విలక్షణ అడవి చుక్క సీతక్క
ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘ అస్నాల శ్రీనివాస్ ’ కలం నుంచి జాలువారిన పరిశోధనాత్మకమైన ‘ రణధీర సీతక్క’ అనే పుస్తకంపై సమీక్ష
రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక మాధ్యమాల సాయంగా బాగా దగ్గరైన ఆదివాసి పోరు బిడ్డ అతి మారుమూల గిరిజన గూడెంలో పుట్టి తెలిసి తెలియని వయస్సులో విప్లవ మార్గం పట్టి అడవుల్లో అజ్ఞాత జీవితం గడిపి కుటుంబ సభ్యులను భర్తను కోల్పో యి,అనేక ఇబ్బందులుపడి చివరికి తనకు ఇష్టమైన ప్రజాసేవకు తనించుకున్న విప్లవ బంధ పనికిరాదని అనుభవ పూర్వకంగా తెలుసుకుని జనజీవన స్రవంతిలో కలిసి కష్టపడి చదువుకొని తన జనజాతి అడవి బిడ్డల అభ్యున్నతి తనఅంతిమ లక్ష్యంగా ముందుకు నడిచి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి పదవి చేపట్టిన గిరిజన ధీర వనిత సీతక్క అనపడే ‘‘దనసరి అనసూయ’’ మన మహిళాలోకానికి ఆదర్శం.
నేటి ఆధునిక యువతకు ఆమె జీవి తం హెచ్చరికతో కూడిన ఆదర్శ సందేశం ఈ విషయాన్ని గమనించిన ఉద్యమ రచయిత, విద్యావేత్త, ప్రధానాచార్యుడు అయిన అస్నాల శ్రీనివాస్ సీతక్కతో తలకు గల ఆత్మీయ సోపతి తో ఆమె గురించిన వార్తా కథనాల సమ్మేళ నంగా చక్కని పుస్తకం ‘‘రణధీర సీతక్క’’ పేరుతో ప్రచురిం చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలు మలిదశ తెలంగాణ పోరా టం వరకు అమరులైన వందలాది అమర వీరులకు అంకితం ఈయబడిన ఈ యోధు రాలు పుస్త కంకు,గ్వాటే మాల ఆదివాసీ నాయకురాలు ‘రిగో బెర్తామెంచు’, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి వోల్గా తదితరులు అందించిన యోగ్యతా పత్రాలు అదనపు ఆకర్షణ మాత్రమే కాదు,అదనపు సమాచార యుక్తం కూడా…!!
అత్యంత ప్రజాదరణ పొందిన నాయ కురాలు పూర్వాశ్రమ వివరాలు,వార్తాంశాలు, ఇందులో పొందుపరచబడ్డాయి,‘పోరాటం కాలం చెల్లకుండా ఉండాలంటే అచంచలమైన నిబద్ధతతో పోరాట రూపాన్ని మార్చుకోక తప్పదు’ అనే సత్యా న్ని చరిత్ర చెబుతుంది. అందుకు కట్టుబడ్డ సీతక్క గిరిజనులు పేదల పట్ల గల తన నిబద్దతను కొనసా గిస్తూ..బాహ్య సమాజమే తన సేవా కేంద్రం చేసు కొని అజ్ఞాతం వదిలి జనజీవన స్రవంతిలో కలసి, ఉన్నత చదువులు పూర్తి చేసుకొని ఒక మాజీ నక్స లైట్ నాయకురాలు ప్రజాసేవ సాయంగా ఉద్యమ సిద్ధాంతాలకు పూర్తిగా సరిపోని ప్రాంతీయ, జాతీ య,పార్టీలతో చేతులు కలిపి రాజకీయ తెర చాపల ద్వారా తనదైన ‘ప్రజాసేవనావ’ను నడిపి స్తున్న సీతక్క జీవితం నేటి యువతరానికి విలక్షణ మైన ఆదర్శం.
ఈ వ్యాస సంపుటి రచయిత ప్రయ త్నం చాలా మంచిది అభినందించదగ్గది. భావిత రాలకు అక్షర రూపంలో భద్రపరిచిన ఈ ఉద్యమ చరిత్ర సంపద పరిశోధనలకు దారి దీపం అవు తుంది. ఇదో చారిత్రిక వాస్తవాల వ్యాస సంపుటి రూపంలో గల ఒకవ్యక్తి జీవన చిత్రం, స్ఫూర్తిదా యకంగా సాగిన అక్షర ప్రయాణం, సీతక్కను తెలంగాణ సర్వనామంగా అభివర్ణిస్తూ ప్రారంభ మైన ఈ వ్యాస సంపుటిలో మొత్తం 22 భాగాలు కనిపిస్తాయి.07 డిసెంబర్ 2023న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా సీతక్క ప్రమాణం చేసిన అపూర్వ సంఘటనతో ఈ పుస్తకం ప్రారంభమవు తుంది. రెండవ భాగంలో ‘వీర యోధుల శిక్షణ కేంద్రం ములుగు’అనే నేటితరానికి తెలియని విలువైన చారిత్రక అంశాన్ని ఇందులో చేర్చారు. కానీ ఆకాలానికి సీతక్క జన్మించి లేరు. అనంతర కాలంలో జన్మించిన ఈగిరిజన యువతి తన ప్రాం తంలోని పోరాట మూలాలకు చైతన్యం పొంది, తాను సైతం పోరుబాట పట్టింది అన్నదే అక్కడి ప్రధాన అంశం.‘వీరకిశోర బాలికగా సీతక్క’ అనే మూడవ విభాగంలో సీతక్క ఉన్నత విద్యాభ్యాస సమయంలో వసతి గృహంలో విద్యార్ధినిల సమ స్యల గురించి ప్రశ్నించిన తీరు ఆమెను నాయకురా లుగా తీర్చిదిద్దిన వైనం వివరించారు.నాల్గవ విభా గంలో ‘సాయుధగెరిల్లా యోధగా సీతక్క’ చేసిన పోరాటం ఎదుర్కొన్న కష్టాలు నక్సల్స్ ఉద్యమ చరిత్రలో తొలిగిరిజన మహిళా కమాండర్‌గా ఆమె నిర్వహించిన బరువు బాధ్యతల గురించి క్షుణ్ణంగా వివరించారు. అడవుల అజ్ఞాతం వీడిన ధనసరి అనసూయ అడవిలో సీతక్క పేరుతోనే జన స్రవంతిలో అడగండి గిరిజన విద్యాకేంద్రాల వికా సం,మహిళల సమస్యలు,అడవుల పరిరక్షణ, మేడా రం సహజత్వం కాపాడటం,కోసం అవిశ్రాంత అజ్ఞాత పోరాటాలు చేస్తూనే తన ఉన్నతికి సాయ పడే విద్య విలువలను వదలక అజ్ఞాతం వీడిన వెంటనే న్యాయ శాస్త్రంలో పట్టభద్రురాలు కావడం, ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత కూడా అధ్యయనం సాగించి 2022లో ఉస్మాని యా విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన నిత్య విద్యార్థిని డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, 2004లో చంద్రబాబు నాయుడు దూర దృష్టిలో పడ్డ సీతక్క ఎమ్మెల్యే టికెట్ పొంది తన ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది.ప్రజల్లో తన కు గల విశేషఆదరణ సాయంగా రాజకీయాల్లో సహజమైన గెలుపోటములు ఎత్తుపల్లాలను అధిగమిస్తూనే నిత్యం ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పోరాడుతూ ప్రజా నాయకురాలుగా ఎదిగిన వైనం ఈవిభాగాల్లో వివరించడం జరిగింది. మలి దశ తెలంగాణ పోరాటంలో సైతం సీతక్క పాత్ర కృషి గురించిన విశ్లేషణ 12వ విభాగంలో చేశారు, ఒక సాధారణ గిరిజన కుటుంబంలో మారుమూల ప్రాంతంలో పుట్టి, అంచలంచెలుగా ఎదిగి, ఆదర్శ పోరాటం నాయకత్వం అలవర్చుకొని ఆదర్శంగా నిలిచిన ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు నష్టాలు కోల్పోయిన కుటుంబ బలగం, వివరాలు తో పాటు ప్రజల హృదయాల్లో అన్ని వయస్సుల వారిలో స్థానం పొందిన వైనం ప్రతి ఒక్కరికి ఆచర ణీయం.
చివరగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్య తలు స్వీకరించిన డాక్టర్ దనసరి అనసూయ సీతక్క బాధ్యతల గురించి కూడా రచయిత ఉఠం కించటం అభినందనీయం.ప్రారంభ రచనలో ఉండే కొన్నిలోపాలు సవరణలు పక్కకుపెడితే, సంఘ టన సమాచార హారంగా అందించిన ఈ వ్యాస సంపుటి కర్త శ్రీనివాస్ అక్షర కృషి అభినందనీ యం. దీనికి కొనసాగింపుగా ఈ అరణ్య ధీరవనిత జీవితం గురించి భవిష్యత్తులో మరెన్నో ప్రామాణిక రచనలు పరిశోధనలు రావాలని అందుకు ఈ పుస్తకం సరైన మార్గదర్శి కావాలని ఆశిస్తూ సీతక్క అభిమానులతోపాటు,పరిశోధక విద్యార్థులు విధిగా దాచు‘కొని’చదవాల్సిన విలువైన పుస్తకం ఇది.