హక్కుల ప్రాధాన్యత ప్రంచానికి చాటుదాం

‘‘ మానవ ప్రగతికి దోహదం చేసే పరిస్థితులే హక్కులు. సమాజ ఆమోదం పొంది, చట్టబద్ధమై నప్పుడే అవి అర్థవంతమవుతాయి.జాతి,మత,కుల,లింగ, ప్రాంతీ య తేడాలతో సంబంధం లేకుండా మానవులందరికీ హక్కులు వర్తిస్తాయి.వ్యక్తి గౌరవాన్ని (ఔన్నత్యాన్ని) పెంపొందించడానికి హక్కులు అవసరం. ఇవి మానవ నాగరికతకు నూతన ప్రమాణాలు.హక్కులు లేని మనిషి బానిసతో సమానం. ఎందుకంటే మనిషి స్వతంత్రంగా జీవించి, తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయి. ఎన్నో పోరాటాల ద్వారా, మరెన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న మానవ హక్కులకు నేడు రక్షణ లేకుండా పోయింది. మానవ హక్కులకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలే వాటిని హననం చేస్తు న్నాయి. మానవుల మాన, ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవహక్కులు. పుట్టుకతో ప్రతివ్యక్తికి లభించే ఈ హక్కులు జాతి,మత మౌఢ్యంవల్ల,రాజకీయాలవల్ల, వ్యక్తిగత ద్వేషం,కక్ష, కార్పణ్యాల వల్ల మనుషుల జీవితా లకు భరోసా లేకుండా పోతోంది. ’’
ప్రపంచంలో మానవులందరూ ఒక్కటే అని మనం గొప్పగా చెప్పుకున్నా,నవ నాగరిక సమాజంలో మన ప్రయాణం సాగుతూ ఉన్నా అనేక సందర్భాలలో స్వార్థం,కుటిలత్వం,అమానుషత్వం వంటి అనేక కారణా ల వల్ల మనిషి ప్రాణాలకు సాటి మనుషుల నుండే ముప్పు వాటిల్లుతోంది. అటువంటి పరిస్థితులలో మనిషి ప్రాణా లకు భద్రత కావాలంటే మానవ హక్కులు అవసరం. ఆహక్కుల ద్వారానే మనిషి తనకు తాను రక్షణ కల్పించు కోవచ్చు.ఈ మానవ హక్కుల గురించి ఈనాడు చర్చ చేయడం,పోరాటాలు చేయడం అనేది గొప్ప విషయం కాదు.క్రీ.శ.1215లోనే ఈమానవ హక్కుల సాధన విష యమై ఒకప్రకటన జరిగింది అంటే ఆశ్చర్యకరమే. అప్ప టి ఇంగ్లాండ్‌ రాజు జాన్‌ విడుదల చేసిన ‘మాగ్నా కార్టా’ మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటనగా భావించవచ్చు. న్యాయబద్ధమైన తీర్పుద్వారా తప్ప,మరేవిధమైన పద్ధతు ల్లోనూ పౌరుల స్వేచ్ఛను హరించడం నిషేధం’ అని హక్కులకు సంబంధించిన చారిత్రక శాసనం ‘మాగ్నా కార్టా’ స్పష్టం చేసింది.
ఈ భూమ్మీద ఒకానొకప్పుడు పాలన సాగించిన నియంతలు,చక్రవర్తులు,రాజులు మా మాటే వేదం, మేం దైవాంశ సంభూతులం,తిరుగులేని అధికారం మాకే స్వం తం,చట్టానికి మేం అతీతులం అంటూ పాలన సాగించిన పాలకుల అధికారానికి మొట్ట మొదటిసారిగా అడ్డుకట్ట వేసిన ఘటనకు మరో పేరే మాగ్నాకార్టా.ఎవరైతే ప్రజల హక్కులను అణచివేసి,అతనే తప్పనిసరి పరిస్ధితులలో హక్కుల పత్రంపై సంతకం చేసిన క్షణాలు ఈ ప్రపం చంలో ప్రజాస్వామ్యానికి పునాది పడిన ఆ ఘడియల నుండే న్యాయం,స్వేచ్ఛ అనే మహత్తర భావాలకు పునాదు లు పడ్డాయి. రాజే సర్వాధికారి అని ప్రబలంగా నాటుకు పోయిన అభిప్రాయం ఆ రాజు సంతకంతోనే కొట్టుకు పోయింది. నియంతలపై ప్రజా సంక్షేమం పట్టని వారిపై ఈ రోజున ఉద్యమాలు చేయడం గొప్ప విషయం కాదు. ఏనాడో 800సంవత్సరాల క్రితమే సర్వాధి కారాలు చెలాయిస్తున్న అప్పటి ఇంగ్లాండ్‌ రాజు జాన్‌ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఫలితమే మాగకార్టా. నియంతరాజు మెడలువంచి స్వేచ్ఛ, సమా నత్వం అనే భావాలు మానవుల హక్కు అని నిరూపించి ప్రపంచానికి అందించిన వ్యక్తి స్వేచ్ఛల హక్కుల పత్రం.. ఇది చరిత్ర లో ఓకీలక ఘట్టం.చట్టానికి ఎవరూ అతీ తులు కాదు రాజైనా పేదైనా చట్టం ముం దు అందరూ సమానులే అంటూ ఇంగ్లాం డ్‌ ప్రజానీకం పోరు బాట పట్టింది.రాజే సర్వాధికారి అనే వేలసంవత్సరాల అభిప్రా యాన్ని కేవలం ఆఒక్క సంతకంతో తల్ల కిందులు చేసింది. తిరుగులేని ఇంగ్లాండ్‌ రాజే చట్టానికి లోబడి వ్యవహరించే అని వార్య పరిస్థితిని ఈ చారిత్రక ఒప్పందం కల్పించింది.ఆపరిణామంతో నియం తత్వ, తిరుగులేని అధికారాలు క్రమంగా పలుచబడుతూ, ప్రస్తుతం ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆవిర్భావానికి దారితీసింది. ప్రపంచ మానవాళికే గొప్ప బహుమతిని అందించింది.మానవ హక్కు లకు పట్టం కట్టింది. భావితరాల వారికి ఈవ్యక్తి స్వేచ్ఛహక్కులపత్రం నాందీ ప్రస్తా వనగా నిలిచింది అని చెప్పడంలో ఎటు వంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ పత్రం స్వేచ్ఛా హక్కుల పరిరక్షణోద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ తదుపరి 1789వసం.లోఫ్రెంచ్‌ డిక్లరేషన్‌ పేరిట మానవ హక్కుల గురించి పేర్కొన్నారు. కాలక్రమేణా అనేక మంది మేధావులు ఈభూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతం త్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుండాలని, సాటి మనిషిని మనిషిగా కూడా చూడాలని అది హక్కుల కల్పన ద్వారానే సాధ్యపడుతుందని అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది. మనుషుల్లో జాతి,భాష,కులమతాల జాఢ్యం వీడని కారణంగానే మానవ విలువలు అడుగంటిపో తున్నాయి. మానవ హక్కులు లేని నాడు, మానవ జీవనం మరింతహీనంగా పరిణమిస్తుందని అనేక మంది సాంఘి క సంస్కర్తలు తమభావాలను వ్యక్త పరుస్తూ అనేక గ్రంధాలు, ప్రసంగాలు చేపట్టి ఈ హక్కుల ప్రాధాన్యత ప్రపంచానికి చాటి చెప్పారు.వీటిని పురస్కరించుకునే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల రూపకల్పనకై ముం దడుగు వేసింది. – (రుద్రరాజు శ్రీనివాసరాజు)