ప్రకృతి విలయంలో వాయనాడ్
జూలై 30..అర్ధరాత్రి..కేరళలోని వయనాడ్ జిల్లా ముండక్కె గ్రామంలో భారీ శబ్దానికి సేల్స్‌మెన్ అజయ్‌ఘోష్ ఉలిక్కిపడి లేచారు. ఆ భారీ శబ్దం ఏమిటనేది వారికి కొంతసేపు అర్థం కాలేదు.కాసేపటి తరువాత భారీవర్షంతో పాటు పెద్ద ఎత్తున బురద ప్రవాహం మొద లైంది.వయనాడ్ జిల్లాలోని ముండక్కె, చూర ల్మలైతోపాటు నిలంబుర్ మలప్పు రం జిల్లాలోని నీలాంబుర్ అటవీప్రాంతంలో కొండ చరియలు విరిగిపడటంతో సుమారు 308 మంది మృతి చని పోయారు. ఇంకా కొందరి ఆచూకీ తెలి యాల్సి ఉంది. అర్ధరాత్రి 2గంటల నుంచి తెల్ల వారు జామున 4గంటల మధ్యన రెండు సార్లు కొండ చరియలు భారీగా విరిగి పడ్డాయి.ఇవి ఏస్థాయిలో పడ్డాయంటే 90కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్ల ప్పురం జిల్లాలోని అటవీ ప్రాం తం కూడా దీని ప్రభావానికి లోనైంది.ఈప్రాం తాలన్నింటినీ సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా మాధవ్ గాడ్గిల్ నివేదికలో పేర్కొన్నారు. ఆనివేదిక పశ్చిమ కనుమల పర్యావర ణానికి సంబంధించినది.అత్యంత సున్నితమైనవి, తక్కువ సున్నితనమైనవి,అంతగా సున్నితం కాని ప్రాంతాల సమాచారాన్ని ఆ నివేదిక తెలియజేస్తుంది.ఈ నివేదికను అన్ని రాజకీయ పక్షాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వా లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇటీవలి కాలంలో ఈ ప్రాంతాలలో మొక్కల పెంపకమే కాకుండా మరికొన్ని ఇతర కార్యకలాపాలకు కూడా కేరళ ప్రభుత్వం అనుమతిచ్చింది….
కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటుచేసుకున్న ప్రకృతి విలయం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తరు వాత సంభవించిన ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. బుధవారం మధ్యా హ్నానికి 160కి పైగా మృత దేహాలను వెలికి తీశారు. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుండపోత వర్షం కారణంగా ఒకటికి, రెండుసార్లు భారీ కొండ చరి యలు విరిగిపడటంతో వయనాడ్ జిల్లా మొత్తం పెను విపత్తులో చిక్కుకుంది. మెప్పాడి పంచాయతీ పరిధిలోని ముండకై, అట్టామల, నూల్‌పూజా గ్రామాలతో పాటు, చూరాలమల పట్టణంలోనూ బీభత్స దృశ్యాలు చోటుచేసుకు న్నాయి.నివాస స్థలాలు ఉండాల్సిన చోట బురద మట్టి దిబ్బలు కనపడుతున్నాయి. ముండకై గ్రామం స్థానంలో మట్టి,బురద,రాళ్లు నేలకూలిన చెట్లతో నిండిన నది ప్రవహిస్తోం దంటూ వస్తున్న వార్తలు పరిస్థితి తీవ్రతను తెలియచేస్తాయి.ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడానికి వచ్చిన రెస్క్యూ టీమ్ బుధవారం మధ్యాహ్నం వరకు ఆగ్రామం లో అడుగు పెట్టలేకపోయింది.మరో వైపు సం ఘటన స్థలానికి కిలోమీటరు దూరంలో ఉన్న చలియార్ నదిలో ఛిద్రమైన మృత దేహాలు కొట్టుకువస్తూనే ఉన్నాయి. సంఘటన స్థలంలో కన్నా, ఈ నదిలోనే ఎక్కువ మృత దేహాలను రక్షణ సిబ్బంది వెలికి తీస్తున్నారు.
కేరళకు ప్రకృతి విపత్తులు కొత్తేమీ కాదు.కానీ, వయనాడ్‌లో చోటుచేసుకున్నది ఆ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద విపత్తులలో ఒకటి. కొండచరియలు విరిగి నదిలో పడటంతో రెండిరతలైన బురద మట్టి ప్రవాహం ఊళ్లకి ఉళ్లు ముంచెత్తింది. కిలోమీటర్ల పొడవునా, కొన్ని అడుగుల మేర ఎక్కడ చూసినా బురద మట్టే కనపడుతోంది.ఇళ్లు,ఆస్పత్రులు,బడులు, ప్రార్థనాలయాలు అన్నీ ఆ మట్టి కిందే. దీంతో సహాయ చర్యలు ఎక్కడి నుండి ప్రారం భించాలో కూడా రెస్క్యూ సిబ్బందికి అర్ధం కాని పరిస్థితి ఏర్పడిరదంటే ఏస్థాయిలో విపత్తు చోటుచేసుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న పుత్తమలలో 2019లో కొండచరియలు విరిగిపడి 17 మంది మరణించారు.60 మంది మృతి చెందిన కవలపర కూడా దగ్గరలోనే ఉంది.2020లో కూడా ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడ్డాయి. తాజాగా ఈఅన్ని ప్రాంతాల్లోనూ గత ఆదివారం నుండి భారీ వర్షం కురుస్తోంది. 2019 ఆగస్టు 8న నమోదైన వర్షపాతానికి దగ్గరగా ఈ వర్షం ఉంది.మృత్యు రక్కసి విరుచుకుపడిన ప్రాంతంలో 48గంటల్లో 572 మి.మీ వర్షపాతం నమోదైంది.ఈస్థాయి వర్ష పాతం వయనాడ్ జిల్లా కనీవిని ఎరుగదు. భారత వాతావరణ పరిశోధన సంస్థ (ఐఎండి) కూడా ఈ వర్ష బీభత్సాన్ని అంచనా వేయ లేకపోయింది. అరేబియా సముద్రపు ఉష్ణోగ్ర తలు భారీగా పెరగడం కూడా ఉత్పాతానికి కారణంగా చెబుతున్నారు.
ఇంత భయానక పరిస్థితుల్లోనూ స్థానిక ప్రజానీకం కదులుతోంది.ముండకై గ్రామంలో తొలివిడత విధ్వంసం తరువాత పరిసర ప్రాం తాల్లోని ప్రజానీకం పెద్దఎత్తున సహాయ చర్య లు చేపట్టారు.ఆపనులు జరుగుతుండగానే, రెండవసారి కొండ చరియలు విరుచుకుపడి సర్వస్వాన్ని భూస్థాపితం చేశాయి.అయినా, స్థానికులు వెరవలేదు. రెస్క్యూ బృందాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది.దాదాపు 50సహాయ శిబిరాలను ఏర్పా టు చేసింది. పలువురు మంత్రులు సంఘ టనా స్థలానికి చేరుకున్నారు.ముఖ్యమంత్రి పినరయి విజయన్‌నిరంతరంగా సహాయ చర్యలను పర్య వేక్షిస్తున్నారు.2018 వరదలు,కోవిడ్ సంక్షో భాన్ని ఎదుర్కున్న అనుభవంతో యంత్రాంగా నికి దిశా నిర్దేశం చేస్తున్నారు.ఈ ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ఉదారంగా ఆదుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.ఈదిశలో తక్షణం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేంద్రం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలనైతే పంపింది కానీ,కేరళ ప్రభు త్వంపై హోంమంత్రి నిందా పూర్వక వ్యాఖ్యలు చేయడం తగని పని.బాధిత ప్రజానీకాన్ని ఆదు కోవడంపైనే అందరూ సర్వశక్తులను ఒడ్డి, సహకారం సమకూర్చి, ప్రకృతి విలయంలో చిక్కుకున్న వారిని ఒడ్డున పడేయాలి.
51 సార్లు విరిగిపడ్డ కొండచరియలు
వయనాడ్ జిల్లాలోని ఈ కొండప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం మామూలే. ఇందుకు సంబంధించిన సమాచారం గాడ్గిల్ నివేదికలో కూడా ఉంది.చూరల్మలై ముండక్కెకు 10 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో 2019లో 17మంది మరణించారు.రాతి తవ్వకాలే కొండచరియలు విరిగిపడటానికి కారణమని కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (కేఎఫ్‌ఆర్‌ఐ) పేర్కొంది.2018,2019 సంవత్స రాలలో 51సార్లు కొండచరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో పుతుమాల, నిలాం బర్‌లో 34సెంటిమీటర్ల వర్షం కురిసింది.కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని అడ్వాన్స్ డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరక్టర్ అభిలాష్ ఎస్.బీబీసీతో మాట్లాడుతూ..‘గత రెండువారాలుగా కురిసిన భారీ వర్షాల తరువాత, ఈ మంగళవారం మరోసారి అత్యంత భారీ వర్షం కురిసింది. దానిని మీరు ప్రధాన కారణంగా పరిగణిం చక్కరలేదు కానీ, కచ్చితంగా అదో పెద్ద కారణమే’’ అని చెప్పారు.
పర్యాటకం పెరిగింది.
కేరళ అటవీ పరిశోధనా సంస్థ (కేఎప్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్త డాక్టర్ టీవీ సంజీవ్ మ్యాప్‌ల సహా యంతో చూరల్మలై నుంచి 4.65 కిలోమీ టర్లు, ముందక్కె నుంచి 5.9కిలోమీటర్ల దూరంలో మైనింగ్ జరుగుతోందని చెప్పారు. ‘‘గనులలో పేలుళ్ళు ప్రకంపనలు పుట్టిస్తాయి. దాని ప్రభావం గ్రానైట్ ద్వారా చాలా దూరం వ్యాపిస్తుంది. ఈ మొత్తం ప్రాంతం చాలా పెళుసైనది. ఈ ప్రాంతంలో సాధారణంగా కనిపిం చేది వృక్షసంపద. అంటే చెట్లు, మొక్కలు’’ అని తెలిపారు.‘‘తోటల పెంపకానికి అనుమతించిన ప్రాంతాలలో కొంత భాగాన్ని ఇతర కార్యకలా పాలకు వినియోగించవచ్చని ఇటీవల ఓ కొత్త చట్టం తీసుకువచ్చారు. దీని ఫలితంగా ప్లాంటే షన్ యజమానులు పర్యాటక రంగంవైపు దృష్టి సారించారు. తదనుగుణంగా ఇక్కడ పెద్ద భవంతులు కట్టడం మొదలుపెట్టారు. ఇందు కోసం నేలను చదును చేయాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.నాలుగేళ్ల కిందట వయనాడ్‌లో 20కు పైగా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని 25,000 మంది విదేశీ పర్యాటకులు, 1,00,000 మంది స్వదేశీ పర్యాటకులు వస్తుం టారని నాలుగేళ్ళ కిందట ఆ సంస్థ తమ నివేది కలలో ఒకదానిలో పేర్కొంది.‘‘సున్నితమైన భూభాగాలను ఎలా చూడాలనే విషయాన్ని పేర్కొన్న గాడ్గిల్ నివేదికను తిరగేయడం మాకు చాలా ముఖ్యం. ఆ నివేదికలో అత్యంత సున్ని తమైన ప్రాంతాలు, సాధారణ సున్నితమైన ప్రాంతాలు, తక్కువ సున్నితమైన ప్రాంతాల గురించి తెలిపారు.కానీ మొత్తం రాజకీయ పక్షాలన్నీ వీటిని వ్యతిరేకించడం విషాదం’’అని డాక్టర్ సంజీవ్ చెప్పారు.‘‘ఇక్కడి భూమి చాలా బలహీనంగా ఉండటంవల్ల ఈ సమస్య ముందుముందు మరింత పెరుగుతుంది. ఇక్కడ లోతైన లోయలు ఉన్నాయి. భారీవర్షాలను తట్టుకోలేనంత పెళుసుగా ఇక్కడి భూమి మారింది. దీనిని పరిష్కరించుకోవాలంటే అసలు మన పర్యావరణ వ్యవస్థ నిజంగా ఆరోగ్యకరంగా ఉందో లేదో నిర్థరించుకోవాలి. ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే..అప్పుడు ఎటువంటి వాతావరణ మార్పులైనా ఎదుర్కో గలదు’’ అని తెలిపారు.
కొండ ప్రాంతాలే ఎక్కువ
డాక్టర్ సంజీవ్ 2017లో ఓఅకడమిక్ పేపర్ కోసం గ్రానైట్ క్వారీలను గుర్తించారు. రెండేళ్ళ తరువాత కొండచరియలు విరిగిపడే ప్రాంతా లను కూడా గుర్తించారు.కొండచరియలు విరిగి పడే 31ప్రాంతాలను మాధవ్ గాడ్గిల్ బృందం, అదేవిధంగా డాక్టర్ కస్తూరి రంగన్ నేతృత్వం లోని ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూప్ కూడా గుర్తించింది.
పశ్చిమ కనుమల కిందకు వచ్చే వయనాడ్ ఓ కొండ ప్రాంతం.ఇక్కడ అనేక తెగలు కనిపిస్తాయి.కర్ణాటకలోని కొడుగు, మైసూరు జిల్లాలు వయనాడ్‌కు ఉత్త రాన సరిహద్దుగా ఉన్నాయి. ఈశాన్యాన తమిళనాడు హద్దుగా ఉంది.దక్షిణాన మల ప్పురం,నైరుతి దిశలో కోజికోడ్,వాయవ్యంలో కన్నూరు ఉన్నాయి.
పశ్చిమ కనుమలు ఏ రాష్ట్రంలో ఎంతెంత…
గుజరాత్‌లో 449 చదరపు కిలోమీటర్లు మహారాష్ట్రలో 17,348 చదరపు కిలోమీటర్లు గోవాలో 1,461 చదరపు కిలోమీటర్లు కర్ణాటకలో 20,668 చదరపు కిలోమీటర్లు తమిళనాడులో 6,914 చదరపు కిలోమీటర్లు కేరళలో 9,993 చదరపు కిలోమీటర్లు మొత్తం 56 వేల 825 చదరపు కిలోమీటర్ల మేర పశ్చిమ కనుమలు వ్యాపించి ఉన్నాయి. 13 ఏళ్ళ నిరీక్షణ పర్యావరణం పరంగా పశ్చిమ కనుమలు సున్నితమైన ప్రాంతాలుగా గాడ్గిల్ నివేదిక పేర్కొని 13 ఏళ్ళు గడిచాయి. ఈ విషయం తెలుసుకున్న తరువాత ప్రాణాంతక మానవ కార్యకలాపాలను ఆపేయాల్సిన అవస రం ఉంది.కేంద్రప్రభుత్వం 2014 మార్చి నుంచి ఐదు ముసాయిదా నోటిఫికెషన్లు జారీచేసింది.కానీ ఇంకా తుది నోఫికేషన్ జారీ కాలేదు.దీనికి ప్రధాన కారణం పొరుగు రాష్టాలైన కేరళ, కర్ణాటక రాష్ట్రాల వ్యతిరేకత. ఇది ప్రజల జీవనోపాధిని ప్రభా వితం చేస్తుం దనే కారణంతో ముసాయిదా నోటి ఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని కర్ణాటక కోరు తోంది.ఈ విషయంలో ఉదాసీనత కార ణంగా చెట్ల నరికివేత,మైనింగ్,భవనాల నిర్మాణం వంటి పర్యావరణానికి హాని కలిగించే మానవ కార్యకలాపాలు పెరిగాయి. తదీంతో భూమి కుంగిపోయి కొండలు అస్థిరంగా మారడానికి కారణమైంది.కొండచరియలు విరిగిపడటానికి ఇదే ప్రధాన కారణమని డాక్టర్ సంజీవ్ నమ్ముతున్నారు.(బీబీసీ సౌజన్యంతో..)