స్వీయ అనుభూతి గురి
నేటితరం గిరిజనసాహిత్యంకు ప్రామాణికతను పెంపొందించే దిశగా జరుగుతున్న కృషిలో భాగంగా…’’వర్తమాన గిరిజన సమాజానికి కావలసింది సానుభూతి సాహిత్యం కాదు సహను భూతి సాహిత్యం’’ అని ఘంటాపధం గా చెప్పడమే కాదు ఆచరించి చూపిస్తున్న నేటి కాలపు బంగారు భవిత కలిగిన రచయిత నేటి తరం యువతరానికి ఆదర్శనీయుడు ‘‘మల్లిపురం జగదీశ్’’ మలి కథా సంపుటి ‘‘గురి’’,2013 నుంచి 2018సం: మధ్యకాలంలో రాయబడ్డ ఈ 13 కథల్లో.. ఉత్తరాంధ్ర ప్రాంతపు గిరిజన సమాజం ప్రపంచీకరణ పడగ నీడన ఎలా విలవిలలాడుతుందో కళ్ళకు కట్టినట్టు అక్షర బద్ధం చేశారు.
అయితే ఈ వ్యధలు కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం కాలేదు యావత్తుదేశానిదికూడ…!! రచయిత తను స్వయంగా సవిచూసిన విషయాలను అక్షరబద్ధం చేసే బాధ్యతలో భాగంగా తనదైన కథా శైలిలో అభివ్యక్తీకరించారు, దీనిలో ప్రతి కథ తన గిరిజన సామాజిక కుటుంబాల చుట్టూ పరిభ్రమిస్తుంది.
మానవ సంబంధాలు అన్ని ‘‘మనీ సంబంధాలు’’గా రూపాంతరం చెందుతున్న క్లిష్ట పరిస్థితుల్లో.. అడవి బిడ్డల మునుగుట ప్రశ్నార్థకం అయిపోతున్న కాలంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం గురించి వివరిస్తూ జాగృతం చేసే లక్ష్యంతో వ్రాయబడ్డ కథలుగా కనిపిస్తాయి ఇవన్నీ.
అన్ని మార్గాల ద్వారా దాడికి గురి అవుతున్న అడవి బిడ్డల దయనీయ స్థితిని అద్దం పడుతున్న ఈ ‘‘గురి’’ కథాగుచ్చంలోని పతాక శీర్షిక అయిన కథ విషయానికొస్తే తరతరాలుగా ఆదివాసి బిడ్డలపై జరుగుతున్న అరాచకాలు దరిమిలా అడవి బిడ్డల్లో వస్తున్న తిరుగుబాటు తత్వం గురించి అక్షరీకరించిన కథ ‘‘గురి’’ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆదివాసి బిడ్డల జీవితాలపై పెట్టుబడిదారీ వ్యవస్థ సాగిస్తున్న అణచివేత ధోరణి తీరు ఆధునిక పాఠక లోకానికి ఆశ్చర్యం కలిగించక మానదు, ఆధునిక కాలంతో పాటు అడవి బిడ్డల బ్రతుకు చిత్రాల్లో ఆధునిక జీవన సరళి అగుపిస్తున్న అణచివేత కూడా అదే స్థాయిలో ఆధునిక పంథాల్లో సాగటం పట్ల రచయితతో పాటు పాఠకులు ఆగ్రహించి నివారణోపాయాలు గురించి ఆలోచించాల్సిన తరుణమిది.గురి కథలు మంగులు అతని కొడుకు సత్యం ఏవిధంగా పెత్తందారులైన భూస్వాముల అరాచకాలకు బలి అయ్యారో మల్లిపురం జగదీశ్ తనదైన కథన శైలిలో కళ్లకు కట్టారు. మంగులు,సత్యం తండ్రి కొడుకులు ఇద్దరి కథనాల్లోనూ సంఘవిద్రోహక శక్తులుగా భావించబడుతున్న నక్సలైట్ల పాత్రను కథా రచయిత భావ గర్భితంగా సూచించారు, వారివల్ల అడవి బిడ్డలకు మేలా? కీడా?? అనే విషయాన్ని కాలానికి వదిలివేసిన, తల్లి తండ్రి అన్యాయాలకు బలై అనాధ అయిన సత్యం బ్రతుకుతెరువు కోసం పట్టణం తరలి పోయిన అతని పోరాట దృక్పథంలో మార్పు రాలేదు సరి కదా అది వారసత్వంగా తన కూతురు గీతకు ఆపాదించిన వైనం పోరాటస్ఫూర్తి, అందులోని సజీవత్వం ఆవిష్కరించబడతాయి. మహానటి సమాజంలో అక్రమాలను ఎదిరించిన తండ్రి మంగులు మంత్రగాడి నేరంతో సమా జానికి దూరం చేయబడితే నీటి కాలానికి చెందిన అతడి కొడుకు సత్యం తండ్రిలో ధనవంతులు అన్యాయాన్ని ఎదిరించి ఇన్ఫార్మర్ గా నేరం మోపబడతాడు అక్కడ సత్యం తప్పించుకుని నగరం బాట పడితే ఇక్కడ అతని కూతురు గీత తండ్రికి జరిగిన అన్యాయానికి ఎదురునిలిచి గురి పెట్టడం ద్వారా రచయిత గిరిజన సమాజానికి స్ఫూర్తిని ధైర్యాన్ని అందిస్తూ కథను ఉత్తమ కథా లక్షణాలతో ముగిస్తారు. బిడ్డల కష్టాల గురించి కథా రచయిత పరిశీ లించిన తీరు కోణాలు ఔరా అనిపిస్తాయి.’’ నిత్య నిర్వాసితులు’’ కథలో ప్రభుత్వ అధికారులు వారికి గల నియమాలను బూచిగా చూపిస్తూ అమాయకులైన ఆదివాసి జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో వివరిస్తారు. ముఖ్యంగా ప్రాజెక్టులవంటి బహుళార్థక కట్టడాలకు మొదట బలయ్యేది అడవి బిడ్డలే !! పాలకులు ప్రాజెక్టుల ద్వారా పంట భూములు విస్తీర్ణం పెంచుకొని నీటి సౌకర్యం పెంచుతు న్నామని ఏక కోణం ఆలోచనతోనే ముందుకు పోతున్నారు తప్ప ఎప్పటినుంచో ఆ గ్రామాల మీద ఆధారపడి జీవిస్తున్న అడవి బిడ్డల జీవి తాలు నిత్యనిర్వాసితం అయిపోతున్నాయనే మానవత్వపు ఆలోచనలు మన అధికారులకు కానీ పాలకులకు కానీరాకపోవడంపై రచయిత తీవ్ర విముఖత వ్యక్తం చేశారు ఈ కథలో. పెల్లివలస అనే గిరిజన గ్రామం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి వలసరాగ దురదృష్టవశాత్తు ఆ గ్రామం అగ్ని ప్రమాదంలో కాలి బూడిద అయింది దానికి కేవలం తత్కాలిక తిండిగిం జలు పంపిణీ సాయంతో సరిపెట్టారు అధికా రులు,అది రెవెన్యూ గ్రామంగా గుర్తింపు కాలేదు కనుక పక్కా గృహాలు మంజూరు చేయలేమన్న అధికారుల అలసత్వం ఈ కథలో చూపించారు రచయిత. నిర్వాసిత గ్రామంలో ప్రకటించ డంలో అధికారులు చేసిన అలసత్వంవల్ల అమాయకులైన ఆదివాసీలు ఎలా నష్టపోయారో ఉదాహరిస్తూ ఇలాంటి చేయని నేరాలకు ఎలా శిక్షలు అనుభవిస్తున్నారో రచయిత ఇందులో వివరించిన వైనం హృద్యంగా సాగుతుంది, ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు గారు అన్నట్టు ఇవి కతలు కావు ఆదివాసి వెతలు, అడవుల్లో జరుగుతున్న అభివృద్ధి ఆధునీకరణల వల్ల అడవి బిడ్డలకు దక్కే ఫలా లు గోరంత అయితే పెట్టుబడిదారులకు కొం డంత ఆదాయం దక్కుతుంది అనే వాస్తవ విష యాలు చెప్పడంలో రచయిత మల్లిపురం గారు విజయం సాధించారు. యుగయుగాలుగా అభి వృద్ధి యజ్ఞంలో మొదట బలయ్యే’’బలిపశువు’’ ఆదివాసినినే అన్న రచయిత భావనలో నిండు నిజాం దాగి ఉంది. అలాగే ఆదివాసీ లకు ఆరోగ్య రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు నగరా లను ఎంత అభివృద్ధి చేస్తే ఏమిటి అని ‘‘డోలి’’ కథలో రచయిత ప్రశ్నిస్తారు, అడవి బిడ్డల్లో వస్తువ్యామోహం పెంచి అధిక లాభాలతో వారిని అప్పుల పాలు చేస్తున్న నాగరిక వ్యాపా రుల తీరును ఎండగట్టిన తార్రోడ్డు కథ, భూ విముక్తి పోరాటంలో పాల్గొన్న ఆదివాసీలు చివరికి భూమిని పోగొట్టు కున్న వైనాన్ని ధైన్యం గా చూపించిన కథ ‘‘తాండ్ర చుట్ట’’. సభ్య సమాజానికి తెలియని అడవి బిడ్డల ఆగచాట్లు ఎన్నో ఈ ‘‘గురి’’ కథా సంపుటిలో కనిపిస్తాయి, ఈ కథల్లో ఇంత ఘాడతకు కారణం రచయిత ఓగిరి పుత్రుడు కావడమే, అతడు గిరిజనుల ను చూసి రాసిన కథలుకావు, వారితో మమేకమై వ్రాసిన కథలు నిజమైన గిరిజన కథలకు నిల యమైన మన మల్లి పురం జగదీశ్ కథలు ప్రతి ఒక్కరికి అవసరం, గిరిజన జీవితాల పరిశో ధకులు ప్రత్యేకించి చదవదగ్గది –డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్ : 7729883223)