పెసా చట్టంపై అవగాహన సదస్సు

షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందా లంటే పెసా చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. సమత,గిరిమిత్ర సంస్థల ఆధ్వర్యంలో అక్టోబర్‌ 8వతేదీన నర్సీపట్నం ఎన్‌జీజీఎస్‌ భవనంలో పెసా చట్టం-1996పై సమీక్ష,అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏపి ఆదివాసీ హక్కుల సంఘం అధ్యక్షులు ఎన్‌. కళ్యాణ్‌ మాట్లాడుతూ గిరిజనలకు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలు గ్రామసభల అమలపై పెసా చట్టాలను నేటి గిరిజన యువత అవగా హన చేసుకొని,స్థానిక వనరులు దోపిడికి గురి కాకుండా పరిరక్షించుకోవాలన్నారు.పెసా కమిటీ సభ్యులు బత్తుల కృష్ణ మాట్లాడుతూ గిరిజన వనరులు పరిరక్షణ,గిరిజన పల్లెల ప్రగతి చెందాలంటే పెసా చట్టం ద్వారా గ్రామ సభలు సంపూర్ణంగా అవగాహన చేసుకోవా లన్నారు.అనకాపల్లి జిల్లా గిరిజన సంఘం అధ్యక్షులు ఎస్‌.జనార్దన్‌ ప్రతి యువత గ్రామసభల నిర్వహణ,బాధ్యతలు తెలుసుకుని గిరిజన గ్రామభివృద్ధికి తోడ్పాడాలని పిలుపు నిచ్చారు.సమత సభ్యులు పెద్దమల్లాపురం)లోతా సుబ్బారావు మాట్లాడుతూ సమత చేస్తున్న రాజ్యాంగ పోరాటాల ఫలితమే నేడు గిరిజన వనరుల పరిరక్షణ అన్నారు.గిరిమిత్ర కార్యదర్శి బి.గంగరాజు అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశంలో అనకాపల్లి జిల్లా బిఎస్పి పార్టీ అధ్యక్షులు బి.నాగరాజు,వికాసవాణి కార్యదర్శి జగ్గారావు,ప్రగతి శిలా కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ పెసా చట్టం అమల్లోకి వచ్చి సుమారు 32 సంవత్సరాలు అవుతున్నా నేటికీ షెడ్యూల్డ్‌ ఏరియాలో సంపూర్ణంగా అమలు కావడం లేదని అన్నారు.దీనివల్ల ఎన్నో గిరిజన కుటుంబాలు భూములు అన్యాక్రాంతమవుతూ దోపిడీదారుల గుప్పెట్లో నలిగిపోతున్నారని పేర్కొన్నారు.బి.బాలరాజు,వినియోగదారుల మండల్‌ చింతపల్లి మండల అధ్యక్షులు పి.చిట్టిబాబు,సమత డైరెక్టర్‌ సుశాంత్‌ ప్రాణాగ్రహీ,కో-ఆర్డినేటర్లు కే.సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామసభ ప్రతిష్టతను,దాని ఫలితాలను వివరించారు.జీ.సైమన్‌ మాట్లాడుతూ పెసాచట్టం, గ్రామసభ ప్రాధాన్యత పై తమ తమ అభిప్రాయాలను వెల్లడిరచారు.పెసా చట్టంలో పొందు పరిచిన కమిటీలు నిర్వహణ,బాధ్యతలు,అన్యా క్రాంత మవుతున్న భూములు పరిరక్షణ, సంతల కోసం గ్రామసభల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవా లనే అంశాలను వివరించారు.ఈ సమావేశం లో సమత పరిశోధన విద్యార్థులు,గిరిజన యువకులు పాల్గొన్నారు. అనంతరం ‘పల్లె ప్రగతికి పట్టాభిషేకం పెసా చట్టం-996’అనే పుస్తకానీ ఆవిష్కరించారు. – (బి.గంగరాజు)

దేశంలో జమిలి ఎన్నికల సంకేతాలు

జమిలి ఎన్నికల విషయంలో మరో అడుగు పడిరది. ఈ మధ్యనే, సార్వత్రక ఎన్నికలకు కాస్తంత ముందు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. లోక్‌సభలో సొంతబలం గట్టిగా ఉన్న తొలి రెండు పర్యా యాల్లో ఈదిశగా సాగించిన ప్రయత్నా లను, ఇప్పుడు సరిపడా స్వశక్తి లేని దశలో కూడా ముందుకు తీసుకుపోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. జమిలితో దేశా నికి ఎంతో మంచిది అంటూ బీజేపీ పెద్దలు పట్టువీడ కుండా పోరాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
దేశంలో జమిలి ఎన్నికల సంకే తాల సందడి మరోసారి బలంగా తెరపైకి వచ్చింది.అకస్మాత్తుగా పార్లమెంట్‌ ప్రత్యేక సమా వేశాల ప్రకటన, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో జమిలీ ఎన్నికల సాధ్యా సాధ్యాలపై కమిటీ వేశారన్న సమాచారంతో.. ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ సాగు తోంది. ఇప్పటికే తెలంగాణపై కర్ణాటకలో కాం గ్రెస్‌ గెలుపు ప్రభావం ఉంది. వచ్చే ఎన్నికలో మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌,ఛత్తీస్‌గఢ్‌, తెలం గాణలో కాంగ్రెస్‌ గెలిస్తే మరింత ప్రభావం చూపే అవ కాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ లు, దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన సిఫారసులు చేయాలంటూ గత మోదీ ప్రభుత్వం కోవింద్‌ కమిటీని కోరింది.ఈ నేపథ్యంలో చర్చలు నిర్వహించిన కమిటీ.. తన సిఫారసు లను గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.తొలుత లోక్‌సభ, అసెంబ్లీలకు ఒక విడుతలో ఎన్నికలు నిర్వహించడం,తదుపరి వంద రోజులలోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా జమిలి సాధ్యపడుతుందని కోవింద్‌ కమిటీ పేర్కొన్నది.జమిలి ఎన్నికలు నిర్వహిం చాలంటే రాజ్యాంగంలో పలు కీలక సవరణలు చేయాల్సి ఉంటుంది.తొలివిడుతలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించ డానికి రాజ్యాంగ సవరణలు అవసరమైనప్పటికీ.. పార్లమెంటు ఆమోదం పొందితే రాష్ట్రాల ర్యాటి ఫికేషన్‌ అవసరం ఉండదు. అయితే..వంద రోజు ల తర్వాత నిర్వహించే స్థానిక ఎన్నికలకు మాత్రం కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
ఏమిటీ జమిలి ఎన్నికలు?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు,లోక్‌ సభకు,స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వ హించడమే జమిలి ఎన్నికలప్రధాన ఉద్దేశం. గతం లో జరిగినా..ఆ తర్వాత వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు.1952 లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు,రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడక పోవడం,గడువుకు ముందే పలురాష్ట్రాల శాసన సభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాల తో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ,అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరు పడం మొదలైంది.
ప్రక్రియ పెద్దదే
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాలు చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్య వధిని పొడిగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నిక లు జరుగాలంటే దాదాపు 18రాజ్యాంగ సవర ణలు,ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్‌ కమిటీ తాజా నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356,ఆర్టికల్‌ 324, ఆర్టికల్‌ 83(2),ఆర్టికల్‌172(1),ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తు న్నారు.
రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫార్సులు
జమిలి ఎన్నికల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయక త్వంలో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ 18 వేల పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పిం చింది.దేశంలో47రాజకీయ పార్టీలలో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.ఈకమిటీ 2029నాటికి రాజ్యాం గంలో 5ఆర్టికల్స్‌ సవరణ చేసి జమిలి ఎన్నికలు నిర్వ హించవచ్చని తెలిపింది.7దేశాలలో జమిలి ఎన్ని కల గురించి అధ్యయనం చేశామని పేర్కొంది. కానీ స్వీడన్‌,జర్మనీ,బెల్జియం వంటి దేశాలలో అమ లులో ఉన్న నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం గురించి కమిటీ పేర్కొనలేదు.కోవింద్‌ కమిటీ 10కీలక సిఫా ర్సులు చేసింది.తొలి దశలో లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారిఎన్నికలు నిర్వహించాలని, రెండో దశలో కార్పొరేషన్లకు, మునిసిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు,పంచాయతీరాజ్‌ సంస్థలకు ఎన్ని కలు నిర్వహించాలని పేర్కొంది.స్థానిక సంస్థల ఎన్నికలు లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పింది. జాతీ య ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫొటో గుర్తింపు కార్డును జారీ చేయాలని పేర్కొంది.
రాజ్యాంగ సవరణలు
జమిలి ఎన్నికలు అమలులోకి రావటానికి కనీసం 6 రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉంటుందని రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ పేర్కొన్నది. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గద ర్శకాలను నిర్దేశించిన 1951ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడంతో పాటు కనీసం 6కీలక రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉం టుంది.లోక్‌సభ,రాజ్యసభ కాలపరిమితిని నిర్ణ యించే 83వఆర్టికల్‌,రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని నిర్ణయించే 172వ ఆర్టికల్‌,ఎన్నికల కమిషన్‌ అధికారాలకు సంబంధించిన 324వ ఆర్టికల్‌ సవరణ చేయాలి.వీటితో పాటు స్థానిక సంస్థలకు సంబంధించిన ఆర్టికల్‌243-కె, 243-జడ్‌.ఏలను కూడా సవరించవలసి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే రాజ్యాంగ సవరణలను రాజ్య సభ, లోక్‌సభ లలో 2 బై 3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి. ప్రస్తుతం రెండు సభలలో బిజెపికి ఉన్న బలంతో అది సాధ్యం కాదు. ఇతర పార్టీల మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. దీనితో పాటు స్థానిక సంస్థల రాజ్యాంగ సవరణలకు సగం రాష్ట్రాల శాసనసభలు కూడా ఆమోదించాలి. బిజెపి మిత్రపక్షాలు అంగీకరిస్తేనే ఇది సాధ్యమౌ తుంది. – (కె.యస్‌.లక్ష్మణరావు)

అడవి తల్లి వేదన..అరణ్య రోధన

అడవంటే జ్ఞాన నిలయం.తపోభూమి. అడ వంటే ఆరోగ్య ప్రదాయిని. ఔషధుల ఖని. ఒక్క మాటలో చెప్పాలంటే అడవి భారతీయ ఆత్మ. జీవితాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే అందులో ఒక భాగానికి వానప్రస్థాశ్రమం అన్న పేరు పెట్టి, అడవిలో తమని తాము భాగం చేసుకున్నారు భారతీయులు. ఈ అద్భుత చింతనను గతం గూటిలోకి నెట్టడం సరికాదు. ఇప్పుడు అడవులకు మనిషి చేస్తున్న చేటును ఆపాలంటే ఆ భావన ఉపయోగపడు తుందని ఆశిద్దాం. అడవిని రక్షించుకోవాలన్న నినాదం ఈ క్షణం నుంచి ప్రతి గుండె లయ కావాలి. లేదంటే రేపన్నరోజు ఆ గుండె కొట్టుకోవడం కష్టమవు తుంది. అడవి లుప్తమైతే మంచి గాలి ఉండదు. అడవి నరికితే భూమి ధ్వంసమవుతుంది. చెట్లు నరికితే పర్యావరణం నాశనమవుతుంది. వీటన్నిటికి స్పందిం చేది నీ గుండె, నా గుండె, మనందరి గుండెలు. అడవిని రక్షించుకోవడం ధార్మిక విషయమే కాదు. శాస్త్రబద్ధం కూడా. కాని వనాల మీద భారతీయులు పెంచుకున్న భావనకు వేళ్లు విజ్ఞానశాస్త్రంలో ఉన్నాయి.
ప్రపంచ జనాభాను బాధిస్తున్న దాదాపు ఎనభై శాతానికి పైగా జబ్బులకు ఔషధాలను అంది స్తున్న ఆఅడవితల్లి ఇప్పుడు రక్తకన్నీటిని కారుస్తున్నది..ప్రతీ యేటా ప్రపంచ అటవీ సంరక్షణ దినోత్సవాన్ని ఘనంగా జరిపే ఐక్యరాజ్య సమితి ఈసంవత్సరం కూడా ‘’ఫారెస్ట్‌ అండ్‌ ఎనర్జీ(అడవి మరియు శక్తి)’’ నినాదంతో పర్యావరణ ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించింది. అయినప్పటికీ,ప్రకృతి మాతపై జరుగుతున్న ఘోర కలి ఆగట్లేదు. డెబైÄ్భయేండ్ల క్రితం 250కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభాకు ఎటువంటి రక్షణను అందించిందో, ప్రస్తుతమున్న ఎనిమిది వందల కోట్ల జనులకు అదే ప్రేమను పంచుతున్న ఆ అడవికి మాన వుడు చేస్తున్న గాయం వర్ణనాతీతం! తనను ఎంతగా నాశనం చేస్తున్నా..ఆఅడవితల్లి తన బిడ్డలకు జీవ వాయువులను అందిస్తూ, వర్షాలు కురిసేలా చేస్తూ, ఆకలితీర్చే అమ్మగా తన ఒడిలో ఇప్పటికీ సమస్త ప్రాణికోటిని కంటికి రెప్పల సాకుతూనే ఉన్నది.
అగ్ర రాజ్యాలే ఆజ్యం పోస్తున్నాయి
1990 నుంచి ఇప్పటి వరకు సగానికి సగం వర్షాధార అడవులు కేవలం అగ్ర దేశాల కార్యకలాపాల వల్లనే నాశనమయ్యాయని తెలిస్తే ఆశ్చర్యం కలక్కమానదు..అటవీ పరిరక్షణ సమితి,ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం..భూమిపై 30శాతం అడవులు ఉం డాలి.కానీ ఏటావీటి విస్తీర్ణం గణనీయంగా పడిపోతున్నది. ప్రతీ సెకనుకి ఒకటిన్నర ఎకరం అడవి నరకబడుతుందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. పర్యావరణవేత్తలు చెప్పే దాన్ని బట్టి..వాతావరణంలోకి విడుదల య్యే ఒక క్లోరిన్‌ పరమాణువు, భూమికి కవచంలా ఉన్న ఓజోన్‌ పొరలోని లక్ష అణువులను విచ్ఛి న్నం చేయగలదు! అడవులను క్రమక్రమంగా క్షీణింపజేస్తూ..రోజుకి కొన్నిలక్షల లీటర్ల క్లోరిన్‌ సంబంధ ఉదారాలను అగ్రదేశాలు వాతావర ణంలోకి వదులుతున్నాయని, ఇదిలాగే జరిగితే రానున్న శతాబ్ద కాలంలో భూమిపై ఒక్కటంటే ఒక్క వర్షాధార అడవి కూడా మిగలదని హార్వర్డ్‌,కొలంబియా విశ్వ విద్యాలయాల పర్యావరణ విభాగానికి చెందిన నిపుణుల పరిశోధనల్లో వెల్లడ వ్వడం యావత్‌ ప్రపం చాన్ని నిశ్చేష్టులను చేస్తున్నది.
అడవుల ప్రాధాన్యం తెలుసా ?
అభివద్ధి ముసుగులో అగ్రరాజ్యాలు అవలం భిస్తున్న పారిశ్రామిక వింత పోకడలు ప్రకతి మాత ఒంటిని తునాతునకలు చేస్తున్నది. అడవులను విచక్షణా రహితంగా నరకడం వల్ల కార్బన్‌ డైయాక్సైడ్‌ నియంత్రణ కుంటు పడి, వాతావరణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపు తున్నది. సాధా రణంగా సముద్రాలు 25శాతం కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకుం టాయి.ఇవి నీటిలోని వివిధ మూలకాలతో కలిసి కార్బాలిక్‌ యాసిడ్‌ వంటి పదార్ధాలను ఏర్పరుస్తాయి.ఈ విధంగా గడచిన 250 సంవత్సరాల్లో సము ద్రజలాల ఆమ్లత్వం 30శాతం పెరిగిందని, దీనికి కారణం..అడవులశాతం తగ్గడమే నని,ఇది ఇలాగే కొనసాగితే,2100 సంవత్స రం నాటికి సముద్రజలాల ఆమ్లత్వం 150 శాతం వరకు పెరిగి..సముద్రాన్నే ఆవాసంగా ఏర్పరచుకున్న లక్షలాది సముద్ర జీవులు మృత్యువాత పడటం ఖాయమని బయో డైవర్సి టీ రిపోర్టులు కుండబద్దలు కొట్టాయి. ఇక,అడవుల్లో చెలరేగే అగ్ని ప్రమాదాలు పర్యా వరణానికి, జంతువులకే గాక మానవుల్లో సైతం వివిధ శ్వాసకోశ వ్యాధులు,అస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి రోగాలకు పెను ముప్పుగా దాపురిస్తున్నాయి. ఉదాహరణకు.. 2015ఆగష్టు నెలలో ఇండోనేషియా అటవీ ప్రాంతంలో సంభవించిన ఘోరఅగ్ని ప్రమా దంలో వేలకు వేల అరుదైన వ క్షాలు, జీవ జాలం కలిగిన సుమారు 2.6మిలియన్‌ హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహు తవ్వగా..సుమారు 1,00,300 మంది ప్రజలు వివిధ శ్వాసకోశ వ్యాధులతో అసువులు బాసా రని తేలింది.అడవులను నరకడంవల్ల ఓజోన్‌ పొర క్షీణించి సూర్యుడినుంచి అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమికి చేరుకోవడవల్ల మానవుల్లో వివిధ రకాల క్యాన్సర్లకు కారణ మవుతాయనే విషయం కూడా తెలిసిందే !
అడవులను విచక్షణారహితంగా నరుకుతూ..ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న సుమారు 70శాతం కాగితాన్ని వినియోగించు కుంటూ ..రానున్న ఇరవై యేండ్లలో 28వేల జీవజాతుల మనుగడనే ప్రశ్నార్ధకంచేస్తున్న అమెరికా,ఐరోపా వంటి అగ్రదేశాలే జరుగు తున్న విపత్కర పరిణామానికి జవాబుదారీతనం వహించాలి.పర్యావరణ ప్రేమికులు,అభివృద్ధి చెందుతున్న దేశాల అధినేతలు అగ్రరాజ్యాల మెడలు వంచి అడవితల్లి మెడలో పచ్చల తోర ణం అలంకరించే అవసరం ఎంతైనా ఉంది.
అడవులు ఆశ్చర్యకర అంశాలు
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 160కోట్ల మంది ప్రజలకు అడవే జీవనాధారం!భూమిపై ప్రతి నిమిషం..ఇరవై ఫుట్‌ బాల్‌ స్టేడియం విస్తీర్ణ మంతా అటవీ ప్రాంతం కనుమరుగవుతు న్నది.ప్రపంచ జనాభాలో 5శాతం కూడా లేని అమెరికన్లు, ముప్పై శాతంకి పైగా కాగితాన్ని వినియోగిస్తున్నారు.ప్రపంచ దేశాలతో పోలిస్తే కేవలం అమెరికా,ఐరోపా దేశాలే 12రెట్లు ఎక్కువ అడవిని పారిశ్రామికీకరణ పేరుతో నాశనం చేస్తున్నాయి.
చెట్టును కూల్చడమంటే హత్యతో సమానం. ఒక అడవిని నిర్మూలించడమంటే ఒక జాతి మీద జరిగిన సామూహిక హననం కాదా! చెట్టుకు అనుభూతులుంటాయి. చెట్టుకు వ్యక్తీకరణలుంటాయి. వైర్లెస్‌ సిగ్నలింగ్‌, మైక్రోవేవ్‌ ఆప్టిక్స్‌ శాస్త్రవేత్త సర్‌ జగదీశ్‌ చంద్రబోస్‌ వంటి మహా శాస్త్రవేత్త చెప్పిన అద్భుత సత్యమిది. చెట్టుకు అనుభూతులు ఉంటాయని ఆయన నిరూపించారు.లండన్‌ రాయల్‌ సొసైటీలో 1901లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో రుజువు చేశారు.జంతువులకు వలెనే మొక్కలకీ నాడీ వ్యవస్థ ఉంటుందని చెప్పారాయన.వాటికి హాని జరిగితే మౌనంగా రోదిస్తాయి కూడా.వాటిని నిర్మూలించుకోవడం అంటే మానవాళి తనను తాను నిర్మూలిం చుకోవడమే.
పచ్చదనం మీద కక్ష
అడవులు స్వచ్ఛమైన గాలినిస్తాయి. వాతావ రణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి.పర్యా వరణ సమతుల్యాన్ని కాపాడతాయి. ఉపాధిని స్తాయి. జీవజాలానికి ఆశ్రయమిస్తాయి. సకాలంలో వానలు కురిపిస్తాయి.భూగర్భ జలాల పరిరక్షణ,కర్బన ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పుల నియంత్రణలో అడవులు విశేషమైన పాత్ర పోషిస్తాయి.కానీ రానురాను ఆధునికత, అభివృద్ధి, ప్రజావసరాలు, పట్టణీ కరణ పేరుతో విచక్షణా రహితంగా వనాల నరికివేత సాగిపోతోంది. ఇది ఏఒక్క దేశా నికో,రాష్ట్రానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా కళ్లకు కడుతున్న దుష్పరిణామం. పచ్చదనం మీద మనిషి కక్ష కట్టినట్టే వ్యవహరి స్తున్నాడు.దీనివల్ల కలిగే అనర్థాలు విపరీతంగా ఉంటున్నాయి. వాయు కాలుష్యం పెరిగిపో తోంది. స్వచ్ఛమైన గాలి కరవవుతోంది. వన్య ప్రాణులు ఆహారం కోసం వనాలు వదలి పల్లెలు,పట్టణాలకు తరలుతున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి.ప్రజలను భయపెడు తున్నాయి. దాడులు చేస్తున్నాయి.రుతుపవ నాలు క్రమం తప్పుతున్నాయి.వర్షాలకు విఘాతం కలుగుతోంది. అయితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టితో యావత్‌ భూ మండలం తల్లడిల్లుతోంది.విశ్వవ్యాప్తంగా అడవుల క్షీణత మానవాళి మనుగడను ముప్పులోకి నెడుతోంది. చెట్లు తరిగేకొద్దీ కరవులు,తుపాన్లు,వరదలు, వాతావరణ మార్పులు చోటుచేసుకుంటు న్నాయి.ఇవి ప్రజలకు సవాళ్లను విసురుతు న్నాయి.
ఏటా నాశనమయ్యే అడవి ఎంతో తెలుసా?
ఐక్య రాజ్య సమితి అంచనా ప్రకారం ఏటా దాదాపు కోటీ ఇరవై లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం హరించుకుపోతోంది.వనాలక్షీణత, జలవనరులతో పాటు వాతావరణ మార్పులపై, జీవనోపాధులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపు తోంది.12నుంచి 20శాతం వరకు కర్బన ఉద్గారాలకు అడవుల క్షీణతే కారణం.ఈపరి స్థితిని అధిగమించేందుకు 2012 నవంబరులో ఐక్యరాజ్య సమితి నడుంబిగించింది.
కాపాడలేకపోతున్న ‘కంపా’
కానీ అడవుల రక్షణ కాగితాల మీదే విస్తరి స్తున్నది. అనేక దేశాలు అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తుండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. పాలకు లలో చిత్తశుద్ధి లేక వనాల నరికివేతకు అడ్డుకట్ట పడటం లేదు.కొత్తగా వనాల పెంప కం తూతూ మంత్రంగా సాగుతోంది. మొక్కలు నాటేందుకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తు న్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటు న్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఫలితాలు కనపడటం లేదన్నది చేదు నిజం.జలాశ యాలు,వివిధ ప్రాజెక్టులు,రహదారుల నిర్మాణం,విస్తరణ,ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఏటా పెద్దయెత్తున వనాలను వినియోగిస్తుండటంతో అవి కుచించుకు పోతున్నాయి.ఈపరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం‘కంపా’పథ కాన్ని తెరపైకి తీసుకువచ్చింది.కాంపన్సేటరీ అఫారెస్టేషన్‌ మేనేజ్‌మెంట్‌,ప్లానింగ్‌ అథారిటీ (ప్రత్యమ్నాయ వనీకరణ నిధి ప్రణాళిక సంఘం)కి సంక్షిప్త రూపమే ‘కంపా’.కోల్పో యిన అటవీ భూమి మేరకు ప్రత్యామ్నాయంగా అడవులను పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దే శం.దీనికింద 27రాష్ట్రాలకు కేంద్రం 2019లో రమారమి రూ.47వేలకోట్లు మంజూరు చేసింది.ఈ నిధులను ప్రత్యమ్నాయ అటవీ పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ,అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ తదితరాలకు వెచ్చించాల్సి ఉంటుంది. అటవీ భూములను పారిశ్రామిక అవసరాలకు బదలాయిస్తే,ఆ మే రకు అడవుల పెంపకం చేపట్టాలన్న ఆలోచన తో ‘కంపా’ పథకం రూపుదిద్దుకుంది.పథకం లక్ష్యాలు సమున్నతమే.కానీ ఆచరణ అంతంత మాత్రం.వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం,కాగితాలపై లెక్కలు, క్షేత్ర స్థాయిలో లోపాల కారణంగా అడవుల పెంప కం కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. వనాల విస్తీర్ణం తగ్గడానికి పోడు వ్యవసాయం కూడా కొంతవరకు కారణం.అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా అడవులను ధ్వంసం చేయడం,నదీగమనాలను మళ్లించడం,నీటి వనరులను విచ్చలవిడిగా వాడటం వైపరీ త్యాలకు దారితీస్తోంది.కొండలను,గుహలను తొలచి, భారీ సొరంగాలను తవ్వి విద్యుత్‌ ప్రాజెక్టులను నిర్మిస్తుండటంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతిని అనర్థాలు చోటుచేసు కుంటున్నాయి.ఇటీవలి ఉత్తరాఖండ్‌ వరదలకు ఇదే కారణం.అడవులు జీవ వైవిధ్యానికి మారుపేరుగా నిలుస్తాయి.ఇక్కడ అనేక రకాల జంతుజాలాలు మనుగడ సాగిస్తాయి. దాదాపు అరవై వేల చెట్ల జాతులు ఉన్నయాని అంచనా. ఈ వైవిధ్యమే మానవాళికి మేలు చేస్తుంది.– (గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌)

అనివార్యంగా వాతావరణ సంక్షోభం..!

సీజన్‌తో సంబంధం లేకుండా తుపాన్లు సంభవిస్తున్నాయి.ఎండాకాలం ముగిసినా..హీట్‌ వేవ్స్‌ వెంటాడుతూనే ఉంటున్నాయి.శీతాకాలంలో..చలితీవ్రత ఊహించనిస్థాయికి పెరిగి పోతుంది. వర్షా కాలంలోకుండపోత వానలతో వరదలు పోటెతున్నాయి.హిమాలయాల్లాంటి ప్రాంతాల్లో మంచు ఫలకాలు కరిగి సముద్రమట్టాలు పెరిగిపోతాయి.అంతకుముందెన్నడూ చూడని జలప్రళయం సంభ విస్తుంది.నానాటికీ భూతాపం పెరిగిపోయి..భూగోళం క్రమంగా అగ్నిగుండంగా మారి పోతుం దని,మానవాళి చాలాడేంజర్‌లో ఉందని శాస్త్రవేత్తలు హెచ్చిరిస్తున్నారు.
ఈ ఏడాదిజూన్‌28,జూలై15,19,ఆగస్టు3,29,సెప్టెంబర్‌5,13,23తేదీల్లో బంగా ళాఖాతంలో ఏర్పడిన వరస అల్పడీనాలు కొన్నేళ్ల రికార్డులను పరిశీలిస్తే..ఈఏడాది సెప్టెంబర్‌ నాటికే ఎనిమిదిసార్లు అల్పపీడనాలు తూర్పుతీరాన్ని భయపెట్టించాయి.వాతావరణం మార్పులు, భూతాపంవల్ల మహాసముద్రాలు వేడెక్కితున్నాయని,వర్షపాతంలో అసాధారణ పరిస్ధితులు సంభ విస్తున్నాయనడానికి సాక్షీభూతమే..ఈఏడాది నైరుతి సీజన్‌ అంటున్నారు శాస్త్రవేత్తలు. రుతు పవనాల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు సాధారణమే అయినా,వాటి సంఖ్య ఇంతలా పెరగడం, వెంటవెంటనే ఏర్పడటం,తీవ్రరూపం దాల్చి తుఫాన్లుగా మారడం,కుంభవృష్టి కురిపించ డాన్ని అసాధారణంగా విశ్లేషిస్తున్నారు.
లానినో,పసిఫిక్‌ పరిణామాలుతోడై..బంగాళాఖాతంలో అల్పపీడనాలు సంఖ్య,వాటి తీవ్రత పెరుగుతోంది.తదుపరి భారీవర్షాలు కురుస్తుండటంతో తీరప్రాంతంలోనే కాదు..మధ్య,ఉత్తర భారతం వరకూ అధికశాతం జనాభా ప్రభావితమవుతోంది.విజయవాడ,ఖమ్మంప్రాంతాల్లో ఇటీవల కుంభ వృష్టిక కూడా ఇక్కడి పరిస్థితులే కారణం.సహజంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఎక్కువే. ఈసారి వాటకి లానినో ప్రభావం తోడైంది.పశ్చిమ పసిఫిక్‌మహాసముద్రంలో ఏర్పడుతున్న తుఫాన్లు తూర్పు,ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం,కంబోడియా,ధాయ్‌లాండ్‌ మీదుగా పయనించి బలహీన పడుతున్నాయి.ఈసీజన్‌లో ఇప్పటికే ఎనిమిది అల్పపీడనాలు ఏర్పడ్డాయి.అందులో ఐదు వాయు గుండాలుగాబలపడి,తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
అల్పాపీడనాలు తీరం దాటినా అదే తీవ్రత సంభవిస్తోంది.భూతాపం కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు(ఎస్‌ఎస్‌టీ)పెరిగి,తరచూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి.అవి తీరానికి చేరువగా వచ్చే సరికి తీవ్రత పెరుగుతోంది.మరోవైపు వారా నికో అల్పపీడనం రావడంతో నేలలో తేమశాతం పెరుగుతోంది.ఈ కారణంగా అల్పపీడనం సముద్రతీరం దాటి,భూభాగంపైకి వచ్చినా బలహీన పడట్లేదు.ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాలు తేమ వాతావరణం కారణం గానే దేశ పశ్చిమ,వాయువ్య ప్రాంతాలైన గుజరాత్‌,రాజస్థాన్‌ వరకూ పయనించాయి.ఒడిశా, రaార్ఖండ్‌,తెలంగాణ,మధ్యప్రదేశ్‌,గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో భారీవర్షాలకు కారణమయ్యాయి.
గతంలో అండమాన్‌ దీవులవద్ద తుఫాన్లు ఏర్పడితే,పశ్చిమ దిశగా నెల్లూరు,వాయవ్యంగా కోల్‌కతా వైపు పయనించేవి.కొన్నాళ్లుగా వాటి గమనం మారుతోంది.తీరాలు కోతకు గురికావడంతో తుఫాన్‌ తీరాన్నితాకే ప్రాంతాలు మారిపోతున్నాయి.తీరంవైపు వెళ్తున్నట్లే కనిపించిన తుఫాన్లు, సముద్రంలోనే దిశ మార్చు కుంటున్నాయి.లేదా ఆకస్మాత్తుగా తీవ్రమవుతున్నాయి.భూతాపం,తీరం కోత కారణంగా భవిష్యత్తులో తుఫాన్ల ఉధ్దృతి మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
గ్లోబుల్‌ వార్మింగ్‌ పరిరక్షణకు అంతర్జాతీయంగా సహకరించుకోవాలి.ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన యాగి తుఫాను మయన్మార్‌ వద్ద బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిరది.దీని ప్రభావంతో ఉత్తర భారతదేశ:లో భారీ వర్షాలు కురిశాయి. ఇది అంచనాలకు అందనిది.ప్రస్తుతం పసిఫిక్‌,హిందూ,అట్లాంటిక్‌ మహాసముద్రాల్లోని పరిస్థితులను జపాన్‌,భారత్‌, అమెరికాలు పర్యవేక్షిస్తున్నాయి.ఈదేశాలు కలసి కట్టుగా వీటిపై పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

1 2