విశాఖ తీరంలో సాహస విన్యాసాలు
‘‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విశాఖ సాగర తీరంలో 12వ ఫ్లీట్ రివ్యూ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐఎన్ఎస్ సుమిత్రలో పయనించారు. నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షించారు. భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు గౌరవ వందనం చేశాయి. 60 యుద్ధ నౌకలతో పాటు సబ్ మెరైన్స్, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి. ఫ్లీట్ రివ్యూలో నేవీ చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నౌకా దళ తీర పెట్రోలింగ్ నౌక ఐఎన్ఎస్ సుమిత్రలో రాష్ట్రపతి కోవింద్ బంగాళాఖాతంలో నాలుగు నిలువు వరుసలలో లంగరు వేసిన 44 నౌకలను దాటుకుని గౌరవ వందనం స్వీకరించారు ’’
ప్రశాతంగా కనిపించే విశాఖ సాగర తీరం భయంకర శబ్ధాలతో దద్దరిల్లింది.. యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు పరిస్థితి చూసుంది. దూరం నుంచి చూసేవారికి ఏదో జరుగు తోందనే భయం వేస్తుందేమో..కానీ అక్కడ జరిగింది మాత్రం అద్భుత విన్యాశాలు.. భారత నౌకాదళ యుద్ధ విన్యాసాలు తెలిసేలతో ప్రత్యేక ప్రదర్శనలు సాగాయి. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ లో భాగంగా Iచీూవిశాఖ నౌకను జాతికి అంకితం చేశారు సీఎం వైఎస్.జగన్. నేవల్ డాక్‌యార్డ్‌లో ఐఎన్ఎస్ వేలా జలాం తర్గామిని ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ జలంతర్గామిలో ప్రత్యేకలను సీఎం జగన్, భారతి దంపతులు ఆసక్తిగా తిలకించారు. నేవీ సిబ్బంది నుంచి గౌరవ వం దనం స్వీకరించారు. ఐఎన్ఎస్ విశాఖ నౌక పశ్చిమ నౌకాదళంలో సేవలం దించనుంది. విశాఖ బీచ్‌లో ఫిబ్రవరి 27న మిలాన్ 2022 కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు పాల్గోన్నారు.6000 అడుగుల ఎత్తులో 6గురు ఆకాశంలో త్రివర్ణ పతకంతో విన్యాసాలు చేశారు. యుద్ధ విమానాలు గర్జనల, నావికా సిబ్బంది యుద్ధ విన్యాసాలు, నావికదళ సిబ్బంది రీస్క్యు ఆపరేషన్, ప్రమాదంలో ఉన్నవా రిని రక్షించే సాహసాలు, యుద్ద విమానాలు చక్కర్లు, సముద్రంలో బాంబుల మోతాతో ఆ సాగర తీరం దద్దరిల్లింది.యుద్ధనౌకల అత్యంత వేగవంతమైన విన్యాసాలు,మెరైన్ కమాండోల బహుముఖ కార్యకలాపాలు,యుద్ధ విమానాల ఫ్లైపాస్ట్ విన్యాసాలు వీక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇలా వివిధ రకాల విమానాలు, వైమానిక శక్తి ప్రదర్శనలు ప్రపంచ దేశాల మధ్య స్నేహ పూర్వక వాతావరణాన్ని ప్రతిబిం బించాయి. తరువాత మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ప్రారంభించారు. గంటన్నర పాటు జరిగే సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్ స్వయంగా సమీక్షించారు. తూర్పునౌకాదళం వేదికగా ఈ మిలాన్ విన్యాసాలు మార్చి 4 వరకూ జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్..ఐఎన్ఎస్ మీద డాల్ఫిన్ లైట్‌హౌస్, డాల్ఫిన్ నోస్, కృష్ణజింకను ముద్రించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ది సిటీ ఆఫ్ డెస్టినీ అని అన్నారు. సిటీ పరేడ్‌లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని సీఎం జగన్ తెలిపారు. ఇది చాలా అరుదైన వేడుక.. విన్యాసాల పండగ అని కొనియాడారు. ఇటీవల తూర్పు నౌకాదళ స్థావరంలో ఐఎన్ఎస్ విశాఖ చేరిందని తెలిపారు. ఈ విన్యాసాల్లో పాల్గొన్న అందరికీ సీఎం జగన్ అభినందనలు తెలియజేశారు. విశాఖపట్నంలో మిలాన్-2022 నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించ దగ్గ రోజు అని అన్నారు. భవిష్యత్తులో విశాఖ మరిన్ని అంతర్జాతీయ వేడుకలకు వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నేవీ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్)2022 కార్యక్రమాన్ని ఫిబ్రవరి 21న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,రాష్ట్ర గవర్నర్ ఆంప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌లు హజరూ సుమిత్రి నౌక నుంచి ఫ్లీట్ రివ్యూను ప్రారం భించారు. ఫ్లీట్ రివ్యూ ద్వారా మరోసారి భారత నౌకాదళం తమ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించింది. భారత తూర్పు నావికాదళం శక్తి సామర్ధ్యాలు మరోసారి తెలిసి వచ్చేలా విన్యాసాలు సాగాయి. విశాఖ సాగర తీరంలో సాగిన సాహస విన్యాసాలు ఆంధ్యంతం అబ్బురపరిచేలా సాగాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 27న జరిగిన మిలాన్
2022 ఉత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హజరై ఐఎన్ఎస్ విశాఖను జాతికి అంకితం చేశారు. ఫిబ్రవరి 21న జరిగిన రాష్ట్రపతి కార్యక్రమంలో నావికా దళాలు త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు ఘనంగా గౌరవ వందనం చేశాయి. పీఎఫ్ఆర్-22లో భాగంగా నౌకాదళానికి చెందిన రెండు నౌకాద ళాలను,యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌తో కూడిన 60 నౌకలు,10 వేల మంది సిబ్బందితో కూడిన జలాం తర్గాములకు సంబంధించిన నౌకాదళ శక్తి సామర్ధ్యాలను రివ్యూ చేశారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చి75 సంవత్స రాలు పూర్తవుతున్న దశలో జరిగిన ఫ్లీట్ రివ్యూ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకు తగ్గట్టుగానే విన్యాసాలు అద్భుతం అనేలా సాగాయి. ఈ రివ్యూను చూసేందుకు జనం కూడా భారీగానే తరలి వచ్చారు. ఫ్లీట్ రివ్యూ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ…‘‘కోవిడ్-19’’ మహ మ్మారి సమయంలో నేవీ పాత్రను కొని యాడారు. స్నేహపూర్వక దేశాలకు వైద్య సహాయం అందించారన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విదేశీ పౌరులను తరలించి సేవను ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. భారత నౌకా దళం నిరంతర నిఘా,సంఘటనలపై సత్వర ప్రతిస్పందన, అలుపెరగని ప్రయత్నాలు సముద్రాల భద్రతను కాపాడుకోవడంలో అత్యంత విజయవంతమైందని రాష్ట్రపతి చెప్పారు. ప్రపపంచ దేశాలన్నింటికీ పోటీ ఇచ్చేలా మన బలగాలు పెరగడం సంతోషించే పరిణమమన్నారు. సాయుధ దళాల సుప్రీం కమాండర్ మాట్లాడుతూ..రాష్ట్రపతికి మొదట ధన్యవాదాలు తెలిపారు. తూర్పు నావికా దళంలో నౌకలు,విమానాలు,జలాంతర్గాముల అద్భుతమైన కవాతు ప్రదర్శించాయి అన్నారు. ఎలాంటి ఆకస్మిక పరిస్థితులనైనా ఎదుర్కొనేం దుకు భారత నౌకాదళం సన్నద్ధతను కూడా ఈ కవాతు ప్రదర్శించింది అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం హిందూ మహా సముద్ర ప్రాంతంలోనే జరుగుతోందని మన వాణిజ్యం,ఇంధన అవసరాలలో గణనీయమై భాగం మహాసముద్రాల ద్వారానే తీరుతుందని కోవింద్ స్పష్టం చేశారు. భారత నావికాదళ నౌకలు,జలాంతర్గాములు,విమానాలు,మన సముద్ర శక్తికి సంబంధించిన ఇతర అంశాల సంసిద్ధతను సమీక్షిస్తున్నందుకు తాను చాలా సంతోషిస్తున్నాని చెప్పారు. భారత నావికాదళం మరింత స్వావలంబనగా మారుతోందని అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవలో ముందంజలో ఉందని గుర్తు చేశారు. భారత దేశం అణు జలాంతర్గాములను నిర్మించడం చాలా గర్వించదగ్గ విషయంగా రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. 1971 యుద్ధ సమయం లో విశాఖపట్నం నగరం సహకారం మరువ లేనిది అన్నారు. అంతర్జాతీయ కార్యక్ర మాలకు విశాఖ వేదికగా నిలుస్తోంది.
ప్రెసిటెండ్స్ ఫ్లీట్ అంటే ఏంటి?
ప్రపంచ దేశాలు ప్రెసిటెండ్స్ ఫ్లీట్ రివ్యూ నిర్వహించడాన్ని ఒక సంప్రదాయంగా భావి స్తాయి. ముందస్తుగా ఎంచుకొన్న చోట నౌకాద ళానికి చెందిన యుద్ధ నౌకలను ప్రదర్శిస్తారు. దేశ రక్షణలో నౌకాదళం పాత్ర,సాధించిన అభివృద్ధిని చాటడంటో భాగంగా ఫ్లీట్‌ను నిర్వహిస్తారు. రాష్ట్రపతి పదవీకాలం ముగిసే సరికి కనీసం ఒక్కసారి అయినా ప్రెసిడెంట్స్ ఫ్లీట్ నిర్వహిస్తారు. రిపబ్లిక్ డే రోజున నిర్వ హించే సైనిక ప్రదర్శన మొదటిదని,ఆ తరహాలో చేపట్టే రెండో కార్యక్రమం ప్రెసిడెంట్స్ ఫ్లీట్ అని నేవీ అధికారులు వివరించారు. ఇండియాలో మొట్టమొదటి సైనిక, ఆయుధ ప్రదర్శనను 18వ శతాబ్దంలో మరాఠా రాజులు నిర్వహించారు. తీరప్రాంతంలోని కోటరత్నగిరిలో అప్పటి సర్కీల్ కన్హోజీ అంగ్రీ నేతృత్వంలో గురబ్స్,గల్లివట్స్‌గా పేర్కొనే సైనికుల ప్రదర్శన జరిగింది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 11సార్లు ప్రెసిడెంట్స్ ఫ్లీట్ నిర్వహించారు. అందులో రెండు ఇంటర్నేషనల్ ఫ్లీట్స్ ఉన్నాయి. 2001,2016లో అంతర్జాతీయ స్థాయి ఫ్లీట్స్‌ను ఇండి యన్ నేవీ చేపట్టింది. ప్రస్తుతం విశాఖ పట్నంలో రెండోసారి ప్రెసిడెంట్స్ ఫ్లీట్ నిర్వహి స్తున్నారు.2016లో కూడా విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ జరగ్గా అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం హాజరయ్యారు. ప్రెసిడెంట్స్ ఫ్లీట్‌లో నౌకలను చూసి రాష్ట్రపతి ఇచ్చే ప్రశంసలు విశ్వాసాన్ని పెంపొందిస్తాయని, దేశరక్షణలో ఇండియన్ నేవీ పాత్రను సత్తాను ప్రదర్శన చాటుతుందని నేవీ అధికారులు తెలిపారు.2020లో అండ మాన్ నికోబార్ దీవుల్లో జరగాల్సిన ప్రెసిడెంట్స్ ఫ్లీట్ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిరది.
ప్రెసిడెంట్స్ ఫ్లీట్‌లో ప్రత్యేకతలు
‘ఇండియన్ నేవీ- 75 ఇయర్స్ ఇన్ ది సర్వీస్ ఆప్ ది నేషన్’ అనే నినాదంతో ప్రస్తుతం ప్రెసిడెంట్స్ ఫ్లీట్ జరుగుతోంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవు తున్న సందర్భంగా ఈ ఫ్లీట్‌ను ప్రత్యేకంగా జరుపుతున్నారు. ప్రదర్శనలో 60 నౌకలు, సబ్ మెరైన్స్, 50 ఎయిర్ క్రాఫ్ట్స్ పాల్గొంటాయని అధికారులు పేర్కొన్నారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోస్టుగార్డ్‌కు చెందిన నౌకలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి చెందిన సబ్‌మెరైన్స్ కూడా ఫ్లీట్‌లో పాల్గొన్నాయి.
రాష్ట్రపతి పర్యాటన ఇలా జరిగింది..
నౌకల ప్రదర్శన,ఎయిర్ క్రాఫ్ట్స్ విన్యాసాలు ఉం టాయి. కార్యక్రమం అనంతరం ప్రత్యేక కవర్, పోస్టల్ స్టాంప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విడుదల చేశారు. ప్రత్యే కంగా సిద్ధం చేసిన ప్రెసిడెన్షియల్ యాచ్ ద్వారా మ్యారిటైమ్ ఆర్గనైజేషన్స్‌కు చెందిన నౌకలు,యుద్ధ నౌకలు., సబ్‌మెరైన్స్‌ను రాష్ట్రపతి పరిశీలించారు యాచ్ లో ప్రయాణిస్తూ ఆయా నౌకల్లోని అధికారుల గౌరవవందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. గాల్లో ఎగురుతూ సెల్యూట్ చేసే వంటి విన్యాశా లను ఎయిర్ క్రాఫ్ట్స్ చేశాయి. ఇండియన్ నేవీకి చెందిన ఏవియేషన్ వింగ్ ఆధ్వర్యంలో 50 ఎయిర్‌క్రాఫ్ట్స్ కనువిందు చేశాయి. ఐఎన్ఎస్ విశాఖను జాతికి అంకితం చేసిన సీఎం జగన్
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో భయానక వాతావరణం కనిపిస్తోంది. సేమ్ అలాంటి యుద్ధ వాతావరణమే విశాఖలోనూ కనిపించింది. అయితే ఇదంతా కేవలం విన్యాసాలు మాత్రమే.. భారత నౌకాదళం శక్తి తెలిసేలా అద్భుతమైన విన్యాసాలు చేశారు. మరోవైపు ఈ సందర్భంగా ఐఎన్ఎస్ విశాఖ నౌకను జాతికి అంకితం చేశారు సీఎం వైఎస్.జగన్. తర్వాత జలాంతర్గామిలో సిఎం జగన్ దంపతుల సందర్శించి అలరించి విన్యాసాలు వీక్షించారు. వేగంగా కదిలే నౌకలు, గగనతలంపై భారీ శబ్ధాలను చేసు కుంటూ రెప్పపాటు క్షణంలో మాయ మవుతూ ఉండే ఫ్లై పాక్,యుద్ధ విమానాల విన్యాసాలతో ఒక్కసారిగా యుద్ధవా తావరణం కనిపిం చింది. సముద్ర జలాల్లో ఎవరైనా చిక్కుకుంటే వారిని పై నుంచి వెళ్లే విమానాలు,అక్కడ నుంచి నీటిపైకి వేసే లావుపాటి తాళ్లు,నిచ్చెనల నుంచి మెరైన్ కమోండోలు (మార్కోస్), సైలర్లు దిగి వారిని కాపాడే ప్రక్రియ అత్యంత గగుర్పాటుకు గురి చేసింది. సుమారు 60 నౌకలు, జలాంత ర్గాములు,55 యుద్ధ విమానాలు బంగాళా ఖాతంలో సందడి చేశాయి. 44యుద్ద నౌకలు 4వరుసలుగా కొలువు దీరగా వాటి మధ్యనుంచి ఐఎన్ఎస్ సుమిత్ర (Iచీూ ూబఎఱ్‌తీa) నౌక ముందుకు సాగింది. – గునపర్తి సైమన్