సముద్ర కాలుష్యం..ప్లాస్టిక్ అధికశాతం
తినే తిండి..తాగేనీళ్లు..వాడుకునే వస్తువులు..ప్రతిదానికీ ప్లాస్టిక్! మనకండ్ల ఎదురుగా కనిపించే ప్రతి వస్తువులో ప్లాస్టిక్..అంతాలా మన జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది.అవసరం ఉన్నాలేకున్నా వాడాల్సిన పరిస్థితికి మనం చేరి పోయాం.ప్లాస్టిక్ వస్తూనే ఉన్నది..గుట్టలు గుట్టలుగా పేరుకుపోతూనే ఉంది.భూమినే కాదు..సముద్రాలను ముంచెత్తుతుంది.ఎన్నో జీవరాశుల ప్రాణాలకు ముప్పు తెస్తోంది.ప్లాస్టిక్ భూతం వల్ల సముద్రాలకు,జలచరాలకు జరుగుతున్న నష్టమెంత?ప్లాస్టిక్‌ను ఆపేదెట్ల? సముద్రాలను కాపాడుకునుడెట్ల?–(కొట్టాల రాము)
మనిషి అడుగుపడనంత వరకే ఏ ప్రాంతమైనా సురక్షితం..అని అన్నాడో రచయిత.దేన్నయినా ధ్వంసం చేయగల నేర్పు..గాలినీ,గంగనూ..కలుషితం చేయగల తెలివి..ఒక్క మనిషికే సొంతం.మన తప్పులకు నీటి అడుగున ఉన్న ప్రపంచం నాశనం అవుతోంది.ఫ్లాస్టిక్ చెత్తను పడేసేందుకు డంపింగ్ యార్డుల్లా సముద్రాలు మారిపోతున్నాయి.ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోతున్నాయి.సముద్రపు జీవుల మనుగడే ప్రశ్నార్ధకంగా మారిందని అమెరికాకు ఎందిన ‘ది5గైర్స్ ఇనిస్టిట్యూట్’ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ప్రపం చవ్యాప్తంగా ఉన్న మహా సముద్రాల్లో దాదాపు 170 ట్రినియన్ల ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయి.వీటి బరువు రెండు మిలియన్ టన్నుల ఉంటుంది.2005నుంచి సముద్రాల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ చాలా పెరిగింది.దీన్ని కానీ ఆపకపోతే 2040నాటికి వ్యర్ధాలు మూడురెట్లు పెరుగుతాయి.ఇది మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది.ప్లాస్టిక్ నివారణకు చట్టబద్దమైన విధానాలు తీసుకురావాలి.ఫ్లాస్టిక్ నష్టాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం అవసరం.ఎక్కువ ఫ్లాస్టిక్ తయారీతోపాటు వాడకం కూడా పెరిగింది.దీంతో భూమిపై వీటి వ్యర్ధాలు భారీగా పేరుకుపోయాయి’’ని వివరించింది.
మనకు ఎంతో ఇస్తోంది..
జీవి మనుగడకు సముద్రం అత్యంత ముఖ్యం.సముద్రాలులని మానవ జీవనాన్ని ఊహించలేం. భూమి మొత్తం విస్తీర్ణంలో దాదాపు మూడువంతులు సముద్రాలే.ఒకవంతు భాగంలో మనం జీవిస్తున్నాం. మిగిలిన జీవరాశుల మనుగడకు సముద్రాల ఉనికి చాలా కీలకం.సముద్రాల్ని క్షేమంగా కాపాడుకుంటేనే మనుషులూ,మిగిలిన జీవులు క్షేమంగా ఉండటానికి వీలవుతుంది. మన ఫుడ్‌లో ఇంపార్టెంట్ స్టాల్..అఅది దొరికేది సముద్రం నుంచే.చేపలు,రొయ్యలు,పీతల్లాంటి జలచరాలు సముద్రాల నుండే లభిస్తున్నాయి.అలాగే సముద్రపు పొచి,నాచు నుంచి సేకరించే పదార్ధాలను ఫుడ్ ఐటమ్స్‌లో వాడతారు.సముద్రాల్లో దరికే ఫ్రాన్స్,సీవిప్ కోరల్స్ నుంచి సేకరించిన పదార్ధాలను ఫెయిర్ కిల్లర్స్,ఇతర ఔషధ ఉత్పత్తుల్లో వాడతారు. సముద్ర తీరాల్లో లభించే ఇసుక..భవన నిర్మాణాల్లో ఉపయోగపడుతోంది.మనకు ఇంత ఉపయోగపడుతున్న సముద్రాలకు మనం మాత్రం తిరిగికాలుష్యాన్ని కానుకగా ఇస్తున్నాం.ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా కలుషితం చేస్తున్నాం.
సముద్ర జీవాలకు ముప్పు…
సముద్రపు అంచుల్లో నివసించే జీవుల్లో మైక్రో ఫ్లాస్టిక్స్ బయటపడుతున్నాయి. ‘‘మైక్రో ఫ్లాస్టిక్‌వల్ల నీరు కలుషితం అవుతుంది.ఇదొక్కటేనా ప్లాస్టిక్‌ను ఫుడ్ అనుకొని సముద్ర జీవులు తినడంతో వాటి ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి.మహాసముద్రాల్లో మైక్రో ఫ్లాస్టిక్స్ పెరిగిపోవడంతో ఇప్పుడు ప్రపంచస్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉంద’’ ని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు.తాబేళ్లు,తిమంగలాలు,ఇతర జలచరాలు ఫ్లాస్టిక్ మింగడం లేదా వాటిలో చిక్కు కొని మరణిస్తున్నాయి.సముద్రపక్షలు చేపలు అను కుని ప్లాస్టిక్‌ను తింటున్నాయి.ఇలా చనిపోయిన పక్షల కడుపుల్లో దాదాపు80శాతం ఫ్లాస్టిక్ ఉంది. తిమింగలాల పొట్టలో నుంచి కేజీల కొద్దీ ఫ్లాస్టిక్ బయటపడిన ఘనటలూ ఉన్నాయి.
కారణాలేంటీ?..
సముద్రాలకు ఫ్లాస్టిక్ చేస్తున్న హానిని ఊహించ లేమని సైంటిస్టులు ఆందోళన పడుతు న్నారు.‘బీచ్‌ల్లో చెత్త వేయడం,సాధారణ వ్యర్ధాల నిర్వహణలోపం,మురుగు కాలువలు,నదులు, వాన లకు కొట్టుకుని రావడం వంటి కారణాలతో సము ద్రంలోకి ఎత్త చేరుతోంది.మరో 22శాతం మిస్ మేనేజ్ చేస్తున్నారు.ఇది ఇలానే కొనసాగితే భయంకర పరిస్థితులు తెలెత్తుతాయి.ప్రపంచం ముందుకు వచ్చి ఫ్లాస్టిక్ కట్టడికి చర్యలుతీసుకోకపోతే..2040 నాటికి మహా సముద్రాల్లోకి చేరే చెత్త 64బిలియన్ ఫౌండ్ల(2,902కోట్ల కిలోల)కు పెరుగుతుందని రీసెచర్చర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2050 నాటికి భూమిపై పోగయ్యే చెత్త 26ట్రిలియన్ ఫౌండ్ల(11.79కిలక్షల కోట్లు)వరకు ఉండొచ్చని మరో స్టడీ అంచనా వేసింది.‘‘ఫ్లాస్టిక్ కాలుష్యం చాలా స్థిరంగా కొనసాగుతుంది.అలానే వదిలేస్తే అనేక దశాబ్దాలు లేదా శతాబ్దాలపాటు ఇలానే ఉండొచ్చు.సముద్రంలోకి ఫ్లాస్టిక్ చేరకుండా అడ్డు కోవాలంటే దాని మూలాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలి.అప్పుడే పరిష్కారాలు దొరుకుతాయి. దీనికి పూర్తి మ్యాపింగ్ అవసరం.ఒకసారి మహా సముద్రాల్లోకి చేరిన చెత్త..చిన్నచిన్న భాగాలుగా విడిపోతుంది.కాలక్రమేణా మారిపోతుంది.కానీ నిజంగా అదృశ్యం కాదు.రికవరీ కార్యకలాపాలను మరింత క్లిష్టతరం చేస్తుంది’’అని ది ఓషన్ క్లీనప్ రీసెర్చ్ హెడ్ లౌరెంట్ లెబ్రెటెస్ ఆందోళన వ్యక్తం చేశాడు.
నమ్మలేని నిజాలివి…
-కొన్నేండ్లుగా సగటున ప్రతి నిమిషానికి ఓట్రక్కు చెత్త సముద్రంలో కలుస్తున్నట్లు అంచనా.
– గత వందేండ్లలో ఉత్పత్తి కానంత చెత్త..కేవలం గత దశాబ్దకాలంలోనే ఉత్పత్తి అయింది.
-ఒక ఫ్లాస్టిక్ కవర్ మనకు ఉపయోగపడే సమయం సగటున కేవలం 15 నిమిషా లు.కానీ అవసరం తీరాక అది డీగ్రేడ్ కావడానికి 500నుంచి వెయ్యేండ్లు పడు తుంది.డీ గ్రేడ్ అయినంత మాత్రాన డీ కంపోజ్‌కాదు.మైక్రోఫ్లాస్టిక్‌గా మారు తంది. మనుషులు,జంతువులకు విష పూరితంగా మారుతుంది.పావుగంటలో వాడేందుకు పనికరాకుండా పోయే వస్తువును..కొన్ని తరాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాకర వస్తువుగా మారుస్తున్నాం.
– ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 సముద్ర జంతువులు ఫ్లాస్టిక్ వల్ల చనిపోతు న్నాయి.దాదాపు 90శాతం సముద్ర పక్షలు ఫ్లాస్టిక్ తింటున్నాయి. ఫ్లాస్టిక్‌ను ఆహారం అనుకుని ప్రతి మూడు సముద్ర తాబేళ్లలో ఒకటి తింటున్నాయి.
-చివరికి తల్లి గర్బంంలోని శిశువులకు అన్ని పోసకాలను అందించే,బొడ్డు తాడు (ప్లెసెంటా)లో కూడా మైక్రోఫ్లాస్టిక్ అవశే షాలు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
-2050కల్లా ప్రపంచంలో మత్స్య సంపద తో సమానంగా ఫ్లాస్టిక్ సముద్రాల్లో చేరు తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు చేపలు పట్టేటప్పుడు ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా పడుతున్నాయట. ఇటీవల కేరళలో మత్స్యకారుల వలలకు టన్నుల కొద్దీ ఫ్లాస్టిక్ చెత్త వచ్చి పడిరదట.
– సముద్రాల్లో పొగువుతన్న చెత్తలో 80శాతంపైగా ఫ్లాస్టిక్ వ్యర్ధాలే ఉం టున్నాయి.
-ప్రపంచంలోని ఒక్కశాతం నదులు (సుమారు1,0001)..సముద్రాల్లోకి చేరే 80శాతం ఫ్లాస్టిక్‌కు కారణమవు తున్నాయి.
క్లీనింగ్ ఇలా..
ఫ్లాస్టిక్ చెత్త సముద్రాల్లోకి చేరకుండా ఆపడాన్ని నదులను శుభ్రపరచడం ద్వారా ప్రారం భించాలి.దిఓషన్ క్లీనప్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనై జేషన్.. సముద్రాల్లో ఫ్లాస్టిక్ క్లీన్ చేసేందుకు చర్యలు చేప ట్టింది.ఇప్పటివరకు 2మిలియన్ కిలోలకు పైగా చెత్తను సముద్రం నుంచి తొలగించింది.
కాస్టింగ్ నెట్..
సముద్రాల్లో ఏర్పడే ప్యాచ్‌లను తొలగిం చేందుకు నెట్స్ వాడుతున్నారు.రెండు పడవలకు చెరోవైపు నెట్‌ను తగిలించి..యు ఆకారంలో వెళ్లి చెత్తనంతా మధ్యలోకి తీసుకొస్తారు.అక్కడి నుంచి తరలించి రీ సైకిల్ చేస్తారు.ఈప్రాసెస్‌లో సముద్ర జీవులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇంటర్ సెప్టార్ సిస్టమ్..
నదికి అడ్డంగా ఒకవైపు నుంచి ఇంకో వైపునకు ‘ట్రాష్ ట్రెంచ్’ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంటర్ సెప్టార్ బ్యారియర్ల ద్వారా చెత్త సేకరి స్తారు. నది వెడల్పు,లోతు,ప్రవాహ వేగం,చెత్త రకం వంటి అంశాల ఆధారంగా సేకరణ తీరు మారు తుంటుంది.ఈ మొత్తాన్ని ఏఐ కెమెరాలను ఉపయో గించి అంచనా వేస్తారు.చెత్తను తీయడానికి కన్వే యర్ బెల్ట్ వాడతారు.
గ్రేట్ బబుల్ బారియర్లు..
గ్రేట్ బబుల్ బారియర్లద్వారా నది నుంచి వచ్చే చెత్త సముద్రంలో కలవకుండా చూస్తారు.ఈ బబుల్ బారియర్లను నదిలో వాలుగా ఏర్పాటు చేస్తారు. వాటి నుంచి వచ్చే గాలి బుడగలు ప్లాస్టిక్ చెత్తను అడ్డుకుంటాయి.వచ్చే చెత్తమొత్తం ఒడ్డును ఒక మూలకు చేరేలా చేస్తాయి.అక్కడి నుంచి చెత్తను సేకరిస్తారు.
రోజూ వాడే వస్తువులన్నీ…
నదులు ద్వారా,నేరుగా డంపింగ్ చేయ డం ద్వారా భారీస్థాయిలో ఫ్లాస్టిక్ చెత్త సముద్రాల్లోకి వచ్చి పడుతోంది.సముద్ర అంతర్గత ప్రవాహాల కారణంగా ఆఫ్లాస్టిక్ అక్కడక్కడా గుంపు(ప్యాచ్)గా చేరుతోంది.ఈ ఫ్లాస్టిక్ చెత్తలో మనం నిత్యం వాడే అన్ని రకాల వస్తువులు ఉంటున్నాయి.శాస్త్రవేత్తలు పసిఫిక్ ప్యాచ్‌లో పరిశీలించినప్పుడు..ఫ్లాస్టిక్ బాటి ల్స్,గ్లాసులు,పాత్రలు,బొమ్మలు,టాయిలెట్ సీట్లు, చేపల వలలు,ఎలక్ట్రానిక్ పరికరాల ఫ్లాస్టిక్ భాగా లు,ఇంట్లో వాడే ఇతరఫ్లాస్టిక్ వస్తువుల ముక్కలు, థర్మాకోల్ ముక్కలు..ఇలా ఇంకా ఎన్నో రకాలు కనిపించాయి.
ఫ్లాస్టిక్‌ను వాడకుండా ఉండలేమా.?
ఫ్లాస్టిక్‌ను నియంత్రిండమెలా?నిజంగా మనం ఫ్లాస్టిక్‌ను వాడకుండా ఉండలేమా?శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి.‘‘ విచ్చలవిడిగా ఫ్లాస్టిక్‌ను తయారుచేస్తూ..రీ సైకిల్ చేయాలి..క్లీన్ చేయాలి అంటే ఎలా?అసలు ఫ్లాస్టిక్ తయారు చేయడమే మానేయాలి.అప్పుడు రీ సైక్లింగ్,క్లీనింగ్ అవసరమే ఉండదు.ఫ్లాస్టిక్ బదులు మనకు ఎన్నోప్రత్యామ్నాయ మార్గాలున్నాయి .కాకపోతే ప్రభుత్వాలకూ,ప్రజలకూ నిబద్దత అవ సరం.ఫ్లాస్టిక్ వాడే తీరు మారాలి’అంటున్నారు.
సైంటిస్ట్‌లు..
మనం బజారుకెళ్లి ఏంతెచ్చినా..ఫ్లాస్టిక్ కవర్‌లోనే తెస్తాం.ఇంటికి వచ్చే వరకే ఫ్లాస్టిక్ కవర్ మనకు అవసరం.తర్వాత అదిచెత్త బుట్టలోకి వెళ్తుంది. ఇలా ఒకరోజుకు,నెలకు,ఏడాదికి ఎంత ఫ్లాస్టిక్ చెత్తను మనం పడేస్తున్నాం అనేది ఆలో చించాలి.అవసరం మేరకే వాడుతున్నామా? అందుబాటులో ఉంది కాబట్టి విచ్చలవిడిగా వాడు తున్నామా?అనేది గమనించాలి.మితిమీరి తింటే మందు కూడా విషం అవుతుంది.అలాంటిది విషం లాంటి ఫ్లాస్టిక్‌ను..ప్రతి దానికి ఉపయోగిస్తున్నాం.
మారాల్సింది మనం ..ఫ్లాస్టిక్ వాడుతున్న పద్దతి కదా!..
ఫ్లాస్టిక్ కవర్లపై నిషేధం అంటూ ఉత్తుత్తి ప్రకటనలతో కాకుండా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి.దశల వారీగా సింగిల్ యూజ్ ఫ్లాస్టిక్‌ను నిషేధించాలి.ఫ్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేం దుకు టార్గెట్లు పెట్టుకోవాలి.వాటిని సాధించేందుకు కృషి చేయాలి.బ్యాన్‌ను కాదని అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రత్యామ్నాయాలను ప్రొత్స హించాలి.జనపనార లేదా క్లాత్ సంచుల వినియో గాన్ని ప్రోత్సహించాలి.తయారీదారులకు ఇన్సెం ట్‌వ్‌లు ఇచ్చి దన్నుగా నిలవాలి.ముఖ్యంగా బయో డీఏడబుల్ సంచులను ఉపయోగించేలా ప్రజల్లో మార్పు తీసుకురావాలి.బంగాళదుంపలతో కూడా క్యారీబ్యాంగ్,స్పూన్స్,ప్లేట్స్,పిల్లల ఆట సామగ్రిని తయారు చేస్తున్నారు.పర్యావరణానికి ఇవి ఎలాంటి హాని చేయవు.కొదÊఇద రోజులకే కరిగి భూమిలో కలిసిపోతాయి.వీటిని రీసైక్లింగ్‌కి కూడా వాడొచ్చు. బ్రిటన్,జపాన్‌లలో వీటిని ఇప్పటికే వాడుతున్నారు. రోజుకు సముద్రాల్లో ఎంత ఫ్లాస్టిక్ చెత్త పేరుకు పోయింది?రేపటికీ అది ఎంత అవుతుంది?వచ్చే ఏడాది ఎంత పెరుగుతుంది?ఇలాంటి ప్రశ్నలకు మనకు నిజంగా సమాధానాలు తెలియపోవచ్చు. కానీ,సముద్రపు చెత్తా చెదారాన్ని నియంత్రించ డానికి స్థానికంగా,ప్రాంతీయంగా, ప్రపంచ స్థాయి లో తీవ్రమైన ప్రయత్నాలు జరిగే వరకు భారీ మొత్తంలో ఫ్లాస్టిక్ వేస్ట్ సముద్రాల్లో పెరుగుతూనే ఉంటుంది.
పదివేల అడుగుల లోతున…
ఫిలిప్పీన్స్ మెరైన్ సైన్స్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మైక్రోబయల్ ఓషియనాలజిస్ట్ డాక్టర్ డియోఫ్లోరెన్స్ ఓండా..2021లో పసిఫిక్ సముద్రం లోని ‘ఎమ్డెన్ డీప్’లో 10,000మీటర్ల లోతైన ప్రదేశానికి వెళ్లారు.అది ప్రంచంలోని అతి పురాత నమైన, భూమ్మీద మూడులోతైన ట్రెంచ్(కందకం) సముద్రంలో దాగి ఉన్న రహాస్యాలను కనుగొవడం కోసం ఆసాహసం చేశారు.10,000మీటర్ల లోతులో పదార్ధాలను,వాతారణాన్ని పరిశీలిం చారు. ఆయనతోపాటు అమెరికన్ సైంటిస్ట్ విక్టర్ వెస్కోవా వెళ్లారు.ఇద్దరూ దాదాపు 12గంటలపాటు అన్వేషించారు.‘‘ మేమిద్దరం సముద్రంలోని లోతైన ప్రదేశానికి వెళ్లగానే తెలుపు రంగులోని పదార్ధాలు కనిపించాయి.వాటిని మొదట జెల్లీఫిష్ అనుకు న్నాం.తీరా దగ్గరకు వెళ్లి చూస్తే..అవన్నీ ఫ్లాస్టిక్ వ్యర్ధాలని అర్ధమైంది.ఇంత లోతులో ఫ్లాస్టిక్ వ్య ర్ధాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాం. బట్టలు, పాత బొమ్మలు,ప్యాకేజింగ్ వస్తువులు,ఫ్లాస్టిక్ సంచులు ఇలా చాలా వస్తువులు అక్కడ పేరుకు పోయాయి’’ని చెప్పారు ఓండా.
ఊహించలేనంత నష్టం..
సముద్రం ఒక క్రైమ్ ప్లేస్‌గా మారింది. ఇది ఒక సైటింటిస్టు ఆవేదన.నీటిలో తప్ప ఇంకె క్కడా బతకలేని జలచరాలకు..సముద్రమే ప్రమాద కరమైన ప్రదేశంగా మారుతోంది.మనకెన్నో ఇస్తు న్న సముద్రాన్ని అంతలా మనమే నాశనం చేస్తు న్నాం.నీళ్లు,సముద్రపు ఉత్పత్తులు కలుషితం అయి పోతున్నాయి.అమెరికా సహా పలుదేశాల్లోని సము ద్ర తీర ప్రాంతాల్లో మట్టి,ఇసుకను పరిశీలిం చిన శాస్త్రవేత్తలు…వాటిలో ఫ్లాస్టిక్ అవశేషాలు గణ నీయంగా ఉన్నట్లు గుర్తించారు.మనం తినే తిండి, తాగే నీళ్లు..ఓలెక్కన చెప్పాలంటే మన శరీరంలోకి కూడా మైక్రోఫ్లాస్టిక్ చేరిపోతుంది.అసలు మైక్రోఫ్లాస్టిక్(సూక్ష్మస్థాయి ఫ్లాస్టిక్ ముక్కలు) లేనిప్రదేశమే లేకుండా పోయిందని సైంటిస్టులు చెప్తున్నారు.ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకా రం..గాలిలోని దుమ్ములో,తాగేమంచినీళ్లలో, సము ద్ర జీవు కడుపుల్లో మైక్రోఫ్లాస్టిక్‌ను గుర్తించారు. మనం తప్పు చేసి శిక్ష అనుభవించడమే కాకుండా ఎన్నో కోట్ల జీవరాశులను బలి చేస్తున్నాం.భవిష్యత్తు తరాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాం.‘‘ఏటా 640 వేల టన్నుల ఫిషింగ్ ఎక్విప్‌మెంట్‌ను సముద్రాల్లో డంప్ చేస్తున్నారు.ఫ్లాస్టిక్ నుంచి వెలువడే రసా యనాలతో నీళ్లు కలుషితమవుతున్నాయి.ఆ ప్రభా వం సముద్రం జీవులపై పడుతోంద.వాటి నుంచి ఆ ఎఫెక్ట్ మనుషుల ఆరోగ్యంపై పడుతోంది’’ అని డబ్ల్యూయూఎన్ గ్లోబల్ రీసెర్చ్ గ్రూప్ రీసెర్చర్లు ఆందోళన పడుతున్నారు.
ప్లాస్టిక్ లేని ఊరు..
ఫ్లాస్టిక్ వల్ల ఈ భూమ్మీద ప్రతి ప్రాణికి ప్రమాదమే.అందుకే మన దేశంలో సహా ప్రపం చంలో అనేక దేశాలు ఫ్లాస్టిక్ వాడకం తగ్గించాయి. వ్యర్ధాలను ఎక్కపడితే అక్కడ పారేయకుండా చర్యలు తీసుకుంటున్నాయి.ఫ్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను గుర్తించిన ఓ గ్రామం సర్పంచ్ వాళ్ల ఊరి ప్లాస్టిక్ రహిత పంచాయితీగా మార్చాలి అనుకున్నాడు.కానీ,అది అంత ఈజీకాదని కొత్తగా ఆలోచించాడు.దాంతో ఆయన లక్ష్యం 15రోజు ల్లోనే నెరవేరింది.సౌత్ కశ్మీర్ అనంతనాగ్ జిల్లా లోని షహబాద్ బ్లాక్ సాదీవర పంచాయితీకి ఫరూ క్ అహ్మద్ గనయ్ సర్పంచ్.ఇంతకుముందు ఆయన లాయర్‌గా పనిచేశారు.వాళ్ల గ్రామంలో ఫ్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చేయాలనుకుని..‘ఫ్లాస్టిక్ తీసుకు రండీ`బంగారం గెలుచుకోండి’ అని ప్రకటించాడు.ఈ కార్యక్రమంలో భాగంగా 20 క్వింటాళ్ల ఫ్లాస్టిక్ వ్యర్ధాలను తీసుకొచ్చిన వాళ్లకు ఒక బంగారం నాణెం ఇస్తామని చెప్పాడు.దాంతో ఊరివాళ్లంతా ఫ్లాస్టిక్ సేకరించే పనిలో పడ్డారు. దాంతో..పదిహేను రోజుల్లోనే ఊళ్లో ఫ్లాస్టిక్ కని పించకుండా పోయింది.ఆ తర్వాత గవర్న మెంట్ ఆ గ్రామాన్ని ఫ్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటిం చింది.
రీసైక్లింగ్‌కు కట్టుబడితేనే…
ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం మున్సి పాలిటీల ప్రాధమిక విధుల్లో ఒకటి.తడి,పొడి చెత్తను వేరుగా తీసుకోవాలి.రీసైక్లింగ్ చేపట్టాలి .అయితే ఈపని ఎక్కడా సరిగా జరగదు.కానీ, ఒడిశాలోని సంబల్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ)చెత్తనుంచి ఆదాయం సంపాదించుకుం టోంది.ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి.. అమ్మ డం ద్వారా ప్రతినెల రూ.15లక్షల నుంచి రూ.2 లక్షల దాకా ఆదయాం పొందుతోంది.‘గ్లాసు, పేపర్,కార్డ్‌బోర్డ్,మెటల్,ఫ్లాస్టిక్ టైర్లు,బట్టలతో సహా 16రకాల రీసైకిల్ చేయగలిగే వ్యర్ధాలు వేరు చేస్తోంది. ఎంపిక చేసిన ఏజెన్సీకి..ఒక్కో ఐటమ్‌ను ఒక్కో ధరకు అమ్ముతోంది.సంబల్‌పూర్ సిటీలో రోజూ 110టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంటే.. తొమ్మిది వెల్త్ సెంటర్లును ఏర్పాటు చేసి ప్రాసెస్ చేస్తున్నారు.తొలుత గృహాలు,వాణిజ్యసంస్థల నుంచి సేకరించిన చెత్తను వెల్త్ సెంటర్లకు తీసు కొస్తారు.ఈసెంటర్లలో మైక్రోకంపోస్టింగ్ సెంటర్ (ఎంసీసీ),మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎం ఆర్‌ఎఫ్) ఏర్పాటు చేశారు.నగరంలో ఉత్పత్తయ్యే బయోడీగ్రేడబుల్ వ్యర్దాలను వేరు చేస్తారు.అలా వేరు చేసిన తర్వాత రీసైకిల్ చేయడానికి వీలులేని చెత్తను..ఇంధనంగా వాడేందుకు సిమెంట్ ఫ్యాక్టరీకి పంపుతారు.రీసైకిల్ చేయగలిగే చెత్తను ఏజెన్సీకి అమ్ముతారు.వేస్ట్‌ను కూడా వేస్ట్ చేయకుండా ఆదాయవనరుగా మార్చుకుంటు న్నారు వాళ్లు.2017లో బ్రిటన్‌కు చెందిన అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్ కారోలిన్ పవర్ తీసిన పొటో ఇది.హోండురాస్‌లోని రోవాటెన్ ఐలాండ్‌కు దగ్గర్లోకి కరేబియన్ సముద్రంలో ఇలాకొన్ని కిలో మీటర్ల మేరచెత్త పేరుకుపోయింది.హోం డురాస్, గాటెమాలలో అడ్డూఅదుపు లేని ఫ్లాస్టిక్ వినియో గానికి ఇదోఉదాహరణ.సముద్రాల్లో ఫ్లాస్టిక్ ఎంతటా పేరుకుపోతుందో చేపేందుకు ఇదో నిదర్శనం.పైగా‘దీనికి మీదే బాధ్యత’అంటూ రెండు దేశాలు ఒకరినొకరు నిందుంచుకోవడం గమ నార్హం. (వీ6వెలుగు సౌజన్యంతో…)