కడలిని..కాపాడుకుందాం..!

సముద్రపు కోత
సముద్రపు నీరు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదని అందరికీ తెలుసు. ఉష్ణోగ్రత, లవణీయత, సాంద్రత మొదలైన విభిన్న భౌతికలక్షణాల ప్రభావంతో సముద్రపు నీరు కదులుతూ ఉంటుంది. అందుకు సూర్యుడు, చంద్రుడు గాలుల వంటి బాహ్యశక్తుల ప్రభావం ఉంటుంది. సముద్రాల్లో ఏళ్ల తరబడి జరుగుతున్న మార్పుల కారణంగా రాకాసి అలలు సముద్రాన్ని కోతకు గురిచేస్తున్నాయి. దీంతో దగ్గర్లో నివశిస్తున్న మత్య్సకారుల జీవనం అయోమయంలో పడుతోంది.అయినా, లాభాలకోసం ఎంతకైనా తెగించే పెట్టుబడిదారీ విధ్వంసం కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉంది. ఈ కాలుష్యం వల్ల చేపలు, ఇతర జీవులు చనిపోతున్నాయి.మత్య్సకారుల జీవనం ప్రమాదంలో పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కడలిని,దాన్ని నమ్ముకున్న మత్స్యకారులను కాపా డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మన రాష్ట్రంలో ఉప్పాడ బీచ్‌ అందుకు ఓ ఉదాహరణ.
వాతావరణంలో మార్పులు
వర్షాలకు పూర్తిగా మహాసముద్రాలే కారణం. ఆవిరైన సముద్రపు నీరు నుండి వర్షంగా పడుతుంది. నీటిని మాత్రమే కాకుండా సముద్రం నుండి తీసుకున్న సౌరశక్తిని బదిలీ చేస్తుంది. అంతే కాదు.. సముద్రపు మొక్కలు ప్రపంచంలోని చాలా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. సముద్రపు నీరు గాలిలోని కార్బన్‌ డయాక్సైడ్‌లో సగం తీసుకుం టుంది. ఇది భూతాప ప్రభావాలను తగ్గిస్తుంది. సముద్రం యొక్క ప్రవాహాలు ఉష్ణమండల నుండి ధ్రువాల వైపు వెచ్చదనాన్ని తీసుకువెళతాయి. ప్రవా హాలు మారినప్పుడు, వాతావరణం కూడా మారు తుంది. వీటివల్లే మనుషులు తమ జీవనాధారమైన కార్యకలాపాలు జరుపుకుంటున్నారు. వ్యవసా యానికి అనువైన వాతావరణం కల్పించడంలో సముద్రాలే మూలకారణం.ఆ తర్వాత అడవులు. అటువంటి సముద్రాలను కొందరు చెత్తమయం చేస్తున్నారు. లక్షల టన్నుల వ్యర్థాలను సముద్రాల్లో కలుపుతున్నారు.దీంతో కాలుష్యకోరల్లో చిక్కు కొని, సముద్రజీవులు కూడా అంతరించి పోతు న్నాయి. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి.
నీటి అడుగున ఉష్ణతరంగాలు
అమెరికాకు చెందిన నేషనల్‌ ఓషనిక్‌ అండ్‌ అట్మాస్పియర్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఒఎఎ) శాస్త్రవేత్తలు గత ఏడాది సముద్రం అడుగున పరిశో ధన చేశారు. వారు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు కనుగొన్నారు.నీటి అడుగున ఉష్ణతరంగాలను కను గొన్న ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ఎన్‌ఒ ఎఎ ఫిజికల్‌ సైన్స్‌ లాబొరేటరీ వాతావరణ శాస్త్ర వేత్త డిల్లాన్‌ అమయా తన అనుభవం వెల్లడిర చారు. ఉత్తర అమెరికా చుట్టుపక్కల ఉన్న ఖండాం తర తక్కువ లోతు సముద్ర నీళ్లలో ఈ పరిశోధన సాగించారు. సముద్రాలుపైనే కాకుండా అడుగున కూడా నీళ్లు నిరంతరం వేడెక్కుతున్నాయని కనుగొ న్నారు. ఇది సముద్ర జీవులపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని చెప్పారు. ఉపరితలంపై ఉండే వేడి కన్నా,అడుగున మరింత ఎక్కువగానూ సుదీర్ఘ కాలం ఉంటోందని వెల్లడైంది.ఈ వేడి ఒక తీరా నికీ మరో తీరానికీ వేర్వేరుగా ఉంటుందని ఆయన వివరించారు.
పారిస్‌ ఒప్పందం అమలులో వైఫల్యం
వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్త చర్చలకు కేంద్ర బిందువుగా పనిచేసే పారిస్‌ ఒప్పందం 2015లో కుదిరింది. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత,గత ఎనిమిదేళ్లు (2015-2022) వరుసగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటీవల, ప్రపంచ వాతావరణ సంస్థ (ఔవీఉ) తన గ్లోబల్‌ క్లైమేట్‌ 2023 నివేదికను విడుదల చేసింది. వాతావరణ మార్పుపై పారిస్‌ ఒప్పందం, దాని ఎజెండాను నెరవేర్చడంలో ఆయా దేశాల్లో చర్యలు అసమ ర్థంగా ఉన్నాయని చెప్పింది. వాతావరణ సంక్షో భానికి ప్రధాన కారణమైన శిలాజ ఇంధనాలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వ చర్యలు శూ న్యం. వాతావరణ వ్యవస్థపై శీతలీకరణ ప్రభా వాన్ని చూపే లానినా వాతావరణ సంఘటన గత మూడేళ్లలో సంభవించకపోతే పరిస్థితి చాలా దారు ణంగా ఉండేది.
పీడిస్తున్న ప్లాస్టిక్‌ భూతం
భూమిలో కరగని ప్లాస్టిక్‌ పదార్థాలను పరిశ్రమలు సముద్రాల్లో విడుదల చేస్తున్నాయి. 2018లో అమెరికా 31 మిలియన్‌ మెట్రిక్‌ టన్ను ల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉత్పత్తి చేసింది. ఇది ప్రపం చంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ. చెత్త, ము రుగు,చమురు లీకేజీల వంటి మానవ కార్యకలా పాల చర్యల వల్ల నిత్యం సముద్రంలో విధ్వంసం జరుగుతుంది.సముద్రంలో కలుస్తున్న ప్లాస్టిక్‌ సంచులు,డిస్పోజబుల్‌ వస్తువుల్లో చిన్న చిన్న జీవు లు,అరుదైన చేపలు చిక్కుకుపోయి చనిపో తున్నాయి.ఈ విధంగా వందల సంవత్సరాలు ప్లాస్టిక్‌ పదార్థాలను తినడంవల్ల జీవుల జీర్ణవ్య వస్థల్లో ప్లాస్టిక్‌ నిల్వ ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ కాలుష్యపు నీటిలో అరుదైన జీవ జాతులు కూడా అంతరించిపోతున్నాయని నిపు ణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర మొక్కలు నశించిపోతున్నాయి. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించి, సముద్రాల సుస్థిర అభివృద్ధికి కృషి చేసేలా వారికి అవగాహన కల్పించాలి.
ఎలా వచ్చిందంటే..
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని 1992లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన ఎర్త్‌ సమ్మిట్‌లో మొదటిసారిగా ప్రతిపాదన వచ్చిం ది. మహాసముద్రాలు మన జీవితాలలో కీలకపాత్ర పోషిస్తాయని..వాటిని రక్షించడంలో ప్రజలకు సహాయపడే మార్గాల గురించి అవగాహన పెంచడానికి ఓరోజును పాటించాలని దేశాధి నేతలు సూచించారు. దాన్ని ఆమోదిస్తూ ఐక్యరాజ్య సమతి ప్రతి ఏటా జూన్‌ 8న ‘ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. సముద్రాలు బాగుం డాలి.. జీవులూ బాగుండాలి.. అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సం థీమ్‌.
నివారణకు చర్యలు
సముద్రాల దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ ప్లాస్టిక్‌ వస్తువులను పడేయకూడదు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇ-వ్యర్థాలను, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌లను తగ్గించడం, స్థిరమైన ఆహార వ్యవస్థలను అవలంబించాలి. పేపర్‌ బ్యాగులను ఉపయోగించాలి.ప్లాస్టిక్‌ బదులు ప్రత్యామ్నా యంగా పేపర్‌,అల్యూమినియం వస్తువులు వాడాలి.ఇంటి సామాగ్రికి గాజు వస్తువులను వాడాలి. ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తిరిగి రీసైక్లింగ్‌కి పంపించాలి.
అవగాహన పెంపుదల
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కప్పులు, కత్తులు,ప్లేట్లు,టేక్‌అవే ఫుడ్‌బాక్స్‌ల తయారీ, అమ్మ కాల్ని 2016లో నిషేధించి, ప్రపంచంలో తొలి దేశంగా ఫ్రాన్స్‌ అవతరించింది. ప్లాస్టిక్‌ కాలు ష్యంపై అవగాహన పెంచడానికి దేశంలో వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి బంగ్లాదేశ్‌ ప్రభు త్వం పెద్దఎత్తున రీసైక్లింగ్‌ చేపట్టింది. ఇవన్నీ ఆదర్శంగా తీసుకుని, మిగిలిన దేశాలూ అనుస రించాలి. సాగరం బాగుంటేనే సకల జీవరాశులుబాగుంటాయనే విషయాన్ని గుర్తించాలి. చైత న్యంతో అందరం కలిసి కడలిని కాపాడు కోవాలి.
వ్యాసకర్త : సముద్ర పరిరక్షణ నిపుణురాలు- (పద్మావతి)

కార్పొరేట్‌ రాజకీయ పర్యావసానాలు

ప్రజాస్వామ్యానికి ప్రాణమైన ఎన్నికల ప్రక్రియను రాజకీయ రహిత క్రీడగా మార్కెట్‌ వ్యవహారంగా మార్చడం అతి పెద్ద మార్పు.నిజానికి పరిభాష కూడా మారిపోయింది. ప్రజలను ఓటర్ల డేటాగా చూడటం.బిగ్‌ డేటా వుంటే రకరకాల పద్ధతుల్లో బుర్రలు నింపేయొచ్చని భావించడం ఇందులో మొదటిది.బిగ్‌ డేటా,డేటా ఎనలిస్టులు, మార్కెటింగ్‌ సర్వే సైన్యంతో బయలుదేరడమే. వీలైతే సొంత టీములు,లేదంటే ఉమ్మడిగా,అదీ కాదంటే నాయకులకుపార్టీలకు అనుబంధంగా వుండి డీల్‌ కుదుర్చు కోవడం.ఈ క్రమంలో వారి సమస్యలు మనోభావాలు కూడా ఓట్ల ఆకర్షణ కోణంలోనే. ఏది వారిని ప్రభావితం చేస్తుందంటే కాస్త చర్చించి ఏదో పేరుతో ఏదో రూపంలో అది చేయడం. అది కుల మత ఛాందసమా అసభ్యత అసహనం పెంచేదా వంటి కొలబద్దలేమీ వుండక్కర్లేదు. ఉద్వేగాలు పెంచడానికి పనికి వచ్చేదైతే మరీ మంచిది.అలాంటి వ్యక్తిగత అంశాలను అనుకూలంగానూ ప్రతికూలంగానూ వెతికి తెచ్చి మరీ రచ్చ చేయడం.టీవీ రేటింగులలాగే ఈ పనుల వల్ల కలిగిన లాభనష్టాలను బేరీజు వేసి మరో చోట అదే రకమైన ప్రయోగం.అంతే.దీర్ఘకాల ప్రజా ప్రయోజనం ప్రజాస్వామిక విలువల వంటి సంకోచాలే వుండక్కర్లేదు. కావాలంటే మరో పక్షాన్ని లేదా ప్రత్యర్థిని అప్రతిష్ట పాలు చేసేందుకు ఏం చేసినా ఫర్వాలేదు. పైగా ఫలానా వారు ఫలానా పార్టీలోనే వుడాలనీ లేదు. గిట్టుబాటయ్యే బేరం వస్తే పార్టీలో చీలిక తేవచ్చు. ఇప్పుడు తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణలో ఒక కోణం ఏమిటంటే బిఆర్‌ఎస్‌ రోహిత్‌ రెడ్డిని బిజెపి నేతలు కదిలించడం, మరికొందరిని కలుపుకోవాలని చూడటం, దాన్ని కెసిఆర్‌ వాడుకున్నారనే ఆరోపణ ఒకటైతే అసలా అనైతికత విషయమేంటి? వచ్చిన రాజకీయ దళారులలో వ్యాపారులు, పూజారులు కూడా వుండటమేమిటి? ఆర్థిక వనరులు పుష్కలంగా వున్న వారు ఎప్పుడు ఏ పార్టీ మారినా స్వాగతమే.తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లోనే చూస్తే ఒక కూటమిగా ఏర్పడిన పార్టీలలో కూడా అటూ ఇటూ దూకి పోటీ చేసినవారు కనిపిస్తారు. అందుకోసం అత్యధిక సంపదలు కలిగిన అభ్యర్థుల వేట. అవకాశాలతో అన్వేషణ. టికెట్‌ ఇచ్చే పార్టీకి రూ.వంద కోట్లో యాభై కోట్లో ముందే నిధి. తాము పోటీ చేసే పార్లమెంటు సీటు పరిధిలో అసెంబ్లీ స్థానాలకు పెట్టుబడి. వీలైతే ముందే అక్కడ శిబిరాలు ఏర్పాటు చేయించుకుని హంగామా చేయడం. టికెట్‌ కోసం ప్రయత్నం చేయడానికి ముందే నియోజక వర్గంలో ఓటర్ల కులాల పొందికపై ప్రత్యేక పరిశీలన. నిజం చెప్పాలంటే ప్రశాంత కిశోర్‌తో సహా ఈ వ్యూహకర్తలు ఎక్కువ సార్లు చెప్పేది కులం లెక్కలేనని పాలక పార్టీల నేతలు ఒప్పుకుంటున్నారు. ఒకే వ్యూహకర్త ఒకోసారి ఒకవైపున పని చేయడం వెంటనే మరోవైపు దూకడం ఆశ్చర్యం కలిగించే వాస్తవం. మోడీకి,రాహుల్‌ గాంధీకి ఒకే ప్రశాంత కిశోర్‌ పనిచేస్తాడు. జగన్‌కు పని చేసి మళ్లీ చంద్రబాబుతో మంతనాలు జరుపుతాడు. ఆయన పని చేసిన ఐ ప్యాక్‌ సంస్థ వారే రెండు వైపులా వుంటారు. ఈ మధ్యలో చాలా విన్యాసాలు చేస్తాడు. కానీ బడా మీడియా ఆయనకే అగ్రతాంబూలం ఇచ్చి అభిప్రాయాలు ఆణిముత్యాలన్నట్టు ప్రచారం ఇస్తుంది.ఎందుకంటే ఆ పార్టీలకూ కార్పొరేట్‌ మీడి యాకు పనిచేయించుకునే పార్టీలకూ కూడా రాజకీయ సైద్ధాంతిక పట్టింపులేమీ వుండవు. ఇవన్నీ డీల్స్‌ మాత్రమే.
ఇమేజి గేమ్‌
ఒక డ్రైవరో కండక్టరో ఎక్కిన వాళ్లను ప్యాసింజర్లుగా మాత్రమే లెక్కపెడతారు. ఒక హోటల్‌ యజమాని ఎన్ని టిఫన్లు, ఎన్ని మీల్సు లెక్క కడతాడు. అలాగే ఎన్నికలు, ఓట్లు, ఓటర్లు, వారిపై ఖర్చు అంతా మార్కెట్‌ భాషలో చూడటమే. ఈ పని రాజకీయ విధానాలతో సేవలతో కాకుం డా చిట్కాలతో ఎత్తులతో పూర్తి చేయాలి. ఓటరు ప్రొఫైల్‌ ఏమిటి? కులం, మతం, లింగం, నేపథ్యం తెలుసుకుంటే ఏవిధంగా పడగొట్టొచ్చు. ఓట్ల కొను గోలు దీనికి అదనం. దానికి కూడా మెథడాలజీ. పోల్‌ మేనేజిమెంట్‌ అంటే మనేజ్‌మెంటు అని సరదాగా అనేదందుకే. ఇవన్నీ గతంలో కార్యకర్త లు లేదా స్థానిక దాదాలు చేస్తే ఇప్పుడు కార్పొరేట్‌ స్టయిల్‌లో చేసేవాళ్లు వచ్చేశారు. మీరు సోషల్‌ మీడియాలో లేదా మీడియాలో ఏం చూస్తున్నారు మీ స్నేహితులెవరు. అభిరుచులేమిటి తెలుసుకుని ఆ రూట్లో చేరుకోవడం. మార్కెట్‌ భాషలో గ్యారం టీలు ప్రకటించడం. గ్యారంటీ వారంటీ డబుల్‌ ధమాకా ఆఫర్‌ ఇలాంటి భాష ఇప్పుడు రాజకీయా ల్లో సర్వసాధారణమైపోయింది. ఒటర్లే కాదు, అభ్య ర్థులూ సరుకులే. మొదటిది వారి బడ్జెట్‌ ఎంత? స్వంతంగా భరించగలరా లేక భరించేవారి తర పున ఏజంటుగా పనిచేస్తారా? ఈ తతంగం మార్కె టింగ్‌ టీం కూడా సహకరించే విధంగా జరగొచ్చు. ఆ మేరకు నేతలను కలిసి ఆఫర్లు ఇచ్చి పార్టీలు మార్పించడం చేర్చుకోవడం జరగొచ్చు. అది కాస్త ముగిశాక ఇమేజ్‌పెంచడం. మేకోవర్‌. మోడీ చారు వాలాగా బయిలుదేరి గారు వాలాగా మారి, రామ్‌ చే లాగా ఎదిగి ఇప్పుడు సాగర్‌ రaూ లా వూగుతు న్నారంటే ఇదంతా ఒక నిర్దిష్టమైన పథకం ప్రకారం జరుతున్నదే.ఆయన వేషభాషలు,సందేశాల సంకే తాలు మకాం వేసే నేపథ్యాలు ఏవీ ఊరికే నిర్ణయం కావు. మార్కెట్‌ ప్రొడక్టు అభ్యర్థి అయితే తనను కష్టమర్లయిన ఓటర్లకు ఆకర్షణీయంగా తయారు చేయాలి.అదే బ్రాండ్‌ ఇమేజి.మోడీ బ్రాండ్‌, చంద్ర బాబు బ్రాండ్‌, అమరావతి బ్రాండ్‌. ఇలా చాలా చెప్పొచ్చు. ఇందుకోసం ప్రత్యేక అధ్యయనాలు. అభిప్రాయ సేకరణలు చాప కింద నీరులా సాగిపో యాయి. నిజానికి ఇది 1980లో ఇందిరాగాంధీ పనిచేసే ప్రభుత్వం అంటూ తిరిగివచ్చిన సమయం లోనే మొదలైంది. తర్వాత వాజ్‌పేయి హయాంలో ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌, ఇండియా షైనింగ్‌ వంటి నినాదా లు కూడా వచ్చాయి. ప్రపంచీకరణ మీడియా విస్తరణతో పాటు ఇప్పుడు ఈయంత్రాంగం కూడా విస్తరించిందన్నమాట.ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ సభల క్యాప్షన్‌,బొమ్మ ప్రసంగాలలో ఎత్తుగడ అన్నీ స్క్రిప్టులే.ఈ అయిదేళ్లు ఐప్యాక్‌ టీము ఏదో రూపం లో ఆయనతో వుంటూనే వచ్చింది కదా? విధా నాల పరమైన ప్రణాళికలు పోయి గ్యారంటీలు వాటికి మోడీ గ్యారంటీలని గొప్పలు చెప్పడం వ్యా పార భాష కదా?
వాట్సప్‌ నుంచి యూ ట్యూబ్‌
ఇక ప్రచారంలో సాధనాలు సంస్థలు కూడా సిద్ధంగా వుంటాయి. ఒక మీడియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే మన ప్రమోషన్‌ చూసి పెడుతుంది. ఎన్ని ఇంటర్వ్యూలు, ఎంత కవరేజి అన్నీ సాగిపోతాయి. మనను కవర్‌ చేయడంతో పాటు ప్రత్యర్థిని బద్‌నాం చేసే పని కూడా వాళ్లదే. ఇందుకు సోషల్‌ మీడియా ఆర్మీలు. అసలైన సమస్యలు పక్కన పెట్టి అవతలివారిని దెబ్బ తీయ డం మనను పైకి లేపడం మాత్రమే టార్గెట్‌గా పనిచేయడం. తక్కువ జీతాలకే యువత దొరుకు తారు గనక వారిని పనిలో పెట్టుకుంటే బతుకు తెరువు కోసం అన్నీ చేసి పెడతారు. మన ప్రచారం మోత మోగిస్తారు. 2019లో వాట్సప్‌లో మెసేజ్‌లు పంపడం ప్రధానంగా వుంటే ఈసారి నేరుగా యూ ట్యూబ్‌ ఛానళ్లు లేదా మన స్వంత ఛానల్‌ పెట్టు కుని అప్‌లోడ్‌ చేసుకోవడమే.ఎవరికీ బాధ్యత లేదు. ఏదైనా వివాదం వస్తే తప్ప, వివాదాలు పెంచడం కూడా ఇందులో భాగమే. అంటే రాజకీయ నిబద్దత ఎంత మాత్రం లేని అభ్యర్థులు వ్యూహకర్తలు ప్రచార యంత్రాంగం పనిచేసి పెడతాయి. మీడి యాలో కూడా నిబద్దతతో పని చేసేవారిని వేటాడ టం,ఆసంస్థలనే కొనేయడం రివాజుగా మారిపో యింది. ప్రణరు రారు వంటి వారు కూడా స్వంత వేదికలు ఏర్పాటు చేసుకోవడం తప్ప పెద్ద తరహా సంస్థల్లో చోటు కాపాడుకోలేని పరిస్థితి. బడా కుటుంబాలు లేదా వ్యాపారాల్లో గుట్టలు పోసుకున్న వారు కాదంటే సినిమా సెలబ్రిటీలు, కార్పొరేట్‌ వర్గాల సేవకులు ఎన్‌ఆర్‌ఐలు మీడియాలో రాజకీ యాల్లో దిగిపోవడమే. విశేషించి తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే అతి సంపన్నులైన అభ్యర్థులు రంగంలో నిలవడం దేశమంతా చర్చనీయాంశమైంది. వామ పక్షాల వరవడి వుంది గనక సమస్యలపై చర్చ కొంతైనా జరిగింది గానీ లేకపోతే కేవలం మార్కె టింగ్‌ వ్యూహాలతోనే గడిచిపోయేది. సంఘ సంస్క రణ,స్వాతంత్రోద్యమం,కమ్యూనిస్టు ఉద్యమం వంటి బలమైన సంప్రదాయాలు గల చోట కార్పొ రేట్‌ బాబులు కుల శక్తుల కుమ్ములాటగా ఎన్నికలు జరగడం దిగ్భ్రాంతి కలిగించే వాస్తవం. ఇవన్నీ సర్వసాధారణమైనట్టు భావించడం మరింత దారు ణం. ఇరువైపుల ఆటగాళ్లు ఒకేఆట ఆడుతూ ఆశ యాలు ఉద్యమాల కోసం పాటు పడేవారిని అప హాస్యం చేయడం అలక్ష్యం చేయడం ఇక్కడ కొస మెరుపు.బ్యూరోక్రసీ కూడా ఇందుకు తగినట్టే వ్యవ హరిస్తుంది.ప్రైవేట్‌ భాగస్వాములను కూడా సలహా దారులై సర్కార్లను నడిపిస్తున్నారు. ముప్పయ్యేళ్ల ప్రపంచీకరణ పర్యవసానమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రతిఫలనమే ఇది.పైగా కార్పొరేట్‌ మార్కెటింగ్‌ రాజకీయం మితవాద, మతవాద రాజకీయాలను తప్ప ప్రగతిశీలతను సహించదు. ఎందుకంటే ఉద్యమ చైతన్యం దోపిడీని ప్రశ్నిస్తుంది గనక ఆశక్తు లను లేకుండా చేసే కుట్ర సాగిపోతుం టుంది. ఎందుకంటే ప్రపం చీకరణ మౌలికంగా ప్రజాస్వా మిక విలువలకు వ్యతిరేక మైంది. అందుకే తక్షణ రాజకీయ పోరాటంతో పాటు దీర్ఘకాలంలో ప్రజా స్వామిక పునాదులు కాపాడు కోవడానికి గట్టి కృషి అవసరం.పూర్తి ఫలితాల తర్వాత ఇందుకు సంబం ధించిన మరింత నిర్దిష్టత రావచ్చు. ప్రజాశక్తి సౌజన ్యంతో…)-(తెలకపల్లి రవి)

ఆదివాసుల చీకటి బతుకుల్లో అక్షర కాంతి..

అజ్ఞానం అన్ని సమస్యలకు మూలం. ఇంటర్నెట్‌, పేస్‌ బుక్‌, వట్సాప్‌ వంటి సాంకేతిక విప్లవం రాజ్యమేలు తున్న నేడు సరస్వతి కాళు మోపని ఆదివాసి గ్రామా లు ఇంకా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.కాని ఇది నిజం.స్వాతంత్య్ర పోరాటంలో తెల్లదొరలను తరిమి కొట్టడం,ముఠాదారి వ్యవస్థల రద్దు, స్వేచ్ఛను పొం దడం మాత్రమే కాకుండా తన సొంత ప్రజలు (ఆది వాసులు) విజ్ఞానవంతులు కావడం కుడా అంతే ముఖ్యమని గుర్తించిన గొప్ప దార్శని కుడు మర్రి కామయ్య. సుమారు 90ఏళ్ల క్రితమే ఆదివాసులకు చదువు అవసరాన్ని గుర్తించి పాఠశాలలు తెరిచి విద్యాభివృద్దికి కృషిచేసిన ఆది వాసుల మరో జ్యోతి రావు పూలే మర్రి కామయ్య. ఆయనతో పాటు డుంబేరి వీరన్న, రేగం భీమేశ్వర రావు, పొండోయి కొండన్న, మర్రి దన్ను (మర్రి కామయ్య కుమారుడు), కంట మచ్చేలు,బొండా మల్లుడు,బొండా బాలన్న మొదలైన అనేకమంది ఈ కార్యదిక్షలో భాగమ య్యారు.1940 వ సంవత్సంలో నెలకొల్పిన ‘‘ఆంద్ర శ్రామిక ధర్మరాజ్య సభ మాడుగుల, అనంతగిరి కొండ జాతి శాఖ సంఘము’’ల ద్వారా స్వాతంత్య్ర కాంక్షతో పాటు ఏజేన్సిలో పాఠశా లలు నెలకొల్పి, స్వీయ పర్యవేక్షణలో అక్షరోద్యమాన్ని నడిపించారు. ఈ బృహత్‌ కార్యానికి రెబ్బప్రగడ మండే శ్వర శర్మ గారు సంఘ కార్యదర్శిగా ఎంతగానో దోహద పడ్డారు. చదువుకున్న ఆదివాసీ యువకులను గుర్తించి, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో శిక్షణ ఇప్పించి ఉపాద్యయులుగా నియ మించారు. ఆ సంఘం ద్వారా శిక్షణ పొందిన ఉపాద్యయుడి (మండి పెంటయ్య, జనకోట) వద్దనే తొలి అక్షర భ్యాసం చేసిన నాకు ఈ కొద్ది విషయాలు మీ ముందుకు తెచ్చే అవకాశం దొరికినందుకు సంతోసిస్తున్నాను. మధ్య కాలంలో పోలీసులు కామయ్యను అరెస్టు చేసి జైలుకు వేశారు. కామయ్యకు సంబందించిన భూములు, పశువులు ఇతర ఆస్తులు స్వాధీనం చేసుకుని వేలం వేశారు.బ్రిటిష్‌వారు,ముఠాదార్లు, సావుకార్లు, ధనవంతులు, ఉద్యోగులు ఏకమై ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిపై నిర్బంధాలు చేయడం,జైలు శిక్షలు వేయడం,లాఠీలతో కొట్టడం, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటం వంటి ఆకృత్యాలకు చేసేవారు. బ్రిటిష్‌ వారు ప్రవేశపెట్టిన వేట్టిసాకిరి రద్దు,స్థానిక ప్రజల సంక్షేమం కోసం రహదారుల నిర్మాణం,ఆది వాసి యేతరుల వలసలను అరికట్టడం,సంత లలో వ్యాపారుల మోసలు అరికట్టడం,మద్య పాన నిషేధం,రవాణా,తపాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు రావదానికి ఎనలేని కృషి చేశారు. భూగోళం హద్దులు చెరిగిపోయి ‘‘వసుదైక కుటుంబం (గ్లోబల్‌ ఫ్యామిలీ)’’గా మారిపోతున్న మర్రి కామయ్య ఉద్యమకాంక్ష మాత్రం నేటి వరకు నెరవేడడం లేదు. ఆ మహనీయుల కృషికి కొనసాగింపుగా గత నాలుగున్నర దశబ్దాలుగా గిరిజన విద్యార్థుల సంఘం (జి.యస్‌.యు) ఆదివాసుల విద్యాభి వృద్ధికి,ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తోంది.ఈ ఉద్యమ ప్రయాణంలో 1999 జనవరి 31న ముగ్గురు సహచర విద్యార్థి ఉద్యమకారులు కటారి కొండబాబు, కిల్లో సురేంద్ర కుమార్‌,మజ్జి జయరామ్‌లను జి.యస్‌.యు కోల్పోయింది. విద్యార్థుల, ప్రజల సమస్యలు పరిష్కారానికి విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభ ముగించుకుని తిరుగుప్రయాణంలో రోడ్డు ప్రమదానికి గురై ప్రాణాలు కోల్పోయారు.ఆంధ్రప్రదేశ్‌లో బ్రిటీష్‌ వలసపాలనకు వ్యతిరేకంగా తూర్పు ఏజెన్సీలో కారం తమన్న దొరతో ప్రారంభమైన రంప తిరుగుబాటు (రంప రెబలియన్‌) విశాఖ మన్యం మీదుగా విజయనగరం వరకు పాకింది. 1917 నాటికి ఉధృతం దాల్చి 1922-24 నాటికి ముగి సింది. తదానంతరం 1930 తర్వాత ఆ పోరా టాన్ని మర్రి కామయ్య కాంగ్రెసుతో కలిసి కొన సాగించాడు.అవిభాజ్య విశాఖ మన్యానికి దక్షిణ బాగానా ఒరిషా సరిహద్దు కామయ్యపేట (హుకుంపేట మండలం) కేంద్రంగా ఆంగ్లే యులు పెంచిపోసించిన ముఠా సిస్టం, వెట్టి పని రద్దుకు వ్యతిరేకంగా ఉద్యమం సాగింది. రంప తిరుగుబాటు లాగయాతు వేట్టిసాకిరి రద్దుకు స్వాతంత్య్రనంతరం వరకు ఆదివాసులు కొనసాగించిన పోరాటల వరకు చరిత్రకారులు విస్మరిచిన,ఆ నాడు వారు వేసిన కరపత్రాలు, సర్వోదయ సేవ సంఘం అద్యక్షులు జర్సింగి మంగ్లన్న (గలగండ) కంబిడి బలాన్న (గూడ) కామయ్య గురించి అచువేసిన పుస్తకం, అందు బాటులో ఉన్న సమాచారం పుణ్యాన ఆదివా సుల విద్యాభివృద్ధికి (పాఠశాలల నిర్వహణకు) మర్రికామయ్య, అతని సహచర ఘనం చేసిన కృషి కొద్దిగానైన తెలుసుకునే అవకాశం దొరికింది. రంప తిరుగుబాటు (మన్యం పితూరి) దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం తెచ్చిపెట్టడానికి ఎంతో దోహదం చేసినప్పటికీ, ఆ పోరాటంలో పాల్గొన్న అనేకమంది యోధుల త్యాగాలు చీకటిలో ఉండిపోవడం శోచనీయం. మన్యం పితూరి కోసం గాం గంటం దొర కుటుంబం సర్వస్వం త్యాగం చేసింది. గంటం దొర సోదరుడు మల్లు దొర దేశద్రోహం నేరం కింద అండమాన్‌ జైలులో శిక్ష అనుబవిం చాడు. ఆ కుటుంబంతో రాజకీయాలు నెరిపిన పాలకులు వారి మనువడు గాం బోడి దొరకు కనీసం ఒకఇల్లు కట్టి ఇవ్వలేకపోయారు. దాతల వితరనతో కాలం వెల్లడిస్తూ, చివరికి దిక్కులేని మరణం పొందాడు. ఐపీసీ సెక్షన్‌ 121 దేశద్రోహం నేరం కింద అండమాన్‌ జైలుకు పంపబడ్డ మొట్టమొదట ఖైది బోనంగి పండు పడాల్‌. పడాల్‌ తో పాటు మరో 12 మంది అతని సహచరులను దశలవారిగా అండమాన్‌ కు తరలించారు. పాలకులు విస్మరించిన ఈ మధ్యకాలంలో కొంతమంది మానవతవాదులు ఆదివాసి పోరాటలపై చేసిన అధ్యయనాలు, బ్రిటీష్‌ కాలం నాటి జైలు రికార్డులు ఆధారంగా నేడు కొంతమేరకు బయటి ప్రపంచానికి పరిచయమవుతుంది. ఇది ఒక శుభ పరిణామం. తెల్లవాడి పెత్తనానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి ప్రేరేపి తుడైన బోనంగి పండు పడాల్‌ ఇంట్లో భార్యకు గాని, కుటుంబ సభ్యులకు గాని చెప్పకుండా సాయుధ పోరులో చేరిపోయాడు. ఆ సమయం లో అతని భార్య లింగమ్మ ఏడేనిమిది నెలల గర్భవతి. పోలీసు స్టేషన్లపై పితూరీ సేనలు చేస్తున్న మెరుపు దాడులు తిరుగులేని స్వతంత్య్రోద్యమంగా ప్రాధన్యత సంతరిం చుకుంది. చింతపల్లి, కృష్ణదేవి పేట, రాజ మ్మంగి పోలీస్‌ స్టేషన్లపై మెరుపు దాడులు చేసి ఆయుదాలు స్వాధీనం చేసుకొన్న సంగతి తెలుసుకున్న స్థానిక ప్రజలు మరింత ఉత్తేజితు లయ్యారు. విశాఖ-తూర్పు ఏజెన్సీలలో ఆదివాసులు సాంప్రదాయ విల్లంబులతో చేస్తున్న గెరిల్లా దాడులు ఉద్యమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండుపడాల్‌ ఆచూకీ తెలిపిన వారికి వంద రూపాయలు (రూ. 100/-లు) బహుమతి కూడా ప్రకటించింది బ్రిటిష్‌ ప్రభుత్వం. వాస్తవానికి పండు పడాల్‌ కు ఉరిశిక్ష పడిరది.13 మే1925న పునర్‌ విచారణ జరిపిన విశాఖపట్నం వాల్తేరు సెషన్స్‌ కోర్టు ఉరిశిక్షను రద్దు చేసి జీవిత ఖరగార శిక్షగా మార్చింది. పండుపడాల్‌ను 25ఏప్రిల్‌ 1926న అండమాన్‌ నికోబార్‌ దీవులు పోర్టు బ్లేయర్‌ లోని సేల్లులార్‌ జైలుకు తరలించారు. ఆ తరువాత తగ్గి వీరయ్య దొర (20.11. 1926), కోరబు కోటయ్య (20.11.1926), కుంచెటి సన్యాసి,గొలివిల్లి సన్యాసి,సుంకరి పొట్టయ్య,కోరబు పొట్టయ్య, లక్ష్మయ్య, కూడ లక్ష్మయ్య, ధనకొండ లక్ష్మయ్య,లోత లక్ష్మయ్య, అంబటి లక్ష్మయ్య, మామిడి చిన్నయ్య,కోరాబు లింగయ్య లను దశావరిగా తరలించారు. పండుపడాల్‌ వారసులు తమ స్వగ్రామమైన చింతపల్లి మండలం గొండిపాకలు గ్రామానికి అండమాన్‌ నుండి అప్పుడప్పుడు వచ్చిపోయ్యేవారు.ఆదివాసుల తిరుగుబాట్లు అన్ని దాదాపుగా ఆంగ్లేయులతో జరిగినవే. అయినా అవెక్కడ దేశం కోసం జరిగిన తిరుగుబట్లుగా గుర్తించబడలేదు. అతిసాధారణ ఘటనలుగానే చుస్తువచ్చారు. 1835 ఒరిషా రాష్టం పుల్బాని ప్రాంతాలను ఆక్రమించుకున్న ఆంగ్లేయులపై చక్ర బిసోయ్‌,గౌర బిసోయ్‌ లు సాంప్రదాయ అయుదాలతో తిరుగుబతు చేశారు.1885లో బెంగాల్‌,బీహార్‌ ప్రాం తాలలో ఈస్ట్‌ ఇండియా కంపెని ప్రవేశపెట్టిన జమిందారి విధానం,శిస్తు వసూళ్ళకు వ్యతిరేకంగా అంగ్లేయులపై తిరుగుబాటు చేసారు.బ్రిటిష్‌ రాయబారి లార్డ్‌ కారన్‌ వాల్లిస్‌ ప్రవేశపెట్టిన తప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ‘‘సంతాల్‌’’ప్రజలు తిరుగుబాటు చేసారు. 1768, 1835లలో అస్సాంలోని ‘‘షేర్‌, కాశీ’’ తెగలు, 1824-48ల మద్య కాలంలో మహారాష్ట్రలోని ‘‘కోల్‌’’ తెగలు, ఒరిస్సాలో ‘‘కొందు’’లు, 1889-90 బీహార్‌ లో సంతాల్‌ తేగలు,1913 న రాజస్థాన్‌ లో బిల్లులు, 1919న మణిపూర్‌లో‘‘కుకీ’’లు వలసవాద బ్రిటిష్‌ వారిపై తిరుగుబాట్లు చేశారు. 1921లో నల్లమల అడవులలో ‘‘చెంచు’’లు 1916న తూర్పు ఏజెన్సీ లాగారాయి తిరుగు బాటు కూడా అంగ్లేయులపై జరిగినవే. చరిత్రకు ` ఆదివాసులకు ఉన్న ప్రాధాన్యత గురించి ఒక చిన్న సందర్బం గుర్తుచేస్తాను. 29 మార్చి 1857న మంగళ్‌ పాండే నాయకత్వంలో జరిగిన సిపాయిల తిరిగుబాటును మొట్టమొదటి స్వాతంత్య్ర సంగ్రామంగా చరిత్రలో చదువుకుంటున్నాం. బ్రిటిషు వారు ఇండియన్‌ సిపాయిలకు ఆవు కొవ్వు,పంది కొవ్వు పూసి తయారుచేసిన తూటాలు ఇచ్చేవారు. ఆతూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి.ఆవు, పంది కొవ్వులు పూసిన తూటాలు ఇవ్వడాన్ని అగ్రహించిన ఇండియన్‌ సైనికులు ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ దళాల’పై తిరుగుబాటు చేసాయి. సిపాయిల తిరుగుబాటుకంటే సుమారు 70సంవత్సరాల ముందు1784లో బాబా తిల్కా మారీa బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా మొదటిసారి సాయుధ తిరుగుబాటు చేసాడు.?బ్రిటీష్‌ వారి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటానికి అతను ఆదివాసులతో ఒక సాయుధ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. బాబా తిల్కా బ్రిటీష్‌ కమీషనర్‌ లెఫ్టినెంట్‌ అగస్టస్‌ క్లివ్‌ ల్యాండ్‌ మరియు అతని నివాసం రాజ్‌మహల్‌పై గులేల్‌ స్లింగ్‌షాట్‌తో సమానమైన ఆయుధం)తో దాడి చేశాడు. బ్రిటీష్‌ వారు,తిల్కా సైన్యం నిర్వహించే తిలా పూర్‌ అడవిని చుట్టుముట్టారు.కానీ తిల్కా తన సైన్యంతో చాలా వారాల పాటు నిలువరిస్తు వచ్చారు. చివరకు తన 34వ ఏట 13జనవరి 1785 పట్టుబదినపుడు,అతన్ని గుర్రపు తోకకు కట్టి బీహార్‌లోని భాగల్‌పూర్‌ కలెక్టర్‌ నివాసం వరకు ఈడ్చుకెళ్లారు అక్కడ మర్రిచెట్టుకు అతని దేహాన్ని వేలాడదీశారు. కానీ,తిల్కా బ్రిటిష్‌ వారిపై చేసిన తిరుబటును ఆంగ్లేయులతో చేసిన స్వాతంత్య్ర పోరాటంగా గుర్తించ బడలేదు.1600 సంవత్సరంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ భారతదేశానికి కాళ్ళు మోపిన నాటి నుంచి వందల ఏళ్లుగా అనేక సార్లు బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేస్తూ వచ్చారు.ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖ, ుజడుRI,ఐటిడీఏలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి చొరవ తీసు కోవాలి. ఆదివాసి పోరాట యోధుల చరిత్ర లను,ఇతివృత్తాలను,ఏజేన్సీ రక్షణ చట్టాలను పాఠ్యాంశాలలో చేర్చడం,పుస్తకాలు ముద్రించి ప్రచారంలోకి తీసుకురవాలి.విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల ముందు స్వతంత్ర పోరాట యోదుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ఇలా చేయకపోతే ఈ దేశంలో ఆదివాసుల చరిత్ర కనుమరుగావ్వడం కయంగా కనిపిస్తుంది.
తరాలు మారినా తీరని వేతలు..
భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రూపంలో గొప్ప రాజ్యాంగం కూడా రాసుకున్నాం.అంత మాత్రణ అన్ని చట్టాలు వాటంతటవే అమలవు తాయని ఎమరుపాటుగా ఉండటం అంత మంచిది కాదు.ముఖ్యంగా ఆదివాసులు, దళితులు,సంఖ్య బలం లేని అల్ప సంఖ్యక ప్రజలు,ఓట్ల రూపంలో ప్రభావితం చేయలేని వారు గట్టిగా ప్రశ్నించడం అలవాటు చేసు కోవాలి.ఎందుకంటే పెట్టుబడిదార్లకు,ఆర్ధిక పెత్తందార్లకు వనరులు దోచి పెట్టడానికి అధికారం కోసం పాలకులు ఏదైనా చెయ్య గలరు.ఎక్కువ ఓట్లు శాతం కలిగి ఉంటే అర్హత ఉన్నా లేకపోయినా-అడిగిన అడగక పోయినా తాయిలాలు ప్రకటించే దుర్మార్గపు అలవాటు మన పాలకులకు ఉన్నదే! ఇది మాత్రం తూ.చ తప్పకుండా పాటిస్తారు. వర్ణ,వర్గ,మత విద్వేష గ్నులు ఆరనివ్వకుండా జగర్తపడతారు.ఆ విద్వే షాలను అధికారం తెచ్చి పెట్టే సాధనంగా వాడుకుంటారు. కాబట్టి అవసరం ఉన్న వారు గట్టిగా మాట్లాడకపోతే ఏమి ఇవ్వరు.సరి కదా ఉన్నది కూడా లాగేసు కుంటారు. ఆదివాసు లకు రక్షణగా ఉన్న చట్టాలు అమలు, రిజర్వే షన్ల, ప్రకృతి వనరుల విషయంలో తీరని అన్యాయం జరుగుతునే ఉంది.రాజకీయ అవస రాల కోసం,అధికారం దక్కించుకోవడం కోసం కేంద్ర,రాష్ట్ర పాలక పక్షాలు ఆదిమజాతుల కంటే అన్ని విధాల అభివృద్ధి చెందిన కులాలను షెడ్యుల్డ్‌ తెగలలో కలిపి, మాకు (షె.తె.లకు) కేటాయించిన రిజర్వేషన్లనే అందరికీ సమానంగా పంచాలని చూస్తున్నారు. 1956 తరువాత షె.తె.ల జాబితా క్రమంగా పెంచుతూ వచ్చారు. పెంచిన జాబితాలో కొండ ప్రాంతాలలో నివసించే మూలజాతుల ఉనికి మరింత వెనుకకు నెట్టబడ్డాయి.మరికొన్ని జాతులు అవశేషాలు లేకుండా పోయాయి. ప్రతీ ఎన్నికలలో ఇతర కులాలను తెగల జాబితాలో చేర్చే అంశం ప్రచార అశ్రంగా మారుతుంది.ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీలు ఎవరికివారు అధికారంలోకి రావడం కోసం బోయలను ఎస్టిలలోకి కలపాలని పోటిపడు తున్నారు.150కోట్లకు చేరువలో ఉన్న గొప్ప ప్రజాస్వామ్య భారత దేశంలో ఇతర కులాలను కలుపుతూపోతే ఆదివాసులు ఎంత నష్టపోతరో ఆలోచించగలిగిన ఒక్క రాజకీయ పార్టి గాని, నాయకుడు గాని లేరంటే సిగ్గుపడాలి.2024 సార్వతిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లోని అరుకు ఎస్టి పార్లమెంట్‌ నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా కొతపల్లి గీతాను బరిలోకి దించింది. ఆమెను కుల వివాద అంశంలో గిరిజన సంక్షేమశాఖా ఎస్టి కాదని తేల్చింది. జివో నెంబర్‌ 3ద్వారా ఆమెకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ జారి చేసిన ఎస్టి-వాల్మీకి ద్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ రద్దుచేసింది. ప్రస్తుతం ‘హైకోర్టులో స్టే’ ఉంది. రేపోమాపో ‘స్టే’కొట్టివేసే అవకాసం కూడా ఉంది. అంతేకాదు,బిజెపికి అస్సలు గిట్టని అవినీతి కేసుకుడా సిబీఐ దోషిగా తేల్చింది. గీతా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 42.79కోట్ల రూపాయలు ఎగవేసినదుకు జైలు శిక్ష కూడా అనుభవించింది. ఆదివాసులంత ముక్తకంఠంతో ఆమే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా,బిజెపి జాతీయ అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు జెపి నడ్డా, బిఎల్‌ సంతోష్‌ గార్లకు లేఖలు రాసిన పట్టించుకోవడం లేదు. అంటే చట్టసభలలో అసలైన ఆదివాసుల ప్రాతినిద్యం తగ్గించడం, బాక్సైట్‌ వంటి వనరుల దోపిడీకి గీతాను ఒక పావుగా వాడుకోవడానికి బిజెపి హ్యుహం పన్నినట్టు స్పష్టమవుతుంది.షెడ్యూల్‌ ప్రాంత ఆదివాసుల రక్షణ కవచాలుగా ఉన్న 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం,జీవో నెంబర్‌ 3,ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటి చట్టం-1989, పంచా యతీరాజ్‌ (షెడ్యూల్‌ ప్రాంతాల విస్తారన) చట్టం-1996(ూజుూA),అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 వంటి చట్టాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన పోరాటాల ఆధారంగా సాధ్యపరచుకున్నదే. ఇక ముందు కూడా రాజ్యాంగం స్ఫూర్తిగా ప్రశ్నించనిదే ఈ చట్టాలు అమలు కావు. పాలకులు వాటిని అమలు చేయరు. ఆదివాసులు కోరుకున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం అంటే అధికార మార్పిడి కాదు. ప్రజలు బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వదేశి పాలకుల ఏలుబడిలో ఉండటం అంతకన్నా కాదు. ఈ భూమిపైన, భూమి లోపల ఉండే వనరులపైన సర్వహక్కులు కలిగి స్వేచ్చగా జీవించగలిగే హక్కు ప్రజలకే ఉండాలి. అభివృద్ధి అంటే వచ్చిన అభివృద్దిలో స్థానిక ప్రజల జీవితాలు ఆధారపడి ఉండాలి. మన అభివృద్ధికి రోడ్డు వస్తే,ఆరోడ్డు పేదలకు సౌకార్యాన్ని, జీవన ప్రమాణాలు మేరుగుపడ టానికి దోహదపడాలి. అంతేకాని,ఉన్న కొద్దిపాటి భూమిని, వనరులను దూరం చేస్తే, అది ఎలా అభివృద్ధి అవుతుంది. వినాశం అవు తుంది గాని.ఉదాహరణకు విజయనగరం జిల్లా బొడ్డవర నుండి పాడేరు మీదుగా రాజ మండ్రి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 516జులో ఆదివాసులు పెద్ద ఎత్తున తమ పంట భూములు కోల్పోయారు.2013 కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం ఆదివా సులకు భూమికి భూమి పరిహారం ఇవ్వవలసి ఉన్న దాని ఉసే ఎత్తడం లేదు.అధికార్లు మాత్ర భూమికి భూమి ఇవ్వడానికి భూమి ఎక్కడ ఉంది.లేదుకదా? అంటున్నారు. నష్టపోయిన వారికి ఇవ్వడానికి భూమి లేనపుడు,ఉన్న భూమి ఎందుకు లాక్కొంటున్నారని అడిగిన ప్రశ్నకు వారివద్ద సమాధానం లేదు. హక్కుల స్ఫూర్తిని రాజ్యాంగంలో పొందుపరచడానికి వందల ఏళ్ళుగా ఆదివాసులు చేసిన/చేస్తున్న పోరాటాల కృషి ఉంది.వాటిపై ఒత్తిడి ఫలి తంగానే అమలవుతాయి. బ్రిటిష్‌ వారు కాళు మోపిన ప్రతీ చోట ఆదివాసులు తిరుగు బాట్లు మొదలుపెట్టినా ఇతర ప్రజలు ఎవరు కనీసం సహకారించలేదు. బ్రిటీష్‌ పాలకులు తీసుకు వచ్చిన అటవీ చట్టాలు ఆదివాసులకు అడవిపై ఉండే సహజమైన హక్కులను సైతం నిరాకరిం చాయి. అదే ‘‘మద్రాసు అటివీ చట్టం -2006’’.ఈ చట్టం ఆదివాసులను అడవుల్లో స్వేచ్ఛగా తిరగడం, తమ సహజ హక్కులను అనుభవించడం నిరాకరించాయి.అనేక కఠిన మైన ఆంక్షలు విధించింది. ఆదివాసుల పరం పరగత/సాంప్రదాయకమైన ‘పోడు’ వ్యవ సాయం చేయడం,కట్టెలు (వంట చెరుకు) సేక రించి తెచ్చుకోవడం, ఇప్పపువ్వు,ఈత కళ్ళు, తాటికల్లు మొదలైన ఫలసాయలు సేకరించడం వంటివి కూడా ఈ చట్టం ప్రకారం నేరమే. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన అటవీ చట్టం ముసాయిదా మద్రాసు అటవీ చట్టానికి తలదన్నే విధంగా రూపొందించారు. ఆదివాసులు తమ దయనందిన కార్యకలా పాలకు అడివిలోకి వెల్లడానికి వీలు లేకుండా సాయుధ బలగాలతో కాపలాగా పెట్టాలని, అడవులకు ప్రవేశించిన వారిపై కఠినమైన కేసులు పెట్టి జైలుకు పంపే విధంగా ప్రతిపా దనలు ప్రవేశపెట్టింది. ఈ ముసాయిదా రూపొందించిన నాటి నుండి వ్యతిరేకిస్తూ వచ్చాము. కానీ,పాలకులు పట్టించుకోలేదు. అటవీ సంరక్షణ చట్టాన్ని తమకు నచ్చిన బహుళజాతి కంపెనీలకు, వారు అడిగిన ప్పుడల్లా ప్రభుత్వమే నేరుగా అటవీ భూములను దారాదత్తం చేసే విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మార్చివేసింది.‘‘2023 నూతన అటవీ సంరక్షణ సవరణ చట్టం’’ద్వారా గ్రామ సభ అధికారులను తొలగించింది. ఇప్పుడు గ్రామసభ అభిప్రాయలతో పని లేకుండా బహుళజాతి కంపెనీలకు అటవీ భూములు కేటాయించేయ్యవచ్చు. చట్టాన్ని ఆవిధంగా మార్చేసుకున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వవలసిన ప్రభుత్వాలు అటవీ భూముల నుంచి ఆదివా సులను సొరబాటుదారులుగా ముద్ర వేసి దేశవ్యాప్తంగా అడవులపై ఆధారపడ్డ పది లక్షలకు పైగా ఆదివాసి కుటుంబాలను అడవుల నుండి గెంటివేయడానికి పథకం వేసారు. సత్తిస్గడ్‌ రాష్ట్రంలో నూతన అటవీ సంరక్షణ చట్టం ప్రభావం మొదలైంది. ఆ రాష్ట్రంలో ఇటివలే కొలువుదీరిన బాజపా ప్రభుత్వం బొగ్గు గనుల వెలికితీత, జాతీయ రహదారులు నిర్మాణం కోసం లక్షలాది చెట్లను తొలగించే పని మొదలు పెట్టేసింది. కఠీనమైన అటవీ సంరక్షణ చట్టాలు అమలో ఉన్నప్పుడే లెక్కచేయని పాలకులు, ఆ చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నకా వదిలి పెడతరా?.ఈ ఎలక్షన్‌ ముగిసిన తరువాత మనకు బాక్సైట్‌ గనుల రూపంలో ముప్పు పొంచివుంది.ఆదివాసులకు అవసాలుగా ఉంటు న్న భూమి,అడివీ,వనరులు వారికి దూరం చేయడానికి అడవుల నుంచి తరిమి వేసే కుట్ర నేటిది కాదు. వందల ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ వివక్ష నాడు బ్రిటిషు వాడి చేతుల నుంచి నేడు స్వదేశీ పెట్టుబడిదారి పాలకుల చేతుల్లోకి మారింది. అంతే తప్పితే! వివక్షలో మాత్రం మార్పు లేదు. ప్రపంచవ్యాప్తంగా నేటికీ మనుగడ కొనసాగిస్తూన్న జాతులు ఇతర ఆదిపత్య సమూహాల ఒత్తిడికి గురౌతు, పాలక పక్షాల కుట్రలను ఎదిరించి నిలిచినవే.
వ్యాసకర్త : కె రామారావు దొర ,జిల్లా కన్వీనర్‌,ఏఎస్‌ఆర్‌ జిల్లా ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసి జెఎసి, 9492340452

ప్రకృతి జీవకళ జీవ వైవిధ్యం

జీవుల మధ్య ఉండే భిన్నత్వమే జీవ వైవిధ్యం.భూమ్మీదఉండే లక్షలాది జీవ జాతు లు, వాటి జన్యువులు, అవి ఉన్న జీవా వరణ వ్యవస్థలను కలిపికూడా జీవ వైవిధ్యం అంటా రు. ఈఅధ్యయనాన్ని నోర్స్‌,మెక్మానస్‌ 1980 లోమొదట జీవశాస్త్ర వైవిధ్యం అన్నారు.ఈ పదాన్ని డబ్ల్యుజి రోసెన్‌ 1985లో జీవ వైవి ధ్యంగా మార్చారు.తరువాత దీనిలో ఎన్నో మార్పు లు వచ్చాయి.ఇక్కడ ప్రస్తావిస్తున్న అంశానికి సంబంధించి జీవ వైవిధ్యంలోని రెండు విలువల గురించి చెప్పాలి. అవి ప్రత్యక్ష విలువలు, పరోక్ష విలువలు. జీవ వైవిధ్యం దెబ్బ తింటే పర్యావరణం దెబ్బ తింటుంది. దీనితో పంటలు దెబ్బ తింటాయి. జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవడం అంటే మానవాళి తనను తాను రక్షించుకోవడమే. మితిమీరిన రసాయనిక ఎరువులు,మందులకు జీవ వైవి ధ్యం బలవుతున్నది.మానవాళి మనుగడకు కీలకమైన ఆహారోత్పత్తులకు మూలాధారం జీవ వైవిధ్యమన్న వాస్తవాన్ని కూడా మానవాళి విస్మ రిస్తున్నది.ఈ సృష్టిలో మనుషులకు,తోటి జీవు లకు ఒకటే గ్రహం,ఒకటే గృహం. మనుషు లంతా ఒకటే అనేది ఉట్టిమాట. పొడుగు, పొట్టి, లావు, సన్నం, నలుపు, తెలుపు, ఇంకా వీటి మధ్యస్థ రకాలు, భేదాలు.ఇంకా మనుషులంతా ఒకటే అని అనుకోవడం ఏమిటి? ఒక్క మనుష్య జాతిలోనే ఇన్ని భేదాలుంటే, మనిషికి తెలిసిన మిగతా జంతు, వృక్ష జాతులలో మరిన్ని వైవిధ్యాలు ఉన్నాయి. ఈ భూమ్మీద ఉండే జీవులలో ఉండే ఈతరహా భేదాలన్నిటినీ కలిపి జీవవైవిధ్యం అంటున్నాం. జీవవైవిధ్యం భూమిపై జీవుల ఆరోగ్యాన్ని కొలిచే థర్మామీటర్‌ వంటిది.ప్రకృతిలో ప్రతిజీవి ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తూ పర్యావరణ వ్యవస్థల స్థిరత్వంస్థితిస్థాపకతకు దోహదం చేస్తుంది.
తక్కువైతే మనకేంటి నష్టం?
ఒక పురుగో, అసలిప్పటివరకు సామా న్య మానవులకు కనిపించని ఒక మొక్కో లేదా ఏదో విషపు పాముల వంటి జంతువో అంతమై పోతే మనకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? అది మన దైనందిన జీవితాలపై నిజంగా ప్రభావం చూపుతుందా? పర్యావరణ వ్యవస్థలోని ప్రతి జాతి ఇతర జీవ రూపాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంకర్షణ చెందుతుంది. పర్యావరణ వ్యవస్థను ఒక భారీ నెట్‌వర్క్‌గా భావించవచ్చు, ఇక్కడ ప్రతి జీవి ఒక దారం ద్వారా ఇతరులతో అనుసంధా నించబడి ఉంటుంది.ఒక దారం తెగిపోయి నప్పు డు,దానితో నేరుగా అనుసంధానించబడిన జాతు లు ప్రభావితమౌతాయి. అయితే అవి పరోక్షంగా దానితో సంకర్షణ చెందే వాటిపై ఎక్కువ లేదా తక్కువ ప్రభావాన్ని చూపుతాయి.పర్యావరణ వ్యవస్థ ఎంత వైవిధ్యంగా ఉంటుందో, అది అంత బాగా అంతరాయాలను తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది. జీవుల సహజ ఆవాసాల నాశనం, కాలుష్యం లేదా వాతావరణ మార్పుల ద్వారా కలిగే అంతరాయా లతో పర్యావరణం నిలకడగా ఉండదు. అందుకు కారణం జీవవైద్య నాశనమే. కొన్ని జాతుల నష్టం కూడా మానవ జనాభాకు తీవ్రమైన పరిణామా లను కలిగిస్తుంది, మన జీవితాలను ప్రభావితం చేస్తుంది.
ప్రకృతి అందించే అపరిమిత సేవలు
ప్రతిరోజూ, జీవవైవిధ్యం మనకు అనేక రకాలుగా సేవలను అందిస్తుంది. ఉదాహరణకు, మొక్కలు కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తూ ఆక్సిజన్‌ను అందిస్తాయి. తేనెటీగలు మరియు ఇతర కీటకాలు మొక్కల ఫలదీకరణానికి దోహద పడతాయి, మాంసాహారులు శాకాహారి జనాభాను నియంత్రణలో ఉంచుతాయి.ఆక్సిజన్‌ ఉత్పత్తి, నేల నిర్మాణం,నీటి చక్రం వంటి క్రియలు పర్యావరణ వ్యవస్థలు సాఫీగా నడవడానికి తోడ్పడే ప్రాథమిక అంశాలు.నిజానికి జీవవైవిధ్యమే వాతావరణ మార్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, మానవులు ఉత్పత్తి చేసే కార్బన్‌ డయాక్సైడ్‌లో దాదాపు సగభాగాన్ని పీల్చుకోవడం ద్వారా వాతావరణాన్ని నియంత్రించడంలో సము ద్రాలు,అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. చిత్తడి నేలలు,మడ అడవులు,పగడపు దిబ్బల వంటి తీర పర్యావరణ వ్యవస్థలు తుఫానులు, వరదల నుండి సహజ రక్షణను అందిస్తాయి.వృక్షాలు గాలి నీటి శుద్దీకరణతో పాటు, ఉష్ణోగ్రతలను తగ్గించడానికి, మట్టిని స్థిరీకరించడానికి, తద్వారా వరదల ప్రమా దాన్ని తగ్గిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ, ప్రస్తుతం వాతావరణ మార్పులే జీవవైవిధ్యాన్ని కుప్పకూ లుస్తున్నాయి.పర్యావరణం స్థిరంగా ఉండాలంటే, జీవ వైవిధ్యం అధికంగా ఉండటం ముఖ్యం. వైవి ధ్యభరితమైన పర్యావరణం మరింత స్థిరంగా ఉంటుంది.వాతావరణ మార్పులవల్ల జీవవైవి ధ్యంపై అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. ఎన్నో శాస్త్రీయ నివేదికలు ఈ విషయాన్ని నివే దించాయి.ఉష్ణోగ్రతలు1.5%జ పెరిగితే,దాదాపు 6%కీటకాలు,8% మొక్కలు4%సకశేరుకాలు వాటి భౌగోళిక పంపిణీలో(ఆవాసాలమార్పు) మార్పులకు లోనవుతాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల 2%మేర అయితే,ఈశాతాలు రెట్టింపు అవుతా యి.ఈ కారణంగా,ఆక్రమణ జాతులు కూడా అనూహ్యంగా విస్తరించే ప్రమాదముంది. ప్రపంచ భూభాగంలో దాదాపు 7% పర్యావరణ వ్యవస్థలు మారే ప్రమాదం ఉంది, అందువల్ల సహజ ఆవా సాల క్షీణత రాబోయే సంవత్సరాల్లో వేగవంతం అవుతుంది.ఫినోలాజికల్‌ మార్పులు (కొన్ని జాతుల పుష్పించే లేదా పునరుత్పత్తి వంటి ఆవర్తన సంఘ టనలు) ఎక్కువగా నమోదు చేయబడుతు న్నాయి, ఫలితంగా జాతుల మధ్య పరస్పర సంబంధాలపై ప్రభావం చూపుతుంది. ఉష్ణోగ్రత 1.5%జ లేదా 2%జ పెరిగితే, దాదాపు 70-99% పగడపు దిబ్బలు నాశనమవుతాయి. ఈ సృష్టిలో మనుషు లకు, తోటి జీవులకు ఒకటే గ్రహం, ఒకటే గృహం.
కంటికి సరిగ్గా కనిపించని బ్యాక్టీరియా నుండి ఆకాశాన్ని అందుకునే ఎత్తైన చెట్ల వరకు అగాధా లలో అనాయాసంగా నివసించే సముద్ర జీవుల నుండి అలవోకగా ఆకాశంలోఎగిరే పక్షుల వరకు భూమి కోట్ల కొద్దీ జీవజాతులకు నిలయం. నిత్యం కనుగొనబడే జీవజాతులు, వాటి శాస్త్రీయ వర్గీకర ణ కారణంగా ఖచ్చితమైన సంఖ్య ఇప్పటికీ అనిశ్చి తంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అధికారికంగా 17 కోట్ల జాతులను మాత్రమే గుర్తించాము. యాభై నుండి మూడువందల కోట్ల జీవజాతులు ఉండవచ్చు అనేది ఒకఅంచనా. ఇంతటి విస్తృతమైన వైవిధ్యం రాత్రికి రాత్రే పుట్టుకు రాలేదు. ఇది ఇప్పటి స్థితికి రావడానికి దాదాపు నాలుగు వందల కోట్ల సంవత్సరాల పాటు జీవపరిణామక్రమ ప్రక్రియ జరగవలసి వచ్చింది. కానీ ఆ కోట్లాది జాతులలో కొన్ని జాతులు సమూలంగా అంతరిం చడం జరిగింది మాత్రం మానవుడు ఆవిర్భవించిన ఇటీవలి కాలంలోనే! భూమి చరిత్రలో జీవవైవిధ్యం అంతరించిపోవడం,పునరుద్ధరణ జరగడం సహజ ప్రకృతి చర్యనే. గతంలో కనీసం అయిదు సార్లు సహజ కారణాలవల్ల సామూహికంగా జీవుల విలుప్తాలు(జుఞ్‌ఱఅష్‌ఱశీఅం) జరిగాయి.వీటిలో చివరిది 65మిలియన్‌ సంవత్సరాల క్రితం జరిగిన డైనోసార్ల విలుప్తం.కానీ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ప్రపంచీకరణ నుండి, జీవవై విధ్య నష్టం ప్రమాదకర స్థాయిలో వేగవంతమైంది. ఇప్పుడో ఆరవ సామూహిక విలుప్తత జరిగే ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. చిక్కగా నేసిన వస్త్రంలో నుండి ఒక్కో దారం లాగేస్తుంటే, పల్చనైపోయి, వదులుగా మారి, క్రమేపీ కనుమరు గయ్యే వస్త్రం చందాన మన గ్రహం పైనున్న జీవవై విధ్య పరిస్థితి ఉంది.అతి సూక్ష్మజీవుల నుండి భారీ నీలి తిమింగలాల వరకు,ప్రతి జాతి మన పర్యావ రణ వ్యవస్థ అనే వస్త్రపు సమతుల్యతను కలిపి ఉంచే కీలకమైన దారాలు. ఇప్పుడు ఆవస్త్రం నుండి దారపు పోగులు ఒక్కొక్కటిగా జారిపోతు న్నాయి. మన కళ్ల ముందే ప్రకృతి కనుమరుగవుతోంది. భూగ్రహం పై జీవవైవిధ్యం ముప్పులో ఉండటానికి ప్రధాన కారణం, దానిపైనే అధికంగా ఆధారపడే జీవి-మనిషి కావడం విశేషం.జీవవైవిధ్యం మానవ శ్రేయస్సు మరియు జీవనోపాధికి చాలా అవసరం. ఎందుకంటే ఇది అసలు జీవపు ఉనికికే ఆలంబన. కానీ,జీవుల సహజ నివాస స్థలాల నష్టం, కాలు ష్యం, వ్యవసాయం, వేటాడటం, ఆక్రమణ జాతులు మరియు పెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా వక్ష, జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదం పెరుగుతూనే ఉంది. గత కొన్ని సంవత్సరాలలో, జనాభా పెరుగుదల, దాంతోబాటే విపరీతంగా, అనిశ్చితంగా పెరిగిన, ఉత్పత్తి, వినియోగ విధా నాలు జీవవనరులకు వినియోగాన్ని పెంచాయి. దీని వలన జీవవైవిధ్యం నాటకీయంగా నష్టపో యింది. జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం అనేది మానవజాతి ముందున్న గొప్ప సవాళ్లలో ఒకటి.
జీవవైవిధ్యం అనే పదాన్ని 1988లో అమెరికన్‌ శాస్త్రవేత్త ఎడ్వర్డ్‌ ఓ.విల్సన్‌ మొదటిసారి ప్రయోగించాడు. ఈ పదం, మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు,సూక్ష్మజీవులు,అలాగే పర్యావరణ పరస్పర చర్యలతో సహా గ్రహం మీద ఉన్న వివిధ రకాల జీవ రూపాలను సూచిస్తుంది. జీవవైవి ధ్యాన్ని భూమిపై ఉన్న జీవ సంపదగా నిర్వచించ వచ్చు.జీవవైవిధ్యాన్ని పర్యావరణ వ్యవస్థలోని జాతుల సంఖ్య ద్వారా కొలుస్తారు, ప్రతిజాతి జనాభాలో జన్యు వైవిధ్యాన్ని అంచనా వేయడం ద్వారా మరియు వివిధ వాతావరణాలలో జాతుల పంపిణీ అంచనా ద్వారా కూడా కొలుస్తారు.
మనదేశంలో జీవవైవిధ్యం
భారతదేశం 2011లో నగోయా ప్రోటోకాల్‌పై సంతకం చేసి, హైదరాబాద్‌లో జరిగిన జదీణకి 11వ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌లో అక్టోబర్‌ 2012లో దానిని ఆమోదించింది. బయో లాజికల్‌ డైవర్సిటీ యాక్ట్‌, 2002, జదీణ అమలు కోసం భారతదేశ దేశీయ చట్టంగా పనిచేస్తుంది. భారతదేశం,32,87,263 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. భారతదేశంలో 89,451జంతుజాతులున్నాయి. ఇది ప్రపంచ జంతుజాలంలో 7.31%.అలాగే 49,219 వృక్ష జాతులున్నాయి. ఇది ప్రపంచ మొత్తంలో 10.78%వాటాను కలిగి ఉంది. ప్రపం చంలో ఉన్న పదిహేడు అతిపెద్ద జీవవైవిధ్య దేశా లలో భారతదేశం ఒకటి.భూవిస్తీర్ణంలో 2 .4శా తమే ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్త జీవజాతులలో 7.8శాతం మన దేశంలో ఉన్నాయి. మన ప్రభు త్వం 2002లో జీవవైవిధ్య చట్టాన్ని తీసుకు వచ్చింది.అందులో ముఖ్యాంశాలు: జీవవైవిద్య సంరక్షణ, సుస్థిర వినియోగం, అంతరించిపోతున్న జీవజాతులను కాపాడటం, వాటికి పునరావాసం కల్పించడం. జీవవనరుల వినియోగాన్ని క్రమబద్దీ కరించడం, జీవవైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయడం, స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి.ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ భారత దేశంలో1,212 జంతు జాతులను తన రెడ్‌ లిస్ట్‌లో పర్యవేక్షిస్తుంది.వీటిలో 12%పైగా జాతులు 148%అంతరించిపోతున్నాయి.అంతరించి పోతు న్న జాతులలో69క్షీరదాలు,23 సరీసృ పాలు, 56ఉభయచరాలు ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం (ప్రస్తుతం మన దేశ జనాభా దాదాపు నూట నలభై నాలుగుకోట్లు.ప్రపంచ జనాభా దాదా పు ఎనిమిది వందల కోట్లు) పెరిగిపోతున్నారు. మొత్తం అటవీ ప్రదేశంలో కేవలం15శాతం అడవు లు మాత్రమే ఇప్పుడు భూమ్మీద ఉన్నాయి. మిగతా వన్నీ ఏనాడో మనిషి మింగేశాడు. దాదాపు పాతిక శాతం వృక్షజాతులు ప్రమాదపుటంచులలోఉన్నా యి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ దాదాపు నలభై శాతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జీవవైవిధ్యంపై ఆధా రపడి ఉంది.భూమ్మీద అందుబాటులో ఉన్న మూడుశాతం మంచినీటిలో దాదాపు ఆరుశాతం జాతులు ఉన్నాయి. ఉష్ణమండల వర్షారణ్యాలు ఒకప్పుడు భూమి పై 14 శాతం వుంటే, ఇప్పుడు ఆరుశాతానికి పడిపోయాయి.
వినాశనానికి ముఖ్య కారణాలు
సహజ పర్యావరణాల విధ్వంసం, విచ్ఛిన్నం జీవవైవిధ్యానికి అతిపెద్ద ముప్పు. ఆవాసా లలో మార్పులు వ్యవసాయం, పట్టణీకరణ, అటవీ మరియు భూవినియోగంలో మార్పుల ఫలితం. ఇన్వేసివ్‌ జాతుల (ఆక్రమణ జాతులు) వ్యాప్తి కూడా జీవవైవిధ్య వినాశనానికి అతిపెద్ద ముప్పు. మానవు లు ఉద్దేశపూర్వకంగా లేదా ప్రమాదవశాత్తు ప్రవేశ పెట్టిన కొన్ని జాతులు ఆయా ఆవాసాలలో ఉండే సహజ జాతులపై దాడి చేసి వాటిని అంతంచేసే ప్రమాదముంది. వనరులను అతిగా దోచుకోవడం, అంటే,అధికంగా చేపలు పట్టడం, వేటాడటం లేదా అతిగా మేపడం వంటి చర్యలు అనేక జాతులకు ముప్పు కలిగిస్తుంది. మన వాతావరణం, పర్యావ రణ వ్యవస్థలలో మార్పులు జీవవైవిధ్యానికి ముప్పు. అన్ని రకాల కాలుష్యం:నీరు, నేల మరియు వాయు కాలుష్యం,కానీ కాంతి లేదా ధ్వని కాలుష్యం, ఇది అనేక రకాల జీవులను ప్రభావితం చేస్తుంది. అభి వృద్ధి పేరుతో ఎకరాలకొద్దీ సహజ వనరులపై జరిగే దాడి, విధ్వంసం తెలియనిది కాదు. ఇటీవల జరిగిన నికోబార్‌, లక్షద్వీపాలలో వేలకొద్దీ ఎకరాల భూమిలో అడవులు నాశనం కావడం, ఆ కారణం గా ఆదివాసీ తెగల జీవన, ఆవాసాలు దెబ్బతినడం తెలిసిందే. తెగలతో బాటు చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువుల జాతులు కూడా దెబ్బతిని, ఒకప్పటి ఘనమైన వైవిధ్యం ఇకఎప్పటికీ కనిపించదు. అడవులు,జీవ,జలరాశులను ఇప్పటికైనా పరి రక్షించుకోనట్లయితే రాబోయే రోజుల్లో మానవ జాతి మనగడకే ముప్పు వాటిల్లుతుందని అందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి పేరుతో మనం ఇప్ప టికే ఎంతో విలువైన ప్రకృతి సంపదను కోల్పోయా ము,అయినా మిగిలివున్న వన సంపందను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వంగానీ, పౌరులుగానీ అభివృద్ధి పేరుతో చెట్లను నరకాల్సి వచ్చినప్పుడు ఒక్క చెట్టు స్థానంలో పది చెట్లు నాటాలి.జీవవైవిధ్యాన్ని మనం కాపాడుకోలేకపోతే చివరకు మనిషి మనుగడే లేకుండా పోతుందన్న అవగాహన ఉండాలి. భవిష్యత్తు కోసం జాగ్రత్త పడాలి.
జాతీయ జీవవైవిద్యం ప్రాధికారసంస్థ
ఇది భారతదేశ కేంద్ర ప్రభుత్వ వాతా వరణం, అడవుల మంత్రిత్వశాఖ, ఆధ్వ ర్యంలో పనిచేస్తుంది.జాతీయ జీవవైవిధ్య ఆధారిటీ సంస్థ నూ చట్టబద్ధ హోదాతో చెన్నైలో 2003లో ఏర్పా టు చేశారు. జీవసంపద దొంగ లించకుండా జాగ్రత్త పడడం,రక్షిత ప్రదేశాల బయట కూడా జీవవైవిద్య రక్షణకు నియమాలు రూపొందించి వాటిని అమలుపర చడం వంటివి దీని బాధ్యతలు.
ఆంధప్రదేశ్‌ జీవ వైవిధ్య మండలి
ఆంధప్రదేశాష్ట్ర జీవవైవిధ్య మండలి భారత ప్రభుత్వం జీవవైవిధ్య చట్టానికి అనుగు ణంగా ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం 2006లో ఏర్పాటు చేసింది.జీవ వైవిధ్య సంరక్షణ, సుస్థిర వినియో గానికి సంబం ధించిన విషయాలపై రాష్ట్ర ప్రభు త్వానికి సలహాలు ఇవ్వడం,జీవవనరుల వినియో గం ద్వారా సమ కూరే ప్రయోజనాల న్యాయబద్ధ పంపిణీ మొదలై నవి రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ప్రధాన ఉద్దేశాలు.
వ్యాసకర్త : ఆంధప్రదేశ్‌ జీవవైవిధ్య నిపుణులు-(డా.కాకర్లమూడి విజయ్‌/ బీఎంకే రెడ్డి,)

ఆహారం కోసం..వలస పోరాటం

ప్రపంచ మార్కెట్‌లో తక్కువ ధరలకే దొరికే టప్పుడు దేశీయంగా ఎందుకు పండిరచడం అన్న సామ్రాజ్యవాదుల వాదన ఎంత బూటకమో దీనిని బట్టే స్పష్టం ఔతోంది. కొన్ని దేశాలు అన్ని రకాల పంట లనూ పండిరచలేనప్పుడు ప్రపంచ మార్కెట్‌లో పోటీ అన్నది అర్ధం లేనిది. అన్నిదేశాలూ అన్ని రకాల పంట లనూ పండిరచి, తమకు అవసరం లేని వాటిని చౌకగా ఎగు మతిచేసి, కావలసినవాటిని దిగుమతి చేసు కున్నప్పుడు మార్కెట్‌ సూత్రం వర్తిస్తుంది. కాని కొన్ని దేశాల దగ్గర పెట్టుబడి అధికంగా పోగుబడినప్పుడు, మరికొన్ని దేశాలు పేద దేశాలుగా మిగిలిపోయి నప్పుడు సమన్యాయం వర్తించదు. అటువంటప్పుడు కీలకమైన తిండిగింజల విషయంలో దిగుమతుల మీద ఆధార పడవలసిన పరిస్థితిని కొని తెచ్చుకోవడం ఏ దేశానికైనా ఆత్మహత్యా సదృశమే ఔతుంది.
ప్రపంచం మొత్తం మీద గోధుమ ఎగు మతుల్లో 30శాతం రష్యా, ఉక్రెయిన్‌ దేశాల నుంచే జరుగుతుంది.తమ ఆహారఅవసరాల కోసం చాలా ఆఫ్రికన్‌ దేశాలు ఈరెండు దేశాల మీదే ఆధారపడ తాయి.ఇప్పుడు ఆరెండు దేశాల నడుమ సాగుతున్న యుద్ధం కారణంగా ఆఫ్రికన్‌ దేశాల ఆహార సరఫరాలు దెబ్బతిన్నాయి.యుద్ధం ముగిసిన తర్వా త కూడా ఈవిషయంలో మామూలు పరిస్థితి తిరిగి వెంటనే రాకపోవచ్చు.ఆరెండు దేశాల్లో పంట సాగువిస్తీర్ణం యుద్ధం కారణంగా తగ్గి పోయింది. ప్రపంచ మొక్కజొన్న ఎగుమతుల్లో 20 శాతం ఒక్క ఉక్రెయిన్‌ నుంచే జరుగుతాయి. ఈ మొక్క జొన్న సరఫరాకూడా దెబ్బ తింటోంది.చాలా బల హీన దేశాల ఆహార లభ్యత ఇందువలన దెబ్బ తింటోంది. అంతే కాదు, చాలా దేశాలకు ఎరువు లను సరఫరా చేసేది రష్యానే.ఇప్పుడు వాటి సర ఫరా కూడా దెబ్బ తింటోంది. వెరసి ప్రపంచం మొత్తం మీద ఆహార వస్తువులధరలు బాగా పెరగ డానికి, ఆహార లభ్యత దెబ్బ తినడానికి ఈ పరిస్థితి దారితీస్తుంది.
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభం కావ డానికి ముందరి నెల ఫిబ్రవరి నాటి ధరలతో పోల్చితే మేనెల నాటి ముఖ్యఆహార ధాన్యాల ధరలు 17శాతం పెరిగాయి. మరింత ఎక్కువ సంఖ్యలో ప్రజలు కరువు పరిస్థితులను ఎదుర్కొనే వాతా వరణం ఏర్పడిరది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా తయారౌతాయి. ముఖ్యం గా పశ్చిమాసియా,ఆఫ్రికాదేశాలు-యెమెన్‌, ఇథి యోపియా,సోమాలియా,సూడాన్‌,దక్షిణ సూడాన్‌, నైజీరియా,కాంగో రిపబ్లిక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి దేశాలు ఈ ముప్పుకు ఎక్కువగాలోనయ్యే ప్రమాదంఉంది. ఇటువంటి పరిస్థితులు ఎదురవవచ్చునని నిపు ణులు ముందు నుండే హెచ్చరిస్తున్నారు. యుద్ధ రంగంలో పోతున్న ప్రాణాల గురించే ఎక్కువ మంది పట్టించుకుంటున్నారు కాని తిండి దొరకని పరిస్థితులు ఏర్పడినందువలన, ఈ యుద్ధంతో ఏ మాత్రమూ సంబంధం లేని దేశాల్లో, యుద్ధం జరుగుతున్న చోటికి చాలా దూరాన ఉన్న దేశాల్లో ఎన్ని ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతు న్నాయో వారికి పట్టడం లేదు. ముఖ్యంగా పశ్చిమ, సంపన్న దేశాల వారికి ఈ సమస్య అస్సలు పట్ట డం లేదు. ఐతే,ఈచర్చలో కేంద్ర స్థానంలో ఉన్న ప్రశ్న వేరు. దానినెవరూ అడగడమే లేదు. ‘’ప్రపం చంలో కొన్ని దేశాలు కరువు ముంగిట ఎందుకు నిలబడాల్సిన పరిస్థితి ఉన్నది?ఎక్కడ ఆహార ధాన్యా ల సరఫరాలో తేడా వచ్చినా,ఈ దేశాలలోనే ఎందుకు భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది? అసలు కరువు ప్రమాదానికి లోనయ్యే పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఎందుకు ఉండవలసిన పరిస్థితి ఏర్పడిరది ?’’ ఈ ప్రశ్నకు వెంటనే వచ్చే సమా ధానం ఈ విధంగా ఉంటుంది. ఈ కరువు దేశా లు స్వయంగా యుద్ధం కారణంగా దెబ్బతిన్న దేశా లుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ కాని, సూడాన్‌ కాని, పశ్చిమ ఆఫ్రికా దేశాలు కాని యుద్ధాల చరిత్ర కలిగివున్నాయి.కొన్నిదేశాలలో ఆయుద్ధాలు ఇటీ వల దాకా సాగుతూనే వున్నాయి. ఈ యుద్ధాల కారణంగా ఆహార సరఫరా దెబ్బ తిన్నది. దాని ప్రభావం వలన ఆ దేశాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఐతే ఈ వివరణ ఏ మాత్ర మూ సరతృప్తినివ్వదు. ఇక్కడ మనం యుద్ధం అంటే రెండు దేశాల మధ్య జరిగేదానినే కాకుండా, ఒక దేశంలో జరిగేఆంతరంగిక తిరుగుబాటును (దీనినే మనం ఉగ్రవాదం అంటున్నాం) కూడా పరిగణన లోకి తీసుకోవాలి. ఐతే ఈ తిరుగుబాట్లు అనేవి వెలుపలి నుండి రుద్దేవి కావు. ఆదేశంలోని పేదరి కంలో,ఆహారం సైతం దొరకని పరిస్థితు లలో ఈ తిరుగుబాట్ల మూలాలు ఉంటాయి. అందుచేత తిరుగుబాట్ల వలన ఆహార లభ్యత దెబ్బ తిన్నదనే వివరణ చెల్లదు. ఇకరెండో విషయం: ఈ యుద్ధా లు, లేక తిరుగుబాట్లు దాదాపు మూడో ప్రపంచ దేశాలన్నింటా జరిగాయి. కానికొన్ని దేశాలు మాత్ర మే కరువు ముంగిట నిలవాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది ? దీనికి సరైన సమాధా నం ఒక్కటే. కొన్ని దేశాలు సామ్రాజ్య వాదుల డిమాండ్లకు తలొగ్గి తమ ఆహార భద్రతను బలి చేశాయి. వలస దేశాలుగా ఉన్న కాలంలో చాలా మూడో ప్రపంచ దేశాల్లో తలసరి ఆహార లభ్యత చాలా ఎక్కువగా పడిపో యింది. దానివలన ఆ దేశాల్లో ఆ కాలంలో కరువు పరిస్థితులు ఏర్ప డ్డాయి. వలసపాలన నుండి విముక్తి సాధిం చాక వాటిలో చాలా దేశాలు తమ దేశీయ ఆహార ధాన్య ఉత్పత్తిని పెంచడానికి పూనుకు న్నాయి. వలసాధి పత్యం నుండి బైట పడడం అంటే అందులో ఆహార స్వయంసమృద్ధి సాధించడం ఒక ప్రధాన అంశంగా ఉన్నది. కాని ఈ ప్రయత్నాన్ని సామ్రా జ్యవాద దేశాలు అడ్డుకున్నాయి. ఆహార స్వయం సమృద్ధి అన్న భావనే సరైనది కాదని, ప్రపంచం అంతా ఒకటే మార్కెట్‌గా ఉన్నప్పుడు చౌకగా లభించే చోట నుండి ఆహారధాన్యాలను కొనుక్కునే వీలు ఉన్నదని,ఆఅవకాశాన్ని వదులు కుని స్వం తంగా పండిరచుకోవాలనే తాపత్రయం ఎందుకని సామ్రాజ్యవాదం వాదించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఎజెండాలో ఇదొక అంశంగా సామ్రాజ్య వాదం జొప్పించగలిగింది. ఆహార స్వయం సమృద్ధి లక్ష్యంగా ఉండేదానికన్నా ప్రపంచ మార్కెట్‌లో వేటికి ఎక్కువ గిట్టుబాటు అవుతుందో ఆపంటలను పండిరచేందుకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలని డబ్ల్యు.టి.వో చెప్తుంది. ఇప్పుడు సంపన్న పెట్టుబడి దారీ దేశాలు కొన్ని రకాల ఆహార ధాన్యాలను ఎప్పుడూ తమ దేశీయ అవసరాలకు మించి ఎక్కువ గా పండిస్తూంటాయి. వాటి వద్ద ఆధాన్యాలు ఎప్పు డూ నిల్వ ఉంటాయి.ఐతే ఉష్ణ,సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో పండే పంటలు చాలా వరకు ఈ సంప న్న దేశాల్లో పండవు. తాజా కూరగా యలు, పళ్ళు,జనుము,పత్తి వంటి పీచు పంటలు, చెరకు, నూనె గింజలు,సుగంధ ద్రవ్యాలు వంటివి అక్కడ పండ వు. మూడో ప్రపంచ దేశాల్లో అధిక భాగం ఈ ఉష్ణ, సమశీతోష్ణ మండల ప్రాం తాలలో ఉన్నాయి. ఆ దేశాల్లో భూ వినియోగాన్ని తమకు అను కూలంగా మార్చగలిగితే, అది రెండు విధాలుగా సంపన్న పశ్చిమ దేశాలకు లాభదా యకం ఔతుంది.తమ వద్దనున్న మిగులు ధాన్యపు నిల్వ లను ఆమూడో ప్రపంచ దేశాలకు అంట గట్ట వచ్చు. తమకు అవసరమైన పంటలను ఆ మూడో ప్రపంచ దేశాల్లో పండిరచేటట్టు చేయడం ద్వారా తమ అవసరాలను తీర్చుకోవచ్చు (ఆ పంట ల్లో బయో ఇంధనానికి ఉపయోగించే మొక్కజొన్న వంటివి కూడా ఉన్నాయి). తక్కిన మూడో ప్రపంచ దేశాల కన్నా ఆఫ్రికా దేశాలు సామ్రాజ్యవాదుల వత్తిడికి ముందుగా తలొగ్గాయి. అందుకనే తక్కిన ప్రపంచంలో కన్నా ఆఫ్రికాలోనే ఎక్కువ దేశాలు కరువు ముంగిట్లో ఉండే దేశాల జాబితా లోకి చేరాయి. వాటిలో నుంచి కేవలం రెండే రెండు దేశాల ఉదాహరణలను చూద్దాం. ఒకటి నైజీరి యా. ఆఫ్రికాలోకెల్లా అత్యధిక జనాభా ఉన్న దేశం ఇది. 20 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. రెండోది కెన్యా.నయా ఉదారవాద విధానాలు అత్యంత జయ ప్రదంగా అమలు చేసిన దేశంగా కెన్యా గురించి సంపన్న పశ్చిమ దేశాలు నిన్నమొన్నటి దాకా పొగుడుతూ వచ్చాయి. ఐరాస కు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ) అందించిన గణాం కాలను బట్టి1990లో నైజీరియా తలసరి తిండి గింజల ఉత్పత్తి 129.37ఉండేది కాస్తా 2019 నాటికి 101.09కి పడిపోయింది. మూడే మూడు దశాబ్దాల లోపల 20శాతం కన్నా అధి కంగా పడి పోయింది. కెన్యాలో కూడా ఇదే కాలం లో తలసరి ఆహారధాన్యాల ఉత్పత్తి 132.82, ఉండి 107. 97కి పడిపోయింది. 1980లోనైతే కెన్యా తలసరి ఉత్పత్తి 155.96 ఉండేది. అంటే నాలుగు దశా బ్దాల వ్యవధిలో ముప్పై శాతానికి మించి పడి పోయింది! ఇంత గణనీయంగా దేశీయ ఉత్పత్తి తగ్గిపోతే ఇక దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు ఆ దేశాలు కరువు ముంగిట నిలబడివుండే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచ మార్కెట్‌లో తక్కువ ధరలకే దొరికేటప్పుడు దేశీయంగా ఎందుకు పండిరచడం అన్న సామ్రా జ్య వాదుల వాదన ఎంత బూటకమో దీనిని బట్టే స్పష్టం ఔతోంది. కొన్ని దేశాలు అన్ని రకాల పంట లనూ పండిరచలేనప్పుడు ప్రపంచ మార్కెట్‌లో పోటీ అన్నది అర్ధం లేనిది. అన్ని దేశాలూ అన్ని రకాల పంటలనూ పండిరచి, తమకు అవసరం లేని వాటిని చౌకగా ఎగుమతి చేసి, కావలసిన వాటిని దిగుమతి చేసుకున్నప్పుడు మార్కెట్‌ సూత్రం వర్తిస్తుంది. కాని కొన్నిదేశాల దగ్గర పెట్టుబడి అధి కంగా పోగుబడినప్పుడు, మరికొన్ని దేశాలు పేద దేశాలుగా మిగిలిపోయినప్పుడు సమన్యాయం వర్తించదు. అటువంటప్పుడు కీలకమైన తిండి గింజల విషయంలో దిగుమతుల మీద ఆధారపడ వలసిన పరిస్థితిని కొని తెచ్చుకోవడం ఏ దేశాని కైనా ఆత్మహత్యా సదృశమే ఔతుంది. వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగిన ప్రతీ దేశంలోనూ ఈ సత్యాన్ని అవగతం చేసుకున్నారు. దేశం స్వతంత్రంగా మనగలగడం అంటే ఆహార స్వయం సమృద్ధి అని నిర్ధారించుకున్నారు. దాన ర్ధం దేశంలో ప్రతీ ఒక్కరికీ సరిపడా తిండి లభించే స్థితి కోసం ప్రయత్నించారని కాదు. కాని కనీస స్థాయి వినియో గాన్ని గ్యారంటీ చేసేందుకు ప్రయ త్నించారు. సామ్రాజ్యవాదుపై ఆధారపడ కుండా మూడో ప్రపంచ దేశాలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి ఆహార స్వయం సమృద్ధి విషయంలో పరస్పరం సహకరించుకున్నాయి. ఈవిధానాన్ని తొలుత ఆఫ్రికా దేశాలు విడనాడాయి. సామ్రాజ్య వాద ఒత్తిడులకు తలొగ్గాయి. అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించు కుంటున్నాయి. కరువు ముంగిట్లో నిలబడివున్నాయి. భారతదేశం స్వతం త్రం వచ్చిన తొలిదినాల్లో ‘’గ్రో మోర్‌ ఫుడ్‌’’నినా దాన్ని చేపట్టి దేశీయంగా ఆహారోత్పత్తిని పెంచా లని ప్రచారం చేపట్టింది. కాని అమెరికా వలలో పడి పి.ఎల్‌-480 పథకం కింద అమెరికా నుండి ఆహారధాన్యాలను కొనుగోలు చేయడం మొదలు బెట్టింది. ఎప్పుడైతే 1960 దశకంలో సంభవించిన కరువు కాటకాల కాలంలో ఈ స్కీము అక్కరకు రాలేదో, అప్పుడే మన ప్రభు త్వానికి జ్ఞానోదయం అయింది. ఆహార స్వయం సమృద్ధి ప్రాధాన్యత బోధపడిరది.ఆ తర్వాత హరిత విప్లవం చేపట్టింది. ఆహరిత విప్లవం తన లక్ష్యా లను సంపూర్ణంగా నెరవేర్చిందని చెప్పలేం కాని ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో మన కాళ్ళ మీద మనం నిలబడగల పరిస్థితి ఏర్పడిరది. కాని సామ్రాజ్య వాదులు మాత్రం మన ఆహార స్వయంసమృద్ధిని దెబ్బ తీయడానికి నిరంతరం ప్రయత్నాలు కొన సాగిస్తూనే వున్నారు. వారి ప్రయత్నాలకు మోడీ ప్రభుత్వం ఊతం ఇచ్చినట్టు వ్యవహరించింది. నల్ల వ్యవసాయ చట్టాలను జారీ చేసింది. కనీస మద్దతు ధర వ్యవస్థను రద్దు చేయడానికి సిద్ధమైంది. మన దేశ ఆహార భద్రతకి ఈ కనీస మద్దతు ధర అనేది చాలా కీలకమైనది. దేశ రైతాంగం సాహసోపే తంగా సాగించిన పోరాటం ప్రస్తుతానికి మనల్ని కాపాడిరది. ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసు కోక తప్పలేదు. ప్రస్తుతానికి మన ఆహార భద్రత నిలబడిరది. కాని అది అంతర్ధానం కాకుండా ఉండాలంటే ప్రజానీకం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే.
ఆకలిచావులు పట్టవు కానీ …
దేశంలోని ఆకలి చావులు పట్టవు… కానీ ప్రజలు తినే ఆహారంపై ఆంక్షలు పెడుతు న్నారు కేంద్ర పాలకులు. బీఫ్‌పై నిషేధం పేరుతో ఆవు,గేదె,ఎద్దు,ఒంటెలను తినడాన్ని నిషేధిం చటం ఒక కుట్రపూరిత చర్య. దీనివెనుక ఈ దేశాన్ని శాఖాహార దేశంగా మార్చాలనే సంఫ్న్‌ సిద్ధాంతం అమలవుతోంది. బీఫ్‌ తినే వారిపై నిన్నటి వరకు మోరల్‌ పోలీసింగ్‌ చేసిన వారు ఇప్పుడు కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని డైరెక్ట్‌ పోలీసింగ్‌ ప్రయోగించబోతున్నారు. ఈదేశంలోని దళిత గిరిజనులు ఇష్టంగా తినే అహారాన్ని ఏవో మతప రమైన కారణాలు చెపుతూ దూరం చేసే పనికి మోడీ సర్కారు సిద్ధమైంది. నిషేధంగా చెప్పబ డుతున్న ఆవు,ఎద్దు,గేదెలను పెంచేది కాసేదీ కడిగేదీ…వాటి యోగక్షేమాలు చూసేదీ ప్రధానంగా దళితులే. ఇవన్నీ సామాన్యుల ఇండ్లలో పెంపుడు జంతువులు.
వ్యవసాయం, పాడి అవసరాలకోసం జంతువులను వాడి, అవి అవసరం తీర్చలేని పరిస్థి తిలో కబేళాలకు అప్పజెప్పటం సహజంగా జరిగే పని. దీన్ని అడ్డుకుంటాం. వీటిని తినేవారిపై దాడు లు చేస్తామనే వారు దీన్ని అడ్డుకోవడానికి వారికి ఉన్న అర్హత ఏమిటో ఆలోచించుకోవాలి? ఇక్కడ మోడీ సర్కారు కాని, ఆ ప్రభుత్వాన్ని వెనకనుండి నడిపిస్తున్న సంఫ్న్‌ సంస్థలు కాని గుర్తుపెట్టు కోవాలిసిన అంశం ఏమిటీ అంటే..బీఫ్‌ అంటే ఎక్కడో అడవుల్లో సహజసిద్ధంగా పెరిగే జంతువుల మాంసం కాదు. ఈ దేశంలోని పేద మధ్యతరగతి ఇండ్లలో వారి చేతులతో పెంచుకునే జంతువుల మాంసం. పెంచుకునే వారి హక్కులు కాలరాసేలా ప్రభుత్వాలు వ్యహరించడం సరైంది కాదు. పైకి బీఫ్‌ని నిషేధిస్తున్నట్టు చెపుతున్నా వారి అసలు టార్గెట్‌ మాంసాహారం లేకుండా చేసే కుట్రే. ఆహారంపై దాడి చేయటం ఏమిటి అనేది దేశం లోని ప్రగతిశీల శక్తుల ప్రశ్న. నిజానికి దేశంలో ఒక్క బీఫ్‌మీద ఏడాదికి లక్షకోట్ల వ్యాపారం జరుగు తోంది. మిగతా జంతువులు అనగా కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు కలిపితే ఇది ఇంకా ఎక్కువే. లక్షలాదిమంది ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు. వీటన్నింటినీ విస్మరిస్తూ తీసుకొనే నిర్ణయాలు దేశ అభివద్ధికి మంచిది కాదు. ఆదిమానవుడి కాలం నుండే మనిషికి మాంసాహారం అలవాటు. దీన్ని వక్రీకరిస్తూ దేవుడికి,మతానికి,నమ్మకాలకి మాంసా హారాన్ని ముడిపెట్టి మాంసం తినడం పాపం అనే వాదనని సంఫ్న్‌శక్తులు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ రోజు మాంసాహారం తినేవారిపై జరగు తున్న దాడి ఈ దేశం తమ భుజాలపై మోస్తున్న ఉత్పత్తి రంగంలో పనిచేసే వారిపై, వారి అహారపు అల వాట్లపై దాడిగానే చూడాలి. అసలు ఇక్కడ మోడీ సర్కార్‌ సమాధానం చెప్పాల్సిన విషయాలు ఏమిటీ అంటే అహారపు అలవాట్లు అనేది వ్యక్తిగత విష యం. కొందరు కొన్ని కూరలు తింటారు, కొందరు తినరు. కొందరు మాంసాహారం ఇష్టంగా తింటా రు, కొందరు అసలు ముట్టరు. ఇది వారి ఇష్టాయి ష్టాలూ అలవాట్లను బట్టి ఉంటుంది. మరి ఇలాంటి వ్యక్తిగత విషయంలోకి పాలకులు ఎందుకు తలదూ రుస్తునట్టు?పాలించే ప్రభువులు చూడాల్సింది దేశంలోని అందరి ప్లేట్లలో ఆహారం ఉందా, లేదా…లేకపొతే ఎందుకు లేదు. అందరికీ ఆహరం చేరాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి అని ఆలోచించాలి. దేశంలోని ప్రజలందరికీ సరిపడు ఆహారం అందుబాటులో ఉందా?ఉపాధి లబి óస్తోందా? ఆహారాన్ని పండిరచే రైతుకు గిట్టు బాటు ధర లేదు. దేశంలో రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్టాల్లో మిర్చి రైతుల గోస అందరికీ తెలిసిందే. తమిళ నాడు మహారాష్ట్ర రైతుల ఉద్యమం చూస్తూనే ఉన్నాం. దేశంలో ఆహారాన్ని ఉత్పత్తి చేసే వారికీ రక్షణ కల్పించలేని కేంద్ర పాలకులకు తినే ఆహారం గురించి అడిగే హక్కు ఎక్కడిది?మరి ఎవరి ప్రయోజనాలకోసం సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నిర్ణయాన్ని కేరళ,బెంగాల్‌,ఢల్లీి లాంటి చాలా రాష్ట్రా లు వ్యతిరేకిస్తున్నా ఏఅజెండా అమలు కోసం కేంద్రం ఈనిర్ణయాన్ని అమలు చేసేందుకు పూనుకుందీ? బీఫ్‌ మీద నిషేధం అమలుచేస్తున్న సర్కారు దానికి శ్రాస్తీయ కారణాలు ఉంటే అర్థం చేసుకోవొచ్చు. కానీ, కొన్ని నమ్మకాల ఆధారంగా నిషేధం ఏమిటి అనే సమాధానం చెప్పాలి. నమ్మ కాలు వేరు,పాలన వేరు,ఒక నమ్మకం కలిగిన వారు వేరే నమ్మకం కలిగిన వారిపై భౌతిక దాడికి దిగ కుండా ఆపడమే పాలకుల పని. కానీ కొన్ని నమ్మ కాలు మోయడమో,వాటి అజెండాగా పాలన నడప డటం సరైంది కాదు.లౌకిక విలువలు కలిగి ప్రపం చానికే ఆదర్శంగా నిలబడిన భారతదేశంలో నమ్మ కాల ఆధారంగా పాలన సాగిస్తామంటే భారత ప్రజలు సమ్మతించరు.-(కందుకూరి సతీష్‌ కుమార్‌)

కొలువు దీరిన కొత్త ప్రభుత్వాలు

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కొత్తప్రభుత్వాలు కొలువు దీరాయి.ఇటు ఆంధ్రప్రదేశ్‌,అటు కేంద్రంలోను బలమైన జట్టుతో కూటమి ప్రభుత్వాలు కొలువు దీరాయి.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది.వీరిలో 30మంది క్యాబినెట్‌,ఐదుగురు స్వతంత్ర, 36సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.పదేళ్ల అనుభవాలు 140కోట్లమంది ప్రజల ఆకాంక్షల మధ్య కొలువుదీరింది మోదీ సర్కారు 3.0. మూడవసారి దేశ నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు. ఆఅరుదైన ఘనత ఒకవైపు,పదేళ్ల తర్వాత సంకీర్ణ బలంపై ఆధారపడిన సమీకరణాలు మరోవైపు నేపథ్యంలో ఈ దఫా ఎన్డీయే పాలన ఎలా సాగనుంది?రాజకీయంగా,ప్రభుత్వ పరం గా వారి ముందున్న ప్రాధాన్యాలు,సవాళ్లు ఏంటి?ఎన్డీయే తొలి వంద రోజుల ప్రణాళిక లో ఏ ఏ అంశాలున్నాయి? ఉమ్మడి పౌరస్మృతి, ఒకటేదేశం-ఒకటే ఎన్నికలతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తోన్న సవాళ్లకు ఇకనైనా పరిష్కారం చూపగలరా ?ఇవే అంశాలపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం లో కొలువు దీరిన ఎన్డీఏ3.0సర్కార్‌ కేబినెట్‌ లో బీజేపీకి 61,ఎన్‌డీఏ మిత్రపక్షాలకు11 బెర్తు లు లభించాయి. మొత్తం 72మందితో మోదీ కేంద్ర కేబినెట్‌ కొలువుదీరింది. ఎన్‌డీఏ ప్రధాన మిత్రపక్షాలైన తెలుగుదేశం,జేడీయూకి చెరో రెండు కేబినెట్‌ బెర్తులు దక్కాయి.ఎల్‌జేపీ(ఆర్‌ వీ),జేడీఎస్‌,శివసేన,రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండి యా,రాష్ట్రీయలోక్‌దళ,అప్నాదళ్‌,హిందూ అవా మీ మోర్చాచెరో ఒక్కకేబినెట్‌ స్థానాన్ని దక్కించు కున్నాయి.
ఏనీలో కూటమి కొత్త కొలువు
ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల ఆనందోత్సాహాలు, అభివాదాల మధ్య నారా చంద్రబాబునాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు.ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్ర గవ ర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చంద్రబాబుతో ప్రమాణం చేయిం చారు.ప్రమాణస్వీకారం అనంతరం పవన్‌ కల్యాణ్‌ తన సోదరుడు చిరంజీవికి పాదాభి వందనం చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటు మరో 24మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో రెండుసార్లు,విభజన తర్వాత నవ్యాంధ్రó ప్రదేశ్‌కు రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌,కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు తమ స్థానాల్లోనే నిలుచుని చప్పట్లతో అభినందనలు పలికారు. అనంతరం వేదిక వద్ద ఉన్న ప్రముఖులంతా చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియ జేశారు.ఆ తర్వాత వరు సగా 24మంది కొత్త మంత్రులచే గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిం చారు. జనసేన అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌,టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌,టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నా యుడు, కొల్లు రవీంద్ర,నాదెండ్ల మనోహర్‌ (జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకు మార్‌యాదవ్‌(బీజేపీ),నిమ్మల రామా నాయుడు, మహ్మద్‌ ఫరూఖ్‌,ఆనం రాంనారా యణరెడ్డి, పయ్యావుల కేశవ్‌,అనగాని సత్య ప్రసాద్‌, కొలుసు పార్థసారథి,బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌,కందుల దుర్గేష్‌ (జన సేన),గుమ్మడి సంధ్యారాణి,బీసీ జనార్ధన్‌ రెడ్డి, టీజీభరత్‌, ఎస్‌ సవిత,వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌,మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రు లందరూ ప్రమా ణంచేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ,రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌లతో చంద్ర బాబు కొత్త కేబినెట్‌ గ్రూప్‌ ఫొటోదిగారు. ప్రమాణ స్వీకార కార్యక్ర మానికి కేంద్ర మంత్రులు అమిత్‌షా,నితిన్‌ గడ్కరీ,జేపీనడ్డా,చిరాగ్‌పాశ్వాన్‌,అనుప్రియా పాటిల్‌,కింజారపురామ్మోహన్‌నాయుడు, శ్రీనివాస వర్మ,పెమ్మ సాని చంద్రశేఖర్‌, మహా రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,(గవర్నర్‌,ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌, శ్రీలంక) తదితరులున్నారు.
-గునపర్తి సైమన్‌

ఈ నిరుద్యోగానికి పరిష్కారం ఎలా..

ఆర్థిక శాస్త్రంలో డిమాండుకు కొరత ఉన్న వ్యవస్థకి, సప్లరుకి కొరత ఉన్న వ్యవస్థకి (పెట్టుబడులకు, ముడి సరుకులకు, కార్మికులకు, టెక్నాలజీకి కొరత ఉండడాన్ని సప్లరుకి కొరత ఉన్నట్టు పరిగణిస్తాం) మధ్య తేడాను చూస్తారు. మొదటి తరహా వ్యవస్థలో స్థూల డిమాండు పెరిగితే అందుకు అనుగుణంగా సరుకుల ఉత్పత్తిని పెంచుకోవచ్చు.డిమాండుకు తగినట్టు సరుకుల సరఫరా లేకపోతే వాటి ధరలు పెరుగుతాయి. ఉత్పత్తిని పెంచడం ద్వారా అటువంటి ధరల పెరుగు లను నివారించవచ్చు. అదే రెండో తరహా వ్యవస్థలో (సప్లరుకి కొరత ఉన్న వ్యవస్థలో) స్థూల డిమాండు గనుక పెరిగితే అది ఉత్పత్తి పెరుగుదలకు దారితీయదు. అప్పటికే ఆ వ్యవస్థలో ఉన్న ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించివున్నందున (అప్పుడు అదనంగా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు) గాని, లేదా ఏవైనా కీలకమైన ముడి సరుకులకో, పరికరాలకో, కార్మికులకో కొరత ఏర్పడినందువలన గాని మార్కెట్‌కు అవసరమైనంత మేరకు ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఉంటుంది. అటు వంటి స్థితిలో స్థూల డిమాండు మరింత పెరిగితే అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. యుద్ధ సమయాల్లో మిన హాయిస్తే సాధారణంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఎప్పుడూ డిమాండుకు కొరత ఉన్న వ్యవస్థగానే ఉంటుంది. అదే సోషలిస్టు వ్యవస్థలో (గతంలోని సోవియట్‌ యూని యన్‌ లేదా తూర్పు యూరప్‌ దేశాల వ్యవస్థలలో) సప్లరుకి కొరత ఉండేది. డిమాండుకు కొరత ఉన్న వ్యవస్థలో గనుక స్థూల డిమాండ్‌ పెరిగితే దానితో బాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
ప్రస్తుతం మన దేశంలో నిరుద్యోగం ఒక తీవ్ర సామాజిక సమస్యగా ఉంది. దాని తీవ్రత తాజా ఎన్నికలలో బిజెపి బలం తగ్గడానికి దోహ దం చేసింది.అందుచేత నిరుద్యోగ సమస్యను అత్యవసరంగా పరిష్కరించవలసిన అగత్యం ముం దు కొచ్చింది.ఈ పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థల్లో పైన తెలిపిన తేడాను దృష్టిలో ఉంచుకోవడం అవసరం. మన దేశంలో ప్రభుత్వ సర్వీసులతో సహా సేవా రంగంలో చాలా గణనీయంగా ఉపాధి కల్పనను కావాలనే తగ్గించారు ఇక్కడ పెట్టుబడికి కొరత అన్న సమస్య ఏదీలేదు.అదే విధంగా మనకి ఇప్పుడు పెట్టుబడికి గాని, కార్మికులకు గాని ఏ ఇతర ఇన్‌పుట్‌లకు గాని కొరత లేదు. ఆహారధా న్యాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. పేదలకు ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయడాన్ని తొలుత ఎకసెక్కం చేసిన మోడీ ప్రభుత్వం కూడా ఉన్న ఆహారధాన్యాల నిల్వలను కుటుంబానికి 5 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నించింది. ఇప్పుడు తగ్గిన నిల్వలను పెంచుకోడానికి అంతర్జాతీయ మార్కెట్‌ నుండి గోధుమలను కొనుగోలు చేయడానికి మన దేశం ప్రయత్నిస్తోంది. దీనికి కారణం ఉన్న నిల్వ లను సక్రమంగా వినియోగించలేక దుర్వినియోగం చేయడమే. అంతేకాని దేశంలో ఇప్పుడు ఆహారధా న్యాల కొరత ఏమీ లేదు.అందుచేత ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న తీవ్ర నిరుద్యోగానికి కారణం డిమాండుకు తీవ్ర కొరత ఉన్న వ్యవస్థే.దీనిని పరి ష్కరించడానికి వెంటనే స్థూల డిమాండును పెం చాలి.దానికోసం ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెం చాలి. ఇప్పుడు చాలా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు గా భర్తీ కాకుండా పడివున్నాయి. విద్యా రంగంలో సిబ్బంది కొరత తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాని ఫలితంగా విద్యా ప్రమాణాలు దెబ్బ తినిపోతు న్నాయి.చివరికి సైన్యంలో సైతం మామూలు స్థాయిలో ఖాళీలను నింపడం లేదు. దానికి తోడు అగ్నివీర్‌ వంటి పథకాలను ప్రవేశపెట్టడం నిరు ద్యోగ తీవ్రతను పెంచింది. ఉపాధి కల్పనలో తక్కిన యజమానులకన్నా ముందుండి దారి చూపవలసిన ప్రభుత్వం నిరుద్యోగాన్ని పెంచడంలో ముందుంది. ద్రవ్యపరంగా నియంత్రణలు అమలులో ఉండడమే దీనికి కారణం. ఇంతకు ముందు మనం డిమాం డుకు కొరత ఉన్న ఆర్థిక వ్యవస్థకి, సప్లరుకి కొరత ఉన్న ఆర్థిక వ్యవస్థకి మధ్య ఉండే తేడాను గురించి చర్చించాం.ఏదైనా ఒకసర్వ స్వతంత్ర దేశపు ఆర్థికవ్యవస్థలో సప్లరుకి సంబంధించిన కొరత ఉండే అవకాశం లేదు. ఇక ఒక సర్వ స్వతంత్ర దేశం మీద ద్రవ్యపరమైన నియంత్రణలు మామూ లుగా ఉండే అవకాశం లేదు. ఏవైనా ద్రవ్య పర మైన నియంత్రణలు ఉంటే అవి అంతర్జాతీయ పెట్టుబడి మన ప్రభుత్వం మీద విధించినవై వుం డాలి, అందుకు ఆఅంతర్జాతీయ పెట్టుబడికి స్థానిక మిత్రులైన దేశీయ కార్పొరేట్‌-ద్రవ్య పెట్టుబడి ముఠా తోడై వుండాలి. అంటే ద్రవ్య నియంత్రణతో మన దేశం తన స్వయం నిర్ణయాధికారాన్ని కొంత మేరకు కోల్పోయినట్టు భావించాలి. అంతే తప్ప స్వతహాగా మన ప్రభుత్వం ఏవో పరిమితుల మధ్య ఉన్నట్టు కాదు. నిజానికి డిమాండుకు కొరత ఉన్న వ్యవస్థలో ఆడిమాండును పెంచడానికి అవస రమైన అదనపు వ్యయాన్ని ప్రభుత్వం చేయాలంటే అందుకు ఆటంకం ఏమీ ఉండదు. 90 సంవత్స రాల క్రితమే కాలెక్కీ-కీన్స్‌ సైద్ధాంతికంగా అర్థ శాస్త్రంలో తెచ్చిన పెనుమార్పులు ఆటంకాలు వుంటాయనే వాదాన్ని తిప్పికొట్టాయి.అప్పుడు తిర స్కరించబడ్డ వాదనలనే ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యయం మీద పరిమితులు బడా కార్పొరేట్లు విధించినవే తప్ప స్వతహాగా ఉన్నవి కానే కావు. అందుచేత అంతర్జా తీయ, దేశీయ బడా పెట్టుబడి దురాశాపూరితమైన నిబంధనల ఉచ్చు నుండి బైటపడి, నిరుద్యోగాన్ని పరిష్కరించేందుకు తన దృఢ నిశ్చయాన్ని ప్రభు త్వం ప్రదర్శించాల్సి వుంది.
ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచడానికి ద్రవ్యలోటును పెంచి ఖర్చు చేయాల్సి వుంటుంది. దానివలన ఉపాధి కల్పన పెరుగుతుంది. ఇలా ద్రవ్యలోటు పెరిగితే దాని ఫలితంగా ప్రైవేటు పెట్టు బడులు తగ్గుతాయన్న వాదనలు పస లేనివి. నిజానికి ద్రవ్యలోటు పెరిగితే దానివలన కలిగే నష్టం ఏమిటంటే అది సంపదలో అసమానతలు పెరగడానికి దారితీస్తుంది. ఇదెలాగ జరుగుతుందో చూద్దాం. ఉదాహరణకు ప్రభుత్వం రూ.100 మేరకు తన వ్యయాన్ని పెంచిందనుకుందాం. అందుకోసం అప్పు చేసింది అనుకుందాం (ద్రవ్య లోటు పెంచడం అంటే అప్పు చేసి ఖర్చు చేయ డమనే అర్థం).అలా ఖర్చు చేసిన రూ.100 చివరికి పెట్టుబడిదారుల దగ్గరకే చేరుతాయి (ముం దు కార్మికులకు అందినా,ఆ సొమ్మును వారు ఖర్చు చేస్తారు గనుక అంతిమంగా ఆసొమ్ము పెట్టుబడిదారుల దగ్గరకే చేరుతుంది). ప్రభుత్వం ఆ పెట్టుబడిదారుల నుండే అప్పు తీసుకుంటుంది. దీనిని ఇంకా బాగా అర్ధం చేసుకోవాలంటే మనం ఆర్థిక వ్యవస్థని మూడు విడివిడి భాగాలుగా విడ దీసి చూడాలి. మొదటిది: ప్రభుత్వం. రెండోది: శ్రామిక ప్రజలు,మూడోది : పెట్టుబడిదారులు. ఈ మూడు భాగాల దగ్గర ఏర్పడే లోటు అంతా కలిపితే ఎప్పుడూ సున్నాగానే ఉంటుంది (లోటు అంటే అప్పు చేసి ఖర్చు చేయడం. ఒకడు అప్పు చేయాలంటే దానిని ఇచ్చేవాడు మరొకడు ఉండాలి కదా.ఇద్దరిదీ కలిపితే నికరలోటు సున్నా అవు తుంది కదా). శ్రామిక ప్రజలు ఎంత సంపాదిస్తారో అంతా ఖర్చు చేసేస్తారు. అందుచేత వారివద్ద లోటు ఏమీ ఉండదు (వాళ్ళలో వాళ్ళు ఒకరికొకరు అప్పులిచ్చుకోవాలే తప్ప పెట్టుబడిదారులు పేదలకు అప్పులివ్వరు). అందుచేత ప్రభుత్వం అప్పు చేసి ఖర్చు చేయాలంటే అంతిమంగా అది పెట్టుబడిదా రుల నుండే మిగులు నుండే చేయాలి. ప్రభుత్వం బ్యాంకుల నుండి మొదట రూ.100 అప్పు తెచ్చి ఖర్చు చేస్తుంది.ఆ ఖర్చు అంతిమంగా పెట్టుబడి దారుల దగ్గరకు చేరుతుంది. అప్పుడు ఆ పెట్టుబడి దారుల నుండి ప్రభుత్వం రూ.100అప్పు తెచ్చి బ్యాంకుల అప్పు తీరుస్తుంది.ఈ క్రమంలో పెట్టు బడిదారుల దగ్గర రూ.100 మిగులు పోగుబడు తుంది. దీనివలన పెట్టుబడిదారులు అదనంగా కష్టపడేదేమీ లేదు సరికదా,వారికి మిగులు చేరు తుంది.ప్రభుత్వం చేసే అదనపు వ్యయం వలన ఈ పెట్టుబడిదారుల దగ్గర అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సరుకులు చెల్లుబాటు అవుతాయి. దానితోబాటు అదనంగా సంపద పోగుబడుతుంది. ఇది సంపద అసమానతలకు దారి తీస్తుంది. ఈ విధంగా సంపదలో అసమానతలు పెరిగిపోకుండా ఉండాలంటే,పెట్టుబడిదారుల దగ్గర పోగుబడిన అదనపు సంపదను పన్ను రూపంలో ప్రభుత్వం తిరిగి తీసుకోవాలి.అలా తీసుకున్నందువలన పెట్టుబడిదారులకు అంతవరకూ ఉన్న సంపద ఏమీ తగ్గిపోదు. కేవలం అదనంగా పోగుబడినది మాత్రమే పన్ను రూపంలో వెనక్కి పోతుంది. అంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచి నిరుద్యోగాన్ని తగ్గించ డం ద్వారా అంతరకూ పెట్టుబడిదారుల దగ్గర పోగుబడిన సంపద ఏమీ తగ్గిపోదు. అందుచేత అంతర్జాతీయ, దేశీయ బడా కార్పొరేట్లు ఎటువంటి ఆటంకాలు కల్పించినా,వాటన్నింటినీ అధిగ మిం చే ధైర్యాన్ని ప్రభుత్వం ప్రదర్శించగలిగితే నిరు ద్యోగాన్ని పరిష్కరించవచ్చు. ముందు ప్రభుత్వ విద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో ఉన్న బోధన, బోధనేతర పోస్టులనన్నింటినీ భర్తీ చేయాలి. అదే విధంగా వైద్య రంగంలో కూడా భర్తీ చేయాలి. ఆతర్వాత ఈరంగాల్లో అదనపు పోస్టులను మం జూరు చేయాలి. అప్పుడు పతనమౌతున్న మన విద్యా, వైద్య ప్రమాణాలను నిలబెట్టగలుగుతాం. వాటితోబాటు ఇప్పుడు ఉనికిలో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలి. దానికి విధించిన పరిమితు లను ఎత్తివేయాలి. గ్రామాల్లో ఎంతమంది పని కావాలని అడిగితే అంతమందికీ పనులు కల్పిం చాలి.ఆపథకాన్ని పట్టణ ప్రాంతాలకూ విస్తరిం చాలి. ఆ పథకం కింద చెల్లించే వేతనాలను కూడా సహేతుకంగా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచాలి.
ఈ మూడూ చేస్తే దాని ఫలితంగా దేశ ఆర్థికవ్యవస్థలో అనేక రకాల వినిమయ సరు కులకు డిమాండ్‌ బాగా పెరుగుతుంది. ఇప్పుడున్న ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తి స్థాయి మేరకు వినియో గించగలుగుతాం. అంతేకాక అదనపు సామర్ధ్యాన్ని కూడా నెలకొల్పవలసిన పరిస్థితి వస్తుంది. ముఖ్యం గా చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో అభివృద్ధికి ఇది దారి తీస్తుంది (ఆ పరిశ్రమలకు అవసరమైన రుణ సదుపాయాలను కూడా కల్పించాల్సి వుం టుంది).అంటే, ప్రభుత్వం తన వ్యయం ద్వారా కల్పించే అదనపు ఉపాధి వలన ప్రైవేటు రంగంలో కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వం చేసే ఈ అదనపు వ్యయానికి కావలసిన ఆర్థిక వనరులను సమీకరించడానికి పెట్టుబడి దారుల మీద,తక్కిన బడా సంపన్నుల మీద అద నపు పన్నులు విధించాలి. వారి ఆదాయాలమీద, వారి దగ్గర వున్న సంపద మీద పన్నులు విధిం చాలి. ముఖ్యంగా వారి స్థిరాస్తుల మీద,వారి నగదు నిల్వల మీద (షేర్ల రూపంలో ఉన్నవాటితో సహా) అదనపు పన్నులు వేయాలి.దానివలన వారు పెట్టే పెట్టుబడులు ఏమీ తగ్గిపోవు.సంపదమీద పన్ను సమర్ధవంతంగా వసూలు కావాలంటే వారసత్వ పన్ను కూడా అదే సమయంలో విధించాలి. మన దేశంలో ఇప్పుడు సంపద పన్ను కాని,వారసత్వ పన్ను కాని అమలు చేయడంలేదు.నయా ఉదార వాద శకంలో కొద్దిమంది దగ్గర విపరీతంగా సంపద పోగుబడుతున్నప్పుడు, అసమానతలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఈ మాదిరి పన్ను లు అసలే లేకపోవడం దిగ్భ్రాంతికరం. అదే సమ యంలో ఈరెండు రకాల పన్నులనూ ఇప్పటి నుంచైనా అమలు చేస్తే ప్రభుత్వం దగ్గర పెద్ద మోతాదులో ఆర్థిక వనరులు సమకూరే అవకా శాలు మెండుగా ఉన్నాయని స్పష్టంగా కనపడు తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ఒక్కటే తక్షణ పరిష్కారం.ఆ అదనపు ప్రభుత్వ వ్యయానికి కావలసిన వనరులను సమీకరించ డానికి సంపద పన్ను, వారసత్వ పన్ను విధించడమే సముచిత మార్గం.దీనివలన ఒకే దెబ్బకు అనేక పిట్టల్ని కొట్టవచ్చు.ఒకటి:ఉద్యోగాలు పెరుగు తాయి,రెండు:సంపద అసమానతలు పెరిగి పోకుం డా అదుపులో ఉంటాయి. తద్వారా ప్రజా స్వామ్యం బలపడుతుంది, మూడు: విద్యా, వైద్య ప్రమాణాలు మన దేశంలో మెరుగుపడతాయి.(ప్రజాశక్తి సౌజన్యంతో..)`(స్వేచ్ఛానుసరణ)- (ప్రభాత్‌ పట్నాయక్‌)

అడవిపూల కదంబ మాల`ఆత్మగోష

ఆదివాసీల‘ఆత్మఘోష’ ను అక్షరీకరించి ఎత్తిచూపిన పాండు కామ్టేకర్‌ కథాత్మక కథనాల గుచ్చం ఇప్పటి వరకు తెలుగు కథా సాహిత్యాన్ని గిరిజనుల జీవిత ఇతివృతాలతో సుసంపన్నం చేసిన గిరిజన,గిరిజనేతర రచయితలు కూడా అబ్బుర పడేటంత గొప్పగా సంకలనీకరించిన అడవిపూల కదంబ మాల ఈ కథనాత్మక కథనాల సంపుటం…
అన్నం వండడానికి పొయ్యి మీద ఎసరు, పొయ్యి కింద మంటపెట్టి గాలికి వదిలేస్తే ఎసరొచ్చిన తరువాత ఆ అన్నం కుండ మీది మూత దానంతట అదే పైకి లేచి కిందపడిపోతుంది. అదే విధంగా తన గుండే గాడి పొయ్యిలో ఎసరులా మసిలిపోతున్న గిరిజనుల జ్ఞాపకాల భారాన్ని భరించి, భరించి ఇక భరించలేని స్థితిలోకి వచ్చిన కామ్టేకర్‌ అప్పటిదాకా ఎటువంటి రచనా చేసిన అనుభవం లేకపోయినప్పటికీ తను అనివార్యంగా ఈ కథా కథనాత్మక రచనకు శ్రీకారం చుట్టారు.

కామ్టేకర్‌ తన యాభై రెండేండ్ల జీవనయనంలో సుమారు పాతిక సంవత్సరాల పాటు ఆంత్ర పాలజిస్ట్‌ లపాలిటి బంగారు గని లాంటి ప్రాంతమైన చింతూర్‌ సమీప గ్రామమైన ‘కోయత్తూర్‌ బాట’ రామన్నపాలెంలో ఓస్వచ్ఛంద సంస్థలో నూటికి నూరుపాళ్ళు నిమగ్నమై, అదివాసీ జీవితాలకు సంబంధిం చిన సమస్త కోణాలనూ ఔపోసన పట్టినవాడు. పాఠకులు అతిశయోక్తి అనుకోకుంటే కామ్టేకర్‌ మన తెలంగాణాకు చెందిన మరో హైమం డార్ఫ్‌గా పేర్కొనదగినవాడు.తన స్వంత కుటుంబంతోపాటు మొత్తం ఆదివాసీ సమా జాన్నే తన బలగంగా భావించి,వారి అభ్యు న్నతికి తన పరిధి మేరకు అనేక విధాలుగా శ్రమించిన ఆదివాసీ ప్రేమికుడు. గిరిజన జీవితాలతో తనకున్న రెండున్నర దశాబ్దాల అనుబంధంలో తటస్థపడిన ప్రతి అనుభవాన్ని తన గుండెకవాటంలో తోరణాలుగా గుచ్చి ఒరుగులుగా దాచు కున్నవాడు కామ్టేకర్‌. తన వ్యక్తిగత,ఆరోగ్య కారణాలతో వ్యక్తిగా కోయ త్తూర్‌ బాట నుండి బయటికొచ్చినా మానసి కంగా తను అను నిత్యం గిరిజన జీవితాలనే శ్వాసిస్తున్న వ్యక్తి. అన్నం వండడానికి పొయ్యి మీద ఎసరు, పొయ్యి కింద మంటపెట్టి గాలికి వదిలేస్తే ఎసరొచ్చిన తరువాత ఆ అన్నం కుండ మీది మూత దానంతట అదే పైకి లేచి కింద పడి పోతుంది. అదే విధంగా తన గుండే గాడి పొయ్యిలో ఎసరులా మసిలిపోతున్న గిరిజనుల జ్ఞాపకాల భారాన్ని భరించి,భరించి ఇక భరించ లేని స్థితిలోకి వచ్చిన కామ్టేకర్‌ అప్పటిదాకా ఎటువంటి రచనా చేసిన అనుభవం లేకపోయి నప్పటికీ తను అనివార్యంగా ఈకథా కథనా త్మక రచనకు శ్రీకారం చుట్టారు. దాని ఫలి తమే మన చేతుల్లో వున్న ఈ సంపుటం. ఇందులో కోయపల్లె, పురుడు పోయడం,కొడ కల్పడం,బాణం తయారీ, సంతకు తయారీ, భూమి పండుగ, సుక్కుడు కాయ పండుగ,తాటి పండుగ,ఇప్పపూల పండుగ,కొలుపుల పండుగ,పెద్దమనిషి,చావు, కీడు నీళ్ళు,దినాలు, పేతర్లముంత,ఇంటి నిర్మాణం, గ్రంధాలయం, పెళ్లి,నేల-ఉపాధి,చీమ గుడ్ల కారం, ఆదివాసీ (కోయత్తూర్‌) కులమా? మతమా?, పోలవరం నిరసనలు,ఒంటరి మహిళలు-జీవన విధానం, గుజిడి, పోలవరం ప్రాజెక్ట్‌-తీరుతెన్నులు, ఓదార్పు-సమస్త జీవజాల మద్దతు,సమస్త సమాజానికి సూటి ప్రశ్న అనే ఇరవై ఎనిమిది శీర్షికలతో వ్రాసిన కథాత్మక కథనాలున్నాయి. ప్రతి కథనం ఒక్కో సమస్యను పాఠకుల ముందుకు తీసుకొచ్చి సవివరంగా వాటిని గురించి మనకు వివరిస్తూ మనను మనకు తెలియని లోకంలోకి చేయిపట్టి నడిపించుకు పోతాడు రచయిత కామ్టేకర్‌. మొట్ట మొదటి కథాకథనంలో ‘కోయపల్లె’లో చింతూర్‌ చుట్టుపక్కల ఉళ్ళన్నీ గుంపుల సముదాయం. ఒక్కొక్క గూడెంలో నాలుగు నుండి ఎనిమిది గుంపులుంటాయి.ప్రతి గుంపుకి ఓఇంటి పేరు వుంటుంది.ఆ ఇంటి పేరు వారే గుంపులో ఎక్కువగా వుంటారు. స్తూపాకారంతో చెక్కిన ఓవేప కర్రను పాతి, దాని చుట్టూ మట్టితో గద్దె వేస్తారు. దాన్ని ‘గామం’ లేదా బొడ్రాయి అంటారు. అక్కడే కొలుపుల పండుగ చేస్తారు. పండుగప్పుడు వెదురు బుట్టలో ఒక మట్టి ముంతను పెడతారు.దాన్ని ‘ముడుపు ముంత అంటారు. అందులో వున్న నీళ్ళల్లో పసుపు కలుపుతారు. ఆ పసుపును ‘బండారు’ అంటారు. ఆబండారును గుంపుల్లో అంటు వ్యాధులు ప్రబలినప్పుడు పిల్లలకు బొట్టు పెడతారు. వేల్పులు ఉన్న చోటును ‘అనె గొందే’ అంటారు. జువ్వి లేదా మద్ది చెట్టును గ్రామ దేవతగా ముత్యాలమ్మ పేరుతో కొలు స్తారు. పురుడు పోయడం కథా కథనంలో మంత్రసాని భద్రమ్మ ద్వారా గుంపుల్లో పురుడు ఏవిధగా పోస్తారో కూలంకషంగా వివరించిన సంద ర్భంలో కథకుడి జిజ్ఞాస ఏస్థాయిలో కొనసాగిందో మనకు అర్ధమౌతుంది. అదివా సీల్లో అమ్మాయి పుడితే కొడవలితోను, అబ్బాయి పుడితే బాణంతోనూ బొడ్డు కోస్తారట. ఈగ్రా మాల్లో గల గల పారే ఏటి దారిలో ఏర్పడే చిన్న చిన్న గుంతలను ‘అలంధర్‌’ అంటారట. ఈ అలంధర్ల దగ్గర ఆదివాసీలు విశ్రాంతి తీసుకుంటుంటారు.‘కొడ కల్పడం’అనే మరో కథా కథనంలో హిందూ ధర్మంలో కొన్ని సామాజిక వర్గాల్లో యుక్త వయస్కులౌతున్న మగపిల్లలకు మెడలో జంద్యము వేసి,దాన్ని ‘ఒడుగు’అంటారు. అదే ముస్లీముల్లో మగ పిల్లలకు సున్తీలు చేసి, ఒడుగు అంటారు.ఇక క్రైస్తవుల్లో ఓ నీటి మడుగులో చేయించే పవిత్ర స్నానాన్ని బాప్థిజమ్‌ పేరుతో ఒడుగు అంటారు. అదే ఆదివాసీల్లో పన్నెండేండ్ల మగపిల్లలందరినీ ఒకరోజు దేవర దగ్గరకు తీసుకుపోయి కోల్లను కోసి,వాటి మాంసంతో ఘాటైన చారు కాస్తారు. ఆ చారును ‘జొమ్ము’ అంటారు. ఆ చారుతో పాటు సారా,కల్లులను తాపించి పెద్దవాళ్ళతో సమానమైన హోదా ఇస్తారు.దాన్నే ఒడుగు అంటారు. ఆవిధంగా ఆలోచించి చూస్తే అన్నీ ధర్మాల్లోకల్లా అదీవాసీ ధర్మంలోనే అందరికన్నా ముందుగా ఈఒడుగు అనే ఆచారం ఆచరణలో వున్నట్టుగా అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. ‘బాణం తయారీ’ కథా కథనంలో అడవిలో సంచరించే ఆదివాసికి బాణం అతిముఖ్యమైన వేట సాధనం.దాన్ని తయారు చేయడానికి ఎంతో నైపుణ్యం కావాల్సి వుంటుంది. ముందుగా పిల్లల్లు అడుకోడానికి చిన్న విల్లు బాణాలను తయారుచేసి ఇస్తారు. వాటిని ‘‘డుమ్మిరి విల్లు’’అంటారు.ఆ డుమ్మిరి విల్లే తదనంతరకాలంలో ‘డమ్మీ’ అనే ఆధునిక పదంగా మారిపోయి విస్తృత జనబాహుళ్యంలో వాడుకలో కొచ్చింది.‘ఎర్రగడ చేపలు’ అంటే? కొన్నిసార్లు ఎక్కువ చేపలు దొరికినప్పుడు కొన్ని తిని, మిగతా వాటిని తాటి కమ్మల్లో కాల్చి, దోరగా వేయించి,ఎండలో ఎండబెడతారు. వీటినే ‘ఎర్రగడ’ చేపలు అంటారు. వీటి రుచి ఆదివాసులకు ఎంతో ప్రీతి పాత్రమైనది. ‘సంతకు తయారు’ కథలో నేటి షాపింగ్‌ మాల్స్‌ కి మూల రూపమైన గిరిజన సంతలను గురించి కథకుడు చాలా విలువైన సమాచా రాన్ని అందించారు.అంతేకాదు నేటి ఆధునిక హెయిర్‌ డ్రెస్సర్స్‌ కు ఏమాత్రం తీసిపోని హెయిర్‌ డ్రెస్సర్స్‌ ఆదివాసీ మహిళల్లో ఏనాటి నుండో ఊహించ లేనంత కళాత్మకంగా వుండేదో కథకుడు ఎంతో వివరంగా తెలియజేశాడు.‘భూమి పండుగ’ కథా కథనం లో ఆదివాసీలు ప్రతిరోజూ సాయం కాలం తాటి కళ్ళు దింపుకుని వచ్చి,ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ,తాక్కుంటూ, ఏదో ఒకటి నంజుకుంటూ గడుపుతారు.అట్లా కూర్చునే తావునే ‘‘గుజిడి’’ అంటారు.ఇట్లాగే ఇంకా మిగిలిన కథా కథనాల్లో కూడా మనకు తెలియని అనేక అంశాలను సందర్భో చితంగా వివరించిన రచయితకు ఆదివాసీల ఆచారవ్యవ హారాల్లో ఎంతటిలోతైన అవగాహన వుందో తెలుసుకుంటున్నా కొద్ది మనం ఆశ్చర్యచకి తులమై పోతుంటాము. వాటిల్లో మచ్చుకు కొన్ని….. కమతం అంటే? :- ఎక్కడైనా ఒక్కరే వ్యవసాయం చేసుకోవడం సాధ్యపడదు. అందుకే మూడు నాలుగు కుటుంబాలు కలిసి వారి భూమిని సమిష్టిగా కలిసి దున్నుకుని సాగుచేయడానికి చేసుకునే ఒప్పందం. ఈ కమతాల భావనే తదనంతర కాలంలో సహకార వ్యవసాయానికి మాతృక అయ్యిందేమో అన్పిస్తుంది.
రాగిపట్ట అంటే? :- గ్రామస్తులందరి భూమిని కలిపి ఒకే ఒక పట్టా రాగిరేకు పైన రాసి వుండేది.దీన్నే రాగి పట్టా అంటారు. నెయిదం అంటే? :- భూమి పండుగనాడు దేవతకు బలి ఇచ్చే జంతువు మాంసంతో చేసే వంటకం.ఆ మాంసంలోనే బియ్యం,పసుపు, కారం,ఉప్పు నూనె ప్రతి ఇంటి నుండి తెచ్చినవి అదే పాత్రలో వేసి,నీళ్ళు పోసి,దగ్గరికి ఉడికి స్తారు.అదే నేయిదం. ఆధునికులు చేసుకునే బిర్యానికి ఈ నేయిదమే మూలం అనవచ్చును. ‘కోయ వాళ్ళు’ అంటే? :- దేవరకు పెట్టే కోడిని కత్తితో కోయకుండా నేలకు కొట్టి చంపి, కోసు కుని తింటారు. కాబట్టి వాళ్ళను ‘కోయని వాళ్ళు’,కోయత్తురు అని అంటారు. పూర్ణ కల్లు అంటే? :- రోజు దించే కల్లును, దించకుండా వారంరోజులు వుంచితే చెట్టుకు కట్టి వుంచిన వెదురు గొట్టం నిండుతుంది. అలా నిండిన కల్లును ‘పూర్ణకల్లు’అంటారు. ఇప్ప పూల పండుగ అంటే :- ఇప్పచెట్టు పాలతో బండ కత్తుల పిడులను, కొడవళ్ళ పిడులను ఊడిపోకుండా వుండడానికి సన్నని ఇసుకతో కలిపి,పిడి చుట్టూ వున్న సందుల్లో ఇప్ప ఆకు పాలు పోస్తే ఆ పిడి గట్టిగా రాయిలాగా అతుక్కుంటుంది.అంతటి మహిమ గల చెట్టుకు మొట్టమొదటి సారిగా రాలిన పువ్వులను సేకరించే సందర్భంగా చేసుకునే పండుగానే ‘‘ఇప్పపూల పండుగ’’ అంటారు. బట్టలను ఉతకాలంటే :- మద్ది ఆకు బూడిదలో బట్టలన్నీ నానబెట్టి ఉతికితే మురికి అంతా పోయి, బట్టలకు కమ్మని వాసన వస్తుంది. వార్తలు :- చావు వార్తలు చెప్పడాని వెళ్ళేటప్పుడు చేతుల్లో గొడుగు పట్టుకెళితే అది కీడు కబురని అందరికీ తెలుస్తుంది.ఆ ప్రయాణాన్ని ఆపకుండా మిగతా వాళ్ళు సహకరిస్తారు. అదే శుభకార్యమైతే బాణం పట్టుకు పోతారు. వెట్టి అంటే?’’ :- ఆదివాసీలు తమ తమ ఇండ్లను పూర్తిగా సహకార పద్ధతిలో కట్టుకుంటారు. ఈ పద్ధతినే ‘వెట్టి’ అంటారు.కానీ,ఇదే వెట్టి అనే పదానికి భూస్వామ్య వ్యవస్థలో పేదవారు ముఖ్యంగా కులవృత్తుల వారు,భూస్వాములకు కొన్ని తరాలపాటు జీతం,బత్తెం లేని సేవలు చేయడాన్ని కూడా వెట్టి అంటారు.దీన్ని బట్టి ఒకే పదానికి సమాజాన్ని బట్టి,కాలాన్ని బట్టి అర్ధం మారిపోతుందన్న విషయం మన దృష్టికి వస్తుంది.
పెళ్లి అనే కథలో :- ఆదివాసీల్లో పెళ్లి చూపుల తతంగం ఏడు అంచలుగా సాగుతుంది. వాటిలోనూ పెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయి తరపువాళ్ళు ఏ ఒక్కరూ ఒకే తల్లి పాలు తాగివుండకూడదు.వాళ్ళ వరుసలు, గట్టులు అనుకూలంగా వున్నా, వారు ఒక తల్లి పాలు తాగితే వారి మధ్య అన్నా చెల్లి వరుస వున్నట్టుగా భావిస్తారు. అటువంటి బంధాన్ని ‘పాలవంకలు’ అంటారు. ఆటువంటి పెళ్ళిని వారు అంగీకరించరు.పెద్దల కారణంగా వచ్చే ఈ బాధలన్నీ పడలేకనే ప్రేమించుకున్న అమ్మాయిలు,అబ్బాయిలు చాలామంది లేచి పోయి,కొన్నాళ్ళ పాటు సహజీవనాలు సాగించి, ఆ తరువాత మెల్లగా పెళ్లిళ్లు చేసు కుంటారు. మామిడాకులన్నీ ఓచెట్టు చివరలో గుత్తులు గుత్తులుగా వుంటాయి. కొన్ని ఆకులు ఒకదాని కొకటి అంటుకొని ఒక సొరకాయ బుర్ర మాదిరిగా,గుండ్రంగా డొప్పలు డొప్పలు గా కట్టివుంటాయి.ఆ డొప్పల పైన వున్న రంద్రము లోకి ఎర్రచీమలు వస్తూ పోతూ వుంటాయి.ఆ చీమలను ‘అల్లి పెత్తెలు’ అంటారు.చీమలు ఆగూళ్ళల్లో పెట్టిన గుడ్లను సేకరించిన ఆది వాసీలు వాటిని చక్కగా వేయించి కారప్పొడి గాను,చారుగాను తయారు చేసుకుని తింటారు. అవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఈ విధంగా పుస్తకం అంతటా మనం ఎరుగని ఆదివాసీల జీవితానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎవ్వరూ ప్రస్తావించని అనే విషయా లను కామ్టేకర్‌ తనదైన శైలిలో మనకు అందిం చడమే కాదు. ముందు తరాల గిరిజనులకు ఒక నిధిని సమకూర్చి పెట్టిన వారుగా మిగిలిపోతారు. ప్రధానంగా ఆదివాసీ బిడ్డల సేవా కార్యక్ర మాల్లో మునిగిపోయిన కామ్టే కర్‌కి రచనా ప్రక్రియల్లో ప్రవేశం లేకుండా పోయింది.ఆ కారణం చేతనే ఎంతో విలువైన సమా చారాన్ని పాఠకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించే కథన పద్ధతిలో వ్రాయలేక పోయా రేమో అన్పిస్తుంది.అదో ప్రధానమైన లోపంగా మిగిలిపోయింది. అయినప్పటికీ ఇప్పటివరకూ ఎవరూ పట్టుకొని విధంగా ఆదివాసీ దేవతల ఆత్మల ద్వారా కథనాలను నడిపించడం వినూత్నంగా వుంది. పాతికేళ్ళపాటు తన కార్య స్థానమైన రామన్న పాలెం పరిసర ప్రాంతాలన్నీ పోలవరం ముంపులో జలసమాధి కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఆదివాసీల ఆత్మఘోషను వాళ్ళ దేవతల ఆత్మఘోషగా వెల్లడిరచడం అతని ఊహాశక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.ముద్రా రాక్షసం కూడా అక్కడక్కడా కొంచం పాఠకుణ్ణి విసిగించే ప్రమాదం పొంచివుంది.
పై రెండు లోపాలను మినహాయిస్తే ఇప్పటి దాకా తెలుగులో వచ్చిన గిరిజన సాహిత్యంలో ఈ పుస్తకం ఒక మైలు రాయిగా నిలిచిపో యేంత గొప్పగావుంది.-ఇది శీరాంషెట్టి కాంతా రావు. రచయిత కామ్టేకర్‌ భవిష్యత్తు లోనూ ఇటు వంటి విలువైన మరిన్ని పుస్తకా లను వెలువరించాలని కోరుకుందాం!.
ఆత్మఘోష కథాసంపుట కోసం..:
ప్రచురణ : బోధి ఫౌండేషన్‌ పేజీలు : 241 ధర : 400/- రూ.లు.
సెల్‌ నెం. : 63004 84726

ప్రామాణిక వివరణ గిరిజనులు తిరుగుబాట్లు

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘ ప్రో ॥ రామ్‌దాస్‌ ’ కలం నుంచి జాలువారిన పరిశోధనాత్మకమైన ‘ తెలంగాణలో గిరిజనులు తిరగుబాట్లు’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
మానవ జీవనమే పోరాటాలమయం మనిషి జీవిత కాలం ఏదో ఒక పోరాటాన్ని ఎదుర్కొంటూనే మనుగడ కోసం జీవన పోరాటం సాగించక తప్పదు. మానవ సమాజానికి మూలవాసులుగా ఆదివా సులుగా అభివర్ణించబడుతున్న ఈ అడవి బిడ్డల జీవితమే ఒక పోరాటం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విభిన్న పేర్లతో జీవిస్తున్న ఈ ఆదివాసులు ప్రతి పోరాటానికి మూలవాసులే అనాలి.
ఇక మన తెలుగు ప్రాంతాల్లోని గిరి బిడ్డలు అటు ఆదిలాబాద్‌ నుంచి ఇటు నల్లమల మీదుగా ఉత్తరాంధ్ర వరకు వ్యాపించి ఉన్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌ లోని గోండులు పేరు చెప్పగానే కొమరం భీం పోరాటం, ఉత్తరాంధ్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన తిరుగుబాట్ల పోరాటాలు, శ్రీకాకుళం గిరిజన తిరుగుబాటు మనకు తెలిసిందే!!
మనుగడ కోసం మొదలైన పోరాటం స్వాతంత్రం కోసం తీవ్ర రూపందాల్చింది. చివరికి స్వరాజ్యదేశంలో కూడా ప్రాంతీయత కోసం,అస్తిత్వాలు కాపాడుకోవడం భూమి కోసం భుక్తి కోసం ఆధునిక తిరుగుబాట్లు పోరాటాలు కొనసాగుతున్నాయి.
పోరాటాలను సమాజ విధముగా చర్యలుగా చూస్తూ వాటిని కూకటివేళ్లతో బికిలించి సమూలంగా నాశనం చేయాలనుకుని రక్షణ దళాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ..అనేకమంది అమాయకులను బలి చేస్తున్న పాలకులు అసలు పోరాటాలకు మూల కారణం గురించి ఆలోచించడం లేదు.
అచ్చంగా అలాంటి ఆలోచన కోసమే ప్రొఫెసర్‌ రాందాస్‌ రూపావత్‌ పరిశోధ నాత్మకంగా గణాంకాలతో అందించిన ప్రామాణిక పుస్తకమే ‘‘తెలంగాణలో గిరిజనులు తిరుగుబాట్లు’’
ఈ పుస్తకంలో గిరిజనులు చేసిన పూర్వ పోరాటాలు వాటి నేపథ్యం వివరిస్తూ గిరిజనులకు అందించాల్సిన అవకాశాలు, చేయబడ్డ చట్టాలు గురించి క్షుణ్ణంగా వివరించారు రచయిత రామదాస్‌,
తెలంగాణలో గిరిజనులు భూస్వాములు మొదలు ఉద్యమ దశలు కొరకు ఐదు విభాగాలుగా రూపొందించబడిన ఈ ప్రామాణిక పరిశోధక పుస్తకం ద్వారా అనేక విలువైన విషయాలతో పాటు సమగ్ర సమాచారం క్షుణ్ణంగా తెలుస్తుంది.
ఇది కేవలం తెలంగాణ ప్రాంత గిరిజనులకే పరిమితం చేసినట్టు కన్పిస్తున్న దీనిలోని సమస్యలు పరిష్కార మార్గాలు అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి.
అడవి బిడ్డలు తరతరాలు ఓ అనుభవించిన బాధ వివక్షత తిరుగుబాట్ల రూపంలో పెల్లుబికింది,దాన్ని అంతం చేయడానికి పాలకులు చేసిన చర్యలు అన్నీ విఫలం కావడంతో గిరిజన గిరిజనేతల మధ్య అలాగే గిరిజనుల్లోని వివిధ తెగల మధ్య వైరుధ్యాల సృష్టించి అనేక కుట్రలతో ఆదివాసీలను, ఆదివాసీ నాయకులను,లోబర్చుకోవడానికి నిత్య ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అంటారు రచయిత,
పోరాటాలపై ఎన్ని అణచివేతలు ఉన్నా గోండుల ఆరాధ్య దైవం కొమరం భీం ఆశయం అయిన జల్‌,జమీన్‌,జంగల్‌, కోసం నేటికీ తెలంగాణ అడవి బిడ్డలు తమ అవిశ్రాంత పోరాటం సాగిస్తూనే ఉన్నారు.
తెలంగాణ ప్రాంత గిరిజనుల ప్రధాన సమస్య భూ సమస్య,ఇక్కడి గిరిజనుల ప్రతి పోరాటం దీని చుట్టూనే తిరుగుతుంది.
సహజంగా శాంతికాంకులైన అడవి బిడ్డల్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం తమ కట్టుబాట్లకు తమను దూరం చేస్తూ వారిపై ఆధునిక పెత్తనం చేయడమే ఈ తిరుగుబాట్లకు ప్రధాన కారణం అంటూ వాటిని సహేతు కంగా వివరించే ప్రయత్నం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో బ్రిటిష్‌ వారి పాలనలోనే భూముల వ్యాపారం మొదలైంది అని చెబుతూనే 18 వశతాబ్దపు తొలి రోజుల్లో తెలంగాణలో నాటి నైజాం రాజ్యంలో గిరిజనులు బయట ప్రపంచానికి సంబంధంలేని చక్కని జీవనం గడిపేవారు కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం నిజాం సర్కారుపై దండెత్తి ఆక్రమించి ఆధిపత్యం చిక్కించుకున్న సమయంలో (1800-1850) బ్రిటిష్‌ వారు చేసిన భూచట్టాలు తదితరాలవల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది తప్ప ఆదివాసులకు ఎలాంటి లాభం ఉండేది కాదు, అదేవిధంగా అడవుల మీద హక్కులు కూడా కోల్పోయారు.అడవులను రక్షిస్తూ పర్యావరణ సంరక్షకులుగా ఉన్న అడవి బిడ్డలు తమ సొమ్ములకు తామే పన్నులు కట్టే దుర్మార్గపు పరిస్థితి ఏర్పడిరది, అంటూ గిరిజన భూములకు కలిగిన అభద్రత గురించి వివరిస్తూ గిరిజన భూముల దురాక్రమణ కారణాలు వివరిస్తూనే భూ బదిలీ నియంత్రణ చట్టాల ఉల్లంఘన గురించిన వివరాలతో పాటు..
భూబదలాయింపు నిబంధన చట్టం అమలు అయిన వివరాలను పట్టిక రూపంలో పొందుపరిచారు.
రెండవ భాగములో స్వాతంత్రానికి ముందు తరువాత జరిగిన గిరిజన ఉద్యమాల గురించి చారిత్రక గణాంక ఆధారాలతో వివరించ బడిరది,గిరిజన ఉద్యమాల్లో తొలి ఉద్యమంగా 1879-80 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ కోస్తా జిల్లాలో గల చోడవరం తాలూకాలోని ‘‘రంప’’ అనే గ్రామంలో జరిగిన తొలి ఆదివాసి తిరుగుబాటు అనంతర కాలంలో జరిగిన పోరాటాలకు మూలంగా నిలిచింది,1915- 16 సం:లో జరిగిన కొండ రెడ్ల ఉద్యమం, అనంతర కాలంలో1922-24 మధ్యకాలంలో మన్యంలో జరిగిన అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచింది. అలాగే 1940 దశకంలో కొమరం భీమ్‌ చేసిన గోండుపోరు,1946-51మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం మరికొన్ని గిరిజన పోరాటాల గురించి వివరించి చివరగా స్వాతంత్రానంతరం గిరిజనుల దీనస్థితి గురించి కూడా సవివరంగా చెబుతూ దానికి కారణాలు నివారణ మార్గాల గురించి కూడా పరిశోధక రచయిత రామదాస్‌ సహేతుకంగా వివరించారు.
మూడవ విభాగంలో గిరిజన ప్రాంతాలపై జరిగిన పరిశోధనలు మార్గదర్శకాలు గురించిన వివరణలో గిరిజన ఉద్యమాలను నాటి బ్రిటిష్‌ వారు నేటి ప్రజాస్వామ్య పాలకులు ఎన్ని కుయుక్తులు చేసి వ్యూహాత్మకంగా ఉద్యమాల అణిచివేతకు ప్రయత్నాలు చేస్తున్న ఉద్యమాలు మాత్రం ఒక నిర్దిష్టమైన మార్గంలో ముందుకు పోతూ గిరిజనులను ప్రభావితం చేస్తున్నాయి అంటారు రచయిత.
నాల్గవ విభాగంలో తెలంగాణలో గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతుల పట్టికల ఆధారంగా విశ్లేషణలు చేయబడ్డాయి.
చిట్టచివరి భాగంలో భూ ఆక్రమణ తీరుతెన్నులు ఉద్యమ దశల గురించి వివరించిన ఈ వ్యాస సంపుటిలో గిరిజన ఉద్యమాలు మొత్తం భూమి కేంద్రంగా జరిగాయని అందుకు గిరిగినేతరులే ప్రధాన కారణం అన్న విషయం చెబుతూనే,చట్టాల గురించి అవగాహన కలిగించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇందులో వివరించబడ్డాయి.
గిరిజన ప్రాంతాల్లో గిరిజన అభివృద్ధి కోసం ప్రస్తుతం చేపడుతున్న చట్టాలు చర్యలకు తోడు మరికొన్ని చట్ట సవరణలు అభివృద్ధి అవగాహన చర్యలు గురించి ఇందులో కూలంకషంగా వివరించారు.
గిరిజన సాహిత్య అధ్యయనకర్తలు, పరిశోధక విద్యార్థులకు ఎంతో విలువైన సమాచార దర్శిని ఈ ప్రామాణిక పరిశోధక వ్యాస సంపుటి.
తెలంగాణలో గిరిజనులు తిరుగుబాట్లు
రచన : ప్రొఫెసర్‌ రాందాస్‌ రూపావత్‌ పేజీలు : 82, వెల,60/-రూ ప్రతులకు : నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌- 68 ఫోన్‌ : 040-24224453/54. సమీక్షకుడు : డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌ : 7729883223.

ప్రభుత్వ బడిని బతికించుకుందాం..!

అమ్మ లాంటి ప్రభుత్వ బడి. అమ్మా నాన్న కూలికి వెళితే అక్కున చేర్చుకుని విద్యా బుద్ధులు నేర్పిన బడి. సమాజంలో ఎలా బతకాలో నేర్పిన బడి. ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావించడం తన జీవనంలో భాగంగా చూడమన్న బడి. పెద్దలను గౌరవించండి, తల్లిదండ్రులను పూజించండి అని రోజూ ఓనమాలు దిద్దించిన బడి. ఇప్పుడు ఏదో పాడు ప్రపంచీకరణ వచ్చి అమ్మ, బడి నేర్పాల్సిన దాన్ని సెల్‌ఫోన్‌ నేర్పు తుంది కానీ..ఆ రోజుల్లో బడే నేర్పేది. పాఠశాల ప్రారంభం కాబోతుంది కనుక ఆ బడిని రక్షించు కోవడం కోసం ఉపాధ్యాయులుగా, సమాజంగా ఏం చేయాలో చూద్దాం.
పాఠశాలలు-పిల్లలు
ఏప్రిల్‌ 30,2021 ప్రభుత్వ లెక్కల ఆధారంగా ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ రంగంలో 33,813 ఉంటే,ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠ శాలలు 1,287ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రాథమికోన్నత పాఠశాలలు 4,158 ఉంటే, ఎయిడెడ్‌ పాఠశాలలు 250 ఉన్నాయి.ప్రభుత్వ రంగంలో ఉన్నత పాఠశాలలు 6,648 ఉంటే, ఎయిడెడ్‌ పాఠశాలలు 435 ఉన్నాయి.2021 ఏప్రిల్‌ నాటికి ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 44,54,038.
జిఓ 117 పేరుతో పాఠశాలలకు సంఖ్యను 6 పాఠశాలలుగా మార్చిన తర్వాత కచ్చితమైన లెక్కలు ప్రభుత్వం నుంచి బహిర్గతం కాలేదు. కొన్ని జిల్లాల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఫౌండేషన్‌ స్కూళ్లు అంటే 1,2 తరగ తులు మాత్రమే నిర్వహించే పాఠశాలలు మొత్తంగా 4600 ఉంటే దానిలో 20 లోపు ఎన్‌రోల్‌మెంట్‌ ఉన్న పాఠశాల 2,730. ఫౌండేషన్‌ ప్లస్‌ అంటే ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 27,000 పైచిలుకు ఉంటే 8,900 వరకు 20 లోపు విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలు ఉన్నాయి. అంటే సుమారుగా 12,000 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయులతో నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా వస్తుందో ప్రశ్నార్థకంగా మారిపోయింది. ప్రీ హైస్కూల్‌ అంటే 1నుంచి 8వ తరగతి వరకు ఉన్న మొత్తం పాఠశాలలు 3,500 దాకా ఉన్నాయి. వీటిలో 30లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 900 వరకు ఉన్నాయి.ఉన్నత పాఠశాలలు 5,400 దాకా ఉంటే దీనిలో 100లోపు విద్యార్థులు ఉన్న పాఠ శాలలు 450 దాకా ఉన్నాయి.20లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు 30లోపు వున్న ప్రీ హైస్కూళ్లు, 100లోపు ఉన్న ఉన్నత పాఠశాలల భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారబో తుంది. ఆశ్చర్య కరమైన విషయం ఏమంటే హైస్కూల్‌ లో చదువుతున్న మూడో తరగతి విద్యార్థికి సబ్జెక్టు టీచర్లతో పాఠాలు,అదే ఒక ప్రాథమిక పాఠశాలలో లేదా ప్రీ హైస్కూల్‌లో 8వ తరగతి దాకా ఉన్న యూపీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థికి సబ్జెక్టు టీచర్లతో బోధన ఉండదు. ఒక భిన్నమైన విద్యా విధానం గత రెండు సంవత్సరాల కాలంగా అమలు చేయబడిరది. మేధావులు,ఎమ్మెల్సీలు,ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు దీన్ని సరిచేయాలని ఇది సరైన పద్ధతి కాదని చెప్పినా ఇది మాపాలసీ అనే పేరుతో అప్పటి ప్రభుత్వం అమలు చేసు కుంటూ పోయింది. దీంతో ఈ రోజున 12,000 ప్రాథమిక పాఠశాలలు ఏకోపా ధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. అలాగే కొన్ని ఉన్నత పాఠశాలల డీ గ్రేడ్‌,కొన్ని యూపీ పాఠశాలల డిగ్రేడ్‌గా మారిపోయాయి. ఎయిడెడ్‌ పాఠశాలలు కనుమరుగు అయి పోయాయి. ఇప్పుడు ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ చూస్తే ఈ లెక్కలు కూడా ప్రభుత్వం అధికారి కంగా ఎక్కడా వెబ్‌సైట్‌లో పెట్టలేదు.కానీ 36 లక్షలకు మించి విద్యార్థులు ప్రభుత్వ పాఠశా లల్లో చదవటం లేదనేది అర్థమవుతుంది. ప్రాథమిక పాఠశాల వ్యవస్థ జిఓ117వల్ల అస్తవ్యస్తంగా మారిపోయింది. అక్కడ చదివే పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారో ప్రైవేటు పాఠశాలకు వెళ్లారో కూడా గణాంకాలు లేని పరిస్థితులు ఏర్పడతాయి. పాఠశాల స్ట్రక్చర్‌, మౌలిక వసతులు, పిల్లలకు కావలసిన సదుపాయాలు కలుగచేసిన తర్వాత కూడా పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గడానికి కారణమేమిటో, ఉపాధ్యాయ పోస్టులు కుదించబడటానికి కారణమేమిటో సమీక్ష జరగకపోవటం ప్రధాన లోపంగా ఉన్నది. ఇప్పటికైనా తక్షణం ఈ విద్యారంగంలో చేస్తున్న మార్పుల మీద ఒక స్పష్టమైన సమీక్ష జరగాలి. దాన్ని సరిచేసుకుని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకునేవైపు ప్రణాళికలు ఉండాలి. బైజూస్‌, సిబిఎస్‌ఇ, టోఫెల్‌, ఐఎఫ్‌బి ప్యానల్‌. ఇలా అనేక పథకాలు పాఠశాలలోకి వచ్చి చేరాయి. ఏపాఠశాలలో ఏసిలబస్‌ ఉందో,ఏ పరీక్షా విధానం ఉందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపైన మాట్లాడుకోవడం గానీ, చర్చించుకోవడం గానీ సమగ్రంగా జరగలేదు. మరో విచిత్రం ఏమంటే ఉపాధ్యాయులు తమ సొంత నెట్‌,సెల్‌ఫోన్‌లోనే అన్ని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవటం.పిల్లలకు ఏమైనా నాలుగు అక్షరాలు వచ్చాయా అనే దానికంటే ఉపాధ్యాయులు యాప్‌లు నింపడం,ఫార్మేట్లు పూర్తి చేయటం మీదే పర్యవేక్షణ సాగింది. పర్యవేక్షణ పాఠశాలలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది.ఒక్క ఉపాధ్యా యులే కాదు.విద్యార్థులు,తల్లిదండ్రులు, డీఈఓ,ఆర్‌జెడి,పై అధికారులు కూడా భయ పడాల్సిన పరిస్థితి ఏర్పడిరది.ఒక స్వేచ్ఛా యుత వాతావరణం పాఠశాలో దెబ్బతిన్నది.
బడి కోసం ఉపాధ్యాయులు
విద్యార్థి బడి ద్వారా సమాజంలో మంచి పౌరుడుగా మారడానికి టీచరు ఉపయోగ పడాలి.నిరంతరం తల్లిదండ్రులతో మమేకం అవ్వాలి.పిల్లల యోగక్షేమాన్ని అడిగి మనోధైర్యా న్ని ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించడానికి నిరంతరం ప్రత్యేక కృషి చేయాలి.చదవటం,రాయటం ప్రతి విద్యార్థికి వచ్చే బాధ్యత తీసుకోవాలి. మన బడికి వచ్చే పిల్లలు ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వారినే విషయం స్పృహలో ఉంచుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చే ఆప్యాయతను విద్యార్థికి బడిలో ఉపాధ్యాయులు ఇవ్వాలి. బడి సమయాన్ని పిల్లల కోసం మాత్రమే కేటా యించాలి. ఉపాధ్యాయుల జీతాలు తల్లిదం డ్రులు, సమాజం కట్టే పన్నుల నుంచే వస్తున్నా యనే వాస్తవాన్ని గ్రహించి, పిల్లల తల్లిదం డ్రులతో, సమాజంతో అనుసంధానం అయ్యేలా వారి పని ఉండాలి. ప్రతి రోజు నూతన అంశాలు, నిరూపించిన శాస్త్రీయ అంశాలు బోధించాలి. విద్యార్థుల్లో చదువుల పట్ల ఆసక్తి కలిగించేటట్లు పని మెరుగు పరచుకోవాలి. ఏదైనా పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే, ఉత్తీర్ణత కాకపోతే తనువు చాలించడం కాకుండా మనోధైర్యంతో బతికేటట్లు, మరల విజయాన్ని అందుకునేటట్లు ప్రోత్సహించాలి. కష్టం,శ్రమ,నిజాయితీ లాంటి నైతిక విలువ లను నేర్పాలి.మొత్తంగా బడి చుట్టూ ఒక సామాజిక కంచెను ఏర్పాటు చేసుకోవాలి. సమాజంలో మనం మనలో సమాజం భాగంగా ఉంటుందని భావనతో ఉపాధ్యా యులు తమ పనిని అభివృద్ధి చేసుకునే వైపు ఉండాలి. బడి తల్లిదండ్రుల ఆదరాభిమానాల్ని పొందే విధంగా టీచర్లు ఆదర్శంగా ఉండాలి. అవసరమైతే ఒకగంట అదనంగా పనిచేయ డానికి సిద్ధపడాలి.బడి నుంచి బయటికి వెళ్లిన విద్యార్థి సమాజంలో ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా బతకగలిగే సామర్ధ్యాన్ని ఇవ్వగలిగేలా బోధన ఉండాలి. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా బడి సమయంలో పిల్లల చుట్టూ, పిల్లల అభివృద్ధి చుట్టూనే ఉపాధ్యాయుల ఆలోచనలు,ఆచరణ, కార్యాచరణ ఉండాలి. బడి కోసం ప్రభుత్వం బోధనకు మాత్రమే ఉపాధ్యాయుని పరిమితం చేయాలి. పాఠశాల పర్యవేక్షణ కక్ష సాధింపు ధోరణితో కాకుండా పొరపాట్లను సరిచేసుకునే పద్ధతిలో ఉండాలి. విద్యారంగానికి హాని చేసే జీవో117ని పూర్తిగా రద్దు చేయాలి.విద్యార్థి ఏమీడి యంలో చదువుకోవాలనే దానిపై విద్యార్థికి స్వేచ్ఛ నివ్వాలి. ప్రాథమిక పాఠశాల విద్య మాతృ భాషలో మాత్రమే ఉండాలి. మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో రెండు మీడియంలను అనుమ తించాలి.ఖాళీలన్నీ డిఎస్సీ ద్వారా తక్షణం భర్తీ చేసి ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయాలి. ఎంఈఓ-2,ప్లస్‌ టు పాఠశాలల వ్యవస్థపై సమీక్ష జరపాలి.ప్రతి పంచాయతీకి అన్ని హంగులతో ఒక ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉండేటట్లుగా ఏర్పాట్లు జరగాలి. ఉపాధ్యాయుల సమస్యలను విని పరిష్కరించే ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. బది లీల కౌన్సిలింగ్‌ విధానాన్ని బలోపేతం చేసే విధంగా బదిలీల చట్టాన్ని రూపొందించాలి. బదిలీల చట్టానికి భిన్నంగా ఎలాంటి బదిలీలు చేయడానికి అనుమతించకూడదు. యాప్‌లు, సెక్షన్లు, ఫార్మేట్లు పూర్తి చేయటం అనేది పాఠశాల పరిధిలో ఉండకూడదు. పాఠశాల పనిదినాలలో ఎలాంటి శిక్షణలు ఉండకూడదు. బడి అంటే పిల్లల కేంద్రంగా ఉండాలి. పిల్లలకు నైపుణ్యమైన, నాణ్యమైన విద్య అందించడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. సాంకేతిక పరిజ్ఞానం అదనపు సోర్సుగా ఉండాలి తప్ప ఉపాధ్యాయుడు మింగివేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుమతించకూడదు. స్కీముల పేరుతో రోజుకో రకమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం కూడదు.రాష్ట్ర అవసరాలను తీర్చగలిగిన నూతన తరాన్ని తయారు చేసేటట్లు రాష్ట్ర విద్యా విధానం రూపొందించాలి. మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం విద్యలో చేస్తున్న మార్పులపై సమగ్ర చర్చ జరిపి, అందరి ఆమోదంతో అమలు చేయాలి. అంతి మంగా ప్రభుత్వ బడిని బలోపేతం చేసే వైపు కార్యాచరణ, ప్రణాళిక, బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి. బడిలో ఉపాధ్యాయుడికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలి.
ప్రభుత్వ బడికి ప్రత్యామ్నాయం లేదు
సమాజంలో నైతిక విలువలు,ప్రజాస్వామ్య విలువలు దృఢంగా నిలబడాలన్నా, మానవత్వం పరిమళించాలన్నా శ్రమజీవుల గురించి ఆలోచించే గొంతుకలు కావాలన్నా,ప్రశ్నించే తత్వం, పరిశోధనలు పెరగాలన్నా, భవిష్యత్తు తరంలో సమానత్వపు ఆలోచనలు పెంపొందిం చాలన్నా, చదువుకున్న చదువుని సమాజం కోసం నిస్వార్ధంగా వినియోగించాలన్నా ప్రభుత్వ బడి వుండాలి. డబ్బుతో కొనుక్కునే చదువు ద్వారా తయారైన పౌరుడు ప్రతిదాన్ని కొనుక్కునే వైపుగానే ఆలోచిస్తాడు. విద్యార్థి పరిపూర్ణ మానవత్వం కలిగిన వ్యక్తిగా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడాలంటే ప్రభుత్వ బడిని బతికించుకోవాలి. కనుక ప్రభుత్వ బడిని రక్షించుకోవాల్సింది బలోపేతం చేయాల్సింది ఆ రంగంలో పని చేస్తున్నటు వంటి ఉపాధ్యాయులే. ఉపాధ్యాయ హక్కుల కోసం ఎంతగా కదులుతున్నామో, ఎంతగా తపిస్తున్నామో, హక్కుల రక్షణకు ఎంతగా ఆలోచిస్తున్నామో అంతకంటే ఎక్కువ బాధ్యతతో, చిత్తశుద్ధితో ప్రభుత్వ బడిని బతికించుకునేందుకు కదలాలి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యా యులు ముందుకు కదలాలి. నిరంతరం సమాజంతో మమేకం కావాలి.
తెలుగు భాషలో సరిగా పునాదులు వేయాలి! -డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌
‘బడి ఈడు పిల్లలకు ‘తెలుగు భాషలో సరిగా పునాదులు పడకపోవడానికి కారణం ఏమిటి? ప్రస్తుతం ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే ‘సమాజంలో ఉన్న సమస్యల గురించి లోతైన పరిశీలన చేయకపోవడం పరిష్కారాల గురించి సరైన దిశగా విశ్లేషణతో కూడిన చర్చ చేయక పోవడం.నిజానికి ప్రస్తుత చర్చలు అన్నీ కూడా ….పైపై మెరుగుల్లాగా,అంతా పైపై చర్చలే! 21వశతాబ్దంలో మన తెలుగువారు నమ్ముతున్న అతిపెద్ద అవాస్తవం ఏమిటంటే ‘ఇంగ్లీష్‌ రావా లంటే చిన్నప్పటి నుండి ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలి.తెలుగు రావాలంటే తెలుగు మీడియం లో చదవాలి‘అని.ఈ రెండు భావనలు తెలుగు రాష్ట్రాల ప్రజలను,తల్లిదండ్రులను,రాజకీయ పార్టీలను బలంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ రెండు భావనలతో ఆలోచించడం మానేసి , మెదడును మూసివేసి…వాస్తవాన్ని,సత్యాన్ని చూడటం లేదు మరియు కనీసం వినడం కూడా లేదు!! చర్చలలో వాస్తవాలను తెలుసు కోవడానికి ‘ఓపెన్‌ మైండ్‌‘తో ఉండటం ఎంతో అవసరం.కానీ ఘనీభవించిన ఆలోచనలు ఉన్న మెదడులు…నిజాలను తెలుసుకోవడానికి కానీ, వాస్తవాలను అంగీకరించడానికి కానీ సిద్ధంగా ఉండవు.
అసలు సమస్య..
విద్యార్థి తెలుగు మీడియంలో చదివినా (లేక) ఇంగ్లీష్‌ మాధ్యమంలో చదివినా ప్రాథమిక స్థాయిలో..వారి మోడల్‌ టైమ్‌ టేబుల్‌ ప్రకారం,1వ తరగతి నుండి 5వ తరగతి వరకు వారానికి తెలుగుకు కనీసం10 పీరియడ్‌లు ఉంటాయి.నిజానికి చాలా మంది ‘ మంచి ఉపాధ్యాయులు‘ తెలుగు ఇంగ్లీష్‌లకు ఇంకా ఎక్కువ సమయం కేటాయిస్తారు (అనగా ప్రతీ భాషకు వారానికి సుమారు 12నుండి 15పీరియడ్‌ల వరకు) తగినంత బోధనా సమయం కేటాయించినా కూడా విద్యా ర్థులకు తెలుగులో చక్కటి పట్టు ఎందుకు రావడం లేదు అన్నది అసలు ప్రశ్న లోపం ఎక్కడుంది? ఏదైనా భాషలో నైపుణ్యం (లాంగ్వేజ్‌ ప్రోఫిషియన్సీ) ఉన్నది అంటే ‘సంసిద్ధం కాని) పరిస్థితులలో కూడా విన డం,విన్నదాన్ని అర్థం చేసుకొని తగురీతిలో మాట్లాడటం,చదవడం మరియు రాయడం అనే నాలుగు నైపుణ్యాలు (శ్రీఱర్‌వఅఱఅస్త్ర,ంజూవaసఱఅస్త్ర, తీవaసఱఅస్త్ర aఅస షతీఱ్‌ఱఅస్త్ర)వచ్చి ఉండా.మన రాష్ట్రంలో పిల్లలు బడిలో చేరటానికి ముందే …ఇంటివద్దే వారికి తెలుగులో మాట్లాడిరది విని అర్థం చేసుకొని,తదుపరి తగినట్లుగా మాట్లాడటం అనేవి (శ్రీఱర్‌వఅఱఅస్త్రడ ంజూవaసఱఅస్త్ర) చక్కగావచ్చు.వాస్తవానికి బడి పిల్లలకు నేర్పా ల్సింది…తెలుగులో చదవడం,వ్రాయడం మాత్రమే! ఈరెండు నైపుణ్యాలు తెలుగు పిల్లలకు,తెలుగుగడ్డపై నేర్పడంలో‘తెలుగు రాష్ట్రాలబడులు’ఎందుకు విఫలమవు తున్నాయి..?లోపం ఎక్కడుంది?తెలుగును బోధించే విధానంలో లోపం ఉన్నదా?(లేక) తరగతి గదిలోనూ,పరీక్షలలోనూ విద్యార్థులు వ్రాసిన తప్పులను సరిచేయకపోవడంలో ఉన్నదా?
తెలుగును బోధించే విధానం..
అ) ముందుగా తెలుగు అక్షరాలు,గుణింతాలు, తదుపరిపదాలు,వాక్యాలు నేర్పుతూ ముందుకు వెళ్లడం ఒక పద్ధతి.
ఆ) మరొక పద్ధతి నేరుగా పదాలలోని అక్షరాలను గుర్తిస్తూ,పదాలను కూడా ఒకేసారి పరిచయం చేసుకుంటూ వెళ్లడం.ఇందులో అక్షరమాలను వరుస క్రమంలో పిల్లలకు నేర్పరు.నిజానికి విద్యార్థికి ఏవిధానంలో నేర్పినా…అక్షరమాలలోని అన్ని అక్షరాలు నేర్పడం,వాటి ఆధారంగా పదాలను చదవడం,తర్వాత రాయడం నేర్పుతారు.
పలకపై దిద్ధితేనే తెలుగు వస్తుందా..
తెలుగు అక్షరాలు నేర్పేటప్పుడు ‘ఒకప్పుడు అక్షరాలు ఇసుకలో దిద్దించేవారు,తర్వాతి కాలంలో పలక మీద, ప్రస్తుతం నోట్‌ పుస్త కంలో వ్రాయిస్తున్నారు.ఇందులో ఒకపద్ధతి కన్నా,మిగిలిన పద్ధతులు ఏమాత్రం ఉత్తమ మైనవి కావు.
తప్పులను సరిచేయకపోవడమే అసలు లోపం..
ప్రాథమిక స్థాయినుండే అత్యధిక మంది ఉపాధ్యాయులు తెలుగులో విద్యార్థుల తప్పులను (చదివినప్పుడు,వ్రాసినప్పుడు)సరిచేయడం చాలా వరకు ఆపేశారు. కనీసం క్లాస్‌ నోట్స్‌లో కూడా తప్పులను ఎర్ర పెన్నుతో రౌండ్‌ చేసి …సరైనది వ్రాయడం లేదు.1వ తరగతినుండి పరీక్షలలో25కి23-24-25లు వేయడంకోసం అన్నిటికీ కరెక్ట్‌ అని టిక్కులు కొడుతున్నారు. దీని వలన విద్యార్థులు వాళ్ళు వ్రాసింది( తప్పు లు అయినా) కరక్టే అనే భావనలో ఉంటు న్నారు. ఇదే విధానంపై తరగతులలో కూడా జరుగుతుంది.ఏదైనామార్కులు 23,24,25లు వేయాలంటే..అన్నిటికీ రైట్‌లు కొట్టుకుంటూ వెళ్ళాల్సిందే కదా !!అదే ఉపాధ్యాయులు చేస్తున్నారు.విద్యార్థులు వ్రాసినదాన్ని సరిచేయడం అనేది దాదాపు ఆగిపో యింది.కొద్ది మంది నిబద్ధత కల్గిన ఉపాధ్యా యులు,ప్రశ్నించే తల్లిదండ్రులు ఉన్న చోట్ల మాత్రమే తప్పొప్పులు కొంతమేర సరిచేస్తున్నారు.
బాధ్యతా రాహిత్యం నుండి మార్కుల వరద వరకు…
తరగతి గదిలో ప్రాథమిక స్థాయిలో,సెకండరీ స్థాయిలో చేయాల్సినవి చేయకుండా..పరీక్షలలో మార్కుల వరద తీసుకువస్తున్నారు.2024 పది పబ్లిక్‌ పరీక్షలలో6,854మందికి తెలుగులో 100 కి100మార్కులు వచ్చాయి.ఇవి నిజంగా నిక్కచ్చిగా పేపర్లు దిద్దిన తర్వాత వస్తే … ఆవిద్యార్థులు మన తెలుగు జాతికి గర్వకా రణం.అప్పుడు భాషాభిమానులు దిగులు పడాల్సిన పనేమీలేదు!! ఎందుకంటే భాషను కాపాడే శక్తియుక్తులు ఆ పిల్లలకు ఉన్నాయి అని గుండెల మీద చేయివేసుకొని హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు! ఈమార్కులు నిజమైనవని,వారు వ్రాసిన సమాధానాలలో తప్పులే లేవని ప్రభుత్వం భావిస్తే ‘తెలుగులో 100కి100మార్కులు వచ్చిన విద్యార్థుల జవాబు పత్రాలు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టండి. (విద్యార్థుల పేర్లు,హాల్‌ టికెట్‌ నెంబర్‌లు కనబడకుండాచేసి…ఆపేపర్లు పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు). తప్పులు లేకుండాఉన్న జవాబుపత్రాలు తల్లిదం డ్రులు చూస్తే,వారి పిల్లలు కూడా అలా రాయలని తపన పడతారు ,వారి పిల్లలను కూడా ఆదిశగా ప్రోత్సహిస్తారు.నిజానికి దీనివలన సమాజంపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
తల్లిదండ్రులపై నెపం వేయడం తప్పు….
తల్లిదండ్రులకు తెలుగుపై మక్కువలేదని, ఇంగ్లీష్‌పై మోజుందని చెప్పడం అనేది ‘సమస్య ను పక్కదారి పట్టించడమే !.వాళ్ళపిల్లలు వ్రాస్తున్న, చదువుతున్న తప్పులను సరికుండా,కనీసంఎత్తి చూపకుండా మార్కులు కుమ్మరిస్తుంటే…వాళ్ళు అంతా సవ్యంగా ఉంది అని అనుకుంటున్నారు.
చక్రపాణి మాష్టారు లాంటి వారు ఆదర్శం…
తాడికొండ గురుకులపాఠశాలలో 1992లో 10వ తరగతి విద్యార్థులందరికీ పబ్లిక్‌ పరీక్ష లలో తెలుగులో 90కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. మార్కులు నిక్కచ్చిగా వేసే ఆరోజుల లోనే కాదు…ఇప్పటికీ అది రికార్డే! ఈరికార్డుకు మూలకారణం‘చక్రపాణి మాష్టారు ‘…ఆయన తెలుగు మాష్టారు.ఆయన జవాబు పత్రాలు దిద్దేటప్పుడు ప్రతీతప్పును హైలైట్‌ చేసేవారు.ప్రతీతప్పుకు 1/4% మార్కు తగ్గించే వారు.కొత్తగా చేరిన విద్యార్థులు కూడా, రెండు మూడు పరీక్షలు ముగిసేటప్పటికి తప్పులు లేకుండా వ్రాసేవారు.నేర్చుకోవడం అనేది విద్యార్థికి ఉన్న సహజ స్వభావం.పరీక్షలలో తప్పులు సరిజేయకుండా, అధిక మార్కులు వేసుకుంటూ వెళ్లడం వలన ‘విద్యార్థులకు ఉండే నేర్చుకునే స్వభావం మసకబారు తుంది,మరియు మొద్దుబారిపోతుంది. కావున తెలుగు భాషను కాపాడాలంటే ‘ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులు (క్లాస్‌టీచర్‌లు),హై స్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయులు నడుంకడితే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. విద్యార్థులు వ్రాసిన తప్పొప్పులను,ఉపాధ్యాయులు ప్రతీ దశలోనూ సరిచేయాలి.తప్పులను సరిచేస్తే పిల్లలు బాధపడతారు అనేది …చాలా అసంబద్ధమైన, పసలేని వాదన!! ఎందుకంటే వారు బాధపడటం,బాధపడకపోవడం అనేది మన హావభావాల మీద-దండన లాంటి విషయాలపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. కావలసింది తప్పులనుసరిదిద్ది,విద్యార్థులను మరింతగా ప్రోత్సహించే అభ్యుదయ కాముకులైన ఉపాధ్యాయులు, హెడ్‌మా స్టార్లు.వారికి పాఠశాల యాజమా న్యాలు మరియు విద్యాశాఖ అధికారులు పూర్తి సహకారాన్ని అందిస్తూ, పర్యవేక్షణను పెంచాలి.అప్పుడే తెలుగు భాష మరలా తన పూర్వ వైభవాన్ని పొందుతుంది.
-(ఎన్‌.వెంకటేశ్వర్లు)

1 2