విఫత్తులు..మానవాళికి పెనుశాపాలు
అంతా నేతల చేతుల్లోనే : భూతాపాన్ని తగ్గించ డానికి ఏమాత్రం గడువు లేదు. వెంటనే స్పందిం చాల్సిందే.కానీ,ఇప్పుడిది ప్రభుత్వాధినేతలు, రాజ కీయ నేతల చేతుల్లో ఉంది. భూమిని రక్షించుకోవ డానికి తీసుకోవాల్సిన కఠిన చర్యలను పట్టాలెక్కిం చడానికి ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు. ప్రపంచ దేశాలు ఇప్పుడు కానీ స్పందించకపోతే ఆ తరువాత వారు వాతావరణంలోని కర్బనాన్ని సంగ్రహించడానికి ఇంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ‘సత్వరం మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందే. ఇంతకుముందు పారిస్ ఒప్పందం చేసిన ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉన్నంత మాత్రానసరిపోదు’ అని ప్రొఫెసర్ జిమ్ స్కీ అన్నారు. ప్రపంచదేశాల నేతలు ఈ నివేదికను చదివి వారి లక్ష్యాలను పెంచుకోవడానికి నిర్ణయించడంతో పాటు వెంటనే కార్యరంగంలోకి దిగితే భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించడం అసాధ్యమేమీ కాదని జిమ్ అభిప్రాయపడ్డారు. పర్యావరణవేత్తలు, భూతాప నివారణకు పనిచేస్తున్నవారు ఈ అంశంపై మాట్లాడుతూ,ముప్పు ముంచుకొస్తుండడంతో దీనిపై చర్చించడానికి కూడా సమయం లేదని, మార్పులకు సత్వరం శ్రీకారం చుట్టాల్సిందేనని చెప్పారు.
పర్యావరణంలో వచ్చిన పెనుమార్పుల కారణంగా ఏర్పడుతున్న ప్రకృతి ప్రళయాలు, విపత్తులు సర్వసాధారణంగా మారాయి. మండే ఎండలు, భారీ వర్షాలు, భూకంపాలు, సునామీల వంటి దుస్థితికి మానవ తప్పిదాలే ప్రధానంగా తోడవుతున్నాయనేది చేదు నిజం. ప్రభుత్వాల చొరవకు తోడు.. పౌర బాధ్యతతోనే ప్రకృతి వనరుల పరిరక్షణ, మానవ ప్రేరిత విపత్తులను నివారణ సాధ్యమవుతుంది. – జిఎన్‌వి సతీష్
భారీవర్షాలు,వరదల ధాటికి పాకిస్తాన్, బెంగళూరు,కేరళ,ఉత్తరాఖండ్ అతలాకుతలమవు తున్నాయి.వేలసంఖ్యలో మరణాలు నమోదయ్యా యి. వేల మంది నిరాశ్రయులయ్యారు.వరద బీభ త్సం-దేశీయ ప్రకృతి వ్యవస్థల పరిరక్షణ తీరుతెన్ను లను మరోసారి చర్చకు తీసుకువచ్చింది. పశ్చిమ, తూర్పు కనుమల్లో విచ్చలవిడిగా సాగుతున్న వనాల విధ్వంసం,సున్నితమైన పర్యావరణ వ్యవస్థల పరి రక్షణలో అంతులేని నిర్లక్ష్యం,వాతావరణ మార్పుల చేదు ఫలితాలు ఎక్కడికక్కడ విపత్తులతాకిడిని పెంచుతున్నాయి.ముందు జాగ్రత్తల ద్వారా నష్టా లను తగ్గించే కార్యాచరణ లోపిస్తుండటమే విచా రకరం!
బుట్టదాఖలవుతున్న నివేదికలు : భిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులు కలిగిన భారతదేశంలో ఏటారుతుపవనాలు ప్రవేశించాక వరదలు, తుపా నులు సంభవించడం సర్వసాధారణం.కొన్నేళ్లుగా లెక్కకుమిక్కిలిగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులు- జనజీవనాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దశాబ్దం క్రితంతో పోలిస్తే తుపానుల్ని ముందే పసిగట్టి హెచ్చ రించే సాంకేతిక పరిజ్ఞానం, సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. వాటి ఆసరాతో సమర్థ చర్యలు చేపడితే నష్టాలను గణనీయంగా తగ్గించ వచ్చు. కేంద్ర జల సంఘం, విజ్ఞానశాస్త్ర-పర్యావ రణ కేంద్రం(సీఎస్ఈ) సమాచారం మేరకు గడిచిన అరవై ఏళ్లలో వరదల మూలంగా దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా చనిపోయారు. దాదాపు 62 కోట్ల ఎకరాల్లో పంటలు, ఎనిమిది కోట్లకు పైగా గృహాలు నాశనమయ్యాయి. కేంద్ర జలశక్తి శాఖ నివేదికల ప్రకారం దేశంలో అధిక శాతం నదులు 2019లో భారీ వరద ఉధృతిని చవిచూశాయి. వందేళ్లలో కనీవినీ ఎరగని స్థాయిలో ముంచెత్తిన వరదల ధాటికి 2018లో కేరళ బాగా దెబ్బతింది. ఉత్తరాఖండ్,గుజరాత్,రాజస్థాన్,బిహార్,పశ్చిమ్ బంగ,ఈశాన్య రాష్ట్రాలూ గడచిన కొన్నేళ్లలో భీకర వరదల తాకిడికి గురయ్యాయి. శ్రీనగర్,చెన్నై, హైద రాబాద్,ముంబై నగరాలూ అలాగే శోకసంద్రాల య్యాయి. విశాఖతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు హుద్‌హుద్,తిత్లీ వంటి తుపానులు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. దేశవ్యాప్తంగా ఏటా మూడు కోట్ల మంది వరదల బారిన పడుతున్నారు. దేశంలో జూన్-అక్టోబర్ మధ్య కాలంలో భారీ వర్షాలతో నదుల్లోకి అధికనీటి ప్రవాహంచేరుతోంది.ఆ సమ యంలో పర్వత శ్రేణులకు ఆనుకుని ఉండే ప్రదే శాలు,నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విచక్షణారహితంగా సాగు తున్న ఇసుక తవ్వకాలు నదుల సహజ ప్రవాహ గమనాన్ని దెబ్బతీస్తున్నాయి.అనేక నగరాల్లో దశా బ్దాల నాటి మురుగు నీటిపారుదల వ్యవస్థలు ఇప్ప టికీ మెరుగుపడలేదు.దాంతో వరద నీరు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.గుజరాత్,మహా రాష్ట్ర,గోవా,కర్ణాటక, కేరళ,తమిళనాడు రాష్ట్రాల పరిధిలో సుమారు1.60 లక్షల చదరపు కిలోమీటర్ల మేర పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. అక్కడి పర్యావరణ, జీవవైవిధ్య వ్యవస్థల పరిరక్షణ కోసం 2010లోకేంద్ర ప్రభుత్వం ప్రముఖ పర్యా వరణ వేత్త మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో అధ్యయన సం ఘాన్ని నియమించింది. పశ్చిమ కనుమలను పర్యా వరణపరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటిం చాలని ఆ సంఘం సూచించింది. నిర్దేశిత ప్రాంతా ల్లో నూతన ఆర్థిక మండళ్లు, హిల్స్టేషన్ల ఏర్పాటు, ఖనిజాల తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని సిఫార్సు చేసింది. కనుమల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ భూములను బదిలీ చేయ కూడదని పేర్కొంది. పశ్చిమ కనుమల పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది. వీటిని అమలు చేయకుండా 2012లో శాస్త్రవేత్త కస్తూరి రంగన్ నేతృత్వంలో కేంద్రం మరోసంఘాన్ని కొలు వు తీర్చింది.గాడ్గిల్ కమిటీ బాటలోనే-కనుమ లలో గనులతవ్వకం,క్వారీ కార్యక్రమాలపై పూర్తిగా నిషేధం విధించాలని ఆ సంఘం సిఫార్సు చేసింది. కనుమలలో37శాతం భూభాగాన్ని సున్నిత పర్యా వరణ ప్రాంతంగా గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. వీటినిఅమలు చేసి ఉంటే- వరదల తీవ్రత తగ్గి ఉండేది. ఒడిశా,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన తూర్పు కనుమల దుస్థితీ ఇలాగే ఉంది. ఒడిశా, ఆంధ్రపరిధుల్లోని కనుమలలో లేటరైట్, బాక్సైట్ వంటి ఖనిజాల తవ్వకాల మూలంగా అడవులకు తీరని నష్టం వాటిల్లుతోంది. నదుల గమనంలో మార్పులతో భవిష్యత్తులో వరద ప్రమాదాలు అనూహ్య స్థాయిలో ఉంటాయని నిపుణులు హెచ్చరి స్తున్నారు. వాస్తవ పరిస్థితులను మదింపు వేయ డానికి అధ్యయనాలు చేపట్టేందుకు సైతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపకపోవడం ఆందోళన కరం.
పటిష్ఠ కార్యాచరణ అవసరం : ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదాలతో సమన్వయం కొరవడుతోంది. విపత్తు లకు కారణమయ్యే వాతావరణ మార్పుల ప్రభా వాలను పరిమితం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠ ప్రణాళికలు అవసరం. వాటికి అనుగుణంగా ప్రకృతి వ్యవస్థల పరిరక్షణకు ప్రభుత్వాలు ఇతోధి కంగా నిధులు కేటాయించాలి. ఖనిజ తవ్వకాలు, ఆనకట్టలు, జల విద్యుత్ ప్రాజెక్టులపై లోతైన చర్చ తరవాతే ముందడుగు వేయాలి. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే వ్యవస్థలను నెలకొల్పాలి. విపత్తుల నిర్వహణ,యాజమాన్య సంస్థలను వేగంగా పటిష్ఠీకరించాలి.చాలా రాష్ట్రాల్లో వరదలు, తుపా నుల బాధితులకు దీర్ఘకాలంలో మేలు చేకూర్చేలా ప్రభుత్వాల కార్యాచరణ ఉండటం లేదు. ఈ వైఖరి లో మార్పు రావాలి. వరదలు, తుపానుల్ని ఎదుర్కొ నేలా ప్రకృతివిపత్తుల సంఘాల్లో స్థానికుల భాగస్వా మ్యాన్ని పెంచి, వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దాలి. ప్రకృతి వనరుల వినియోగం, యాజమాన్యాలకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిం చాలి. స్థానికుల సాయంతో వాటి అమలుకు ప్రభు త్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. అప్పుడే విపత్తు ల దాడిలో కకావికలమవుతున్న జనావళికి భవిష్య త్తుపై భరోసా కలుగుతుంది.విచ్చలవిడిగా ఆన కట్టలు..భారతదేశంలో ప్రధాన పర్వతశ్రేణులైన హిమాలయాలు,పశ్చిమ-తూర్పు కనుమల్లో పర్యావ రణ వ్యవస్థలకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఫలితం గా వరదల తీవ్రత ఏటా అధికమవుతోందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో పర్యావరణ-సామాజిక నష్ట ప్రభావాల అంచనా, నష్ట భర్తీలపై సమగ్ర చర్యలు పూజ్యమవుతున్నాయి. భవిష్యత్తు ప్రమాదాలను ఎదుర్కొనే వ్యూహాల రూప కల్పనా కొరవడుతోంది. వాతావరణ మార్పులతో హిమగిరులు వేగంగా కరిగిపోతుండటంతో అక్కడి సరస్సులు,నదులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడు తోంది.దానికి మానవ తప్పిదాలుతోడై ఆ పర్వత రాష్ట్రాల్లో విపత్తుల తాకిడి పోనుపోను ఇంతలం తలవుతోంది. ముందుచూపు లేకుండా, ప్రత్యామ్నా య మార్గాలజోలికి పోకుండా సాగు,విద్యుత్ అవస రాల పేరుతో నదీప్రవాహాలకు అడ్డంగా నిర్మి స్తున్న భారీ ఆనకట్టల మూలంగానూ సమస్య తీవ్రత అధికమవుతోంది.
భూతాపం :
పెరుగుతున్న భూతాపం మానవజాతిని కబళించే రోజు ఎంతో దూరంలేదంటూ శాస్త్రవేత్తలు అత్యం త తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటు కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వ రాదన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేని స్థాయిలో సత్వరం ఫలితమిచ్చే చర్యలు చేపట్టా లని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.’1.5డిగ్రీల సెల్సి యస్కు మించి పెరగకుండా నియంత్రించడం లక్ష్య మైనప్పటికీ ఇప్పటికే ఉష్ణోగ్రతలు దాన్ని మించి పోయే దశలో ఉన్నాయి. అదే జరిగితే దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను నివారించడానికి ఇప్పటికీ ప్రపంచ దేశాలకు అవ కాశముంది’’అంటూ నివారణోపాయాలనూ సూచి స్తున్నారు.
మూడేళ్ల అధ్యయనం : అనంతరం దక్షిణ కొరి యాలో వారంపాటు శాస్త్రవేత్తలు, అధికారుల మధ్య సమగ్రచర్చ తరువాత ‘ఇంటర్‌గవర్నమెంటల్ ప్యా నెల్ ఆన్ క్లైమేట్ చేంజ్’ (ఐపీసీసీ) భూఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరిగితే ఆ ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై కీలక నివేదిక విడు దల చేశారు.శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధుల మధ్య చర్చల సారాంశాన్ని ఆ నివేదికలో పొందు పరిచారు.ఇందులో కొన్ని విషయాల్లో రాజీపడినట్లు గా కనిపిస్తున్నప్పటికీ పలు అంశాలపై విస్పష్టమైన సూచనలు చేశారు. ‘ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కే పరిమితం చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలుం టాయి.వాతావరణ మార్పులవల్ల కలిగే దుష్ఫలి తాలను ఇది తగ్గిస్తుంద’ని ఐపీసీసీ ఉపాధ్యక్షుడు జిమ్ స్కీ అభిప్రాయపడుతున్నారు.‘భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయాలనుకుంటే చేపట్టాల్సిన మార్పులపై ఆలోచించాలి. ఇంధన వ్యవస్థలో తేవాల్సిన మార్పులు.. భూవినియోగం తీరుతెన్నుల్లో మార్పులు..రవాణా రంగంలో తీసుకు రావాల్సిన మార్పులు అన్నీ ఆలోచించాలి’ అని అభిప్రాయపడ్డారు.
టార్గెట్ 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ : ‘తక్షణం చర్యలు తీసుకోండి’ అని పెద్దపెద్ద అక్షరాలతో రాయాలని శాస్త్రవేత్తలు అనుకునే ఉంటారు.వారువాస్త వా లను,గణాంకాలను చూపుతూ ఆ మాట చెప్పాల్సి ఉందని చర్చల్లో పరిశీలకురాలిగా పాల్గొన్న గ్రీన్ పీస్ సంస్థ ప్రతినిధి కైసా కొసోనెన్ అన్నారు.ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించకుండా చూస్తే వాతావరణ మార్పుల కారణంగా కలిగే ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు నియంత్రించగలుగుతామన్న ఇంతకు ముందు ఉండేది.కానీ,1.5 డిగ్రీలసెంటీగ్రేడ్‌ను మించి ఉష్ణోగ్రతలుపెరిగితే భూమిపై జీవనయోగ్య త విషయంలో పాచికలాడినట్లేనని ఈకొత్త అధ్య యనం హెచ్చరిస్తోంది.
ఈపరిమితి సాధ్యమే : అయితే, ఇది అత్యవసరంగా జరగాల్సి ఉంది.ప్రభుత్వాలు,వ్యక్తులు..ఇలా ప్రతి స్థాయిలోభారీ ఎత్తున మార్పులు రావాల్సి ఉంది. అంతేకాదు,రెండు దశాబ్దాల పాటు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో2.5శాతం ఇలాంటి చర్యల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదిక సూచించింది. అప్పుడుకూడా వాతావరణంలోని కర్బనాన్ని సంగ్ర హించడం కోసం చెట్లు ఉండాలి, సంగ్రహణ యం త్రాలను ఉపయోగించాలి. అలా సంగ్రహించిన కర్బనాన్ని భూగర్భంలో పాతరేయాలి. ఈ ప్రక్రియ నిత్యం కొనసాగుతుండాలి.
మనమేం చేయాలి? : ప్రధానంగా ఇంధన, భూవిని యోగం,నగరాలు,పరిశ్రమల వ్యవస్థల్లో సమూల మార్పలు తెస్తేనే భూతాపాన్ని అనుకున్న స్థాయిలో తగ్గించగలమని ఈ నివేదిక వెల్లడిరచింది. అయితే, వ్యవస్థలతో పాటు మనిషి తనకు తాను ఇలాంటి మార్పులను నిర్దేశించుకోకుంటే లక్ష్యాన్ని చేరు కోవడం కష్టం. ఇందుకు గాను వ్యక్తిగతంగా తీసుకు రావాల్సిన మార్పులనూ ఈ నివేదిక సూచించింది.
ా మాంసం,పాలు, వెన్న వంటి ఉత్పత్తులను కొనడం తగ్గించాలి. అలాగే వాటిని వృథాగా పారబోయడమూ తగ్గించాలి.
ా తక్కువ దూరాలకైతే నడుచుకుంటూ లేదంటే సైకిళ్లపై వెళ్లాలి.
ా విమాన ప్రయాణాలు తగ్గించుకుని బస్సులు, రైళ్లలో రాకపోకలు సాగించాలి.
ా వ్యాపార పరమైన సమావేశాల కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి అందరూ ఒక చోటికి వచ్చే కంటే వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
ా దుస్తులు ఎండబెట్టేందుకు డ్రయ్యర్లను వాడేకంటే చక్కగా తాడుకట్టి దానిపై ఆరబెట్టడం మంచిది.
ా కొనుగోలు చేసే ప్రతి వస్తువూ కర్బన రహి తమో..లేదంటే తక్కువ కర్బనాలను విడు దలచేసేదో అయ్యుండేలా చూసుకోవాలి.
ా జీవనశైలిలో ఇలాంటి మార్పులను తీసుకు రావడంవల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగు తుందని ఐపీసీసీకి చెందిన మరో ఉపాధ్యక్షురాలు డెబ్రా రాబర్ట్స్ చెప్పారు.
ా ఉష్ణోగ్రతలు1.5డిగ్రీలసెంటీగ్రేడ్‌కు తగ్గించ డానికి 5మార్గాలు
ా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు 2010 నాటి స్థాయితో పోల్చితే 45 శాతం తగ్గాలి.
ా 2050 నాటికి ప్రపంచ విద్యుత్ అవసరాలలో 85 శాతం పునరుత్పాదక ఇంధన వనరులే తీర్చాలి.
ా బొగ్గు వినియోగాన్ని పూర్తిగా ఆపేయాలి.
ా ప్రపంచవ్యాప్తంగా 70మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంధన పంటలు(జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడే మొక్కలు) ఉండాలి. అంటే సుమారు ఆస్ట్రేలియా అంత విస్తీర్ణంలో జీవఇంధనాల తయారీకి ఉప యోగపడే మొక్కలను సాగు చేయాలన్నమాట.
ా 2050 నాటికి కర్బన ఉద్గారాలను శూన్య స్థితికి చేర్చాలి.