జీవుల మనుగడ జీవ వైవిధ్యం
ఈ సృష్టిలో మనుషులకు,తోటి జీవులకు ఒకటే గ్రహం,ఒకటే గృహం.మనుషులంతా ఒకటే అనేది ఉట్టి మాట. పొడుగు,పొట్టి,లావు,సన్నం,నలుపు,తెలుపు,ఇంకా వీటి మధ్యస్థ రకాలు,భేదాలు.ఇంకా మనుషు లంతా ఒకటే అని అనుకోవడం ఏమిటి?ఒక్క మనుష్య జాతిలోనే ఇన్ని భేదాలుంటే, మనిషికి తెలిసిన మిగతా జంతు, వృక్ష జాతులలో మరిన్ని వైవిధ్యాలు ఉన్నాయి.ఈభూమ్మీద ఉండే జీవులలో ఉండే ఈ తరహా భేదాల న్నిటినీ కలిపి జీవవైవిధ్యం అంటున్నాం. జీవవైవిధ్యం భూమిపై జీవుల ఆరోగ్యాన్ని కొలిచే థర్మామీటర్ వంటిది.ప్రకృతిలో ప్రతి జీవి ఒకప్రత్యేక పాత్రనుపోషిస్తూ పర్యావరణవ్యవస్థల స్థిరత్వం,స్థితిస్థాపకతకు దోహ దం చేస్తుంది.ఒకపురుగో,అసలిప్పటివరకు సామాన్య మానవులకు కనిపించని ఒక మొక్కో లేదా ఏదో విషపు పాముల వంటి జంతువో అంతమైపోతే మనకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? అది మన దైనందిన జీవితాలపై నిజంగా ప్రభావం చూపుతుందా? పర్యావరణ వ్యవస్థలోని ప్రతిజాతి ఇతర జీవ రూపాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంక ర్షణ చెందుతుంది.పర్యావరణ వ్యవస్థను ఒకభారీ నెట్‌వర్క్‌గా భావించవచ్చు, ఇక్కడ ప్రతి జీవిఒకదారం ద్వారా ఇతరులతో అనుసంధానించబడి ఉంటుంది. ఒక దారం తెగిపోయినప్పుడు,దానితో నేరుగా అనుసంధానించబడిన జాతులు ప్రభావితమౌతాయి.అయితే అవి పరోక్షంగా దానితో సంకర్షణ చెందే వాటిపై ఎక్కువ లేదా తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. పర్యావరణ వ్యవస్థ ఎంత వైవిధ్యం గా ఉంటుందో,అది అంతబాగా అంతరాయాలను తట్టుకునే శక్తి కలిగి ఉం టుంది.జీవుల సహజ ఆవాసాల నాశనం,కాలుష్యం లేదా వాతావరణ మార్పుల ద్వారా కలిగే అంతరాయాలతో పర్యావరణం నిలకడగా ఉండదు.అందుకు కారణం జీవవైద్య నాశనమే. కొన్ని జాతుల నష్టం కూడా మానవ జనాభాకు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది, మన జీవితాలను ప్రభా వితం చేస్తుంది.
ప్రకృతి అందించే అపరిమిత సేవలు :ప్రతిరోజూ,జీవవైవిధ్యం మనకు అనేక రకాలుగా సేవలను అందిస్తుంది. ఉదాహరణకు,మొక్కలు కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తూ ఆక్సిజన్‌ను అందిస్తాయి. తేనెటీగలు మరి యు ఇతర కీటకాలు మొక్కల ఫలదీకరణానికి దోహదపడతాయి, మాంసాహారులు శాకాహారి జనాభాను నియంత్రణలో ఉంచుతాయి.ఆక్సిజన్ ఉత్పత్తి, నేల నిర్మాణం, నీటి చక్రం వంటి క్రియలు పర్యావరణ వ్యవస్థలు సాఫీగా నడవడానికి తోడ్పడే ప్రాథమిక అంశాలు.నిజానికి జీవవైవిధ్యమే వాతావరణ మార్పులను తగ్గించ డానికిఉపయోగపడుతుంది.ఉదాహరణకు, మానవు లు ఉత్పత్తిచేసే కార్బన్ డయాక్సైడ్‌లో దాదాపు సగ భాగాన్ని పీల్చుకోవడంద్వారా వాతావరణాన్ని నియం త్రించడంలో సముద్రాలు,అడవులు కీలక పాత్ర పోషి స్తాయి.చిత్తడి నేలలు,మడ అడవులు,పగడపు దిబ్బల వంటి తీరపర్యావరణ వ్యవస్థలు తుఫానులు, వరదల నుండి సహజ రక్షణను అందిస్తాయి.వృక్షాలు గాలి నీటిశుద్దీకరణతోపాటు,ఉష్ణోగ్రతలను తగ్గించడానికి, మట్టిని స్థిరీకరించడానికి,తద్వారా వరదల ప్రమా దాన్ని తగ్గిస్తాయి. కానీ దురదృష్టవ శాత్తూ, ప్రస్తుతం వాతావరణ మార్పులే జీవవైవిధ్యాన్ని కుప్పకూలుస్తు న్నాయి.పర్యావరణం స్థిరంగా ఉండాలంటే,జీవ వైవి ధ్యం అధికంగా ఉండటం ముఖ్యం. వైవిధ్య భరి తమైన పర్యావరణం మరింత స్థిరంగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల జీవవైవిధ్యంపై అనేక దుష్పరిణామాలు కలుగుతాయి.ఎన్నో శాస్త్రీయ నివేది కలు ఈవిషయాన్ని నివేదించాయి. ఉష్ణోగ్రతలు 1.5 పెరిగితే, దాదాపు 6% కీటకాలు,8% మొక్కలు 4% సకశేరుకాలు వాటి భౌగోళిక పంపిణీలో (ఆవాసాల మార్పు)మార్పులకులోనవుతాయి.ఉష్ణోగ్రతల పెరుగు దల 2%మేర అయితే,ఈ శాతాలు రెట్టింపు అవుతా యి.ఈకారణంగా,ఆక్రమణ జాతులు కూడా అనూ హ్యంగా విస్తరించే ప్రమాదముంది. ప్రపంచ భూభా గంలో దాదాపు 7%పర్యావరణ వ్యవస్థలు మారే ప్రమాదం ఉంది, అందువల్ల సహజ ఆవాసాల క్షీణత రాబోయే సంవత్సరాల్లో వేగవంతం అవుతుంది. ఫినోలాజికల్ మార్పులు (కొన్ని జాతుల పుష్పించే లేదా పునరుత్పత్తి వంటి ఆవర్తన సంఘటనలు) ఎక్కు వగా నమోదు చేయబడుతున్నాయి, ఫలితంగా జాతు ల మధ్య పరస్పర సంబంధాలపై ప్రభావం చూపు తుంది.ఉష్ణోగ్రత1.5జలేదా2%జపెరిగితే, దాదాపు 70-99% పగడపు దిబ్బలు నాశనమవుతాయి. ఈ సృష్టిలో మనుషులకు,తోటి జీవులకు ఒకటే గ్రహం, ఒకటే గృహం.కంటికి సరిగ్గా కనిపించని బ్యాక్టీరి యా నుండి ఆకాశాన్ని అందుకునే ఎత్తైన చెట్ల వరకు అగాధాలలో అనాయాసంగా నివసించే సముద్ర జీవుల నుండి అలవోకగా ఆకాశంలోఎగిరే పక్షుల వరకు భూమికోట్ల కొద్దీ జీవజాతులకు నిలయం. నిత్యం కనుగొనబడే జీవజాతులు, వాటి శాస్త్రీయ వర్గీకరణ కారణంగా ఖచ్చితమైన సంఖ్య ఇప్పటికీ అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అధికారి కంగా 17కోట్ల జాతులను మాత్రమే గుర్తించాము. యాభై నుండి మూడువందల కోట్ల జీవజాతులు ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఇంతటి విస్తృతమైన వైవిధ్యం రాత్రికి రాత్రే పుట్టుకు రాలేదు. ఇది ఇప్పటి స్థితికి రావడానికి దాదాపు నాలుగు వందల కోట్ల సంవత్సరాల పాటు జీవపరిణామక్రమ ప్రక్రియ జరగవలసి వచ్చింది. కానీ ఆకోట్లాది జాతులలో కొన్ని జాతులు సమూలంగా అంతరించడం జరిగిం ది మాత్రం మానవుడు ఆవిర్భవించిన ఇటీవలి కాలంలోనే!భూమిచరిత్రలో జీవవైవిధ్యం అంతరించి పోవడం,పునరుద్ధరణ జరగడం సహజ ప్రకృతి చర్యనే.గతంలో కనీసం అయిదు సార్లు సహజ కార ణాలవల్ల సామూహికంగా జీవుల విలుప్తాలు (జుఞ్‌ఱఅష్‌ఱశీఅం)జరిగాయి.వీటిలో చివరిది 65 మిలి యన్ సంవత్సరాల క్రితం జరిగిన డైనోసార్ల విలు ప్తం.కానీ ఆందోళన కలిగించే విషయం ఏమి టంటే,ప్రపంచీకరణనుండి,జీవవైవిధ్య నష్టం ప్రమా దకర స్థాయిలో వేగవంతమైంది. ఇప్పుడో ఆరవ సామూహిక విలుప్తత జరిగే ప్రమాదం ఉందంటు న్నారు శాస్త్రవేత్తలు. చిక్కగా నేసిన వస్త్రంలో నుండి ఒక్కో దారం లాగేస్తుంటే, పల్చనైపోయి, వదులుగా మారి, క్రమేపీ కనుమరుగయ్యే వస్త్రం చందాన మన గ్రహం పైనున్న జీవవైవిధ్య పరిస్థితి ఉంది.అతి సూక్ష్మజీవుల నుండి భారీ నీలి తిమింగలాల వరకు, ప్రతిజాతి మన పర్యావరణవ్యవస్థ అనే వస్త్రపు సమ తుల్యతను కలిపి ఉంచే కీలకమైన దారాలు. ఇప్పుడు ఆ వస్త్రం నుండి దారపు పోగులు ఒక్కొక్కటిగా జారి పోతున్నాయి.మన కళ్లముందే ప్రకృతికను మరుగవు తోంది.భూగ్రహంపై జీవవైవిధ్యం ముప్పులో ఉండ టానికి ప్రధాన కారణం, దానిపైనే అధికంగా ఆధార పడే జీవి-మనిషి కావడం విశేషం.జీవవైవిధ్యం మానవ శ్రేయస్సు జీవనోపాధికి చాలా అవసరం. ఎందుకంటే ఇది అసలు జీవపు ఉనికికే ఆలంబన. కానీ,జీవుల సహజ నివాస స్థలాల నష్టం, కాలుష్యం, వ్యవసాయం,వేటాడటం,ఆక్రమణ జాతులు మరియు పెరుగుతున్న గ్లోబల్‌వార్మింగ్ కారణంగావక్ష, జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదం పెరుగు తూనే ఉంది.గత కొన్నిసంవత్సరాలలో,జనాభా పెరుగు దల,దాంతోబాటే విపరీతంగా,అనిశ్చితంగా పెరిగి న,ఉత్పత్తి, వినియోగ విధానాలు జీవవనరు లకు వినియోగాన్ని పెంచాయి. దీని వలన జీవవైవిధ్యం నాటకీయంగా నష్టపోయింది. జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం అనేది మానవజాతి ముందున్న గొప్ప సవాళ్లలో ఒకటి.జీవవైవిధ్యం అనే పదాన్ని 1988లో అమెరికన్ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఓ.విల్సన్ మొదటిసారి ప్రయోగించాడు. ఈ పదం, మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు మరియు సూక్ష్మజీవులు,అలాగే పర్యావర ణ పరస్పర చర్యలతో సహా గ్రహం మీద ఉన్న వివిధ రకాల జీవ రూపాలను సూచిస్తుంది. జీవవైవిధ్యాన్ని భూమిపై ఉన్న జీవసంపదగా నిర్వచించవచ్చు. జీవ వైవిధ్యాన్ని పర్యావరణ వ్యవస్థలోని జాతుల సంఖ్య ద్వారా కొలుస్తారు, ప్రతిజాతి జనాభాలో జన్యు వైవి ధ్యాన్ని అంచనా వేయడం ద్వారా మరియు వివిధ వాతావరణాలలో జాతుల పంపిణీ అంచనా ద్వారా కూడా కొలుస్తారు. మానవ కార్యకలాపాల కారణం గా జీవ వైవిధ్యంలో గణనీయమైన తగ్గుదల సమస్య పై అవగా హన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్స రం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపు తుంది.
మనదేశంలో జీవవైవిధ్యం
భారతదేశం,32,87,263చదరపు కిలోమీటర్ల వైశా ల్యంతో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. భారత దేశంలో89,451జంతుజాతులున్నాయి.ఇది ప్రపంచజంతుజాలంలో7.31%. అలాగే 49,219 వృక్ష జాతులున్నాయి.ఇది ప్రపంచమొత్తంలో 10. 78% వాటాను కలిగి ఉంది. ప్రపంచంలో ఉన్న పదిహేడు అతి పెద్ద జీవవైవిధ్య దేశాలలో భారత దేశం ఒకటి. భూవిస్తీర్ణంలో 2.4 శాతమే ఉన్నప్ప టికీ, ప్రపంచవ్యాప్త జీవజాతులలో 7.8 శాతం మన దేశంలో ఉన్నాయి. మన ప్రభుత్వం 2002లో జీవవైవిధ్య చట్టాన్ని తీసుకువచ్చింది. – (డా.కాకర్లమూడి విజయ్)
