దసరా అందరూ కలిసే సరదా

ప్రకృతి ప్రసాదించే ప్రత్యేక కాలాల్లో మనుషుల సంతోషాలూ, సందళ్లూ పరవళ్లు తొక్కుతుం టాయి. ఆటపాటలూ, ఆనందాలూ ఆకాశాన్ని తాకుతాయి. ఇది పండగల ఆరంభ సంధర్భం. ఆ తరువాత పండగల్లోకి పురాణగాథలు వచ్చి చేరతాయి. కథోపకథల సంగతి ఎలా ఉన్నా.. పండుగ పరమార్థం పదిమందీ కలిసి ఆడటం, పాడటం, చెడును నిరసించి,మంచికి జేజేలు పలకటం. చెడు మీద మంచి గెలిచిన ప్రతిసారీ మనుషులంతా గెలిచినట్టే.అదే నిజమైన పండగ. దసరా సరిగ్గా అట్లాంటి పండగే. మంచి సాధించిన విజయానికి ప్రతీక. మన అమ్మల వీరత్వానికి ఒక మచ్చుతునక. ప్రకృతిని గౌరవించుకుంటూ మనుషులిచ్చే కానుక. ఈ చివరి వాక్యాలను స్కాన్‌ చేసి, మనసులో సేవ్‌ చేసుకోవాలి.ఈ చివరి వాక్యాలను టాటూగా హృదయం మీద వేసుకోవాలి. నిజానికి ఇది దసరాని మరింత గుర్తుచేసుకోవాల్సిన సందర్భం.సింధూ నాగరికత కాలం నుంచీ నేటి వరకూ మన చరిత్రను పరిచీ,తరచీ చూసుకోవాల్సిన సందర్భం.ఈ నేల మీద మాతృస్వామ్య వ్యవస్థ తాలూకా ఛాయలు లీలామాత్రంగా కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే మనం కాస్త ఫోకస్‌ చెయ్యాలి. మరి కాస్త జూమ్‌ చేయాలి. లేదంటే నిర్భయలూ, దిశలూ, గృహహింసా బాధితులు, చైల్డ్‌ అబ్యూజ్‌కు గురవుతున్న పిల్లలూ, ఆఫీస్‌లో చెవులు కట్టేసుకుని బతుకుతున్న ఉద్యోగినులు.. ఇలా వీళ్లే కనబడుతుంటారు. అదీ నేటి పరిస్థితి.ఇది చెడు మీద కత్తి తిప్పిన దుర్గమ్మను తలుచుకోవాల్సిన సమయం. పురుషాధిక్యపు చెట్టు మీద ఎక్కుపెట్టడానికి సమానత్వపు గొడ్డలిని సిద్ధం చేసుకోవాల్సిన సందర్భం. మన అమ్మలఅమ్మలఅమ్మల వీర గాథóలను నరన రానా ఇంకించుకోవాల్సిన సమయం. ఒకసారి దసరానీ, అందులో మిళితమై ఉన్న మన తెలుగు సంస్కృతినీ, మన ఇంటి అమ్మలని మనం గౌరవించుకునే విధానాన్నీ తలుచుకుందాం.
టూకీగా అదీ కథ..
ప్రకృతిని ఆరాధిస్తూ, మాతృమూర్తిని జగన్మా తగా కొలిచే పండగే దసరా. సహజంగా తల్లి తన బిడ్డల పట్ల అపరిమితమైన ప్రేమను కలిగి ఉంటుంది. తన బిడ్డలు మంచిని పంచాలనీ, చెడును అంతరించాలనీ, మనుషులందరి కోసం నిలబడాలనీ కోరుకుంటుంది. దీని కోసం తన జీవితాన్ని హాయిగా ఇచ్చేస్తుంది. కానీ కథ యూటర్న్‌ తీసుకుంటే ఊరుకోదు. ఆ బిడ్డలే చెడు వైపు నిలబడితే, అడ్డుకోవడానికి సర్వప్రయత్నాలూ చేస్తుంది. విఫలమైతే రౌద్ర మూర్తిగా మారి తానే బుద్ధి చెబుతుంది. టూకీగా ఈ తాత్వికతను చాటిచెప్పే పండుగే దసరా.
నవరాత్రులు..
సీమాంధ్రలో దసరా పండగను నవరాత్రులుగా చేసుకుంటారు. ఒక్కోరోజున ఒక్కోరకంగా దుర్గమ్మను అలంకరించుకుని మాతృమూర్తికి ప్రతిరూపంగా, చెడుపై అమ్మ సాధించిన విజయానికి ప్రతీకగా కొలుస్తారు. ప్రపంచీ కరణ ప్రభావానికి ముందు జీవం ఉన్న పండుగలను ప్రజలంతా మనసారా ఆస్వాదించే వాళ్లు.వేడుకలన్నీ కమర్షియల్‌ అయ్యాక ఆ మజా తగ్గిపోయింది. మనిషికీ, మనిషికీ మధ్య పోటీ ప్రపంచం దూరాన్ని పెంచింది. దాన్ని పండగలు కూడా దగ్గర చేయలేకపోతున్నాయి. ఇదంతా మనుషుల మీద పెట్టుబడి సాధించిన విజయం. మనుషులకూ, మమతలకూ మధ్య క్యాపిటలిష్టులు దూరం పెంచిన వైనం. కాలాన్ని కొంచెం వెనక్కి జరిపితే మనం కొన్ని ఆనంద సమయాలనూ, మరికొన్ని కళారూపాలనూ గుర్తుతెచ్చుకోవచ్చు.
విజయవాడలో కనకదుర్గ..
దసరా అనగానే విజయవాడ కచ్ఛితంగా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కాస్త తీరు మారింది కానీ,గత కాలపు ఉత్సవాల్లో కళలకు ప్రాధా న్యత ఉండేది. తొమ్మిది దశాబ్దాల క్రితమే ఇంద్రకీలాద్రి కొండ మీద భేతాళ వేషాలు వేయడం..ఆడటం ఒక సంస్కృతిగా మొదలైంది. అంతరించిపోతున్న సామాన్యుల కళారూపాల్లో ఇదీ ఒకటి. అత్యంత క్లిష్టమైన ఈ కళాప్రక్రియలో కాళికాదేవి వేషం వేసుకుని, ఆడటం కత్తి మీద సాము లాంటిదే. ఆ రూపా నికి అవసరమయ్యే చేతుల బరువు పాతిక కేజీలు ఉంటుంది. వాటిని వీపుకు తగిలిం చుకుని తలపై కిరీటం పెట్టుకుని నృత్యం చేస్తారు. ఆ కళాకారులు పలికించే హావ భావాలు ఇప్పటి తరానికి ఏ ఓటీటీ తెర మీదా కనిపించవు. వెండితెర మీద డబ్బింగ్‌ సినిమా కాంతారాకు కలక్షన్ల వర్షం కురిపించాం. అలాంటి కళారూపాలు మనకూ ఉన్నాయనీ ఇప్పటికీ వాటి ప్రదర్శనలు జరుగుతున్నాయని ఎవరికో కానీ తెలియకపోవడం విషాదం. తొంభై ఏళ్ల క్రితం బెజవాడలో ఈ బేతాళ వేషాలను బి. గురువులు, చంటీ మొదటగా వేశారు. ఇప్పటికీ వాళ్ల వారసులు ఆ వారస త్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇవే కాకుండా తోలుబొమ్మలాటతో మొదలుకుని బుర్రకథల వరకూ అనేక కళరూపాలకు ప్రదర్శనా వేదికలుగా ఒకప్పటి దసరా ఉత్సవాలు ఉండేవి.ఇప్పటికీ అరాకొరా వాటి ఛాయలు ఉన్నా ఆ స్థాయి ప్రభావం లేదు. ప్రభలు కట్టే సంస్క ృతి కూడా ఇక్కడ వైభవంగా సాగేది. ఎడ్ల బండ్లపై ఎంత ఎత్తుగా ప్రభను కడితే అంత గొప్పగా భావించేవాళ్లు. అందులో కాళికాదేవి వేషం కట్టి కూర్చునే మనిషి అచ్చంగా విగ్రహంలానే ఉండి ఆశ్చర్యపరి చేవారు. పీడిత ప్రజల నేత పుచ్చలపల్లి సుందరయ్య ఫోటోని పెట్టి ప్రభను కట్టిన చరిత్ర ఉంది. అత్యంత వైభవంగా సాగే ఈ సంస్క ృతి కూడా దాదాపు అటకెక్కేసింది.
తెలంగాణాలో బతుకమ్మ
%దసరానే కాదు. దసరా నవరాత్రుల్లో జరుపుకునే పండగల్లోనూ ఓ విశిష్టత ఉంది. ప్రకృతితో మమేకమయ్యే సజీవ సంబంధమేదో దాగుంది. మహిళలను గౌరవించుకునే పద్ధతి ఇమిడి ఉంది. తెలంగాణలో దేవీ నవరాత్రుల్లో భాగంగా జరుపుకునే బతుకమ్మ పండగ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బతుకమ్మ ‘పూల పండగ’, చెరువుల పండగ, మహిళల పండగ, పర్యావరణ పండగ. మరి కాస్త అర్థం చేసుకుని చెప్పాలంటే ప్రకృతి పండగ. మన అమ్మలకు, అక్కలకు, ప్రతి ఆడబిడ్డకూ కృతజ్ఞతలు తెలుపుకునే పండగ. ఇంకా లోతుగా వెళ్లి చూస్తే ఇది ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. జీవితాన్ని ఇచ్చిన ఆడబిడ్డలకు, అమ్మలకు మనం చెప్పే ధన్యవాదాల పండగ.
బతుకమ్మ పండగ సాధారణంగా భారతీయ కాలమానం ప్రకారం ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఈ వేడుకను తొమ్మిది రోజుల పాటు సెలబ్రేట్‌ చేసుకుంటారు. ‘బతుకు’ ‘అమ్మ’ అనే పదాలే బతుకమ్మగా మారాయి. ఇందులో భాగంగానే మహిళలనూ, ప్రకృతినీ పూజించు కుంటారు. సాధారణంగా భారతీయ పూజా విధానాల్లో విగ్రహారాధన ఉంది. అందులో భాగంగా పూజ కోసం పూలను ఉపయోగి స్తారు. కానీ బతుకమ్మ విషయంలో మాత్రం పూలనే దైవత్వానికి ప్రతినిధిగా గుర్తించి పండగ చేసుకుంటారు.
ఈ తొమ్మిది రోజుల వేడుకల్లో గొప్ప జీవన విలువల్ని నేర్పే పాఠాలూ ఉన్నాయి. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ,మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ,ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరోరోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ,తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో పండగ పూర్తవుతుంది. రోజుకో బతుకమ్మ చొప్పున చివరిరోజుకు చేరేసరికి ఒక రకమైన పరిపూర్ణత చేకూరుతుంది. చివరి రోజున సద్దుల బతుకమ్మతో దగ్గర్లోని చెరువుకి చేరతారు. అక్కడ ఆటపాటల మధ్యన బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. బతుకమ్మను పేర్చే క్రమంలోనూ మన మహిళల కళాత్మక నైపుణ్యం ఉట్టిపడుతూ ఉంటుంది.
బతుకమ్మ పాటల్లోనూ ఒకరకమైన స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి వాక్యంలోనూ ప్రకృతి పట్ల ప్రేమ,గౌరవం,ఆరాధనా కనిపిస్తూ ఉంటాయి. అవి సామాన్యుల జీవితాలకు దగ్గరగానూ, అందరూ కలిసి పాడుకునేందుకు వీలుగానూ ఉంటాయి.
అవన్నీ పల్లెల నుంచి పుట్టిన పాటలు..
శ్రామిక మహిళల నుంచి పుట్టిన పాటలు. ఎంపలీ చెట్టు కింద ఉయ్యాలో ఎంపలీ చెట్టు కింద ఉయ్యాలో ఎల రేని కింద ఉయ్యాలో ఎప్పుడూ నీ నోము ఉయ్యాలో శ్రీ గౌరి దేవి ఉయ్యాలో చిన తల్లి నోమింది ఉయ్యాలో సిన తోటా వనము ఉయ్యాలో పెద తల్లి నోమింది ఉయ్యాలో పెద్ద తోటా వనము ఉయ్యాలో నా తల్లి నోమింది ఉయ్యాలో నందన్న వనము ఉయ్యాలో నందన్న వనమైతె ఉయ్యాలో నాకేమి కలుగు ఉయ్యాలో పెట్టెతో బియ్యమే ఉయ్యాలో పేటంచు చీర ఉయ్యాలో గోనెతో బియ్యమే ఉయ్యాలో గోరంచు చీర ఉయ్యాలో మొంటెతో బియ్యమే ఉయ్యాలో మొగ్గాలంగీలు ఉయ్యాలో ఏమేమి పువ్వొప్పుదూ గౌరమ్మ ఏమేమి పువ్వొప్పుదూ గౌరమ్మ ఏమేమి కాయొప్పుదూ గౌరమ్మ గుమ్మాడి పువ్వొప్పుదూ గౌరమ్మ గుమ్మాడి కాయొప్పుదూ గౌరమ్మ గుమ్మాడి చెట్టు మీది యాట సిలుకాలాల పాట సిలుకాలాల కలికి సిలుకాలాల కందుమ్మ గుడ్డలు మమ్మ సిరి మేడలు రాను మూడడుగులు పోను మూడడుగులు సందప్పు జల్లులు సకినప్పు నీడలు నీడల్ల కనుగొంటినీ గౌరమ్మ
నీ నోము నే నోమితీ గౌరమ్మ
ఈ పండుగలో జమ్మిచెట్టుకి కూడా ప్రాధాన్యత ఉంది. జమ్మి కొండవాలుల్లో పెరిగే ఒక ముల్ల చెట్టు. దీంతో అనుసంధానమవడం కంటే ప్రకృతితో మమేకం అవ్వడం ఇంకేముంటుంది. జమ్మి చెట్టును పూజించుకోవడం కూడా ఈ పండుగలో ప్రధాన ఘట్టం.జమ్మి ఆకులను పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఈ విషయంలో కరీంనగర్‌ లాంటి ఉత్తర తెలంగాణా ప్రాంతాల్లో మరి కొంత విభిన్నమైన సంస్క ృతిని చూడొచ్చు.వయసు తేడాలను పరిగణనలోకి తీసుకోకుండా,ఇంట్లోని ప్రతి మహిళకూ జమ్మి ఆకును ఇచ్చి నమస్కరిస్తారు. అదీ కాక ఆడపిల్లలు తమ పుట్టింటికి కచ్ఛితంగా చేరే పండగ ఇది. బతుకమ్మకు పేర్చే పూలను చూసుకున్నంత అపురూపంగా, గౌరవంగా, మర్యాదగా వాళ్లని చూడమనే బతుకమ్మ చెప్పేది.
పిల్లల సందడి
అది ఏ పండగైనా కానివ్వండి.ముందుగా వెలిగిపోయేది పిల్లల మొహాలే.సెలవులకు వారం రోజులు ముందుగానే, పిల్లల్లో ఆ ఆనం దం కనిపిస్తూ ఉంటుంది. అమ్మమ్మల ఇళ్లకు, నానమ్మలకు ఇళ్లకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనే ఎదురుచూపులు ఉండేవి. స్కూల్‌ ఒత్తిళ్లకు కాస్త విరామమిచ్చి పల్లె వాతావరణపు మట్టిగాలినీ, ముందుతరాల ప్రేమలనీ గుండెల నిండా నింపుకునే అవకాశం ఉండేది.పండగ అంటే ఊరంతా కలిసి జరుపుకునేది.వీధుల్లో జరుపుకునేది.నవ్వుకుంటూ,తుళ్లుకుంటూ ఆలింగనాల మధ్య జరుపుకునేది.కానీ ఇప్పుడు తీరు మారిపోయింది. పిల్లలంతా అపార్ట్‌ మెంట్‌లో చిక్కుకుపోయారు. మన బతుకుల్లానే పండగ కూడా ఇరుకైపోయింది. ముందు తరం వరకూ అయినా కాస్తోకూస్తో అసలైన పండగ శోభను చూసి ఉన్నారు. బొమ్మల కొలువులు పెట్టుకుని, స్నేహితులతో ఆడిపాడి ఉన్నారు. ఇప్పుడంతా పబ్జీలు, ఫ్రీఫైర్‌ల కాలమొచ్చేసింది. బొమ్మల కొలువు కమ్యూనికేషన్‌ని పెంచితే, స్మార్ట్‌ఫోన్‌ ఆటలు కళ్లను డ్యామేజ్‌ చేస్తున్నాయి.
పిండి వంటలు
పండగ అంటే సంస్క ృతీ,సాంప్రదాయం,కళలు ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. వాటన్నింటితో పాటు పిండి వంటలకూ ప్రత్యేక స్థానం ఉంది. ఒక తమిళ సినిమాలో హీరో విజరు ’’కప్పు ముఖ్యం బిగిలు’’ అన్నట్టు పండుగకు ’’పిండి వంటలు’’ ముఖ్యం.పిల్లలకు సెలవులు ఇవ్వగానే, టౌన్‌లూ,సిటీలూ టిక్కెట్టేసుకుని సొంత ఊళ్లకు చేరిపోయేవాళ్లు. అందరూ కలిసి ఒకదగ్గర చేరి ఒక్కో ఇంటి పిండివంటలనూ చేసుకునేవాళ్లు. ఏడాది పాటు జీవితాల్లో జరిగిన కష్టాలకూ, నష్టాలకూ, సుఖాలకూ, దు:ఖాలకూ షేరింగ్‌ పాయింట్‌ అదే. ఇప్పుడు సోషల్‌ మీడియాలో స్టేటస్‌ పెడితే చూసే కాలం.మనుషులంతా సంతోషాలను తెర మీదా,బాధలను గుండె లోపలా దాచుకుంటున్న కాలం. పిండి వంటల సంగతి స్విగ్గీ,జొమోటో,స్వగృహా ఫుడ్స్‌ చూసుకుంటున్నాయి.ఆర్డర్‌ చేసాక, డెలివరీ బారు తెచ్చిచ్చే, కేజీ అరిసెలంత తీపిదనం కూడా లేని పండగను సెలబ్రేట్‌ చేసుకునే హడావుడిలోకి చేరిపోయాం.
దసరా మామూళ్లు
నిజానికి దసరా మామూళ్లు ఒక ఎమోషన్‌. ఒకరి సాయం లేకుండా ఎవరూ తమ బతుకుబండిని లాగలేరనేది వాస్తవం.అది ఇల్లు కావొచ్చు,ఆఫీస్‌ కావొచ్చు, పొలం కావొచ్చు మరేదైనా కావొచ్చు. హెల్పర్లు లేకపోతే ముందుకు నడవాల్సిన పని వెనక్కే నడుస్తుంది. వాళ్లని గౌరవించుకోకపోతే,ఒక మనిషి తనని తాను గౌరవించుకోనట్టే అవుతుంది. ఇలా పండగల సందర్భంలో తమ హెల్పర్లకు మూమూళ్లు ఇవ్వడం ఒక మనిషి తనకు తాను ఇచ్చుకునే మర్యాదే అవుతుంది. ఒకప్పుడు దసరా వస్తుందంటేనే పనివాళ్ల మొహాలన్నీ కళకళలాడుతుండేవి. ఇప్పటికీ ఈట్రెండ్‌ కొనసాగుతున్నా కొద్దిపాటి మార్పులొచ్చాయి. డిజిటల్‌ ఇండియా అట్టడుగు స్థాయి వర్కింగ్‌ క్లాస్‌ వరకూ ఇంకా పూర్తిగా చేరనేలేదు. మరో పక్క పైస్థాయి వర్కింగ్‌ క్లాస్‌ ఉద్యోగులు చెల్లిం పులన్నీ డిజిటల్‌ మయమైపోయాయి. ఇదే అవకాశం అనుకుని, మూమూళ్లకు ఎగనామం పెడుతున్న మహానుభావులూ పెరిగిపోయారు. తప్పదన్నట్టూ, వదిలించుకోవాలన్నట్టూ ఎంతో కొంత సమర్పించుకునేవాళ్లూ ఎక్కువైపోయారు. హృదయంతో మామూళ్లిచ్చే కాలం వెళ్లిపోయి చాలా కాలమే అయింది.
పలచనవుతోన్న కళ..
ఇప్పుడు ఏ పండగలోనైనా సాంప్రదాయకళల సందడి తగ్గింది. హడావిడి పెరిగింది.. ఆదరణ సన్నగిల్లింది. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న ఒంగోలు ‘కళారం’ ఆచారం ఇప్పటికీ కొనసాగుతున్నా ఆ శోభ తగ్గిపో యింది. తూతూ మంత్రంగా లాగించడమే తప్ప గౌరవమూ, ఆసక్తి సన్నగిల్లిపోతున్నాయి. మచిలీపట్నం కాళికానృత్యం పరిస్థితీ ఇంతే. అత్యంత కళాత్మకమైన ఆ నృత్యానికి అప్పటి ఆదరణలో పదోవంతు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఆకాశాన్ని తాకే వీరవాసం ఏనుగు సంబరాలు ఇప్పుడు పూర్తిగా నేల మీదే ఉన్నాయి. ఇక దసరా వేషాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు వీటికి ప్రత్యేక ఆకర్షణ ఉండేది. వేషం కట్టి ఇంటింటికీ తిరిగి తమ కళారూపాన్ని ప్రదర్శించే కళాకారుల కోసం మీ దగ్గర ఒక భూతద్దం ఉంటే తీసి వెతకండి. ఒకరో ఇద్దరో కనిపించొచ్చు. పోనీ మీ యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి చూడండి. అతి తక్కువ వ్యూవ్స్‌తో ఏదో ఒక మూలన కనిపించొచ్చు.ఇది మనం సమూలంగా దసరాను గుర్తుచేసుకోవాల్సిన సమయం.అసలైన దసరా అంటే ప్రకృతిని గౌరవించడం.అసలైన దసరా అంటే మహిళలను గౌరవించడం.అసలైన దసరా అంటే కళలను గౌరవించడం. అసలైన దసరా అంటే అదంతా అందరూ కలిసే ఒక సరదా.(ప్రజాశక్తి సౌజన్యంతో..) – (రావి నేహ)

కొత్త బొగ్గు తవ్వకాలు నిలిపివేయాలి

ఆసియన్‌ పీపుల్స్‌’మౌవ్‌మెంట్‌ ఆన్‌ డెబ్‌ట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఏపీఎండీడీ`Aూవీ ణణ) పిలపు మేరకు గ్లోబల్‌ వీన్‌ ఆఫ్‌ యాక్షన్‌ 10-20సెప్టెంబర్‌ వరకు ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు తవ్వకాలు నియంత్రించి, కొత్త చేపట్టబోయే తవ్వకాలను నిలిపి వేయా లని డిమాండ్‌ చేస్తూ ఏపీ అల్లూరి సీతారా మారాజు జిల్లా బొర్రా గుహలు,కటికి, అరకువ్యాలీ వంటి పర్యాటక ప్రాంతాల్లో గిరిజన యువకులతో కలసి ర్యాలీ నిర్వహిం చారు.బొగ్గు తవ్వకాలు ఆపాలి,భూగర్భలో ఉన్న ఇంధన వనరల వెలికితీత తగ్గించాలి, సోలార్‌ వినియోగం పెంచాలి,ప్రతిచోటా విండ్‌ పవర్‌ ప్లాంట్స్‌,మైక్రో హైడల్‌ పవర్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేయాడెబ్బై అయిదు సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత…మన దేశంలోని ఇతర ఏ రంగం కన్నా కూడా…వ్యవసాయ రంగం ఎక్కువ సంక్షోభంలో ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం ఈ పాతిక్ఱేళ్లలో (1995-2020) రైతులు, వ్యవసాయ కూలీలు నాలుగు లక్షల మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో గత ఎనిమిదేళ్లలో మోడీ పాలన లోనే ఒక లక్ష మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. దళితులు, ముస్లింలలో భూమిలేని కుటుం బాల సంఖ్య 60శాతం. ఆదివాసీలు సాధా రణంగా భూమి కలిగినవారై ఉంటారు. కానీ గత 30 ఏళ్లలో భూములు గుంజుకోవడం వల్ల భూమి లేని ఆదివాసీల సంఖ్య పది శాతం పెరిగింది. ఎన్‌ఎప ˜్‌హెచ్‌ఎస్‌ వివ రాల ప్రకారం దేశంలోని భూమిలో 20 శాతం భూమి 75 ఎకరాల పైబడి ఉన్న కుటుంబాల చేతిలోనే ఉంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం లెక్కల ప్రకారం చట్టంలో పేర్కొన్న దానికి విరుద్ధంగా 100 రోజుల బదులు వ్యవసాయ కార్మికులకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 49 రోజులే పని దొరికింది. జూన్‌ 2022లో గ్రామీణ ఉపాధి 80 లక్షల మందికి పోయిందని సీఎం ఐఈ లెక్క తేల్చింది. మొత్తం గ్రామీణ నిరు ద్యోగం రేటు ఎనిమిది శాతం పెరగటం ఆందోళనకరం. పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాల ప్రకారం 2018-19లో 21-59 ఏళ్ల వయసు వారిలో 10శాతం గ్రామీణ పురుషులు, 72 శాతం గ్రామీణ మహిళలు ఏ ఉపాధి లేకుండా ఉన్నారు. ఇది కోవిడ్‌ ముందు స్థితి, ఆతర్వాత పరిస్థితి ఇంకా దిగజారింది. ఆకలి వల్ల, పోషకాహార లేమి వల్ల లక్షల్లో చనిపోతున్న గిరిజన బిడ్డల సంగతి వర్ణనాతీతం. 2021లో ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 116 దేశాల్లోనూ 101వ స్థానానికి చేరింది. భారతదేశ వ్యవసాయ సంక్షోభానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్వాతంత్య్రానంతరం వరుస కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవలంభించిన వ్యవసాయ విధాన లక్ష్యం, అర్ధ ఫ్యూడల్‌ భూస్వాములను – గునపర్తి సైమన్‌

బంగారు భవితకు బాట

దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తోంది. యూత్‌కు ఉన్న బలం, అంకితభావం ప్రపంచంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. సమాజానికి ఉపయోగపడేలా తమ కార్యాచరణ ఉండేలా యోచిస్తుంది. అటువంటి యువతకు ప్రపంచీకరణ ఆధునిక కాలం ఎన్నో సవాళ్లు విసురుతోంది. అయినా పుంజుకుని ముందుకు వెళ్లేందుకే చూస్తోంది. ఉపాధి అవకాశాలు, సరైన నైపుణ్యాలు లేక వెనకబడుతున్నారే తప్ప, ప్రకృతి విపత్తులు, ఆపదల వచ్చినా ముందుకు వచ్చేది యువకులే. అందుకే వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అవరోధాలు దాటి, విజయాలెన్నో సాధిస్తారు.
దేశానికి నిజమైన సంపద బంగారు గనుల్లో, అద్దాల మేడల్లో,అందాల నగరాల్లో కాదు.. యువతలో ఉందని- అటువంటి యువశక్తిని సక్రమంగా వాడుకుంటే దేశం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుందనే స్వామి వివేకా నంద మాటలు నిత్యసత్యం.యుక్త వయ స్సులో ‘ఏదైనా సాధిస్తాం.ఎంతటి కష్టాన్నైనా ఛేదిస్తాం.మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి.అందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమిస్తాం’ అనేలా యువత ఉం టుంది. కొంగొత్త ఆలోచనలు పుట్టేది కూడా ఈ వయస్సులోనే. పిల్లల్ని పెంచేది తల్లిదం డ్రులే అయినా వారికి విద్యాబుద్ధులు నేర్పి, మంచి మార్గంలో నడిచేలా చేసేది ఉపాధ్యా యులు. విజ్ఞానంతో బయటకు వచ్చిన యువతకు నైపుణ్యాలు నేర్పించి-వారిని దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా చేసుకునే బాధ్యత మాత్రం ఆయా ప్రభుత్వాలదే.
నిధులు లేక
ఒకప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్ర మాలను విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన నెహ్రూ యువజన సంఘాలు క్రమంగా ఉనికిని కోల్పోతున్నాయి. నిరక్షరా స్యత నిర్మూలన, సామాజిక చైతన్య కార్యక్ర మాల్లో పాల్గొనే యువతకు ఆదరణ కరువైంది. గతంలో గ్రామాల్లో వివిధ రకాలశిక్షణ, వ్యక్తిత్వ వికాసం నింపే కార్యక్రమాలు నిర్వహించే వారు. కానీ ఇప్పుడు అటువంటి చర్యలు కనిపించడం లేదు. దాంతో యువత ఉపాధి హామీ,వ్యవసాయ పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. పాలకులు సరైన దిశానిర్దేశం చేయకపోవడంతో యువతలో నిర్లిప్తత చోటు చేసుకుంటుంది.ఇది భవిష్యత్తుకే ప్రమాదం. అందుకే కొత్త జిల్లాల్లో యువజన సంఘాల ఏర్పాటు చేసి-ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి.సామాజిక దృక్పథం పెంపొందించేందుకు వారిలో చైతన్యం కల్పించి-విద్య,ఉద్యోగ సాధనలో నైపుణ్య వికాసం నింపేలా శిక్షణ ఇవ్వాలి. మట్టిలో మాణిక్యాలు ఉన్నట్లే గ్రామాల్లో ప్రోత్సాహం లేక ప్రాథమిక స్థాయిలో నిలిచిపోతున్న క్రీడామణులు ఉంటారు. వారిని గుర్తించి ప్రోత్సహించాలి.వారికి కావలసిన ఆట వస్తువులు సరఫరా చేయాలి.సమాజావృద్ధిని కాంక్షించేలా యువజన సంఘాలను బలోపేతం చేయాలి.
రాజకీయాల్లోనూ..
యువతీ, యువకులు స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచి తమ గొంతును వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణాకు చెందిన శిరీష-డిగ్రీ చదివినా ఉద్యోగం – (పద్మావతి)

సమ్మిళిత ఆర్ధిక వృద్ధికి ఆలంబన

సమ్మిళిత వృద్ధి సాధించడానికి ప్రధానంగా వ్యవసాయం తీరు తెన్నులు, విధానాలు, పేదరికం తగ్గించడం, ఆహారపు హక్కు, ఉద్యోగిత కల్పించడం ద్వారా సామూహిక భద్రత మానవాభివృద్ధి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం వంటి విషయాల్లో వృద్ధిని సాధించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది. – (ఎం. సునీల్‌కుమార్‌)
ఇండియాలో బ్యాంకింగ్‌ సేవలు ఇంతగా విస్తరించడానికి 47ఏళ్లు పట్టేది.జన్‌ధన్‌వల్ల ఆ ప్రగతి అత్యంత వేగంగా వాస్తవ రూపం దాల్చింది.అని బ్యాంక్‌ ఆప్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ పరిశోధకుడు కితాబునిచ్చారు. దానికి గర్వించడంతోపాటు సరిదిద్దుకోవాల్సిన వ్యవస్థాగత లోపాలూ కొన్ని ఉన్నాయి. జనధన్‌ తదనంతరం అంతవరకూ వెళ్లని ఊళ్లలోకి బ్యాంకులు అడుగు పెట్టాయి.2013లో దేశవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకు శాఖలు దాదాపు1.06లక్షలు,2023కు అవి 46శాతం అధికమయ్యాయి.ఏటీఎంల సంఖ్య సైతం 30శాతం మేరకు పెరిగింది.కానీ, లావా దేవీలేమీ జరగని బ్యాంక్‌ ఖాతాలు ఎక్కువగా ఉండటమే విస్మయకరం!దేశంలో మొత్తం ఖాతాల్లో అటువంటివి 35శాతం వరకు ఉంటాయని ప్రపంచబ్యాంకు క్రోడికరించిన గ్లోబ్‌ ఫిన్‌డెక్స్‌ డేటా బేస్‌ వెల్లడిర చింది.అభివృద్ధి చెందుతున్న దేశాల సగటుతో పోలిస్తే ఇది ఏడు రెట్టు ఎక్కువ!జన్‌ధన్‌ ఖాతాల్లోనూ నిష్క్రియమైనవి 20శాతం దాకా ఉంటాయని అంచనా.అందుకు కారణాలేంటో అన్వేషించడంతోపాటు పీఎంజేడీవై ప్రధాన లక్ష్యమై న ఆర్ధికఅక్షరాస్తను పెంపొందించడం మరో సవాలు. ఆర్బీఐ నివేదిక ప్రకారం,గడిచిన పదేళ్లలో దేశీయ బ్యాంకుల్లో జరిగిన మోసాల విలువ రూ. 5.3లక్షలకోట్లు.సైబర్‌ నేరాల ఉధృతికి ప్రభుత్వాలు అడ్డు కట్టవేస్తేనే`ప్రజల కష్టార్జితాలకు రక్షణ లభిస్తుం ది.డిజిటల్‌ ఆర్ధికవ్యవస్థ పురోగతీ శ్రీఘ్ర తరమ వుతుంది.
సమ్మిళిత వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 11,12 ప్రణాళికల్లో సమ్మిళిత, సత్వర వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది.11వ పంచవర్ష ప్రణా ళిక సమ్మిళిత వృద్ధి సాధించడానికి మొత్తం 27 ద్రవ్య విధాన లక్ష్యాలను 13 రాష్ట్రాలకు నిర్దేశిం చింది.దీనిలో భాగంగా పేదరికంతగ్గించి,ఉపాధి కల్పనను పెంచి సత్వర వృద్ధి సాధించడం, విద్య, ఆరోగ్యం వంటి అవసరమైన సేవలను అందిం చడం,విద్యా నైపుణ్యాలను పెంచడం ద్వారా సాధి కారతను సాధించడం,ద్వారా ఉపాధిని విస్తరిం చడం,పర్యావరణ కొనసాగింపు సాధించడం, లింగ వివక్షతను తగ్గించడం, పాలనలో మెరుగు దలను తీసుకురావడం వంటి అంశాల్లో దృష్టిని సారించింది.పై వాటిని సాధించడానికి వ్యవసాయ రంగంలో4శాతం వృద్ధిని, పారిక్షిశామిక రంగంలో 10-11శాతం వృద్ధిని,సేవారంగంలో 9-11 శాతం వృద్ధిని సాధించాలని వాటి ద్వారా ప్రణాళి కలో వార్షిక వృద్ధిరేటు లక్ష్యమైన 9శాతం వృద్ధిని సాధించాలని నిర్ణయించారు.సమాచార సాంకేతిక రంగంలో విశిష్టమైన అభివృద్ధిని సాధించాం. సాఫ్ట్‌ వేర్‌ పరిక్షిశమ బాగా వృద్ధి చెందింది. వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి ‘ఇంటిక్షిగేటెడ్‌ యాక్షన్‌ప్లాన్‌ను దేశం లోని 60 జిల్లాల్లో ప్రవేశపెట్టారు.
11వ ప్రణాళికలో వివిధ పథకాల్లో భాగంగా అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే పేదరి కపు రేఖకు దిగువన ఉన్నవారికి సంబంధించి ‘రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన’ పథకాన్ని 2007 లో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని కుటుంబాలకు బీమా రక్షణ కల్పించడానికి ‘ఆమ్‌ ఆద్మీ బీమా యోజన’ పథకాన్ని ప్రారం భించారు. దీనికి చెల్లించే ప్రీమియం రూ.200. దీని నిర్వహణ బాధ్యతను ఎల్‌ఐసీకి అప్పగించారు. దీనికి అవసరమయ్యే నిధులను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరిస్తాయి. వ్యభిచార వృత్తిలో ఉన్నవారికి పునరావాసం కల్పిం చడానికిగాను ‘ఉజ్వల’పథకాన్ని ప్రారంభిం చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలను ఆదుకోవ డానికి దేశంలో వేతన ఉపాధి పథకాన్ని అమలు చేస్తున్నారు. పైవాటితో పాటుగా ప్రభుత్వం కొన్ని ఫ్లాగ్‌షిప్‌ పథకాలను అమలు చేసింది.దీనిలో భాగంగా ‘రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన’ జాతీయ హార్టికల్చర్‌ మిషన్‌,సత్వర నీటి పారుదల ప్రయో జన పథకం గ్రామీణ తాగునీటి సదుపాయం, రాజీవ్‌గాంధీ విద్యుదీకరణ, ఇందిరా ఆవాస్‌ యో జన,సర్వశిక్షా అభియాన్‌,మధ్యాహ్నభోజన పథకం, నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌, సమీకృత శిశు అభివృద్ధి సేవలు, ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వృద్ధిని సాధించడంతోపాటు దాన్ని సమాజంలో అన్ని తరగతుల వారికి, అన్ని వర్గాల వారికి అందించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్య మవుతుంది. సమ్మిళిత వృద్ధి సాధించడానికి ప్రధా నంగా వ్యవసాయం తీరు తెన్నులు, విధానాలు, పేదరికం తగ్గించడం, ఆహారపు హక్కు, ఉద్యోగిత కల్పించడం ద్వారా సామూహిక భద్రత మానవా భివృద్ధి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం వంటి విషయాల్లో వృద్ధిని సాధించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది.
భారత ప్రభుత్వం 12వ ప్రణాళికలో ఆర్థిక వృద్ధిని 9 శాతానికి పెంచాలని పేర్కొన్నది. వ్యవసాయరంగంలో 4శాతంవృద్ధిని,పారిక్షి శామిక రంగంలో 9.5శాతం వృద్ధిని,సేవారంగంలో 10 శాతం వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించింది.మొత్తం మీద ప్రణాళికలో వృద్ధిని 9-9.5శాతం వరకు సాధిం చాలని నిర్ణయించింది.
హరిత ఆర్థికం సమ్మిళితమేనా?
హరిత ఆర్థిక వ్యవస్థలుగా శీఘ్రగతిన పరివర్తన చెందేందుకు ప్రపంచ దేశాలు ఆరాట పడుతున్నాయి. ఇంధన వ్యవస్థలలో బొగ్గు, గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా పునరుద్ధరణీయ పవన, సౌరశక్తి వనరులనుబీ రవాణా రంగంలో పెట్రోలియం ఉత్పత్తులకు బదులుగా విద్యుత్‌ను, పరిశ్రమలలో శిలాజ ఇంధనాలకు మారుగా హైడ్రోజన్‌ను ఉపయోగించుకునే దిశగా ప్రపంచ దేశాలన్నీ చురు గ్గా చర్యలు చేపడుతున్నాయి.అడ్డూ అదుపు లేకుం డా భూతాపం తీవ్రమవుతుండడం, తత్పర్య వసానంగా వాతావరణ వైపరీత్యాలకు కారణమ వుతున్న కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు, ఇంధన వ్యవస్థలు,రవాణా రంగం,వస్తూత్పత్తి కార్య కలాపాలలో చోటు చేసుకుంటున్న మౌలిక మార్పు లు దోహదం చేయగలవని ప్రభుత్వాలు ఆశిస్తు న్నాయి. హరిత ఆర్థికవ్యవస్థ దిశగా ప్రపంచ దేశాలు మరింత వేగంగా,సమస్యను పరిష్కరిం చేందుకు అవసరమైన బృహత్‌ చర్యలతో పురోగ మించవలసి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే కొత్త హరిత ప్రపంచానికి మనం తీసుకువెళ్లే (వనరుల వినియోగ,ఉత్పాదక కార్యక లాపాల నిర్వహణ) విధానాలు,పద్ధతులు ఎలా ఉండనున్నాయి? అవి హరిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యాల పరిపూర్తికి తోడ్పడుతాయా? సహజ వనరులను ఉపయోగించుకోవడంలో మనం అనుసరిస్తున్న పాత పద్ధతులలో స్వతస్సిద్ధంగా పలు సమస్యలు ఉన్నాయి. ఇవి సామాజిక, పర్యావరణ వ్యవస్థలను ప్రతికూలంగా,మరింత కచ్చితంగా చెప్పాలంటే విధ్వంసకరంగా ప్రభావితం చేస్తున్నందునే హరిత ఆర్థిక కార్యకలాపాలలో సైతం మనం పాటించే పద్ధతుల గురించి ప్రశ్నించడం అనివార్య మ యింది. ఖనిజాల వెలికితీతనే తీసుకోండి% బొగ్గు, ఇనుము,అల్యూమినియం మొదలైన ఖనిజాలు మన ఆర్థికవ్యవస్థలకు మౌలిక అవసరాలు. అయితే భూగర్భం నుంచి వాటి వెలికితీత పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోంది.భారత్‌లో ఈముడి పదార్థాలు అడవుల కింద,వన్యప్రాణుల ఆవా స ప్రదేశాలలోను,గిరిజన ప్రాంతాలలో ఉన్నాయి. పర్యావరణ భద్రతకు, ప్రజా శ్రేయస్సుకు హాని వాటిల్లకుండా ఆ సహజ సంపదను ఉపయోగిం చుకోవడం ఎలా? ఇదొక విపత్కరమైన పరిస్థితి. వనరుల విపత్తు అనేది సంపద్వంత భూములు, పేద ప్రజలకు సంబంధించిన సమస్య. మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన ఖనిజాలను సమ కూర్చుకునేందుకు మనం అడవులను నరికివే స్తున్నాం.స్థానిక జనసముదాయాలను నిర్వాసితు లను చేస్తున్నాము.ఖనిజాల వెలికితీత అనేది మనం అనుసరిస్తున్న ఆర్థికాభివృద్ధి నమూనాలో చాలా కీలకమైన కార్యకలాపం. దానివల్ల ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం సమకూరుతున్నది.

కోయ భాష అస్తిత్వాన్ని బతికిద్దాం

పిల్లలే కవులుగానూ,కథకులు గానూ రచయితలుగామారి తమకోసం తాము కవి తలు,కథలు,పాటలు రాసుకునే అరుదైన సంఘటనతో మొదటి రోజు బాల సాహిత్య కార్యక్రమం అల్లూరి సీతారామారాజు జిల్లా చింతూరు మండలం రామన్నపాలెంలో అక్టోబర్‌ 5న కార్యశాల ప్రారంభమైంది. కోయత్తోర్‌ బాట మరియు సమత సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదురోజుల కోయబాష బాల సాహిత్య కార్యశాలఅక్టోబర్‌ 5నుంచి 9వ తేదీవరకు కొనసాగింది.6 నుండి 14 సంవ త్సరాల వయస్సు గల చిన్న పిల్లలు తాము రాసిన కవితలు, పాటలు, కథలు రాసి వినిపించిన తీరు అందరిని ఆకట్టు కుంది.’’ పిల్లల కు సరిjైున అవకాశం, ప్రోత్సాహం ఇస్తే పెద్దల తో సమానం గల కవితలు, కథలు ఎన్నెన్నో రాస్తారని‘‘కార్యశాల సమన్వయకర్తలు జీ.యాదయ్య,కె.పాండు, డి.భీమమ్మ,జె.మల్లయ్య అన్నారు.పిల్లలను ఐదుగురు గ్రూప్‌లుగా విభజించి వాటికి బంతి, మల్‌ పిట్ట,ఎడజు డువ్వు,గులాబీ అని పేర్లు పెట్టి,అందరికీ చిన్న చిన్న కథల,పాటల పుస్తకాలు ఇచ్చి,వీటి మాదిరి మీరు కూడా కవితలు,కథలురాసి,చదివి వినిపించాలని చెప్పి రాయించి‘‘కార్యశాల నిర్వహించిన తీరు వివరించారు.ఇందులో తొలి కోయ బాల సాహిత్య రచయిత్రి భీమమ్మ తాను రాసిన కొన్ని పిల్లల పాటలు చదివి వినిపించి,పిల్లల లను ప్రోత్సాహం నింపింది.కోయ బాష కార్య కార్యకర్తలు తెల్లంకృష్ణ,మోసం సత్యనారా యణలు తమ నాట్య గీతాలలో పిల్లలను పాల్గొనేలా చేసిన తీరు పిల్లలలో కొత్త ఉత్సా హం నింపింది.ఎంతో దూరం నుండి కొయ తురు బాట పూర్వ విద్యార్థులు విచ్చేసి ఈ కార్యశాలలో పాల్గొనడం ప్రశంస నీయమని కార్యశాల నిర్వాహాకులు తెలియ జేశారు.ఈ కార్యశాలలో రామన్నపాలెం పిల్లలూ,కుంజ వారి గూడెం పిల్లలూ ఉత్సాహంగా పాల్గొ న్నారు.కోయత్తోర్‌ బాట పూర్వ ఉపాధ్యా యులూ,బాల సాహిత్య అభిమానులూ, మొదటితరం రచయిత శ్రీపూనెం బాబూరావు ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలు కనుమరుగవుతూ వస్తున్నాయన్నారు.ఆదివాసీ భాషలు అంతరించే దశకు చేసుకుంటున్నాయి. గత ఇరవైఏళ్లుగా కోయ భాషలో బాల సాహిత్యం అభివృద్ధికి కోయత్తర్‌ బాట విశేష కృషి చేస్తుందన్నారు.ఇందులో భాగంగానే పూర్వ ప్రాధమిక సాహిత్య సృజనపై ఐదురోజుల కార్యక్రమం గిరిజనబిడ్డలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయ పడ్డారు.భాష మనుగడను పరిరక్షించడానికి స్వచ్ఛంధ సంస్ధలు చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. – (జీ.యాదయ్య)

బ్రతిక ఉన్నా లేనట్లే..

‘‘ ప్రపంచం ముందుకు వెళ్తోందని, సాంకేతి కతని అందిపుచ్చుకుంటున్నా మని మనమం దరం అనుకుంటాం.కానీ ఇప్పటికీ ఆధార్‌ అంటే ఏంటో తెలియని గిరిజనులు, ఆధార్‌ కార్డ్‌ ప్రయోజనం పొందలేనివారు, తద్వారా పభుత్వ సంక్షేమ పథకాలకు ఆమడ దూరంలో ఉన్నవారు ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో అక్కడక్కడ కనిపిస్తున్నారు.అనకాపల్లి, అల్లూరి సీతారామారాజు జిల్లాలో ఆధార్‌ కార్డు,రేషన్‌కార్డు,ఆరోగ్యశ్రీకార్డు లేని గిరిజన కుటుంబాలు అనేకం ఉన్నాయి. చాలా బడిఈడు పిల్లలు ఆధార్‌కార్డులు లేక చదువులకు దూరమవుతున్నారు.’’(గునపర్తి సైమన్‌)

అందరికీ ఆధార్‌ ఓవరం.ఆధార్‌ కార్డ్‌తో అన్ని పథకాలు అందిపుచ్చుకోవచ్చు. కానీగిరిజనులకు మాత్రం అది ఇంకా ఓశాపంగా మారింది.ఉమ్మడి విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో నివశించే గిరిజనులు కూడా ఆధార్‌ సౌకర్యానికి దూరంగా ఉంటు న్నారు. చిన్నపిల్లల్ని స్కూల్‌లో వేయాలంటే ఆధార్‌ తప్పనిసరి,రేషన్‌ కార్డ్‌ కావాలంటే ఆధార్‌ ఉండాలి,అనుకోని ప్రమాదం జరిగితే ఆరోగ్యశ్రీ కింద చికిత్సకి కూడా ఆధారే కీలకం.కానీ ఆధార్‌ గురించి, పథకాల గురించి సరైన అవగాహన లేక గిరిజనులు వీటన్నిటికీ దూరమైపోయారు. వీరితోపాటు సంచార జాతుల్లో సగటున 50శాతం మంది గిరిజనులకు ఆధార్‌ కార్డ్‌ అంటే ఏంటే తెలియదంటే అతిశయోక్తి కాదు.ఆధార్‌ ప్రత్యేక శిబిరాలు ఎన్ని ఏర్పాటు చేసినా,ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆధార్‌ కార్డు పొందలేని స్థితిలో చాలామంది గిరిజనులు ఉన్నారు.దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయితీ బల్లిపురం అనే ఓగిరిజన గ్రామం.అక్కడ కొండదొర,నూకదొర,భగత్‌, మన్నెదొర తెగలకు చెందిన సుమారు 39మంది కుటుంబాలున్నాయి.మొత్తం జనాభా120మంది.ఈ గ్రామంలో అధికశాతం వలస వచ్చిన గిరిజన జనాభా అధికం.దీంతో సుమారు 25మందికి పైగా ఆధార్‌ కార్డులు, రేషన్‌కార్డులు,ఓటర్‌ ఐడీ కార్డులు లేవు.ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వీరంతా ఓటు హక్కు లేక ఓటును వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిరది.అల్లూరి జిల్లా బొర్రా,కొయ్యూరు,అనంతగిరి మండ లాల్లోని మారుమూల పంచాయితీల నుంచి దశాబ్దాల క్రితం మైదాన గిరిజన గ్రామా లకు వలస వచ్చి కూలీ పనులకు వెళ్లే గిరిజన కుటుంబాలకు ఆధార్‌కార్డులుగానీ, రేషన్‌కార్డులుగానీ లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఆఖరికి వారికి పుట్టిన బడిఈడు పిల్లలు చదువుకు సైతం దూరమవుతున్నారు.అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయితీ పరిధిలోగల బల్లిపురం తదితర గిరిజన గ్రామాలు మైదాన ప్రాంతానికి ఆనుకొని ఉన్నాయి.అల్లూరి జిల్లా నుంచి వలస వచ్చిన అనేక మంది గిరిజనులకు నేటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచు కోలేదు.కనీసం అవ్వతాతలకు, వితంతువు లకు,దివ్యాంగులకు సామాజిక పింఛన్‌ అందని వైనం నెలకొంది.అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట గ్రామానికి చెందిన కర్రిచిలకమ్మకు సామాజిక ఫించన్‌ అందక వృద్దాప్యంతో కొట్టిమిట్టులాడుతున్నారు. కొయ్యూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కుర్రా రామచంద్రర్‌కు ఆధారకార్డు లేదు.జీకేవీధి మండలం దమ్మయన్న పల్లి గ్రామపంచాయితీ సింగనపల్లి గ్రామానికి చెందిన వీర్రాజి (11)ఆధార్‌కార్డు లేక చదువుకు దూరంగా ఉన్నారు. పంటపొలాలు,బొగ్గు,ఇటుకల బట్టీల వద్ద ఏడాదిలో తొమ్మిది నెలలు జీవనం సాగించే ఎస్టీలకు ఎలాంటి ధ్రృపత్రాలు లేకపోవడంతో ఆధార్‌ నమోదుకు అర్హత కోల్పోతున్నారు. ఆర్డీవో కార్యాలయం జారీ చేసిన జనన ధ్రువపత్రం కావాలని ఆధార్‌ కేంద్రాల సిబ్బంది చెబుతుండడంతో నిరుత్సాహంతో వెనుదిరుగు తున్నారు.ఇళ్లు,పొలాల్లో పురుడు పోసుకున్న చిన్నారుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయని కారణంగా పంచాయితీ కార్యాల యాల్లో జనన ధ్రువీకరణ పత్రాలు అందడం లేదు.దీంతో వారికి ఆధార్‌కార్డులు జారీ చేయడం లేదు.ఆధార్‌ కార్డు లేని కారణంగా వీరికి రేషను,ఓటరుకార్డులు లేవు.పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేపట్టిన ఏ సంక్షేమ పథకాలు వీరిదరి చేరడం లేదు. వృద్దులు,వితంతువులు,దివ్యాంగులు ఉన్నా పింఛను ఇతర సౌకర్యాలు అందడం లేదు. బడిలో పేరు నమోదు చేయాలన్నా ఆధార్‌ తప్పని సరి కావడంతో పిల్లలు చేరలేని పరిస్థితి నెలకొంది.ఎస్టీ కార్పొరేషన్‌ అంచనాల ప్రకారం జిల్లాలో అయిదువేల మందికిపైగా ఆధార్‌ కార్డు లేని గిరిజనులు ఉన్నాట్లు అంచనా.గతంలో ఐటీడీఏ ద్వారా గిరిజనులకు నమోదు కార్యక్రమం జరిగేది.ప్రస్తుతం ఆవిధానం నిలిపివేయడంతో ఇటీవల జన్మించిన పిల్లలు,ఇంకా ఆధార్‌ తీసుకోని వారు అవస్థలు పడుతున్నారు.అంగన్‌వాడీలో పోషణ,ఉచిత బియ్యం,ప్రబుత్వ ప్రయోజనాలు కోల్పోతున్నారు.అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో సుమారు 105మంది ఆధార్‌ లేనివారినిఅధికారులు గుర్తించారు. వీరిలో బల్లిపురంలో సుమారు 70మంది పాఠశాల విద్యార్థులు ఉండగా,50మందికిపైగా చిన్నారులు ఉన్నారు.వలస పనులకు వెళ్లేన గిరిజనులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతే..కనీసం ప్రభుత్వ బీమా సొమ్ము కూడా వారికి రాదు.ఎందుకంటే వారికి ఆధార్‌ లేదు.దీంతో ఆరోగ్యశ్రీకార్డు,రేషన్‌ కార్డులు కూడా లేని పరిస్ధితి నెలకొంది. చాలామంది గిరిజనులు అసంఘటిత రంగంలో కార్మికు లుగా పనిచేస్తున్నారు.వీరంతా ఏదైనా ప్రమాదానికి గురైనా ఇచ్చే బీమాకు వారు అనర్హులు మారుతున్నారు.ఎలాంటి పత్రాలు లేకపోయినా,వారివద్ద వివరాలు సరిగా ఉంటే.. అక్కడికక్కడే ఆధార్‌ నమోదు చేసుకుంటారు.
పింఛన్‌ లేదు..
మాది బల్లిపురం గిరిజన గ్రామం. పదిహేనేళ్లక్రితం బొర్రా పంచాయితీ నుంచి బల్లిపురం వలస వచ్చేశాం. ఇప్పుడు నాకు 65సంత్స రాలు.ఆధార్‌కార్డు గానీ,రేషన్‌కార్డు కానీ లేదు. భర్త చనిపోయి పదేళ్లువుతుంది. అప్పటి నుంచి ఆధార్‌కార్డు లేక పింఛన్‌ ఇవ్వలేదు.ఆరోగ్యశ్రీ కార్డు లేక ముగ్గురు కొడుకులను అనారోగ్యం తో బాధపడుతూ మృత్యువాత పడ్డారు.వారికి పుట్టిన ఒక మగబడ్డ (15వయస్సు)ఆధార్‌కార్డు లేక చదవించలేకపోయాను.
తమ గ్రామంలో ఆధార్‌కార్డులు,రేషన్‌కార్డులు, ఓటరు కార్డులు చాలామందికి లేవని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. సుమారు ఊరులో సగానికిపైగా కుటుం బాలకు ఆధార్‌కార్డులు లేవు.దీనివల్ల చాలా మంది బడిఈడు పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. పంచాయితీ ఎన్నికల్లో కూడా అధికారులకు తమ గోడును చెప్పుకున్నా పట్టించుకునే నాధుడు కరవయ్యారు.`ఆగారి బంగారుబాబు,బల్లిపురం గ్రామ పంచాయితీ సభ్యుడు

సంయమనం అవశ్యం

తిరుపతి లడ్డు కల్తీ విషయం చినికి చినికి గాలివానగా మారింది. ఈ కల్తీపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్‌’ వేసింది. విచారణ జరిపించాలని దేశ ప్రధానికి జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరం రాశారు. ముఖ్యమంత్రి ఆరోపణలపై బిజెపి మాజీ ఎంపీ సుబ్రమ ణ్యస్వామి, టిటిడి మాజీ ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి లతో సహా అనేకమంది విడివిడిగా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈలోపు పాలక, ప్రతిపక్ష పార్టీల పరస్పర విమర్శలు, ప్రమాణాల సవాళ్ళు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష, వైసిపి కేంద్ర కార్యాల యంపై బిజెపి అనుబంధ యువజన సంఘం కార్యకర్తల దాడి ఒకదాని తర్వాత ఒకటి శరవేగంగా జరిగిపోతు న్నాయి. తాము ఎంతో పవిత్రంగా భావించి, పూజించి, భుజించిన స్వామి వారి లడ్డు అపవిత్రమైనదా! జంతు వుల కొవ్వు కలిపిన లడ్డు తిన్నామా! అంటూ దేశవ్యాపి తంగా వున్న కోట్లాది తిరుమల భక్తులు తీవ్ర ఆందో ళనకు, ఆవేదనకు గురవుతున్నారు. లడ్డులో కల్తీ జరిగి వుంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దోషులపై కేసు లు పెట్టాలి, కఠిన శిక్షలు విధించాలి. అందుకు చట్టం తన పని తాను చేయాలి.ఈ పని సక్రమంగా చేయాల్సి న పాలకులు ఇతర మతాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మత సామరస్యతను దెబ్బ తీస్తున్నారు.
తిరుపతి లడ్డూ-కల్తీ నెయ్యి అంశంపై వారం రోజులుగాచర్చసాగుతోంది.నిజానిజాలను నిర్ధారించి,కారకులపై చర్యలు తీసుకోవడంపై చూ పాల్సిన శ్రద్ధను-అధికార,ప్రతిపక్ష పార్టీలు ఒక దానిపై ఒకటితీవ్రమైన నిందారోపణలు చేసుకో వటంపైనే ఎక్కువగా వెచ్చిస్తున్నాయి. భక్తుల మనో భావాలు, క్షేత్ర పవిత్రత అంటూ పైకి చెబుతూనే మత వైషమ్యాలను రెచ్చగొట్టే సంఫ్‌ు పరివార్‌ శక్తు లకు ఊతమిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక మంది సందర్శించే తిరుపతి-తిరుమల క్షేత్రంలో ఇచ్చే లడ్డూ ప్రసాదం అనేకమంది భక్తుల మనోభావాలు, నమ్మకాలతో ముడిపడినది. అందులో వాడాల్సిన అన్ని రకాల దినుసులూ నాణ్యంగా ఉండాలి. తిరు మల క్షేత్రంలోనే కాదుబీ ఎక్కడైనా సరే ప్రసాదంగా నో,ఆహారంగానో ఇచ్చే ఏ పదార్థమైనా కల్తీ కాకుం డా ఉండాలి. నాణ్యతను ఎప్పటికప్పుడు నిర్ధారిం చాల్సిన యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలి. ఏ దినుసులో నాణ్యత లోపించినా, కల్తీ కనిపిం చినా నిబంధనలప్రకారం వ్యవహరించాలి. ఆయా దినుసులను వాడకంలోకి వెళ్లకుండా నిలిపి వేసి, సరఫరా సంస్థలపైనా, నిర్లక్ష్యం వహించిన వ్యక్తుల పైనా తగు చర్యలు తీసుకోవాలి. భక్తుల మనోభావా లను గౌరవించాలన్నాబీ పౌరుల ఆహార నాణ్యత కు,ఆరోగ్య భద్రతకు రక్షణ కల్పించాలన్నా-ఇదీ, పాటించాల్సిన పద్ధతి!
అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం తిరుమల క్షేత్రంలో ఇలాంటి తనిఖీ, నియంత్రణ వ్యవస్థలు చాలా ఏళ్లుగా అమలులో ఉన్నాయి.సరఫరా సంస్థలు పంపే దినుసులు నిర్దే శిత ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయా? లేదా? అనితనిఖీ చేసి, సరిగ్గా ఉన్నవాటిని స్వీకరించటం, లేనివాటిని వెనక్కు పంపటం చేస్తున్నాయి. గతంలో టిడిపి,వైసిపిప్రభుత్వాలు,అవి నియమించిన పాలక వర్గాలూ అధికారంలో ఉన్నప్పుడు ఇలా నాణ్యత లేని నెయ్యిని తిప్పి పంపిన ఉదంతాలు ఉన్నాయని చెబుతున్నారు. తనిఖీ వ్యవస్థ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యమూ లేదా ఉద్దేశపూర్వక విస్మరణ ఎక్కడ,ఏ దశలో జరిగినా గుర్తించటం చాలా సుల భం.కారకులను గుర్తించి చర్యలు తీసుకోవడం కూడా సులభం. ఈ పనులన్నీ చేయటానికి అధికా రిక వ్యవస్థలూ,దొంతరలూ తిరుమలలో నడుస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటి ఆధ్వర్యాన సమ స్యను సరిచేయాలి తప్ప వివాదాస్పదం చేయడం తగదు. మనోభావాలను గాయపరిచే, మత వైష మ్యాలను రెచ్చగొట్టే పరిభాషను ఎంచుకోవటం మరీ ప్రమాదకరం. కల్తీని కనుక్కోవటానికి, కార కులను శిక్షించటానికి రాజ్యాంగబద్ధమైన పద్ధతు లను అవలంబించాల్సిన ఉప ముఖ్యమంత్రి ఏకం గా మత వైషమ్యాలను రెచ్చగొట్టే మాటలతో లడ్డూ అంశాన్ని మరింత వివాదాస్పదం చేశారు. కొన్ని మతాలను,ఆ మతస్తుల ప్రార్థనా స్థలాలను ప్రస్తా వించారు. ఇలా వైషమ్యాలను సృష్టించటం అభ్యం తరకరం. చాలా సాధారణంగా, సరళంగా పరిష్క రించాల్సిన అంశానికి మతపరమైన ఉద్రేకాలను, ఉద్రిక్తలను అంటుగట్టి,రాష్ట్రంలో మతోన్మాద శక్తుల వీరంగానికి అవకాశం ఇవ్వడం చాలా పెద్ద పొర పాటు. అధికార టిడిపి-జనసేన, ప్రతిపక్ష వైసిపి ఈ విధమైన పొరపాట్లతో సామరస్యానికి చేటు తెస్తున్నాయి. ఒక పార్టీ ప్రాయశ్చిత్తమంటే- మరొక పార్టీ దేవాలయాల్లో పూజలు చేస్తామంటూ ప్రక టించింది.రాజకీయపార్టీలు రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న జీవనోపాధికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలితప్ప వ్యక్తిగత మతవిశ్వాసాలపై కాదు. మతాన్ని స్వార్థరాజకీయ ప్రయోజనాలకు వాడుకో వటంపై అసలే కాదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, వరద బాధితులకు కేంద్ర సహాయంలో నిర్లక్ష్యం తదితరఅనేక ప్రజాసమస్యలు పక్కకుపోతు న్నాయి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో మతోన్మాదాన్ని ఎగదోసి, రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి-ఆర్‌ఎస్‌ ఎస్‌ పొంచి చూస్తున్నాయి.అంతర్వేది,రామతీర్థం తది తర అంశాలను ఎంచుకొని ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి.ఇలాంటి కుయుక్తులపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన తరుణంలో తిరుపతి లడ్డూ అంశాన్ని రాజకీయం చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు, సామరస్యానికీ ప్రమాద కరం.సిట్‌ నివేదిక వచ్చేవరకూ రాజకీయ పార్టీలు లడ్డూ అంశంపై ఎలాంటి ఉద్రేక ప్రకటనలూ చేయకుండా సంయమనం వహించాలి.
(`వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు) – (ఆర్‌.వెంకట సుందరరావు)

కూటమి వంద రోజుల పాలన

ఏపీకి భరోసా లేకుండా లేని నాడు,ఏపీ అన్ని విధాలుగా నష్టపోతున్న నేపథ్యంలో అసలు ఆశలు అన్నవి ఆవిరి అయిన వేళ ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టింది.మూడు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏపీలో ఇదే తొలిసారి.ఎంతో అనుభవం కలిగిన చంద్ర బాబు అలాగే ప్రజల కోసం తపన పడే పవన్‌ కళ్యాణ్‌,కేంద్రంలో రెండు టెర్ములు సక్సెస్‌ ఫుల్‌ గా అధికారాన్ని అందుకుని ప్రజలకు మేలైన పాలన సాగించిన బీజేపీ కలసి ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాయి.జూన్‌ 12న ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బాధ్యతలు స్వీకరించారు.అలా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి సరిగ్గా సెప్టెంబర్‌ 20తో వంద రోజులను పూర్తి చేసుకుంది. ఈ వంద రోజులలో ప్రభుత్వం ఏమిచేసింది అన్నది అంతటా చర్చించాల్సిన విషయమే. నిజానికి ఒకప్రభుత్వానికి వంద రోజులు అన్నది చాలా చిన్నది.అయినా సరే ఈ వంద రోజులలో చంద్ర బాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజ లలో కొత్త భరోసా కల్పించింది.ఏపీని గాడిన పెట్టేందుకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంది. మొదటి రోజు నుంచే ఏపీకి రాజధాని ఆవశ్యకతను గుర్తించి అమరావతిని మళ్లీ పూర్వపు దారిలో నడి చేలా చర్యలకు ఉపక్రమించింది. అమరావతిలో ఎన్నో నిర్మాణాలు మొదలెట్టిన గత ప్రభుత్వం దిగి పోగానే వైసీపీ వచ్చి వాటిని అలా వదిలేసింది. అయితే తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే పాత నిర్మాణాలను పరిశీలించి వాటిని ఎక్కడ నుంచి నిర్మాణం పనులు ప్రారంభించవచ్చు అన్నది నిపుణులతో చర్చించి ఒక గాడిన పెట్టే కార్యక్రమం ఆరంభించింది. అంతే కాదు అమరావతి రాజధాని అంటే దాని చుట్టూ తుప్పలతో అడవిని తలపించే లా ఉన్న వాటిని అన్నీ తొలగించేలా పెద్ద ఎత్తున జంగిల్‌ క్లియరెన్స్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం ది. దాని కోసం 37 కోట్ల రూపాయలను ఖర్చు చేయడంద్వారా అమరావతికి కొత్త రూపు ఇవ్వ డానికి ప్రయత్నాలు స్టార్ట్‌ చేసింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంవద్ద ఉన్న పలుకుబడితో అమ రావతి రాజధానినిర్మాణానికి అవసరం అయిన నిధులను పోగుచేసే పనిలో కూడా కూటమి ప్రభుత్వం విజయవంతం అయింది. కేంద్రం పూచీకత్తు మీద ప్రపంచ బ్యాంక్‌ ఏకంగా పది హేను వేలకోట్ల రూపాయలు తీసుకుని రావడం అంటే అది గ్రేట్‌ అనే చెప్పాలి. దాంతో పాటు అమరావతిలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తన పలుకుబడిని ఉపయోగిస్తు న్నారు. గతంలో అమరావతిలో భూములు కేటా యించిన వారిని పిలిచి వారితో సంప్రదింపులు చేయడం ద్వారా వారి పనులు ప్రారంభించ డానికి కూడా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తున్నారు.అలాగేఎన్నారైలను కూడా పిలిచి మరీ వారిద్వారా కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టించాలని మాస్టర్‌ ప్లాన్‌ వేస్తు న్నారు. అమరావతిలో విద్యా సంస్థలు ఇతర కార్య కలాపాలు మొదలైతే కచ్చితంగా అక్కడా యాక్టివిటీ స్టార్ట్‌ అవుతుందని దాని ఫలితంగా అమరావతి రూపూ షేపూ మారిపోతాయని బాబు భావిస్తు న్నారు. మరో వైపు అమరావతి రాజధాని విషయం లో ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు కూడా చేస్తోం ది.గతంలోలా కాకుండా గుంటూరు, విజయ వాడలను కలుపుకుని జంట నగరాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రణాళికలు రూపొంది స్తోంది. ఇక అమరావతి నుంచి భారీ రైల్వే లైన్లు వేసేలా కేంద్రం నుంచి సహకరం కూడా అందు కుంది.అదే విధంగా ఆరులైన్ల రోడ్లను కూడా నిర్మించడం ద్వారా అమరావతిని ఏపీలోని అన్ని ప్రాంతాలకు దగ్గరచేసేలా కనెక్టివిటీ ఉండేలా కూడా ప్రయత్నం చేస్తోంది.దీంతో గతపదేళ్ళుగా రాజధాని లేదు అని మానసికంగా ఎంతో అవేదన చెందుతూ ఇతర రాష్ట్రాల వారితో ర్యాగింగ్‌కి గురి అయిన ఏపీ ప్రజానీకానికి కేవలం వంద రోజుల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం రాజధాని పేరిట ఒక రాజసం కల్పించింది అని చెప్పాలి. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌. ఇది ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రాజెక్ట్‌. దీని విషయంలో 2014 నుంచి 2019దాకా టీడీపీ ప్రభుత్వం చాలానే వర్క్‌ చేసి పెట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం బాగా స్లో డౌన్‌ అయింది. దాంతో ఎపుడో పూర్తికావాల్సిన పోలవరం కూడా పడకే సింది.టీడీపీ కూటమి ప్రభుత్వం తన ప్రాధాన్య తలుగా పోలవరంని కూడా పెట్టుకుంది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కేంద్రం వద్దకు వెళ్ళి పెండిరగులో ఉన్న 12 వేల కోట్ల రూపాయ లను విడుదల చేయించుకుంది.దాంతో పోలవరం పనులకు ఇపుడు ఆటంకాలు లేకుండా పోయాయి. నవంబర్‌ నుంచి పోలవరం పనులు శరవేగంగా ప్రారంభించేందుకు అన్ని రకాలైన ప్రయత్నాలను కేవలం వందరోజుల వ్యవధిలోనే కూటమి ప్రభు త్వం చేయడం మరో ప్లస్‌పాయింట్‌. ఇక నిరు ద్యోగా యువత కోసం మెగా డీఎస్సీని 16 వేలకు పైగా టీచర్‌ పోస్టులతో భర్తీ చేయడానికి చంద్ర బాబు సీఎంగా చేసిన మొదటి అయిదు సంతకా లలో ఒకటిగా పెట్టడం నిజంగా మరో విజయం గా చూస్తున్నారు.అంతేకాదు చంద్రబాబు సామా జిక పెన్షన్లు కూడా భారీగా పెంచారు. మూడు వేల రూపాయలను ఒక్క సారిగా నాలుగు వేలకు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగుల పెన్షన్‌ కూడా రెట్టింపుచేసారు. ఈ విధంగా అరవై ఆరు లక్షలకుపైగా పెన్షన్‌ లబ్దిదారుల కళ్ళలో వెలుగు నింపారు.మరోవైపు చూస్తే ల్యాండ్‌ టైటిలిం గ్‌ యాక్ట్‌ ద్వారా రైతులు తమ భూములు ఎక్కడ పోతాయో అని నానా బాధలు పడుతూ అవేదన చెందారు.కూటమి ప్రభుత్వం అధికారంలోని వస్తూనే ఆయాక్ట్‌ని తొలగించింది. దాంతో రైతులు అంతా పూర్తి భరోసాను పొందారు. అదే విధంగా అన్నా క్యాంటీన్లను టీడీపీకూటమి ప్రారంభిం చడం మరో శుభ పరిణామం.దీనివల్ల పేదల ఆకలి పూర్తిగా తీరుతోంది.ఇది దేశంలోనే అద్భుత పథకంగా మారింది. ఒక వైపు కేంద్ర ప్రభుత్వంతో సామరస్యంగా ఉంటూ ఏపీకి తేవాల్సిన నిధులను తెచ్చుకుంటూ మరో వైపు ఏపీని అభివృద్ధి చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ తొలి అడుగులే బలంగావేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ముఖ్యంగా గతంలో ప్రజలలో ఉన్న అభద్రతా భావం ఇపుడు లేదు.అంతే కాదు భవిష్యత్తు మీద ఒకగట్టి నమ్మకం ఏర్పడిరది. ఏపీ సేఫ్‌ హ్యాండ్స్‌లో ఉంది అని ప్రతీ ఒక్కరూ భావిస్తు న్నారు. ఏపీ సమీప భవిష్యత్తులో బాగా పుంజుకుని అభివృద్ధిలో దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతుంది అన్న నమ్మకాన్ని చంద్రబాబు ఇవ్వగలి గారు. మొత్తానికి వంద రోజుల పాలనలో ఎన్నో సవాళ్ళు ఎదురైనా కూడా చంద్రబాబు ఆత్మ విశ్వా సంతో ముందుకు సాగారు.దానికితాజా ఉదా హరణ బెజవాడను ముంచెత్తిన భారీ వరదలు. అటువంటి సమయంలో కూడా మొక్కవోని ధైర్యంతో ముఖ్యమంత్రి పదిరోజుల పాటు శ్రమించి ప్రజలకు తగిన సహాయం అందించగలిగారు. దాంతో వందరోజుల పాలన ఏపీకి మేలు మలు పుగా ఉందని అంతా భావిస్తుననారు.
వంద రోజుల అసహనం, అపనమ్మకం
నరేంద్ర మోడీ సర్కారు మూడో దఫా పాలనకు వంద రోజులు నిండిన పేరుతో హడా వుడి చేయా లని బిజెపి, సంఘపరివార్‌లు ఎంత హంగామా చేసినా వాస్తవాలు మాత్రం వెక్కిరిం చేలా గోచరిస్తున్నాయి.నిజానికి మూడోసారి వచ్చిన ప్రభుత్వానికి ఇవేవీ పెద్ద సందర్భాలు అవసరం లేదు. అయితే ఈసారి కేంద్రంలో ఎన్‌డిఎ సర్కారు ఏర్పడిన తీరులోనే ఆబండారం దాగుంది. నాలుగు వందల జపంతో మొదలై చివరకు అందులో సగం దగ్గర ఆగి అన్య పక్షాల మద్దతుపై ఆధారపడి రాజ్యం చేయవలసిన రాజకీయ దురవస్థ అడుగ డుగునా అడ్డుచక్రం వేస్తున్నది.లాంఛనంగా జర పాల్సిన ఈవంద రోజుల వేడుకను పెద్దఉత్స వంలా ప్రచారం చేసుకోవడంలోనే బలహీనత స్పష్టమవుతుంది.ఒకసారి నెట్‌ పరికిస్తే అన్ని ఇంగ్లీ షు పత్రికలలోనూ చాలా జరిగిపోయిందని రైట ప్పులు రాయించుకోవడం, అందరూ అచ్చు గుద్ది నట్టు ఒకే జాబితా రాయడం బట్టి వాటికి ఎలాంటి ఆదేశాలు వచ్చిందీ తెలిసిపోతుంది. మంగళవారం నాడు మోడీ ‘సుభద్ర’పేరుతో ఒకపథకం ప్రారం భిస్తూ తాము ఎన్ని చేశామో ఏకరువు పెట్టారు. నిజానికి ఈఅపనమ్మకం ఎన్నికల ఫలితాలు రాక ముందే మొదలైంది.రాబోయే వంద రోజులలో ఏం చేయాలనేది ముందే గతప్రభుత్వమే చర్చకు పెట్టడం వంటి ప్రహసనం గతంలో ఎన్నడూ జరిగి వుండదేమో!కానీ మోడీమోతకు అవన్నీ అవసరమై నాయి.ముందే నిర్ణయించాము గనక ఆవంద రోజుల పనులు చేశామని ఆయన ఇప్పుడు చెప్పు కుంటున్నారు.మరోవైపున హోంమంత్రి అమిత్‌షా కూడా అదే పనిలో వున్నారు. మూడుకోట్ల కొత్త ఇళ్లనిర్మాణం,యువతకు సహాయ పడేందుకు రెండు లక్షల కోట్ల సహాయం, గ్రామాలకు రోడ్లు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి,కొత్త పెన్షన్‌ పథకం,11లక్షల మంది మహిళలను లక్షాధికారి దీదీలను చేయడం, రైతులకు సహాయంఇలా చాలా జాబితా చదివారు. నిజానికి ఇందులో చాలా భాగం గతంలో అమలు కానివీ,ఇప్పుడు కూడా స్పష్టత లేనివే. వచ్చిన మేరకు కూడా ఉద్యమాల ఒత్తిడికి జంకి మొక్కు బడిగా ప్రకటించినవి వున్నాయి. పదేళ్ల తర్వాత కూడా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయలేక పోయామని ప్రధాని పరోక్షంగా ఒప్పుకుంటు న్నారన్నమాట.ఇక నిరుద్యోగం ప్రపంచంలో ఎక్కడా లేనంత రికార్డుస్థాయిలో వుంటే వారి పేరి ట కార్పొరేట్లకు నెలజీతం జమ చేయడం ఓ విపరీ త విధానం. వీటినే మహత్తర విజయాలుగా మోడీ సర్కారు గానీ ఆయన పార్టీగానీ ప్రచారం చేసుకో వడం,ఎన్‌డిఎ భాగస్వాములుగా వున్న పార్టీలు వంత పాడటం హాస్యాస్పదం. ఇదేగాక విదేశాంగ విధానంలోనూ గొప్పఫలితాలు సాధించినట్టు మరో ప్రచారం. – జి.ఎన్‌.వి.సతీష్‌

సమత రవికి ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డు

వైవిధ్యం ఆయన జీవన శైలి.ఉద్యమం ఆయన ఊపిరి.ఎన్నో సమస్యలపై పోరాడారు.విజయం సాధించారు. గిరిజనులకు ‘నేనున్నా’..అంటూ భరోసా ఇచ్చారు.వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.ఆయనే రవి రెబ్బాప్రగడ. ఆయన సేవలకుగాను ఇప్పటికే ‘లక్ష్మీపత్‌ సింఘానియా యువ నాయకత్వం’ వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించగా తాజాగా అక్టోబర్‌ 4న మరో ప్రతిష్టాత్మకమైన పురస్కారం సమత రవిని వరించిన సందర్భంగా…
రవి పుట్టింది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి.సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ అమాయకులైన నిరుపేద గిరిజనుల సాదక బాధకాలు ఆయన్ని బాగా కలచి వేశాయి.గ్రామీణాభివృద్ధి అంశంపై స్నాతకోత్తర పట్టా(పీజీ)పుచ్చుకున్న ఆయన బహుళజాతి సంస్ధల్లో వచ్చిన ఉద్యోగావకా శాన్ని వదులుకున్నారు.34ఏళ్ల క్రితం ఓసామా జిక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించారు. ఈ మూడు దశాబ్దాలలో ఆయన సేవలకు గుర్తింపుగా ఢల్లీి హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ‘ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డ్స్‌ 2024’పురస్కారాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి న్యాయమూర్తి ఎన్‌.కోటిష్వరసింగ్‌ అందుకున్నారు.ఢల్లీి హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రముఖ తీర్పులకు దారితీసిన న్యాయ పోరాటం చేసిన వ్యక్తులను,ప్రముఖ తీర్పులకు దారితీసిన విజేతలను సత్కరించడానికి ‘ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డ్స్‌ 2023’కార్యక్రమాన్ని ప్రారంభించింది.రెండవ సంచికను నిర్వహించిన న్యాయపోరాటం చేసిన వ్యక్తుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఐదోవ షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని గిరిజన హక్కులు, పర్యా వరణం,వనరుల పరిరక్షణపై పనిచేస్తున్న రవికి ఈఅవార్డు లభించింది.
అవార్డు ఎంపిక జ్యూరీ..
సమత వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌,ఇతర రాష్ట్రాలలో న్యాయం కోసం సమత చేసిన అలుపెరగని పోరాటం కోసం ప్రముఖ జ్యూరీ ‘గిరిజన ఎస్సీ,ఎస్టీ విభాగంలో అవార్డు గ్రహీతగాఎంపిక చేసింది.ఈ అవార్డుల ఎంపికను ప్రముఖ జ్యూరీ అవార్డు గ్రహీతలను నిర్ణయించారు.ఢల్లీి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి,మీనన్‌, సాయుధ దళాల ట్రిబ్యునల్‌ ఛైర్మన్జస్టిస్‌ రాజేంద్ర,ఢల్లీి హైకోర్టు మాజీ న్యాయ మూర్తి,జస్టిస్‌ కైలాష్‌ గంభీర్‌,తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండ రామ్‌,ఢల్లీి హైకోర్టు బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షులు,సీనియర్‌ న్యాయవాది, మోహిత్‌ మాథుర్‌,సీనియర్‌ న్యాయవాది,ఢల్లీి హైకోర్టు సీనియర్‌ న్యాయవాది రాజశేఖర్‌ రావు,ఢల్లీి హైకోర్టు వికాస్‌ పహ్వా,ఢల్లీి మాజీ ప్రత్యేక పోలీసు కమిషనర్‌ సంజయ్‌ సింగ్‌, సీనియర్‌ న్యాయవాది,ఢల్లీి హైకోర్టుమ ణిందర్‌ సింగ్‌ జ్యురీస్‌ సభ్యులుగా ఉన్నారు.
నేపథ్యం ఇదీ..
దేశం యావత్తూ ఒక్కసారిగా ప్రభుత్వేతర సంస్థల పదునేమిటో ప్రత్యక్షంగా చవి చూసిన సంఘటన 1997నాటి సమత తీర్పు.ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొని తూర్పు కనుమల్లో గనుల తవ్వకాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు ద్వారా సమత వాదన సరైం దేనని తీర్పు పొందిన ఘనతకు మూల కారకు డాయన. సమతా వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (1997)లో సుప్రీంకోర్టు తీర్పు భారతదేశంలోని గిరిజన సంఘాల హక్కు లను,ముఖ్యంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో భూవినియోగం,సహజ వనరుల దోపిడీకి సంబంధించిన హక్కులను గణనీ యంగా సమర్థించే ఒక మైలురాయి తీర్పు. మైనింగ్‌ కార్యక లాపాల కోసం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజనుల భూములను గిరిజనేతర కార్పొరేష న్‌లకు లీజుకు ఇచ్చినప్పుడు,అక్కడ నివసిస్తున్న ఆదివాసీ జనాభా హక్కులు,జీవనోపాధిని ఉల్లం ఘిం చినప్పుడు ఈ కేసు తలెత్తింది.
సమత ఉద్యమంగా విశాఖ కేంద్ర బింధువు..
విశాఖను సమత ఉద్యమాల కేంద్ర బింధువుగా తీర్చిదిద్దుతున్న నేపథ్యం పరిశీలిస్తే..సమాజ సేవ చేయాలనే సంకల్పంతో 1986లో రవి భాగవతుల చారిటబుల్‌ ట్రస్టులో చేరారు. ఆతర్వాత కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో స్వాతంత్య్ర సమర యోధుడు స్వర్గీయ కె.తిలక్‌ స్థాపించన స్పందన సంస్థలో పరిపూర్ణ అవగాహన ఏర్పరచుకున్నారు. 1990లో తానే స్వయంగా సమత స్వచ్చంధ సంస్థను స్థాపించి గిరిజన హక్కుల పోరాటం లో కొత్తపుంతలు తొక్కారు.ఏజెన్సీలోని కాకినాడ జిల్లా బవురవాక గ్రామంలో పేద గిరిజనులకు 298 ఎకరాల భూమికి పట్టాలు పంపిణీ చేయడంలో రవి కృషి అనన్య సామా న్యం.ఏజెన్సీలో నెలకొన్నపలు సమస్యల పరిష్కారానికి మొక్కవోని దీక్షతో పనిచేశారు.
ఉద్యమమే ఊపిరిగా..
ఉమ్మడి విశాఖ అల్లూరి సీతారామారాజ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిం చడమే ధ్యేయంగా సమత కార్యకలాపాలను విస్తరించారు.గిరిజనులను చైతన్యవంతులను పర్చేపలు సామాజిక సేవా కార్యక్రమాలను చేయడంతో ఆసేవలను గుర్తించి అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్‌ 1994లో అవార్డును బహుకరించారు.బొర్రా ప్రాంతో మైనింగ్‌,భూ సమస్యలను దృష్టి సారించి రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు కంపెనీలు చేపట్టే కార్యక్రలాపాలను వ్యతిరేకిం చారు.అనంతగిరి బొర్రా,అరకు,ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు మైనింగ్‌ ఇచ్చిన లీజులను సమర్దవంతంగా అడ్డు కున్నారు.ఈఘటనతో తూర్పు కనుమల్లో గిరిపుత్రుల్నీ,వారి హక్కుల్నీ సంరక్షించడానికి ఉద్య మించిన ఉక్కు పిడికిలి రవి రెబ్బా ప్రగడ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. న్యాయపోరాటంచేసి 1997లో భారత అత్యన్నత న్యాయస్థానం ద్వారా సాధించిన ‘సమత తీర్పు’ దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రా ల్లోని గిరిజన హక్కుల పరిరక్షణకు ఓకవ చంలా ఉపయోగపడుతోంది.ఆనాటి పోరాట ఫలితమే నేడు ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డు` 2024 పురస్కారం ఈసముచిత గౌరవాన్ని రవి రెబ్బాప్రగడ దక్కించుకున్నారు.– గునపర్తి సైమన్‌

ప్రామాణిక దర్పణం కొండరెడ్డి జీవన విధానం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్‌ శాఖ వారి పరిశోధన గ్రంధం ‘ కొండ రెడ్ల గిరిజనుల జీవన విధానం’ అనే పుస్తకంపై సమీక్ష
మనం మూల వాసులుగా చెబుతున్న ఆదివాసీలలో ఒక తెగ అయిన కొండరెడ్డి గిరిజన జీవన విధానంకు సంబంధించి సంపూర్ణ సమాచారంగల ప్రామాణిక పుస్తకం ‘‘కొండరెడ్డి గిరిజనుల జీవన విధానం’’ తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్‌ శాఖ వారి పరిశోధన, ప్రచురణల విభాగంలో భాగంగా ఈ పుస్తకం 2010 సంవత్సరంలో ప్రచురించారు. గిరిజన జీవన విధానాల పరిశోధన ప్రామాణికతను దృష్టిలో ఉంచుకుని నాటి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి మండలంలో గల ‘‘బొడ్లంక’’అనే సంపూర్ణ కొండారెడ్డి గిరిజన గ్రామంను ఈ పరిశోధనకు ఎంపిక చేసుకొని పరిపూర్ణమైన సమాచారం సేకరించి పొందుపరిచారు.
నాటి గ్రామ చరిత్ర సమాచారాలను తెలిపే కైఫియత్తు ప్రక్రియలో వ్రాసిన ఈ గిరిజన గ్రామ చరిత్రలో అనేక చారిత్రక సామాజిక సాంస్కృతిక విషయాలు తెలుస్తాయి.
సుమారు 1901 సంవత్సరంలో పుట్టగండి గ్రామం నుంచి వలస వచ్చిన కొన్ని కొండ రెడ్డి కుటుంబాలతో ఏర్పడిన ఈ పూర్తి గిరిజన గ్రామంలో నేడు 60 కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు.
చుట్టూ దండకారణ్యం ఎతైన కొండలు వాటి మధ్య బొడ్డు లాగా లోతుగా ఉండే లోయ నాలుగు దిక్కుల జలజల పారే సెలయేర్లతో అందాలు ఆరబోస్తున్న ఈ ప్రాంతం భౌతిక రూపం అనుగుణంగానే ఈ గ్రామానికి బొడ్లంక అనే పేరు సార్ధకం చేసినట్టు,అలాగే ఈ గ్రామ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిం చిన పల్లాల వీరపరెడ్డి తండ్రి బోడి రెడ్డి పేరు మీదుగా కూడా ఈ గ్రామానికి బొడ్లంక అనే పేరు వచ్చిందనే మరో కథనం కూడా ఉంది.
నేడు ఈ గ్రామం ఐటిడిఎ సహాయ సహకారాలతో కొంత కొత్త రూపును సంతరిం చుకుంటున్న,నగర సంస్కృతి ఛాయలు సంత రిస్తున్న ఇక్కడి కొండరెడ్డి గిరిజనులు వారి పూర్వ తరాల సంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ మనుగడ సాగించటం విశేషం.
‘‘బొడ్లంక పరిచయం’’ మొదలుకొని ‘‘ఆటలు’’ వరకు మొత్తం14విభాగాలుగా విభజించి వ్రాసిన సంపాదకులు ఆచార్య భట్టు రమేష్‌ గారి సంఘటిత అక్షర కృషి అభినందనీయం, విషయ సేకరణ కర్తల కృషి ప్రశంసనీయం, గ్రామాల చరిత్ర రాయడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అన్ని ఇందులో అగుపిస్తున్నాయి. గ్రామ పరిచయంతో మొదలై. ప్రజలు కులాల మధ్య సయోధ్య, పర్యావరణం,ఇంటి నిర్మాణం, గృహ సంబంధ వస్తు సంస్కృతి,వైద్య విజ్ఞానం, దేవతలు పండుగలు,జీవిత చక్రం,సంబరాలు వేష భాషలు భూషణాలు,ఆహారం,వస్తువులు, నిలవ పద్ధతులు,ఆటలు,తదితర అంశాలు కొండరెడ్డి గిరిజన జీవితాల్లో ఎలా పెనవేసు కున్నాయో ఆసక్తిదాయకంగా ఇందులో వివరించారు.
కొండ రెడ్డి కుటుంబంలో పుట్టిన శిశువుకు పేరు పెట్టడం ఒక ప్రహసనంగా చేస్తారు ఆ కార్యక్రమాన్ని ‘‘పేరు ముళ్ళ’’ అని పిలుస్తారు ఈ తంతులో వారి సంస్కృతిని ఆధారం చేసుకుని వ్యవహరించడంలో అనేక ఆసక్తి దాయకమైన విషయాలు వెల్లడవుతాయి మనుషుల పేర్లతో పాటు ఇంటిపేర్లు చెట్ల పేర్లు తదితర పేర్ల గురించి వివరంగా తెలిపారు. బొడ్డులంక సంపూర్ణ కొండ రెడ్డి గ్రామం అయినా వీరితో సయోధ్య గల కమ్మరులు వేగుజంగాలు తదితర జాతుల గురించి ప్రస్తావిస్తూ వారితో వీరికి గల సయోధ్య గురించి వివరించిన అంశాలు ఉపయుక్తంగా ఉన్నాయి.
అలాగే ఈ గ్రామస్తులు పర్యావరణ సంరక్షణలో తీసుకుంటున్న చర్యలు గురించి వివరిస్తూ అక్కడి వృక్ష సంపద గురించి అనేక విలువైన విషయాలు పేర్కొన్నారు. అలాగే కొండరెడ్డి గిరిజనులు నిర్మించుకునే ఇంటి నిర్మాణం గురించి జీవిత చక్రపు సంబరాల్లో ఇంటి ప్రాధాన్యత దానికి కొండరెడ్లు ఇచ్చే ప్రాతినిథ్యం తదితర అనేక విలువైన విషయాలు ఈ విభాగంలో పొందుపరచబడ్డాయి.
అలాగే ‘‘గృహ సంబంధ వస్తు సంస్కృతి’’ వైద్య విజ్ఞానం, వృత్తి విజ్ఞానం,తో పాటు కొండరెడ్లు ప్రత్యేకంగా చేసుకునే దేవతల పండుగలులో వారు చేసుకునే విలక్షణమైన సంక్రాంతి పండుగ గురించి, అనేక ఆసక్తిదాయకమైన విషయాలు ఈ విభాగంలో తెలిపారు దీనితో పాటు వాళ్లు చేసుకునే కొండ దెయ్యాల పండుగ,సొప్పల పండుగ,పచ్చిక పండుగ, మామిడి కొత్త పండుగ,మామిడి టెంకల పండుగ,కొర్ర కొత్త,జొన్న కొత్త,పండుగలు బుడమల పండుగ,దారి పండుగ,లక్ష్మీదేవి పండుగ,భూదేవి గంగానమ్మల పండుగలు, వంటి సామూహిక పండుగలతో పాటు వ్యక్తి గతమైన పండుగలను జీవిత చక్రపు సంబ రాలు శీర్షికతో కొండరెడ్లు చేసుకునే మరికొన్ని పండుగలు అవి చేసుకునే విధానాల గురించి ఉపయుక్తమైన విషయాలను సేకరించి అందిం చారు.దీనిలో కొండారెడ్డి జాతిలో జననం నుంచి మరణం దాకా చోటు చేసుకునే వివిధ సంఘటనల గురించి సవివరంగా తెలిపారు. ఇక 11వ విభాగం అయిన ‘‘వేష భూషణాలు’’ గురించిన దానిలో కొండరెడ్లు ధరించే ఆభర ణాలు అలంకరణలు తదితర విషయాలు ఎంతో చక్కగా పేర్కొన్నారు.అనంతరం ఆహా రం గురించిన విశ్లేషణలో వారు తినే సోడి రొట్టె, సామకూడు,సామజావ,కొర్రకూడు, గంట్లు,జీలుగు అంబలి,మామిడి టెంకల రొట్టె, అంబలి,మొక్కజొన్న అంబలి,సేమకూర, వెదురు కొమ్మలకూర,లక్ష్మిచారు,తదితర ఆహార దినుసులు తయారు చేసే విధానాలు మొదలైన అంశాలు ఈ విభాగంలో పొందుపరిచారు. ఇక చివరి రెండు విభాగాలుగా,వస్తువులు నిల్వ పద్ధతులు,ఆటలు,అనే అంశాలు చెప్పబడ్డాయి. పోడు వ్యవసాయం చేయడంలో సిద్ధస్తులైన కొండరెడ్లు వారు పండిరచిన ఆహారం పంట లను నిల్వ చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహి స్తారు.ఆధునికులకు ఈవిధానం ఆశ్చర్యకరంగా ఆగుపించిన,వీరు పాటించే పద్ధతులు ప్రామా ణికంగా ఆరోగ్య దాయకంగా ఉంటాయి. కొండరెడ్లు ఆడే ఆటల్లో కూడా కొన్ని విలక్షణమైన అంశాలను మనం గమనించ వచ్చు వాటిలో ప్రధానంగా ఆగుపించేవి ఉప్పరి పెట్టెలు,నాలుగురాళ్లు,పిన్నీసు ఆట,ముక్కు చిక్కుడు,తల్లి పిల్లఆట, ఎత్తురాళ్ళు,పుల్ల, బచ్చ,గూటి బిళ్ళ,గెలుపులాట,మొదలైన ఆటలు కొండరెడ్డి గిరిజన జాతులవారిలో పిల్లలు పెద్దలు స్త్రీ పురుషులు ఆడతారు..అనే అంశా లు ఇందులో తెలిపారు.
ఇలా ఒక గ్రామమును ప్రామాణికంగా తీసు కుని అక్కడి వివరాలను పరిశోధనాత్మకంగా అక్షరబద్దం,చేయడం ద్వారా బహుళ ప్రయో జనాలు చేకూరతాయి.
ఎన్నో పరిశోధక విలువలు గల ఈ బొడ్లంక కొండరెడ్డి గిరిజన గ్రామ చరిత్ర ఆధారంగా మరిన్ని గిరిజన గ్రామాల చరిత్రలు రావాల్సిన అవసరం కనిపిస్తుంది.
పుస్తకం : కొండ రెడ్డి గిరిజనుల జీవన విధానం (బొడ్లంక)
సంపాదకులు : ఆచార్య భట్టు రమేష్‌, పేజీలు:172,వెల :-85/-రూ,ప్రతులకు : జానపద గిరిజన విజ్ఞాన పీఠం తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్‌-506002, ఫోన్‌ : 0870-2101309/2441258
సమీక్షకుడు : డా: అమ్మిన శ్రీనివాసరాజు
సెల్‌ :7729883223.

1 2