తెలంగాణ గిరిజన పవిత్ర స్థలాలు జాతరలు

మామానవ జాతికి మూలంగా చెప్పబడుతున్న గిరిజనులు దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో విస్తరించి ఉన్నారు ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో అందున తెలంగాణ రాష్ట్రంలో గిరిజ న జనాభా10శాతం విస్తరించి ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తుంది.12రకాల గిరిజన తెగలు గోదావరి కృష్ణ నదుల పరివా హక ప్రాంత కొండలు,కోనలు,అడవులు, మైదానాలలో నివసిస్తున్నారు.నమ్మకానికి సంస్కృతి పరిరక్షణకు ప్రతిరూపా లైన ఈఅడవి బిడ్డలు నివసించే ప్రాంతాలలోని ఆధ్యాత్మిక క్షేత్రాల గురించిన పూర్తి పరిశోధక పుస్తకం ‘తెలంగాణ గిరిజన పవిత్ర స్థలాలు జాతరలు’ రచయిత డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ. వీరు నిత్య సంచార పరిశోధకులు16 డిగ్రీలు పూర్తి చేసిన బహుముఖ విద్యావేత్త. గిరిజనా భివృద్ధి సంస్థ హైదరాబాదులో ఉన్నత ఉద్యో గ సేవలు అందిస్తున్న ఆయన వ్రాసిన ఈపుస్తకంలో అనేక ప్రామాణిక అంశాలు పొందుపరిచారు. గిరిజన కళాసంస్కృతి మొదలు గోదావరి లోయలో గిరిజన క్షేత్రాలు అనే తొమ్మిది విభాగాలుగా ఈ ప్రామాణిక పుస్తకం పొందుపరిచారు, అను బంధంగా తెలంగాణలోని అసెంబ్లీ స్థానాల వారీగా లంబాడ గిరిజన జనాభా వివరాలు అందించారు.ఈ పుస్తక రచన తెలంగాణ ప్రాంతంలోగల వివిధ జాతుల గిరిజనులు వారు పూజించే దైవాలు చేసేజాతరలు కేంద్రంగా కొనసాగి నేటితరం వారికి తెలి యని అనేక విలువైన చారిత్రక ఆధ్యాత్మిక విషయాలు విశేషాలు తెలియజేసింది. గిరిజన కళా సంస్కృతి అనే మొదటి విభాగంలో వివిధ గిరిజన తెగలు,కళలు, సంగీతం,నాట్యం,సాహిత్యం,చిత్రలేఖనం,కర్ర శిల్పం,అల్లికలు,గురించి సవివరంగా వివరి స్తూనే ప్రపంచీకరణ ప్రభావంతో అవి అంత రించిపోతున్న వైనం తెలిపి జాగృతం చేశారు.
ముఖ్యంగా లంబాడీల జీవన సంస్కృతి గురించి చాలా లోతైన అంశాలు వెల్లడిరచారు వంశాల వారీగా కొలిచే దేవతలు వాటి ప్రతిరూపాలుగా పూజించే చెట్ల వివరాలు లంబాడి సమాజం కుటుంబం కట్టుబాట్లు వివాహ విధానాలతో పాటు రాజస్థాన్లోని అబు పర్వతంపై బ్రాహ్మ ణులు చేసిన యజ్ఞం నుంచి ఉద్భవించిన రాజులు ఆ వంశం నుంచి అవతరించిన లంబడా తెగల వివరణ ఆసక్తికరంగా వివరిం చారు రచయిత సత్యనారాయణ. లంబాడీల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ పూజా విధానం గురించి అనేక చారిత్రక అంశాలు జోడిరచి వివరించబడిరది.
కోయదొరలు పూజించే మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి చారిత్రక జానపద అంశాలు జత చేసి అందించిన విభాగంలో సమ్మక్క సారక్క ప్రతాపరుద్రుని సేనలతో పోరాడి మరణించినట్టు ప్రజలను రక్షించే నేపథ్యంలో యుద్ధంలో మరణించిన వారి స్ఫూర్తి కోసం ‘‘వీరగల్‌ శిల్పాలు’’ చెక్కించటం నాటి ఆనవాయితీ, ప్రస్తుతం మేడారం దగ్గర జంపన్న వాగుపై వంతెన నిర్మాణ తవ్వకాల్లో స్త్రీ మూర్తి,పురుషమూర్తి,విగ్రహాలు బయట పడ్డట్టు అవి సమ్మక్క జంపన్న లవి అయిఉంటాయి అనే స్వీయ భావం రచయిత వ్యక్తపరిచారు. కాని ఆవివరాలు ఏవి ప్రస్తుతం మేడారంలోగానీ మ్యూజియంలోగాని లేకపోవడం కాస్త సందిగ్ధకరం. ఇక ఆదిలాబాద్‌ లోని కేస్లాపూర్‌లో గల గోండుల ఆరాధ్య దైవం‘‘నాగోబా’’గురించి కూడా అనేక చారిత్రక విషయాలతో సుదీర్ఘ అంశాలు, జాతర నేపథ్యం తీరుతెన్నుల గురించి కూలంకషంగా చర్చించారు.అలాగే గుండులు అమ్మ తల్లిగా పూజించే జంగు భాయ్‌ జాతర గురించి,కొమరం భీమ్‌ స్మారకం జోడెన్‌ ఘాట్‌ గురించిన వివరణలు ఇందులో చదవవచ్చు.
తెలంగాణలో గల ప్రధాన కోటలు వరంగల్‌, భువనగిరి,కోటలకన్నా అతి ప్రాచీనమైన గాంధారి కోట,గురించి అక్కడి పద్మనాయకపు గిరిజనులు ప్రతి ఏటా ఫిబ్రవరి మాసంలో జరుపుకునే మైసమ్మ జాతర గురించి జాతర ప్రారంభం నుంచి ముగింపు వరకు చేసే తంతులు గురించి సవివరంగా రాయడంలో రచయిత స్వీయ క్షేత్ర పర్యటనా నుభవం ప్రతి అక్షరంలో అగుపిస్తుంది.
ఆదిలాబాద్‌లోనే గల మరో అరుదైన పెద్దయ్య గుట్ట,గురించి కూడా మార్గ నిర్దేశం చేస్తూ వివరించారు,అలాగే కరీంనగర్‌ ప్రాంతంలో గల చిన్నయ్య గుట్ట యొక్క మొక్కుల గురించి కూడా తెలిపారు,
భద్రాచలం సమీపంలోని చర్ల దగ్గర పూజారి గూడెంలోని నాయకపోడు గిరిజనులు చేసే ‘‘సోముల దేవమ్మ కొలుపు’’ గురించి ఆసక్తిక రంగా తెలుపుతూ ఆధునికులు చేసే యజ్ఞ యాగాదుల ద్వారా వర్షాలు కురుస్తాయి. అనడంలో ఎలాంటి శాస్త్రీయత ఉందో, గిరిజనులు చేసుకునే జాతర్లు,కొలుపులలో కూడా అంతే శాస్త్రీయత ఉంది అంటూ రచయిత సహేతుకంగా చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లోని నల్లముడి గ్రామం శివారులోని అడవుల్లో గల ‘‘అక్షరాలలొద్ధి’’లో గల ఆదివాసి చిత్రలేఖనం గురించి రచయిత సత్యనారాయణ గారే మొదట వెలుగులోకి తెచ్చిన విషయం వివరించారు.
పాండవులు అరణ్య అజ్ఞాతవాస సమయంలో దక్షిణభారతంలోని దండకారణంలో గడిపినట్టు తద్వారా ఈ ప్రాంత అటవి పుత్రులకు పాండవులకు కలిగిన సంబంధ బాంధవ్యాలకు సంబంధించి నేటికీ ఇక్కడ గిరిజనులు భీముడు మొదలైన వారిని పూజిస్తూ సంబరాలు జాతరలు చేస్తుంటారు అని అనేక ఉదాహ రణలతో రచయిత చెప్పారు.
నల్లమల ప్రాంత గిరిజనులు తమ జాతి ఆడపడుచు చెంచులక్ష్మినిమను వాడిన శివుని తమ అల్లునిగా భావించి,పూజిస్తారని,ఇక్కడ జరిగే సలేశ్వరం లింగమయ్య జాతర,లొద్ది మల్లయ్య జాతర,భవరాపూర్‌ శివరాత్రి జాతర, గురించి చాలా క్షుణ్ణంగా రచయిత వివరించారు.
అదేవిధంగా గోదావరి లోయలోగల గిరిజన క్షేత్రాలు గురించిన అనేక ఆసక్తికరమైన విషయాలు విశేషాలు తెలియజేస్తూ… పాఠకులకు ఆసక్తిని కలిగిస్తూ అనేక విలువైన గిరిజన చారిత్రక సాంస్కృతిక విషయాలు తెలియజేశారు.
ఇందులోని ప్రతి విషయం కూడా ప్రామాణికంగా పరిశోధనకు చేయూతనిచ్చే దారి దీపం వంటిది ఈ పుస్తకం.
ఇప్పటివరకు వచ్చిన అనేక గిరిజన సాంప్రదాయ పుస్తకాలకు ఇది భిన్నమైనది ప్రతి పరిశోధక విద్యార్థి ఉత్తమ పాఠకులు తప్పనిసరిగా చదివి తీరాల్సిన ప్రామాణిక పుస్తకం ఇది.

పుస్తకం పేరు తెలంగాణ గిరిజన పవిత్ర స్థలాలు జాతరలు
రచన డా.ద్యావనపల్లి సత్యనారాయణ పుటలు 116 పేజీలు వెల అమూల్యం ప్రతులకు సంత్‌ శ్రీ సేవాలాల్‌ స్వచ్ఛంద సంస్థ,టేకులపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెల్‌ 9703085458. – డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

మెరుగైన ఐటీ పాలసీతో ఐటీ పరిశ్రమలు రప్పిస్తాం..

  • 100 బిలియన్‌ ఎకానమీగా విశాఖ మహానగరాన్ని అభివృద్ధిచేస్తాం!
  • గ్రీన్‌ చానల్‌ ద్వారా ఐటి పరిశ్రమలకు రాయితీలను అందజేస్తాం
  • ఐటిలో ఎంత ఎక్కువ ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సాహకాలు
  • ఏపి ఐటి అసోసియేషన్‌ ప్రతినిధుల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌ విశాఖపట్నం: త్వరలో మెరుగైన ఐటి పాలసీని ప్రకటించి, దేశంలోనే ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొ న్నారు. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్‌ ఐటి అసోసియేషన్‌ ప్రతినిధులతో మంత్రి లోకేష్‌ గురువారం ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ ఐటి రంగంలో ఇప్పటికే అభివృద్ధి సాధించిన హైదరాబాద్‌, బెంగు ళూరు,చెన్నయ్‌ లల్లో అమలుచేస్తున్న పాలసీల ను అధ్యయనం చేసి మెరుగైన ఐటి పాలసీని తీసుకువస్తాం.రాష్ట్రంలో అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యం లో ఐటి,ఎలక్ట్రానిక్స్‌ రంగాలు కీలకపాత్ర పోషించబోతున్నాయి.దేశంలో టాప్‌-10 ఐటి కంపెనీలతో చర్చలు జరుపుతున్నాం,త్వరలో రాష్ట ప్రజానీకం ఐటి పరిశ్రమ పెట్టుబడులపై శుభవార్త వింటారు.ఐఎస్‌బి తరహాలో విశాఖ లో ప్రపంచస్థాయి ఎఐ యూనివర్సిటీని ఏర్పా టుచేస్తాం.ఎఐ హబ్‌ గా కూడా విశాఖను తీర్చి దిద్దుతాం.రోబోటిక్స్‌,హెల్త్‌ కేర్‌,ఎడ్యుకేషన్‌ వంటి రంగాలతో అనుసంధానించి ఐటిని వేగ వంతంగా అభివృద్ధిచేస్తాం.రాబోయే అయిదేళ్ల లో విశాఖపట్నాన్ని 100బిలియన్‌ డాలర్ల ఎకానమీ నగరంగా తీర్చిదిద్దుతాం.ఐటి రంగం లో హైదరాబాద్‌ ను చంద్రబాబు నాయుడు గారు ఏవిధంగా అభివృద్ధి చేశారో ఐటి పరిశ్ర మదారులకు తెలుసు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడి ఐఎస్‌ బిని హైజాక్‌ చేసి హైదరాబాద్‌కు రప్పిం చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4.0 వెర్షన్‌ను చూడబోతున్నాం.గతంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో రాష్ట్రాన్ని నెం.1గా నిలి పిన బాబు,ఇప్పుడు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజి నెస్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీయించబోతున్నారు.చంద్రబాబుగారిలో 19 95 నాటి సిఎం మాదిరిగా పనిచేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మేంకట్టుబడి ఉన్నాం విశాఖను ఐటి క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లలా భావిస్తూ ముందుకు సాగుతోంది.గత అయిదేళ్లలో ఐటి పరిశ్రమ అష్టకష్టాలు గత అయిదేళ్లలో పరిశ్రమ దారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ముఖ్యమంత్రి విశాఖలో తన కోసం విలాసవం తమైన ప్యాలెస్‌ కట్టుకున్నాడు కానీ ఒక్క చదర పు అడుగు కూడా ఐటి స్పేస్‌ అభివృద్ధి చేయ లేదు. ఐటి పరిశ్రమలకు వెళ్లే రహదారుల్లో వీధిలైట్లు కూడా ఏర్పాటుచేయలేదు. మెరుగైన ఐటి పాలసీ రూపకల్పనకు పరిశ్రమ పెద్దలతో చర్చిస్తున్నాం,గత ప్రభుత్వం పెండిరగ్‌ పెట్టిని ఇన్సెంటివ్‌ బకాయిలన్నీ క్లియర్‌ చేస్తాం. ప్రస్తు తం పనిచేస్తున్న ఐటి కంపెనీలు, కొత్తగా ఏర్పా టుచేసే కంపెనీలకు ఇకపై గ్రీన్‌ చానల్‌ ద్వారా ఇన్సెంటివ్స్‌ అందజేస్తాం.రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఐటి పరిశ్రమల్లో 90శాతం విశాఖప ట్నానికే రాబోతున్నాయి.విశాఖలో ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆఫీస్‌ స్పేస్‌ను అభివృద్ధి చేస్తాం.కేవలం ఐటిలో మాత్ర మే కాకుండా ఫార్మా, ఎంఎస్‌ఎంఇ వంటి రంగాల్లో కూడా విశాఖవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటి రంగంలో తెలుగువారు అధికంగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయిన ఐటి నిపుణులను తిరిగి ఎపికి రప్పి స్తాం. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్‌ సెన్సస్‌ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నాం, విద్యారంగంలో కెజి టు పిజి వరకు ప్రక్షాళన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌ -100 యూనివర్సిటీల్లో ఎపి విశ్వ విద్యాలయాలు ఉండాలన్నదే తమ లక్ష్యం. కొత్త గా ఏర్పాటయ్యే ఐటి పరిశ్రమలు యువతకు ఎన్ని ఎక్కువ ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సహకాలు అందిస్తాం. – జిఎన్‌వి సతీష్‌

మహిళలపై పెరుగుతున్న హింస

కోల్‌కతాలో ఆర్‌జికర్‌మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డాక్టర్‌పై ఆగస్టు 9నహత్యాచారం జరిగింది.ఈఘటనపై దేశం భగ్గు మంటోంది.దాదాపు అన్నిరాష్ట్రాల్లో మెడికల్‌ విద్యా ర్థులు,డాక్టర్లు,నర్సులు,మహిళలు,విద్యార్థి,మహిళా సంఘాలు,మేధావులు ప్రదర్శనలు,సభల ద్వారా తమ నిరసనను తెలుపుతున్నారు.ఈఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారిస్తున్నది. ఈ సమయం లోనే మహారాష్ట్రలోని బాద్లాపూర్‌లో ఇద్దరు మైనర్‌ అమ్మాయిలపై,అస్సాం రాజధాని గౌహతిలో విద్యార్థి నిపై, హిమాచల్‌ ప్రదేశ్‌లో నర్సింగ్‌ విద్యార్థినిపై అత్యా చారాలు జరిగాయి.‘వియె వాంట్‌ జస్టిస్‌’ అని ప్రదర్శ నలో అరచిన ఆడబిడ్డల గొంతుల తడారక ముందే ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయి.
దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి ప్రతి గంటకు 51 కేసులు పోలీస్‌ స్టేషన్లలో రిజిష్టరు అవుతున్నట్లు జాతీయ నేర పరిశోధన బ్యూరో 2023 నివేదిక తెలిపింది. పోలీస్‌ స్టేషన్‌ వరకు రాని కేసులు ఇంతకు రెండిరతలు పైగా వుంటాయి. నిందితులు ఇన్ని దారుణాలు చేయగలుగు తున్నారంటే వారికి అంత ధైర్యం ఎక్కడిది? పాలకుల భీకరింపులు, పోలీసు కేసులు, న్యాయస్థానాల శిక్షలు ఈ దారుణాలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాయి?
గత పది సంవత్సరాలుగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలగురించి ప్రధానమంత్రి మాట్లా డుతూనే వున్నారు. అయినా నేరాలు తగ్గకపోగా పెరుగుతూనే వున్నాయి. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రిపోర్టు ప్రకారం మహిళలపై 2016లో 3,38, 954బీ 2017లో3,67,000బీ,2018లో 3,92,136బీ 2019లో 4,12,000బీ 2020లో 3,71,503బీ 2021లో 4,28,278బీ 2022లో 4,45,256 నేరాలు జరిగాయి.ఇవన్నీ పోలీసు స్టేషన్లలోరిజిస్టరైన కేసుల వివరాలు.2016-2021 సంవత్సరాల మధ్య మహిళలపై నేరాలు 26.35 శాతం పెరిగాయి. 2021-2022 సంవ త్సరాల్లో అత్యాచారాలు 7.1శాతం పెరిగాయని ఈ రిపోర్టు తెలిపింది. గృహ హింస, కిడ్నాప్‌లు, దాడులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే వున్నాయి. మహిళలపై జరుగుతున్న ఈఘోరాలకు పౌర సమాజం స్పందించడంతో కొన్ని చట్టాలు వచ్చా యి. 2012లో దేశ రాజధాని ఢల్లీిలో కదులుతున్న బస్సులో 23ఏళ్ళ ‘నిర్భయ’పై జరిగిన దారుణం తర్వాత ప్రజలు రోడ్లపైకి రావడంతో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు, చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె.ఎస్‌.వర్మ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడిరది.వీరి సూచనలతో క్రిమినల్‌ లా (సవర ణ) చట్టం2013 అమలులోకి వచ్చింది. మహిళ లపై కొత్త తరహాలో జరుగుతున్న వేధింపులు, నేరాలను నిర్వచించింది.శిక్షలను కఠినతరం చేసిం ది.అయినా నేరాలు పెరుగుతున్నాయి. బాలికలపై పైశాచికత్వం ఏడాదికేడాది పెరిగిపోతుంది. చిన్నా రులపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టం వచ్చినా బాలికలపై నేరాలు తగ్గడం లేదు.2018లో37,798బీ 2019లో 45,270బీ 2020లో45,591బీ,2021లో51,863బీ 2022లో61,303 మంది బాలికలపై నేరాలు జరిగాయి.గత ఐదు సంవత్సరాల్లో మొత్తం నేరాలు 2,51,825కాగా,శిక్షలు పడినవి కేవలం25, 961మాత్రమే. నేరగాళ్లకు శిక్షలు పడుతున్న తీరు ‘బేటీ బచావో’ నినాదాన్ని హేళన చేయడంలేదా! మహిళల,బాలికల జీవితాలను ఇలా అర్థాంతరం గా బలి తీసుకోవడానికి ప్రధాన కారణాలు సనా తన పురుషాధిక్య భావజాలం, ఆధునిక వ్యాపార విష సంస్కృతి,పెరుగుతున్న మతతత్వ భావాలలు, వీటిని పెంచి పోషిస్తున్న పాలకుల విధానాలు. స్త్రీల కంటే పురుషులు అధికమనే భావం మన సమాజంలో నరనరాన ఇంకిపోయింది. హక్కులు లేని జాతి స్త్రీలదనే హీన సాంప్రదాయం నేటికీ కొనసాగుతున్నది. చదువుకునే హక్కు కోసం, బాల్య వివాహాల రద్దు కోసం, వితంతు వివాహాల కోసం, ఆస్తి హక్కు కోసం,వరకట్న నిషేధం కోసం, అత్యాచారాల నిరోధం కోసం, చట్టబద్ద రిజర్వేషన్ల కోసం,ఉద్యోగం, ఆరోగ్యం ఇలా జీవితంలోని ప్రతి అంశం కోసం మహిళ పోరాడి సాధించుకోవలసి వచ్చింది. మహిళలకు కొన్ని హక్కులు, చట్టాలు సాధించుకున్నా దురాగతాలు ఇంకా కొనసాగ డానికి మూల కారణం మన సమాజంలో కొన సాగుతున్న భూస్వామ్య అవశేషాలు. విదేశీ పాల కులు, ఆ తర్వాత స్వదేశీ పాలకులు సమాజాన్ని పురోగతివైపు నడపడానికి కారణమైన భూ సమస్యను పరిష్కరించకుండా భూస్వామ్య వర్గా లతో రాజీ పడ్డారు. కాళ్ళు పాతళంలో ఆలోచనలు ఆకాశంలో వున్నట్లు ఆధునిక వ్యవస్థ గురించి కలలుగనమని ప్రజలకు పిలుపునిస్తున్నారు. వెనుకటి వ్యవస్థ దుర్లక్షణాలవల్ల మహిళలు, అట్ట డగు వర్గాలపట్ల వివక్ష,హింస,అవమానాలు కొన సాగుతునే వున్నాయి.వీటిని చట్టాల ద్వారా మాత్ర మే పరిష్కరించలేమని,ఈభావాలు కొనసాగ డానికి మూల కారణాలను పరిష్కరించాలని జస్టిస్‌ భాను మతి 2017లో ఒకతీర్పు సందర్భంగా చెప్పిన విషయాలు అక్షరసత్యాలు. పాత భావాలు ఇంకా మన మనస్సు నుండి దూరం కాకుండానే విదేశీ వ్యాపార సంస్కృతి మన మెదళ్ళలోకి జొరబడిరది. ప్రపంచీకరణ విధానాల పేరుతో స్త్రీని వ్యాపార సరుకుగా మార్చివేశారు.అందమైన, అశ్లీలమైన స్త్రీ బొమ్మల ద్వారా తమ సరుకులను అమ్ముకునే నీచ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగింది. అశ్లీలత చట్టబద్దమైపోతున్నది.అడ్వరటైజ్‌మెంట్లు, సినిమా లు, సీరియళ్లు,రీల్స్‌, కామెడీ షోలు ఇలా అన్నింటా స్త్రీని అసభ్యంగా చూపడంతో పాటు, జుగుప్సాకర మైన ద్వంద్వార్థాల డైలాగులు నిత్యకృత్యమయ్యా యి.సోషల్‌ మీడియా ముఖ్యంగా యూట్యూబ్‌ చానెళ్లలో అశ్లీల వీడియోలు విచ్చలవిడిగా యువ తకు అందుబాటులో ఉంటున్నాయి.827 పోర్న్‌ వెబ్‌సైట్లను నిషేధించాలని 2015లోనే సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.అన్ని రకాల పిల్లల అశ్లీల చిత్రాలను నిషేధించాలని 2016లో మరోసారి కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాల్సి వచ్చింది.అయితే పోర్న్‌ హబ్‌ తాజా లెక్కల ప్రకా రం 2019 తర్వాత ఆన్‌లైన్‌ పోర్న్‌ వీడియోలు చూసే వారిసంఖ్య వేగంగా పెరిగింది. మన దేశం లో 18 నుండి 24 ఏళ్ళ లోపు వున్న పిల్లలు 44 శాతం మంది ఈ పోర్న్‌ వీడియోలు చూస్తున్నారట! ప్రపంచంలో ఇలాంటి వీడియోలుచూస్తున్న వారి లో మన దేశం ప్రస్తుతం మూడో స్థానంలో వుంది. గత పదేళ్ళుగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి భావజా లానికి పునాది మనుధర్మశాస్త్రం.ఈఅశాస్త్రం బోధంచే నీతి స్త్రీ బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త,వృద్ధాప్యంలో తండ్రి సంరక్షణలో పెరగాలని. మానవ సమాజంలో సగ భాగంగా వున్న స్త్రీలు ఇలా పరాన్న జీవులుగా వుంటే ఆ సమాజం ఎలా అభివృద్ధి సాధిస్తుంది? రాజుల కాలంలో రాజ్యాల ఆక్రమణలో భాగంగా పదుల సంఖ్యలో స్త్రీలను పెళ్ళిళ్లు చేసుకోవడం,పరాయి రాజ్య స్త్రీలను చెర చడం,వేశ్యలుగా,బసివినులుగా,జోగినులుగా మార్చి కామాంధులకు బలిపెట్టారు. కౌరవసభలో ద్రౌపదికి జరిగిన ఘోర అవమానాన్ని అటు పౌరాణిక నాటకాల్లో, ఇటు సినిమాల్లో, సీరియ ళ్లలో ఈనాటికీ చూపిస్తూనే వున్నారు. ఈ భావజా లం తలకెక్కిన మతోన్మాదులు పాలకులుగా మారి అదే నీచ పద్ధతులను అనుసరిస్తున్నారు. గుజరాత్‌ లో బిల్కిస్‌బానోపై జరిగిన సామూహిక అత్యాచా రం,మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగిం చడం,జెఎన్‌యూ,ఇతర యూనివర్శిటీలలో అమ్మా యిలపై దాడులు,హింస ఇందులో భాగమే. ప్రశ్నిం చే ఆధునిక మహిళలపట్ల సోషల్‌ మీడియాలో జరిగే వేధింపులు,ట్రోలింగ్స్‌ ఆనాటి నీచ మనస్త త్వానికి ఆధునిక వికృత రూపాలు. బిల్కిస్‌బానో కేసులో నిందితులకు శిక్ష తగ్గించడమే కాకుండా, వారిని జైళ్ల నుండి హారతులు పట్టి పాలక పార్టీనే స్వాగతించిన తర్వాత మహిళల మాన ప్రాణాలను ఎలా కాపాడుతారు?2023 ఎన్‌సిఆర్‌ నివేదిక ప్రకారంఉత్తరప్రదేశ్‌లో మహిళలపై 56వేల నేరా లు జరిగి మొదటి స్థానంలో వుండగా,40,738 కేసులతో రాజస్థాన్‌,39,526 కేసులతో మహారాష్ట్ర వరుస రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నేరాలు జరిగిన తర్వాత కేసులు నమోదు చేయకపోగా బెదిరింపులు,పెద్దల పంచాయితీల పేరుతో బాధిత మహిళలను మరింతగా వేధిస్తున్నారు. మహిళా నేరాలపై వచ్చిన ఫిర్యాదులను సకాలంలో చార్జిషీట్‌ వేసి దోషులకు శిక్షలు వేయించడంలో కేరళ ఆదర్శంగా వుందని ఎన్‌సిఆర్‌ రిపోర్టు తెలిపింది. ఆ రాష్ట్రంలో నమోదైన మహిళా నేరాల కేసుల్లో 96 శాతం వాటికి చార్జిషీట్‌ సకాలంలో వేస్తున్నా రు.మహిళలు, బాలికలపై ఘోరాలు జరిగినప్పుడు స్పందించడం కనీస మానవత్వం.ఆమాత్రం ప్రజా స్పందన వుంది కాబట్టే ప్రభుత్వాలు కొంతైనా స్పందిస్తున్నాయి. కానీ వీటితోనే నేరాలను అరికట్ట లేం.మూలమైన భూ సమస్య, వికృత వ్యాపార సంస్కృతి,మతతత్వ పాలక విధానాలను ప్రతిఘ టించి,ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం విభిన్న రూపాల్లో కృషి చేయడమే మహిళల మాన, ప్రాణా లకు నిజమైన రక్షణ.
వైద్య సిబ్బందికి రక్షణ ఏదీ !
కోల్‌కతా నగరంలోని ఆర్‌.జీ.కార్‌ ప్రభుత్వ వైద్య కళాశాల,ఆసుపత్రిలో విధుల్లో ఉన్న మహిళా వైద్యు రాలిపై అత్యాచారం, హత్య చేసిన దారుణ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి,తీవ్ర ఆందోళనకు గురి చేసిం ది. దేశంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థి తుల్లో, రక్షణ కొరవడిన స్థితిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా మహిళలు విధుల్ని నిర్వహిం చాల్సి వస్తుందో ఇంకోసారి తేటతెల్లం చేసిన దుర్ఘటన.ఆ పీజీ వైద్య విద్యార్థి36గంటలుగా విధుల్లో ఉన్నా రు.అర్ధరాత్రి దాటాక కాసేపు సెమి నార్‌ రూమ్‌లో విశ్రమించిన సమయంలో దారుణ సంఘటనకి బలయ్యారు. నగరం మధ్యలో ప్రభుత్వ ఆసుపత్రి లో,తమకి బాగా పరిచయమైన స్థలంలో తమ రక్షణకి ఇంత తీవ్రమైన ప్రమాదం ఉంటుం దని ఆమె కలలో కూడా అనుకుని ఉండరు. అక్కడ సీసీ కెమెరాలు పని చెయ్యడం లేదట. ఆగంతకులు రాకుండా సరిపడా భద్రత, సరిjైున వెలుతురు లేని క్యాంపస్‌. ఇవన్నీ ఆ కిరాతక చర్యకు దోహద పడ్డాయి.ఇది వ్యవస్థాగత లోపం.మహిళా ఉద్యో గులకు పూర్తి స్థాయి భద్రత కల్పించలేని నిర్వాకం. ముఖ్యంగా వైద్యరంగంలో పనిచేస్తున్న వారు ఆరో గ్య సేవలు అందించడంలో తీవ్రంగా శ్రమ పడు తున్నారు. అయినా రోగి బంధువుల నుండి భౌతిక దాడులకు గురవ్వడం లాంటి సంఘటనలు పెరుగు తూ వస్తున్నాయి.వాటిని అరికట్టే కఠిన చట్టాలు, చట్ట ప్రకారం సత్వరం శిక్ష పడేలా ఏర్పాట్లు వ్యవస్థ లో అవసరం. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి.ప్రాణాలు నిలిపే డాక్టరు, తానే ప్రాణ భయంతో చికిత్స అందించాల్సి వస్తే అది రోగికి మాత్రమే కాదు ప్రజారోగ్య వ్యవస్థకే ప్రమాదం. ఇక హత్యోదంతం విషయంలో ఆ వైద్య కళాశాల పెద్దలే కాకుండా ప్రభుత్వం కూడా బాధ్యతా రహితంగా వ్యవహరించింది. దుర్ఘటన జరిగిన పిమ్మట ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ రిపోర్ట్‌ ఇవ్వడానికి కూడా ఆలస్యంచేస్తే,ఆయనపై చర్యలు తీసుకోవా ల్సింది పోయి ప్రభుత్వం ఆయనకు వేరేచోట బాధ్యతలు అప్పగించడం ద్వారా గౌరవిం చింది. సమయానికి హైకోర్టు స్పందించి ఆయన్ని సెల వుపై పంపమని ఆదేశించడం ద్వారా, కేసుని సీబీఐకి అప్పగించడం ద్వారా కొంత న్యా యం చేసింది. ఇలాంటి హీన నేరం జరిగిన తర్వా త కూడా అక్కడి ప్రభుత్వం కోర్టుచెప్తే గానీ సరైన విధంగా స్పందించక పోవడం దారుణం.ఈ హత్యోదంతం నుండి పాఠాలు నేర్చుకుని వైద్యుల, ఆరోగ్య సిబ్బంది రక్షణకు, భద్రతకు ప్రభుత్వాలు పూర్తి బాధ్యత వహించాలి. వారు పని చేసే స్థలం పూర్తి సేఫ్‌ జోన్‌గా ఉండాలి.
తిరోగమన చర్య
దేశ అత్యున్నత న్యాయస్థానం సూమోటోగా ఈ కేసును విచారణకు తీసుకుంది. విచారణ ప్రారం భించిన మొదటి రోజే ‘మరో అత్యా చారమో హత్యో జరిగేంతవరకు చూస్తూ ఊరుకోవాలా?’అని ప్రశ్నించింది. ఈ పరిణా మాలన్నీ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టాయి. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగం గా మహిళల పనిగంటలు తగ్గించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘సాధ్యమైనంత వరకు మహిళలకు రాత్రి డ్యూటీని నివారించాలి’ అని మార్గదర్శకాలను జారీ చేసింది. భద్రత కోసం ఈనిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ ఆచర ణలో ఇది మహిళల ఉపాధి అవకాశాలపై గొడ్డలి వేటుగా మారనుంది. మహిళలకు అరకొరగా ఉన్న ఉపాధి అవకా శాలను సైతం ఈ నిర్ణయం గండి కొడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతు న్నాయి. అందుకే, మమతా ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం తిరోగ మన చర్య.మభ్య పెట్టే ఈతరహా విధానాలకు బదులు అసలైన రక్షణ చర్యలు తీసుకోవాలి. కోల్‌ కతా వంటి మహానగరంలో వైద్యఆరోగ్య రంగంతో పాటు,గిగ్‌ వర్కర్లు,ఫ్యాక్టరీలు,కాల్‌ సెంటర్లు, హో టళ్లు, పారిశుధ్య కార్మికులుగా లక్షలాది మంది మహిళలు పనిచేస్తున్నారు.ఆటో డ్రైవర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. విధి నిర్వ హణలో భాగం గా పురుషులతో సమానంగా రాత్రి పూట కూడా వీరు పనుల్లో భాగస్వాములవు తున్నారు. ‘ఎక్కడైనా..ఎప్పుడైనా’వీరందరికి సురక్షిత వాతా వరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆపని చేయడానికి బదులుగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం చేతులెతేస్తోంది. మరో విధంగా చెప్పా లంటే మహిళలు ఇళ్లనుండి బయటకొచ్చి రాత్రి పూట పనిచేస్తున్నారు కాబట్టే,అత్యాచారాలు జరుగు తున్నాయన్నట్టుగా వ్యవహరిస్తోంది.ఇది ఒక రకం గా సంఫ్న్‌పరివార్‌ వాదనే! ఈనిర్ణయంతో మహి ళల ఉద్యోగ,ఉపాధి అవకాశాలు గణనీ యంగా కుదించుకుపోతాయి.అంతిమంగా శ్రామి క శక్తి నుండి మహిళలను దూరం చేస్తుంది. అదే సమ యంలో వేధింపులు,అత్యాచారాల నుండి మహిళ లకు లభించే భద్రత మాత్రం ప్రశ్నార్థకమే! పగటి పూట వేధింపులు జరగవన్న గ్యారంటీ ఏమిటి? రాత్రిపూట ఇళ్ళ వద్ద ఉన్నా భద్రత ఉంటుం దన్న నమ్మకం ఏమిటి?మహిళలు రాత్రిపూట పని చేయ డంపై చర్చ ఇప్పటిదికాదు.స్వాతం త్య్రానికి పూర్వ మే రామ్‌ చంద్‌ వర్సెస్‌ మథురా చంద్‌ కేసులో న్యాయస్థానం భద్రత సాకుతో మహిళలను నైట్‌ డ్యూటీల నుండి దూరం పెట్టడాన్ని తప్పు పట్టింది. స్వాతంత్య్రం తరువాత కూడా అత్యున్నత న్యాయ స్థానంఇదేస్ఫూర్తిని కొనసాగించింది. కె.ఎస్‌ త్రివేణి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా,ఆర్‌ వసంత వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌14ను అత్యున్నత న్యాయ స్థానం ప్రస్తావించింది. ఎటువంటి వివక్షా లేని సమానత్వాన్ని ఆర్టికల్‌ 14దేశ ప్రజలందరికీ దఖ లు పరుస్తోందని స్పష్టం చేసింది.ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌లో దీనికి భిన్నంగా ఉన్న నిబంధనలను కొట్టివేసింది. ఈ తీర్పుల స్ఫూర్తితో పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు (నివారణ, నిషేధం, పరిహారం) చట్టం 2013, లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 రూపొందాయి. ఇప్పటికీ వీటి అమలు అంతంత మాత్రమే! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈచట్టాల మేరకైనా భద్రతా చర్యలను తక్షణం అమలు చేయా లి.అమలు చేయని సంస్థలను గుర్తించి కఠిన చర్య లు తీసుకోవాలి.మహిళలపట్ల హింసకు, దౌర్జన్యా లకు,లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలి.- (అన్విత్‌/ డా.డి.వి.జి.శంకరరావు)

ఏపీ గిరిజన విశ్వవిద్యాలయ పనులు ప్రకటనలకే..

కేంద్ర ప్రభుత్వం 2014లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎ.ఐ.ఐ. ఎం.ఎస్‌), కేంద్రీ య గిరిజన విశ్వవిద్యాలయం అనే జాతీయ విద్యా సంస్థలను ఒకేసారి ఆంధ్ర ప్రదేశ్‌కు మంజూరు చేసింది. కానీ రూ.834 కోట్లు ఎస్టిమేషన్‌ కలిగిన గిరిజన విశ్వవిద్యా లయం ఎక్కడ నిర్మించాలి అన్న దానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. యూనివర్సిటీకి నిధుల కేటాయింపులు కూడా ప్రతి ఏడాది తగ్గుతు న్నాయి.2015లో రూ.834కోట్లు కేటాయించి మొదటి విడత కింద రూ.420కోట్లు విడుదల చేసింది.2023 సంవత్సరంలో సవరించిన బడ్జెట్‌లో రూ.40.67కోట్లు కేటాయించారు. కానీ ఖర్చు జరగలేదు.ఈ ఏడాది ఏకంగా బడ్జెట్‌లో యూనివర్సిటీకి ప్రత్యేకించి ఎటువంటి కేటాయిం పులు జరగలేదు.యుజిసి నిధుల నుండి కేటాయి స్తామని చెబుతుంది.పోనీ ఆ యుజిసి నిధులేమైనా పెంచారా అంటే అదీ లేదు.గతంలో యుజిసికి రూ.6409 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 60.99 శాతం కోత విధించి కేవలం రూ.2500 కోట్లు కేటాయించారు. ఇందులో గిరిజన విశ్వ విద్యాలయంకు ఎంత ఖర్చు చేస్తారో వేచి చూడాలి. భూములు సేకరించారు-బాధ్యత మరిచారు
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం విజయ నగరంలో కొత్తవలస సమీపంలోని రెల్లి గ్రామంలో నిర్మించాలని గతంలో టిడిపి ప్రభుత్వం నిర్ణయించింది.2015లో అక్కడ రైతుల నుండి 520 ఎకరాలు భూమిని సేకరించింది. కానీ దానికి రైతులకు ఎటు వంటి పరిహారం చెల్లించలేదు. కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన నిధులలో రూ.5కోట్లు ఖర్చు చేసి భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి చేతులు దులు పుకుంది. ‘రెల్లిలో సేకరించిన భూమిలో ఎక్కువ శాతం జిరాయితీ భూమి.పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వుంటుంది.అందుకనే రెల్లి నుండి యూనివర్శిటీని మెంటాడలోని కుంఠినివలస దగ్గరకు మార్చామ’ని 2019లో నూతనంగా వచ్చిన వై.ఎస్‌.ఆర్‌.సి.పి ప్రభుత్వం చెప్పింది. అక్కడ రైతుల దగ్గర నుండి 563ఎకరాలు భూమి సేకరించి నష్టపరిహారం కూడా 90 శాతం చెల్లించింది.4సంవత్సరాలు పాటు కాలయాపన చేసి ఎన్నికలు వస్తున్నాయనగా హడావుడిగా కేంద్రమంత్రి ధర్మేందర్‌ ప్రధాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.ఆతరువాత మళ్లీ ప్రభుత్వం మారింది.2024లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది.ఎస్‌.కోట ఎంఎల్‌ఏ కోళ్ల లలిత కుమారి యూనివర్సిటీ నిర్మాణం గతంలో అనుకున్న రెల్లిలోనే ఏర్పాటు చేస్తామని దానికి ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కూడా ఆమోదం తెలిపారని ప్రకటిం చారు.ఈమధ్య గిరిజనశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుంఠినివలసలో జరిగిన గ్రామ సభలో మాట్లాడుతూ యూనివర్సిటీ రెల్లిలో ఏర్పాటు చేస్తారని చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని ఇక్కడే ఏర్పాటు చేస్తామని,అందులో ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.అంతకు ముందు రోజేజిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో యూనివర్శిటీ పనులు వేగ వంతం చేస్తామని తెలిపారు.నీటి సరఫరాకు 4కోట్లు,విద్యుత్‌ సరఫరాకు రూ.3.6 కోట్లు,రోడ్డుకు పరిహారం చెల్లించడానికి రూ.2.6కోట్లు అవసరమౌతాయని తెలిపారు. యూనివర్శిటీ మంజూరై నప్పటి నుండి ఇటు వంటి ప్రకటనలు అనేకం వస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పని మాత్రం ముందుకు కదలడం లేదు.
సదుపాయాలు లేవు
2019 నుండి యూనివర్సిటీ ఏ.యు భవనం లో తాత్కాలికంగా తరగతులు నడుస్తున్నాయి. సుమారు 250కుపైగా విద్యార్థులు చదువు తున్నారు. మన రాష్ట్రంతో పాటు కేరళ, కర్ణా టక,ఒడిస్సా వంటి ఇతర రాష్ట్రాల నుండి కూడా విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువు తున్నారు. వీరికి సరిపడా సదుపాయాలు లేవు. వసతి సదుపాయం లేక దగ్గరలో ఓప్రైవేట్‌ కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నారు.అక్కడ రూ. 60,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతంత ఫీజులు కట్టుకోలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.చాలా మంది విద్యా ర్థులు వసతి లేకపోవడంతో బయట ప్రైవేట్‌ హాస్టళ్లు,అద్దె గదుల్లో ఉంటూ చదువుతున్నారు. తరగతి గదులు సరిపోక పోవడంతో ఉదయం కొన్ని కోర్సులు,మధ్యాహ్నం కొన్ని కోర్సులు నడుస్తున్నాయి.కంటైనర్లతో నిర్మాణం చేసిన గదుల్లో ల్యాబ్‌ ఏర్పాటు చేయాల్సిని దుస్థితి. యూనివర్సిటీల్లో చేరుతున్న వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుంది.వారందరికీ ఈ అరకొర సదుపాయాలు సరిపోవడం లేదు.విభజన చట్టం ప్రకారం 2021నాటికి యూనివర్శిటీ నిర్మాణం పూర్తి కావాలి. ప్రభుత్వాలు మారు తున్నాయి తప్ప పనుల్లో మాత్రం ఎటువంటి మెరుగుదల లేదు.గిరిజన యూనివర్శిటీ నిర్మా ణం పూర్తయితే గిరిజన ప్రాంతంతోపాటు విజయనగరం జిల్లా కూడా అభివృద్ధి చెందు తుంది.ఆర్థికంగా వెనుకబడిన జిల్లాకు ఎంతో కొంత ఆర్థిక వనరులను సమకూర్చుకోగలదు. వేల మంది విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగ పడుతుంది.చాలా మందికి ఈజిల్లాలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఉత్తుత్తి ప్రకటనలు ఆపి నిర్మాణ పనిలో మెరుగుదల కనబరచాలి.
అసలేం జరిగింది?
సాలూరు నియోజకవర్గం దత్తి రాజేరు, మెంటాడ మండలాల్లోని 561.88ఎకరాల్లో రూ.834 కోట్లతో గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అందులో భాగంగా,మెంటాడ మండలం చిన మేడ పల్లిలో ఆగస్టు 25న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వర్సిటీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.విజయనగరం జిల్లాలోని సాలూరు ఎస్టీ రిజర్వ్‌ నియోజకవర్గం.రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పీడిక రాజన్నదొర ఈ నియోజకవర్గం నుంచే ప్రాతి నిధ్యం వహిస్తున్నారు.జిల్లాల పునర్విభజన సందర్భంగా రాష్ట్రంలో రెండు గిరిజన జిల్లాలు గా అల్లూరి సీతారామరాజు,పార్వతీపురం మన్యం జిల్లాలను ఏర్పాటు జరిగాయి. ఈ నేప థ్యంలో కేంద్రం మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఈరెండు జిల్లాల పరిధిలోనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు కూడా వచ్చా యి.కానీ,గిరిజన యూనివర్సిటీకి శంకు స్థాపన జరిగిన ప్రాంతం మైదాన ప్రాంతమైన విజయ నగరం జిల్లా పరిధిలోకి వస్తోంది.
2017లో పరిస్థితేంటి…
విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసింది.తొలుత ఈయూనివర్సి టీని కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్నదొరపాలెంలో ఏర్పాటు చేయాల నుకున్నారు.అందుకోసం సర్వేనంబర్‌1/8లో 526.24ఎకరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది.యూనివర్సిటీ పనుల్లో భాగం గా స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి కేంద్రం రూ.5కోట్లు కేటాయించింది.అప్పటి రాష్ట్ర భూగర్భ గనులశాఖ మంత్రి సుజయకృష్ణ రంగరావు ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు.ఆ పనులు పూర్తయ్యాయి. అప్పన్నదొర పాలెంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఆ ప్రాంతంలో అవసరమైన 200 ఎకరాల భూములు ఇచ్చిన 178కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నట్లు అధికారులు గుర్తించారు.వీరికి భూమికి భూమి అప్పగిం చేందుకు సమీపంలోనే భూసేకరణ కూడా చేశారు.
వైసీపీ వర్సెస్‌ టీడీపీ
గత టీడీపీ ప్రభుత్వం సేకరించిన స్థలంలో కాకుండా గిరిజన యూనివర్సిటీని వైసీపీ మరో చోటుకు తరలించడంపై టీడీపీ నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాము అధికారం లోకి వస్తే గిరిజన యూనివర్సిటీని మరోచో టుకు మారుస్తామని అంటున్నారు.‘‘గిరిజనుల కోసం నిర్మించే యూనివర్సిటీ గిరిజన ప్రాం తంలో ఉండాలి. కానీ,టీడీపీ ప్రభుత్వం గిరిజ నులతో సంబంధం లేని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రం బాగా సాగుతున్న రెల్లి రెవెన్యూ పరిధిలో దీనిని నిర్మించాలని భావించారు.ఎందుకంటే, ఈ ప్రాంతంలోనే టీడీపీ నాయకులు, మంత్రు లు, వాళ్ల బినామీలు భారీ ఎత్తున రియల్‌ ఎస్టేల్‌ వ్యాపారం చేస్తున్నారు. వారి భూముల విలువ పెంచుకోవడం కోసం గిరిజన యూని వర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నిం చారు. వైసీపీ ప్రభుత్వం రావడంతో వారి ఆటలు సాగలేదు’’అని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర తెలిపారు.కొందరు టీడీపీ నాయకులు వారు అధికారంలోకి వస్తే గిరిజన వర్సిటీని వేరే ప్రాంతానికి మారుస్తామని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సొంత భవనాలు లేకపోవడంతో గిరిజన యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని, ఇప్పుడు శంకుస్థాపన జరుపు కున్న గిరిజన యూనివర్సిటీ ఎప్పటికి పూర్తవు తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని గిరిజన సంఘం నాయకులు అంటున్నారు. ‘‘ఈ పరిస్థితుల్లో వైసీపీ, టీడీపీ లేదా మరో రాజకీయపార్టీ ఒకరిపై ఒకరు పంతాలతో గిరిజన యూనివర్సిటీని పూర్తి కానివ్వకపోతే అది గిరిజనులకు తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది.గిరిజన యూనివర్సిటీని పార్టీలకు అతీతంగా పూర్తి చేయాలని, కేంద్రం కూడా వాటి నిర్మాణాలకు అనుగుణంగా నిధులను జాప్యం చేయకుండా కేటాయించాలి’’అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అయిదో షెడ్యూల్‌ సాధన సమితి గౌరవ అధ్యక్షులు కె.గోవిందరావు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం లోనైనా గిరిజన విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పరిచి గిరిజన విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన విద్యా ఫలాలు అందివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. – (డి.రాము/ఎల్‌.శ్రీనివాస్‌)

గిరిజన గ్రామసభలకు పునరుజ్జీవం ఎప్పుడూ..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభలకు ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయం.గతనెల ఆగస్టు 23న రాష్ట్రంలో13,236గ్రామ పంచాయితీల్లో ఒకరోజు గ్రామసభలు నిర్వహించిన పంచా యితీలకు పునరుజ్జీవం కల్పించింది.అయితే ఆదివాసీ ప్రజలకు భారత రాజ్యాంగం కొన్ని విశేషమైన హక్కులు కల్పించింది.సమత సుప్రీంకోర్టు జడ్జెమెంటు ద్వారా ఆదివాసుల భూమి,అడవి,నీరు, వనరులపై ప్రత్యేకమైన హక్కులు కల్పించబడ్డాయి.అలాగే కొండ,కోనల్లోని ఆదివాసుల సంప్రదాయ గ్రామసభలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ఉద్దేశించిన పంచాయతీరాజ్‌-షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం(పెసాచట్టం-1996)షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చింది.వీటిపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సహజ వనరులనిర్వహణ కోసం గ్రామసభలో చురుకైన ప్రమేయంతో గిరిజన జనాభాను దోపిడీకి గురికాకుండా,స్వయంప్రతిపత్తిని అందించడం ప్రధాన లక్ష్యం.ఆదివాసుల భూమి,అటవీపై వారిహక్కులను పరిరక్షిస్తోంది. సుమారు మూడు దశాబ్దాల క్రితం పెసాచట్టం కోసం దేశవ్యాప్తంగా గిరిజనులు పోరాడారు. ముఖ్యంగా ప్రముఖ విశ్రాంతి ఐఏఎస్‌ అధికారులు స్వర్గీయ బీడీశర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌సింగ్‌ భూరియా వంటి గిరిజనతెగల స్పూరి ్తదాతల సహకారం కూడా మరవలేనిది.
ఈచట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధి కారాలను కల్పించారు.రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు జాబితాలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ,ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌,జార్ఖండ్‌,మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్‌లలోని షెడ్యూలు ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలన్నింటికీ ఈచట్టం వర్తిస్తుంది.ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు.గ్రామసభకు విశేషాధి కారాలను కల్పించారు.ఈపెసాచట్టం ఏర్పడి28ఏళ్లు పూర్తియింది.అయినా సరేనేటికీ చట్టం లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో అమలు పర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.ఆదివాసుల జీవనోపాధుల మెరు గుదల,అటవీ హక్కుల కల్పన,మౌలిక వసతుల అభివృద్ధి తదితర కీలక అంశాల్లో వారికి స్వయం పాలన హక్కులు కల్పించే పీసాచట్టం స్ఫూర్తిని ఇన్నేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా అర్థం చేసుకోలేక పోయాయనే చెప్పాలి.జల,అటవీవనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షించుకునే విధంగా గ్రామ సభలను సుశిక్షితంచేయాలి.
విద్యా,వైద్య కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత ఉంటుంది.అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ,నష్ట పరిహారపంపిణీ,గనుల తవ్వకాలకు అవసరమైన లీజుల మంజూరుకు గ్రామసభల అనుమతి తప్పనిసరి.ఆవాసాల సామాజిక,ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబం ధించిన ప్రణాళికల రూపకల్పనబీ గిరిజనాభివృద్ధి ఉపప్రణాళిక నిధులను ఖర్చు చేసేందుకు తప్ప నిసరిగా గ్రామసభల పాత్ర ఉండాలి.సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు,చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ తదితర విషయాల్లో గ్రామసభలకు పూర్తి అధికారాలు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల కోసం విడుదలయ్యే జమా ఖర్చుల ధ్రువపత్రాలను అధికారులు గ్రామసభల నుంచి తీసు కోవాలి.
పెసాతో సహా ఇతర గిరిజనరక్షణ చట్టాలు,సంబంధిత నిబంధనలపైశిక్షణ,అవగాహన పెంచే బాధ్యత,అమలుతీరును పర్యవేక్షణ బాధ్యతలు ప్రభుత్వంశ్రద్ద తీసుకోవాలి.గ్రామసభల ప్రాముఖ్యతపై ఆదివాసీ ప్రజలకు అవగాహన కల్పించాలి.విశేషాధికారాలున్న పెసా చట్టం నియమ నిబంధనల మేరకు,షెడ్యూల్‌ప్రాంతాల్లో గ్రామసభలు సమర్ధవంతంగా అమలయ్యేలా ఆదివాసులకు హక్కులు కల్పించాలి.వారికి స్వయంపాలన కల్పించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

చిన్నారుల చిదిమేసిన కలుషిత ఆహారం

అనాథాశ్రమంలో ఫుడ్‌పాయిజన్‌.. ముగ్గురు చిన్నారులు మృతి
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పాఠశాల విద్యార్థుల్లో ముగ్గురు మృతి చెందారు. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రయంలో సమోసా తిన్న విద్యార్థులంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులను వెంటనే ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందజేస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం ఉదయం ముగ్గురు చిన్నారు చనిపోయారని తెలిసింది.. మృతి చెందిన విద్యార్థులు భవాని,జాషువా, శ్రద్ధగా గుర్తించారు. మృతులు ముగ్గురు కొయ్యూరు మండలానికి చెందిన వారు. జరిగిన ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. చిన్నారులను వెంటనే ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందజేస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం ఉదయం ముగ్గురు చిన్నారు చనిపోయారని తెలిసింది.. మృతి చెందిన విద్యార్థులు భవాని, జాషువా, శ్రద్ధగా గుర్తించారు. మృతులు ముగ్గురు కొయ్యూరు మండలానికి చెందిన వారు. జరిగిన ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శ.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందు తున్న చిన్నారులను రాష్ట్ర హోం మంత్రి వంగల పూడి అనిత, స్థానిక ఎంపీ శ్రీభరత్‌, ఉత్తర ఎమ్మెల్సీ విష్ణుకుమార్‌ రాజు,తెదేపా జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ,భాజపా నేత మాధవ్‌ ఇతర నేతలు, అధికారు లతో కలిసి పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థి తిని తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారి లో మనోధైర్యం నింపారు.ఆమె వెంట జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌, కేజీహెచ్‌ సూపరెం టెండెంట్‌ కె.శివానంద,ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ ఇతర అధికారులు.అస్వస్థతకుగురైన పిల్లలకు కేజీ హెచ్లో మెరుగైన వైద్యం బాధితులను జిల్లాకలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ పరామర్శించించారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు కేజీహెచ్లో మెరుగై న వైద్యం అందుతోందని, వైద్యులు అన్ని రకాలుగా పర్యవేక్షిస్తున్నారని విశాఖపట్టణం జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం చిన్నారులను కేజీహెచ్‌కు తీసు కురాగా కలెక్టర్‌ వెళ్లి పరామర్శించారు.చిన్నా రులతో,వారి తల్లిదం డ్రులతో మాట్లాడారు. వారి లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. మొ త్తం14మంది పిల్లలు అనకాపల్లి నుంచి వచ్చారని వారందరికీ ప్రస్తుతం పిల్లల వార్డులో వైద్య నిపు ణుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతోం దని పేర్కొన్నారు.అందరి పరిస్థితీ బాగానే ఉందని భయపడాల్సిన పని లేదని అన్నారు.
ఆదమరిస్తే ఆహారమే విషం..
అభం..శుభం తెలియని ముగ్గురు గిరిజన బిడ్డలు కలుషిత ఆహారం తిని ప్రాణాలు పొగొట్టుకున్నారు. మరో 35మందికి పైగా పిల్లలు త్రీవ అస్వస్థతకు గురై ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసప ట్నంలో ఇటీవల జరిగిన ఈవిషాద ఘటన రాష్ట్రం లో కలకలం రేపుతోంది.ఈనేపథ్యంలో సంబంధిత యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.అయితే కేవలం వసతి గృహాల్లోనే కాదు.. నగరంలోని చాలా హోటళ్లు,బేకరీలు,ఇతర ఫాస్టు ఫడ్‌ సెంట్రల్లో కలుషిత ఆహారాలు,తినబండారాలు యధ్ఛేగా విక్రయాలు సాగుతున్నాయి.దీనిపై ఫుడ్‌ సెప్టీ యంత్రాంగం తూతూ మంత్రంగా చోదాలు చేస్తూ చోధ్యం చేస్తోంది.
ఆకలి రుచి ఎరగదు..నిద్ర సుఖమెరగ దంటారు పెద్దలు.మహానగరంలోని సిటిజన్ల ఉరకులు పరు గుల జీవితంలో సమయానికి దొరికింది.ఏది పడితే అదితినేస్తున్నారు.వాటిలో ఫాస్ట్‌ ఫుడ్‌తోపాటు అనేక రకాల ఆహార పదార్ధాలు ఉంటున్నాయి.అయితే కొన్ని ఆహారపు అలవాట్లవల్ల కొన్నిసార్లు అనా రోగ్యం బారిన పడే అవకాశం లేకపోలేదు. శరీరా నికి పడని ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్‌ పాయి జనింగ్‌ అయ్యే ప్రమాదం ఉంది.ఈ క్రమంలో వాంతులు,విరేచనాలు,కడుపునొప్పి,మంట, గ్యాస్ట్రి క్‌ సమస్యలు లాంటివి తలెత్తుతున్నాయి. అంతే కాకుండా కొన్ని సమయాల్లో ప్రాణా పయస్థితికి తీసుకువస్తూన్నాయి.
ఆకర్షణ వెనుక..విషాదం..
నగరంలో నోరూరించే వాసన,ఆకర్షించే రంగులు. ఇంకేముంది చికెన్‌,మటన్‌,చేపలు కనిపిస్తే చాలు లొట్టలేసుకుంటూ తింటాం.బిర్యానీ ప్రేమికులు ఇంకాస్త ఎక్కువగా ఆరగిస్తున్నారు.కానీ హోటల్‌ ల్లో తిన్నపాపానికి పొద్దున్నే ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది.రోజురొజుకూ నగరంలో ఫుడ్‌ పాయిజి నింగ్‌(విషాహారం)కేసులు నమోదువుతూనే ఉన్నా యి. కానీ కొన్ని భయటపడుతున్నాయి. మరి కొన్ని మామూళ్లు చాటును దాగిపోతున్నాయి. హోటళ్ల లో వాడుతున్న నాసిరకం ఆహారం పదార్ధాల ముడి సరుకులు,అపరిశుభ్ర వాతావరణం,సరైన నీళ్లు వాడకపోవడం,ఎక్కువరోజులు నిల్వ ఉంచిన పదార్ధాలు వండటం వంటి కారణాలతో ఫుడ్‌ పాయిజనింగ్‌ కేసులు తీవ్రమవుతున్నాయి.
విషాహారానికి ప్రధాన కారణాలు ఇవే..
ఆహార పదార్ధాలను సరిగా శుభ్రం చేయకుండా వినియోగించడం.సరైన మోతాదులో ఉడికించక పోవడం.మాసాహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం,వాడిన నూనెలు మళ్లీమళ్లీ వినియోగిం చడం,ఆకర్షణకోసం రకరకాలరంగులు వేసి వడ్డిం చడం,బాగాచల్లారిపోయిన పదార్ధాలను వడ్డిం చడం,ఎక్కువ రోజులునిల్వ ఉంచిన చీజ్‌, బటర్‌ లలో బ్యాక్టీరియా ఉండటం,కలుషిత నీళ్లు వాడడం ద్వారా ఎక్కువ బ్యాక్టీరియావచ్చే అవకాశం ఉంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…
మాంసాహారం గానీ,కూరగాయలుగానీ ఎక్కువ సేపు ఉడికించి తినాలి.వీలైనంత వరకూ నిల్వ ఉంచకుండా ఏరోజు ఆహారం ఆరోజే తినాలి.కాచి చల్లార్చిని నీళ్లును తాగడం మంచిది.ఒకసారి వేడిచేసిన నూనెను మళ్లీమళ్లీ వాడకుండా చూసు కోవాలి.ప్రధానంగా మాంసాహారం అప్పటికప్పుడు తినడం మంచిది.పురుగు మందుల వాడకం ఎక్కువైన నేపథ్యంలో ఆకుకూరలుగానీ, కూరగా యలు గానీ వేడినీటిలో ఉప్పువేసి ఆరగంట సేపు నానబెట్టాక వండటం మంచిది.వాంతులు, విరేచ నాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించగానే ఓఆర్‌ఎస్‌(ఓరల్‌ రీ హైడ్రేషన్‌ సొల్యూషన్‌)ఫౌడర్‌ నీళ్లలో కలిపి తాగాలి.కాచి చల్లార్చిన నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం,కొబ్బరినీళ్లు,మజ్జిగ వంటివి తీసుకోవాలి.
నియంణ్ర ఎక్కడా..?
స్ట్రీట్‌ ఫుడ్‌,బీచ్‌ రోడ్డు ఫుడ్‌.. హోటళ్ల లో వండుతున్న ఆహారంపై నియంత్రణే లేదు. ప్రధానంగా మాసాహారం,చికెన్‌,మటన్‌,చేపలు, రొయ్యలు వంటి పదార్ధాలు నాలుగైదు రోజులు కూడా నిల్వ ఉంచి వినియోగదారులకు పెడుతు న్నారు.దీనివల్ల వినియోగదారుడు త్రీవంగా నష్టపో తున్నారు.చిన్నచిన్న బడ్డీకొట్టు అటుంచితే ఓ మోస్తరు మెస్‌లు,రెస్టారెంట్‌లకు కూడా లైసెన్సులు లేని పరిస్థితి.ఏళ్లతరబడి ఇన్‌స్పెక్టర్లు చూసీ చూడ నట్లు వెళుతున్నారు.ఫిర్యాదులు వచ్చినా పట్టించు కోలేదు.ఇక రోడ్లమీద,బీచ్‌లుఎదురుగా అమ్మే ఆహారం కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది.గతేడాది అక్టో బర్‌లో మూలగాఢ గ్రామానికి చెందిన 13మంది యవకులు గాజువాక సమీపంలో ఓహోట్‌లో మండీ బిర్యానీ తిని ఫుడ్‌ పాయిజన్‌కు గురై తీవ్ర అస్వస్థతకు గురైనఘటన అప్పట్లో కలకలం రేపింది.ఎక్కడో ఒకదిక్కున ఫుడ్‌ పాయిజనింగ్‌ కేసులు బయట పడితేనే తప్పా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌,ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూన్నారే తప్పా.క్రమంగా తనిఖీలు చేసిన దాఖలాలు కన్పించలేదనే విమర్శలు వినిపి స్తున్నాయి.
నగర హోటళ్లుల్లో దారుణాలు..
కైలాసపట్నం ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌,ఫుడ్‌ సేఫ్టీ అధికార యంత్రాంగం నగరంలో చేపడుతున్న మెరుపు దాడుల్లో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెలుగు లోకి వచ్చాయి.ఆర్కే బీచ్‌లోని మత్స్యదర్శినివద్ద ఉన్న ఓహోటల్‌లో నాణ్యత లేని ఆహారం విని యోగదారులకు రోజుల తరబడి నిల్వ ఉంచిన బిర్యానీ,చికెన్‌,మటన్‌,చేప కూరలు నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలను వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.డాబాగార్డెన్స్‌ దగ్గర ఉన్న ఓమెస్‌లో చికెన్‌,ఫిష్‌కర్రీతో పాటు వెజ్‌ కర్రీలు కూడా రెండు, మూడు రోజుల కిందట వండి ఫ్రీజర్లు,ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు.అంతేకాదు ముందు రోజు వండిన అన్నాన్ని వినియోగదారు లకువడ్డిం చేందుకు రెడీచేసే సమయంలో తనిఖీలు చేప ట్టారు. ఈపదార్థాలు రంగు,రుచి కోసం కూరల్లో కొన్నిరకాల పౌడర్లను కలుపుతున్నట్లు గుర్తించారు. ఇలా పాడైపోయిన పదార్థాలను విక్రయిస్తున్నం దుకు హోటల్‌కురూ.పది వేలు జరిమానా విధిం చారు.- (జి.ఎ.సునీల్‌ కుమార్‌)

ఉసురు తీస్తున్న ఫార్మా కంపెనీలు

విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో ఇటీవల పేలుడు సంభవించి 17మంది మృతిచెందిన నేపథ్యంలో రాష్ట్రం లోని అత్యధిక ఫార్మా పరిశ్రమలున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ కంపెనీల్లో పనిచేసే కార్మికుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఉమ్మడిజిల్లాలోని చౌటుప్పల్‌,బీబీనగర్‌, భువనగిరి,బొమ్మల రామారం,భూదాన్‌ పోచంపల్లి, త్రిపురారం,మిర్యాలగూడ మండలాల్లో సుమారు 100వరకు ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి.10వరకు భారీ కంపెనీలు ఉండగా..వీటిల్లోనే సుమారు 30వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.మిగిలిని వాటిలో సుమారు 20వేల వరకు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. వేల మందికి ఉపాధి ఇచ్చే కంపెనీల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది.నైపుణ్యం గల కార్మికులు పనిచేయాల్సి ఉండగా..ఉత్తర్‌ప్రదేశ్‌,బీహర్‌, జార్ఖండ్‌ లాంటి తదితర రాష్ట్రాల నుంచి తక్కువ వేతనంతో పనిచేసే వారిని కార్మికు లుగా నియమించుకుంటున్నారు. కంపెనీల్లో పిర్యాదుల చెద్దామంటే స్థానికులకు సంబం ధిత ఫ్యాక్టరీస్‌,పీసీబీ అధికారులు అందు బాటులో ఉండటం లేదు. ఏకంగా జిల్లా ఉన్నతాధికారులు నిర్వహించే సమీక్ష సమావేశాల్లోనూ వీరు పాల్గోనడం లేదు.
ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలే ఉసురు తీస్తు న్నాయి. ఫార్మా కంపెనీల్లోకార్మికులకు రక్షణ కరువు అవుతోంది. యాజమాన్యాలు కార్మికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.దీంతో ఏటా కార్మికులు మృత్యువాత పడుతున్నారు.ఫార్మా కంపెనీల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉండాలి.ఎక్కడా ఆదిశగా చర్యలు చేపట్టడం లేదు.తక్కువ ఖర్చుతో అధిక లాభాలు గడిరచాలనే దురాలో చనతో సబ్‌ కాంట్రాక్టర్లకు పరిశ్రమల నిర్వ హణ అప్పగిస్తున్నారు. సబ్‌ కాంట్రాక్టర్లు నైపుణ్యం లేని వారిని తక్కువ వేతనాలతో నియమించడంతో తరుచు ప్రమాదాలు సంభవి స్తున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. భద్రత గురించి ప్రశ్నించే కార్మికుల్ని యాజమా న్యాలు నిర్ధాక్ష్యణ్యంగా విధుల నుంచి తొలిగి స్తున్నాయి. దీంతో కార్మికులు భయపడి బిక్కుబిక్కుమంటు ఉద్యోగాలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఫార్మా కంపెనీలు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై చూపడంలేదనేది బహిరంగ రహస్యం. కార్మికులకు భద్రతా పరికరాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఫ్యాక్టరీ ఇన్స్‌పెక్టర్లు, కార్మిక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి లోపాలను సరిచేయాల్సి ఉన్నప్ప టికీ ఫార్మా కంపెనీల్లో ఇదంతా మొక్కుబడి తంతుగా మారుతోంది.
కంట్రోల్‌ కాని రియాక్టర్లు
ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లలో హై టెం పరేచ్‌లో ద్రవకాలను మరిగించాల్సి ఉం టుంది. నిపుణులైన ఉద్యోగులు లేకపోవడం వల్ల తరుచు ప్రమాదాలు సంభవిస్తున్నాయనే ఆరోణపణలు ఉన్నాయి. రియాక్టర్లు పేలిన ప్పుడు కంట్రోల్‌ చేయాలంటే నిపుణులు ఉం డాలి అత్యధిక శాతం కంపెనీల్లో అరకొర నాలెడ్జి ఉన్న వారే ఉండటంతో ప్రమాద సమయాల్లో రియాక్టర్లను కంట్రోల్‌ చేయడం కష్టంగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.పైప్‌లైన్‌ లీకేజీ కార ణంగా పలు సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వ్యర్థ రసాయనాలు వెళ్ళే పైల్‌లైన్‌ సక్రమంగా ఉండేలా చూసుకోవా ల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యాలతో పాటు అధికారులు పర్యవేక్షించాలి. వ్యర్థ రసాయనాలను శుద్ధి చ?టటసి పైల్‌లైన్‌ గుండా బయటకు పంపాల్సి ఉన్నప్పటికీ పలు కంపెనీలు ఈదిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది.అనకాపల్లి జిల్లా అచ్యుతా పురం సెజ్‌ లోని సాహితీ ల్యాబ్‌ లో రియా క్టర్‌ భారీ పేలుడు కారణంగా ఇద్దరు కార్మి కులు అక్కడికక్కడే మృత్యువాత పడగా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.ల్యాబ్‌ లో కెమికల్స్‌ మరిగించే క్రమంలో వ్యాపిం చిన మంటలే ప్రమాదానికి కారణంగా -గునపర్తి సైమన్‌

తెలుగు రాష్ట్రాల్లో వరదల విలయం.

ఊహకందని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి.ఇటు ఏపీలో బుడమేరు విజయవాడ,అటు తెలం గాణలో మున్నేరు ఖమ్మం ముంపు ప్రాంతాల వాసులను కోలుకోలేని దెబ్బ తీసింది.బుడమేరు ఉప్పొంగి ప్రవహించడంతో సింగ్‌నగర్‌ జలదిగ్బంధంలో చిక్కుకుంది.నిద్ర లేచేసరికి తరుముకొచ్చిన వరద..పుట్టెడు శోకాన్ని మిగి ల్చింది.కొందరు ఇళ్లపైకి ఎక్కి, సాయంకోసం హాహాకారాలు చేస్తున్నారు. మరికొందరు బంధువుల గృహాలు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. మున్నేరు శాంతించిన తర్వాత స్వగృ హాలకు చేరుకుని,ఆనవాళ్లు కోల్పోయిన ఇళ్లు,రూపరేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరుమున్నీర వుతున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని పలువురు బాధితులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వర్షాలు కాస్త తగ్గినా వరద ప్రభావం మాత్రం తగ్గలేదు.పలు ప్రాంతాలు ఇంకా నీటిలో చిక్కుకుని ఉన్నాయి. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసా గుతున్నాయి.విజయవాడ, ఖమ్మం,మహబూబాబాద్‌ ప్రాంతాల్లో వరద తీవ్రత చాలా ఎక్కువగా కనిపిం చింది.ఎటూ చూసినా రోడ్లపై పొంగుతున్న వాగులు, బురద ముంచెత్తిన నివాసాలు,అనేక గ్రామాల్లో కుప్ప కూలిన ఇళ్లు..కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన బతుకులు..వరద నీటి నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతున్న బస్తీలు.. కాలనీలు.. పొలాల్లో మట్టి,ఇసుక మేటలు..ఛిద్రమైన రహదారులు.. మృత్యువాత పడిన పశువులే కన్పిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జనజీవనానికి ఆటంకంగా మారాయి.అటు ఆంధ్రప్రదేశ్‌,ఇటు తెలంగాణలో వానలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.ఏర్లు,నదులకు భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.బుడమేరు వరద ఉధృతితో విజయ వాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది.భారీ వర్షాలు..వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు జనజీవనం కకావికలమైంది.ఏపీలో బుడమేరు వరద నుంచి విజయవాడ తేరుకోక ముందే.. కృష్ణా నదికి వరద పొటెత్తింది.తెలంగానలో కురిసిన భారీవర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజీ వద్ద11.43లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది.ఉమ్మడి గుంటూరు,కృష్ణా జిల్లాలో కృష్ణానది ఇరువైపులా లంక గ్రామాలు జల దిగ్బందంలోకి చేరాయి.అక్కడి ప్రజలను అధికారులు హూటాహుటిన ఖాళీచేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు.గుం టూరు జిల్లా పరిధిలో 18లంకగ్రామాలకు రాకపోకలు నిలిచాయి.విద్యుత్తు సరఫరా స్తంభించింది.మహిళలు,గర్భిణులు,వృద్దులు సహా వైద్యసాయం అవసరమైన వారిని పడవల్లో తరలించారు.రెండు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు నీటి మునిగాయి.ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలవల్ల మొత్తం19మంది మరణించినట్లు అధికారిక సమాచారం.వీరిలోఎన్టీఆర్‌ జిల్లాలో ఎనిమిదిమంది మరణించగా,గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిగిలిన వారు మరణిం చారు.తెలంగాణలో వరదలవల్ల ఇప్పటి వరకు 9మంది మరణించినట్లు అధికారిక సమా చారం.విజయవాడ నగరం వరుసగా రెండో రోజు కూడా నీటిలోనే ఉంది.బుడమేరు వరద ఈనగరాన్ని అతలాకుతలం చేసింది. నగరం లోని చాలాకాలనీల్లో ఒకఅడుగు నుంచి నాలుగు అడుగుల వరకు నీరునిలిచి పోయిం ది.అనేక ప్రభుత్వ శాఖలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.సింగ్‌ నగర్‌ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. పలుచోట్ల ఆహారం,ఇతర అత్యవసర పదార్థాలను బోట్లు,ట్రాక్టర్ల ద్వారా సిబ్బంది అందిస్తున్నారు.చాలా మంది ఆవాన నీటిలోనే నానుతూ,వరదప్రభావం లేనిప్రాం తాల్లోని తమకు తెలిసిన వారిఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేశారు.కృష్ణా,గుంటూరు జిల్లాల్లోని పలు ప్రదేశాల్లో ప్రవాహంలో ఇరుక్కున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి.కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో కూడా వరద,వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపించింది.రాయల సీమలో వరద ప్రభావం కాస్త తక్కువగా ఉంది.
నేనున్నాననే..భరోసా..
వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాలి లోతు నీటిలో ఏపీసీఎం నారా చంద్రబాబునాయుడు ముంపు ప్రాంతాలు,పునరవాస కేంద్రాలు పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. సహాయక కార్యక్రమాలు స్వయంగా పర్య వేక్షిస్తున్నారు.బుల్‌డోజర్‌,బందరు పోర్టు నుంచి తెప్పించిన భారీ యంత్రంపై ఎక్కి,వరదలో పర్యటించారు.తనకు కొద్దిగా సమయం ఇవ్వాలని,పరిస్థితులు చక్కదిద్దుతామని బాధితులకు విజ్ఞప్తి చేశారు.ప్రతి డివిజన్‌కు ఓఐఏఎస్‌ అధికారిని ఇన్‌చార్జిగా నియ మించారు.మంత్రులందరూ విజయవాడలోనే మకం వేసి పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేశారు.ఆహారం,మంచినీటి సరఫరాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడు తున్నారు.ప్రాణనష్టం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు అందిన వేంటనే సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు.దాదాపు 10వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు.ఆక్షయ పాత్రసంస్థ ద్వారా లక్షమందికి ఆహారం అందించారు.హోటల్స్‌ అసోసియేషన్‌ వారు మరో లక్షమందికి భోజనాలు సమకూర్చారు. పవర్‌బోట్లు పలు ప్రాంతాల్లో తిరుగుతూ బాధి తులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు.
పంట నష్టం
కరకట్ట లోపల వ్యవసాయం,ఉద్యాన పంటలన్నీ కృష్ణార్పణమయ్యాయి.ఒక్కటి చేతికొచ్చే పరిస్థితి లేదు.అరటి,కంద,పసుపు,చామ,కూరగాయ పంటలన్నీ నీటమునిగాయి.ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణయ్య కరకట్ట అంచులను తాకుతూ ప్రవహిస్తోంది.తెనాలి,రేపల్లి నియోజ కవర్గాల్లో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతా లో మట్టి,ఇసుక బస్తాలు వేసి,ఎత్తు పెంచి నీరు పొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
వీడని వరద..
బుడమేరు ఉధృతికి నీట మునిగిన సింగ్‌నగర్‌ ప్రాంతంలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. ఐదారు అడుగుల ఎత్తున నీరు నిలవడంతో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు. పడవ లు ఏర్పాటు చేసి కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించినా,అధికశాతం మంది ఇంకా పైఅంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తు న్నారు.ప్రధాన రహదారుల వెంబడి ఉన్న వారికి ఆహారం,తాగునీరు అందుతున్నా,లోపలి ప్రాంతాల్లోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.బయటకు రావాలంటే పడవలు కూడా లేవు.విద్యుత్తు లేదు.తాగునీరు నిండుకుందన వాపోతున్నారు.
డ్రోన్ల ద్వారా ఆహారం,తాగునీరు..
బాధితుల్లో ఎక్కువ మందికి సురక్షితంగా ఆహారాన్ని అందించేందుకు డ్రోన్లను వినియోగించారు.మునిగిన ప్రాంతాలు,బహుళ అంతస్తుల భవనాలపైకి డ్రోన్ల ద్వారా ఆహార పొట్టాలు పంపించారు.పెట్టుబడులు,మౌళిక వసతులశాఖ కార్యదర్శి సురేష్‌కుమార్‌ ఈ డ్రోన్‌ పని విధానాన్ని ఎన్జీఆర్‌ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబుకు ప్రయోగాత్మకంగా చూపించారు.డ్రోన్ల్‌ ద్వారా 8`10కిలోల బరువున ఆహారం,మందులు,తాగునీటిని సరఫరా చేయొచ్చని సూచించారు.దీంతో వీలైనన్ని ఫుడ్‌ డెవవరీ డ్రోన్లను సిద్దం చేసుకుని లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన బాధితు లకు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.ఆ వెంటనే సింగ్‌నగర్‌, గొల్లపూడిలోని బాధితులకు ఆహార పొట్లాలు, తాగునీటి ప్యాకెట్లును అధికారులు సరఫరా చేశారు.ఈ ప్రయోగం విజయవంతం కావ డంతో మున్ముందు మరిన్ని చోట్ల వినియో గించాలని అనుకుంటున్నారు.
కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి..
వరద సహాయక చర్యలపై మంత్రి లోకేష్‌ విజయవాడలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి నిరంతరం సమీక్షించారు.వరద సహాయక చర్యల్లో పెద్దఎత్తున పాల్గొన్నాలని తేదేపా శ్రేణులకు పిలుపు నిచ్చారు.ముంపు ప్రాంతాల్లో హెలీకాప్టర్ల ద్వారా 7,220కిలోల ఆహారం,తాగునీరు మందులు జారవిడి చారు.వరద ప్రాంతాల్లోని ప్రజలకు పండ్లు సరఫరాకు మార్కెట్‌ంగ్‌శాఖ చర్యలు చేప ట్టింది.1.10లక్షల యాపిల్స్‌,90వేల అరటి పండ్లు సేకరించి ముంపు ప్రాంతాలకు పంపారు.రానున్న రెండు రోజుల్లో 2.5లక్షల అరటి పండ్లను పంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కన్నీటి విపత్తు!
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 మంది మృతి చెందారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 9 మంది మృత్యువాత పడగా, గుంటూరు జిల్లాలో ఏడుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు మరణించారు.విజయవాడ మొగల్రాజుపురంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు, విజయవాడ రూరల్‌, జీ కొండూరు, రెడ్డిగూడెం, పైడూరుపాడులో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.గుంటూరు జిల్లా.. పెదకాకాని మండలంలో ఇద్దరు సహా ఒక టీచర్‌, ఇద్దరు విద్యార్థులు కారులో కొట్టుకుపోయి మృతి చెందారు. ఒక యువ కుడు కొండవీటివాగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. మంగళగిరిలో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు.ప్రకాశం జిల్లాలో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. గుంటూరు-నందివెలుగు రోడ్డులో వరదనీటిలో గుర్తుతెలియనివ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు.విజయవాడలో 275 రైళ్లు రద్దు అయ్యాయి.149 రైళ్లను దారి మళ్లించారు.
4.68 లక్షల ఎకరాల్లో పంట మునక
వర్షాలు, వరదలకారణంగా 4,31,355 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 37,397 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు.3,18,220 ఎకరాల్లో వరి, 64,782ఎకరాల్లో పత్తి, 28,085 ఎకరాల్లో మొక్కజొన్న,6,477 ఎకరాల్లో మినుము,6,167ఎకరాల్లో కంది, 2,610 ఎకరాల్లో పెసర,1,945 ఎకరాల్లో వేరుశనగ,5,012ఎకరాల్లో ఇతర పంటలు ముంపుబారిన పడ్డాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.ప్రాథమిక అంచనా ప్రకారం 20జిల్లాల్లో 365 మండలాలు వర్షాలు, వరదల ప్రభావానికి గురి కాగా, 2,475 గ్రామాల్లో 2లక్షల మంది రైతులకు నష్టం జరిగినట్లు భావిస్తున్నామని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
జల దిగ్బంధం..
తెలంగాణలో వరద తీవ్రంగా ఉంది. మహబూబాబాద్‌, ఖమ్మం పరిసరాల్లో అనేక జనావాసాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఖమ్మం నగరానికి, మహబూబాబాద్‌ పట్టణా నికిచాలా వైపుల నుంచి రాకపోకలు ఆగిపో యాయి.మున్నేరు వాగు వరదతో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలు ప్రభావితం అయ్యాయి. పాలేరు దగ్గర ఒక కుటుంబం వరదల్లో చిక్కుకుపోయింది. యంత్రాంగం ప్రయత్నించినప్పటికీ వారిని కాపాడలేక పోయారు.ఖమ్మం పరిధిలోని భక్తరామదాసు ఎత్తిపోతల పథకంపంపు హౌసులు మునిగి పోయాయి.నల్లగొండ, సూర్యాపేట, మహ బూబ్‌నగర్‌, కొత్తగూడెం జిల్లాలపై కూడా వరద ప్రభావం ఎక్కువగా కనిపించింది. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల వరద, వర్షం ప్రభావంతో జన జీవనానికి ఇబ్బంది కలిగింది.చాలాచోట్ల కాలనీలు,బస్తీలు,ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు నీట మునిగాయి.అనేక చోట్ల హాస్టళ్లు జలదిగ్బంధమైపోవడంతో,ఆనీటిలో నుంచే విద్యార్థులు సామాన్లతో బయటకు వచ్చేశారు.తెలంగాణ ప్రభుత్వం సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. పాలేరులో వరదలో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని కాపాడలేక పోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.అన్ని ప్రయత్నాలూ చేసినప్పటికీ వాతావరణం అనుకూలించక రక్షించుకోలేక పోయినట్టు చెప్పిన ఆయన, ఆ ఘటనను గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వర్షాలపై సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్టుగా ఉండాలి. కలెక్టరేట్లలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలి.వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ.4లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నాం.ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలి. ఈ వరద లను జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకో వాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాస్తాం. ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాలకు తక్షణ సాయంగా రూ.5కోట్ల చొప్పున ఇస్తాం’’ అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.
లక్షల ఎకరాల్లో పంట నష్టం
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ,హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడారు. తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్ర బృందాలకు సహాయంగా కేంద్ర బృందాలను పంపమని ఆదేశాలు జారీచేశారు.ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రెండు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరినాట్లు వేసిన సమయం కావడంతో ఆరైతులు బాగా నష్టపోయారు.ఇతర వాణిజ్యపంటలకూ పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. ఇక అరటి వంటి పండ్ల తోటలు, కూరగాయల పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి.
200 గేదెలు కొట్టుకుపోయాయి
చెరువులు, వాగులకు గండ్లు పడిన చోట పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కట్ట తెగిన చోట ప్రవాహ ఉధృతికి భవనాలు కొట్టుకుపోయాయి.ముందు జాగ్రత్త చర్యగా బడులకు సెలవులు ప్రకటించారు.చాలా చోట్ల ఇళ్ల డాబాలపైకి ఎక్కి కూర్చుని సమయం గడిపారు ముంపు బాధితులు.గుంటూరు జిల్లా తుళ్లూరు దగ్గర 200 గేదెలు కొట్టుకు పోయాయి. పలు చోట్ల లంక గ్రామాల్లో బాధి తులను కాపాడారు సహాయ సిబ్బంది.కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.విజయవాడలో సహాయ చర్యల్లో హెలికాప్టర్లు వాడనున్నట్టు విపత్తు శాఖ ప్రకటించింది.ఇవాళ, రేపు కూడా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
కొట్టుకుపోయిన రోడ్లు, ధ్వంసమైన రైల్వే ట్రాకులు
భారీ వర్షానికి రవాణా వ్యవస్థ కూడా స్తంభిం చింది.ముఖ్యంగా విజయవాడ,ఉత్తర దక్షిణ భారతాలను కలిపే ప్రధాన నగరం కావడంతో ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.పలుచోట్ల హైవేలపై నీరు రావడంతో ట్రాఫిక్‌ ఆగిపో యింది.కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఇక రైల్వే ట్రాకుపై నీరు చేరడంతో,పెద్ద ఎత్తున రైళ్ల మళ్లింపుతో పాటు కొన్ని రైళ్లు రద్ద య్యాయి.వరంగల్‌ దగ్గర్లోని కేసముద్రం దగ్గర ట్రాక్‌ కింద ఉన్న నిర్మాణం మొత్తం కొట్టుకు పోయింది.అనేక చోట్ల వంతెనలపై నీరు పొంగి ప్రవహించింది.తాళ్లు, క్రేన్లు, ప్రోక్లెయినర్ల సహాయంతో ప్రజలు, నీరున్న ప్రదేశాలను దాటాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.విజయవాడ -హైదరాబాద్‌ హైవేపై కూడా రాకపోకలకు ఆటంకం ఏర్పడిరది.పలుచోట్ల రైలు ప్రయాణి కులను బస్సుల్లో తరలించారు.విజయవాడ శివార్లలో రైలు ప్రయాణికులను స్టేషన్‌ బయటకు తీసుకురావడం కూడా కష్టమైంది. రైళ్లు నిలిచిపోయినచోట ఆహార పదార్థాలు అందించారు.వందకు పైగా రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. రెండు రాష్ట్రాల ఆర్టీసీలూ పెద్ద ఎత్తున బస్సులను ఆపివేశాయి.
తెలంగాణలో వర్ష బీభత్సం: ఉప్పొంగిన మున్నేరు, రైళ్లు రద్దు
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.జనజీవనం స్తంభించింది.రోడ్లు కొట్టుకుపోయి ఏపి, తెలంగాణ మధ్య రాకపోక లకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది.పలుచోట్ల రైల్వే ట్రాక్‌లకు నష్టం కలగడంతో అధికారులు రైళ్లను దారిమళ్లించారు.భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 9మంది చనిపోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ తెలిపారు.ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి హెలికాప్టర్‌ను రప్పిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త పరిస్థితులపై సీఎం రేవంత్‌ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు.పునరావాస,రక్షణ చర్యలపై సీనియర్‌ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి సూచనలు చేశారు.రెవెన్యూ, పోలీస్‌, పంచాయతిరాజ్‌,వైద్య ఆరోగ్యశాఖ వంటి అత్యవసర శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేసి రంగంలోకి దించాలని, జిల్లాల్లో ఎప్పటి కప్పుడు పరిస్థితులను సమీక్షించి చర్యలు తీసు కోవాలని టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను ఆదేశిం చారు సీఎం.ఎంపీ,ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.
జలదిగ్బంధంలో ఖమ్మం,మహబూబాబాద్‌
భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం,వరంగల్‌ జిల్లాలపై పడిరది.ఖమ్మం పట్టణంలో మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రకాశ్‌ నగర్‌ వద్ద మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహబూ బాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూ సపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో వరద ప్రవా హానికి రైల్వే పట్టాలకింద కంకర కొట్టుకు పోయింది.ట్రాక్‌ దెబ్బతినడంతో ఆరూట్‌లో రైళ్ల ను నిలిపివేశారు.మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో నిలిపివేసిన మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ ప్రయా ణీకులకు స్వచ్ఛంద సంస్థలు,పోలీసులు ఆహారపదార్ధాలు,నీరు అందించారు. ప్రస్తుతం ట్రాక్‌ పునరుద్ధరణ పనులు సాగుతు న్నాయి. ఏపీ, తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ సికింద్రా బాద్‌ రైల్‌ నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వరద నీటిలో ఖమ్మం పట్టణం..
ఖమ్మం పట్టణాన్ని ఊహించని వరద చుట్టు ముట్టింది.మున్నేరు నది ఉధృతంగా పారు తోంది. ప్రస్తుతం 27.5అడుగుల ఎత్తులో మున్నేరు ప్రవహిస్తోంది.దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.పట్టణంలోని సగం కాలనీలు నీట మునిగాయి.ప్రకాశ్‌నగర్‌ ప్రాం తం జలదిగ్బంధంలో ఉంది. ప్రకాశ్‌ నగర్‌ బ్రిడ్జిపై తొమ్మిది మంది ఉదయం నుండి చిక్కుకుపోయారు.వారిని రక్షించేందుకు హెలి కాప్టర్‌ను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చీకటి పడటంలో బ్రిడ్జిపైన చిక్కుకున్న వారి భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ‘‘ఖమ్మం పట్టణం గతంలో ఎన్నడూ చూడని వరద ఇది.సగం కాలనీలు మునిగిపోయాయి. నీరు చేరని ప్రదేశం అంటూ లేదు. పట్టణం నడిబొడ్డున 5అడుగుల నీరు ప్రవహిస్తోంది. వరద అంచనా,సహాయక చర్యల్లో అధికారులు విఫలం అయ్యారు. జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్నా సమయానికి హెలికాప్టర్‌ను రప్పించ లేకపోయారు’’అని తన వివరాలు వెల్లడిరచడానికి ఇష్టపడని చెప్పారు.‘‘మున్నే రుకు ప్రొటెక్షన్‌వాల్‌ నిర్మాణ పనులు నత్తనడక కొనసాగుతున్నాయి.నాలాల కబ్జా, మున్నేరు వరద ఒత్తిడితో నీరు బయటికి పోవడం లేదు.’’ అని ఆయన అన్నారు.
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పరిస్థితి
మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది.నెక్కొండ మండలం వెంకటాపురం సమీపంలో40 మంది ప్రయాణీ కులతో ఉన్న ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకు పోగా,అధికారులు వారిని సురక్షితంగా బయ టకు తీసుకువచ్చారు.రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు.మరోవైపు భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి భారీ వరద చేరు తోంది.మేడిగడ్డ బరాజ్‌ కు 1.57లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది.శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ లు 53వేల ఇన్‌ ఫ్లో వస్తుండగా ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలకు గాను 63టీఎంసీలకు నిల్వ చేరింది.– (గునపర్తి సైమన్‌)

1 2