కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్(కాప్`26) సదస్సు ఈ ఏడాది నవంబరులో స్కాట్లాండ్లో జరిగింది. ప్రతిఏటా 197దేశాలను ఒకచోట చేర్చే సదస్సు ఇది. వాతావరణ మార్పులు, దాని ద్వారా ఏర్పడే సమస్యల గురించి ఈసదస్సు ప్రధానంగా చర్చిం చింది. ఇది వాతావరణ మార్పుల పై యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఖచీఖీజజజ) ఆధ్వ ర్యంలో జరిగిన కన్వెన్షన్.పర్యావరణంపై మానవ కార్యక లాపాల ప్రభా వాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ప్రపంచంలోని ప్రతి దేశం, ప్రతిభూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్.1994 మార్చి 21న తొలి ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సమావేశాలు జరగ్గా, ఈ ఏడాది జరగబోయేది 26వది. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో నవంబర్ 1 నుంచి 12 తేదీల మధ్య ఈసదస్సు జరిగింది.కాప్ 26 ప్రాధాన్యత
కాప్ 26 సదస్సు 2015లో పారిస్ వాతావరణ ఒప్పందంపై సంతకాల తర్వాత, అది ఏం సాధిం చింది, ఎక్కడ విఫలమైంది అని చర్చించే మొదటి శిఖరాగ్ర సమావేశం.పారిస్ ఒప్పందం ప్రాథమి కంగా వాతావరణ విపత్తును నివారించడానికి మనుషులు అమలు చేయాలనుకున్న వ్యూహం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతలు1.5సెల్సియస్ పెరుగు తున్నాయి.ఈ ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతే భూమికి తిరిగి బాగు చేసుకోలేని ప్రమాదాన్ని సృష్టి స్తాయి. ఏదైనా ఒక ప్రణాళికను ప్రకటించినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి.కాప్‌సదస్సుల ఉద్దేశం కూడా అదే. కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు, వ్యూహాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అన్నది చర్చించు కోవడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశారు.
కరోనా మహమ్మారి వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి?
మహమ్మారి కారణంగా పర్యావరణ పరిరక్షణ చర్య లకు తీవ్ర ఆటంకం కలిగింది. శిఖరాగ్ర సదస్సును ఒక ఏడాదివాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు, మహమ్మారి అనంతర ఆర్థిక స్థితి మెరుగు పరుచు కోవడంలో భాగంగా కొత్త నిర్ణయాలు తీసుకునేలా కోవిడ్ అవకాశం కల్పించింది.ఉదాహరణకు… మనం నిజంగా ఇన్ని ప్రయాణాలు చేయాలా,ఇంటి దగ్గరఉండి పనిచేస్తే సరిపోదా,ఇది కర్బన ఉద్గారా లను తగ్గిస్తుంది కదా,పట్టణీకరణను తగ్గించడానికి అవకాశం ఉందా?లాంటి ఆలోచనలకు దారి తీసింది.
గతంలో ట్రంప్ రద్దు చేసుకున్న పారిస్ ఒప్పందాన్ని తాను కొనసాగిస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. వాతావరణ అనుకూల విధానాలు అవలంబించడంవల్ల ఆర్ధిక పరంగా కూడా ఎంతో మంచిదని ఆయన భావి స్తున్నారు. ఈసారి కాప్‌లో కూడా పర్యావరణానికి సంబంధించి సరికొత్త, సాహసోపేతమైన దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించారు.వాతావరణ మార్పులకు కారణమయ్యే దేశాలలో మొదటి వరసలో పేద దేశాలే ఉన్నాయి. మరోవైపు పెరుగుతున్న సముద్ర మట్టాలు ద్వీపాలను నెమ్మదిగా ముంచెత్తుతున్నాయి. ఇటు కరువు,వేడిగాలులు పంటలను దెబ్బ తీస్తు న్నాయి. ప్రస్తుత కాప్26 సదస్సులో వందకు పైగా దేశాలు కొన్ని డిమాండ్లు పెట్టాయి. పర్యా వరణ సమస్యలపై చర్యలకు నిధులు,ఈ చర్యలు తీసుకున్నందుకు కలిగిన నష్టాలకు పరిహారం,తమ ఆర్థిక స్థితిగతులు బాగుపడటానికి సహకారం,ధనిక దేశాలన్నీ 2020 నాటికి 100 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.75వేల కోట్ల ఇస్తామని హామీ ఇచ్చాయి. కానీ ఇప్పటి వరకు అందులో సుమారు 80శాతం మాత్రమే ఇవ్వగలిగాయి.వీటిలో ఎక్కువ భాగం రుణాలే తప్ప గ్రాంట్లు కాదు.ఈ సదస్సులో చర్చకు వస్తుందనుకుంటున్న మరో అంశం క్లైమేట్ ఫైనాన్స్. కార్బన్ మార్కెట్లు, కార్బన్ క్రెడిట్ల వ్యవ స్థను అమలు చేయడానికి సరైన మార్గం వెతకాల్సిన అవసరం ఉంది. కాలుష్య కారకాలను ఎక్కువగా విడుదల చేసే వారు గ్రీనర్ ఎకానమీలకు కార్బన్ క్రెడిట్ లను ఇచ్చే విధానం ఇది. పేద దేశాలకు సాయం అందించాలి చూడటానికి ఎంతో బాగుంది. కానీ, ధనిక దేశాలు తాము చెల్లిస్తున్నాం కాబట్టి,ఇష్టారాజ్యంగా కాలు ష్యాలను విడుదల చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మరొక ఉదాహరణ...ఒకఅడవిని నాశనం చేసి నందువల్ల ఏర్పడిన ఉద్గారాల కోసం ఒకదేశం ఎంత చెల్లించాలో ఎవరు నిర్ణయిస్తారు? ఒకవేళ గ్లాస్గో శిఖరాగ్ర సమావేశం పైన పేర్కొన్న అన్నింటికీ ఒప్పుకున్నప్పటికీ, మనం నిర్దేశించుకున్న హరిత లక్ష్యాలకు‘కాలపరిమితులు’అవసరం. ఈ సమస్య లకు పరిష్కారం చాలా సులభం అని అనుకుం టారు. కానీ అదినిజం కాదు. క్లైమేట్ ఛేంజ్ పై సాహసోపేత చర్యలు చేపట్టాం., ప్రధాని మోదీ వెల్లడి. ఇది నిరంతర ప్రక్రియ.వాతావరణ కాలుష్య నివారణకు ఇండియా పలు సాహసోపేత చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. క్లైమేట్ ఛేంజ్ అన్నది పెనుసవాల్ అని,అయితే క్లీన్ ఎనర్జీ ఎన్వి రాన్ మెంట్ సాధించాలన్న లక్ష్యంతో ఇండియా వివిధ చర్యలకు శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు. ఇందుకోసం అంతర్జాతీయ సౌరకూట మిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తమ దేశం సమర్థించిందని ప్రధాని మోడీ చెప్పారు. వాతా వరణ కాలుష్యం వల్ల తలెత్తే విపరీత పరిణా మాల కారణంగా మానవ మనుగడ ప్రమాదంలో పడుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే దీని మార్పు కోసం పటిష్టమైన చర్యలు అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. హరిత విప్లవ సాధన కోసం భారత, అమెరికా దేశాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ఇందుకు తాను,అమెరికా అధ్యక్షుడు జోబైడెన్..2030 నాటికల్లా ఇండియా-యూఎస్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించిన లక్ష్య సాధన కోసం అజెండాను రూపొందించామని వెల్లడిరచారు. పలు ఇతర దేశాల్లోని కార్బన్ కాలు ష్యం కన్నా ఇండియాలో ఈకాలుష్యం 60 శాతాని కన్నా తక్కువగా ఉందని మోదీ చెప్పారు. దశాబ్దాల తరబడి కాలుష్య నివారణకుకృషి జరగాలని సూచిం చిన ఆయన ఈ సందర్భంగా స్వామి వివేకానందను గుర్తుచేశారు. క్లైమేట్ ఛేంజ్ పై 40దేశాల ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో వర్చ్యువల్‌గా ప్రధాని పాల్గొ న్నారు. ఈ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్,బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బ్రిటిష్ పీఎం బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రెజిల్‌అధ్యక్షుడు జైర్ బొల్సనారో తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు దేశాధినేతలంతా కృషి చేయాలని తీర్మానించారు. గ్లోబల్ హైబ్రిడ్ సమ్మిట్‌ద్వారా భారతదేశాన్ని స్వచ్చ Ûమైన శక్తి దిశగా నడిపేందుకు వేదికగా ఈ సమా వేశం నిలవనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIూ) ఛైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శిఖరాగ్ర సమావేశంలో ముఖ్య వక్తగా పాల్గొనడం విశేషం. ఈ శిఖరాగ్ర సమావేశాలను ూనణ ఛాంబర్,చీIుI ఆయోగ్, పర్యావరణ మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక పరిశోధన విభాగం, (జూIR),సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.శిఖరాగ్రసమావేశంలో, భారతదేశ హైడ్రో జన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాయి. కాప్26 వాతావరణ సదస్సుతో పెరిగిన కాలుష్యం
వాతావరణ మార్పుపై ప్రపంచ శిఖరాగ్ర సమా వేశాన్ని మీరు నిర్వహించబోతున్నట్లయితే, దాన్ని సాధ్యమైనంత కాలుష్యరహితంగా నిర్వహించడానికి ప్రయత్నించాలి.ఈ ఈవెంట్‌ని ‘‘కార్బన్ న్యూట్రల్’’గా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని యూకే ప్రభుత్వం చెప్పింది. కానీ,మాడ్రిడ్‌లో జరిగిన మునుపటి శిఖరాగ్ర సమావేశం కంటే రెట్టింపును మించి ఉద్గారాలు గ్లాస్గో శిఖరాగ్ర సమావేశ నిర్వ హణ సమయంలో జరిగాయని ఓకొత్త నివేదిక తెలిపింది.ఎక్కువ మంది ప్రతినిధులు,ఎక్కువ ఉద్గారాలు కాప్26సమావేశ సమయంలో విడు దల అయిన మొత్తం కార్బన్ ఉద్గారాలు 1,02,500 టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమానంగా ఉండను న్నాయని యూకే ప్రభుత్వానికి అందిన ప్రాథమిక అంచనా నివేదిక ద్వారా తెలిసింది. ఇది దాదాపు 10,000 యూకేగృహాల నుండి ఒక ఏడాది మొత్తం వచ్చే ఉద్గారాలకు సమానం. 2019లో మాడ్రిడ్‌లో జరిగినచివరి వాతావరణ శిఖరాగ్ర సమావే శంలో జరిగిన ఉద్గారాలతో పోల్చితే కాప్26 సమావేశా నికి అయిన ఉద్గారాలు రెట్టింపు. 2019లో మాడ్రిడ్‌లో జరిగిన సదస్సులో27,000 మంది పాల్గొనగా, కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, గ్లాస్గో ఈ సమావేశానికి 39,000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారని యూకే ప్రభుత్వం తెలిపింది.
అంతర్జాతీయ విమానాలు,ప్రైవేట్ జెట్లు
నివేదిక ప్రకారం కాప్`26 ఉద్గారాలలో 60% అంతర్జాతీయ విమానాల ద్వారానే వచ్చినట్లు అంచనా వేశారు.విమానాల నుండి వచ్చే ఉద్గారా లను నియంత్రించడానికి,హాజరయ్యే వారు సాధ్య మైతే రోడ్డుమార్గంద్వారా ప్రయాణించాలని కోరారు. అయినా, చాలా మంది ప్రపంచ నాయకులు ప్రైవేట్ జెట్ విమానాల్లో వచ్చారు.
అంతేకాకుండా వారి సొంత కాన్వాయ్ వాహనాలను, హెలీకాప్టర్లను తీసుకురావడానికి ప్రత్యేకంగా కార్గో విమానాలను వాడారు. నవంబర్ 1 వరకు గ్లాస్గో చుట్టుపక్కల ప్రాంతాలకు నాలుగురోజుల్లో ప్రైవేట్ జెట్లు లేదా వీఐపీ విమానాలు అన్నీ కలుపుకుని మొత్తం 76 విమా నాలు వచ్చాయని ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ సిరియమ్ రియాలిటీ చెక్‌తో చెప్పింది. సమ్మిట్‌లో కార్బన్ ఉద్గారాలను తగ్గించ డానికి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఖచీఖీజజజ) గుర్తించిన ప్రణాళికలను అమలు చేశామని యూకే ప్రభుత్వం చెప్పింది. వీటిలో పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయో గించడం,చెట్ల పెంపకం వంటివి ఉన్నాయి. కార్బన్ న్యూట్రాలిటీపై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రమాణం ూAూ2060కి అనుగుణంగా నిర్వహించిన మొదటి కాప్ ఇదే అని యూకే ప్రభు త్వం చెప్పింది. ఇటీవల కార్న్‌వాల్‌లో జరిగిన మూడు రోజుల జీ7సమ్మిట్‌లో 20,000 టన్నుల కార్భన్‌డయాక్సైడ్‌కి సమానమైన ఉద్గారాలు విడు దల అయినా ఇది కూడా ‘‘కార్బన్ న్యూట్రల్’’గా గుర్తింపు పొందింది.(బీబీసీ సౌజన్యంతో)
-రవీంద్రనాథ్ కె
Related