సంక్షేమంతో..సుపరిపాలన

తమకు అందుతున్న నిరంతర సేవలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలో సుపరిపాలన అమలవు తుందా లేదా అని ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ సీ.ఆర్‌.మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. సుపరి పాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ రూపాంతరం అనే అంశంపై స్టేట్‌ అవర్‌ లీడర్‌ వైఎస్సార్‌ ఇంటెక్ట్యువల్‌ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆయన పర్యటించారు. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించి మేథావులు,విద్యావేత్తలతో ఈ అంశంపై సమాలోచనలు చేసి సీఎం జగన్‌ అమలపరుస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు సుపరిపాలన అందుతుందా లేదా అనేదానిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు..’
ఇందులో భాగంగా విశాఖలో జరిగిన సభలో కొమ్మినేని శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగిం చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటు న్నాయని కొనియాడారు. ఆగష్టు 21న అవర్‌ స్టేట్‌ అవర్‌ లీడర్‌లో భాగంగా ‘‘సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ రూపాంతరం’’ అనే అంశంపై జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో వైఎస్సార్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు సిద్దమైందన్నారు. వలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్న కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థనే తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోం దన్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నారనడానికి ఇవి ఉదాహరణ లన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాద్యమం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆయన తెలిపారు. పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టగా తీవ్రంగా వ్యతిరేకించిన వారే తమపిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదివిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హామీలను నెరవేర్చిం దన్నారు. గ్రామసచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 50వేల కార్యాలయాలను ఏర్పాటుచేసి అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. గతంలో ఏముఖ్యమంత్రీ చేపట్టని సంస్కరణలు, సంక్షేమానికి జగన్‌ శ్రీకారం చుట్టారని కొనియాడారు. విద్యకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని జోడిరచడం ద్వారా ఉన్నత విద్య అనంతరం యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు మెరుగు పరచిందన్నారు. ఆర్ధికపరమైన అన్ని అంశాలను మహిళలకు కేటాయించడం ద్వారా వారి సాధికారితకు నిజమైన నిర్వచనాన్ని ఇచ్చారన్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా విద్యా సంస్థలపై తల్లులకు ప్రశ్నించే అధికారాన్ని కల్పించారని ఆయన పేర్కొన్నారు. ఇదంతా సుపరిపాలనలో భాగమని ఆయన తెలిపారు. పరిపాలన అందరికీ ఉపయోకరంగా,ఉపయుక్తంగా ఉండాలని అందుకు నిదర్శనంగా ఈ ప్రభుత్వం నిలుస్తుందన్నారు.సభకు అధ్యక్షత వహించిన నాగార్జున యూనివర్శిటీ రిటైర్డ్‌ వీసీ వి.బాలమోహన్‌దాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ,ప్రజలకు పథకాలు అందజేయడంలో తండ్రీకి మించిన తనయుడు సీఎం జగన్‌ అని కొనియాడారు. విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రవేశపెట్టిన విద్యాకానుక, విద్యాదీవెన,విదేశీయ విద్యాదీవెనలకు సంబంధించి కొనియాడారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శాంత మూర్తి మాట్లాడుతూ తమ సంస్థలో 700మంది సభ్యులు ఉన్నారని ,వీరిలో డాక్టర్లు,లాయర్లు, ఇంజనీర్లు, ఇంటలిజెన్స్‌ అధికారులు,వైస్‌ ఛాన్సలర్లు,ఐఎఎస్‌ అధికారులు ఉన్నారని తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రజల సమస్యలను గుర్తించిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నార న్నారు.ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం అనులు చేసేందుకు సిద్ధమైందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్న కేరళ ప్రభుత్వం,ఆ రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థనే తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారే తమ పిల్లలను అంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారని చెప్పారు.విద్య, వైద్యానికి కీ.శే రాజశేఖర్‌ రెడ్డి ప్రాధాన్యత కల్పించారని, నేడు జగన్మోహన్‌ రెడ్డి మరింత బలోపేతం చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. తీరప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పలువురు అడిగిన ప్రశ్నలకు వక్తలు సమాధానమిచ్చారు.
కిడ్నీ వ్యాధి మూలాలు కనుగొనడమే ప్రభుత్వ లక్ష్యం
ఉద్దానంలో మహమ్మరిలా వ్యాపిస్తున్న కిడ్నీ వ్యాధి మూలాలు కనుగొనడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. కాశీబుగ్గలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆసుపత్రిని మంగళవారం సందర్శించారు.కిడ్నీ రోగులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. అంతకుముందు పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ డైరెక్టర్‌ ఎ.పి ఇన్నోవేషన్‌ సొసైటీ లావణ్య, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వెంకటరావు, 28వార్డు కార్పొరేటర్‌ పల్లా దుర్గారావు,యాక్సిస్‌ సెవెన్‌ ఇకోస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పాల్‌ బాస్కర్‌,ఆంధ్రా యానివర్సిటీ ప్రొఫెసర్‌ తిమ్మారెడ్డి, పాతపట్నం,టెక్కలి,రాజాం ప్రభుత్వ డిగ్రీకళాశాలల ప్రిన్సిపాళ్లు కె.శ్రీరాములు,గోవిందమ్మ, స్వప్న హైందవి, గాయత్రి విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌ పులఖండం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.– జి ఎన్ వి సతీష్