ఎంత కాలం ఈ పోరాటం

  • నాన్ షెడ్యూల్డ్ ఏరియా గిరిజనుల వెతలు …..
  • ” పుట్టింది..పెరిగింది… నివసిస్తున్నది…అంతా ఏజెన్సీ ప్రాంతంలోనే. అయినా కొందరు గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందలేక పోతు న్నారు. కొందరు మహిళలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా.. కొన్ని గ్రామాలు ప్రభుత్వ రికార్డులలో నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాల్లో నమోదై ఉండటమే దీనికి కారణం. రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులున్నా, ఇలా ప్రభుత్వ రికార్డుల కారణంగా గిరిజనులు ఆ హక్కులను, చట్టాల నుంచి రక్షణను కోల్పోతున్నారు. మరి కొన్ని గ్రామాలు ఏజెన్సీ ఏరియా రికార్డుల్లో ఎందుకు లేవు? ఎవరు తొలగిం చారు. ఎందుకు తొలగించారు..? అనే విషయాలు తెలుసుకుందాం..!!”
    నాన్‌ షెడ్యూల్‌ గిరిజన ప్రాంతాలను ఐదోవ షెడ్యూల్‌ ప్రాంతాల్లో చేర్చాలనే నినాదంతో ఉపప్రణాళిక ప్రాంత గిరిజనులు, గాంధే యమార్గం లో చేస్తున్న పోరాటం ఆగలేదు.ఈసుదీర్ఘ ఉద్య మ ప్రస్థానంలో వారు న్యాయంకోసం,సాయం కోసం తొక్కని గడపలేదు.కలవని రాజకీయ నాయ కుడు లేడు.అనేక మంది నాయకులకు,అధికారులకు లేఖలురాస్తూ,విజ్ఞపన పత్రాలు అందిస్తున్నారు.ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆపార్టీ ముఖ్య మంత్రిని, మంత్రులను,నాయకులను కలసి మద్దతివ్వాలని అభ్యర్ధించారు. వానొచ్చినా,వరదోచ్చినా,ఎండలు నిప్పులు చెరుగుతున్నా..కరోనా భూతం కోరలు చాచినా వారిలో మనోధైర్యం చెక్కు చెదరలేదు. పిల్లపాపలతో కలెక్టర్ల కార్యాలయాలు,ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయాలు తిరగని రోజంటూ లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో తాము ఆదివా సులమే..అందరం అడవి బిడ్డలమే కానీ హక్కులు మాత్రం కొందరికే ఎందుకు దక్కుతున్నాయి.. అయి నా అభివృద్ధికి ఆమడదూరం..అటవీవనరులు పరిరక్షణ,తమహక్కులు సాధన కోసం ఎన్ని అవంత రాలు ఎదురైనా అహర్నిశులు శ్రమించి సాధించే వరకు పోరాటం ఆపేది లేదని నాన్‌షెడ్యూల్‌ ఏరి యా గిరిజన ప్రజలు ముక్తకంఠంతో స్పష్టం చేస్తు న్నారు.
    వాళ్లంతా గిరిజనులు.రాజ్యాంగపరం గా గుర్తింపుపొందినాసరే..వాళ్లకు ఏజెన్సీలోఉన్న రాయితీలు అందడంలేదు.కనీసంరిజర్వేషన్లు కూడా వర్తించడంలేదు. అభివృద్ధి విస్తరణలో తమ హక్కు ల్ని కోల్పోతున్నగిరిపుత్రులదుస్థితి ఇది.గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా,కొన్నిగ్రామాలు ప్రభుత్వ రికా ర్డులలోనాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాల్లో నమోదై ఉండ టమే దీనికి కారణం. రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులున్నా, ఇలాప్రభుత్వ రికార్డుల కార ణంగా గిరిజనులు ఆహక్కులను,చట్టాల నుంచి రక్షణను కోల్పోతున్నారు.మరి,కొన్ని గ్రామాలుఏజెన్సీ ఏరియా రికార్డుల్లో లేకపోవడం కారణంగా వారిబ్రతుకులు నేటికీ అగమ్యగోచరంగానే ఉన్నాయి.
    బ్రిటిష్‌పాలనలో…గిరిజన తెగలు నివ సించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు,ఆచారాలు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామాలను షెడ్యూల్డ్‌ (నిర్దేశిత,ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొ న్నారు.అందుకోసం(ూషష్ట్రవసబశ్రీవస ణఱర్‌తీఱష్‌ం Aష్‌-1874)అమల్లోకి తెచ్చారు.మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి నియమితులైన ప్రభుత్వ ఏజెంట్‌ పర్య వేక్షణ లో ఈప్రాంతాల్లో పరిపాలన జరిగేది. ఏజెంట్‌ పరిపాలనలోఉన్న ప్రాంతాలు కావడంతో ఏజెన్సీగా పిలవడం మొదలైంది. ఇప్పటికీ అదే పేరు కొన సాగుతోంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను అయిదో షెడ్యూల్‌ లో చేర్చారు.అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామా లను వదిలేశారు. ఇలా రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌లో చేరని గిరిజనులు నివాసం ఉండే గ్రామాలను నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలు అంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర,ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటువంటివి 800 గ్రామాలు ఉన్నాయి.
    అయిదవ షెడ్యూల్‌లో ఏముంది…
    అయిదో షెడ్యూలులోని క్లాజ్‌ 6 ప్రకా రం ప్రభుత్వం నోటిఫైచేసిన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొం దుతారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైనా చట్టం అమలు చేసే ప్రక్రియలో గిరిజనుల ఆచార,సంప్ర దాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయి దో షెడ్యూల్‌లో ఉన్న గిరిజన ప్రాంతాలను తొల గించడం లేదా కొత్తగాఏర్పాటు చేయడం వంటి వాటిపైఅధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ‘‘షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు, నాన్‌-షెడ్యూల్డ్‌ఏరియాలోఉంటున్న గిరిజనులకు… హక్కులు,చట్టాలు,రక్షణ విషయాల్లో చాలా తేడా ఉంటుంది. షెడ్యూల్డ్‌ ఏరియా గ్రామాల్లో ఆదివాసి భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఆదివాసీల మధ్య మాత్రమే జరగాలని చెప్పే 1/70 వంటి చట్టాలు అమలులో ఉంటాయి. అదే నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరి యాలో అయితే గిరిజనుల భూముల్ని ఎవరైనా కొనవచ్చు,అమ్ముకోవచ్చు. ఈ భూములపై సివిల్‌ కోర్టుల్లో కేసులు కూడా వేయవచ్చు’’ కేంద్ర ప్రభు త్వం గిరిజనులకు ఇచ్చే సబ్‌ ప్లాన్‌ నిధులు షెడ్యూల్డ్‌ ఏరియాకే వర్తిస్తాయని, గ్రామసభలకు అధికారాలిచ్చే పీసా చట్టంలాంటివి అమల్లో ఉంటాయి. మైనింగ్‌ అనుమతులు ఇవ్వా లన్నా గ్రామసభల అనుమతి కావాల్సిందేని ఆయన తెలిపారు.‘నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో పీసాచట్టం,గ్రామసభల అనుమతులతో పని లేదు.ఇలా నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న గిరిజనులు రాజ్యంగం కల్పించిన హక్కులను, రక్షణ ను పొందలేక పోతున్నారని విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు గ్రామానికి చెందిన నాన్‌ షెడ్యూల్‌ గిరిజన సంఘం ఉద్యమకారుడు, గిరిమిత్ర కార్యదర్శి బండి గంగరాజు ఆవేదన.
    ఉద్యోగాలు రావట్లేదు
    ప్రభుత్వ రికార్డులు ప్రకారం నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలుగా ఉన్న గిరిజన గ్రామాలు ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా శంఖవరం,రౌతులపూడి, ఏలేశ్వరం,ప్రత్తిపాడు,కోటనందూరు మండలాల్లో 56నాన్‌షెడ్యూల్‌ గిరిజన గ్రామా లున్నాయి. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈగ్రామాల్లోని గిరిజనులు మౌలిక వస తులు,అభివృద్ధి,హక్కులు,రక్షణ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఐటీడీఏ పరిధిలో ఏదైనా ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు వెళ్లినా షెడ్యూల్డ్‌ ఏరియా లో లేని ఆదివాసీలుగా భావించి…ఉద్యోగాలు ఇవ్వ డం లేదని నర్సీపట్నం మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న నాన్‌-షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామానికి చెందిన వసుంధర చెప్పారు.కనీసం కులధృవీకరణ పత్రాలు సైతం మంజూరు చేయడం లేదని పెదమల్లాపురం కు చెందిన షెడ్యూల్‌ ఏరియా గిరిజన సాధన కమిటీ అధ్యక్షుడు బాలరాజు చెప్పారు.
    రాజకీయంగా కూడా దెబ్బే…
    ‘షెడ్యూల్డ్‌ ఏరియాలో గ్రామ పంచాయి తీ సర్పంచ్‌ పోస్టులు,మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షు డి పోస్టులు అన్ని ఆదివాసీలకే రిజర్వు అయి ఉం టాయి. కానీ,నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న ఆది వాసీలకు మాత్రంరోస్టర్‌ విధానం(వంతుల వారీగా) ఉంటుంది. అందువల్ల గిరిజనులున్న ప్రాంతాల్లో కూడా అధికారం చాలాసార్లు గిరిజనేతరులకు వెళ్తుంది. దీని వలన రాజకీయంగా కూడా మేం ఎదగలేకపోతున్నాం’’ అని నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియా అజయ్‌పురానికి చెందిన కిల్లో రాంబాబు చెప్పారు. ‘ఉపాధి హామీ పనులకు కూడా మమ్మల్ని పిలవడం లేదు. పేరుకే ఆదివాసీలం. హక్కులు లేవు’ అని రాంబాబు అన్నారు.
    షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చమంటే… వీఎం ఆర్డీఏలోకి
    ఇప్పుడు నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంటున్న ఆదివాసీలకు మరో సమస్య వచ్చింది. ఇప్పటి వరకు నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియా నుంచి షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనిగిరిజనులు డిమాం డ్‌ చేస్తూంటే…వారి గ్రామాల్ని వీఎంఆర్డీఏ (విశాఖ మెట్రోపాలిటన్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథా రిటీ)లో చేర్చారు.‘రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్‌ ఏరి యాలోఉన్న11మండలాలను మినహాయించి… మిగిలిన జిల్లా అంతటినీ కూడా వీఎంఆర్డీఏ పరిధి లోకి తీసుకు వచ్చింది. ఇదంతా కూడా నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో మైనింగ్‌ యధేచ్ఛగా సాగిం చేందుకే.విశాఖ జిల్లాలోని నాతవరం మండ లంలో సరుగుడు పంచాయితీ ఏరియా పరిధిలో జరుగుతున్న లేటరైట్‌ తవ్వకాలే ఇందుకు ఉదాహ రణ. అలాగే తూర్పుగోదవరి జిల్లా శంఖవరం మండలం పెద్దమల్లాపురం,వేళింగి పంచాయితీ నాగులకొండపై కూడా లేట్‌రైట్‌ తవ్వకాలపై కన్ను పడిరది. ఇప్పటికే ప్రత్తిపాడు మండలం వంతాడ కొండంతా లేట్‌రైట్‌ తవ్వకాలు చేపట్టి ఆ ప్రాంతాన్ని శ్మశానవాటికల చేసి వదిలేశారు. విశాఖజిల్లా రావి కమతం మండలంలో ఆదివాసీ గ్రామాలు ఎక్కువ గా ఉన్నాయి. కానీఈగ్రామాలేవీ షెడ్యూల్డ్‌ ఏరియా లోఉండవు.ఇక్కడే మైనింగ్‌ ఎక్కువగా జరుగు తుంది. అయిదో షెడ్యూలు ఏజెన్సీ ప్రాంతాల్లో పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే… రాష్ట్ర గిరిజనసలహామండలి,రాష్ట్ర గవర్నర్‌ సిఫార్సు, సలహాలతో రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత మాత్రమే సాధ్యం అవుతుంది. నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరి యాలో గిరిజన చట్టాలకు విరుద్ధంగా ఖనిజ వన రులు దోపిడీ,భూములఅమ్మకాలు,కొనుగోళ్లు యధే చ్ఛగా జరుగుతున్నాయి.అయితే ప్రజాప్రతినిధుల మాట మాత్రం వేరుగా ఉంది. వీఎంఆర్డీఏ కలిసే ప్రాంతాలన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందు తాయి. నాన్‌-షెడ్యూల్డ్‌ ప్రాంతాలు కూడా కల వడంవల్ల అవి త్వరగా అభివృద్ధి చెందుతాయి. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు.
    సరుగుడు పంచాయితీయే ఉదాహరణ…
    1985 వరకూ సరుగుడు ఏజెన్సీ ప్రాంతమంతా కొయ్యూరు తాలూకాలో ఉండేది.ఈపంచా యితీలో 16గ్రామాల్లో లేటరైట్‌ గనులు విస్తారంగా ఉన్నా యి. అయితే సరుగుడు ఏజెన్సీ మండలాల విభజ నలో నాతవరం మండలంలోకి మారింది. నాతవ రం మండలంనాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంది. ‘షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలు గిరిజనేత రులకు,బినామీలకు ఇవ్వడం చట్ట విరుద్ధం. సరు గుడు ప్రాంతంలో లేటరైట్‌ ఖనిజ తవ్వకాల ప్రక్రి యలో ఈ నిబంధనలేవి పాటించడం లేదు. ఇక్కడ పూర్తిగా గిరిజన కుటుంబాలే ఉన్నాయి. అయినా అధికారుల దగ్గరవారు తాము గిరిజనులమని నిరూ పించుకోవాల్సి వస్తోంది. ఈ తరుణంలో సరుగుడు ప్రాంతాన్ని వీఎంఆర్డీఏలో చేర్చారు. ఇదంతా లేట రైట్‌ మైన్స్‌ కోసమే’’ అని నాతవరం గిరిజన సంఘం నాయకులు అంటున్నారు.
    షెడ్యూల్డ్‌ ప్రాంతంగా మారాలంటే…
    విశాఖపట్నంలోని నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన ప్రాం తాల్ని వీఎంఆర్డీఏలో చేర్చడాన్ని తప్పుపడుతూ గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఏవైతే షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపేందుకు అర్హతలున్న గ్రామాలను ఏజెన్సీలో కలిపేందుకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించామని రావికమతం మండలం తహాశీల్దార్‌ కనకరావు చెప్పారు.ఈమండలంలోనాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియా లో 33 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఎస్టీ జనాభా 50 శాతంకంటే ఎక్కువ ఉన్నగ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చవచ్చంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పని చేస్తున్నాం. జనాభాతో పాటు అక్షరాస్యత,సమీప షెడ్యూల్డ్‌ ప్రాంతం వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వ గైడ్‌ లైన్స్‌లో ఉంది. రావికమతం మండ లంలో 5గ్రామాల్లో 50శాతం కంటే ఎక్కువ ఎస్టీ జనాభా ఉన్నారు అని కనకరావు చెప్పారు.
    గతంలో జరిగిన ప్రయత్నాలెన్నో
    1976లో ఉమ్మడిరాష్ట్రంలో 800 గిరి జన గ్రామలునాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్నా యని…వాటిని షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో మంత్రి మండలి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. 2007లో గిరిజన శాఖ మంత్రిగా ఉన్న రెడ్యా నాయక్‌ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 800 గిరిజన గ్రామాలను (శ్రీకాకుళం-240,విజయనగరం-181,విశాఖపట్నం-90, తూర్పుగోదావరి-40,పశ్చిమగోదావరి-01) షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనే ప్రతిపాదన ఉన్నట్లు అసెంబ్లీలో తెలిపారు. ఆతర్వాత దీనిపై మళ్లీ చర్చ జరగలేదు. అయితే 2018లో రాజ స్థాన్‌లోని 6జిల్లాలలో ఉన్న 9మున్సిపాలిటీలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి’’అని విశాఖ జిల్లా గిరిమిత్ర సంస్థ కార్యదర్శి బండి గంగరాజు డిమాం డ్‌ చేస్తున్నారు.
    వైఎస్సార్‌ హామీని…జగన్‌ నెరవేరుస్తారా
    2004లో పాదయాత్ర సందర్భంగా వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి విశాఖజిల్లా వడ్డాదిలో నిర్వ హించిన బహిరంగసభలో మాట్లాడుతూ, ఈ ప్రాం తంలోని నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న గిరిజన ప్రాంతాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలుపుతామని హామీ ఇచ్చారు.అయితే,వైఎస్సార్‌ మరణం, రాష్ట్రం లో సమైక్య, ప్రత్యేక ఉద్యమాలు,రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈఅంశం తెరమరుగైంది.అయితే ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉం దని…అర్హతలున్న అన్ని నాన్‌-షెడ్యూల్డ్‌ గ్రామాల్ని షెడ్యూల్డ్‌ ఏరియాలో చేరుస్తామని పాడేరు ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలకృష్ణ స్పష్టం చేశారు.
    కల నెరవేరేనా?
    తూర్పు,విశాఖజిల్లానాన్‌షెడ్యూల్‌ ప్రాంత గిరిజనగ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరం లో కొట్టుమి ట్టాడుతున్నాయి. మారుమూల గ్రామా ల్లో కనీస సదుపాయాలులేవు. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఉచితవిద్య అందించే ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలలు,జూనియర్‌ కాలేజీలులేవ్వు. ఇక్కడనివసించే గిరిజన విద్యార్ధులకు కులధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదు.పెదమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక మండల ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు ఉద్యమం చేస్తూనే ఉన్నాం. పరిపాలన సౌలభ్యం కోసం ఏపీఓ కార్యాలయాన్ని పెదమల్లాపురంలో ఏర్పాటు చేయాలి. ఇక్కడ గిరిజన గ్రామాల్లో 1/70చట్టం వర్తించకపోవడంవల్ల గిరిజనేతరులు దళారీ చేతుల్లో తమ భూములను చేజిక్కించుకొని అన్యాయానికి గురవుతున్నారు.అటవీ హక్కుల చట్టం ప్రకారం తాము సాగుచేసుకుంటున్న పోడుభూ ములకు పట్టాలు మంజూరు చేయాలి.ఈ ప్రాంత సమస్యలపై ఎన్నోసార్లు ప్రజా ప్రతినిధులు, అధి కారులను కలసి మొరపెట్టుకున్నాం. అయినా పట్టిం చుకోవడం లేదని గిరిజన సంక్షేమ సంఘం కార్య దర్శి బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు.– గున‌ప‌ర్తి సైమ‌న్‌