విశాఖ వైపు మెట్రో పరుగులు

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖలో అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖలో ఇప్పటికే వందల కోట్ల వ్యయంతో సుందరీకరణ,అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. తాజాగా పెండిరగ్‌లో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టునూ పరుగులు పెట్టించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మెట్రో రైలు పరిధిని 75 కిలోమీటర్లుగా నిర్ణయించిన ప్రభుత్వం నాలుగు కారిడార్లుగా దీన్ని అభివృద్ధి చేయబో తోంది. ఇందుకోసం సమగ్ర వివరాలతో డీపీఆర్‌ను త్వరలోనే విడుదల చేసేందు కు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారా యణ ప్రకటించారు.అంతే కాకుండా ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డి విశాఖ రాజధాని అభి వృద్ధిపై అధికార్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ మెట్రో ప్రాజెక్టుపై చర్చిలు నిర్వహించిన విషయం తెలిసిందే. నగరంలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి,సంప్రదాయం ప్రతిబింబిం చేలా మెట్రో పిల్లర్లు నిర్మాణం చేపట్టే దిశగా ఆలోచన చేస్తోంది. మరోవైపు తొలి విడతలో76.90కి.మీ.మేర లైట్ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈలోగా నిధుల సమీకరణను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మెట్రో రైల్ కార్పొరేషన్కు మార్గదర్శకాలు జారీ చేశారు.
విశాఖ మెట్రో పరిధి ఖరారు పారిశ్రా మికంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరం ఏపీలోని ప్రస్తుతం మరే ఇతర నగరాల కంటే కూడా మెరుగైన స్ధితిలో ఉంది. ఇక్కడ కొత్తగా వస్తున్న ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్ధలకు చెందిన ఉద్యోగులతో నగరం కిటకిటలాడు తోంది.ఈ రద్దీని తట్టుకునేందుకు ఎప్పటి నుంచో మెట్రోరైల్ ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగినా అవి అరకొరగానే మిగిలిపోయాయి. ఇప్పుడు వైసీపీ సర్కారు వాటిని దుమ్ముదులిపి ఎలాగైనా మెట్రో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అడుగులు వేస్తోంది.కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖ నగరంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలంటే మెట్రో ప్రాజెక్టు తప్పనిసరి అని భావిస్తున్న ప్రభుత్వం 75కిలోమీటర్ల మార్గంలో దీన్ని అభివృద్ధి చేసేందుకు తుది ఆమోద ముద్ర వేసింది.
ప్రజారవాణా వ్యవస్థ మెరుగుదలపై దృష్టి
2021 అంచనాల ప్రకారం విశాఖ మహా నగరంలో 25లక్షలకుపైగా జనాభా ఉంది. మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే మొత్తం జనాభా 41లక్షలు. లాభనష్టాలతో సంబంధం లే కుండా కేవలం ప్రజలకు రవాణా సౌకర్యా లను మె రుగుపరిచేందుకు మెట్రోపై దృష్టి సారించింది.సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా తర్వాత విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించేందుకు అడుగులు పడుతున్న తరు ణంలో నగరంలో ప్రజారవాణా వ్యవస్థ మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్ సమస్య తీరడం తోపాటు సమయం కూడా ఆదా అవుతుంది..
నాలుగు కారిడార్లుగా విభజన…
విశాఖలో ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని 75 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్టును నాలుగు కారిడార్లుగా విభజిం చారు. స్టీల్ ప్లాంట్ గేటు నుంచి కొమ్మాడి జంక్షన్ వరకూ,గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకూ,తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ, కొమ్మాడి జంక్షన్ నుంచి భోగాపురం వరకూ నాలుగు కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ నాలుగు కారిడార్ల ఏర్పాటుకు అవసరమైన డీపీఆర్ సాధ్యమై నంత త్వరగా సిద్ధం చేయాలని విజయ వాడలో నిర్వహించిన సమీక్షలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆధేశించారు. వచ్చే ఏడాది కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు నాటికి మెట్రో పనులను ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రారంభం కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
2025 నాటికి రోజుకు ఆరులక్షల మంది ప్రయాణం…
కోవిడ్ కారణంగా డీపీఆర్ తయారీ ఆలస్యమై నప్పటికీ సాధ్యమైనంత త్వరగా దీన్ని ప్రభు త్వానికి అందించేందుకు అధికారులు సన్నద్దమవు తున్నారు.ఆ తర్వాత దాన్ని వెంటనే ఆమోదించి ప్రాజెక్టును పట్టాలెక్కిం చాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో డీపీఆర్ పూర్తి చేసి ప్రాజెక్టు మొదలుపెడితే మూడు నుంచి నాలుగేళ్ల వ్యవధిలో ఇది పూర్తవుతుంది. ఆ లెక్కన చూస్తే 2025 నుంచి రోజుకు సగటున ఆరు లక్షల మంది విశాఖ మెట్రోలో ప్రయాణించేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యాధునిక మెట్రోగా ఉన్న హైదరాబాద్ మెట్రోరైల్ కంటే మెరుగైన టెక్నాలజీతో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆదే శాలు ఇచ్చింది.
వచ్చే ఏడాది జనవరి 15న పునాది రాయి
వచ్చే ఏడాది జనవరి 15న మెట్రో రైలు పనులకు పునాది రాయి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహన్రెడ్డి నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షలో మెట్రో రైలు నిర్మాణ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పునాది రాయి వేసేలోగా నిధులు సమీకరించేందుకు ఉన్న మార్గాల్ని అన్వేషించాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావుకు సూచించారు. 42 మెట్రో స్టేషన్లతో కూడిన మూడు కారిడార్లను మొదటి దశలో నిర్మించాలని భావిస్తున్నారు. కారిడార్-1లో స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.40కి.మీ..కారిడార్-2లో గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.07 కి.మీ.,కారిడార్-3లో భాగంగా తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.75 కి.మీ. మేర లైట్ మెట్రో కారిడార్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత రెండో విడత కింద కారిడార్-4లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు 30.67 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఈ నాలుగు కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, రెండు డిపోలు ఏర్పాటు చేయనున్నారు.
బీచ్ రోడ్డులో ట్రామ్ కారిడార్
బీచ్ రోడ్డులో ట్రామ్ కారిడార్ ఒక మణిహా రంగా రాబోతోంది. ప్రధాన జం క్షన్ల నుంచి అభివృద్ధి చెందే ప్రాంతాలకు కూడా ట్రామ్ నడిపే యోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తం 60.05 కి.మీ. మేర మోడ్రన్ ట్రామ్ని నడ పిేందుకు 4 కారిడార్లు గుర్తించారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ ట్రామ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి, ఎన్‌ఏడీ జంక్షన్ నుంచి పెందుర్తి వరకు కూడా ట్రామ్ కారిడార్ రాబోతోంది.
శివారుకు మెట్రో.. సీఎం ఆకాంక్ష
ఏపీ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఐటీ హబ్ అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతా లు కూడా కోర్ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. అందుకే ఆయా ప్రాంతాలకు మెట్రో స్వా కర్యం కూడా కల్పించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా డీపీఆర్ లో మార్పులు, చేర్పులు జరిగాయి.
విశాఖ మెట్రో స్వరూపమిదీ..
మొత్తం అంచనా వ్యయం:14.09 కోట్ల
ఫేజ్-1లో కారిడార్-1, 2,3 నిర్మాణ అంచనా వ్యయం: రూ.9,699 కోట్లు
ఫేజ్-2లో కారిడార్-4 నిర్మాణ అంచనా వ్యయం: రూ.4,610 కోట్లు ప్రాజెక్టు
విస్తీర్ణం: 76.90 కి.మీ. ఫేజ్-1, ఫేజ్-2లో నిర్మించే మొత్తం స్టేషన్లు: 54
మోడ్రన్ ట్రామ్ ప్రాజెక్టు
అంచనా వ్యయం: రూ.5,323 కోట్లు కారిడార్ -1 అంచనా వ్యయం: రూ.1,102 కోట్లు,కారిడార్-2 అంచనా వ్యయం: రూ.1.879 కోట్లు, కారిడార్- 3 అంచనా వ్యయం: రూ.1,321 కోట్లు, కారిడార్ – 4 అంచనా వ్యయం: 1.21 కోట్ల, ప్రాజెక్టు విస్తీర్ణం: 60.05 కి.మీ.– (జి.ఎ.సునీల్ కుమార్)