సవరణల పేరిట…. జీవవైధ్యానికి తూట్లు !
‘‘మానవ మనుగడకు బహుళ ప్రయోజనాలను అందిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణ కాపా డేవి అడవులే. అటువంటి అడవులు క్రమేపీ కనుమరుగు అవుతు న్నాయి ఇది ఒకదేశానికి చెందిన సమస్య కాదు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ అడవుల తరుగుదల ఏర్పడుతూ ఉంది. వీటిని కాపాడుకోలేకపోతే భూతాపం వలన ఏర్పడే ప్రమాదాన్ని ఈ సృష్టిలోగల ప్రతీజీవి అనుభవించ వలసి వస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. దీనిని దృష్టిలో ఉంచుకునే మన దేశం కూడా ఎన్నో అంతర్జాతీయ సదస్సులలో తీర్మా నాలు చేసుకుంటూ హామీలు ఇస్తూ వస్తున్నది. అయితే ఎన్ని సదస్సులు జరిగిన తీర్మానాలు చేసినా వాస్తవంలో మాత్రం భూతాపాన్ని తగ్గించి ప్రాణ వాయు వును అందించే అడవులు మాత్రం క్రమేపీ క్షీణిస్తూనే ఉన్నాయి. ఫలితంగా పర్యావర ణం కాలుష్య భరితం అవుతూ ఉంది. మానవుని స్వార్థ పూరిత చర్యలు వల్లనే ఈఅడవులు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా తరిగిపోతున్నాయి అనేది నిర్వి వాదాంశం’’
భూతాపం, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులను అడ్డుకోవడానికి సహజసిద్ధమైన అత్యుత్తమ పరిష్కారం అడవుల పరిరక్షణ.మానవ మనుగడకు బహుళ ప్రయోజనాలను అందిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణ కాపాడేవి అడవులే. అటు వంటి అడవులు క్రమేపీ కనుమరుగు అవుతు న్నాయి ఇది ఒక దేశానికి చెందిన సమస్య కాదు ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ అడవుల తరుగు దల ఏర్పడుతూ ఉంది.వీటిని కాపాడుకోలేకపోతే భూతా పం వలన ఏర్పడే ప్రమాదాన్ని ఈసృష్టిలోగల ప్రతీ జీవి అనుభవించవలసి వస్తుందిఅనే సత్యాన్ని మనం గ్రహించాలి.దీనిని దృష్టిలో ఉంచుకునే మన దేశం కూడా ఎన్నో అంతర్జాతీయ సదస్సులలో తీర్మానాలు చేసుకుంటూ హామీలు ఇస్తూ వస్తున్నది.అయితే ఎన్ని సదస్సులు జరిగిన తీర్మానాలు చేసినా వాస్తవంలో మాత్రం భూతాపాన్ని తగ్గించి ప్రాణ వాయువును అందించే అడవులు మాత్రం క్రమేపీ క్షీణిస్తూనే ఉన్నాయి.ఫలితంగా పర్యావరణం కాలుష్య భరితం అవుతూ ఉంది.మానవుని స్వార్థపూరిత చర్యలు వల్లనే ఈఅడవులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా తరిగిపోతున్నాయి అనేది నిర్వివాదాంశం. వంట చెరకు, కలప స్మగ్లింగ్, చెట్ల నరికివేత, పట్టణీకరణ, ఆక్రమణ, అటవీ భూములు వ్యవసాయ భూములుగా మార్పు, ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యకలాపాల వలన అరణ్యాలు నానాటికీ కుదించుకుపోతున్నాయి.బ్రిటీష్ వారి కాలంలోనే ఈ అటవీ పరిరక్షణకై మన దేశంలో 1927వ సంలో అటవీచట్టం పురుడు పోసుకోవడం జరి గింది.దాని కొనసాగింపుగా మనదేశంలో 1980 వ సంలో అడవుల పరిరక్షణకై పటిష్ట చట్టాన్ని రూపొందించాం. ఎట్టి పరిస్ధితులలో కూడా అడవు లను ఆటవీయేతర ఉత్పత్తి కార్యక్రమాలకు ఉపయో గించకూడదని చట్టంలో స్పష్టంగా పేర్కొ న్నాం. 1988 మరియు 1996వ సంలో ఈ చట్టానికి సవరణలు తీసుకు వచ్చి అటవీ భూముల పరిరక్షణ మరింత రక్షణ కల్పించాం. అయితే ఆస్ఫూర్తి వాస్త వంలో మాత్రం కనపడటం లేదు అనడానికి ప్రతీ ఏటా మన దేశంలో క్షీణిస్తున్న అడవులే ప్రధాన సాక్ష్యం. సవరణ చట్టంలో 1927 నాటికి వేటిని అడవులుగా నిర్వచించామో వాటినే ప్రస్తుతం అడ వులుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్దారించ డానికి సిద్ధం అయ్యింది. ప్రయివేట్ భూముల విష యంలో నెలకొన్న అడవుల విషయంలో మినహా యింపు దిశగా ప్రభుత్వం ఆలోచనచేస్తూ ఉంది.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అటవీ ఆస్తులకు సంబం దించి ఒక కేసు విచారణలో మాత్రం అటవీ చట్టం దశ దిశ మార్చే తీర్పును ప్రకటించింది.అది ఏమి టంటే అటవీ భూమి అయినా కాకపోయినా, ప్రయివేటు భూములైనా. ఏ ప్రాజెక్టు – కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నదైనా అడవి అడవే, పైన చెప్పినవి అన్నీ కూడా సదరు చట్ట పరిధిలోకే వస్తాయి. అలాంటి ఏ భూమి వినియోగ మార్పిడికైనా అనుమతులు తప్పనిసరి అని తీర్పులో పేర్కొంది.ఈ తీర్పు ఫలితంగా భూయాజమాన్య హక్కులతో నిమిత్తం లేకుండా.. అడవులు, చెట్లు, మొక్కలు, ఇతర పచ్చదనం అభివృద్ధి పరుస్తున్న వ్యవసాయేతర కార్యకలాపాలన్నీ అటవీ చట్ట పరిధిలోకి వచ్చాయి.దీనివలన పచ్చదనం కొంత వరకు పెరిగింది అనడంలో సందేహం లేదు. పర్యావరణ వేత్తలకు ఇది శుభవార్తగా నిలిచింది. అయితే ప్రభుత్వాలకు మాత్రం ఇది మింగుడు పడని విషయంగా మారింది. ఎందుకంటే ఈ తీర్పు ద్వారా ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్ర మాలకు అటవీ అనుమతులు కానీ పర్యావరణ అనుమతులు మరింత కఠినమై అడ్డుగా నిలుస్తున్నా యి. ఈపరిస్ధితిని గమనించిన ప్రభుత్వాలు ఆ చట్టపరిధి నుండి బయట పడే మార్గాలపై అన్వేషిం చడం మొదలు పెట్టాయి.చట్టాన్ని నీరు గార్చే యజ్ఞా నికి శ్రీకారం చుట్టాయి.దీనికై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత అటవీ చట్టానికి కొత్తగా సవరణలు చేపట్టి అటవీ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు ఆరం భం అయ్యాయి.దీనిని ఆచరణలోకి తీసుకురావ డానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం 1988 అటవీ సంరక్షణ చట్టంలో కొన్ని సవరణలను చేయడానికి సిద్ధం అయ్యింది. దీనిని అమలు పరచే బాధ్యత తీసుకోవడానికి కేంద్ర పర్యావరణ, అటవీ సంరక్షణ మంత్రిత్వ శాఖ ముందుకు వచ్చింది. మారుతున్న ఆర్ధిక అవసరాలు దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత అటవీ చట్టానికి సవరణలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఈప్రతిపాదనలో పేర్కొ న్నారు.. ఈవిషయమై కేంద్రం అటవీ చట్ట సవరణ చేయడానికి 14 అంశాలను ప్రతిపాదించారు.ఈ సవరణల ప్రధానలక్ష్యం ఇప్పటి వరకు రక్షిత అటవీ చట్టాల పరిధిలో ఉన్నభూములను ఆచట్ట పరిది óనుంచి తప్పించి అనుమతుల ఇబ్బంది లేకుండ చేసుకోవడం. ఎందుకంటే జాతీయ రహదారులు, రైల్వే రవాణా,ప్రాజెక్టులనిర్మాణం విషయంలో అటవీ చట్టపరిధిలో ఉండే భూముల నుండి మరి యు పర్యావరణ అనుమతులు రావడంచాలా క్లిష్టతరం అవుతూ ఉంది.దానితో పాటు వాటి నిర్మాణ వ్యయాలు కూడా రోజురోజుకి పెరిగి పోయి అభివృద్ధి పనులు నిలచి పోతున్నాయని ప్రభుత్వ వాదన. దానిని దృష్టిలో ఉంచుకునే ప్రభు త్వం అటవీ చట్టాన్ని నీరుగార్చే యత్నాలు మొదలు పెట్టింది.దీనికి దేశ భద్రత..దేశ రక్షణ అనే అంశాలను ముడిపెట్టి సవరణ ప్రతిపాదన చేసింది. దాని ప్రకారం దేశ సరిహద్దులు వెంబడి అవస్ధాపన వసతులు కల్పించడానికి నిర్దేశిత ప్రాజెక్టులు చేపట్టడానికి అటవీ మరియు పర్యావరణ అనుమ తులు ఆటంకం కలిగిస్తున్నాయి ఇటువంటి వాటిలో జాప్యం అనేది సరి హద్దు దేశాల నుండి ముప్పుకు అవకాశం కలిగిస్తుంది.కనుక అటువంటి వాటి కోసం ఆ ఆభూములను చట్ట పరిధి నుండి మినహా యించాలిఅనే ప్రతిపాదన ఒకటి.దేశ భద్రత దృష్ట్యా ప్రజల నుండి రాజకీయ పక్షాల నుండి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉండదని దీనిని ప్రధానంగా ప్రభుత్వం చూపించింది.
అంతర్జాతీయ సరిహద్దుల్లో దేశ భద్రత – వ్యూహాత్మక మౌలిక వసతుల కోసం అటవీ భూముల్ని బదలాయించాల్సి వస్తే అనుమతులు అక్కర్లేదు అనేది ఈ సవరణ ప్రధాన లక్ష్యం.ఇకపోతే దీనికి అనుబంధంగా రైల్వేలు,హైవే అథారిటీ, ఇతర రవాణా సంస్థలు 1980కి పూర్వం పొందిన భూముల్ని అటవీ చట్టం నుండి మినహాయించడం, ఆయా సంస్థలు రోడ్డు, ట్రాక్ పక్క చెట్లు, పచ్చదనం పెంచిన స్థలాల్ని ఈ పరిధి నుంచి తప్పించటం, నివాస ఇతర ప్రాజెక్టు అవసరాలకు 250 చదరపు మీటర్లలో నిర్మాణాలు అనుమతించడం, స్థలయా జమాన్య హక్కులు బహుళ రికార్డుల్లో నమోదై అటవీ – రెవెన్యూ, ఇతర విభాగాల మధ్య వివాదం ఉంటే, సదరు ఆ భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించడం వంటి వాటిని సవరణలుగా ప్రతిపా దిస్తూ అటవీచట్టాన్ని నీరు గార్చడానికి రంగం సిద్ధం అయ్యింది.అంతకన్నా ముఖ్యంగా చమురు సహజవాయువు వెలికితీతలో నేడు ఆధునిక సాంకే తిక పరి జ్ఞానం ఎంతగానో లభించింది. దానిని ఉపయోగించుకుని అడవులకు నష్టం కలగకుండా అడవుల వెలుపల భూమికి రంధ్రాలు చేసి వాటి ద్వారా అడవులలో చమురు సహజ వాయువల అన్వేషణ చేసుకునే అవకాశం పొందటానికి చట్ట సవరణ అవసరంఅని ప్రభుత్వం భావిస్తూ ఉంది ప్రభుత్వం.ఇలా లభించిన భూమి అంతా అటవీ యేతర అవసరాలకు వినియోగించాలి అన్నది ప్రభుత్వ దృఢ సంకల్పం..ఒకవిధంగా చూస్తే ఈ చట్టానికి సవరణలు లేకుండానే ప్రతీ యేటా మన దేశం సమారు 13 వేల చ.కి.మీ. అటవీ భూమిని కోల్పోతోంది అని ఒక అంచనా. ప్రస్తుతం మన దేశంలో సుమారు ఆరుకోట్ల 49లక్షల హె క్టార్ల భూమి మాత్రమే అటవీ ప్రాంతం కింద ఉన్నట్లు గణాంకలు చెబుతున్నాయి.ఈ సవరణ చట్టం కానీ అమలులోనికి వస్తే మరింత అటవీ భూభాగం హరించుకు పోతుంది అనడంలో సందేహం లేదు. జాతీయ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని చట్టానికి కొన్ని సవరణలు చేసి మినహాయింపులు ఇస్తున్నాం అని ప్రభుత్వం చెబుతూ ఉన్నా ఆచరణలో ఈ సవరణలు కార్పొరేట్ వర్గాల వారి ప్రయోజనాలకే అన్నది వాస్తవం.ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెడు తున్న మానిటైజేషన్‌లో భాగంగా రోడ్డు, రైల్వే, అవస్ధాపన సౌకర్యాల కల్పన ఏర్పాటు అనేవి పూర్తి గా కార్పొరేట్ వర్గాల చేతుల్లోనికి వెడతాయి.దీనితో పాటు దేశ వ్యాప్తంగా అవస్ధాపన సౌకర్యాల కోసం లక్ష కోట్ల రూపాయలతో కేంద్రం పీ.ఎం.గతి శక్తి కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఈ పనులు కూడా కార్పొరేట్ వర్గాల వారికే దక్కుతాయి.అయితే వీటి ఏర్పాటులో వారికి పర్యావరణ అనుమతుల ఇబ్బందులు లేకుండా చేయడానికే ప్రభుత్వం అటవీ చట్టానికి సవరణలు చేయడానికి ముందుకు వచ్చింది అని పర్యావరణవేత్తల అభిప్రాయం. ఈ సందర్భంలో ప్రస్తుత అటవీ చట్టం ద్వారా వారికి పర్యావరణ అనుమతులు పొందడం కష్టం అవు తాయి.వారికి ఇబ్బంది కలిగించకుండా సానుకూ లత కలుగ చేయటానికే ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టడానికి సిద్ధం అయ్యింది అని పర్యావరణ వేత్తల అభి ప్రాయం.కేవలం వారి ప్రయోజనాల కోసం అటవీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం సమం జసం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అటవీ చట్టాలకు ఇన్ని మినహాయింపులు ఇస్తూ కూడా అడవులను 33 శాతానికి పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు. ప్రస్తు తం మనదేశంలో ఉన్న22 శాతం అడవులు కూడా ఈ మినహాయింపుల పర్వంద్వారా మరింత అడ వుల విస్తీర్ణం అంతరించి పోవడం తధ్యం. దేశ సరిహద్దులులో అత్యంత ఆవశ్యకమైన రక్షణ భద్రత లు కోసం మినహాయింపు కోరడంలో తప్పు లేదు.వాటిని ఎవరూ అభ్యంతర పెట్టరు కూడా. అయితే ఇటువంటి దేశభద్రత అనే అంశాన్ని చూపిం చి భవిష్యత్‌లో మరెన్నో మినహా యింపులు చేసు కుంటూ పోతే రక్షిత అటవీ చట్టం నిర్వీర్యం కాక తప్పదు ఆదిశగానే ప్రభుత్వాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి కూడా. తప్ప నిసరి పరిస్ధితులలో అటవీ భూములను ఉపయోగిస్తే అదే పరిమా ణంలో అడవులు పెంచాలి అనేది చట్ట నియమం.. కానీ మనం నరుకుతూ పోవడమే తప్ప పెంచిన దాఖలాలపై శ్రద్ధ చూపడం లేదు.ఎందుకంటే ఏడు దశాబ్దాల పైగా మనం వన సంరక్షణ ధ్యేయంగా వన ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాం కానీ ఈ కృషితో అటవీ విస్తీర్ణాన్ని ఏమాత్రం పెంచలేక పోయాం అనేది మాత్రం కఠిన సత్యం.ఒక విధంగా చెప్పాలంటే పచ్చదనం విషయంలో స్వచ్చంద సంస్ధలు స్దానిక ప్రభుత్వాలు ఎంతో శ్రద్ధ చూపిస్తు న్నాయి.మొత్తం మీద ఈఅటవీచట్ట సవరణ ఫలా లు అన్నీ కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేవే! కొత్త అడవుల పెంపకం పక్కన పెడితే ఇటువంటి సవర ణలు వలన ఉన్న అడవికి ముప్పు వాటిల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రతిపాదిం చిన అటవీ చట్ట సవరణలను పర్యావరణ వేత్తలు.. స్వచ్చంద సంస్ధలు పౌరులు ఖండిరచవలసిన సమయం ఆసన్నమయ్యింది.ఈ విషయమై మన మౌనంగా ఉంటే అది భావితరాల వారికి శాపంగా పరిణమిస్తుంది.(లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్.. ఐ.పోలవరం)
పర్యావరణ చట్ట మార్పులు ఔషధ కంపెనీల కోసమా ?
జీవ వైవిధ్యచట్టానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సవరణల పుణ్య మా అని ఎలాంటి అనుమతులు లేకుండానే పేటెంట్ హక్కు లు పొంది…స్థానిక గిరిజనులకు పరిహారాన్ని ఇవ్వనక్కర్లేకుండా దేశీయ కంపెనీలకేగాక విదేశీ బహుళజాతి కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఇక మీదట మన అరుదైన వృక్ష సంపదపై మాన్ శాంటో వంటి బహుళజాతి కంపెనీలకు పేటెంటు హక్కులు లభిస్తే బిటీ కాటన్ వలె మన వ్యవసాయం వారి ఆధీనంలోకి పోయే ప్రమాదం వుంది. ప్రస్తు తం అమలులో వున్న జీవ వైవిధ్య చట్టానికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖా మంత్రి గత పార్లమెంటు సమావేశాల్లో కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ఇవేగనక అమలు లోకి వస్తే…అరణ్య ప్రాంతాల్లో వున్న అరుదైన ఔషధ మొక్కలను,మూలికలను, గిరిజన, రైతు బాహళ్యం అనాదిగా సాగు చేసుకొనే విత్తనాలను,పంట రకాలను వినియోగించు కొనేందు కుగాను ఇకపై ఎటువంటి ప్రభుత్వ సంస్థల అను మతులు లేకుండానే ప్రైవేటు భారత, విదేశీ ఔషద కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది.
మరోవైపు ఈసవరణలను పర్యావరణవే త్తలు, శాస్త్రవేత్తలు,గిరిజన,రైతుసంఘాల ప్రతి నిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. విశిష్ట లక్షణాలు కల్గిన ఔషధ మొక్కలు, విలువైన పంటల రకాలు పట్టణీకరణ, వాతావరణ మార్పులు, అక్రమ రవాణా కారణంగా ఇప్పటికీ వేగంగా అంతరించి పోతున్నాయి. వీటిలో చాలా మొక్కలు ఆయుర్వేదం, వ్యవసాయంలో ఉపయోగించాలే తప్ప మార్కెట్లో ఇతర ‘’వ్యాపార వస్తువులు’’గా పరిగణించరాదు. ఒకవేళ ఆవిధంగా చేసినట్లయితే, ఔషధ కంపెనీల మితిమీరిన వినియోగంతో అరుదైన వృక్ష సంపదను లాభాలకోసం కోల్పోవాల్సి వస్తుంది. దాంతో అటు పర్యావరణానికి ఇటు గిరిజనులు, రైతుల జీవనో పాధికి తీవ్రమైననష్టం వాటిల్లుతుందని వారు హెచ్చ రిస్తున్నారు.హిమాలయ,ఈశాన్య ప్రాంతాల పశ్చిమ, తూర్పు కనుమల్లోను, గుజరాత్ లోని అరణ్యాల్లో కొండకోనల్లో అనేకవృక్షాలు, ఎన్నో ఔషధ మొక్కలు న్నాయి. మనం తరచూ వినియోగించే క్రోసిన్, సింకోరా (మలేరియా) తదితర అల్లోపతి ఔషధాలు మన దేశంలోని అరుదైన చెట్ల బెరళ్లు,వేళ్లు, మూలి కల నుండి పొందిన సహజ రసాయనాల ఆధారం గా రూపొందించినవే. ఢల్లీి లోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐ.సి.ఎ.ఆర్) విత్తన బ్యాంకులో 96వేల బియ్యం రకాలు భద్రపర్చబడినవంటే ఆశ్చ ర్యం కలుగక మానదు. గతంలో వరిలో బంగారు తీగలు,అక్కుళ్ళు వగైరా రకాలు ఏ కిరాణా దుకా ణానికి వెళ్ళినా లభించేవి. కానీ ఈనాడు వరిలో సైతం మూడు లేక నాలుగు రకాలు మించి సాగు కావటం లేదు. అమృతపాణి, చక్రకేళి దాదాపుగా అంతరించిపోయాయి. పంటలు, వివిధ మొక్కల రకాలు తగ్గి ప్రకృతి నుండి అదృశ్యం కావటాన్నే కుంచించుకుపోతున్న‘జీవ వైవిధ్యం’గా పేర్కొం టారు. మొక్కల్లోని వైవిధ్యం మానవుని ఆరోగ్యానికే (పోషక విలువలకు) కాక పర్యావరణానికి, సృష్టిలో మనుషుల,పక్షుల,జంతువుల,మనుగడకు అత్యావ శ్యకం. అమృతపాణి అరటిపళ్లు, ‘తైమ్’, ‘అతిబాల’ వంటి మొక్కలు ప్రకృతి నుండి అదృశ్యమైతే ముందు తరాల వారికి కనీసం అవి మ్యూజియంలో కూడా కానరాని పరిస్థితి దాపురిస్తుంది. ఈవిలువైన సం పదను ముందు తరాల అవసరాలను సంరక్షించు కోవాలి. వీటి పరిరక్షణకు ‘’జీవ వైవిధ్య చట్టం-2002’ కొన్ని చర్యలు చేపట్టింది. వీటిని సక్రమంగా వినియోగించుకోవటానికి కేంద్రంలో ఒకసంస్థ (నేష నల్ బయోడైవర్సిటీ అథారిటీ) ఏర్పాటైంది. వివిధ రాష్ట్రాల్లో బయోడైవర్సిటీ బోర్డులు నిర్వహింప బడ్డాయి. ఆరు సంవత్సరాల క్రితం హైదరా బాద్‌లో జరిగిన ‘అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు’ అనేక విలువైన సూచనలు చేసింది. ఏదైనా ఔషధ సంస్థ,కంపెనీ,ఆహారశుద్ధి పరిశ్రమ, దేశీ, ఆయు ర్వేద, యునానీ వైద్యులు…అరణ్యాలు, కొండల్లోని అరుదైన మొక్కల్ని వ్యాపారరీత్యా పొందాలంటే ప్రభుత్వ బయోడైవర్సిటీ సంస్థల నుండి తప్పక అనుమతులు పొందాలి. ఈవృక్ష సంపదను, వన మూలికలను సాగు చేస్తూ, సంరక్షించే ఆ ప్రాంత గిరిజనులకు…ప్రతిఫలంగా కొంత రుసుమును చెల్లించాలి. పొందిన లాభాల్లో కొంత భాగం గిరి జనుల సంక్షేమానికి (స్థానికంగా వారికి పాఠ శాలలు,ఆస్పత్రులు వగైరా నెలకొల్పటానికి) విని యోగించాలి.అనాదిగా గిరిజనులకు వృక్ష సంప దపైనున్న జ్ఞానాన్ని పరిరక్షించాలి. ఇది మానవాళి నాగరికతలో అంతర్భాగం.దేశంలోని వివిధ అర ణ్యాలు,గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 20కోట్ల మంది గిరిజనులు,గ్రామీణ పేదలు అటవీ ఉత్ప త్తుల, వన మూలికలు, ఔషధ పంటల సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు.వామపక్షాల ఒత్తిడి మేరకు నాటి యు.పి.ఎ ప్రభుత్వం ఆదివాసి, గిరిజనులకు ఈ ఉత్పత్తులు అనుభవించటానికి గాను, పోడు తదితర భూములపై పరిమితంగానైనా కొన్ని హక్కులు కల్పించింది. ఐక్యరాజ్య సమితి నిర్వ హించిన ‘’నగోయా’’ పర్యావరణ సదస్సు సూచించిన నిబంధనావళి లోని ఆర్టికల్ 5 ప్రకారం అటవీ ఉత్పత్తులు, ఔషధ, అరుదైన పంట రకాల విని యోగం ద్వారా లభించే లాభాలను విధిగా గిరిజన, ఆదివాసీ, రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఈనిబంధనల కు మన పార్లమెంటు గతంలో చట్టపరంగా హక్కులు కల్పించింది.
కాగా 2016లో ఉత్తరాఖండ్ లోని ‘’దివ్య’’ ఆయుర్వేద కంపెనీ హిమాలయాల్లోని అడవుల నుండి పెద్దసంఖ్యలో అనేకఅరుదైన ఔషధ మొక్క లను ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా చౌర్యం చేసింది. విశేషమేమంటే దివ్య ఫార్మసీ ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్తగా మారిన వివాదాస్పద రామ్ దేవ్ బాబాకు చెందిన ఔషధ సంస్థ. ‘జీవ వైవిధ్య చట్టం-2002’ను అతిక్రమించి అరుదైన ఔషధ మొక్కలను ప్రభుత్వ సంస్థల అనుమతులు లేకుండా పరిశ్రమల్లో వినియోగించి,తద్వారా లభించిన లాభాల్లో భాగాన్ని స్థానిక గిరిజనులకు ఇవ్వడానికి నిరాకరించినందుకు ఉత్తరఖండ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వ్యాజ్యం వేసింది. ఈఉల్లంఘనను తీవ్ర మైనదిగా పరిగణిస్తూ హైకోర్టు దివ్యఫార్మసీపై జుర్మానా విధిస్తూ ఆపరిశ్రమ నిర్వహణకు సంబం ధించి కఠినమైన షరతులు విధించింది. ఈ చర్యను జీర్ణించుకోలేని రామ్‌దేవ్ బాబా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి…ప్రైవేటు ఔషధ పరిశ్రమలు, ఆయుష్ సంస్థలు ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఔషధ మొక్కలను పొందటానికి వీలుగా…జీవ వైవిధ్య చట్టం-2002కితూట్లు పొడిచే సవరణలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఇరవై సంవత్స రాల్లో భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన వేప, పసుపు, వంగ, బాస్మతి వరి, బంగినపల్లి రకాలపై మేధోసం పత్తి హక్కులు(పేటెంట్లు) పొంది…వాటిని తస్కరిం చేందుకు ఔషధ,ఆహార బహుళజాతి విదేశీ కంపెనీలు ప్రయత్నించాయి. మన ప్రజా సంఘాలు, సంస్థలు చేసిన ఒత్తిడి మేరకు…ఈ‘జీవ వైవిధ్య చట్టం-2002’ సహకారంతో… భారత ప్రభుత్వం దీర్ఘకాలం పోరాడి ఈ సంపదను విదేశీ కంపెనీలు కాజేయకుండా రక్షించుకోగల్గింది.
జీవ వైవిధ్య చట్టానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సవరణల పుణ్యమా అని ఎలాంటి అనుమతులు లేకుండానే పేటెంట్ హక్కులు పొం ది…స్థానిక గిరిజనులకు పరిహారాన్ని ఇవ్వనక్కర్లే కుండా దేశీయ కంపెనీలకేగాక విదేశీ బహుళజాతి కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఉదాహరణకు రైతులకు ఎంతో పంట నష్టం కలిగిస్తున్న అగ్గి తెగులును తట్టుకొనే వరి వంగడాలను రూపొందిం చాలంటే క్రాసింగ్ కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలకు తూర్పు కనుమల్లోని ఛత్తీస్‌గఢ్ అడవుల నుండి కొన్ని కొండజాతి వరిరకాలు అవసరం అవుతా యి. ఇక మీదట మన అరుదైన వృక్ష సంపదపై మాన్‌శాంటో వంటి బహుళజాతి కంపెనీలకు పేటెం టు హక్కులు లభిస్తే బిటీ కాటన్ వలె మన వ్యవసాయం వారి ఆధీనంలోకి పోయే ప్రమా దం వుంది. అందుకే దేశ ఆహార భద్రతకు, పర్యా వర ణానికి, గిరిజనుల, రైతుల ప్రయోజనాలకు హని కల్గించే ఈచట్ట సవరణలను వెనక్కి తీసు కోవాలి. పలువురు శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాలు, జన విజ్ఞాన వేదిక ఇటీవల నిర్వహించిన అంత ర్జాల సదస్సుద్వారా పార్లమెంటరీ స్థాయీ సంఘా న్ని ఇదే కోరాయి.
(వ్యాసకర్త :డా.సోమమర్ల,ఐసిఎఆర్ ఎన్.బి.పి.జి.ఆర్‌లోప్రిన్సిపల్‌సైంటిస్ట్` న్యూఢల్లీి ) -రుద్రరాజు శ్రీనివాసరాజు