చత్తీష్‌ఘ‌డ్ గ‌వ‌ర్న‌ర్‌తో స‌మ‌త ర‌వి భేటీ

చత్తీష్‌ఘర్‌ రాష్ట్ర పీసా చట్టం గ్రూప్‌ వర్కింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌,సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి ఆ రాష్ట్ర గవర్నర్‌ అనుసూయ ఉయిక్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అనుసూయ ఉయిక్‌తో రవి పలు అంశాలు ప్రస్తావించారు. షెడ్యూల్‌ ప్రాంత చట్టాలు పరిరక్షణ, పీసా చట్టం`1996 అమలు,గ్రామసభల పటిష్టకు కృషి చేస్తానని తెలిపారు. షెడ్యూల్డు ప్రాంత పాలన,రాజ్యాంగ నియమాలు,భూమి బదలాయింపు నిబంధనలు 1/70,అటవీ హక్కుల గుర్తింపు చట్టం`2006,ఆదివాసీ హక్కలు వంటి కీలకమైన విషయాలుపై చర్చించారు. అదేవిధంగా సమత వ్యవస్థాపక దినోత్సవం ఏర్పా టుపై గవర్నర్‌ అనుసూయ ఉయిక్‌తో ప్రస్తావించారు. దీనిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. చారిత్రాత్మకమైన సమత తీర్పు షెడ్యూల్‌ ప్రాంత ఆదివాసీలకు రక్షణ కవచంలాంటిదని కొనియాడారు.గిరిజన హక్కులను పునరుద్దరించిన సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుని పేర్కొన్నారు.ఆదివాసీ హక్కుల కోసం పోరాడే ఒక చిన్న సామాజిక కార్యాచరణ సంస్థ అయిన సమత అన్యాయాలపై గళమెత్తడానికి వివిధ మార్గాలను ఎంచుకొని చైతన్యవంతమైన రాజకీయ నిర్ణయాలు,న్యాయసాధనకు అసంఖ్యాక న్యాయమార్గాల ద్వారా ప్రజా ఉద్యమాన్ని నడిపిన మహా కర్తవ్యమని సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవిని ప్రశంసించారు.అట్టడుగు స్థాయిలో గిరిజనుల సంక్షేమం,అభ్యున్నతికోసం శ్రమించే సామాజిక సంస్థని కితాబునిచ్చారు. గవర్నర్‌ను కలసిన వారిలో మైన్స్‌,మినరల్స్‌ అండ్‌ పీపుల్స్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ శర్మాలి(గుజరాత్‌)సమత డైరెక్టర్‌ విక్కీ పాల్గొన్నారు.- గునపర్తి సైమన్‌