆర్థికంగా చితికిపోయింది..
బ్రిటిష్‌ పరిపాలనకు ముందు మనది స్వయం సమృద్ధ దేశం.వారి ఏలుబడిలో ఆర్థికంగా చితికిపోయింది.తదనంతర కాలంలో దేశాన్ని నిల బెట్టడం కోసం ప్రభుత్వాలు అనేక విధానా లను రూపొందించి అమలు చేశాయి. జనాభా పెరిగి అవసరాలూ మారిన తరవాత 1965లో హరిత విప్లవం దిశగా సాగి దిగుబడులు సాధించింది. 1990లో ప్రపంచీకరణకు తలు పులు తెరిచింది. అయినప్పటికీ స్వావలం బన అనేది ఇప్పటికీ ఇంకా సుదూరంలోనే ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం జీడీపీలో 23.64శాతం దిగుమతులు ఉంటే,19.74 శాతం ఎగుమతులు ఉన్నాయి. మందులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రక్షణ సామగ్రి, చమురు, సెమీకండక్టర్ల వంటివాటికి ఇప్పటికీ ఇతర దేశాలమీదే ఆధారపడుతున్నాం. అందుకే స్వావ లంబన మంత్రాన్ని జపిస్తున్నాం. కరోనా, లాక్‌ డౌన్‌, సడలింపులు వంటి వాటితో మన వైద్య, ఆర్థిక వ్యవస్థలోని డొల్లతనం బయటపడిరది. వలస కూలీల వెతలే ఇందుకు నిదర్శనం. బ్రూకింగ్స్‌ నివేదిక ప్రకారం7.30కోట్ల ప్రజలు కటిక పేదరి కాన్ని అనుభవిస్తున్నారు. ఆపైన ఉన్నవారు, మధ్యతరగతి ప్రజలు అరకొర ఆదాయాలు, చుక్క లంటుతున్న ధరలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక ప్రకారం 1917-18లో 4.6శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2018-19లో6.3 శాతానికి 2019-20లో 7.6శాతానికి ఎగబా కింది. అసంఘటితరంగం ఆసాంతం, సంఘటిత రంగంలోని చిన్న మధ్యతరహా సంస్థలు తీవ్రం గా దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి కోసుకుపోయి, ఆదాయాలు అడుగంటినవేళ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ఏ మేరకు పని చేస్తుందో చూడాలి. ఉపాధి, ఆదాయం,కొనుగోలు శక్తి,ఈ మూడిరటి మధ్య సంబం ధాన్ని గుర్తించ నంత కాలం, ఉపాధిలో స్వావలం బన సాధించ నంత కాలం అంతరాలు అలాగే ఉంటాయి. అందువల్ల ఆర్థిక అంతరాలు తగ్గే విధంగా, సంపద సృష్టి సమాజంలో అందరికీ విస్తరిం చేలా ఉపాధి కల్పన పథకాలు, కార్యక్రమా లను అమలుచేసే విధంగా ప్రభుత్వాలు తమ విధానా లను మార్చుకోవాల్సిన అవసరం ప్రస్తుత కరోనా క్లిష్టకాలంలో ఎంతైనా ఉంది! `(వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్టు, అమరావతి – (పొడిశెట్టి సత్యనారాయణ)

  

ఉరుముతున్న నిరుద్యోగం

పతకమూరు దామోదర్‌ ప్రసాద్‌
ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేక పోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్త వుతాయి. స్వతంత్ర భారతం అనేక రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించినా భారత్‌లో తయారీ వంటి ఆకర్షణీయ నినాదాలిస్తున్నా తదనుగుణంగా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ముఖ్యంగా తయారీ రంగంలో మేటిగా నిలవలేక ఇంకా అనేక వస్తువులను చైనా తదితర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవు తున్నాయి.
స్వతంత్ర భారతం అనేక రంగాలలో గణనీయ మైన అభివృద్ధి సాధించినా భారత్‌లో తయారీ వంటి ఆకర్షణీయ నినాదాలిస్తున్నా తదను గుణంగా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ముఖ్యంగా తయారీ రంగంలో మేటిగా నిలవలేక ఇంకా అనేక వ స్తువులను చైనా తదితర దేశాలనుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.ఫలితంగా కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పనలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను వచ్చే 24ఏళ్లలో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం లో 3వస్థానానికి చేర్చడమే లక్ష్యంగా సంకల్పం చెప్పుకుని ఆదిశగా కొన్ని చర్యలు చేపట్టారు.అయితే ఇవి లక్ష్యసాధనకు ఏమేరకు ఉపకరిస్తాయనేదే ప్రశ్న.నిరుద్యోగ సమస్య తీవ్రత దృష్ట్యా పాలస్తీనా వివాదంలో ఇస్లామిక్‌ దేశాలతో పోరాడుతున్న ఇజ్రేల్‌ దేశములో వివిధ రంగాలలో ముఖ్యంగా నిర్మాణ రంగంలో పనిచేయడానికి భారత యువత ఎగబడటం చూస్తే నిరుద్యోగ పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది.ఇజ్రియల్‌ నిర్మాణ రంగంలో పనిచేయడానికి 10వేలమందికి పైగా ప్లంబర్లు,ఎలక్ట్రీషియన్‌ లు,కార్పెంటర్‌ లు,పెయింటర్ల వంటి వివిధ వృత్తుల వారు అవసరం కాగా ఆపనుల్లో చేరడానికి తొలుత 25కోట్ల జనాభాగల అతిపెద్ద రాష్ట్రం యుపి, హర్యానా యువకులు ఎగబడ్డారు.కాగా ఇజ్రేల్‌ తో స్నేహసు హృద్భావ సంబంధాలు నెరపు తున్న శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చొరవ తీసుకుని బిజెపి ఏలుబడిలోని యుపి, హర్యానాలో కార్మికుల రిక్రూట్‌మెంట్‌లో ఇజ్రెల్‌ కు తమ సహకారాన్ని అందించింది. పాలస్తీనా సంఘర్షణలో ఇస్లామిక్‌ దేశాలు,ఇ జ్రేల్‌ పరస్పరం బాంబు,క్షిపణి దాడులకు దిగడంతో అక్కడ ప్రాణాంతకమైన భీతా వహ పరిస్థితుల్లో సైతం పనిచేయడానికి మన నిరుద్యోగ యువత పోటీపడుతున్నది. ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.1.40లక్షల జీతం,రూ 4వేల వరకు బోనస్‌ ఇస్తామని ప్రకటించడంతో ఎంపిక జరుగుతున్న చోట్ల తొక్కిసలాట జరుగుతున్నది.ఆకలితో మరణించడం కంటే పనిచేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడానికి యువత సిద్ధపడటం నిరుద్యోగ తీవ్రతకు నిదర్శనం. వివిధ దేశాలలో నైపుణ్యం,పాక్షిక నైపుణ్యం గల కార్మికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండ టంతో బతుకు కోసం ఆదేశాలకు తరలి వెళ్ళడానికి యువత పోటీ పడుతున్నారు.ప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు గల్ఫ్‌ తదితర దేశాలలో పని చేస్తూ తమ కుటుంబాలకు వేలకోట్ల రూపాయలు పంపి ఆదు కుంటున్నారు. దేశంలో తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకే యువత విదేశాలబాట పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పి స్తామని 2014లో అధికారం లోకి రావడానికి ముందు బిజెపి తమ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. అయితే వాస్తవంగా జరిగింది వేరు.దేశంలో తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కన్సల్టెన్సీలకు వేలకొద్దీ డబ్బు చెల్లించి మన యువత విదేశాలకు తరలి వెళుతున్నారు. ధనదాహంతో కొన్ని కన్సల్టెన్సీలు అవకాశాలు లేని దేశాలకు కూడా యువతను పంపడం, అక్కడికి చేరాక వారు అష్టకష్టాలు పడటం తెలిసిందే.కెనడా, అమెరికా వంటి దేశాలకు వెళ్లిన వారికి సైతం తగిన ఉద్యోగాలు లభించక అర్ధాకలితో అలమటిస్తూ,అప్పుల పాలై మళ్లీ స్వస్థలాలకు తిరిగి వస్తున్నవారు గణనీయంగా ఉన్నారు.2022అక్టోబర్‌ -2023 సెప్టెంబర్‌ మధ్యమెరికాలో అక్రమంగా ప్రవేశించిన 96,917మందిని గుర్తించి పట్టుకున్నట్లు అమెరికన్‌ కస్టమ్స్‌,సరిహద్దు భద్రతా దళం గణాంకాలు ఘోషిస్తున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందు తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా ఇది ఉద్యోగ, ఉపాధి కల్పించలేని అభివృద్ధిగా మిగిలి పోతున్నది.2024-25లో మనదేశం 7.3 శాతం అభివృద్ధి సాధించగలదని ఇటీవల తాత్కాలిక బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు.కోట్లాది యువతకు,శ్రామికులకు ఉద్యోగ జీవనో అవకాశాలు కల్పించలేనిదిగా నిలవనుంది. నిరుపేదలు ఏపని దొరికితే అపనికి వెలుతూ జీవితాలు వెళ్ళ దీస్తున్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత మాత్రం తమ అర్హతలకు అనుగుణమైన ఉద్యోగాలకే ప్రాధా న్యత ఇస్తున్నారు. పనిచేసే వయసుగల యువ తకు తగిన ఉపాధి అవకాశాలు లభిం చక పోతే అది వారిలో నైరాశ్యానికి, అశాంతికి దారితీసే ప్రమాదముంది. భారత ప్రభుత్వం రెండేళ్ల క్రితం సై న్యంలో చేరదలచిన యువ తకు అగ్నిపత్‌ పథకాన్ని ప్రకటించగా వేలాదిమంది యువత ముందుకొచ్చారు. మామూలు సైన్యంలో ఇచ్చే జీత భత్యాలు, పింఛను వీరికి రావు.బిజేపి ప్రభుత్వం ఎక్కువగా వాణిజ్య,పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నందున, అగ్నిపథ్‌లో శిక్షణ పొందిన వారు ఐదేళ్ళ తర్వాత పరిశ్రమల వారికి రక్షకులుగా పని చేయాల్సి ఉంటుంది.13కోట్ల జనాభాగల పెద్ద రాష్ట్రం బీహార్లో పరిమితమైన రైల్వే ఉద్యోగాలకోసం యువత ఎగబడడంతో అది హింసాకాండకు దారితీసింది.ఆరేళ్ల క్రితం 35వేల ఉద్యోగాల కోసం ప్రకటన రాగా కోటి మంది దరఖాస్తు చేశారు.నియామకాల్లో అవినీతి జరిగి ఆందోళనలకు దారితీసింది. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం 368బంట్రోతు ఉద్యోగాలకు ప్రకటన చేయగా పీహెచ్‌ డీలు, పోస్టు గ్రాడ్యుయేట్లు సహా 23లక్షలమంది దర ఖాస్తు చేసుకున్నారు.ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి.దేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు6.6శాతం.నగరాలు,పట్టణాలలో 15-19ఏళ్ల ఉద్యోగార్థులు రేటు అంతకు 3రెట్లు ఎక్కువగా ఉన్నట్లు 2023జులై సెప్టెంబర్‌ గణాంకాలు ఘోషిస్తున్నాయి. నిరుద్యోగ సైన్యం నానాటికీ పెరిగిపోతుండటం అనేక సమస్య లకు దారి తీస్తున్నది.2014లో యువత కోటి ఆశలతో కమలం పార్టీకి ఓటేయడంతోనరేంద్ర మోడీ ప్రధానిగా కేంద్రంలో కమలనాథులు అధికారంలోకి వచ్చారు. నిరుద్యోగయువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మోడీ ప్రభుత్వానికి ప్రధమ ప్రాధాన్యం కావాలి.అయితే అరకొర చర్యలు తప్పితే మోడీ ప్రభుత్వం ఈరంగంలో పెద్దగా పురో గతి సాధించలేదు.ఉద్యోగాలు కల్పించినా కొన్ని పట్టణాలు,నగరాలలో అసంఘటిత రంగంలో రోజువారీ కూలీపనులే,మహిళలే అధికం.2019-20లో 22శాతంగా ఉన్న ఈ పనులు 2022-23లో 24శాతానికి పెరిగి నట్లు పరిశీలనలో తేలింది.ఇవి,హెల్పర్లు ,గృహ పరిశ్రమలకు చెందినవే.పట్టణ యువత నైరాశ్యంతో ఉద్యోగాల కోసం వెదకడం మానేసినట్లు తేలింది.2023 జూలై -సె సెప్టెంబర్‌ లో ఉద్యోగుల చేరిక తగ్గింది. మూడు నెలల్లో లోకసభ,అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కంటి తుడుపుగా కొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల డిఎస్‌ సి ద్వారా టీచర్ల నియామకాలను ప్రకటించింది.2023 జూలై నాటికి నిరు ద్యోగి త రేటు 7.95శాతంగా ఉన్నట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ వెల్లడిర చింది.తెలంగాణా ప్రభుత్వం 2015నుండి ఇప్పటి వరకు36,643 ఖాళీల భర్తీకి నోటిఫ కేషన్లు జారీ చేసినట్లు ఆర్‌టిఐ ద్వారా సమా చారం లభించింది.మధ్యలో ప్రశ్నా పత్రాలు లీకై కొన్ని పరీక్షల రద్దుకు,ఉద్యోగాలు రావనే నిరాశతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయం.అయినా పదవులు వెలగ బెట్టిన వారిలో కొంతయినా ఆత్మ పరిశీలన లేక పోవడం విచారకరం.కాగా రేవంత్‌ రెడ్డి సిఎం గా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దాదాపు 2లక్షల పోస్టులకు దశల వారీగా నియామక ప్రక్రియ చేపట్టడం యువతకు ఆశా కిరణంగా కనిపిస్తోంది. తెలంగాణా ప్రభుత్వ 31వి భాగాలలో మం జూరైన పోస్టులు4,91,304.ప్రస్తుతం 3లక్ష ల ఉద్యోగులు మాత్రమే పనిచేస్తు న్నారు. స్కూ లు విద్య,ఆరోగ్యకుటుంబ సంక్షేమ, పోలీసు, పంచాయతీరాజ్‌,రెవెన్యూ శాఖలలో దాదాపు 77శాతం మంది పనిచేస్తున్నారు.స్కూలు విద్యాశాఖలో మంజూరైన పోస్టులు 1,37, 651కాగా ప్రస్తుతం 1,13,853మంది మాత్రమే పని చేస్తున్నారు.పోలీసు శాఖలో మంజూ రైన పోస్టులు98,384కాగా ప్రస్తుతం 61,212మంది మాత్రమే పని చేస్తున్నారు. ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖలో మంజూ రైన పోస్టులు52,906కాగా ప్రస్తుతం22,336 మంది పని చేస్తున్నారు.కాగా నరేంద్ర మోడీ పదేళ్లపాలనలో 9లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు,అదే మోడీ ప్రభుత్వం సాధించిన ఘన విజయమని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితెంద్రసింగ్‌ అభివ ర్ణించారు.కానీ యూపీయే పదేళ్ల పాలనలో ఇచ్చినది 6లక్షల ఉద్యోగాలేనని కేంద్రమంత్రి అంటున్నారు.యుపి ఎస్‌ సి ద్వారా మోడీ ప్రభుత్వం 50,906 ఉద్యోగ నియామకాలు చేయగా యుపిఏ హయాంలో ఇచ్చింది45, 431ఉద్యోగాలేనని,ప్రస్తుత సిబ్బందికి భారీగా ప్రమోషన్‌లు కల్పించామని మంత్రి చెప్పారు. భారత ప్రభుత్వంలో మంజూరైన పోస్టులు 40లక్షలు కాగా,ప్రస్తుతం 30లక్షల ఉద్యోగులే పని చేస్తున్నారు.సివిల్‌ సర్వీసులలో1,365, ఐఏఎస్‌,703,ఐ పీఎస్‌,1042,ఇండియన్‌ ఫారెస్ట్‌ పోస్టులు1042ఖాళీలు,ఐ ఆర్‌ ఎస్‌ పోస్టులు 301ఖాళీగా ఉన్నాయి. హోమ్‌ శాఖలో 1,14,245,సీఆర్పీఎఫ్‌,బి ఎస్‌ ఎఫ్‌, ఢల్లీి పోలీసు శాఖలలో గ్రూప్‌ ఏ స్టులు3, 075,గ్రూప్‌ బి పోస్టులు15861 పోస్టులు, గ్రూప్‌ సి లో95,309పోస్టులు,ఖాళీగా ఉన్నా యి. రైల్వేలలో 2.63లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా ఇటీవల పలుదఫాలుగా1.39లక్షల పోస్టులు భర్తీ చేశారు.ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం 8లక్షల ఉద్యోగులు ఉన్నారు.వారిలో 5.6లక్ష ల రెగ్యులర్‌,1.3లక్షలమంది గ్రామ,వార్డు సచివాలయాలలో పనిచేస్తున్నారు. 2లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్‌ లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్నారు.యుపిలో 27లక్షల ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు, మహారాష్ట్రలో 17లక్షలు,తమిళనాడులో 16లక్షల ఉద్యోగులు,పెన్షనర్లు ఉన్నారు. బీహార్‌,రాజస్తాన్‌,జార్ఖండ్‌,ఢల్లీి రాష్ట్రాలలో నిరుద్యోగులు అధికం. కేంద్రప్రభుత్వం, తెలం గాణా,ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ఖాళీలు భర్తీ చేస్తే నిరుద్యోగులకు కొంతయినా ఊరట కలుగుతుంది. నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పనను ప్రోత్సహిస్తే మరి కొన్ని వేలమందికి ఉపాధి లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈదిశగా సత్వర చర్యలు చేపట్టాలి.

ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్దం

విరాళాల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడం చెల్లదు..ఇది భావ ప్రకటన స్వేచ్ఛ,సమాచార హక్కు చట్ట ఉల్లంఘన..తక్షణమే పథకాన్ని రద్దు చేయాలి..నగదుగా మార్చుకోని బాండ్లను పార్టీలు వాపస్‌ చేయాలి..మార్చి 6లోగా బాండ్ల వివరాలు సమర్పించాలి.. మార్చి13లోగా పూర్తి వివరాలను ఇసి వెబ్‌సైట్‌లో పెట్టాలి`ఎస్‌బిఐ… ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మసనం చరిత్రాత్మక తీర్పు.!
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ పథకం కింద రాజకీయ పార్టీలకు ముడుతున్న విరాళాలను అత్యంత గోప్యంగా ఉంచడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన నాకచాంగ ధర్మాసనం బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లు,బాండ్ల విలువ, వాటి స్వీకర్తల(రాజకీయ పార్టీల) పేర్లను బహిర్గతం చేయాలని ఆదేశించింది.20 18లో తీసుకువచ్చిన ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగపరంగా లభించే భావ ప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కు చట్టాల ఉల్లంఘనగా ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోనిరాజ్యాంగ ధర్మాసనం అభివర్నించింది. రాజకీయ పార్టీలకు చెందిన విరాళాల సేకరణలో పారదర్శకతను తీసుకురావడానికి, నల్ల ధనాన్ని నిర్మూలించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రహస్య బ్యాలెట్‌ తరహాలోనే రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే దాతల పేర్లను రహస్యంగా ఉంచుతామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తిరస్కరిస్తూ ఇది లోపభూయిష్టమని పేర్కొంది.ఈ పథకాన్ని తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదే శించింది. అంతేగాక 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకు విక్రయించిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా భారత ఎన్నికల కమిషన్‌(ఇసిఐ) సమర్పిం చాలని ఎన్నికల బాండ్లను విక్రయిచే అధికారాన్ని పొందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ)ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.మార్చి 13వ తేదీ లోగా ఇసిఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రచురిం చాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ప్రతి ఎన్నికల బాండు విక్రయ తేదీని, కొనుగోలు దారుడి పేరును,ఎన్నికల బాండు విలువను ఇసిఐకి సమర్పించాలని ఎస్‌బిఐని ధర్మాసనం ఆదేశించింది.2019 ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి తీర్పు వెలువడిన నేటి వరకు ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాల వివరాలను ఎస్‌బిఐ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. సిజెఐ డివై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూ ర్తుల ధర్మాసనంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌,జస్టిస్‌ జెబిపార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ఉన్నారు.ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల మధ్యలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ సంచ లన తీర్పును వెలువరించింది. 2019 ఏప్రిల్‌ 12న సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. తాము స్వీకరించిన విరాళాలు, స్వీకరించబోయే విరాళాలకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీలు సీల్డ్‌ కవర్‌లో ఇసిఐకి సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా,తాజాగా ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దుచేసిన సుప్రీంకోర్టు 15రోజుల చెల్లుబాటు గడువు మాత్రమే ఉండే ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలు ఇంకా తమ ఖాతాలలో జమచేయని పక్షంలో సంబంధిత బ్యాంకుకు వాటిని వాపసు చేయాలని, ఆ సొమ్ము మొత్తాన్ని సంబంధిత కొనుగోలు దారుడి ఖాతాలో బ్యాంకులు జమచేయాలని ధర్మాసనం ఆదేశించింది.ఎడిఆర్‌, సిపిఎం, మరి కొందరు వ్యక్తులు ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 2017-18 నుంచి 2022-23 వరకు రాజకీ య పార్టీల వార్షిక ఆడిట్‌ నివేదికలను సిజెఐ తన 152పేజీల ఏకగ్రీవ తీర్పులో ప్రస్తావి స్తూ పార్టీల వారీగా ఎన్నికల బాండ్ల ద్వారా అందుకున్న విరాళాల వివరాలను పేర్కొ న్నారు.బిజెపి రూ.6,566.11కోట్లు అందు కోగా, కాంగ్రెస్‌ పార్టీ రూ. 1123.3 కోట్లను స్వీకరించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ రూ.1092.98 కోట్లు అందుకుంది. రాజకీయ పార్టీలకు అపరిమిత విరాళాల చెల్లింపునకు అనుమతిస్తూ కంపెనీల చట్ట నిబంధనలను సవరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇది రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణను ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాల వివరాలను తెలుసుకునే హక్కు ఓటరుకు ఉందని, అటువంటి అవకాశాన్ని కూడా ఈ పథకం కల్పించలేదని ధర్మాసనం తెలిపింది. నల్ల ధనాన్ని నిర్మూలించడానికి ఎన్నికల బాండ్ల పథకం ఒక్కటే మార్గం కాదని, ఆందుకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. విరాళాలు అందచేయడం ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు తమ మద్దతు తెలియచేయడం, లేదా క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన విరాళాలు అందచేయడం వంటి ప్రధానంగా రెండు కారణాలతోనే విరాళాలు అందచేయడం జరుగుతుందని తన తీర్పులో ధర్మాసనం పేర్కొంది. కార్పొరేట్‌ కంపెనీలు అందచేసే భారీ విరాళాల వివరాలను గోప్యంగా ఉంచ డాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. క్విడ్‌ ప్రో కో లావాదేవీల కింద రాజకీయ పారీలకు అందే విరాళాలు ఆయా రాజకీయ పార్టీలకు మద్దతు గా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. కాగా..జస్టిస్‌ ఖన్నా విడిగా మరో 74పేజీల తీర్పును వెలువరిస్తూ సిజెఐ చంద్రచూడ్‌ రాసిన తీర్పును బలపరుస్తూ వేర్వేరు కారణా లను వివరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు చేయాలన్న తీర్పుతో ఆయన కూడా ఏకీభవించారు.
ఎన్నికల బాండ్లు అంటే ఏంటి.. పార్టీలకు విరాళాలు ఎలా వస్తాయి..ఎవరు జారీ చేస్తారు?
ఈ ఎలక్టోరల్‌ బాండ్లు అంటే ఏంటి అని ప్రజల్లో ప్రశ్నలు తలెత్తతున్నాయి. ఎలక్షన్‌ బాండ్‌ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్‌ పేపర్‌ మాత్రమే. మన దేశానికి చెందిన వ్యక్తులు గానీ..సంస్థలు గానీ దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు విరా ళాలు ఇవ్వడానికి ఈ ఎన్నికల బాండ్లను ఉపయోగిస్తారు.ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని 2017-2018 ఆర్థిక సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ.. బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో దీన్ని తొలిసారిగా ప్రవేశ పెట్టారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఈ ఎల క్టోరల్‌ బాండ్స్‌ పథకాన్ని తీసుకుచ్చారు. ఇక మొదటిసారి ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1వ తేదీ నుంచి10వ తేదీ వరకు జరిగాయి. ఈ ఎలక్టోరల్‌ బాండ్లపై బ్యాం కులు ఎలాంటి వడ్డీ చెల్లించవు. కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన సూచనల మేరకు ఎలక్టోరల్‌ బాండ్లను జనవరి,ఏప్రిల్‌, జూలై,అక్టోబర్‌ మొదటి 10 రోజుల్లో బ్యాంకులు జారీ చేయ గా.. పార్టీలకు విరాళాలు ఇచ్చే వారు కొను గోలు చేసే అవకాశం ఉంటుంది.ఈ ఎల క్టోరల్‌ బాండ్లు రూ.1000,రూ.10 వేలు, రూ.1 లక్ష,రూ.1 కోటి రూపంలో ఉంటాయి. ఈ ఎలక్టోరల్‌ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఎలక్టోరల్‌ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ ఎన్నికల బాం డ్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజు లలోపు ఖాతాదారులు..వాటిని తమకు నచ్చిన పార్టీకి అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల బాండ్లపై.. ఎవరు కొనుగోలు చేశార నేది మాత్రం ఉండదు. ఆ వివరాలన్నీ బ్యాంకు వద్ద సీక్రెట్‌గా ఉంటాయి.ఈ ఎన్నికల బాండ్ల పథకం కింద చేసే విరాళాలు జమ చేసే వారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది.విరాళాలు ఇచ్చే వారి వివరాల్ని బ్యాంకులు,రాజకీయ పార్టీలు రహస్యంగా ఉంచుతాయి.ఒక వ్యక్తి లేదా సంస్థ ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని బాండ్లు అయినా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకంలోని నిబంధనల ప్రకారం.. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 29ఎ కింద రిజిస్టర్‌ చేయబడిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్టోరల్‌ బాండ్లను స్వీకరిం చేందుకు అర్హత ఉంటుంది.గత 6 ఏళ్లలో ఈ ఎలక్టోరల్‌ బాండ్లు విక్రయించడం ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు కలిపి మొత్తం రూ.16437 కోట్లు సమకూరాయి. ఇందులో అత్యధికంగా బీజేపీకే రూ.10117కోట్లు రావ డం సంచలనంగా మారింది. అయితే అధికా రంలో ఉన్న పార్టీకి అత్యధికంగా విరాళాలు వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.ఈ క్రమంలోనే ఈ ఎలక్టోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని సీపీఎం,కాంగ్రెస్‌ సహా మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఇది సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని..అవినీతిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
‘నీకిది నాకిది’తరహాలో..
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని,వాటి జారీని తక్షణం నిలిపివేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు మోడీ ప్రభుత్వానికి, బిజెపికి చెంపపెట్టు. కార్పొరేట్లకు దోచిపెట్టి అందుకు ప్రతిఫలంగా వారి నుంచి భారీగా నిధులు సమకూర్చుకొని రాజకీయాలను శాసించాలనుకున్న బిజెపికి సుప్రీం తీర్పుతో కొంతైనా అడ్డుకట్ట పడుతుంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం,నిష్కళంక,పారదర్శక రాజకీ యాలు కోరుకునే ప్రతి ఒక్కరూ స్వాగతిం చాల్సిన తీర్పిది. పాలక పార్టీ, కార్పొరేట్ల నడుమ ‘నీకిది నాకిది’తరహాలో క్విడ్‌ప్రోకోకు ఎలక్టోరల్‌ బాండ్ల స్కీం దారి తీస్తుందన్నవారి ఆందోళనలను, వాదనలను సుప్రీం సమర్ధిం చింది. రాజకీయ పార్టీలకు నిధులు సమ కూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది.ఎటువంటి వివరాలూ తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడమంటే సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనంది. నల్లధనాన్ని అరికట్టేం దుకు, పారదర్శకత కోసం ఈ స్కీం తెచ్చా మన్న బిజెపి ప్రభుత్వ కుతర్కాన్ని తోసిపారే సింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా అపరి మిత విరాళాలకు అనుమతిస్తూ కంపెనీల చట్టంలో చేసిన సవరణ ఏకపక్షమనీ తప్పు బట్టింది.బాండ్ల ద్వారా సేకరించే విరాళాల వివరాలను బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీం నొక్కి వక్కాణించింది. ఇప్పటి వరకు జారీ చేసిన బాండ్ల వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మార్చి 6లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని, ఆ వివరాలను 13లోగా వెబ్‌సైట్‌లో ఇ.సి ప్రచురించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆర్‌టిఐ,ఐ.టి చట్టాలకు విరుద్ధంగా, కంపె నీల చట్టంలో ఏకపక్ష సవరణలతో ఎన్నికల బాండ్ల పథకాన్ని మోడీ సర్కారు ఎందుకు తీసుకొచ్చిందో ఈ కాలంలో బిజెపి జేబులోకి చేరిన అజ్ఞాత కార్పొరేట్ల విరాళాల వరదే చెబుతుంది.2018 జనవరి నుంచి స్కీంను అమల్లోకి తెచ్చారు. ఎన్నికల బాండ్‌ అంటే ఒక విధంగా ప్రాంసరీ నోటు వంటిది. నిర్దిష్ట సమయాల్లో వాటిని బ్యాంకులు జారీ చేస్తా యి. బాండ్లను వ్యక్తులు, కంపెనీలు కొనుగోలు చేసి తమకు నచ్చిన రాజకీయపార్టీలకు విరాళంగా అందిస్తాయి. వాటిని పార్టీలు నగదుగా మార్చుకొని ఎన్నికలకు, పార్టీ కార్యకలాపాలకు ఉపయోగపెట్టుకుంటాయి. అయితే ఎవరు విరాళాలిచ్చారో బహిర్గత పర్చనవసరం లేదు.2017-18 నుంచి 2022-23 వరకు దాదాపు 30తడవల్లో 28 వేలబాండ్లను ఎస్‌బిఐ జారీ చేసింది. వాటి విలువ రూ.16,500కోట్లకు పైమాటే. వాటిలో రూ.6,500 కోట్లు బిజెపి గల్లాపెట్టె లో పడ్డాయి.2018-19, 2019-20లలో 70-80శాతం విరాళాలు బిజెపి ఖాతాకు చేరాయంటే, కార్పొరేట్లకు ఆ పార్టీకి మధ్య పెనవేసుకున్న మైత్రి బంధం తీవ్రత అవగతమవుతుంది.ఎలక్టోరల్‌ బాండ్లు రాజకీ య అవినీతిని చట్టబద్ధం చేసేందుకేనని పర్య వసానాలబట్టి తెలుస్తోంది. ఎన్నికల నిధి సేకరణలో పెద్ద ఎత్తున గోప్యతతో కూడిన, పారదర్శకత లేని పద్ధతులకు బిజెపి ప్రభు త్వం తెరతీసిందని స్కీం వచ్చినప్పుడే సిపిఎం, పలు ప్రతిపక్ష పార్టీలు,ఎ.డి.ఆర్‌ వంటి సంస్థలు నిరసించాయి. సుప్రీం కోర్టులో సవాల్‌ చేశాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట బాండ్ల జారీ ప్రారంభానికి లోపే విచారణ పూర్తి చేయాలని విన్నవించిన మీదట కోర్టు గతేడాది అక్టోబర్‌లో విచారణ ముగించి తీర్పు రిజర్వ్‌ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది. కార్పొరేట్లు అందిం చిన రాజకీయ నిధులకు బదులుగా రాయి తీలు కట్టబెట్టడం మోడీ ప్రభుత్వం అను సరిస్తున్న విధానం. ఇది ఆశ్రిత పెట్టుబడిదారీ లక్షణం. తొమ్మిదిన్నరేళ్లలో కార్పొరేట్లు బ్యాంకుల్లో తీసుకున్న రూ.14 లక్షల కోట్ల రుణాలను మోడీ సర్కారు రద్దు చేసింది. కార్పొరేట్‌ పన్నులో రూ.లక్షల కోట్ల సబ్సిడీలిచ్చింది. సహజ వనరులను, ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా అప్పగించింది. స్వేచ్ఛాయుతమైన న్యాయబద్ధమైన ఎన్నికలకు హామీ కల్పించే విధంగా అభ్యర్ధులందరూ సమాన స్థాయిలో పోటీ పడాలనే సూత్రాన్ని ఈ విధంగా లభించిన ధనబలంతో బిజెపి వమ్ము చేస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎన్నికల సంస్క రణలు అవశ్యమన్న డిమాండ్‌ బలంగా ముందుకొస్తోంది. ఎన్నికల సంస్కరణలే ప్రజాస్వామ్యానికి రక్ష. -( కృష్ణంరాజు యాదవ్‌)

గరీబీ హఠావో..నినాదం వింటున్నాం..కానీ..

జనవరి 30వ తేదీ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మోదీ సర్కారు సాధించిన విజయాలను గుర్తుచేశారు. యువశక్తి, నారీశక్తి,రైతులు, పేదలు అనే నాలుగు స్తంభాలపై దేశాభివృద్ధి ఆధారపడి ఉందని విశ్వసిస్తున్నాం. సరిహద్దు ల్లో ఆధునిక మౌళిక సదుపాయాలు కల్పిస్తు న్నాం.ఉగ్ర వాదం,విస్తరణవాదానికి మన దళాలు గట్టిగా బదులిస్తున్నాయి. నక్సల్‌ ఘటనలు భారీగా తగ్గాయి.జమ్మూకాశ్మీర్లఓ సురక్షిత పరిస్థితులను నెలకొన్నాం.గ్రీన్‌ మొబిలిటీని ప్రొత్సహిస్తున్నాం. సౌరవిద్యు దుత్పత్తిలో మన దేశం ప్రపంచం లోనే ఐదోస్థానంలో నిలిచింది.దేశంలో లక్షకు పైగా స్టార్టప్‌లు ఏర్పాటు చేశాం.పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాం.అండమాన్‌,లక్షదీప్‌ వంటి ప్రాంతాలపై పర్యాటకులకు ఆసక్తి పెరిగింది. సవాళ్లు, ఆటుపోట్లను అధిగమించి భారత్‌ ముందుకెళ్తోందని, అంతరిక్షంలోనూ అద్భు తంగా దూసుకు పోతోందని ముర్ము తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య మందిర అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. అలాగే, ఆర్టికల్‌ 370 రద్దును కూడా చారిత్రక నిర్ణయంగా చెప్పారు.కొత్త పార్లమెంట్‌లో ఇదే తన తొలి ప్రసంగం అని చెప్పారు. సభా కార్యకలాపాలు సజావు సాగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను రాష్ట్రపతి ముర్ము కోరారు. 21వ శతాబ్ధంలో నవ భారతం సరికొత్త సంప్రదాయాలను నిర్మించాలనే సంకల్పానికి ఈ భవనం ప్రతీక గా ఉంది. ఈనూతన పార్లమెంట్‌ భవనంలో విధవిధానాలపై అర్థవంతమైన చర్చలు జరుగు తాయని నేను విశ్వసిస్తున్నానని ఆమె అన్నారు.భారతీయ సంస్కృతి,సభ్యత ఎంతో చైతన్యవంతమైనవని,చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశం భారత్‌ అని రాష్ట్రపతి కొనియాడారు. ఆసియా క్రీడల్లో తొలిసారి వంద పతకాలను భారతీయ క్రీడాకారులు సాధించారని పేర్కొన్నారు. గతంలో గరీబ్‌ హఠావో నినాదాన్ని మాత్రమే విన్నామని, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ముర్ము అన్నారు.‘శాంతినికేతన్‌ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది..భగవాన్‌ బిర్సాముండా జన్మదినాన్ని జన్‌ జాతీయ దివస్‌గా జరుపుకొం టున్నాం..తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది.. ఆదివాసీ యోధులను స్మరించు కోవడం గర్వకారణం.. గతేడాది మన దేశం ఎన్నో ఘనతలు సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది.. ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది.జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహిం చుకున్నాం…ఆసియా క్రీడల్లో తొలిసారి భారత్‌ 107,పారా క్రీడల్లో 111 పతకాలు సాధించింది’ అని తెలిపారు.కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ను ఎత్తివేయడం చారిత్రాత్మక నిర్ణయ మని ముర్ము ప్రశంసించారు.పేదల కోసం 10కోట్ల ఉజ్వల్‌ కనెక్షన్ల అంద జేశాం..తొలి సారిగా నమోభారత్‌ రైలును ఆవిష్కరించాం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేలా నారీశక్తి వందన్‌ అధినియమ్‌ బిల్లును ఆమోదింపజేసుకున్నాం..‘గరీబీ హఠా వో’ నినాదాన్ని వింటున్నాం..కానీ, జీవితంలో తొలిసారి పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోల డం చూస్తున్నాం.గత 0ఏళ్లలో 25 కోట్లమంది పేదరికం నుంచి బయట పడ్డారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్‌ ముందు కళ్తోంది.’అని మోదీ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి అభినందించారు. ‘శతాబ్దాలుగా కలలు కంటున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం సాకారమైంది..ఎన్నో ఆటంకాలను అధిగమిం చి ఆలయాన్ని ప్రారంభించాం..దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది..కొత్త క్రిమినల్‌ చట్టాలను తీసుకొచ్చాం.‘ఏక్‌ భారత్‌- శ్రేష్ఠ్‌ భారత్‌’ నినాదంతో ముందుకెళ్తున్నాం..రక్షణ, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరి గాయి.. ఉత్తర్‌ ప్రదేశ్‌, తమిళనాడులో రక్షణ కారిడార్‌లు ఏర్పాటుచేసుకున్నాం..ప్రపంచం లోనే అత్యుత్తమ బ్యాంకింగ్‌ వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది.’అని రాష్ట్రపతిపేర్కొన్నారు.
బడ్జెట్‌కు ముందు.. నిర్మలమ్మ నోరు తీపి చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
2024-25 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాత్కాలిక బడ్జెన్‌ను మరికాసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 30 ఉదయం 11 గంటలకు లోక్‌ సభలో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభిం చనున్నారు. ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆర్థిక మంత్రి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలమ్మకు రాష్ట్రపతి నోరు తీపి చేశారు. స్వీటు తినిపించి గుడ్‌లక్‌ చెప్పారు. మరోవైపు మధ్యంత బడ్జెట్‌కే రాష్ట్రపతి,
కేబినెట్‌ ఆమోదం లభించింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ ఎలాంటి కొత్తదనం లేకుండా పేలవంగా ఉన్నది. పూర్తిస్థాయి బడ్జెట్‌ కాదు, కనుక ప్రజలు దీనిపై పెద్దగా ఆశలేమీ పెట్టుకోలేదు. కాకపోతే సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్నది కనుక ఏవైనా జనాకర్షక అంశాలు ఉంటాయేమో అనుకున్నారు. కానీ, ఎలాంటి ఉరుములు, మెరుపులు లేకుండానే చప్పగా సాగింది ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం. మౌలికరంగం మెరుగుదల, ద్రవ్యలోటు తగ్గింపుపైనే ఆమె ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. పెట్టుబడి వ్యయం లక్ష్యాన్ని 11శాతం పెంచారు. ద్రవ్యలోటును 5.1శాతానికి తగ్గిస్తామన్నారు. ఆదాయ పన్ను పరిమితి పెంపు గురించి ఒకప్పుడు బీజేపీ నేతలు ఊదరగొట్టేవారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పదేండ్లు పూర్తి చేసుకుం టున్న సందర్భంగా వెలువడిన ఈ చివరాఖరి బడ్జెట్‌లోనూ పన్ను పరిమితుల్లో గానీ, రాయితీల్లో గానీ ఎలాంటి వెసులుబాట్లు ప్రతిపాదించలేదు. ఇప్పటికే చేయాల్సినదంతా చేశాం.. ఇకపై చేయాల్సింది ఏమీ లేదనే ధోరణి ఆర్థికమంత్రి మాటల్లో వ్యక్తమైంది. ఎన్నికల వేళ తాయిలాల జోలికి పోకుండా, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను పెంచుకోవడం ప్రభు త్వంలో పెరిగిన ఆత్మవిశ్వాసానికి ప్రతీక అంటున్నారు బీజేపీ అనుకూల ఆర్థిక, రాజకీ య పరిశీలకులు. ఇక రూ.5లక్షల కోట్ల జీడీపీ లక్ష్యం ఓవైపు వాయిదా పడు తుండగానే, 2030 నాటికి రూ.7లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ సాధిస్తామంటూ ఆర్థికమంత్రి అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేశారు. ప్రజల తక్షణ సమస్యల కన్నా స్థూల ఆర్థికవృద్ధి మీదనే దృష్టి పెట్టడం బీజేపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.గత పదేండ్లలో భారత ఆర్థిక వ్యవస్థ సకారాత్మక పరిణామానికి గురైందని, ఆశలు పెరిగాయని ఆర్థికమంత్రి గొప్పగా చెప్పుకొన్నారు. జీడీపీ పెరిగినా తలసరి ఆదాయం పెరగని వింతైన, విలోమ పరిస్థి తిలో భారత్‌ ముందుకు సాగుతున్నది. ధనిక-పేద అంతరాలు అంతకంతకూ అధికమవు తున్నాయి. ఆదాయాల తరుగుదల, ధరల పెరుగుదల మధ్యన నలిగిపోతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఉపశమ నమూ బడ్జెట్‌లో లేకపోవడం ప్రభుత్వ ప్రాధాన్యతలకు మచ్చుతునక. టూరిజం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తామని చెప్తూ లక్షద్వీప్‌లో మౌలిక వసతుల అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. అంతర్జాతీయ వివాదాలపై తెంపరితనపు స్పందనగా మారిన ఈ అంశం సున్నితమైన జీవావరణంతో ముడిపడి ఉన్నదనే విషయం విదితమే. పర్యాటక అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం జరగకుండా చూడాలన్న పర్యావర ణవేత్తల హెచ్చరికలపై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమున్నది. రైతులకు పెద్దపీట వేసినట్టు ఆర్థికమంత్రి చెప్పారు. కానీ, పలు కీలక అంశాల్లో రైతులకు నిరాశ కలిగించారు. పీఎం కిసాన్‌ యోజన కింద ఆర్థిక సాయాన్ని రూ.6 వేల నుంచి రూ.9 వేలకు, అలాగే పంటరుణాల లక్ష్యాన్ని పెంచు తారని ఆశించినప్పటికీ బడ్జెట్‌లో వీటికి చోటు దక్కలేదు. గత ఐదేండ్లలో రూ.లక్ష కోట్లకు పైగా వ్యవసాయ బడ్జెట్‌ నిధులను ప్రభుత్వం ఖర్చు చేయకుండా వెనక్కి తీసుకున్నదన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ రంగంపై ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రశ్నార్థకమవు తున్నది. రుణమాఫీకి అవకాశం ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్లలేదు.పెట్రోల్‌,డీజిల్‌ ధరలు తగ్గించాల్సిన అవసరం ఇప్పుడు ఇదివరకటి కంటే ఎక్కువగా ఉన్నది. అందుకు అవసర మైన ఆర్థిక వెసులుబాటు కూడా ఉన్నప్పటికీ దానిని పట్టించుకోలేదు.ఇలా ప్రజల మీద భారం తగ్గించే అనేక అంశాలపై ఆర్థికమంత్రి శీతకన్ను వేయడంతో బడ్జెట్‌ అన్నివర్గాలకు అసంతృప్తినే మిగిల్చింది!
ఊరించి.. ఉసూరనిపించి..!
నిరుపేదలు, మహిళలు, యువత, రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మల.. వారితోపాటు ఇతరులకూ నిర్దిష్టంగా ఎటువంటి వరాలూ ప్రకటించలేదు. అలాగే వాతలూ పెట్టలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనన్న మోదీ సర్కారు ధీమా బడ్జెట్‌ ప్రసంగంలో ప్రతిఫలించింది! రాబోయే ఐదేళ్లలో మునుపెన్నడూ లేని అభివృద్ధి జరగనుందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ కల సాకారానికి ఇది స్వర్ణ యుగమని నిర్మల చెప్పారు. రాబోయే ఐదేళ్ల లో మధ్య తరగతి గృహ నిర్మాణానికి సంబం ధించి కొత్త పథకం ప్రకటిస్తామని నిర్మల ప్రకటించారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద మూడు కోట్ల మార్కుకు చేరు కుంటున్నామని, రాబోయే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని వెల్లడిరచారు. రైల్వేలో మూడు (ఎనర్జీ, మినరల్‌, సిమెంట్‌) భారీ కారిడార్లను చేపట్టడంతోపాటు ఏకంగా 40 వేల సాధారణ బోగీలను వందే భారత్‌ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. పోర్టు కనెక్టివిటీ కారిడార్లు, హై ట్రాఫిక్‌ డెన్సిటీ కారిడార్లనూ తీసుకొస్తామన్నారు. విమానాశ్ర యాలను విస్తరించడంతోపాటు కొత్తగా వెయ్యికిపైగా విమానాలను కొంటామని చెప్పారు. రూఫ్‌ టాప్‌ సోలార్‌ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు అందజేస్తామని ప్రకటించారు. టెక్నాలజీ అంటే చెవి కోసుకునే యువత స్టార్ట్‌పలను ప్రారంభించేందుకు చేయూత ఇస్తామని, తక్కువ వడ్డీకి లేదా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు లక్ష కోట్ల రూపాయలతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఐదు ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే, మహిళల ఆరోగ్యంపై నిర్మల ప్రత్యేకంగా దృష్టి సారించారు. 9-14 ఏళ్ల బాలికలకు సర్వైకల్‌ క్యాన్సర్‌ టీకా వేసేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. మాతా శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెబుతూనే..ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అంగన్వాడీలు, ఆశాలకూ విస్తరించారు. మహిళలను లక్షాధికారుల (లాక్‌పతి దీదీ)ను చేసే పథకం కింద ఇప్పటికే కోటి మందిని లక్షాధికారులను చేశామని, రాబోయే ఐదేళ్లలో మరో తొమ్మిది కోట్ల మందిని చేయడమే తమ లక్ష్యమని వెల్ల డిరచారు. అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తామని, మరిన్ని మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కేటాయింపులను 43 శాతం పెంచి 86 వేల కోట్లు చేశారు.ఎప్ప ట్లాగే రక్షణ బడ్జెట్‌కు పెద్దపీట వేశారు. గత బడ్జెట్‌తో పోలిస్తే 4శాతం పెంచి రూ.6.2 లక్షల కోట్లు కేటాయించారు. ఇక, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు సహా దిగుమతి సుంకాల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే, స్టార్ట్‌ప్సకు ఇచ్చే కొన్ని రాయితీలు, సావరిన్‌ వెల్త్‌ బాండ్స్‌, పింఛను నిధుల్లో పెట్టే పెట్టుబ డులకు ఇచ్చే రాయితీలు తదితరాలు వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కొనసాగుతాయని తెలిపారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన 10 వేలుబీ 25 వేలలోపు వివాదాస్పద ఐటీ పన్ను డిమాండ్లను రద్దు చేశారు.తద్వారా,కోటి మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. విద్యుత్తు వాహన వ్యవస్థను బలో పతం చేస్తామని చెప్పిన నిర్మల..అందు కు సంబంధించి నిర్దిష్ట కార్యాచరణను మాత్రం బడ్జెట్లో ప్రకటించలేదు. సరికదా..ఫేమ్‌ పథ కం బడ్జెట్‌నూ 44శాతం కోత కోశారు.
మూలధన వ్యయానికి పెద్దపీట
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ద్రవ్యలోటును అదుపులో ఉంచడమే తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని పునరుద్ఘా టించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. బడ్జెట్లో ఆ దిశగానే అడుగులు వేశారు. ఇందులో భాగంగా మూలధన వ్యయం పెంపునకు పెద్దపీట వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాన్ని భారీగా 11.1శాతం పెంచి రూ.11,11,111కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. తద్వారా, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన పుంజుకుంటాయని సంకేతాలు ఇచ్చారు. అయితే, గత ఏడాది రూ.10 లక్షల కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తామని చెప్పినా.. రూ.9.5 లక్షల కోట్లకే పరిమితం కావడం గమనార్హం. రాష్ట్రాలకు కూడా మూలధన వ్యయం పెంచేందుకు ఈ ఏడాది రూ.1.3 లక్షల కోట్ల మేరకు వడ్డీ లేని రుణం కల్పిస్తామని, వికసిత్‌ భారత్‌ యాత్రలో భాగంగా సంస్కరణల అమలుకు రాబోయే 50 ఏళ్లలో మరో రూ.75 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను రాష్ట్రాలకు అందిస్తామని వెల్లడిరచారు. ఆర్థిక కార్యకలాపాల్లో బలమైన వృద్ధి కారణంగా రెవెన్యూ వసూళ్లు పెరిగా యని, గత ఏడాది డిసెంబరుకు జీఎస్టీ వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లు ఉన్నాయని వివరించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రూ.47.77 లక్షల కోట్ల మేరకు ఆదాయం లభిస్తుందని, ఇందులో కేవలం పన్ను రాబడులే రూ.26.99 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.30 లక్షల కోట్లు ఉంటాయని తెలిపారు. ఫలితంగా, సంక్షేమ పథకాలకు వ్యయాన్ని కూడా పెంచామని వివరించారు. గత పదేళ్లలో తీసుకున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోగతి చెందిందని గణాంక వివరాలతో సహా వివరించారు. 2023-24కు సవరించిన ఆర్థిక లోటు జీడీపీలో 5.8శాతానికి చేరుకుందని చెప్పిన నిర్మల..ఇది ఆర్థిక పటిష్ఠత దిశలో మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు నిదర్శనమని తెలిపారు. వచ్చే ఏడాది కూడా ఆర్థిక లోటును తగ్గించి జీడీపీలో 5.1శాతానికే పరిమితం చేస్తామని చెప్పారు. మార్కెట్‌ రుణాలు గత ఏడాది కంటే తక్కువగా ఉంటాయని, వీటిని మరింత తగ్గిస్తామని అంటూనే.. నికర మార్కెట్‌ రుణాలు రూ.11.75 లక్షల కోట్లు ఉండ వచ్చునని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులకు సంబంధించి ఇది స్వర్ణయుగమని, 2005-14తో పోలిస్తే 2014-23లో రెట్టింపు ఎఫ్‌డీఐలు లభించాయని, ఈ ఐదేళ్ల లోనే 596 బిలియన్‌ డాలర్ల (రూ.4,172 వేల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశానికి వచ్చాయని వివరించారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ 7.3శాతం ఉం టుందని అంచనా వేశారు. 2027 నాటికి భారత్‌ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్‌ సహా పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేశాయని చెప్పారు. పన్నుల వాటా కింద చెల్లించే నిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు ఇచ్చే సొమ్ము, పలు గ్రాంట్లు/లోన్లు తదితర అవసరాల కోసం రాష్ట్రాలకు కేంద్రం రూ.22,22,264 కోట్లు చెల్లించనుంది. ఇందులో రాష్ట్రాలకు పన్నుల వాటా కింద రూ.12,19,783 కోట్లు కోట్లు, ఆర్థిక కమిషన్‌ నిధుల రూపంలో రూ.1,32,378 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రూ.6,81,480 కోట్లు ఇవ్వనుంది.వడ్డీ చెల్లింపులకు రూ.11, 90,440 కోట్లు,వివిధ అవసరాల కోసం తెచ్చిన రుణాలకు చెల్లించే వడ్డీల చెల్లింపుల కోసం సుమారు రూ.11,90,440 కోట్లు అవసరం అవుతుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. 2023-24లో వడ్డీల చెల్లింపులకు 10,55,427 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2022-23లోరూ.9,28,517 కోట్ల నిధులను వడ్డీలకు చెల్లించారు.జీడీపీ రూ.3,27,71,808 కోట్లు వచ్చే ఏడాదికి గాను జీడీపీ రూ.3,27,71,808 కోట్లు ఉం టుందని అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది10్న అధికం.2023-24ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రూ.2,96,57,745 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆర్థిక మంత్రి మధ్యంతర బడ్జెట్‌లో ప్రధా నంగా నాలుగు వర్గాలపై దృష్టి సారించారు. తన దృష్టిలో ఈ నాలుగే అతి పెద్ద కులాలని ప్రధాని మోడీ గతంలో చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకొని పేదలు, మహిళలు, యువత, రైతుల కోసం కొన్ని పథకాలు, కార్యక్రమాలు ప్రకటించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని పలు సర్వేలు చెబుతున్నప్పటికీ దానిపై ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో ఒక్క మాట కూడా చెప్పలేదు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధనే లక్ష్యంగా ఉపాధి కల్పన కోసం ఏదైనా పథకమో లేక కార్యక్రమమో ప్రకటిస్తారని ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద రాబోయే ఐదు సంవత్సరాల్లో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని నిర్మల తెలిపారు. విద్యుత్‌ బిల్లుల నుండి సామా న్యులకు ఊరట కల్పించే ఉద్దేశంతో కొత్తగా సౌరశక్తి పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా కోటి ఆవాసాలకు ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ లభిస్తుందని చెప్పారు. ఇళ్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునే వారికి ఏడాదికి రూ.15,000 నుండి రూ.18,000 ఆదా అవుతుందని తెలిపారు. పట్టణ పేదల కోసం కూడా ఆర్థిక మంత్రి ఓ పథకాన్ని ప్రకటించారు.‘అద్దె ఇళ్లు, మురికివాడలు, అనధికారిక కాలనీలలో నివసించే మధ్యతరగతి ప్రజలు ఇళ్లను కొనుగోలు చేసేందుకు లేదా నిర్మించుకునేం దుకు సాయం అందిస్తాం’ అని చెప్పారు. ఈ పథకం లక్ష్యాన్ని మాత్రం వివరించలేదు. 9-14 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలు సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా వ్యాక్సిన్ల తయారీని ప్రోత్సహిస్తామని అన్నారు. దేశంలో మరిన్ని వైద్య కళాశాలల ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు కూడా వర్తింపజేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి స్వనిధి ద్వారా ఇప్పటి వరకూ 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించామని, రాబోయే కాలంలో మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. పంటలకు నానో డిఎపి ఎరువులు అందజేస్తామని అన్నారు. చమురు గింజల రంగంలో ఆత్మ నిర్భరత సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2,3 తరగతులకు చెందిన నగరాలకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఛార్జింగ్‌ స్టేషన్లు, ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్‌ బస్సుల్ని ప్రోత్సహిస్తామని వివరించారు.
స్వల్పంగా పెరిగిన కేటాయింపులు
మధ్యంతర బడ్జెట్‌లో పలు కీలక పథకాలకు కేటాయింపులు పెద్దగా పెంచలేదు. గ్రామీణ ఉపాధి హమీ పథకానికి కేటాయింపులను కేవలం రూ.26,000 కోట్లు మాత్రమే పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.86,000 కోట్లు (సవరించిన అంచనాలు) కేటాయించారు. ఇక ఆయుష్మాన్‌ భారత్‌ (పిఎంజెఎవై) పథకానికి కేటాయింపులు రూ.7,200 కోట్ల నుండి రూ.7,500 కోట్లకు అంటే కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెరిగాయి.కీలకమైన ఆరోగ్యం, విద్య రంగాలకు సైతం మధ్యంతర బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగాలకు జరిపిన కేటాయింపుల్ని సైతం పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో విద్యపై రూ.1,16,417 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.1,08,878 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అదే విధంగా ఆరోగ్య రంగంపై రూ.88,956 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా రూ.79,221 కోట్లు వ్యయం చేశారు.
కేటాయింపుల్లోనూ కోతలే
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం ఉద్దే శించిన కీలక పథకాలకు కూడా మధ్యంతర బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత విధించారు. ఉదా హరణకు షెడ్యూల్డ్‌ కులాల వారి అభివృద్ధి కోసం ఒకే గొడుగు కింద సాయం చేసేందుకు ఉద్దేశించిన పథకానికి (అంబ్రెల్లా స్కీమ్‌) బడ్జెట్‌ అంచనాలు రూ.9,409 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ.6,780 కోట్లు. షెడ్యూల్డ్‌ తెగలకు బడ్జెట్‌ అంచనాలు రూ.4, 295 కోట్లు కాగా సవరించిన అంచనా లు రూ.3,286 కోట్లు. మైనారిటీలకు బడ్జెట్‌ అంచనాలు రూ.610 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ.555 కోట్లు. ఇతర బలహీన వర్గాలకు బడ్జెట్‌ అంచనాలు రూ.2,194 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ.1,918 కోట్లు.
పన్నులే ఆదాయం
ప్రభుత్వానికి ఇప్పుడు ఆదాయ పన్ను ద్వారానే అధిక ఆదాయం లభిస్తోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరు అప్పులే అయినప్పటికీ అతి పెద్ద రెండో ఆర్థిక వనరు ఆదాయ పన్ను నుండి లభించే రాబడి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక వనరుల్లో 19% రాబడి ఆదాయ పన్ను ద్వారా లభించేదేనని బడ్జెట్‌ పత్రాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆర్థిక వనరుల్లో 17% కార్పొరేట్‌ పన్నులు, 18% జీఎస్టీ, 28% అప్పుల ద్వారా సమకూరుతోంది.
ద్రవ్యలోటును మరింత తగ్గిస్తాం
రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్ప త్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం మార్కెట్‌ విలువ (నామినల్‌ జిడిపి) 10.5% పెరగ వచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. తాజా బడ్జెట్‌ పత్రాల ప్రకారం ఈ విలువ రూ.3, 22,71,808 కోట్లు ఉండవచ్చునని అంచనా. ద్రవ్య లోటును 5.8%కి తగ్గించామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దీనిని 5.1%కి, 2025-26 నాటికి 4.5%కి తగ్గిస్తామని తెలిపారు. మూలధన వ్యయాన్ని రూ.10 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ సవరించిన అంచనాలను బట్టి అది సాధ్య పడలేదని తేలింది. మూలధన వ్యయం రూ.9.5 లక్షల కోట్లకే పరిమితమైంది.
ప్రతిపక్షాలపై విసుర్లు
గంట పాటు సాగిన నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగంలో%ౌౌ% అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలపైనా స్పందించారు. మోడీ ప్రభుత్వం లౌకికవాదాన్ని బలపరిచే చర్యలు చేపడుతోందని చెప్పుకున్నారు. ప్రతిపక్ష నేతలపైనే జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలను గురించి మాట్లాడుతూ ‘గతంలో సామాజిక న్యాయం ఓ రాజకీయ నినాదంగా ఉండేది. మా ప్రభుత్వానికి సంబంధించి అది సమర్ధ వంతమైన, అవసరమైన పరిపాలనా మోడల్‌. ప్రజలందరికీ సామాజిక న్యాయం అందేలా చూడాలి. అవినీతిని తగ్గించాలి. బంధుప్రీతిని రూపుమాపాలి’ అని అన్నారు.
రైలు బోగీలకు వందే భారత్‌ హంగులు
బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. నలభై వేల సాధారణ బోగీల్లోనే వందే భారత్‌ రైళ్లలో ఉండే ప్రమాణాలు నెలకొల్పుతామని చెప్పారు. పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచు కొని ప్రయాణికుల కోసం మెట్రో, నమో భారత్‌ రైళ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. దేశంలో మూడు కొత్త రైల్వే ఆర్థిక కారిడార్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైళ్ల రాకపోకలు ఎక్కువగా జరిగే మార్గాల్లో, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్లలో మౌలిక సదు పాయాలను మెరుగుపరుస్తామని అన్నారు. ప్రధాని గతిశక్తి కార్యక్రమం కింద ఇంధనం- ఖనిజాలు -సిమెంట్‌ కారిడార్లు, ఓడరేవుల అనుసంధానం కారిడార్లు, రద్దీ అధికంగా ఉండే కారిడార్లు ఇలా మూడు ఆర్థిక కారిడార్లను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో వివరించారు. ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకలను మెరుగుపరు స్తామని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె చెప్పారు. కారిడార్ల ఏర్పాటుతో రైళ్ల ప్రయాణ వేగం కూడా పెరుగుతుందని ఆర్థిక మంత్రి అన్నారు.
విషాద బడ్జెట్‌ 2024.. మరోసారి వంచనకు గురైన రాష్ట్రం..` సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరి గిందని.. మన రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలు బడ్జెట్లో లేవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకట నను తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో కొనసాగించే విషయం గానీ, పోలవరం నిర్వాసితుల విషయం గాని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ, అమరావతి రాజధానికి నిధులు, విభజన హామీల ప్రస్తావన వంటి ఏ అంశాలు ఈ బడ్జెట్లో లేకపోవడంతో మరొకసారి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వంచించ టానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని స్పష్టమవుతుందన్నారు. మన రాష్ట్రం నుండి జిఎస్టీ వసూళ్ళు పెరిగినా రాష్ట్రం వాటా మాత్రం పెరగలేదన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలంతా ముందుకు రావా లని..వైసిపి, టిడిపి, జనసేన సహా అన్ని పార్టీలు ఈ కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. కేంద్ర విద్రోహానికి వ్యతిరే కంగా ఫ్రిబవరి 7,8 తేదీలలో ఢల్లీిలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ గత 10ఏళ్ల విషాద భారతం కొనసాగింపుగానే ఉందని.. ఈ బడ్జెట్‌లో 99శాతం ప్రజలకు ఎలాంటి ఉపశమనం లేదన్నారు. బడా కార్పొరేట్లకు వికాసం, సామాన్యులకు విషాదం మిగిల్చి.. ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని అంబానీ, అదాని లాంటి బడాకార్పొరేట్‌లకు కట్ట బెట్టడంలో కేంద్ర ప్రభుత్వం జయప్రదం అయిందన్నారు. నిరుద్యోగులకి తీవ్రంగా అన్యాయం జరిగిందని.. ధరల పెంపుదలతో ప్రజలపై భారాలు పెరిగాయని తెలిపారు. జీఎస్టీ పేరుతో రెట్టింపు పరోక్ష పన్ను వసూలు చేయడమే దీనికి తార్కాణమన్నారు. ప్రత్యక్ష పన్ను రాయితీలన్నీ కార్పొరేట్‌ కంపెనీలకి ఇచ్చి పెంపుదల భారం అంతా మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతిపై, ఉద్యోగవర్గాలపై వేయటం ఈ కాలంలో వారు సాధించిన ’’ఘనత’’ అని పేర్కొన్నారు.విదేశీ పెట్టుబడి దారులకు పెద్దపీట వేసి చిన్న పరిశ్రమలను చిన్న వ్యాపారస్తులను దెబ్బతీశారని. సాధారణ ప్యాసింజర్‌ రైళ్ళను తగ్గించి వందేభారత్‌ రైళ్ల పేరుతో ప్రయా ణాల్ని భారంగా మార్చారని ధ్వజ మెత్తారు. ఈ అసంతృప్తిని పక్కదారి పట్టించ డానికి, అణచటానికి మతాన్ని ఉప యోగించుకొని రామనామస్మరణతో ప్రజల్ని మాయ చేయా లని చూస్తున్నారని మండి పడ్డారు. ప్రజల్ని మోసం చేయడానికి వేసుకున్న ముసుగు మాత్రమే ఈ రామనామ స్మరణ అని అన్నారు. దేశాన్ని మతరాజ్యంగా మార్చడం వారి ధ్యేయమని నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో, నేటి బడ్జెట్‌ ఉప న్యాసంలో స్పష్టంగా వెల్ల డైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఆర్థిక భారాలు ప్రజలపై వేస్తూ కార్పొరేట్లకు దేశ సంపదను కట్ట బెడుతూ మరోవైపు మతోన్మాద భావోద్రేకాల ను రెచ్చగొట్టి దేశాన్ని బలహీనపరిచే బిజెపి వైఖరిని మేధావులు, లౌకికవాదులు,అన్ని పార్టీలు ఖండిరచాలని అన్నారు. ఈ ప్రజావ్య తిరేక బడ్జెట్‌ని వ్యతిరే కించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.-(జీవన ప్రతాప్‌)

గిరిజన భూముల్లో రైల్వేజోన్‌ చిచ్చు

మహావిశాఖనగర మున్సిపల్‌ కార్పోరేషన్‌ సంస్థ(జీవీఎంసీ)పరిధి శివారు కొత్త సెంట్రల్‌ జైల్‌ పక్కన శ్రీకృష్ణాపురం అనే ఓగిరిజన కుగ్రామం ఉంది. కొన్ని దశాబ్దాల నుంచి మన్నెదొరకు చెందిన 200 కుటుంబాలు ఇక్కడ నివాసముంటున్నాయి.వారికి 1977లో విశాఖ జిల్లా కలెక్టర్‌ 70మంది గిరిజన కుటుంబాలకు సర్వేనంబరు 26లో 77 ఎకరాలు భూమిని పంపిణీ చేసి వారికి అప్పటి ప్రభుత్వం డి`పట్టాలు మంజూరు చేసింది.నాటి నుంచి నేటివరకు సుమారు ఐదు దశాబ్దాలు(47 సంవత్సరాలు) నుంచి మామిడి,దుంప,సరుగుడు,జీడిమామిడి,ఉద్యానవన తోటలు వేసుకొని పంటలు పండిరచుకుంటున్నారు. దీంట్లో లభించిన ఫలసాయంతో వారంతా కుటుంబాలను పోషించుకుంటూ జీవనోపాధి పొందు తున్నారు. ఈనేపథ్యంలో విశాఖనగర పురపాలక సంస్థ 2007లో కార్పొరేషన్‌ సంస్థగా విస్తరించారు.వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హాయంలో హనుమంతువాక నుంచి అడవివరం వరకు బీఆర్‌టీఎస్‌ ఆరులైన్ల రహదారి నిర్మించారు.దీంట్లో శ్రీకృష్ణాపురం గిరిజనలు సాగుచేసుకుంటున్న డి పట్టా భూముల్లో ఏడుగురు గిరిజన రైతులకు చెందిన ఏడు ఎకరాలు రోడ్డులో కలసిపోయి నిర్వాసితులయ్యారు.దీనిపై భూమిని కోల్పోయిన రైతులకు అప్పట్లో జీవీఎంసీ కమిషనర్‌ శ్రీకాంత్‌ ఆరిలోవ ప్రాంతంలో మూడు సెంట్లు చొప్పున ఏడుగురు రైతులకు నష్టపరిహారంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు కూడా మంజూరు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం రావడంతో గిరిజనులు సాగు చేసుకుంటున్న రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రైల్వేజోన్‌ బూసితో ప్రశాంతంగా సాగు చేసుకుంటున్న 56ఎకరాల భూమిపై ప్రభుత్వం కుట్రపన్నింది.ఈ భూమిని రైల్వే జోన్‌కి అప్పగించామని కొన్ని సార్లు,ఇది జీవీఎంసీ పరిధి ముడసర్లలోవ రిజర్వాయర్‌ పరివాహాక ప్రాంతంలో ఉంది.తక్షణమే ఈ భూములను ఖాళీ చేయాలని చినగదలి విశాఖ రూరల్‌ రెవెన్యూ అధికార్లు రైతులను బెదిరిస్తూ మానసికమైన ఆవేదనలకు గురిచేస్తు న్నారు.నగరంలో చాలా చోట్ల వందలాది ఎకరాల భూములు ఖాళీగా ఉండగా మరి కొన్ని బడాబాబుల చేతుల్లో ఆక్రమణలకు గురయినప్పటికీ వాటిపై ప్రభుత్వ అధికారుల జోలికి వెళ్లలేదు.అమాయకులైన గిరిజనులు దశాబ్దాల క్రితం నుంచి సాగు చేసి జీవనోపాధి పొందుతున్న భూములను రైల్వే జోన్‌ కోసం కేటాయించడం అన్యాయమంటూ ఇక్కడ గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గిరిజన భూములతో ప్రభుత్వం ఆటలు..
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కపట నాటకాలతో పబ్బం గడుపుకుంటోంది. లేని భూ వివాదాన్ని పదేపదే తెరపైకి తెస్తూ ఎడతెగని జాప్యం చేస్తోంది. లోక్‌సభలో గురువారం 2024-25 మధ్యంతర బడ్జెట్‌ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్‌ మాట్లాడుతూ ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు రాష్ట్ర ప్రభుత్వమే స్థలం చూపకుండా మోకాలడ్డు తోంది. వివాదం లేని భూమి ఇస్తే జోన్‌ పనులు ప్రారంభిస్తాం’ అంటూ చెప్పడం చర్చనీయాంశంగామారింది. రైల్వే అధికారులు కూడా మంత్రి ప్రకటన పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఒకటి, రెండు స్థలాలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఒకదానికి డిపిఆర్‌లో కూడా ఆమోదం లభించింది. దీంతో పాటు మడసర్లోవలో కూడా మరో స్థలం ఉంది. వీటిని మంత్రి విస్మరించారు. మరోవైపు పనులు కూడా ప్రారంభిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. నామమాత్రపు సిబ్బందినీ కేటాయించలేదు. సాధారణంగా ఏ కార్యాల యాన్ని ఏర్పాటు చేయాలన్నా తాత్కాలిక ప్రాతిపదికన కొన్ని ఏర్పాట్లు , కొంత పనులు చేసుకునే విషయం తెలిసిందే! ఈ దిశలో ఒక్క అడుగుకూడా వేయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా అసత్యాలు చెబుతున్నా రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపి కూడా పెదవి విప్పకపోవడం గమనార్హం. రైల్వే వైర్‌లెస్‌ కాలనీలో ప్రత్యామ్నాయ స్థలం 30 ఎకరా లకుపైనే ఉందని, దీనికి డిపిఆర్‌లో కూడా ఆమోదం లభించిందని రైల్వే అధికారులు చెబుతున్నారు . అదే సమయంలో విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు రైల్వే జోన్‌ పనుల ప్రారంభానికి చిహ్నంగా శిలాఫలకం సిద్ధం చేసి, ఆ క్రెడిట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్న బిజెపి నేతల అభ్యంతరాల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో బిజెపి నేతలు కూడబలుక్కుని జోన్‌ పనులు నిలిపివేశారు. ముడసర్లోవ రైల్వే స్థలంపై వివాదం ఎంత ? విశాఖలో బిఆర్‌టిఎస్‌ కోసం రైల్వే నుంచి గతంలో 26 ఎకరాలను జివిఎంసి తీసుకుంది. అందుకు బదులుగా రైల్వేకు ముడసర్లోవ వద్ద సర్వే నెంబరు 57 నుంచి 59 పి, 61పి, 62 పి, 63, 64, 65లో 52 ఎకరాలు కేటాయించింది. 2018లో ఆ స్థలం వద్ద కంచె వేసేందుకు రైల్వే అధికారులు వెళ్లగా ఆ భూముల్లో ఉన్న రైతులు అభ్యం తరపెట్టారు. ఆ సమయంలో సర్వే కూడా రైల్వే చేయగా 27ఎకరాలు క్లియర్‌గా ఉందని తేలింది. మిగిలిన స్థలం ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. దీనికోసం రైల్వే అధికారులు, జివిఎంసి కలిసి జాయింట్‌ సర్వే చేసేందుకు 2022 నవంబర్‌ 15న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ నుంచి రైల్వే డిఆర్‌ఎం కార్యాల యానికి లేఖ రాశారు. రైల్వేకు అవసరమైన భూమిని తీసుకునేందుకు సర్వేలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దఫదఫాలుగా పిలిచినా రైల్వే అధికారులు హాజరు కాలేదు. మరలా జివిఎంసి కమిషనర్‌ నుంచి 2023 డిసెంబరు 23న కూడా రిమైండర్‌ పంపారు. కానీ, రైల్వే స్పందిం చలేదు. నిజానికి వైర్‌లెస్‌ కాలనీలో ఐదు ఎకరాల్లో జోన్‌ కార్యాలయ భవనాల నిర్మాణానికి సరిపోతుంది. అయినా, ఇటువైపు రైల్వే శాఖ చూడడం లేదు. జాయింట్‌ సర్వేకు రాకుండా కాలయాపన చేస్తోంది. ఇప్పుడు భూ వివాదం అంటూ నెపం వేయడానికి కేంద్ర మంత్రి ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వాల దొంగాట
కేంద్రం పితలాటకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదు. రెండూ కలిసే దొంగాట ఆడుతున్నాయంటూ విశాఖ వాసులు పేర్కొంటున్నారు. కేంద్రంలోని బిజెపి సర్కారు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఇస్తున్నట్లు ప్రకటించి ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌ను ఎత్తేసింది. 200 కిలోమీటర్లలోపు విజయ వాడ డివిజన్‌ ఉండగా, వాల్తేరు రైల్వే ఎందుకు? అంటూ బిజెపి పెద్దలు వాదించి విజయవాడ డివిజన్లో వాల్తేరు డివిజన్లోని సగభాగాన్ని కలిపించేశారు. మరి విజయ వాడకు 40 కిలోమీటర్ల దూరాన్నే గుంటూరు డివిజన్‌ లేదా? రాష్ట్ర ప్రభుత్వం ఈ వాదన కేంద్రం వద్ద చేయడంలేదెందుకు? జోనల్‌ హెడ్‌క్వార్టర్స్‌ వచ్చినంత మాత్రాన డివిజన్‌ ప్రధాన కార్యాలయాన్ని మూసె య్యాలా?కొల్‌కతాలో రెండు జోనల్‌ హెడ్‌ క్వార్టర్లు లేవా? ఒక జోన్‌,ఒక డివిజన్‌ ప్రధాన కార్యాలయం ఒకేచోట ఉంటే తప్పే మిటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.రైల్వే జోన్‌ స్థలంపై ఎలాంటి వివాదమూ లేదు. విశాఖపట్నం రైల్వే జోన్‌ స్థలానికి సంబం ధించి ముడసర్లోవలో ఎలాంటి వివాదమూ లేదని విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లి కార్జున తెలిపారు. రైల్వే మంత్రి ఫిబ్రవరి 2న చెప్పిన నేపథ్యంలో ఆమరుచటి రోజు సాయంత్రం తన ఛాంబర్‌లో మీడియాతో కలెక్టర్‌ మాట్లాడారు.‘ముడస ర్లోవ సర్వే నెంబర్‌ 26లో సుమారు 52 ఎకరాలను గతంలో రైల్వేతో జివిఎంసి చేసుకున్న ఒప్పందం ప్రకారం సిద్ధం చేశాం. రైల్వే వారిని రావాలని, భూమి తీసుకోవాలని పలుమార్లు కోరినా స్పందన లేదు. వారెప్పుడు వచ్చినా స్థలం ఇస్తాం. ఈ విషయంపై 2023 డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ సిఎస్‌ సమావేశం నిర్వహించి డైరెక్షన్‌ ఇచ్చారు. ల్యాండ్‌ హ్యాండ్‌ ఓవర్‌ చేయాలని జివిఎంసి కమిషనర్‌కి స్వయంగా నేను చెప్పాను. ఆయన కూడా ఈ ఏడాది జనవరి 2న రైల్వేకు లేఖ రాశారు. ట్రెంచింగ్‌ కూడా ఆ భూమిలో క్లియర్‌ చేశాం. భూ వివాదం లేదు’ అని వివరించారు. రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ముడసర్లోవ సమీపంలో 52 ఎకరాల స్వాధీనానికి సిద్ధమైన జీవీఎంసీ సిబ్బందిని అడ్డుకునేందుకు స్థానిక గిరిజనులు యత్నిం చారు. ఆ భూమిని తమకు ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చిందని వాదనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. ముడసర్లోవ సర్వే నంబర్లు 53,55, 59, 60 61,62లో గల భూమి చుట్టూ కంచె నిర్మించేందుకు శుక్రవారం జీవీఎంసీ సిబ్బంది పోలీసుల సహాయంతో వెళ్లారు. ఈ విషయం తెలిసి స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఆ భూము లకు తాము హక్కుదారులమని, ఫలసాయాన్ని ఇచ్చే చెట్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ కార్యాలయాలను కట్టడానికి ప్రభుత్వం సిద్ధమైతే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గిరిజనులకు, పోలీసులకు నడుమ వాగ్వాదం జరిగింది. అనంతరం గిరిజనులు తమ ఆందోళన ొనసాగిస్తుండగానే…మరోవైపు అధికారులు తమ పని తాము చేసుకోసాగారు. ఈ భూమి గతంలోనే జీవీఎంసీకి దఖలు పడినట్టు చినగదిలి తహసీల్దార్‌ రమణయ్య తెలిపారు. కాగా ఈ భూమిని రైల్వే జోన్‌ కోసం కేటాయించనట్టు అధికారులు చెబుతున్నారు.-జిఎన్‌వి సతీష్‌

1 2 3 13