సమత రవికి ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డు

వైవిధ్యం ఆయన జీవన శైలి.ఉద్యమం ఆయన ఊపిరి.ఎన్నో సమస్యలపై పోరాడారు.విజయం సాధించారు. గిరిజనులకు ‘నేనున్నా’..అంటూ భరోసా ఇచ్చారు.వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.ఆయనే రవి రెబ్బాప్రగడ. ఆయన సేవలకుగాను ఇప్పటికే ‘లక్ష్మీపత్‌ సింఘానియా యువ నాయకత్వం’ వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించగా తాజాగా అక్టోబర్‌ 4న మరో ప్రతిష్టాత్మకమైన పురస్కారం సమత రవిని వరించిన సందర్భంగా…
రవి పుట్టింది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి.సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ అమాయకులైన నిరుపేద గిరిజనుల సాదక బాధకాలు ఆయన్ని బాగా కలచి వేశాయి.గ్రామీణాభివృద్ధి అంశంపై స్నాతకోత్తర పట్టా(పీజీ)పుచ్చుకున్న ఆయన బహుళజాతి సంస్ధల్లో వచ్చిన ఉద్యోగావకా శాన్ని వదులుకున్నారు.34ఏళ్ల క్రితం ఓసామా జిక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించారు. ఈ మూడు దశాబ్దాలలో ఆయన సేవలకు గుర్తింపుగా ఢల్లీి హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ‘ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డ్స్‌ 2024’పురస్కారాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి న్యాయమూర్తి ఎన్‌.కోటిష్వరసింగ్‌ అందుకున్నారు.ఢల్లీి హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రముఖ తీర్పులకు దారితీసిన న్యాయ పోరాటం చేసిన వ్యక్తులను,ప్రముఖ తీర్పులకు దారితీసిన విజేతలను సత్కరించడానికి ‘ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డ్స్‌ 2023’కార్యక్రమాన్ని ప్రారంభించింది.రెండవ సంచికను నిర్వహించిన న్యాయపోరాటం చేసిన వ్యక్తుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఐదోవ షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని గిరిజన హక్కులు, పర్యా వరణం,వనరుల పరిరక్షణపై పనిచేస్తున్న రవికి ఈఅవార్డు లభించింది.
అవార్డు ఎంపిక జ్యూరీ..
సమత వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌,ఇతర రాష్ట్రాలలో న్యాయం కోసం సమత చేసిన అలుపెరగని పోరాటం కోసం ప్రముఖ జ్యూరీ ‘గిరిజన ఎస్సీ,ఎస్టీ విభాగంలో అవార్డు గ్రహీతగాఎంపిక చేసింది.ఈ అవార్డుల ఎంపికను ప్రముఖ జ్యూరీ అవార్డు గ్రహీతలను నిర్ణయించారు.ఢల్లీి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి,మీనన్‌, సాయుధ దళాల ట్రిబ్యునల్‌ ఛైర్మన్జస్టిస్‌ రాజేంద్ర,ఢల్లీి హైకోర్టు మాజీ న్యాయ మూర్తి,జస్టిస్‌ కైలాష్‌ గంభీర్‌,తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండ రామ్‌,ఢల్లీి హైకోర్టు బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షులు,సీనియర్‌ న్యాయవాది, మోహిత్‌ మాథుర్‌,సీనియర్‌ న్యాయవాది,ఢల్లీి హైకోర్టు సీనియర్‌ న్యాయవాది రాజశేఖర్‌ రావు,ఢల్లీి హైకోర్టు వికాస్‌ పహ్వా,ఢల్లీి మాజీ ప్రత్యేక పోలీసు కమిషనర్‌ సంజయ్‌ సింగ్‌, సీనియర్‌ న్యాయవాది,ఢల్లీి హైకోర్టుమ ణిందర్‌ సింగ్‌ జ్యురీస్‌ సభ్యులుగా ఉన్నారు.
నేపథ్యం ఇదీ..
దేశం యావత్తూ ఒక్కసారిగా ప్రభుత్వేతర సంస్థల పదునేమిటో ప్రత్యక్షంగా చవి చూసిన సంఘటన 1997నాటి సమత తీర్పు.ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొని తూర్పు కనుమల్లో గనుల తవ్వకాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు ద్వారా సమత వాదన సరైం దేనని తీర్పు పొందిన ఘనతకు మూల కారకు డాయన. సమతా వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (1997)లో సుప్రీంకోర్టు తీర్పు భారతదేశంలోని గిరిజన సంఘాల హక్కు లను,ముఖ్యంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో భూవినియోగం,సహజ వనరుల దోపిడీకి సంబంధించిన హక్కులను గణనీ యంగా సమర్థించే ఒక మైలురాయి తీర్పు. మైనింగ్‌ కార్యక లాపాల కోసం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజనుల భూములను గిరిజనేతర కార్పొరేష న్‌లకు లీజుకు ఇచ్చినప్పుడు,అక్కడ నివసిస్తున్న ఆదివాసీ జనాభా హక్కులు,జీవనోపాధిని ఉల్లం ఘిం చినప్పుడు ఈ కేసు తలెత్తింది.
సమత ఉద్యమంగా విశాఖ కేంద్ర బింధువు..
విశాఖను సమత ఉద్యమాల కేంద్ర బింధువుగా తీర్చిదిద్దుతున్న నేపథ్యం పరిశీలిస్తే..సమాజ సేవ చేయాలనే సంకల్పంతో 1986లో రవి భాగవతుల చారిటబుల్‌ ట్రస్టులో చేరారు. ఆతర్వాత కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో స్వాతంత్య్ర సమర యోధుడు స్వర్గీయ కె.తిలక్‌ స్థాపించన స్పందన సంస్థలో పరిపూర్ణ అవగాహన ఏర్పరచుకున్నారు. 1990లో తానే స్వయంగా సమత స్వచ్చంధ సంస్థను స్థాపించి గిరిజన హక్కుల పోరాటం లో కొత్తపుంతలు తొక్కారు.ఏజెన్సీలోని కాకినాడ జిల్లా బవురవాక గ్రామంలో పేద గిరిజనులకు 298 ఎకరాల భూమికి పట్టాలు పంపిణీ చేయడంలో రవి కృషి అనన్య సామా న్యం.ఏజెన్సీలో నెలకొన్నపలు సమస్యల పరిష్కారానికి మొక్కవోని దీక్షతో పనిచేశారు.
ఉద్యమమే ఊపిరిగా..
ఉమ్మడి విశాఖ అల్లూరి సీతారామారాజ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిం చడమే ధ్యేయంగా సమత కార్యకలాపాలను విస్తరించారు.గిరిజనులను చైతన్యవంతులను పర్చేపలు సామాజిక సేవా కార్యక్రమాలను చేయడంతో ఆసేవలను గుర్తించి అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్‌ 1994లో అవార్డును బహుకరించారు.బొర్రా ప్రాంతో మైనింగ్‌,భూ సమస్యలను దృష్టి సారించి రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు కంపెనీలు చేపట్టే కార్యక్రలాపాలను వ్యతిరేకిం చారు.అనంతగిరి బొర్రా,అరకు,ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు మైనింగ్‌ ఇచ్చిన లీజులను సమర్దవంతంగా అడ్డు కున్నారు.ఈఘటనతో తూర్పు కనుమల్లో గిరిపుత్రుల్నీ,వారి హక్కుల్నీ సంరక్షించడానికి ఉద్య మించిన ఉక్కు పిడికిలి రవి రెబ్బా ప్రగడ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. న్యాయపోరాటంచేసి 1997లో భారత అత్యన్నత న్యాయస్థానం ద్వారా సాధించిన ‘సమత తీర్పు’ దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రా ల్లోని గిరిజన హక్కుల పరిరక్షణకు ఓకవ చంలా ఉపయోగపడుతోంది.ఆనాటి పోరాట ఫలితమే నేడు ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డు` 2024 పురస్కారం ఈసముచిత గౌరవాన్ని రవి రెబ్బాప్రగడ దక్కించుకున్నారు.– గునపర్తి సైమన్‌