వైవిధ్యాన్ని ప్రొత్సహిద్దాం..

‘ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని అణచి వేయా లని చూస్తే నేను ఆ చిన్న దేశం వైపు నిలబడతాను. ఆ చిన్న దేశంలోనే మెజారిటీ మతం చిన్న మతాన్ని అణగదొక్కాలనిచూస్తే నేను చిన్న మతం వైపు నిలబడ తాను. ఆమై నారిటీ మతంలో కులాలు ఉం డి అది ఒక కులం మరొక కులాన్ని అణగదొక్కాలని చూస్తే ఆఅణచివేతకు గురయ్యే కులం వైపు నిలబ డతాను.ఆణిచి వేతకు గురైన కులంలో ఒక యజ మాని తన నౌకరుని అణిచివేస్తుంటే నేను ఆ నౌకరు వైపు నిలబడతాను. ఆ నౌకరు తన ఇంట్లో తన భార్య హక్కుల్ని కాలరాస్తుంటే నేను ఆ నౌకరు భార్య వైపు నిలబడి గొంతెత్తుతాను. చివరికి నేను చెప్పేది అణిచివేత అనేది ఏ స్థాయిలో ఏస్థితిలో ఉన్నా అది నా శత్రువు!’అంటాడు పెరియార్ ఇ.వి. రామస్వామి. భారత దేశ నాగరికత అతి ప్రాచీనమైనది. కాల ప్రవా హంలో కొన్ని నాగరికతలు, సంస్కృతులు కాల గర్భంలో కలిసిపోతుంటాయి. కొత్త నాగరికతలు, సంస్కృతులు పుట్టు కొస్తుంటాయి. ఎన్నో మతాలు, సంస్కృతులసంగమం మనదేశం. అనేక సాంప్ర దాయాలు, చారిత్రక నేపథ్యాలున్న హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైనుల సహజీవనం మన సంస్కృతి. రాచరిక ప్రభువుల నిరంకుశత్వాన్నిదాటి, భూస్వాములఅరాచ కాలను, ఆగడాలను ఎదుర్కొని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన జీవన విధా నంగా చేసుకున్నాం. భిన్న సంస్కృతులను విశాల దృక్పథంతో అర్థం చేసు కొనేవారితోనే సమానత్వం సిద్ధిస్తుంది. ఈ వైవిధ్యా న్ని సమాజ రక్షణ కోసం ఏర్పడిన రాజ్యం దాన్ని విస్మరిస్తూ విద్వేషం వెదజల్లు తున్న వేళ..న్యాయమూర్తులే విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న సమయం. ఈ నేపథ్యంలో మైనార్టీల హక్కు ల దినోత్సవ ఆవశ్యకత ఎంతైనా ఉంది.
థీమ్..
ఈఏడాది మైనారిటీ హక్కుల దినోత్సవ థీమ్ ’’వైవిధ్యాన్ని ప్రోత్సహించడం,హక్కులను పరిర క్షిం చడం!’’ అని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఇంతకుముందు కూడా థీమ్‌లను ప్రకటించారు. మాటలు కోటలు దాటాయే తప్ప ఆచరణ గడప దాట లేదు.కేంద్రంలో మోడీ పదేళ్ల పాలనలో మైనార్టీల హక్కులపై ఎడాపెడా దాడులు జరుగుతున్న నేపథ్యం లో ఈథీమ్ కార్యరూపం దాల్చాలంటే పోరాటం మినహా మరో మార్గం లేదు.
మనిషితనాన్ని కోల్పోయి..మనిషి రక్తాన్ని మరిగినప్పుడు-ఈ దుష్ట సంస్కృతిని,నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ..‘మేమూ మనుషులమే..ఈ గడ్డలో మేమూ భాగమే..మమ్మల్నీ బతకనీయండి’ అంటూ నినదించే పౌర సమాజ బృందాలు,కార్యకర్తల గొంతులను, బిగించిన పిడికిళ్లను బుల్డోజ్ చేస్తూ..అణచివేస్తుంటే.. ఆఅణచివేతను,ఆనిరంకుశత్వాన్ని ఎదిరించే పోరా టాలే మానవ హక్కులయ్యాయి.ఏదేశంలోనైనా హక్కు ల ఉల్లంఘన, అణచివేత.. ఆందోళన కలిగించే విష యమే.‘ప్రజల మానవ హక్కులను తిరస్కరించడం అంటే..వారిమానవత్వాన్ని సవాలు చేయడమే’ అంటా డు నెల్సన్ మండేలా.జాతీయత,మతం,వర్గం, జాతి నేపథ్యంతో సంబంధం లేకుండా సమాజ మంతటికీ లభించే సమానత్వం,గౌరవం,స్వేచ్ఛ కనీస అవసరం. నాగరికత ఎంత అభివృద్ధి చెందినా,అనేక దేశాల్లో మానవ హక్కులకు, ముఖ్యంగా మైనారిటీల హక్కులకు పూర్తి భరోసా లేని పరిస్థితి ఏర్పడిరది. అతిపెద్ద ప్రజా స్వామ్య దేశమని చెప్పుకుంటున్న భారత్‌లో సైతం మైనారిటీల హక్కుల హననం కొనసాగుతోంది.
ఇలా ఏర్పడిరది..
ఐక్యరాజ్యసమితి మొట్టమొదట మైనార్టీ హక్కుల దినోత్సవంగా1992,డిసెంబర్ 18వతేదీని పరిగ ణిం చింది.మతము,జాతి,భాషా,లింగం,సంస్కృతి పరంగా మైనారిటీ హక్కుల పరిరక్షణకు ఈ రోజును గుర్తిం చాల్సిందిగా ప్రకటించింది.మనదేశంలో కూడా డిసెం బర్ 18ను మైనార్టీ హక్కుల దినోత్సవంగా ప్రకటించి, చట్టం చేసి జాతీయ మైనారిటీల కమిషన్ (ఎన్‌ఎంసి -1992) నియమించింది.2024 మైనారిటీ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ (ప్రమోటింగ్ డైవర్సిటీ అండ్ ప్రొటెక్టింగ్‌రైట్స్)వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, హక్కు లను రక్షించడం.
రాజ్యాంగ హక్కు..
భారత జాతీయ మైనారిటీల కమిషన్ మనదేశంలోని ముస్లింలను (14.2) క్రైస్తవులను (2.3),సిక్కులను (1.7),బౌద్ధులను(0.7),పారశీలను(0.06), జైనులను (0.4) మైనార్టీలుగా గుర్తించింది. మైనార్టీలకు భద్రతా, సమానత్వం,సమన్యాయం అందించడం రాజ్యాంగ బద్ధమైన ఆదేశమే కాక సామాజిక అవసరం కూడా. గాంధీజీ అన్నట్లు’’ఒక దేశంగొప్పతనం అన్నది ఆ దేశంలో అణగారిన వారు ఎలా చూడబడు తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది’’.ఈరోజు మతం పేరు తో మనదేశంలో జరుగుతున్న దాడులు కొద్దిమంది మతోన్మాదులకు తృప్తిని కలిగించవచ్చు. కానీ ప్రపంచ దృష్టిలో మాత్రం దేశ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగు తుందన్న స్పృహ అవసరం. గోరక్షణ పేరుతో మానవ హత్యలు గావించడం, మైనారిటీ మహిళలను నగంగా ఊరేగించి హత్యాచారాలు చేయించడం యథేచ్చగా కొనసాగుతోంది.హిజాబ్, హలాల్, అజాన్, నమాజ్‌ల పేర్లతో మతాచారాలపై, మైనారిటీల ఆస్తులపై బుల్డో జర్లను ప్రయోగించి నిరాశ్రయులను చేస్తోంది. ఇవన్నీ రాజ్యాంగ అతిక్రమణ చర్యలే కాదు అమానవీయ మైనవి.
మైనారిటీల స్థితిగతులు..
మనదేశంలోని మైనార్టీ స్థితిగతులపై నివేదిక కోసం 2005,మార్చి 9న ప్రధానమంత్రి జస్టిస్ రాజేందర్ సచ్చార్ నాయకత్వాన ఒకకమిటీ వేయడం జరిగింది. ఈదేశంలో ముస్లిం మైనార్టీలు,విద్యా,ఉపాధి, ఆర్థిక పరంగా ఎంత వెనుకబాటుతనంలో ఉన్నారో సమూల వివరణలతో ఆ కమిటీ రిపోర్టు సమర్పించింది. వీటిని అధిగమించటానికి సూచనలు కూడా చేసింది. కానీ కమిటీలు వేయడంలో ఉన్నంత చిత్తశుద్ధి, దాని సూచనలు అమలులో లేకపోవడం విచారకరం. ప్రధా నంగా విద్యను మాతృభాషలో అందించటానికి ప్రాధా న్యత నిస్తూ పాఠశాలలు ఏర్పాటు చేసినా,ఆంగ్ల భాష మీద చూపే ప్రేమ మైనార్టీ భాషనే కాదు మెజార్టీ స్థానిక భాషలపైనా ప్రభావం చూపుతుందన్నది సత్యం. ఈ పరిస్థితి మైనార్టీలను మధ్యలోనే విద్యకు దూరం చేసి, మరింత వెనుకబాటులోకి నెట్టివేస్తుంది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఉన్న జాతీయ స్కాలర్ షిప్,విదేశీ విద్యకు అందే స్కాలర్‌షిప్‌లను కేంద్ర ప్రభు త్వం నిలిపివేసింది. ప్రాథమిక విద్యలోనే ఆటం కాలు ఏర్పడితే ఉన్నత విద్యకు వెళ్ళడం అసాధ్యమైన విష యంగా మైనార్టీలకు పరిణమించింది. దీంతో పిల్ల లను బడి మాన్పించి,పనుల్లోకి పంపడం జరుగు తోంది. బాలికలలో ఇది మరింత పెరిగి బాల్యవివాహా లకు దారితీస్తుంది.- (యం.డి.షకీలా బేగం)