సంయమనం అవశ్యం
తిరుపతి లడ్డు కల్తీ విషయం చినికి చినికి గాలివానగా మారింది. ఈ కల్తీపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ వేసింది. విచారణ జరిపించాలని దేశ ప్రధానికి జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరం రాశారు. ముఖ్యమంత్రి ఆరోపణలపై బిజెపి మాజీ ఎంపీ సుబ్రమ ణ్యస్వామి, టిటిడి మాజీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి లతో సహా అనేకమంది విడివిడిగా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈలోపు పాలక, ప్రతిపక్ష పార్టీల పరస్పర విమర్శలు, ప్రమాణాల సవాళ్ళు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష, వైసిపి కేంద్ర కార్యాల యంపై బిజెపి అనుబంధ యువజన సంఘం కార్యకర్తల దాడి ఒకదాని తర్వాత ఒకటి శరవేగంగా జరిగిపోతు న్నాయి. తాము ఎంతో పవిత్రంగా భావించి, పూజించి, భుజించిన స్వామి వారి లడ్డు అపవిత్రమైనదా! జంతు వుల కొవ్వు కలిపిన లడ్డు తిన్నామా! అంటూ దేశవ్యాపి తంగా వున్న కోట్లాది తిరుమల భక్తులు తీవ్ర ఆందో ళనకు, ఆవేదనకు గురవుతున్నారు. లడ్డులో కల్తీ జరిగి వుంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దోషులపై కేసు లు పెట్టాలి, కఠిన శిక్షలు విధించాలి. అందుకు చట్టం తన పని తాను చేయాలి.ఈ పని సక్రమంగా చేయాల్సి న పాలకులు ఇతర మతాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మత సామరస్యతను దెబ్బ తీస్తున్నారు.
తిరుపతి లడ్డూ-కల్తీ నెయ్యి అంశంపై వారం రోజులుగాచర్చసాగుతోంది.నిజానిజాలను నిర్ధారించి,కారకులపై చర్యలు తీసుకోవడంపై చూ పాల్సిన శ్రద్ధను-అధికార,ప్రతిపక్ష పార్టీలు ఒక దానిపై ఒకటితీవ్రమైన నిందారోపణలు చేసుకో వటంపైనే ఎక్కువగా వెచ్చిస్తున్నాయి. భక్తుల మనో భావాలు, క్షేత్ర పవిత్రత అంటూ పైకి చెబుతూనే మత వైషమ్యాలను రెచ్చగొట్టే సంఫ్‌ు పరివార్ శక్తు లకు ఊతమిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక మంది సందర్శించే తిరుపతి-తిరుమల క్షేత్రంలో ఇచ్చే లడ్డూ ప్రసాదం అనేకమంది భక్తుల మనోభావాలు, నమ్మకాలతో ముడిపడినది. అందులో వాడాల్సిన అన్ని రకాల దినుసులూ నాణ్యంగా ఉండాలి. తిరు మల క్షేత్రంలోనే కాదుబీ ఎక్కడైనా సరే ప్రసాదంగా నో,ఆహారంగానో ఇచ్చే ఏ పదార్థమైనా కల్తీ కాకుం డా ఉండాలి. నాణ్యతను ఎప్పటికప్పుడు నిర్ధారిం చాల్సిన యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలి. ఏ దినుసులో నాణ్యత లోపించినా, కల్తీ కనిపిం చినా నిబంధనలప్రకారం వ్యవహరించాలి. ఆయా దినుసులను వాడకంలోకి వెళ్లకుండా నిలిపి వేసి, సరఫరా సంస్థలపైనా, నిర్లక్ష్యం వహించిన వ్యక్తుల పైనా తగు చర్యలు తీసుకోవాలి. భక్తుల మనోభావా లను గౌరవించాలన్నాబీ పౌరుల ఆహార నాణ్యత కు,ఆరోగ్య భద్రతకు రక్షణ కల్పించాలన్నా-ఇదీ, పాటించాల్సిన పద్ధతి!
అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం తిరుమల క్షేత్రంలో ఇలాంటి తనిఖీ, నియంత్రణ వ్యవస్థలు చాలా ఏళ్లుగా అమలులో ఉన్నాయి.సరఫరా సంస్థలు పంపే దినుసులు నిర్దే శిత ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయా? లేదా? అనితనిఖీ చేసి, సరిగ్గా ఉన్నవాటిని స్వీకరించటం, లేనివాటిని వెనక్కు పంపటం చేస్తున్నాయి. గతంలో టిడిపి,వైసిపిప్రభుత్వాలు,అవి నియమించిన పాలక వర్గాలూ అధికారంలో ఉన్నప్పుడు ఇలా నాణ్యత లేని నెయ్యిని తిప్పి పంపిన ఉదంతాలు ఉన్నాయని చెబుతున్నారు. తనిఖీ వ్యవస్థ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యమూ లేదా ఉద్దేశపూర్వక విస్మరణ ఎక్కడ,ఏ దశలో జరిగినా గుర్తించటం చాలా సుల భం.కారకులను గుర్తించి చర్యలు తీసుకోవడం కూడా సులభం. ఈ పనులన్నీ చేయటానికి అధికా రిక వ్యవస్థలూ,దొంతరలూ తిరుమలలో నడుస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటి ఆధ్వర్యాన సమ స్యను సరిచేయాలి తప్ప వివాదాస్పదం చేయడం తగదు. మనోభావాలను గాయపరిచే, మత వైష మ్యాలను రెచ్చగొట్టే పరిభాషను ఎంచుకోవటం మరీ ప్రమాదకరం. కల్తీని కనుక్కోవటానికి, కార కులను శిక్షించటానికి రాజ్యాంగబద్ధమైన పద్ధతు లను అవలంబించాల్సిన ఉప ముఖ్యమంత్రి ఏకం గా మత వైషమ్యాలను రెచ్చగొట్టే మాటలతో లడ్డూ అంశాన్ని మరింత వివాదాస్పదం చేశారు. కొన్ని మతాలను,ఆ మతస్తుల ప్రార్థనా స్థలాలను ప్రస్తా వించారు. ఇలా వైషమ్యాలను సృష్టించటం అభ్యం తరకరం. చాలా సాధారణంగా, సరళంగా పరిష్క రించాల్సిన అంశానికి మతపరమైన ఉద్రేకాలను, ఉద్రిక్తలను అంటుగట్టి,రాష్ట్రంలో మతోన్మాద శక్తుల వీరంగానికి అవకాశం ఇవ్వడం చాలా పెద్ద పొర పాటు. అధికార టిడిపి-జనసేన, ప్రతిపక్ష వైసిపి ఈ విధమైన పొరపాట్లతో సామరస్యానికి చేటు తెస్తున్నాయి. ఒక పార్టీ ప్రాయశ్చిత్తమంటే- మరొక పార్టీ దేవాలయాల్లో పూజలు చేస్తామంటూ ప్రక టించింది.రాజకీయపార్టీలు రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న జీవనోపాధికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలితప్ప వ్యక్తిగత మతవిశ్వాసాలపై కాదు. మతాన్ని స్వార్థరాజకీయ ప్రయోజనాలకు వాడుకో వటంపై అసలే కాదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, వరద బాధితులకు కేంద్ర సహాయంలో నిర్లక్ష్యం తదితరఅనేక ప్రజాసమస్యలు పక్కకుపోతు న్నాయి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో మతోన్మాదాన్ని ఎగదోసి, రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి-ఆర్‌ఎస్ ఎస్ పొంచి చూస్తున్నాయి.అంతర్వేది,రామతీర్థం తది తర అంశాలను ఎంచుకొని ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి.ఇలాంటి కుయుక్తులపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన తరుణంలో తిరుపతి లడ్డూ అంశాన్ని రాజకీయం చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు, సామరస్యానికీ ప్రమాద కరం.సిట్ నివేదిక వచ్చేవరకూ రాజకీయ పార్టీలు లడ్డూ అంశంపై ఎలాంటి ఉద్రేక ప్రకటనలూ చేయకుండా సంయమనం వహించాలి.
(`వ్యాసకర్త : సీనియర్ పాత్రికేయులు) – (ఆర్.వెంకట సుందరరావు)