సమ్మిళిత ఆర్ధిక వృద్ధికి ఆలంబన
సమ్మిళిత వృద్ధి సాధించడానికి ప్రధానంగా వ్యవసాయం తీరు తెన్నులు, విధానాలు, పేదరికం తగ్గించడం, ఆహారపు హక్కు, ఉద్యోగిత కల్పించడం ద్వారా సామూహిక భద్రత మానవాభివృద్ధి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం వంటి విషయాల్లో వృద్ధిని సాధించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది. – (ఎం. సునీల్‌కుమార్)
ఇండియాలో బ్యాంకింగ్ సేవలు ఇంతగా విస్తరించడానికి 47ఏళ్లు పట్టేది.జన్‌ధన్‌వల్ల ఆ ప్రగతి అత్యంత వేగంగా వాస్తవ రూపం దాల్చింది.అని బ్యాంక్ ఆప్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ పరిశోధకుడు కితాబునిచ్చారు. దానికి గర్వించడంతోపాటు సరిదిద్దుకోవాల్సిన వ్యవస్థాగత లోపాలూ కొన్ని ఉన్నాయి. జనధన్ తదనంతరం అంతవరకూ వెళ్లని ఊళ్లలోకి బ్యాంకులు అడుగు పెట్టాయి.2013లో దేశవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు శాఖలు దాదాపు1.06లక్షలు,2023కు అవి 46శాతం అధికమయ్యాయి.ఏటీఎంల సంఖ్య సైతం 30శాతం మేరకు పెరిగింది.కానీ, లావా దేవీలేమీ జరగని బ్యాంక్ ఖాతాలు ఎక్కువగా ఉండటమే విస్మయకరం!దేశంలో మొత్తం ఖాతాల్లో అటువంటివి 35శాతం వరకు ఉంటాయని ప్రపంచబ్యాంకు క్రోడికరించిన గ్లోబ్ ఫిన్‌డెక్స్ డేటా బేస్ వెల్లడిర చింది.అభివృద్ధి చెందుతున్న దేశాల సగటుతో పోలిస్తే ఇది ఏడు రెట్టు ఎక్కువ!జన్‌ధన్ ఖాతాల్లోనూ నిష్క్రియమైనవి 20శాతం దాకా ఉంటాయని అంచనా.అందుకు కారణాలేంటో అన్వేషించడంతోపాటు పీఎంజేడీవై ప్రధాన లక్ష్యమై న ఆర్ధికఅక్షరాస్తను పెంపొందించడం మరో సవాలు. ఆర్బీఐ నివేదిక ప్రకారం,గడిచిన పదేళ్లలో దేశీయ బ్యాంకుల్లో జరిగిన మోసాల విలువ రూ. 5.3లక్షలకోట్లు.సైబర్ నేరాల ఉధృతికి ప్రభుత్వాలు అడ్డు కట్టవేస్తేనే`ప్రజల కష్టార్జితాలకు రక్షణ లభిస్తుం ది.డిజిటల్ ఆర్ధికవ్యవస్థ పురోగతీ శ్రీఘ్ర తరమ వుతుంది.
సమ్మిళిత వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 11,12 ప్రణాళికల్లో సమ్మిళిత, సత్వర వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది.11వ పంచవర్ష ప్రణా ళిక సమ్మిళిత వృద్ధి సాధించడానికి మొత్తం 27 ద్రవ్య విధాన లక్ష్యాలను 13 రాష్ట్రాలకు నిర్దేశిం చింది.దీనిలో భాగంగా పేదరికంతగ్గించి,ఉపాధి కల్పనను పెంచి సత్వర వృద్ధి సాధించడం, విద్య, ఆరోగ్యం వంటి అవసరమైన సేవలను అందిం చడం,విద్యా నైపుణ్యాలను పెంచడం ద్వారా సాధి కారతను సాధించడం,ద్వారా ఉపాధిని విస్తరిం చడం,పర్యావరణ కొనసాగింపు సాధించడం, లింగ వివక్షతను తగ్గించడం, పాలనలో మెరుగు దలను తీసుకురావడం వంటి అంశాల్లో దృష్టిని సారించింది.పై వాటిని సాధించడానికి వ్యవసాయ రంగంలో4శాతం వృద్ధిని, పారిక్షిశామిక రంగంలో 10-11శాతం వృద్ధిని,సేవారంగంలో 9-11 శాతం వృద్ధిని సాధించాలని వాటి ద్వారా ప్రణాళి కలో వార్షిక వృద్ధిరేటు లక్ష్యమైన 9శాతం వృద్ధిని సాధించాలని నిర్ణయించారు.సమాచార సాంకేతిక రంగంలో విశిష్టమైన అభివృద్ధిని సాధించాం. సాఫ్ట్ వేర్ పరిక్షిశమ బాగా వృద్ధి చెందింది. వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి ‘ఇంటిక్షిగేటెడ్ యాక్షన్‌ప్లాన్‌ను దేశం లోని 60 జిల్లాల్లో ప్రవేశపెట్టారు.
11వ ప్రణాళికలో వివిధ పథకాల్లో భాగంగా అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే పేదరి కపు రేఖకు దిగువన ఉన్నవారికి సంబంధించి ‘రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన’ పథకాన్ని 2007 లో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని కుటుంబాలకు బీమా రక్షణ కల్పించడానికి ‘ఆమ్ ఆద్మీ బీమా యోజన’ పథకాన్ని ప్రారం భించారు. దీనికి చెల్లించే ప్రీమియం రూ.200. దీని నిర్వహణ బాధ్యతను ఎల్‌ఐసీకి అప్పగించారు. దీనికి అవసరమయ్యే నిధులను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరిస్తాయి. వ్యభిచార వృత్తిలో ఉన్నవారికి పునరావాసం కల్పిం చడానికిగాను ‘ఉజ్వల’పథకాన్ని ప్రారంభిం చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలను ఆదుకోవ డానికి దేశంలో వేతన ఉపాధి పథకాన్ని అమలు చేస్తున్నారు. పైవాటితో పాటుగా ప్రభుత్వం కొన్ని ఫ్లాగ్‌షిప్ పథకాలను అమలు చేసింది.దీనిలో భాగంగా ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన’ జాతీయ హార్టికల్చర్ మిషన్,సత్వర నీటి పారుదల ప్రయో జన పథకం గ్రామీణ తాగునీటి సదుపాయం, రాజీవ్‌గాంధీ విద్యుదీకరణ, ఇందిరా ఆవాస్ యో జన,సర్వశిక్షా అభియాన్,మధ్యాహ్నభోజన పథకం, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, సమీకృత శిశు అభివృద్ధి సేవలు, ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వృద్ధిని సాధించడంతోపాటు దాన్ని సమాజంలో అన్ని తరగతుల వారికి, అన్ని వర్గాల వారికి అందించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్య మవుతుంది. సమ్మిళిత వృద్ధి సాధించడానికి ప్రధా నంగా వ్యవసాయం తీరు తెన్నులు, విధానాలు, పేదరికం తగ్గించడం, ఆహారపు హక్కు, ఉద్యోగిత కల్పించడం ద్వారా సామూహిక భద్రత మానవా భివృద్ధి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం వంటి విషయాల్లో వృద్ధిని సాధించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది.
భారత ప్రభుత్వం 12వ ప్రణాళికలో ఆర్థిక వృద్ధిని 9 శాతానికి పెంచాలని పేర్కొన్నది. వ్యవసాయరంగంలో 4శాతంవృద్ధిని,పారిక్షి శామిక రంగంలో 9.5శాతం వృద్ధిని,సేవారంగంలో 10 శాతం వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించింది.మొత్తం మీద ప్రణాళికలో వృద్ధిని 9-9.5శాతం వరకు సాధిం చాలని నిర్ణయించింది.
హరిత ఆర్థికం సమ్మిళితమేనా?
హరిత ఆర్థిక వ్యవస్థలుగా శీఘ్రగతిన పరివర్తన చెందేందుకు ప్రపంచ దేశాలు ఆరాట పడుతున్నాయి. ఇంధన వ్యవస్థలలో బొగ్గు, గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా పునరుద్ధరణీయ పవన, సౌరశక్తి వనరులనుబీ రవాణా రంగంలో పెట్రోలియం ఉత్పత్తులకు బదులుగా విద్యుత్‌ను, పరిశ్రమలలో శిలాజ ఇంధనాలకు మారుగా హైడ్రోజన్‌ను ఉపయోగించుకునే దిశగా ప్రపంచ దేశాలన్నీ చురు గ్గా చర్యలు చేపడుతున్నాయి.అడ్డూ అదుపు లేకుం డా భూతాపం తీవ్రమవుతుండడం, తత్పర్య వసానంగా వాతావరణ వైపరీత్యాలకు కారణమ వుతున్న కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు, ఇంధన వ్యవస్థలు,రవాణా రంగం,వస్తూత్పత్తి కార్య కలాపాలలో చోటు చేసుకుంటున్న మౌలిక మార్పు లు దోహదం చేయగలవని ప్రభుత్వాలు ఆశిస్తు న్నాయి. హరిత ఆర్థికవ్యవస్థ దిశగా ప్రపంచ దేశాలు మరింత వేగంగా,సమస్యను పరిష్కరిం చేందుకు అవసరమైన బృహత్ చర్యలతో పురోగ మించవలసి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే కొత్త హరిత ప్రపంచానికి మనం తీసుకువెళ్లే (వనరుల వినియోగ,ఉత్పాదక కార్యక లాపాల నిర్వహణ) విధానాలు,పద్ధతులు ఎలా ఉండనున్నాయి? అవి హరిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యాల పరిపూర్తికి తోడ్పడుతాయా? సహజ వనరులను ఉపయోగించుకోవడంలో మనం అనుసరిస్తున్న పాత పద్ధతులలో స్వతస్సిద్ధంగా పలు సమస్యలు ఉన్నాయి. ఇవి సామాజిక, పర్యావరణ వ్యవస్థలను ప్రతికూలంగా,మరింత కచ్చితంగా చెప్పాలంటే విధ్వంసకరంగా ప్రభావితం చేస్తున్నందునే హరిత ఆర్థిక కార్యకలాపాలలో సైతం మనం పాటించే పద్ధతుల గురించి ప్రశ్నించడం అనివార్య మ యింది. ఖనిజాల వెలికితీతనే తీసుకోండి% బొగ్గు, ఇనుము,అల్యూమినియం మొదలైన ఖనిజాలు మన ఆర్థికవ్యవస్థలకు మౌలిక అవసరాలు. అయితే భూగర్భం నుంచి వాటి వెలికితీత పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోంది.భారత్‌లో ఈముడి పదార్థాలు అడవుల కింద,వన్యప్రాణుల ఆవా స ప్రదేశాలలోను,గిరిజన ప్రాంతాలలో ఉన్నాయి. పర్యావరణ భద్రతకు, ప్రజా శ్రేయస్సుకు హాని వాటిల్లకుండా ఆ సహజ సంపదను ఉపయోగిం చుకోవడం ఎలా? ఇదొక విపత్కరమైన పరిస్థితి. వనరుల విపత్తు అనేది సంపద్వంత భూములు, పేద ప్రజలకు సంబంధించిన సమస్య. మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన ఖనిజాలను సమ కూర్చుకునేందుకు మనం అడవులను నరికివే స్తున్నాం.స్థానిక జనసముదాయాలను నిర్వాసితు లను చేస్తున్నాము.ఖనిజాల వెలికితీత అనేది మనం అనుసరిస్తున్న ఆర్థికాభివృద్ధి నమూనాలో చాలా కీలకమైన కార్యకలాపం. దానివల్ల ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం సమకూరుతున్నది.