విఫత్తుల సమయం అప్ర‌మ‌త్తం అవశ్యం


ఈనేపథ్యంలో ఇటీవల సంభవించిన గులాబ్‌ తుఫాన్‌ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ,ఉత్తర ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌లలో భారీ నష్టానికి గురిచేసింది.నాటి1990తుఫాన్లు మాదిరిగా తీవ్రమైన నష్టాన్ని చూపించింది. తెలుగు రాష్ట్రాలకు ఎప్పఉడు తుఫాన్లు వచ్చినా కేంద్రప్రభుత్వం సకాలంలో ఆదుకోవడం ప్రశంసనీయం. దేశంలో అధిక విపత్తుకు గుర య్యే ప్రాంతలు హిమాలయ ప్రాంతాలు,ఒండ్రుమైదానాలు,తీరప్రాంతాలు,ఎడారి ప్రాంతం.ప్రస్తుతం తీరప్రాంతాల్లో సంభవించే తుఫాన్లు,గాలివానలు ఎక్కవగా ఉన్నాయి. దక్షిణ ఒడిశా,ఉత్తర ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ,ఉత్తర ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో తుఫాన్లు పరిస్థితులు పరిశీలిస్తే 19902021వరకు ప్రమాదకరమైన14తుఫాన్లు సంభవించాయి.20112021 మధ్యలో మూడు భయం కరమైన తుఫాన్లు ప్రజలు ఎదుర్కొన్నారు. ఇవీ పర్యావరణం,సమాజం,సామాన్యప్రజలకు ఆర్ధికంగా అధిక నష్టం కలిగించాయి.సాధారణ కార్యకలాపాలను కూడా అడ్డుకునే తీవ్రమైన పరిస్థితి ఏర్పడిరది. ఈప్రకృతి వైపరీత్యాలవల్ల అధిక మొత్తంలో ఆస్తి,ప్రాణ నష్టాలు జరిగాయి. గతనెలాఖరున సంభవించిన గులాబ్‌ తుఫాను బీభత్సం తెలిసిందే. ప్రజలకు హానికలిగే పరిస్థితి ఉన్నప్పుడు,వైపరీత్యాలను ఎదుర్కొనే ముందుస్తు సమర్ధచర్యలు లేనప్పుడు విఫత్తు తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ గులాబ్‌ తుఫాన్‌ ప్రభుత్వం,ప్రభుత్వ అధికార యంత్రాంగం సకాలంలో ఆదుకోని సహాయక చర్యలు చేపట్టడం అభినందనీయం.


ప్రపంచవ్యాప్తంగా వరదలకారణంగా మరణిస్తున్నవారిలో 20శాతం భారతదేశంలోనే ఉన్నారు. ఇక్కడ వరద ముంపునకు గురయ్యే ప్రదేశాలు కూడా ఎక్కువే.ఇక్కడ దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రదేశాల్లోనూ వరదులు సంభవిస్తున్నాయి.తెలుగు రాష్ట్రా ల్లో గోదావరి,కృష్ణా నదులు ప్రధానంగా వరదలకు కారణమవుతున్నాయి. ఉత్తరాంధ్రలో నాగావళి,వంశధార నదులు,దక్షిణాంధ్రలో పెన్నా నదీ ప్రాంతం వరదలకు కారణమవుతున్నాయి.2009లో కృష్ణానది వచ్చిన వరదలవల్ల మహాబూబ్‌నగర్‌,కర్నూలు,నల్గోండ, కృష్ణా,గుంటూరుజిల్లాలకు అపారనష్టం వాటిల్లింది. 2005లో ముంబాయిలో ఒకేరోజు10సెంటీమీర్ల వర్షం కారణంగా ఆ మహానగరాన్ని వరదులు ముంచెత్తాయి. అలాగే2014లో సంభవించిన హూదూద్‌ తుఫాన్‌ కారణంగా విశాఖనగరం అతలాకుతలమైంది. ఆస్తి నష్టం,ప్రాణనష్టం సంభవించింది. దేశంలో వరద ఉధృక్తిని తెలుసుకోవడానికి శాటిలైట్‌,రిమోట్‌ సెన్సఇంగ్‌ పరికరాలు లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. వరదల హెచ్చరికలను కేంద్ర జలసంఘం లేదా సాగునీరు,వరద నియంత్రణశాఖ లేదా జలవనరులశాఖ జారీచేస్తాయి. సహజ వైపరీత్యమైన వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్దంగాఉండాలి. అప్పుడే అవి విఫత్తులుగా మారకుండా ఉంటాయి. తద్వారా విలువైన సంపదను కాపాడుకోవచ్చు.


తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటానవంబరు,డిశంబరు నెలల్లో తుఫాన్లు,భారీవర్షాలు సంభవిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై ముందుస్తు జాగ్రత్త చర్యలతో ప్రజలకు ప్రాణ,ఆస్తినష్టం కలుగకుండా నియంత్రిస్తోంది. వాతావరణశాఖ సూచన జారీచేసిన నేపథ్యంలో విపత్తుల నియంత్రణ అధికారులు,రక్షణశాఖ,రెవెన్యూ అధికారయంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. ముంపునకు గురయ్యే ప్రాంతవాలసులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం,తుఫాన్లు షెల్టర్లు ఏర్పాటు,పునరావాస కేంద్రాలకుతరలించి వారికి నిత్యావసర వస్తువులు,ఆహారం,వైద్య సదుపాయాలు కల్పించే సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు ముందుడటం విశేషం.అయితే ఇలాంటి విఫత్తులు సంభవించినప్పుడు సకాలంలో ఆదుకోవడానికి యువతకు శిక్షణలు ఇవ్వాలి.స్వచ్చంధ సంస్థల సేవలను ప్రభుత్వాలు వినియోగించుకోవడానికి తోడ్పడాలి. లోతట్టు ప్రాంతవాసులకు కూడా అవగాహన కల్పించి అక్కడ యువతకు శిక్షణ ఇవ్వాలి. పర్యావరణం కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలి.- ర‌వి రెబ్బా ప్ర‌గ‌డ‌,ఎడిట‌ర్‌- థింసా