ఇది అందరి పండుగ

రంగు రంగుల హరివిల్లులతో, రివ్వురివ్వున ఎగిరేగాలిపటాలతో, ఇంటికొచ్చే హరిదాసు లతో,అందంగాఅలంకరించిన బసవన్నలతో కనువిందు చేసే తెలుగువెలుగుల కాంతి మన రంగవల్లుల సంక్రాంతి. ఆప్యాయతలతో అనురాగాలతో ప్రేమాను బంధాలతోఅసలు సిసలైన ఆనందాల పూతోట మన ప్రియమైన సంక్రాంతి. వన్నెలద్దుకున్న గుమ్మాల వింత కాంతులతో కళకళలాడే నట్టింటి సోయగం మన ముచ్చటైనసంక్రాంతి. మావిడాకులతో, పూబంతీ చామంతులతో, తోరణాలతో అలం కరించుకున్న పందిరి మనపచ్చదనాల సంక్రాంతి. కొత్త అల్లుళ్ళతో, కొంటెమరదళ్ళతో మేళవించుకున్న సన్నాయి రాగంమన ఆట పాటల సంక్రాంతి. కోళ్ల పందాలతో,ఎడ్ల పందాలతో ఊరంతా హ్రోరెత్తిపోయే సంతో షాల వడిఈ సంబరాల సంక్రాంతి. నేతి అరిసె లతో కొబ్బరిబూరెలతో కలగలపు కూర లతో ఘుమఘుమలాడిరచే అరిటాకు భోజనం మన కమ్మనైనసంక్రాంతి. ఊరంతా పేరంటాల తో వాడంతా ఉత్సవాలతో ఇళ్లన్నీ కొత్త కాంతు లతో అంబరాన్నంటే ముంగిళ్ల కాంతి మన తెలుగు ఇంటి మమకారాల సంక్రాంతి. సంక్రాంతి సిసలైన రైతుల పండగ. శ్రామికుల పండగ. అల్లుళ్ల పండగ.గునపర్తి సైమన్‌
గిరిజన పల్లెకు ..సంక్రాంతి పల్లకి..
గిరిజన గూడెల్లో ముందస్తు సంక్రాంతి సందడి నెలకొంది..! ఏజెన్సీ గ్రామాల్లో అడవి బిడ్డలు సంబరాల ఊపందుకున్నాయి. జనవరి నెల వచ్చిందంటే చాలు..ఏజెన్సీ వ్యాప్తంగా సందడి వాతావరణం మొదలౌతుంది. ముఖ్యంగా మన్యంలోని గిరిజనుల సంప్ర దాయ సంక్రాంతి పండగను పుష్య పౌర్ణమి నుంచి ప్రారంభించారు. ప్రతి ఏడాది పుష్యమాసం ఆఖరు రెండు వారాల్లో ఎక్కడో చోట సంక్రాంతి పండగను గిరిజనులు ఉత్సా హంగా జరుపుకొంటారు. పుష్యమాసం వచ్చిన రెండో వారం తర్వాత గిరిజనులు భోగి చేసు కుంటారు. గ్రామంలోని పాత వస్తువులు, చీపుర్లు, కర్రలను భోగి మంటలో వేస్తారు. కొత్త కుండలో కొత్త బియ్యం, పప్పులతో పులగం తయారు చేసి గ్రామంలో అందరికీ పంచుతారు.భోగి రోజు నుంచి ప్రతి రోజూ రాత్రి వేళల్లో డప్పు వాయిద్యాలు,థింసా నృత్యాలతో సందడిగా ఉంటుంది. వ్యవసా యాధారంగా జీవనం సాగించే గిరిజనులు తమ వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించే రోజునే సంక్రాంతిగా భావిస్తారు. దీంతో భోగి మరుసటి రోజు సంక్రాంతి పండగ నిర్వహించుకుని, తమ పనిముట్లకు పూజలు చేస్తారు. మైదాన ప్రాంతంలో కనుమగా నిర్వహించే మూడో రోజును ఏజెన్సీలో పప్పల పండగ అంటారు. ఈ పం డగను కేవలం పశువుల కోసమే చేస్తారు. పశువులను శుభ్రంగా కడిగి,వాటి కొమ్ములకు రగ్గులు పూసి,అరెశలు,బూరెలు,గారెలతో చేసిన దండలను వాటికి వేస్తారు. ప్రత్యేకంగా పులగాలను వండి వాటికి ఆహారంగా పెడతారు.
పుష్యమాసాంతం వరకు సందడి
గిరిజనులు సంప్రదాయం ప్రకారం పుష్య మాసం రెండో వారం(పౌర్ణమి) నుంచి పక్షం రోజులు సంక్రాంతి పండగను నిర్వహి స్తారు. దీనిని స్థానిక భాషలో ’పుష్య పోరోబ్‌’ అంటారు. జనవరి 17 నుంచి 31వ తేదీ వరకు ఏజెన్సీ పల్లెల్లో సంక్రాంతి సందడి కొనసాగుతుంది. ప్రధానంగా ఇతర గ్రామాల్లో వారి బంధువులను తమ గ్రామాలకు ఆహ్వానించుకుంటారు. వారికి మద్యం, మాంసంతో విందు భోజనాలు పెడతారు. అలాగే కొత్త బట్టలను పెడతారు. అలాగే పుష్యమాసం ముగిసే వరకు ప్రతి రోజు రాత్రుళ్లు మహిళలు థింసా నృత్యాలు, పురు షులు డప్పువాయిద్యాలతో సందడి చేస్తారు. పురుషులు మాత్రమే వివిధ వేషధారణలతో గ్రామాల్లో తిరుగుతుంటారు. దీంతో పుష్య మాసంలో ఏజెన్సీలోని వారపు సంతలు సైతం జనంతో కళకళలాడతాయి. సంక్రాంతి నాడు పండిరచిన తొలిచూరి బియ్యంతో పులగం తయారు చేస్తారు. తమకు వ్యవసాయ జీవనాధారమైన పాడి పశువులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు..ఇప్పటికే కొన్ని గిరిజన పాడేరు మండలం వనుగుపల్లి పంచాయితీ లో సంక్రాంతి సందడిగా సాగుతోంది. క్యాలెండర్‌తో సంబంధం లేకుండా సాధా రణంగా అందరూ జరుపుకునే సంక్రాంతికి ముందు గ్రామ దేవతకు గంగాలమ్మకు పూజలు చేస్తారు. ఇక్కడ గిరిజనులు. అదే రోజు రాత్రి భోగి మంటలు వేసి భోగి పండగ జరుపుకుంటారు.పండిన వ్యవసాయ జీవనా ధారమైన పాడి పశువులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కొత్త వస్త్రం…కొత్త కన్నె..తాడు.. పూజలు నిర్వహిస్తారు. ఏడాది పండిరచిన కొత్త ధాన్యాన్ని పులగం ఆహారంగా తయారుచేసి పశువులకు తినిపిస్తారు.పశువుల మెడలో దుంపల్ని కడతారు.అంతా సందడిగా సంబరాలు చేసు కుంటారు.మరుసటి రోజు కనుమ పండుగ చేసుకుంటారు ఇక్కడే ఆదివాసీలు. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని, సాంప్రదాయాలను గిరిజనులు ఇప్పటికీ పాటిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గిరిజన మహిళలు ప్రత్యేక వస్తదారణతో ఆకట్టుకుంటారు. థింసా నృత్యం చేస్తూ ఆడి పాడతారు.
మైదాన ప్రాంతాల్లో ఇలా…
పిల్లల పండగ.పెద్దలు,వృద్ధుల పండగ. బీదాబిక్కి పండగ. కళకళలాడుతున్న పంట పొలాలను, పండబోయే దిగుబడిని తలుచు కొని సంతోషపడుతుంటారు. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంప దకు గొప్ప స్థానమిచ్చే ఈ సంక్రాంతి పండు గను బీద,గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకు కర్షకులు ఆనందంలో పాలుపంచుకుంటారు. సంక్రాంతికి విడుద లయ్యే సినిమాల సంగతి చెప్పనక్కరలేదు. సంక్రాంతి నాడు చేసే స్నాన, దాన, జపా దులు విశేష ఫలదాయకం. అన్నిటికన్నా ఉదయ కాల స్నానం ముఖ్యం. సంక్రాంతి నాడు స్నానం చేయని వారికి వ్యాధులు సంక్రమిస్తాయని శాస్త్రోక్తి. స్నానం చేసిన తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగిం చాలి. నువ్వులు, బియ్యం కలిపి శివుని అర్చిం చిన పిమ్మట ఆవునేతితో అభిషేకం చేయాలి. విష్ణువును, పౌష్యలక్ష్మిని పూజించి విష్ణుసహస్ర నామ పఠనం చేయాలి. తర్వాత లోక బాంధవుడు, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుడిని పూజించి కొత్తబియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలు పొంగించి భక్తిప్రపత్తులతో ఆయనకు నివేదించడం శుభప్రదం.భోజనంలో మంచి గుమ్మడి కూర ఉండేట్లు చూసుకోవాలి.చక్కెర పా నువ్వులు కలిపి చేసిన మిఠాయిలు తినడం, వాటిని చుట్టుపక్కల వారికి, స్నేహి తులకు, హితులకు పంచిపెట్టడం వల్ల బాంధవ్యాలు పెంపొందుతాయి. మకర సంక్రాంతి పితృపూజలకు అనుకూలమైన దినం కాబట్టి నువ్వులతో పితరులకు తర్పణ విడవాలి. పితృదేవతలకు పుణ్యప్రదమైన ఈ సంక్రమణం కాలంలో ఒకపూట భోజనం చేయడం మంచిది.
అనుబంధాల పెన్నిధి
బిడ్డలు..ఉద్యోగ,ఉపాధి అవకాశాలను అన్వేషిస్తూ..వేర్వేరుప్రాంతాలకు వెళ్లి స్థిరపడు తుంటారు.పల్లెకు,తల్లిదండ్రులకు అది బాదైనా..ఎక్కడున్నా తమ బిడ్డలు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు.అలా వెళ్లిన వారంతా ఈ పండగకు సొంత ఊళ్లకు తరలి రావడం..పల్లెకు,ప్రతి ఇంటికి సంక్రాంతే.
సమైక్యతల సన్నిధి
సంక్రాంతి..ప్రజల సమైక్యతను చాటుతుంది.దాన గుణాన్ని పెంపొందిం చడంతోపాటు ధని,పేద తారతమ్యం మరచి,ప్రతి ఇంట పౌష్యిలక్ష్మీని ఆహ్వానిస్తూ,జరిగే కార్యక్రమాలు గ్రామాలకు నూతన శోభను తెస్తుంటాయి.ఏడాది పొడవునా వచ్చే పండుగలు ఆ రోజుకు ఆరోజే చేసుకుంటారు. సంక్రాంతికి మాత్రం ముందుస్తు ఏర్పాట్లు జరుగుతుంటాయి. ప్రధానంగా అరిసెల తయారీ ఇరుగుపొరుగువారందరూ కలసిమెలసి చేసుకోవడం ఆకట్టుకుంటుంది.
చెక్కు చెదర‘నిధి’
మకర సంక్రాంతిని అత్యంత విశిష్టంగా భావిస్తుంటారు.తమ ఇంట కాలం చేసిన పెద్దలను పితృదేవతులుగా భావిస్తూ,వారిని నూతన వస్త్రాలునివేదించి..తమున్నతికి వారుచేసిన కృషిని గుర్తు చేసుకుంటూ భాష్పాంజలి సమర్పిస్తుంటారు.తమ హృదయాల్లో కొలువైన తమ వారి గురించి సంతానానికి తెలిపి,తర్వాత తరానికి దిశా నిర్ధేశం చేయడం అబ్బురమనిపిస్తుంది. ప్రకృతి వేళ ఆలయాల్లోనే కాదు..వేపచెట్టు మహాలక్ష్మీ,పోలేరమ్మ ప్రతిరూపాలుగా భావిస్తూ పూజలు చేయడం మన ఆన వాయితీ.సాప్ట్‌వేర్‌ ఇతర ఉద్యోగాల కోసం నగరాలు,ఇతర సుదూరాలకు వెళ్లినవారు సైతం గ్రామాలకు వచ్చిన తర్వాత ఈ ఉత్స హాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. పంక్తి భోజనాలతోపాటుకనుమనాడు తమజీవన గమనంలో తోడుగా నిలిచిన పశువులను అలంకరించి..గౌరవించడం ఎంతో ప్రత్యేకం.
సాంప్రదాయ వారధి
గతంలో పుష్యమాసంలో హరిదాసుల కీర్తనలు,గంగిరెద్దుల విన్యాసాలు,పిట్టల దొరల గొప్పలు..కాలక్రమంలో కనుమరుగవుతున్నా.. సంక్రాంతి సంప్రదాయం నిర్వఘ్నంగా కొనసాగుతోంది.అప్పట్లో చెడుగుడు,కబడ్డీ పోటీలు జరిగేవి.ఇప్పుడు వాటి స్థానంలో క్రికెట్‌,వాలీబాల్‌ చేరాయి.ఇంటి ముంగిళ్లలో ముగ్గులు,గొబ్బిళ్లు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
శాంతి,సౌభాగ్యం,ఐకమత్యం కలగ లిసినదే పండుగ. అందరూ పండుగగా వ్యవహరించే ఉత్సవాలు వ్యక్తిగతంగాను, కుటుంబ పరం గాను, బంధుగతంగాను జరుపుకుంటూ ఉం టాము. అంతవరకు వున్న కష్టాలు మరచి అందరితో కలసి మెలసి ఆనందం పంచుకునే దినమే పండుగ. ఈపండుగల క్రమంలో వచ్చే ముఖ్య మైన పండుగలలో సంక్రాంతి ఒకటి. సూర్యుడు తన ప్రయాణంలో ఒక రాశినుండి మరొక రాశి లోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ధనుస్సురాశినుండి మకరరాశిలోనికి ప్రవేశిస్తే మకర సంక్రమణం సంభవించి, ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమయి, మనం ఆచరించే ‘‘సంక్రాంతి’’ పండుగ వస్తుంది. సూర్యగమనం ఉత్తరాయణ, దక్షిణాయనాలు నిర్ణయిస్తే, చంద్రగమనం మాసాలు నిర్ణయిస్తుంది. సూర్యుడు ధనుస్సురాశిలో సంచరిస్తుండగా ధనుర్మాసం జరుగుతుంది. ఈ ధనుర్మాసం ముగియగానే సంక్రాంతి శోభలు ప్రారం భమవుతాయి. కాలచక్రంలోని రాశులలో మకరరాశి సర్వశ్రేష్టమైనది. శ్రవణానక్షత్ర ములో ఉద్భవించిన శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభునిగా బ్రహ్మకు సాక్షాత్కరిం చినది శ్రవణానక్షత్రములో. ఈ నక్షత్రము మకర రాశికి చెందినది.ఈకారణం చేత శ్రీమహా విష్ణువుని యొక్క రాశి మకరరాశి. దీనిని మానవుని శిరస్సుగా భావిస్తారు. అటువంటి మకరరాశిలోకి సహస్రకిరణుడైన సూర్యభగ వానుడు ప్రవేశించే మహత్తర పుణ్యదినం కాబట్టి, ప్రతీవ్యక్తిలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించటానికి అత్యంత అనువైన కాలం. వేదకాలంనుంచి శిష్యులు సరైన గురువు కోసం అన్వేషించటం, గురూ పదేశం పొందడం, వేదపారాయణలు సాగించటం వంటివి ఈ సమయంలోనే ఆరంభమవుతాయి. జగత్తు జలమjైునప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదివరాహమూర్తిగా అవతరించి భూమిని ఉద్ధరించిన రోజు సంక్రాంతి. వామనావతార ఘట్టములో వామనుడికి బలిచక్రవర్తి మూడడుగుల భూమిని దానం చేసినది, వామనుడి పదఘట్టనతో పాతాళానికి చేరినది ఈరోజే. దీనికి సంకేతంగా మనం సంక్రాంతి పర్వదినం జరుపుకుంటాము. ఈపండుగ భోగి, సంక్రాంతి, కనుము అని మూడు రోజులుగా జరుపుకునే పర్వదినం.
భోగిపండుగ
భోగి పండుగ పేరు చెప్పగానే మనకు స్ఫురించేవి భోగిపళ్ళు, భోగిమంటలు. ఆవుపేడతో పిడకలు తయారుచేసి యఙ్ఞ దేవతను తలుచుకుంటూ, పాపప్రక్షాణన జరిపించమని వేడుకుంటూ, ధర్మమార్గ పయనానికి సమాయత్తమవుతూ మంటలలో సూర్యోదయం సమయంలో వీటిని వేస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ ఈ మంటల చుట్టూ చేరి ఆనందోత్సాహలలో మునిగిపోతారు. ఈ మంటలలోనే పాతపడిన సామానులను కూడా వేసే సాంప్రదాయం కూడా కనబడుతుంది. నూతనత్వానికి ఆహ్వానం పలుకాలంటే పాతదనాన్ని విడనాడాలి.ఈ మంటలు వేదకాలమునాటి ఋషులు తాము సంవత్సరారంభములో వ్రేల్చిన ‘ఆగ్రాహాయణి’ హోమాగ్నికి ప్రతి రూపం. హోమ భస్మం మంత్రసారము, అతి పవిత్రమైనది. మంటలు శాంతించిన తరువాత ఈ హోమ భస్మాన్ని దైవప్రసా దంగా భావించి నుదుటిన ధరిస్తారు. పిల్లలకుకూడా నుదుటిమీద ఉంచి వారి ఆయురారోగ్యాలకై ప్రార్థిస్తారు. దేవతారాధన, నూతన వస్త్రధారణ, పిండివంటలతో భోజనము వగైరా పూర్తిచేసుకుని సాయంకాలం ‘‘భోగిపళ్ళ’’ వేడుక జరుపుతారు. పిల్లలను ఆశీర్వదిస్తూ పెద్దలంతా వారి శిరస్సుపై రేగిపళ్ళను పోస్తారు. రేగిచెట్టును సంస్కృతంలో బదరీ వృక్షం అని పిలుస్తారు. ఈవృక్షం విష్ణు ప్రీతికరమైనది. ఈ రేగిపళ్ళతోపాటు చిల్లర పైసలు, నానపెట్టిన శనగలు, పువ్వులు పిల్లల తలలపై పోస్తూ, శ్రీమహావిష్ణువులాగా తేజరి ల్లాలని ఆశీర్వదిస్తారు. తరువాత ముతై దువు లకు తాంబూలాలు ఇచ్చి సంతోషపరు స్తారు.
సంక్రాంతి పండుగ
రెండవ రోజైనది సంక్రాంతి పండుగ. పండుగలలో ప్రతీ రోజుకు ఒకప్రత్యేకత ఉంటుంది, వ్యవహార నియమ నిబంధన లుంటాయి. స్నానాదికాలు ఎలా ఆచరిం చాలి, ఎటువంటి పూజలు ఆచరించాలి, ఎటువంటి దానధర్మాలు చేయాలి అనేవి మన శాస్త్రాలు విపులంగా వివరించాయి. ఇవిశారీరిక ధారు ఢ్యాన్ని పెంపొందించి, వాతావరణ సమతుల్యత కాపాడుతూ, సమతలను పెంపొందిస్తాయి.నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం శారీరిక రుగ్మతలను నివారిస్తుంది. నువ్వులు సేవించటం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఈరోజు జరిపే శాంతి హోమాలు, మృత్యుంజయ హో మాలు, అభిషేకాలు, వివిధ దైవారాధనలు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించి, భగవ దానుగ్రహానికి తోడ్పతాయి. పితృదేవతల స్మరణ వారి అఖండ ఆశీర్వచనానికి దోహదం చేస్తాయి. ఇది పగటి పూట వస్తే ప్రశస్తము. మధ్యాహ్నమునకు పూర్వమే సంభవించే అర్ధోదయకాలమే పూర్తి ఫలితాన్ని స్తుంది. గొబ్బిళ్ళ సందడి సంక్రాంతి పం డుగు వేడుకలలో మరొక ప్రధానమైనది. కన్నె పిల్లలు చక్కటి వస్త్ర ధారణతో, తమకు కలిగిన ఆభరణాలతో చూడచక్కగా అలంక రించు కుంటారు. తెలుగుదనం ఉట్టి పడే కన్నె పిల్లలను చూచి కుటుంబ సభ్యులు మురిసి పోతారు. వివాహ వయస్సుకు వచ్చినారని చెప్పకనే చెబుతారు. పెద్దవారికి ఇది ఒక హెచ్చరికలాటిది. ఆవుపేడతో గుండ్రముగా బంతులవలె తయారుచేసి, ఇంటి ముంగిటి రంగవల్లుల మధ్య అమరుస్తారు. వాటిపై బంతిపూవులు, ఇతర రంగు రంగు పూలను అలంకరించి, వాటి చుట్టూ తన తోటివారితో, స్నేహితులతో వలయాకారంగా తిరుగుతూ, గొబ్బిపాటలు పాడుతూ,లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ తిరుగుతారు. ఇది సంధ్యా సమయంలో జరిగే కనుల పంట. చూచిన వారిదే భాగ్యం. మహాలక్ష్మికి ప్రీతిపాత్ర మైనది. ఈవిధంగా చేయటం వలన కన్నెపిల్ల లకు త్వరలోనే చక్కటి వరుడు లభించి వివాహం జరుగుతుందని విశ్వాసం. లయ బద్దంగా చిడతలు వాయిస్తూ, భుజము పైనున్న వీణను స్వరబద్ధముగా మీటుతూ, అడుగు అడుగులో గజ్జెల సవ్వడి నింపుతూ విలాసంగా సాగిపోయే హరిదా సులు మన సంప్రదాయ చిహ్నాలు. హరి నామ సంకీ ర్తన తప్ప మరొక మాయ వారి నోటి వెంట వెలు వడదు. రంగు రంగుల వస్త్రధారణతో, మెడలో పూదండతో హుందాగా నడుస్తూ సాగిపోతారు.
కనుమ
మూడవ రోజైన పండుగ కనుమ పండుగ. కనుమ నాడు మినుము తినాలంటారు. అందుకే ఆవునేతితో తయారుచేసిన మినపసు న్నెలు, బెల్లం గారెలు వంటిని తయారుచేసు కుంటారు.నోరూరించే పదార్థాలు జిహ్వను మరింత పెంచగా మానసిక సంతృప్తితో కడుపారా అస్వాదిస్తారు. వ్యవసాయదారులు తమ తమ పశువులను అలంకరించి వాటిని స్వేచ్ఛగా తిరిగేలా చేస్తారు. బలవర్థకమైన దాణావేసి విశ్రాంతిగా ఉండేలా చేస్తారు. వ్యవసాయ క్షేత్రములో వాటి అవసరం లేకుండా పంటలు పండవు.నాగరిక ప్రపంచ ములో యంత్రాల విని యోగం ఎక్కువైనప్ప టికి, పశువుల వినియోగం లేకుండా సాగదు. మనకు జీవనాన్ని,జీవి తాన్ని ఇచ్చిన ప్రతీ ప్రాణిని గౌరవించాలనే సత్సాంప్రదాయము మనది. కనుమనాడి కాకి కూడా కదలదు అనే నానుడి ప్రచారంలోఉంది. శాస్త్రపద్దతిలో ఆలోచిస్తే దీనికి తగిన కారణం కనబడు తుంది. దైనం దిన కార్యక్ర మాలకు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యు లతో కలసి మెలసి ఆనందంగా జీవించటానికి అవకాశం కల్పించేవే కొన్ని కట్టుబాట్లు, ఆచారవ్య వహారాలు. బయటకు వెళ్ళకోడదు అనే నియమం పెడితే చక్కగా ఇంటి వద్దే వుండి సంతోషంగా గడుపుతారని దీని ముఖ్యోద్ధే శము. అంతేకాకుండా మరుసటి రోజున బంధువులు తమతమ స్వస్థాలకు వెళ్ళిపోతారు కనుక వారి వీడ్కోలుకు కావలసిన కార్యక్రమ నిర్వహణకు దోహదం చేస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా కోడిపందేలతో మగవారు ఆనందిస్తారు.
బొమ్మల కొలువు ప్రతీ ఇంటా కొలువుదీరుతుంది. సంవత్సరం పొడవునా సేకరించిన రకరకాల బొమ్మలను పలు వరుసలలో అలంకరించి హృద్యమైన వాతావరణాన్ని తయారుచేస్తారు. వస్తుగ్రహ ణాశక్తిని పెంపొందించి, మానసిక శాంతిని కలిగిస్తుంది. సిరిసంపదలు కలుగుతాయని విశ్వాసం. బొమ్మల కొలువు పేరుతో ఇంటిని అందంగా అలంకరిస్తారు. పలువురు విచ్చేసి అలంకరణలను వీక్షించి ముగ్దులౌతారు. ఇంటిని అలంకరించిన మామిడి తోరణాలు, నూతన వస్త్ర ధారణలు,వాకిట భోగి మంటల వింత శోభలు,నట్టింట్లో నిండు గర్భిణిలా ధాన్యపు గాదెలు, వాకిట్లో హరిదాసులు ఆలపించే హరిభ జనలు, తోటల్లో కోడిపందేలు, పెరట్లో పశువుల అలంకా రాలు,అత్తింట్లో అల్లుడు గారు ఎక్కే అలక పాన్పులు, వంటింట్లో అత్తగారు చేసే నేతి అరిసెల ఘుమఘుమలు, అంగట్లో వస్త్రాల సంబరాలు, ఆలయాలలో దైవ పూజలు, ముంగిట్లో వయ్యారి భామలు దిద్దే ముత్యాల రంగవల్లులు, రంగవల్లులపై శోభిల్లే గొబ్బిళ్ళు, దాన ధర్మాల తృప్తిపొందిన దానగ్రహీ తలు.. కలగలసి మన సంక్రాంతి. ఈవిధంగా మూడు రోజులు నూతన వస్త్రాలు ధరించి, యథాశక్తి పూజలు, హో మాలు సలిపి, దానాలు చేసి, పశువులను అలంకరించి అందరితో కలసియధాశక్తి పిండివంటలు భుజించి అత్యంత ఆనందంగా గడుపుకుని, సంవత్సరమంతా పండుగలా గడవాలని కోరుకుంటారు.

జీవితాన్ని అంకితమిచ్చిన సామాజిక ఉద్యమ నేతలు

తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ప్రతిక్షణం గిరిజన,దళిత ప్రజల ఆకాంక్షలు, కలలనే ఊపిరిగా చేసుకుని బతికిన సామాజిక స్పూర్తిదాతలు,పర్యావరణవేత్త శ్రీధర్‌ రామ్మూర్తి, సామాజికవేత్త విలియమ్‌ స్టాన్లీ,అలుపెరగని పోరాట యోధుడు,సామాజిక సేవకు అద్దంపట్టే మరోఆత్మ కె.రాజేంద్ర కుమార్‌లు ఒకే నెల జనవరిలో మనమధ్య నుంచి దూరమవ్వడం మర్చిపోలేని సంఘటన.ఈ ముగ్గురు సామాజిక యోధులతో నాకున్న అంకుఠిత పరిచయం చిరస్మరణీయమైనది.నాతోటి సహచారులు మనలో లేరంటే నా హృదయం పరితపిస్తోంది.
వివిధ రంగాల్లో నిర్మాణాత్మకమైన సామాజిక ఉద్యమాలను నడిపించారు.సమాజ శ్రేయస్సుకు..సమూహ ప్రయోజనాలు అందించారు. వర్తమాన సామాజిక ఉద్యమాల చరిత్రలో చెరిగిపోని సంతకాలగా వారి సామాజిక సేవలు నిలిచిపోయాయి.సామాజిక అసమానతలపై సమరం సాగిస్తూ,సమాజాన్ని సంస్కరించడం కోసం,అలుపెరగని కృషి చేసిన పోరాట యోధులు.
శ్రీధర్‌ అనంతమైన ఆలోచనలు,విశ్లేషణలతో కూడిన పరిశోధకుడు.శాస్త్రవేత్త.దేశంలోనే కాకుండా అనేక దేశాలలో ఆదివాసీ ప్రజలకు ఆలోచనలు అందించారు. ఒకశాస్త్రవేత్త,ఒకకార్యకర్త, ఒకసాహసికుడు,ఒక స్వాప్నికుడుగా తన జీవితమంతా అట్టడుగున ఉన్నవారి కోసం, పర్యావరణంకోసం, సహజవనరులపై సమాజాల నియంత్రణకోసం అలుపెరగని పోరాటాలు చేశారు.
ఇక విలియమ్‌ స్టాన్లీ ఒడిస్సా,చత్తీష్‌ఘర్‌ ఆదిమతెగల జీవితాల్లో వెలుగు నింపాడు.అనాగరిక గిరిజన ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించారు.వందలాది గిరిజన గ్రామాలకు త్రాగునీరు, విద్యుత్‌,ఇతరమౌళిక సదుపాయాలు కల్పించారు.గిరిజన యువతకు మార్గదర్శిగా ఉంటూ సామా జిక,ఆర్ధిక,రాజకీయరంగాల్లో ఎందరో యువకులకు భవిష్యత్తునిచ్చారు.
ఇక అలుపెరగని సామాజిక యోధుడు రాజేంద్ర నాతోటే పయనించారు.అత్యంత అట్టడుగున దళిత కుటుంబంలో జన్మించిన రాజేంద్ర తన దళిత,గిరిజనుల జీవితాల కోసం రక్తాన్ని ధారపోసిన హృదయం.ఒకఆత్మ స్థిరమైన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మార్గాల కోసం అనంతంగా అన్వేషించిన నిస్వార్ధపరుడు.రాజేంద్ర చేసినసుదీర్ఘ పోరాటాలు ఎన్నో నేటికి చెరగని ముద్రవేసుకున్నాయి.కాలుష్యకోరల్లో కొట్టిమిట్టులాడుతున్న క్వారీ ప్రజలకు అండగా నిలిచారు.ఏలేరు నిర్వాసితులకు పునరావాసం సుదీర్ఘ పాదయాత్ర చేశారు.అత్యాచారానికి గురైన దళిత బిడ్డకు అండగా నిలిచి న్యాయంపోరాటం చేసి గెలిచారు.కాకినాడ జిల్లా తీరప్రాంతంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక ఆర్ధిక మండలి(స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌`(ఎస్‌ఈజెడ్‌) పేరుతో రైతులు,మత్స్యకారుల భూములు ప్రభుత్వం స్వాదీనపర్చు కోవడంపై తరుపున సుదీర్ఘ పోరాటంచేసి కొద్దిరోజులు జైలుజీవితాన్నికూడా అనుభవించారు. వంతాడ ఆదివాసీ వనరుల పరిరక్షణపై(లేటరైట్‌)పోరాటంచేసి విజయం సాధించారు.
సామాజిక సేవలో కుటుంబాన్ని,ఆరోగ్యాన్నిసైతం విస్మరించారు.వారి జీవితాన్ని ప్రజా ప్రయోజనాల కోసం అలుపెరగని సేవలందించారు.వాస్తవానికి సామాజిక సేవ చేసే ప్రతి కార్యకర్త ప్రజలతోనే మమేకంగా ఉంటారే తప్పా వారి ఆరోగ్యం,కుటుంబం సంక్షేమకోసం పట్టించుకోవడం తక్కువ.ఈనేపథ్యంలోనే ఈ ముగ్గురు సహచరులు హాఠత్తుమరణానికి గురికావాల్సి వచ్చింది. మనిషికి మరణమనేది ఏరకంగా సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఈనేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం వహించకూడదు. అనారోగ్యం రాకుండానే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రస్తుత మానవ జీవనవిధానం కలుషితమయంగా మారింది.కలుషితమైన ఆహారపదార్ధాలనే తీసుకుంటున్నాం.ముఖ్యంగా సమాజంలో సామాజిక మార్పులు తీసుకొచ్చే శ్రేణులు ఆరోగ్యపరిరక్షణ పట్ల మరింత శ్రద్ద తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.జీవిత విలువ తెలుసుకొనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు.!- రవి రెబ్బాప్రగడ ,ఎడిటర్ 

శతాబ్దాల సాంస్కృతి సమాహారం

స్వచ్ఛమైన సెలయేళ్లు..దట్టమైన అడవులు.. గంభీరమైన కొండలు.. పక్షుల కిలకిలారా వాలు. పచ్చని ప్రకృతి అందాలు వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుత నానికి సజీవ సాక్ష్యంగా. పాలకుల ఆలన కోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ జనం నివసి స్తోంది. అడవితల్లి బిడ్డలుగా ,ప్రకృతి ఒడే అవాసంగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని, ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది. విద్య,వైద్యం వంటి మౌళిక సదుపాయాలకు నోచుకోని గూడే లెన్నో కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే వారి జీవితాల్లో వెలుగులు నింపే సర్కారు వచ్చింది.వారి కష్టాలు తీర్చేందుకు బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తోంది.-(భమిడిపాటి గౌరీశంకర్‌)
జాతులు..భాషలు
జిల్లాలో 2.36 లక్షల మంది గిరిజనులున్నారు. వీరిలోట్రైబల్‌ సబ్లన్‌ మండలాల్లో నివసించే సంఖ్య1.87 లక్షలుగా ఉంది. గిరిజనుల్లో 36 జాతులున్నాయి.ఉత్తరాం ధ్ర జిల్లాల్లో సవర, కొండదొర, గదబ, వాల్మీకి,జాతాపు, కోయ, భగత జాతులు ప్రధానమైనవి. సవరభాష శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకేలాఉంటుంది. వీరి అభ్యున్నతికి ఏర్పాటైన ఐటీడీఏకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కేటాయిస్తున్నాయి. సగటున ఒక్కో ఐటీడీఏకి ఏటా రూ.300 కోట్ల నిధులు వస్తున్నాయి. కానీ అందులో గిరిజనులకు ఈ నిధుల్లో చేరేది నామమాత్రమే. నిక్కచ్చిగా ఈ నిధులన్నీ గిరిజనులకే ఖర్చుచేసి ఉంటే గిరిజనుల ఎప్పుడో మారిపోయి ఉండేవి.
సజీవ సంప్రదాయాలకు నిలయం
గిరిజన జీవనం విభిన్నంగా ఉంటుంది. సంబరాలు, వివాహ వేడుకలు, ఆరాధనల ఆచారాలు, మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటాయి. తరాలు మారినా వారి అలవాట్లు, కట్టుబాట్లు ఇప్పటికీ మారలేదు. ఇక్కడ జరిగే వివాహ వేడుకల్లోని సంప్రదాయాల్లో భాగంగా చెట్టును ఆరాధిం చే విధానాలు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి సందేశాన్ని పంపుతుంటాయి. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఏ పల్లెకు వెళ్లినా సవరజాతి గిరిజనుల సంబరాలు, పండుగ సందడులన్నీ ఒకే రకంగా కొనసాగితే పెళ్లిళ్లు మాత్రం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ప్రాణాధారమైన నీరు, అది లభించడానికి అవసరమైన చెట్టు చుట్టూనే వారి తంతు తిరుగుతుంది. సవర భాషలో పాటలు, థింసా నృత్యాలు ఇక్కడి గిరిజనుల పండుగలు, శుభకార్యాల్లో భాగం.ఆడవేషంలోవున్న యజ్ఞుడు అనే పురోహితుని పాత్రలో పెళ్లితంతు నిర్వపి వధూవరులను మేనమామలు భుజాలపై ఎక్కించుకొని నృత్యం చేస్తూ ఊరేగించడం నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం.
కనీస సౌకర్యాలు కరువు
నేటికీ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపా యాలు లేవు. కనీసం తాగునీరు, రోడ్డు మార్గం లేదు. వైద్య సదుపాయాలు లేక ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. గర్భిణులు, వృద్ధులు అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. నేటికీ వైద్యం కోసం, విద్య కోసం గిరిజనులు కొండలు గుట్టలు దాటి కాలినడకనచ,డోలీ సాయంతో మైదాన ప్రాంతాలకు రావాల్సిందే. వీరి తండాలకు విద్యుత్‌ సౌకర్యం లేదు.ఉండ టానికి ఇళ్లు లేవు. ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వారి వనరులను లాక్కుంటున్నారు. క్వారీలు నడుపుతూ ఖనిజ సంపదను కొల్లగొడు తున్నారు. బాక్సైట్‌, గ్రానైట్‌ దోచుకుంటున్నారు. పిండిచేసి గిరిజనులకు పోడు వ్యవసాయం చేసి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. గిరిజనుల జీవితాల్లో మార్పునకు సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. తొలిత కురుపాం,సాలూరు గిరిజన రిజర్వర్డు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్టు ఇచ్చారు. ఎన్నిక ల్లో గెలిచిన వెంటనే తన తొలి కేబినెట్లో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి స్థానం కల్పించారు. గిరిజన శాఖ మంత్రి పదవిని ఇవ్వడంతో పాటు ఉపముఖ్యమంత్రి హోదానిచ్చి ఉన్నత స్థానం కల్పించారు. తర్వాత సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు గిరిజిన సంక్షేమశాఖ మంత్రి పదవినిచ్చారు. గత ప్రభుత్వాలు ఎస్టీ సప్లాన్‌ నిధులను ఇతర ఖర్చులకు వాడేసేవి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరులో దళితతేజం సభ నిర్వహణకు సబ్‌ ప్లాన్‌ ఖర్చు చేశారు. ఇలాంటి వాటిని అరి కట్టడానికి అధికారం గిరిజనుల చేతుల్లో ఉండాలి. గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండా లని గిరిజనులు ఎప్పటి నుంచో కోరుతుండే వారు. సాంఘిక సంక్షేమ శాఖలో మిళితమై ఉండటంవల్ల గిరిజనులకు అన్యాయం జరుగు తుందని వేడుకునేవారు. వారి గోడువిన్న జగన్‌ గిరిజనులకు ప్రత్యేక మంత్రిని ఇచ్చారు. గిరిజనుల బతుకులు బాగుచేయాలనే ఉద్దేశం తో గిరిజన సలహామండలిని ఉపముఖ్యమంత్రి నేతృత్వంలో,గిరిజన ఎమ్మెల్యేల భాగస్వా మ్యంతో సీఎం ఏర్పాటు చేశారు. గత ప్రభు త్వంలో అప్పటి పాలకులు పదవిలో ఉన్నన్నా ళ్లూ గిరిజన సలహా మండలి ఊసెత్తలేదు. ప్రజా సంకల్ప యాత్రలో ఎస్సీ,ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ అందిస్తానని హామీ ఇచ్చి, సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే దానిని నెరవేర్చారు.200 యూనిట్ల వరకూ విద్యుత్‌ వినియోగాన్ని ఉచితం చేశారు.దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కుటుంబాలకు ప్రయో జనం చేకూరుతోంది.
సవరల సంస్కృతి మరియు సంప్రదాయాలను పరిరక్షించే ప్రయత్నాలు
గిరిజనులకు సమాజంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది, వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం మరియు భాషకు ధన్యవాదాలు. వారి స్వంత లిపి లేనప్పటికీ, ప్రత్యేకమైన వారసత్వం ఏదో ఒకవిధంగా శతాబ్దాలుగా తరువాతి తరానికి అందించబడుతోంది.కానీ ప్రస్తుత తరం ఆంగ్లం,తెలుగు ఒడియా భాషలలో సాధారణ విద్య,అధ్యయనానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో, సవర కమ్యూనిటీకి చెందిన గిరిజన పెద్దలు తమ సంస్కృతి, సంప్రదాయం భావితరాల కోసం భాషను పరిరక్షించడంపై ఆందోళన చెందుతున్నారు.
సవర సంస్కృతీ దర్పణాలు గిడుగు కథలు
సవర భాష కోసం నిరంతరం పరిశ్రమించిన పండిత మాన్యుడు గిడుగు రామమూర్తి పంతులు.సవరల భాష, యాస, సంస్కృతుల పట్ల ఆయనకు 1880లోనే ఆసక్తి కలిగింది. మన్యప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచే యటం ఇందుకు ప్రధాన కారణమనిపిస్తుంది. కొందరు ఆలోచించి వదిలేస్తారు. కొంతమంది మాత్రమే ఆలోచించి ఆచరిస్తారు.అతి కొద్ది మంది మాత్రమే లోతైన అధ్యయనంతో విజయం సాధిస్తారు. గిడుగు రామమూర్తి ఇటువంటివారే. సవరభాషకు ఓ లిపిని ఏర్పాటు చేయడమే కాక, వారి జీవనసంస్కృతి మూలాల లోనికి దగ్గరగా వెళ్ళారు. అధ్యయనం చేశారు. వారి జీవితాలను చరిత్రగా రికార్డు చేశారు. సవరభాషకు నిఘంటువు, వ్యాకరణం కూర్చారు. పాటలని సేకరించారు. వాచకాలను రూపొందించారు. సవరభాష నేర్చుకోవటం తేలిక అనేది ఆయన భావన. గిడుగు రామమూర్తి పాండిత్యం ఎంతో నిర్మాణాత్మమెనది. గ్రాంథిక భాషను ఖండిరచడం వెనుక ఉన్నది ఈ అంశమే! సవర భాష విషయంలో ఆయన చేసిన స్వయంకృషి శ్లాఘనీయం.
సవరల జీవన విధానంలోని సంస్కృతి సంప్రదాయాలను వ్యక్తిగమెన కార్యనిర్వహణ రంగాలను గిడుగువారు దగ్గరగా పరిశీలించారు. వాటిని ‘సవర కథలు’గా రాశారు. ‘సవర భాషలో నేను వ్రాసిన మొదటి పుస్తకంలోని కథలకు ఇంచుమించుగా సరైన తెలుగు చేసి ఈ పుస్తకం వ్రాసినాను. ఈ సవర %-పుస్తకంలోని కథలన్నీ ఇంగ్లీష్‌లో ఉన్న ఈసపు కథలను పట్టి వ్రాసినాను’ అని ఆయన ఆ పుస్తకం ముందుమాటలో చెప్పారు. ప్రతి వాక్యాన్ని సవరలకు వినిపించి, వారి సవరణలు, సలహాలు, సూచలను అనుసరించి తిరగ రాశారు. కథలలోని విషయాలు సవరల వ్యవహారాన్ని అనుసరించి వాళ్ళకు తెలిసేటట్లు చేర్పులు మార్పులు చేశారు. కనుక ఈ సవర కథలు సవరల నిజజీవన చిత్రణ దృశ్యాలు.. సాక్ష్యాలు. ‘కోదుల భాషలో ముగ్గురు నలుగురు కొన్ని పుస్తకములు వ్రాసినారు. కాని.. సవర భాషలో ఇదివరకు ఎవరూ పుస్తకాలను వ్రాయలేదు. నేను వ్రాసినవే మొదటి పుస్తకాలని’ గిడుగువారు చెప్పుకున్నారు. ఫిక్షన్‌ అండ్‌ ది రీడిరగ్‌ పబ్లిక్‌’ అనే పుస్తక రచయిత క్యు.డి.లీవీస్‌ కథను గూర్చి చెబుతూ కథ ప్రధాన లక్షణమైన క్లుప్తత కేవలం రూపానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. జీవితానికి, జీవిత దృక్ప థానికి రూపం. జీవితంలోని ఒక ముక్కను తీసుకుని దానికి వ్యక్తిత్వం ఇవ్వాలన్న ఆకాంక్ష లోంచి కథకు రూపం వచ్చిందంటారు. కథల్లో కొద్దిమంది లేదా ఒక జీవితం కొన్ని శకలా లుగా గోచరమవడం పాఠకులకు కొత్త కాదు. కానీ తనకు తెలియని ప్రపంచంలోని భాష, వ్యక్తులు, జీవన విధానాలను కథలుగా మలచడంలో ఎన్నో ఇబ్బందులున్నాయి. చదువరి వీటిని తనవిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో గురించి వారంటే తెలియని వారు ఎందుకు తెలుసుకోవాలి? అటువంటి కథలు ఎందుకు చదవాలి? ఇవి సామాన్య చదువరుల ప్రశ్నలు. ప్రపంచీకరణ నేపథ్యంలో సాహిత్యం కొత్త సిద్ధాంతాలను, వాతావరణాలను సృష్టించుకుంటూ వస్తున్నది. మన చుట్టూ ఉన్న సమాజం నాగరికత ఆనవాళ్ళు అభివృద్ధి పరంగా శరవేగంగా మార్పుకు లోనవుతున్నది. కాని అలాలేని జీవితాలున్నాయి. జీవన గమనాలున్నాయి. ఎటువంటి కృతక వర్ణాలను అంటించుకోని స్వచ్ఛమైన మన్యాలున్నాయి. వాటిలో ప్రజాసమూహాలున్నాయి. ప్రకృతి వారికి పాఠశాల..కూడు, గుడ్డ, భాష కూడా అక్కడ నుంచి వచ్చినదే. భయంకమెన క్రూరమృగాలు, సాధు జంతువులు వారిని దగ్గరగానే చూస్తాయి. వారు కూడా వాటితో సహజీవనం చేస్తారు. సవరలు ఇందుకు మినహాయింపు కాదు. సవర దక్షిణ ముండాభాష. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా ఐదులక్షలకు పైనే. వీరు పోడు వ్యవసాయం చేస్తారు. వీరి గృహాలు ఒకదానికెదురుగా మరొకటి ఉంటాయి. వీరి భాషలో గ్రామాన్ని గొర్భాం అంటారు. అంటువ్యాధుల వల్ల, పులి, అగ్ని వంటి వాటి ప్రమాదాల వల్ల జనం చనిపోతే ఆ గ్రామాన్ని వదిలి వేరే చోటుకు వెళ్ళిపోతారు. నేటికీ వారిని అనాగరికులుగానే సభ్య సమాజం గుర్తిస్తుంది. మనిషికి ఆత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని గాఢంగా నమ్ముతారు. ఆత్మల్లోకి మనుషులు ప్రవేశించగలరనే విశ్వాసాలు ఉన్నాయి వారికి. వీటిని గిడుగువారు దగ్గరగా చూశారు. తనవిగా భావించారు. వారితో కలసిమెలసి సవరభాషకు ఓ శాశ్వతను తీసుకువచ్చారు. వీటినే ‘సవర కథలు’ ద్వారా అందించారు. ‘సవర కథలు’ చాలావరకు చిన్న పిల్లల కథలు వలే ఉన్నా సవరల మనస్త త్వాన్ని చెబుతాయి. సవరల జీవితాల్లోని ఓ తాత్వికతతో కూడిన విశ్వాసాలున్నాయి. వాటి వెనుక నీతివంతమైన వ్యవహారా లున్నాయి. కష్టపడే తత్వాన్ని నీతి ఆవహిస్తే స్వచ్ఛత కనిపిస్తుంది. ఇది ప్రకృతి గుణం. ‘నక్కా-గద్దా’,‘మూడు పిల్లులు- కోతి’,‘గొప్ప వాడి కథ’, ‘అత్యాశగల ఒక మనిషి’ వంటి కథలలోని నీతిని సవరల జీవనవిధానంలోని భాగంగా భావించడం కన్నా,వారి మనస్త త్వాన్ని, మానవతా దృక్పథాన్ని పరోక్షంగా చెబుతాయి. ఈ కథలలోని రెండవ పుస్తకం ముందుమాటలో ‘ఇందులోని కథలు అన్నీ సవర వాళ్ళు నాఎదుట చెప్పినవే. ఇంచు మించుగా వాళ్ళ మాటలే’ అంటారా యన. ఈ సంపుటంలోని కొన్ని కథలు వారు విన్నవి. కొన్ని కల్పనలు. కొన్ని కథలు వారివే. సవరలు పచ్చిబూతులు యథేచ్ఛగా ఉపయోగిస్తారు. అవి ఈ కథల్లో లేకుండా చూశారు గిడుగువారు. ఈ కథల్లో సవర జీవన విధానంతో పాటు వారి భాషను కూడా ఆయన సహజంగా గిడుగువారు ప్రతిపాదిం చారు. నాలుగో భాగం సవర కథల్లో పూర్తిగా సవరలకు సంబంధించిన జీవన విధానపు భాషా వ్యవహారం కనిపిస్తుంది.ఇళ్ళు,పొలం,సంత,తగవులు, పూజలు,కల్లు తాగడం,సోది,కేసులు, పోలీసు లు,జడ్జిలు, రోగాలు వంటి సందర్భాల్లో వారి సంభాష ణలోని సహజ త్వాన్ని గిడుగు అందించారు. సవర భాషాలిపికర్తగా,వ్యవ హారిక భాషా ఉద్యమ కారుడిగా చరిత్రకెక్కిన ఆయనకు, వర్తమానం లో ఎదురవుతున్న అవరోధాలన్నిటి నుంచి తెలుగు భాషను కాపాడుకోవటమే మన అర్పించే నిమెన నివాళి.
గిరిజనుల ప్రకృతి ఆరాధనే
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా విశేషమైన పశు సంపద తో అటవీ వాతావరణంలో నివసించే గిరిజనులు ఏటా తమ సంప్రదా యాన్ని ప్రతిబింబించేలా సీత్లా పండుగ జరుపుకొంటారు. సామూహిక జీవితంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఐక్యతను చాటేలా నిర్వహించే ఈ పండుగ వారి సంప్రదాయానికి అద్దం పడుతున్నది. పంటలు బాగా పండాలని, పశు సంపద అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పాటు ప్రకృతి ఆరాధన ఆ పండుగ అంతర్లీనంగా ఉం టుంది. అత్యధికంగా తండాలు కలిగిన పాలకవీడు మండలం లోపాటు బొమ్మల రామారం,తుర్కపల్లి మండలాల్లోనూ సీత్లా పండుగ సందడి నెలకొన్నది. లాలితండా, బెట్టెతండా,పాడ్యాతండా,చెర్వుతండా, కల్మటితండా,కొత్తతండా,శూన్యంపహాడ్‌, దేవ్లాతండా,మీగడంపహాడ్‌ తండా, లక్ష్మీతం డాల్లో పండుగలు జోరందుకున్నాయి. గిరిజ నుల తొలి పండుగ సీత్లా. ఆషాఢ మాసం పెద్ద పుష్యాల తొలి పాదంలో ఈ పండుగను జరుపుకొంటారు. తండాలోని కుటుంబాలన్నీ సామూహంగా ఏర్పడి ప్రకృతి దేవతలైన సీత్లా భవానీతో పాటు ఆరుగురు భవానీల ప్రతిమ లను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహి స్తారు. వర్షాలు బాగా కురువాలని పాడి పంటలతో పల్లెలు, తండాలు సస్యశ్యా మలంగా ఉం డాలని కోరుతూ మొక్కులు చెల్లించు కొం టారు. ఏడు రకాల వంట కాలతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఆటా పాటలతో గిరిజన సంప్రదాయ నృత్యాలతో సందడి చేస్తారు.ఈ తంతులో కుల పెద్దలు ప్రముఖ పాత్ర పోషిస్తారు. సాయంత్రం వేళ అమ్మ వార్లకు గొర్రె పోతు లను బలి ఇచ్చి,పేగు పైనుంచి పశువులను దాటిస్తారు. దీనినే దాటుడు పండుగ అని అంటారు.

1 2