సామాజిక కార్య‌క‌ర్త దిశ ర‌వి అరెస్టు

కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతు కోసం తీసుకుని వచ్చిన మూడు వ్యవసాయ చట్టాకు వ్యతిరేకంగా ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. ఢల్లీి సరిహద్దుల్లో.. ఇండియా గేట్‌ వీధుల్లో..పార్లమెంట్‌దారుల్లో రైతు నిరసన వ్యక్తం చేస్తోండగా.. దీక్షల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రైతు దీక్షకు సంబంధించి సామాజిక మాధ్య మాల్లో గెటా థెన్‌బర్గ్‌ చేసిన టూల్‌ కిట్‌ వివాదంలో బెంగళూరు ఐటీ సిటీకి చెందిన పర్యావరణ, సామాజిక కార్యకర్త 22ఏళ్ల దిశా రవిని ఢల్లీి పోలీసు అరెస్టు చేశారు. తర్వాత ఫిబ్రవరి 23న బెయిల్‌ మంజూర య్యాంది. దేశంలో జరుగుతున్న రైతు ఆందోళనకు మద్దతు తొపుతూ స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమ కారిణి గ్రెటా థన్‌బర్గ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన టూల్‌ కిట్‌ను దిశారవి అప్‌లోడ్‌ చేశారు. రైతును రెచ్చగొట్టేలా ఉందంటూ ఫిబ్రవరి 4న ఢల్లీి పోలీసు థన్‌ బర్గ్‌పై అలాగే దిశపై ఐపీసీ సెక్షన్లు 124ఏ,120ఏ, 153ఏ కింద కేసు నమోదు చేసి దిశను అరెస్టు బెయిల్‌పై బయటకు విడుదయ్యారు.

ఫ్రైడేస్‌ఫర్‌ఫ్యూచర్‌’పేరిట పర్యావరణ పరిరక్షణకోసం చేపట్టిన అవగాహన కార్యక్ర మానికి శ్రీకారంచుట్టిన వారిలో దిశరవి ఒకరు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్‌ వేర్పాటువాదు టూల్‌కిట్‌ని రూపొందించినట్లుగా ఆరోపణు వ్యక్తంఅవుతున్నాయి. దీనివెనుక ఖలిస్థాన్‌ అను కూ సంస్థ ‘పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ హస్తం ఉన్నట్లు పోలీసు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యం లో గుర్తుతెలియని వ్యక్తుపై ఢల్లీి పోలీసు దేశ ద్రోహం,ప్రభుత్వంపై కుట్రకు సంబంధించిన పు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆకేసు విచారణలో భాగంగానే తాజాగా దిశ రవిని అరెస్ట్‌ చేశారు.
 రైతు ఆందోళనకు మద్దతు తెలిపేం దుకు టూల్‌కిట్‌ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే ఎడిట్‌చేశానని ఆమెవ్లెడిరచారు. డాక్యు మెంట్‌లోని అంశాు అభ్యంతకరంగాఉన్నందున దానిని తొగించాంటూ థన్‌బర్గ్‌ను కోరినట్లు కూడా చెప్పుకొచ్చారు. అనంతరందిశను ఐదు రోజు పోలీసు కస్టడీకి అప్పగించారు. జనవరి 26వ తేదీన ఢల్లీిలో రైతు ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనకు టూల్‌కిట్‌ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణ మని పోలీసు భావిస్తున్నారు. ఈక్రమంలోనే టూల్‌కిట్‌ రూపకర్త సమాచారం అందించాం టూ గూగుల్‌,ట్విట్టర్‌ను కోరారు. ఆరెండు సంస్థు ఇచ్చిన వివరామేరకు భారత ప్రభుత్వానికి వ్యతి రేకంగా దేశంలో సామాజిక,సాంస్కృతిక, ఆర్థికపర మైన అజడును సృష్టించేందుకు కుట్ర పన్నారం టూ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

దిశా రవి ఎవరు? ఏమిటీ టూల్‌కిట్‌ కేసు? భారత్‌లో రైతు నిరసనకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్‌ షేర్‌ చేసిన ‘టూల్‌కిట్‌’ మీద నమోదైన కేసుకు సంబంధించి.. అరెస్టు చేశారు. ఆమె అరెస్టు ను తప్పుబడుతూ దిల్లీముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీ వాల్‌ మొదుకొని అమెరికా ఉపాధ్యక్షురాు కమలా హారిస్‌ మేనకోడు వరకు అనేక మంది ప్రముఖు స్పందిస్తున్నారు. అసు ఏం జరిగింది? దిశ రవి ఎవరు? ఈకేసు ఏమిటి? ఇండియాలో‘ఫ్రైడేస్‌ఫర్‌ ఫ్యూచర్‌’ ప్రచార అధ్యా యాన్ని ప్రారంభించిన వారిలో22 ఏళ్ల దిశా రవి ముఖ్యు.దిల్లీకి చెందిన స్పెషల్‌ సెల్‌ పోలీసు ఆమెను బెంగళూరులో అరెస్ట్‌ చేశారు.గ్రేటా థన్‌బర్గ్‌ రైతుకు మద్దతుగా ట్వీట్‌ చేసిన తరువాత నమో దైన కేసుల్లో ఇది మొదటి అరెస్ట్‌. బెంగళూరుకు చెందిన ప్రముఖ కార్యకర్త తారా కృష్ణస్వామి, దిశ గురించి మాట్లాడుతూ..‘‘పర్యావరణ పరిరక్షణ కోసం మేము చేపట్టే వివిధ కార్యక్రమా గురించి అనేకసార్లు మాట్లాడుకున్నాం. వ్యక్తిగతంగా తనతో నాకు పరిచయం లేదు.కానీ, ఒకటిమాత్రం కచ్చి తంగా చెప్పగను. ఆమెఎప్పుడూ చట్టాన్ని ఉ్లం ఘించలేదు. ఒక్కసారి కూడా అలాంటి పని చేసిన దాఖలాు లేవు. ఇదొక్కటే కాదు,అనేకఉద్యమాకు సంబంధించిన సంస్థన్నీ కూడా చట్ట బద్ధంగానే పనిచేస్తాయి. దిశఎప్పుడూ వాటన్నిటికీ నిజాయితీ గా,శాంతియుతంగా సహకరిస్తారు’’ అని అన్నారు. దిల్లీ పోలీసు దిశను దిల్లీకోర్టులో హాజరు పరుస్తూ.. ‘‘దిశారవి టూల్‌కిట్‌ గూగల్‌ డాక్యు మెంట్‌ ఎడిటర్‌…ఈడాక్యుమెంట్‌ను తయారు చేయడంలోనూ,ప్రచారం చేయడంలోనూ ఆమె ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ఖలిస్తాన్‌ మద్దతుదారు ‘పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’తో కలిసి దిశ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాు చేపడుతున్నారు. దిశనే ఈటూల్‌కిట్‌ను గ్రేటాథన్‌బర్గ్‌తో పంచు కున్నారు. ఈ టూల్‌కిట్‌ రూపొందించడం కోసం ఒక వాట్సాప్‌గ్రూప్‌ను దిశ ఏర్పాటు చేశారు. ఈ టూల్‌కిట్‌ పైనల్‌ డ్రాఫ్ట్‌ తయారు చేసిన బృందంతో దిశ కలిసి పనిచేశారు’’ అని పేర్కొన్నారు.‘‘జనవరి 26న దేశరాజధాని దిల్లీలో జరిగిన అ్లర్లు ప్రణాళిక ప్రకారమే జరిగాయని, అందులో ఈ డాక్యు మెంట్‌ పాత్ర ఉందని’’ వారు చెబుతున్నారు. అయితే దిశారవితో పనిచేసినవారందరూ ఆమె ఎంతో నిజాయితీ పరురాని,నిబద్ధత కలిగిన వ్యక్తి అని అంటున్నారు.‘‘దిశ చాలాచలాకీ అమ్మాయి. మంచి యువతి. కొన్నిసార్లు ఆమెకార్యక్రమాకు ఆస్యం గా వచ్చేవారు. కానీ,మేం ఏం అనేవాళ్లం కాదు. ఎందుకంటే ఆమె శక్తివంచన లేకుండా,చట్టాకు అనుగుణంగా,నిజాయితీతో పనిచేస్తారు. ‘సేవ్‌ ట్రీస్‌’ (చెట్లనుకాపాడండి)ఉద్యమం గురించి తనే స్వయంగా పోలీసుకు వివరించి,వారి అనుమతి తీసుకు న్నారు. దిశ ఎప్పుడూ చిత్తశుద్ధితో చట్టాకు లోబడే పనిచేశారు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక కార్యకర్త వివరించారు.‘‘దిశ అరెస్టుతో అనేకమంది భయాందోళనకు గురవుతున్నారని’’ మరొక వ్యక్తి అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉగ్రవాద నిరోధకచట్టం (యూఏపీఏ) యువతను చాలా భయ పెడుతోంది. దీనివనే 2020 జూన్‌లో ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ను నిలిపివేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఎన్వి రాన్మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్మెంట్‌’(ఈఐఏ)కు వ్యతి రేకంగా ప్రచారం చేపట్టాల్సి ఉండగా దాన్ని నిలిపి వేయాల్సి వచ్చింది’’ అని ఇంకొక వ్యక్తి తెలిపారు.ఆసమయం లోదిశారవి షషష.aబ్‌శీతీవజూశీత్‌ీ aటతీఱషa.షశీఎఅనే వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ..’’ భారతదేశంలో ప్రజావ్యతిరేకచట్టాకు జనం బలై పోతున్నారు. అసమ్మతి గొంతు నొక్కేస్తున్న దేశంలో మేము జీవిస్తున్నాం. ఎన్విరాన్మెంటల్‌ ఇంపాక్ట్‌ అసె స్మెంట్‌ ముసాయిదాను వ్యతిరేకిస్తున్న కారణంగా ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ఇండియా’కు చెందిన వ్యక్తుపై తీవ్రవాదునే ముద్ర వేస్తున్నారు. ప్రజ జీవితా కన్నా లాభాకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం స్వచ్ఛమైనగాలి, నీరు కోరుకోవడాన్ని తీవ్రవాదంగా పరిగణిస్తోంది’’ అని అన్నారు.<br>దిశా రవి మీద పెట్టిన కేసు ఏంటి?<br>భారతీయ శిక్షా స్మృతిని అనుసరించి దేశ ద్రోహం, సమాజంలో వివిధ వర్గా మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, నేరపూరిత కుట్ర కింద దిశపై కేసు నమోదు చేశారు. బెంగళూరులోని ఓప్రైవేటు కాలేజీలో దిశ బీబీఏ డిగ్రీ చదువుతున్నారు. 2018 లో గ్రేటా థన్‌బర్గ్‌ పర్యావరణ పరిరక్షణ దిశగా ‘సేవ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌ క్యాంపెయిన్‌’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టిస్తున్న సమయంలోనే దిశా రవి ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ఇండియా’ ప్రచారం మొదుపెట్టారు. భారత్‌లో వాతావరణ మార్పు నియంత్రణకు నిర్వహిస్తున్న చాలా ఉద్యమాు, కార్యక్రమాల్లో దిశ పాల్గొన్నారు. ఇదే అంశంపై గతంలో ఆమె బెంగళూరులో నిరసను చేపట్టారు. వాతావరణ మార్పుతో చుట్టుముట్టే ముప్పుపై మీడియాలో ఆమె వ్యాసాు కూడా రాస్తుంటారు. అయితే, నిరసన ప్రదర్శనలో పాల్గొనడం కంటే ఎక్కువగా చెరువు, నదును శుభ్రం చేయడం, చెట్లను నరక్కుండా కాపాడడం మొదలైన కార్యక్ర మాలో పాల్గొనడానికే ఆమె మొగ్గు చూపుతారు. దిశ అరెస్ట్‌ యువతను భయపెట్టిందని తారా కృష్ణస్వామి కూడా అంగీకరించారు.‘‘నాకు కూడా భయం వేస్తోంది. మేము అన్ని విషయాను శాంతియుతంగా పరిష్కరించడానికే మొగ్గు చూపు తాం. పోలీసు అనుమతి తీసుకోకుండా ఏ పనీ చెయ్యం. యువతను ఇలా క్ష్యంగా చేసుకోవడం చాలా విచారకరం’’ అని ఆమె అన్నారు. ప్రస్తుతం దిశను ఐదు రోజు కస్టడీకి తీసుకున్నామని పోలీసు ు వివరించారు. ఆమె మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ కూడా సీజ్‌చేశారు. అయితే, దిశను కస్టడీకి పంపిం చానే నిర్ణయం తీసుకొనే సమయంలో ఆమె తరపు లాయర్‌ కోర్టులో లేకపోవడంపై నిపుణు నుంచి ప్రశ్ను మ్లెవెత్తుతున్నాయి. లాయర్‌ లేని సమ యంలో ఆమెను పోలీసు కస్టడీకి పంపించండంపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ‘‘పాటియాలా హౌస్‌ కోర్టు డ్యూటీ మెజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. తన తరపున వాదించ డానికి న్యాయవాది అందుబాటులో ఉన్నారో లేదో కూడా తొసుకోకుండా ఒకయువతిని ఐదు రోజు రిమాండ్‌పై పోలీస్‌ కస్టడీలోకి పంపిం చారు. మెజిస్ట్రేట్‌ ఇలాంటి విషయాను చాలా సీరియస్‌గా తీసుకోవాలి. రాజ్యాంగలోని ఆర్టికల్‌ 22 కచ్చితంగా పాటించేలా చూడాలి. విచారణ సమయంలో నిందితురాలి తరపు న్యాయవాది హాజరు కాకపోతే వకీు వచ్చేవరకు వేచి చూడాలి లేదా ప్రత్యామ్నాయాను సూచించాలి. కేసు డైరీ, మెమో తనిఖీ చేశారా? బెంగళూరు కోర్టు ట్రాన్సిట్‌ రిమాండ్‌ లేకుండా ఆమెను నిర్బంధించి నేరుగా ఇక్కడి కోర్టుకు ఎందుకు తీసుకొచ్చారని మెజిస్ట్రేట్‌ స్పెషల్‌ సెల్‌ అధికారును ప్రశ్నించిందా? న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఈఅంశానీ కూడా షాక్‌ కలిగిస్తున్నాయి’’అని సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ వాది రెబెకా జాన్‌ సోషల్‌ మీడియాలో రాశారు. ‘‘ఒకవేళ ఏదైనా తప్పు చేశారనిపిస్తే ఆమెను ముందు పోలీస్‌ స్టేషన్‌లో విచారించాలి. నేరుగా దిల్లీ కోర్టులో హాజరు పరచడానికి ఎందుకు తీసు కెళ్లారు.టెక్నాజీ గురించి సరైన అవగాహన లేక పోవడంవన ఈవిషయంలో గందరగోళం తలె త్తిందనిపిస్తోంది’’ అని తారా కృష్ణస్వామి అన్నారు.<br>ఏమిటీ టూల్‌కిట్‌?‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ నుంచి ‘యాంటీ లాక్‌డౌన్‌ ప్రొటెస్ట్‌’ వరకు.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాను ముందుకు తీసుకెళ్లడానికి అనుసరించాల్సిన కార్యా చరణ ప్రణాళికతో నిరసనకాయి ఒక డాక్యుమెంట్‌ రూపొందిస్తారు. దీనినే ‘టూల్‌కిట్‌’ అంటారు.ఈ డాక్యుమెంట్‌ కోసం సోషల్‌ మీడియాలో ‘టూల్‌కిట్‌’ అనేమాటను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందు లో సోషల్‌ మీడియా వ్యూహంతోపాటు, నిరసన ప్రదర్శన సమాచారంకూడా ఇస్తుంటారు. ఉద్య మం ప్రభావాన్ని పెంచడానికి సాయపడగ వారికి ఈ టూల్‌కిట్‌ను తరచూ షేర్‌ చేస్తుంటారు.‘టూల్‌కిట్‌ అనేది ఒకపత్రంలాంటిది. పరస్పర సహకారం,సమన్వయంకోసం ఉపయోగించేది. రాజకీయ పార్టీు, కార్పొరేట్‌ వర్గాు కూడా దీన్ని వినియోగిస్తాయి. దీన్ని ఎవరికీ వ్యతిరేకంగా ఉప యోగించరు. ఎవరైనా ఎక్కడినుంచైనా గూగల్‌ డాక్యుమెంట్‌ ఎడిట్‌ చెయ్యొచ్చు. అందరి ఆలోచ నను అందులో పొందుపరిచి..అన్నీ ఒకేచోట ఉండేలా చేయొచ్చు. దీన్ని ఎవరు ముందు సవరిం చారు, ఎవరు తరువాత సవరించారుఅనే విష యాలేం తెలీవు. ఇది డిజిటల్‌ ప్రపంచం. ఎవరైనా ఎక్కడినుంచైనా ఎడిట్‌ చెయ్యొచ్చు. నిజం చెప్పా ంటే వయసు పైబడినవాళ్లు, వృద్ధు ఈదేశాన్ని నడుపుతున్నారు. వారికి టెక్నాజీ గురించి ఏమీ తెలీదు’’ అని తారా కృష్ణస్వామి అభిప్రాయపడ్డారు. వీగన్‌ మిల్క్‌ (పూర్తి శాకాహార పాు) ప్రోత్సహించే ఒకస్టార్టప్‌ కంపెనీ కోసం దిశా రవి పనిచేస్తున్నారు. ‘‘దిశ ఆమె తల్లిదండ్రుకు ఏకైక సంతానం. ప్రస్తు తం తన కుటుంబం తన సంపాదన మీదే నడు స్తోంది. చిన్నప్పటినుంచీ ఆమె కుటుంబం నాకు బాగా తొసు. ఆమె తండ్రి ఆరోగ్యం బాగోలేదు. తల్లిగృహిణి. కొద్దిరోజు ముందు,పొద్దున్న ఏడు గంట నుంచీ తొమ్మిది వరకూ,మళ్లీ సాయంత్రం ఏడు నుంచీ తొమ్మిది వరకూ చేయగలిగేలా ఏదైనా పని ఉంటే ఇప్పించమని ఆమె నన్ను అడిగారు’’ అని ఆస్టార్టప్‌కు చెందిన,పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి తెలిపారు.‘‘ఇది చాలావిచారకరం. నిరాశ నిస్పృహను కలిగిస్తోంది. చెట్లను,పర్యావరణాన్ని కాపాడానుకునే ప్లిను దేశద్రోహుగా చిత్రీ కరించి భయపెడుతున్నారు’’ అని మరొక కార్యకర్త తెలిపారు.<br>యువ పర్యావరణ వేత్తకు దేశవ్యాప్త మద్దతు<br>దిశకు ప్రముఖు నుంచి మద్దతు భిస్తోంది.దిశా రవి అరెస్టును దేశవ్యాప్తంగా పువురు సామాజిక కార్యకర్తు,రాజకీయ నాయకు తప్పుబడు తున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌పార్టీ నాయకు రాహుల్‌గాంధీ, ప్రియాం కా గాంధీ ఇప్పటికే ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారు. 22 ఏళ్ల దిశను అరెస్టు చేయడమంటే ప్రజాస్వామ్యంపైదాడి చేయడ మేనని,రైతుకు మద్దతు ప్రకటించడం నేరం కాదని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌ నోరు నొక్కేయలేరని చెబుతూ దిశ అరెస్టుకు సంబంధించిన వార్తను రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఎలాంటి ఆయు ధాూ లేని ఒకసాధారణ అమ్మాయిని చూసి తుపాకున్న వారు భయపడు తున్నారని, ఆ అమ్మాయిని చూస్తుంటే వారిలో ధైర్యం నీరుగారి పోతోందని ప్రియాంకాగాంధీ ట్వీట్‌ చేశారు. ‘’ఇండియాబీయింగ్‌ సైలెన్సెడ్‌, రిలీజ్‌ దిశారవి’’ హ్యాష్‌ట్యాగ్‌ను ఆమె జోడిరచారు. అమెరికా ఉపాధ్యక్షురాు కమలా హ్యారిస్‌ మేన కోడు మీనా హ్యారిస్‌ కూడా దిశ అరెస్టుపై స్పందించారు.‘’ఒక యువపర్యావరణ ఉద్యమకారిణిని భారత అధికారు ు అరెస్టు చేశారు. రైతు ఉద్యమానికి సంబంధిం చిన టూల్‌కిట్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేసి నందుకే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సామాజిక కార్యకర్త నోరును ఎందుకు నొక్కేయా ని ప్రయత్నిస్తున్నారో ఒకసారి భారత ప్రభుత్వం ఆలోచించుకోవాలి’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ కూడా దిశకు మద్దతుగా స్పందించింది. కశ్మీర్‌లో ప్రజ గొంతు నొక్కేస్తున్నట్లే, వారికి వ్యతిరేకంగా మాట్లాడే అందరి నోర్లనూ మోదీ, ఆరెస్సెస్‌ ప్రభుత్వం మూయించాని అనుకుంటోందని విమర్శించింది. దీనికోసం క్రికెటర్లు,బాలీవుడ్‌ సెబ్రిటీనూ ఉపయోగించు కుంటోందని ట్విటర్‌లో ఆరోపించింది.<br>దిశను కసబ్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ బీజేపీ సీనియర్‌ నేత, బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌… దిశను 2008 ముంబయి దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్‌ తీవ్రవాది మహమ్మద్‌ అజ్మల్‌ కసబ్‌తో పోల్చారు. బుర్హాన్‌ వనీ,కసబ్‌ వయసు కూడా 21 ఏళ్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒక నేరం, ఎప్పుడూ నేరమే అవుతుందని ట్వీట్‌ చేశారు. మోహన్‌ వ్యాఖ్యపై సోషల్‌ మీడియాలో పెద్ద యెత్తున నిరసన వ్యక్తమవుతోంది.మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ దిశారవి అరెస్టునుఖండిరచారు. పోలీసు వేధిం పుకు ప్పాడడం సరైందికాదని వ్యాఖ్యానిం చారు. ఆమెకు తాను అండగా ఉంటానన్నారు. మరో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిదంబరం సైతం ఈ యువపర్యావరణ వేత్త అరెస్టును తప్పుబట్టారు. పోలీసు చర్యకు వ్యతిరేకంగా యువత గళం విప్పానికోరారు. రైతుఉద్యమానికి మద్దతు ప్రకటిం చడం నేరం కాదని, ఆకారణంగా కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమేంటని ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ప్రభుత్వం ప్రశ్నించే గొంతు అణచివేతకు ప్రయత్నిస్తోందన్నారు. దిశ అరెస్టును ఖండిరచినవారినలో కేంద్రమాజీమంత్రిశనిథరూర్‌ కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మూ ఉన్నారు. ఈ క్రమం లో రైతు సమస్య గురించి తెలీకుండా వ్యాఖ్యానిం చొద్దంటూ పువురు నెటిజన్లు గ్రెటాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ పూర్తిచేసిన దిశ ఓప్క్రెవేటు కంపెనీలో మేనేజర్‌ గా పనిచేస్తూ ‘ఫ్రైడేఫర్‌ఫ్యూచర్‌’అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహి స్తున్నారు. కాగా దిశారవిపై మోపిన అక్రమ కేసు ను ఎత్తివేయాని, వెంటనే ఆమెను విడుద చేయాని కోరుతూ సోషల్‌ మీడియాలో క్యాం పెయిన్‌ నడుస్తోంది. అటు రైతునేతు సైతం దిశ అరెస్టును ఖండిరచారు. కిసాన్‌ సంయుక్త మోర్చ దిశపై తప్పుడు కేసు మోపడాన్ని తప్ప బట్టింది. ఆమెను వెంటనే విడుద చేయాని డిమాండ్‌ చేసింది.ఉద్యమ ‘దిశ’<br>ఇదిరాజద్రోహం నేరంతప్ప మరేమీ కాదని రాజ్యయంత్రాంగం అంతా వాదిస్తుంది. బట్టతకు మోకాుకు ముడిపెట్టడం అంటే ఇదే కదా! ఇందులో ఎంత అశాస్త్రీయత, అహేతుకత ఉన్నదో వేరుగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇప్పుడు బెంగుళూరుకు చెందిన ఓ యువపర్యావరణ కార్య కర్త దిశ రవిని దేశద్రోహిగా, అంతర్జాతీయ కుట్ర దారుగా పరిగణించి ఢల్లీిపోలీసు వచ్చి అకస్మా త్తుగా అరెస్టుచేయడాన్ని యావత్‌ప్రపంచం విస్తుపో యేట్టు చేస్తున్నది. ఇందుకోసం ‘టూల్‌కిట్‌’ కుట్ర సిద్ధాంతాన్ని కేంద్రం రంగంలోకి తెచ్చింది. ఈ పేరున ఇది తొలి అరెస్టు. ఇప్పుడేకాదు ఇకముందు కూడా ఎవరైనా కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇలాంటి అరెస్టు, వేదింపు తప్పవనే హెచ్చరిక ఇందులో ద్యోతకమవుతున్నది. ఉద్యమ కార్యకర్త ను భయబ్రాంతుకు గురిచేసేందుకే కేంద్రం ఇలాంటి దుశ్చర్యకు ప్పాడుతున్నట్టు చెప్పకనే చెపుతున్నది. చట్టాన్ని అముపరిచేవారు చట్టబద్దం గా వ్యవహరిస్తున్నారా? అంటే అదీలేదు. బెంగు ళూరు శివారుల్లోని దిశరవి గృహం నుంచి ఆమెను ఢల్లీి పోలీసు అరెస్టు చేసిన తీరు అన్ని నియమ నిబంధననూ తుంగలోతొక్కినట్టు స్పష్టం చేస్తున్నది. అవకాశం లేకగాని, లేకుంటే స్వీడన్‌ పర్యావరణ వేత్త గ్రెటాథెన్‌బర్గ్‌ను కూడా అరెస్టుచేసి జైల్లో బంధించేవారని విమర్శకు పేర్కొంటున్నారు. గ్రేటా వయస్సు ఇరవై ఏండ్లలోపే. పిన్న వయస్సు లోనే ఆమె ప్రపంచ పర్యావరణ వేత్తగా ప్రసిద్ధిగాం చింది. దిశ రవి వయస్సుకూడా 22ఏండ్లే. ఎంబీఏ చదువుతున్న ఆమె మాంసం పరిశ్రమకు లెక్కలేనన్ని జీవాు హతమవుతున్న తీరును ఓడాక్యు మెంటరీలో చూసిచలించిపోయి పర్యావరణ వేత్తగా మారింది. ఉద్యమ పంథాను ఎంచుకున్నది. గ్రేటా మద్దతుతో నడిచే ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ఇండియా’కు దిశ బెంగుళూరులో వ్యవస్థాపక సభ్యురాు. వృక్షజాతుతో పాఉత్పత్తు తయారుచేసే స్టార్టప్‌ కంపెనీలో ఈమె పనిచేస్తున్నది. మెట్రో పను,స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా వేలాది చెట్లునరక డాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నడిపింది. ఇప్పుడు తాజాగా, దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నావని కోర్టులోపబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆరోపించి నప్పుడు దిశ దానిని నిర్ద్వందంగా ఖండిరచింది. ‘నేను భవిత గురించి ఆలోచిస్తాను. దేశానికి ఆహారాన్ని అందిం చేది రైతు. అన్నం పెట్టేది రైతే కాబట్టి దేశానికి రైతే భవిత, ఫ్యూచర్‌ అని నమ్మాను కాబట్టే రైతు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాను’ అని విస్ప ష్టంగా చెప్పింది. ఇంత సత్య నిష్టగా సమాధాన మివ్వడం కొందరు పాకుకు మింగుడుపడటం లేదుమరి. ఇకపోతే టూల్‌కిట్‌ విషయం…గ్రేటాషేర్‌ చేయ డంతో టూల్‌కిట్‌ విషయం మెగులోకి వచ్చింది. భిన్నప్రాంతా సమూహ ప్రజానీకం తమ న్యాయ మైన డిమాండ్ల సాధనకు ఉద్యమంలో భాగంగా వివిధ మార్గాను సూచించే పద్ధతిలో గూగుల్‌ డాక్యుమెంట్‌గా ఇదిరూపొందింది. తాము ప్రజాస్వామ్యయుతంగా ఉద్దేశపూర్వంగా నిర్వ హించే కార్యాచరణ ప్రాంతాను, సమయాను ఇందులో నమోదు చేసుకుంటారు. సామాజిక మాద్యమాల్లో దీనిని ఉపయోగం ఎక్కువ. అమెరికా న్లజాతి వివక్ష వ్యతిరేక ఉద్యమం, లాక్‌డౌన్‌ వ్యతిరేక నిరసనోద్యమం, పర్యావరణ పరిరక్ష ణోద్యమం మొదలైనవి ఈ టూల్‌కిట్‌ సాయంతో ప్రణాళికు రచించుకుని ముందుకు సాగాయి. ఉద్యమం అభివృద్ధి కావడానికి ఇది తోడ్పడు తుంది. అంటే ఓకరపత్రంలా,పోస్టర్‌లా పని చేస్తుంది. అయితే పాకు దీనికి వేరే నిర్వచనం చెపుతున్నారు. వారిని బపరిచే గోడీ మీడియా అయితే ఇకసరేసరి. ఉగ్రవాదు, దేశవిధ్వం సకు మాత్రమే టూల్‌కిట్‌ను వినియోగిస్తారని, అందుకు వంద వేకోట్లు ంచం తీసుకుని ట్వీట్లు,షేర్లు చేస్తారని, ఇదంతా అంతర్జాతీయ కుట్ర లో భాగ మేనని వల్లిస్తున్నారు.<br>కుక్కను చంపాంటే పిచ్చికుక్క అని ముద్ర వేయాలి. నిజాయితీ పరులైన ఉద్యమ కారుపై అభాండాు వేయడం, వేదించడం, శిక్షించడం, రామాయణ కాం నుంచీ జరుగు తున్నది. ఈచీకటి కోణాు తొసుకున్న కొద్దీ మెగు ప్రస్థానంవైపుకే మాన వుడు ప్రయాణి స్తాడు. ఉద్యమం కూడా ఆ ‘దిశ’గానే ప్రవహి స్తుంది. రైతు వెంట పర్యావరణ ఉద్యమవేత్తు, వారి వెంట ప్రజాతంత్ర వాదు, దేశ ప్రజానీకం సంఫీుభావంగా నడవడం తప్పదు మరి!

దిశ రవికి బెయిల్‌ మంజూరు చేసిన ఢల్లీి కోర్టు
రైతు ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెట్షా థన్‌బర్గ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసిన టూల్‌కిట్‌ వ్యవహారంలో బెంగళూరు యువతిని ఢల్లీి పోలీసు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. టూల్‌కిట్‌ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశ రవికి ఢల్లీి కోర్టులో ఊరట భించింది. ఢల్లీి అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా ఆమెకు బెయిల్‌ మంజూరు చేశారు. రూ.క్ష వ్యక్తిగతబాండు, అంతే మొత్తానికి మరోఇద్దరి పూచీ కత్తుతో ఆమెను విడుద చేయాని ఆదేశించారు. ఆమెకు బెయిల్‌ మంజూరు చేయకపోవడానికి సహేతుక కారణాు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాపై ఆందోళను నిర్వహిస్తోన్న రైతుకు మద్దతుగా సోషల్‌ మీడియా ద్వారా టూల్‌కిట్‌నుషేర్‌చేసినట్టు దశరవి అభియోగాు ఎదుర్కొంటున్నారు. ఖలిస్థాన్‌ అనుకూసంస్థ ‘పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ (పీజేఎఫ్‌)తో ఆమెకు ప్రత్యక్ష సంబంధాు ఉన్నట్టు నిరూపించే ఆధారాను పోలీసు సమర్పించలేకపోయారని కోర్టు పేర్కొంది. వేర్పాటువాద ఆలోచనతో ఆమెకు సంబంధం ఉందని చెప్పడానికీ ఆధారా ల్లేవని తెలిపింది. గతంలో ఎటువంటి నేర చరిత్రలేని యువతికి అరకొర ఆధారాను పరిగణనలో తీసుకుని బెయిల్‌ నిరాకరించ డానికి ఎటువంటి ప్రాతిపదిక కనిపించడం లేదని న్యాయమూర్తి అన్నారు. సమాజంలో బమైన మూలాున్న ఆమెను నిర్బంధించి జైల్లో పెట్టడాన్ని కోర్టు తప్పుపట్టింది.<br>టూల్‌కిట్‌ గురించి పోలీసు చెబుతున్నా దానిని ఉపయోగించి ఆమెహింసను ప్రోత్సహించినట్టు ఎక్కడా కనిపించలేదని న్యాయ మూర్తి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ తీరుపై పౌరు నిరంతర పరిశీన ఉంటుందనేది నా నిశ్చిత అభిప్రాయమని, కేవం విధానాతో విభేదించాన్న మార్గాన్ని ఎంచుకున్నందుకు వారిని జైల్లో ఉంచడం తగదని హితవు పలికారు. ప్రభుత్వ అహంకారం దెబ్బతిన్నంత మాత్రాన దానికి మందుగా దేశద్రోహ అభియోగం మోపడం సమంజసం కాదని ఘాటువ్యాఖ్యు చేశారు. విభేదించడం, భిన్నాభిప్రాయం ఉండడం, అసమ్మతి తెపడం, ఆక్షేపించడం అనేవి రాజ్య విధానాల్లో వాస్తవికతను ప్రోది చేసే చట్టబద్ధ సాధనాని వ్యాఖ్యానించారు. వివేకవంతులైన, విడమరిచి చెప్పగ పౌయి ఉండడం ఆరోగ్యకర, దేదీప్యమాన ప్రజాస్వామ్యానికి సూచిక అనేది నిర్వివాదాంశమని పేర్కొన్నారు. విభేదించే హక్కును రాజ్యాంగంలోని 19వఆర్టికల్‌ బంగా చాటు తోందని, కమ్యూనికేషన్‌కు భౌగోళికహద్దులేమీ లేవని జడ్జ్‌ అన్నారు. సమాచారాన్ని పొందడానికి అందుబాటులో ఉన్న ఉత్తమ సాధానాను వినియోగించుకునే హక్కు పౌరుకు ఉందని స్పష్టం చేశారు. వాట్సప్‌ గ్రూపునుఏర్పాటు చేయడం, అపాయకరం కాని టూల్‌కిట్‌కు ఎడిటర్‌గా ఉండడం తప్పేమీ కాదని కుండ బద్దు కొట్టారు. విచారణకు దిశ సహకరించాని, దర్యాప్తు అధికాయి పిలిచినప్పుడు హాజరు కావాని సూచించిన కోర్టు..తమ అను మతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. బెయిల్‌ మంజూరు కావడంతో ఫిబ్రవరి 23రాత్రి దిశరవి తిహార్‌ జైు నుంచి విడుదయ్యారు. కుమార్తెకు బెయిల్‌ భించడంతో న్యాయ వ్యవస్థపై తమ విశ్వాసం మరింత పెరిగిందని దిశ రవి తల్లిదం డ్రు హర్షం వ్యక్తం చేశారు.
-సైమన్‌ గునపర్తి/కె.శాంతారావు