పకృతి శాపమా?..మన పాపమా.?

దేశంలో సంభవిస్తున్న వరుస ఉత్పాతాలు భూమిపై వాతావరణ మార్పునకు సూచికలు. ఇదివరకు వందేండ్లలో వచ్చినమార్పుగా భావిస్తే, ఇప్పుడు తుఫాన్లు,భారీవర్షాలు,మెరుపులు, శీతల గాలులు,వడగాల్పులు,వరదలు,కరువు,కొండచరియులు విరిగిపడడం వంటివి త్రీవమైన ప్రకృతి విధ్వంస ఘటనలు ఐదేండ్లలో అనేకం చూస్తున్నాం.వాస్తవానికి పర్యావరణాన్ని సంరక్షిస్తే..అది మానవాళి ప్రయోజనాలు కాపాడుతుంది.యధేచ్ఛగా విధ్వంసక దుశ్చర్యలకు తెగబడితే,అనూహ్య స్థాయిలో ఇలాంటి విఫత్కర పరిస్థితులే దాపురిస్తాయి.ఇది కొన్నేళ్లుగా పదేపదే నిరూపితమవుతున్న సార్వత్రిక సత్యం.ప్రకృతిపట్ల మనిషిలో మేటవేసిన అలసత్వం,నిర్లక్ష్యం,అడ్డూఆపూలేని పారిశ్రామీకీక రణల దారుణ పర్యవసానమే విఫత్తుల పరంపరం.దేశంలో ఈఏడాది రెండు,మూడు,నెలల వ్యత్యా సంలో రెండు ప్రకృతి విధ్వంసక సంఘటనలు చోటు చేసుకున్నా విషయం తెలిసిందే.కేరళలోని సుందరమైన వయనాడ్‌ ప్రకృతి ఆగ్రహానికిగురై శ్మశానస్థలిగా మారిన దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా భావోద్వేగం కలగకమానదు.జూలై 29న ప్రజలంతా నిద్రిస్తున్న వేళ భారీఎత్తున కొండచరియలు విరిగి మీద పడడంతో చిగురాకులా వణికిపోయి వందలాది మంది నిండు ప్రాణాల్ని కబళించాయి.మే నెలలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రాజిల్లాలోని లంబడుగ్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ డ్యామ్‌ ధ్వంస మైంది.దీంతో బురద,బండరాళ్లువచ్చి వ్యవసాయ పొలాలు,దుకాణాలు,ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈరాష్ట్రం లో గతపదేళ్లలో కనీసం14ఘటనలు జరగ్గా,35మంది ప్రాణాలు కోల్పోయారు.అదేవిధంగా జూలైలో సంభవించిన భారీ వర్షాలకు దేశ ఆర్ధిక రాజధాని ముంబాయిని ముంచెత్తేసింది.రికార్డుస్థాయిలో నీటిమట్టం పెరిగి వర్షపాతం నమోదయ్యింది.దీంతో నగరంలో జనజీవనం స్తంభించి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తూర్పుకనుమల్లో విశాఖ ఉమ్మడి జిల్లా అరకు దరి కోడిపుంజువలస గ్రామంలో 1995లో సంభవించిన వరదలకు పచ్చనికొండ కరిగిపోయింది.బురదమట్టి,కొండచరియలు విరగబడి భారీ స్థాయిలోనే ప్రకృతి విధ్వంసం సంభవించింది.ఇలాంటి ప్రకృతి విఫత్తులు పర్యావరణ విధ్వంసం, భూతాపాలే ఇందుకు మూలకార ణాలని(వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం`సీఎస్‌ఈ)అధ్యయనం వెల్లడి స్తోంది.దేశంలో అటవీ ఛాయ హరించుకుపోతుండటాన్ని ప్రస్తావించింది.
నవ్యాంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు విభజన నేపథ్యంలో గిరిజన ప్రాంతాలు రాజ్యాంగ ఉల్లంఘనలకు గురవుతుంది.అల్లూరి జిల్లా.చింతపల్లి మండలం, ఎర్రవరం గ్రామంలో హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సర్కారుధారాదత్తం చేసి,కొండకోనల నడుమ ప్రశాంతంగా ఉండే గిరిజనుల గూడేల జీవితాల్లో చిచ్చుపెట్టింది.ఈప్రాజెక్టు నిర్మాణంవల్ల 32గిరిజన గ్రామాలు ముంపునకు గురికానున్నాయి.షెడ్యూల్‌ ప్రాంతాల పరిరక్షణకు సమత చేసిన ఉద్యమం మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన సమత జడ్జెమెంటు ఉన్నప్పటికీ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి.ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఏజెన్సీలోచోరబడి ఎక్కడబడితే అక్కడ పర్యాటకప్రాజెక్టులు నెలకొల్పి పర్యావరణానికి విఘాతం కల్గిస్తోంది.పర్యావరణ పరిరక్షణకు ఎక్కడా సంరక్షణ లేని పరిస్థితి నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పడిరది. పర్యావరణ పరిరక్షణ,నీటివనరులసంరక్షణపై 2009లో సమత కొండల ఆరోగ్యమే..పల్లపు ప్రాంతాల సౌభాగ్యం అనే నినాదంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీస్థాయిలో అవగాహన ర్యాలీ చేపట్టాం.అభివృద్ధి పేరుతో వాతావరణాన్ని,పర్యావరణాన్ని వినాసనం చేయరాదని,కొండలు ఆరోగ్యంగా ఉంచితేనే మైదాన ప్రాంతాలకు ప్రాణాధారమైన నీటివనరులు లభిస్తాయని సూచించింది.
ఈనేపథ్యంలో ప్రకృతి ప్రసాదించిన సహజ సంపద అంతా విచక్షణాయుతంగా మానవ జాతి గర్విష్టంగా మేలు చేసేలా సద్వినియోగం కావాలి. అటువంటి పర్యావరణ స్పృహ ప్రభుత్వాలు, పాలక గణాల్లో కొరవడితే రేపటితరాలు మనల్ని క్షమించవు! –రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

విభజిత ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణపదేళ్ల అభివృద్ధి..

రెండు రాష్ట్రాల అర్థికా భివృద్ధి,తలసరి ఆదాయం,ఆర్థికాభి వృద్ధిలో వివిధ జిల్లాలు,రంగాల అభివృద్ధి మధ్య వ్యత్యా సాలు,అభివృద్ధి కేంద్రీకరణ లేదా వికేం ద్రీకర ణ వైపుగా సాగుతున్నదా?ఆర్థిక వ్యవస్థలో సృష్టించబడుతున్న సంపద సమాజంలో ఉన్న అత్యధిక మంది శ్రమ జీవులకు పంపిణీ అవు తున్నదా? లేదా?వంటి కొన్ని విషయాలకు పరిమితమౌతుంది.గత దశాబ్ద కాలంలో ఆంధ్ర ప్రదేశ్‌,తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఆర్థిక వృద్ధి కనిపిస్తున్నది.ఆంధ్ర రాష్ట్రస్థూల ఉత్పతి (జిఎస్‌డిపి) అభివృద్ధి రేటు రాష్ట్ర విభజన అనంతరం టిడిపి ప్రభుత్వ ఐదేళ్ళ (2014-19)కాలంలో స్థిర ధరల్లో సగటున 9.03 శాతం అభివృద్ధి రేటు నమోదయ్యింది.ఆ తరు వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌ సిపి ప్రభుత్వ కాలంలో అనగా 2019-24లో సగ టున 5.36శాతం చొప్పున వృద్ధి రేటు సాధిం చింది.నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తొలి ఐదేళ్ళలో సగటున 9.03శాతం చొప్పున, ఆ తరువాత 2019-24మధ్య కాలంలో సగ టున4.66 శాతం వృద్ధిరేటు సాధించింది.గత దశాబ్ద కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో సగటున 7.34శాతం, తెలంగాణలో 6.98 శాతం వృద్ధి రేటు ఉంది.రెండు రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (ఎస్‌ జిడిపి) విలువను ప్రస్తుత ధరల్లో పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో 2014-15లో రూ.5,24, 976కోట్లు ఉండగా 2023-24కి రూ.15, 40,000 కోట్లకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే కాలంలో రూ.5,05, 849 కోట్ల నుండి రూ.14,49,708 కోట్లకు పెరి గింది. దేశ జిడిపి లో ఆంధ్రరాష్ట్ర జిఎస్‌ డిపి ర్యాంకు చూస్తే 2014-15లో 8వర్యాంకు ఉండగా 2023-24లో కూడా ఇదే ర్యాంకు ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా 9వ ర్యాం కులో కొనసాగుతుంది.ఉదారవాద ఆర్థిక విధా నాలను దేశంలో ప్రవేశపెట్టిన తరువాత పాల కులు స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయాల పెరు గుదల మీద కేంద్రీకరిస్తున్నారు.వృద్ధి రేటు పెరి గితే ఆటోమేటిక్‌గా ప్రజల మధ్య అసమాన తలు తగ్గుతాయని, ఉపాధి అవకాశాలు పెరు గుతాయని భ్రమ కల్పిస్తున్నారు.వాస్తవంగా ఈ దశాబ్ద కాలంలో రెండు రాష్ట్రాలలో వృద్ధిరేటు బాగా పెరుగుతున్నా సంపద కేంద్రీకరణ, అస మానతలు తగ్గకపోగా తీవ్రంగా కొనసాగుతు న్నాయి. జిల్లాలు,వివిధ రంగాల మధ్య సంపద కేంద్రీకరణ, అసమానతలు రెండు రాష్ట్రాలలో చూడొచ్చు.ఆంధ్ర రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021-22లో ఉమ్మడి (విభజన జిల్లాల సమాచారం అందుబాటులో లేకపోవడం వలన) 13 జిల్లా ల్లో కృష్ణా (14శాతం), విశాఖపట్నం (12 శాతం),తూర్పు గోదావరి (11శాతం),పశ్చిమ గోదావరి (10శాతం) జిల్లాల వాటా 47 శాతం ఉంది.శ్రీకాకుళం (4 శాతం),విజయ నగరం (4శాతం) జిల్లాలు అట్టడుగునే ఉన్నా యి.మిగిలిన గుంటూరు,ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు,కడప,అనంతపురం,కర్నూలు జిల్లాలు రాష్ట్ర జిఎస్‌డిపిలో 5నుండి8శాతం మధ్య వాటాతో గత పదేళ్ళ నుండి కొనసాగు తున్నా యి.ఆంధ్ర రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవ సాయ, పారిశ్రామిక, సేవా రంగాల వాటాలను పరిశీ లిస్తే వ్యవసాయ రంగం వాటా రాష్ట్ర జిఎస్‌ డిపిలో2014-24 మధ్య 30.39 నుండి 36.1శాతానికి పెరుగుతూ వ్యవసాయ రాష్ట్రం గా మారుతున్నది. పారిశ్రామిక రంగం వాటా 25.17నుండి23.36 శాతానికి,సేవా రంగం వాటా44.61నుండి 40.45శాతానికి దిగ జారింది.జిడిపిలో వ్యవసాయ రంగం వాటా పెరుగుతుందంటే వ్యవసాయం మీద ఆధార పడిన ప్రజల ఆదాయాలు పెరుగుతున్నట్లుగా భావిస్తే అది పొరపాటు.వాస్తవంగా రైతాంగ ఆదాయం క్షీణిస్తున్నది.వ్యవసాయ రంగంలో ఆహార పంటల మీద 80శాతం ప్రజలు ఆధార పడి ఉంటారు.కానీ వ్యవసాయ రంగంలో ఆహార పంటల నుండి 2022-23లో కేవలం 12.31శాతం ఆదాయం మాత్రమే సమకూ రింది.పౌల్ట్రీ,పశు సంబంధిత,రొయ్యలు,చేపల నుండి ఆదాయం పెరుగుతూ నేడు 57.35 శాతానికి చేరింది.ఉద్యానవనాలను కూడా కలుపుకుంటే 85.44శాతానికి పెరుగుతుంది. అంటే వ్యవసాయ రంగంలో కేవలం కొద్ది మంది ఆధారపడిన రొయ్యలు,చేపలు,పౌల్ట్రీ, మాంసం వంటి వాటి నుండి అత్యధిక ఆదా యం వస్తున్నది.ఈ మార్పులు వ్యవసాయ రంగంలో కొద్దిమంది చేతుల్లో సంపద పోగుపడుతున్నట్లు,ఉపాధి తగ్గిపోతున్నట్లు తెలియజేస్తున్నాయి. గడిచిన తొమ్మిదేళ్ళలో ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల స్థూల ఉత్పత్తి విలు వను పరిశీలిస్తే చేపలు,రొయ్యలు,పౌల్ట్రీ ఎక్కువ గా ఉన్న జిల్లాల్లో వ్యవసాయం నుండి ఎక్కువ ఆదాయం వస్తున్నది.ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాలో 56.8శాతానికి వ్యవసాయ రంగం నుండి ఆదాయం వస్తున్నది. అలాగే విజయనగరం,విశాఖ,తూర్పుగోదావరి,కృష్ణా, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో కూడా ఈధోరణి మనకి కన్పిస్తున్నది. ఈ జిల్లాల స్థూల ఉత్పత్తి లో వ్యవసాయ రంగం నుండి 40శాతం పైన ఆదాయం వస్తున్నది.జిల్లాల స్థూల ఉత్పత్తి విలువలో పారిశ్రామిక రంగం వాటాను పరిశీ లిస్తే చాలా ఆందోళనకర పరిస్థితి కొనసాగు తున్నది. గత పదేళ్ళలో పెట్టుబడుల సదస్సులు పెట్టినా పారిశ్రామిక అభివృద్ధి కని పించడం లేదు. ప్రభుత్వ పెట్టుబడులు లేకుం డా పోయా యి. ఫలితంగా 2014-22 మధ్య కాలంలో 9 జిల్లాల్లో ఆ జిల్లాల స్థూల ఉత్పత్తిలో పారి శ్రామిక రంగం వాటా క్షీణిస్తూ వస్తున్నది. విశాఖపట్నం జిల్లాలో సైతం ఈకాలంలో 36.3నుండి 33.4శాతానికి పడిపోయింది. విజయనగరం,పశ్చిమగోదావరి,కృష్ణా, ప్రకా శం,అనంతపురం,కర్నూలులో 2021-22 నాటికి పారిశ్రామిక రంగం వాటా ఆయా జిల్లాల స్థూల ఉత్పత్తిలో 20శాతం లోపుగానే ఉంది.పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం 16.1 శాతంలోనే నేటికి కొనసాగుతుంది. సేవా రం గంలో పరిస్థితి కూడా పారిశ్రామిక రంగం వలే తొమ్మిది జిల్లాల్లో దాని వాటా తగ్గుతూ వస్తున్నది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2014-22 మధ్య కాలంలో31.5నుండి 27.1శాతా నికి, కృష్ణాలో 52.2నుండి 43.3శాతానికి, నెల్లూరులో 38.6నుండి 32.9శాతానికి, చిత్తూరులో43.2 నుండి37.4శాతానికి సేవా రంగం వాటా దిగజారింది. విజయనగరం, గుంటూరు,ప్రకాశం,కర్నూలు జిల్లాల్లో సేవా రంగం వాటా గత తొమ్మిదేళ్ళలో ఎదుగు బొదుగు లేకుండా ఉంది. కేవలం విశాఖపట్నం జిల్లాలో మాత్రమే 50నుండి52.6శాతానికి పెరిగింది. ఇక తెలంగాణలో చూస్తే 2014-23మధ్య కాలంలో రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 19శాతం చుట్టూ కొనసాగు తుండగా,పారిశ్రామిక రంగంవాటా 19.2 శాతం నుండి17.3 శాతానికి తగ్గింది. పారి శ్రామిక రంగలో ముఖ్యమైన తయారీ రంగం చూస్తే రాష్ట్ర జిడిపిలో 11శాతం వాటాకి పడి పోయింది. కేవలం సేవారం గం వాటా మాత్ర మే 61.3 శాతం నుండి 62.9శాతానికి స్వల్పంగా పెరిగింది.23శాతం వాటాతో రియ ల్‌ ఎస్టేట్‌ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నది.ఐటి రంగంపై ఆధారపడి ఈ స్పెక్యులేటివ్‌ బూమ్‌ కొనసాగుతున్నది. ఆంధ్ర రాష్ట్రం వలే తెలంగాణలో కూడా వ్యవ సాయ రంగంలో ఆహార పంటల నుండి వచ్చే ఆదాయం కంటే పౌల్ట్రీ, మాంసం, పశుసంపద నుండి వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగు తున్నది.2022-23 సంవత్సరంలో వివిధ రకాల పంటల నుండి రూ.1,08,269 కోట్లు రాగా, పౌల్ట్రీ, మాంసం, పశుసంబంధిత ఆదా యం రూ.95,955 కోట్ల ఆదాయం వచ్చింది. జిల్లాల స్థూల ఉత్పత్తి పురోగతిని చూస్తే తెలం గాణ రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో వలే జిల్లాల మధ్య అసమానతలు, సంపద కేంద్రీక రణ పెరుగుతున్నట్లు తెలుస్తు న్నది. 2022-23 లెక్కలను పరిశీలిస్తే రంగా రెడ్డి,హైద రాబాద్‌,మల్కాజ్‌గిరి మూడు జిల్లాలు కలిపి 43.72శాతం రాష్ట్ర జిడిపిలో భాగస్వామ్యం ఉన్నాయి.మిగిలిన 30 జిల్లాల్లో 6వేల నుండి 15వేలకోట్ల రూపాయల లోపు 10 జిల్లాలు,15 వేల నుండి 25వేలకోట్ల రూపాయలలోపు 12 జిల్లాలు,25వేల నుండి 55 వేలకోట్ల రూపా యల లోపు 5జిల్లాలు రాష్ట్ర జిడిపిలో వాటాతో ఉన్నాయి. దీనినిబట్టి తెలం గాణలో జరుగుతు న్న అసమాన అభివృద్ధిని అర్ధం చేసుకోవచ్చు. తలసరి ఆదాయం చూస్తే రెండు రాష్ట్రాలు దేశ తలసరి ఆదాయం సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి ర్యాంకులో ఉండగా ఆంధ్ర రాష్ట్రం మాత్రం 16వ ర్యాంకులో ఉంది.తెలంగాణలో తలసరి ఆదాయం రూ.1,24, 104 నుండి రూ.3,08,732కు, ఆంధ్ర రాష్ట్రంలో రూ.93, 903 నుండి రూ.2,42, 479కు గత దశాబ్ద కాలంలో పెరిగింది. కానీ తలసరి ఆదాయం లో తెలంగాణ,ఆంధ్రా రెండిరటిలోను జిల్లాల మధ్య అసమానతలు పెరుగుతూ వస్తున్నాయి. తెలంగాణలో 2022-23లో మొత్తం 33 జిల్లా ల్లో కేవలం రెండు జిల్లాలు మాత్రమే రాష్ట్ర తల సరి ఆదాయ సగటు కంటే ఎక్కువ ఆదాయం తో ఉన్నాయి. రంగారెడ్డి రూ.7,58,102, హైదరాబాద్‌ రూ.4,02,941 తలసరి ఆదా యం ఉండగా, సంగారెడ్డి జిల్లా రాష్ట్ర సగటుకి కొంచెం తక్కువగా అనగా రూ.3,01,870గా ఉంది. మిగిలిన 30 జిల్లాలు రాష్ట్ర సగటు తల సరి ఆదాయానికి చాలా దూరంలో దిగువన ఉన్నాయి.ఆంధ్ర రాష్ట్రంలో 2021-22లో తల సరి ఆదాయం రూ.1,92,587గా ఉండగా మొత్తం ఉమ్మడి 13జిల్లాలో 5జిల్లాలు అనగా కృష్ణా (రూ.2,88,551), విశాఖపట్నం (రూ.2,64,225), పశ్చిమ గోదావరి (రూ.2,33,898), నెల్లూరు (రూ.2,12,216), తూర్పు గోదావరి (రూ.1,97,894), జిల్లాలు మాత్రమే రాష్ట్ర తలసరి ఆదాయం సగటుకి ఎగువ భాగాన ఉన్నాయి. ఈ జిల్లాల్లో కూడా కేవలం కొన్ని మండలాల్లో మాత్రమే అత్యధిక తలసరి ఆదా యం ఉంది. మిగిలిన ఏడు జిల్లాలు రాష్ట్ర సగటుకు దిగువ స్థాయిలో ఉన్నాయి. ఎప్పటి లాగే విజయనగరం (రూ.1,28,194), శ్రీకాకు ళం (రూ.1,28,820) జిల్లాలు 12,13 ర్యాంకులతో అట్టడుగునే పదేళ్ళ నుండి కొనసాగుతున్నాయి.రెండు రాష్ట్రాల్లో పాలకులు అనుసరిస్తున్న ఈఉదారవాద కార్పొరేట్‌ ఆర్థిక నమూనా వల్ల గడిచిన దశాబ్ద కాలంలో రెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయ అంకెలు వాస్తవాన్ని మరుగున పరుస్తున్నాయి. భవిష్యత్‌లో ఉభయ రాష్ట్రాల్లో ఆర్థిక అసమానతలు మరింత తీవ్రం కానున్నాయి. వ్యాసకర్త: జీవీఎంసీ కార్పొరేటర్‌ (ప్రజాశక్తి సౌజన్యంతో..) డా.బి.గంగారావు

నూట మూడేళ్ల జాతీయ పతాకం

దేశ భిన్నత్వంలోని ఏకత్వం, సమతా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం.. మన మూడు రంగుల మువ్వన్నెల జాతీయపతాకం. స్వాతంత్య్ర పోరాటంలో సమరయోధుల భుజాలపై నిలిచి.. భారతీయుల ప్రతాపానికి నిదర్శనంగా నిలిచింది. ఇంతటి మహోన్నత పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మన తెలుగుబిడ్డే అవడం.. మరింత సంతోషాన్నిచ్చే విషయం. కోట్లాది హృదయాలను ఏకంచేసిన ఆ 3 రంగుల పతాకం..నేటితో నూటమూడు సంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
-డాక్టర్‌ దేవులపల్లి పద్మజ
రెపరెపలాడే మన త్రివర్ణ పతాకాన్ని చూస్తే.. దేశభక్తి ఉప్పొంగుతోంది. సమైక్యతారాగం నినదిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నో మహోన్నత పోరాటాలకు ప్రతీకగా నిలిచిన ఆ జెండా రూపొందించి..నేటితో నూట మూడేళ్లు పూర్తయ్యాయి. 1921 మార్చి 31న విజయవాడలో జాతిపిత మహాత్మాగాంధీ ఆదేశాల మేరకు..పింగళి వెంకయ్య కేవలం మూడు గంటల్లోనే పతాకాన్ని రూపొందిచడం విశేషం. నగరంలోని విక్టోరియా జూబ్‌లీ మ్యూజియం సమావేశ మందిరంలో గాంధీ సమక్షంలో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలోనే మహాత్మడు.. పింగళికి పతాక రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయన తన అధ్యాపకుడు అయిన ఈరంకి వెంకట శాస్త్రి సహకారంతో కేవలం మూడు గంటల్లోనే పతాకాన్ని తయారుచేశారు.
ఎరుపు,ఆకుపచ్చ రంగులతో పాటు చరఖా అందులో ఉంది. ఆతర్వాత జరిగిన మరో సమావేశంలో గాంధీ..ఎరుపు రంగు హిందు వులకు,ఆకుపచ్చ ముస్లింలకు, తెలుపు ఇతర మతాలకు ఉండేలా పతాకన్ని మార్చాలని సూచించగా…ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు మధ్యలో రాట్నంతో జాతీయపతాకాన్ని సిద్ధం చేశారు.1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభల్లో ఈ మార్పును కాంగ్రెస్‌ జాతీయ మహాసభ ఆమోదించింది.
బీజం పడిరది అప్పుడే…
పతాక రూపకల్పనకు బీజం 1906లోనే పడిరది. 1906లో కోల్‌కతాలో 22వ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు నిర్వహించగా…. ప్రారంభానికి ముందు బ్రిటీష్‌ వారి పతాకమైన యూనియన్‌ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి రావడంతో పింగళి కలత చెందారు. ఈ క్షణం లోనే మనకు ప్రత్యేక జెండా ఎందుకు ఉండ కూడదనే ప్రశ్న ఆయన మదిలో మెదిలింది. ఆ సభలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా..ఆయనను కాంగ్రెస్‌ విషయ నిర్ణయ సమితి సభ్యుడిగా నియమించారు. తర్వాత పతాక ఆవశ్యకతను వివరిస్తూ వెంకయ్య దేశవ్యాప్తంగా పర్యటించారు.ఆతర్వాత జాతీయ పతాకానికి,పార్టీ జెండాకు వ్యత్యాసం ఉండా లని..1947జులై 22న ప్రకటించిన ప్రకారం జాతీయపతాకంలో కాషాయం,తెలుపు, ముదు రు ఆకుపచ్చ రంగుల పట్టీలతో..మధ్యలో నీలిరంగులో అశోకచక్రాన్ని ముద్రించారు. వెంకయ్య తన 19వ సంవత్సర వయ స్సులో దేశం విదేశే పరిపాలనలో నలిగిపో వటం భరించలేక సైన్యంలో చేరిబోయర్‌ యుద్ధంలో ఉత్సాహంగా ల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉండ గానే మహాత్మాగాంధీని కలవటం జరిగింది. వారి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధ శతాబ్దంపాటు నిలిచింది.అప్పటినుంచి జాతీయజెండా ఎలావుండాలనే సమస్యనే ప్రధానంగా దేశంలో ప్రచారం ప్రారంభిం చాడు.1913నుండి ప్రతి కాంగ్రేసు సమావేశానికి హాజరై, నాయకులందరితోనూ జాతీయపతాక రూపకల్పనపై చర్చలు జరిపేవారు. 1916లో ‘‘భారతదేశానికి జాతీయజెండా‘‘ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో వ్రాసి ప్రచురించారు.ఈ గ్రంధానికి అప్పటి వైస్రాయ్‌ కార్యనిర్వాహక సభ్యుడ్కెన కేంద్ర మంత్రి సర్‌ బి.యన్‌. శర్మ ఉత్తేజకరమైన ముందు మాట వ్రాసారు.
త్రివర్ణపతాకావిష్కరణ :- 1906లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రేసు సమా వేశంలో పింగళి తయారుచేసిన జాతీయ జెండానే ఎగురవేశారు.1919లో జలంధర్‌ వాస్తవ్యుడ్కెన లాలా హన్స్‌ రాజ్‌ మన జాతీయ పతాకంపై రాట్నం చిహ్నం వుంటే బాగుంటుం దని సూచించగా గాంధీ దానిని సమర్ధించారు. 1921లోభారత కాంగ్రేసు సమావేశాలు బెజ వాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం,ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒకజెం డాను చిత్రించమని కోరగా,ఒక జెండాను సమ కూర్చారు పింగళిగారు.అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు సత్యం,అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపురంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెం డాలో అదనంగా తెలుపురంగును చేర్చి, నేటి మన త్రివర్ణ పతాకాన్ని రూపొందించి దేశానికి కానుకగా ఇచ్చాడు.మన తెలుగువారి చేత,మన తెలుగుదేశంలోనే,భారత దేశానికి త్రివర్ణ పతాక రూపకల్పన చేయబడి దేశమంతా విజయకే తనం ఎగురవేయబడుతోంది.మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని,రైతు,కార్మిక త్యా గాన్ని తెలియచేస్తుంది.కార్మిక,కర్షకులపై ఆధార పడిన భారతదేశం సత్యము మరియు అహిం సలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందనే ఆశయ చిహ్మమే త్రివర్ణపతాకం.1947 జూల్కె 22వ తేదీన జరిగిన సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మును పటి త్రివర్ణ పతాకంలోని రాట్నం స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా అమర్చారు. చిహ్నం మార్పు తప్పితే, వెంకయ్య రూపొందిం చిన జెండాకు,నేటి జెండాకు తేడా ఏమీలేదు. అశోకుని ధర్మచక్రం మన సంస్కృతికి సంకేతం. ఈ పతాక రూపకల్పనకు పింగళి ఎంతో కృషి చేశారు. ఒకజాతికి,ఆ జాతి నిర్వ హించే ఉద్యమానికి ఒక పతాకం అవసరమన్న గొప్ప వాస్తవం వెంకయ్యకు 1906లోనే కలి గిన ఆలోచన. దానికి కారణం కలకత్తాలో జరిగిన కాంగ్రేసు సభలు.పింగళి 1918 మొదలు 1921వరకు ఎంతో పరిశోధన చేసి 30దేశాల పతాకాలను సేకరించారు. వాటిపై అవగాహన కలిగిన తరువాత 1918 మొదలు 1921వరుకు జరిగిన సభలలో పతాక విష యం ప్రస్థావన తెస్తూనే ఉన్నారు. పతాకానికి చెడుని విధ్వంసం చేసి ఉత్తేజాన్ని కలిగించే శక్తి ఉన్నది.బ్రిటిష్‌ వారు వారి జెండా యూనియన్‌ జాక్‌ను, ఎగురవేయగా అది వారికి అనంత మైన ప్రేరణను ఇచ్చేది. అదే విధంగా మన త్రివర్ణపతాకం కూడా భారతీయులకు స్ఫూర్తి నింపాలని 22 జూల్కె 1947న జాతీయ పతా కంగా భారతజాతి స్వీకరించింది.అందుకే పింగళి వెంకయ్యను,జెండా వెంకయ్య అని కూడా పిలిచేవారు. ఈ పతాక రూపకల్పనకు మేడమ్‌ బ్కెకాజీ కామా,అనిబిసెంటు,సిస్టర్‌ నివేదిత కూడా ప్రయత్నించారు.కానీ సఫలం కాలేదు.దీక్షాతత్పరుల్కెన పింగళి వెంకయ్యని ఆ వరం వరించింది.యంగ్‌ ఇండియా పత్రికలో గాంధీజీ వ్రాసిన ‘‘మన జాతీయ పతాకం‘‘శీర్షికలో పింగళి వెంకయ్య తపన, కృషి, దీక్ష, పతాక రూపకల్పనలో వారు తీసుకున్న శ్రద్ధ గూర్చి వివరంగా వ్రాసారు. పతాక రూపశిల్పి వెంకయ్యను,పత్తి వెంకయ్య, డ్కెమండ్‌ వెంకయ్య, జపాను వెంకయ్య,జెండా వెంకయ్య అను వివిధ నామాలతో పిలుస్తూ గౌరవించుకునేవారు మన భారతీయులు. అన్య దేశాలలో పతాక రూపకర్తలకు స్వర్ణ విగ్రహా విష్కరణలతో కృతజ్ఞతలు తెలియచేస్తారు. వారు కేవలం పతాక రూపకర్తలేకాదు, వారు భారతసైనికులుగా రక్షణ విభాగంలో పని చేసారు. విద్యారంగంలో అధ్యాపకులుగా సేవలందించారు.శాస్త్రవేత్తగా పరిశోధనలు చేశారు. వ్యవసాయదారుడుగా పత్తి పండిర చారు.రచయితగా అనేక రచనలు చేశారు. అభ్రకంపై పరిశోధనలు చేసి వజ్ర కరూరు, హంపీలలో ఖనిజాలు,వజ్రాల గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను తెలియచేస్తూ ‘‘వజ్రపు తల్లిరాయి‘‘ అనే గ్రంధం వ్రాసి ప్రచురించారు. స్వాతంత్య్ర భారత దేశంలో ఖనిజ పరిశోధక శాఖ సలహాదా రునిగా 1960 వరకు సేవలు అందించారు. విధ్యార్థులలో దేశభక్తి కలిగిస్తూ, గుర్రపుస్వారీ, వ్యాయామం,సైనిక శిక్షణ ఇచ్చేవారు. చ్కెనా జాతీయ నాయకుడ్కెన ‘‘సన్‌ యత్‌ సేన్‌‘‘జీవిత చరిత్ర వ్రాసారు.మనకు అనేక సేవలు అందిం చిన ఆ మహాత్ముడు 4జూలై 1963లో శాశ్వ తంగా దూరమైపోయారు. అయితే ఆయన తెలియచేసిన తన చివరికోరిక ‘‘నాఅంత్యదశ సమీపించింది.నేను చనిపోయిన తరువాత త్రివర్ణపతాకాన్ని నాభౌతిక కాయంపై కప్పండి.శ్మశానానికి చేరిన తరువాత,ఆపతాకం తీసి అక్కడ ఉన్న రావిచెట్టుకు కట్టండి.ఇది నా తుది కోరిక‘‘ అని తెలియచేసారు. జాతీయ పతాకం ఎగురుతున్నంతవరకు గౌరవంగా స్మరించుకోవలసిన పింగళి వెంకయ్య నిస్వార్థ దేశభక్తులు.నిరాడంబరమైన జీవితం గడిపిన మహా మనీషి. ఆయనను ప్రజలు సదా స్మరించుకోవలసిన అవసరాన్ని తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైదరాబాదు ట్యాంకు బండుపై వారి కాంస్యవిగ్రహాన్ని ప్రతిష్టింపచేసి వారి దర్శన భాగ్యం నిత్యం ప్రజలకు కలిగిం చారు.పింగళిగారి స్మృత్యర్థం విజయవాడ లో3ఫిబ్రవరి 2008న తిరంగా పరుగును నిర్వహించారు. సుమారు లక్షమంది ఈ పరు గులో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.మన దేశ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకి వందనాలర్పిస్తూ,దేశ ప్రజలకు 77వ స్వాతం త్య్రదినోత్సవ శుభాకాంక్షలు.
వ్యాసకర్త :ప్రముఖ సాహితి సాహితి రత్న,విశాఖపట్టణం,ఫోను 9849692414

1 2