శ్రీ రవీంధ్రుని స్మరణలో..
భారత దేశానికి జాతీయ గీతాన్ని అం దించిన కవి,రవీంద్రనాథ్ ఠాగూర్(మే 7,1861-ఆగస్టు7,1941).ఠాగూర్‌గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. స్వాతంత్య్ర పోరాటంలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేబేంద్రనాథ్ ఠాగూర్,శారదా దేవి దంపతులకు పదమూడు మంది సంతానంలో చిన్నవాడైన రవీంద్ర నాథ్ ఠాగూర్1861 మే 7న జన్మించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రాథమిక విద్య మొత్తం ఇంట్లోనే.. కానీ సాహిత్య ప్రతిభ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. తన రచనలతో తక్కువ కాలంలోనే గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఆయన కవిత్వంలో అధిక ప్రతిభను కనబర్చారు. రవీంద్రనాథ్ రాసిన కవితా సంకలనం గీతాంజలి 1910లో పబ్లిష్ అయ్యింది. ఇది సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని గెలుచుకుంది. ఠాగూర్ అనేక ఇతర ముఖ్యమైన రచనల్లో మానసి(1890), సోనార్ తారి (1894), గితి మాలయ(1914),రాజా(1910),పోస్టాఫీసు (1912) మొదలైనవి ఉన్నాయి.రవీంద్రనాథ్ ఠాగూ ర్ ఎన్నో చిత్రాలను గీశారు. ఆయనకు సంగీతంపై ఆసక్తి ఉండడంతో కొన్నిపాటలు రాసి వాటికి సంగీ తం కూడా అందించారు.జాతీయస్వాతంత్య్రో ద్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీష్ సామ్రాజ్య వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.జలియన్ వాలా బాగ్ మారణకాండకు నిరసనగా అతడికి బ్రిటీష్ అధికారులు ఇచ్చిన ‘నైట్‌హుడ్’ బిరుదును కూడా తిరిగి ఇచ్చేశారు. జాతీయ భావాలు అధికంగా ఉన్న రవీంద్రుడు అనేక హిందూ మేళాలో దేశ భక్తి గీతాలను పాడేవారు.తన పాటలద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తట్టిలేపేవారు. బ్రిటీషర్లు బాల గంగాధర్ తిలక్ ను బంధించినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని విమర్శించారు. బెంగాల్ విభజనను వ్యతిరేకించారు.
మనం జాతీయ గీతంగా పిలుచుకునే ‘జనగణమణ’ను ఆయనే రచించారు.‘వందే మాత రం’ గేయాన్ని1896లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో తొలిసారిగా ఆలపించారు.దీనిని బక్రించంద్ర చటర్జీ రచించారు.స్వాతంత్య్ర అనంతరం ఈ రెండిరటిలో దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని పెద్ద చర్చ జరిగింది. కానీ 1950 సంవత్సరం జనవరి 24వ తేదీన ‘జనగణమణ’ను జాతీయ గీతంగా ప్రకటించారు.1913 సంవత్సరంలో రవీంద్ర నాథ్ ఠాగూర్ తన కవితా రచన ‘గీతాం జలి’కిసాహిత్యంలో నోబెల్ బహుమతిని అందు కున్న మొదటి భారతీయుడు,అలాగే మొదటి యూరోపియనేతరుడు కూడా ఆయనే. రవీంద్రనాథ్ ఠాగూర్ పిల్లల కోసం శాంతినికేతన్ అనే విశ్వవిద్యా లయాన్ని స్థాపించారు.దీనిని విశ్వభారతి విశ్వ విద్యాలయం అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ప్రాచీన గురుకుల విద్యను అందించేవారు.
భారత జాతీయ గీతం-జన గణ మన, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. బ్రిటీష్ రాజ్‌లో జార్జ్ ప్రశంసలతో జాతీయ గీతాన్ని కంపోజ్ చేశా రానే ఆరోపణలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ జాతీయ గీతం‘అమర్ సోనార్‌బంగ్లా’ కూడా ఆయన స్వరకల్పన చేసిందే. శ్రీలంక జాతీయ గీతం ‘శ్రీలంక మాత’కూడా ఠాగూర్‌సృష్టి నుండి ప్రేరణ పొం దింది. దీన్ని రచించిన ఆనంద్ సమర్కూన్ రవీంద్ర నాథ్ ఠాగూర్‌తో శాంతినికేతన్లో నివసించారు. ఆనంద్ సమర్కూన్ ఒకసారి మాట్లాడుతూ ఠాగూర్ స్కూల్ ఆఫ్ కవిత్వం తనని బాగా ప్రభావితం చేసిందని చెప్పారు. ఠాగూర్ కవిత్వం సంగ్రహావ లోకనం అందులోని ఒక పేరాలో కనిపిస్తుంది. ‘జనగణమన అధినాయక జయహే’ అనే మన జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రుడు ప్రపం చానికంతటికీ ఎత్తయిన హిమాలయములో వున్న మానస సరోవరంలో వికసించిన పద్మం. ఆ పద్మ మే కవీంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్.మేరు పర్వ తంలా పెరిగి తారల తాకునట్టి కీర్తి కిరీటం అలంక రించిన విశ్వకవి. హిందువుల మానసిక సౌంద ర్యాన్ని చూపించిన గీతాంజలి సృష్టికర్త మన రవీం ద్ర కవి. విశ్వ భారతి నిర్మాతసత్యం,శివం,సుం దరం త్రిగుణాత్మక తత్త్వగీతి
గీతాంజలి. ఈ లోకా నికి ముముక్షువు వంటి కవి మన రవీంద్రుడు. ద్వంద్వాతీత, కళాసంపత్తి, సహితానాం భావము కలిగిన కవి. వీరు ప్రకృతి ప్రేమికులు. సమయము దొరికినప్పుడు తోటల్లోను,బహిరంగ ప్రదేశాల లోను విహరిస్తూ ప్రకృతిని ఆరాధించేవారు. చిన్నతనంలో వీరికి చదువుపై పెద్దగా మక్కువ ఉండేదికాదు. నిరాడంబరుడు. తన ఊహలకు కలలో రెక్కలు తొడిగి వాటిపై విహరిస్తూ, విచిత్ర లోకంలో గడిపేవాడు. విశ్వంలోని విచిత్రాలను తెలుసుకోవాలనే కుతూహలముతో ఉండేవారు. వారు పాఠశాలలోని చదువు కంటే, ఇంటిలోనే విధ్యాభ్యాసము చేయుటకు ఇష్టపడేవారు. సమ యపాలన అన్న అమిత మక్కువ. చదువవలసిన అంశాలను పద్దతి ప్రకారము అభ్యసించెడివారు. గణితము,చరిత్ర,భూగోళశాస్త్రము,సంస్కృత వ్యాకర ణము ఇష్టంగా చదివెడివారు.ప్రతి దినము వ్యాయా మము చేసెడివారు. చిత్రలేఖనము, సంగీతము, పుస్తక పఠనములపై ఇష్టపడేవారు. అనేక నాటకా లను వీక్షించేవారు. మాతృభాషపై ఎనలేని గౌరవ ము. రచనా వ్యాసంగముపై కూడా వారికి పట్టు అమితము.వారు అనేక వ్యాసాలు, పద్యాలు, విమర్శ లు వ్రాసేవారు.అవి వివిధ పత్రికలలో ప్రచురితమ య్యేవి.కాళిదాసు, షేక్సుఫియరు మొదలుగు వారి రచనలపై అభిరుచిని కలిగి వుండేవారు.కాని చదు వుల నిమిత్తమై ఇంగ్లండులోనిఒకపబ్లిక్ స్కూలు లోచేరి,అక్కడి ప్రొఫెసర్ మార్లేగారు ఆంగ్ల ఉప న్యాసములు విని, ఆంగ్ల సాహిత్యముపై మక్కువ పెంచుకున్నారు.18 నెలలు విధ్యాభ్యాసము కొరకు లండన్‌లో గడపినా తన మనసుకు నచ్చిన విధ్య ఏదీ పొందలేదు. ఎటువంటి విద్యార్హతలతో తిరిగి రాలేదు. తండ్రి సహాయముతో అనేక భక్తి గీతాలను ప్రచురించారు. రవీంద్రుడు ‘‘భగ్న హృదయము’’, ‘‘నిర్గరేర్ స్వప్నభంగ’’,ప్రభాతసంగీత’’ అనే కావ్యాలను రచించారు.రవీంద్రునికి అమితిమైన పేరు ప్రఖ్యా తులు తెచ్చిన రచన ‘‘గీతాంజలి’’.బెంగాలీ భాషలో రచించిన కొన్ని భక్తిగీతాలను ఆంగ్లములోనికి అనువదించి పొందుపరిచారు.ఈ రచన అనేక ప్రపంచభాషలలోనికి అనువదింపబడినది. నిరా శా, నిస్పృహలను దూరం చేస్తూ,సకల సృష్టిని ప్రేమ భావముతో చూచే శ్రమ తత్త్వాన్ని ముఖ్యాంశముగా గల గీతాంజలి నోబెల్ బహుమతిని సాధించినది. విశ్వకవిగా గుర్తింపబడినారు. ఆనాటి నుంచి వారి రచనలు విశ్వవ్యాపితమైనాయి.ఒక్క చిటికె కాల పరిమితిలో అయినా నీ సమీపంలో సేదదీరుటకు అనుమతి ఇవ్వమని భక్తిభావంతో భగవంతుని వేడుకున్న రవీంద్రునిలో ఆధ్యాత్మికత కనిపిస్తుంది. ప్రకృతిని తన స్నేహితుడుగా తలుస్తూ చక్కని భావ ప్రకటన ఈ కవితలో కనపడుతుంది.
తాను చిన్నతనంలో ప్రకృతి ఒడిలో పెరిగిన విధంగా,పిల్లలందరూ తమ బాల్యాన్ని ప్రకృతి సహజీవనంతో గడిపితే మానసిక వికా సానికి దోహదం చేస్తుందని నమ్మేవారు. అందుకు అనుగుణంగా కలకత్తా నగరంలో ‘శాంతి నికేతము’ స్థాపించారు. ఇది పూర్వకాలపు గురుకులాన్ని పోలి వుండేది. విధ్యార్థులు బయట పచ్చికపై కూర్చుని విద్యను అభ్యసించెడివారు.ఇందులో చేరిన విధ్యా ర్థులు క్రమశిక్షణకు మారుపేరుగా పెరిగేవారు. ఉదయం మేల్కాంచినప్పటి నుండి, తిరిగి రాత్రి నిద్రించు వరకు చేయవలసిన దిన చర్యలను పద్దతి ప్రకారం ఆచరించే విధంగా విధి విధానాలను రూపొందించారు. వ్యాయామము, శుభ్రత పాటిం చుట, శాకాహార భోజనము,కాలినడక, పెద్దలను గురువులను గౌరవించుట,సత్యమునే పలుకుట, చెడు పనులను చేయకుండుట, ఆరోగ్య పరిరక్షణ మొదలగు ఉన్నత లక్షణాలను నేర్పుతూ నేటికీ క్రమ శిక్షణతో ముందుకు కొనసాగుతున్న గురుకులం శాంతినికేతనము.గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు అని నమ్మిన రవీంద్రుడు, గ్రామాభ్యుదయానికి కూడ తమ వంతుగా గంగాతీరంలో‘శ్రీనికేతన్’ స్థాపిం చారు. పరమత సహనాన్ని ప్రబోధించారు. ప్రపం చము ఆనందమయమనీ, మనసుతో అనుభవిం చెడివారికి అవగతమౌతుందని భావించెడివారు. ఉన్నతమైన జాతీయ భావాలు ప్రదర్శించెడివారు. వీరి భావనలకు జవహర్లాల్ నెహ్రూ ముగ్ధుల య్యెడివారు.బెంగాల్ విభజనను తీవ్రంగా వ్యతి రేకించారు. ఈ సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. బకింగ్ చంద్రచటర్జీ రచించిన ‘వందేమాతరం’జాతీయ గేయంగా గుర్తింపు పొం దగా, రవీంద్రుడ రచించిన ‘జనగణమన’ జాతీయ గీతంగా గుర్తింపు పొందాయి. భారత రాజ్యాంగ ములో వీటికి సమాన ప్రతిపత్తి కల్పించారు. శ్రీ రవీంద్రులు మనకు స్వాతంత్య్రము వచ్చునాటికి మన మధ్య లేకపోవటం తీరనిలోటు. ఆయన రచించిన జాతీయగీతాన్ని నిత్యం మనము ఆలాపి స్తున్నాము. వీరు రచించిన పుస్తకాలలో అనేక ఉత్తమ ప్రభోధాత్మక భావాలు ఉండేవి. ‘చెడుగా ఆలోచించే గుణం సగం సమస్యలకు కారణం’, ‘ఎక్కడవ్ఞినం స్వేచ్చగా మనగలుగుతుందో’,‘ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో’, ‘ప్రేమించే వ్యక్తికి దండిరచే అధికారం కూడా వుంటుంది’, ‘మూఢత్వ ము మరణానికి దారితీస్తుంది’,‘గడచిన ప్రతీ రోజు నుండి మనము కొత్త విషయాలు నేర్చుకోవాలి’, ‘వైఫల్యాల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి’ వంటి సూక్తులు మనకు వీరి రచనలలో కనబడతాయి. వీరు తత్త్వదర్శి,దార్శినికులు శ్రీరవీంద్రనాథ్ ఠాగూర్.ఆయనన నిధి.వారి మాటలను అనుసరిం చుట మన విధి.రెండవ ప్రపంచ యుద్ధ సమ యంలో మానసింగా కృంగిపోయిన రవీంద్రనాథ్ ఠాగూర్,ఏవైద్యానికి కోలుకోలేదు. వారు భారతదేశ మును శోకసంద్రములో ముంచి 1942, ఆగస్టు 7వ తేదీన పరమపదించారు. `జై భారత్-(డా.దేవులపల్లి పద్మజ)