సమత..గిరిజనులకు చేయూత
ఎకో టూరిజంపై గిరిజన యువతకు శిక్షణ
స్వయం ఉపాధి సాధన దశగా సమత కృషి
సత్ ఫలితలిస్తున్న సమత శిక్షణ తరగతులు
గిరిజన ప్రాంతాల్లో పర్యాటక రంగం గణనీయంగా పెరుగు తుంది.గిరిజన ప్రజల్లో కూడా వారి జీవనశైలి,జీనోపాధిలోను మార్పులు సంభ విస్తున్నాయి.ఈనేపథ్యంలో సమత మరో ముందుడు వేసింది.పర్యాటక ప్రదేశాల్లో నివసిస్తూ నిరుద్యోగులుగా ఉంటున్న యువతీ, యవకులకు స్వయం ఉపాధి సాధన దశగా గిరిజన యువతను తీర్చిదిద్దాలని సంకల్పంచింది.అటవీ ప్రాంతాల్లో స్థాని కంగా లభించే వనరులు,అటవీ ఉత్పత్తులను సద్వినియోగం చేసుకుని ఆర్ధికాభివృద్ధి సాధించేందుకు అవసరమైన శిక్షణలు,నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి,అరకు,చింతపల్లి,పాడేరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా బుర్రాగుహలు, కటికి,సిరియా వంటి జలపాతాలున్న ప్రదేశాలవద్ద గిరిజన ఉత్పత్తులు,వారు తయారు చేసే వస్తువులు,రుచికరమైన వంటకాలను పర్యాటకులకు విక్రయిస్తూ మెరుగైన జీవనోపాధిని పొందడానికి వివిధ రంగాల్లో నిపుణులతో గిరిజన యువతకు శిక్షణ ఇస్తూన్నారు. దీనిపై నైపుణ్యాభివృద్ధి సాధనకు మెరుగైన శిక్షణలు ఇవ్వడానికి సమత కృతనిశ్చయంతో ముందుకు సాగుతుంది. గిరిజన యువత ఆర్థికాభివృద్ధి సాధించాలి ` సమత రవి
గిరిజన యువతలో మార్పు రావాలి.అర్హతలకు తగ్గా ఉద్యోగాలు లభించకపోయినా,అటవీప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తులు,పంటలను సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధి సాధించేలా వివిధ రంగాల్లో నిష్టాతులైన నిపుణులతో శిక్షణలు ఇప్పిస్తూగిరిజన యువతకు వివిధ రంగాల్లో శిక్షణనిచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు చేపడుతున్నట్లు సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెబ్బాప్రగడ రవి తెలిపారు. ఇప్పటికే కటికి పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక్కడ యువతకి డ్రైవింగ్ స్కూల్లో చేర్పించి నెలరోజులపాటు శిక్షణ ఇప్పించాం.వారికి అవసరమైన డ్రైవింగ్ లైస్సెన్సులు సైతం ఇప్పించడం జరిగింది.గిరిజన యువతకు సమత అందిస్తున్న నైపుణ్యాభివృద్ధిశిక్షణలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధిని సాధించా లన్నారు.అంతేకాకుండాపర్యాటక ప్రదేశాల్లో ఎకోటూరిజం అభివృద్ధి,పర్యా వరణ పరిరక్షణ,యువత స్వయం అభివృద్ధిపట్ల ఆదివాసీ యువతకి సమత ఇచ్చిన శిక్షణ తరగతులు సద్వినియోగపర్చుకోవాలన్నారు.యువత వివిధ రంగాల్లో నేర్చుకున్న నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకుని పర్యాటక ప్రాంతాల్లో మార్కెటింగ్ చేయాలన్నారు. అలాగే పెరుగుతున్న సోషల్ మీడియా రంగం ద్వారా ఇక్కడ ప్రదేశాలు,మీరు తయారు చేసిన అటవీ ఉత్పత్తులు, రుచికరమైన వంటకాలను యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని సూచించారు.
సత్ఫ్‌లితాలిచ్చిన సమత శిక్షణలు
ఆదివాసీ పర్యాటక ప్రాంతమైన బుర్రాగుహలు, కటికి జల పాతం ప్రాంతాల గిరిజన యువతకి కటికి గ్రామంలో సమత వారం రోజుల పాటు యువత స్వయంఉపాధి ఏర్పాటు చేసుకొని,వారి కుటుంబాలు ఆర్ధికంగా అభివృద్ధి చెండడానికి ఉపయోగపడే వివిధ రకాల అంశాలుపై ఈశిక్షణలు పొందారు.సమత కో-ఆర్డినేటర్లు కే.సతీష్ కుమార్ సమన్వయ కర్తగా వ్యవ హరించారు. హాస్పటాలిటీ మేనేజమెంట్ పేరుతో పర్యాటకులకు రుచి కరమైన పౌష్టికాహరాలు తయారీ,(వెదురుబొంగు,నాన్ వెజ్,వెజ్ బిరి యాని,బొంగు చికెన్,స్థానికంగా లభించే రాగి,జొన్న,కొర్రలు,సోమలు మొక్కజొన్నలతో రుచి కరమైన స్నేక్స్ తయారు చేయడం నేర్పించారు.అలాగే అడవిలో సేకరించే అటవీ ఉత్పత్తులతో (వెదురు,గృహాపకారణాలు,సెల్‌ఫోన్ల కవర్లు,అల్లికలు వంటి అంశాలపై నేర్పించారు. తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసేందుకు నైపుణ్యాల అభివృద్ధి పట్ల కూడా బెంగళూర్ నుంచి వచ్చిన నిపుణులు ద్వారా ఈ శిక్షణలు ఇప్పించారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని మెరుగైన జీవలోపాధి సాదించకోవడానికి ఈశిక్షణలు దోహద పడతాయని శిక్షణా నిపుణులు గోపి కృష్ణ తెలిపారు.ముఖ్యంగా పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతలో ఎకో టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణకు యువత పర్యాట కులను చైతన్య వంతులు కావాలని కోరారు. శిక్షణ కార్యక్రమంలో సమత కో-ఆర్డినేటర్లు కే.సతీష్ కుమార్,గునపర్తి సైమన్, కటికి జలపాతం కమిటీ అధ్యక్షులు మోహన్, ట్రైనింగ్ టీమ్ లీడర్స్ గోపి కృష్ణ,బొర్రా పంచాయతీ సర్పంచ్ జన్ని అప్పారావు, ఎంపీటీసీ అరుణ నవీన్,పెసా కమిటీ ఛైర్మెన్ దేవ కుమార్,సెక్రటరీ డొనేరు డేనియల్‌రాజకు మార్గే మ్మేలా చిన్నాయ్య అడ్వకేట్ సోమేలా రాం బాబు తదితరులు పాల్గొన్నారు. – గునపర్తి సైమన్