వ్యాక్సిన్ లాభా కోసమా? ప్రజల కోసమా?
‘‘ ఎటు పోతున్నావ్ కరోనా?’’ అంటూ మసూచి సమాధిపై కూచున్న టి.బి, ఫ్లూ, జికా, సార్స్, ఎయిడ్స్,ఆంథ్రాక్స్, కరా, పోలియో, ఇంకొన్ని వైరసు ప్రశ్నించాయి. సమాధానంలేదు.కాలరెగరేసుకొని పోతున్నావు, కొత్త బట్టు కుట్టించుకున్నావు ఎక్కడికి?’’ మళ్ళీ అదే ప్రశ్న. ఇక తప్పింది కాదు కరోనాకి. నోరు విప్పాల్సి వచ్చింది.’’
దేశంలో కరోనావ్యాధి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నా...ఈవ్యాధి ప్రమాదం సమీప భవిష్యత్తులోనే పొంచి వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా దరిదాపుగా ప్రపంచ దేశాన్నింటికీ సోకింది. మనదేశంలో కరోనావ్యాధి మార్చి 30వ తేదీన తన ప్రయాణాన్ని ప్రారంభించి, డిసెంబర్ 19వ తేదీ నాటికి కోటి మందికి సోకింది. క్షా 45 వే మందిని తన పొట్టనబెట్టుకున్నది. కరోనా వ్యాధి వస్తే నయం చేసుకోవడానికి స్పష్టమైన మందు లేకపోవడంతో నివారణే ఏకైక మార్గమని, అందులో వ్యాక్సినేషనే అత్యుత్తమ నివారణ మార్గమని ప్రపంచ ప్రజందరూ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఈవ్యాధి నుండి బయటపడవచ్చుననే ఆశతో వున్నారు. రష్యా‘స్పుత్నిక్’పేరుతో ఆదేశ ప్రజకు కరోనావ్యాక్సిన్‌ను అందుబాటులో వుంచ డంతోపాటు వివిధ దేశాలో ఈ వ్యాక్సిన్ అమ్మకానికి సంబంధించిన ఒప్పందాు కూడా చేసుకుంది. అదేవిధంగా అమెరికాలోని ‘ఫైజర్’ కంపెనీ ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను ప్రపంచం లోనే మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చి ప్రపంచ దేశాతోవ్యాక్సిన్ అమ్మక ఒప్పం దాను చేసుకుంటూ పోతోంది.మనదేశంలోసిఎంఆర్,సీరమ్ ఇన్స్టిట్యూట్, జైడస్, డా.రెడ్డీస్ లాబొరేటరీస్ లాంటి కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీు కూడా వ్యాక్సిన్ అందుబాటు లోకి తేవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాయి. ఇలా ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ ను అందుబాటు లోకి తేవడానికి ఇప్పటికి దరిదాపుగా 200 కంపెనీు తీవ్రమైన ప్రయత్నాు చేస్తున్నాయి. ఇందులో ఏకంపెనీ కూడా కరోనా వ్యాక్సిన్ తయారీలో వున్నటువంటి ప్రయోగ దశలో ముఖ్యమైన మూడో దశ ప్రయోగాను పూర్తి చేయలేదు. పైగా,తమ వ్యాక్సిన్ బాగా పని చేస్తుందని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వాు ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతు కూడా మంజూరు చేశాయి. బ్రిటన్, అమెరికా, రష్యా లాంటి దేశాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. ఇటీవ కరోనా వ్యాక్సిన్‌పై విపరీతమైన ప్రచారాు ఊపం దుకుంటున్నాయి. అవేమిటంటే అమెరికాకు చెందిన ‘ఫైజర్’ అనే బహుళజాతి కంపెనీ తను తయారు చేసిన వ్యాక్సిన్ కరోనాను 95 శాతం నియంత్రించగదని ప్రకటించు కుంది. ‘ఫైజర్’ కంపెనీ ప్రకటించిన రెండో రోజే 92శాతం కరోనాను నియంత్రించ గలిగిన వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు రష్యా మీడి యాకు సమాచారాన్ని విడుద చేసింది. అయితే ఈవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సమా చారం హేతుబద్ధంగా లేదని, నియంత్రించే శక్తిని విశదీకరించే విషయా వివరణు పొందుపరచలేదనే విమర్శు వస్తున్నాయి. ఇప్పుడు‘ఫైజర్’కంపెనీ వ్యాక్సిన్‌పై స్పందిం చిన ఆల్ ఇండియా ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెడి కల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ ఈ వ్యాక్సిన్ ను-70డిగ్రీ సెల్సియస్ దగ్గర భద్ర పరచ వసిన అవసరం వుందని చెప్పారు. దీని నిర్వహణ మన దేశంలో కష్టసాధ్యంగాఉంటుందని, ఆర్‌యన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్ల న్నీ చాలా ఖరీదుతో కూడుకున్నవని స్పందిం చారు. ప్రపంచ జనాభా 780కోట్లు ఉంటే వ్యాక్సిన్ శీతలీకరణ సామర్థ్యం 300కోట్ల జనాభాకు మించి లేదు. దీనివ్ల ఈ వ్యాక్సి న్ వచ్చినా అందరికీ అందుబాటు లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ‘ఫైజర్’ కంపెనీ మన దేశంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించ కుండానే వ్యాక్సిన్ అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వా ని భారత ఔషధ నియంత్రణ అధికారుకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవ అపోలో హాస్పిటల్ కార్పొరేట్ యజమాన్యం10క్ష వ్యాక్సిన్లు ఇచ్చేం దుకు మీగా తమ మౌలిక వసతు సమకూర్చు కుంటున్నా మని ప్రకటించింది. ఈవిధంగా వ్యాక్సి న్ తయారీ దశలోనే ఒకవ్యాపార దృక్పథం బట్ట బయు అవుతున్నది. ఇదంతా అము కావడానికి రెండు లేదా మూడు సంవత్స రాు పట్టవచ్చని పువురు వైద్య నిపుణు అంచనా వేస్తున్నారు. రేపు వ్యాక్సిన్ బయట కు వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా వుంటుందనేది ఈ పరిణా మాు తెలియజేస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీ ఒక భాగమైతే ఈవ్యాక్సిన్ ప్రజందరికీ అందు బాటు లోకి తీసుకురావడం మరో ముఖ్యమైన అంశం. ప్రపంచ దేశాల్లో కానీ భారత్‌లో గాని కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రధానం గా నిమగమైనవన్నీ బహుళజాతి కంపెనీలే. రాబోయే కాం కరోనా వ్యాధిదేనని గుర్తిం చినఈకంపెనీన్నీ గత ఆరు మాసా నుండి భవిష్యత్తు లాభా కోసం అయ్రి చాస్తు న్నాయి. లాభాలే పరమావధిగా భావించే బహుళజాతి కంపెనీు ఈవ్యాక్సిన్ పేరుతో చేసే వ్యాపారం ప్రజకుశాపంగా మార నున్నదా అన్న అనుమానాు కూడా వస్తు న్నాయి.
ఎందుకో తెలియాంటే…
కరోనా విజృంభణ జరిగిన మే తరు వాత చోటు చేసుకున్న ఓఅంశాన్ని ప్రస్తావించు కుందాం. ఎబోలావ్యాధి నివారణకు వాడిన ‘’గిల్లెడ్’’కంపెనీ ‘’రెమిడెసి విర్’’ఇంజక్షన్ కరోనా నివారణకు మందుగా అమెరికాకు చెందిన బహు జాతి కంపెనీ మార్కెట్లోకి విడుద చేస్తూ విపరీ తమైన ప్రకటను గుప్పించింది. తద్వారా ఈ మం దుకు కృత్రిమకొరతను సృష్టించి బ్లాక్ మార్కె ట్లో అమ్మింది. ఈమందు కోర్సు వాస్తవ ఖరీదు రూ.36మే. కానిబ్లాకులో రూ.క్ష వరకు అమ్మ కం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ‘’సాలిడారిటీ ట్రయల్’’లో ప్రకటించినంత నియం త్రణ ఈమందుకులేదని,కేవంతాత్కాలిక ఉపశ మనమే ఇచ్చేలా వుందని, దీన్నిమందు ప్రోటో కాల్ జాబితా నుంచి తొగించారు. కానీ బహుళ జాతి కంపెనీకు కొమ్ము కాసే అమెరికన్ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డి ఏ)ఈ మందును కరోనా నివారణా మందుగా అనుమతిస్తూ ప్రకటిం చింది.ఈ మందును మన దేశంలో విచ్చవిడిగా చాక్లెట్లు, బిస్కెట్లు మాదిరిగా కార్పొరేట్ ఆసుపత్రు ఉపయోగించాయి.
భారతదేశంలో కరోనా విజృంభణ జరు గుతున్న తరుణంలో దీని నివారణ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుని రాష్ట్ర ప్రభు త్వాపై వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వాు లాక్డౌన్ సడలిం పును అదునుగా తీసుకుని పూర్తిగా చేతు ఎత్తేశాయి. ఒక వైపు కేసు పెరిగి వ్యాధి సామా జిక వ్యాప్తి చెందిందని, రెండవ విడత కరోనా వచ్చే అవకాశం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికను సైతం లెక్క చేయ కుండా పూర్తిగా ప్రజ స్వీయ నియంత్రణకే వదిలేశారు. కరోనా పరీక్షు విస్తృతపరిచే కొదీ కేసు తీవ్రత పెరుగుతున్నట్లు గుర్తిం చినా అందరికీ పరీక్షు చేయానే సూచన ను కూడా పక్కకు పెట్టారు. వ్యాక్సిన్ రావడంఆస్యం అవుతుందని తెలిసినా… ప్రభుత్వపరంగా ప్రజకు…మాస్కు ధారణ, చేతు శుభ్రత,భౌతిక దూరం వంటి జాగ్రత్త ు కూడా చెప్పడంలేదు. వాటిని ప్రజ విజ్ఞతకే వదిలేశారు. మరోవైపు విద్యార్థుకు వార్షిక పరీక్ష నిర్వహణ, స్కూళ్లు,కాలేజీు తెరవడంతో వచ్చే పరిణామా కు తగ్గట్లు యంత్రాంగాన్ని వినియోగించడం లోనూ అనేక లోపాు మెగు చూశాయి.
ఇటీవబీహార్ ఎన్నికల్లో ఆరాష్ట్ర ప్రజ కు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని బిజెపి ఎన్నిక మ్యాని ఫెస్టోలో ప్రకటించడంతో దేశవ్యా ప్తంగా ప్రతిపక్షాు, ప్రజ నుంచి తీవ్రవ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజందరికీ వ్యాక్సిన్ అందిస్తా మని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అయితే దీని ధర రూ.750 వుంటుందని ప్రధాని మోడీ ప్రకటించారు. కోవిడ్ వ్యాక్సి న్ తయారీ, తదుపరి పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్‌ను విజయ వంతంగా ముగించుకుని వచ్చిన వ్యాక్సిన్‌ను ప్రభు త్వమే తమ అజమాయిషీలో అందరికీ ఉచితంగా పంపిణీ చేసే బాధ్యతను చేపట్టాలి. దీనికి అనుగు ణంగా ముఖ్యంగా ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపె నీను,ప్రభుత్వ రంగమందు కంపెనీను అవసర మైతే ప్రైవేటు కంపె నీను కూడా తమ ఆధీనం లోకి తీసు కుని…అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాకు పంపిణీ అయ్యే విధంగా కోల్డ్ చైన్‌ను, రవాణా ఏర్పాట్లను చేయాలి. అప్పుడే వ్యాక్సిన్ అందరికీ వీలై నంత తొందరగా అందుబాటు లోకి వస్తుం ది.కానీ ప్రభుత్వ చర్యు ఈవిధంగా లేవు. ‘అంద రికీ వ్యాక్సిన్’ ప్రకటనకే పరిమిత మయ్యే విధంగా వున్నది. కరోనా వ్యాక్సిన్ ప్రజందరికీ ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తిం చాలి. ఈవ్యాక్సిన్ తయారీ, పంపిణీ, నియంత్రణ, అజ మాయిషీ అంతా ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీ చెప్పుచేతల్లోనే వున్నది. ఈవ్యాక్సి న్ రావడంతో కరోనా కట్టడికి ఎంతమేర ఉపయోగపడుతుందో తెలియదుగానీ,వ్యాక్సిన్ కార్పొరేట్ల కోసమని స్పష్ట మవుతున్నది.
ఎటు పోతున్నావ్ కరోనా…?
‘’ఎటు పోతున్నావ్ కరోనా?’’ అంటూ మసూచి సమాధిపై కూచున్న టి.బి,ఫ్లూ,జికా, సార్స్,ఎయిడ్స్,ఆంథ్రాక్స్,కరా, పోలియో, ఇంకొన్ని వైరసు ప్రశ్నించాయి. సమాధానం రాలేదు. ‘’కారెగరేసుకొని పోతున్నావు,కొత్త బట్టు కుట్టించుకున్నావు ఎక్కడికి?’’ మళ్ళీ అదే ప్రశ్న. ఇక తప్పింది కాదు కరోనాకి. నోరు విప్పాల్సి వచ్చింది.
‘’రెండో దశకు’’ ధీమాగా చెప్పింది.
‘’మానవుడి గురించి నీకు పూర్తిగా తెలీదు. మేమి ప్పుడు ఊరికే బతికున్నామనే కాని… కూచుంది ఎక్కడో చూశావా?’’. ‘’చూశాను, మసూచి సమా ధిపై!!’’‘’ఇంకొన్ని చిన్న చిన్న సమాధు కనిపిస్తు న్నాయా’’ ‘’అవీ చనిపోయిన వైరసులే’’ ‘’నీక్కూడా సమాధి కడతాడు మానవుడు. అది ఎంతో పెద్దగా ఉంటుంది.అప్పుడు నీసమాధిపైకూచొని మాట్లాడు కుంటాం’’మీరు భయప డుతుంది మానవుడి గురించే, కానీ నా ధైర్య మూ మానవుడే’’ గర్వంగా చెప్పింది కరోనా.
‘’ఎలా?’’ ఒక వైరసు ప్రశ్న.
‘’ఎలాఏముంది,మీకాంలో మనిషికి తెలి సిన సైన్సుతక్కువే, కాబట్టి ఎలాగో బతికి బట్ట కట్టారు. కానిఇప్పుడు ఎంతసైన్సు తెలి సినా కామన్సెన్సు పూర్తిగా కోల్పోయాడు మానవుడు’’ కోవిడ్ సమా ధానం విని వైరసు న్నీ వెలిగిపోతున్న మొహాతో చూడసాగాయి. ‘’ఓసగటు మానవుడి మాటు వినండి మీకే తొస్తుంది. జనాను కూచోబెట్టి కొన్ని విషయాు చెబుతున్నాడు. అతని మాట నుండి ఇతరులేమి నేర్చుకుంటారో తెలీదు కాని, నాకుకొండంత ధైర్యాన్ని స్తున్నా డు. వినండి’’ ఇది ఎవరినీ భయపెట్టడానికి చెప్పడం లేదు. ఉన్నది వున్నట్టు,నిజాన్ని తొసు కొన్ని జాగ్రత్తగా నడచు కొమ్మని, మసుకొమ్మని సందేశం, సమాచార మివ్వ డానికే చెప్పేది. ఈపాటికే అర్ధమై పోయి ఉంటుంది నేను కరోనా గురించి చెబుతు న్నానని. నిజం. ఆమహమ్మారి మ్లెమ్లెగా ప్రపంచమంతా పాక డం, ప్రభు త్వాను పడగొట్టడం, చావుతప్పి కొంద రికి కన్ను లొట్టపోవడం ఈపాటికే చేసింది. దాని పని అది చేసుకుపోతోంది. మనమే మనం చేయ వసినది చేస్తున్నామా లేదా అని, చేస్తుంటే ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో, చేయక పోతే ఇప్పటి నుండైనా మొదు పెట్టాలి. ఇప్పుడు మనం క్రాస్ రోడ్డులో వున్నాం, రహదారి కూడలిలో వున్నాం. ఎటు పోవా లో నిర్ణయించుకోవసింది మనమే. మన తరం కోసం, రానున్న తరా కోసం. ఈ మధ్య ఒకరోజు ఉదయాన్నే కూరగాయు ఇంకొన్ని రేషన్ సరుకు తెద్దామని మెయిన్ రోడ్డెక్కాను. మూతికి మాస్కు లేకుండా ఆటో నిండా జనం పోవడం కంట పడిరది. ఇక అందరినీ గమనిం చడం మొదు పెట్టాను. నేను మాస్కు పెట్టుకొనే పోయా నన్న విషయం మీకు అర్థమై పోయిం టుంది. కూరగాయ దగ్గర నన్ను రాసు కుంటూ నిబడ్డాడో అసామి. భౌతిక దూరం ఊసే లేదు. మూతికి మాస్కు లేదు. కూరగాయు తీసుకు పోవడానికి చేతిలో సంచిలేదు. ప్లాస్టిక్ కవర్లు రెండిరటిలో తీసుకు పోయాడు. పోతూ పోతూ ఒక షాపు దగ్గర ఆగి జనా మీదికి పొగ వచ్చే లాగ మరీ సిగరెట్ ఊదేసి మరీ పోయాడు. ప్రతి ఐదు గురిలో ముగ్గురికి మాస్కు లేదు. ఇంతకు ముందు ఎరుపు జోన్లో ఉన్న మాప్రాంతం తరు వాత ఆకుపచ్చ జోనుగా మారింది. అప్పుడు అందరూ జాగ్రత్తగానే వున్నారు. మరి ఈ మార్పుకు కారణమేమి? కరోనా భయానికి అవాటు పడ్డారా, కరోనా ఇక రాదనే నిర్ణయానికి వచ్చారా, ఎదో ఒకరోజు ధైర్యంగా చచ్చేదానికి బదు భయ పడు తూ రోజూ చస్తూ బతకాలా అన్న నిర్ణయాని కొచ్చా రా ఇలాఆలోచిస్తూ వస్తున్నాను. అఖి భారత వైద్య సంస్థ, ఎయి మ్స్ డ్క్కెరెక్టరు కరోనాకు వ్యాక్సిను 2022లో మాత్రమే రాగద న్నారు. ఈలోగా రష్యా నుండి రెడ్డిల్యాబ్స్ వారికి వ్యాక్సిన్ వచ్చి నట్టు వీడియో కనిపిం చింది. అదిమూడు దశ వరకే పని చేస్తుందని ఒకఫార్మా మిత్రుడు చెప్పాడు. ఫైజర్ కంపెనీది కూడా త్వరలో వస్తుందం టున్నా రు. ఇంకొన్ని ప్రయోగ దశలోవున్నా యని సమా చారం.
ఈలోగా బడు తెరిచారు. కొందరు విద్యార్థుకు, ఇంకొంత మంది ఉపాధ్యాయుకు ఒకరి నుండి ఒకరికి వైరసు సోకిందని సమాచారం. దాదాపు వేయి మందికి వచ్చినట్టు వార్తు. ప్రాణం కంటే విద్యా సంవత్సరం ఎక్కువేమీ కాదని అందరూ చెబుతున్నారు. కొందరు టీచర్లు కరోనాతో మరణించారు కూడా. ఇప్పుడే ప్రభుత్వం, ప్రజు, సామాజిక సేవా సంఘాు, సైన్సు సంస్థు, ఇంకా ప్రజకు మేు చేయాన్న ప్రతి ఒక్కరూ కూచొని అసలైన పరిస్థితిని అంచనా వేయాలి. మహ మ్మారిని దీటుగా ఎదుర్కోవడానికి ఏమేం చేయాలో అవి చేయాలి. శానిటైజర్లు, హ్యాండ్ వాషు, హైపోు, మాస్కు, సబ్బు వ్యాపారాు బాగా పెరిగాయి. వైద్యం కూడా చిన్న వ్యాపారం కానట్లు కోట్లు రాబడు తోంది. ఉచితంగా సమాజ సేవ చేసే వారున్నారు కాని మిగతా వారంతా అలా వుండరుకదా. మందు షాపు వద్దన్నా తెరిచారు. పేకాట రాయుళ్ళు తమ వంతు బాధ్యతగా ఈ కరోనాని సమాజం పైకి వెదజ్లు తున్నారు. ఇక బాధ్యతాయుతంగావున్న యువత ఒకలాగ, ఏదీ పట్టని యువత మాస్కు కూడా లేకుండా తిరగడం చూస్తూనే వున్నాం. పెళ్ళిళ్ళు, పుట్టిన రోజు, ఇతర సంబరాుపెరిగి పోతున్నాయి. నగపై, ఖరీదైన వస్త్రాపైఉన్న ధ్యాస మాస్కు వాడడం,శానిటైజర్లు పెట్టడం లాంటి కనీస జాగ్రత్త ు పాటించడంపై లేదు. ఇంకో వైపు మాల్స్ తెరిచారు. సినిమా షూటింగు కూడా మొదు పెడుతున్నారు. రాజకీయ వైరసు పూర్తిగా పట్టిన వాళ్ళు ఎన్నికకై ఆరాటపడుతున్నారు. కొన్ని చోట్ల నిర్వహిం చేశారు కూడా. ఎన్నికల్లో గొపు ఓటము పై వున్న ధ్యాస వాళ్ళకి కరోనా కట్టడిపై లేదు. ఆఎన్నికవ్ల పెరిగిన కరోనా గురించి ఒక్క మాటా చెప్పరు. ఇక ఆర్.టి.సి బస్సుల్లో,ఆటోలో పరిస్థితి చూస్తే కరోనాను ప్రపంచంలో లేకుండా చేశామ న్నట్లు కనీస భయం కూడా లేకుండా తిరుగుతు న్నారు జనాు. ఇప్పటిదాకా ఒకఎత్తు. ఇకపై రాను న్న రెండవ దశఒక ఎత్తు. అందుకే మనం జాగ్రత్త గా ఉండాలి. అధికాయి, ప్రభు త్వాు, మునిసి పాలిటీు, పోలీసు చేయ వసిన పని మనం చేయాలి.
-టి.కామేశ్వరరావు/జంధ్యాల రఘు.