భారత్‌ గణతంత్ర దినోత్సవం`2025 ప్రత్యేకతలు

‘‘ భారత సైనిక శక్తిని,ఆయుధ పాటవాన్ని,సాంస్కృతి వైభవాన్ని ప్రదర్శిస్తూ 76వ గణతంత్ర వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.అత్యాధునిక క్షిఫణులు,యుద్ద విమానాల ప్రదర్శన,జవాన్ల కవాతు దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా సాగాయి. సశక్త్‌ ఔర్‌ సురక్షిత్‌ పేరిట తొలిసారి ప్రదర్శించిన త్రివిధ దళాల ఉమ్మడి శకటం ఆకట్టుకుంది. ఢల్లీిలోని కర్తవ్య పథ్‌లో జనవరి 26న జరిగిన ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము,ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ,కేంత్రమంత్రులు,త్రివిధ దళాధిపతులు,ప్రముఖలు పాల్గొన్నారు.రాష్ట్రపతి సంప్రదాయ బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు.’’
త్రివర్ణ స్పూర్తి`సమున్నత కీర్తి
భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా,అపారమైన సైనిక పాటవానికి అద్దం పట్టేలా,పురోభివృద్ధి ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్లు వివరించేలా శకటాలు,కవాతులకు కర్తవ్యపథ్‌ వేదికగా నిలిచింది.76వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఢల్లీిలోని కర్తవ్యపథ్‌ నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.వారిద్దరూ కలిసి గుర్రపుబగ్గీలో ప్రధాన వేదికవద్దకు వచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధనఖడ్‌, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. త్రివిధ దళాలు సంయుక్తంగా శకటాన్ని తీసుకురావడం ఈసారి ఒక ప్రత్యేకత.అభివృద్ధి ప్రధాన ఇతివృత్తంగా ‘స్వర్ణిమ్‌భారత్‌: విరాసత్‌ ఔర్‌ వికాస్‌’ పేరుతో ప్రత్యేక శకటాలకు రూపకల్పన చేశారు.బ్రహ్మోస్‌,ఆకాశ్‌ క్షిపణులు,పినాక మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ ప్రత్యే-ఆకర్షణగా నిలిచాయి.కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. రాష్ట్రాలు, కేంద్ర శాఖలకు చెందిన 31శకటాలను ప్రదర్శించారు.
మార్మోగిన ‘నారీశక్తి’
కవాతులో నారీశక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చరిత్రలో తొలిసారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం, డోలు వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్యపథ్‌ పరేడు ప్రారంభించారు. సైన్యం, నౌకాదళం, వాయుసేనల్లో నారీశక్తిని చాటేలా అధికారిణులు- లెఫ్టినెంట్‌ కర్నల్‌ రవీందత్‌ రంధావా, లెఫ్టినెంట్‌ కమాండర్‌ మ అగర్వాల్‌, ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ రుచి సాహా, కెప్టెన్‌ సంధ్యా మహ్లా దీనిలో పాల్గొన్నారు. డీఆర్డీవో బృందానికి మహిళా శాస్త్రవేత్త సునీతా జెనా నాయకత్వం వహించారు. సహాయ కమాండెంట్‌ ఐశ్వర్య జాయ్‌ నేతృత్వంలోని 148 మంది సభ్యుల సీఆర్పీఎఫ్‌ మహిళా బృందం, డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఆదిత్య నేతృత్వంలోని ఆర్పీఎఫ్‌ బృందం పరేడ్లో పాల్గొన్నాయి. 15 మంది మహిళా పైల బృందం గగనతల విన్యాసాలతో తమ ప్రతిభను చూపింది.
ప్రపంచ రికార్డులు..
కదులుతున్న మోటారుసైకిల్‌ మీద 12 అడుగుల ఎత్తైన నిచ్చెనపై నిలబడి రాష్ట్రపతికి శాల్యూట్‌ చేయడం ద్వారా మహిళాధికారిణి కెప్టెన్‌ డిరపుల్సింగ్‌ భాటి ప్రపంచరికార్డు సృష్టించారు. డేర్రెవిల్స్‌ ప్రదర్శించిన మరో విన్యాసం కూడా ప్రపంచరికార్డు సృష్టించనుంది. 33మంది కలిసి మానవ పిరమిడ్‌ ఆకారంలో చేసిన ఇంకో విన్యాసం విశేషంగా ఆకట్టుకుంది. సుఖోయ్‌ విమానాల విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సాగాయి. కొయ్యబొమ్మల నుంచి మహా కుంభమేళా వరకు వివిధ అంశాలకు ప్రతీకగా శకటాలు నిలిచాయి. 5వేల మంది జానపద కళాకారులు, గిరిజనులు కలిసి 45 రకాల నృత్యరీతుల్ని ప్రదర్శించారు. ఇండోనేసియా సైనిక దళానికి చెందిన 152 మంది బృందం కవాతులో పాల్గొంది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రగతికి పది సూత్రాల ప్రణాళికతో
రాష్ట్రప్రగతికి పది సూత్రాల ప్రణాళికతోముందుకు వెళుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు.విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహిం చిన 76వ గణతంత్ర దిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్‌ ప్రసంగించారు. ఏడు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఆర్థిక, పరిపాలనా గందరగోళంతో దెబ్బతిం దన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేయడం, వనరుల మళ్లింపుతో పాటు దుష్పరి పాలన సాగించడంతో ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలపై పడిరదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని, అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయని, నిలిచిపోయిన ప్రాజెక్టులతో పాలనా వ్యవస్థ దెబ్బ తిన్నదన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడం, ప్రతి సవాలును అవకాశంగా మార్చడం మన బాధ్యతని, ఇందుకు స్వర్ణాంధ్ర విజన్‌ 2047 రోడ్‌మ్యాప్‌ రూపొందిం చినట్లు చెప్పారు. గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొదట ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్ను పెట్టాల్సి వచ్చిందన్నారు. ఆర్థిక అడ్డంకులను అధిగ మించడం, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం తన పూర్తి సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ రూ.16లక్షల కోట్ల నుంచి 2047నాటికి రూ.305 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, పలువురు మంత్రులు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీఎస్‌ విజయానంద్‌, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
పది సూత్రాలు
`-పేదరికం నిర్మూలనకు పీ 4 విధానం.
-అందరికీ స్వచ్ఛమైన తాగునీరు.
-మహిళ, యువత సాధికారతపై ప్రత్యేకంగా దృష్టి.
-యువతను రేపటి అవకాశాలకు సిద్ధం చేస్తూ వేగంగా నైపుణ్య గణన
-నీటి భద్రత కోసం నదుల అనుసంధానం, నీటి నిర్వహణలో విప్లవాత్మక మార్పులు
– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు మామిడి,అరటి,మిర్చి,కాఫీ,సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు లాంటి పంట ఉత్పత్తులు ప్రత్యేక కేంద్రాల ద్వారా ప్రపంచ మార్కెటోతో నుసంధానం.
-మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానా శ్రయాలు,మల్టీమోడల్‌ రవాణా కేంద్రాల అభివృద్ధి.
-క్లీన్‌ ఎనర్జీ పాలసీ 2024తో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపు. 5వేల ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు. పీఎం సూర్య ఘర్‌ రూఫ్‌ టాప్‌ సోలార్‌ పథకం, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి ప్రోత్సాహం.
-గిరిజన ప్రాంతాల్లో సేంద్రీయ పద్ధతిలో పండిరచే పంటలకు విలువ జోడిరపు సౌకర్యాల కల్పన.
అసెంబ్లీ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు : అసెంబ్లీ ప్రాంగణంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసన సభలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం,ఓటుహక్కు కల్పించిందని అయ్యన్న పాత్రుడు స్పష్టంచేశారు. సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈసందర్భంగా పిలుపు నిచ్చారు.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన శాసనమండలి ఛైర్మన్‌: శాసనమండలిలో ఛైర్మన్‌ మోషేన్‌రాజు త్రివర్ణ పతా కాన్ని ఎగురవేశారు. ప్రజలు తమ హక్కులు గురించి తెలుసుకోవాలని మోషేన్‌ రాజు తెలిపారు. పాఠ్యాం శాల్లో రాజ్యాంగ విలువల్ని పొందుపరచాలన్నారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజ యానంద్‌ జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా చిన్నారులకు సీఎస్‌ కె.విజయానంద్‌ మిఠాయిలు పంచారు..
హైకోర్టులో..: హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా 76వగణతంత్ర వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్ర మంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ఠాకూర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమైక్యస్ఫూర్తిని పెంపొందించుకు ని ప్రతి ఒక్కరూ ఎంచుకున్న రంగాల్లో ముందుకు సాగాలని అంద రికీ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌ శకటం..
ఢల్లీిలోని కర్తవ్య పథ్‌ 76వ రిపబ్లిక్‌ డే పరేడ్‌ సంద ర్భంగా ఆంధ్రప్రదేశ్‌ శకటం ప్రదర్శించ బడిరది. ఆంధ్రప్రదేశ్‌ ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈకళాఖండాలు ఎన్నోఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆటవస్తువుల్లాగా ఉన్నాయి. ఎలాంటి రసాయ నాలు ఉపయోగించకుండా అడవి లో దొరికే కట్టెలతో ఈ బొమ్మలు తయారు చేస్తారు. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.ఈ శకటం ఆంధ్ర ప్రదేశ్‌ కీర్తి కిరీటంలో ఓకలికితురాయి వంటివి. మా మూలు కర్రతో తయారు చేసే ఈబొమ్మలు.. దేశ విదేశాల్లోనూ ఏపీ సృజనా త్మకతను సగర్వం గా చాటి చెబుతు న్నాయి.ఘన చరిత్ర కలిగిన ఈబొమ్మలు గణ తంత్ర దినోత్స వంనాడు శకటం రూపంలో దర్శన మిచ్చి ఆకట్టుకున్నాయి.
విశాఖ జిల్లాలోగణతంత్ర దినోత్సవ వేడుకలు
విశాఖపట్టణం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాంతత్య్రసమర యోధులు, పద్మ అవార్డుల విజేతలు,రాజకీయ ప్రముఖులు, న్యాయ, పరిపాలనా అధికారులు వేడుకల్లో భాగస్వా మ్యం కాగా..జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగాడీసీపీ మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్‌ ఓపెన్‌ టాప్‌ వాహనంపై మైదానాన్ని సంద ర్శించారు. అనంతరం పరేడ్‌ కమాండర్‌ ఎన్‌.వి. రమణ సారథ్యంలో మార్చ్‌ ఫాస్ట్‌ మొదలు కాగా పోలీస్‌ సిబ్బంది,ఎన్‌.సి.సి. క్యాడెట్లు కవాతు నిర్వహించారు. వారి నుంచి కలెక్టర్‌, వేదికపై ఆశీనులైన ఇతర అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. శాంతికి చిహ్నం, జాతి సమైక్యతను చాటి చెబుతూ జిల్లా కలెక్టర్‌, పోలీసు అధికారులు జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి విశేషాలను వివరిస్తూ కలెక్టర్‌ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. -(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

చిత్తడి నేలలు ప్రకృతి పరిరక్షణకు నెలవులు

సముద్రం,నది ఇతర నీటి వనరులు కలిగిన తీర పాంతాల్లో తక్కువ లోతు ఉండి ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండే భూములను చిత్తడి నేలలు అంటారు. పెద్దనదులు లేదా సరస్సుల వెంబడి మంచినీటి చిత్తడి నేలలు ఏర్పడతాయి.. అతిపెద్ద సరస్సుగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సును చిత్తడి నేలలు కలిగిన భూమిగా గుర్తించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోక పోతే భావితరాలకు చిత్తడి నేలలు ఉండవు. ఇప్పటికే పలురకాల పక్షులు,జంతువులు, జీవ జాతులు అంతరించిపోతున్నాయి. కొన్నిరకాల జంతువులు, పక్షులు చూడా లంటే జూపార్కు లోనో, ఛానల్స్‌లోనే చూడవలసి వస్తుందని, ఇదే పరిస్ధితి కొన సాగితే భవిష్యత్తులో చిత్తడినేలలు కనుమరు గవు తాయని పర్యావరణ నిపు ణులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. మానవాళి మను గడకు చిత్తడి నేలలు ఎంతో దోహద పడతాయి. సృష్టిలో సహజసిద్ధంగా ఏర్పడిన వనరులను కాపాడుకుంటే భావితరాల ప్రజలకు వాటి ఆవశ్య కత, స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించ గలుగు తాం. సృష్టిలో ఉన్న అనంతకోటి జీవరాశుల్లో 40 శాతం చిత్తడి నేలల్లోనే ఉంటాయి. పక్షులకు ఈ నెలల్లో ఆహారం సమృద్ధిగా లభిస్తుంది. వీటి ప్రాముఖ్యతను గుర్తించి వివిధ దేశాలు ‘ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం’ నిర్వహిస్తున్నాయి.
భూగోళంపై జీవరాశి మనుగడకు చిత్తడి నేలలు అత్యంత కీలకం. భూమికి ఊపిరితిత్తులుగా పని చేస్తూ ప్రకృతి సమతుల్యతకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.దురదృష్టవశాత్తు చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని శతాబ్దాలుగా గుర్తించకపోవడం వల్ల, అవి శరవేగంగా అంతరించి పోతున్నాయి. జీవుల మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు చిత్తడి నేలలు ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా గడచిన వందేళ్లలో ఇవి64శాతంమేర అంత రించి పోయాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు వాటి పరిరక్షణ,అభివృద్ధి కోసం కృషి చేయాలని ఇరా న్లోని రామ్సార్లో 1971లో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరి ఆతరవాత నుంచి ఏటా ఫిబ్రవరి రెండో తేదీన చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మానవాళికి చిత్తడి నేలల వల్ల కలిగే ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడం ఈఏడాది లక్ష్యం.
ఎన్నో ప్రయోజనాలు..
సముద్ర,నదీతీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటి వనరులతో నిండి ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలుగా పరిగణిస్తారు. మంచినీటితో పాటు ఉప్పు నీటి సరస్సులు,తంపర,బీల భూములు,పగడపు దిబ్బలు, మడ అడవులు తదితర 19రకాల ప్రాంతాలు చిత్తడి నేలల కిందకు వస్తాయి. నదీ తీరాల్లోని చిత్తడి నేలలు ప్రవాహ ఉద్ధృతిని,అలల తాకిడిని అడ్డుకుని తుపానులు, వరదల ప్రభావాని తగ్గిస్తాయి. పర్యావరణ మార్పుల కారణంగా వాయు దుష్ప్రభావాలను గణనీయంగా నియం త్రిస్తాయి.అరుదైన మత్స్య,వృక్షజాతుల జీవనానికి దోహదపడటంతోపాటు దేశ,విదేశీ వలస పక్షులకు ఆశ్రయమిస్తాయి.ఈ నేలలు పరిసర ప్రాంతాల్లోని నీటి నాణ్యతను పెంచడమే కాదు,కాలుష్య తీవ్రత ను తగ్గించడంలోనూ కీలకమవుతున్నాయి.చిత్తడి నేలలు సాగు,తాగునీరు అందిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయి.ఈ నేలల్లో లభించే చేపల్లో పోష కాలు అధికంగా ఉంటున్నాయని పలు పరిశోధ నలు తేల్చాయి.చూపరులను విశేషంగా ఆకట్టు కుంటున్న చిత్తడి నేలలు-పర్యటక ఆదా యాన్ని గణనీయంగా పెంచుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,400 ప్రదేశాలను రామ్సార్‌ ప్రమాణాల ప్రకారం చిత్తడి నేలలుగా గుర్తించారు.వీటిలో అత్యధికంగా 175 వరకు యూకేలోనే ఉన్నాయి.142 ప్రదేశాలతో మెక్సికో రెండో స్థానాన్ని ఆక్రమించింది.భారత్‌ 1982లో రామ్సార్‌ ఒప్పందంలో చేరి చిత్తడి నేల గుర్తింపును మొదలుపెట్టింది.1982-2013 మధ్య కాలంలో 26ప్రదేశాలను,2014-23 మధ్య మరో 49 క్షేత్రాలను చిత్తడి నేలలుగా గుర్తించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75 చోట్ల13.30లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రామ్సార్‌ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు విస్తరించి ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు,పులికాట్‌ సరస్సులు ఇలా గుర్తింపు పొంది నవే.రామ్సార్‌ ఒప్పంద ప్రమాణాలకు అను గుణంగా ఉన్నప్పటికీ,దేశంలోని అనేక చిత్తడి నేలలను గుర్తించడంలో తీవ్రతాత్సారం జరుగు తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోయంబత్తూరుకు చెందిన సలీం అలీ సెంటర్‌ ఫర్‌ ఆర్నిథాలజీ, నేచురల్‌ హిస్టరీ (సాకాన్‌) సంస్థ రెండు దశాబ్దాల క్రితమే దేశంలోని 700 ప్రదేశా లకు చిత్తడి నేలలుగా గుర్తింపునిచ్చి పరిరక్షించా లని సూచించింది.వాటిలో 200 ప్రాంతాలను రామ్సార్‌ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది. కోరింగ అభయారణ్యం, పాకాల చెరువు, కృష్ణా నదీ పరీ వాహక ప్రాంతాలను ఆ జాబితాలో చేర్చాల్సినవి గా సాకాన్‌ పేర్కొంది.సోంపేట,నౌపడ, వాకల పూడి బద్వేలు,కంభం,విశాఖపట్నం జిల్లాలోని కొండక్లర్ల్‌ ఆవ,తిమ్మరాజు చెరువు ప్రాంతాలు చిత్తడి నేలలేనని,వాటి పరిరక్షణకు చర్యలు అత్యవసరమని సూచించింది.కొల్లేరు,కొండకర్ల ఆవతో పాటు మరికొన్ని ప్రదేశాలను అటవీశాఖ చిత్తడి నేలలుగా గుర్తించినప్పటికీ,వాటి సంరక్ష ణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలేదు. ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తిం పు పొందిన కొల్లేరు పరిధిలో వేల ఎకరాల చిత్తడి నేలలు ఆక్రమణలకు,విధ్వంసానికి గురయ్యాయి. దాన్ని అడ్డుకుని,అక్కడి నేలలను పునరు ద్ధరించ డంలో ప్రభుత్వ వ్యవస్థలు ఘోరంగా విఫలమవుతు న్నాయి.సుప్రీంకోర్టు ఇటీవలే నాగ్పుర్లోని ఫుటాలా సరస్సు చుట్టూ కార్యకలాపాలను నిలిపివేసింది. చిత్తడి నేలగా గుర్తించిన ఈ ప్రదేశాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం మానవ నిర్మితంగా పేర్కొన్నప్పటికీ, ప్రకృతి వ్యవస్థల వాస్తవరూపాన్ని మార్చవద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం వారించింది.జాతీయ హరిత ట్రైబ్యునల్‌,కాగ్‌ వంటివి సైతం చిత్తడి నేలల విధ్వంసాన్ని నిలువరించాలని గతంలో సూచించాయి.జాతీయ అటవీ కమిషన్‌ 2006 లోనే చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్రానికి నివేదించింది. సుమారు దశాబ్ద కాలం తరవాత కేంద్రం 2017 లో చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణకు మార్గదర్శ కాలను తీసుకువచ్చినప్పటికీ, అవేమీ క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడంలేదన్న విమర్శలు న్నాయి.
బహుముఖ చర్యలు కీలకం…
కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రప్రభు త్వాలు గుర్తింపు పొందిన చిత్తడి నేలల సమాచా రాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలి. పర్యా వరణ,అటవీ, వన్యప్రాణి, కోస్తా నియంత్రణ చట్టాలను వర్తింపజేయడంతో పాటు వ్యర్థ రసాయనాలు, విషపూరిత జలాలను చిత్తడి నేలల్లో పారబోయకుండా నిఘాను తీవ్రతరం చేయాలి. కఠిన శిక్షలు,భారీ జరిమానాలు విధించడం ద్వారా ఈ నేలల ఆక్రమణలను, విధ్వంసాన్ని అడ్డుకోవాలి.చిత్తడి నేలల పరిరక్షణ కోసం నిరుడు కేంద్రం ప్రకటించిన ‘అమృత్‌ ధరోహర్‌’ పథకాన్ని రామ్సార్‌ గుర్తింపు ఉన్న ప్రదేశాలకే పరిమితం చేశారు.మిగతా చిత్తడి నేలలకూ వర్తింపజేయాలి. పర్యాటక, అటవీ, పర్యావరణ శాఖలు సంయు క్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు జిల్లాస్థాయి ప్రణాళికలను రూపొందించి స్థానిక సమూహాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమర్థంగా అమలుపరచాలి. ఇటువంటి చర్యలు కొరవడితే-చిత్తడి నేలల విధ్వంసం నిరాటం కంగా సాగు తూనే ఉంటుంది!
కొరవడిన సంకల్పం
చిత్తడి నేలల విధ్వంసం మూలంగా పర్యావరణ మార్పుల దుష్పరిణామాలు అధికమవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వీటి పరి రక్షణకు పటిష్ఠ కార్యాచరణను రూపొందించి అమలుపరచాలని కోపెన్హాగెన్‌ వంటి ప్రపంచ స్థాయి సమావేశాలెన్నో తీర్మానాలు చేశాయి. అందుకు గట్టి సంకల్పం కొరవడటం దుర దృష్టకరం.జనాభా పెరుగుదలకు తోడు పారిశ్రా మిక అవసరాల కోసం చిత్తడి నేలలను మట్టితో కప్పి ఆక్రమించేస్తున్నారు పంటల సాగు కోసం రసాయన ఎరువులు,పురుగు మందులను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు.ఆ ప్రభావంవల్ల చిత్తడి నేలలు సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయి.
జల,వృక్ష సంపదకు కొల్లేరు ఆలవాలం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు చిత్తడి నేలలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇటువంటి నేలను, ప్రకృతిని కాపాడితే అది భవి ష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుందని కొంతమంది గుర్తించలేకపోతున్నారు.సృష్టిలో సహజసిద్ధంగా మానవాళి మనుగడ కోసం ఏర్పడిన సంపదను విస్మరిస్తున్నారు.ప్రపంచ దేశాలుసైతం పర్యావరణాన్ని పరిరక్షించండి, ప్రకృతిని కాపాడడండి అంటూ పదేపదే హెచ్చరి స్తున్నా వాటి వినాశనానికి చేసే వికృతి చేష్టలు తగ్గలేదు.సహజసిద్ధంగా ఏర్పడిన సంపదను రక్షించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని (వరల్డ్‌ వెట్‌ల్యాండ్స్‌డే) జరుపుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన ఏకైక చిత్తడి నేలలు ఏలూరు జిల్లాలో విస్తరించిన 77,136 ఎకరాలు కొల్లేరు సరస్సు మాత్రమే. ఈచిత్తడి నేలలు అనేక జీవరాశులకు, పక్షులకు ఎంతో మేలు చేస్తుంటాయి. అందువల్లే ప్రపం చంలోని అనేక దేశాలకు చెందిన పక్షులు వలస వస్తున్నాయి. చిత్తడినేలలపై 1971సంవత్సరంలో ఫిబ్రవరి 2న ఇరాన్‌ దేశంలో రామ్‌సర్‌ నగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.అప్పుడు సదస్సులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రపం చంలోని 164దేశాలు చిత్తడినేలల పరిరక్షణకు ఒప్పంద సంతకాలు చేశాయి.వీటిలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది.2002 సంవత్సరంలో కొల్లేరును రామ్‌సర్‌ సైట్‌లోనికి తీసుకున్నారు. భారతదేశంలో 21రాష్ట్రాల్లో 46 ప్రాంతాలను చిత్తడినేలలుగా గుర్తించారు.
చిత్తడి నేలల ప్రాధాన్యం
అరుదైన మొక్కలు,పక్షులు,జంతువులు,చేపలు గుడ్లు పెట్టడానికి ఈ నేలలు చాలా అనుకూలం. నీటి నాణ్యతను పెంచడంలో,కాలుష్య కారకా లను గ్రహించడంలో ఈ చిత్తడినేలలు ప్రాధాన్యత పోషిస్తాయి. మానవ తప్పిదాలతో పర్యావరణానికి చాలాహాని జరుగుతుంది. ప్రజలు వ్యవసాయ, ఆక్వా అవసరాలకు ఈ భూములను ఆక్రమిం చుకుని రసాయన ఎరువులు వాడడంవల్ల నివాస యోగ్యానికి ఈ నేలలను పూడ్చడంతో చిత్తడి నేలలు విధ్వంసానికి గురవుతున్నాయి. ప్రపంచం పరిశ్రమల కోసం ఈచిత్తడి నేలలు కేటాయించ డంతో మరింత వినాశనానికి దారితీస్తున్నాయి.
భూమికి ఊపిరితిత్తులు!
6 వేలకు పైగా చిత్తడి నేలలు నమోదయ్యాయి
చిత్తడి నేలల సంరక్షణ కోసం వ్యవసాయం మరియు అటవీ మంత్రిత్వ శాఖలోని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేచర్‌ కన్జర్వేషన్‌ అండ్‌ నేషనల్‌ పార్క్స్‌చే నిర్వహించబడుతున్న కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందజేస్తూ, మంత్రి యు మాక్లీ చిత్తడి నేలల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, ఇవి జీవశాస్త్రపరంగా అత్యంత ఉత్పాదక పర్యా వరణ వ్యవస్థలు. రెయిన్‌ఫారెస్ట్‌, పర్యావరణ సమతుల్యతను నిర్ధారించడం మరియు జీవ వైవి ధ్యాన్ని సంరక్షించడం రెండిరటిలోనూ దృష్టిని ఆకర్షిస్తూ,ఈ ప్రాంతాలు అనేక విధులను కలిగి ఉన్నాయని యుమాక్లే పేర్కొన్నారు.ఈ ప్రాంతాలు భూగర్భ జలాలను పోషించడం,భూగర్భ జలాలను సమతుల్యం చేయడం, వరద నీటిని నిల్వ చేయ డం, వరదలను నియంత్రించడం,తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు ప్రవేశించకుండా నిరోధించడం ద్వారా ఈప్రాంతం నీటి పాలనను క్రమబద్ధీకరి స్తుంది.2002లో చేసిన శాసన పునర్విమర్శతో చిత్తడి నేలలను నింపడం మరియు ఎండబెట్టడం నిషేధించబడిరదని మంత్రి యుమాక్లే గుర్తు చేస్తూ, ‘‘అదే సంవత్సరంలో చిత్తడి నేలల రక్షణపై నియంత్రణ అమలులోకి వచ్చింది. చిత్తడి నేలల రక్షణపై నియంత్రణ,చిత్తడి నేలల రక్షణ,ఉపయో గం,సూత్రాలు,రక్షణ మండలాల నిర్ధారణ,అమలు సూత్రాలు,రామ్‌సార్‌ సైట్‌ల ప్రకటన ప్రక్రియ, జాతీయ చిత్తడి నేల కమిషన్‌ విధులు,పని విధానా లతో ఒక ముఖ్యమైన అడుగు తీసుకోబడిరది. నిర్ణయించబడ్డాయి.‘‘నియంత్రణ ద్వారా స్థాపించ బడిన నేషనల్‌ వెట్‌ల్యాండ్‌ కమిషన్‌,చిత్తడి నేలలపై మరియు ప్రకృతి పరిరక్షణ పేరుతో సంబంధిత సంస్థలను కలిగి ఉన్న మన దేశంలో మొదటి కమిషన్‌’’సమాచారం ఇచ్చాడు. టర్కీ లోని రామ్‌సర్‌ కన్వెన్షన్‌ ద్వారా రక్షించబడిన 14 ప్రాంతాలు కాకుండా,మొత్తం 59మిలియన్‌ 47 వేల1హెక్టార్ల విస్తీర్ణంలో161చిత్తడి నేలలు ఉన్నా యని, వీటిలో 205 జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలు మరియు వాటిలో 120 స్థానిక ప్రాముఖ్యత కలిగినవి అని యుమాక్లే పేర్కొంది. గత 5 సంవత్సరాలలో,జనరల్‌ డైరెక్ట రేట్‌ నిర్వ హించిన అధ్యయనాలతో జాతీయ చిత్తడి నేలల జాబితా పూర్తి దశకు చేరుకుందని నేషనల్‌ వెట్‌ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ పేర్కోంది.ఈ వ్యవస్థలో జాబితా మాత్రమే కాకుండా,చిత్తడి నేలల హోదాలో ఇవ్వబడిన చిత్తడి నేల కార్యకలాపాలకు అనుమతులు కూడా ఇక్కడ నిర్వహించబడతాయి.అదనంగా, మన ప్రజలు ఇ-గవర్నమెంట్‌ ద్వారా చిత్తడి నేలల కోసం సులభంగా దరఖాస్తులు చేసుకోవచ్చు. 1999 నుండి రామ్‌సర్‌ కన్వెన్షన్‌‘తడి నేలల హేతుబద్ధ వినియోగం’ సూత్రం పరిధిలో మా మంత్రిత్వ శాఖ చిత్తడి నేల నిర్వహణ ప్రణాళి కలను సిద్ధం చేసింది.చిత్తడి నేల నిర్వహణ ప్రణా ళిక ఆప్రాంతం సాధారణ రక్షణ వినియోగ సూత్రాలను నిర్ణయిస్తుంది. అదనంగా, ప్రణాళి కలు చిత్తడి నేలల సమస్యలను పరిష్కరించడానికి భాగస్వామ్య విధానం మరియు అన్ని ఆసక్తి సమూ హాలకు వివిధ బాధ్యతలను అందించే కార్యకలా పాలను కలిగి ఉంటాయి.1999 నుండి జనరల్‌ డైరెక్టరేట్‌ చే వెట్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌లు తయారు చేయబడ్డాయి. -గునపర్తి సైమన్‌

పీసా కమిటీ ఎన్నికల్లో అంతరంగమేమిటీ?

రాజ్యాంగంలో ఆదివాసులకు కల్పించిన రక్షణ చట్టాల్లో పెసాచట్టం1996(షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు పొడి గింపు చట్టం)ఒక్కటి.ఈచట్టం ఐదువ షెడ్యూల్డ్‌ప్రాంతాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హిమా చల్‌ప్రదేశ్‌,జార్ఖండ్‌,మధ్యప్రదేశ్‌,మహారాష్ట్ర,ఒడిశా,రాజస్థాన్‌,తెలంగాణవంటిపదిరాష్ట్రాలకుపెసా చట్టం1996 వర్తిస్తోంది.ఆదివాసీప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధికారాలనుకల్పించారు.షెడ్యూల్‌ గిరిజనులకు స్వపరిపాలన అందించడం,షెడ్యూల్‌ తెగలసంస్కృతి, సంప్రదాయాలు,వివాద పరిష్కార పద్దతుల రక్షణ,గ్రామసభకు అధికారం తీసుకునే నిర్ణయం ఉంది.ఈచట్టం ప్రాముఖ్యతపై19992010వరకు దశాబ్దకాలంపాటు విశ్రాంతిఐఏఎస్‌ అధికారి బీడీశర్మ,ఉస్మానియా సెంట్రల్‌ యూనివర్శిటీ విశ్రాంతి ఫ్రొఫెసర్‌ జేపీరావు వంటి సామాజిక ఉద్యమనేతలు మావూళ్లో మారాజ్యం అనే నినాదంతో ఆదివాసీల స్వపరిపాలనకోసం పోరాడి గిరిజన తండాలు,గూడేలు తిరిగి ఆతరం ఆదివాసీ ప్రజలకు పెసా చట్టంపై అవగాహన కల్పించారు.అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అనంతగిరి మండలం నిమ్మలపాడు లోనూ సమత ఆధ్వర్యంలో మావూళ్లో మారాజ్యం స్థూపం కూడా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈచట్టం ప్రాధాన్యతను గ్రహించి రాష్ట్ర పంచాయితీ గ్రామీణాభివృద్ధి శాఖ,ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కళ్యాణ్‌ గ్రామసభ ప్రాముఖ్యతపై ప్రజలకు కాస్త అవగాహన కల్పించారు.గతేడాది ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజున13,326 గ్రామపంచాయితీల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి గ్రామసభ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు.దీంట్లో ఏపీలో ఐదో షెడ్యూల్‌ ఏరియా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు.ఆ తర్వాత రెండు గతేడాది డిసెంబర్‌లో పెసా చట్టం1996 అమలుపై రాష్ట్రప్రభుత్వం గిరిజన గ్రామాల్లో కమిటీ ఎన్నికలు నిర్వహించింది.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు అన్నీ ఐటీడీఏ పరిథిలోఉన్న గిరిజన గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం పెసా కమిటీ ఎన్నికలు నిర్వహించి ఎంపిక చేశారు.
అయిత,ే ఈపెసాచట్టం వచ్చిదాదాపుగా 29ఏళ్లు అవుతుంది.నాటి నుంచి నేటి వరకు ఏప్రభుత్వం పట్టిం చుకోలేదు.కూటమి ప్రభుత్వం మాత్రం ఆఘమేఘాలపై పెసా కమిటీలు ప్రభుత్వ నియమ నిబంధనలతో ఎంపిక పూర్తి చేసింది.ఎంపికైన కమిటీ సభ్యుల్లో చాలా మంది యువతకే ప్రాధాన్యత ఇచ్చారు.ఇటీవల నేను అనంతగిరి మండలం నిమ్మలపాడు,రాళ్లవలస,కరకవలస గిరిజనగ్రామాలను సందర్శించాను.ఆప్రాంత పెసా కమిటీ సభ్యులనుస్థానికులు పరిచయం చేశారు.ఎన్నికైన కమిటీసభ్యులందరూ కుర్రగ్యాంగే.వారికిఈచట్టంపై ఏమాత్రం అవగాహన లేని పరిస్థితులను గమనించాను.రాజ్యాంగబద్దమైన చట్టాల కోసం అవగాహన లేని అమాయకులను ఎంపిక చేయడంపట్ల ప్రభుత్వ అంతరంగం ఏమిటీ గిరిజన మేథావులు ప్రశ్నిస్తున్నారు. ఈప్రక్రియలో బహుళ జాతి పెట్టుబడిదారుల స్వార్ధం కన్పిస్తోందని భావిస్తున్నారు.ఇక్కడవున్న వనరుల దోపిడికి సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.దీంట్లో భాగంగానే ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక ప్రాంతీయ పెట్టు బడులదారుల సమ్మెట్‌లో రాజ్యాంగబద్దమైన పదవిలోఉన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడుచేసిన వ్యాఖ్యాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రసంచలనం రేపాయి.దీంట్లోభాగంగానే అయ్యన్న వ్యాఖ్యాలపై భగ్గుమన్న మన్యం ఈనెల 11,12 తేదీల్లో కూడా రాష్ట్రవ్యాప్త మన్యం బంద్‌ను ప్రకటించడం గమనార్హం.
ఈనేపథ్యంలో ప్రభుత్వకుటిల నిర్ణయాలు,ఆలోచనలపై నేటి గిరిజనతరం ఆలోచించాలి.ముల్లును ముల్లు తోనే తీయాలనే చందంగా రాజ్యాంగబద్దంగా ఎన్నికైన పెసా కమిటీ సభ్యులతోనే గ్రామసభల ద్వారా ఇక్కడ ఉన్న అపారమైన నిక్షేపాలు దోపిడికి రంగం సిద్దమవుతుందనేది కమిటీ సభ్యులు ఆలోచించాలి. దీనిపై గిరిజన సంఘనాయకులు,ఉద్యోగులు,ప్రజలు యావత్తు అప్రమత్తంగా వ్యవహరించాలి.ఇప్పటికే చింతపల్లి,పార్వతీపురం ఏరియాలో అదాని ప్రాజెక్టు కోసం సన్నహాలు సాగుతున్నాయి.ఇటీవల జరిగిన ఏపీ కాబినేట్‌ సమావేశంలో అల్లూరి జిల్లాలో అదాని ప్రాజెక్టుల నిర్వహణపై సీఎం ప్రకటించడం తెలిసిందే.ఇప్పటికైనా పెసా కమిటీలు ఎన్నికల్లో పాలకుల కుతంత్రాల ఎన్నికైన అమాయక గిరిజన యువత గ్రహించాలి.గ్రామసభల తీర్మాణాల్లో ఏకపక్ష నిర్ణయాలు కాకుండా భవిష్యత్తు తరాల కోసం,ప్రజల పక్షాన నిలబడి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.లేని పక్షంలో గిరిజన ప్రజల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉంది.! – రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

1 2