శతాబ్దాల సాంస్కృతి సమాహారం

స్వచ్ఛమైన సెలయేళ్లు..దట్టమైన అడవులు.. గంభీరమైన కొండలు.. పక్షుల కిలకిలారా వాలు. పచ్చని ప్రకృతి అందాలు వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుత నానికి సజీవ సాక్ష్యంగా. పాలకుల ఆలన కోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ జనం నివసి స్తోంది. అడవితల్లి బిడ్డలుగా ,ప్రకృతి ఒడే అవాసంగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని, ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది. విద్య,వైద్యం వంటి మౌళిక సదుపాయాలకు నోచుకోని గూడే లెన్నో కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే వారి జీవితాల్లో వెలుగులు నింపే సర్కారు వచ్చింది.వారి కష్టాలు తీర్చేందుకు బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తోంది.-(భమిడిపాటి గౌరీశంకర్)
జాతులు..భాషలు
జిల్లాలో 2.36 లక్షల మంది గిరిజనులున్నారు. వీరిలోట్రైబల్ సబ్లన్ మండలాల్లో నివసించే సంఖ్య1.87 లక్షలుగా ఉంది. గిరిజనుల్లో 36 జాతులున్నాయి.ఉత్తరాం ధ్ర జిల్లాల్లో సవర, కొండదొర, గదబ, వాల్మీకి,జాతాపు, కోయ, భగత జాతులు ప్రధానమైనవి. సవరభాష శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకేలాఉంటుంది. వీరి అభ్యున్నతికి ఏర్పాటైన ఐటీడీఏకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కేటాయిస్తున్నాయి. సగటున ఒక్కో ఐటీడీఏకి ఏటా రూ.300 కోట్ల నిధులు వస్తున్నాయి. కానీ అందులో గిరిజనులకు ఈ నిధుల్లో చేరేది నామమాత్రమే. నిక్కచ్చిగా ఈ నిధులన్నీ గిరిజనులకే ఖర్చుచేసి ఉంటే గిరిజనుల ఎప్పుడో మారిపోయి ఉండేవి.
సజీవ సంప్రదాయాలకు నిలయం
గిరిజన జీవనం విభిన్నంగా ఉంటుంది. సంబరాలు, వివాహ వేడుకలు, ఆరాధనల ఆచారాలు, మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటాయి. తరాలు మారినా వారి అలవాట్లు, కట్టుబాట్లు ఇప్పటికీ మారలేదు. ఇక్కడ జరిగే వివాహ వేడుకల్లోని సంప్రదాయాల్లో భాగంగా చెట్టును ఆరాధిం చే విధానాలు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి సందేశాన్ని పంపుతుంటాయి. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఏ పల్లెకు వెళ్లినా సవరజాతి గిరిజనుల సంబరాలు, పండుగ సందడులన్నీ ఒకే రకంగా కొనసాగితే పెళ్లిళ్లు మాత్రం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ప్రాణాధారమైన నీరు, అది లభించడానికి అవసరమైన చెట్టు చుట్టూనే వారి తంతు తిరుగుతుంది. సవర భాషలో పాటలు, థింసా నృత్యాలు ఇక్కడి గిరిజనుల పండుగలు, శుభకార్యాల్లో భాగం.ఆడవేషంలోవున్న యజ్ఞుడు అనే పురోహితుని పాత్రలో పెళ్లితంతు నిర్వపి వధూవరులను మేనమామలు భుజాలపై ఎక్కించుకొని నృత్యం చేస్తూ ఊరేగించడం నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం.
కనీస సౌకర్యాలు కరువు
నేటికీ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపా యాలు లేవు. కనీసం తాగునీరు, రోడ్డు మార్గం లేదు. వైద్య సదుపాయాలు లేక ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. గర్భిణులు, వృద్ధులు అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. నేటికీ వైద్యం కోసం, విద్య కోసం గిరిజనులు కొండలు గుట్టలు దాటి కాలినడకనచ,డోలీ సాయంతో మైదాన ప్రాంతాలకు రావాల్సిందే. వీరి తండాలకు విద్యుత్ సౌకర్యం లేదు.ఉండ టానికి ఇళ్లు లేవు. ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వారి వనరులను లాక్కుంటున్నారు. క్వారీలు నడుపుతూ ఖనిజ సంపదను కొల్లగొడు తున్నారు. బాక్సైట్, గ్రానైట్ దోచుకుంటున్నారు. పిండిచేసి గిరిజనులకు పోడు వ్యవసాయం చేసి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. గిరిజనుల జీవితాల్లో మార్పునకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. తొలిత కురుపాం,సాలూరు గిరిజన రిజర్వర్డు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్టు ఇచ్చారు. ఎన్నిక ల్లో గెలిచిన వెంటనే తన తొలి కేబినెట్లో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి స్థానం కల్పించారు. గిరిజన శాఖ మంత్రి పదవిని ఇవ్వడంతో పాటు ఉపముఖ్యమంత్రి హోదానిచ్చి ఉన్నత స్థానం కల్పించారు. తర్వాత సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు గిరిజిన సంక్షేమశాఖ మంత్రి పదవినిచ్చారు. గత ప్రభుత్వాలు ఎస్టీ సప్లాన్ నిధులను ఇతర ఖర్చులకు వాడేసేవి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరులో దళితతేజం సభ నిర్వహణకు సబ్ ప్లాన్ ఖర్చు చేశారు. ఇలాంటి వాటిని అరి కట్టడానికి అధికారం గిరిజనుల చేతుల్లో ఉండాలి. గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండా లని గిరిజనులు ఎప్పటి నుంచో కోరుతుండే వారు. సాంఘిక సంక్షేమ శాఖలో మిళితమై ఉండటంవల్ల గిరిజనులకు అన్యాయం జరుగు తుందని వేడుకునేవారు. వారి గోడువిన్న జగన్ గిరిజనులకు ప్రత్యేక మంత్రిని ఇచ్చారు. గిరిజనుల బతుకులు బాగుచేయాలనే ఉద్దేశం తో గిరిజన సలహామండలిని ఉపముఖ్యమంత్రి నేతృత్వంలో,గిరిజన ఎమ్మెల్యేల భాగస్వా మ్యంతో సీఎం ఏర్పాటు చేశారు. గత ప్రభు త్వంలో అప్పటి పాలకులు పదవిలో ఉన్నన్నా ళ్లూ గిరిజన సలహా మండలి ఊసెత్తలేదు. ప్రజా సంకల్ప యాత్రలో ఎస్సీ,ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందిస్తానని హామీ ఇచ్చి, సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే దానిని నెరవేర్చారు.200 యూనిట్ల వరకూ విద్యుత్ వినియోగాన్ని ఉచితం చేశారు.దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కుటుంబాలకు ప్రయో జనం చేకూరుతోంది.
సవరల సంస్కృతి మరియు సంప్రదాయాలను పరిరక్షించే ప్రయత్నాలు
గిరిజనులకు సమాజంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది, వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం మరియు భాషకు ధన్యవాదాలు. వారి స్వంత లిపి లేనప్పటికీ, ప్రత్యేకమైన వారసత్వం ఏదో ఒకవిధంగా శతాబ్దాలుగా తరువాతి తరానికి అందించబడుతోంది.కానీ ప్రస్తుత తరం ఆంగ్లం,తెలుగు ఒడియా భాషలలో సాధారణ విద్య,అధ్యయనానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో, సవర కమ్యూనిటీకి చెందిన గిరిజన పెద్దలు తమ సంస్కృతి, సంప్రదాయం భావితరాల కోసం భాషను పరిరక్షించడంపై ఆందోళన చెందుతున్నారు.
సవర సంస్కృతీ దర్పణాలు గిడుగు కథలు
సవర భాష కోసం నిరంతరం పరిశ్రమించిన పండిత మాన్యుడు గిడుగు రామమూర్తి పంతులు.సవరల భాష, యాస, సంస్కృతుల పట్ల ఆయనకు 1880లోనే ఆసక్తి కలిగింది. మన్యప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచే యటం ఇందుకు ప్రధాన కారణమనిపిస్తుంది. కొందరు ఆలోచించి వదిలేస్తారు. కొంతమంది మాత్రమే ఆలోచించి ఆచరిస్తారు.అతి కొద్ది మంది మాత్రమే లోతైన అధ్యయనంతో విజయం సాధిస్తారు. గిడుగు రామమూర్తి ఇటువంటివారే. సవరభాషకు ఓ లిపిని ఏర్పాటు చేయడమే కాక, వారి జీవనసంస్కృతి మూలాల లోనికి దగ్గరగా వెళ్ళారు. అధ్యయనం చేశారు. వారి జీవితాలను చరిత్రగా రికార్డు చేశారు. సవరభాషకు నిఘంటువు, వ్యాకరణం కూర్చారు. పాటలని సేకరించారు. వాచకాలను రూపొందించారు. సవరభాష నేర్చుకోవటం తేలిక అనేది ఆయన భావన. గిడుగు రామమూర్తి పాండిత్యం ఎంతో నిర్మాణాత్మమెనది. గ్రాంథిక భాషను ఖండిరచడం వెనుక ఉన్నది ఈ అంశమే! సవర భాష విషయంలో ఆయన చేసిన స్వయంకృషి శ్లాఘనీయం.
సవరల జీవన విధానంలోని సంస్కృతి సంప్రదాయాలను వ్యక్తిగమెన కార్యనిర్వహణ రంగాలను గిడుగువారు దగ్గరగా పరిశీలించారు. వాటిని ‘సవర కథలు’గా రాశారు. ‘సవర భాషలో నేను వ్రాసిన మొదటి పుస్తకంలోని కథలకు ఇంచుమించుగా సరైన తెలుగు చేసి ఈ పుస్తకం వ్రాసినాను. ఈ సవర %-పుస్తకంలోని కథలన్నీ ఇంగ్లీష్‌లో ఉన్న ఈసపు కథలను పట్టి వ్రాసినాను’ అని ఆయన ఆ పుస్తకం ముందుమాటలో చెప్పారు. ప్రతి వాక్యాన్ని సవరలకు వినిపించి, వారి సవరణలు, సలహాలు, సూచలను అనుసరించి తిరగ రాశారు. కథలలోని విషయాలు సవరల వ్యవహారాన్ని అనుసరించి వాళ్ళకు తెలిసేటట్లు చేర్పులు మార్పులు చేశారు. కనుక ఈ సవర కథలు సవరల నిజజీవన చిత్రణ దృశ్యాలు.. సాక్ష్యాలు. ‘కోదుల భాషలో ముగ్గురు నలుగురు కొన్ని పుస్తకములు వ్రాసినారు. కాని.. సవర భాషలో ఇదివరకు ఎవరూ పుస్తకాలను వ్రాయలేదు. నేను వ్రాసినవే మొదటి పుస్తకాలని’ గిడుగువారు చెప్పుకున్నారు. ఫిక్షన్ అండ్ ది రీడిరగ్ పబ్లిక్’ అనే పుస్తక రచయిత క్యు.డి.లీవీస్ కథను గూర్చి చెబుతూ కథ ప్రధాన లక్షణమైన క్లుప్తత కేవలం రూపానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. జీవితానికి, జీవిత దృక్ప థానికి రూపం. జీవితంలోని ఒక ముక్కను తీసుకుని దానికి వ్యక్తిత్వం ఇవ్వాలన్న ఆకాంక్ష లోంచి కథకు రూపం వచ్చిందంటారు. కథల్లో కొద్దిమంది లేదా ఒక జీవితం కొన్ని శకలా లుగా గోచరమవడం పాఠకులకు కొత్త కాదు. కానీ తనకు తెలియని ప్రపంచంలోని భాష, వ్యక్తులు, జీవన విధానాలను కథలుగా మలచడంలో ఎన్నో ఇబ్బందులున్నాయి. చదువరి వీటిని తనవిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో గురించి వారంటే తెలియని వారు ఎందుకు తెలుసుకోవాలి? అటువంటి కథలు ఎందుకు చదవాలి? ఇవి సామాన్య చదువరుల ప్రశ్నలు. ప్రపంచీకరణ నేపథ్యంలో సాహిత్యం కొత్త సిద్ధాంతాలను, వాతావరణాలను సృష్టించుకుంటూ వస్తున్నది. మన చుట్టూ ఉన్న సమాజం నాగరికత ఆనవాళ్ళు అభివృద్ధి పరంగా శరవేగంగా మార్పుకు లోనవుతున్నది. కాని అలాలేని జీవితాలున్నాయి. జీవన గమనాలున్నాయి. ఎటువంటి కృతక వర్ణాలను అంటించుకోని స్వచ్ఛమైన మన్యాలున్నాయి. వాటిలో ప్రజాసమూహాలున్నాయి. ప్రకృతి వారికి పాఠశాల..కూడు, గుడ్డ, భాష కూడా అక్కడ నుంచి వచ్చినదే. భయంకమెన క్రూరమృగాలు, సాధు జంతువులు వారిని దగ్గరగానే చూస్తాయి. వారు కూడా వాటితో సహజీవనం చేస్తారు. సవరలు ఇందుకు మినహాయింపు కాదు. సవర దక్షిణ ముండాభాష. ఆస్ట్రో-ఏషియాటిక్ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా ఐదులక్షలకు పైనే. వీరు పోడు వ్యవసాయం చేస్తారు. వీరి గృహాలు ఒకదానికెదురుగా మరొకటి ఉంటాయి. వీరి భాషలో గ్రామాన్ని గొర్భాం అంటారు. అంటువ్యాధుల వల్ల, పులి, అగ్ని వంటి వాటి ప్రమాదాల వల్ల జనం చనిపోతే ఆ గ్రామాన్ని వదిలి వేరే చోటుకు వెళ్ళిపోతారు. నేటికీ వారిని అనాగరికులుగానే సభ్య సమాజం గుర్తిస్తుంది. మనిషికి ఆత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని గాఢంగా నమ్ముతారు. ఆత్మల్లోకి మనుషులు ప్రవేశించగలరనే విశ్వాసాలు ఉన్నాయి వారికి. వీటిని గిడుగువారు దగ్గరగా చూశారు. తనవిగా భావించారు. వారితో కలసిమెలసి సవరభాషకు ఓ శాశ్వతను తీసుకువచ్చారు. వీటినే ‘సవర కథలు’ ద్వారా అందించారు. ‘సవర కథలు’ చాలావరకు చిన్న పిల్లల కథలు వలే ఉన్నా సవరల మనస్త త్వాన్ని చెబుతాయి. సవరల జీవితాల్లోని ఓ తాత్వికతతో కూడిన విశ్వాసాలున్నాయి. వాటి వెనుక నీతివంతమైన వ్యవహారా లున్నాయి. కష్టపడే తత్వాన్ని నీతి ఆవహిస్తే స్వచ్ఛత కనిపిస్తుంది. ఇది ప్రకృతి గుణం. ‘నక్కా-గద్దా’,‘మూడు పిల్లులు- కోతి’,‘గొప్ప వాడి కథ’, ‘అత్యాశగల ఒక మనిషి’ వంటి కథలలోని నీతిని సవరల జీవనవిధానంలోని భాగంగా భావించడం కన్నా,వారి మనస్త త్వాన్ని, మానవతా దృక్పథాన్ని పరోక్షంగా చెబుతాయి. ఈ కథలలోని రెండవ పుస్తకం ముందుమాటలో ‘ఇందులోని కథలు అన్నీ సవర వాళ్ళు నాఎదుట చెప్పినవే. ఇంచు మించుగా వాళ్ళ మాటలే’ అంటారా యన. ఈ సంపుటంలోని కొన్ని కథలు వారు విన్నవి. కొన్ని కల్పనలు. కొన్ని కథలు వారివే. సవరలు పచ్చిబూతులు యథేచ్ఛగా ఉపయోగిస్తారు. అవి ఈ కథల్లో లేకుండా చూశారు గిడుగువారు. ఈ కథల్లో సవర జీవన విధానంతో పాటు వారి భాషను కూడా ఆయన సహజంగా గిడుగువారు ప్రతిపాదిం చారు. నాలుగో భాగం సవర కథల్లో పూర్తిగా సవరలకు సంబంధించిన జీవన విధానపు భాషా వ్యవహారం కనిపిస్తుంది.ఇళ్ళు,పొలం,సంత,తగవులు, పూజలు,కల్లు తాగడం,సోది,కేసులు, పోలీసు లు,జడ్జిలు, రోగాలు వంటి సందర్భాల్లో వారి సంభాష ణలోని సహజ త్వాన్ని గిడుగు అందించారు. సవర భాషాలిపికర్తగా,వ్యవ హారిక భాషా ఉద్యమ కారుడిగా చరిత్రకెక్కిన ఆయనకు, వర్తమానం లో ఎదురవుతున్న అవరోధాలన్నిటి నుంచి తెలుగు భాషను కాపాడుకోవటమే మన అర్పించే నిమెన నివాళి.
గిరిజనుల ప్రకృతి ఆరాధనే
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా విశేషమైన పశు సంపద తో అటవీ వాతావరణంలో నివసించే గిరిజనులు ఏటా తమ సంప్రదా యాన్ని ప్రతిబింబించేలా సీత్లా పండుగ జరుపుకొంటారు. సామూహిక జీవితంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఐక్యతను చాటేలా నిర్వహించే ఈ పండుగ వారి సంప్రదాయానికి అద్దం పడుతున్నది. పంటలు బాగా పండాలని, పశు సంపద అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పాటు ప్రకృతి ఆరాధన ఆ పండుగ అంతర్లీనంగా ఉం టుంది. అత్యధికంగా తండాలు కలిగిన పాలకవీడు మండలం లోపాటు బొమ్మల రామారం,తుర్కపల్లి మండలాల్లోనూ సీత్లా పండుగ సందడి నెలకొన్నది. లాలితండా, బెట్టెతండా,పాడ్యాతండా,చెర్వుతండా, కల్మటితండా,కొత్తతండా,శూన్యంపహాడ్, దేవ్లాతండా,మీగడంపహాడ్ తండా, లక్ష్మీతం డాల్లో పండుగలు జోరందుకున్నాయి. గిరిజ నుల తొలి పండుగ సీత్లా. ఆషాఢ మాసం పెద్ద పుష్యాల తొలి పాదంలో ఈ పండుగను జరుపుకొంటారు. తండాలోని కుటుంబాలన్నీ సామూహంగా ఏర్పడి ప్రకృతి దేవతలైన సీత్లా భవానీతో పాటు ఆరుగురు భవానీల ప్రతిమ లను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహి స్తారు. వర్షాలు బాగా కురువాలని పాడి పంటలతో పల్లెలు, తండాలు సస్యశ్యా మలంగా ఉం డాలని కోరుతూ మొక్కులు చెల్లించు కొం టారు. ఏడు రకాల వంట కాలతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఆటా పాటలతో గిరిజన సంప్రదాయ నృత్యాలతో సందడి చేస్తారు.ఈ తంతులో కుల పెద్దలు ప్రముఖ పాత్ర పోషిస్తారు. సాయంత్రం వేళ అమ్మ వార్లకు గొర్రె పోతు లను బలి ఇచ్చి,పేగు పైనుంచి పశువులను దాటిస్తారు. దీనినే దాటుడు పండుగ అని అంటారు.