విభిన్న సంస్కృతి….విశాల  భారతి…!

రోజుకొక ఊరికి అతిథిగా వెళ్లండి. మీ ఆతిథ్య యాత్ర పూర్తవ్వటానికి 1700 సంవత్స రా సమ యం పడుతుంది. రోజుకొక రకం తిండి తినండి. మీరు మొదటిరోజు స్వీకరించిన ఆహారం మళ్లీ అందుకోవటానికి మీజీవితంలో సగం రోజు గడిచిపోతాయి. రెండ్రోజుకొక తరహా వస్త్రధారణ చేయండి. అన్నిరకాు ధరించటానికి రెండేళ్ల సమయం అవసరమవుతుంది. నెకొక భాష నేర్చుకోండి. మీకోరిక తీరటానికి అరవయ్యేళ్లు పడు తుంది….రోజుకొక కళాసాంస్కృతిక ప్రదర్శన తి కించండి. ఏళ్లతరబడి కొన్ని వంద వైవిధ్య భరిత కళను ఆస్వాదిస్తూనే ఉంటారు. గంటకొక గుండె చప్పుడు వినండి. మీకుకచ్చితంగా క్షన్నర ఏళ్లు అవసరం. ఇదీ మన దేశ విస్తృతి..


మన విభిన్న సంస్కృతు వైవిధ్య రీతి.. ఇది అనేక జాతుూ భాషూ మతాూ సంస్కృ తుూ ఏకమై…విడివిడిగా కలివిడిగా సాగుతున్న జీవన సౌందర్యం! భిన్నత్వంలోని ఏకత్వాన్ని ఎుగెత్తి చాటే భారతదేశ వారసత్వ ఔన్నత్యం!! అవును. మనది ఒకటే దేశం. కానీ,వే వే సంస్కృ తు సమ్మేళనం. ఒకటే దేశం. అనేకనేక కుమ తా, యాసభాష సమాహారం. మనది పైకి ఒకటే జీవితం. కానీ,అనేకవ్యత్యాసా,వ్యవ హారా జీవన సమరం. కట్టుబొట్టుల్లో తేడాు బోలెడు. ఆహారపు అవాట్లతో అంతరాు బోలెడు. ఆట పాటల్లో,ఆచారవ్యవహారాల్లో వ్యత్యాసాు బోలెడు. అయినాసరే, మనందరం భారతీ యుం.. స్వాతంత్య్ర గణతంత్ర దేశ పౌరుం. ఇన్ని విభిన్న తు, ప్రత్యేకతు, వ్యత్యాసాూఉన్నాయని గమనంలో ఉంచుకొని- మన రాజ్యాంగ కర్తు భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశ పౌరు ందరి మధ్య సమన్వయం, సఖ్యత, సమానత్వం సాధించే ఆలోచనతోనే దేశానికి ఓ దిక్సూచిని అందించారు. ప్రతి అంశాన్ని రాజ్యాం గపు అధిక రణల్లో, క్లాజుల్లో స్పష్టంగా మార్గనిర్దేశం చేశారు. ఇది పాకిస్తాన్‌ వలె మతరాజ్యం కాదుబీ ఏ మతాన్ని పానలోకి తీసుకోకూడని లౌకిక దేశం. మతం ప్రజకు వారి వారి అభిమతం. దాన్లో ప్రభుత్వం పాత్రా,ప్రమేయం ఉండకూడదు. ఆహార ఆహా ర్యాు ప్రజ అభీష్టం. దాంట్లో పా కు జోక్యం ఉండకూడదు. రాజ్యాంగపు ప్రాథమిక హక్కుకు, విధుకు భంగం వాట్లికుండా ఎవరి బతుకు వారు బతకొచ్చు. ఎవరి సంస్కృతిని వారు అను సరించవచ్చు. ఈతరహా జీవన వైవిధ్యమే భిన్న త్వంలో ఏకత్వం.మనరాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదే!
సంస్కృతు సమానత్వం
సంస్కృతు మధ్య సమానత్వం, పర స్పర గౌరవం ఉండాలి. ఒకటి ఎక్కువ మరొ కటి తక్కువా కాదు. దేని ప్రత్యేకత దానిది. దేని విశిష్టత దానిది. కానీ, మనసమాజంలో అంతర్లీనంగానూ, బాహాటంగానూ ఒక క్షణం ఉంటుంది. ఆధిపత్య సంస్కృతు,అవాట్లుపై వృత్తంలో ఆడంబ రంగా, అట్టహాసంగా ప్రదర్శితమవుతాయి. వాటికి సహ జంగా లేని‘ఉన్నతతత్వాన్ని’ఆపాదించుకొని- గొప్పవిగా ప్రాచుర్యం పొందుతాయి. అది గొప్ప అనుకునేవాళ్లు క్రమంగా దానిని అనుసరించటం, అనుకరించటం మొదలెడతారు. ఆవిధంగా ఆధి పత్య సంస్కృతి అన్నింటా నెమ్మది నెమ్మదిగా చొచ్చు కొస్తుంది. స్థానిక సంస్కృతి అంతే నెమ్మదిగా ప్రాము ఖ్యాన్ని కోల్పోతూ ఉంటుంది. ముఖ్యంగా వేష భాషల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. స్వ్ప స్థాయీ చనంతో సహజంగా జరిగే మార్పును మనం కాదనలేం. కానీ, అదిబవంతంగానో, మార్కెట్టుశక్తు ప్రమేయంతోనో జరిగితే- అభ్యం తరకరం. తాముచెప్పింది తప్ప మరేదీ సంస్క ృతి కాదని ఎవరన్నా విర్రవీగితే- అది ప్రమా దకరం. ఒక ప్రాంత సంస్కృతిని మరో ప్రాంత సంస్క ృతితో తూకమేసి, సరిచేయానుకోవటం అరాచకవాదం. ఇక్కడే మనం గురజాడ మాటను గుర్తు చేసు కోవాలి. ‘దేశమంటే మట్టి కాదోరు.. దేశమంటే మనుషులోరు’అన్న ప్రబోధాన్ని పాటించాలి. ఎప్పు డైనా సరేబీ మనుషు, వారి అభీష్టాు ప్రధానం. తంతుూ తతంగాూ, ప్రాంతాూ ప్రదేశాూ తరువాత. కనిపించే సాటి మనుషు కన్నా కన పడని నమ్మకాూ, క్పానిక కథూ ఎప్పుడూ ఎక్కువకావు.పైగా, నమ్మకాు అనేకమైనా ఎ్ల ప్పుడూ ఒకేలా ఉండవు.. అన్నిచోట్లా ఒకే మివతో చెలామణి కావు. ఆంధ్రా బ్రహ్మణు సహజంగా చేపను తినరు. అదిమాంసాహారం. ఒడిశా, బెం గాు బ్రాహ్మణుకు అవి ప్రియమైన ఆహారం. ఇక్కడ ఎవరి అవాటు ప్రామాణికం?ఎవరి ఆచ రణ అనుసరణీయం? అసు ఈ ప్రశ్నలే అసం బద్ధం. ఎవరి అవాటు వారిది. ఒకరి ఆహారపు అవాటును మరొకరి ఆహారపు అవాటుతో కొత వేయటం-మన దేశ భిన్నత్వాన్ని అవమా నించటమే! చాలామంది మేకమాంసం,కోడి మాం సంతిన్నట్టే-కొంతమంది గొడ్డుమాంసం తిం టారు. కాదనేహక్కు ఎవరికీఉండదు. కానీ, కొన్నేళ్లుగా ఇదొక సమస్యగా మారింది. ఇంట్లో గొడ్డు మాంసం ఉందన పేరిట మనుషునే చంపేసే ఉన్మాద మూక స్వైర విహారం సాగు తోంది. పాకు ఇలాంటి దుశ్చర్యను అరికట్టకపోగా, నిందితును అభినందించటం అప్రజాస్వామికం.
ఎవరి కథ వారిది కదా!?
చాలాచోట్ల రాముడు ఆరాధ్యుడైతే- తమిళనాట రావణుడు దేవుడు. రాముడు ఆదర్శ ప్రాయుడు అనటానికి ఎన్ని కథున్నాయో, రావణు డు గొప్పవాడు అనటానికీ అన్నే కారణాు ఉన్నాయి. ఎవరి కథ వారిది. ఎవరి సంబరం వారిది. ఏకథలో ఎంత కల్పితం ఉందో, ఏ సన్ని వేశంలో ఎంత అతిశయోక్తి ఉందో ఎవరికీ పూర్తిగా తెలీదు. ప్రతికథా వారివారి సాంస్కృతిక వారస త్వంలోంచే వస్తుంది. కథను కథగానే భావిస్తే, మనిషిని మనిషిగా గౌరవిస్తే- భిన్న సంస్కృతు వర్థ్లిుతాయి. వాస్తవానికి మనం చెప్పుకునే పురాణ కథన్నీ కగాపుగాు. అనేక వే ఏళ్ల క్రితం …అనేక సంస్కృతు మధ్య జరిగిన యుద్ధాల్లో- ఆధిపత్య వర్గాు అల్లిన కమ్మని కథాయణాు. స్థానికు కొలిచే దేవదేవుళ్లను కూడా తమ ప్రధాన కథలో బంట్లుగానో,నమ్మకస్తుగానో,సైడు హీరోు గానో మార్చిన ‘సాంస్కృతిక’ గారడీు. దక్షిణాదిలో సాధారణంగా అమ్మ దేవతకే కొుపుంటాయి. సంబరాు జరుగుతాయి. ఊరూరికి ఒక అమ్మ వారు. పండగల్లో ప్రధానంగా మాంసాహారమే నివేదిస్తారు. దాదాపు వందేళ్ల క్రితం దాకా ఇక్కడ ఇవే సందళ్లూ సంబరాూ. తరువాతి కాంలోనే దుర్గామాత, వినాయకుడు వంటి దేవుళ్లు గ్రామా వరకూ వచ్చారు. ఇప్పుడు పెద్దఎత్తున ఈ సంబరాలే జరుగుతున్నాయి. బాగా ఆదాయం వచ్చే అమ్మవార్ల దేవాయాల్లో ఒకప్పుడు స్థానిక పూజార్లు ఉంటే- ఇప్పుడు బ్రాహ్మణ పూజార్లు వచ్చారు. ఒకప్పుడు కోడినో, మేకనో మామూు మాటతో నివేదిస్తే- ఇప్పుడు పండ్లనూ పానూ మంత్రాతో సమర్పి స్తున్నారు. అంటే- స్థానిక సంస్కృతిస్థానే బ్రాహ్మ ణీయ సంస్కృతి వచ్చింది. పెళ్లిళ్లూ పేరంటాూ, పండగూ పబ్బాూ.. ఇలా అన్నిటా మంత్రా సంస్కృతి ప్రవేశించి, ప్రవర్ధమానమవుతోంది..! ఇంటింటా మోగుతున్న టీమీ ఈ పనిలో ఇతోధి కంగా తోడ్పడి, తరిస్తున్నాయి..! ఇంటికి వచ్చే అతిథికి లేదా ఆరాధించే దైవానికి మనం తినేదే మరింతబాగా వండి పెట్టడం సహజమైన ఆచరణ. మనం చూసిన సినిమాలో భక్త కన్నప్ప శివుడికి తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే ఆహారంగా పెడతాడు. తనకు తెలిసిన భాషలోనే మాట్లాడ తాడు. ఇప్పుడైతే అది కుదిరే పని కాదు. కన్నప్పకు ఇష్టమైన దేవుడికైనా సరే, ఏంపెట్టాలో, ఏం చెప్పా లో మరెవరో నిర్ణయిస్తారు. సాంస్క ృతిక ఆధిప త్యానికి ఇదొక చిన్న ఉదాహరణ.
జీవితంలోంచే వైవిధ్యం
నిజానికి వైవిధ్యమూ, భిన్నత్వమూ ప్రకృ తికి అందం..దేశానికీ అందం. ఈ భిన్నత్వ వైవిధ్యా ు ఊరకనే రావు. తెచ్చి పెట్టుకున్నవి అసలే కావు. దేనికైనా జీవితమే ప్రాతిపదిక. జీవితంలోని ఆటుపోట్లు, అవసరాు వాటిలోంచి వచ్చే అను భవాూ…సాంస్కృతిక వికాసానికి భూమిక వహి స్తాయి. కాశ్మీరలోయలో చ్లని వాతావరణం. అందుకనే అక్కడ స్త్రీకైనా, పురుషుకైనా వంటి నిండా వస్త్రధారణ. అదొక సంస్కృతి. ఆఆకు పచ్చని లోకం ఓకళాత్మక సౌందర్యం. అక్కడి చేతి వృత్తుల్లో, ఆటపాటల్లో ఆ సున్నితత్వ భావుకత ఓ భాగంగా పరిణమిస్తుంది. బతుకు క్రమంలో ప్రజ ఉమ్మడి అవసరాూ, ఆకాంక్షూబీ సాగించిన పోరాటాూ….కాశ్మీరంలో ఓ చక్కని సామరస్య వాతావరణాన్నే సమకూర్చి పెట్టాయి. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా బురఖా ధరించని ముస్లిం మహిళు అక్కడ ఉంటారు. పనిపాటుల్లో అన్ని మతా వారూఒక్కటైసాగుతారు. కాశ్మీరీ సంస్కృ తి ప్రత్యేకత అది. అలాంటి చక్కని హరిత వనంలో మతోన్మాద ముష్కయి ప్రవేశించాక- కుంకుమ తోటు రక్తపురంగుద్దుకున్నాయి. నిరంతర శోకవ నంలా రోదిస్తూనే ఉంది. ఇక కొండప్రాంతాల్లో నివసించేవారికి మాంసంప్రధాన ఆహారం. ఈశాన్య రాష్ట్రాల్లో, గిరిజనప్రాంతాల్లో ఈఅవాటును చూ డొచ్చు. వారికి తెగవారీగా ప్రత్యేక సాంస్క ృతిక నేపథ్యం ఉంటుంది. అడవి జంతువును అదలిం చటం ఓ ప్రధాన వ్యాపకంగా ఉంటుంది కాబట్టి, వారి వాయిద్యాన్నీ పెద్ద పెద్ద శబ్దాు చేసేవిగా ఉంటాయి. ఆటపాటన్నిటిలోశబ్దం శిఖర స్థాయి లో ఉంటుంది. గానాూ సంగీతాూ సోలోగా సాగవు. బృందాు బృందాుగా సమూహాు కదుతాయి. వారిసంఘ జీవనానికి అద్దం పడతా యి. విశాఖ మన్నెంలోని థింసా కావొచ్చుబీ మణి పురిలోని నృత్యం కావొచ్చు. ఈ విద్యలో వీరుడూ, వీరగత్తె ఎవరయ్యా అంటే-ఏఒక్కరి పేరో వినిపిం చదు. వంద పేర్ల వరస కదిలొస్తుంది.
ఒక్కో చోట ఒక్కో అందం
మనది విశామైనదేశం.28 రాష్ట్రా ు.. 9 కేంద్రపాలిత ప్రాంతాు.. ఆరున్నర క్ష ఊళ్లు…22అధికార భాషు..720 స్థానిక భాషు…ఇంత వైవిధ్యం ప్రపంచంలో మరే దేశానికీ లేదు. కేరళలోుంగీు ఓసాంప్రదా యం. ఆఫీసుకు సైతం అలా వెళ్లొచ్చు. అభ్యం తరం లేదు. రాజస్థానీలో రాచరిక తరహా వస్త్రధా రణం. హిందీ రాష్ట్రాల్లో చుడీదార్ల సందడి. అరకు ఆదివాసీ మహిళ చీరకట్టు ఓ ప్రత్యేకం. బోండా తెగ గిరిజనుకు పూసలే వస్త్రాూ ఆభరణాూ. ంబాడీ తెగలో రంగురంగు రింగు భలే ఆకర్షణ. ఇలా కొందరు కొన్నే ధరిస్తారు అని చెప్ప టం కూడా పూర్తి సత్యం కాదు. ఒక రాష్ట్ర ప్రజ వస్త్రధారణ మొత్తం ఒకేలా ఉంటుందని కూడా చెప్పలేం. ప్రాంతానుబట్టి, ఆర్థిక స్థితిగతునుబట్టి, సామాజిక తరగతును బట్టి-సాంప్రదాయం అనుకున్న దానిలో కూడా చాలా వ్యత్యాసాుం టాయి. భాష, దాని ఉచ్ఛారణలోనూ భేదాుం టాయి. అడవుల్లో తిరుగుతూనో, సముద్రం మీద వేటాడుతూనో జీవించే తరగతు-గొంతు చించు కొని అరిస్తే తప్ప బతుకు బండి నడవదు. సమూ హా మధ్య సుఖంగా బతికే తరగతు నెమ్మదిగా మాట్లాడినా రోజు గడిచిపోతుంది. అదే తరహా ఉరవడి, నెమ్మది వారి వారి సంగీత సాంప్రదాయా ల్లోనూ, యాసలోనూ ప్రతిఫలిస్తాయి. అందుకనే శాస్త్రీయసంగీతాు ఒక రకం.జానపద సందళ్లు మరో రకం. కళఏదైనా సాధనా, ప్రావీణ్యమూ అవసరమే! ఒకటి అధికం కాదు, మరొకటి అ్పమూ కాదు. కానీ, ఆధిపత్య భావజాం రెంటికీ సమాన స్థానం ఇవ్వదు. కళ దైవదత్తం అనే ట్యాగు తగిలిం చటం ద్వారా ఆకళాకాయి దైవాంశ సంభూతు ుగా మారిపోతారు. జానపద కళు శ్రమ నుంచి పుడతాయి. వాటిపుట్టుకా, ఎదుగుదలో రహాస్య మేమీ ఉండదు. అందరూ పాల్గొనవొచ్చు. అందరూ ప్రదర్శించవొచ్చు.
కనునిండా పండగ
మనదేశం భౌగోళికంగా కూడా చాలా వైవిధ్యభరితం.7 వే కిలోమీటర్ల సాగరతీరం.. ఎన్నో ఉన్నత పర్వత శ్రేణు సమాహారం… అన్నిటా ఎన్నో అనుభవాూ అనుభూతుూ గడిరచ వొచ్చు. ఏడాది పొడవునా చిరపుంజిలో వానచిను కు సవ్వడిని వినొచ్చు. నడివేసవిలో సైతం ఊటీ కొండల్లో చ్లదనం చవిచూడొచ్చు. రాజస్థాన్‌ ఎడా రిలో వర్షాకాంలో కూడా ఎండ ధాటిని ఎదుర్కోవొచ్చు. సాగర జలాల్లో సాహస యాత్రు చేయొచ్చు. కాశ్మీర్లో ఆకుపచ్చని లోయు, హిమన్న గాూ అపూర్వ సోయగం. కేరళలో బోటు విహా రం ఓగొప్ప అనుభవం. ఇంకా చాలా చాలా చారిత్రిక కట్టడాు.వాటి వెనకవీరోచితగాధ ూ…ఎన్నో చారిత్రిక సంఘ టనూ…మనదేశ వైవిధ్యానికి ఆనవాళ్లు.. ఈఅన్నిచోట్లా ప్రజ జీవన స్థితిగతుల్లో తేడాు గమనించొచ్చు. ఒక్కో దగ్గర ఒక్కో తరహా జీవన విధానాను పరిశీలించొచ్చు. ఒకటి మాత్రం నిజం..మనుషు ఎలాంటి చోట ఎలా జీవిం చినా-ఆ బతుకు బొంగరం చుట్టూ ఓ సాంస్కృతిక తాడు అు్లకుంటారు. అందుకనే జీవితాల్లో ఎన్నెన్ని వైరుధ్యాు ఉంటే-సాంస్కృతిక భూమికల్లోనూ అన్నన్ని వైవిధ్యాు సాక్షాత్కరిస్తాయి. తీరుబడిగా తికిస్తేకనునిండా పండగలా మెగొందుతాయి.
మార్పు కోసం ఉద్యమాు
ఏ సమాజమూ దానికదే మారిపోదు. వ్యక్తుగానో, వ్యవస్థాగత శక్తుగానో ఆయా కాలానుబట్టి ఉద్యమాు సాగించాల్సిందే! మనదేశంలో అలాంటి ఉదంతాు అనేకం ఉన్నాయి. ఆనిరంతర ప్రయ త్నా వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. బ్రిటీషు వాళ్లు రాకముందు మనదేశం అనేక చిన్న చిన్న సంస్థానా సమూహం. వ్యాపారం కోసం వచ్చి- నెమ్మదిగా ఈస్టిండియా కంపెనీ చొరబడిరది. దేశం మొత్తం మీద అది ఏుబడి చేయటానికి దాదాపు వందేళ్ల సమయం తీసుకొంది. ఆనాటి సంస్థానాధీశు అనైక్యత బ్రిటీషు విస్తరణకు దోహదపడిరది. సంస్థానాూ, బ్రిటీషు పాకుూ కలిసి ప్రజను కడగండ్ల పాు చేసిన సందర్భాు చాలా ఉన్నాయి. ప్రజు ఎప్పటికప్పుడు ఏదొక రూపంలో నిరసన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. 1857 సిపాయి తిరుగుబాటు అందులో ఒకపెద్ద నిరసన. దానికి చాలాముందే పీడనకు, నిర్బం ధానికీ గురైన రైతు, గిరిజను చిన్న చిన్న బృందాుగా తిరుగుబాట్లు చేశారు. అదేకాంలో నిరక్షరాస్యత,అజ్ఞానం, మూ ఢనమ్మకాూ, మత మౌఢ్యం వంటివాటిని పారదో డానికి అనేకమంది సంస్కరణోద్యమాు చేపట్టారు. రాజా రామ్మో హనరారు, దయానంద సరస్వతి, వివేకానందుడు, నారాయణగురు,ఈశ్వర చంద్రుడు, జ్యోతిబా పూలే, కందుకూరి వీరేశలిం గం వంటి వారు ఆ ఒరవడి సాగించారు. ఈ అందరినీ ఒకే రకమైన మార్గంకాదు. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన అవగాహన,ఒక్కోరకమైన ఆచరణ. అందరి ప్రయ త్నమూ అప్పటి సమాజాన్ని మార్చటమే, మరి కాస్త ముందుకు తీసుకెళ్లటమే! స్త్రీవిద్య,శాస్త్రీయ ఆలోచన, మూఢత్వ వ్యతిరేకత, ఆధునిక దృక్పథం, ఐక్యత వంటి మేలిమి ఫలితాు ఆఉద్యమావల్లే సాధ్యమ య్యాయి. తర్వాత కాంలో జాతీ యోద్యమం ఊపందు కొంది. బ్రిటీషు వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్ర బోసు, రాజగురు వంటి యోధు ఆచరణ, ఆలోచ ను యువతను ఉధృతంగా కదిలించాయి. కమ్యూనిస్టు ఆధ్వర్యాన సాగినరైతాంగ పోరాటాూ, ఉద్యమా ూ స్వాతంత్య్రోద్యమ జోరును పెంచాయి. మొత్తం ఈకృషిలో ఈనాటి బిజెపిరాజకీయ కుదురు ఆరెస్సెస్‌ పాత్ర శూన్యం. సంస్థానాధీశుకు, బ్రిటీషు పాకు కు అనుకూ ంగా వ్యవహరించటం ఒక్కటే స్వాతంత్య్రోద్యమంలో ఆసంస్థ నిర్వాకం. దేశవ్యా ప్తంగా రకరకాుపాయుగా, ప్రవాహాుగా సాగిన ఉద్యమా ూ పోరాటాూ బ్రిటీషు వారిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎట్టకేకు 1947ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది. ఉద్యమానికి పెట్టు బడిదా రు ప్రతినిధులే నాయకత్వం వహించటం వ్ల-ప్రజకు పూర్తి హక్కుూ అవకాశాూ దక్కలేదు. అధికార మార్పిడి మాత్రం జరిగింది. స్వాతంత్య్రం తరువాత కూడా వివిధ అవసరా కోసం, హక్కు కోసం ప్రజా ఉద్యమాు సాగాయి. సాగుతు న్నాయి. ప్రజు సాధించుకున్న ప్రయోజ నాు ఆఉద్యమా ఫలితమే! నూతన ఆర్థిక విధా నా తరువాత-పాకు ప్రజ హక్కును, వనరును హరించటం మొదలైంది. కొత్తకొత్త పద్ధతుల్లో జిమ్మిక్కు చేస్తూ- ప్రభుత్వ రంగాన్ని ప్రయి వేటుపరం చేస్తున్నారు. ప్రజల్లో భావోద్వేగాు రెచ్చ గొట్టి, ద్వేషమే దేశభక్తి అనే కుయుక్తిని ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. భిన్నత్వంలోని ఏక త్వంపై దాడి కూడా అందులో భాగమే! దానిని ఎదుర్కోవాంటే-మనభిన్నత్వాన్ని అర్థం చేసు కోవాలి. ప్రజాసంస్కృతి ప్రాధాన్యాన్ని, దాని పరి రక్షణ అవశ్యకతనీ ప్రచారం చేయాలి. ఆకా శాన విరిసే ఇంద్రధనుసులో ఏడురంగుఉంటా యి. ఏరంగుకు ఆరంగు ప్రస్ఫుటంగా కనిపిస్తూనే- ఒకదాన్లో మరొకటి కలిసికొత్త సొగసును పూయి స్తాయి. అన్నీ కలిసి ఒకేరంగు అయితే-వాన మ్లికు వైవిధ్యం ఏముంటుంది? మనచరిత్ర అయినా, సంస్కృతి అయినా అంతే! మన సొంతాన్ని మనం కాపాడుకుందాం. రంగురంగు పూతోటలో మువ్వె న్న పతాకం ఎగురవేద్దాం!-సుజయ సాహితి