సమ్మక్క సారక్కల చారిత్రిక వీరగాధ పోరుగద్దే మేడారం
ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘‘జయధీర్ తిరుమల రావు’’ కలం నుంచి జాలువారిన ‘‘ వీరుల పోరు గద్దె మేడారం’’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జన జాతరగా చరిత్రలో నిలిచిన మేడారం జాతరకు కారకురాలైన గిరిజన వీరవనిత ‘‘సమ్మక్క’’కు సంబంధించిన సంపూర్ణ చరిత్ర గాని, దానికి ఆధారమైన శాసనాలు, ఇతర ఏ ఆధారాలు ప్రామాణికంగా ఇంతవరకు ఎక్కడా లభ్యం కాలేదు. మరి అంత పెద్ద సంఘటనకు సాక్ష్యం గిరిజనుల విశ్వాసం,వారి పూర్వీకుల నుంచి మౌఖిక రూపంలో అందిన పుక్కిట పురాణ గాథలే..! సమ్మక్క పుట్టుక,జీవనం,వీర మరణాలకు సంబంధించి వివిధ కథనాలు వినిపిస్తూ కొన్ని తేడాలు అనిపిస్తున్న. అన్ని కథనాలు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుని కేంద్రంగా తీసుకుని నడుస్తు న్నాయి. అయితే కాకతీయుల చరిత్రకు సంబంధించిన ఏశాసనాలు గ్రంథాలలో మేడారం సమ్మక్క ప్రస్తావనగాని,జరిగిన పోరాటం గురించి గానీ,ఉఠంకించబడలేదు. అంత పెద్ద కాకతీయ రాజ్యంలో మేడారం ప్రస్తావన, ఆనాటి వారికి అత్యంత చిన్న విషయం అయి ఉండవచ్చు. ఇక గిరిజనులు నిరక్షరాస్యులు కావడం చరిత్రలను భద్రపరు చుకునే శక్తి లేకపోవడం వంటి కారణాలతో నేటి ఇంత పెద్ద జన జాతరకు ఆనాటి చరిత్రలో చిరు స్థానం కూడా దక్కలేదు. అర్థ శతాబ్ద కాలం క్రితం ఈ మేడారం సమ్మక్క జాతర కేవలం కొన్ని గిరిజన కుటుంబాలకే పరిమితమై స్థానిక గిరిజన జాతర పండుగ మాత్రమే. ఇటీవల ఈజన జాతర విశ్వవ్యాప్తం కావడంతో అందరి దృష్టి దీని మీద నిలిచింది, దానితో ఊహాత్మకమైన కథలు,రచనలు,పాటలు,సినిమాలు,రావడం మొదలయ్యాయి. ఏ విశ్వవిద్యాలయాలు గాని ఇంతవరకు ప్రామాణికమైన పరిశోధనలు అందించలేదు. ఆ లోటు తీర్చే సంకల్పంతోనే ప్రముఖ రచయిత, గిరిజన సాహితీవేత్త, జయధీర్ తిరుమలరావు ఎంతో శ్రమతో తన క్షేత్ర పర్యటనల సాయంగా పూర్వ ఖమ్మం జిల్లా మణుగూరు మండలంలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన డోలి వారితో పడిగె సాయంతో సకిన రామచంద్రయ్య బృందంతో గానం చేయించిన ‘‘సమ్మక్క సారలమ్మల వీర గాధ’’ను పుస్తక రూపంలో ప్రచురించారు. తరాలతరబడి డోలి కళాకారుల ద్వారా పాటల రూపంలో ప్రదర్శించబడుతున్న ఈ మౌఖిక సాహిత్యంకు అక్షర రూపం కలిగించటం అభినందనీయం ఉపయోగకరం. 136 పేజీల ఈ ఉపయుక్త పుస్తకంలో విషయం పాటల రూపంలో ఉన్న, వాటి దిగువ అందించిన వచన సమాచారం,కొన్ని గిరిజన భాష మాటలకు పాద సూచికల రూపంలో అందించిన వివరణతో సంపూర్ణ సమాచారం తెలుస్తుంది. గిరిజనులు పరమ పవిత్రంగా భావించి,పూజించే,‘‘పడిగె’’ సాయంగా ఈ వీర గాధ వివరించారు.కోయ వారి చరిత్రకు శాసనాల వంటివి ఈ పడి గెలు, త్రికోణకారంలో గుడ్డలతో తయారు చేయబడే వీటి మీద వివిధ రంగులు ఆకారా ల్లో చిత్రించబడే గుర్తులు ద్వారా ఆయా చరిత్రలకు సంబంధించిన గోత్రాలు గోత్రపు పురుషుడు ఇంటిపేర్లు ప్రాంతాలు వాహనాలు పోరాటాలు మహిమలు అన్ని చిన్నచిన్న రేఖా చిత్రాల రూపంలో ఈ పడిగెల మీద ఉంటా యి. వాటి సాయంగా డోలి వారు ఆయా చరిత్రల గాథలను చర్మ వాయిద్యం ఆయన ‘‘డోలు’’ వాయిస్తూ గేయ కథా రూపంలో గానం చేస్తూ ఉంటారు. గిరిజనుల ఆశ్రిత కులం వారైనా ఈ డోలీలను గిరిజనుల చరిత్ర గురువులుగా,పూజారులు,అడ్డెలు,గా ఇందులో అభివర్ణించారు. అభిప్రాయాలు మొదలు పాద సూచికల వరకు 8 విభాగాలతో పాటు అనుబంధంగా ప్రధాన సంపాదకుని అను భవాలు, చిత్రాలతో ఈ పుస్తకాన్ని పొందు పరిచారు. ప్రతి విభాగంలో ఎంతో విలువైన అనుభవైఖ్యమైన సమాచారం అందించారు. ముఖ్యంగా సమ్మక్క వంశవృక్షం దీనిలో ప్రాధాన్యత సంతరించుకుంది నాలుగో గట్టు కోయరాజులైన సాంబశివరాజు-తూలుముత్తి దంపతుల ఐదుగురు సంతానంలో పెద్ద కుమార్తె సమ్మక్క.ఆమె భర్త పగిడిద్దరాజు వారికి సారలమ్మ అనే కూతురు,జంపన్న అనే కుమారుడు ఉన్నారు. ఇది పడిగె సహాయంతో డోలీలు చెప్పిన ప్రామాణికమైన సమ్మక్క వివరాలు, అలాగే పగిడిద్దరాజు వంశవృక్షం కూడా ఇందులో మనం చూడవచ్చును. పడమటి దేశానికి చెందిన ఎడవగట్టు పారేడు కోయరాజు వంశానికి చెందిన,బాలసంద్రుడు శివమందాకిని దంపతులకు ఐదుగురు సంతా నం,వారు పగిడిద్దరాజు,గోవిందరాజు, గడి కామరాజు,కొండాయి,అనే నలుగురు కొడు కులు లక్ష్మీదేవి, అనే ఏకైక కుమార్తె ఆమెకే ‘‘ముయ్యాల’’ అని ముద్దు పేరు.పగిడిద్దరాజు కు సమ్మక్క నాగులమ్మ అనే ఇద్దరు భార్యలు, ఇద్దరినీ పెళ్లి చేసుకోవడానికి తటస్టించిన పరిస్థితులతో పాటు పగిడిద్దరాజు తన పరివారంతో ఇంద్రావతి నది దాటి తన ప్రాంతానికి పడమటి దిక్కు కదిలి ఓరుగల్లు వచ్చి అటు నుంచి ‘‘ఓయిమూల’’ ప్రాంతం చేరిన తీరు ఈడోలీల గానంద్వారా వివరించ బడిరది,నేటి చల్వాయి,తాడ్వాయి, మేడారం, ప్రాంతాలను కలిపి ఆనాడు కోయరాజులు ‘‘ఓయిమూల’’ అని పిలిచేవారు. ఈ ప్రాంతం లో తేనె,గడ్డలు,ఆకులు,అలములు,ఇప్ప పూల తో పాటు చల్లని నీడ చెట్లు, తోగులు, తాగే నీరు, పుష్కలంగా దొరికేవట ప్రతాపరుద్రుని రాజ్యంలో గల ఆ ప్రాంతంలో పగిడిద్ద రాజు తన సామంతరాజ్యం ఏర్పాటు చేసుకోవడం, కాలానుగుణంగా వచ్చిన ప్రకృతి వైపరీత్యాల వల్ల కరువు కాటకాలతో అక్కడివారు కాకతీ య ప్రభువుకు రకం సకాలంలో చెల్లించలేక పోవడం జరుగుతుంది. కోయ రాజుల మూల వంశానికి చెందిన కాకతీయ ప్రభూ తమ వారు అనే కృతజ్ఞత కూడా లేకుండా పగిడిద్ద రాజు సామంతరాజ్యం మీద తన బలగాలతో యుద్ధం ప్రకటించటం ఆ యుద్ధంలో మొదట పగటిదరాజు పరివారం ఓటమి అంచులకు చేరడం విషయం తెలిసిన సమ్మక్క ఆదిపరా శక్తిగా కోయల కుటుంబంలో ఇష్టంగా జన్మించడంతో తమ జాతి సంరక్షణార్థం అపర కాళీమాతల యుద్ధరంగంలో దునికి ఆధునిక కాకతీయ సైనికుల ఆయుధాలను కూడా నిర్వీర్యం చేసి సైనికులను అందర్నీ మట్టు పెట్టింది, క్షతగాత్రుడైన భర్త పగిడిద్ద రాజు,ను అక్కడ నుంచి తీసుకుని వెళ్లి చిలకలూరిగుట్టకు చేరిపోయింది,మూడేళ్ల కోసారి సమ్మక్క పగిడిద్దరాజు కళ్యాణం జరుగుతుందని డోలీలు ఈపాటలో పాడు తారు. మేడారం ఒకనాటి వీరోచిత యుద్ధ క్షేత్రం, సమ్మక్క గాధ ఒక కోయ వీరనారి పోరాట కథ, కొద్దిపాటి కాల్పనికత ఉన్న, ఈ డోలీలు పటం సాయంతో చెప్పే ఈ వీరగాథ లో ఆదివాసీల చరిత్ర మూలాలు కనిపి స్తాయి.గతంలో సమ్మక్క చరిత్రకు సంబంధిం చిన ప్రచార ఉదంతాలకి ఈ ‘‘డోలిగానకథ’’ పాఠ్యం ఒక క్రమరీతిని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.ఈ వీర గాధల బృంద గానంలో..‘‘ఓరేలా..రే రేలా..రే రేలయ్యో…’’ అనే కూతతో ప్రారంభమై ‘‘అయ్యారే… యమ్మాలే.’’ అనే పల్లవులు పునరావృతం అవు తుంటాయి. ఆదిపరాశక్తి అంశ అయిన సమ్మక్క మొదట అన్ని కులాలలో వెలవాలని తలచి చివరికి కోయవారి కులం లోనే వెలిచింది అని చెప్పడానికి..‘‘కోమటోరిళ్ళల్లో నాకు కోరిన కొబ్బర్లు ు అయ్యారే/ అది నాకు గాని కావాలా అయ్యారే../బాపనోళ్ళ ఇళ్లల్లో అది బందీన తల్లిలే-అయ్యాలే ..’’అంటూ డోలీ గానం సాగుతుంది. గిరిజన మౌఖిక భాషకే పరిమితం అయిన తూర్పు దేశం (బస్తరు), రొట్టదంటు (పెద్ద అడవి), మాయ మందు (ఇప్ప సారా) కాలికొమ్మలు (సన్నాయి వాద్యాలు), పిట్టె పూరోడి పట్నం.(తాడ్వాయి దగ్గరి అంకన్నగూడెం గ్రామం), వంటి పదాలకు అర్థాలు పాద సూచికల ద్వారా అం దించడం చదువరులకు సౌలభ్యంగా ఉంది. అనుబంధంలో ఈ పుస్తక సంపాదకులు ‘‘జయధీర్ తిరుమల రావు’’ గారి గిరిజన క్షేత్ర పర్యటనల అనుభవ వ్యాసాలు మరింత అదనపు సమాచారం కలిగి ఉన్నాయి. బైండ్ల కథలో కాకతీయ రాజుల ఉదంతం, కోయ వీర గాథలు తెలిపే పగిడెలు, పటాలు, ఆరు కోయగాథలు వెలుగు చూసే రుతువు, నలు గురు కోయరాజులు 8 పడిగ కథలు ఈ అనుబంధంలో చదువుకోవచ్చు, భావి పరిశో ధకులు కోయ వీర గాథలు అధ్యయ నంకు పరిశోధనలకు ఈపుస్తకంఓ ప్రామా ణిక పునాదిగా ఉపకరిస్తుంది.
వీరుల పోరుగద్దె ‘‘మేడారం’’ (కోయ డోలీల కథ),సంపాద కుడు: జయధీర్ తిరుమలరావు, పేజీలు:136, ధర:80/- రూ, ప్రతులకు: సాహితీ సర్కిల్, హైదరాబాద్ – సెల్: 99519 42242.