విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్
ఎంతోకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖ రైల్వేజోన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ కు కేంద్ర మంత్రివర్గం మార్చి 25న ఆమోదం తెలిపింది. అలాగే వాల్తేర్ డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటించారు. రాజ్యసభలో నిన్న బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ వేసినట్టు మంత్రి రాజ్యసభ వేదికగా వెల్లడిరచారు.
దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు డీపీఆర్ సమర్పించిన తర్వాత కొత్త రైల్వే జోన్,రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు పరిధి, ఇతర అంశాలకు సంబంధించి పలు విషయాలు తమ దృష్టికి వచ్చాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.దీంతో ఈ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొ న్నారు. ప్రస్తుతం ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేపట్టి విశాఖ పట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రం కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు కూడా ఆయన తెలిపారు.
కమిటీ పని చేస్తోంది
జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసినట్లు కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. కొత్త రైల్వేజోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకోసం 2020-21 బడ్జెట్లో రూ.170 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రైల్వేజోన్‌కు డీపీఆర్ సమర్పించాక కొత్త రైల్వేజోన్,రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు లో భాగంగా పరిధి-ఆదాయ వ్యవహా రాలకు సంబంధించి అనేక విషయాలు తమ దృష్టికి రావటంతో వీటిని మరింతగా అధ్య యనం చేయటం కోసం అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీని ఏర్పాటుచేశామని రైల్వే మంత్రి వెల్లడిరచారు.
భూమి ఎంపిక పూర్తయింది
దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ సముదాయం నిర్మాణానికి భూమిని ఎంపిక చేశామని చెప్పారు. పరిపాలన.. నిర్వహణ అవసరాలతో పాటుగా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం కొనసా గుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే… తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేసి విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటు..అదే విధంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పుకొచ్చారు.
రైల్వేలో ఉద్యోగాల ఖాళీలు
ఇలా దక్షిణ మధ్య రైల్వేలో నాన్‌గెజిటెడ్ ఉద్యోగాలు 16,878, గెజిటెడ్ ఉద్యోగాలు 34 ఖాళీగా ఉన్నట్లు రైల్వేమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లలో కలిపి 3,01,414 నాన్‌గెజిటెడ్, 2,519 గెజిటెడ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడిరచారు. 2013-14లో రూ.110 కోట్లతో మంజూరుచేసిన కర్నూలు కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ కేటాయింపులను తాజాగా రూ.560.72 కోట్లకు పెంచినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. కడప-బెంగుళూరు రైల్వేలైన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా డిపాజిట్ చేయకపోవడంతో ఆ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిపేసినట్లు పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియను వేగవంతం చేయడానికి వీలుగా భూసర్వే, ప్రధాన కార్యాలయ సముదాయం లేఅవుట్, నివాస సముదాయ కాలనీ, ఇతర ముందస్తు నిర్మాణ పనుల ప్రాథమిక కార్యకలాపాలను చేపట్టాలని రైల్వేశాఖ నిర్దేశించింది. పరిపాలన, నిర్వహణ అవసరాలతో పాటు ఇతరత్రా హేతుబద్ధమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిపై నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడున్న దక్షిణమధ్య రైల్వే,తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేపట్టి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్, ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది’అని రైల్వేమంత్రి తెలిపారు. కర్నూలు కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ కేటాయింపులు రూ.560 కోట్లకు పెంపు,2013-14లో రూ.110కోట్లతో మంజూరుచేసిన కర్నూలు కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ కేటాయిం పులను, తాజాగా రూ.560.72 కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.178.35 కోట్లు కేటాయించి రూ.171.2 కోట్లు ఖర్చుచేసినట్లు వెల్లడిరచారు. తెలంగాణ ప్రభుత్వం7ఎకరాల భూసేకరణలో ఆలస్యం చేయడం వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందన్నారు. ఆ భూమిని గత ఏడాది నవంబరులో రైల్వేకి అందించినట్లు వెల్ల డిరచారు. కొవిడ్ లాక్డౌన్ వల్లా పనులు తీవ్రంగా ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఎప్పటికప్పుడు ఇక్కడ ఓవర్‌హాలింగ్ చేయనున్నట్లు వెల్లడిరచారు. దక్షిణ మధ్య రైల్వేలో నాన్‌గెజిటెడ్ ఉద్యోగాలు 16,878, గెజిటెడ్ ఉద్యోగాలు34ఖాళీగా ఉన్న ట్లు రైల్వేమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లలో కలిపి 3,01,414నాన్‌గెజిటెడ్, 2,519 గెజిటెడ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడిరచారు.
కొత్త జోన్‌తో అభివృద్ధి పరుగు
విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే జోన్ ప్రకటన..ప్రయాణీకుల అవసరాలను తీర్చడంతోపాటు, రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదం చేయనుంది. ప్రధానంగా కేంద్ర బడ్జెట్లో జోన్లవారీగా చేసే కేటాయింపుల వల్ల ఆర్ధిక వెసులబాటు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక కొత్త రైళ్ల మంజూరు,ఉన్నవాటిని పొడిగించడంతో రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.విశాఖపట్నం జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానుండటంతో పరిపాలనపరంగానే కాక ఉద్యోగాల విషయంలోనూ ఎంతో లబ్ది కలగనుంది.రైల్వే ఉద్యోగాల నియామకాలకు సంబంధించి,రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ)జోన్ కేంద్రంగా విశాఖపట్నంలోనే ఏర్పడుతుంది. ఇది రాష్ట్ర ప్రజలకు రైల్వే ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చాలా దోహదం చేస్తుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ దాదాపుగా ఒకే పరిధిలోకి
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే నెట్వర్క్,ఇప్పటివరకు వేర్వేరుజోన్ల పరిధిలో ఉంది. విజయవాడ,గుంటూరు,గుంతకల్లు డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణమధ్య రైల్వే జోన్లో ఉన్నాయి. వాల్తేరు డివిజన్ ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా గల తూర్పు కోస్తా,జోన్లో అంతర్భాగమై ఉంది. రాష్ట్ర అవసరాలకు,ప్రయాణీకులకు సంబంధించిన ప్రతిపాదనలు ఏవైనా ఆయా డివిజన్ల నుంచి జోన్ ప్రధాన కార్యాలయం వెళ్లేవి.కొన్నింటిఇన దక్షణ మధ్య రైల్వేకు,మరికొన్నింటిని తూర్పు కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయాలకు పంపాల్సి వచ్చేది. అరకరడ ఆమోదం తర్వాత ఆ ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు చేరేవి.ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రతిపాదనలను తూర్పుకోస్తా జోన్లో తొక్కిపెడుతున్నారని,వివక్ష చూపుతున్నారని,ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఓ బండికి అదనంగా బోగీ కావాలన్నా తిరగాల్సి వచ్చేది. విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్ఠ్ రైల్వే ప్రత్యేక జోన్ కావాలన్న డిమాండ్ నెరవేరడంతో ఇబ్బందులు తొలగిపోతా యంటున్నారు.
వాల్తేరు పేరు ఇక లేనట్లే
విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటుచేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించినప్పటికీ,విశాఖలో రైల్వే డివిజన్ లేకపోవడం ఓ పెద్దలోటుగా మారింది. వాల్తేర్ డివిజన్ ఆంధప్రదేశ్,ఒడిశా,చత్తీషఘడ్..మూడు రాష్ట్రాల పరిధిలోనూ ఉంది. ఇందులో ఏపీ పరిధిలోని వాల్తేరు డివిజన్ ప్రాంతాన్ని విజయవాడ డివిజన్లో కలిపి,విశాఖ కేంద్రంగా కొత్తగా దక్షిణకోస్తా రైల్వే ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాల్తేరు డివిజను విశాఖపట్నం డివిజన్‌గా పేరు మారుస్తారని వినిపించినా,అలా జరగలేదు. ఏపీలో ఏర్పడుతున్న కొత్త రైల్వేజోన్‌లో వాల్తేర్ పేరుతో డివిజన్ లేకపోవడంపై విమర్శలు వినిపి స్తున్నాయి. డివిజన్ స్థాయిలో జరగాల్సిన పనులు,ప్రతిపాదనల కోసం విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లి రావాల్సి ఉంటుంది. జోన్ ప్రధాన కార్యాలయం ఉన్న చోట డివిజన్ లేకపోవడాన్ని రైల్వే రంగ నిపుణులు తప్పుపడుతున్నారు.
ా గుంటూరు,గంతకల్లు,విజయవాడ డివిజన్లతోపాటు వాల్తేరు డివిజన్ పరిధిలో ఉత్తరాంధ్ర ప్రాంతం,కొత్త జోన్ పరిధిలోకి వస్తుంది. అది విజయవాడ డివిజన్లో కలిసే అవకాశం ఉంది. భౌగోళికంగా కొద్ది ప్రాంతం మినహా ఆంధప్రదేశ్ అంతా ఒకే జోన్ కిందికి వస్తుంది.
ా జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకానుంది.కొత్తగా జనరల్ మేనేజర్,అదనపు జనరల్ మేనేజర్,వివిధ విభాగాల అధిపతులు,వారికి కార్యదర్శులు,సహాయకులు..ఇలా కొత్త ఉన్నతా ధికారులు,అధికారులు వాస్తారు.
ా రద్దీని బట్టీ ఏదైనా రైలుకు అదనపు బోగీలు వేయాలన్నా,పండుగ సమయాల్లో ప్రత్యేక రైళ్లు నడపాలన్నా,త్వరితగతిని నిర్ణయాలు ఉంటాయి. సంక్రాంతి,ఇతర ప్రధాన పండుగల సమయంలో విశాఖపట్నం వైపు రద్దీ అధికంగా ఉంటుంది. తూర్పుకోస్తా రైల్వే స్పందించి నిర్ణయం తీసుకునేసరికి పండుగ వచ్చేస్తుంది. కొత్త జోన్ రావడంవల్ల ఇక్కడే త్వరగా నిర్ణయాలు జరుగుతాయి.
ా అదపు రైళ్ళు బోగీలు తెచ్చుకోవడంవల్ల ఆ మేరకు ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది.
ా కొత్త రైళ్లు ప్రకటించినప్పుడు సాధారణంగా జోన్ ప్రధాన కార్యాలయం ఉన్న చోటకు ప్రాధాన్యం లభిస్తుంది. రిజర్వేషన్ కోటా తక్కువగా ఉండేది. ఇప్పుడు విశాఖ కేంద్రంగా జోన్‌తో ఆ సమస్యలు తీసిపోతాయి.
ా ఇచ్ఛాపురం,పలాస వంటి మారుమూల ప్రాంతాలకు రైళ్ల కనెక్టివిటీ పెంచుకోవచ్చు.
ా వడ్లపూడిలో ఉన్న వ్యాగన్,వర్క్‌షాపు తదితరాలకు అనుబంధ పరిశ్రమలు వస్తాయి.
ా గంగవరం,విశాఖపట్నం ఆదాయాలు పెరుగుతాయి.
ా ప్రయాణీకుల అవసరాల్ని బట్టి రైళ్లను పొడిగించుకోవచ్చు.
ా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంలో,నిధుల కేటాయింపులోనూ ప్రాధాన్యం పెరుగుతంది.
వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వేజోన్ ప్రకటించాలి ఆర్టికల్ 371డి ప్రకారం స్థానికులకు 75 శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి, రైల్వే విడిభాగాల పరిశ్రమలను కేటాయించి ,కొత్త ఆర్ఆర్బి సెంటర్‌ను ప్రారంభించాలి, వాల్తేర్ డివిజన్‌తో కూడిన రైల్వే జోన్ ప్రారంభించే తేదీని ప్రకటించాలి. కొన్ని సంవత్సరాల నుండి కేంద్ర డిపిఆర్ వేశామని కాలయాపన చేసు ్తన్నారూ, గత డిపిఆర్ నివేదిక ఏమయింది, మరల ఎందుకు డి పి ఆర్ కమిటీ వేస్తున్నారు .2021లో 170 కోట్లు డివిజన్ అభివృద్ధి గురించి కేటాయించిన పనులు ఏమయ్యాయి. కేంద్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, రాయగడ డివిజన్ బదులు వాల్తేరు డివిజన్ తో కూడిన విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలి. అంతవరకూ రైల్వేజోన్ సాధన సమితి తో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత కుమార్ స్పష్టం చేశారు.– జిఎన్‌వీ సతీష్