ఉపాధి హామీకి రక్షణ చట్టం` ఆవశ్యం

ఒకే ఏడాది సుమారు 6 కోట్లకు పైగా పని దినాలు తగ్గిపోయాయి. అంతే కాకుండా చట్టంలోని మౌలిక అంశాలను, కనీస సౌకర్యాలను రద్దు చేసింది. రెండు పూటలా పని చేయాలని నిర్ణ యించింది. ఎండాకాలంలో ఇస్తున్న 20శాతం నుండి 30 శాతం అలవెన్స్‌ను తొలగించింది. చివరకు గుక్కెడు మంచినీళ్ళ కోసం ఇస్తున్న డబ్బులను సైతం రద్దు చేసింది. పొమ్మనకుండా పొగబెట్టి, పేదలే ఈ పథకం వద్దనేలా కేంద్ర ప్రభుత్వం కుట్రకు పూను కున్నది. దీనికి తందాన అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా 10శాతం నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో30 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ ఇచ్చే వారు. ఒకా నొక సందర్భంగా 50 శాతం కూడా ఇచ్చారు. చట్టం ప్రారంభం అయినప్పటి నుండి వున్న ఈ అలవెన్స్‌ను ఈసంవత్సరం కేంద్ర ప్రభుత్వం కావాలనే రద్దు చేసింది.దీనివల్ల ఎర్రటి ఎండలో చేతులు బొబ్బ లెక్కే లా పని చేసినా గిట్టుబాటు కూలి రావడం లేదు. పేదలు ఈపని మానుకుంటే తప్పుడు మస్టర్లు సృష్టించి కాంట్రాక్టర్లు,దళారులకు కట్ట బెట్టేందుకు ప్రయత్ని స్తున్నారు.
కూటి కోసం..కూలి కోసం..పనులు చేసుకుని బతు కుదామని బయల్దేరిన శ్రమజీవులు మార్గ మధ్యంలోనే ప్రమాదాల బారినపడి బలవుతు న్నారు. ఇటీవల మనరాష్ట్రంలో జరిగిన భారీ ప్రమాదాలన్నింటిలోనూ ప్రాణాలు కోల్పోయింది బడుగుజీవులే కావడం విషాదం.ఈ వారంలో మన రాష్ట్రంలో మూడు భారీ ప్రమాదాలు జరగ్గా, వాటిలో మరణించిన వారిలో 17 మంది మహిళలే కావడం విషాదం. వీటిలో రెండు ప్రమాదాల్లో మరణించిన వారంతా రెక్కాడితేగాని డొక్కాడని మహిళలు. అందువల్లే సెవెన్‌ సీటర్‌ ఆటోలో ఒక ఘటనలో 23 మంది, మరో ఘటనలో 14 మంది ప్రయాణించారు.తెలంగాణ నార్కట్‌పల్లి-మన రాష్ట్రంలోని అద్దంకిని కలిపే ఆ రహదారిలో అంతవరకూ నాలుగు రోడ్ల లైనులో వేగంగా వచ్చిన వాహనాలు సింగిల్‌లైనులోనూ అదే స్పీడులో రావ డంవల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. 2010లో నాలుగులైన్లరోడ్డు పూర్తయినా..వివాదాలు పరి ష్కారం కాకపోవడంతో ఆ ప్రాంతం ప్రమాదాలకు హాట్‌ స్పాట్‌గా మారింది. గత మూడేళ్లలో 12 ప్రమాదాలు ఆ ప్రాంతంలో జరిగాయంటేనే పరిస్థి తి అర్థం చేసుకోవచ్చు. మిరపకాయల పని కోసం తెలంగాణ నుంచి బయల్దేరిన 23మందిలో ఆరు గురు మరణించడం, ఏడుగురు తీవ్రంగా గాయ పడటంతో ఆగిరిజన కుటుంబాల జీవనం చిన్నా భిన్నమైంది. రొయ్యల శుద్ధి పరిశ్రమలో పనిచేసి తిరిగివస్తున్న యానాం ప్రాంతానికి చెందిన ఏడు గురు మహిళలు కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమా దంలో మరణించగా, మరో ఏడుగురు తీవ్ర గాయా ల పాలయ్యారు. ప్రైవేటు ట్రావెల్‌ బస్సును క్లీనర్‌ నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
రహదారులు రక్తసిక్తం కావడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలవల్ల మరణిస్తున్న వారి సంఖ్య 13 లక్షల కు పైమాటే. మరో రెండుకోట్ల నుంచి ఐదు కోట్ల మంది వరకూ తీవ్ర గాయాల పాలవు తున్నారు.ఈ గాయాలవల్ల వికలాంగులై జీవచ్ఛ వాల్లా బతుకు తున్న వారి సంఖ్యే ఎక్కువ. మృతుల సంఖ్యలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండటం, క్షతగాత్రుల సంఖ్యలో మూడోస్థానంలో ఉండ టం…మన దేశంలో రహదారుల భద్రత దుస్థితిని చాటిచెబుతోంది. 2020 లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే 69.80 శాతమని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడిరచారు. 2020లో దేశంలో 3,74,397 మంది మరణిస్తే, 2021లో 3,97,530 మంది బలయ్యారు. బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌ 40,510 మరణాలతో..10.2 శాతం, ఉత్తర ప్రదేశ్‌ 36,521 మరణాలతో.. 9.2 శాతం ప్రమాదాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏటా నాలుగు శాతం మరణాలు సంభవిస్తున్నాయి. 2021 లెక్కల ప్రకారం 16,044 మంది బలయ్యారు. రోడ్డు రవాణా, హైవేల మంత్రి త్వశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం ప్రమాదాలకు ఐదు ప్రధాన కారణాలున్నాయి. వాటిలో పరధ్యానంగా నడపటం, అత్యధిక వేగంతో నడప టం, మద్యం సేవించి నడపడం, ట్రాఫిక్‌ నిబంధ నలు పాటించకపోవడం, రహదారులు ఛిద్రమై ప్రమాదకరంగా ఉండటం.నూతన సాంకేతిక నైపు ణ్యంతో అతివేగంగా దూసుకెళ్లే వాహనాలు మార్కెట్‌లోకి వస్తుండగా, అందుకు అనుగుణంగా రహదారులు మెరుగుపడటం లేదు. దీంతో, వాహ న వేగం ఎందరి ప్రాణాలనో బలిగొంటోంది.
మరోవైపు… రోజురోజుకూ ఉపాధి మార్గాలు కుంచించుకుపోవడం,ఉపాధి హామీకి సైతం సవాలక్ష కొర్రీలు ఉండటం…తదితర కారణాలవల్ల దూర ప్రాంతానికైనా వెళ్లి పనులు చేసేవారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో పెరుగు తోంది.రోజూ పనులు దొరక్కపోవడంతో కుటుం బం గడవడం కష్టమవుతోంది. దీంతో, భర్తలకు చేదోడువాదోడుగా ఉండేందుకు మహిళలు సైతం పనులకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే అధిక ఛార్జీలు భరించలేక ఆటోల్లో కిక్కిరిసి ప్రయా ణిస్తూ జీవితాలను బలిపెట్టుకుంటున్నారు. ‘బేటీ బచావో.. బేటీ పఢావో..’ అని నినాదమిచ్చిన మోడీ ప్రభుత్వం గానీ, అక్కచెల్లమ్మలు అంటూ నిత్యం జపం చేసే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గానీ ఉపాధి,ఉద్యోగ కల్పనకు శ్రద్ధపెట్టింది లేదు. దీంతో, రొయ్యల శుద్ది లాంటి కష్టమైన పనులు చేస్తూ… ఎటువంటి భద్రత లేని ప్రయాణం చేస్తూ బలవు తున్న వ్యవసాయ కార్మికులు, మహిళలు రాష్ట్రంలో పెరుగుతున్నారు.ప్రమాదాలు జరిగినప్పుడు నష్టప రిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం కాకుం డా ప్రమాదాల నివారణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లు చిత్తశుద్ధితో కృషి చేయాలి. మృతుల కుటుంబా లను, క్షతగాత్రులను ఆదుకునేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.- (వి.వెంకటేశ్వర్లు)

ఒరిశా రైలు ప్రమాదానికి బాధ్యులెవరు?

దేశంలో మనుషుల ప్రాణాలంటే ప్రభుత్వాలకు లెక్కలేదు.రైలు,రోడ్డు,ఆకాశమార్గాల్లో ప్రమాదాలు జరుగుతున్నా ప్రజల భద్రత పరిరక్షణ చేపట్టడంలేదు. మానవ తప్పిదం కారణంగా ఒడిశా బాలేశ్వర్‌ రైలు ప్రమాదదుర్ఘటనలో దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపింది.గూడ్స్‌,ట్రైన్‌ నిలిచివున్న ట్రాక్‌లోకి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశించిందని,మూడు రైళ్ల ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని రైల్వే అధికారులు చెబుతున్నారు.ఇది మొత్తం ఎలక్ట్రికల్‌ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ తప్పిదాలు వల్లనే ఇంత ఘోరం జరిగిందని అధికారులు తేలిగ్గా చెప్పడం వారి భాద్యతారాహిత్యానికి, భద్రతచర్యల లోపాలకు నిదర్శనం.
రైలు ప్రమాద దుర్ఘాటనలో తన ఇద్దరు సోదరులను కోల్పోయిన ఒరిశా వాసి మనోజ్‌ దాస్‌ సోషల్‌ మీడియాలో తన ఆవేదన వ్యక్తపరిచారు.‘‘ఈ రకమైన తప్పిదాలు రైల్వేశాఖలో చాలావరకు జరుగుతున్నాయి. మొత్తం సంఘటనలో చాలా తప్పించుకోదగిన తప్పులు ఉన్నాయి. దీంట్లో ఎవరినీ నిందించడం లేదు కానీ మన దేశంలోని సో కాల్డ్‌ సిస్టమ్‌ యొక్క అజాగ్రత్త కారణంగా దేశంలో బహుజనుల సమస్యల పట్ల అజ్ఞానం,ఉదాసీనత స్పష్టంగా కన్పిస్తోంది. విషాదానికి దారితీసిన కొన్ని ‘‘సాంకేతిక లోపాలు’’ ఇక్కడ ఉన్నాయి.వీటిలో ఏవీ పూర్తిగా యాదృచ్ఛికంగా కనిపించవు.
ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పుకారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ అనేది సిగ్నల్‌లను సరికాని క్రమంలో మార్చకుండా నిరోధించడానికి ఒక భద్రతా చర్య. మార్గం సురక్షితమని నిరూపించబడినంత వరకు ఇది రైలును కొనసాగించడానికి అనుమతించదు. ఇనుప ఖనిజంతో కూడిన గూడ్స్‌ రైలు అప్పటికే ఆగిపోతున్న లూప్‌ లైన్‌ గుండా వెళ్లడానికి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు మొదట గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వబడిరది.ఈ మార్గంలో ఇలాంటి సిగ్నలింగ్‌ వైఫల్యాలు కొత్త కాదు.కానీ అన్ని తెలిసిన గతంలో ఈ వైఫల్యాల నుండి నేర్చుకోవడానికి నిరాకరించారు.
దాదాపు 1400మంది ప్రయాణికులతో యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌ సమ యం కంటే 3గంటలు ఆలస్యంగా బయలుదేరింది.సరైన సమయంలో,సాయంత్రం4గంటలకు బాలాసోర్‌ గుండా వెళితే,ఢీకొనడాన్ని సులభంగా నివారించవచ్చు.ఆలస్యానికి హంతకులు కాకపోతే మరెవరు బాధ్యులు?ప్రాణాలతో బయటపడిన కొద్దిమందితో ఫోన్‌లో మాట్లాడి,చాలా మంది రైళ్లలో కూర్చున్న వారి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసుకున్నారు.72సిట్టింగ్‌ కెపాసిటీ ఉన్న జనరల్‌ బోగీల్లో రెండు రైళ్లలోఒక్కొక్కరికి 200మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఘర్షణ జరిగినప్పుడు నిలబడి ఉన్నారు.ఈ రైళ్ల రద్దీకి జవాబుదారీ ఎవరు? అవును,ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోని నాటి ప్రభుత్వమే..నా సోదరుల మృతిపై రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలు కూడా..వాస్తవాలను దాచిపెడుతున్న పెయిడ్‌ మీడియా.తమరాజకీయ నాయకుల ముఖాన్ని కాపాడండి. కానీ దేశంలోని మతిమరుపు పౌరులమైన మనమే ఈసంఘటనను మరచిపోయి ప్రశ్నించడాన్ని జాతీయ వ్యతిరేకతగా పరిగణిస్తాము.’’అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్నచిన్న భద్రత లోపాలు కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.ఉదాహరణకు హెల్మేట్‌,సీటుబెల్టు,పెట్టుకొని ప్రయాణించక పోవడం ప్రమాదాలకు మరో కారణం.రహదారిపై ప్రయా ణించేటప్పుడు లైప్ట్‌ సైడ్‌ వెళ్లాల్సిన వాహనచోదకులు రైట్‌సైడ్‌ వెళ్తూ ప్రమాదాలకు గురవు తున్నా రు.దీంతోపాటు అతివేగం నియంత్రణ లేకపోవడం.వాహనాలను ఓవర్‌ టేక్‌ చేస్తూ అతివేగంగా ప్రయాణించడంతో ప్రమాదాలకు పిలుపులుగా మారుతున్నాయి.ఇవన్నీ యాధృచ్ఛకంగా జరుగుతున్న చిన్నచిన్న భద్రత లోపాలే.దేశంలో భద్రతకు ప్రధమ ప్రాధాన్యతమివ్వడం లేదు. రోడ్డు,రైలు మార్గాల భద్రతపట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి.అతివేగం,మానవ తప్పిదాల వల్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ భద్రతను పాటించాలి.- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

1 2