1/70 చట్టం పట్టని అధికారులు

గిరిజనులకు ఆవాసం,జీవనోపాధి,సామాజిక,ఆర్థిక,రాజకీయ ప్రగతితో పాటు సమా నత్వాలకు అత్యంత ప్రధానమైన, విలువైన ప్రకృతి సంపద భూమి. దాంతోనే గిరిజనుల భూములను అన్యాక్రాంతం కాకుండా రక్షించడానికి స్వాతంత్య్రం రాకముందు నుంచి చట్టాలు చేయబడ్డాయి. స్వాతంత్య్రానంతరం కూడా వీటికి కొనసాగింపుగా షెడ్యూలు ప్రాంత భూ బదలాయింపు నిషేధ చట్టం`1959 ఎల్‌.టి.ఆర్‌.1/59చట్టం,1/70చట్టం ఆతర్వాత ఈ చట్టాలకు సవరణ కూడా తీసుకొచ్చారు.ఈ చట్టం ప్రకారం షెడ్యూలు ప్రాంతాలోని భూమితో సహా ఇతర స్థిర ఆస్తులను గిరిజనులు మాత్రమే పొందటానికి అర్హులు. గిరిజనేతరులు ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్డ్‌ ప్రాంతాలో భూమిని కాని,ఏ స్థిరాస్తిని కొనుగోలు లేదా మరి ఏ ఇతర మార్గాల ద్వారా పొందటానికి వీలులేదు. కాని దానికి భిన్నంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలలోని గిరిజనుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. బ్రిటిష్‌ పాలనలో…గిరిజన తెగలు నివసించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు, ఆచారాలు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామాలను షెడ్యూల్డ్‌ (నిర్దేశిత, ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొన్నారు.అందుకోసం ూషష్ట్రవసబశ్రీవస ణఱర్‌తీఱష్‌ం Aష్‌-1874అమల్లోకి తెచ్చారు.మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి నియమితులైన ప్రభుత్వ ఏజెంట్‌ పర్యవేక్షణలో ఈ ప్రాంతాల్లో పరిపాలన జరిగేది.ఏజెంట్‌ పరిపాలనలో ఉన్న ప్రాంతాలు కావడంతో ఏజెన్సీగా పిలవడం మొదలైంది.ఇప్పటికీ అదే పేరు కొనసాగుతోంది.భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను అయిదో షెడ్యూల్‌లో చేర్చారు.అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామాలను వదిలేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత,13జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆతర్వాత 2022లో ఈజిల్లాలను 26జిల్లాలుగా పునర్వీభన చేశారు.దీంట్లో కొత్తగా రెండు ఆదివాసీ జిల్లాలు-పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామ రాజులు ఏర్పడ్డాయి.ఇవిప్రధానంగా ఆదివాసీ ప్రజలతో కూడిన ప్రాం తాలు.అదనంగా,ఏలూరుజిల్లా(పోలవరం,బుట్టయ్యగూడెం,జీలుగుమిల్లి,వెలూరుపాడు, కుకునూరు వంటి మాండల్లు) మరియు అనకాపల్లి జిల్లాలో (జి.మడుగుల,దేవరపల్లి, నాతవరం మండలాల్లోని కొన్ని ఆదివాసీ గ్రామాలు)కొన్ని గిరిజన గ్రామాలు కలిపి 5వషెడ్యూల్‌ కింద వస్తాయి. ఈనేపథ్యంలో రాజ్యాంగబద్దంగా ఐదో షెడ్యూల్‌ ఏరియాలోకి వచ్చే ఈప్రాంతాల్లో 1/70 భూ బదలాయింపు చట్టాన్ని బాధ్యతగా అమలు పరిచే ప్రభుత్వ ఏజెంట్‌ ఎవరనేది గిరిజన ప్రజల్లో తెలియని పరిస్థితులు దాపురించాయి.ఈచట్టం ప్రకారం,ఐదో షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉన్న భూములు ఆదివాసీ ప్రజలవి.ఈభూములను ఆదివాసీ సమాజాల ప్రయోజనాలకు తప్ప మరే ఇతర ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఉపయోగించకుండా ఉండాలి. అంతేకాకుండా, ప్రభుత్వానికి ఈ భూములను ప్రభుత్వ సంస్థలకు కేటాయించే అధికారమూ లేదు.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని,ప్రభుత్వానికి 5వ షెడ్యూల్‌ కింద ఆదివాసీ భూములను రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరం.ముఖ్యంగా ఆదివాసీలు జీవించే జిల్లాలో ‘‘ఏపీ భూబదాలయింపు` 1/70చట్టం’’ను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వ ఏజెంట్లును నియమించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.దీనిపై గిరిజన సంఘా నాయకులు, ఆదివాసీ ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవశ్యకత ఉంది.గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన ఈచట్టాన్ని విస్మరించినట్లుయితే మనలను చరిత్ర క్షమించదు.!

రెబ్బాప్రగడ రవి,ఎడిటర్