అడుగంటిన బొగ్గు నిక్షేపాలు

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విద్యుత్‌ కేంద్రా లలో బొగ్గునిల్వలు అంతరించి పోవడంతో రాబో యే రోజుల్లో రాష్ట్రం అంధకారమయం కానున్నది. బొగ్గు నిల్వలు తగినంతగా ఉన్నాయా లేవా అని ముందుచూపు లేనట్లు ప్రభుత్వాలు వ్యవహ రిస్తు న్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ప్రజలకు విద్యుత్‌ పొదుపు గురించి ఉచిత సల హాలు మాత్రం ఇస్తున్నారు విద్యుత్‌ శాఖ అధికారులు. సాయంత్రం పూట ఆరు గంటల నుండి పది గంటల వరకు ఏసీలు వాడొద్దని సెలవిస్తు న్నారు.
దేశవ్యాప్తంగా బొగ్గునిల్వల కొరత ఏర్పడటం, కేంద్రం నుంచి సహకారం లభించక పోవడం వంటి కారణాలతో రాష్ట్రంలోని ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు బొగ్గు సంక్షోభం బారిన పడ్డాయి. ఇప్ప టికే చాలా వరకూ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు దాదాపు అంత రించిపోయాయి. దీంతో కొన్ని రోజులుగా సగం కెపాసిటీ మేరకే విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యుత్‌ కోతలు విధిస్తోంది. సింగరేణి గను లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోని పవర్‌ ప్లాంట్లకు రావాల్సిన బొగ్గు నిల్వలు దాదాపుగా నిలిచిపోవడంతో పవర్‌ ప్లాంట్లు అల్లాడు తున్నాయి. మన రాష్ట్రంలో 9ధర్మల్‌ విద్యుత్‌ ఆధారిత ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో విశాఖ జిల్లా పరవాడలోని ఎన్టీపీసీ సింహాద్రి సూపర్‌ ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో 2000 మెగావాట్లు, గాజువాక లోని వీటీపీఎస్‌లో 1040 మెగావాట్లు, విజయవాడలోని ఎన్టీ పీఎస్‌లో 1760 మెగావాట్లు,కడప జిల్లా ముద్దనూరు లోని ఆర్టీపీఎస్‌ లో 1650 మెగా వాట్లు, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని డీఎస్టీపీఎస్‌ లో 1600 మెగావాట్లు,సింహపురి ధర్మల్‌ పవర్‌ స్టేషన్లో 600 మెగావాట్లు,మీనాక్షి ధర్మల్‌ పవర్‌ స్టేషన్లో 1000 మెగావాట్లు, సెంబ్‌ కార్ప్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌లో 1320 మెగావాట్లు, ఎస్జీపీఎల్‌ పవర్‌ స్టేషన్లో 1320 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ఈ మొత్తం ప్లాంట్లు కలిపి 12 వేల 290 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంది. కాని బొగ్గు కొరత కారణంగా సగం ఉత్పత్తే సాధ్యమవుతోంది. కొన్ని రోజులుగా ఇదే పరిస్ధితి. ప్లాంట్లు పూర్తిగా పని చేయక పోవడంతో ఆమేరకు విద్యుత్‌ ఉత్పత్తి కూడా భారీగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. రేపు,ఎల్లుండి కల్లా మిగిలిన నిల్వలు కూడా తరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది.అప్పుడు ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లన్నీ మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. బొగ్గు కొరత కార ణంగా ఆంధ్రప్రదేశ్‌లో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రతిరోజూ దాదాపు 2000 మెగావాట్లకు పైగా కొరత ఏర్పడుతోంది. ఇది ఇవాళ రేపట్లో మరింత ఎక్కువ కానుంది. సంక్షోభం తీవ్రతరం అయితే, డిస్కమ్‌లు బహిరంగ మార్కెట్‌ నుండి అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడ డడంతో….బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు కొనాల్సిన దుస్థితి ఏర్పడిరది. అలా చేయాలన్నా ప్రభుత్వం దగ్గర తగినన్ని నిధులు ఉండాలి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం…ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. పైగా ఇప్పటికే ఆస్తి పన్ను, ట్రూ అప్‌ చార్జీల పేరుతో విద్యుత్‌ చార్జీల పెంపుదలపై ప్రజాగ్రహనికి గురైంది. ఇప్పుడు విద్యుత్‌ కొనుగోలుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసి డిస్కంలపై ఆర్థిక భారం తగ్గించాలంటే విద్యుత్‌ చార్జీలు పెంచక తప్పదు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యంచేసి, ప్రతి రోజు డీజిల్‌,పెట్రోలు,గ్యాసు నిత్యావసర సరుకులు ధరలను పెంచుకుంటూ పోతోంది కేంద్ర ప్రభు త్వం. చెంపదెబ్బ గోడ దెబ్బ మాదిరిగా తయారైంది రాష్ట్ర ప్రజల పరిస్థితి.
విద్యుత్‌ సంక్షోభంపై కేంద్రం అప్రమత్తం..
దేశంలోని అనేక విద్యుత్‌ కంపెనీలలో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిరది. మున్ముందు కాలంలో దేశంలోని పలు ప్రాంతా ల్లో కారు చీకట్లు అలుముకోనున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ముందుగా దక్షిణ భారత దేశంలోని బెంగళూరు పట్టణంలో అంధకారం నెలకొంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో విద్యుత్‌ సంక్షోభం,బోగ్గు నిల్వల కొరతపై దృష్టిసారించింది. బొగ్గు నిల్వల కొరత, విద్యుత్‌ అంతరాయాల నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర అప్రమత్తమై.. అధి కారులు,బొగ్గు కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు హోంమంత్రి అమిత్‌ షా..ఇప్పటికే కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌ కె సింగ్‌,బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలో బొగ్గు నిల్వల కొరత,విద్యుత్‌ అంతరాయాల నేపథ్యంలో ఈ సమీక్షపై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. బొగ్గు కొరత కారణంగా దేశంలోని పలు ప్లాంట్లల్లో విద్యుత్‌ ఉత్పత్తిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రాల్లో దిగజారుతున్న పరిస్థితుస్థిలపై ఢల్లీి, పంజాబ్‌,కేరళ,మహారాష్ట్ర,కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు కూడా రాశాయి. దీంతో పాటు విద్యుత్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. అక్టోబర్‌ 7న కేంద్ర విద్యుత్‌ అథారిటీ నివేదిక ప్రకారం, దేశంలోని 135 ప్లాంట్లలో 110కర్మాగారాలు బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అలాగే 16 ప్లాంట్లలో ఒక్క రోజుకు సరిపడా కూడా బొగ్గు నిల్వ లేదని సమచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే బొగ్గు సరఫరాను పెంచినట్లు కోల్‌ ఇండియా ప్రకటనను విడుదల చేసింది. దసరా అనంతరం బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుతా మని ప్రకటించింది.
అసలు బొగ్గు కొరతకు కారణాలేంటి.?
నల్లబంగారానికి డిమాండ్‌ పెరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి. సరఫరా చేయడానికి సరిపడా బొగ్గు ‘కోల్‌ ఇండియా’ దగ్గరఉందా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ కావాల్సినంత బొగ్గు ఉందం టోంది. కానీ..థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో మాత్రం కొన్ని రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే నిల్వ ఉంది. అసలు ఈ కొరతకు కారణాలేంటి? కరెంట్‌ అవసరం ఒక్కసారిగా ఎందుకు పెరి గింది? కొన్ని రోజుల నుంచి బొగ్గు కొరతకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపి స్తున్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్‌ కొరత తప్పదనే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. మనది ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినా మునుపెన్నడూ లేని విధంగా కరెంట్‌ సంక్షోభం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మన దేశంలో దాదాపు 70శాతం ఎలక్ట్రిసిటీ థర్మల్‌ ప్లాంట్ల నుంచే వస్తుంది. అయితే.. కొన్నాళ్ళ క్రితం కరోనా ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉండడం వల్ల కంపెనీలు మూత పడ్డాయి. దాంతో కరెంట్‌ వినియోగం తగ్గింది. ఆ తర్వాత కంపెనీలు తెరిచినా థర్డ్‌ వేవ్‌ భయంతో పూర్తి ఆక్యు పెన్సీతో పనిచేయలేదు. తక్కువ స్టాఫ్‌తో తక్కువ ప్రొడ్యూస్‌ చేశాయి. కానీ.. ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీలు పూర్తి కెపాసిటీతో పనిచేస్తు న్నాయి. దానివల్ల కరెంట్‌ వాడకం బాగా పెరిగింది. ప్రొడక్షన్‌ పెంచాల్సి వచ్చింది. కానీ.. ప్రొడక్షన్‌కి తగ్గట్టు బొగ్గు సరఫరా జరగడం లేదు. దానివల్ల నిల్వలు తగ్గుతు న్నాయి. ఈ కొరత ఇలాగే కొనసాగితే ఈ ఎఫెక్ట్‌ దాదాపు అన్ని రంగాల మీద పడే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. దేశంలో బొగ్గు కొరత ఉందని కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి చెప్పినా.. కేంద్రం మాత్రం పరిస్థి తులు బాగానే ఉన్నాయని అవసరమైనంత బొగ్గు సరఫరా చేయడానికి రెడీగా ఉన్నామని చెబు తోంది. కాకపోతే ప్లాంట్లలో నిల్వలు తక్కువగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. పైగా ‘‘ఎవరికి కావాలో చెప్పండి. సప్లై చేస్తాం’’ అంటూ కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ చెప్పారు. దేశంలో నాలుగు రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. కానీ..అది కేవలం స్టోరేజీ మాత్రమే ప్రతి రోజూ సప్లై జరుగుతూనే ఉందన్నారు. దీంతో అసలు బొగ్గు కొరత ఉందా? లేదా? అని అందరూ చర్చించుకుం టున్నారు. అయితే.. పరిస్థితులను బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఉన్నదనే తెలు స్తోంది. ఎందుకంటే.. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు బాగా పెరిగాయి. పొరుగు దేశం చైనా లో బొగ్గు కొరత వల్లే కరెంట్‌ ప్రొడక్షన్‌ బాగా తగ్గింది. పరిశ్రమలతోపాటు ఇళ్లకు కూడా కరెంటు కోతలు పెడుతున్నారు. అదే పరిస్థితి మనకూ వచ్చే ప్రమాదముందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ఇక బొగ్గు సరఫరా లేకపోవడం వల్లే బీహార్‌,రాజస్థాన్‌,జార్ఖండ్‌,పంజాబ్‌,ఏపీ వంటి రాష్ట్రాల్లో కరెంట్‌కోతలు ఎక్కువగా ఉంటున్నాయని ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు.
మనకూ సమస్యేనా?
సింగరేణి బొగ్గు గనులు మన రాష్ట్రంలోనే ఉన్నా..రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. జెన్‌కో, సింగరేణి, ఎన్టీపీసీ థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో మామూలుగా 15రోజులకు సరిపడా బొగ్గు స్టోర్‌ చేస్తారు. కానీ..ఇప్పుడు నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నట్టు,ఈస్టేషన్లకు తక్కువగా సప్లై చేస్తూ, కొరతతో ప్రొడక్షన్‌ ఆగిపోయే స్థితిలో ఉన్న స్టేషన్లకు సింగరేణి సంస్థ బొగ్గు సప్లై చేస్తోందని తెలుస్తోంది. కానీ..వర్షాలవల్ల కొన్నా ళ్ల సింగరేణిలో ప్రొడక్షన్‌ తగ్గినా ఇప్పుడు మళ్లీ మెరుగుపడిరది. ఇప్పుడు రోజుకు 1.8 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేస్తోంది. అందులో తెలంగాణలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్లకు 30,000టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. మిగతాది కర్నాటక,మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు సరఫరా అవుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి తెలంగాణలో ఎటువంటి సమస్య రాదని తేల్చిచెప్పారు. ‘‘తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’’ (ుూGజుచీజూ) ప్రకారం.. తెలంగాణలో థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో 3,772.5 మెగావాట్ల కరెంట్‌ ప్రొడ్యూస్‌ చేయొచ్చు. ప్రస్తుతం 3.8 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని మంత్రి చెప్పారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం దగ్గర ఉన్న 2,600 మెగావాట్ల నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ పవర్‌ స్టేషన్‌ కూడా తెలంగాణలో కరెంట్‌ సరఫరాకు సాయం చేస్తుంది.
‘పిట్‌హెడ్‌’ కాబట్టి ఇబ్బంది లేదు
బొగ్గు గనులకు 50కిలోమీటర్లలోపు ఉండే థర్మల్‌ పవర్‌ ప్లాంట్లను ‘పిట్‌హెడ్‌’ అంటారు. వీటికి బొగ్గును అందించడం పెద్ద కష్టమేమీ కాదు. అందువల్ల ట్రాన్స్‌పోర్టేషన్‌ టైం, ఖర్చు కూడా చాలా తక్కువ. మన దగ్గర ఎక్కువగా ‘పిట్‌హెడ్‌’ ప్లాంట్లే ఉన్నాయి. అందువల్ల ఈ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.
కొరత ఎందుకొచ్చింది?
పొరుగుదేశం చైనాలో కూడా కరెంట్‌ కొరత ఏర్పడిరది. కొన్ని పరిశ్రమలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. ఆ పరిస్థితి మనకు రాకూడదనే బొగ్గు మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఇంటర్‌-మినిస్టీరియల్‌ సబ్‌-గ్రూప్‌ వారానికి రెండుసార్లు బొగ్గు స్టాక్‌ పరిస్థితి గురించి తెలుసుకుంటోంది. సమస్యలను పరిష్కరిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌,వర్షాలు, ఫ్యాక్టరీలు ఎక్కువ కరెంట్‌ వాడడం ఇలా.. బొగ్గు కొరత ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి.
కరోనా ఎఫెక్ట్‌
లాక్‌డౌన్‌ వల్ల స్టాఫ్‌ని తగ్గించుకున్న ఫ్యాక్టరీలు మళ్లీ కరోనా కేసులు పెరుగుతాయేమోననే భయంతో పూర్తి ఆక్యూపెన్సీతో ప్రొడక్షన్‌ మొదలుపెట్టలేదు. కానీ.. ఇప్పుడు మళ్లీ తేరుకున్నాయి. స్టాఫ్‌ని పెంచుకుని పూర్తి కెపాసిటీతో ప్రొడక్షన్‌ మొదలుపెట్టాయి. మళ్లీ మామూలు పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా కరెంట్‌కు డిమాండ్‌ పెరిగింది. కరెంట్‌ వాడకం పెరగ డం వల్ల దాని ప్రొడక్షన్‌కు ఉపయోగించే బొగ్గుకు కూడా డిమాండ్‌ బాగా పెరిగింది. అందుకే కొరత ఏర్పడిరది. ఈమధ్యే దేశంలో కరెంట్‌ వాడకం రోజుకు 4బిలియన్‌ యూనిట్లు దాటింది. ఇందులో 65నుండి 70శాతం బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతోంది. 2019 ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో నెలకు దాదాపు 106.6 బిలియన్‌ యూనిట్లు, అదే 2021లో నెలకు 124.2 బిలియన్‌ యూనిట్లు కన్జ్యూమ్‌ అయింది.
వర్షాలు:
ఈ ఏడాది సెప్టెంబర్‌లో బొగ్గు గనులున్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడ్డాయి. దాంతో ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నీళ్లు నిండడం వల్ల కోల్‌ ప్రొడక్షన్‌ తగ్గింది. ఈ సమస్య దాదాపు ప్రతి ఏటా ఉంటుంది. కానీ..ఈ సారి డిమాండ్‌ పెరిగి, ప్రొడక్షన్‌ తగ్గడంతో కొరత ఏర్పడిరది. రుతుపవనాల మొదలవడానికి ముందే ఎక్కువ బొగ్గును స్టోర్‌ చేసుకోగలిగితే ఈ సమస్య వచ్చేది కాదు.
ఇంటర్నేషనల్‌ మార్కెట్‌
అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు బాగా పెరిగాయి. మనం ఎక్కువగా ఇండోనేసియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. ఇండోనేసియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు ధర మార్చి-2021లో టన్నుకు 60డాలర్లుగా ఉంది. అదే (సెప్టెంబర్‌, అక్టోబర్‌లో 160 డాలర్లకు పెరిగింది. దానివల్ల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని కరెంట్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న ప్లాంట్లలో ప్రొడక్షన్‌ తగ్గింది. 2019తో పోల్చితే ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేసు కుంటున్న బొగ్గుతో ప్రొడ్యూస్‌ చేసే కరెంట్‌ 2021లో 43.6శాతం తగ్గింది. దీంతో బొగ్గు కొరతను తగ్గించేందుకు కోల్‌ ఇండియా బొగ్గు ప్రొడక్షన్‌ను పెంచింది. అక్టోబర్‌ 7న, కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (జIూ)1.501 మిలియన్‌ టన్నుల బొగ్గును సప్లై చేసింది. దానివల్ల వాడకానికి, సప్లైకి మధ్య ఉన్న తేడాని తగ్గిం చింది. సప్లై క్రమంగా పెంచాలని బొగ్గు మంత్రిత్వశాఖ తెలిపింది.
అందరికీ ఇదే పరిస్థితి
మన దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ధరల పెరుగుదల, పెట్రోల్‌ సంక్షోభం వంటివి ఇబ్బందికరంగా మారాయి. యూరప్‌ లో నేచురల్‌ గ్యాస్‌ ధర ఈఏడాది దాదాపు నాలుగింతలు పెరిగింది. ఇక కరెంట్‌ చార్జీలు మూడిరతలు పెరిగాయి. మన దేశంలో కూడా పెట్రోల్‌,వంట గ్యాస్‌ ధరలు బాగా పెరిగాయి. కొన్నాళ్ల క్రితం శ్రీలంకలో ఏకంగా ఫుడ్‌ ఎమ ర్జెన్సీ ప్రకటించారు.ఎండ ఎక్కువగా ఉంటేనే కరెంట్‌ ఎక్కువ ప్రొడ్యూస్‌ అవుతుంది. గాలితో కూడా కరెంట్‌ ప్రొడ్యూస్‌ చేయొచ్చు. విండ్‌ పవర్‌ను కరెంట్‌గా మార్చడానికి విండ్‌ టర్బైన్‌లను వాడతారు. దీనికి మెకానికల్‌ పవర్‌ కోసం గాలి మరలను వాడతారు. కాకపోతే ఇది గాలి ఎక్కువగా వీచినప్పుడే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఖర్చయ్యే కరెంట్‌లో విండ్‌ పవర్‌తో దాదాపు రెండు శాతం ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. నేచురల్‌ గ్యాస్‌ టర్బైన్లు, ఆవిరి టర్బైన్లను వాడి కరెంట్‌ను ఉత్పత్తి చేయొచ్చు. బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల కంటే నేచురల్‌ గ్యాస్‌ మండిర చడంవల్ల తక్కువ కాలుష్యం అవుతుంది. ఇది చాలా తక్కువ కార్బన్‌ డై ఆక్సైడ్‌ను రిలీజ్‌ చేస్తుంది.కాబట్టి థర్మల్‌ పవర్‌ కంటే నేచురల్‌ గ్యాస్‌తో కరెంట్‌ను ప్రొడ్యూస్‌ చేయడమే బెటర్‌. నేచురల్‌ గ్యాస్‌ వల్ల పెట్రోలి యంను కాల్చడం కంటే 30%తక్కువ, బొగ్గును కాల్చడం కంటే 45%తక్కువ కార్బన్‌ డై ఆక్సైడ్‌ రిలీజ్‌ అవుతుంది.న్యూక్లియర్‌ ఫూజన్‌ ద్వారా ఇది పవర్‌ని ప్రొడ్యూస్‌ చేస్తుంది. కాబట్టి ఇదిథర్మల్‌ పవర్‌ కంటే బెటర్‌. ఎందుకంటే ఇందులో కార్బన్‌ ప్రొడ్యూస్‌ అవ్వదు. థర్మల్‌ నుంచి న్యూక్లియర్‌ పవర్‌కి మారడం వల్ల డీకార్బోనైజింగ్‌ అవు తుంది. కానీ.. న్యూక్లియర్‌ పవర్‌ స్టేషన్ల సేఫ్టీపై ఎన్నో భయాలు ఉన్నాయి. అందుకే మన దేశంలో అణు విద్యుత్‌ చాలా తక్కువగానే ఉత్పత్తి అవుతుంది.
కొరత రాకుండా ఏం చేయాలి?
బొగ్గు కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసు కోవాలి. లేదంటే ఇలాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా వర్షాలు, వరదల వల్ల సెప్టెంబర్‌లో బొగ్గు ప్రొడక్షన్‌ తగ్గుతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. వర్షాకాలం రాకముందే ఎక్కువగా తవ్వి స్టోర్‌ చేసుకుని పెట్టుకోవాలి. లేదంటే.. ఎలాగూ వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హైడల్‌ పవర్‌ జనరేషన్‌ కెపాసిటీని పెంచుకోవాలి. సెప్టెంబరు 30 వరకు గడిచిన ఆరు నెలల్లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నుండి 14%,మాత్రమే కరెంట్‌ ప్రొడ్యూస్‌ అయింది. డ్యామ్‌ల దగ్గర మరిన్ని హైడ్రో పవర్‌ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని అల్యూమినియం, సిమెంట్‌ కంపెనీలు ఎక్కువగా బొగ్గును కొంటుంటాయి. ఆ కొనుగోళ్ల మీద కూడా ఎప్పటికప్పుడు కంట్రో ల్‌ ఉండాలి. దేశంలో బొగ్గుకు డిమాండ్‌ పెరుగుతుండడం వల్ల రిఫైనరీల నుంచి అల్యూ మినియం, మాం సం ప్రాసెసింగ్‌ చేసే సంస్థల వరకు చాలా కంపెనీలపై ఎఫెక్ట్‌ పడుతోంది. ఎక్కువ ఎఫెక్ట్‌ పడే కంపెనీలు ఇవి..
పెట్రోలియం
పవర్‌ రేషన్‌ పరిస్థితి మరింత దిగజారితే… పెట్రోలియం రంగం మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్‌ పడే ప్రమాదం ఉంది. అయితే.. పెట్రోలియం రిఫైనరీలకు ఎక్కువగా కరెంట్‌ అవసరం ఉంటుంది. ఒకవేళ వాటికి సరిపడా కరెంట్‌ అందించకపోతే వాళ్లకున్న క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి పవర్‌ జనరేట్‌ చేసు కుంటారు. అయితే.. వాటిలో చాలా యూనిట్లు గ్యాస్‌ ద్వారా నడుస్తాయి. దానివల్ల నేచురల్‌ గ్యాస్‌ ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఈ రంగంలో ప్లాస్టిక్‌, ఫైబర్‌, సింథటిక్‌ రబ్బర్‌ తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వెహికల్‌ టైర్లు, ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ తయారుచేసే వాటిపై కూడా ప్రభావం ఉండొచ్చు. కొన్ని పరిశ్రమలకు సొంత పవర్‌ యూనిట్లు ఉండవు. అందుకని ప్రొడక్షన్‌ ఆగకుండా ఉండేందుకు వాళ్లు డీజిల్‌ జనరేటర్లను వాడతారు. ఇండియాలో పెద్దస్టీల్‌ ఫ్యాక్టరీలకు సొంత పవర్‌ ప్లాంట్లు ఉన్నాయి. వాళ్లు బొగ్గును వేలం పాటలో కొనుక్కుంటారు. ఇక చిన్న చిన్న ఫ్యాక్టరీలు సొంతంగా కరెంట్‌ను తయారు చేసుకోలేవు. కాబట్టి వీటిలో ప్రొడ క్షన్‌పై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
-డా.ఎం.సురేష్‌ బాబు