వైవిద్య జీవనం..అడవులే జీవనాధారం
అడవి మార్గంలో రైలులో ప్రయాణిస్తుండగా దేవులపల్లి భావోద్వేగానికి గురయ్యారట. అందులోంచి పుట్టిన పాట..
‘ఆకులో ఆకునై.. పువ్వులో పుప్వునై.. కొమ్మలో కొమ్మనై.. నునులేత రెమ్మనై.. ఈ అడవి దాగిపోనా.. నేనెటులైనా ఇచటనే ఆగిపోనా..’ అన్నది. అడవి అందాలను ఆస్వాదించాలని ఎవరికి మాత్రం ఇలా అనిపించదు..? పచ్చని చెట్ల నీడన సేదదీరాలని, గలగల పారే సెలయేటి నీటిని దోసిటపట్టి తాగాలని, పక్షుల కిలకిలా రావాలను, పూల సుంగధాలను ఆస్వా దించాలని, చెట్టుపై మాగిన పండ్లను కోసి తినాలని.. ఇలాంటి అనుభవం జీవితంలో ఒక్కటైనా ఉండాలని ఎవ్వరనుకోరు..! ఇంతటి స్వచ్ఛమైన జీవితం అనుభవించే తెగ.. ఆదివాసీ. వారి మనుగడకు ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా, అభివృద్ధికి దూరంగా ఉంటున్నా.. అడవినే నమ్ముకుని అక్కడే ఉండిపోతున్నారు. వారి జీవనం, సంస్కృతి, సంప్రదాయాలలో వైవిధ్యం ఉంటుంది. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఈ నేపథ్యంలో నల్లమల గిరిజనుల జీవనంపై ప్రత్యేక కథనం.
- ా సంస్కృతికి ప్రాణమిచ్చే ఆదివాసులు
- ా అభివృద్ధి దరిచేరని జీవితాలు
- ా అందని ప్రభుత్వ పథకాల ఫలాలు
- ా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఆదర్శంగా నిలుస్తున్న గిరిజనులు
- ఆదివాసీలు,గిరిజనులు ఏ దేశానికైనా మూలవాసులన్నది మానవ శాస్త్రవేత్తల భావన. సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సమూహాలు గిరిజన తెగలు. వీటికి సామా జికంగా, సాంస్కృతి కంగా ప్రత్యేకతలున్నాయి. వీటితో పాటు వైవిధ్య చరిత్ర,సంస్కృతులున్నాయి. జన జీవన స్రవంతిలో భాగంగా కొందరు..దూరంగా ఇంకొందరు జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతా ల్లోనూ భిన్న తెగలకు చెందిన గిరిజ నులున్నారు. ప్రస్తుతం భారత జనాభాలో దాదాపు 8`9శాతం ప్రజలు వివిధ గిరిజన సమూహాలకు చెందినవారే. ఆంథ్రోపాలజీకల్ సర్వే ఆఫ్ ఇండి యా అధ్యయనం ప్రకారం ఒక్కో గిరిజన తెగ ఒక నిర్ధిష్టమైన భౌగో ళిక ప్రాంతానికి పరిమితమై ఉంటుంది. ఒక గిరి జన తెగ విభిన్నరాష్ట్రాల్లో విస్తరించి ఉండటం అరుదు. ప్రతి గిరిజన సమూహానికి ఒక నిర్ధిష్టమైన పేరుంటుంది. ఒకేరకమైనభాష,సంస్కృతిఉంటాయి. ఒకేరకమైన ఆచార వ్యవహారాలు కలిగి ఉంటారు. ఒకే న్యాయం,ఒకేచట్టం ఉంటాయి. అంతర్వివాహ పద్దతిని ఆచరిస్తారు. గిరిజన సమూహాలకు ప్రత్యే కమైన మతవిశ్వాసాలు,ఆరాధన పద్దతులు ఉం టాయి. ముఖ్యంగా ప్రకృతి శక్తులను ఆరా ధిస్తారు. వీటితోపాటు ప్రతిగిరిజన సముదాయా నికి ఒక స్వయం ప్రతిపత్తిగల రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఈనాటికీ చాలా తెగలు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ప్రవేశించినా,తమను తాము నియంత్రిం చుకునే స్వీయ రాజకీయ వ్యవస్థను(ఆదివాసీ మండలి) కొనసాగిస్తున్నాయి. ఆయా తెగల పెద్దలు ఇందులో సభ్యులుగా ఉంటారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ కార్యకలాపాలను వీరే నియంత్రి స్తుం టారు. అన్నింటికీ మించి ఇవి ఏకరూపత కలిగిన సమూహాలు. వీటన్నింటిలోనూ గోత్ర వ్యవస్థ అంత స్సూత్రంగా పనిచేస్తుంది. గిరిజన సమాజంలోని సభ్యుల ప్రవర్తనను గోత్రవ్యవస్థ నియంత్రిస్తుంది. స్వగోత్రికలు రక్తబంధవులనే భావన కలిగి ఉంటా రు. అందుకే స్వగోత్రీకులు పెళ్లిళ్లు చేసుకోరు. ప్రతి గోత్రానికి ఓటోటెమ్ ఉంటుంది. టోటెమ్ అంటే మతపరమైన చిహ్నం. గోత్ర సభ్యులంతా ఆ మత పరమైన చిహ్నం నుంచి ఉద్భవించామనే భావనతో దాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆరాధాస్తారు. ఈ చిహ్నం ఒక వ్యక్తి కావోచ్చు.. జంతువు,చెట్టు లేదా ప్రకృతిలోని ఏదైనా కావోచ్చు. అది వారి తెగకు గుర్తు.
- దేశంలో మూడు రకాల తెగలు : భారత్‌లో మనకు మూడు రకాల గిరిజన తెగలు కనిపిస్తాయి
- 1) దట్టమైన అటవీ ప్రాంతాల్లో,పర్వత ప్రాంతా ల్లో జీవించేవారు. వీరు జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు. అడవులు, అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తారు. ఆర్ధికం గా,రాజకీయంగా స్వతంత్రంగా జీవించినప్ప టికీ ఆర్ధికంగా వెనకబడిన తెగలివి.
- 2) అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నా,వ్యవసాయం ప్రధానంగా చేసే ఆదిమ తెగలు. వీరికి పాక్షికంగా గిరిజనేతరులతో సంబంధా లుంటాయి. సామా జిక,వ్యాపార సంబంధా లుండే అవకాశముంది.
- 3) మైదాన ప్రాంతాల్లోని గిరిజన సమూహాలు. జనజీవన స్రవంతిలో భాగంగా ఉండి ఆధునిక జీవన విధానానికి దగ్గరగా ఉంటారు. ప్రభుత్వం కల్పించే చాలా అభివృద్ధి పథకాలు ఈమైదాన ప్రాంతాల్లో స్థిరపడిన,గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు దగ్గరగా ఉన్న తెగలు ఎక్కువగా ఉపయోగించు కుంటాయి. అందుకే వారిలో విద్య,ఆర్ధిక అభివృద్ధి కనిపిస్తుంది. ఉదాహరణకు ఉత్తర భారతదేంలో తీసుకుంటే బిల్లులు,సంతాల్(మధ్యప్రదేశ్)లు, ముండాలు (బీహార్),మహారాష్ట్ర,తెలంగాణలోని రాజ్ గోండులు,లంబాడీలు జనజీవన స్రవంతికి చాలా దగ్గరగా ఉండే సమూహాలు. అందుకనే వీరిలో రాజకీయ,ఆర్ధిక,విద్యాపరమైన అభివృద్ధి కనిపిస్తుంది. అదే చెంచు లాంటి తెగలను చూస్తే వారింకా జనజీవన స్రవంతికి దూరంగానే ఉన్నారు.
- ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలు అంత రించిపోతున్న తరుణంలో వారి సంరక్షణ దిశగా ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టింది. ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలని 1994లో ప్రకటించింది. 1997లో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు, హక్కులను కల్పిస్తూ.. ప్రపంచ దేశాల ప్రతినిధులను తీర్మానానికి ఆహ్వానించింది. 143 ఐరాస సభ్యుదేశాలు ఓటింగ్‌లో పాల్గొనగా 125దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆమోదిం చారు. 14 మంది తటస్థ వైఖరి తెలపగా, కేవలం నలుగురు వ్యతిరేకించారు. అప్పటి నుంచి గిరిజన హక్కులు, వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించేందుకు ఏటా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 5వేల ఆదివాసీ తెగలున్నాయి. 6, 700 భాషలు మాట్లాడుతున్న వీరి జనాభా 40 కోట్ల పైమాటే. ఆదివాసీ తెగలు,భాషలు పలు కారణాలతో అంతరించిపోతున్న నేపథ్యంలో ఆది వాసుల సాంస్కృతిక జీవనాన్ని, వారిహక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఆదివాసీ దినోత్సవం జరపాలని ఐక్య రాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానం అమలులోకి తెచ్చింది.
- ఆదివాసీ ప్రపంచం అభివృద్ధి ముసుగులో : మన దేశ పార్లమెంటులో ఎంతో మంది ఆదివాసీ ఎంపీలు ఉన్నా ఆదివాసీ సమ స్యలపై వారేనాడూ నోరు విప్పింది లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసులపై నరమేథం కొనసాగు తోంది. అంతర్యుద్ధం వంటి పరిస్థితుల మధ్యన ఆదివాసులు నలిగిపోతున్నారు. ఆదివాసులను పూర్తిగా అంతరింపజేసి వారి సమాధులపై సామ్రా జ్యాల నిర్మాణం జరుగుతున్న ఆధునిక చరిత్ర నేటికాలంలోనూ సాగుతోంది. రెడ్ ఇండియన్లను నిర్మూలించిన అమెరికా సంయుక్త రాష్ట్రాల పంథా లో ఆదివాసుల అంతానికి అన్ని దేశాలూ నడుం కట్టిన పరిణామాలను ఇప్పుడు ప్రతి దేశంలోనూ చూడవచ్చు. ఈచరిత్రను మనదేశ పాలకులు కూడా అందిపుచ్చుకున్నారు. మరోవైపున ఆదివాసుల రక్షణకు ఐరాస తీర్మానించిన విధానాలను వివిధ దేశాల ప్రభు త్వాలు పూర్తిగా పక్కనబెడుతున్నాయి. ఈ క్రమం లో ఆదివాసుల ఉమ్మడి జీవన వ్యవస్థ వార సత్వం ధ్వంసమైపోతోంది. మన దేశంలోనూ ఆదివాసీల హక్కులు, రాజ్యాంగ పరమైన రిజర్వే షన్లను అమలు చేయడంలో మన పాలకవర్గాలు తీవ్రంగా విఫలమ య్యాయి. ఆనకట్టలు, ప్రాజెక్టు లు, మైనింగ్..ఇలా దేశంలో ఏ భారీ నిర్మాణాలకు పూనుకున్నా బలవు తున్నది ఆదివాసీలే. నిత్యం వీరు ఎదుర్కొంటున్న ప్రాణాంతక వ్యాధులకు చికిత్స లేదు. వీరిభాషకు గుర్తింపు లేదు. ప్రాణా లకు విలువ లేదు. వారి చరిత్రకు గౌరవం లేదు. ఈ విధ్వంసకర అభివృద్ధి నుంచి తమ రక్షణకు ఆదివాసీ తెగలు ఏకమ వ్వాలి. మన దేశ మైనింగ్ మాఫియా దోపిడీలో ప్రతి ఆదివాసీ అనాథ అయితే ఓపెన్ కాస్టులు వారి శ్మశాన వాటికలు. ఈశ్మశాన వాటికల్లో ఆది వాసులను తగులబె డుతున్న బహుళజాతి కంపె నీలకూ,వారికి వత్తాసుగా నిలుస్తున్న దళారీ పాల కవర్గాలకూ వ్యతిరేకంగా ఆదివాసులు చేస్తున్న పోరాటాలకు సకలవర్గాల ప్రజలూ అండగా నిల వాలి. ఆదివాసులు తమ అస్తిత్వాన్ని, మను గడను కోల్పోతే, ఈసమాజానికీ,చరిత్రకీ,సంస్కృతికీ, సంప్ర దాయాలకూ చాలా ప్రమాదమని భావించక తప్పదు.
- షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన చట్టాల ఉల్లంఘన
- రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్లో గిరిజనుల స్వయం ప్రతిపత్తి, గ్రామస్వరాజ్యం గిరిజనులను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనీ, నీళ్లు, అడవి, భూమి వనరుల మీద గిరిజనులకు సంపూర్ణ హక్కు ఉండాలని చెప్పింది. గిరిజన భాషా, సంస్కృతి, వేష ధారణ, గిరిజన ఆవాసాలు అభివృద్ధి చెందాలంటే 5వషెడ్యూల్ చట్టాలు పకడ్బందీగా అమలు కావాలి. అందుకు రాష్ట్ర గవర్నర్ ఎప్పటికప్పుడు గిరిజనుల స్థితిగతులపై పర్యవేక్షించాలి. గిరిజనులను సమా జంలో భాగస్వాములు చేయడానికి విధానాలు సవరించుకోవడం కోసం ప్రత్యేక ప్రొవిజన్లు ఏజెన్సీ లో కల్పించబడ్డాయి. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాజకీయ ప్రాతినిధ్యం గిరిజను లకు కల్పించినా సంపూర్ణంగా అమలు కావడం లేదు.
- పండుగలంటే ప్రాణం : గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో పండుగలు జరుపుకుంటారు. హిందు వులు జరు పుకునే సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలతో పాటు గోండులు ప్రతి నెలా ఒకపండుగ చేసు కుంటారు. దసరా అనంతరం గిరిజన గ్రామాల్లో దీపావళి వేడుకలు ప్రారం భమవుతాయి. దీపావళి సందర్భంగా గిరిజన గ్రామాల్లో దండారి నృత్యం చేస్తారు.పక్క గ్రామా లవారితో సంబంధాలు పెంచు కోవడం కోసం దండారి బృందాలు పక్క గ్రామా లకు అతిథులుగా వెళ్లివారి ఐక్యతను చాటిచెబు తారు. చైత్రమాసంలో చెంతు భీమన్న పండుగ జరిపి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. మేలో పెర్సాపేన్ పూజలు, జూన్ లో మెహతుక్ పండుగ, జూలైలో అకోపేన్ పూజలు, ఆగస్టులో పొలాల,సెప్టెంబర్‌లో పెత్రమాస (పెద్దలపండుగ) చేసుకుంటారు. అక్టోబర్‌లో దసరా, దీపావళి, డిసెంబర్లో సెట్టి పండుగ చేసు కుంటా రు. జనవరిలో సం క్రాంతి,ఉగాది చేసుకుంటారు. గిరిజన జీవన విధా నంలో పండుగలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరిం చుకుంటాయి.
- గూడేల్లో కనీస సౌకర్యాలు కరువు : రెండు తెలుగు రాష్ట్రాల గిరిజన గ్రామా ల్లో వర్షాకాలంలో పొంగిపొర్లే వాగులు ఆది వాసీ గ్రామాలను బాహ్య ప్రపంచంతో వేరు చేస్తున్నాయి. వ్యాధులతో బాధ పడుతున్న ఆదివాసులు వాగులు దాటుకొని ఆసుపత్రులకు రావడం కూడా గగనమే. రోడ్డు సౌకర్యం సరిగాలేక గ్రామాల్లో అభివృద్ధి కనిపిం చడం లేదు. కనీసవతసతులైన రోడ్లు,రవాణా, తాగు,సాగునీరు,విద్యుత్,విద్యా వైద్యం తదితర వసతులకు ఆదివాసీ గ్రామాలు నోచు కోవడం లేదు.104,108అంబులెన్స్‌లు కూడా వెళ్ల లేని గ్రామాలు ఏజెన్సీలో అనేకంగా ఉన్నాయి. వాగుపై వంతెనలు నిర్మించకపోవడంతో వర్షా కాలంలో వాగులు ప్రవహిస్తే గిరిజనులు బాహ్య ప్రపంచాకి దూరంగా ఉండిపోతున్నారు. ఫలితంగా అంటు వ్యాధులు ప్రబలితే వైద్యం అందక గ్రామా ల్లోనే తనువు చాలిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో మంచినీటి వనరులున్నా విద్యుత్ సమస్యలతో పథకాలు పని చేయక కలుషిత నీరు తాగుతూ అనారోగ్యానికి గురవుతున్నారు.
- మారని జీవితాలు :పాలకులు, అధికారులు మారుతున్నా ఆదివాసుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఐటిడిఎ ఏర్పాటు చేసి కోట్లాది రూపా యలు విడుదల చేస్తున్నా అవి వారిదరి చేరడం లేదు. ఐటిడిఎలో కీలక అధికారుల పోస్టులు కూడా ఖాళీగా ఉంటుండడంతో అభివృద్ధి పథకాల అమ లులో తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయి. ఆదివాసీల సంక్షేమంకోసం ఐటిడిఎ ద్వారా ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు.ప్రతి ఏడాది ఆదివాసులను జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వందల సంఖ్యలో గిరిజనులు మరణిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం కరు ణించడం లేదు. శాశ్వత పరిష్కారాలను కను గొన డానికి ప్రయత్నించడం లేదు. ఏజెన్సీ ప్రాంతం లోని ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చాలాపోస్టు లు ఖాళీగా ఉన్నాయి.
- రైతులపై కరువు ఛాయలు : అటవీ హక్కు చట్టంతో కొంతమంది ఆది వాసులకు ప్రయోజనం చేకూరినా వాటి ఫలాలు పూర్తిగా పొందలేకపోతున్నారు. గిరిజనుల భూ సమస్య పరిష్కరించడంలో ఐటిడిఏ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శ లున్నాయి. వారు పండిరచే పంటకు సరైన మార్కెట్ సౌకర్యం కూడా కల్పించడంలో ప్రభుత్వం విఫల మైంది. పంటలు నష్టపోతే నష్టపరిహారం సైతం పొంద లేకపోతున్నారు. గిరిజనుల భూముల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ స్థానంలో కూడా రెగ్యులర్ అధికారి కరువై పోవడంతో ఇన్‌ఛార్జీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హరిత హారం పథకం కూడా గిరిజనులకు కష్టాలను తెచ్చి పెడుతోంది. కొన్ని చోట్ల గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వక పోగా, హరితహారం పేరుతో పొలాల్లో గుంతలు తవ్వడం తో గిరిజనులు ఆందోళన చెందు తున్నారు. –గునపర్తి సైమన్