విభజిత ఆంధ్రప్రదేశ్,తెలంగాణపదేళ్ల అభివృద్ధి..
రెండు రాష్ట్రాల అర్థికా భివృద్ధి,తలసరి ఆదాయం,ఆర్థికాభి వృద్ధిలో వివిధ జిల్లాలు,రంగాల అభివృద్ధి మధ్య వ్యత్యా సాలు,అభివృద్ధి కేంద్రీకరణ లేదా వికేం ద్రీకర ణ వైపుగా సాగుతున్నదా?ఆర్థిక వ్యవస్థలో సృష్టించబడుతున్న సంపద సమాజంలో ఉన్న అత్యధిక మంది శ్రమ జీవులకు పంపిణీ అవు తున్నదా? లేదా?వంటి కొన్ని విషయాలకు పరిమితమౌతుంది.గత దశాబ్ద కాలంలో ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఆర్థిక వృద్ధి కనిపిస్తున్నది.ఆంధ్ర రాష్ట్రస్థూల ఉత్పతి (జిఎస్‌డిపి) అభివృద్ధి రేటు రాష్ట్ర విభజన అనంతరం టిడిపి ప్రభుత్వ ఐదేళ్ళ (2014-19)కాలంలో స్థిర ధరల్లో సగటున 9.03 శాతం అభివృద్ధి రేటు నమోదయ్యింది.ఆ తరు వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ సిపి ప్రభుత్వ కాలంలో అనగా 2019-24లో సగ టున 5.36శాతం చొప్పున వృద్ధి రేటు సాధిం చింది.నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తొలి ఐదేళ్ళలో సగటున 9.03శాతం చొప్పున, ఆ తరువాత 2019-24మధ్య కాలంలో సగ టున4.66 శాతం వృద్ధిరేటు సాధించింది.గత దశాబ్ద కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో సగటున 7.34శాతం, తెలంగాణలో 6.98 శాతం వృద్ధి రేటు ఉంది.రెండు రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (ఎస్ జిడిపి) విలువను ప్రస్తుత ధరల్లో పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో 2014-15లో రూ.5,24, 976కోట్లు ఉండగా 2023-24కి రూ.15, 40,000 కోట్లకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే కాలంలో రూ.5,05, 849 కోట్ల నుండి రూ.14,49,708 కోట్లకు పెరి గింది. దేశ జిడిపి లో ఆంధ్రరాష్ట్ర జిఎస్ డిపి ర్యాంకు చూస్తే 2014-15లో 8వర్యాంకు ఉండగా 2023-24లో కూడా ఇదే ర్యాంకు ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా 9వ ర్యాం కులో కొనసాగుతుంది.ఉదారవాద ఆర్థిక విధా నాలను దేశంలో ప్రవేశపెట్టిన తరువాత పాల కులు స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయాల పెరు గుదల మీద కేంద్రీకరిస్తున్నారు.వృద్ధి రేటు పెరి గితే ఆటోమేటిక్‌గా ప్రజల మధ్య అసమాన తలు తగ్గుతాయని, ఉపాధి అవకాశాలు పెరు గుతాయని భ్రమ కల్పిస్తున్నారు.వాస్తవంగా ఈ దశాబ్ద కాలంలో రెండు రాష్ట్రాలలో వృద్ధిరేటు బాగా పెరుగుతున్నా సంపద కేంద్రీకరణ, అస మానతలు తగ్గకపోగా తీవ్రంగా కొనసాగుతు న్నాయి. జిల్లాలు,వివిధ రంగాల మధ్య సంపద కేంద్రీకరణ, అసమానతలు రెండు రాష్ట్రాలలో చూడొచ్చు.ఆంధ్ర రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021-22లో ఉమ్మడి (విభజన జిల్లాల సమాచారం అందుబాటులో లేకపోవడం వలన) 13 జిల్లా ల్లో కృష్ణా (14శాతం), విశాఖపట్నం (12 శాతం),తూర్పు గోదావరి (11శాతం),పశ్చిమ గోదావరి (10శాతం) జిల్లాల వాటా 47 శాతం ఉంది.శ్రీకాకుళం (4 శాతం),విజయ నగరం (4శాతం) జిల్లాలు అట్టడుగునే ఉన్నా యి.మిగిలిన గుంటూరు,ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు,కడప,అనంతపురం,కర్నూలు జిల్లాలు రాష్ట్ర జిఎస్‌డిపిలో 5నుండి8శాతం మధ్య వాటాతో గత పదేళ్ళ నుండి కొనసాగు తున్నా యి.ఆంధ్ర రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవ సాయ, పారిశ్రామిక, సేవా రంగాల వాటాలను పరిశీ లిస్తే వ్యవసాయ రంగం వాటా రాష్ట్ర జిఎస్ డిపిలో2014-24 మధ్య 30.39 నుండి 36.1శాతానికి పెరుగుతూ వ్యవసాయ రాష్ట్రం గా మారుతున్నది. పారిశ్రామిక రంగం వాటా 25.17నుండి23.36 శాతానికి,సేవా రంగం వాటా44.61నుండి 40.45శాతానికి దిగ జారింది.జిడిపిలో వ్యవసాయ రంగం వాటా పెరుగుతుందంటే వ్యవసాయం మీద ఆధార పడిన ప్రజల ఆదాయాలు పెరుగుతున్నట్లుగా భావిస్తే అది పొరపాటు.వాస్తవంగా రైతాంగ ఆదాయం క్షీణిస్తున్నది.వ్యవసాయ రంగంలో ఆహార పంటల మీద 80శాతం ప్రజలు ఆధార పడి ఉంటారు.కానీ వ్యవసాయ రంగంలో ఆహార పంటల నుండి 2022-23లో కేవలం 12.31శాతం ఆదాయం మాత్రమే సమకూ రింది.పౌల్ట్రీ,పశు సంబంధిత,రొయ్యలు,చేపల నుండి ఆదాయం పెరుగుతూ నేడు 57.35 శాతానికి చేరింది.ఉద్యానవనాలను కూడా కలుపుకుంటే 85.44శాతానికి పెరుగుతుంది. అంటే వ్యవసాయ రంగంలో కేవలం కొద్ది మంది ఆధారపడిన రొయ్యలు,చేపలు,పౌల్ట్రీ, మాంసం వంటి వాటి నుండి అత్యధిక ఆదా యం వస్తున్నది.ఈ మార్పులు వ్యవసాయ రంగంలో కొద్దిమంది చేతుల్లో సంపద పోగుపడుతున్నట్లు,ఉపాధి తగ్గిపోతున్నట్లు తెలియజేస్తున్నాయి. గడిచిన తొమ్మిదేళ్ళలో ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల స్థూల ఉత్పత్తి విలు వను పరిశీలిస్తే చేపలు,రొయ్యలు,పౌల్ట్రీ ఎక్కువ గా ఉన్న జిల్లాల్లో వ్యవసాయం నుండి ఎక్కువ ఆదాయం వస్తున్నది.ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాలో 56.8శాతానికి వ్యవసాయ రంగం నుండి ఆదాయం వస్తున్నది. అలాగే విజయనగరం,విశాఖ,తూర్పుగోదావరి,కృష్ణా, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో కూడా ఈధోరణి మనకి కన్పిస్తున్నది. ఈ జిల్లాల స్థూల ఉత్పత్తి లో వ్యవసాయ రంగం నుండి 40శాతం పైన ఆదాయం వస్తున్నది.జిల్లాల స్థూల ఉత్పత్తి విలువలో పారిశ్రామిక రంగం వాటాను పరిశీ లిస్తే చాలా ఆందోళనకర పరిస్థితి కొనసాగు తున్నది. గత పదేళ్ళలో పెట్టుబడుల సదస్సులు పెట్టినా పారిశ్రామిక అభివృద్ధి కని పించడం లేదు. ప్రభుత్వ పెట్టుబడులు లేకుం డా పోయా యి. ఫలితంగా 2014-22 మధ్య కాలంలో 9 జిల్లాల్లో ఆ జిల్లాల స్థూల ఉత్పత్తిలో పారి శ్రామిక రంగం వాటా క్షీణిస్తూ వస్తున్నది. విశాఖపట్నం జిల్లాలో సైతం ఈకాలంలో 36.3నుండి 33.4శాతానికి పడిపోయింది. విజయనగరం,పశ్చిమగోదావరి,కృష్ణా, ప్రకా శం,అనంతపురం,కర్నూలులో 2021-22 నాటికి పారిశ్రామిక రంగం వాటా ఆయా జిల్లాల స్థూల ఉత్పత్తిలో 20శాతం లోపుగానే ఉంది.పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం 16.1 శాతంలోనే నేటికి కొనసాగుతుంది. సేవా రం గంలో పరిస్థితి కూడా పారిశ్రామిక రంగం వలే తొమ్మిది జిల్లాల్లో దాని వాటా తగ్గుతూ వస్తున్నది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2014-22 మధ్య కాలంలో31.5నుండి 27.1శాతా నికి, కృష్ణాలో 52.2నుండి 43.3శాతానికి, నెల్లూరులో 38.6నుండి 32.9శాతానికి, చిత్తూరులో43.2 నుండి37.4శాతానికి సేవా రంగం వాటా దిగజారింది. విజయనగరం, గుంటూరు,ప్రకాశం,కర్నూలు జిల్లాల్లో సేవా రంగం వాటా గత తొమ్మిదేళ్ళలో ఎదుగు బొదుగు లేకుండా ఉంది. కేవలం విశాఖపట్నం జిల్లాలో మాత్రమే 50నుండి52.6శాతానికి పెరిగింది. ఇక తెలంగాణలో చూస్తే 2014-23మధ్య కాలంలో రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 19శాతం చుట్టూ కొనసాగు తుండగా,పారిశ్రామిక రంగంవాటా 19.2 శాతం నుండి17.3 శాతానికి తగ్గింది. పారి శ్రామిక రంగలో ముఖ్యమైన తయారీ రంగం చూస్తే రాష్ట్ర జిడిపిలో 11శాతం వాటాకి పడి పోయింది. కేవలం సేవారం గం వాటా మాత్ర మే 61.3 శాతం నుండి 62.9శాతానికి స్వల్పంగా పెరిగింది.23శాతం వాటాతో రియ ల్ ఎస్టేట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నది.ఐటి రంగంపై ఆధారపడి ఈ స్పెక్యులేటివ్ బూమ్ కొనసాగుతున్నది. ఆంధ్ర రాష్ట్రం వలే తెలంగాణలో కూడా వ్యవ సాయ రంగంలో ఆహార పంటల నుండి వచ్చే ఆదాయం కంటే పౌల్ట్రీ, మాంసం, పశుసంపద నుండి వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగు తున్నది.2022-23 సంవత్సరంలో వివిధ రకాల పంటల నుండి రూ.1,08,269 కోట్లు రాగా, పౌల్ట్రీ, మాంసం, పశుసంబంధిత ఆదా యం రూ.95,955 కోట్ల ఆదాయం వచ్చింది. జిల్లాల స్థూల ఉత్పత్తి పురోగతిని చూస్తే తెలం గాణ రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో వలే జిల్లాల మధ్య అసమానతలు, సంపద కేంద్రీక రణ పెరుగుతున్నట్లు తెలుస్తు న్నది. 2022-23 లెక్కలను పరిశీలిస్తే రంగా రెడ్డి,హైద రాబాద్,మల్కాజ్‌గిరి మూడు జిల్లాలు కలిపి 43.72శాతం రాష్ట్ర జిడిపిలో భాగస్వామ్యం ఉన్నాయి.మిగిలిన 30 జిల్లాల్లో 6వేల నుండి 15వేలకోట్ల రూపాయల లోపు 10 జిల్లాలు,15 వేల నుండి 25వేలకోట్ల రూపాయలలోపు 12 జిల్లాలు,25వేల నుండి 55 వేలకోట్ల రూపా యల లోపు 5జిల్లాలు రాష్ట్ర జిడిపిలో వాటాతో ఉన్నాయి. దీనినిబట్టి తెలం గాణలో జరుగుతు న్న అసమాన అభివృద్ధిని అర్ధం చేసుకోవచ్చు. తలసరి ఆదాయం చూస్తే రెండు రాష్ట్రాలు దేశ తలసరి ఆదాయం సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి ర్యాంకులో ఉండగా ఆంధ్ర రాష్ట్రం మాత్రం 16వ ర్యాంకులో ఉంది.తెలంగాణలో తలసరి ఆదాయం రూ.1,24, 104 నుండి రూ.3,08,732కు, ఆంధ్ర రాష్ట్రంలో రూ.93, 903 నుండి రూ.2,42, 479కు గత దశాబ్ద కాలంలో పెరిగింది. కానీ తలసరి ఆదాయం లో తెలంగాణ,ఆంధ్రా రెండిరటిలోను జిల్లాల మధ్య అసమానతలు పెరుగుతూ వస్తున్నాయి. తెలంగాణలో 2022-23లో మొత్తం 33 జిల్లా ల్లో కేవలం రెండు జిల్లాలు మాత్రమే రాష్ట్ర తల సరి ఆదాయ సగటు కంటే ఎక్కువ ఆదాయం తో ఉన్నాయి. రంగారెడ్డి రూ.7,58,102, హైదరాబాద్ రూ.4,02,941 తలసరి ఆదా యం ఉండగా, సంగారెడ్డి జిల్లా రాష్ట్ర సగటుకి కొంచెం తక్కువగా అనగా రూ.3,01,870గా ఉంది. మిగిలిన 30 జిల్లాలు రాష్ట్ర సగటు తల సరి ఆదాయానికి చాలా దూరంలో దిగువన ఉన్నాయి.ఆంధ్ర రాష్ట్రంలో 2021-22లో తల సరి ఆదాయం రూ.1,92,587గా ఉండగా మొత్తం ఉమ్మడి 13జిల్లాలో 5జిల్లాలు అనగా కృష్ణా (రూ.2,88,551), విశాఖపట్నం (రూ.2,64,225), పశ్చిమ గోదావరి (రూ.2,33,898), నెల్లూరు (రూ.2,12,216), తూర్పు గోదావరి (రూ.1,97,894), జిల్లాలు మాత్రమే రాష్ట్ర తలసరి ఆదాయం సగటుకి ఎగువ భాగాన ఉన్నాయి. ఈ జిల్లాల్లో కూడా కేవలం కొన్ని మండలాల్లో మాత్రమే అత్యధిక తలసరి ఆదా యం ఉంది. మిగిలిన ఏడు జిల్లాలు రాష్ట్ర సగటుకు దిగువ స్థాయిలో ఉన్నాయి. ఎప్పటి లాగే విజయనగరం (రూ.1,28,194), శ్రీకాకు ళం (రూ.1,28,820) జిల్లాలు 12,13 ర్యాంకులతో అట్టడుగునే పదేళ్ళ నుండి కొనసాగుతున్నాయి.రెండు రాష్ట్రాల్లో పాలకులు అనుసరిస్తున్న ఈఉదారవాద కార్పొరేట్ ఆర్థిక నమూనా వల్ల గడిచిన దశాబ్ద కాలంలో రెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయ అంకెలు వాస్తవాన్ని మరుగున పరుస్తున్నాయి. భవిష్యత్‌లో ఉభయ రాష్ట్రాల్లో ఆర్థిక అసమానతలు మరింత తీవ్రం కానున్నాయి. వ్యాసకర్త: జీవీఎంసీ కార్పొరేటర్ (ప్రజాశక్తి సౌజన్యంతో..) డా.బి.గంగారావు